- వైద్యులు, సూపర్‌వైజర్ల నియామకం
- డీఎంఅండ్ హెచ్‌వో చంద్రయ్య
ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు చర్యలు
Published Thu, Aug 18 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
చింతూరు:
ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు డీఎం అండ్ హెచ్‌వో కె.చంద్రయ్య తెలిపా రు. గురువారం ఆయన చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇటీవలే 10 మంది వైద్యులను నియమించినట్లు తెలిపారు. విలీన మండలాల్లోని తొమ్మిది పీహెచ్‌సీలకూ ఇద్దరు చొప్పున సూపర్‌వైజర్‌లను మైదాన ప్రాం తం నుంచి డిప్యుటేషన్‌పై నియమించామన్నారు. వారు క్షేత్రస్థాయిలో మలేరియా కేసులను స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పా రు. వీరికితోడు దోమల నివారణ, యాంటీ లార్వా చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సబ్‌యూనిట్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చూస్తున్నామని, ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇటీవల హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయన్నారు. విద్యార్థులకు జ్వరం వస్తే ఇళ్ళకు పంపివేయకుండా ఆసుపత్రులకు పంపి పరీక్షలు నిర్వహించాలని హాస్టళ్ల సిబ్బందికి సూచించారు. హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను వార్డెన్, ఏఎన్‌ఎంలకు అప్పగించినట్లు తెలిపారు. జ్వరాల నియంత్రణకు ఏజెన్సీలో 104 వెళ్లలేని గ్రామాల్లో 650 వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, లక్ష్మీపురం పీహెచ్‌సీల సిబ్బందితో సమావేశం నిర్వహించి మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అడిషనల్ డీఅండ్‌హెచ్‌వో పవన్‌కుమార్, డీఎంవో ప్రసాద్, ఎస్పీహెచ్‌వో సుబ్బమ్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement