Malaria
-
వైరస్ల పనిపట్టే కృత్రిమ ప్రోటీన్.. పరిశోధకుల కీలక విజయం
పరమాణువులపై పరిశోధన చేస్తున్న ఢిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. ముందులకు లొంగకుండా వైరస్లు ‘వ్యాధి నిరోధకత’ను సంతరించుకుంటున్న పరిస్థితికి చెక్‌పెట్టే దిశగా పరిశోధకులు కీలక విజయం సాధించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఒక పరిశోధనలో జేఎన్‌యూ సైంటిస్టులు హెచ్ఎస్పీ70 అనే మానవ ప్రోటీన్‌ను కనుగొన్నారు. మానవల్లో కోవిడ్, మలేరియా వంటి వైరస్ కారక వ్యాధులు ప్రబలడంలో హెచ్ఎస్పీ70 కీలకపాత్ర పోషిస్తోందని గుర్తించారు. వ్యాధికారక వైరస్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి హెచ్ఎస్పీ70 ప్రోటీన్ పరోక్షంగా సాయపడుతుంది. వ్యాధికారక ప్రోటీన్ జాడ తెలియడంతో ఈ ప్రోటీన్ చర్య, అభివృద్ధిని కట్టడిచేసే మరో ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధిచేశారు. జేఎన్‌యూలో స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసన్ విభాగ అధ్యయనకారులు ఈ కృత్రిమ ప్రోటీన్‌ను అభివృద్ధిచేశారు. ఇది హెచ్ఎస్పీ70 పనితీరును క్షీణింపజేస్తుంది. దాంతో అది వ్యాధికారక వైరస్‌లకు పూర్తిస్థాయిలో సాయపడటంతో విఫలమవుతుంది. దాంతో మానవశరీరంలో వ్యాధి విజృంభణ ఆగుతుంది. చికిత్సకు, మందులకు లొంగకుండా వైరస్ కనబరిచే ‘వ్యాధినిరోధకత’సామర్థ్యమూ తగ్గుతుంది. హీట్షాక్ ప్రోటీన్ హీట్షాక్ ప్రోటీన్‌కి పొట్టిరూపమే హెచ్ఎస్పీ. వ్యాధికారక వైరస్ ప్రబలినప్పుడు కణాల్లో అవి క్షణాల్లో రెండింతలు, మూడింతలు, ఇలా కోట్ల రెట్లు పెరిగేందుకు హెచ్ఎస్పీ ప్రోటీన్ సాయపడుతుంది. శరీరాన్ని వేడెక్కేలా చేసి వైరస్ల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైరస్ తనలాంటి లక్షలాది వైరస్‌లను తయారుచేయడంలో, అచ్చం అలాగే ఉండటంలో, రెట్టింపు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా హెచ్ఎస్పీ ప్రోటీన్ చూసుకుంటుంది. ఇంతటి కీలక ప్రోటీన్ జాడను కనిపెట్టి జేఎన్‌యూ పరిశోధకులు ఘన విజయం సాధించారు. ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత బయోలాజికల్ మైక్రోమాలిక్యూల్స్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ కారక సార్స్ కోవ్–2 వైరస్‌లోని కొమ్ములతో, మానవ కణంలోని ఏస్2 గ్రాహకాలకు మధ్య హెచ్ఎస్పీ అనుసంధానకర్తలా వ్యవహరిస్తోందని పరిశోధనలో తేలింది. కణాల్లోకి వైరస్ చొరబడాలంటే ఏస్2 రిసెప్టార్లదే కీలక పాత్ర. హెచ్ఎస్పీను నిలువరించడం ద్వారా వైరస్ల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోగలిగామని జేఎన్‌యూ ప్రొఫెసర్లు ఆనంద్ రంగనాథన్, శైలజా సింగ్ చెప్పారు.‘‘హెచ్ఎస్పీని అడ్డుకునేలా పీఈఎస్–సీఐ అనే కొత్త ప్రోటీన్‌ను అభివృద్ధిచేశాం. దీనిని సార్స్–కోవ్2 సోకిన కణాల్లోకి జొప్పించాం. దీంతో సార్స్–కోవ్2 కణాల రెట్టింపు ప్రక్రియ గణనీయస్థాయిలో మందగించింది. సాంప్రదాయక ఔషధాలు నేరుగా వైరస్‌లపై దాడిచేస్తాయి. కానీ వైరస్‌లకు ఆతిథ్యమిచ్చే కణాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి కొత్తరకం విధానాల ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం ముగియడంతో జనం దాదాపు కరోనా గురించి మర్చిపోయారు. కానీ పరిశోధనా ప్రపంచం ఎప్పుడూ రాబోయే కొత్తరకం వైరస్ల గురించి అప్రమత్తంగానే ఉంటుంది’’అని పరిశోధకులు అన్నారు.చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ ప్రమోద్ గార్గ్, పీహెచ్డీ స్కాలర్ ప్రేరణ జోషి సైతం ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చి విజృంభించే కొత్త రకం వైరస్ల కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రేరణజోషి అన్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు శాస్త్రసాంకేతి రంగం ఏ స్థాయిలో నూతన చికిత్సా విధానాలు, ఆవిష్కరణలతో సంసిద్ధంగా ఉండాలనే అంశాన్ని తాజా పరిశోధన మరోసారి నిరూపిస్తోంది. -
మలేరియా వచ్చిందని నా దగ్గరకు ఎందుకొచ్చావయ్య! వెళ్లి మళ్లీ ఆ దోమలతోనే కుట్టించుకో పోతుంది!
-
రాష్ట్రానికి చలిజ్వరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ మొదలు ఏజెన్సీ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. ఏ ఆస్పత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో ఔట్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కిక్కిరిసిపోతున్న పెద్దాస్పత్రులు ⇒ హైదరాబాద్‌లోని ఒక్క ఫీవర్ ఆస్పత్రికి ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన జ్వరాల బాధితులు 12,080 మందికావడం ఆందోళనకరం. నాలుగైదు రోజులుగా రోజూ 800 వరకు ఔట్ పేషెంట్లుగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ జ్వర సంబంధ సమస్యలతో సుమారు 700 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ⇒ ఇక చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్‌కు సోమవారం 1,600 మంది ఔట్ పేషెంట్లుగా నమోదుకాగా.. ఇందులో చలి కారణంగా ‘న్యుమోనియా’వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్ పేషెంట్లుగా 1,300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ⇒ ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం జనరల్ మెడిసిన్ కింద వైద్యం కోసం వచ్చిన ఔట్పేషెంట్లు 290, ఇక గాంధీ ఆస్పత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన ఔట్ పేషెంట్ల సంఖ్య 35,547. అంటే సగటున ప్రతీరోజు 1,500 మంది వస్తున్నారు. ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతీరోజు 300 నుంచి 500 మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు. ⇒ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రతీరోజు 50కి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఉట్నూరు ఐటీడీఏ, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట మన్ననూరు, కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కానీ చాలా మంది గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గరే సొంత వైద్యం చేసుకుంటున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. తగ్గిన డెంగీ, చికున్‌గున్యా... ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు.. నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. డెంగ్యూ కేసులు సెప్టెంబర్, అక్టోబర్‌లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,500కు పైగా డెంగీ కేసులు నమోదవగా..సెపె్టంబర్లో 1,542, అక్టోబర్‌లో 854 కేసులు ఉన్నాయి. ఈ నెలలో 22వ తేదీ వరకు 168 కేసులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇక చికున్‌గున్యా కేసులు సెప్టెంబర్‌లో 183, అక్టోబర్‌లో 13 నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 13 కేసులే వచ్చాయని వివరిస్తున్నారు. మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి... కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది. దీని కారణంగా న్యుమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఇబ్బందిపడుతున్న వారు అధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది కూడా. చలితో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.ఈ చిత్రంలోని తల్లీకొడుకులు ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామానికి చెందినవారు. తల్లి మిరియాల రాజమ్మకు వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, కుమారుడు అనుపాల్కు టైఫాయిడ్. ఇద్దరూ ఇప్పుడు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి పెరగడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.చలిజ్వరంతో బాధపడుతున్నా..చలి, తీవ్ర జ్వరం, కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా దవాఖానాకు వచ్చిన. డాక్టర్లు పరీక్షించి వార్డులో చేర్చుకున్నారు. పొద్దున, సాయంత్రం వచ్చి చూస్తున్నారు. కొంచెం నయమైంది. – తూడి సోమక్క, వనపర్తి, లింగాల గణపురంశ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో 2,350 మంది ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చారు. అందులో 80 మంది జ్వరాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల టెస్టులు చేయడానికి ఎక్స్‌రే, ఈసీజీ, ట్రెడ్మిల్, టూడీ ఈకో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సరిపడా టెక్నీíÙయన్స్ లేక అన్ని టెస్టులు ఒక్కరే చేస్తున్నారు. సరిపడా మందులు ఉన్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీయడం లేదు. – డాక్టర్ గోపాలరావు, జిల్లా వైద్యాధికారి, ములుగుసీజనల్ వ్యాధులతో జాగ్రత్త శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి గాలిలో తిరగవద్దు. బయటికి వెళ్లినప్పుడు మాసు్కలు ధరించడం మంచిది. వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి -
Telangana: రాష్ట్రవ్యాప్తంగా 'జోరు వాన'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి, చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. ఆదివారం విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్లు శనివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరలో 16.38, బోమన్‌దేవిపల్లిలో 13.75, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 12.35, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 10.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల 5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మొత్తంగా శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2.33 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సీజన్ సగటులో అధిక వర్షపాతం నైరుతి సీజన్లో ఆగస్టు చివరినాటికి రాష్ట్రంలో 57.59 సెం.మీ. సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 66.37 సెం.మీ. కురిసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలన్నీ సాధారణ వర్షపాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వానలు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్లలోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఏకబిగిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన పుట్ట మహేశ్ (17) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుతో మృతి చెందాడు. ⇒ ములుగు జిల్లా జగ్గన్నగూడెం సమీపంలోని బొగ్గులవాగు, పస్రా–ఎస్ఎస్ తాడ్వాయి మండలాల మధ్య జలగలంచవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పస్రా– తాడ్వాయి మధ్య కొండపర్తి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల వాగు ఉప్పొంగడంతో.. వందల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఖమ్మం జిల్లా మధిర పట్టణం జలదిగ్బంధమైంది. బస్సులు, వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. భారీ వర్షాల నేపథ్యంలో హుటాహుటిన మధిరకు బయలుదేరారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు–పెగళ్లపాడు మధ్య రహదారిపై చేరిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడి నక్కలవాగులో భవానిపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు(19) గల్లంతయ్యాడు. ⇒ కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా రాజాపేటలో, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా బండగొండలో ఇద్దరు యువకులు వాగులో పడి కొట్టుకుపోగా.. స్థానికులు గమనించి కాపాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభి, వర్నె వాగు ఉధృతంగా పారుతున్నాయి. జడ్చర్లలో ఏరియా ఆస్పత్రి జలదిగ్బంధమైంది వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం దావాజీపల్లి సమీపంలో కేఎల్ఐ కాల్వకు గండిపడటంతో పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెనచర్లలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ⇒ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటాద్రినగర్ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. అధికారులు ప్రజలను జేసీబీ సహాయంతో వాగును దాటిస్తున్నారు. గ్రేటర్ సిటీకి ముసురు హైదరాబాద్ మహానగరానికి ముసురు పట్టింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీనితో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. లో తట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. హై దరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. విస్తారంగా వానలతో హిమాయత్‌నగర్, గండిపేట జంట జలాశయాల్లోకి వరద పెరిగింది. దీ నితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో శనివారం ఆయన సీఎస్‌తో సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాల గేట్లు ఎత్తేసే నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అన్ని జిల్లా కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని.. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారిని నియమించి.. జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పరిస్థితికి అనుగుణంగా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.బొగత జలపాతం సందర్శన నిలిపివేత వాజేడు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేంజర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మళ్లీ ఎప్పుడు అనుమతిస్తారనేది మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు.సీజనల్ వ్యాధులపై జాగ్రత్తవైద్య సిబ్బందికి మంత్రి దామోదర సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి. -
జ్వర భద్రం
డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇంతకుముందులా కాకుండా ‘మిక్స్డ్ ఇన్ఫెక్షన్ల’తో జనాల ఆరోగ్యాన్ని నిలువునా పీలి్చపిప్పిచేస్తోంది. రెండు, మూడు రకాల వైరస్లు సోకుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. జ్వరంతోపాటు తీవ్ర నీరసం, ఒళ్లంతా నొప్పులతో.. కనీసం బెడ్‌పై నుంచి లేచి నడవలేనంతగా బాధపెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే తగిన వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ‘నిలువు దోపిడీ’ సమరి్పంచుకోలేక.. శారీరకంగానే కాదు, మానసికంగానూ జనం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషజ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతున్నా, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం జ్వరాలతో మంచాన పడింది. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. పెరుగుతున్న డెంగీ తీవ్రత రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే జరుగుతోంది. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 6,051 డెంగీ కేసులు, 164 చికున్‌గున్యా కేసులు, 197 మలేరియా కేసులు నమోదయ్యాయి. కానీ లెక్కలోకి రాని కేసులు భారీ స్థాయిలో ఉన్నాయనే అంచనా. ముఖ్యంగా డెంగీ దడ పుట్టిస్తోంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే ఏకంగా 3,317 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 1,267 కేసులు, నల్లగొండ జిల్లాలో 276 కేసులు, ఖమ్మం జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరిగినా.. అధికారికంగా నమోదవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలదాకా వసూళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు వసూలు చేస్తున్నాయని డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులు వాపోతున్నా రు. ముఖ్యంగా డెంగీ వచ్చి ఆస్పత్రిలో చేరితే చాలు.. పరిస్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చికిత్సల కోసం వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిక్కడంలో వైద్యశాఖ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణ, బాధితులకు చికిత్స అందించడంపై దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దడంపై ఫోకస్ చేస్తున్నా.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రికార్డు స్థాయిలో రోగులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,680 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. హైదరాబాద్‌లోని ఉస్మానియాకు 2,566 మంది, గాం«దీకి 2,192 మంది, వరంగల్ ఎంజీఎంకు 2,385 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. ఓపీ నమోదైంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.ప్లేట్లెట్స్ టెస్టు కోసం బయటికి.. నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో మూడు రోజులుగా వైద్యం తీసుకుంటున్నా. నా భర్తకు కూడా జ్వరమే. ఆస్పత్రిలో ప్లేట్లెట్ టెస్ట్ చేసే సదుపాయం లేదని టెస్టుల కోసం బయటికి పంపించారు. – కె.లక్ష్మీతిరుపతమ్మ, సత్తుపల్లి మందులు సరిగా ఇవ్వడం లేదు నేను నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. వైద్యులు పారాసెటమాల్ 650 ఎంజీ మాత్రలు రాశారు. కానీ సిబ్బంది 500 ఎంజీ మాత్రలు, అదీ రెండు రోజులకు సరిపడానే ఇచ్చారు. 650 ఎంజీ మాత్రలు బయట కొనుక్కోవాలని చెప్పారు. – మశమ్మ, నాగర్కర్నూల్మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావంసీరో టైప్–1, 2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్.. కోవిడ్ వచ్చి తగ్గినవారిలో నీరసం మరింత ఎక్కువఅడిషనల్ డీఎంఈ రాజారావు వెల్లడి ‘‘ఏ వైరల్ జ్వరం అయినా వీక్నెస్ ఉంటుంది. కోవిడ్ వచి్చపోయిన వారిలో నీరసం మరింత ఎక్కువగా ఉంటోంది. వైరల్ జ్వరం వచ్చిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. డెంగీలో సీరో టైప్–2 అనేది మన వద్ద ఎక్కువగా వ్యాపిస్తోంది. మిగతా డెంగీ వేరియంట్ల కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తీవ్రత మరింత పెరుగుతుంది. ఎవరికైనా సీరో టైప్–1 డెంగీ ఒకసారి వచి్చ, రెండోసారి సీరో టైప్–2 వస్తే.. మొదటిదాని యాంటీబాడీస్, రెండో టైప్ ఇన్ఫెక్షన్ క్రాస్ రియాక్షన్ వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇక డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం కంటే.. ప్లాస్మా లీకేజీ చాలా ప్రమాదకరం. రక్తంలోని నీరు రక్తనాళాల నుంచి లీక్ అవడమే ప్లాస్మా లీకేజీ. దీనివల్ల పల్స్, బీపీ పడిపోవడం, తర్వాత తీవ్ర కడుపునొప్పి, వాంతులు రావడం, చెమటలు పట్టడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, అవయవాలు విఫలమయ్యే కూడా వెళ్తుంది. అయితే వంద మందికి డెంగీ వస్తే.. అందులో ఐదుగురికి మాత్రమే ప్లాస్మా లీకేజీ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం సాధారణ లక్షణమే. చాలా మందిలో వాటంతట అవే పెరుగుతాయి. ఒకవేళ రక్తస్రావం జరుగుతున్నా, 20 వేలకన్నా తక్కువకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయినా.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్ టెస్టులను పెథాలజిస్ట్ చూసి నిర్ధారించాలి. మిషన్‌లో లెక్కిస్తే.. ఉన్నదానికంటే తక్కువగా చూపించే చాన్స్ ఉంటుంది. – ప్రొఫెసర్ ఎం.రాజారావు, అడిషనల్ డీఎంఈఏ ఆస్పత్రిలో చూసినా అవే సమస్యలు.. ⇒ మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు పీహెచ్సీలలో మందుల కొరత ఉంది. అన్ని రకాల యాంటీ బయాటిక్స్ అందుబాటులో లేవు. జలుబు సిరప్, కంటి చుక్కల మందులు, క్లేవమ్ వంటి మందులు కూడా లేవు. ఇంజక్షన్లు అందుబాటులో లేవు. వైద్యులు ఐదారు రకాల మందులు రాస్తే వాటిలో రెండు, మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో జ్వరం, ఇతర జబ్బులకు కేవలం రెండు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. ⇒నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. వారం రోజులకు మందులు రాస్తే.. మూడు రోజుల మందులే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు లేకపోవడంతో బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ⇒బోధన్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు.డెంగీతో ఇద్దరి మృతిపాపన్నపేట(మెదక్)/సిద్దిపేట అర్బన్: వేర్వేరు జిల్లాల్లో డెంగీతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్‌కు చెందిన వడ్ల రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హర్షిత్చారి (11)కి వారం రోజుల క్రితం డెంగీ సోక గా.. కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డబ్బులు కట్టలేక, నిలోఫర్‌కు తరలించగా.. హర్షిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి జ్వరంతో బాధ పడుతుండటంతో సిద్దిపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా నయం కాకపోవడంతో నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపుతాం ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహఅడ్డగోలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీసు కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయొచ్చు ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహసాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచి్చందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు టాస్‌్కఫోర్స్ పనిచేస్తోందని.. ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆస్పత్రులను పరిశీలించిందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై శనివారం సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. డెంగీని గుర్తించేప్పుడు టెస్టు రిపోర్టులు సరిగా ఉంటున్నాయా లేదా పరిశీలిస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఆస్పత్రులు డెంగీ పరీక్షలు చేసిన, నిర్ధారణ అయిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయండి: ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూం నడుస్తోందని.. విషజ్వరాల బాధితులు తమ సమస్యలపై దానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులంతా ఆస్పత్రుల పర్యటనకు వెళ్లాలని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించాం. మందుల కొరత ఉండకూడదని చెప్పాం..’’ అని మంత్రి వెల్లడించారు. కోఠి ఆస్పత్రిలోని వెక్టార్ బార్న్ డిసీజెస్ విభాగం కంట్రోల్ రూం నంబర్ 94404 90716 -
జ్వరం.. కొత్త లక్షణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా ప్రజలను వింత జ్వరాలు వేధిస్తున్నాయి. జ్వరం ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతున్నా ఆ తరువాత కీళ్ల వాపులు, శరీరంపై ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో జ్వరం వస్తే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉండేది. కానీ ప్రస్తుతం జ్వరం ఒక్కరోజు మాత్రమే ఉంటోంది. 103 నుంచి 104 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. కానీ దుష్ఫలితాలు పది నుంచి 15 రోజుల పాటు వెంటాడుతూనే ఉన్నాయి.మలేరియా, డెంగీ అనుమానిత కేసులువిజయవాడ నగరంలోని మొగల్రాజపురం, మారుతీనగర్, గుణదల, పాతబస్తీలోని చిట్టినగర్, కేఎల్‌రావు నగర్ వంటి ప్రాంతాల్లో డెంగీ, మలేరియా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. కొందరిలో డెంగీ ఎన్ఎస్1 పరీక్షలో పాజిటివ్ వస్తూ, ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయి. అలాంటి వారిలో డెంగీ ఎలీజా పరీక్ష చేస్తే నెగిటివ్ వస్తోంది. గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు సోకగా, పదిహేను రోజులుగా నగరంలో కూడా జ్వర బాధితులు పెరుగుతున్నారు. దోమకాటుతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కూడా జ్వరాలు పెరుగుతున్నాయి.దోమల నివారణ ప్రచార ఆర్భాటమేవిజయవాడ నగరంలో వ్యాధులు సోకకుండా దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారమే కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు జరగడం లేదు. ఏదైనా అనుమానిత కేసు వచ్చిన ప్రాంతంలో వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది వెళ్లి చుట్టు పక్కల ఇళ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాలు సైతం యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేసేందుకు రెండు, మూడు ప్రాంతాల్లో పర్యటించి సరిపెడుతున్నారు. దోమల నియంత్రణ క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు. దీంతో నగర ప్రజలు దోమకాటు వ్యాధులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు.కనిపిస్తున్న లక్షణాలు ఇవీ.. ⇒ తొలుత జ్వరం వచ్చి ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతుంది.⇒ ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ప్రారంభమవుతున్నాయి.⇒ క్రమేణా కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. ⇒ ఇలాంటి వారిలో కొందరు రెండు మూడు రోజులు మంచం మీద నుంచి కిందకు దిగి నడవలేని పరిస్థితి తలెత్తుతోంది.⇒ కొందరిలో కాళ్ల వాపులు సైతం ఎక్కువగా వస్తున్నాయి.⇒ వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.⇒ ఈ లక్షణాలు పది రోజుల నుంచి 15 రోజులు పాటు ఉంటూ ప్రజలను బాధిస్తున్నాయి.⇒ కొంత మందిలో జ్వరం తక్కువగా ఉండి గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వేధిస్తున్నాయి.⇒ ఇలాంటి వారు తీవ్రంగా నీరసించి పోతున్నారు. రెండు మూడు రోజులకు దగ్గు కూడా ప్రారంభమవుతుంది. వారం నుంచి పది రోజుల పాటు దగ్గు ఇబ్బంది పెడుతోంది.జ్వరాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి..ప్రస్తుతం ప్రబలిన జ్వరాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక రోజు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఆ తర్వాత చాలా మందిలో కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. కొందరైతే, రెండు, మూడు రోజులు మంచంపై నుంచి దిగలేని పరిస్థితి ఏర్పడుతోంది. పది నుంచి పదిహేను రోజుల పాటు నొప్పులు ఉంటున్నాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నారు. డెంగీ ఎన్ఎస్1 పాజిటివ్ వచ్చి, ప్లేట్లెట్స్ తగ్గినా, ప్రమాదకరంగా మారడం లేదు. వాటికవే పెరుగుతున్నాయి. కొందరిలో భరించలేని తలనొప్పి, బాడీపెయిన్స్ కూడా ఉంటున్నాయి. నిపుణులైన వైద్యులను సంప్రదించి వైద్యం పొందితే మంచిది.– డాక్టర్ ఎస్.డి.ప్రసాద్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ -
వామ్మో..! మనిషిపై మశక సైన్యం!!
