control
-
Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫిబ్రవరి 15న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. అదేవిధంగా దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు మూడు నూతన విధానాలను అనుసరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.ఇవే ఆ మూడు విధానాలు1. హోల్డింగ్ ఏరియాను ఏర్పాటురైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 60 ప్రధాన రైల్వేస్టేషన్లలో హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాల్లో రైలు ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు వచ్చే వరకూ వేచివుండాల్సివుంటుంది. రైలు వచ్చిన తరువాతనే ప్రయాణికులంతా క్రమపద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఈ వ్యవస్థను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ స్టేషన్, లక్నో, వారణాసి, మొగల్సరాయ్, కాన్పూర్, ఝాన్సీ, పట్నా, ముంబై, సూరత్, బెంగళూరు, హౌరా తదితర స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.2. ప్రయాణికులకు అవగాహనరైల్వేస్టేషన్లలో ముందుజాగ్రత్త చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులెవరూ మెట్లపై కూర్చోకూడదని విజ్ఞపి చేయనున్నారు. పలువురు ప్రయాణికులు మెట్లపై కూర్చోవడం వలన ఆ మెట్లపై ఎక్కేవారికి, దిగేవారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన దరిమిలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.3 సూచనలు, సలహాల స్వీకరణవివిధ రైల్వేస్టేషన్లలో రైల్వే అధికారులు ఆరు నెలలపాటు ప్రత్యేక అవగాహనా ప్రచారాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు, ప్లాట్‌ఫారాల వద్ద పనిచేసే సిబ్బంది, స్టాల్స్ నిర్వహిస్తున్న దుకాణదారులకు రైల్వే అధికారులు పలు సూచనలు చేయనున్నారు. అలాగే వారి నుంచి రద్దీ నియంత్రణకు అవసరమైన సలహాలను కూడా స్వీకరించనున్నారు. ఇది కూడా చదవండి: ‘అద్దాలు పగులగొడితే.. ఈడ్చుకెళ్లాల్సిందే’ -
కోపాన్ని దిగమింగినవాడే సిసలైన శూరుడు
కోపం మానవుల ఆగర్భ శతృవు. అది అనేక అనర్ధాలకు హేతువు. కోపం అభివృధ్ధి నిరోధకం. కోపంలో మనిషి తనపై తాను అదుపును కోల్పోతాడు. కోపంలో మనిషి దుర్భాషలాడతాడు. కొట్లాటకు దిగుతాడు. భార్యా బిడ్డలపై చేయి చేసుకుంటాడు. అసభ్య పదజాలం ప్రయోగిస్తాడు. చిన్నాపెద్దా వయోభేదాన్ని కూడా పాటించడు. కోపంలో మనిషి ఎవరి మాటా వినే పరిస్థితిలో ఉండడు. హత్యలు చేయవచ్చు. ఆత్మహత్యకూ పాల్పడవచ్చు. కోపస్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేడు. క్షణికావేశానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. రెప్పపాటులో చేసే ఆ చిన్న తప్పువల్ల జీవిత కాలానికి సరిపడా చేదు అనుభవాలు మిగిలినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.అసలు ఒకటనేమిటి? నేడు సమాజంలో జరుగుతున్న అనేక అనర్ధాలకు కోపమే కారణమంటే అతిశయోక్తికాదు. మరి ఈ కోపమనే శత్రువును పారద్రోలాలంటే ఏం చెయ్యాలి? దీనికి దైవప్రవక్త ముహమ్మద్ (స) ఒక ఉపాయం చెప్పారు. కోపం వచ్చినప్పుడు నియంత్రించుకోవాలంటే, మనిషి తాను ఉన్నచోటునుండి పక్కకు జరగాలి. అంటే ఆ చోటును వదిలేయాలి. నిలబడి ఉంటే కూర్చోవాలి. కూర్చొని ఉంటే పడుకోవాలి. ఇలా చేయడంవల్ల కోపం అదుపులోకొస్తుంది. అంతకూ ఇంకా కోపం తగ్గకపోతే, వజూ చేయాలి. అంటే నియమబద్ధంగా చేతులూ, ముఖమూ, కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే, ఆగ్రహం షైతాన్ ప్రేరణ వల్ల కలుగుతుంది. షైతాన్ సృజన అగ్నితో జరిగింది. అగ్ని నీటితో ఆరుతుంది. కనుక షైతాన్ ప్రేరణతో కలిగిన ఆగ్రహం చల్లారాలంటే నీటిని ఉపయోగించాలి. వజూచేయాలి. ఇలాచేస్తే తప్పకుండా కోపం మటుమాయమవుతుంది.వాస్తవానికి, కోపం రావడమన్నది మానవ సహజమే. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. కాని కోపంలో విచక్షణ కోల్పోకపోవడమే గొప్పతనం. కోపానికి లోనై జుట్టుపీక్కోవడం, చిర్రుబుర్రు లాడడం, అయిందానికీ, కానిదానికి ఎవరిపైబడితే వారిపై విరుచుకుపడడం, చేతిలో ఏముంటే అది విసిరి కొట్టడం, నోటికొచ్చినంత మాట్లాడడం, బూతులు లంకించుకోవడం ఇవన్నీ ఉన్మాదపు చేష్టలు. మానవ ఔన్యత్యానికి ఏ మాత్రం శోభించని లక్షణాలు. అసలు ఏకోశానా ఇది వీరత్వమూకాదు, ధీరత్వమూకాదు. మానవత్వమూ కాదు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ (స)’కుస్తీలో ప్రత్యర్ధిని మట్టికరిపించే వాడు వీరుడు కాదు. తనకు కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా నిగ్రహించుకున్నవాడే అసలైన వీరుడు, శూరుడు’.అన్నారు.ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వికనుక, కోపం మానవ సహజమే అయినప్పటికీ, దానిపై అదుపుకలిగిఉండాలి. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా ప్రవర్తించకూడదు. తాను కోపగించుకొని, కస్సుబుస్సులాడి ఏం సాధించగలనని ఆలోచించ గలగాలి. అందరికంటే బలవంతుడు దైవం ఉన్నాడని, ఏదో ఒకరోజు ఆయన ముందు హాజరు కావలసిందేనని, ఆయన అందరి మనోస్థితులూ తెలిసిన సర్వజ్ఞాని అని తెలుసుకొని, విచక్షణాజ్ఞానంతో మసలుకుంటే ఎటువంటి అనర్ధాలూ ఉండవు. కోపానికి దూరంగా ఉంటే జీవితమంతా సంతోషమే. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
ప్రపంచ నం.1 కంపెనీగా పేరున్న యాపిల్ ఉద్యోగుల పట్ల కఠిన విధానాలు అమలు చేస్తుందని ఓ ఉద్యోగి ఆరోపించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఐప్యాడ్, ఐఫోన్ వంటి పరికరాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ కార్యకలాపాలపై రహస్యంగా నిఘా వేస్తోందని తెలిపారు. 2020లో కంపెనీలో చేరిన అమర్ భక్త అనే ఉద్యోగి ఈమేరకు సంస్థపై ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన కాలిఫోర్నియాలో కంపెనీపై కేసు దాఖలు చేశారు.అక్కడ ఉద్యోగం సాఫీగా ఉండదు..‘ఉద్యోగుల గోప్యత హక్కును యాపిల్ హరిస్తోంది. సిబ్బంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వారిపై ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిఘా ఉంచుతోంది. దీన్ని ఉద్యోగులు అంగీకరించాలని కంపెనీ ఒత్తిడి చేస్తుంది. యాపిల్ సంస్థలో పని వాతావరణం సాధారణంగా బయట అనుకున్నంత సాఫీగా ఉండదు. అదో జైలు జీవితం లాంటిది. యాపిల్ ఉద్యోగులు కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను పని కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాగని వ్యక్తిగత అవసరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాలనుకుంటే మాత్రం కంపెనీ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌తోనే వాటిని వినియోగించాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు‘వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించే పరికరాల్లో ఈమెయిల్‌లు, ఫొటోలు, వీడియో.. వంటి ఆప్షన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాకు లింక్ చేసిన ప్రతి డేటాను యాక్సెస్ చేసేందుకు యాపిల్‌కు అనుమతి ఉంటుంది. యాపిల్ ఉద్యోగులు వారి పని పరిస్థితులు, తమ వేతనాల గురించి బయట ఎవరితో మాట్లాడనివ్వకుండా కంపెనీ జాగ్రత్త పడుతోంది. ఉద్యోగులు ఈమేరకు ఏవిధంగానూ స్పందించకుండా ఉండడంతోపాటు రాజకీయ కార్యకలాపాలకు పరిమితం అయ్యేలా కట్టడి చేస్తోంది’ అని అన్నారు.సమాచారం తొలగించమని ఆదేశాలు‘కంపెనీకి సంబంధించి ఉద్యోగులు తమ అనుభవాలను పాడ్‌క్యాస్ట్‌లు వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ మాట్లాడకుండా యాపిల్ నిషేధించింది. ఈమేరకు ఏదైనా కార్యకలాపాలు సాగిస్తే వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కంపెనీకి సమాచారం వెళ్తుంది’ అని చెప్పారు. ప్రస్తుతం తాను చేసిన పనికి సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి తీసివేయమని కంపెనీ ఆదేశించించినట్లు భక్త పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..యాపిల్ స్పందన ఇదే..యాపిల్ దీనిపై స్పందిస్తూ దావాలోని అంశాలు నిరాధారమైనవని, అవాస్తవాలని కొట్టిపారేసింది. పని ప్రదేశాల పరిస్థితులను చర్చించడానికి ఉద్యోగుల హక్కులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. తమ బృందాలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలను పరిరక్షిస్తూ, ఉత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడంపై కంపెనీ దృష్టి సారించిందని స్పష్టం చేసింది. -
Delhi Pollution: ఊపిరి సలపనివ్వని కాలుష్యం .. 300కు తగ్గని వైనం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్య స్థాయి ఒకరోజు పెరుగుతూ, మరోరోజు తగ్గుతూ వస్తోంది. ఈరోజు (గురువారం) ఉదయం మరోసారి ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో ఉంది. ఇండియా గేట్ వద్ద భారీగా పొగమంచు కమ్ముకుంది. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో విషపు నురుగు తేలియాడుతోంది.వాయు కాలుష్యం కారణంగా కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో కురుస్తున్న పొగమంచు.. ప్రజలపై సూర్యుని వేడి పడకుండా చేస్తోంది. ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. ఎయిమ్స్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు శరీరంలో 90 శాతం విటమిన్ డి3 ఉత్పత్తికి మూలకారణంగా నిలుస్తున్నాయి. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుకోకుండా అడ్డుకుంటోంది.ఎయిమ్స్ నిపుణులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడిందని, దీంతో చాలామంది విటమిన్ డి లోపానికి గురైనట్లు అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో అంతకంతకూ కాలుష్య స్థాయి పెరుగుతోంది. పొగమంచు సమస్య తీవ్రతరమయ్యింది. ఈరోజు రాజధానిలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయని చెబుతూ వాతావారణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇది కూడా చదవండి; నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్‌రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
RBI Monetary Policy: అదుపులో ద్రవ్యోల్బణ ‘గుర్రం’
ముంబై: ద్రవ్యోల్బణ అదుపు చేయడానికి సంబంధించిన ఉదాహరణను పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘ఏనుగు’ నుంచి ‘గుర్రం’ వైపునకు మార్చడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడిపై ఆయన గతంలో మాట్లాడుతూ, ‘‘ఏనుగు అడవికి తిరిగి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ, ‘‘చాలా కృషితో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరత్వానికి తీసుకురావడం జరిగింది. రెండేళ్ల క్రితం ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం ఈ రేటు ఆమోదయోగ్యమైన లక్ష్యాలకు దగ్గరలో ఉంది’’ అని పేర్కొన్నారు. ‘గుర్రం మళ్లీ అదుపుతప్పే అయ్యే అవకాశం ఉన్నందున గేట్ తెరవడం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అదుపు కోల్పోకుండా గుర్రాన్ని గట్టిగా పట్టి ఉంచాలి’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంతో పోల్చే విషయంలో జంతువును మార్చడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ, ‘‘ఇందుకు కారణం ద్రవ్యోల్బణంపై యుద్ధం. యుద్ధంలో ఏనుగులను గుర్రాలను ఉపయోగించడం జరుగుతుంది’’ అని చమత్కరించారు. అవసరమైతే పౌరాణిక కథానాయకుడు అర్జునుడు (2022 చివర్లో ఆయన ద్రవ్యోల్బణం కట్టడిని అర్జునుడి గురితో పోలి్చన సంగతి తెలిసిందే) కూడా తిరిగి రాగలడని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీ తొలి భేటీ కేంద్రం ఈ నెల ప్రారంభంలో ముగ్గురు కొత్త సభ్యులను నియమించిన తర్వాత గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం ఇది. ఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్ర ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు వోటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులయిన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
ఉడుతలకు, పావురాలకు గర్భనిరోధక మాత్రలు
పావురాలు, ఉడుతలు.. ప్రకృతికి, మనిషికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయనే సంగతి మీకు తెలుసా? అమెరికన్, యూరోపియన్ శాస్త్రవేత్తలు ఈ చిన్ని ప్రాణులు మనకు ఎంతో హాని చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ జంతువుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా పావురాలకు, కుందేళ్లకు గర్భనిరోధక మాత్రలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు.పావురాలు, ఉడుతలేకాదు అడవి పందులు, చిలుకలు, జింకలు మొదలైనవి అటు ప్రకృతికి ఇటు మనుషులకు ముప్పుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజురోజుకు వీటి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. ఉడుతలలోని గ్రే స్క్విరెల్ జాతిని 1800లో అమెరికా నుండి ఇంగ్లండ్‌కు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇక్కడ వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి చెట్ల బెరడును తొలిచి కలపనునాశనం చేస్తున్నాయి. ఈ ఉడుతల వల్ల ఏటా దాదాపు రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు రాయల్ ఫారెస్ట్రీ సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.ఇక పావురాల విషయానికొస్తే అవి మనుషులకు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా మరికొన్ని జంతువులు మనుషులకు హాని కలిగిస్తున్నాయి. అందుకే వాటి సంఖ్యను నియంత్రించేందుకు వాటికి గర్భనిరోధక మాత్రలు ఇచ్చే ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాంటినెంటల్ యూరప్, స్కాండినేవియాలో గతంలో అడవి పందుల సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండగా, 2020 నాటికి వాటి సంఖ్య 10 లక్షలకు పెరిగిందని ఇటలీ రైతు సంఘాలు చెబుతున్నాయి. వీటి కారణంగా పంటలు దెబ్బతినడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి.ఈ జంతువుల సంఖ్యను తగ్గించడానికి, వాటిని చంపడం కంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం ఉత్తమమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ది గార్డియన్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం ఈ జంతువులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తున్నాయని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జియోవన్నా మాస్సే తెలిపారు. ఈ జంతువుల సంఖ్యను నియంత్రించేందుకు, వాటి ఆహార గింజల్లో గర్భనిరోధక మాత్రలు కలపాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బ్రిటన్‌లో ఉడుతలకు హాజెల్‌నట్ అనే పండులో గర్భనిరోధక మాత్రలు ఉంచి వాటికి ఇస్తున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పావురాలు, ఇతర పక్షుల సంఖ్యను నియంత్రించడానికి వాటికి అవి తినే గింజలలో గర్భనిరోధక మాత్రలు కలిపి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
మాక్ డ్రిల్.. పవర్ఫుల్
సత్తెనపల్లి : ఒక్కసారిగా జరిగిన ఈ అలజడికి పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావు ఘటనా స్ధలికి చేరుకొని నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరి కదా.. ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికందినవన్నీ పోలీసులపై విసరడం మొదలు పెట్టారు. అంతే ఉన్నతాధికారులకు సీఐ శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో డీఎస్పీ గుర్నాథ్బాబు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు, సివిల్, ప్రత్యేక సాయుధ దళాలు వ్యాన్లతో అక్కడికి చేరాయి.ముందుగా ఆందోళనకారులకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి బాష్ప వాయువును ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడం.. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరోవైపు ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైర్ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ నిరసనకారుడికి బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలగా.. మరొకరు తలకు గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్ట్రెక్చర్‌పై వాహనంలో తరలించారు. అంబులెన్సుల హడావుడి.. పోలీస్ సైరన్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు. కళ్లకు కట్టిన ప్రదర్శన ఈ దృశ్యాలను చూస్తూ భీతావహులైన ప్రజలకు మైక్‌లో ఒక ఎనౌన్స్మెంట్ వినిపించింది. ‘ఇది మాక్ డ్రిల్.. కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం’ అని పోలీసులు ప్రకటించడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు ‘నటించిన’ పోలీసులు అక్కడి నుంచి ని్రష్కమించారు. పట్టణంలో పోలీసులు చేపట్టిన నమూనా ప్రదర్శన ఇది. పేరుకే మాక్ డ్రిల్ అయినప్పటికీ వాస్తవాలను కళ్లకు కట్టింది.స్థలం : సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్ సమయం: ఆదివారం సాయంత్రం 5.11 గంటలు 50 మందికి పైగా ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.. ఓ చేతిలో ప్లకార్డులు .. మరో చేతిలో రాళ్లు ... పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు. తాలూకా సెంటర్లో నడిరోడ్డుపై మంట పెట్టిన టైర్లు.. ఎటుచూసినా భయానక వాతావరణం..అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్రరాజు అన్నారు. మాక్ డ్రిల్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తెలిపారు. ఇప్పటికే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజ్ విక్రయాలకు, పేలుడు పదార్థాలు, బాణసంచా విక్రయాలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రదర్శనలు, అల్లర్లు, గుమికూడటం చేయరాదని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నరసరావుపేటలో ఒకరిపై చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబు, ఏఆర్ డీఎస్పీ గాంధీ, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రాంబాబు, సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.రాజేష్ కుమార్, ఎస్ఐలు ఎం. సంధ్యారాణి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. -
Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచి్చన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచి్చన సాధారణ సమ్మతిని బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్ 16న ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్‌ఖాలీ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సీబీఐ తమ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. సీబీఐపై ప్రభుత్వæ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. -
డాన్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్.. వీడియో వైరల్!
మనిషన్నాక ఏదోఒక అభిరుచి ఉంటుంది. కొందరికి సింగర్ కావాలని, మరికొందరికి యాక్టర్ కావాలనివుంటుంది. అలాగే రచయిత కావాలని, క్రీడాకారులు కావాలని కూడా కొందరు కోరుకుంటారు. అయితే కొంతమంది తమ అభిరుచిని వదిలి వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటివారు వారి అభిరుచిని వదులుకోలేరు. ఒక ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఇదే కనిపించింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్‌వాక్‌తో, మరోమారు స్టెప్పులు వేస్తూ.. వాహనాలకు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్ కామెంట్ బాక్స్‌లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు. నేను ఆయనను చూసేందుకు హైకోర్టు స్క్వేర్‌కి వెళ్తుంటాను’ అని రాశారు. మరొక యూజర్ ‘సూపర్’అని రాశారు. अपने Moves दिखाने के लिए सही Platform का इंतजार मत करो, Platform को सही खुद बना लो! 😉 pic.twitter.com/5WE4plySsH — Temjen Imna Along (@AlongImna) February 27, 2024 -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేటి (శనివారం)ఉదయం 10 గంటల సమయంలో భక్తులతో నిండిన ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి పటియాలీ-దరియావ్‌గంజ్ రహదారిలోని చెరువులో పడింది. అనంతరం అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడినవారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులతోపాటు పరిపాలన విభాగానికి చెందిన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. పాటియాలీలోని సీహెచ్‌సీలో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు మృతి చెందారని సీఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. -
గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్
పాలస్తీనా గ్రూప్ హమాస్ నెల రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై దాడికి దిగి, 500కు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ నేపధ్యంలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ‘గాజాలో హమాస్ నియంత్రణ కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. హమాస్ ఉగ్రవాదులు దక్షిణం వైపుకు పారిపోతున్నారంటూ ఎటువంటి ఆధారాలు చూపకుండానే పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇజ్రాయెల్ ప్రధాన టీవీ స్టేషన్లలో ప్రసారమైన వీడియోలో తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి హమాస్ ఉగ్రవాదులు చొరబాటు అనంతరం రక్తపాత గాజా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌లో సుమారు 1,200 మంది మృతి చెందారు. కాగా హమాస్ ఆధ్వర్యంలోని గాజా స్ట్రిప్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూసుఫ్ అబు రిష్ మాట్లాడుతూ వసతులు లేమి కారణంగా క్షతగాత్రులకు అన్ని ఆసుపత్రులలో వైద్య సేవలు అందించలేకపోతున్నామని, గాజాలోని అతిపెద్ద అల్-షిఫా ఆసుపత్రిలో ఇటీవల ఏడుగురు నవజాత శిశువులు, 27 మంది క్షతగాత్రులు మృతి చెందారని తెలిపారు. ఇదిలావుండగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ గాజాలో హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించేందుకు ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయన్నారు. ప్రణాళిక విఫలమవుతుందనే ఉద్దేశంతో వివరాలను వెల్లడించడం లేదన్నారు. అయితే బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. ఇది కూడా చదవండి: అదే గాజా.. అదే దీన గాథ! -
ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
భోపాల్: జనాభా నియంత్రణలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్షాల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని గునా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. నితీష్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని అన్నారు. "భారత కూటమికి చెందిన ప్రధాన నాయకుడు బిహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించాడు. భారత కూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించట్లేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు?మన అమ్మా, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశాన్ని అవమానిస్తున్నారు"" అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇంకా ఎంత దిగజారిపోతారని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రశ్నించారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా ప్రముఖులు చిరునవ్వులు కురిపించారు. సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలు అవమానకరమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎట్టకేలకు నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు?
