positive cases
-
విశాఖలో డయేరియా కలకలం.. చిన్నారి మృతి!
సాక్షి, విశాఖ: విశాఖపట్నం ఏపీలో చాప కింద నీరులో డయేరియా విస్తరిస్తోంది. విశాఖలో డయేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డయేరియాతో 41 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, డయేరియా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఓ చిన్నారి చనిపోవడంతో డయేరియానే కారణమని సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం చోటుచేసుకుంది. గడిచిన 5 రోజుల్లో 40 మంది వరకు డయేరియాతో ఆసుపత్రిల్లో చేరారు. వాంతులు, వీరోచనాలతో బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరినట్టు తెలుస్తోంది. మంచి నీటి కొళాయి వద్ద మురుగు నీరు కలుస్తుండడం వల్లే డయేరియా ప్రబలినట్టు స్థానికులు చెబుతున్నారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫాతిమా మాట్లాడుతూ..‘డయేరియా ప్రబలిన ప్రాంతంలొ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. 41 మంది డయేరియా బారిన పడ్డారు. గీతిక అనే బాలిక డయేరియాతో చనిపోయిందని నిర్ధారించలేం.. వేరే కారణం ఏదైనా అవ్వచ్చు. ఏడుగురు డయేరియా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డయేరియా బాధితులకు డయాలసిస్ అవుతుంది.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. -
ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్1’ వేరియంట్ ఎంపాక్స్ వైరస్ భారత్‌లోకి అడుగుపెట్టింది. క్లేడ్ 1బీ పాజిటివ్ కేసు భారత్‌లో నమోదైందని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు తిరిగొచి్చన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్ 1బీ వైరస్‌ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. క్లేడ్ 1బీ వేరియంట్ కేసులు విజృంభించడతో ఆగస్ట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తెల్సిందే. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. కోలుకున్న ‘క్లేడ్2’ రోగి క్లేడ్2 వేరియంట్‌తో ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. హరియాణాలోని హిసార్‌కు చెందిన ఈ వ్యక్తి సెపె్టంబర్ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరడం తెల్సిందే. -
మంకీపాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ
న్యూఢిల్లీ: ‘అనుమానిత’ కేసు మంకీపాక్స్(ఎంపాక్స్) కేసుగానే నిర్ధారణ అయ్యింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలేవీ లేవని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సదరు యువకుడు ప్రయాణంలో ఉండగా ఎంపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్–2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించామని వివరించింది. ఇది 2022 జూలై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లాంటిదేనని తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేడ్–1 రకం వైరస్ కాదని స్పష్టంచేసింది. క్లేడ్–2 రకం వైరస్ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి అతడి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది. హరియాణాలోని హిసార్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అనుమానిత ఎంపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత, నిర్ధారిత ఎంపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలో మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ గదులు సిద్ధం చేశారు. ఎంపాక్స్ కేసుల చికిత్స విషయంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి నోడల్ సెంటర్‌గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్ గదులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రజ ల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు సోమవా రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎంపాక్స్‌పై ప్రజల్లో అనుమానాలు తొలగించాలని పేర్కొన్నారు. వైరస్ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు. -
India: టెన్షన్ పెడుతున్న జేఎన్-1 వేరియంట్.. భారీగా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్-1 తీవ్ర కలకలం సృష్టిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. మొత్తం 12 రాష్ట్రాల్లో కలిపి 819 జేఎన్-1 వేరియంట్ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక, జేఎన్-1 కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 250, ఆ తర్వాత కర్ణాటకలో 199, కేరళలో 148 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. అదే సమయంలో కొత్తగా 475 కోవిడ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,919కి చేరాయని తెలిపింది. 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒక కోవిడ్ బాధితుడు చనిపోయినట్లు పేర్కొంది. A total of 819 cases of JN.1 series variant have been reported from 12 states in India till 8th January 2024: Sources — ANI (@ANI) January 9, 2024 కర్ణాటక గవర్నర్‌కు కరోనా ఇదిలా ఉండగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఆయన కోలుకునే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు రాజ్‌భవన్ మంగళవారం తెలిపింది. ఆయన రాజ్‌భవన్‌లోనే క్వారంటైన్లో ఉన్నారని, చికిత్స అవసరం లేదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. -
Corona: గడిచిన 24 గంటల్లో 761 కేసులు.. 12 మంది మృతి
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మరోసారి భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన రేకేత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో 761 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క రోజులోనే 12 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,249 యాక్టివ్ కేసులు ఉండగా కర్ణాటక 1,240, మహారాష్ట్ర 914, తమిళనాడు 190, చత్తీస్‌గఢ్- ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్‌తో మరణించిన వారిలో కేరళలో అయిదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరు ఉన్నారు. కాగా గతేడాది తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా డిసెంబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. డిసెంబర్ 5 వరకు వందలోపు నమోదైన కేసులు.. తర్వాత కొత్త వేరియంట్ వెలుగుచూడంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020లో కరోనా తొలిసారి బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 5.3లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. 4.4 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. -
బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్.. నాలుగు మరణాలు
ఢిల్లీ: కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 కారణంగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్ కారణంగా రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 4,334 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, దేశంలో కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరులోనే 172 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇదే సమయంలో కరోనాతో నలుగురు మృతిచెందడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. ఇక, ప్రస్తుతం కర్ణాటకలో 1,240 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారీగా పెరిగిన జేఎన్-1 కేసులు.. ఇదిలా ఉండగా.. దేశంలో జేఎన్-1 పాజిటివ్ కేసులు 500 మార్కును దాటాయి. ప్రస్తుతం దేశంలో జేఎన్-1 వేరియంట్ కేసులు 541 ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కర్ణాటకలో 199, కేరళలో 148, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణ 2, ఒడిషా, హర్యానాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మిజోరం, త్రిపుర, చండీఘర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్‌లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి యాక్టివ్ కేసులు కూడా లేవని వైద్యారోగ్యశాఖ తెలిపింది. -
India: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 600 మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలను వైద్యశాఖ మరోసారి హెచ్చరించింది. తాజాగా వైద్యారోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 602 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. COVID-19 | India reports 602 new cases, 5 deaths in the last 24 hours; Active caseload at 4,440 — ANI (@ANI) January 3, 2024 ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు మంగళవారం నాటికి 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు. -
TS: కరోనా కలకలం.. రెండు జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలో పాజిటివ్ కేసుల కలకలం చోటుచేసుకుంది. రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. రేకుర్తికి చెందిన ఓ మహిళకు, 18 నెలల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక, మహబూబ్‌నగర్ జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులను గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు ఇప్పటి వరకు 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు. -
ఒక్కరోజులో 797 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జేఎన్.1 ఉప వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 797 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒకేరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత ఏడు నెలల్లో ఇదే మొదటిసారి. మొత్తం యాక్టివ్ కేసుల 4091కి చేరుకుంది. ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ బారినపడిన బాధితుల సంఖ్య 162కు చేరింది. అత్యధికంగా కేరళలో 83 కేసులు, గుజరాత్లో 34 జేఎన్.1 కేసులు వెలుగుచూశాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీలో జేఎన్.1 ఉప వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సారి్టయం(ఇన్సాకాగ్) శుక్రవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో కరోనా కాటుకు ఐదుగురు బలయ్యారు. -
TS: కొత్త వేరియంట్ కలకలం.. నర్సుకు పాజిటివ్!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా పాజిటివ్ కేసులు జిల్లాల్లో సైతం నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో, వారికి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ కలకలం చోటుచేసుకుంది. కొత్త వేరియంట్ జేఎన్-1కు సంబంధింంచి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక ఆసుపత్రి నర్సు, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళకు పాజిటివ్‌గా తేలింది. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారి శాంపిల్స్‌ను జీనోమ్ పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. వారి సన్నిహితుల సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ నగరంలో 9, కరీంనగర్లో ఒక్క కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి ఒకరు కోలుకున్నారు. మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంకో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్ సూచించారు. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ (65)కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేశారు. కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. యాదమ్మ కుటుంబసభ్యులు భాస్కర్ (42), వీణ (30), ఆకాష్ (13), మిద్దిని (5)లు ఇంట్లోనే ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారు. -
Covid-19: దేశవ్యాప్తంగా 63 కరోనా జేఎన్1 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వైరస్ వ్యాప్తి దేశంలో పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈ ఉపవేరియంట్ రకం కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది, కేరళలో ఆరు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు ఈ రకం కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. కేరళలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది. -
Covid-19 JN.1 Variant: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..!