దోమలు చూడటానికి చిన్నగా ఉంటాయి గాని, ఇవి అత్యంత ప్రమాదకరమైన జీవులు. ప్రపంచంలో ఏటా పాముకాటుతో మరణిస్తున్న వారి కంటే దోమకాటుతో మరణిస్తున్న వారే ఎక్కువ. పాముకాటు వల్ల ఏటా దాదాపు 1.37 లక్షల మంది మరణిస్తుంటే, దోమకాటు వల్ల వ్యాధులకు లోనై మరణించే వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటోంది. దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవడానికి ఈ లెక్క చాలు. ఈ భూమ్మీద 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నాయి. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దోమల బెడద ఉండనే ఉంది. దోమలు మనుషుల కంటే చాలా ముందు నుంచే భూమ్మీద మనుగడ సాగిస్తున్నాయి. ఇవి దాదాపు డైనోసార్ల కాలం నుంచే అంటే, 25.1 కోట్ల సంవత్సరాల నుంచి భూమ్మీద ఉన్నాయి.భూమ్మీద మిగిలిన ప్రదేశాలతో పోల్చుకుంటే, ఉష్ణమండల ప్రదేశాల్లో, నీరు ఎక్కువగా నిల్వ ఉండే చోట దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అసలు నీరులేని చోట, నీరు ప్రవహించే చోట దోమలు మనుగడ సాగించలేవు. నిల్వ నీరు ఉన్న ప్రదేశాలే దోమలకు సురక్షిత స్థావరాలు. మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉష్ణమండల ప్రదేశాలే! ఇక్కడి వాతావరణం దోమల విజృంభణకు చాలా అనుకూలంగా ఉంటుంది. దోమలు భూమ్మీద కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నా, దోమల సగటు ఆయుఃప్రమాణం మాత్రం తక్కువే! ఒక దోమ బతికేది 10 నుంచి 56 రోజుల లోపే! ఇంత అల్పాయుర్దాయంలోనే దోమలు సృష్టించాల్సిన విధ్వంసమంతా సృష్టిస్తాయి.దోమల్లో ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. ఒక ఆడ దోమ రోజు విడిచి రోజు 150–200 వరకు గుడ్లు పెడుతుంది. దోమ గుడ్లు పెట్టడానికి 50 మిల్లీలీటర్ల నిల్వనీరు చాలు. దారి పక్కన పడి ఉండే చిన్న చిన్న కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వాడటం మానేసి మూలపడేసిన ఎయిర్ కూలర్లు వంటివి దోమలకు ప్రశస్థమైన ఆవాసాలు. ఇలాంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి, వంశాభివృద్ధి చేసుకుంటాయి. దోమలను నిర్మూలించడానికి మనం ఎన్ని రకాల మందులను వాడుతున్నా, దోమలు వాటిని తట్టుకునేలా తమ నిరోధకతను నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. దోమలు మందులను తట్టుకునే శక్తి పెంచుకునే కొద్ది వాటి వల్ల మనుషులకు ముప్పు మరింతగా పెరుగుతుంది. ఆడదోమలు మనుషుల రక్తాన్ని పీల్చే క్రమంలో వాటి నుంచి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మనుషుల రక్తంలోకి చేరి, వ్యాధులను కలిగిస్తాయి.దోమలు కలిగించే వ్యాధులు..దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, లింఫాటిక్ ఫైలేరియాసిస్, రిఫ్ట్వ్యాలీ ఫీవర్, యెల్లో ఫీవర్, జికా, జపానీస్ ఎన్సెఫలిటిస్, వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లను కలిగించే వ్యాధుల్లో 17 శాతం వ్యాధులు దోమల వల్లనే వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 9.6 కోట్ల మంది దోమకాటు వ్యాధులకు లోనవుతున్నారు. వారిలో అత్యధికంగా దాదాపు 4 లక్షల మంది మలేరియా వల్ల, 40 వేల మంది డెంగీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి వల్ల మరణాల బారిన పడిన వారిలో ఐదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా ఉంటుండటం విచారకరం. దోమల కారణంగా తలెత్తే తీవ్ర వ్యాధులు, వాటి లక్షణాలను తెలుసుకుందాం.మలేరియా..ఈ వ్యాధి అనాఫలిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మజీవి కారణంగా మలేరియా వస్తుంది. వీటిలో ఒకరకం జాతికి చెందిన సూక్ష్మజీవి కారణంగా సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితికి చేరడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు ఉంటాయి.చికెన్ గున్యా..ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమ ద్వారా వ్యాపించే ఒకరకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఎడిస్ ఈజిపై్ట దోమ ఎక్కువగా పగటివేళ కనిపిస్తుంది. చికున్ గున్యా సోకిన వారికి జ్వరం, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన కీళ్లనొప్పులు వస్తాయి.డెంగీ..డెంగీకి కూడా ఎడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంతగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.డెంగీని నిరోధించే వొబాకియా..వొబాకియా అనే బ్యాక్టీరియా డెంగీ వ్యాప్తిని అరికట్టగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మలేసియా, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లోని పరిశోధక సంస్థల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు వొబాకియా బ్యాక్టీరియాను ప్రయోగించి, డెంగీ వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతులయ్యారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఏడిస్ ఈజిపై్ట దోమల శరీరంలోకి వొబాకియా బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేసి, వాటిని బయటి వాతావరణంలోకి విడిచిపెట్టాక, వాటి ద్వారా డెంగీ వ్యాప్తి పెద్దగా జరగలేదు. వొబాకియా బ్యాక్టీరియా ఎక్కించిన తర్వాత దోమలకు పుట్టిన తర్వాతి తరాల దోమల్లో కూడా డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.దోమల నివారణ మార్గాలు..దోమలను సమర్థంగా నివారించుకోవడం ద్వారా మాత్రమే దోమకాటు వ్యాధుల బారి నుంచి మనం తప్పించుకోగలం.– మనం ఉండే ఇళ్లలోకి, గదుల్లోకి దోమలు రాకుండా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలి.– దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరంపై పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.– దోమలు కుట్టకుండా ఉండాలంటే, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా నిండుగా దుస్తులు ధరించాలి.– దోమలు మురికి దుస్తులపై ఆకర్షితమవుతాయి. అందువల్ల శుభ్రమైన దుస్తులు ధరించాలి.– ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిత్యం ప్రవహించేలా కాల్వలను శుభ్రం చేసుకోవాలి.అపోహలు, వాస్తవాలు..అపోహ: దోమలన్నీ మనుషులను కుడతాయి.వాస్తవం: ఆడ దోమలు మాత్రమే మనుషులను, జంతువులను కుడతాయి. ఆడ దోమల్లో పునరుత్పత్తి శక్తి కోసం మనుషులు, జంతువుల రక్తం అవసరం.అపోహ: కొన్ని రకాల రక్తమంటేనే దోమలకు ఇష్టంవాస్తవం: ముఖ్యంగా ‘ఓ–పాజిటివ్’ రక్తమంటే దోమలకు ఇష్టమని, అందుకే ఆ రక్తం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయనే ప్రచారం ఉంది. నిజానికి దోమలను ఆకర్షించేది రక్తం కాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా. చర్మంపై కొన్నిరకాల బ్యాక్టీరియా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.అపోహ: తెల్లచర్మం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.వాస్తవం: దోమలు కుట్టినప్పుడు తెల్లచర్మం ఉండేవారి శరీరంపై దద్దుర్లు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దోమల లాలాజలంలో ఉండే ఎంజైమ్ వల్ల దురద పుట్టి దద్దుర్లు ఏర్పడతాయి. దోమలు కుట్టడానికి మనుషుల రంగుతో సంబంధం లేదు.అపోహ: దోమలన్నీ వ్యాధులను కలిగిస్తాయి.వాస్తవం: ప్రపంచంలో 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నా, వీటిలో చాలా జాతులకు చెందిన దోమలు అసలు మనుషుల జోలికి రావు. అయితే, మనుషులను కుట్టే జాతులకు చెందిన దోమల్లో ఎక్కువ జాతులు వ్యాధులను మోసుకొస్తాయి.అపోహ: గబ్బిలాలను ఆకట్టుకుంటే దోమలు పరారవుతాయి.వాస్తవం: దోమలను పారదోలాలంటే, పెరట్లోకి గబ్బిలాలను రప్పించాలనే ప్రచారం ఉంది. దోమలు, ఈగల వంటి కీటకాలను గబ్బిలాలు తినడం నిజమే గాని, అవి దోమలను పూర్తిగా నిర్మూలించలేవు.అపోహ: మనుషుల పరిమాణంతో సంబంధం లేకుండా దోమలు వారిని కుడతాయి.వాస్తవం: చిన్నగా కనిపించే వారి కంటే పెద్దగా కనిపించే మనుషులనే దోమలు ఎక్కువగా కుడతాయి. చిన్న పిల్లల కంటే దోమలు పెద్దలనే ఎక్కువగా కుడతాయి. పిల్లల కంటే పెద్దలు తమ ఊపిరిలో కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా విడిచిపెడతారు. చాలా దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను పసిగట్టగల దోమలు త్వరగా పెద్దల వైపు ఆకర్షితమవుతాయి.మరిన్ని మశక విశేషాలు..గుడ్డు దశ నుంచి పూర్తిగా ఎదిగిన దశకు చేరుకోవడానికి దోమకు వారం నుంచి పదిరోజులు పడుతుంది.చెమట కారణంగా చర్మంపై పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే వాసనలు దోమలను ఇట్టే ఆకట్టుకుంటాయి. చెమట చిందిన పాదాలను శుభ్రం చేసుకోకుండా కాసేపు అలాగే వదిలేస్తే, వాటిపై దోమలు దాడి చేస్తాయి.కొన్ని రకాల వాసనలు దోమలను గందరగోళానికి గురిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి వాసనల వైపు దోమలు రావు. వెల్లుల్లి తిన్నట్లయితే, చెమట వాసనలో మార్పు వస్తుంది. వెనిగర్‌లో ముంచిన ఉల్లిపాయ ముక్కలను ఒంటికి రుద్దుకున్నట్లయితే, దోమలు దరిదాపులకు రావు.దోమలు అతి నెమ్మదిగా ఎగురుతాయి. దోమల వేగం గంటకు ఒకటి నుంచి ఒకటిన్నర మైళ్లు. తేనెటీగలు ఎగిరే వేగంతో పోల్చుకుంటే, ఇది పదోవంతు మాత్రమే!దోమలు ఎగురుతున్నప్పుడు బాగా రొదగా ఉంటుంది. దోమలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు సెకనుకు 300–600 సార్లు రెపరెపలాడతాయి. వాటి కారణంగానే ఈ మశక సంగీతం వినిపిస్తుంది.దోమ బరువు 2 మిల్లీగ్రాములు. ఆడదోమ చిన్నిపొట్ట నిండటానికి లీటరులో 50 లక్షలవంతు రక్తం సరిపోతుంది. ఒక్కోసారి ఆడదోమలు తమ శరీరం బరువుకు సమానమైన నెత్తురు తాగేస్తాయి. వెన్నెల రాత్రులలో దోమలు మరింతగా విజృంభిస్తాయి. వెన్నెలలో దోమలకు తమ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపించడమే దీనికి కారణం. చీకటి రాత్రుల కంటే వెన్నెల రాత్రులలో దోమలు ఐదురెట్లు ఎక్కువగా మనుషులను కుడతాయి.దోమలను ముదురు రంగులు ఇట్టే ఆకట్టుకుంటాయి. రక్తం తాగే ఆడ దోమలు ఎక్కువగా చీకటి ప్రదేశాలను స్థావరంగా చేసుకుంటాయి. అందుకే అవి ముదురు రంగు దుస్తులు వేసుకునే వారి వైపు ఆకర్షితమవుతాయి. -
Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్‌యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి
మలేరియావ్యాధి నిర్మూలనలో పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) శాస్త్రవేత్తల బృందం మలేరియాకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన నివారణ, చికిత్సా వ్యూహాలకు మార్గం సుగమం చేయగల మంచి వ్యాక్సిన్ తయారీలో మరో అడుగు ముందు కేశారు. జెఎన్‌యులోని మాలిక్యులర్ మెడిసిన్ సెంటర్ ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ నేతృత్వంలోని పరిశోధన, టీకా వ్యూహంలో భాగంగా కొత్త పారాసైట్ ఇంటరాక్టింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించింది.మనిషిలోఇన్ఫెక్షన్కు కారణమైన రెండు తటస్థ అణువులు పీహెచ్బీ2-హెచ్ఎస్పీ70ఏ1ఏను గుర్తించినట్లు పరిశోధనలో భాగమైన ప్రొఫెసర్ శైలజ తెలిపారు. ఈ పారాసైట్ ప్రొటీన్ పీహెచ్బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్‌కు దోహదం చేయగలదన్నారు.మానవ హోస్ట్ లోపల పరాన్నజీవి ఇన్ఫెక్షన్ పొందడంలో సహాయపడే నవల PHB2-Hsp70A1A రిసెప్టర్ లిగాండ్ జతను తాము గుర్తించామని, పరాన్నజీవి ప్రోటీన్ PHB2 ఒక శక్తివంతమైన టీకా ఇదని ఆమె తెలిపారు. వివిధ సెల్యూలార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్ ఇవి అని చెప్పారు. పీఎఫ్‌పీహెచ్‌బీ2 యాంటీబాడీల ఉనికిని గుర్తించడం మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని మరో పరిశోధకుడు మనీషా మరోథియా వివరించారు. యాంటీబాడీ చికిత్స పరాన్నజీవుల పెరుగుదలను పూర్తిగా రద్దు చేయడం విశేషమని పేర్కొన్నారు.. అలాగే శాస్త్రవేత్తలుగా, మలేరియా నిర్మూలన పట్ల ఆకాంక్ష ఎప్పటికీ ఆగదని ఇరువురు ప్రొఫెసర్లు పునరుద్ఘాటించారు.మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపించే వెక్టర్-బోర్న్ వ్యాధి. ప్రధానంగా ఇండియా సహా అనేక దేశాల్లో శతాబ్దాలుగా మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ కేసులు మరియు 60,800 మరణాలు సంభవిస్తున్నాయి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి పరిశోధనకు కలిగించిన అంతరాయం ఫలితంగా ఇటీవల కేసులు, మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యయన ఫలితం ఆశాజనకంగా భావిస్తున్నారు నిపుణులు. -
మలేరియా వ్యాక్సిన్ తయారీపై ‘సీరమ్’ దృష్టి!
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పూణె) మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తర్వాత తమ సంస్థ మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించిందని తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ తయారు చేసేందుకు కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకుందని అదార్ పూనావాలా తెలిపారు. సంస్థకు పది కోట్ల డోసుల మలేరియా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా దీనిని మరింత పెంచవచ్చన్నారు. మలేరియా వ్యాక్సిన్ తయారీలో టెక్నాలజీ బదిలీ ఒప్పందంతో పాటు వ్యాక్సిన్ల ఎగుమతిపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాక్సిన్ తయారీపై కూడా దృష్టిపెట్టామన్నారు. ఏటా లక్షల మంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ గతంలో కరోనా నివారణకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పుడు దీనికి డిమాండ్ తగ్గడంతో తక్కువ స్థాయిలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. -
జ్వరం.. వణుకుతున్న జనం!
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఒడిశా కాలనీకి చెందిన బోయ అజయ్, బోయ మరియమ్మల కుమార్తె అక్షర (3) విషజ్వరంతో ఆదివారం మృతి చెందింది. చిన్నారికి తీవ్ర జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఏటూరునాగారంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ సరిగా వైద్యం అందక.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన గోస్కుల శ్రీజ (4) అనే చిన్నారి డెంగీ లక్షణాలతో మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు తొలుత సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలిసింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కొత్మీర్ గ్రామానికి చెందిన యువకుడు మిట్టె నాగరాజు (24) ఆదివారం రాత్రి విష జ్వరానికి బలయ్యాడు. అప్పటికే నాలుగైదు రోజులుగా జ్వరంతో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందినా పరిస్థితి మెరుగుకాలేదు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సాక్షి ప్రతినిధి, వరంగల్ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభించి జనం అల్లాడుతున్నారు. ప్రస్తుత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 5,315 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య సంగతేమోగానీ పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కరిద్దరు జ్వరంతో మంచాన పట్టి కనిపిస్తున్నారు. గత ఇరవై రోజులుగా విష జ్వరాల తీవ్రత మరింతగా పెరిగింది. డెంగీ, మలేరియాలతో గత ఐదారు రోజుల్లోనే ఉమ్మడి వరంగల్‌లో నలుగురు మృత్యువాత పడటం ఆందోళనకరం. గోదావరి పరీవాహక ఏజెన్సీ ప్రాంతాల్లో.. ముఖ్యంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ పల్లెల్లో జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. గంటల వ్యవధిలోనే ప్రాణం పోయింది చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ కళ్లముందు తిరిగిన నాబిడ్డ గంటల వ్యవధిలోనే దూరమైపోయింది. గత నెల 28న ఆమెకు జ్వరం వస్తే.. స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాం. పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చి, సిరప్ రాసిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి సిరప్ తాగిస్తే తెల్లవారే సరికి జ్వరం తగ్గింది. రెండు రోజులు బాగానే ఉంది. కానీ 30న మధ్యాహ్నం కడుపులో నొప్పి అంటూ వాంతులు చేసుకుంది. వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. రూ.10వేలు అడ్వాన్సుగా తీసుకుని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. కానీ పరిస్థితి సీరియస్‌గా ఉందని, తమ వల్ల కాదంటూ 65 కిలోమీటర్ల దూరంలోని మణుగూరుకు వెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్తుండగానే నా బిడ్డ ప్రాణాలు విడిచింది. – బోయి అజయ్, (అక్షర తండ్రి) ఆందోళన వద్దు.. మలేరియా, డెంగీ జ్వరాల పట్ల ఆందోళన వద్దు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఇటీవల జ్వరాలు విజృంభిస్తుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారుల సూచన మేరకు డెంగీ, మలేరియాలను నియంత్రించేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాం. జ్వరం లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సహాయం పొందాలి. రక్త పరీక్షలు చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులకు తగినన్ని మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ సాంబశివరావు,డీఎంహెచ్ఓ, హనుమకొండ -
దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్ ఆర్ఎన్ఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణిగా వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించారు. దోమ లాలాజలంలోని ఆర్ఎన్ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. సరికొత్త చికిత్సకు మార్గం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వెలుగులోకి కొత్త విషయాలు ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌పై పరిశోధనలు చేయగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్ ఆర్ఎన్ఏ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ తానియా స్ట్రిలెట్స్ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు. ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్ ఆర్ఎన్ఏ (రిబోన్యూక్లియిక్ యాసిడ్)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ అని పిలిచే మెంబ్రేన్ (పొర) కంపార్ట్మెంట్లలో సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏ (ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ) ద్వారా డెంగీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ స్థాయిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది. ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్ వెల్లడించారు. ఈ సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ అడ్డుకుంటోందని తేల్చారు. -
ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు. మస్కిటో మ్యాగ్నెట్ మారదు చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగ్విస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!. -
మలేరియా వ్యాప్తిని నిరోధించే దోమలు
లండన్: మలేరియా.. మానవాళికి పెనుముప్పుగా మారిన అతిపెద్ద వ్యాధి. దోమల నుంచి వ్యాపించే మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. వ్యాధి నివారణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియా వ్యాప్తిని అరికట్టే దోమలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం సాధారణ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు. మలేరియాకు కారణమయ్యే పారాసైట్లు జన్యుపరంగా మార్పు చేసిన ఈ దోమల్లో వేగంగా పెరగవని చెబుతున్నారు. మలేరియాను అరికట్టడంలో ఇదొక శక్తివంతమైన ఆయుధం అవుతుందని పేర్కొంటున్నారు. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌తోపాటు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ మోడలింగ్’ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన ఆడ దోమ మరో వ్యక్తిని కుడితే అతడికి కూడా వ్యాధి సోకుతుంది. అంటే దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. మలేరియా పారాసైట్లు తొలుత దోమ ఆంత్రంలోకి చేరుకుంటాయి. అక్కడే ఇన్ఫెక్షన్ కలిగించే స్థాయికి ఎదుగుతాయి. అనంతరం లాలాజల గ్రంథుల్లోకి చేరుకుంటాయి. ఆంత్రంలో పారాసైట్లు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేలా చేశారు. పారాసైట్లు అభివృద్ధి చెంది, మనిషిని కుట్టే లోపే దోమల జీవితకాలం ముగుస్తుందని చెబుతున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు మలేరియా రిస్క్ పొంచి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 6,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. -
సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు
తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. చిత్తూరు రూరల్ : వర్షాకాలంలో ప్రజలు అధికంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. వాతావరణ మార్పులతో తరచుగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. రోగాల వ్యాప్తికి ప్రధానంగా దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్ల వద్ద, వీధుల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయని వివరిస్తున్నారు. వైరల్ జ్వరాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ► తేలికపాటి జ్వరం.. జలుబు: సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి . ఈ వైరల్ ఫీవర్ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జాగ్రత్తలు: భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్ర పరుచుకోవాలి. నిల్వ పదార్థాలు తినకూడదుౖ తాజా పండ్లు తీసుకోవాలి . వర్షంలో తడవకూడదు . తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండ కూడదు. మాస్క్ తప్పనసరిగా ధరించాలి. ► చికెన్ గున్యా: దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం , కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్ష ణాలు , ఇది సోకితే మొదటి రెండు , మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది . జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి . కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి . ► మలేరియా: తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు . జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది . ఆడ దోమ కాటుతో మలేరియా జిరమ్స్ శరీరంలో లోపలికి వెళ్తాయి . 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది . ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: దోమతెరలు వినియోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ చేరితే అందులో కిరోసిన్ గాని పురుగు మందుగాని పిచికారీ చేయించాలి. ► డెంగీ: వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది . ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు , చేతులు , ముఖం , వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి . ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది . ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇళ్లలోని కుండీలు , ఓవర్ హెడ్ ట్యాంక్‌లు , ఎయిర్ కూలర్లు , పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు , ప్లాస్టిక్ కప్పులు , పగిలిన సీసాలు , టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి . చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి . దోమ తెరలు వాడడం శ్రేయస్కరం . వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి . ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు , పాత టైర్లు , ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి . ఎయిర్ కూలర్లు , ఎయిర్ కండిషన్లు , పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి. ► హెపటైటిస్–ఏ: వర్షాకాలంలో హెపటైటిస్– ఎ ( కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉంది . ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కలుషితమైన ఆహార పదార్థాల నుంచి , తాగునీటి నుంచి రోగ కారకక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి . కాలేయ వ్యాధి కారణం గా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి. జాగ్రత్తలు: శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఆహారం తినకూడదు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. ► టైఫాయిడ్: వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది . ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది . కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్తలు: కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి. ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది. అప్రమత్తత తప్పనిసరి వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్ర జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. – శ్రీనివాసులు, డీఎంఓ -
దోపిడి దోమ
రాయదుర్గంలోని నేసేపేటకు చెందిన సిద్ధన్న అనారోగ్యానికి గురై ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. అతడి సలహా మేరకు ఓ సీనియర్ వైద్యుడి దగ్గరకు వెళితే.... రోగి చెబుతున్నది వినకుండానే రక్తపరీక్షలు చేయించుకుని రమ్మంటూ ఓ చీటి రాసి చేతిలో పెట్టాడు. దీంతో సిద్ధన్న ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు వెళితే.. రోగ నిర్ధారణ పరీక్షకు అక్షరాల రూ.950 బిల్లు అయింది. ల్యాబ్ నిర్వాహకుడు ఇచ్చిన రిపోర్టు తీసుకుని తిరిగి సదరు డాక్టర్ వద్దకు వెళితే... సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపి మందులు రాసిచ్చాడు. ఈ తరహా దోపిడీతో వైద్యులు, ల్యాబ్ నిర్వాహకులు కలిసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. రాయదుర్గం: జిల్లాల్లో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. దోమ కాటుతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీనికి తోడు రోగ నిర్ధారణకు సంబంధించి ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుల వైఖరి మరీ దారుణంగా మారింది. రక్తాన్ని పీల్చే దోమ కాటుతో కోలుకోవచ్చు కానీ, నగదు కొల్లగొడుతున్న దోపిడీ దోమల దెబ్బకు రోగులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. భయాన్ని సొమ్ము చేసుకుంటూ.. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ వైద్యుడి దగ్గరకు వెళ్లినా.. రోగ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి అంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షకు సంబంధించి రిపోర్టులు లేకుంటే వైద్యం చేయలేని అసహాయ స్థితికి వైద్యులు చేరుకున్నారంటే పొరబడినట్లే. కన్సల్టెంట్ ఫీజు రూపంలో కొంత దండుకునే వైద్యుడు... రోగ నిర్ధారణ పరీక్షలకు రెఫర్ చేయడం ద్వారా మరికొంత కమీషన్ దక్కుతుండడమే ఇందుకు కారణం. విష జ్వరాలపై ప్రజల్లో ఉన్న భయాన్ని తెలివిగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన ల్యాబ్‌లు 79 ఉండగా... అనధికారికంగా నిర్వహిస్తున్నవి దీనికి రెట్టింపుగానే ఉన్నాయి. ఉచితంగా అందుబాటులో ఉన్నా.. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు గర్భిణులకు బ్లడ్ గ్రూపింగ్, హెచ్ఐవీ, బ్లడ్ షుగర్, హైపటైటిస్–బీ, యూరిన్, టీబీ పరీక్షలతో పాటు డెంగీ, ప్లేట్లేట్ కౌంట్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ లాంటి ఇతర కీలక వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరీక్షలు ప్రాథమిక, అర్బన్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల్లోనే నిర్వహిస్తుంటారు. డెంగీ పరీక్ష కోసం పీహెచ్‌సీల్లోనే రక్త నమూనాలు సేకరించి ‘ఎలిసా’ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి పంపిస్తారు. 24 గంటల్లోపు పరీక్ష చేసి రోగికి సమాచారం అందేలా చర్యలూ తీసుకున్నారు. ఇష్టారీతిన ఫీజుల వసూళ్లు.. ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆరేళ్లు పరిశీలిస్తే 1,538 డెంగీ, 816 మలేరియా, 670 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. 2017–19 మధ్య డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించి 80 శాతం కేసులు నమోదు కావడం విశేషం. ప్రాణాంతకమైన ఈ రోగాలకు సంబంధించి విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి బిల్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ధరల పట్టికను సంబంధిత ప్రైవేట్ ల్యాబ్‌ల్లో తప్పనిసరిగా ప్రదర్శనకు ఉంచాలి. అయితే అధికారిక పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పైగా ప్రశ్నించిన రోగుల పట్ల దురుసుగా వ్యవహరించడం, గంటల తరబడి వేచి ఉండేలా చేసి ఇబ్బందులు గురి చేస్తుంటారు. టైఫాయిడ్, మలేరియా లాంటి పరీక్షలకు రూ.180 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తారు. అయితే ఈ పరీక్షలకు రూ.500 నుంచి రూ.600 వరకూ తీసుకుంటూ రోగుల జేబులు కొల్లగొట్టడం విమర్శలకు దారి తీస్తోంది. అనుమతి లేని ల్యాబ్‌లపై చర్యలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడినట్లు తేలితే అనుమతులున్నా ల్యాబ్‌లను సీజ్ చేస్తాం. – డాక్టర్ ఓబులు, జిల్లా మలేరియా అధికారి, అనంతపురం ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర విష జ్వరాల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీని ఉపేక్షించబోం. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ (చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు ) -
మలేరియా నియంత్రణలో రాష్ట్రానికి జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మలేరియాను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015–21) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని, దీంతో తెలంగాణ కేటగిరీ–2 నుంచి కేటగిరీ–1లోకి చేరిందని కేంద్రం ప్రశంసించింది. ‘సత్కారాన్ని అందుకునేందుకు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపింది’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. -
మలేరియాకు చెక్
మలేరియా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గత మూడేళ్ల నుంచి దోమల నివారణతో పాటు మహమ్మారి తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖల శ్రమకు ఫలితం లభించింది. మరణాల నివారణతోపాటు మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. సాక్షి, పాడేరు : మన్యంలో మలేరియా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. ఒకప్పుడు మలేరియా మహమ్మారితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దోమకాటుకు గురై మలేరియా జ్వరాల బారిన పడటంతో పరిస్థితి ప్రాణాల మీదకు వచ్చేది. పారిశుధ్య కార్యక్రమాలు గ్రామాల్లో అంతంత మాత్రంగానే ఉండేవి. మన్యంలో 2012 నుంచి 2018 వరకు మలేరియా విజృంభించడంతో మరణాలు చోటు చేసుకునేవి. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా.. ఏర్పడిన తరువాత మన్యంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అనేక వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టారు. గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వలంటీర్ల సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అనేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను సచివాలయ వ్యవస్థ విస్తృతం చేసింది. మరోవైపు దోమల నివారణకు ప్రభుత్వం ] మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ బృందాలు నిరంతరం పనిచేశాయి. దోమతెరలతో.. తెరలను ప్రభుత్వం పంపిణీ చేయడం మరింత మేలు చేసింది. గిరిజనులకు దోమ కాట్ల బెడద లేకుండా 5,02,950 దోమతెరలను అందజేసింది. వీటి వినియోగంపై వైద్య బృందాలు, సచివాలయ ఉద్యోగులు గిరిజనులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు ఎపిడమిక్ సీజన్‌గా ప్రభుత్వం గుర్తించి వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపడుతోంది. మలేరియా, వైద్యారోగ్యశాఖలు.. మూడేళ్ల నుంచి దోమల నివారణతో పాటు మలేరియా తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతో శ్రమించాయి. మరణాలు కూడా లేకపోవడంతో మలేరియాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. పాడేరు ఐటీడీఏ పీవో, ఇతర శాఖల అధికారులు కూడా దోమల నివారణ మందు పిచికారీ పనులను నిరంతరం పర్యవేక్షించేవారు. ఏటా రెండు దఫాలుగా దోమల నివారణ మందు పిచికారీ పనులు జరిగాయి. ప్రతి గిరిజన కుటుంబం ఇంటా, బయట దోమల మందు పిచికారీని తప్పనిసరిగా జరుపుకోవాలనే నిబంధనలు కూడా సచివాలయ ఉద్యోగులు అమలు చేసేవారు. గ్రామ వలంటీర్ల పర్యవేక్షణలో.. సచివాలయ వ్యవస్థ ఏర్పడడంతో పాటు గ్రామ వలంటీర్లంతా తమ నిర్దేశిత గిరిజన కుటుంబాల నివాసాలకు దగ్గరుండి దోమల నివారణ మందు పిచికారీ చేయించేవారు. ఇంటింటా ఫీవర్ సర్వే కూడా విజయవంతంగా జరిగింది -
Hyderabad: వ్యాధుల రొద.. రోగుల వరద!