దాదాపు నాలుగు నెలలు గడిచినా మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. మెయిటీ, కుకీ అనే రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఇప్పటికీ రాష్ట్రంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆందోళనలతో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగింది. గత ఆగస్టు 27న ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇద్దరు విద్యార్థినుల హత్య దరిమిలా జనం ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, కొండ ప్రాంతాలలో ఆర్మ్డ్ ఫోర్సెస్(స్పెషల్ పవర్స్) యాక్ట్(ఏఎఫ్ఎల్పీఏ)ను మరో 6 నెలల పాటు పొడిగించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో హింసాకాండను నియంత్రించే దిశగా ప్రభుత్వం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానం అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ ద్వారా ఒక జిల్లాలో శాంతిభద్రతలు నిర్వహించడం. అంటే ఈ విధానంలో ఒక జిల్లాలో భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఒక దళానికి అప్పగించనున్నారు. జిల్లాలో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా దానికి ఆ దళం బాధ్యత వహిస్తుంది. ఇది హింసాయుత ఘటనలను నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు మణిపూర్‌లో హింసను అరికట్టడానికి పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివిధ బలగాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడమే కాకుండా జవాబుదారీతనాన్ని కూడా నిర్ధారిస్తుందని ఢిల్లీకి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపారు. ప్రతీ జిల్లాలో ఒక దళం మోహరించినందున, ఆ దళం అధికారి అక్కడ అల్లర్లు జరగకుండా చూస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఘటనకు బాధ్యత వహించడంలో వివిధ దళాలు తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నాయి. ఆర్పీఎఫ్లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని, వారిని అధికశాతం జిల్లాల్లో మోహరించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. మణిపూర్‌లో 16 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి. 2023 మే 3 నుండి హింస చెలరేగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీని మోహరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 200 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ హింస ఆగడం లేదు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి? -
భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్కల బెడదపై దృష్టి సారించి, అత్యంత ప్రమాదకరమైన శునకజాతిపై నిషేధం విధించారు. బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్క కాట్లను నివారించేందుకు రుషి సునాక్ అమెరికన్ ఎక్స్ఎల్ బులీ జాతికి చెందిన కుక్కల పెంపకంపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ అమెరికన్ ఎక్స్ఎల్ బులీ డాగ్స్ మనుషులకు ప్రమాదకరంగా పరిణమించాయని, ముఖ్యంగా ఇవి చిన్నారులపై దాడులు చేస్తున్నాయన్నారు. ఈ తరహా కుక్కలు దాడులకు పాల్పడటానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన షేర్ చేశారు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన శునకాలతో సమస్య లేదని, అయితే ఎక్స్ఎల్ బులీ డాగ్స్ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేమన్నారు. బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్కల బెడద నివారణకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలియజేశారు. ఇటీవల జరిగిన దాడులకు కారణంగా నిలిచిన కుక్కల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామన్నారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని తెలిపారు. కాగా ఇటీవల స్టాఫోర్డ్షైర్లో ఎక్స్ఎల్ బులీ జాతి శునకం ఒక వ్యక్తిపై దాడి చేయగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికిముందు 11 ఏళ్ల చిన్నారిపై ఇదేవిధమైన దాడి జరిగింది. కాగా ఎక్స్ఎల్ బులీ అనేది అమెరికన్ పిట్‌బుల్ టెరియర్స్- అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెరియర్స్ల క్రాస్ బ్రీడ్. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? It’s clear the American XL Bully dog is a danger to our communities. I’ve ordered urgent work to define and ban this breed so we can end these violent attacks and keep people safe. pic.twitter.com/Qlxwme2UPQ — Rishi Sunak (@RishiSunak) September 15, 2023 -
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
బాలింతల్లో రక్తహీనతకు చెక్
సాక్షి, అమరావతి: ప్రసూతి మరణాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవానంతరం చోటు చేసుకుంటున్న మాతృ మరణాల్లో 60 శాతం రక్తహీనత కారణంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యస్థ, తీవ్ర రక్తహీనతతో బాధపడే బాలింతలకు వచ్చే వారం నుంచి ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 వేలకుపైగా ఉన్న ఈ ఇంజెక్షన్లను ప్రసవానంతరం బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఆస్పత్రులకు ఇంజెక్షన్ల సరఫరా రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. వీరిలో 28 శాతం మంది వరకు మహిళల్లో రక్తహీనత ఉంటోందని వైద్యశాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లే ముందు బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఆస్పత్రిలోనే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేసి డిశ్చార్జి చేస్తారు. మూడు వారాల అనంతరం వీరికి మళ్లీ హెచ్‌బీ టెస్ట్ నిర్వహించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయా.. లేదా.. అని పరీక్షిస్తారు. దీని ఫలితం ఆధారంగా అవసరమైతే రెండో డోసు కూడా ఇస్తారు. దుష్ప్రభావాలు ఉండవు.. క్లినికల్ ట్రయల్స్‌లో మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి వెయ్యి ఎంజీ గరిష్ట మోతాదులో ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేయగా, మూడు వారాల్లో సుమారు 1.5 శాతం మేర హిమోగ్లోబిన్ పెరిగినట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తేలింది. ప్రసవానంతరం బాలింతలకు ఇంజెక్షన్ వేయడంపై న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని నేషనల్ అనీమియా కంట్రోల్, రీసెర్చ్ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బాలింతలకు ఎఫ్సీఎం ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం బాలింతలకు ఇంజెక్షన్లు వేయడం సురక్షితమేనని నిర్ధారణకు వచ్చాక మన రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు చేపట్టారు. మార్గదర్శకాలు జారీ చేశాం రూ.8.46 కోట్ల విలువ చేసే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వెయిల్స్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సోమవారం నుంచి బాలింతలకు ఇంజెక్షన్ల పంపిణీ మొదలుపెడతాం. రక్తహీనత నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఉచితంగా మాత్రలు పంపిణీ చేసినా కొందరు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి ఇవి దోహదపడతాయి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ -
అక్కడ కోడిగుడ్లు..ఇక్కడ టమాటాలు
వాంకిడి/తాండూరు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 363వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఒకచోట టమాటాల లోడున్న వాహనం, మరోచోట కోడుగుడ్ల వ్యాన్ పల్టీ కొట్టాయి. రూ.11 లక్షల విలువైన టమాటాలు రోడ్డు పొడవునా చిందరవందరగా పడిపోయాయి. మరోచోట రూ.2 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయి కిందపడటంతో రోడ్డంతా పచ్చసొన పరచుకుని వరదలా పారింది. పెద్దపల్లి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు ఓ వ్యాన్ కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి సమీపంలో రెండు బైక్‌లు ఒక్కసారిగా ఎదురు రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేక్రమంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో రూ. 2 లక్షల విలువైన గుడ్లన్నీ పగిలిపోగా, అందులోని సొన మొత్తం రోడ్డుపై పచ్చని వరదలా పారింది. అయితే వ్యాన్ డ్రైవర్ ఎండీ ఆసిఫ్ స్వల్పంగా గాయపడ్డాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పలువురు వాహనచోదకులు జారిపడ్డారు. కర్ణాటక నుంచి రూ.11 లక్షల విలువైన 430 పెట్టెల టమాటాలతో ఓ వాహనం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామేలా గ్రామసమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తిమ్మప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాల పెట్టెలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పొడవునా పడిపోయిన టమాటాలను ఏరేందుకు స్థానిక యువకులు సహాయపడ్డారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. -
ఆ హైవేపై ప్రమాదాల నివారణకు ఏఐ లెన్స్ కెమెరా.. దాని సామర్థ్యం ఎంతంటే...
మహారాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న పలు చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవే ట్రాఫిక్ మనేజిమెంట్ సిస్టమ్(హెచ్‌టీఎంఎస్)కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సిస్టమ్ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తికావచ్చని సమాచారం. ఈ సిస్టమ్‌తో వాహన వేగాన్ని గుర్తించడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టేందుకు మరింత అవకాశం లభిస్తుంది. ఈ సిస్టమ్ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో కొనసాగనుంది. గడచిన కొద్ది నెలల నుంచి రవాణాశాఖ రాష్ట్రంలోని అన్ని ఆర్టీవోలకు రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని ఆదేశించింది. కాగా హెచ్‌టీఎంఎస్‌లో ముంబై నుంచి పూణె మధ్య 93 స్పాట్లలో హైటెక్ కెమెరాలను ఇన్స్టాల్ చేయనున్నారు. ఈ కెమెరాలు వాహన వేగాన్ని గుర్తించే సామర్థ్యం కలిగివుంటాయి. ఈ కెమెరాలలో హైరిజల్యూషన్ ఉన్న కారణంగా వాహనంలోని డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో కూడా ఈ కెమెరా చూపిస్తుంది. ఏఐ ఆధారిత లెన్సులు కలిగిన ఈ కెమెరా.. వాహన నంబరు ప్లేటు ఆధారంగా సమాచారాన్నంతా సేకరించి, వెంటనే కంట్రోల్ రూమ్‌కు పంపిస్తుంది. ఈ హైవేలో ఇలాంటి 370 కెమెరాలను అమరుస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నందున వాటి నియంత్రణకు హెచ్‌టీఎంఎస్ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. ఇది సమగ్రంగా కార్యకలాలు ప్రారంభించాక రోడ్డు ప్రమాదాలు మరింతగా తగ్గుతాయని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. -
కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ వేడుకలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయి ఓ గుంపుపైకి దూసుకపోయింది. అయితే ఆ సమయంలో చార్లెస్ 3 వెస్ట్మిన్స్టర్ అబ్బే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి తిరిగి వెళ్లిపోయిన తదుపరి ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ హౌస్‌హోల్డ్‌లోని మౌంటెడ్ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. సమీపంలో ఓ మెటల్ బారీకేడ్ని ఢీ కొట్టి మరీ గుంపుపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తున్న గోల్డస్టేట్ కోచ్‌కు కేవలం గజం దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సైనిక సిబ్బంది గాయాలను ఊహించి సంఘటన స్థలానికి స్ట్రెచర్‌ను తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు భయపడేంతగా ఎవరికి గాయాలు కాలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. During today's coronation of the British King Charles the Third, an agitated horse, which was part of the royal procession, ran into the audience watching the event on the streets of London pic.twitter.com/29RXPOwK2e — Spriter (@Spriter99880) May 6, 2023 (చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి) -
ట్రక్కు అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన పెట్రోల్ పంపు
పెట్రోల్ బంక్‌లో ప్రవేశిస్తుండగా ట్రక్ అదుపుతప్పడంతో ఘోర ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటనలో పెట్రోల్ పంపు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటన ఏప్రిల్ 22న ఉదయం 9.3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ట్యాంక్ ఫిల్ చేసుకునేందుకు మహారాష్ట్రలోని పూణే సతారా హైవే సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రావడంతోనే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. సరిగ్గా పెట్రోల్ బంక్ ఎంట్రెన్స్‌లోకి వస్తుండగా ట్రక్కు అదుపుతప్పడంతో.. బంక్ వద్ద ఆగి ఉన్న కారుని ఢీకొట్టి పెంట్రోల్ బంక్ పంపు వైపుకి దూసుకొచ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రత్యక్ష సాక్ష్యలు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Video: Truck Hits Car At Pune Highway Petrol Pump, Uproots Fuel Dispenser Read here: https://t.co/w643tyKGZS pic.twitter.com/sVSq4qcZEU — NDTV Videos (@ndtvvideos) April 25, 2023 (చదవండి: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా..మోదీ రోడ్ షో) -
ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ఈ గదిలోకి వెళ్లాల్సిందే!
ఎంత చదివినా అర్థం కావట్లేదని చిర్రెత్తుకొస్తోందా? మీ కలల కొలువు ఉన్నట్టుండి ఊడిందేమిటని పిచ్చెక్కుతోందా? ఆఫీస్‌లో గొడ్డులా చాకిరీ చేసినా బాస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని మనసు రగులుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? అయితే వెంటనే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గాజు గ్లాసులు, ట్యూబ్లైట్ల వంటి వస్తువులను విరగ్గొట్టండి!! ఏమిటీ పిచ్చి సలహా అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఇదే మరి.. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. సాక్షి, హైదరాబాద్: మనలో ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఏదైనా విషయంపై పట్ట లేని ఆగ్రహావేశాలు, కసి, కోపం వంటివి కలి గే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థంకాక చాలా మంది కుమిలిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కోపం, ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన గదులే రేజ్ రూమ్స్. వీటిని రేజ్ రూమ్స్, బ్రేక్ రూమ్స్, యాంగర్ రూమ్స్, డిస్ట్రక్షన్ రూమ్స్, స్మాష్ రూమ్స్... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి గదులు ఆవేశంతో రగిలిపోతున్న వారికి సాంత్వన చేకూర్చి శాంతపరుస్తున్నాయి. అసలేమిటీ రేజ్ రూమ్‌లు...? కోపం, కసి, ఫ్రస్ట్రేషన్ వంటి వాటితో బాగా ఇబ్బంది పడుతున్న వారిలో కొందరుఏదైనా పగులగొట్టడమో, ధ్వంసం చేయడమో చేస్తే ప్రశాంతత వస్తుందని అనుకోవడం పరిపాటి. ఎలాంటి వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా స్థిమిత పడతామని భావిస్తారో అలాంటి వాటిని ఒక గదిలో ఉంచి ధ్వంసం చేయించడమే ఈ రేజ్ రూమ్‌ల ఏర్పాటు ఉద్దేశం. ఈ జాబితాలో హాళ్లలోని వస్తువులు, వంటిగది వస్తువుల నమూనాలు, ఫర్నీచర్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్‌్కలు, ఫోన్లు మొదలైనవి ఉంటాయి. ఎప్పుడు మొదలైందీ ట్రెండ్... 2008 ప్రారంభంలో జపాన్, అమెరికాలోనిటెక్సాస్లలో ఇది మొదలైంది. ముఖ్యంగా జపాన్‌లో 2008లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల్లో పెరిగిన ఒత్తిళ్లు, ఫ్ర్రస్టేషన్ను తగ్గించేందుకు ఈ పద్ధతిని కనుగొన్నారు. అమెరికా, జపాన్‌తోపాటు సెర్బియా, యూకే, అర్జెంటీనా వంటి దేశాల్లో వందలాది రేజ్రూమ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మన దేశంలోనూ షురూ... 2017లో ఢిల్లీ శివార్లలోని గుర్‌గ్రామ్‌లో ‘బ్రేక్రూమ్’పేరుతో ప్రారంభం. అదే ఏడాది మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ‘భద్దాస్’–యాంగర్ రూమ్ అండ్ కేఫ్ ఏర్పాటైంది. తాజాగా ఈ నెలలోనే బెంగళూరులోని బసవనగుడిలో రేజ్రూమ్ను ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడు అనన్యశెట్టి ప్రారంభించాడు. 2022 అక్టోబర్ హైదరాబాద్‌లో తొలి రేజ్రూమ్కు 25 ఏళ్ల సూరజ్ పూసర్ల శ్రీకారం చుట్టాడు. గదిలో ఏముంటాయి? పాడైపోయిన లేదా పనికిరాని వస్తువులను సేకరించి రేజ్ రూమ్‌లో ఉంచుతారు. తమ కోపాన్ని తీర్చుకోవాలనుకొనే వ్యక్తులు ఈ గదిలోకి వెళ్లి వారి ఆవేశం చల్లారే దాకా వస్తువులను చితక్కొట్టొచ్చన్నమాట. అయితే ఇదేమీ ఊరికే కాదండోయ్... వస్తువులను విరగ్గొట్డడమో లేదా పగలగొట్టడమో చేయాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందే. ఇవీ ప్యాకేజీలు.. ఉదాహరణకు హైదరాబాద్‌లోని రేజ్ రూమ్‌లో ‘క్వికీ’ప్యాకేజీ కింద రూ.1,300 చెల్లిస్తే గాజు సీసాలు పెట్టే ఒక ఫైబర్ బుట్ట (బాటిల్ క్రేట్), ఓ కంప్యూటర్ కీ బోర్డు, మౌస్, స్పీకర్లు ధ్వంసం చేయొచ్చు. అలాగే ‘రఫ్ డే’కి రూ.1,500 కడితే రెండు క్రేట్లలో 15 బాటిళ్లు, ప్టాస్టిక్, ఎల్రక్టానిక్ వస్తువులు విరగ్గొట్టొచ్చు. అదే ‘రేజ్ మోడ్’కు అయితే రూ. 2,800 చెల్లించి ఓ మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్, టీవీ సెట్, రిఫ్రిజిరేటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లను విరగ్గొట్టొచ్చు. ఇవేకాకుండా పంచింగ్ బ్యాగ్, బాక్సింగ్ ఉపకరణాలు, గురిచేసి కొట్టే డార్ట్‌లు ఇంకా రేజ్ బాల్స్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలు ఉపయోగించుకొనే వారికి ఇండస్ట్రియల్ సూట్, హెల్మెట్, గ్లౌస్, షూస్ వంటివి ఇస్తారు. ఒక్కొక్కరూ లేదా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం 20 నిమిషాలపాటు ఆ గదిలో ఉండి వస్తువులను ధ్వంసం చేయొచ్చు. పనికి రానివే.. పనికి రాని వస్తువులు, పాడైన వస్తువులను తుక్కు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రేజ్ రూమ్‌లో ఉంచుతాం. కోపంతో ఉన్న వారు విరగ్గొట్టిన వివిధ వస్తువులను రీసైక్లింగ్ కేంద్రాలకుతరలిస్తాం. –నిర్వాహకులు -
మనసు మాట వినే చక్రాల కుర్చీ!
వాషింగ్టన్: దివ్యాంగులకు చక్కగా ఉపయోగపడే చక్రాల కుర్చీని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కుర్చీని కదిపేందుకు బటన్స్ నొక్కాల్సిన పనిలేదు. మనిషిలోని ఆలోచనలను బట్టి నడుచుకుంటుంది. అంటే మనస్సుతో∙కుర్చీని కంట్రోల్ చేయొచ్చు. కుర్చీలో కూర్చున్న తర్వాత కుడి వైపునకు మళ్లాలంటే రెండు చేతులను కుడి వైపునకు కదిలించినట్లు మనసులో ఊహించుకుంటే చాలు. ఎడమ వైపునకు వెళ్లాలంటే రెండు కాళ్లను అదే దిశలో కదిలించినట్లు ఊహించుకోవాలి. మెదడులోని సంకేతాలను వీల్ చైర్ కదలికలతో అనుసంధానించారు. ఇందుకోసం హెల్మెట్ (స్కల్ క్యాప్) లాంటిది ధరించాలి. ఇందులో 31 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి మెదడు అందించే సంకేతాలను పసిగడతాయి. చైర్ వెనుక ల్యాప్‌ట్యాప్ ఫిక్స్ చేసి ఉంటుంది. కృత్రిమ మేధ(ఏఐ)తో మెదడు సంకేతాలు కుర్చీ కదలికలుగా మారుతాయి. దివ్యాంగులు, నడవలేని బాధితులు చేయాల్సిందల్లా కుర్చీలో కూర్చొని కాళ్లు, చేతులు ఆడించినట్లు మనసులో ఊహించుకోవడమే. మనసు మాట వినే ఈ చక్రాల కుర్చీ 80 శాతం కచ్చితత్వంతో పని చేసినట్లు అధ్యయనంలో తేలింది. కుర్చీలను వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
హాంకాంగ్ హస్తగతమైంది.. తర్వాత తైవానే!
బీజింగ్: హాంకాంగ్‌ను పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. దాని ద్వారా అల్లర్ల నుంచి సుపరిపాలన దిశగా హాంకాంగ్ మార్పు చెందినట్లు చెప్పారు. మరోవైపు.. తైవాన్ వేర్పాటువాదంపై చైనా పోరాటం చేస్తోందన్నారు. తైవాన్ తమ అంతర్గత భాగమని, ఆ ప్రాంత సమగ్రతను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు జిన్‌పింగ్. ‘హాంకాంగ్‌లో పరిస్థితులు ఆందోళనల నుంచి సుపరిపాలన దిశగా మార్పు చెందాయి. స్వీయ పరిపాలన ద్వీపం తైవాన్‌లో వేర్పాటు వాదం, విదేశీ శక్తుల జోక్యంపై ప్రధానంగా పోరాటం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు జిన్‌పింగ్. తైవాన్ను స్వతంత్ర ప్రాంతంగా తాము అంగీకరించబోమని, తైపీ తమ అంతర్గత ప్రాంతమని చాలా సందర్భాలుగా చైనా చెబుతూ వస్తోంది. ఇటీవల అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ, ఇతర చట్ట సభ్యులు తైనాన్‌లో పర్యటించగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ను అష్టదిగ్భందనం చేసి.. యుద్ధ మేఘాలను ఆవరించింది. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే! -
మంచి మాట: మన ఆలోచనలే మనం
మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు. ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది. ‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది. సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం. ‘హెయిన్’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే. మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది. కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్ తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది. మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు. – ఆచార్య మసన చెన్నప్ప -
Diabetes: బ్లడ్ షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం మరొకటి అధిక బరువు. ఇటీవలి కాలంలో ఇవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మారిన జీవన శైలి, ఆహార నియమాలు, జంక్ఫుడ్స్, ఇతర అనారోగ్యకరమైన జీవన పద్ధతులు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి. అయితే మన కిచెన్‌లోని అతి సాధారణ మసాలా దినుసులు, మూలికలతో షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తేవచ్చు. ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. దీని వలన తీవ్రమైన సమస్యలు రావడంతో పాటు, ఒక్కోసారి శారీరక వైకల్యంతో బాడీపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మనిషి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. అయితే షుగర్ వ్యాధి బారిన పడినంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. తమ రోజు వారీ ఆహారం, తేలికపాటి వ్యాయామాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడు తూనే, శరీరంలో షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు చిట్కాలు పాటిస్తుండాలి. ముఖ్యంగా వంట ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆయుర్వేద విలువలు కలిగిన మూలికలతో షుగర్ వ్యాధికి చెక్ చెప్పవచ్చు. అలాంటి వాటిలో దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, జీలకర్ర, సోంపు ప్రధానంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్‌కి రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు నిత్యం మనం వాడే వస్తువులు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పసుపును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వ్యాధులనుంచి తప్పించే సహజసిద్ధమైన యాంటిబయోటిక్‌గా పనిచేసే పసుపును ప్రతీ ఒక్కరు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. మన బాడీలోకి ప్రవేశించే ఏ రకమైన వైరస్ లేదా బాక్టీరియాతోనైనా మనకు తెలియకుండానే ఇది ఫైట్ చేసుంది. ఇక మధుమేహం విషయంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కేవలం మాసాలా దినుసుగా మాత్రమే కాదు దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడంతోపాటు, షుగర్ బాధితులు దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీరు లేదా టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం.ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు వడకట్టి ఈ నీటిని తాగాలి. లేదా ఆ మెంతులతో పాటు తీసుకున్నా మంచిదే. మనం రోజు పోపు దినుసులా వాడే జీలకర్ర కూడా సుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. సోంపులో ఉండే అనిథాల్ శరీరంలోని అనేక ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను నివారిస్తుంది. సోపు గింజల్లో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు మధుమేహ బాధితులకు మేలు చేస్తాయి. -
డ్రగ్స్ కట్టడికి పోలీస్ స్టేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటుపై పోలీస్ శాఖ రూపకల్పన చేస్తోంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విభాగాలపై అధ్యయనం చేస్తున్న పోలీస్ శాఖ పటిష్టమైన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు రూపుదిద్దుకోబోతున్న విభాగానికి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ హోదా కలిగి ఉండాలని భావిస్తోంది. ఎందుకంటే ప్రత్యేకమైన నేరాలను విచారించబోతున్న ఈ విభాగానికి కేసు నమోదు చేసుకొని చార్జిషీట్ వేసే అధికారం కల్పిస్తేనే వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడం సులభతరం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఉన్న నేర పరిశోధన విభాగం (సీఐడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లాగా నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ (ఎన్‌ఓసీసీసీ) విభాగం కూడా విధులు నిర్వర్తించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇలా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్, సంబంధిత ఇతర నేరాల కేసులు నమోదు చేసే అధికారం, స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి కేసులు బదలాయించుకొని విచారణ చేసే అధికారం ఈ యూనిట్‌కు ఉంటుంది. ఎస్హెచ్ఓగా డీఎస్పీ ర్యాంకు అధికారి పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్)గా డీఎస్పీ ర్యాంకు అధికారిని నియమించుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రతీ జిల్లాలో ఒక ఎన్‌ఓసీసీసీ (నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్) ఏర్పాటు చేయాలని, దీనివల్ల తీవ్రత కిందిస్థాయి వరకు వెళ్తుందని, నిందితుల్లోనూ భయం ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సీఐడీ, ఏసీబీలాగే జిల్లాల వారీగా యూనిట్లు ఏర్పాటుచేసి, డీఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో కార్యాలయాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిసింది. అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మాత్రం అదనపు డీసీపీ/అదనపు ఎస్పీ నేతృత్వంలో యూనిట్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. డిప్యుటేషన్‌పై సిబ్బంది వెయ్యి మందితో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఎన్‌ఓసీసీసీకి తొలిదశలో 350–400 మందిని నియమించాలని భావిస్తున్నారు. ఇందులో 85 శాతం మందిని పోలీస్ శాఖ నుంచి, మిగిలిన 15 శాతం ఎక్సైజ్ విభాగం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ర్యాంకు అధికారి వరకు కనీసం మూడేళ్లు, సీఐ ర్యాంకు అధికారిని రెండేళ్లపాటు డిప్యుటేషన్‌పై తీసుకుంటారని తెలిసింది. ఇలా పలు దఫాలుగా సిబ్బందిని పెంచుకుంటూ వెయ్యి మందితో పూర్తిస్థాయి విభాగంగా మార్చాలని భావిస్తున్నారు. మరోసారి సీఎంతో చర్చించి.. కొత్త సెల్ ఏర్పాటుకు ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో రూపొందించి నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. ముందుగా విభాగం ఏర్పాటుపై అదేశాలు వెలువడగానే, నియామకాలకు సంబంధించి ఆదేశాలు వెలువడతాయని చెప్పారు. ప్రతిపాదనలపై మరోసారి సీఎం కేసీఆర్‌తో చర్చించాల్సి ఉంటుందని, మార్పులు చేర్పులు, కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
అన్నా.. మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను..