న్యూఢిల్లీ: కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. కేరళలో మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూయడంతో దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్‌లో తొలికేసు వెలుగుచూసిననాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త శ్వాససంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. ‘‘ పండుగల సీజన్ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. జేఎన్1 ఉపవేరియంట్‌కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టంచేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు జేఎన్1సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కలి్పస్తాయి’’ అని ఆమె చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. -
తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. ఈరోజు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు అలర్ట్. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక, తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో నేడు 12 కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి ఒకరు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇక, ఈరోజు 1322 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. నేడు నమోదైన కేసులో హైదరాబాద్‌లోనే తొమ్మిది కేసులున్నాయి. హైదరాబాద్- 9 కేసులు రంగారెడ్డి- 1 సంగారెడ్డి-1 వరంగల్-1. -
కరోనా అలర్ట్.. తెలంగాణలో పెరిగిన పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక, తెలంగాణలో కొత్తగా మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో కొత్త మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నాట్టు బులిటెన్‌లో తెలిపారు. అలాగే, కరోనా నుంచి నేడు ఒకరు కోలుకున్నారు. ఈరోజు తెలంగాణలో 1245 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈరోజు నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో ఎనిమిది, రంగారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మరోవైపు.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స్ ఆర్‌టీపీసీటీ టెస్ట్‌కు పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతోపాటు మరో వ్యక్తి రాజేందర్‌కు పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరికి కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. -
TS: కొత్త వేరియంట్ కలకలం.. జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తెలంగాణలో కొత్తగా మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఈరోజు కొత్తగా ఆరు కేసులు నమోదు కాగా, వైరస్ నుంచి ఒకరు కోలుకున్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 20 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో 19 మందికి చికిత్స జరుగుతోంది. ఇక, నేడు హైదరాబాద్‌లో నాలుగు, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఈరోజు 925 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇంకా 54 మందికి సంబంధించి కోవిడ్ టెస్టు రిజల్ట్ రావాల్సి ఉందని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్‌లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్‌లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో, ఎంజీఎం అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని తెలిపారు. -
HYD: కరోనా కొత్త వేరియంట్ అలర్ట్.. మళ్లీ పెరిగిన కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల జాగ్రత్తలు పాటించడం మంచింది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం తెలంగాణలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్‌లోనే నమోదు కావడం గమనార్హం. దీంతో, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జేఎన్-1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
కోవిడ్ కేసుల ఎఫెక్ట్.. ఆ మూడు రాష్ట్రాల్లో మాస్క్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6వేలు దాటిపోయింది. యాక్టివ్ కేసుల సంఖ్య 31వేల దాటింది. దీంతో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను సమీక్షించాలని సూచించారు. ఇదిలా ఉండగా, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను అంచనా వేయడానికి సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టనుందని స్పష్టం చేసింది. ఐసియూలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు అమలులో ఉన్నాయని, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని పేర్కొంది. మరోవైపు.. కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరిగా చేశాయి. హర్యానా కోవిడ్ కేసుల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించేలా అమలు చేసేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు. కేరళ కేరళలో గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ సంబంధిత మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. కాబట్టి, వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పుదుచ్చేరి పుదుచ్చేరి ప్రభత్వుం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఒక ప్రకటనలో తెలిపింది. -
కొత్తగా 3,824 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇవే ఒకరోజు అత్యధిక కేసులు కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 18,389కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 4,47,22,605 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 5,30,881 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. మరోవైపు రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. 4,41,73,335 మంది కరోనా బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సంబంధిత మరణాల రేటు 1.19 శాతంగా రికార్డయ్యింది. కేంద్ర ప్రభత్వుం ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. -
మళ్లీ భయపెడుతున్న కరోనా.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా టెన్షన్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 18,389 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. ఇక, శనివారంతో పొల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య 27 శాతం పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, శనివారం దేశవ్యాప్తంగా 2,995 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, వైరస్ బారినపడి ఇప్పటి వరకు 5,30,881 మృతిచెందినట్టు పేర్కొంది. India reports 3,824 new cases of Covid-19 in 24 hours; the active caseload stands at 18,389. pic.twitter.com/i4AOCyHAj3 — ANI (@ANI) April 2, 2023 -
భారత్‌లో కరోనా టెన్షన్.. ఒక్కరోజులో 40శాతం కేసులు జంప్!