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా మహమ్మారి జడలు విప్పి నాట్యం చేస్తుంటే.. దీనికి తోడు ఇతర వ్యాధులూ నగర వాసుల్ని పట్టిపీడిస్తున్నాయనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. డెంగీ, మలేరియా, డయేరియా, విష జ్వరాలు జనాలను భయకంపితుల్ని చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. వందల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు దవాఖానాలకు పోటెత్తుతున్నారు. సోమవారం గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చికిత్స కోసం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించడం వ్యాధుల తీవ్రతకు దర్పణం పడుతోంది. చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు.. ఫీవర్ ఆస్పత్రిలో క్యూలైన్.. నిలోఫర్ ఆవరణలో కిక్కిరిసి.. -
అచ్చం రక్తంలాగే ఉండే బీట్రూట్ జ్యూస్.. తాగితే దోమలు ఖతం
మనుషులకు అతిపెద్ద శత్రువులు దోమలే. రకరకాల వ్యాధులను వ్యాపింపజేస్తూ లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి దోమలను నిర్మూలించడంపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు.. బీట్రూట్ జ్యూస్ ఆధారంగా రక్తంకాని రక్తాన్ని సృష్టించారు. అందులో విషపూరిత పదార్థాలను కలిపి దోమలను హతమార్చే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ కీటకనాశనుల ప్రమాదం నుంచి.. ప్రస్తుతం మనం దోమలను హతమార్చేందుకు మస్కిటో రిపెల్లెంట్లు, రసాయనాలు కలిపిన అగరుబత్తులు వంటి వాటిని వినియోగిస్తున్నాం. వాటిలో విషపూరిత పదార్థాలు దోమలను చంపడమో, మనుషులను కుట్టే సామర్థ్యాన్ని దెబ్బతీయడమో చేస్తాయి. కానీ ఆ రసాయనాలు మనుషులకు కూడా హానికరమేనని వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. స్వీడన్‌కు చెందిన ‘మాలిక్యులర్ అట్రాక్షన్’స్టార్టప్ శాస్త్రవేత్తలు.. మనుషులకు హానికలగకుండా దోమలను ఆకర్షించి చంపే విధానాన్ని అభివృద్ధి చేశారు. చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి! ‘మలేరియా’వాసనతో.. మలేరియా వ్యాధి సోకినవారి నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం పరాన్నజీవులు.. మన రక్తంలోని ఎర్రరక్త కణాలను ఆక్రమించి, విచ్ఛిన్నం చేసినప్పుడు వెలువడే ‘హెచ్‌ఎంబీపీపీ’అనే రసాయనమే దీనికి కారణం. దోమలు ఈ వాసనకు విపరీతంగా ఆకర్షితమవుతాయి. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘హెచ్‌ఎంబీపీపీ’మాలిక్యూల్స్తోనే దోమలకు చెక్‌పెట్టవచ్చని తేల్చారు. చదవండి: సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ బీట్రూట్ జ్యూస్‌లో కలిపి.. అచ్చం రక్తం లక్షణాలను పోలి ఉండేలా.. అంతే సాంద్రత, రంగుతో బీట్రూట్ జ్యూస్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దానిలో దోమలను ఆకర్షించే ‘హెచ్‌ఎంబీపీపీ’మాలిక్యూల్స్‌ను, మొక్కల ఆధారిత విష పదార్థాలను కలిపారు. దీనిని దోమలు ఉన్న చోట పెట్టారు. హెచ్‌ఎంబీపీపీ వాసనకు ఆకర్షితమైన దోమలు రక్తంకాని రక్తాన్ని పీల్చుకున్నాయి. విషపదార్థం ప్రభావంతో కాసేపటికే అన్నీ చనిపోయాయి. అయితే మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ రకం దోమలు ఎక్కువగా ఆకర్షితమయ్యాయని.. వివిధ మాలిక్యూల్స్‌ను ఉపయోగించడం ద్వారా ఇతర వ్యాధులను వ్యాప్తిచేసే దోమలనూ చంపవచ్చని మాలిక్యులర్ అట్రాక్షన్ సంస్థ ప్రకటించింది. ఈ పరిశోధన వివరాలు ఇటీవలే కమ్యూనికేషన్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మనుషులకు హానికలగకుండా.. ‘‘దోమల నిర్మూలన కోసం వినియోగించే రసాయనాలను గాలిలో స్ప్రే చేయడమో, రిపెల్లెంట్ పరికరాలతో ఆవిరిగా మార్చడమో చేస్తుంటారు. వాటిని మనం కూడా పీల్చుకుంటుంటాం. ఆ విష పదార్థాలు మన శరీరంలో చేరి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. అదే మేం రూపొందించిన పద్ధతిలో దోమలు వాటంతట అవే వచ్చి విషపూరిత పదార్థాన్ని పీల్చుకుని చనిపోతాయి. మనుషులకు ఎటువంటి హానీ ఉండదు. పైగా ఖర్చుకూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడొచ్చు..’’అని మాలిక్యులర్ అట్రాక్షన్ సంస్థ సీఈవో లెచ్ ఇగ్నటోవిజ్ వెల్లడించారు. దోమలకు బ్యాక్టీరియా ఎక్కించి.. దోమల నియంత్రణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో డెంగీకి కారణమయ్యే దోమల నియంత్రణపై ఇండోనేషియాలో చేసిన ప్ర యోగం దాదాపు విజయవంతమైంది. శాస్త్రవేత్తలు దోమల్లో డెంగీ వైరస్‌ను వ్యాప్తిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీసే ‘వొల్బాచియా’ బ్యాక్టీరియాను ఎక్కించారు. ఈ దోమలను పలు ప్రాంతాల్లో వదిలారు. ఆ బ్యాక్టీరియా ఇతర దోమలకూ వ్యాపించి.. డెంగీ కేసులు తగ్గాయి. -
మలేరియాకు వ్యాక్సిన్ రెడీ!
మలేరియా.. అందరికీ తెలిసిన వ్యాధే. అది పెద్ద ప్రమాదకరమేమీ కాదని అనుకుంటాం. కానీ మన దేశంలో, రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది మలేరియా బారినపడుతున్నారు. పెద్దవాళ్లు దీన్ని తట్టుకుంటున్నా ఐదేళ్లలోపు చిన్నారుల్లో వందల మంది చనిపోతున్నారు. మలేరియాకు చాలా కాలం నుంచీ చికిత్స, మందులు అందుబాటులో ఉన్నా.. ప్రయోజనం మాత్రం తక్కువే. అలాంటి మలేరియాకు ఎట్టకేలకు ఓ వ్యాక్సిన్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ మలేరియా మహమ్మారి, దాని వ్యాప్తి, చికిత్స, ప్రస్తుత వ్యాక్సిన్ వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ►ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది మలేరియా బారినపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ►రోజు విడిచి రోజు బాగా పెరుగుతూ తగ్గుతూ ఉండే జ్వరం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటపట్టడం, చేతులు–కాళ్లు వణకడం వంటివి మలేరియా లక్షణాలు. ►దీనితో సుమారు ఏటా నాలుగు లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లల సంఖ్యే 2.68 లక్షల మంది వరకు ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ►మలేరియా పరాన్నజీవి ఆడఅనాఫిలిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అప్పటికే ఈ వ్యాధి ఉన్న వ్యక్తులను కుట్టిన దోమలు వేరే వ్యక్తులను కుట్టితే వారికీ వ్యాపిస్తుంది. వైరస్ కాదు.. బ్యాక్టీరియా కాదు.. ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే అతిచిన్న పరాన్నజీవి (ఏకకణ జీవి–ప్రొటోజోవా) కారణంగా మలేరియా వ్యాధి వస్తుంది. ఇది వైరస్, బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవి కాదు. వాటికన్నా పెద్దగా ఉంటుంది. ►ఉదాహరణకు ప్లాస్మోడియం క్రిముల పరిమాణం 8–12 మైక్రోమీటర్లు (మైక్రోమీటర్ అంటే మీటర్లో పదిలక్షల వంతు) ఉంటుంది. అదే వైరస్ల పరిమాణం వంద నానోమీటర్ల వరకు (నానోమీటర్ అంటే మీటర్లో వంద కోట్ల వంతు) ఉంటుంది. అంటే వైరస్ల కంటే.. ప్లాస్మోడియం క్రిములు వంద రెట్లు పెద్దగా ఉంటాయి. 8 లక్షల మందిపై పరిశీలించి.. మస్కిరిక్స్’వ్యాక్సిన్ ప్రాథమిక ప్రయోగాలు 2019లోనే పూర్తయ్యాయి. భద్రతా ప్రమాణాల మేరకు ఉన్నట్టు నిర్ధారించుకున్నాక.. దాని పనితీరు, దీర్ఘకాలిక ప్రభావాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు విస్తృత పరిశోధన చేపట్టారు. గత రెండేళ్లలో ఆఫ్రికా ఖండంలోని ఘనా, కెన్యా, మలావి దేశాల్లో ఎనిమిది లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి పరిశీలించారు. ►ఆరు వారాల వయసు నుంచి ఏడాదిన్నర వయసున్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ►దీనిని నాలుగు డోసులుగా (అర మిల్లీలీటర్ చొప్పున) ఇవ్వాల్సి ఉంటుంది. నెలకో డోసు చొప్పున మూడు డోసులు ఇస్తారు. 18 నెలల (ఏడాదిన్నర) తర్వాత నాలుగో డోసు ఇస్తారు. ►వాస్తవానికి ఈ వ్యాక్సిన్ పిల్లలపై 30శాతం ప్రభావవంతంగానే పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కానీ లక్షల కొద్దీ కేసులు, వేలకొద్దీ మరణాలు నమోదయ్యే చోట.. ఈ మాత్రమైనా పనిచేసే వ్యాక్సిన్ ప్రయోజనకరమని పేర్కొంది. ►ఆఫ్రికాలో 2019 ఒక్క ఏడాదిలోనే 3.86 లక్షల మంది మలేరియాతో మరణించారు. అదే గత ఏడాదిన్నరలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య మాత్రం 2.12 లక్షలే. ప్రపంచంలోనే తొలిసారిగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్లు, బ్యాక్టీరియాలతో వచ్చే వ్యాధులకు సంబంధించి చాలా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగాకుండా ఒక పరాన్నజీవికి సంబంధించిన వ్యాక్సిన్ విడుదల అవుతుండటం ఇదే మొదటిసారి అని నిపుణులు చెప్తున్నారు. మలేరియాకు వ్యాక్సిన్ ప్రయోగాలు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి. కొన్ని సంస్థలు వ్యాక్సిన్లను రూపొందించినా.. అవి సమర్థవంతంగా పనిచేయలేకపోవడం, సైడ్ ఎఫెక్టులు ఉండటం వంటి కారణాలతో అనుమతులు పొందలేదు. మస్కిరిక్స్ వ్యాక్సిన్‌ను కూడా ఏళ్లపాటు, లక్షలాది మందిపై పరీక్షించిన తర్వాతే అనుమతి ఇచ్చారు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? దోమకాటు వేసినప్పుడు మలేరియా పరాన్నజీవులు మన రక్తంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి కాలేయానికి చేరుకుని వాటి సంఖ్యను పెంచుకుంటాయి. తర్వాత మళ్లీ రక్తంలోకి చేరి ఎర్రరక్త కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. మలేరియా పరాన్నజీవులు కాలేయంలో చేరి సంఖ్యను పెంచుకోకుండా ఈ యాంటీబాడీలు అడ్డుకుంటాయి. ప్లాస్మోడియం ప్రొటీన్ల నుంచే.. బ్రిటన్‌కు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్కే) ఫార్మా సంస్థ ఈ ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మలేరియాను కలిగించే ప్లాస్మోడియం ఫాల్సిపరం పరాన్నజీవి పైపొరలో ఉండే ప్రొటీన్ల ఆధారంగా దీనిని రూపొందించారు. 2028 నాటికల్లా కోటిన్నర డోసులు ఉత్పత్తి చేస్తామని, ఉత్పత్తికి అయ్యే ఖర్చుపై కేవలం ఐదు శాతమే ఎక్కువ ధరతో విక్రయిస్తామని జీఎస్కే ప్రకటించింది. ►ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లోని చాలా దేశాల్లో మలేరియా సీజనల్‌గా వ్యాప్తి చెందుతుంటుంది. ఏటా లక్షల మంది దీని బారినపడుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం.. 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు కోట్ల మలేరియా వ్యాక్సిన్లు అవసరం కానున్నాయి. మన దేశానికి అత్యవసరం! ప్రపంచంలో ఆఫ్రికా ఖండం తర్వాత ఎక్కువగా మలేరియా కేసులు నమోదయ్యే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. దేశంలో ఏటా లక్షలాది కేసులు నమోదవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే టెస్టులు చేసే సౌకర్యాలు లేకపోవడం, మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటంతో అధికారికంగా కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందని పేర్కొంటున్నారు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో మలేరియా వ్యాప్తి బాగా తగ్గిపోయిందని వివరిస్తున్నారు. ►2019లో భారత్‌లో సుమారు 56 లక్షల మందికి మలేరియా సోకగా.. 7,700 మంది మరణించినట్టు డబ్ల్యూహెచ్‌వో అంచనా. ►కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జూలై చివరినాటికి దేశవ్యాప్తంగా 64,520 మలేరియా కేసులు నమోదుకాగా.. 35 మంది చనిపోయారు. ►హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ మన దేశంలో ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుందని ఫార్మా వర్గాలు తెలిపాయి. ప్రపంచానికి ఓ బహుమతి మలేరియా వ్యాక్సిన్లపై 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. జీఎస్కే ఫార్మాతయారు చేసిన ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌పై పలు దేశాల్లో విస్తృతంగా ప్రయోగం నిర్వహించారు. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్‌ను డబ్ల్యూహెచ్‌వో తరఫున సిఫార్సు చేస్తున్నాం. మలేరియా బాధిత దేశాల్లో పిల్లలకు పెద్ద ఎత్తున ఈ వ్యాక్సినేషన్ చేపట్టాలి. – డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ -
మలేరియాకు ర్యాడికల్ చికిత్స!
మళ్లీ మళ్లీ జ్వరం వస్తుండటం ఎందుకంటే... మలేరియా అనేది ప్రోటోజోవా అనే విభాగానికి చెందిన ఏకకణ జీవి అయిన ‘ప్లాస్మోడియమ్’ కారణంగా వస్తుంది. మళ్లీ ఇందులోనూ కొన్ని రకాలు ఉంటాయి. ఉదాహరణకు ప్లాస్మోడియమ్ వైవాక్స్, ప్లాస్మోడియమ్ ఓవ్యూల్. మిగతా రకాలు ఎలా ఉన్నా... ఇవి మాత్రం చికిత్స తర్వాత... మందులకు దొరికి నశించిపోకుండా ఉండేందుకు వెళ్లి కాలేయంలో దాక్కుంటాయి. ఒకవేళ ఇవి అక్కడ దాక్కుని ఉంటే... చికిత్స తర్వాత కొన్ని రోజులకూ లేదా కొన్ని నెలలకు సైతం మళ్లీ మళ్లీ జ్వరం తిరగబెడుతూ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని పూర్తిగా తొలగించేలా చేయడానికే ఈ ‘ర్యాడికల్ చికిత్స’ అవసరమన్నమాట. మలేరియా వచ్చినప్పుడు కొంతమంది ప్రాథమికంగా చికిత్స తీసుకుని తగ్గగానే దాని గురించి మరచిపోతారు. నిజానికి మలేరియా తగ్గాక కూడా ఆ జ్వరానికి ‘ర్యాడికల్ ట్రీట్మెంట్’ అనే చికిత్స తీసుకోవాలి. అంటే శరీరంలోని మలేరియల్ ఇన్ఫెక్షన్ను పూర్తి స్థాయిలో తీసివేయడమన్నమాట. సాధారణంగా మలేరియా జ్వరం తగ్గిన రెండు వారాల పాటు ఈ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే మలేరియా జ్వరం మళ్లీ రావచ్చు. మరప్పుడు ఏం చేయాలి? మలేరియా వచ్చాక అది ప్లాస్మోడియమ్ వైవాక్స్, ప్లాస్మోడియమ్ ఓవ్యూల్ రకానికి చెందిందా కాదా అని తెలుసుకోవడం కోసం ‘బ్లడ్ స్మియర్’ను మైక్రోస్కోప్ కింద పరీక్షించాల్సి ఉంటుంది. బాధితుడికి ప్లాస్మోడియమ్ వైవాక్స్ ఉందని తెలిశాక, వాస్తవానికి అతడికి ‘ప్రైమాక్విన్’ అనే మందును 14 రోజుల పాటు ఇవ్వాలి. అయితే వాళ్లలో ‘జీ6పీడీ’లోపం ఉంటే అలాంటివాళ్లకు ప్రైమాక్విన్ మందు ఇవ్వకూడదు. ఆ లోపం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ‘జీ6పీడీ’ అనే పరీక్ష నిర్వహించి, లోపం లేనివాళ్లకు మాత్రమే ప్రైమాక్విన్ మందు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మందును నిర్ణీత కాలంపాటు బాధితుడికి ఇచ్చి... అతడిలోనుంచి మలేరియాను సమూలంగా తొలగిపోయేలా చేయాలి. దీన్నే ‘ర్యాడికల్ ట్రీట్మెంట్’ అంటారు. డాక్టర్ జి. నవోదయ సీనియర్ ఫిజీషియన్, జనరల్ మెడిసిన్ -
దోమకాటు: బోదకాలు, చికున్ గున్యా, కాలా అజర్.. ఇంకా
వానాకాలం వచ్చిందంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ ఇదే సమయంలో మనిషికి ప్రమాదకరమైన దోమల్లాంటి కీటకాల విజృంభణ పెరుగుతుంది. అనాది కాలంగా దోమకాటు మనిషికి ప్రాణాంతకంగా ఉంటోంది. ఆధునిక యుగంలో వైద్య విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అందుకే దోమలే కదా, అని తీసిపారేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ లాంటి ఉష్ణమండల దేశాల్లో, జనాభా అధికంగా ఉండే దేశాల్లో దోమలు పలురకాలుగా చెలరేగుతుంటాయి. వీటివల్ల రకరకాల వ్యాధులు సంభవించడమే కాకుండా, వీటిలో కొన్ని వ్యాధులు ప్రాణాంతకాలు కూడా! ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం దోమకాటుకు భారత్‌తో సహా దక్షిణాసియాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సో.. అజాగ్రత్త అస్సలు పనికిరాదు. దోమలు.. వ్యాధులు మనిషి రక్తాన్ని నేరుగా పీల్చే దోమలు అదే రక్తంలోకి పలురకాల సూక్ష్మ క్రిములను ప్రవేశపెడతాయి. దీంతో మనిషిలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. భారత్‌లో దోమల ద్వారా వ్యాపించే కొన్ని ప్రమాదకరవ్యాధుల వివరాలు ఇలా ఉన్నాయి.. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వ్యాపిస్తుంది. ఉదయం, సాయంత్ర వేళ్లలో అనాఫిలస్ దోమకాటు వల్ల ప్లాస్మోడియం సోకుతుంటుంది. సోకిన తర్వాత అధిక జ్వరం, విపరీతమైన చలి, తలనొప్పి, విపరీతమైన చెమటలు, కండరాల నొప్పి లాంటి లక్షణాలు బయటపడతాయి. పిల్లలు, గర్భిణులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు, తరచూ ప్రయాణాలు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం అతం్యంత ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. తగ్గడానికి క్లోరోక్వినాన్ మందును వాడతారు. బోదకాలు ఒకప్పుడు భారత్‌లో పలు ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేది. వుచరేరియా అనే పరాన్నజీవి వల్ల, క్యూలెక్స్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. మనిషి లింఫాటిక్ వ్యవస్థలో పరాన్న జీవి చేరుకొని రక్తం నిండా దాని లార్వాని కోట్ల సంఖ్యలో విడుదల చేస్తుంది. దీనివల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతిని కణజాలాలు వాయడం, చర్మం బిరుసెక్కడం, అవయవాల్లో అనవసర ద్రవాలు చేరడం సంభవిస్తుంది. దీనివల్ల క్రమంగా వైకల్యం వస్తుంది. చికున్ గున్యా ఇది కూడా వైరస్ ద్వారా సోకుతుంది. ఏడిస్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. తలనొప్పి, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు వారం పాటు ఉండి తగ్గినా, నొప్పులు మాత్రం నెలల పాటు కొనసాగుతాయి. డెంగ్యూతో ఈ వ్యాధి లక్షణాలకు పోలిక ఉంటుంది. రక్తపరీక్షద్వారా నిర్ధారిస్తారు. కాలా అజర్ లెస్మోనియాసిస్ పరాన్నజీవి వల్ల సాండ్‌ఫ్లై కాటుతో సంక్రమిస్తుంది. వారాల పాటు తగ్గని జ్వరం, ప్లీహం ఉబ్బడం, రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటాయి. తొందరగా చికిత్స అందకపోతే రెండేళ్లలో మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ జ్వరం తగ్గిన తర్వాత చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇది వైరస్ ద్వారా క్యూలెక్స్ దోమ కాటు వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు వస్తాయి. ముదిరినప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో మూర్చరోగం కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. డెంగ్యూ వైరస్ ద్వారా సోకుతుంది. సోకిన 3–14 రోజుల్లో అధిక జ్వరం, వాంతులు, కీళ్లనొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు బయటపడతాయి. తగ్గడానికి నిర్దిష్టమైన మందులు లేవు. లక్షణాలను బట్టి మందులు వాడతారు. దాదాపు వారంలో తగ్గుతుంది. కానీ ఒక్కోసారి జ్వరం చాలా ఎక్కువైతే చర్మం కింద రక్తనాళాలు చిట్లడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు ఆస్పత్రిలో చేరాల్సిఉంటుంది. దోమల ద్వారా వచ్చే వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు. ఉదాహరణకు మలేరియా దాదాపు 90కిపైగా దేశాల్లో కనిపిస్తుంది. ఏటా దాదాపు 50 కోట్లమంది దీని బారిన పడుతుంటే, వీరిలో 27 లక్షల మంది మరణిస్తుంటారు. దోమల ద్వారా ఏటా 250 కోట్ల మంది పలు వ్యాధులబారిన పడుతున్నట్లు అంచనా. అందువల్ల ఇవి సోకిన తర్వాత చికిత్స కన్నా నివారణే మంచి మార్గమని నిపుణుల సలహా. చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే! -
హైదరాబాద్ లో హడలెత్తిస్తున్నడెంగ్యూ
-
ప్రజారోగ్యంపై పట్టింపు ఏది?