Mobile Data Usage And Data Saving Tips In Telugu: ఎన్నిసార్లు చెప్పా.. ఇంటర్నెట్ప్యాక్ కోసం ఎక్స్ట్రా రీఛార్జ్ అడగొద్దని? అంటూ అసహనంగా చెల్లిని మందలించాడు ప్రశాంత్. ‘ఏం చేయను అన్నయ్యా.. డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది. ఆ విషయం తెలియకుండానే మొబైల్ డేటా లిమిట్ దాటేసిందని అలర్ట్ వస్తోంది’ అంటూ ముఖం వేలాడేసుకుని సమాధానం ఇచ్చింది గిరిజ. ఇంతకీ మొబైల్ డేటా లిమిట్ ఆన్‌లో పెట్టుకున్నావా? అని ప్రశాంత్ అనడంతో బిక్క ముఖం వేసింది గిరిజ. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే కోట్ల మంది ఎదుర్కొనే సమస్య.. వేగంగా మొబైల్ డేటా అయిపోవడం. వైఫై కనెక్షన్ లేని ఇళ్లలో మొబైల్ డేటానే ఆధారం. ఓటీటీ, ఇతరత్రా సోషల్ యాప్‌లను ఉపయోగిస్తూ రోజూ వారీ డేటా ఎలా అయిపోతోందో కనీసం తెలియదు కూడా. ఫుల్ సిగ్నల్ ఉందని.. ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తోందని సంబరపడేవాళ్లు.. ఇంటర్నెట్ డేటా ఫటా ఫట్ అయిపోతుందని మాత్రం గుర్తించరు!. డేటా లిమిట్ మ్యాగ్జిమమ్ దాటి వెళ్లకుండా ఉండేదుకు పర్యవేక్షణ, పరిమితం చేయడం లాంటి మార్గాలు ఉంటాయని గుర్తిస్తే చాలు కదా!. ►మొబైల్ డేటా వాడకాన్ని మానిటరింగ్ చేయడం చాలా సులువు. ఏదైనా ఒక యాప్‌ను ఎక్కువసేపు నొక్కి పట్టుకున్నప్పుడు.. యాప్ ఇన్ఫో app info అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే నేరుగా యాప్ సెట్టింగ్ పేజ్‌కి వెళ్తుంది. అక్కడ మొబైల్ డేటా&వైఫై ఆప్షన్ కనిపిస్తుంది. పైన బ్యాక్‌గ్రౌండ్-ఫోర్‌గ్రౌండ్‌లో ఆ యాప్ ఎంత డేటాను తీసుకుంటుందనే విషయం అక్కడ చూడొచ్చు. ఒకవేళ ఆ యాప్ ఎక్కువ డేటాను లాగేస్తుందని అర్థమైతే.. వెంటనే అక్కడి ఆప్షన్స్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. ►ఇక ఫోన్ సెట్టింగ్స్ యాప్ Settings appలో డేటాసేవర్ Data Saver అనే ఫీచర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు వినియోగించుకుంటున్న డేటాను నియంత్రిస్తుంది. ►గూగుల్ ప్లే స్టోర్‌లో.. డేటా మేనేజ్మెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మానిటర్ చేసుకోవచ్చు. పైగా ఒకేసారి ఒక్కోయాప్ ఎంతెంత డేటా తీసుకుంటున్నాయో ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. గంట, రోజూ, వారాలు, నెలల తరబడి ఎంతెంత ఉపయోగిస్తున్నామో అక్కడ చూసుకోవచ్చు కూడా. ►కొన్ని ఫోన్లలో డేటా లిమిట్ ఆప్షన్ నేరుగా ఉంటుందన్నది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అక్కడ ఫలానా ఎంబీ నుంచి జీబీల్లో డేటా లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. సపోజ్ యూట్యూబ్లోగానీ, లేదంటే ఏదైనా ఓటీటీ యాప్‌లోగానీ సినిమా చూస్తూ ఉండిపోయినప్పుడు డేటా దానంతట అదే అయిపోతుంది. కానీ, లిమిట్ పెట్టుకోవడం వల్ల పరిధి దాటగానే అలర్ట్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ఇంటర్నెట్ డేటాను నియంత్రించుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా లిమిట్ Data limit అని టైప్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది. మరికొన్ని ఫోన్లలో Data Warning ఫీచర్ కూడా ఉంటుంది. ►లైట్ వెర్షన్, అలర్ట్నేట్ వెర్షన్ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా కూడా ఇంటర్నెట్ డేటాను తక్కువగా వాడొచ్చు. కానీ, వీటిలో చాలామట్టుకు సురక్షితమైనవి కానివే ఉంటాయి. కాబట్టి, ప్లేస్టోర్ నుంచి అథెంటిక్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం ఉత్తమం. ఉదాహరణకు.. ఫేస్బుక్, ఇన్స్టలాంటి యాప్‌ల్లో స్క్రోలింగ్ చేస్తూ ఉండగానే.. డేటా అయిపోయినట్లు మెసేజ్ వస్తుంది. అవి ఎక్కుడ డేటాను లాగేస్తాయి కాబట్టి.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైట్ వెర్షన్ యాప్‌ల ఉపయోగించొచ్చు. మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు. చదవండి: ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండా ఫోన్లో ఫ్రీ స్పేస్ పొందండి ఇలా.. -
దశాబ్దాల దందాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల స్మగ్లింగ్లు, దందాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఉదాశీన చట్టాలను అవకాశంగా చేసుకుని దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ తదితర దందాలపై కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కు సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు అప్పగించింది. ఏళ్ల తరబడి సాగుతున్న దోపిడీ చట్టంలో లొసుగులను అవకాశంగా చేసుకుని రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందా దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైంది. ఇంతవరకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై రాష్ట్ర మైనింగ్, మినరల్స్ నియంత్రణ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. ఎవరైనా వరుసగా 2సార్లు పట్టుబడితే ఆ చట్టం ప్రకారం జరిమానా విధించి విడిచిపెట్టేవారు. మూడోసారి దొరికితే కేసు పెట్టేందుకు అవకాశం ఉంది. అది కూడా స్థానిక పోలీసులకు అప్పగించాలి. అంతేగానీ రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారం ఉండదు. అదే ప్రాతిపదికన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏర్పాటుచేసిన ‘సెబ్’కు కూడా కేసులు పెట్టేందుకు సాంకేతికంగా అడ్డంకులు తలెత్తాయి. మద్యం అక్రమ రవాణా విషయంలోనూ ఎక్సైజ్ చట్టం ప్రకారం నమోదుచేసే కేసులు ఎలాంటి ప్రభావం చూపించడంలేదు. ఇక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవితాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఆన్లైన్ జూదం దందాపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదుకూ అవకాశంలేదు. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూడా అటవీ చట్టాల కింద పెట్టే కేసులు స్మగ్లర్ల ఆట కట్టించేందుకు సరిపోవడంలేదు. ఇటువంటి వ్యవస్థీకృత లోపాలతో రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందాలు యథేచ్ఛగా సాగుతూ అటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతోపాటు ఇటు సామాన్యుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కూడా స్మగ్లర్లకు ఊతమిచ్చింది. కొరఢా ఝళిపించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని రకాల స్మగ్లింగ్ దందాలను నిర్మూలించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యుక్తమైంది. అందుకోసం ‘సెబ్’కు విశిష్ట అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే ఆయా దందాల్లోని పాత్రధారులు, సూత్రధారులపై ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కఠిన శిక్షలు విధించేలా చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం.. ►రాష్ట్రం ఒక యూనిట్‌గా ‘సెబ్’ కమిషనరేట్‌ను గుర్తించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న ‘సెబ్’ స్టేషన్లను పోలీస్స్టేషన్లుగా గుర్తిస్తూ హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం ‘సెబ్’కు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్, ఎక్సైజ్, అటవీ శాఖలు విడివిడిగా కూడా నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉంది. ►ఇప్పటికే గనుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో ఇక నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ‘సెబ్’ దాడులు నిర్వహించి నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది. ఆ కేసులను స్థానిక పోలీసులకు అప్పగించాల్సిన అవసరంలేదు. జరిమానాలతో కేసులను సరిపెట్టరు. దీంతో.. ప్రజాధనం లూటీ, సహజ వనరుల దోపిడీ కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు సంక్రమించాయి. ► హోం, ఎక్సైజ్ శాఖలు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో అక్రమ మద్యం, గంజాయి దందాలకు పాల్పడే వారిపై కూడా ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. ►ఇక ఎర్రచందనం స్మగ్లర్లపై ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తూ అటవీ శాఖ కూడా ఉత్తర్వులు జారీచేయనుంది. ► అలాగే, ఆన్లైన్ జూదాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుగా ఐటీ శాఖ త్వరలో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ►గుట్కా దందాపై కఠిన చర్యలకు వీలుగా వైద్య–ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. -
వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్స్ ఇవే
WhatsApp Upcomig Features In 2022: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలో అదీ కొత్త ఏడాది మొదట్లో కొత్త ఫీచర్స్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఈ ఏడాది అంతగా ఫీచర్ల అప్డేట్ ఇవ్వని వాట్సాప్.. 2022లో మాత్రం యూజర్ ఫ్రెండ్లీ అప్డేట్స్తో రానున్నట్లు సమాచారం. భారత్ సహా ప్రపంచంలోనే మోస్ట్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది వాట్సాప్. వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్.. క్రమంగా వివాదాలను అధిగమిస్తూ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా పేరు దక్కించుకుంది. కరోనా ప్రభావంతో కిందటి ఏడాది, అలాగే 2021 కూడా వాట్సాప్ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ఈ తరుణంలో కొత్త సంవత్సరం అదిరిపోయే ఫీచర్లను అందించబోతోంది. వాబేటా ఇన్ఫోప్రకారం.. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ 2022లో వాట్సాప్ నుంచి రాబోయే కొత్త ఫీచర్ బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు. గ్రూపులో పెట్టే ఏ మెసేజ్‌నైనా.. అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్ ఇది. అప్పుడు అక్కడ This was removed by an admin అని చూపిస్తుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ రీసెంట్గా మెసేజ్ డెలిట్ ఫీచర్‌ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరైనా సరే చేసిన మెసేజ్‌ను వారంలోగా వెనక్కి తీసేసుకునే వెసులుబాటు కల్పించింది. క్విక్ రిప్లయిస్.. బిజినెస్ ప్రత్యేకం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కోసం ఈ ఫీచర్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ కోసం తీసుకురాబోతున్నారు. ఇంతకు ముందు ఛాట్బాక్స్లో “/” అనే సింబల్‌ను తరచూ పంపించే మెసేజ్‌లకు త్వరగతిన స్పందించేందుకు యాడ్ చేసేవాళ్లు. ఇకపై ఈ ఫీచర్ ఛాట్షేర్ యాక్షన్ మెనూకి సైతం చేర్చునున్నారు. స్టిక్కర్ స్టోర్ వాట్సాప్‌లో సాధారణంగా ఇతర యాప్‌ల సాయంతో స్టిక్కర్లు పంపుకోవడం తెలిసిందే. అయితే ఇకపై ఎంపిక చేసిన స్టిక్కర్స్‌ను నేరుగా వాట్సాప్ ద్వారానే పంపుకునే విధంగా స్టిక్కర్ స్టోర్ ఆప్షన్ తీసుకురాబోతోంది వాట్సాప్. వెబ్ అప్లికేషన్స్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షలకు ఈ ఆప్షన్‌ను అందించనుంది. కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ ఫీచర్. ఇది గ్రూప్ అడ్మిన్ల కోసం తీసుకురాబోతున్న ఫీచర్. తద్వారా మల్టీపుల్(ఒకటి కంటే ఎక్కువ) గ్రూపులు అడ్మిన్ కంట్రోల్ చేతిలో ఉంటాయి. అంతేకాదు సబ్ గ్రూపులను క్రియేట్ చేసే వీలుంటుంది కూడా. మెసేజ్ రియాక్షన్స్ దీని గురించి ఆల్రెడీ చర్చించిందే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మాదిరి.. మెసేజ్‌లకు ఎమోజీల ద్వారా నేరుగా రియాక్ట్ అయ్యే వెసులుబాటు కల్పించడం. ప్రస్తుతం ఆరు ఎమోజీల సాయంతో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది వాట్సాప్. స్టిక్కర్ సజెషన్స్ వాట్సాప్‌లో ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్ లోడ్ చేశారనుకోండి!. ఒకటి కంటే ఎక్కువ స్టిక్కర్లకు(సేమ్ స్టిక్కర్) సరిపోయేలా ఏదైనా టైప్ చేస్తే.. అప్పుడు అందులో ఓ స్టిక్కర్ చిహ్నం(కన్ఫ్యూజ్కి గురి చేయకుండా) ఆటోమేటిక్‌గా మారుతుంది. ఎందుకంటే వాట్సాప్ సర్వర్‌లో కాకుండా కేవలం డివైజ్‌లో మాత్రమే వాటిని డౌన్ లోడ్ చేశారు కాబట్టి. ఆ స్టిక్కర్లకు WhatsAppతో సంబంధం ఉండదు కాబట్టి. ఈ ఫీచర్ యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. సేవ్ చేయకుండా స్టిక్కర్లు ఫార్వాడ్ చేయడం సాధారణంగా వాట్సాప్‌లో ఎవరైనా స్టిక్కర్లు పంపితే.. వాటిని సేవ్ చేయకుండా మరొకరికి పంపలేం. అందుకే సేవ్ చేయకుండానే పంపే ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. చదవండి: వాట్సాప్ నెంబర్ పదే పదే బ్యాన్ అవుతోందా? ఇలా చేయండి -
Hyderabad: స్వచ్ఛమైన గాలి కావాలా?.. అక్కడికి వెళ్లాల్సిందే..
ఏపుగా పెరిగిన చెట్లతో రంగురంగుల పూల మొక్కలతో పరుచుకున్న పచ్చదనం ఒక వైపు... అందమైన ఆకృతులలో రాళ్ల వరుసలు మరోవైపు... ఇదీ జూబ్లీహిల్స్ కాలనీలో ఆకట్టుకునే తీరు. నాణ్యమైన ప్రాణవాయువుకు జూబ్లీహిల్స్ కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెలువరించిన నివేదికలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో నాణ్యమైన వాయువు ప్రజలకు అందుతోందని వెల్లడించింది. – బంజారాహిల్స్ క్రమం తప్పకుండా... సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన నేషనల్ ఎయిర్ క్వాలిటీ, మానిటరింగ్ ప్రోగ్రామ్‌లలో ఎక్కడెక్కడ గాలి ఎలా ఉందన్నదాన్ని అంచనా వేస్తుంటారు. ప్రతినెలా ఈ లెక్కింపు ఉంటుంది. దీని ప్రకారమే నగరంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి గాలి లభిస్తుందన్నది నివేదిక ద్వారా స్పష్టం చేస్తున్నారు. ప్రతిసారి జూబ్లీహిల్స్ స్వచ్ఛమైన గాలికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నది. చుట్టుపక్కల ఎలాంటి పరిశ్రమలు లేకపోవడం, కాలనీల్లో కూడా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేకపోవడం, కాంక్రీట్ జంగిల్‌గా మారకపోవడంతో ఇక్కడ ప్రతిసారి స్వచ్ఛమైన లభించేందుకు కారణమవుతున్నాయి. ఎయిర్ క్వాలిటి ఇండెక్స్(ఎక్యూఐ) నివేదిక ప్రకారం నగరంలోని స్వచ్ఛమైన గాలి జూబ్లీహిల్స్‌లో లభిస్తున్నట్లుగా గుర్తించారు. నగరంలో 32 చోట్ల ఏర్పాటు చేసిన నేషనల్ ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ ప్రోగ్రామ్ (ఎన్ఏఎంపీ)ల ద్వారా ఎక్కడెక్కడ స్వచ్ఛమైన గాలి లభిస్తున్నదో అంచనా వేస్తున్నారు. గుడ్, సాటిస్‌ఫ్యాక్టరీ, మాడరేట్, పూర్, వెరీపూర్, సెవర్ తదితర అంశాలలో ఎక్కడెక్కడ ఏ రకమైన గాలి లభిస్తున్నదో అంచనా వేస్తున్నారు. దీని ప్రకారమే జూబ్లీహిల్స్‌లో స్వచ్ఛమైన గాలి లభిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నెల మొదటి వారంలో గుర్తించిన జాబితాలో జూబ్లీహిల్స్ మొదటి స్థానం దక్కించుకుంది. పచ్చదనమే కారణం... జూబ్లీహిల్స్ కాలనీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పచ్చదనం ఎక్కువ. ఇక్కడ అపార్ట్మెంట్ల కంటే వ్యక్తిగత నివాసాలు ఎక్కువగా ఉండటం, ఆ నివాసాల్లో మొక్కలు, చెట్లతో పాటు రోడ్లకు రెండువైపులా భారీ వృక్షాలు కూడా స్వచ్ఛమైన గాలి రావడానికి కారణమని కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్ట్‌లు పేర్కొంటున్నారు. కేబీఆర్ పార్కు కూడా... జూబ్లీహిల్స్ కాలనీని ఆనుకొని 360 ఎకరాల్లో కేబీఆర్ పార్కు విస్తరించి ఉన్నది. పార్కులో 70 శాతం దట్టమైన అడవి ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్వచ్ఛమైన గాలితో ఉంటున్నాయి. జూబ్లీహిల్స్ కాలనీకి కేబీఆర్ పార్కు పచ్చదనం కూడా ఒక వరంగా మారిందనే చెప్పాలి. చదవండి: Karimnagar: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్ -
పంజ్‌షీర్‌ను జయించామన్న తాలిబన్లు.. అదేమీ లేదన్న తిరుగుబాటు దళం
కాబూల్: అప్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షీర్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా అక్కడి తిరుగుబాటుదారులు పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మరిన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంజ్‌షీర్ తమ స్వాధీనంలోకి వచ్చిందని తాలిబన్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు. అఫ్గాన్‌లోని చివరి ప్రావిన్స్ కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పంజ్‌షీర్ లోయను కూడా వశం చేసకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఈ ఆక్రమణతో అఫ్గానిస్తాన్ పై పూర్తి అధికారం సాధించామన్నారు. ‘అల్లా దయతో అఫ్గానిస్తాన్ మొత్తం మా అధీనంలోకి వచ్చింది. తిరుగుబాటు దారులు ఓడిపోయారు. ప్రస్తుతం పంజ్‌షీర్ మా అధీనంలోనే ఉంది’ అని తాలిబన్ల కమాండర్ ఒకరు తెలిపారు. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు విచిత్రమేమంటే రెండు వర్గాలు మేమే పై చేయి సాధించామని చెప్పుకుంటున్నాయి. పంజ్‌షీర్‌పై పట్టు సాధించామన్న తాలిబన్ల వాదనను అక్కడి తిరుగుబాటుదారులు కొట్టి పారేశారు. తాలిబన్లను తిప్పికొట్టామని ప్రకటించారు. అలాగే పంజ్‌షీర్ నుంచి పారిపోయాననే వాదనను అమ్రుల్లా సాలెహ్ తోసిపుచ్చారు. తాము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. రెండు వైపులా ప్రాణ నష్టం వాటిల్లింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగేది లేదు. ఎప్పటికీ అఫ్గాన్ పక్షాన నిలబడి పోరాడతామని సాలెహ్ ప్రకటించారు. మరోవైపు కొన్ని వందల తాలిబన్లు తమ వద్ద చిక్కుకున్నారనీ, వారికి ఆయుధాల కొరత కారణంగా లొంగిపోయేందుకు చర్చలు కొనసాగిస్తున్నారని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రతినిధి అలీ నజారీ వెల్లడించారు. చదవండి: Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! అటు పంజ్‌షీర్‌ను హస్తగతం చేసుకున్నాంటూ తాలిబన్లు రెట్టింపు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో పంజ్‌షీర్‌పై విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులుల్లో 17 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చిన్నారులు సహా పలువురు మృతి చెందినట్లు స్థానిక ఆఫ్గన్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. -
Ys Jagan: నిక్షిప్తం.. ఆరోగ్యం నిక్షేపం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు వేగంగా, సులభంగా మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ కార్డులను డిజిటలైజ్ చేసి ఆధార్‌తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లాగిన్ కాగానే సంబంధిత వ్యక్తితోపాటు కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు వెంటనే లభ్యమయ్యేలా చూడాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఆధార్ నంబర్‌ను వెల్లడించగానే సంబంధిత వ్యక్తి/కుటుంబం ఆరోగ్య వివరాలు సమస్తం లభ్యమయ్యే విధానాన్ని తేవాలన్నారు. ఈ విధానాలన్నీ సమర్థంగా అమలు చేయడంలో విలేజ్ క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల అవి త్వరగా పూర్తయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ హెల్త్‌పై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆరోగ్యశ్రీ కార్డులో సంబంధిత కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య వివరాల డేటాను మొత్తం నిక్షిప్తం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ఈ వివరాలన్నీ తెలిసేలా ఉండాలన్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో కూడా డేటాను నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి విలేజ్, వార్డు క్లినిక్‌లో కంప్యూటర్ను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్న తేదీ, సమయం కూడా క్యూఆర్ కోడ్ ద్వారా నిక్షిప్తం కావాలని, బ్లడ్ గ్రూప్ వివరాలు కూడా పొందుపరచాలని చెప్పారు. గ్రామాలకు వెళ్లే డాక్టర్‌కు సులభంగా తెలియాలి 104 వాహనం గ్రామాలకు వెళ్లగానే ఒక వ్యక్తి ఆరోగ్య వివరాలు డాక్టర్‌కు సులభంగా తెలిసేలా ఈ విధానం ఉండాలని, దీనివల్ల చికిత్స చేయడం చాలా సులభతరమవుతుందని, వైద్యం కూడా త్వరగా అందుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. షుగర్, బీపీ, బ్లడ్‌గ్రూపు సహా ఇతర వివరాలను కార్డులో నిక్షిప్తం చేయాలన్నారు. విలేజ్ క్లినిక్‌లలో సాధారణ పరీక్షలు నిర్వహించేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఎం ప్యానెల్ అయిన ఆస్పత్రుల వివరాలను విలేజ్ క్లినిక్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి అందుబాటులో ఉంచాలన్నారు. చికిత్స కోసం రోగులను నేరుగా సంబంధిత ఆస్పత్రిలో చేర్పించడం, వారితో సమన్వయం చేసుకోవడం లాంటి బాధ్యతలను సిబ్బంది నెరవేర్చేలా ఈ విధానం ఉండాలని సూచించారు. చిన్నారుల వ్యాక్సిన్ల వివరాలు కూడా.. చిన్నారులు అన్నిరకాల వ్యాక్సిన్లు తీసుకుంటున్నారా? లేదా? అనే వివరాలు కూడా ఆరోగ్యశ్రీ కార్డుల్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల వ్యాక్సిన్లపై ఫాలో అప్ చేయడానికి అవకాశాలు ఉంటాయని, తల్లులు, పిల్లల ఆరోగ్యంపై విలేజ్‌క్లినిక్స్ అత్యంత శ్రద్ధ వహిస్తాయని చెప్పారు. గ్రామాల్లో కాలుష్యంపై దృష్టి పెట్టాలి.. గ్రామాల్లో కాలుష్య నివారణపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నీరు, గాలి నమూనాలను పరిశీలించి కాలుష్య స్థాయిలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్యం వివరాలు నమోదు చేయడం వల్ల అధికారులు వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పల్లెల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తరచూ శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ అంశాలపై దృష్టి సారించడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, దీనికి సంబంధించి ప్రోటోకాల్స్ పటిష్టంగా రూపొందించాలని స్పష్టం చేశారు. డిప్యుటేషన్లు వద్దు.. పోస్టుల భర్తీనే విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ ఎంత మంది సిబ్బంది ఉన్నారు? ఇంకా ఎంతమంది కావాలి? అనే అంశాలపై డేటా రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన సంఖ్యలో వైద్యులను నియమించాలని, జిల్లాను యూనిట్‌గా తీసుకుని నియామకాలు చేపట్టాలని సూచించారు. తాత్కాలికంగా సర్దుబాటు చేసే డిప్యూటేషన్లు వద్దని, అన్ని పోస్టులు భర్తీ చేయాలని, మూడు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ‘‘సిబ్బంది కొరత అనేది లేదన్న మాట మూడు నెలల్లో నాకు చెప్పగలగాలి’’ అని సీఎం పేర్కొన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ స్ధాయి ప్రమాణాలతో ఉత్తమ ఆరోగ్య సేవలు అందాలని సూచించారు. అటెండెన్స్‌ను బయోమెట్రిక్ కెమెరాలతో అనుసంధానం చేయాలన్నారు. ఒక డాక్టర్ కనుక 3 రోజులు వరుసగా రాకపోతే తగిన చర్యలు తీసుకునేలా ఉండాలన్నారు. వారిని పనిచేసే చోటకైనా బదిలీ చేయాలి లేదా పనిచేసేలా అయినా చూడాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు! గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏజన్సీల్లో వైద్య సేవలపై పర్యవేక్షణ చేపట్టి అక్కడ విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించడంపై ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు. జీఎంపీ ప్రమాణాలున్న ఔషధాలను రోగులకు అందించాలన్నారు. పీహెచ్‌సీల నుంచి పైస్థాయి ఆస్పత్రుల వరకూ కాంపౌండ్ వాల్స్ ఉండేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, 104 కాల్‌సెంటర్ ఇన్చార్జి ఏ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాంతిస్తున్న కరోనా: దేశంలో భారీగా తగ్గిన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కేసుల నమోదు సంఖ్య తగ్గుతున్నా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడడంతో లేదు. తాజాగా 30 వేలకు దిగువగా కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 373 మంది వైరస్‌తో బాధపడుతూ మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 3,88,508 ఉండగా కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం 97.45 శాతంగా ఉంది. అయితే మరణాల సంఖ్య అదేస్థాయిలో ఉంది. తాజాగా 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే 54,91,647 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 51.45 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. -