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ టెన్షన్‌కు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే 40 శాతం పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. వివరాల ప్రకారం.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3016 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైదారోగ్య శాఖ తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ అని స్పష్టం చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా మొత్తం 1,10,522 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం రోజువారీ కేసుల సంఖ్య 2,151గా ఉండగా.. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు పెరిగాయి. మరోవైపు, దేశంలో వైరస్ కారణంగా నిన్న ఒక్కరోజు 14 మరణాలు చోటుచేసుకున్నాయి. కేరళలో 8, మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు మృతిచెందారు. తాజా మరణాలలో దేశంలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,862కి చేరింది. ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,509గా ఉంది. ఇక రకవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం ఢిల్లీలో 300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్ 2వ తేదీన 3375 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆరు నెలల తర్వాత నేడు.. కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటింది. India recorded 3,016 new #COVID cases in past 24 hours, a nearly 40% jump since yesterday. @Verma__Ishika reports pic.twitter.com/bTqf7UfPs7 — Mirror Now (@MirrorNow) March 30, 2023 -
కోవిడ్‌పై మోదీ సమీక్ష.. మాస్క్ ధరించాల్సిందే..
ఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం సాయంత్రం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారలు, పీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా కేసులు, ఇన్ఫ్లూ పరిస్ధితిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రధాని మోదీకి వివరించారు. మార్చి 22తో ముగిసిన వారంలో దేశంలో సగటున 888 రోజువారీ కేసులు నమోదు కాగా, పాజిటివ్ రేటు 0.98 శాతంగా పెరిగిందని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రధానమైన 20 కోవిడ్ డ్రగ్స్, ఇతర డ్రగ్స్ 12, బఫర్ డ్రగ్స్ 8, ఇన్‌ఫ్లూయెంజా డ్రగ్ లభ్యత , ధరలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రధానికి ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించారు. దేశంలోని ఇన్‌ఫ్లూయెంజా పరిస్ధితిపై ప్రత్యేకించి గత కొన్ని నెలల్లో అత్యధిక సంఖ్యలో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసులు నమోదవుతున్నాయని ప్రధానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ల్యాబ్స్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. దీని వల్ల కొత్త వేరియంట్లు ఏమైనా ఉంటే వాటి ట్రాకింగ్‌కు, సకాలంలో ప్రతిస్పందనకు మద్ధతుగా ఉంటుందని తెలిపారు. టెస్ట్ , ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. రోగులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఆసుపత్రి ప్రాంగణంలో మాస్క్‌లు ధరించడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు రద్దీగా వుండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రధాని కోరారు. అలాగే, ఐఆర్ఐ/ ఎస్ఏఆర్ఐ కేసులపై పర్యవేక్షణ ఇన్‌ఫ్లూయెంజా, కోవిడ్ 19, అడెనోవైరస్‌లకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌ఫ్లూయెంజా, కోవిడ్ 19 కోసం అవసరమైన డ్రగ్స్, లాజిస్టిక్స్, ఆసుపత్రుల్లో బెడ్స్, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉండాలన్నారు. కోవిడ్ 19 మహమ్మారి ఇంకా ముగిసిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుత స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (SARI) కేసుల ల్యాబ్ నిఘా , పరీక్షలను మెరుగుపరచాలని ఆదేశించారు. దేశంలోని ఆసుపత్రులు అత్యవసర పరిస్ధితులకు సిద్ధంగా వున్నాయని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలన్నారు. కాగా.. గత నాలుగు రోజులుగా మాత్రం యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇక, దేశంలో గత నాలుగు రోజులుగా వెయ్యికి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో ఐదుగురు మృతిచెందారు. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరినట్టు స్పష్టం చేసింది. ఇక, దేశంలో ప్రస్తుతం.. 7,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఉత్తరాదిన పెను భూకంపం -
చైనాలో ఇన్‌ఫ్లూయెంజా పంజా
బీజింగ్: చైనాలో ఇన్‌ఫ్లూయెంజా (హెచ్3ఎన్2) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఫ్లూ పాజిటివ్ కేసుల రేటు 41.6 శాతం పెరిగినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. మునుపటి వారంతో పోలిస్తే 25.1 శాతం ఎక్కువ పెరుగుదల నమోదైనట్లు తెలియజేసింది. షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్ నగరంలో ఇన్‌ఫ్లూయెంజా కేసుల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లూ వ్యాప్తి మరింతగా పెరిగితే లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు. హాంకాంగ్ వైరస్‌గా పిలిచే హెచ్3ఎన్2 వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరణాలు సైతం నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు, శరీరంలో నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, చైనాలో కోవిడ్–19 పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గడం విశేషం. -