భారతదేశం కరోనా దెబ్బకు విలవిలలాడిపోవడానికి ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపు చాలా తక్కువగా ఉండటం కూడా కారణమే. పైగా కేంద్రం, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభు త్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థను, మనకు ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. మరోవైపున కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవడమా? మన పొరుగున ఉన్న చైనా, మనకన్నా అధిక జనాభా ఉన్న దేశం.. మలేరియా రహితదేశంగా మారిపోయింది. బుధవారం అంటే నిన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ప్రకటించిన 40 దేశాల్లో చైనా చేరిపోయింది. అంతేకాకుండా, మనకన్నా చిన్నదేశం, అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న శ్రీలంక కూడా మలేరియా రహిత దేశమైపోయింది. సెప్టెంబర్ 5, 2016న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇట్లా 40 దేశాలు తమ గడ్డమీదినుంచి మలేరియాను తరిమి కొట్టాయి. ఇవేకాక అల్జీ రియా, మారిషస్, జోర్డాన్, లిబియా, మొరాకో, అల్బేనియా నుంచి బ్రిటన్ దాకా యూరప్ దేశాల్లో చాలా మలేరియా నుంచి విముక్తి అయ్యాయి. అంతేకాకుండా, దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, జమైకా, క్యూబా, ఉరుగ్వే లాంటి దేశాలు ఈ జాబితాలో చేరి పోయాయి. కానీ మనదేశంలో మాత్రం ఇంకా మలేరియా విలయ తాండవం చేస్తూనే ఉంది. మారుమూల ప్రాంతాలైన అడవుల్లో నివసించే ఆదివాసులు ప్రతి సంవత్సరం లెక్కలకు అందనంత మంది మలేరియా ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు. రాబోయే పది సంవత్సరాలలో భారత్‌ని మలేరియా రహితదేశంగా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేసి నట్టు చెబుతున్నారు. అయితే మనదేశంలో ఉన్న ఆదివాసుల జీవన పరిస్థితులు, స్థితిగతులను పరిశీలిస్తే ఇది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం రాక మానదు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొనసాగుతున్న వ్యత్యాసాలు ప్రజల ఆరోగ్య స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి. మలేరియాతోపాటు, మరొక ముఖ్యమైన సమస్య క్షయ వ్యాధి. ఇది కూడా ప్రజలలో చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇండియా క్షయ వ్యాధి నివేదిక–2020 ప్రకారం 26.9 లక్షల కేసులు నమోదు కాగా, 79,144 మంది మరణించారు. 2019లో 24.04 లక్షల కేసులు నమోదు అయ్యాయి. అంటే 2019 కన్నా 2020లో 14 శాతం అధి కంగా కేసులు నమోదయ్యాయి. అయితే అనధికార లెక్కలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో అంటే 2025 నాటికి టి.బి. రహిత దేశంగా భారతదేశాన్ని తయారుచేస్తామని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రతి సంవత్సరం సరాసరి 4,36,000 మంది టి.బి. వల్ల మరణి స్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 2019లో పదిలక్షల 40వేల మంది క్షయవల్ల మరణిస్తే, మొత్తంగా 20 లక్షల 64 వేలమంది ఆ వ్యాధి బారిన పడ్డారు. ఇందులో మహిళలు 34శాతం కాగా, 59శాతం పురుషులు, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో అధిక సంఖ్యలో క్షయవ్యాధి బారిన పడుతున్నారు. క్షయవ్యాధిలో ఇండియా, మొదటిస్థానంలో ఉండగా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా దేశాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. దీనితోపాటు పోషకాహార లోపం మరొక ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రజలు అనారోగ్యం పాలు కావడానికి 50 శాతం వరకు పోషకాహార లోపమే ప్రధాన కారణమనే విషయాన్ని న్యూట్రిషన్ వరల్డ్–2020 నివేదిక బయటపెట్టింది. పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉంటోందనీ, దాదాపు 50 శాతం మంది పిల్లల్లో ఎముకల ఎదుగుదల లేదని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో కూడా ఆదివాసీ, దళితుల శాతం అధికం. పోషకాహార లోపంతోపాటు, రక్తహీనత కూడా వీరిలో అధికం. ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. దళితుల్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 48 శాతం దళితుల్లోని బాల, బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉండగా, కరోనాలాంటి వ్యాధి ప్రబలితే ఎటు వంటి పరిస్థితులను మనం చవిచూశామో తెలుసు. ఇంకా కరోనా ప్రభావం ఎంత దుష్ప్రభావాన్ని మిగిల్చిందో, మిగులుస్తుందో లెక్కలు తేలాల్సి ఉంది. అంతేకాకుండా, జీవనశైలి మీద ఆధారపడిన మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల వల్ల కరోనా బారిన పడిన వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి లెక్కలు లేవు. ఇవన్నీపోనూ.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల ఆరోగ్య సమస్యను ప్రాధాన్యత లేని సమస్యగా చూస్తున్నాయి. ఇది తీవ్రంగా కలచివేసే సమస్య. మనం రోజురోజుకూ ఎంతో పురోగమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఎటువంటి దూరదృష్టి లేదు. ప్రజల ప్రాణాలు, భద్రత, ఇతర సమస్యల కేంద్రంగా ఈ అంశాన్ని ఆలో చించడం మానేశాం. మన ఆరోగ్య సూచికలన్నీ ప్రపంచ దేశాలన్నింటిలో తిరోగామి స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం మనకు ఒక కచ్చితమైన ఆరోగ్య విధానం లేదు. పేరుకు హెల్త్ పాలసీలు తయారు చేసుకుంటాం. కానీ అది కూడా ఎక్కడో పాత కాలమైతే అల్మారాలో, ఇప్పుడైతే కంప్యూటర్ సర్వర్‌లో దాగి ఉంటుంది. అటువంటిదే 2017 జాతీయ హెల్త్ పాలసీ, అంతకుముందు రెండుసార్లు హెల్త్ పాలసీలు తయారు చేశారు. కానీ అవి ఆచరణకు నోచుకోలేదు. 2017లో రూపొందించిన పాలసీ కూడా అటువంటిదే. అందులో అన్ని సాంకేతికపరమైన సమస్యలే తప్ప, ఎక్కడా నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. పైగా ఆ నివేదికలోనే చెప్పిన విషయం విస్మయం కలిగించక మానదు. ‘కొంతమంది ఆరోగ్య విషయాన్ని, ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని అంటున్నారు. కానీ, మన దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపా యాలు అటువంటి స్థితిలో లేవు’ అని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు స్థూల జాతీయోత్పత్తిలో 1.26 శాతంగా ఉందని, అది 2.5 శాతం పెరిగితే తప్ప ఎటువంటి నూతన సౌకర్యాలు సాధ్యంకావని తేల్చిచెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలు మనకన్నా అదనంగా ఆరోగ్యంమీద ఖర్చు పెడుతున్నాయి. అమెరికా 17 శాతం, బ్రెజిల్ 9.2 శాతం, డెన్మార్క్ 10.1 శాతం, కెనడా 10.7 శాతం జాతీయ స్థూల ఉత్పత్తిలో ఖర్చు చేస్తున్నాయి. కాబట్టే ఆ దేశాలు ఆరోగ్య రంగంలో వచ్చే ఎటు వంటి సమస్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి. భారత్ కరోనా దెబ్బకు విలవిలలాడి పోవడానికి ఈ బడ్జెట్ లేమి కూడా కారణం. కేంద్ర, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభుత్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవ స్థను, మన మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. అంతేకాకుండా, హెల్త్ పాలసీ–2017 స్థానంలో మరొక సమ గ్రమైన, నూతనమైన ఆరోగ్య విధానం రూపకల్పన చేసుకోవాలి. అందులో చాలా స్పష్టంగా కేంద్ర, రాష్ట్రాల విధులను, బాధ్యతలను ప్రత్యేకంగా పేర్కొనాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనాను దృష్టిలో పెట్టుకొని, ఇకపై ప్రజల మీద భారం వేయకుండా ప్రభు త్వమే ఆరోగ్య బాధ్యతను వహించాలి. సార్వజనీన ఆరోగ్య రక్షణకు అంటే ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యాన్ని అందించే విధానాన్ని తయారు చేసుకోవాలి. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవ డమా? మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
మరింత తగ్గిన దోమకాటు జ్వరాలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది దోమకాటు జ్వరాలు మరింతగా తగ్గాయి. జ్వరాల తీవ్రత లేకపోవడంతో పెద్ద ఉపశమనం లభించినట్లయింది. 2019–20తో పోలిస్తే 2020–21లో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా కేసులు భారీగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లోను, 2020తో పోలిస్తే 2021 రెండు నెలల్లోను ఈ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది అంటే జనవరి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఏడు వారాల్లో లెక్కిస్తే చికున్‌గున్యా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఫిబ్రవరి చివరికి వేసవిలోకి వచ్చినట్లే. దీంతో దోమకాటు జ్వరాల ప్రమాదం తక్కువే. ఇక చూసుకోవాల్సిందల్లా కలుషిత నీటివల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి కేసులను నియంత్రించుకోవడమే. కొద్దినెలలుగా కోవిడ్ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నా దోమకాటు వ్యాధుల నియంత్రణపై పైచేయి సాధించింది. కలుషిత నీటి నియంత్రణకు కార్యాచరణ సాధారణంగా వేసవి కాలంలో కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి కేసులు వస్తుంటాయి. వీటి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. పల్లెటూరి నుంచి పట్టణాల వరకు తాగునీరు పరిశుభ్రంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించారు. 26 లక్షల దోమతెరల పంపిణీ లక్ష్యం రాష్ట్రంలో ఏజెన్సీతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా దోమల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట దోమతెరల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 25.94 లక్షల దోమతెరలు పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 1.14 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. ఎల్ఎల్ఐఎన్ (లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్) పేరుతో ఇచ్చే ఈ దోమతెరలు దోమల నుంచి ఊరటనివ్వగలవు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి మంచి ఫలితాలిచ్చాయి. వచ్చే సీజన్ నాటికి వీలైనంత వరకు దోమతెరలు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. తగ్గిన కేసుల తీవ్రత గతంతో పోలిస్తే దోమకాటు జ్వరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మా ముందున్న లక్ష్యం సురక్షిత మంచినీరు అందించి డయేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు రాకుండా నియంత్రించడమే. దీనికోసం కార్యాచరణ రూపొందించాం. మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. – డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
కేరళలో కొత్త వ్యాధి కలకలం
కేరళ : మలేరియా జాతికి చెందిన కొత్త పరాన్నజీవి కేరళలో కలకలం రేపుతోంది. ఇటీవల సూడాన్ నుంచి కేరళకి వచ్చిన ఓ సైనికుడి శరీరంలో దీన్ని కనుగొన్నారు. అతడి ద్వారా వచ్చిన ఈ కొత్త జాతి ‘ప్లాస్మోడియం ఒవల్‌గా’ గుర్తించారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె.శైలజ తెలిపారు. అతనికి కన్నూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. నివారణ చర్యలు చేపట్టడం ద్వారా, తగిన సమయానికి చికిత్స తీసుకోవటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు అని ఆమె పేర్కొన్నారు. కాగా, భారత్‌లో తొలి కరోనా వైరస్ కేసు కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో నమోదయ్యింది. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్ధి అక్కడినుంచి భారత్ వచ్చాడు. అతడిలో కరోనా వైరస్‌ను గుర్తించారు. అంతేకాకుండా 2018లో వచ్చిన నిఫా వైరస్ కూడా ఇక్కడి కొజికొడ్ జిల్లాలో వెలుగుచూసింది. Plasmodium ovale, a new genus of malaria, has been detected in the State. It was found in a soldier who was being treated at the District hospital in Kannur. The soldier had come from Sudan. The spread of the disease can be avoided with timely treatment and preventive measures. — Shailaja Teacher (@shailajateacher) December 10, 2020 -
‘కరోనా’ శాశ్వతంగా ఉండిపోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న, ప్రజలు చిత్తశుద్ధితో భౌతిక దూరం పాటిస్తున్న దేశాల్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికీ విజంభిస్తోంది. కరోనాను కచ్చితంగా కట్టడి చేసే వ్యాక్సిన్ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎలా, ఎప్పుడు తగ్గుతుందనే కలవరం వారిని వెంటాడుతూనే ఉంది. లాక్డౌన్ల వల్ల ప్రయోజనం లేదని, వాటి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువని కొంత మంది నిపుణలు వాదిస్తున్నారు. నిత్య జీవన పోరాటంలో భాగంగానే కరోనాను సామాజికంగా ముఖాముఖి ఎదుర్కోవడమే పరిష్కారమని వారు నిపుణులు సూచిస్తున్నారు. ముసలి, ముతక, వ్యాధులతో బాధ పడుతున్నవారిని మాత్రమే ఇళ్లకు పరిమితం చేసి మిగతా వారు సామాజికంగా కరోనా ఎదుర్కోవాలని, తద్వారా ‘హెర్డ్ ఇమ్యునిటీ (సామూహిక రోగ నిరోధక శక్తి) అభివద్ధి చెందుతోందని వారి వాదనలో నిజం లేకపోలేదు. రోగ నిరోధక శక్తి అందరిలో పెరగుతుందన్న గ్యారంటీ లేదు కనుక వ్యాక్సిన్లు కూడా అవసరమే. అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే వరకు చేతులు ముడుచుకొని కూర్చోవడం కుదరదు కనుక సామూహికంగానో, సామాజికంగానో కరోనాతో పోరాడక తప్పదు. (చదవంవడి: కోవిడ్ కట్టడిలో పాక్ బెటర్: రాహుల్) ప్రజల్లో సామూహికంగా రోగ నిరోధక శక్తి పెరగడం లేదా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన కరోనా వైరస్ కనుమరుగవుతుందని చెప్పలేం. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా, ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగినా నేటికి తట్టు, అమ్మవారు లాంటి బాల్యంలో వచ్చే రోగాలు, వయస్సులో వచ్చే సుఖరోగాలు, దోమల వల్ల వచ్చే మలేరియా లాంటి అంటు రోగాలు, వైరస్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లూయెంజాలు ఇప్పటికీ వస్తున్న విషయం తెల్సిందే. వాటిలాగే కరోనా శాశ్వతంగా పోయే అవకాశం లేదు. వాతావరణ పరిస్థితులను బట్టి ఇతర అంటు రోగాల లాగానే కరోనా కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కో చోట తక్కువ స్థాయిలోనో, తీవ్ర స్థాయిలోనో విజంభించవచ్చు. వ్యాక్సిన్లు లేదా స్వతహాగా ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది’....నెదర్లాండ్స్‌లోని యుట్రెక్ట్ యూనివర్శిటీ థియారిటికల్ ఎపిడిమియాలోజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న హాన్స్ ఈస్టర్‌బీక్ వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. (చదవండి: చైనా వ్యాక్సిన్ పరీక్ష : సానుకూల ఫలితాలు) -
ఏది డెంగీ.. ఏది కరోనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఓ వైపు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. మరోవైపు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో రాబోయే 15 రోజుల పాటు డెంగీ జ్వరాలు విస్తరించే అవకాశముందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే జ్వ రం వస్తే.. డెంగీదా? లేక కరోనాదా? తెలి యక జనానికి గందరగోళంగా మారింది. ము న్ముందు కరోనాతోపాటు డెంగీ కేసులు కూడా పెరిగే అవకాశం ఉండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కిందిస్థాయిలో ఇంటిం టి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే.. మరోవైపు డెంగీ, మలేరియా, చికున్ గున్యా తదితర వ్యాధుల ను నియంత్రించడంపై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. (చదవండి: బాధితులతో రాయ‘బేరాలు’) గతేడాది తీవ్రంగానే డెంగీ.. గతేడాది డెంగీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారమే అప్పుడు ఏకంగా 13వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డెంగీ వీరవిహారం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,100 వరకు డెంగీ కేసులు, 600 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. డెంగీకి, కరోనాకు కామన్‌గా రెండింటికీ ఒకే తరహా లక్షణాలుండటంతో ఏదేంటో అంతుబట్టడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసంగా ఉండటం డెంగీలో ఉండే సాధారణ లక్షణాలు. ఇవే కరోనాలో కూడా ఉండటంతో బాధితులు తమకు ఏది సోకిందో టెస్టులు జరిగి నిర్ధారణయ్యే వరకు తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రెండూ కలిసి వచ్చే అవకాశాలున్నాయా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవాల్సి రావడం వైద్య యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కరోనా కాలం కావడంతో ఉన్న సిబ్బంది అంతా దానికోసమే పనిచేయాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా తక్షణ నియామకాలు చేపట్టాలని సర్కారు ఆదేశించినప్పటికీ.. చాలాచోట్ల తాత్కాలిక నియామకాలకే నోటిఫికేషన్లు ఇవ్వడంతో భర్తీ ప్రక్రియ ముందుకుసాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 1682 కేసులు, 8 మంది మృతి) జిల్లాలకు ఇవే మార్గదర్శకాలు.. ⇒ ప్రతి జిల్లాలోనూ కరోనా కేసులు ఎక్కువున్న ప్రాంతాలు, తక్కువ ఉన్న ప్రాంతా లు, అసలు కేసులు నమోదు కాని ప్రాంతాలుగా వేర్వేరుగా విభజించాలి. ⇒ దోమల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతూనే కరోనా నిబంధనలను పాటించడంపై ప్రజలను చైతన్యం చేయాలి. ⇒ కరోనా జాగ్రత్తలతోపాటు ఇళ్లు, పరిసరా ల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ⇒ డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర నిర్ధారణ చేయాలి. ⇒ మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాల ను చేపట్టాలి. æ డెంగీ, కరోనా రెం డూ ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సమీపం లోని ఆసుపత్రికి సమాచారమివ్వాలి. -
క్లోరోక్విన్‌తో ఉపయోగం లేదు: డబ్ల్యూహెచ్‌వో
బెర్లిన్: కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. బాధితులకు ఈ ఔషధం పని చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు నిర్వహించిన పరీక్షను ముగించినట్లు వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్/రిటోనవిర్ కాంబినేషన్ డ్రగ్‌ను హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సలో వాడుతున్నారు. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనాను నయం చేస్తుందని ప్రచారం కావడంతో దీనిపై డబ్ల్యూహెచ్‌వో పరీక్ష చేపట్టింది. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనా బాధితులకు ఉపయోగపడినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది. క్లోరోక్విన్ ఇచ్చినప్పటికీ బాధితుల్లో మరణాల రేటు తగ్గలేదంది. -
54 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు
ముంబై: కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా.. నగరంలో డెంగ్యూ, మలేరియా, కుష్టు వ్యాధి కేసులు గత ఐదేళ్లలో ఇదే కాలంతో పోలిస్తే.. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 54 శాతం తగ్గాయని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) వెల్లడించింది. వర్షాకాలం ముందు లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఈ ఏడాది బీఎమ్సీ పరిధిలో చేపట్టే వ్యాధి నియంత్రణ చర్యలను ప్రభావితం చేస్తుందనే ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే గత ఐదేళ్ళతో పోల్చితే.. ఈ సంవత్సరం మే వరకు.. ముంబైలో దోమల ద్వారా కలిగే వ్యాధులు అత్యల్ప సంఖ్యలో నమోదయ్యాయని డాటా చూపిస్తుంది. 2016 జనవరి నుంచి మే మధ్య కాలంలో నీరు, దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు 1,762 నమోదయ్యాయని.. అయితే ఈ ఏడాది మే వరకు ఈ వ్యాధుల సంఖ్య 54శాతం తగ్గి 809 కేసులు మాత్రమే వెలుగు చూశాయని డాటా వెల్లడించింది. 2016 మొదటి ఐదు నెలల్లో 114 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది వీటి సంఖ్య కేవలం 37 మాత్రమే అని బీఎమ్సీ తెలిపింది. దోమల ద్వారా వచ్చే వ్యాధులలో ఈ ఏడాది 71 శాతం తగ్గుదల ఉందన్నది. అదేవిధంగా, 2016లో ఇదే కాలంలో ముంబైలో 1,628 మలేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది వీటి సంఖ్య 753కు పడిపోయిందని వెల్లడించింది. నగరంలో మే 20 వరకు 19 కుష్టు వ్యాధి కేసులు నమోదయ్యాయి, 2016లో మొదటి ఐదు నెలల్లో ఈ సంఖ్య 20 అని అధికారులు తెలిపారు.(ఏకంగా చైనాను దాటేసిన మహారాష్ట్ర!) ప్రస్తుతం నిర్మాణ కార్యకలాపాలు తగ్గడం వల్ల మలేరియా, ఇతర వ్యాధులు తగ్గాయని ఆరోగ్య అధికారులు తెలిపారు. ‘లాక్డౌన్ సమయంలో ప్రజల కదలికలు 90 శాతం పరిమితం చేయబడ్డాయి. అంతేకాక ప్రజలు పార్కులు, ఆట స్థలాలకు వెళ్లలేదు. నిర్మాణాలపై పరిమితి కారణంగా.. నీరు నిల్వ ఉండే వస్తువులు తగ్గాయి. ఫలితంగా దోమల సంఖ్య కూడా బాగా తగ్గిందని’ అని బీఎమ్సీ అదనపు కమిషనర్ సురేష్ కాకాని అన్నారు. ప్రతి ఏడు వర్షా కాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల సంఖ్య పెరుగుతుందని.. అటువంటి రోగుల చికిత్స కోసం కోవిడ్ కాని ఆసుపత్రులను సిద్ధం చేశామని అన్నారు. డెంగ్యూ, మలేరియా, కుష్టువ్యాధి ఉన్న రోగులను కేఈఎమ్ (కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్) ఆసుపత్రితో పాటు ఇతర స్థానిక ఆసుపత్రులకు పంపుతామని కకాని తెలిపారు.(మందు బాబులకు కిక్ ఇచ్చే వార్త) కరోనావైరస్, మలేరియా, డెంగ్యూ, జ్వరం లక్షణాలు ఒకే రకంగా ఉండటం వల్ల రోగులు, వైద్యులలో భయాందోళనలు.. గందరగోళానికి కారణమవుతుందన్నారు. ‘ల్యాబ్ రిపోర్ట్స్ కంటే ముందే డెంగ్యూ, మలేరియాలో కనిపించే అసాధారణమైన ఇతర లక్షణాల వల్ల రోగ నిర్ధారణ చేయగలము. రుచి, వాసన కోల్పోవడం, వేళ్లు, పాదాలపై మచ్చలు వంటి లక్షణాల ద్వారా ఒక అంచనాకు రాగలం. అలాగే ఊఐపిరితిత్తుల గురించి తెలుసుకోవడానికి ఎక్స్-రే సహాయపడుతుంది’ అని హిందూజా ఆసుపత్రిలోని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ లాన్సెలాట్ పింటో అన్నారు. అంతేకాక గతంలో కోవిడ్ -19, డెంగ్యూతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిచామని ఆయన తెలిపారు. కరోనా రోగికి డెంగ్యూ కూడా ఉంటే ఆరోగ్యపరిస్థితులు మరింత విషమిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.(తుంపర్లు.. యమకింకర్లు!) -
మలేరియా మందు భేష్!