ఆ 3 ముఖ్యం.. 27 రోజులు ప్రచారం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేస్తోంది. వ్యాధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. తప్పనిసరిగా మాస్క్ ధరించడం (నో మాస్క్.. నో ఎంట్రీ), భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం.. ఈ మూడు కరోనా వైరస్ నియంత్రణకు కీలకమని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 27 రోజులపాటు నిర్వహించనున్న ఈ ప్రచార కార్యక్రమాలు గురువారం (ఈనెల 5న) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, షార్ట్ ఫిల్మ్‌లతో చేపట్టిన ఈ ప్రచారంలో ఏరోజు ఎక్కడ ఏకార్యక్రమాలు నిర్వహించాలన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణ కోవిడ్‌ను నియంత్రించేందుకు నిఘా, పరీక్షలను బలోపేతం చేసిన ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, కోవిడ్ టీకా కార్యక్రమాలను విస్తృతం చేసింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్–19 నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ ప్రచారం చేపట్టింది. ఈనెల 31న ముగిసే ఈ ప్రచార కార్యక్రమాలను కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కేంద్రస్థాయిలో టీచింగ్ ఆస్పత్రుల వారు, జిల్లా ఆస్పత్రుల స్థాయిలో జిల్లా వైద్యాధికారులు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల స్థాయిలో మునిసిపల్ కమిషనర్లు, సంబంధిత పోలీసు, వైద్య అధికారులు, డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎస్పీలు, మండల స్థాయిలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, పీహెచ్సీ వైద్యులు ఈ అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించింది. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాలపై కలెక్టర్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఈ ప్రచార కార్యక్రమాలను కచ్చితంగా నిర్వహించేలాగ అన్ని శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారంటే.. గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని రకాల విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, రవాణా వాహనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, సినిమాహాళ్లు, క్రీడాసముదాయాలు, విహారస్థలాలు, వివాహాలు వంటి కార్యక్రమాల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తారు. అందరూ మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా, తరచూ చేతులు కడుక్కునేలా అవగాహన కల్పిస్తారు. 21 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిలో ఈ నెల 21వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలలో తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అనంతరం నిత్య అలంకరణ, పవిత్రమాలధారణ జరుగుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మండపారాధన, అగ్నిప్రతిష్టాపన జరుగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనం, వేద పారాయణ, హారతి, మంత్ర పుష్పం జరుగుతాయి. 23న ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, శాంతి పౌష్టిక హోమాలు, కూష్మాండబలి అనంతరం మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అన్ని ఆర్జిత సేవలు రద్దు: మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాల నేపథ్యంలో అలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను దేవస్థాన అధికారులు రద్దు చేశారు. ప్రత్యక్ష పూజలతో పాటు పరోక్ష పూజలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం 20న దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మార్గం
సాక్షి, హైదరాబాద్: శరీంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త లక్ష్యాన్ని గుర్తించారు. కణత్వచంపై సెరటోనిన్ రిసెప్టార్–1ఏ.. కొలెస్ట్రాల్‌ను గుర్తించగలదని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అమితబ ఛటోపాధ్యాయ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. సెరటోనిన్ రిసెప్టార్లు కణత్వచంలో ఉండే కొలెస్ట్రాల్‌కు సున్నితంగా ఉంటాయని ఆయన గతంలోనే గుర్తించారు. కణాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు రిసెప్టార్ ప్రోటీన్లు కీలకం కాగా.. చాలా మందులు ఈ రిసెప్టార్ ప్రొటీన్లనే లక్ష్యంగా చేసుకుని తయారుచేస్తుంటారు. సెరటోనిన్ రిసెప్టార్ ప్రొటీన్‌లోని సీఆర్‌ఏసీ నిర్మాణాలపై తాము దృష్టి పెట్టామని, నిర్దిష్ట అమైనో యాసిడ్స్‌ను మార్చి చూడగా, ఒక అమైనోయాసిడ్ కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. స్పెయిన్‌లోని పాంపియూ ఫాబ్ర యూనివర్సిటీ హాస్పిటల్ సాయంతో ప్రొటీన్, కొలెస్ట్రాల్ మధ్య జరిగే చర్యలను పరిశీలించామని, తద్వారా తాము గుర్తించిన అమైనో యాసిడ్.. ఎలా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుందో తెలిసిందని చెప్పారు. వయసుతో పాటు కొలెస్ట్రాల్ మోతాదుల్లో తేడాలు వస్తాయని, ఈ రిసెప్టార్ ఆధారంగా కొత్తగా మందులు తయారుచేస్తే మరింత మెరుగ్గా కొలెస్ట్రాల్‌ను నియంత్రించొచ్చని తాము భావిస్తున్నట్లు వివరించారు. స్ట్రక్చరల్ బయాలజీలో సీసీఎంబీకి ఉన్న నైపుణ్యం ఈ కొత్త ఆవిష్కరణకు వీలు కలిగించిందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ నందికూరి వినయ్ తెలిపారు. -
భయాందోళన వద్దు: ఈనెలలోనే కరోనా తగ్గుద్ది
భువనేశ్వర్: రాష్ట్రంలో కోవిడ్- 19 సంక్రమణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జూన్ నెలలో తగ్గుముఖం పట్టి ఊరట కలిగిస్తుందని, భయాందోళన చెందాల్సిన పనిలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో పాజిటివ్ రేటు బెంబేలెత్తించింది. 3 లక్షల 20 వేల 803 మందికి కోవిడ్ పాజిటివ్ నమోదైంది. 711 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. మే 22వ తేదీన ఒక్కరోజునే 12 వేల 852 మందికి పాజిటివ్ నమోదు కావడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. 4 వారాల తర్వాత లాక్డౌన్ ప్రభావం కనిపిస్తోంది. కోవిడ్ పాజిటివ్ రేటు అధికంగా నమోదైన సుందరగడ్, నువాపడా, గజపతి, సుందరగడ్ జిల్లాల్లో తగ్గుముఖం పట్టింది. ఈ జిల్లాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల పాజిటివ్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. త్వరలో కోవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి త్వరలో కోవిషీల్డ్ టీకాలు సరఫరా కానున్నాయి. జూన్ నెల 3వ తేదీ నాటికి 3 లక్షల 5 వేల 460 మోతాదుల కోవిషీల్డ్ టీకాలు చేరుతాయి. ఈ విడత టీకాల్ని ప్రధానంగా 45 ఏళ్లు పైబడిన వారి కోసం వినియోగిస్తామని తెలిపారు. జూన్ 6వ తేదీ నాటికి మరో 40 వేల మోతాదుల కోవ్యాక్సిన్ టీకాలు రాష్ట్రానికి చేరుతాయని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ రేటు అధికంగా కొనసాగుతున్న రాష్ట్రంలోని 5 మునిసిపల్ కార్పొరేషన్లు, 6 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కోవిడ్ టీకాల కార్యక్రమానికి ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. -
కరోనాపై కలెక్టర్లకు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాలను అప్రమత్తం చేసింది. జిల్లాల్లో కరోనా వైరస్ నియంత్రణ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. ఎవరైనా చైనా సహా సమీప దేశాల నుంచి వచ్చిన వారుంటే గుర్తించాలని, కరోనా రాకుం డా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేరళలో 3 కరోనా కేసులు నమోదు కావడం, అక్కడి ప్రభుత్వం కలెక్టర్లకు బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో అదే పద్ధతిలో తెలంగాణలోనూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కరోనా అనుమానిత కేసులకు కూడా ఇకనుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేయిం చాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇక అక్కడి నుంచి వచ్చే కేసులకు గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేస్తామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. కరోనా, ఎబోలా వంటివి అనుకోకుండా వ్యాపిస్తే పరిస్థితిని నియంత్రించేలా ఇవి పనిచేస్తాయి. ఈ మేరకు ఆ టీమ్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చుకోవద్దు.. కరోనా అనుమానిత లక్షణా లతో వచ్చే వారిని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఏ మాత్రం అడ్మిట్ చేసుకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అటువంటివారు ఎవరైనా వస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యే కశ్రద్ధతో గాంధీ లేదా ఫీవర్ ఆసుపత్రికి పంపించాలని స్పష్టం చేసింది. ముక్కు కార డం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలతో ఎవరు వచ్చినా వారి వివరాలు తెలుసుకోవా లని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 777 విమానాల ద్వారా వచ్చిన 89,500 మందిని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేశారని, అందు లో 3,935 మందిని ఎటూ వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోవాలని కేంద్రం ఆదేశించింది. 454 మంది కరోనా అనుమానితులను పరీక్షించగా, ముగ్గురికి కరోనా సోకినట్లు కేంద్రం ప్రకటించిందని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రానికి ఇప్పటివరకు 42 మంది చైనా నుంచి వచ్చారన్నారు. వుహాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో ఎవరికైనా లక్షణాలుంటే మాత్రమే పరీక్షలు చేయాలని, ఇతరులకు వద్దని నిర్ణయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చైనాకు పంపిన విమానాల ద్వారా మన దేశానికి 600 మంది రాగా, అందులో రాష్ట్రానికి చెందినవారు ఐదుగురు ఉన్నారని అధికారులు వెల్లడించారు. జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వారి వివరాలు మాత్రమే సేకరించామని, ఇకనుంచి అంతకుముందు వచ్చిన వారి వివరాలు కూడా తీసుకోవాలని సూచించామన్నారు. వారిలోనూ ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్యాధికారులకు సూచిం చారు. కరోనా నిర్ధారణ పరీక్ష మూడు శాంపిళ్లను సేకరించడం ద్వారా చేస్తారన్నారు. గొంతు, ముక్కు, రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారని తెలి పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేసియా దేశాలకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. -
కిలో ప్లాస్టిక్..కప్పు కాఫీ..
సాక్షి, విశాఖపట్నం: ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని శాసిస్తోంది. పర్యావరణాన్ని ప్రమాదంలో పడేస్తోంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా మంది ఇస్తుంటారు. వాటిని ఆచరణలో పెట్టమంటే మాత్రం ఒకడుగు వెనక్కు వేస్తుంటారు. కానీ.. పర్యావరణంపై నిజమైన ప్రేమ ఉన్నవారు మాత్రం సంకల్పంతో ముందడుగు వేస్తారు. సరిగ్గా అలాంటి వినూత్న ఆలోచనతోనే ప్లాస్టిక్ నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు ఇండియా యూత్‌ఫర్ సొసైటీ ప్రతినిధులు. ఇందుకోసం బీచ్‌రోడ్డులో ఓ ప్రత్యేక పార్లర్‌ను ఈ నెల 27న ప్రారంభించనున్నారు. మీకు కాఫీ తాగాలని ఉందా? అయితే.. మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, ఇతర వ్యర్థాలు తీసుకురండి.. మంచి కాఫీని సముద్రం ఒడ్డున కూర్చొని ఆస్వాదించండి... ఆకలిగా ఉందా..? బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? ఇంకెందుకాలస్యం.. మొత్తం ప్లాస్టిక్‌ని పోగెయ్యండి.. మంచి సమతులాహారాన్ని లాగించెయ్యండి..? ఇదేంటి..? ప్లాస్టిక్‌కు.. కాఫీ, టిఫిన్‌కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా.? ఇదే ఇప్పుడు ట్రెండ్.. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఇండియా యూత్ ఫర్ సొసైటీ బీచ్‌రోడ్డులో మొబైల్ పార్లర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27న బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ ఎదురుగా ‘ప్లాస్టిక్ పార్లర్’ను ప్రారంభిస్తున్నారు. గివ్ ప్లాస్టిక్.. గెట్ ప్రొడక్ట్స్ నినాదంతో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ఈ పార్లర్ మొదలు పెడుతున్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు.. దేశవ్యాప్తంగా ‘ప్లాస్టిక్ ఇచ్చి పుచ్చుకో’ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. కేజీ బియ్యం ఇచ్చిన కార్యక్రమంతో ఈ ఉద్యమం మొదలైంది. ఇటీవల హైదరాబాద్‌లో దోసపాటి రాము అనే సామాజిక వేత్త.. ప్లాస్టిక్ కవర్లు ఇస్తే.. నర్సరీలో నచ్చిన మొక్కని తీసుకెళ్లి పచ్చదనాన్ని పెంపొందించండి అంటూ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో తాజాగా ఇండియా యూత్‌ఫర్ సొసైటీ ప్రతినిధులు ప్లాస్టిక్ పార్లర్‌ను ప్రారంభిస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ పార్లర్‌ను నడుపుతామని సొసైటీ అధ్యక్షుడు అప్పలరెడ్డి తెలిపారు. మొత్తంగా 30 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించామని వివరించారు. ప్రజల్లో అవగాహన కలి్పంచి.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. విశాఖ నగర ప్రజలంతా తమ ప్రయత్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పార్లర్లో ధరలివీ.. ►కప్పు కాఫీ కావాలంటే.. 1 కిలో ప్లాస్టిక్ ఇవ్వాలి ►ఒక క్లాత్ బ్యాగ్ కావాలంటే.. 2 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి ►ఒక జ్యూట్ బ్యాగ్ కావాలంటే.. 4 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి ►100 మి.లీ. పాలు, 2 బిస్కెట్లు, నట్స్, 1 అరటిపండు, ఉడకబెట్టిన గుడ్డు మెనూతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తినాలంటే.. 3 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి -
అక్రమార్కులపై పీడీ పంజా!
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పీడీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయనుంది. అనుమతుల్లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లను నియంత్రించడానికి కఠిన చర్యలు తప్పవని భావించిన సర్కారు.. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పదేపదే అనధికార లే–అవుట్లు చేస్తున్న డెవలపర్లు/భూ యజమానులపై ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆలోచన చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనుంది. లే–అవుట్లకు అనుమతిలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి పాత్ర ఉండదు. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)కి మాత్రమే లే–అవుట్లను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పట్టించుకోని రియల్టర్లు.. పంచాయతీల పాలకవర్గాలతో కుమ్మక్కైఅడ్డగోలుగా వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు జారీ చేసే లే–అవుట్లతో పోలిస్తే.. ఇందులో స్థలాల ధరలు చౌకగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ఇబ్బడిముబ్బడిగా అనధికార లే–అవుట్లు వెలుస్తున్నాయి. దాదాపు 3 వేల పైచిలుకే..! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా అక్రమ లే–అవుట్లు ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ లెక్క తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి అనధికార లే–అవుట్లు చేసిన రియల్టర్లపై పీడీ చట్టం మేరకు కేసులు నమోదు చేసే అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనుంది. ఈ అంశంపై పోలీసుశాఖతో కూడా చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రకటనలపై ఫేస్బుక్ నియంత్రణ
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ ఉపయోగిస్తున్నప్పుడు మీరెప్పుడైనా ఓ విషయాన్ని గమనించారా. ఫేస్బుక్లో వచ్చే ప్రకటనలు చూసి.. ఇది ఇప్పుడే ఎక్కడో చూశానే అని మీకెప్పుడూ డౌట్ రాలేదా?.. ఈ యాడ్‌లో వచ్చిన కంటెంట్‌ను ఎక్కడో బ్రౌజ్ చేశానే అని అనిపించలేదా.. కచ్చితంగా చాలామందికి అనిపించే ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లో మనం ఉపయోగించిన ఇతర యాప్‌లు, బ్రౌజర్లు, వెబ్సైట్లు, ఇతర డేటా ప్రకారమే ఫేస్బుక్లో మనకు ప్రకటనలు వస్తుంటాయి. దీనికి కారణం ఫేస్బుక్ మనం చేసే ప్రతీ కార్యకలాపం పైనా ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే తాజాగా దీనిపై ఫేస్బుక్ స్వీయ నియంత్రణ విధించుకోనుంది. ఇకపై మనం చూసిన వెబ్సైట్లు, బ్రౌజర్లలో యూజర్ కార్యకలాపాల ప్రకారం ఫేస్బుక్లో ఇచ్చే ప్రకటనలను తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. దీనికోసం ఫేస్బుక్ యాప్‌లో ఓ ఆప్షన్‌ను తీసుకురానుంది. యూజర్లు సంబంధిత సెక్షన్లోకి వెళ్లి ‘ఆఫ్–ఫేస్బుక్ యాక్టివిటీ’అనే ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాలి. అయితే దీంట్లో ఓ మెలిక ఉంది. ఆఫ్ చేసినప్పటికీ ఫేస్బుక్ మీ డేటాను ట్రాక్ చేయడం ఆపదు. కేవలం దానికి సంబంధించిన ప్రకటనలు మాత్రమే తక్కువ సంఖ్యలో వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను సౌత్ కొరియా, ఐర్లాండ్, స్పెయిన్‌ల్లో మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఆప్షన్‌ను ఇతర మార్కెట్లలోకి ఎప్పుడు ప్రవేశపెట్టేది స్పష్టతివ్వలేదు. -
నర్సింగ్ హోంలపై దాడులను అరికట్టాలి
నర్సంపేటరూరల్: ప్రైవేట్ నర్సింగ్‌హోంలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని వైద్యుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, వరంగల్ రోడ్డు కూడలి వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ప్రోటెక్షన్ డే సందర్భగా వైద్యులంతా నర్సింగ్ హోంలు బంద్ చేసి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇటీవల వరంగల్, కోల్‌కత్తాలో వైద్యులపై అన్యాయంగా దాడులు చేసి అక్రమ కేసులు బనాయించారన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా బావించాల్సిన ప్రజలు తమపైనే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. 12 సంవత్సరాలు కష్టపడి వైద్య కోర్సు చదివి వచ్చి ప్రజలకు వైద్యం చేస్తుంటే తమపై దాడులకు పాల్పడడం సరికాదని, ఇలా అయితే వైద్య వృత్తిని వైద్యులు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అనంతరం ఆర్డీఓ, నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌రెడ్డికి వేర్వేరుగా వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వై ద్యులు జయుడు, రాజేశ్వర్‌రావు, ఎడ్ల రమేష్, రామకృష్ణారెడ్డి, విరీన్, కిరణ్, కిషన్, సంపత్, మనోజ్‌లాల్, భారతి, నవత, సుజాతరాణి పాల్గొన్నారు. -
ఫేక్‌కాల్స్ నియంత్రణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా తాజాగా టెలికం విభాగంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేక్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, 30 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ తెలియజేసింది. గతేడాది బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 25 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నామని కంపెనీ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్ రాజేశ్ దుడ్డు గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు. టెలికంతో పాటు తయారీ, ఆర్ధిక, హైటెక్ రంగాల్లోనూ బ్లాక్ చెయిన్ సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌కు ఆడిట్ లావాదేవీల నిర్వహణకు -
థామస్ కుక్ చేతికి డిజిఫొటో
ముంబై: పర్యాటక సేవలందించే థామస్ కుక్ ఇండియా గ్రూప్...ఇమేజింగ్ సొల్యూషన్స్, సేవలందించే డిజిఫొటో ఎంటర్టైన్మెంట్ ఇమేజింగ్(డీఈఐ)లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.289 కోట్లని థామస్ కుక్ ఇండియా తెలిపింది. ఈ కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. డీఈఐలో వాటా కొనుగోలుతో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నామని థామస్ కుక్ ఇండియా సీఎమ్‌డీ మాధవన్ మీనన్ తెలిపారు. ప్రస్తుతం 25 దేశాల్లో నిర్వహిస్తున్న పర్యాటక సేవలకు అనుబంధంగా కొత్త అవకాశాలను ఈ కొనుగోలు అందించగలదని పేర్కొన్నారు. సింగపూర్, యూఏఈ, హాంగ్‌కాంగ్, మకావూ, చైనా, అమెరికా తదితర 14 దేశాల్లో 250 నగరాల్లో 120 మంది భాగస్వాములతో డీఈఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, గత ఏడాదిలో 36 లక్షల లావాదేవీలను నిర్వహించిందని పేర్కొన్నారు. థామస్ కుక్‌తో అనుబంధం కారణంగా తమ స్థానం మరింత పటిష్టమవుతుందని డీఈఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కె. రామకృష్టన్ తెలిపారు. -
అవాంఛిత కాల్స్ నియంత్రణకు వ్యవస్థ
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా వ్యాపారపరమైన అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ మొదలైన వాటిని నియంత్రించేందుకు చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ–కామర్స్ విధానంపై రూపొందించిన 41 పేజీల ముసాయిదాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాధిత ఆన్లైన్ వినియోగదారుల ఫిర్యాదులను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే పరిష్కరించి, పరిహారం చెల్లించే అంశం కూడా ఇందులో ఉంది. ఇందుకోసం ఈ–కన్జూమర్ కోర్టులను ఏర్పాటు చేసే ప్రతిపాదన సైతం ఈ ముసాయిదాలో పొందుపర్చారు. ఇక ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లో కార్యకలాపాలు నిర్వహించే వెబ్సైట్లు, యాప్స్ అన్నీ తప్పనిసరిగా దేశీయంగా వ్యాపార సంస్థగా రిజిస్టర్ అయి ఉండాలి. కొరియర్స్ ద్వారా భారత్‌కు వస్తువులను పంపే క్రమంలో కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించే చైనా వెబ్సైట్లకు కళ్లెం వేసే క్రమంలో తాత్కాలికంగా అటువంటి పార్సిల్స్‌పై నిషేధం విధించాలని ముసాయిదా ప్రతిపాదించింది. అయితే, ప్రాణావసర ఔషధాలకు మాత్రం మినహాయింపునివ్వచ్చని పేర్కొంది. -
తెలుగులో గూగుల్ ‘సేఫ్టీ సెంటర్’ సేవలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారంపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘సేఫ్టీ సెంటర్’ పరిధిని విస్తరిస్తూ తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠి, ఉర్దూ భాషల్లో సేవలందించనుంది. తమ సమాచారాన్ని గూగుల్ ఎలా వాడుకోవచ్చో వినియోగదారులు ప్రాథమ్యాల ప్రాతిపదికగా అనుమతిచ్చే వేదికగా సేఫ్టీసెంటర్ పనిచేస్తుంది. ‘గూగుల్ పౌరుల డేటాను అమ్ముకుంటోందన్న వాదనలు తప్పని సేఫ్టీ సెంటర్ల ద్వారా నిరూపించాం. గూగుల్ ఎందుకు, ఎలాంటి డేటాను సేకరిస్తోంది? డేటాను ఎలా వినియోగిస్తోంది? లాంటి విషయాల్ని వివరించాం. యూజర్ పేరు, పుట్టిన తేదీ, లొకేషన్, బ్రౌజింగ్ చరిత్ర తదితరాలను గూగుల్‌తో పంచుకోవడం ఇష్టం లేకపోతే అలాంటి సమాచారాన్ని డిలీట్ చేసుకోవచ్చు’ అని సంస్థ తెలిపింది. -
నేరాలకు ‘కంట్రోల్’ ఏదీ..!