వైరస్ అలర్ట్: భారత్‌లోకి డేంజరస్ XBB.1.5 వేరియంట్ ఎంట్రీ
కరోనా వేరియంట్ల కారణంగా ప్రపంచదేశాలు మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా XBB.1.5 ప్రస్తుతం అమెరికాను వణికిస్తోంది. ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ వేరియంట్ బారినపడ్డాడు. దీంతో, వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. కోవిడ్ XBB.1.5 వేరియంట్‌ను ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. కాగా, XBB.1.5 వేరియంట్‌ను సూపర్ వేరియంట్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. XBB.1.5 వేరియంట్ గత వేరియంట్ BQ.1 తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అమెరిక పరిశోధకులు చెబుతున్నారు. ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. ఈ వేరియంట్‌ను గుర్తించిన 17 రోజుల్లో ఎంతో మంది ఈ వైరస్ బారినపడినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ XBB.1.5 వేరియంట్ అమెరికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. దీని విస్తరణ క్రిస్మస్ కంటే ముందుగానే ప్రారంభమైందని తెలిపారు. సింగపూర్‌లో కనుగొన్న XBB.1.5 వేరియంట్ కంటే 96 శాతం వేగంగా వ్యాపిస్తుందని వారు చెప్తున్నారు. న్యూయార్క్‌లో ఈ కొత్త వేరియంట్ అక్టోబర్ నెలలోనే వ్యాప్తిచెందడం మొదలైందని ఎరిక్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు అంటున్నారు. ఇది ఒమిక్రాన్ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్ అని, ఇది ఇప్పటికే పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఇక.. XBB.1.5 ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుందోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ వల్ల అమెరికాలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ వివరాలను బహిర్గతం చేయడంలేదని చైనాకు చెందిన ఎరిక్ కామెంట్స్ చేశారు. కేవలం 40 శాతం విస్తరణ వేగం ఉన్నట్లు చెప్పేదంతా అబద్ధమని ఆయన కొట్టిపడేశారు. XBB.1.5 వేరియంట్ అమెరికాలోని నగరాల్లో వేగంగా విస్తరిస్తున్నదని వ్యాఖ్యలు చేశారు. ⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc — Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022 -
తగినన్ని ఔషధ నిల్వలు సిద్ధం చేయండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెద్దసంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలోనూ అందరూ అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలతోపాటు అన్ని రకాల ఔషధ నిల్వలను సిద్ధం చేయాలని ఫార్మా కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైల్ స్థాయి వరకు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోవిడ్–19 మేనేజ్మెంట్ డ్రగ్స్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై మంత్రి గురువారం ఫార్మా కంపెనీల ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫార్మా కంపెనీలు అందించిన సేవలను మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫార్మా కంపెనీల కృషి వల్లే మన దేశానికి అవసరమైన ఔషధాలను, కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు 150 దేశాలకు సైతం ఎగుమతి చేయగలిగామని కొనియాడారు. ధరలు పెంచకుండా, నాణ్యత తగ్గించకుండా ఈ ఘనత సాధించామని హర్షం వ్యక్తం చేశారు. -
చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. రెండు రోజుల్లో ఎంత మందిని కలిశాడు!
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు, చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. వైరస్ కారణంగా మరణాలు సైతం సంభవిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో చైనా నుంచి భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో, అధికారులు సదరు వ్యక్తికి టెస్టులు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఆగ్రాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చైనాకు వెళ్లి.. ఈ నెల 23న భారత్‌కు తిరిగివచ్చాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, బాధితుడు చైనా నుంచి రావడంతో సదరు ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది వెంనే ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ అధికారులు.. సదరు యువకుడి ఇంటికి చేరుకొని వివరాలు సేకరించింది. ఇద్దరు కాంటాక్టులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను పంపారు. సదరు యువకుల కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయనున్నట్లు సీఎంవో డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు.. కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా అయితే నిర్ధారణ అయ్యింది కానీ.. వారికి యువకుడికి ఏ వేరియంట్ సోకిందో తెలియదు. దీంతో, అతడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.