వాషింగ్టన్: కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. రెండు వారాలుగా తాను ఈ మందును తీసుకుంటున్నట్లు ట్రంప్ సోమవారం చెప్పడం తెల్సిందే. మరికొంత కాలం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకుంటానని, అది సురక్షితమైందని కరోనా వైరస్ ఎదుర్కొనే మేలైన మార్గమని మంగళవారం ఆయన పునరుద్ఘాటించారు. ‘అది చాలా శక్తిమంతమైన మందు. మీకు హాని కలిగించదు. కాబట్టి దాన్ని కరోనా చికిత్సకు వాడాలని అనుకున్నా’ అని విలేకరులతో చెప్పారు. (హెచ్1బీతో అమెరికన్లకు నష్టం లేదు!) ప్రపంచవ్యాప్తంగా చాలామంది వైద్యులు ఈ మందును ప్రశంసించారని, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లో గొప్ప అధ్యయనాలు జరిగాయని అమెరికాలోనూ పలువురు వైద్యులు ఈ మందుపై సానుకూలంగా వ్యవహరించారని ట్రంప్ వివరించారు. మరణం ముంగిట్లో ఉన్నవారికి ఈ మందు ఇచ్చి అది పనిచేయలేదని కొంతమంది ఒక అధ్యయనం ద్వారా చెప్పారని వాళ్లు తమ శ్రేయోభిలాషులు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. (ప్రపంచంపై కరోనా పంజా) మలేరియా చికిత్సకు ఈ మందును నలభై ఏళ్లుగా వాడుతున్నారని కానీ వైద్యుల సలహా మేరకు వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతిచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి వైద్యుల సలహా మేరకే ఎవరైనా ఆ మందును వాడాలని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ట్రంప్ శాస్త్రీయంగా నిరూపణ కాని ఓ మందును కరోనా చికిత్సకు వాడటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు విని ఎవరైనా ఈ మందును వాడితే ఎలా? అని సెనేట్ మైనారిటీ నేత చక్ షుమర్ ప్రశ్నించారు. చైనాతో ఒప్పందంపై భిన్నాభిప్రాయం చైనాతో వాణిజ్యానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో చేసుకున్న ఒప్పందంపై తనకు ఇప్పుడు భిన్నాభిప్రాయం ఉందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరిలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం 2020 –21లో అమెరికా ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలుచేసేందుకు చైనా అంగీకరించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని చైనా అడ్డుకోలేకపోయిందని వూహాన్‌కు మాత్రమే వైరస్‌ను పరిమితం చేసిన చైనా ఇతర దేశాలకు చేరకుండా ఎందుకు అడ్డుకోలేకపోయిందన్నది తెలియడం లేదని అన్నారు. -
వ్యాధులనుంచి ప్రజలను కాపాడుకుందాం
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా పు రపాలక శాఖ ఆధ్వర్యంలో శ్రీ కారం చుట్టిన ‘ప్రతి ఆదివారం– పది గంటలకి –పది నిమిషాలు’ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ పాల్గొనడంతో పాటు ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను నివారిద్దామని కోరారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరికీ మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. సీజనల్ వ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని ఈ లేఖలో తెలిపారు. కరోనాపై చేస్తున్న స మష్టి పోరాటం వల్ల ప్రజారో గ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అందరిలో అవగాహన పెరిగిందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించ కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అదేశించారని, పట్టణ ప్రగతిలో భాగంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. దోమల నివారణకు జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఇందుకోసం వారానికి కనీసం 10 నిమిషాలను మన కోసం, మన పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని నిర్ణయించామన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ సహకారంతో పురపాలక శాఖ ఒక క్యాలెండర్ రూపంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా కీటక నివారిణిల వినియోగం, దోమల నిర్మూలనకు మలాథియాన్ స్ప్రే, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని వారానికోసారి స్ప్రే చేస్తున్నామన్నారు. మురికి కాల్వల పూడిక తీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచి న నీటిని ఎత్తిపోయడం, రోజూ చెత్త తరలింపును పకడ్బందీగా నిర్వహించాలని పురపాలికల ను ఆదేశించామన్నారు. ఆదివారం శుభ్రత కోసం.. మన ప్రజలను, పట్టణాలను కా పాడుకునే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు గత వారం ‘ప్రతి ఆదివారం –పది గంటలకు–పదినిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని,. రానున్న పదివారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నా రు. శాసన సభ్యులు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ ఇళ్ల నుంచే ప్రారంభించాలని, తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. డాక్యుమెంట్ రైటర్స్ రూ.4లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం రూ. 4 లక్షల విరాళాన్ని అందించింది. ఆదివారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డితో కలిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివనాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణమాచారి తదితరులు ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేశారు. -
‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం చేస్తుంటారు. జరిగిన వాస్తవ సంఘటనకు మరికాస్త మసాల దట్టించి తమకు నచ్చినట్టు వార్తలను కొందరు రాస్తుంటారు. ఇలాంటి వార్తల బారిన పడ్డారు హీరోయిన్ పాయల్ ఘోష్. గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. దీంతో పాయల్‌కు కరోనా వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు పాయల్. ‘గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ముందుగా తలనొప్పి ప్రారంభమై అతర్వాత జ్వరం వచ్చింది. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాను. ఇది కరోనా కాదని నాకు కచ్చితంగా తెలుసు. అయితే నా కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రం ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేపించారు. వైద్య పరీక్షల్లో మలేరియా జ్వరం అని తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ త్వరలోనే ముగుస్తుందని బలంగా విశ్వసిస్తున్నా. అతిత్వరలోనే మనమందరం మునపటి సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని నా నమ్మకం’అంటూ పాయల్ పేర్కొన్నారు. పాయల్ తెలుగులో మంచు మనోజ్‌తో ‘ప్రయాణం’ , ఎన్టీఆర్‌తో కలిసి ‘ఊసరవెల్లి’ సినిమాలో చిత్రగా కనిపించిన విషయం తెలిసిందే. చదవండి: సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్ గ్రీన్‌సిగ్నల్ మీ త్యాగం అర్థం చేసుకోగలం: మహేశ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మలేరియా విజృంభణ.. కవలలు మృతి
కొయ్యూరు(పాడేరు): కొయ్యూరు మండలంలో మలేరియా ప్రబలుతోంది. యూ.చీడిపాలెం ఆరోగ్య కేంద్రం పరిధిలో పలువురు మలేరియా బారిన పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పాలసముద్రం గ్రామానికి చెందిన కొర్రా భీమరాజు(29)కు బుధవారం తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చింది. అతనికి రక్తపరీక్షలు నిర్వహించగా మలేరియాగా తేలింది. దీంతో పాలసముద్రం నుంచి పలకజీడి వరకు భీమరాజును డోలీలో తరలించారు. అక్కడి నుంచి వై.రామవరం కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా గంగవరం సమీపంలో మృతిచెందాడు. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న నీలవరం,గంగవరం,మర్రిపాకల్లో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల కిందట అదే పంచాయతీలో వేమనపాలానికి చెందిన రమేష్ అనే వ్యక్తి జ్వరంతో 25న మృతి చెందాడు. అతనికి మలేరియా లేదని వైద్యులు చెప్పినా అతని కుటుంబంలో ముగ్గురికి మలేరియా పాజిటివ్ వచ్చింది. అతను మరణించిన నాడే భార్య ప్రసవించింది.పుట్టిన మగబిడ్డకు శరీరమంతా కురుపులు రావడంతో వై.రామవరం ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. జిల్లా మలేరియా అధికారి మణి గ్రామాన్ని సందర్శించారు. గురువారం జిల్లా మలేరియా అధికారి మణి, పాడేరు అదనపు వైద్య ఆరోగ్య అధికారి లీలాప్రసాద్ పాలసముద్రం గ్రామాన్ని సందర్శించారు. కవలలు మృతి ఈనెల 27న గెమ్మెలి లక్ష్మికి వేమనపాలెంలో కవలలు జన్మించారు.కొద్ది సేపటికే మరణించారని వైఎస్సార్ సీపీ నాయకుడు దడల రమేష్ తెలిపారు.ఏడో నెలలో ప్రసవం అయినట్టు వైద్య సిబ్బంది చెబుతున్నారని చెప్పారు. ఆమెను కూడా వైద్య సిబ్బంది వై.రామవరం ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఐటీడీఏ పీవో బాలాజీ తెలిపారు. జిల్లా మలేరియా అధికారి, ఏడీఎంహెచ్‌వోలు ఆ గ్రామాలను సందర్శించి పూర్తి విషయాలు తెలుసుకుంటారన్నారని చెప్పారు. బోయపాడులో ఇద్దరి మృతి నక్కపల్లి(పాయకరావుపేట): మండలంలో రాజయ్యపేట శివారు బోయపాడులో జ్వరాలు విజృంభించాయి. ఇద్దరు మృత్యువాత పడగా సుమారు 20 మంది అస్వస్థతకు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. టీబీతో బాధపడుతున్న గ్రామానికి చెందిన బోంది లక్ష్మణ(65) తీవ్రమైన జ్వరంతో రెండు రోజుల క్రితం మరణించాడు. పిక్కి తలుపులు(32) అనే వ్యక్తి కూడా తీవ్రమైన జ్వరంతో గురువారం విశాఖలో మరణించాడు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మరణించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గొడిచర్ల పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కిషోర్ బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి, మందులు పంపిణీ చేశారు. పరీక్షల్లో సాధారణ జ్వరాలేనని నిర్థారణ అయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 8 మందికి జ్వరం ఉండడంతో వారి నుంచి రక్తపూతలు సేకరించినట్టు చెప్పారు. -
కరోనాలో హెచ్ఐవీ వైరస్ ఆనవాళ్లు
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే ప్రపంచానికి పరిచయమైందంటున్నారు ఫ్రెంచ్ నోబెల్ అవార్డు గ్రహీత లక్ మాంటెగ్నియర్. అక్కడి ల్యాబ్‌లో ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో ఈ వైరస్ ఉద్భవించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనాలో హెచ్ఐవీ జన్యుక్రమం ఉందని పేర్కొన్నారు. అంతేకాక మలేరియాలో ఉండే అతి సూక్ష్మజీవులు దీనిలోనూ ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇలాంటి వైరస్ల విషయంలో వూహాన్ ల్యాబ్‌కు ఎంతో నైపుణ్యముందని, 2000 సంవత్సరం నుంచే అది ప్రయోగాలు చేస్తుందన్నారు. ఇదిలావుంటే చైనాలోని అమెరికా ఎంబసీ అధికారులు వూహాన్ ల్యాబ్‌పై రెండేళ్ల కిందటే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రాణాంతక వైరస్‌లతో పాటు అంటు వ్యాధులపై అధ్యయనం చేస్తున్నారని వారు గతంలోనే ప్రస్తావించినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. (అమెరికా విచారణకు చైనా నో!) ఇప్పటికే అందరి దృష్టి వూహాన్ ల్యాబ్‌పై పడింది. అది కావాలనే ఈ జీవాయుధాన్ని సృష్టించిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర ప్రముఖులు అది చైనాల పనే అని నిర్ధారణకు వస్తుండగా, అందుకుతగ్గ ఆధారాలు మాత్రం ఇంతవరకూ వెలుగుచూడలేదు. కాగా వైరాలజీ డాక్టర్ లక్ మాంటెగ్నియర్ హెచ్ఐవీలో పరిశోధనకుగానూ ఫ్రాంకోఇయన్ బర్రీ- సినోస్సీతో కలిసి 2008లో నోబెల్ అవార్డును అందుకున్నారు. ఎయిడ్స్ వ్యాధికి హెచ్ఐవీ వైరస్ కారణమవుతుందన్న విషయాన్ని వీరి నేతృత్వంలోని బృందం గుర్తించింది. (మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది?) -
మలేరియా కారక సూక్ష్మజీవిపై సీసీఎంబీ పరిశోధనలు
సాక్షి, హైదరాబాద్: మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మలేరియా వ్యాధి నియంత్రణకు ఈ పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకోవడం ముఖ్యం కాగా.. మన ఎర్ర రక్తకణాల్లోకి చేరి డీఎన్ఏను వాడుకునే దీని జన్యువులను తెలుసుకోవాలంటే 4 పొరలను దాటాల్సి ఉంటుంది. ఈ పొరలన్నింటినీ తొలగించి లోపలి పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ఎలక్ట్రోపోరేషన్ అనే ఖరీదైన పద్ధతిని వాడుతున్నారు. డాక్టర్ పూరన్‌సింగ్ సిజ్‌వాలీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ సమస్య పరిష్కారానికి మలేరియా కారక ప్లాస్మోడియం ఫాల్సీపరంపై పరిశోధనలు చేపట్టింది. లైజ్–రీ సీల్ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా ప్లాస్మోడియం ఫాల్సిపరం కణాల్లోకి బయటి నుంచి జన్యువులను జొప్పించడం సులువవుతుంది. ఈ పరాన్న జీవి.. డీఎన్ఏలతో కూడిన ఎర్ర రక్తకణాల్లోకి చేరిపోయి అక్కడ ఉన్న డీఎన్ఏలోకి తనదైన జన్యువులు చొప్పిస్తుంది. పరిశోధన వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి. -
తగ్గని జ్వరాలు
సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆగట్లేదు. వ్యాధులు తగ్గ ట్లేదు. జనానికి జ్వరాల బాధలు తప్ప ట్లేదు. జూలైలో ప్రారంభమైన జ్వరాలు ఇప్పటికీ తగ్గట్లేదు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడ్డారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా జ్వరాలు పట్టిపీడిస్తు న్నాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాం తులు, విరేచనాలతో భయాందోళనకు గురవుతున్నారు. సెప్టెంబర్ చివరి నాటికే వర్షాల తీవ్రత తగ్గిపోవాలి. కానీ అక్టోబర్ నెలాఖరుకు కూడా వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఇప్పటికీ సాయం త్రం అయిందంటే చాలు అనేకచోట్ల క్యుములోనింబస్ మేఘాలతో ఒక్క సారిగా కుండపోత వర్షాలు కురుస్తున్నా యి. ఈ వర్షాలు నవంబర్లోనూ కొద్ది రోజులు కొనసాగే పరిస్థితి ఉండటంతో దోమలు మరింత విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఇద్దరే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ చెబుతున్నా అనధికారిక సమాచారం ప్రకారం డెంగీ కారణంగా కనీసం 150 మందికిపైగా చనిపోయారు. అందులో ఒక్క నిలోఫర్ ఆసుపత్రిలోనే ఏడుగురు పసి పిల్లలు డెంగీతో చనిపోయారని అక్కడి వైద్యులే ఆఫ్ ది రికార్డు సంభాషణల్లో చెబుతున్నారు. అంకెలను తక్కువ చూపిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశంలోనే డెంగీలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు వ్యాధుల విజృంభణ.. డెంగీ, చికున్‌గున్యా వానాకాలం సీజన్లో వచ్చేవి కాగా, శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ పుంజుకుంటుంది. వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉండటంతో డెంగీ, స్వైన్‌ఫ్లూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో వేర్వేరుగా వచ్చే ఈ రెండు వ్యాధులు ఇప్పుడు ఒకేసారి రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 20 వరకు తెలంగాణలో 1,319 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 21 మంది చనిపోయారు. దీంతో జ్వరం, తలనొప్పి వస్తేనే ప్రజలు డయాగ్నస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మామూలు జ్వరానికీ పరీక్షల కోసం వేలు ఖర్చు చేస్తున్నారు. ఇదే అదనుగా డయాగ్నస్టిక్ సెంటర్లు, వైద్యులు దీన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ పేరొందిన ఆస్పత్రి వైద్యులు ప్రతి చిన్న దానికి రూ.5 వేలకు మించి పరీక్షలు చేయిస్తున్నారు. దాంతో పాటు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు మందులు విచ్చలవిడిగా మింగుతున్నారు. అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుం దని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ చర్యలు కరువు.. దోమలే డెంగీ, మలేరియా జ్వరాలకు కారణం. ఈ దోమలను నివారించడానికి ఇంట్లో పరిశుభ్రత, నీటిని నిల్వ ఉండకుండా చూడటం ముఖ్యం. చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే అక్కడా డెంగీ దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమలను నిర్మూ లించాలంటే నిరంతరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఫాగింగ్ చేయాలి. కానీ ఈ ఏడాది ఫాగింగ్ యంత్రాలు పూర్తిస్థాయిలో లేకపోవ డంతో దోమల నివారణ జరగలేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలను ఎదుర్కోవడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైంది. చాలాచోట్ల డెంగీ కిట్లను సకాలంలో అందించలేకపోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడాయి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సరాసరి రూ.50 వేల వరకు డెంగీ, చికున్‌గున్యా, ఇతర వైరల్ జ్వరాలకు ఖర్చు చేసినట్లు అంచనా. కొన్ని కుటుంబాలైతే రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. కొందరు ప్రత్యేకంగా డెంగీకి బీమా చేయించుకున్నారు. సాయంత్రం ఓపీకి బ్రేక్.. ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఓపీ నిర్వహించాలన్న సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికీ డెంగీ, వైరల్ ఫీవర్లు వస్తున్నా సాయంత్రం డాక్టర్లు ఓపీ చూడట్లేదు. అయితే దీనికి రోగులు రావట్లేదన్న కారణం చూపుతున్నారు. ఇక కీలకమైన వైరల్ ఫీవర్ల సీజన్ కావడంతో కొందరు ప్రభుత్వ వైద్యులు సొంత ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మళ్లీ దోమలు విజృంభించే చాన్స్ ఇప్పటికీ ఆస్పత్రులకు డెంగీ జ్వరాలతో జనం వస్తూనే ఉన్నారు. సీజన్ అయిపోయినా వర్షాల వల్ల ఈ పరిస్థితి నెల కొంది. వర్షాలు తగ్గాక మళ్లీ దోమలు విజృం భించే అవకాశముంది. కాబట్టి ఇళ్లలో పరిశు భ్రత పాటించాలి. –డాక్టర్ కృష్ణ భాస్కర్, పిజీషియన్, సిటీ న్యూరో, హైదరాబాద్ డెంగీలో ఖమ్మం రెండో స్థానం.. దగ్గు, జలుబు, తలనొప్పి తో ప్రజలు ఆస్పత్రులకు వస్తున్నారు. డెంగీ కేసుల్లో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. అంటే దోమలు ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. దీంతో దోమలు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం -
డెంగీ డేంజర్..వణికిస్తున్నఫీవర్
విశ్వనగరం విషజ్వరాలతో వణికిపోతోంది. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డిప్తీరియా,డయేరియాలు పంజా విసురుతుండడంతో విలవిల్లాడుతోంది. ఓవైపు డెంగీ దోమమృత్యుఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ఏజెన్సీ దోమ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది డెంగీతో మరణించగా... వారిలో 40 మందికి పైగా గ్రేటర్ జిల్లాల వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో విషజ్వరాలు కేసులు నమోదవుతుండడంపై భయాందోళన వ్యక్తమవుతోంది.ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ రెట్టింపు అయింది. ఉస్మానియాలో ఓపీ 2వేల నుంచి 3వేలకు చేరుకుంది. గాంధీలో 3వేల నుంచి 5వేలకు.. ఫీవర్‌లో 1,200 నుంచి 2,500.. నిలోఫర్‌లో 1,500 నుంచి 2,500 చేరింది. సెలవు రోజుల్లో సైతం ఆయా ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందిస్తున్నారు. మరోవైపు అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు దోమల నివారణ మందు స్ప్రే చేయాలని.. కాలనీలు, రోడ్లపై చెత్త లేకుండా ఏరోజుకారోజు తొలగించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎందుకీ పరిస్థితి? 2018 నవంబర్ మొదలు ఈ ఆగస్టు వరకు ఎన్నికల హడావుడి కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బందికీ ఎన్నికల విధులు అప్పగించారు. దీంతో ఆ సమయంలో బస్తీల్లో ఫాగింగ్, యాంటీలార్వా ఆపరేషన్ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు కాలనీల్లో కొత్త నిర్మాణాలు వెలిశాయి. సెల్లార్లు తవ్వడం, నిర్మాణాల క్యూరింగ్ కోసం నీటిని వాడడం, గదుల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, ట్యాంకులపై మూతలు లేకపోవడం వల్ల అవన్నీ డెంగీ దోమలకు నిలయంగా మారాయి. కనీసం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫాగింగ్ చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ దోమలువిస్తరించడంతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డెంగీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. రెండు రోజుల క్రితం మదీనాగూడకు చెందిన హేమంత్(10), అల్లాపూర్ డివిజన్ గాయిత్రినగర్కు చెందిన అభిషేక్(21), సికింద్రాబాద్‌కు చెందిన టిజాన్ ఎలిసా విన్స్టన్(13), నార్సింగి మున్సిపాలిటీలో పర్హీన్(15) మృతి చెందగా... బుధవారం లాలాపేటకు చెందిన రిత్విక(5) మరణించింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ సహా నగరంలోని ఏ ఆస్పత్రిని పరిశీలించినా 40–50 మంది డెంగీ బాధితులే కనిపిస్తున్నారు. ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతుండడంతో ఇప్పటికే సెలవు రోజుల్లోనూ ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన వైద్యారోగ్యశాఖ తాజాగా వైద్య సిబ్బంది సెలవులపై ఆంక్షలు విధించింది. పరిస్థితి కుదుటపడే వరకు అనివార్యమైతే తప్ప.. సెలవులు మంజూరు చేయొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు డెంగీ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా జీహెచ్ఎంసీ సహా వైద్యారోగ్యశాఖను ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం హెచ్చార్సీలో బుధవారం ఫిర్యాదు చేసింది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకుపైగా డెంగీ పాజిటీవ్ కేసులు నమోదు కాగా... వారిలో ఇప్పటికే 50 మంది మృతి చెందారు. లెక్కల్లో తకరారు... డెంగీ బాధితుల లెక్కలపై ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు 2,113 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు చెబుతున్నా.. వాస్తవంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,889 మంది నుంచి నమూనాలు సేకరించి, ఐపీఎంలో పరీక్షించగా వీరిలో 451 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది. ఒక్క ఆగస్టులోనే 232 కేసులు నమోదయ్యాయి. ఇక ఉస్మానియాలో మే నుంచి ఇప్పటి వరకు 911 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 208 మందికి పాజిటివ్ వచ్చింది. నిలోఫర్ ఆస్పత్రిలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో 799 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వీటిలో ఒక్క ఆగస్టులోనే 499 కేసులు నమోదు కావడం విశేషం.ఫీవర్ ఆస్పత్రిలో జులై, ఆగస్టులో 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 391 మంది హైదరాబాద్ జిల్లా వాసులు కాగా, మిగిలిన వారంతా రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన వారే. ఇక యశోద, కేర్, అపోలో, కిమ్స్, సన్‌షైన్, సిటిజన్, కామినేని, గ్లోబల్, తదితర ప్రైవేటు ఆస్పత్రులు డెంగీబాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ రోగులకు పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. డెంగీ బాధితుడి నుంచి రెండో శాంపిల్ సేకరించి ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉన్నప్పటికీ.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా దీన్ని పాటించడం లేదు. దీంతో ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులనే డెంగీ కేసులుగా భావిస్తోంది. డెంగీకి కారణమిదే... ఈడిన్ ఈజిఫ్టై (టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాలు సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ రాజన్న,చిన్నపిల్లల వైద్యుడు అవసరం లేకపోయినా? ఆరోగ్యవంతుడి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. డెంగీ జ్వరంతో వీటి సంఖ్య క్రమేణా తగ్గుతుంటుంది. 10వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే తిరిగి వాటిని భర్తీ చేయాలి. 20వేల లోపు ఉన్నప్పుడు... రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే ఎక్కించాలి. 20వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తస్రావం అయినా ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా రక్తం గడ్డకట్టేందుకు ప్లాస్మాను ఎక్కిస్తారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో జరిగే అనర్థాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ప్లేట్లెట్ల సంఖ్యతో పాటు రక్తంలో ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ) ఎంత ఉందనేది పరిశీలించడం ముఖ్యం. పీసీవీ సాధారణంంగా ఉండాల్సిన దానికంటే 20శాతం, అంతకంటే ఎక్కువైతే అత్యవసరంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా ఆస్పత్రులు అవసరం లేకపోయినా ప్లేట్లెట్స్ ఎక్కించి, రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పండ్లకు డిమాండ్.. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోతుంటాయి. వైద్యులు ఇచ్చే మందులతో పాటు ప్రత్యామ్నాయంగా బొప్పాయి, కీవీ పండ్లు ప్లేట్లెట్స్ కౌంట్స్‌ను పెంచేందుకు దోహదపడుతుంటాయని అంతా భావిస్తున్నారు. దీంతో సాధారణ జ్వరపీడితులే కాకుండా డెంగీ బాధితులు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఈ పండ్ల ధరలను అమాంతం పెంచేశారు. నిన్న మొన్నటి వరకు ఒక కీవీ పండు రూ.15 ఉండగా, ప్రస్తుతం రూ.50 వరకు ధర పలుకుతోంది. ఇక కిలో బొప్పాయి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60కి పైగా పలుకుతోంది. దోమల భారీ నుంచి రక్షించుకునేందుకు తెరలను కొనుగోలు చేస్తుండడంతో వాటి ధరలు కూడా అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో రూ.200లోపు దొరికిన దోమ తెర... ప్రస్తుతం రూ.1500కి పైగా ధర పలుకుతోంది. ఇదీ పరిస్థితి ♦ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజుల్లో ఓపీ సంఖ్య 1,000 వరకు ఉండగా... నాలుగైదు రోజుల నుంచి దాదాపు 2,000 దాటుతోందని సూపరిటెండెంట్ గంగాధర్ తెలిపారు. ♦ ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రంలో సాధారణ రోజుల్లో 100 వరకు ఉండే ఓపీ.. ప్రస్తుతం 200 దాటుతోందని డా.పల్లవి తెలిపారు. ఇక్కడ కనీసం ప్యారాసిటమాల్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ♦ మల్లాపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓపీ 100 నుంచి 200లకు పెరిగింది. ♦ ఏఎస్‌రావునగర్ జమ్మిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ రెండింతలైందని డాక్టర్ తేజస్వీని తెలిపారు. ♦ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో డెంగీతో ఇప్పటికే ముగ్గురు మరణించారు. మదీనాగూడకు చెందిన హేమంత్ (10), పాపిరెడ్డి కాలనీకి చెందిన అవినాష్ (13), మాదాపూర్ చందానాయక్ తండాకు చెందిన చందర్‌నాయక్ (38) డెంగీతో మృతి చెందారు. ♦ మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి, సరూర్‌నగర్, మీర్పేట్, మలక్‌పేట్‌లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు. ♦ సికింద్రాబాద్‌లోని ఐదు డివిజన్లలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. లాలాపేట యాదవ బస్తీకి చెందిన చిన్నారి రుత్విక బుధవారం డెంగీతో మృతి చెందడం గమనార్హం. ♦ అంబర్‌పేట నియోజకవర్గంలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 50 నుంచి 250కి చేరింది. ♦ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి జ్వరపీడితులు పోటెత్తుతున్నారు. సాధారణంగా రోజుకు సగటున 700–800 మంది అవుట్‌పేషెంట్స్ వస్తుండగా... ఇటీవల ఈ సంఖ్య 1300లకు చేరింది. -
మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం!