కడప అర్బన్ : జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సక్సెస్‌గా నడిపించేందుకు ‘పోలీస్ బాస్’ తమ వంతుగా కృషి చేస్తున్నారు. కడప నగరంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ను గత ఏడాదిలో ప్రారంభిం చారు. తాజాగా ప్రొద్దుటూరు పట్టణంలోను కమాండ్ అండ్ కంట్రోల్ సెంట ర్ను రెండవ కేంద్రంగా ప్రారంభించారు. - కడప నగరంలో ప్రారంభించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా సత్ఫలితాలనిస్తోంది. - వేలాదిమంది ప్రజలు పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారని, నేరాలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. - నేరాల నియంత్రణ బాగున్నా క్షేత్ర స్థాయిలో కొందరు పోలీసుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. - ఇటీవల కాలంలో కొందరు తమ ద్విచక్రవాహనాలను పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భాల్లో ఫిర్యాదు ఎక్కడ చేశారని ఎదురు ప్రశ్నించడం, తాము ఫిర్యాదు చేసిన సందర్భాలలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇవ్వాలనీ కోరితే... దొరికినప్పుడు ఎలాగు రికవరి చేస్తామని మాట దాటేయడం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. - కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో గత నెలలో పట్టపగలు గంగాదేవి అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు చైన్‌ను, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంలో వేగంగా వచ్చి లాక్కెళ్లారు. - ఇటీవల నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘చెడ్డీగ్యాంగ్’ చోరీకి యత్నిం చింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీ లకు పాల్పడే లోపే వారిని నిరోధించాల్సిన పోలీసులు ఆ గ్యాంగ్ జాడ ఇక్కడలేదని సరిపెట్టుకుంటున్నట్లు సమాచారం. - పెద్ద దర్గా ఉరుసు సందర్భంగా పాత నేరస్తురాలు ‘షబానా ఆజ్మి’ ఓ మహిళ నుంచి పర్సును దొంగలించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఆమె అంతకు ముందు కొన్ని నెలల క్రితమే పలు నేరాలకు పాల్పడి కటకటాల పాలైంది. ఆమె విడుదలయ్యాక ‘పరివర్తన’ లాంటి కార్యక్రమం ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించి పునరావాసం కల్పిస్తే ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. కొందరు పోలీసుల అత్యుత్సాహం - కడప నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నుంచి ఉత్సాహవంతులైన పోలీసు సిబ్బంది, అధికారులను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధుల కోసం తీసుకున్నారు. - సంక్రాంతి పండుగ సమయంలో పక్కీర్‌పల్లె చెరువు వద్ద గోళీలాట ఆడుకుంటున్న సమయంలో యువకుల గుంపుపై బ్లూకోల్ట్స్ వారు దాడికి ఉపక్రమించారు. ఆ సమయంలో వీరయ్య అలియాస్ వీరు మృతిచెందాడు. ఆ సమయంలో పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా తెలిసినప్పటికీ తన భర్త ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపడ్డాడని మృతుని భార్య వద్ద నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. - రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు, కారు లాంటి వాహనదారులపై అనుమానం పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారుల్లో కొందరు కడప నగరంలోని స్థానిక పోలీసు అధికారుల ప్రమేయం కోసం ఎదురు చూడకుండా తమకు సమాచారం వచ్చిన వెంటనే తమంతట తాముగా నేర నియంత్రణకు ప్రయత్నిస్తూ ‘తప్పు’లో కాలేస్తున్నట్లు తెలుస్తోంది. - కడప నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘వ్యభి చార గృహం’పై దాడి చేసిన ఓ ఎస్ఐ వారిలో ‘యువతి’ ని హోంకు పంపి, మరో ఇద్దరి విషయంలో చేతి వాటం ప్రదర్శించి వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. - ఏది ఏమైనా నేరాల నియంత్రణ విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగం విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. -
ఫ్లో కంట్రోల్
నిజామాబాద్‌అర్బన్: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీటిని అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఎత్తు, పల్లాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఒకే విధంగా నీరు సరఫరా అందించేలా చూస్తోంది. ఇందుకోసం నూతన పద్ధతిని అమలులోకి తీసుకొస్తోంది. ఇంటింటికి నల్లా ద్వారా నీరు అందించే క్రమంలో నీటి సరఫరాలో లోపాలు ఏర్పడకుండా, ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరందేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. మిషన్ భగీరథ పైప్లైన్లకు ‘ఫ్లో కంట్రోల్ వాల్వ్’ అమర్చడం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని సరఫరా చేయనుంది. జిల్లావ్యాప్తంగా ఇది వరకే కొన్నిచోట్ల పైప్లైన్లు వేయగా, అవసరమున్న చోట ఆ పైప్లైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌లు అమర్చుతున్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి ద్వారా ఎత్తైన ప్రాంతాలు, తండాలు, మారుమూల గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగనున్నాయి. ఫ్లో కంట్రోల్ వాల్వ్ అంటే.. జిల్లాలో మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు ఇంటింటికి నల్లా కనెక్షన్ల పనులు కూడా కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2165.45 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరగాల్సి ఉండగా, ఇప్పటికే 670.45 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణానికిగాను పైపులు సరఫరా అయ్యాయి. కాగా ఇందులో 552.33 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం పూర్తయింది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2,86,494 లక్షల నల్లా కనెక్షన్లు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 37,834 నల్లా కనెక్షన్లు అందించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందించేందుకుగాను పైపులైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌ను అమరుస్తున్నారు. ఈ వాల్వ్‌లను పైప్‌లైన్‌లో అవసరమున్న చోట ఏర్పాటు చేయడం ద్వారా నీరు ఒకే ప్రాంతానికి వేగంగా వెళ్లకుండా, అన్ని ప్రాంతాలకు నీటిని సమానంగా అందే వీలుంటుంది. బంతి మాదిరిగా ఉండే వాల్వ్‌ను పైపులైన్లో ఏర్పాటు చేస్తారు. ఈ వాల్వ్‌కు ఉండే రంధ్రాలు నీటి ఉధృతిని నియంత్రించి, ఒకే ప్రాంతానికి వెళ్లకుండా నీటి సరఫరాను సమన్వయం చేస్తుంది. ఎత్తు నుంచి పల్లానికి నీరు వేగంగా ప్రవహిస్తుంది.. కాబట్టి పైప్లైన్లకు ఈ వాల్వ్‌లను అమర్చుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎత్తుపల్లాలు ఉన్నచోట ఈ విధానం అమలు చేస్తే అందరికి సమానంగా నీరు అందుతుంది. వాల్వ్ ఏర్పాటుకు ప్రాంతాల గుర్తింపు.. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఎత్తుపల్లాలను గుర్తించి పైప్లైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకే కొన్ని చోట్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాగా, ఈ వాల్వ్‌లు ఏర్పాటు చేసేందుకు మళ్లీ తవ్వి పూడ్చివేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇదివరకే వాల్వ్‌ల ఏర్పాటు కూడా జరిగింది. గతంలో మున్సిపాలిటీల్లో నీటి నియంత్రణకు పైపులకు స్ప్రింగ్‌ల మాదిరి ఉండే పరికరాలను ఏర్పాటు చేసి నీటిని కంట్రోల్ చేసేవారు. అయితే కొన్నిరోజులకు స్ప్రింగ్‌లు సాగకపోవడంతో ఈ పద్ధతి విఫలమైంది. ఈ స్థానంలో ప్రస్తుతం ఫ్లో కంట్రోల్ వాల్వ్ విధానంను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని తండాలు, గ్రామ పంచాయతీలు, ఎత్తు ప్రాంతంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో శివారు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను ఇదివరకే గుర్తించారు. మిషన్ భగీరథలో నూతన వాల్వ్ విధానం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
బ్యాక్టీరియా... మన జన్యువులను నియంత్రిస్తాయా?
వినడానికే ఆశ్చర్యంగా అనిపించే విషయమిది. శరీరంలో.. ముఖ్యంగా కడుపు, పేవుల్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా మన జన్యువులను నియంత్రించడం ద్వారా మన ఆరోగ్యానికి కారణమవుతున్నాయని మూడు దేశాల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా చేసిన పరిశోధన ద్వారా తెలిసింది. నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి. మనం పండ్లు, కాయగూరలు తిన్నప్పుడు.. వాటిని బ్యాక్టీరియా జీర్ణం చేసుకుంటాయి. ఈ క్రమంలో అవి కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి బ్యాక్టీరియా నుంచి బయటపడి మన కణాల్లోకి ప్రవేశించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇలా అవి మన కణాల్లోకి చేరినప్పుడు అక్కడ ఉండే జన్యువుల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయన్నమాట. బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనాలు షార్ట్ చెయిన్ ఫ్యాటీయాసిడ్ల రూపంలో ఉంటాయని, హెచ్‌డీఏసీ అనే ప్రొటీన్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా ఇవి జన్యువుల్లో రసాయన మార్పులకు కారణమవుతున్నాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ ప్యాట్రిక్ వర్గా వెయిజ్ అంటున్నారు. కడుపు, పేవుల్లోని బ్యాక్టీరియా తొలగించిన ఎలుకల్లో హెచ్‌డీఏసీ ప్రొటీన్ ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి పేవుల్లో కేన్సర్‌కు ఒక కారణమని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేశాయని ప్యాట్రిక్ తెలిపారు. కేన్సర్ నివారణతోపాటు మంచి ఆరోగ్యానికి శరీరంలోని కొన్ని బ్యాక్టీరియా కీలకమని తమ పరిశోధన చెబుతోందని ఆయన వివరించారు. -
ప్రమాదకరంగా సోషల్ మీడియా
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) తీరుతెన్నులపై పెద్దల సభ అయిన శాసన మండలి ఆందోళన వ్యక్తం చేసింది. అడ్డూ అదుపూ లేకుండా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతోందని, దీన్ని నియంత్రించేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చట్టాలు తేవాలని అభిప్రాయపడింది. గురువారం మండలిలో సభ్యులు ఫారూక్ హుస్సేన్, నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ సోషల్ మీడియా పట్ల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా సమాచారం పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడిన వాటిని కూడా వక్రీకరించి ప్రజల్లోకి పంపుతున్నారని అన్నారు. గూగుల్, వాట్సాప్‌లాంటి సామాజిక మాధ్యమాలు విదేశీ కంపెనీలకు చెందినవని, ఆ దేశాల్లోని చట్టాలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేశారని, మన దేశ చట్టాలకు అనుగుణంగా ఆ కంపెనీలు వ్యవహరించేలా నియంత్రణ చట్టం తెచ్చినప్పుడే కొంతమేర అరికట్ట వచ్చని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల తరహాలోనే ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యుల ఆందోళనకు స్పందించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ అధ్యక్షతన జాతీయ రహదారుల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు ఐటీకోర్‌పై అవగాహన, శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే ప్రత్యేక సర్వే బృందాలతో అధ్యయనం చేసినట్టు తెలిపారు. రాష్ట్ర డీజీపీ నండూరు సాంబశివరావు ఉత్తర్వుల మేరకు ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామన్నారు. డీజీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9,10వ తేదీల్లో విశాఖపట్టణంలో వర్క్‌షాపు నిర్వహించి, రోడ్డు సేఫ్టీ యాప్‌ను ఆవిష్కరించారని చెప్పారు. ఎక్కడ అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయో ఈ యాప్ వల్ల తెలుస్తుందని, తద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ–2 సుంకర మురళీమోహన్ నోడల్ అధికారిగా నియమితులైనట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ కోర్‌పై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దామోదర్, ట్రాఫిక్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, ఎస్బీ డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, డీసీఆర్బీ సీఐ కృష్ణారావు, సీఐ సుధాకర్, ఎన్‌హెచ్–16 పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గూఢచర్యం
కాకినాడ సిటీ: జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించి పిండలింగ నిర్ధారణ వెల్లడిచేసిన సెంటర్లపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై కలెక్టరేట్ కోర్టుహాలులో శుక్రవారం రాత్రి జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఆరు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు, 19 సెంటర్లకు లైసెన్స్ రెన్యూవల్, 10 సెంటర్లకు అడ్రసు మార్పు అనుమతులు రాటిఫికేషన్లు జారీ చేశారు. జిల్లాలో రిజిస్టర్ అయిన 328 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య నిఘా ఉంచి డెకోయ్, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ చేసే ముందు గర్భిణి అనుమతి సంతకాన్ని తప్పనిసరిగా సేకరించాలన్నారు. ఈ అనుమతి పత్రాలు కేంద్రం రిజిష్ట్రేషన్ లైసెన్స్, స్కానర్ వివరాలు, పరీక్షలు నిర్వహించే వైద్యులు, నిపుణుల వివరాలు విధిగా ఆన్లైన్లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్డీఓలు, ప్రోగ్రామ్ అధికారులు తమ పరిధిలో అల్ట్రాసౌండ్ స్కానర్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. 6వ అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీనివాసాచారి, ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య, ఆర్డీఓలు రఘుబాబు, విశ్వేశ్వరరావు, గణేష్‌కుమార్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాళిక జిల్లాలో ఆరు నెలల నుంచి 15 నెలలలోపు పిల్లలందరికీ మీజెల్స్, రూబెల్లా వైరస్ల నివారణ వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాలిక చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఐసీడీఎస్, విద్యా, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆగష్టు నెలలో పిల్లలందరికీ నూరుశాతం వ్యాక్సిన్ పంపిణీకి ప్రత్యేక ఎంఆర్ కాంపెయిన్ నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. సబ్కా సాత్–సబ్కా వికాస్‌కు సమగ్ర ఏర్పాట్లు: ఈనెల13న కాకినాడలో నిర్వహించే సబ్కా సాత్–సబ్కా వికాస్‌కు సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి స్ధానిక రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమాలపై ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
జీవితాన్ని చక్కదిద్దుకోగలరా?
సెల్ఫ్ చెక్ జీవితం చాలా చిన్నది, విలువైనది. దానిని చక్కదిద్దుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం మన చేతుల్లో ఉన్నట్లే, నిస్సారంగా, దుఃఖమయం చేసుకోవటం కూడ మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మొత్తం పరిస్థితులకు కారణం ఎమోషన్స్... వీటిని నియంత్రించుకోగలిగితే జీవితం చింతలేకుండా ఉంటుంది. అంటే మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చు. అంతేకాని మనకు జరిగిన వాటికి ఇతరులను నిందించటమో, వారిపై ఆధారపడాలనుకోవటమో చేయకూడదు. ఇలా ఉండటం తెలియకనే చాలామంది నిస్పృహకు లోనవుతారు. జీవితంపై మీకు ఎంత కంట్రోల్ ఉందో తెలుసుకోవటానికి ఈ క్విజ్‌ను పూర్తిచేయండి. 1. జీవితంలో కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బందిపెట్టినా, వాటిని తట్టుకొని నిలబడతారు. ఎ. కాదు బి. అవును 2. మీరు భరించలేని విషయాలు మీ చుట్టూ జరుగుతుంటే... మీ ఫీలింగ్స్‌ను నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. కాదు బి. అవును 3. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఇతరులపై ఆధారపడరు. మీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఎ. కాదు బి. అవును 4. ఇతరులతో మీకు వచ్చే వివాదాలకు ‘‘కారణం ఎవరు? ఈ విధంగా ఎందుకు జరిగింది?’’ ఇలా అయా పరిస్థితులను అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. ఎ. కాదు బి. అవును 5. ఇతరులు మీకిచ్చే సలహాలను రిసీవ్ చేసుకుంటారు. వారితో వాదించరు. ఎ. కాదు బి. అవును 6. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండకపోవటానికి కారణం మనమే. ఎ. కాదు బి. అవును 7. జీవితాన్ని చక్కదిద్దుకోవటం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎ. కాదు బి. అవును 8. మిమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిస్థితులకు దూరంగా ఉంటారు. ఎ. కాదు బి. అవును 9. శ్రద్ధ పెడితే కన్నకలలను సాధించుకోవటం కష్టమేమీకాదు. ఎ. కాదు బి. అవును 10. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే దానికి వారు సృష్టించుకున్న పరిస్థితులే కారణం. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఏడు దాటితే జీవితంలో ఎలా ఆనందంగా ఉండాలో, దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మీకు తెలుసు, మీ ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలరు.‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కవగా వస్తే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవటం మీకు అంతగా తెలియదు. దీనివల్ల ఎన్నో సమస్యలు మీ చుట్టుముడతాయి... సెల్ఫ్కంట్రోల్ సాధించడానికి కృషి చేయండి. -
పోలీసుల అదుపులో అంతర్ రాష్ట్రదొంగల ముఠా?
కోదాడ: కోదాడ పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కోదాడ పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వీరు కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో షల్టర్ తీసుకున్నట్లు సమాచారం అందడంతో పట్టణ పోలీసులు అత్యంత రహస్యంగా అక్కడి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం.ముఠా సభ్యులను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో వీరి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. -
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
- కలెక్టర్ అరుణ్‌కుమార్ పిలుపు - కాకినాడలో టీబీ నిర్మూలన దినోత్సవ ర్యాలీ కాకినాడ వైద్యం : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి(జీజీహెచ్)లో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏటా ఒక కొత్త రోగి నుంచి క్షయ వ్యాధి 15 మందికి సోకుతోందని, దీనినిబట్టి దీని ప్రభావం సమాజంపై ఏమేరకు పడుతోందో గుర్తించాలని అన్నారు. క్షయ నివారణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి, ఉచితంగా మందులు అందిస్తోందన్నారు. ఈ కారణంగా వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో రోగ నిర్ధారణకు చాలా రోజులు పట్టేదని, ప్రస్తుతం అత్యాధునిక విధానాలతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే కళ్లె పరీక్షతో క్షయ వ్యాధిని గుర్తిస్తున్నారని చెప్పారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా డాట్ చికిత్స పొంది ఆరోగ్యంగా జీవించాలని కోరారు. రోగులు సక్రమంగా మందులు వేసుకోకపోతే వ్యాధి తీవ్రత మరింత పెరిగిపోయే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రోగి ఇంటికే డాట్ ప్రొవైడర్లు వెళ్లి చికిత్స అందించే ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని వివరించారు. ఏజెన్సీలో క్షయ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అక్కడ ప్రత్యేక అవగాహన సమావేశాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 2,656 మందికి డాట్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో 261 మందికి ఈ చికిత్స అందిస్తున్నామన్నారు. వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, పారా మెడికల్, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వాస్పత్రి నుంచి బాలాజీచెరువు సెంటర్ వరకూ సాగింది. అక్కడ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ-2 రాధాకృష్ణమూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, జెబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ కాకినాడ వైద్యం : జిల్లాను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాకినాడ జీజీహెచ్ క్షయ నివారణాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 6,716 మంది టీబీ కేసులు నమోదు కాగా, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ (డాట్) చికిత్స ద్వారా 6,157 మందికి వ్యాధిని నయం చేశామన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాట్ప్లస్ సెంటర్ ద్వారా మొండి క్షయ రోగులకు రెండు లక్షలు విలువైన మందులను పీహెచ్‌సీల ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. దీని నివారణ కోసం డీఆర్‌టీబీ చికిత్స రెండేళ్లపాటు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. టీబీ వ్యాధిని కల్లి పరీక్ష ద్వారా నిర్ధారిస్తామన్నారు. జిల్లాలో కల్లి పరీక్షను చేసేందుకు 63 మైక్రోస్కోపి సెంటర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. రోగ నియంత్రణకు 23 ట్రీట్మెంట్ యూనిట్స్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రసుత్తం 2,656 మందికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.ఇందులో 73 మొండి క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. హెచ్ఐవీ సోకిన రోగుల్లో టీబీని నిర్ధారించడానికి జిల్లాలో కాకినాడలో ఒకటి, రాజమహేంద్రవరంలో రెండు సిబీనాట్ సెంటర్లు ఉన్నట్టు తెలిపారు. ఒక్కో మెషీన్ ఖరీదు సుమారు రూ.20 లక్షలు దాకా ఉందన్నారు. వీటిని 2015 నుంచి అందుబాటులోకి తీసుకురాగా ఫిబ్రవరి నెలాఖరుదాకా 9,680 మందికి పరీక్షలు నిర్వహించామని, 432 క్షయ కేసులు, 34 మొండి కేసులు గుర్తించామన్నారు. నేడు ర్యాలీ మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నుంచి బాలాజీచెరువు దాకా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ప్రారంభిస్తారన్నారు. ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. 23కెకెడీ165: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ -
సైబర్ నేరాల అదుపునకు ప్రత్యేక బృందాలు
ఎస్పీ రవి ప్రకాష్ ఐ.పోలవరం : జిల్లాలో సైబర్ నేరాల అదుపునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ అన్నారు. పాత యింజరంలో ఉన్న మండల పోలీస్ స్టేషన్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువత సైబర్ నేరాలకు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని దీనిని ఆదిలోనే నియంత్రించేలా తగు చర్యలు తీసుకొంటున్నామన్నారు. అలాగే అమలాపురం సూదాపాలెంలో దళితులపై జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చూస్తామన్నారు. జిల్లాలో ఈ ఏడాది క్రైం రేటు 20 శాతం తగ్గిందన్నారు. హైవే దాబాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పక్కనే ఉన్న యానం నుంచి అధిక సంఖ్యలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు తెలిసిందని, వీటి అదుపుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పోలీసులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని అన్న విలేకరుల ప్రశ్నకు చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే జిల్లాలో ఒక సీఐని వీఆర్‌లో ఉంచామని అలాగే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఎస్ఐని సస్పెండ్ చేశామన్నారు. తుని జాతీయ రహదారిపై చేసిన నిఘాలో లారీల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు ధరించాలని, దీనిపై మత్యకార గ్రామాల్లో అవగాహన ఏర్పాటు చేయాలని డీఎస్పీ అంకయ్యకు సూచించారు. అలాగే జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఐ కేటీవీటీ రమణరావు, ఎస్ఐ టి.క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. -
డెంగీ నివారణకు చర్య తీసుకోవాలి
నకిరేకల్: డెంగీ వ్యాధి నివారణకు చర్య తీసుకోవాలని కోరాతూ ప్రజాపోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ పరీక్షలు చేసే సెల్ కౌంటర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇటీవల కాలంలో నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో డెంగీ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఆస్పత్రిలో జ్వర పీడిత రోగులను పరామర్శించారు.రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతూ ప్రధాన వైద్యాధికారి ఎండి.రఫీ, క్లస్టర్ ఇన్చార్జి వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ సమితి నాయకులు గోపిరెడ్డి శ్యామ్ సుందర్‌రెడ్డి, రుద్రవరం నర్సింహ్మ, కొండ గూడురు సత్యనారాయణచారి, కుమార్, మహేశ్వరం సుధాకర్,మేకల సైదులు, కురుమిల్ల పర్శరామ్, పట్టేటి ప్రసాద్, పర్నాటి సీతారామిరెడ్డి, రమేష్ ఉన్నారు. -
నేరాల నియంత్రణకు ప్రణాళిక
– సబ్ డివిజన్ అధికారులకు ఎస్పీ ఆదేశం కర్నూలు: డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాలను తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సబ్ డివిజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీఎస్పీలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ల వద్ద బయట రోడ్డు కనిపించేలా సీసీ టీవీలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని వల్ల విద్యార్థినీ, విద్యార్థులు ఏ నెంబర్ ఆటోల్లో, వాహనాల్లో వస్తున్నారో, వెళ్తున్నారో తెలుసుకోవచ్చునన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు తక్షణమే గుర్తించడానికి సీసీ టీవీల ఫుటేజి ఉపయోగపడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు జిల్లాలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సబ్ డివిజన్ల పరిధిలో బడేఖానాలు ఏర్పాటు చేసి కిందిస్థాయి సిబ్బంది సమస్యలను తెలుసుకుని వారి బాగోగులు చూడాలన్నారు. బాగా పనిచేసేవారిని గుర్తించి ప్రోత్సహించాలని ఆదేశించారు. సబ్ డివిజన్లకు తాను స్వయంగా వచ్చి అందరి కుటుంబాలతో కలసి మాట్లాడేలా బడేఖానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాలు, గణేష్ నిమజ్జనం, బక్రీదు వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. బదిలీ అయిన ఎస్ఐలను తక్షణమే రిలీవ్ చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్‌తో పాటు డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, ఏజీ కృష్ణమూర్తి, హుసేన్ పీరా, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, ఈశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డి, బాబా ఫకద్దీన్, కొల్లి శ్రీనివాసరావు, వెంకటాద్రి, సుప్రజ, సీఐలు పార్థసారధి, శ్రీనివాసులు, ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలి
కోదాడ: పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇబ్బందిగా ఉన్నాS తప్పదని కోదాడ పట్టణ సీఐ రజితారెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని కోదాడ టాలెంట్ స్కూల్లో ట్రాఫిక్ నియంత్రణపై జరిగిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైందని దీనిని క్రమపద్దతిలో పెట్టడానికి పట్టణ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ఉన్న ఆక్రమణలు తొలగించడానికి మున్సిపాల్టీ సిద్ధంగా ఉందని మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి తెలిపారు. డబ్బాకొట్లను, వాటి ముందు ఉన్న ఆక్రమణలు కూడా తొలగించడానికి తగు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ వంటిపులి అనిత తెలిపారు. అనంతగిరి రోడ్డును వన్‌వేగా మార్చాలని పలువురు కోరారు. ఈ రోడ్డులో వెహికిల్ పార్కింగ్ చెయకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, అవగాహన కల్పించడానికి బాణాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో 13 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు రాజకీయ నాయకులతో పాటు విద్యుత్, మున్సిపల్ శాఖ అధికారులతో అటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక భద్రతా వ్యవస్థతో సైబర్ నేరాల అదుపు
తిరుపతి మంగళం : సాంకేతిక భద్రతా వ్యవస్థతోనే సైబర్ నేరాల అదుపు సాధ్యమని మాజీ డీజీపీ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో సోమవారం సైబర్ నేరాలు – భద్రత అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్వీయూ వీసీ దామోదరం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేసీ రెడ్డి ‘ప్రపంచీకరణలో సైబర్ సెక్యూరిటీ అవశ్యకత – ఉపాధి అవకాశాలు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. సాంకేతికత పెరిగే కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోందన్నారు. నేరాలను అదుపు చేయడం ఒక్క సెక్యూరిటీ వ్యవస్థతోనే సాధ్యపడుతుందని తెలిపారు. ఉపాధి అవకాశాలున్న సైబర్ సెక్యూరిటీ కోర్సులను ఎంచుకుని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. ఎస్వీయూ వీసీ మాట్లాడుతూ ఏ ఇతర యూనివర్సిటీల్లో లేనివిధంగా సైబర్ సెక్యూరిటీ కోర్సును ఎస్వీయూలో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ భాస్కర్, సీఆర్‌రావు ఇన్స్టిట్యూట్ (హైదరాబాద్) ప్రతినిధి అరుణ్‌కుమార్, ఈఎస్ఎఫ్ ల్యాబ్ ఎండీ అనిల్, రాజగోపాలన్, ప్రొఫెసర్ సుదర్శనం, ఫ్రొఫెసర్ రామ్మోహన్‌రెడ్డిlపాల్గొన్నారు. -
‘పోడు’పై అటవీశాఖ అత్యుత్సాహం ప్రదర్శించొద్దు
ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ గార్ల: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనుల పోడు భూములపై అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం మానుకోవాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ హెచ్చరించారు. ఆదివారం గార్లలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010 కంటే ముందు నుంచి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్లవద్దని అన్నారు. ఇటీవల కాలంలో పోడు భూములను ఆక్రమించుకుంటే ఆ భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవచ్చన్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటే∙వరకు అటవీ అధికారులు ఏం చేశారని, ఇప్పుడు నాటిన మొక్కలను ధ్వంసం చేయడం సమంజసం కాదన్నారు. మహబూబాబాద్ జిల్లాను గిరిజన జిల్లాగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి బీబీనగర్, వలిగొండ, తిరుమలగిరి మీదుగా తొర్రూరు మహబూబాబాద్, బయ్యారం, ఇల్లెందు, కొత్తగూడెం వరకు 225 కిలోమీటర్లు జాతీయ రహదారిగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలోని 5400 తండాల్లో 500 జనాభా కలిగిన1753 తండాలను రానున్న ఎన్నికల నాటికి గ్రామ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మంది బంజారాలు ఉన్నారని, 342 ఆర్టికల్ ప్రకారం సీరియల్ నంబర్ 29తో గిరిజనులు తమ పిల్లలకు లంబాడీస్తో కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ మాళోత్ వెంకట్‌లాల్, సర్పంచ్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్, భూక్యా నాగేశ్వరరావు, ఎస్సై బి రాజు, జర్పుల భీముడునాయక్, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, హెచ్ఎం బి దేవసింగ్, వార్డెన్ ధనలక్ష్మి పాల్గొన్నారు. -
ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు చర్యలు
వైద్యులు, సూపర్వైజర్ల నియామకం డీఎంఅండ్ హెచ్‌వో చంద్రయ్య చింతూరు: ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు డీఎం అండ్ హెచ్‌వో కె.చంద్రయ్య తెలిపా రు. గురువారం ఆయన చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇటీవలే 10 మంది వైద్యులను నియమించినట్లు తెలిపారు. విలీన మండలాల్లోని తొమ్మిది పీహెచ్‌సీలకూ ఇద్దరు చొప్పున సూపర్వైజర్లను మైదాన ప్రాం తం నుంచి డిప్యుటేషన్‌పై నియమించామన్నారు. వారు క్షేత్రస్థాయిలో మలేరియా కేసులను స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పా రు. వీరికితోడు దోమల నివారణ, యాంటీ లార్వా చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సబ్యూనిట్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చూస్తున్నామని, ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇటీవల హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయన్నారు. విద్యార్థులకు జ్వరం వస్తే ఇళ్ళకు పంపివేయకుండా ఆసుపత్రులకు పంపి పరీక్షలు నిర్వహించాలని హాస్టళ్ల సిబ్బందికి సూచించారు. హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను వార్డెన్, ఏఎన్ఎంలకు అప్పగించినట్లు తెలిపారు. జ్వరాల నియంత్రణకు ఏజెన్సీలో 104 వెళ్లలేని గ్రామాల్లో 650 వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, లక్ష్మీపురం పీహెచ్‌సీల సిబ్బందితో సమావేశం నిర్వహించి మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అడిషనల్ డీఅండ్‌హెచ్‌వో పవన్‌కుమార్, డీఎంవో ప్రసాద్, ఎస్పీహెచ్వో సుబ్బమ్మ పాల్గొన్నారు. -
మలేరియా జ్వరాల నివారణకు చర్యలు
మలేరియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి సైదాపురం: జిల్లాలో ప్రబలిన మలేరియా జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా మలేరియా నివారణాధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సైదాపురం ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మండలంలోని పోతేగుంట గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సైదాపురం, డక్కిలి, రాపూరు, ఉదయగిరి ప్రాంతాల్లో మలేరియా బాధితుల సంఖ్య పెరిగిందన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది జ్వరాలు విపరీతంగా ప్రబలాయన్నారు. మలేరియా జ్వరాల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో మలేరియా నివారణకు సంబంధించి మందులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పు కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పారిశుద్ధ్యం చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వస్తున్న మలేరియా జ్వరాలతో పెద్ద ప్రమాదం లేదన్నారు. సరైన సమయంలో వైద్య పరీక్షలను చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి పాల్ జాన్స్‌న్, సబ్యూనిట్ అధికారి మురళి ఉన్నారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
కోదాడఅర్బన్: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న దోపిడిని అరికట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వామపక్ష విద్యార్ధి సంఘాలైన ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా కార్పొరేట్ విద్యాసంస్థలను బహిష్కరించాలని కోరుతూ ఈనెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. బుధవారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో వారు దీక్ష పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఫీజుల నియంత్రణకై రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 42ను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రా కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చేపూరి కొండలు, పి.శ్రీనివాస్, ఎస్.బిక్షం, నరేష్, చందర్రావు, రాజు, వీరనాయక్, శ్రీకాంత్, శ్రీనునాయక్, వీరబాబు, నవీన్, సాయి, పవన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
బర్త్ కంట్రోల్ పిల్ కు బదులుగా ఫెట్రిలిటీ యాప్...!
లండన్ః గర్భనిరోధక మాత్రలకు బదులుగా వినియోగించే ఓ కొత్త యాప్ ను వైద్య పరిశోధకులు అందుబాటులోకి తెచ్చారు. నేచురల్ సైకిల్స్ పేరున అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త యాండ్రాయిడ్ యాప్ ఆధారంగా సంతానోత్సత్తి సమయాన్ని తెలుసుకొని, ముందు జాగ్రత్తలతో అవాంఛిత గర్భానికి దూరం కావొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మహిళల్లో సంతానోత్సత్తి సమయాన్ని గుర్తించేందుకు పరిశోధకులు కొత్త యాప్ ను సృష్టించారు. బర్త్ కంట్రోల్ పిల్ ను వాడేందుకు బదులుగా ఈ అనువర్తనం ద్వారా మహిళల శరీరంలోని ఉష్ణోగ్రతనుబట్టి అండోత్పత్తి సమయాన్ని గుర్తించే అవకాశం ఉంటుందని వైద్య పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. నేచురల్ సైకిల్స్ యాప్ ను సృష్టించి రసాయనాలకు దూరంగా సహజ గర్భనిరోధావకాశాన్ని కల్పించే పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ కొత్త అనువర్తనం వినియోగించి ఇకపై మహిళల్లో ఇతర సమస్యలను తెచ్చిపెట్టే పిల్స్ కు దూరం కావొచ్చునని చెప్తున్నారు. 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలపై పరిశోధకులు స్వీడన్ లో ఓ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. పెర్ట్ ఇండెక్స్ పద్ధతిలో యాప్ ను పరీక్షించిన పరిశోధకులు గర్భనిరోధక మాత్రలను పోలిన ఫలితాలే ఉండటాన్ని గుర్తించారు. గర్భనిరోధక మాత్రలు క్రమ పద్ధతిలో వాడిన వెయ్యిమంది మహిళల్లో సంవత్సరంలో 0.3 శాతం అనుకోకుండా గర్భం దాల్చే అవకాశం కనిపిస్తే... నేచురల్ సైకిల్ సిస్టమ్ ద్వారా కూడా 0.5 శాతం మాత్రమే ప్రమాదం ఉన్నట్లు కనుగొన్న పరిశోధకులు తమ అధ్యయనాలను యూరోపియన్ జర్నల్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అండ్ రీ ప్రొడక్టివ్ హెల్త్ కేర్ లో ప్రచురించారు. ఆరోగ్యంకోసం అనేక రకాలుగా ఇటీవల మొబైల్ టెక్నాలజీని వాడుతున్నారని యాప్ సృష్టికర్త ఎలీనా బెర్గ్లండ్ చెప్తున్నారు. కెమికల్స్ కు బదులుగా నేటి మహిళలు నేచురల్ సైకిల్స్ యాప్ ను వినియోగించి అవాంఛిత గర్భానికి దూరంకావచ్చంటున్నారు. అంతేకాక గర్భ నిరోధక మాత్రలవల్ల శరీరంలో వచ్చే అనేక రకాలైన హార్మోన్ సమస్యలను కూడ అధిగమించవచ్చని యాప్ సృష్టికర్తలు చెప్తున్నారు. -
'బ్లాక్ బెరీ'లో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ బ్లాక్ బెరీ ఇప్పుడు వినియోగదారులకు మరికొన్ని కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ బెరీ మొబైల్ నుంచి ఇతరులకు పంపే సందేశాల్లో గోప్యతను పెంచేందుకు, వినియోగదారులే కంటెంట్ ను నియంత్రించే మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది. ఈ కొత్త సదుపాయాన్ని ఎటువంటి ఛార్జీలు, ప్రత్యేక ఫీజులు లేకుండా యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. యాండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలో ఎటువంటి ఫీజు లేకుండా కొత్త ఐవోఎస్ అప్ డేట్స్ అందిస్తోంది. యూజర్ల సౌకర్యార్థం వారు షేర్ చేసుకునే సందేశాలు, కంటెంట్ తమ నియంత్రణలోనే ఉంచుకునేందుకు బీబీఎం వినియోగదారులకు ఈ కొత్త అభివృద్ధి సహకరిస్తుందని బ్లాక్ బెరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాథ్యూటాల్బోట్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ ఫోన్ నుంచిపొరపాటున కానీ, ఇష్టప్రకారం కానీ పంపిన మెసేజ్ లు, ఫొటోలు తిరిగి వెనక్కు రప్పించుకునే అవకాశం ఇప్పుడు బ్లాక్ బెరీలో ఉంది. అలాగే తాము పంపిన మెసేజ్ లు, ఫొటోలు ఇతరులకు ఎన్నాళ్ళ పాటు కనిపించాలో కూడా నిర్ణయించేందుకు వీలుగా టైమర్ ను సెట్ చేసుకునే అవకాశం ఇకపై అందుబాటులోకి వస్తుందని మాథ్యూ తెలిపారు. దీనికితోడు కొన్ని అదనపు కీ ఫీచర్లను కూడా బీబీఎం అందుబాటులోకి తెచ్చింది. ఒకరినుంచీ ఒకరికి ఛాట్ మెసేజ్ లను ఫార్వర్డ్ చేసే అవకాశం తోపాటు... విభిన్న వ్యక్తులతో ఛాట్ చేస్తున్నపుడు యాండ్రాయిడ్ లో మ్యూట్ నోటిఫికేషన్లు అందించే సామర్థ్యాన్ని బీబీఎం కొత్తగా కల్పించింది. అంతేకాక ఎన్నో మెరుగైన సందుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన బ్లాక్ బెరీ.. ఇప్పుడు వీడియో షేరింగ్ ఆప్షన్ నూ అందిస్తోంది. ఈ కొత్త పద్ధతిలో అతి పెద్ద వీడియోలను సైతం క్యాప్చర్ చేసి ఇతరులకు షేర్ చేసే అవకాశం ఉంది. ఇవే కాక కొత్త ఛాట్ స్క్రీన్ ను ఐవోఎస్ అందిస్తోంది. యాండ్రాయిడ్ మార్ష్మాల్ల (6.0) ద్వారా ఇప్పుడు బీబీఎం పని చేస్తుంది. -
కార్పొరేట్ విద్యకు కళ్లెం వేయాలి
♦ విపక్ష సభ్యుల సూచన ♦ ఫీజుల నియంత్రణకు చట్టాలు తేవాలి ♦ ఉపాధ్యాయ యూనియన్లను తగ్గించాలని హితవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యావ్యవస్థను శాసిస్తున్న కార్పొరేట్ వ్యవస్థకు తక్షణం కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. కార్పొరేట్ల కబంధ హస్తాల్లో పూర్తిగా విద్యావ్యవస్థ చిక్కుకుపోయిందని, దాన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, గట్టి చట్టాల ద్వారానే నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ యూనియన్లను తగ్గించాలని సూచించారు. బుధవారం విద్యావిధానంపై చర్చల్లో పలువురు సభ్యులు మాట్లాడారు. ఫీజుల నియంత్రణ చేపట్టాలి: కె.లక్ష్మణ్ ‘ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య పూర్తిగా కార్పొరేట్ల పద్మవ్యూహంలో చిక్కుకుంది. కఠిన చట్టాలు చేయకుంటే సామాన్యుడికి పూర్తిగా అందకుండా పోతుంది. కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకి కమిటీలను ఏర్పాటు చేసి, ఫీజుల నియంత్రణ చేయాలి’. కార్పొరేట్లను నియంత్రించాలి: ఆర్.కృష్ణయ్య ‘కార్పొరేట్లు విద్యను వ్యాపారంగా మార్చారు. వారిని నియంత్రించాలంటే కచ్చితంగా మాతృభాషలో విద్యాబోధన ఉండేలా చట్టాన్ని తేవాలి. ఒక యాజమాన్యం కింద ఒకే సంస్థ ఉండేలా, అడ్మిషన్లలో నియంత్రణ పెట్టేలా మార్పులు తేవాలి. ఫీజుల రేట్ల మీద సైతం కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని తేవడంతోపాటు, మౌలిక వసతులను కల్పించాలి. ఆలస్యం చేయకుండా రెసిడెన్షియల్, ఎయిడెడ్, మోడల్, కస్తూర్భా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రంలో 40 ఉపాధ్యాయ యూనియన్లు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులంతా యూనియన్ల పేరుతో చదువు చెప్పడం మానేసి తిరుగుతున్నారు. అలా కాకుండా ఒకే యూనియన్ ఉండేలా, దానికి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేలా చూడాలి’. బొందపెట్టే పరిస్థితి తెచ్చుకోకండి: సంపత్ ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు విద్యార్థులు చేయూతనిచ్చిన ఆందోళనలతో ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఎది గింది. అదే పార్టీ ఇపుడు అధికారంలోకి వచ్చి విద్యార్థులను, యూనివర్సిటీని పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు క్షణాల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలు మాత్రం మూడునెలలైనా యూనివర్సిటీకి చేరలేదు. బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, వారు పై చదువులకు, ఉద్యోగాలకు వెళ్లలేక పోతున్నారు. ఇదిలాగే కొనసాగితే.. అదే ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు’ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలో అన్‌పార్లమెంటరీ పదం ఉన్నందున, దాన్ని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. పర్యవేక్షణ లేని స్కూళ్లు: మనోహర్‌రెడ్డి పాఠశాలలపై పర్యవేక్షణ లేకుండా పోయిందని, ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు లేకుండాపోయారు. వారి నియామకాలకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. పాఠశాలలను రేషనలైజేషన్ చేయాలి.. విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించేలా 8వ తరగతి నుంచే వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలి. యూనియన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని అవసరమా.. అందరూ ఆలోచించాలి’. -
విద్యుత్ ఉద్యోగులపై ‘ఈఆర్సీ’ నియంత్రణ!
ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లవద్దని ఆదేశాలిచ్చిన ట్రాన్స్‌కో సీఎండీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల వ్యాపార లావాదేవీలను ప్రశ్నిస్తూ విద్యుత్ ఉద్యోగులెవరూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)ని ఆశ్రయించవద్దని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా ఈఆర్సీకి వెళితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. యాజమాన్యం నుంచి అనుమతి లేకుండా విద్యుత్ సంస్థల వ్యాపార లావాదేవీలపై ఈఆర్సీను సంప్రదించకుండా, ఈఆర్సీ ముందు హాజరుకాకుండా, ఈఆర్సీని ఆశ్రయించకుండా ఉండేలా తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు తమ ఉద్యోగులను ఆదేశించాలని కోరుతూ ఈ నెల 9న ఈఆర్సీ కార్యదర్శి లేఖ రాశారు. విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీని ఆశ్రయిస్తే ‘ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్-1964’ను ఉల్లంఘించినట్లేనని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రామాణికంగా చూపుతూ ట్రాన్స్‌కో ఉద్యోగులెవరూ ఈఆర్సీతో సంప్రదింపులు జరపరాదని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, పర్యవేక్షక ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లంతా తమ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లకుండా సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వు ప్రతులను శుక్రవారం విద్యుత్ సౌధలో ఇంజనీర్లందరికీ అందజేశారు. -
ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 59 ఏళ్లు. నాకు విరేచనం సాఫీగా కావడం లేదు. బీపీ, షుగర్ వ్యాధులకు మందులు వాడుతున్నాను. నియంత్రణలోనే ఉన్నాయి. విరేచనం కోసం ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - వి.కె. రమణారావు, విశాఖపట్నం నిత్యవిరేచనం అవటంలో సమస్యలుంటే, దానిని ‘మలబంధం’ అనే పేరుతో వివరించింది ఆయుర్వేదం. జీర్ణకోశవ్యవస్థను ‘మహాకోష్ఠం’ అని చెప్పింది. ఇది పిత్తప్రధానంగా ఉండే ‘మృదుకోష్ఠం’. వాత ప్రధానంగా ఉంటే క్రూరకోష్ఠం. జీర్ణాశయ కర్మలన్నీ సజావుగా సాగిపోతే ‘సమకోష్ఠం’ మలబంధం వాతప్రకోపం వల్ల కలుగుతుంది. ఆహారంలో తీపి, పులుపు, ఉప్పు తగినంత ప్రమాణంలో లేకపోవడం, స్నిగ్ధాహారం లోపించడం (అంటే జిడ్డుగా మృదువుగా ఉండే పాయసాల వంటి ఆహారం), తాజా పండ్లు తినకపోవడం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పచ్చిగా ఉండేవీ, ఎండుఫలాలూ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. దానికి తోడు కనీసం రోజూ 3 లీటర్ల నీరు తాగడం అవసరం. ప్రతిరోజూ 45 నిమిషాలపాటు ఏదో ఒక రూపంలో వ్యాయామం చేయాలి. ముఖ్యంగా పొట్టని కదిలించే ‘కపాలభాతి’ వంటి యోగప్రక్రియలు, ఇతర యోగాసనాలు విరేచనం సాఫీగా కావడానికి ఉపకరిస్తాయి. రాత్రిపూట జాగారం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, మద్యం, పొగతాగే అలవాటు వంటివి కూడా మలబంధానికి దారితీస్తాయి. మానసిక ఒత్తిడి వల్ల కూడా పొట్ట ఉబ్బరించడం, మలబంధం సంభవించవచ్చు. చికిత్స: మంచి ఆహార, విహారాలను పాటించడం అత్యవసరం షుగరు, బీపీల వంటి వ్యాధులైనా ఉంటే వాటిని నియంత్రించడం ఆహారంలో ఆకుకూరలు, పొట్లకాయ, బీరకాయ, పనసపొట్టు, చిక్కుడు జాతి కూరలు, అరటిదవ్వ తీసుకోవడం, బార్లీ ద్రవాలు ఎక్కువగా తాగడం రోజూ ఉదయం లేవగానే ఒక లీటరు నీళ్లను తాగడం (గమనిక : గుండె, మూత్రపిండాల జబ్బులు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగకూడదు). ఔషధాలు: మృదువుగా మల విసర్జన అయ్యేలా చూసేవి... కరక్కాయ చూర్ణం (హరీతకీ) : 3 నుంచి 5 గ్రాములు నీళ్లతో రాత్రి సేవించాలి. త్రిఫలాచూర్ణ (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ): 5 నుంచి 10 గ్రాములు వరకు నీళ్లతో కషాయం కాచుకొని 30 మి.లీ. రాత్రిపూట తాగాలి. ఆరగ్వధ (రేల) గుజ్జు; సునాముఖి ఆకు కూడా విరేచనం మృదువుగా అయ్యేలా చూసేవే. వీటిని వాడాలంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. తీక్ష్ణరేచకాలు : హేరండ (ఆముదం), దంతి (నేపాళం)... వీటిని కూడా వైద్యల పర్యవేక్షణలోనే వాడాలి. ‘అభయాదిమోదక’ మాత్రలు బజారులో లభిస్తాయి. వీటిని 1 మాత్ర రాత్రి నీళ్లతో తీసుకోవాలి. స్నిగ్ధం ఉండటం రేచకాలు (మలవిసర్జన మృదువుగా, సాఫీగా అయ్యేవి... ధాత్రీతైలం, హింగుత్రిగుణతైలం (మోతాదు 2 చెంచాలు, పాలతో రాత్రి). సూచన: మృదురేచకాలలో ఏదైనా ఒక్కటి తగిన మోతాదులో వాడుకోవచ్చు. అయితే విరేచనం కోసం కేవలం ఔషధాలపైన ఆధారపడటం శాస్త్రీయం కాదు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి. - రామస్వామి, ఖమ్మం కాలేయం కొవ్వుకు కోశాగారం లాంటిది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ (కడుపు భాగం), కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు. ప్రధానంగా ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీకు ఫ్యాటీలివర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతుసంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను ఒకసారి కలవండి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. వాడు మూడేళ్ల వయసున్నప్పుడు ఆటలాడుతూ ఒకసారి కిందపడ్డాడు. అప్పుడు వాడికి తలమీద గాయం తగిలింది. కానీ అప్పుడు ఏమీ కాలేదు. బొడిపెలాగ వాపు వచ్చి కొన్ని రోజుల తర్వాత అదే తగ్గిపోయింది. అయితే ఈమధ్య మా బాబు ఒకసారి స్కూల్లో ఫిట్స్ వచ్చి కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పటినుంచీ అప్పుడప్పుడూ అలా వస్తూనే ఉంది. మా ఇంటి దగ్గర్లోకి డాక్టర్‌కి చూపెట్టాం. ఆయన కొన్ని మందులు రాసిచ్చారు. అప్పటికి తగ్గిపోయింది గానీ మాకు భయంగా ఉంది. వాడికేమీ గుర్తుండడం లేదు. చిన్నప్పుడు తలకు తగిలిన గాయం వల్ల మా బాబు మెదడుకు ఏమైనా హాని జరిగిందేమోనని మాకు భయంగా ఉంది. దయచేసి మా బాబు సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - లక్ష్మి, తిరుపతి సాధారణంగా చిన్నవయసులో ఆటలాడుతున్నప్పుడు అందరూ కింద పడుతూనే ఉంటాం. శరీరానికి చాలా చోట్ల దెబ్బలు తగలడం, తగ్గిపోవడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే పైకి కనిపించని దెబ్బలు శరీరంలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా తలకు చిన్నతనంలో ఎప్పుడైనా గాయం తగలితే ఎంతమాత్రమూ అశ్రద్ధ చేయకూడదు. వయసు పెరుగుతున్నకొద్దీ తలలో గాయం కూడా పెరుగుతుంటుంది. మీరు వివరించినట్లు మీ అబ్బాయికి చిన్నప్పడు ఆటల సందర్భంలో తగిలిన గాయం వల్లనే ఫిట్స్ రావడం, కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుండవచ్చు. మెదడులోని విద్యుత్ ప్రభావం వల్ల ఫిట్స్‌లా వచ్చి బయటపడుతుండవచ్చు. అయితే అది ఏస్థాయిలో ఉంది, దాని పరిమాణం ఎంత అనేది సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి కొత్తగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో కనిపెట్టగలం. ఆ పరీక్షల తర్వాతనే చికిత్సా ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిష్ణాతులైన వైద్యులతో మీ బాబు సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. కాబట్టి అతడి విషయంలో ఎలాంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. కానీ మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే మీ బాబుకి తగిన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సను అందించండి. అతడు పూర్తిగా కోలుకుంటాడు. డాక్టర్ పి. రంగనాథమ్ సీనియర్ న్యూరోసర్జన్ యశోద హాస్పిటల్స్ సోమాజీగూడ హైదరాబాద్ -
ఆ ఇంటి లైట్లను మీరు కూడా ఆన్, ఆఫ్ చేయొచ్చు
అలస్కా: మన ఇంటికి అలంకరించిన లైట్లను ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడి నుండైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నే కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ.. అమెరికాలోని ఓ ఇంటి అలంకరణ లైట్లను ఎవరైనా ఎక్కడి నుండైనా వెలిగించవచ్చు, ఆర్పేయవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమ సంతోషాన్ని అందరితో పంచుకోవడం కోసం అలస్కాకు చెందిన ఐటీ నిపుణుడు జాన్ ఉడ్స్ తన ఇంటికి అలంకరణ లైట్లను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా, ఎవరైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా మరోసారి లైట్లపై పూర్తి కంట్రోల్ ఇంటర్ నెట్ యూజర్లకే ఇచ్చేశాడు. ఈ ఏడాది ఇలాంటి అవకాశం కల్పించడం ఇది ఆరోసారి. ఉడ్స్ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. తమ ఇంట్లో లైట్లను ఆఫ్ చేయడానికి బద్దకించే వారు సైతం గంటల తరబడి ఆన్లైన్లో ఉడ్స్ ఇంటికి అలంకరించిన లైట్లను ఆన్, ఆఫ్ చేస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ లింక్ ద్వారా http://christmasinfairbanks.com మీరు కూడా ఓ సారి ప్రయత్నించండి.. -
కార్లకు ముకుతాడు!
- ట్రాఫిక్ నియంత్రణకు ఢిల్లీ బాటలో హైదరాబాద్ - కార్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి - ప్రణాళిక తయారీ బాధ్యత నిపుణులకు - మరికొద్దిరోజుల్లో స్పష్టత సాక్షి, హైదరాబాద్: మీకు కారుందా? ఆ కారులో నగరంలో రోజూ తిరుగుతున్నారా? మా కారు మా ఇష్టం అంటారా? అయితే ఇకపై రోజూ నగర రోడ్లపై మీ కారు పరుగులు తీసేందుకు కుదరకపోవచ్చు! వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాలుష్య భూతాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల సరి, బేసి సంఖ్య ఆధారంగా రోజువిడిచి రోజు మాత్రమే రోడ్లపైకి వచ్చేలా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వాన్ని కదిలించింది. అసలే హైదరాబాద్‌లో ఇరుకురోడ్లు.. ఆపై లక్షల్లో వాహనాలు. నెల తిరిగేసరికి వేలసంఖ్యలో కొత్త కార్లు చేరుతున్నాయి. కాలుష్యాన్ని ఎగజిమ్ముతూ నగర జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా కార్లు తిరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ముందు వరసలో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం వాటి నియంత్రణపై ఇప్పుడు దృష్టి సారించింది. కార్లకు ముకుతాడు వేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు ఇచ్చే బాధ్యతను నిపుణులకు అప్పగించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఢిల్లీ తరహా సరి, బేసి సంఖ్యల ఆధారంగా నియంత్రణ కంటే... వారంలో నిర్ధారిత రోజుల్లో కార్ల వాడకాన్ని నియంత్రించే విధానం మెరుగ్గా ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఐదేళ్ల క్రితమే చొరవ ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై దాదాపు 8.5 లక్షల కార్లు పరిగెడుతున్నాయి. నిత్యం 200 వరకు కార్లు కొత్తగా రోడ్లపైకి చేరుతున్నాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు అంతకంత అవుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. కార్యాలయాల వేళల్లో చాలా కార్లలో ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటున్నాడు. కనీసం క్రమశిక్షణ కూడా లేకపోవటంతో కార్ల వాడకం విచ్చలవిడిగా మారింది. దీన్ని అరికట్టేందుకు వాస్తవానికి 2010లోనే ప్రయత్నాలు జరిగాయి. కానీ నాటి ప్రభుత్వం స్పందించకపోవటంతో అవి విఫలమయ్యాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల ప్రాతినిధ్యంతో ఏర్పడ్డ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. నగరంలో ట్రాఫిక్ చిక్కులు, తద్వారా కాలుష్య సమస్య శ్రుతిమించకుండా ఉండాలంటే కార్లపై నియంత్రణ అవసరమని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కార్లపై నియంత్రణ ఎలా ఉందో కూడా సూచించింది. అంతకుముందు నగరంలోని హైటెక్స్‌లో ‘పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ (పాటా) సదస్సు జరిగిన సమయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నగరంలో కార్ల వాడకంపై విస్మయం వ్యక్తం చేశారు. తదుపరి పాటా సదస్సు జరగాల్సిన విదేశీ నగరాల ప్రతినిధులు ఈ విషయంలో చురకలు కూడా అంటించారు. ‘మా నగరంలో పాటా సదస్సుకు వచ్చేవారికి ఇలా విచ్చలవిడిగా కార్లు అందుబాటులో ఉండవు. కావాలంటే సైకిళ్లు ఎక్కి తిరగొచ్చు’ అని చెప్పడం ద్వారా హైదరాబాద్‌లో పర్యావరణ స్పృహ అంతగా లేదని పరోక్షంగా పేర్కొన్నారు. ఇలాంటి అంశాలను కూడా ‘ఉమ్టా’ పరిగణనలోకి తీసుకుంది. కానీ ఆ నివేదికను నాటి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ‘కార్ ఫ్రీ థర్స్డే’లా కావద్దు నగరంలో సాఫ్ట్వేర్ పరిశ్రమలో కార్ల వినియోగం అత్యధికంగా ఉంది. మాదాపూర్ ప్రాంతంలో రోడ్లపై కార్లబార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ‘కార్ ఫ్రీ థర్స్డే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం కారు బదులు బస్సుల్లో, ఇతర వాహనాల్లో ప్రయాణించాలనేది దీని ఉద్దేశం. రెండు మూడు నెలలు బాగానే అమలైనా ఆ తర్వాత అది నీరుగారింది. ఇప్పుడు గురువారాల్లోనూ యథాప్రకారం ఆ రోడ్లపై కార్లు పరుగుపెడుతున్నాయి. -
దిగని ధరలు
దాడులతో సరి! నియంత్రణపై చర్యలు శూన్యం సామాన్యుల వెతలు పట్టని సర్కారు శమరశంఖం పూరించిన వైఎస్సార్సీపీ నేడు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు విశాఖపట్నం: పొద్దున్నే ఇడ్లీముక్కేకాదు..పప్పన్నం..గంజి మెతుకులు కూడా భారమైపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ధరలు చుక్కలను దాటేశాయి. అందుబాటులో లేని ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నాడు. అదుపు చేయాల్సిన సర్కార్ మొద్దునిద్ర వీడటంలేదు. పట్టించు కోవాల్సినఅధికారులు పత్తాలేకుండా పోయారు. దీంతో సర్కార్ తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళన బాటపట్టింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలకు ఆ పార్టీ సర్వసన్నద్ధమైంది. ధరల నియంత్రణలో సర్కార్ పూర్తిగా విఫలమైందని సామాన్యులే కాదు.. అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. అధికారుల మెరుపు దాడులు ముచ్చటగా మూడురోజులకే పరిమితం చేశారు. ఈ మూడురోజుల దాడుల్లోనే ఏకంగా మూడు కోట్లకు పైగా విలువైన పప్పులు, ఆయిల్స్ బయటపడ్డాయంటే బ్లాక్ మార్కెట్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లూను కుందో అర్థమవుతుంది. బ్లాక్ మార్కెటర్స్‌కు అధికార వర్గాలు ఏస్థాయిలో కొమ్ముకాస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో బియ్యం కిలో రూ.55, కందిపప్పు రూ.200, మినపప్పు రూ.185, సన్‌ప్లవర్ ఆయిల్ రూ.100లు, వేరుశనగ నూనె రూ.130 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ నిత్యావసర ధర మూడింతలు పెరిగింది. దీంతో సామాన్యుడు మూడు పూట్లా తినే పరిస్థితి లేకుండా పోయింది. ధరల నియంత్రణపై రాష్ర్ట , జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయాల్సిన ధరల స్థిరీకరణ జాడే లేదు. అన్ని హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో 30వ తేదీ నుంచి కందిపప్పు కిలో రూ.143లకే విక్రయించాలని, అలాగే మిగిలిన పప్పులను కూడా తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్ట మంత్రి పరిటాల సునీత ఆదేశాలు జిల్లాలో అమలుకు నోచుకోవడంలేదు. సామాన్యులేమైపోతే మాకేంటి.. మా జేబులు నిండితే అదే పది వేలు అన్నట్టుగా అధికార పార్టీ పెద్దలతో పాటు అధికారులు కూడా వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ సీపీ శమరశంఖం పూరించింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పార్టీ యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు..రాస్తారోకోలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ పిలుపుతో సామాన్యులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన ఈ ఆందోళనల్లో పార్టీ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధరల నియంత్రణపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ పిలుపు నిచ్చారు. -
బ్యాన్ బాజా..!
నైతిక నియంత్రణ ఇండియాలో కొన్ని తినకూడదు. ఇండియాలో కొన్ని చూడకూడదు. ఇండియాలో కొన్ని చదవకూడదు. ఎందుకు? ఎందుకంటే... బ్యాన్! ‘అదుర్స్’ సినిమా యాక్షన్ కామెడీ. 2010లో వచ్చింది. డెరైక్టర్ వి.వి.వినాయక్. హిట్ మూవీ. కానీ తెలంగాణాలో ఫట్ మంది. అదేంటి ఆంధ్రాలో హిట్ కొట్టి, తెలంగాణాలో ఫట్ మనడం! అప్పుడు తెలంగాణా ఉద్యమం నడుస్తోంది. జూ॥ఎన్టీఆర్ ఆంధ్రా హీరో కదా. అందుకే బ్యాన్. ఎవరు బ్యాన్ చేశారు? ప్రభుత్వమా.. సేఫ్‌సైడ్‌గా? కాదు. ప్రజలా.. స్వచ్ఛందంగా? కాదు. మరి? ఉద్యమకారులు! వారిలోనూ అందరూ కాదు కొందరు. ఉద్యకారులైతే మాత్రం అలా బ్యాన్ చెయ్యొచ్చా? ప్రభుత్వాలే బ్యాన్లు చేస్తున్నప్పుడు ఉద్యమకారులు చెయ్యడంలో ఆశ్చర్యం ఏముంది? పైగా వాళ్లు ఏం బ్యాన్ చేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా. అయితే ప్రభుత్వాలు చేసే బ్యాన్లను ఎవరికి వ్యతిరేకమైనవని అనుకోవాలి? ఇంకెవరికి? ప్రజలకే. అదుర్స్ సినిమానే తీసుకుందాం. సినిమాను ఉద్యమకారులు బ్యాన్ చేస్తే, ఈ సినిమాలోని ఒక పాటలో రెండు లైన్లను ప్రభ్వుత్వం బ్యాన్ చేసింది. ప్రభుత్వం అంటే ఇక్కడ సెన్సార్ బోర్డు. బ్యాన్ అంటే ఇక్కడ ఆ రెండు లైన్లను మార్చేయడం. అదుర్స్‌లో... సి.హెచ్.ఎ.ఆర్.ఐ... చారి.. అనే పాట ఉంది. అది జూ॥ఎన్టీఆర్‌కీ, నయనతారకి మధ్య సాగుతుంది. పాటను చంద్రబోస్ రాశారు. సినిమాలో జూ॥డబుల్ యాక్షన్. ఒకరు పురోహితుడు. ఇంకొకడు ఖతర్నాక్. నయనతార ఫ్రెండ్ పురోహితుడు. ఖతర్నాక్ని చూసి, అతడే తన ఫ్రెండ్ అనుకుని, ‘అరె ఇంత మోడర్న్‌గా మారిపోయాడేంటి?’ అని ఆశ్చర్యపోతుంది. వెంటనే పాట అందుకుంటుంది. వేర్ ఈజ్ ద పంచకట్టు? వేర్ ఈజ్ ద పిలకజుట్టు? వేర్ ఈజ్ ద నిలువుబొట్టు చారీ.. అని పాడుతుంది. ఆడియో రిలీజ్ కాగానే సెన్సార్ పట్టుకుంది! సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని చెప్పి... వెంటనే ఆ పిలకజుట్టును, నిలువుబొట్టును (ఆ పదాలను) మార్చేమని హుకుం జారీ చేసింది. దాంతో పాపం చంద్రబోస్ పిలకజుట్టును పాతబైకుగా, నిలువుబొట్టును ఓల్డు లుక్కుగా మార్చేశారు. భారత ప్రభుత్వంవారి బ్యాన్ల చరిత్రలను చూస్తే ఇది చాలా చిన్న విషయం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన ఇండియా ఇంతవరకు పుస్తకాలను, సినిమాలను, కళలను, టీనేజర్ల ఆటపాటలను మాత్రమే బ్యాన్ చేస్తూ వస్తోంది. ఇప్పుడిక తినే తిండిపైన కూడా నిషేధాజ్ఞలు విధించడం మొదలుపెట్టింది! ఇండియన్ హిస్టరీలో లేటెస్టు బ్యాన్... బీఫ్. గొడ్డు మాంసం. నిషేధిస్తే పోయిందేమిటి? బ్యాన్లను భరిస్తూ పోతుంటే అప్పటికప్పుడు మనకు వచ్చే ఇబ్బంది, జరిగే నష్టం ఏమీ లేదనిపించవచ్చు. కానీ సాంస్కృతికంగా గానుగ ఎద్దులమైపోయి, మూసలోకి ఒదిగిపోయి, మనుషులుగా మిగలకపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా చూసినా దెబ్బతింటాం. మాంసాన్ని నిషేధించారు. ఏమైంది? మాంసాన్ని ఉత్పత్తి చేసేవారికి, విక్రయించేవారికి ఉపాధి పోయింది. వేరే ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తుందా? కల్పించినా అది, వీళ్లకు చేతనైన పని అవుతుందా? ఒక పుస్తకాన్ని బ్యాన్ చేసినా, సినిమాని నిషేధించినా జరిగేది ఇదే. క్రియేటివిటీ చచ్చిపోతుంది. కొత్త క్రియేటివిటీ బతికి బట్టకట్టడానికే భయపడుతుంది. ఇంకో సంగతి. అసలు వాటికి మార్కెట్ పడిపోయి, నకిలీల బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది. డ్రై డేస్‌లో దొంగతనంగా జరిగే అక్రమ అమ్మకాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమాలూ అంతే. ఎంతగా బ్యాన్ అయితే, అంతగా డీవీడీలు మార్కెట్లో పారలల్ ఎకానమీని నడిపేస్తుంటాయి. ఇలా చెలామణీ అయ్యే మనీ అంతా చిన్న స్థాయిలో టాక్స్‌ను తప్పించుకుంటుంది. పెద్ద స్థాయిలో బ్లాక్ మనీగా అవతరిస్తుంది. మోరల్ పోలీసింగ్ ప్రభుత్వం ఇలా ఉన్నదానికీ, లేనిదానికీ బ్యాన్లు చేసుకుంటూ పోతుంటే... సాంస్కృతిక విలువల పరిరక్షకులకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. వాలెంటైన్స్ డే పార్టీల మీద పడి... యువతీయువకులను వాళ్ల సంతోషాల నుంచి, చిన్నచిన్న ప్రేమల్నుంచి, జీన్స్ వేసుకోవడం నుంచి, సెల్‌ఫోన్స్ వాడడం నుంచి బ్యాన్ చేసేస్తారు. ఎంత ఘోరం! అధికారం ఉన్న వారు అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఎంత ఘోరమో, ఏ అధికారమూ లేనివారు అధికారం ఝళిపించడం అంతకన్నా ఘోరం. అసంబద్ధమైన, అవివేకమైన, ఆలోచనారహితమైన నిషేధాల వల్ల జరుగుతున్న అనర్థం ఇదంతా. ఈ మోరల్ పోలీసులైతే మరీను... వాళ్లకు నచ్చని ఆర్ట్‌ని... అదొక పిచ్చికుక్క అని తేల్చేసి ధ్వంసం చేసేస్తారు. ఇదిలాగే కంటిన్యూ అయితే ఇండియా బ్యాన్లకే పెద్ద బ్యానర్ అవుతుంది. ఇప్పుడేదో అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు కదా, ఇండియాని! అభివృద్ధికి కనీసం ప్రయత్నం కూడా చెయ్యడం లేదని అప్పుడంటారు. - సాక్షి ఫ్యామిలీ ఇవి తినకూడదు ఈ ఏడాది మార్చి 3 నుంచి మహరాష్ట్రలో గొడ్డు మాంస విక్రయాలు బంద్ అయ్యాయి. ఇలా నిషేధించిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ఎనిమిదవది. మిగతా ఏడు... ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర యానిమల్ ప్రిజర్వేషన్ (అమెండ్మెంట్) యాక్టు ప్రకారం గొడ్డు మాంసం ఇంట్లో ఉన్నట్టు బయటపడినా సరే ఐదేళ్ల జైలు లేదా పదివేల జరిమానా! జూన్‌లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనం నుంచి కోడిగుడ్లను నిషేధించింది. గుడ్డు మాంసాహారమని! గుజరాత్లో 1960 నుండి మద్యంపై నిషేధం ఉంది. జార్ఘండ్‌లో రెండు దశాబ్దాలకు పైగా మహువా కలిసిన లిక్కర్‌పై బ్యాన్ కొనసాగుతోంది. మణిపూర్, నాగాలాండ్‌లలో 1990ల నుంచి మద్యం అమ్మకాలపై తీవ్రవాదుల నిషేధం కొనసాగుతోంది. కేరళలో ఫైవ్ స్టార్ హోటళ్లు మినహా మిగతా హోటళ్లేవీ మద్యం విక్రయించడానికి లేదు. ఈ ఏప్రిల్‌లో అమలులోకి వచ్చిన ఈ నిషేధం దెబ్బకి దాదాపు 300 హోటళ్లు... బీరు, వైన్ పార్లర్లుగా మారిపోయాయి. ఇవి చదవకూడదు ముంబై యూనివర్శిటీ తన రీడింగ్ జాబితా నుంచి రోహిన్టన్ మిస్త్రీ పుస్తకం ‘సచ్ ఎ లాంగ్ జర్నీ’ని తొలగించింది. తమ భావజాలాన్ని అవహేళన పరిచే విధంగా ఈ పుస్తకం ఉందని శివసేన అభ్యంతరం వ్యక్తంచేయడంతో యూనివర్శిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మిస్త్రీ పుస్తకం బుకర్ ప్రైజ్‌కు పోటీగా నిలిచిన పుస్తకం కావడం విశేషం. ప్రముఖ నాటక రచయిత, సామాజిక కార్యకర్త హబీబ్ తన్వర్ రాసిన ‘చంద్రదాస్ చోర్’ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2009లో బ్యాన్ చేసింది. బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ రాసిన ‘జిన్నా : ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకాన్ని గుజరాత్ ప్రభుత్వం 2009లో నిషేధించింది. ఈ పుస్తకం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందన్నది ప్రధాన అభ్యంతరం. ఉత్తరప్రదేశ్‌కు కూడా లెక్కకు మిక్కిలిగా పుస్తకాలను నిషేధించిన ఘన చరిత్ర ఉంది. అక్కడ మీకు లక్ష్మీకాంత్ శుక్లా రాసిన ‘జతిన్ రాజ్’ పుస్తకం చదవడానికి అటుంచి, కనీసం చూడ్డానికి కూడా కనిపించదు. అలాగే ‘ఉదయిమన్ భార్తీయ సమాజ్ మే శిక్షక్’ (డాక్టర్ కరణ్‌సింగ్), ‘నెహ్రూ గాంధీ పరివార్ సెక్యులర్’, ‘వర్ణ్ సంకర్’ (హరిరామ్ గుప్త), రాణీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ‘రాణి’ (జయశ్రీ మిశ్రా) కాపీలు ఒక్కటి దొరికినా ఆశ్చర్యమే. వీటన్నిటినీ యూపీ ప్రభుత్వం నిషేధించింది. తమిళనాడు ప్రభుత్వం 2012లో ‘వాసంతీస్ జయలలిత : ఎ ప్రోర్ట్రెయిట్’ పుస్తకాన్ని బ్యాన్ చేసింది. ఇవి చూడకూడదు బిబిసి కోసం బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఎడ్విన్ తీసిన ‘నిర్భయ’ డాక్యు మెంటరీని భారత ప్రభుత్వం గత మార్చిలో నిషేధించింది. బ్రిటిష్ అమెరికన్ డ్రామా ఫిల్మ్ ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ని గత ఆగస్టులో భారత ప్రభుత్వం నిషేధించింది. యశ్‌చోప్రా ‘ఆజా నచ్లే’, అశుతోష్ గోవరికర్ ‘జోధా అక్బర్’, ప్రకాష్ ఝా ‘ఆరక్షణ్’ చిత్రాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. గుజరాత్ ప్రభుత్వమైతే ఎన్ని సినిమాలను నిషేధించిందో లెక్కేలేదు. ఫనా, పర్జానియా, చాంద్ భుజ్ గయా, ఇన్ దినో ముజఫర్‌నగర్... వీటిలో కొన్ని. -
హీరోగా సుకుమార్ అన్నకొడుకు
-
తన కోపమే తన శత్రువు
