డెంగీ నివారణకు చర్య తీసుకోవాలి
నకిరేకల్:
డెంగీ వ్యాధి నివారణకు చర్య తీసుకోవాలని కోరాతూ ప్రజాపోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లేట్‌లెట్స్ పరీక్షలు చేసే సెల్ కౌంటర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇటీవల కాలంలో నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో డెంగీ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఆస్పత్రిలో జ్వర పీడిత రోగులను పరామర్శించారు.రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతూ ప్రధాన వైద్యాధికారి ఎండి.రఫీ, క్లస్టర్ ఇన్‌చార్జి వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ సమితి నాయకులు గోపిరెడ్డి శ్యామ్ సుందర్‌రెడ్డి, రుద్రవరం నర్సింహ్మ, కొండ గూడురు సత్యనారాయణచారి, కుమార్, మహేశ్వరం సుధాకర్,మేకల సైదులు, కురుమిల్ల పర్శరామ్, పట్టేటి ప్రసాద్, పర్నాటి సీతారామిరెడ్డి, రమేష్ ఉన్నారు.