హలో హాయ్. నా పేరు దోమ. నేను మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచినని అందరూ అనుకుంటారు. నన్ను విలన్‌గా చూస్తూ అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అందుకే రాజమౌళి కూడా తన సినిమాలో ఈగనే హీరో గా చూపించాడు. మీరు నన్ను తిట్టే తిట్లవల్లే ఆ దేవుడు నాకు తక్కువ ఆయుష్షును ప్రసాదించాడేమో. కానీ నేనూ జీవినే. నా వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెట్టి.. కేవలం నా వల్ల కలిగే జబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పటికీ నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నా వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు తెలియాలంటే వీడియోని క్లిక్చేయండి. -
డెంగీ హైరిస్క్ జిల్లాలు 14
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 14 డెంగీ హైరిస్క్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే మలేరియా హైరిస్క్ జిల్లాలను ఐదింటిని నిర్ధారించింది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, వరంగల్ రూరల్, కరీంనగర్, భూపాలపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా డెంగీ హైరిస్క్‌గా ఉన్నట్లు నిర్ధారించారు. ఇక మలేరియా హైరిస్క్ జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్ ఉన్నాయి. ఏడాదికేడాది డెంగీ కేసులు రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. 2012లో 962 డెంగీ కేసులు నమోదు కాగా, 2018లో ఏకంగా 6,362 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఏడాది మే నెల వరకు సీజన్ లేని సమయంలోనే 756 కేసులు నమోదయ్యాయి. అయితే మలేరియా కేసులు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయని సర్కారు నివేదిక తెలిపింది. 2015లో 11,880 మలేరియా కేసులు నమోదు కాగా, గతేడాది కేవలం 1,792 కేసులే నమోదయ్యాయి. చికున్‌గున్యా కేసులు 2012లో 94 కేసులు నమోదు కాగా, గతేడాది ఏకంగా 1,063 నమోదు కావడం గమనార్హం. రేపు కలెక్టర్లతో మంత్రి సమీక్ష... వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం ప్రబలే సీజనల్ వ్యాధులపై కేంద్రీకరించింది. ప్రధానంగా పది ఏజెన్సీ జిల్లాల్లో మలేరియా, డెంగీతో పాటు సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. శుక్రవారం సీజనల్ వ్యాధులు తీవ్రంగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూలు, ములుగు జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఐటీడీఏ అధికారులు, జిల్లా వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ముం దస్తుగా చేపట్టాల్సిన ప్రణాళికపై జిల్లా కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందుగా దోమల నివారణకు పంచాయతీరాజ్, విద్య, ఇరిగేషన్, మైనింగ్, ఐసీడీఎస్, మత్యశాఖ అధికార యంత్రాంగంతో సమన్వయ పరిచి చర్యలు తీసుకోనున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే వేక్టర్ బోర్న్ వ్యాధులైన చికెన్ గున్యా, యెల్లో ఫీవర్, డెంగీ, జికా, ఫైలేరియా లాంటి కేసుల వివరాలను కూడా ఈసారి సేకరించి, అవి ప్రబలకుండా అధికార యంత్రాంగంనివారణ చర్యలు తీసుకుంటారు. -
మలేరియా దోమలు ఇక మటాష్!
సిడ్నీ: మలేరియాను అదుపు చేయడంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలో కనిపించే ఓ రకం సాలీడులో ఉండే విషంలోని జన్యువులతో అభివృద్ధి చేసిన ఫంగస్‌ను మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఎనాఫిలిస్ దోమల సంహారంలో వినియోగించి మంచి ఫలితాలు సాధించారు. మలేరియాను వ్యాప్తిచేసే ఆడ ఎనాఫిలిస్ దోమలకు హాని కలిగించే ‘మెటరీజియమ్ పింగ్షీన్స్’ అనే ఫంగస్‌ను శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కృత్రిమంగా ఓ ప్రాంతాన్ని సృష్టించి, అక్కడ ఈ ఫంగస్ పెరిగే ఏర్పాట్లు చేశారు. జన్యుపరంగా మార్పులు చేసిన ఈ ఫంగస్ చాలావేగంగా దోమల ప్రాణాలను హరించింది. కేవలం 45 రోజుల్లోనే అక్కడి 99 శాతం దోమలను నిర్మూలించగలిగారు. -
జ్వరమా... మలేరియా కావచ్చు!
జ్వరమా... అయితే మలేరియా కావచ్చు అనేది వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కొన్నేళ్లుగా ప్రజల్లోకి బాగా వెళ్లిన మాట. ఒకప్పుడు ప్రతి జ్వర పీడితుడిని పరీక్షించి మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడు మలేరియాగా నిర్ధారించినా నివేదికలకు మాత్రం ఎక్కడం లేదు. కేసులు అధికమైతే ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించి సిబ్బంది వ్యాధిగ్రస్తుల వివరాలను దాచి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎదురు చూసేకన్నావ్యాధికారక దోమలను నివారించుకోవడంతో మనకు మనమే మలేరియాను పారదోలాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్) :జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి, 542 సబ్‌సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో కృష్ణానది, తుంగభద్ర, హంద్రీ, కుందు నదితో పాటు కేసీ కెనాల్, హంద్రీనీవా కాలువ, తెలుగుగంగ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, ఎల్ఎల్సీ కాలువ తదితరాలు ఉన్నాయి. వీటితో పాటు శ్రీశైలం ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల ప్రాజెక్టు, వెలుగోడు రిజర్వాయర్లు ఉండటం వల్ల మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. దీంతో పాటు 18 శాతం నల్లమల అటవీప్రాంతాల్లోని 42 చెంచుగూడెల్లో మలేరియా రావడానికి అధికంగా ఆస్కారం ఉందని నిర్ధారించింది. ఈ మేరకు ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, మహానంది, ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు, పాణ్యం, బండి ఆత్మకూరు, గడివేముల, శ్రీశైలం మండలాల్లోని 50 గ్రామాలను సమస్యత్మక (మలేరియా వ్యాప్తికి అవకాశం ఎక్కువ) గ్రామాలుగా గుర్తించారు. కేసులు తగ్గించే పనిలో వైద్యఆరోగ్య శాఖ.. ఒకప్పుడు ప్రతి ఒక్క జ్వరపీడితుడిని రక్తపరీక్ష చేసి మలేరియా నిర్ధారించిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు కేసులు తగ్గించేపనిలో పడింది. ఐదేళ్లుగా జ్వరపీడితుల సంఖ్య వాస్తవంగా తగ్గకపోయినా ఆ శాఖ అధికారులు తగ్గుతున్నట్లు నివేదికలు తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 5లక్షల 20వేలకు తగ్గకుండా రక్తనమూనాలకు పరీక్షలు(మలేరియా) చేస్తున్నారు. అయితే ఇందులో అన్ని కేసుల్లోనూ దాదాపుగా మలేరియా లేనట్లు వస్తోంది. లెక్కలు మార్చి చూపడం తప్ప వాస్తవాన్ని దాచిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలేరియా తగ్గుముఖం పడుతోంది గత నాలుగేళ్లతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మలేరియా వ్యాధి తగ్గుముఖం పడుతోందని డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా నివారణ చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జూన్ ఒకటి నుంచి డీడీటీ 50 శాతం పిచికారీ చేయిస్తున్నామన్నారు. జిల్లాలోని 12 మలేరియా సబ్యూనిట్స్లో అవసరమైన కీటక సంహారక మందులను, పనిముట్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేసిన దోమతెరలను ప్రజలు సక్రమంగా వినియోగించుకునేలా హెల్త్ సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగర పాలక సంస్థల సహకారంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి ఎ. నూకరాజు, క్షయ నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. వ్యాధిలక్షణాలు 1. చలి, వణుకుతో కూడిన జ్వరం. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స లేకపోతే నెలల తరబడి బాధిస్తుంది. 2. ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వల్ల మన ప్రాంతంలో మలేరియా వస్తోంది. 3. ఇందులో వైవాక్స్ మలేరియా తక్కువగా బాధిస్తే, పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువ బాధించడమే కాకుండా కొన్ని పరిస్థితుల్లో ప్రమాదస్థాయికి చేరుతుంది. 4. మన్య(గిరిజన) ప్రాంతాల్లో పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువగా, మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతోంది. ఇలా వ్యాపిస్తుంది ♦ ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొరికి వ్యాధికారక క్రిమి ప్లాస్మోడియా వ్యాప్తి చెందుతుంది. ♦ దోమకుట్టిన 8 నుంచి 12 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ♦ చిన్నపిల్లలకు, గర్భిణులకు ఈ వ్యాధి ప్రమాదకరమైనది. చికిత్స: మలేరియా వ్యాధిగ్రస్తులు క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అనే మందుతో పూర్తి మోతాదులో రాడికల్ చికిత్స చేయించాలి. పీవీ మలేరియాకు 14 రోజులు, పీఎఫ్ మలేరియాకు మూడు రోజుల చికిత్స చేయాలి. మధ్యలో మానేస్తే వ్యాధి తిరగబెడుతుంది. మలేరియా రాకుండా జాగ్రత్తలు 1. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. 2. ఇళ్లలో గోడలపై దోమల మందు చల్లించుకోవాలి. 3. కట్టడాలకు సంబంధించిన నీటి నిల్వలు లేకుండా చూడాలి. 4. అనాఫిలిస్ దోమలు మంచినీటి నిల్వల్లో గుడ్లు పెట్టి, లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారతాయి. 5. దోమతెరలను వాడాలి. ఆరు బయట నిద్రించరాదు. 6. ఖాళీ కడుపుతో మలేరియా చికిత్స మాత్రలు మింగరాదు 7. పూర్తి మోతాదులో మాత్రలు మింగాలి. -
చిన్నజీవని వదిలేస్తే.. చిదిమేస్తుంది..!
మలేరియా.. ఒకప్పుడు సీజనల్ వ్యాధిగా ప్రచారంలో ఉన్న తీవ్ర జరం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్రామాలు సహా పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణలోపం, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి సమస్యల కారణంగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరు అర్బన్ : చూసేందుకు అది చిన్న జీవే. కానీ కుడితే కలిగే నష్టం అపారం. మనిషిని నిలువునా కుంగదీస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలమీదకే తెస్తుంది. అదే మలేరియాకారక దోమ. జిల్లాలో ఈ సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. అప్రమత్తంగా లేకుంటే చేజేతులా ప్రాణాలపైకి కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే ప్రజల్ని చైతన్యం చేయడానికి ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం కోట్లలో నిధులు ఖర్చు చేస్తోంది. వైద్యశాఖ దీన్ని సరిగా ఉపయోగించుకోకపోవడంతో నిధుల వ్యయం తప్ప ఫలితం కనిపించడం లేదు. ఫాగింగ్, దోమల నివారణకు చేపట్టే చర్యల్లో నిర్లక్ష్యం, అవినీతి కారణంగా మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప ప్రైవేటు ఆసుపత్రి, నర్సింగ్ హోమ్‌లలో రోగుల గురించి రికార్డులు అధికారిక లెక్కల్లోకి రావడం లేదు. దీంతో మలేరియా ప్రమాదకరంగా మారుతోంది. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా కారక దోమలను అరికట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి తరువాత.. ఎండాకాలం పూర్తవుతుండగానే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, చిన్నపాటి తుంపర్ల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతుంటాయి. మలేరియా వ్యాప్తికి ఈ సీజన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా కన్పించే ఈ వ్యాధి ఇటీవల పట్టణాలు, నగరాలను సైతం విజృభిస్తోంది. గత ఏడాది జిల్లాలో 44 కేసులు నమోదయినట్లు అధికారిక లెక్కల్లో ఉంటే ఇది 200కు దాటిందనేది వాస్తవం. అపరిశుభ్ర వాతావరణం, మురుగు కాలువల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, దోమల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తూతూమంత్రంగా ఉండడం తదితర కారణాలు వ్యాధికి దోహదం చేస్తున్నాయి. అయితే ప్రైవే టు ఆసుపత్రులకు వస్తున్న కేసులు గురించి బయటకు తెలియడం లేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగులకే లెక్కల కింద చూపుతున్నారు. జిల్లాలో ఇవే అధికం.. మలేరియాకు కారణమయ్యే ఫ్లాస్మోడియం పరాన్నాజీవి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇవి మురుగునీటి కాలువలు, చెరువులు, కుంటలు, పంట కాలువలు, పొలాల్లో ఎక్కువగా పెరుగుతాయి. చాలా వేగంగా ఎగురుతూ రాత్రి పూట కుడుతాయి. అవి కుట్టినప్పుడు నొప్పి, శరీరంలో దద్దుర్లు కొందరికి రావచ్చు. శరీరంలోకి ప్రవేశించిన ఫ్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్త కణాలపై దాడి చేస్తుంది. మలేరియాలో ఫ్లాస్మోడియం వైవాక్స్ (పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం (పీపీ) అనేవి రెండు దశాలు. మొదటి దశలో కన్నా జిల్లాలో రెండో దశ వల్ల ఎక్కువ మంది మలేరియా బారిన పడుతున్నారు. వ్యాధి లక్షణాలు ఇలా.. ♦ మలేరియా దోమ ఆరోగ్యవంతుల్ని కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ♦ తొలుత జ్వరం, ఒళ్లుæ నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి.. అంత ప్రమాదకరం కాదు. మందులు వేస్తే తగ్గిపోతుంది. రెండో రకమైన ఫ్లాస్మోడియం పాల్సీఫారం మాత్రం ప్రమాదకరమే. ♦ రెండో దశను త్వరగా గుర్తించి చికిత్స అందజేయకపోతే కాలేయం, కిడ్నీలు, రక్త కణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై ప్రభావం చూపి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ♦ రోజు విడిచి రోజు జ్వరం తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. చలిజ్వరం, చమటలు పట్టడం, కొన్నిసార్లు వాంతులవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సప్రదించి రక్త పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ సమస్య వచ్చిన తర్వాత చికిత్స కంటే.. ముందే జాగ్రత్త పడడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దోమకాటు బారిన పడకుండా చూసుకోవడం ప్రధానం. ♦ బయటకు వెళ్లేటప్పుడు కాళ్లు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ♦ ఇంటి చుట్టు పక్కల దోమలు పెరగకుండా చూసుకోవాలి. కూలర్లు, కుండీల్లో వారానికోసారి నీరు మారుస్తుండాలి. నీటి పంపులు, ట్యాంకులపైన మూతలు తప్పనిసరి. టైర్లు, కప్పులు, కొబ్బరి చిప్పలు, పాత్రలు వంటివి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండకుండా చూసుకోవాలి. ♦ సెప్టిక్‌ట్యాంకు నుంచి గాలివెళ్లే పైపులకు మెస్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ♦ నిద్రించేటప్పుడు దోమ తెరలు వాడాలి. కిటికీలు, తలుపులకు దోమలు రాకుండా తెరలు అమర్చుకోవాలి. ♦ దోమలు బాగా ఉన్న ప్రాంతంలో జ్వరాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి మలేరియా అవునో, కాదో తేల్చుకోవాలి. ఒకవేళ అది కాకపోతే డెంగీ అనే అనుమానుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ప్రజలు బాధ్యతగా ఉండాలి.. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ప్రజల బాధ్యతే. పంచాయతీలు, మునిసిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నా.. ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలను మనమే తీసేయాలి. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉండే కొబ్బరి చిప్పలు, టైర్లను తీసేయండి. ప్రతీ శుక్రవారం కావాల్సిన నీళ్లను ఉంచుకుని డ్రై డేను పాటించాలి. రెండు రోజుల పాటు జ్వరం తగ్గకుంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. – డాక్టర్ ఇ. ఉస్సేనమ్మ,జిల్లా మలేరియా అధికారి -
విషజ్వరాలతో విలవిల!
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వాటితో ఒక్క సెప్టెంబరు నెలలోనే 1,853 మంది మృత్యువాత పడ్డారంటే రాష్ట్రంలో జ్వరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. సగటున రోజుకు 62మంది మరణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాధుల తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా ప్రభుత్వం మాత్రం విష జ్వరాలు లేనేలేవంటోంది. సాధారణ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. మరణించిన వారు కూడా ఇతర కారణాలతో చనిపోయిన వారేనని బుకాయిస్తోంది. ఓ వైపు వేధిస్తున్న వ్యాధులు.. మరోవైపు సర్కార్ నిర్లక్ష్యం వెరసి.. పేద రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. పరీక్షలు చేయించుకుని, మందుబిళ్లలు తెచ్చుకుని ఉపశమనం పొందుదామని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఎప్పుడొస్తారో, మందుబిళ్లలు దొరుకుతాయో లేదో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల తీరయితే సరేసరి. వచ్చిన వారిని బెంబేలెత్తిస్తూ జేబులు గుల్లచేసి వదిలిపెడుతున్నారు. సమన్వయలోపం.. బాధితులకు శాపం వాతావరణ మార్పులు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. అధ్వాన్న పారిశుధ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జ్వరాల నివారణ ఆరోగ్య శాఖదేనని.. కాదు, స్థానిక యంత్రాంగం పారిశుధ్యాన్ని మెరుగుపర్చుకోకపోవడం వల్లే ఇదంతానని ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తుండడంతో శాఖల మధ్య సమన్వయలోపం బాధితులకు శాపంలా మారింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలున్నాయి. కాగితాలపైనే ‘దోమల దండయాత్ర’ దోమలపై దండయాత్ర అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు.. ఆచరణలో మాత్రం చతికిల పడింది. అన్ని శాఖలను సమన్వయపరుస్తూ దోమలపై దండయాత్ర సాగించడానికి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. ఇందుకోసం అప్పట్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. అయినా ‘దండయాత్ర’ అతీగతీ లేకుండాపోయింది. జిల్లాల్లో పరిస్థితి ఘోరం ♦ శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఎక్కువ శాతం ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల వారే విషజ్వరాల బారినపడ్డారు. ప్లేట్లెట్స్ తగ్గుముఖం పడుతున్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇదొక కొత్తరకం వైరస్ అని, ఇదేమిటో అంతుచిక్కడంలేదని వైద్యులు చెబుతున్నారు. గత నెలలో ఒక్క శ్రీకాకుళం రిమ్స్‌లోనే 51మంది బలయ్యారు. ♦ విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలోనే 41మంది మరణించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 35 మంది వరకు డెంగీతో చనిపోయారు. విషజ్వరాలతో అనేకమంది మరణించారు. వీరిలో గ్రామీణ ప్రాంత ప్రజలే అధికం. ఇంకా 5 వేల మంది వరకు జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ♦ విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి విష జ్వరాలు ఎక్కువగా సోకుతున్నాయి. ఇక్కడ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు గ్రామీణులే. నర్సీపట్నం, కోటవురట్ల, సబ్బవరం, చోడవరం, అనకాపల్లి, ఎస్‌కోట, లక్కవరం తదితర గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. కేజీహెచ్ పీడియాట్రిక్స్ విభాగంలో మంగళవారం నాటికి 20 మంది చిన్నారులు జ్వరంతో చికిత్స పొందుతున్నారు. ఒక్క కేజీహెచ్‌లోనే ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224 మంది చనిపోయారు. అంతేకాక.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వందలాది మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. కోస్తాను కుదిపేస్తున్న డెంగీ, మలేరియా ♦ తూర్పుగోదావరి జిల్లాను గత నెల రోజులుగా డెంగీ వ్యాధి కుదిపేస్తోంది. దీనిబారిన పడినవారు ఆర్థికంగా కుదేలైపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలైతే ఖరీదైన వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. వైద్యాధికారులు మాత్రం మరణాలేవీ లేవంటున్నారు. మరోవైపు.. జిల్లాను కలవరపెడుతున్న డెంగీ జ్వరాలను అధికార యంత్రాంగం అదుపు చేయలేకపోతోంది. అధికారికంగా 302 కేసులే నమోదైనా అనధికారికంగా రోగుల సంఖ్య పది వేలకుపైనే ఉంటుందని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఒక్క సెప్టెంబరు నెలలోనే 360మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ♦ పశ్చిమ గోదావరి జిల్లా కూడా విషజ్వరాల బారిన పడి మంచమెక్కింది. ఇక్కడ కూడా డెంగీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైద్య అధికారులు, ప్రభుత్వం డెంగీ మరణాలు లేవని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. గత మూడు నెలల్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి 47 మంది డెంగీ రోగులు వచ్చారు. అనధికారికంగా జిల్లాలో డెంగీ మరణాలు సంభవించిన దాఖలాలు ఉన్నా.. అధికారులు వాటిని సాధారణ మరణాలుగా చూపిస్తున్నారు. వరదలు వచ్చి తగ్గడంతో ఏజెన్సీతోపాటు వరద పీడిత ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా జిల్లాలో మలేరియా, డెంగీ కేసుల్లో అధిక శాతం ఏజెన్సీతోపాటు డెల్టా ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలోనే ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 56మంది మృత్యువాతపడ్డారు. ♦ కృష్ణా జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న భేదం లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియా విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో జిల్లా వ్యాప్తంగా 1,485 కేసులు నిర్ధారణకు వచ్చాయి. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య ఇక వేల సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక సెప్టెంబరులోనే మొత్తం 263మంది మృత్యువాత పడ్డారు. ♦ గుంటూరు జిల్లాలోని ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, ఫిరంగిపురం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, పెదపలకలూరు, నూతక్కి, సంగం జాగర్లమూడి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లి, గుంటూరు నగరంలో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జీజీహెచ్‌లో ఒక్క సెప్టెంబరులో మొత్తం 293 మరణాలు సంభవించాయి. ♦ ప్రకాశం జిల్లాలోనూ డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం వీటిని ఒప్పుకోవడం లేదు. సాధారణ జ్వరాలేనని చెబుతున్నప్పటికీ ఒక్క ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో 56మంది విషజ్వరాలకు బలయ్యారు. ♦ శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లాలోనూ అనేకమంది డెంగీ, మలేరియా బారిన పడ్డారు. నెల్లూరు జీజీహెచ్‌లోనే సెప్టెంబరులో 88మంది మరణించారు. రాయలసీమలో జ్వరాలు, ఎండల తీవ్రత ఎక్కువే ♦ వైఎస్సార్ జిల్లాలో దోమల తీవ్రత, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటివరకు 167 మలేరియా కేసులు, 12 డెంగీ కేసులు, 2552 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వర్షం జాడలేకపోవడంతో ఉష్ణోగత్రలు వేసవిని తలపిస్తున్నాయి. కడప రిమ్స్‌లో సెప్టెంబరు ఒక్క నెలలోనే 77మంది విష జ్వరాలకు బలయ్యారు. ♦ అనంతపురం జిల్లానూ మలేరియా వణికిస్తోంది. జ్వరాల బారినపడుతున్న వారిలో గ్రామీణులే అధికం. జిల్లాలోని 87 పీహెచ్‌సీలకు రోజూ దాదాపు 60 వేల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరిలో 30 శాతం మంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం సర్వజనాస్పత్రికి రోజూ 2 వేల మంది రోగులు వస్తున్నారు. వీరిలో ఎక్కువమంది జ్వరపీడితులే. గత నెల అనంతపురంలోని జీజీహెచ్‌లో మొత్తం 98మంది జ్వరాల కారణంగా మరణించారు. ♦ కర్నూలు జిల్లాలోనూ మలేరియా కేసులు అధికంగానే నమోదయ్యాయి. నంద్యాల, కర్నూలు, ఆదోనిల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 146 అనుమానిత డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క కర్నూలు జీజీహెచ్‌లోనే సెప్టెంబరులో 147 మరణాలు సంభవించాయి. ♦ తిరుపతి రుయా ఆస్పత్రిలో 99మంది మృత్యువాత పడ్డారు. గత నెల రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి వివరాలు.. ఆస్పత్రి మృతుల సంఖ్య జీజీహెచ్, గుంటూరు 293 జీజీహెచ్, కాకినాడ 277 కేజీహెచ్, విశాఖపట్నం 224 జీజీహెచ్, విజయవాడ 210 జీజీహెచ్, కర్నూలు 147 రుయా, తిరుపతి 99 జీజీహెచ్, అనంతపురం 98 జీజీహెచ్, నెల్లూరు 88 డీహెచ్, రాజమండ్రి 83 రిమ్స్, కడప 77 డీహెచ్, ఏలూరు 56 రిమ్స్, ఒంగోలు 56 డీహెచ్, మచిలీపట్నం 53 రిమ్స్, శ్రీకాకుళం 51 డీహెచ్, విజయనగరం 41 -
డెంగీ పంజా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గత ఏడాది 449 మందిలో డెంగీ లక్షణాలు కన్పించాయి. వీరిలో 322 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 134 మంది డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడగా అందులో ఐదుగురికి వ్యాధి ఉన్నట్లు ఎలీసా టెస్ట్‌లో బయటపడింది. ఐదులో ఒకటి గత నెల, మిగిలినవి జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు, నన్నూరు, కడుమూరు, ప్రాతకోట, కొత్తబురుజు, క్రిష్ణగిరి, పుచ్చకాయలమడ, నందవరం, శిరువెళ్ల, నంద్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కేసులు నమోదు కాగా, కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి. కాగా డెంగీ వ్యాధి లక్షణాలతో కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం గ్రామంలో గొల్ల లీలావతి(27), నందికుంట గ్రామానికి చెందిన లక్ష్మిదేవి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అధికారుల లెక్కల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా చనిపోలేదు. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆదోని, ఎమ్మిగనూరుఏరియా ఆసుపత్రులు, నంద్యాల జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. ఇవి గాక 800 దాకా ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లోని వైద్యుల వద్దకు ప్రస్తుతం వస్తున్న రోగుల్లో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇదే క్రమంలో మలేరియా, డెంగీ కేసులూ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ కేసులు పక్కనున్న అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల నుంచి అధికంగా కర్నూలులోని ఆసుపత్రులకు వచ్చేవి. ఈసారి ఆయా జిల్లాలతో పాటు జిల్లాలోని రోగులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలోనూ మలేరియా కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత ఏడాది 91మందికి మలేరియా నిర్ధారణ అయ్యింది. ఈసారి ఇప్పటి వరకు 37 మందిలో గుర్తించారు. ఇందులో ప్రమాదకరమైన పాల్సీఫారమ్ మలేరియా తొమ్మిది మందికి ఉన్నట్లు గుర్తించారు. అధికారులు..ప్రైవేటు ఆసుపత్రుల మధ్య పేచీ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ర్యాపిడ్ టెస్ట్ ద్వారా డెంగీ నిర్ధారణ కాగానే చికిత్స ప్రారంభిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వస్తే తమకు సమాచారం అందించాలని, ఈ మేరకు రక్తం సీరా తీసి కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌కు పంపితే అసలు డెంగీనో, కాదో నిర్ధారణ చేస్తామని చెబుతోంది. ఇక్కడి నివేదిక ఆధారంగా మాత్రమే డెంగీగా ప్రకటించాలని ఆసుపత్రులకు స్పష్టం చేస్తోంది. అయితే.. కేఎంసీలోని ల్యాబ్‌కు వెళ్లి రిపోర్ట్ రావాలంటే 15 నుంచి 30 రోజులు పడుతుందని, ఈలోగా రోగికి చికిత్స చేయకుండా ఆపాలా అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలతో నిమిత్తం లేకుండా వారు డెంగీ లక్షణాలున్న వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు వైద్యులు మాత్రం సాధారణ జ్వరానికి సైతం డెంగీ పేరు చెప్పి దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. డెంగీ ఎలా సోకుతుందంటే.. ఏడిస్ ఈజిపై్ట అనే దోమకాటు వల్ల డెంగీ సోకుతుంది. ఈ దోమ ఒంటిపై నల్లటి, తెల్లటి చారలు ఉంటాయి. అందుకే దీనిని పులిదోమ అని కూడా అంటారు. ఇది శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. సూర్యోదమైన రెండు గంటల వరకు, సూర్యోదయానికి రెండు గంటల ముందు మాత్రమే ఇది కుడుతుంది. ఇది కేవలం రెండు వారాలు మాత్రమే జీవిస్తుంది. ఇది తన జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది. ప్రతిసారీ వంద గుడ్లకు పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టన్స్ వెనుక దాక్కుంటాయి. దోమల నివారణ చర్యలు చేపట్టాం జులై ఒకటి నుంచి 9 మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్‌ల ద్వారా దోమల నివారణకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ప్రతి క్లినిక్‌లో ఎంపీహెచ్‌ఈవో, ఎంపీహెచ్ఎస్, హెల్త్ అసిస్టెంట్, మున్సిపల్ సిబ్బంది ఉంటారు. వీరు ఇంటింటికి వెళ్లి పరిసరాలు పరిశీలించి నీటిలో లార్వా ఉందో..లేదో పరిశీలించి చర్యలు చేపడతారు. జ్వరపీడితులుంటే రక్తపూతలు సేకరించి పరీక్షలకు పంపిస్తారు. మలేరియాలో పాల్సిఫారమ్ నమోదైతే వ్యాధిగ్రస్తుని ఇంటి పరిసరాల్లో డీటీటీ స్ప్రే చేస్తారు. ఇప్పటి వరకు పాల్సీఫారమ్ మలేరియా నమోదైన 15 గ్రామాల్లో 50 శాతం డీటీటీ స్ప్రే చేశాం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తమ జేఈవీఎం యూనిట్ సిబ్బంది వార్డులు తిరిగి డెంగీ, మలేరియా లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. – డేవిడ్‌రాజు, మలేరియా నియంత్రణాధికారి డెంగీ పేరుతో భయపెడితే చర్యలు ర్యాపిడ్ టెస్ట్‌లోనే డెంగీగా నిర్ధారించి రోగికి నేరుగా చెప్పకూడదు. ఈ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా, రోగి రక్తాన్ని కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజి ల్యాబ్‌కు పంపించాలి. అక్కడ ఎలీసా టెస్ట్‌లో వ్యాధి నిర్ధారణ అయితేనే డెంగీగా నిర్ధారించాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను ధిక్కరించే ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు తీసుకుంటాం. 20వేల కంటే తక్కువగాసంఖ్య ఉంటేనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. సాధారణ జ్వరంలోనూ ప్లేట్లెట్లు తగ్గుతాయని ప్రజలు గుర్తించాలి. – డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డీఎంహెచ్‌వో, కర్నూలు వ్యాధి లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. ఒంటిపై ఎర్రటి దురదలు కనిపిస్తాయి. ముక్కు, చిగుళ్లలో రక్తం స్రవిస్తుంది. -