కోపం నిప్పులాంటిది.. దానిని జీర్ణించుకుని వాడుకుంటే... దీపాలను వెలిగించవచ్చు. రాకెట్లను ఎగరేయవచ్చు. ఆకలిని చల్లార్చవచ్చు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోతే... కొంపలు కాల్చుకోవచ్చు. బంధాలను బూడిదలో పోసుకోవచ్చు. జీవితాలని బుగ్గిపాలు చేసుకోవచ్చు. ఈ బర్నింగ్ ప్రాబ్లమ్‌ని ఎలా డీల్ చేయాలి? రేణుక, రాజ్యలక్ష్మి తోడికోడళ్లు. హైదరాబాద్, చందానగర్‌లో ఇళ్లు పక్కపక్కనే. వీళ్ల మధ్య ఒక రోజు చిన్న విషయమై వివాదం చెలరేగింది. ఆ కోపంతో రాజ్యలక్ష్మి రేణుక కూతురు ఏడాదిన్నర వయసుండే జ్యొత్స్నను ఒక్కసారిగా తీసుకెళ్లి నీటి డ్రమ్ములో పడేసింది. ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయింది. ఉప్పల్ సమీపంలోని రామంతాపూర్‌లో అత్త వీరమణి వేణ్నీళ్లు పెట్టమందని గొడవపెట్టుకున్న కోడలు భార్గవి కోపంతో బాత్రూమ్లో కుర్చీలో కూర్చున్న అత్త తలను నల్లాకేసి కొట్టింది. అత్త అక్కడికక్కడే చనిపోయింది. అంబర్‌పేటలో నివాసముండే లండన్ రిటర్న్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూర్యప్రకాష్... కొన్ని నెలలుగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో అత్త, భార్య కలిసి అతణ్ణి హేళనగా మాట్లాడారు. అంతే కోపం తెచ్చుకున్న అతను విసురుగా గదిలోకి వెళ్లి, ఉరేసుకుని చనిపోయాడు. పంజాగుట్ట చౌరాస్తాలో కారు అడ్డం తీయమంటూ హారన్ మోగించాడనే కోపంతో మోటార్‌సైక్లిస్ట్‌ను ఎడా పెడా కొట్టేసిందో కార్పొరేట్ ఉద్యోగిని. ఇప్పటికీ ఆ కేసు విషయమై పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. ఇవేనా! కాలాలకతీతంగా, సంస్కృతులకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అకారణంగా, అసహనంతో, అనవసర కోపాలు పెరిగిపోతున్నాయి. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మహిళల్ని తూలనాడి చిక్కుల్లో పడిన మంత్రి... ఆటోగ్రాఫ్ అడిగిన అభిమాని చెంప పగలగొట్టిన హీరో... రిమోట్ కంట్రోల్ ఇవ్వలేదని అక్కని చంపిన తమ్ముడు... రూ.10 అప్పు తీర్చలేదని రోకలి బండతో మోది హత్య... పండగకి భర్త చీర కొనలేదని నిప్పంటించుకున్న భార్య... ఒకటేమిటి... ఇంతకన్నా సిల్లీ రీజన్స్ కూడా కోపానికి కజిన్స్ అవుతున్నాయి!పెద్ద పెద్దవాళ్లను సైతం చిక్కుల్లో పడేసి, చిన్నవయసు వాళ్లను సైతం చిదిమేసే గుణం కోపం. కచ్చితంగా ఎందుకొస్తుందో చెప్పలేం. సరిగ్గా ఎలా వస్తుందో చెప్పలేం. అది వచ్చాక ఏం చేస్తామో చెప్పలేం... అది వచ్చి పోయిన తర్వాత అదెంత కీడు మిగిల్చి పోయిదో మాత్రం చెప్పగలం. అలాంటి అనూహ్యమైన శతృవుని, అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే ‘స్నేహాన్ని’... ఎలా మ్యానేజ్ చేయాలి? ముహూర్తం చూడకుండా ముంచుకొచ్చేయవచ్చు. ముక్కు మీదే కాపురం పెట్టవచ్చు. అదే కోపం అంటే. అపరకుబేరుడికీ, అన్నం దొరకని పేదకీ చుట్టమది. అందరం ఎపుడో ఒకపుడు చవిచూస్తాం. కొందరం మాత్రం దాన్ని అణుచుకోలేక అనూహ్యమైన ఆపదల్లో ఇరుక్కుంటాం. విధినిర్వహణలో కావచ్చు, వ్యక్తిగత సంబంధాల్లో కావచ్చు కంట్రోల్ తప్పితే కాటేసే గుణం కోపానికుంది. దీన్నెలా నియంత్రించాలి? కారణం...సర్వసాధారణం కోపం సర్వసాధారణం. ఆరోగ్యకరమైన, మానవ సహజ భావోద్వేగం. శారీరక, మానసిక మార్పులతో కలిసి వస్తుంది. రక్తపోటుని పెంచి, అంతర్గతంగానూ, బాహ్యంగానూ ఒత్తిడిని పెంచుతుంది. నిర్ధుష్టంగా ఓ వ్యక్తి మీద రావచ్చు, లేదా ఓ పరిస్ధితి వల్ల రావచ్చు. చివరికి మనల్ని వదలక వెంటాడే కొన్ని జ్ఞాపకాలు కూడా కోపానికి కారణం కావచ్చు. మీరనంత వరకు మేలే కోపం అనేది ఓ సహజమైన ప్రతిస్పందన అది మితిమీరినట్లయితేనే శరీరానికీ, మనసుకు హాని చేస్తుంది. అలాగని కోపాన్ని అణచుకున్నా ప్రమాదమేనని, హైపర్‌టెన్షన్, హైబ్లడ్ప్రెషర్, డిప్రెషన్ వంటివి తలెత్తే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతకోపం ఎందుకు? మిగిలినవారితో పోలిస్తే కొంతమందికి అసాధారణ కోపం ఉంటుంది. చాలా సులభంగా ఆగ్రహానికి గురవుతుంటారు. ఈ తరహా తత్వానికి జెనెటిక్, సైకలాజికల్ అంశాలే కారణం. ఈ లక్షణాలను చిన్న వయసునుంచే గుర్తించవచ్చు. కోపిష్టులు అన్ని విషయాలూ తమ కనుకూలంగా జరగాలని కోరుకుంటారు. కోరడం కన్నా డిమాండ్ చేయడం పట్ల మాత్రమే వారికి ఆసక్తి ఎక్కువ.అందరూ కోరుకునేవే వీరూ ఆశిస్తారు. అయితే అవి అందనపుడు ఈ దుర్వాసుల ప్రవర్తన పూర్తి భిన్నంగా మారిపోతుంది. తలెత్తే సమస్యల్ని గుర్తించాలి ఆలోచనా విధానంలో సమూలమైన మార్పుని తెచ్చే శక్తి కోపానికుంది. చాలా సమయాల్లో కోపం మన లోపలి మనిషిని వెల్లడి చేస్తుంది. కోపంలో ఆలోచనాధోరణి అన్ని పరిమితులు దాటేసి నాటకీయంగా మారిపోతుంది. దీని వల్ల తలెత్తే సమస్యల్ని ముందుగా గుర్తిస్తే పరిష్కరించుకోవడం సులభమవుతుంది. వ్యక్త పరచడంలో వ్యత్యాసం ప్రదర్శించడం, అణుచుకోవడం, నిశ్శబ్దమైపోవడం ఇవన్నీ కోప వ్యక్తీక రణలే. ఉద్రేకంగా కాకుండా దృఢంగా కోపాన్ని వ్యక్తపరచడం ఆరోగ్యకరమైన పద్ధతి. ఇతరులను బాధించకుండా ఈ మానవసహజమైన భావోద్వేగాన్ని చూపాలి. ఇలా ఉండడమంటే మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. ఎదుటివార్ని గౌరవిస్తూ మన గౌరవాన్ని నిలబె ట్టుకోవడం. కోపం వల్ల కలిగే అలోచనను పుట్టకుండానే చంపేయనక్కర్లేదు. అలా చేయకూడదు కూడా. దాని ప్రభావం వల్ల కలిగే ఉద్రేకపూరితమైన ఆలోచనని కలగనిచ్చి దానితో పాటు స్వీయ వివేకంతో వెంటనే మరో మంచి ఆలోచనకి చోటివ్వడం అవసరం. అలాగే లాజిక్‌గా ఆలోచించే అలవాటు కోపాన్ని ఓడిస్తుంది. విభిన్నరకాలుగా ఆలోచించడం ద్వారా ఆగ్రహం కారణంగా ఉత్పన్నమైన పరిస్ధితులు మరింత జటిలం కాకుండా చేసుకోవచ్చు. ‘నేను కేవలం జీవితంలోని కొన్ని అననుకూలతలను అనుభవిస్తున్నానంతే’ అనే విషయాన్ని ఎపుడూ గుర్తుంచుకుంటే, ఆలోచనాధోరణిలో ఇలాంటి మార్పు చేర్పులు తెచ్చుకుంటే సమయోచిత ప్రవర్తనకు అది దోహదం చేస్తుంది. ‘నాకిదే కావాలి’ అనుకోవడానికి భిన్నంగా ‘ అదుంటే బాగుంటుంది’ అనే ధోరణికి మళ్లాలి. వదిలించుకునే దారి ఉంది ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందనేది నిజమే. అయితే సమస్యకు పరిష్కారం వెదకడం పైన మాత్రమే దృష్టి పెడితే అది ఆలస్యం అయి మరింత కోపానికి గురవ్వడం జరగొచ్చు. పరిష్కారం వెతకడం ముఖ్యమే. అయితే ముందు దానివల్ల ఏర్పడిన పరిస్ధితిని మ్యానేజ్ చేయడం మరింత ముఖ్యం. కోపిష్టి మనస్తత్వం ఉన్న వాళ్లు ఒక్కసారిగా ముగింపులోకి గెంతుతారు. వీరిచ్చే ముగింపులు కొన్నిసార్లు చాలా అనుచితమైనవి అవుతాయి. ఏదైనా వేడి వాదనల్లో ఉన్నపుడు నొటికొచ్చినదేదో అనేయకుండా పర్యవసానాల్ని ముందే అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని ఎంత సావధానంగా, శ్రద్ధగా, నిదానంగా, ప్రశాంతంగా వినగలిగితే అంత చక్కగా అర్ధంచేసుకుని అంతే సబబుగా ప్రతిస్పందించగలుగుతారు. సమాధానం ఇవ్వడానికి సమయం తీసుకోవడంలో తప్పులేకపోగా అది అవసరం కూడా. సో.. లెట్స్ సే గుడ్ బై టు యాంగర్. - ఎస్. సత్యబాబు, సాక్షి లైఫ్‌స్టైల్ ప్రతినిధి నవ్వితే కోపం హుష్‌కాకి సిల్లీగా అన్పించే చాలా విషయాలు అనూహ్యమైన రీతిలో ఆగ్రహావేశాలకు చెక్ చెప్తాయి.ఉదాహరణకు మీరు మీ కొలీగ్‌పై అంతులేని కోపంతో ఉన్నపుడు మీకు బాగా నవ్వు తెప్పించే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఎవరిదైనా బల్లమీద తల పెట్టి నిద్రపోయే స్వభావం కావచ్చు, సెల్ఫోన్లో మాట్లాడుతూ గూని వచ్చినట్టు వంగిపోయే భంగిమ కావచ్చు. ఇలాంటివే ఏదో ఒకటి గుర్తు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిక్‌నేమ్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి. చిన్న నవ్వు నవ్వితే బోలెడంత కోపం కూడా ఇట్టే ఎగిరిపోతుంది అనేది తెలిసిందే కదా. దీన్ని మీరు ముందునుంచే ప్రాక్టీస్ చేయండి. కోపం స్పీ.. డ్డ్డ్గా.. వస్తే..!! సుదీర్ఘ శ్వాస తీసుకొని, వదలాలి. ఇలా కనీసం 5-6 సార్లు అయినా చేయాలి. వేగంగా నడవాలి. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ చేయాలి. పది నుంచి ఒకటి వరకు లెక్కపెట్టాలి. ఇలా రెండు మూడు సార్లు చేయవచ్చు. ‘నాదే కరెక్ట్... ఎదుటివారిదే తప్పు’ అనే భావన నుంచి బయటకు రావాలి. కోపానికి - ప్రవర్తనకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లోనే తమకు తాము సర్దిచెప్పుకోవాలి. కోపం తరచూ వస్తుందా?! సామాజిక బంధాలను పెంచుకోవాలి. అందుకు ఎక్కువమందితో స్నేహాలు చేయడం వల్ల మానసిక పరిణతి పెరుగుతుంది. కోప స్వభావం తగ్గుతుంది. అనవసర వాదన వల్ల కోపం స్థాయి పెరుగుతుంది అనిపిస్తే దాన్నుంచి తప్పుకోవాలి. వారానికి ఒకసారి ఒంటరిగా కాసేపు కూర్చొని ‘ఈ వారంలో ఎన్ని సార్లు కోపం వచ్చింది, ఏయే సందర్భాలలో వచ్చింది?’ అంటూ సమీక్షించుకోవాలి. ఆత్మ పరిశీలన ఎప్పుడూ అనవసర కోపాలను కంట్రోల్లో ఉంచుతుంది. సన్నిహితులతో తమ భావావేశాలను వెలిబుచ్చుకోగలగాలి. - డాక్టర్ చెరుకూరి రమణ, సైకియాట్రిస్ట్ చిన్న చిన్న కోపాలు... రోజూ అదే ట్రాఫిక్. భరించలేని రద్దీ. ఆ రూట్లో ప్రయాణం చెయ్యడం మీకు చాలా చిరాకుగా అన్పిస్తోంది. వెంటనే అంతగా రద్దీ లేని దారిని ఎంచుకోవాలి. మరికొంత దూరం పెరిగినా సరే. అది మీకు మానసికంగా ఇచ్చే లాభంతో పొలిస్తే అది ఏపాటి కోపం పరిధి దాటి వ్యక్తిగత సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టుగా ఉంటే సైకాలజిస్ట్‌లు, మానసిక ఆరోగ్య నిపుణులు సహకరిస్తారు. చాలా కేసులలో 8 - 10 వారాలలో కోప స్వభావాన్ని తగ్గించవచ్చని వారు చెప్తున్నారు. -
బాష్రాడార్ టెక్నాలజీతో ’సేఫ్టీ డ్రైవ్’
-
బీ కంట్రోల్
పొద్దున్నే ప్రశాంతంగా నిద్రలేస్తాం! నిన్నటి చిరాకునంతా మరిచి అద్దంలోకి ముఖం చూసి ఈరోజు బాగుండాలని కోరుకుంటాం. బయటికి రాగానే న్యూస్ పేపర్ ఇంకా రాదు! అబ్బా అని అసహనం మొదలవుతుంది. అయినా ఓపికగా పేపర్ బాయ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి.. అతగాడు వచ్చాక.. ఇంత లేటేంటని కసురుకుంటేగానీ ఆత్మారాముడి అసహనం తగ్గదు. కాఫీలో షుగర్ తక్కువైందని ఓసారి.. ఉప్నాలో ఉప్పు ఎక్కువైందని మరోసారి ఇల్లాలిని కసిరి.. రోడ్డు మీదికి వచ్చిపడతాం. రోడ్డెక్కగానే ‘జర దేఖ్కే చలో భాయ్!’ అని ఓ హెచ్చరిక. పక్క వాడి డ్రైవింగ్, మన డ్రైవింగ్ రెండూ మనమే చేస్తుండగా వచ్చిన ఆ హెచ్చరిక చిరాకు తెప్పిస్తుంది. ‘నువ్వే చూసుకుని నడవరా’ అని అనాలనిపిస్తుంది! మన లోపలి మనిషి ‘కంట్రోల్’ అని హెచ్చరిస్తాడు! సిగ్నల్ వరకూ రాగానే అప్పటిదాకా పచ్చగా వెలిగిన లైట్ ఎర్రగా మారి మనవైపు వెక్కిరించినట్టు చూస్తుంది. ముందు వెహికిల్స్ కదలవు! వెనుక నుంచి హారన్స్ మోత. పైన ఎండ, ఒంటిపై చెమట.. చిరాకు రెట్టింపవుతుంది. ముందున్న బైక్ వాడిపై మనసులో గొణుగుతూ.. వెనుకున్న బండి వైపు కోపంగా చూస్తాం. మనది బైక్ అయ్యి.. వెనుకున్నది కార్ అయితే ఆ కోపం ఇంకాస్త ముదురుతుంది. ఆఫీస్‌కు లేటవుతుంటే బాస్ గుర్తొస్తాడు. ఆ టైమ్‌లో ఎవరైనా కదిలిస్తే కస్సుమనాలనిపిస్తుంది. కానీ లోపల ఉన్న బుద్ధిమంతుడు ‘కంట్రోల్ రే’ అంటూ భుజం తడతాడు. ఆఫీస్కొచ్చాక మన పార్కింగ్ ప్లేస్‌లో మరొకరి వెహికిల్ కనిపిస్తుంది.. క్షణాల్లో నియంత్రణ కోల్పోతాం. నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తుంది! ఎంతైనా సావాసగాడని గుర్తొచ్చి మరోసారి కంట్రోల్ అనుకుంటాం! సాయంత్రం ఇంటికెళ్లేముందు టార్గెట్ పూర్తవలేదని బాస్ చివాట్లు పెడతాడు! చెడామడా నాలుగు మాటలు అనేయాలనిపిస్తుంది. ప్చ్.. భక్తితో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవమేదో ‘కంట్రోల్... కంట్రోల్’ అని హెచ్చరిస్తుంది! మళ్లీ ట్రాఫిక్‌లో చచ్చీ చెడీ.. ఇంటికి చేరుకున్నాక.. ‘ఇది నిండుకుంది’ అని గృహమంత్రి, ‘నాన్నా నేను చెప్పిన బుక్ తెచ్చావా..?’ అని కూతురో, కొడుకో అడగ్గానే.. పొద్దంతా లోపల రగిలిన లావా బయటికి తన్నుకొస్తుంది! ఇంట్లోవాళ్ల మీద ఇంతెత్తున లేస్తాం! సదరు గొడవలన్నీ రోజూ ఉండేవే.. ఇలా చిన్న చిన్న విషయాలకు చిరాకు పెంచుకుంటూ సహనాన్ని కోల్పోతే.. మానసిక ప్రశాంతత దూరమై బీపీ, షుగర్స్ దరి చేరుతాయే తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఈ సహనోపాఖ్యానం ఎందుకంటే ఈ రోజు ‘వరల్డ్ ఐయామ్ ఇన్ కంట్రోల్ డే!’ కాబట్టి... ‘బి ఇన్ కంట్రోల్ ఎవ్రీ డే’ అండ్ సే ‘ఐయామ్ ఇన్ కంట్రోల్’! ..:: కట్ట కవిత -
నియంత్రణ ఎత్తేయడం న్యాయమా?!
కీలెరిగి వాత... వీలెరిగి చేత అంటారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడిగా, ఆర్థికవేత్తగా ఎన్ని భుజకీర్తులున్నా మన్మోహన్సింగ్ చేయ సాహసించని పనిని ఎన్డీయే సర్కారు సునాయాసంగా పూర్తిచేసింది. కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు పూర్తయిన వెంటనే డీజిల్ ధరలపై ఉన్న నియంత్రణను ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో ఏడాదికి గానీ ‘ఎన్నికల బాదరబందీ’ లేకపోవడం...అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పల్టీలు కొడుతుండటం గమనించి చేయదల్చుకున్న పనికి ఇదే సరైన అదునని భావించింది. ఈ నిర్ణయంవల్ల సామాన్యులపై ఎలాంటి భారమూ పడబోదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో వాస్తవం లేకపోలేదు. కనీసం ఇప్పటికైతే అది నూటికి నూరుపాళ్లూ నిజం. సామాన్యులపై భారం పడలేదు సరిగదా... అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా డీజిల్ లీటర్‌కు రూ. 3.37 తగ్గింది కూడా. కనుక నియంత్రణ ఎత్తేయడంపై పెద్దగా వ్యతిరేకతలు, నిరసనలు కూడా వ్యక్తంకాలేదు. అయితే, ఇలా నియంత్రణ ఎత్తేయడమనే చర్య పర్యవసానాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగానే ఉంటాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణి గాక ముడి చమురు ధర ఎప్పటిలా ఆకాశాన్నంటితే...దానికి అనుగుణంగా పెరిగే డీజిల్ ధరను తట్టుకోవడం సామాన్యులకు అసాధ్యమవుతుంది. అసలు యూపీఏ ప్రభుత్వమే డీజిల్‌పై నియంత్రణను ఎత్తేయాలనుకుని ఆ పనిని ఒకేసారి చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో వాయిదాల పద్ధతిలో అమలుకు నిరుడు జనవరిలో ద్వారాలు తెరిచింది. సబ్సిడీ పూర్తిగా తొలగేవరకూ నెలకు లీటర్‌కు అర్థరూపాయి చొప్పున పెంచుకుంటూ పోవాలని తీర్మానించింది. అందుకనుగుణంగా డీజిల్ ధర ఇప్పటికి 19సార్లు పెంచింది. ఇలా లీటర్‌కు మొత్తం మీద రూ. 9.50 పెరిగింది. పెట్రో ధరల నియంత్రణ వ్యవహారం ఆదినుంచీ రాజకీయ చట్రంలో పడి నలుగుతున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకొచ్చాక మరో మాట మాట్లాడటం ప్రధాన రాజకీయ పక్షాలకు అలవాటుగా మారింది. వాజపేయి సర్కారు 2002లో నియంత్ర ణను ఎత్తివే స్తున్నట్టు ప్రకటించగానే అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ విరుచుకుపడింది. తాను అధికారంలోకొచ్చాక 2004లో మళ్లీ నియంత్రణను అమల్లోకి తెచ్చింది. కానీ, 2010లో తిరిగి ఎన్డీయే బాటలోనే వెళ్లింది. పెట్రోల్ ఒక్కదానిపైనా నియంత్రణ ఎత్తేస్తున్నామని, సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉండే డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ జోలికి వెళ్లడంలేదని చెప్పింది. తీరా నిరుడు జనవరిలో డీజిల్‌పై ‘పాక్షికంగా’ నియంత్రణ ఎత్తేస్తున్నామని చిదంబరం ప్రకటించారు. అయితే ఇది కేవలం ‘చిన్న చిన్న సవరణలు’ చేసుకోవడానికి చమురు సంస్థలకిచ్చిన అనుమతి మాత్రమేనని సర్దిచెప్పారు. ఈ ‘చిన్న చిన్న సవరణల’ పర్యవసానమేమిటో ఏడాదిన్నర వ్యవధిలోనే లీటర్‌కు అదనంగా రూ. 9.50 చెల్లించవలసి వచ్చాక సామాన్యులకు అర్థమైంది. ఇప్పుడిక ఎన్డీయే వంతు వచ్చింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు పడిపోతున్న ప్రస్తుత తరుణంలోనే డీజిల్‌పై కూడా నియంత్రణను వదులుకోవాలని నిర్ణయించింది. గత మూడు నెలలుగా ముడి చమురు ధర ఎన్నడూ లేనంతగా పతనమైంది. 105 డాలర్లున్న బ్యారెల్ చమురు ధర 83 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 7 వరకూ తగ్గింది. సంపన్నులు వాడే కార్లలో అధికభాగం డీజిల్వే కావడంవల్ల దానికిస్తున్న సబ్సిడీ వృథా అవుతున్నదని మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వంటి ఆర్థిక నిపుణులు బాధపడతారు. అయితే, డీజిల్ పాత్ర అంతకన్నా కీలకమైనది. దేశంలో నిత్యమూ ఒకచోటునుంచి మరో చోటుకు నిత్యావసరాలను చేరవేసే వాహనాలన్నీ డీజిల్‌తో నడిచేవే. డీజిల్ ధర ఏ కొంచెం పెరిగినా అదంతా నిత్యావసరాల ధరలపై ప్రభావాన్ని చూపి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. సామాన్యుల ఆదాయంలో సగభాగం ఆహారావసరాలకు ఖర్చవుతుందంటారు. అలా చూసుకుంటే అధిక ధరల ప్రభావం వారిపై ఎంతగా పడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెట్రో ధరలు పెంచే ప్రతిసారీ అందుకు అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపడం మన పాలకులకు అలవాటైన విద్య. అయితే, మన పొరుగునున్న పాకిస్థాన్ తదితర దేశాలతో పోల్చినా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉంటాయి. ఎక్కడా లేనివిధంగా పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఇందుకు కారణం. పెట్రోల్‌పై 50 శాతంవరకూ, డీజిల్‌పై 36 శాతంవరకూ విధిస్తున్న పన్నుల ద్వారా ప్రభుత్వాలకు వార్షికంగా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నది. ఈ స్థితిని హేతుబద్ధం చేయాల్సివున్నదని గతంలో రంగరాజన్ కమిటీ నివేదిక స్పష్టంచేసింది. తమ ఆదాయ వనరుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఒకే ఒక్క రంగంపై ఇంతగా ఆధారపడటం మంచిదికాదని చెప్పింది. దిగుమతి చేసుకునే ముడి చమురుపై దాని అసలు ధరకు పన్నులను చేర్చి చమురు సంస్థలకు అమ్ముతున్నది కేంద్రమే. చమురు సంస్థలకు ఇలా ధర పెంచి అమ్ముతూ ప్రజలకు మాత్రం ఫలానా రేటుకు మించి అమ్మరాదని ఇన్నాళ్లూ ఆంక్షలు పెట్టిందీ కేంద్రమే. నష్టాలొస్తున్నాయని ఆ సంస్థలు మొత్తుకుంటే...దాన్ని సాకుగా చూపి నియంత్రణ ఎత్తివేస్తున్నదీ వారే. ఇలా సంక్లిష్టంగా తయారైన చమురు ధర పెంపు ప్రక్రియను హేతుబద్ధీకరిస్తే, అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని వృథా వ్యయం అరికడితే చమురు సంస్థలకు వచ్చే నష్టాలు అదుపులోకొస్తాయి. ఎన్డీయే సర్కారు ఈ కోణంలో ఆలోచించకపోవడం దురదృష్టకరం. -
బాబు కెబినెట్లో ''చినబాబు'' చిచ్చు