
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కేసుల నమోదు సంఖ్య తగ్గుతున్నా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడడంతో లేదు. తాజాగా 30 వేలకు దిగువగా కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 373 మంది వైరస్‌తో బాధపడుతూ మృతిచెందారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 3,88,508 ఉండగా కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం 97.45 శాతంగా ఉంది. అయితే మరణాల సంఖ్య అదేస్థాయిలో ఉంది. తాజాగా 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే 54,91,647 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 51.45 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.