జనం జీవితాలతో చెలగాటమాడుతున్నారు
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మలేరియా, డెంగీ, విషజ్వరాలతో మంచాన పడుతుం టే స్పందించి సరైన వైద్య సదుపాయాలు అందించాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందన్నారు. ఎక్కడ చూసినా విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతూ మంచం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో 120మంది, విజయనగరం జిల్లాలో 60మంది విషజ్వరాల వలనే మృత్యువా త పడ్డారన్నారు. విషజ్వరాలు విజృంభించడంతో విశాఖపట్టణంలోని కేజీహెచ్, గుంటూరు జిల్లాలో జీజీహెచ్, విజయవాడ ఆస్పత్రుల్లో బెడ్లు లేక ఒకే బెడ్‌పై నలుగురైదుగురు రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆఖరకు రోగులను రోడ్డుపైకి లాగుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను అనారోగ్యాంధ్ర ప్రదేశ్‌గా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా విషజ్వరాలే రాజ్యమేలుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోనిచంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయని తమ్మినేని అన్నారు. మలేరియా, విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం, చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒక్క విశాఖ కేజీహెచ్‌లో నే 21 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. గుంటూరులో 21 మందికి, తూర్పుగోదావరి, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని దుయ్యబట్టారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ సీఎం చంద్రబాబు వద్దే ఉందని, ఈ శాఖపై చంద్రబాబు దృష్టి సారించకపోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఇటీవలే చం ద్రబాబు జ్వరాలపై సమీక్షించి జ్వరాలపై నియంత్రణ కొరవడిందంటూ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. జూలై 2016 నుంచి జూన్ 2017 మధ్యకాలంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు పట్టేందుకు రూ.60లక్షలు నిధులు ఖర్చు చేయడం దారుణమన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందన్నారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్న లోకేష్ అవగాహనా రాహిత్యం వల్లనే గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో దోమలబెడద అధికమైందని చెప్పారు. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ ఘోర వైఫల్యమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేసి ఆదాయం వచ్చే మార్గాలనే అన్వేషిస్తోందన్నారు. బాబు డ్యాష్బోర్డుపైకి రాష్ట్ర ప్రజలకు అందుతున్న వైద్యసేవల నివేదిక చేరలేదా అని ప్రశ్నించారు. అందని వ్యాక్సిన్లు.. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా వ్యా క్సిన్ అందని దుస్థితి నెలకొందని తమ్మినేని సీతా రాం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు 38 వేల మంది శిశువులు జన్మిస్తున్నారని, చిన్నారులకు ఇన్ఫెక్షన్లు, కామెర్లు సోకకుండా వాక్సిన్లు వేయించాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్లు పీహెచ్‌సీలు, సీహెచ్‌ల్లో అందుబాటులో లేకున్నా ప్రభుత్వం చలించకపోవడం దారుణమన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక చిన్నారులు రోటావాక్, హెపటైటిస్–బి వంటి వ్యాక్సిన్లకు దూరమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేత బొనిగి రమణమూర్తి తదితరులు ఉన్నారు. -
పంజా విసిరిన డెంగీ
రాష్ట్రంపై డెంగీ పంజా విసిరింది. విష జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలు కాగిపోతున్నాయి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా అన్ని జిల్లాలు మంచానపడ్డాయి. పలు ప్రాంతాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు.. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అనధికారికంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. వేలాది మంది రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పలు ఆస్పత్రుల్లో పడకలు సరిపోక నేలపైనే రోగులను పడుకోపెట్టి చికిత్స అందించాల్సిన దుస్థితి తలెత్తింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో రోజురోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నెట్వర్క్: విషజ్వరాలతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో గత రెండు నెలల్లో డెంగీ, మలేరియా బారినపడి 23 మందికిపైగా మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం వీటిని సహజ మరణాలుగానే రికార్డుల్లో నమోదు చేస్తూ.. తీవ్రతను కప్పిపుచ్చే చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 217 మంది మలేరియాతోనూ, 55 మంది డెంగీతోనూ బాధపడుతున్నారని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో అయితే విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో ఈ ఏడాది 87 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ, ఇతర విషజ్వరాలతో ఇప్పటివరకు 70 మందికిపైగా ప్రాణాలొదిలారు. ఒక్క డెంగీతోనే 30 మంది ప్రాణాలు విడిస్తే.. వైద్యాధికారులు మాత్రం ఇద్దరే చనిపోయారని చెబుతున్నారు. విజయనగరం అర్బన్, నెల్లిమర్ల, డెంకాడ, గజపతినగరం, దత్తిరాజేరు, గుర్లలో డెంగీ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా కేసులు, 1,100 టైఫాయిడ్ కేసులు, 21,800 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 1,660 డెంగీ కేసులు నిర్ధారణయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం డెంగీ మరణాల సంఖ్య వందకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా రోజుకు ఇద్దరు, ముగ్గురు డెంగీతో మృతి చెందుతున్నట్లు సమాచారం. డెంగీ బాధితుల కోసం కింగ్ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)లో ప్రత్యేకంగా పది పడకలు ఏర్పాటు చేశారు. కానీ రోజుకు 20 మందికి పైగా రోగులు వస్తుండడంతో.. వారిని ఇతర వార్డుల్లో ఉంచి వైద్యమందిస్తున్నారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 22 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. గజగజలాడుతున్న గోదావరి జిల్లాలు.. డెంగీ ధాటికి గోదావరి జిల్లాలు కూడా గజగజలాడుతున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య ఇంకా భారీగా ఉండే అవకాశముంది. కానీ డెంగీ మరణాలను వెల్లడించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 258 డెంగీ కేసులు నమోదయ్యాయి. శనివారం జగ్గంపేట మండల మల్లిశాలకు చెందిన పాలిపిరెడ్డి నూక రత్నం(53) డెంగీతో కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందగా.. వైద్య సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టవద్దని చెప్పినట్లు తెలిసింది. కాకినాడ రూరల్‌లో అత్యధికంగా 85 డెంగీ కేసులు నమోదవ్వగా.. కాకినాడ నగరంలో 65 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మల్కిపురం మండలం గుడిమెళ్లంకలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీతో మృతి చెందారు. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు డెంగీతో అల్లాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ జిల్లాలో గత 3 నెలల్లో అధికారికంగానే 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఏలూరు, నరసాపురం, భీమడోలు, నల్లజర్ల, రాఘవాపురం, పెనుగొండ, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, లంకలకోడేరు, పెనుమంట్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రి బాధితులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతమున్న వార్డు సరిపోక.. మరో వార్డును అదనంగా కేటాయించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 169 మలేరియా కేసులు నమోదయ్యాయి. రాజధానిలోనూ దయనీయమే.. కృష్ణా జిల్లాలోని నందిగామ, ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు జ్వరపీడితులున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సాధారణంగా రోజుకు దాదాపు 200 మంది రోగులు వస్తుండేవారు. కానీ విషజ్వరాల దెబ్బకు రోజుకు 350 మందికి పైగా రోగులు వస్తుండటంతో పడకలు చాలక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నేలపైనే పడుకోపెట్టి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 42 డెంగీ, 100 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల నందిగామ పట్టణానికి చెందిన మారం జయశ్రీ(18) అనే విద్యార్థిని, వెల్లంకికి ముండ్లపాటి నారాయణ(56) డెంగీతో మృతిచెందారు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు చేవూరుపాలెం గ్రామస్తులు 15 రోజులుగా విషజ్వరాలు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 87 డెంగీ, 279 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, నూతక్కి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లితో పాటు గుంటూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికారికంగా 17 డెంగీ, 44 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 132 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 56 డెంగీ, వందకుపైగా మలేరియా కేసులు రికార్డయ్యాయి. మార్కాపురం నియోజకవర్గంలో 24 మంది డెంగీతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. డెంగీ నిర్ధారణపై ఆంక్షలు! డెంగీ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విశాఖ జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరికరాలున్నప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షల వల్ల కేజీహెచ్‌లోని ల్యాబ్‌కు వెళ్లాలని చెబుతున్నారు. దీంతో అక్కడి ల్యాబ్ రోగులతో కిటకిటలాడుతోంది. తీరా వ్యాధి నిర్ధారణయ్యేసరికి చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా కేజీహెచ్‌లో 4,574 మందికి పరీక్షలు నిర్వహించగా 1,660 మందికి డెంగీగా నిర్ధారణ అయ్యింది. అంటే ప్రతి ముగ్గురు అనుమానితుల్లో ఒకరికి డెంగీ నిర్ధారణ అవుతోంది. పెళ్లయిన 13 రోజులకే ప్రాణం తీసిన విష జ్వరం మాయదారి విష జ్వరం ఓ నవ వరుడిని మింగేసింది. విజయనగరంలోని పూల్‌బాగ్ కాలనీకి చెందిన పన్నగంటి ఈశ్వరరావు(24) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 24న అతనికి పూల్‌బాగ్ కాలనీకి చెందిన మౌనికతో వివాహమైంది. జ్వరం రావడంతో ఈశ్వరరావును ఈ నెల 4న నెల్లిమర్ల మిమ్స్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యులు బుధవారం అతన్ని కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లేసరికే ఈశ్వరావు మృతి చెందాడు. పెళ్లయిన 13 రోజులకే వరుడు చనిపోవడంతో అతని భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తాం: సీఎం సాక్షి, అమరావతి: పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు రాకపోతే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డెంగీ విజృంభణ నేపథ్యంలో బుధవారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ.. విశాఖ, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. దోమల బెడదను నివారించాలని, రక్షిత తాగునీటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సీమలోనూ విషజ్వరాల విజృంభణ.. రాయలసీమలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 66 డెంగీ కేసులు నమోదవ్వగా.. ఈ నెల 1న నార్పల గ్రామానికి చెందిన అనుష్క(8) మృతి చెందింది. ఇప్పటివరకు 164 మలేరియా, 66 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అనంతపురం అర్బన్, బుక్కరాయసముద్రం, ఎద్దులపల్లి, కురుకుంట ప్రాంతాల్లోని 30 గ్రామాల్లో డెంగీ తీవ్రత అధికంగా ఉంది. వైఎస్సార్ జిల్లాలోనూ 45 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఏడింటిని నిర్ధారించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 134 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఐదుగురికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం, నందికుంటకు చెందిన లీలావతి, లక్ష్మీదేవి ఇటీవల డెంగీతో మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. తాజాగా, కర్నూలు గణేష్‌నగర్‌కు చెందిన లక్ష్మయ్య(21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి, పనుల నిమిత్తం కర్నూలుకు వచ్చిన కమలాకర్, ప్రకాష్(ఒడిశా) డెంగీతో బాధపడుతున్నారు. -
దోమ దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు తోడు ఇళ్ల మధ్య మురుగు నిల్వ, చెత్తా చెదారంతో డెంగీ, మలేరియా దోమలు విజృంభిస్తున్నాయి. నీరు, ఆహార కాలుష్యంతో నగరవాసులు డయేరియా, విషజ్వరాల బారినపడుతున్నారు. వాంతులు, విరేచరాలతో పాటు దగ్గు, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రులు సహా నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత డయేరియా కేసులతో పాటు ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది, ఈ సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చాపకింద నీరులా డెంగీ, మలేరియా నగరంలో మలేరియా, డెంగీ దోమలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. గత నెలలో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 417 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో ఇప్పటి వరకు 70పైగా కేసులు, ఉస్మానియాలో కేవలం వారం రోజుల్లోనే 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఫీవర్‌లో 14 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 179 కేసులు నమోదు కాగా, ఈ నెలలో 46 కేసులు నమోదయ్యాయి. 274 మలేరియా కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క ఆగస్టులోనే 31 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని వేడి చేసి, చల్లారిన తర్వాత తాగాలి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. పూల కుండీలు, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. – డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, జనరల్ ఫిజిషియన్ -
దోమలకు దోమలే విరుగుడు..!!
టౌన్స్విల్, ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో గత నాలుగేళ్లుగా ఒక్క డెంగీ వ్యాధి కేసు నమోదు కాలేదు. దోమలకు దోమల్నే ప్రత్యర్థులుగా వినియోగించిన శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సాధించగలిగారు. కొన్ని దోమల్లోకి వోల్బాచియా బ్యాక్టీరియాను చొప్పించడం ద్వారా డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను నాశనం చేశారు. ఈ పద్దతిని తొలిసారిగా ఆస్ట్రేలియాలోని టౌన్స్విల్ పట్టణంలో ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధించడంతో జికా, మలేరియా దోమలను కూడా హతమార్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జికా దోమలను చంపడమే లక్ష్యంగా అతి త్వరలో కొన్ని ప్రత్యేక దోమలను(వోల్బాచియా బ్యాక్టీరియా ప్రభావితమైనవి) వదలనున్నారు. కొలంబియాలోని మెడ్లిన్, ఇండోనేషియాలోని యోగ్యకార్టాల్లో సైతం ఈ మేరకు సన్నహకాలు జరుగుతున్నాయి. టౌన్స్‌విల్‌లో డెంగీపై విజయం సాధించడానికి ప్రధాన కారణం. చిన్నపెద్ద తేడా లేకుండా అందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడమే. విద్యార్థులు సైతం వోల్బాచియా దోమలను వదిలేందుకు ఆసక్తిని కనబర్చారు. దోమలను వదిలిన నాటి నుంచి టౌన్స్‌విల్‌లో ఒక్కటంటే ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ దోమలను ప్రపంచవ్యాప్తంగా అందించడం ద్వారా డెంగీ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చనే భావన వ్యక్తం అవుతోంది. -
గ్రేటర్‌పై డెంగీ పంజా
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌పై మళ్లీ డెంగీ, మలేరియా వ్యాధులు పంజా విసురుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గత మూడు మాసాల్లో 20 డెంగీ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. తాజాగా మరో 14 డెంగీ, 12 మలేరియా కేసులు నమోదయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. మురికివాడల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదు అవుతుండగా, ఐటీ అనుబంధ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలు, ధనవంతులు అధికంగా నివసించే కాలనీల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తాజా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షా నికి తోడు...రోజుల తరబడి ఫాగింగ్ నిర్వహించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రేటర్లో ప్లాస్మోడియం పాల్సీఫారమ్ మలేరియా: మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీఫారమ్(పీఎఫ్) నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో ఈ రకం కనిపించేది. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. మూడు నెలల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. ప్లాస్మోడియం అనే పరాన్న జీవి ద్వారా మలేరియా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారమ్(పీఎఫ్) అనేవి రెండు రకాలు. పీవీ వ్యాపించినప్పుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. మందులు వాడితే తగ్గిపోతుంది. అంత ప్రమాదకరమైనది కాదు. కానీ పీఎఫ్ మలేరియా చాలా ప్రమాదకరమైనది. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి లేదంటే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మెదడుపైనా దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు. దోమ కుట్టిన పది నుంచి ప ద్నాలుగు రోజుల్లో జ్వరం వస్తుంది. డెంగీ లక్షణాలతో బాధపడే వారికి కొంతమంది స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారని, అయితే ఇవి వ్యాధి లక్షణాలను మరింత పెంచుతాయని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ తెలిపారు. పారాసిటమాల్ తప్పఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదన్నారు. -
మలేరియాపై పోరుకు కొత్త అస్త్రం..
మలేరియా వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. ఈ వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం ఫాల్సీపరమ్ అనే బ్యాక్టీరియా శరీర కణంలోకి ప్రవేశించేందుకు, బయటపడేం దుకు ఉపయోగపడే కీలకమైన రెండు ఎంజైమ్‌లను జెనీవా, బెన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైమ్‌లలో ఒకటి కణత్వచాన్ని చీల్చి లోపలికి ప్రవేశించేందుకు ఉపయోగపడగా.. రెండోది బ్యాక్టీరియా తన దాడిని మొదలుపెట్టేందుకు ఉపకరిస్తుంది. మన రక్తం, కాలేయంతోపాటు దోమ కడుపులో కూడా ఈ బ్యాక్టీరియా ఈ రెండు ఎంజైమ్లపైనే ఆధారపడుతున్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిని నిర్వీర్యం చేసేందుకు మార్గం సుగమం చేశారు. వాటిని నిర్వీర్యం చేసే మందులు తయారైతే అటు మలేరియా వ్యాధిగ్రస్తుల్లోని బ్యాక్టీరియా నాశనం అవడమే కాకుండా.. అది దోమల్లోకి చేరి వ్యాధిని మరింత ఎక్కువ మందికి వ్యాప్తి చెందే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు. -
జ్వరం.. కలవరం
► జిల్లాలో విజృంభిస్తున్న జ్వరాలు ► ప్రబలుతున్న మలేరియా ► మంచంపడుతున్న పల్లెలు ► ఇప్పటి వరకు బాలుడు సహా ఏడుగురి మృతి లబ్బీపేట(విజయవాడ తూర్పు) : వాతావరణంలో మార్పులు... అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం... విజృంభిస్తున్న దోమల కారణంగా జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. తూర్పు, పశ్చిమ కృష్ణాలోని పలు పల్లెలు మంచంపట్టాయి. విజయవాడ నగరంలోనూ వేలాది మంది జ్వరంతో బాధపడుతున్నారు. తోట్లవల్లూరు మండలంలోని బొడ్డపాడులో వందలాది మంది జ్వరాల బారిన పడిన విషయం తెలిసిందే. అదే మండలం పాములలంకతోపాటు తిరువూరు మండలంలోనూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, కొత్త రాజరాజేశ్వరీపేట, వన్‌టౌన్ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలాయి. బొడ్డపాడు సహా పలు ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం, అక్కడక్కడా డెంగీ లక్షణాలు కనిపిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెలలుగా... జూలైలో అధికారులు 36,300 వేల మంది జ్వరబాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, వారిలో 158 మందికి మలేరియా పాజిటివ్ వచ్చింది. విజయవాడలో 7,467మంది జ్వరపీడితుల నుంచి శాంపిల్స్ సేకరించగా, 114 మలేరియా ఉన్నట్లు తేలింది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో 17,918 మంది జ్వరబాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించగా, 50 మందికి మలేరియా పాజిటివ్ వచ్చింది. అయితే, ఇవి కేవలం ప్రభుత్వాస్పత్రులు, వైద్య శిబిరాలకు వచ్చిన వారి వివరాలు మాత్రమే. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన, పొందుతున్న వారి సంఖ్య ఇంతకు రెండింతలు రెట్టింపు ఉంటుందని అంచనా. విజయవాడ ప్రభుత్వాస్పతి మెడిసిన్ విభాగానికి నిత్యం 100 మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తుండగా, 20 మంది వరకు ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. పిల్లల విభాగానికి సైతం నిత్యం 50 మంది జ్వరపీడితులు వస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు రోజుకు వెయ్యి మంది వరకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నట్లు సమాచారం. ఒకరితో మొదలై... విష జ్వరాలకు కారణమైన వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దీంతో ఇంట్లో ఒకరికి విషజ్వరం వస్తే, వారి నుంచి మరొకరికి... ఇలా కుటుంబ సభ్యులు మొత్తం జ్వరాల బారినపడుతున్నారు. విష జ్వరం సోకినవారికి జలుబు, గొంతునొప్పి, మంట, తలనొప్పి, దగ్గు రావడంతోపాటు ఒక్కో సమయంలో వాంతులు, విరేచనాలు కూడా అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల పాటు ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఏడుగురి మృతి... జ్వరాలబారిన పడి జిల్లాలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో ఇద్దరు, విజయవాడలో ముగ్గురు, మైలవరంలో ఇద్దరు చొప్పున మరణించారు. విజయవాడలోని ఆర్ఆర్ పేటలో కొంటా యశ్వంత్(4) అనే బాలుడు శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ బాలుడు డెంగీ లక్షణాలతో మరణించి నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జక్కంపూడిలో మలేరియా... విజయవాడలోని జక్కంపూడి కాలనీలో మలేరియా విజృంభిస్తోంది. ఈ కాలనీలో 200 మందికిపైగా మలేరియా బాధితులు ఉన్నట్లు సమాచారం. వారి నుంచి మరింత మందికి వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్నారు. సకాలంలో మలేరియా అధికారులు స్పందించక పోవడం వల్లే కాలనీలో మలేరియా విజృంభించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక శిబిరాలతోపాటు, శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ కాలనీలో ఏడాదిగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అవగాహన అవసరం వ్యాధి సోకిన తర్వాత చికిత్స కన్నా ముందస్తు చర్యలు తీసుకోవడం ముఖ్యం. మనం పరిసరాల్లో పడేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, కుండలు, వాడని డబ్బాల్లో నిల్వ ఉన్న వర్షం నీటిలో వ్యాధి కారక దోమలు వృద్ధి చెందుతాయి. వాటిని పరిసరాల్లో లేకుండా చూడటం ఎంతో ముఖ్యం. తీవ్ర జ్వరం ఉన్నప్పుడు పారాసెట్మాల్ మందులు వేసుకోవడంతోపాటు సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లడం మంచిది. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన అవసరం. – డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి -
మలేరియాతో గిరిజన యువతి మృతి
రాజవొమ్మంగి (రంపచోడవరం) : రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకు చెందిన నేశం శిరీష (22) అనే గిరిజన యువతి మలేరియా జ్వరం, కామెర్లతో ఏలేశ్వరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. ఆమెకు ఏడాది కిందటే వివాహం జరగ్గా అమ్మగారి ఊరైన అమీనాబాద్ వచ్చి జ్వరం బారిన పడింది. దీంతో కుటుంబీకులు ఆమెను రెండు రోజుల కిందట ఏలేశ్వరం తరలించారు. అక్కడ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష పరిస్థితి విషమించి చివరికి మరణించింది. రెండు రోజుల కిందట అమీనాబాద్కాలనీకే చెందిన రావుల రాంబాబు (40) అనే గిరిజనుడు ఏలేశ్వరం ప్రయివేటు ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొంది, చనిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే. అమీనాబాద్కాలనీకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో గల జడ్డంగి పీహెచ్‌సీకి వెళ్ళకుండా గిరిజనులు వైద్యం కోసం ఏలేశ్వరంలోని ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించడం గమనార్హం. జడ్డంగి పీహెచ్సీలో సరైన వైద్యం అందక, క్షేత్రస్థాయి మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అధికారులు పనితీరు సంతృప్తికరంగా లేకే ఇక్కడి గిరిజనులు ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రోగనిర్ధారణలో జాప్యంతో చేటు.. కేవలం జ్వరంతో మూడు రోజుల పాటు బాధపడుతూ గిరిజనులు చనిపోవడానికి అసలు వారికి వచ్చిన రోగం ఏమిటన్నది త్వరగా నిర్ధారణ కాకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డెంగీ వంటి రోగాల బారిన పడి సకాలంలో సరైన వైద్యం లభించకే గిరిజనుల్లో మరణాలు సంభవిస్తున్నాయా అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉంది. రోగంతో ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్ళి ఫీజుల రూపేణా వేలకు వేలు చెల్లించలేని స్థితిలో చికిత్సకు నోచుకోక కూడా ఈ విధంగా అర్ధాంతరంగా చనిపోతున్నారా అన్న అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. -
2030 మలేరియా ఖతం..!
నిర్మూలన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా వేలాది మందిపై పంజా విసురుతున్న మలేరియా మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. మలేరియా నిర్మూలనకు అవసరమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, త్వరితగతిన వైద్య సాయం అందించడం అనే రెండు వ్యూహాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఏటా సగటున 3 వేలకుపైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 2017 జనవరి నుంచి జూలై 2 వరకు రాష్ట్రంలో 1,102 మలేరియా కేసులు నమోదైతే.. కొత్తగూడెం జిల్లాలోనే 400 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. సరైన చికిత్సతోనే..: పరిసరాలు శుభ్రంగా లేక దోమలు వృద్ధి చెంది మలేరియా సంక్రమిస్తుంది. ఆరోగ్యపరమైన అవగాహన పెద్దగా లేని గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా మలేరియా రెండు రకాలు. జ్వర లక్షణాలతో ఉండే మలేరియాకు 14 రోజులు చికిత్స అవసరం. జ్వరం లేకుండా ఉండే తరహా మలేరియాకు 3 రోజులు చికిత్స తీసుకోవాలి. చాలా మంది జ్వరం తగ్గగానే మందులు వేసుకోవడం మానేస్తుంటారు. దాంతో మలేరియా క్రిమి మళ్లీ విజృంభిస్తుంది. 2030లోపు శాశ్వతంగా.. దశాబ్దాలుగా పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న మలేరియాను 2030లోపు పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 2027, 2028, 2029 సంవత్సరాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకుంటే.. 2030 నాటికి మలేరియా రహితంగా ప్రకటించడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. స్థానిక అవసరాలకనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని సూచించింది. ఇందుకు నిధులను కేంద్రమే మంజూరు చేస్తోంది. భవిష్యత్తు తరాల కోసం.. ఆరోగ్యకరమైన భవిష్యత్ సమాజం కోసం మలేరియాను శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే 17 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మలేరియా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో 2.60 లక్షల దోమ తెరలు పంపిణీ చేశాం. మరో 4.89 లక్షల దోమ తెరలను పంపిణీ చేయనున్నాం.. –డా.ఎస్.ప్రభావతి, రాష్ట్ర అధికారి మలేరియా నిర్మూలన కార్యక్రమం -
మంచం పట్టిన మన్యం
► మలేరియా, జ్వరాలతో అడవి బిడ్డల ఆక్రందన ► రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య ► గ్రామాల్లో కానరాని వైద్య శిబిరాలు ► 260 మలేరియా కేసుల నమోదు బుట్టాయగూడెం : ‘పశ్చిమ’ ఏజెన్సీ జ్వరం గుప్పిట్లో విలవిలలాడుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్, కామెర్ల విజృంభిస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పటళ్లలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో సుమారు 260 మలేరియా కేసులు, 33,140 జ్వరాలు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అయితే ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో నమోదైన కేసులు మాత్రమే. ఏజెన్సీలోని మారుమూల కొండరెడ్డి గ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. బుట్టాయగూడెం మండలం లోని మారుమూల ప్రాంతాలైన గొట్టాలరేవులో బాలికలు గురుగుంట్ల రోజా, గురుగుంట్ల ప్రగతి, బాలుడు కెచ్చెల రాజు మలేరియాతో బాధపడుతున్నారు. కెచ్చెల లక్ష్మి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కెచ్చెల రాజు దొరమామిడి ఆస్పత్రిలో వైద్యం పొందాడు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కామవరానికి చెందిన వంజం నాగేంద్ర, అంజలి జ్వరాలతో బాధపడుతుం డగా, దాడి వీర్రాజు, మంగా దుర్గారావు జ్వ రంతో బుట్టాయగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయని పలువురు చెబుతున్నారు. ఏజెన్సీలోని ప్రతి గ్రామంలోనూ జ్వర పీడితులు కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో వైద్య శిబి రాలు లేవ ని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. చాపరాయి ఘటనతో.. తూర్పుగోదావరి జిల్లా చాపరాయి ఘటన తర్వాత అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సర్వేలు చేపట్టి జ్వరాల నివారణకు కృషి చేస్తున్నారు. అయినా మలేరియా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వర్షాల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడం, దోమలు బెడదతో వ్యాధులు ప్రబలుతున్నట్టు తెలుస్తోంది. రహదారులు అధ్వానం ఏజెన్సీలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 86 ఆరోగ్య ఉపకేంద్రాలు, బుట్టాయగూడెంలో మలేరియా కార్యాలయం ఉన్నాయి. ఏటా మలేరియా వ్యాప్తి చెందే సమస్యాత్మక 266 గ్రామాలను అధికారులు గుర్తించారు. పలు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కనీసం 108, 104 వాహనాలు కూడా వెళ్లడం లేదు. ప్రత్యేక చర్యలు ఏజెన్సీలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 198 గ్రామాల్లో మొదటి విడత దోమల నివారణ మందు స్ప్రేయింగ్ పనులు పూర్తి చేశాం. ఈ నెల 16నుంచి రెండో విడత పనులు చేపడతాం. ప్రతి శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టి జ్వరాల నివారణకు కృషి చేస్తున్నాం. ప్రతి గ్రామంలో డ్రెయిన్లు, మంచినీటి వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. – వంశీలాల్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, కేఆర్ పురం -
జిల్లాపై జ్వరాల పంజా
♦ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ♦ ఏజెన్సీ పరిధిలోని వారికి సోకుతున్న మలేరియా ♦ పలు చోట్ల నమోదవుతున్న డయేరియా కేసులు ♦ జ్వరాలతో సతమతమవుతున్న హాస్టల్ విద్యార్థులు సాలూరు/కురుపాం: జిల్లాపై జ్వరాల పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తుండగా... మైదాన ప్రాంతాల్లో డయేరి యా సైతం విస్తరిస్తోంది. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా జ్వరాలతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. ఇక వివిధ గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సైతం జ్వరాలతో సతమతమవుతూ రోజూ ఆస్పత్రి బాట పడుతున్నా రు. సాలూరు ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఒక్కో మంచానికి ఇద్దరు, ముగ్గురు వంతున సర్దుకుపోవాల్సి వస్తోంది. అయినా సరిపడకపోవడంతో ఆస్పత్రి వార్డుల్లోనున్న బల్లలపైనా కూడా వైద్యసేవలందిస్తున్నారు. ఇక్కడ ఒక్క బుధవారమే ఆస్పత్రికి వచ్చినవారు 64మంది కాగా, వారిలో 25మంది జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 10మందికి మలేరియా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. హాస్టళ్లలో విస్తరిస్తున్న జ్వరాలు ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు రోజూ అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుతుండడం గమనార్హం. సాలూరు మండలంలోని కొత్తవలస హాస్టల్ విద్యార్థి మువ్వల మనీష, పాచిపెంట మండలంలోని పి.కోనవలస హాస్టల్‌కు చెందిన కట్టెల సింహాచలంతోపాటు సాలూరు మండలం డి వెలగవలసకు చెందిన కూనేటి కీర్తన, బట్టివలసకు చెందిన గమ్మెల సింహాద్రి, వి.సంతు, రామభద్రపురం మండలం కొండగుడ్డివలసకు చెందిన నల్లజొన్న చిన్నమ్మ బుధవారం ఆస్పత్రిలో చేరారు. పెరుగుతున్న మలేరియా బాధితులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజు రోజుకూ మలేరియా జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలసకు చెందిన గిరిజనులే జ్వరాలతో బారులు తీరుతున్నారు. బుధవారం ఒక్క రోజే పదుల సంఖ్యలో మలేరియా జ్వర పీడితులు ఆస్పత్రిలో చేరడం ఇక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం కురుపాం సీహెచ్‌సీలో ఏజెన్సీ గ్రామాలకు చెందిన తోయక కృష్ణారావు, చంటి, తోయక నీలయ్య, పువ్వల రోజా, గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన మండంగి హరీష్, వాటక రోహిత్ తోపాటు మరో పది మంది వరకు చేరారు. గతేడాది కంటే ఎక్కువే... కురుపాం సీహెచ్‌సీలో 2016 జనవరి నుంచి జూన్ వరకు 210 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 606 మలేరియా పాజటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మార్చి నెలలో 158 కేసులు, మేలో 123, జూన్‌లో 151 కేసులు నమోదవ్వడం చూస్తుంటే రోజురోజుకూ మలేరియా విస్తరిస్తోందనే చెప్పాలి. ఒకే ల్యాబ్ టెక్నీషియన్‌తో రోగుల అవస్థలు కురుపాం సీహెచ్‌సీలో ఒకే ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉండటంవల్ల నాలుగు గిరిజన మండలాల నుంచి వస్తున్న జ్వరపీడితులు రక్తపరీక్షకోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో రోజుకొకరు చొప్పున షిఫ్ట్ డ్యూటీలు నిర్వహిస్తుండటతో వైద్య సేవలు కూడా అరకొరగానే అందుతున్నాయని గిరిజన వాపోతున్నారు. కానరాని నివారణ చర్యలు మలేరియా నివారణే లక్ష్యంగా ఏజన్సీలోని గ్రామాల్లో మలాథియన్ పిచికారి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చట్లేదని ప్రస్తుతం నమోదవుతున్న కేసులే చెబుతున్నాయి. -
అమ్మో మలేరియా బ్యాట్‌మ్యాన్
డే టైమ్‌లో ట్రాఫిక్ నైట్ టైమ్‌లో దోమలు ఒణికించేస్తున్నాయి. జుయ్‌మని వర్షాలకు బండ్లు జారిపడడం.. గుయ్‌మని వచ్చి కుట్టే దోమలకు మన బండి మంచం మీద పడడం.. ఈ సీజన్లో వెరీ కామన్! సచిన్, ధోనీ, కొహ్లీ.. ఈ ముగ్గుర్నీ వేలంలో కొనుక్కుని బ్యాట్ చేతికిచ్చినా... అంతా డకౌట్ అవుతారే తప్ప... దోమలు నాటౌట్. అంతేనా?! వాటి దెబ్బకు మన టెంపరేచర్ సెంచరీ దాటుతుంది. ఎలా మరి? జాగ్రత్తగా ఉంటే సరి. దోమ సైజు చాలా చిన్నది. కానీ అది కలిగించే వ్యాధుల జాబితా మాత్రం పెద్దది. ఆ జాబితాలో ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న వ్యాధి మలేరియా. ఏజెన్సీ ఏరియాలోని గిరిపుత్రుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న మలేరియా... కేవలం మన దగ్గర మాత్రమే కాదు ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో నమోదైన దేశాల సంఖ్య 192 అయితే ఇందులో దాదాపు 110 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. అంటే... సగానికి పైగా గ్లోబును ఈ వ్యాధి భయపెడుతోందన్నమాట. ఆ మలేరియా గురించి అవగాహన కోసం ఈ కథనం. ప్రధాన లక్షణాలు మలేరియా వ్యాధిలో ప్రధానంగా కనిపించే లక్షణం జ్వరం. రోగాన్ని కలిగించే పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించగానే లక్షణాలు కనిపించవు. అవి ప్రవేశించిన నాటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడేవరకు పట్టే వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. చలితో పాటు తలనొప్పి ఉండి జ్వరం కనిపిస్తుండటం మలేరియా సాధారణ లక్షణం. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్న జీవి ప్రజాతిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత చాలా ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో రోగి కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, కామెర్లు, మూత్రపిండాలు విఫలం కావడంతో పాటు, నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి మృత్యువు కూడా దారితీయవచ్చు. స్థూలంగా కనిపించేవి జ్వరం ∙తలనొప్పి ∙తీవ్రమైన ఒళ్లునొప్పులు జ్వరం : ఎర్రరక్తకణాల్లో ప్రత్యుత్పత్తి తర్వాత కణాలు పెరిగి ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమై మెరోజాయిట్స్ను విడుదల చేసినప్పుడు జ్వరం వస్తుంది. చలి : మొదట చలి వస్తుంది. ఆ తర్వాత విపరీతమైన చెమటలు పడతాయి. లక్షణాల్లో తేడాలిలా... ఎర్రరక్తకణాల నుంచి వచ్చే మెరోజాయిట్స్ విడుదల అనే అంశం వేర్వేరు రకాలు ప్రజాతుల్లో వేర్వేరు వ్యవధుల్లో ఉంటుంది. అందువల్ల జ్వరం వచ్చే తీరు, వ్యవధి ఒక్కొక్క ప్రజాతిలో ఒక్కోలా ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్, వైవాక్స్, ఒవేల్‌లో ప్రతి 48 గంటలకు ఒకసారి జ్వరం వస్తుంది. అదే మలేరీ ప్రజాతి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు జ్వరం ప్రతి 72 గంటలకు ఒకసారి వస్తుంది. నిర్ధారణ... ఇటీవలి కాలంలో అభివృద్ధి మలేరియా నిర్ధారణ కోసం రక్తపరీక్షపై ఆధారపడటం అన్నది సాధారణంగా ఇప్పటివరకూ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. అయితే ఇటీవల ఈ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి కారణంగా చాలా చవకగానూ, విస్తృతంగానూ లభ్యమవుతున్న ‘డిప్–స్టిక్’ పద్ధతి ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతోంది. పైగా ఈ పరీక్ష ఫలితాలు చాలా ఖచ్చితమైనవి కూడా. గతంలోని పరీక్షలు రక్త పరీక్ష : థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్షలు. ఒకసారి పరీక్షలు చేసిన వెంటనే మలేరియా పరాన్నజీవి కనుగొనకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ : మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్–ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. అయితే పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే తరహా పరీక్షలు కూడా ఉన్నాయి గాని, ప్రస్తుతం వీటిని పెద్దగా వాడటం లేదు. చికిత్సలో విప్లవాత్మకమైన పురోగతి గతంలో మలేరియా చికిత్స క్వినైన్, క్లోరోక్విన్ వంటి సంప్రదాయ మందులతో చేసేవారు. కానీ డాక్టర్లు అందుబాటులో లేని చోట కూడా విస్తృతంగా లభ్యమయ్యే ఆ మందుల పట్ల మలేరియా పరాన్నజీవులు తమ నిరోధక శక్తిని పెంచుకున్నాయి. అందుకే ఆ మందుల లభ్యతపై కొంత నియంత్రణ విధించాల్సి వచ్చింది. సాధారణ చికిత్స ప్రక్రియలు తొలుత మలేరియా వ్యాధి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అది వైవాక్స్ లాంటిదా లేక తీవ్రమైన ఫ్యాల్సిపేరమ్ తరహాదా అని పరిశీలిస్తారు. వైవాక్స్ లాంటి సాధారణ మలేరియాకు రోగిని ఇంట్లో ఉంచే చికిత్స చేయవచ్చు. సాధారణ క్లోరోక్విన్ వంటి మందులతో పాటు పుష్టికరమైన ఆహారం, మంచి విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. ఇక కేవలం మందుల విషయానికి వస్తే... ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ఫెక్షన్ సోకితే చికిత్స అనంతరం ప్రైమాక్వైన్ టాబ్లెట్స్ (15 ఎంజీ) రెండు వారాల కోర్సు వాడాల్సి ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్ అయితే... ఒకవేళ అది తీవ్రప్రభావం చూపించే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందినదైతే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ తరహా మలేరియా జ్వరంలో రోగికి కాలేయం, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఎక్కువ. అంటే కామెర్లు రావడం, స్పృహ తప్పిపోవడం, ఫిట్స్ రావడంతో పాటు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం తప్పనిసరి. ఇలాంటి స్థితిలో మలేరియా చికిత్స కోసం క్వినైన్ సల్ఫేట్, ఆర్టెసునేట్, టెట్రాసైక్లిన్, డాక్సిసైకర్టిన్, మెఫ్లోక్విన్, క్లిండోమైసిన్, అమోడయాక్విన్, ల్యూమెఫ్యాంట్రైన్ లాంటి మందులు వివిధ కాంబినేషన్స్‌లో వాడతారు. ఇతర శారీరక దుష్ప్రభావాలు (కాంప్లికేషన్స్) ఉన్నవారిలో తొలుత ఇంజెక్షన్స్ వాడి తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు ఉపయోగిస్తారు. రోగి అంతర్గత అవయవాలు దెబ్బతింటే... ఆ దెబ్బతిన్న అవయవాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే... మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస సరిగా అందకపోతే వెంటిలేషన్ వంటి సౌకర్యాలు అవసరమవుతాయి. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియాలో ఆసుపత్రిలో లభ్యమయ్యే ఈ తరహా చికిత్స రోగికి దొరకకపోతే ఒక్కోసారి అది రోగి మరణానికీ దారితీయవచ్చు. మొక్క నుంచి మందులు ఇటీవల మలేరియా చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు, పురోగతి చోటు చేసుకున్నాయి. ‘ఆర్టిమిసినిన్’ గ్రూపునకు చెందిన మందులను కనుగొన్న తర్వాత ఈ చికిత్స మరింత సులభం అయ్యింది. ‘ఆర్టిమిసినిన్’ అన్నది ‘స్వీట్ వార్మ్వుడ్’ అని పిలిచే చైనీస్ జాతి మొక్క. దీని నుంచి తయారు చేసిన ‘ఆర్టిమిసినిన్’ మందులతో గుణం చాలా మెరుగ్గానూ, వేగంగానూ కనిపిస్తుంది. అయితే ఒకే ఒక మందుగా (అంటే మోనో థెరపీగా) దీన్ని ఇచ్చినప్పుడు రోగిలోని మలేరియా క్రిములు ఆ మందు పట్ల నిరోధకతను వేగంగా అభివృద్ధి చేసుకుంటాయి. ఇదే విషయం మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్ దేశాల్లో నిరూపితమైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఈ తరహా మందుల లభ్యత పట్ల ప్రపంచ మార్కెట్లో కొన్ని నియంత్రణలను విధించింది. దాంతో ఆర్టిమిసినిన్తో పాటు మరికొన్ని కాంబినేషన్ మందులను వాడటం అన్నది ఫ్యాల్సిపేరమ్ తరహా మలేరియా చికిత్సలో ఒక భాగం అయ్యింది. దీన్నే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్టిమిసినిన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీలు (ఏసీటీస్)గా పేర్కొంటోంది. మలేరియా రోగాన్ని కలిగించే పరాన్న జీవులు ఇలా మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకోవడాన్ని గమనించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చికిత్సలో ఒక ప్రామాణికతను నిర్ణయించింది. దాన్ని ‘డబ్ల్యూహెచ్ఓ టీ3’గా అభివర్ణిస్తారు. టీ3 అంటే... టెస్ట్, ట్రీట్, ట్రాక్ ఇనిషియేషన్ అన్నమాట. అంటే నిర్ధారణ పరీక్ష, చికిత్స, అవి కొనసాగే తీరు. నివారణ దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే మలేరియా నుంచి అంత సమర్థంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు.మన ఇంట్లోకి, గదిలోకి దోమలు రాకుండా చూసుకోడానికి రిపెల్లెంట్లు, దోమతెరలు వాడవచ్చు. దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం. ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల çపరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. దీనితో పాటు కాల్వల్లో నీరు నిత్యం పారేలా కాల్వల పూడిక లేకుండా చూసుకోవడం అవసరం. దూరప్రాంతాలకు ప్రయాణమయ్యేవారు ముందు జాగ్రత్తగా సల్ఫాడోక్సిన్ – పైరిమిథమైన్ వంటి యాంటీ మలేరియల్ (కీమో– ప్రొఫిలాక్సిస్) మందులు తీసుకోవచ్చు.పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకండి.వాటర్ కూలర్స్లో కొంతమంది కొన్ని నీటిని ఉంచేస్తారు. సాధారణంగా వర్షాలుపడగానే వాటిని ఉపయోగించడం ఆపేసి, కూలర్లను మూలన పడేస్తారు. దాంతో అవి దోమలకు మంచి బ్రీడింగ్ స్థలాలుగా మారిపోతాయి. హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులను వాడకండి. ఒళ్లంతా పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడండి. మలేరియా అర్థమేమిటంటే? క్రీస్తుపూర్వం దాదాపు ఐదు శతాబ్దాల కిందటే ఈ వ్యాధిని గుర్తించారు. అయితే అప్పట్లో చెడు పరిసరాల వల్ల, చెడు గాలి వల్ల వచ్చేదని భావించేవారు. ‘మాల్’ అంటే చెడు అనీ... ‘ఏరియా’ అంటే పరిసరాలు అని అర్థం. ఈ భావన వల్లనే ఆ వ్యాధికి మలేరియా అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ఇది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. ప్రపంచమంతా ఉన్న ఈ వ్యాధి గురించి, దాని చరిత్రను గురించి సర్ రొనాల్డ్ రాస్ అనే పరిశోధకుడు ‘సికింద్రాబాద్’లోనే కనుక్కున్నారు. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి దోమలు వ్యాప్తి చేస్తాయి. దోమల్లోనూ ఆడ అనాఫిలిస్ దోమ దీని వ్యాప్తికి దోహదపడుతుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి కూడా నాలుగు ప్రధాన ప్రజాతులుగా ఉంటుంది. అవి... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి కూడా ఉంది గానీ దీని వ్యాప్తి కొద్ది దేశాలకే పరిమితం. వ్యాధి తీవ్రత ఎవరెవరిలో ఎక్కువ... ►వృద్ధుల్లో, చిన్నారుల్లో, గర్భిణుల్లో ►జబ్బు గుర్తించడంలో జాప్యం జరిగి చికిత్స అందడం ఆలస్యం అయిన వారిలో ►పారసైటిక్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో ►మలేరియా లేని దేశాల నుంచి మలేరియా ఉన్న ప్రాంతంలోకి వచ్చిన వారికి ఈ వ్యాధి పట్ల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో వారిలో తీవ్రత ఎక్కువ. డాక్టర్ జె. శ్రీకాంత్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ అపోలో హెల్త్ సిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -
వణుకుతున్న తూర్పు మన్యం
– మన్యంపై మలేరియా పంజా –జ్వరాలు బారిన గిరిజనులు - 16 గ్రామాల్లో దోమల విహారం - పెరుగుతున్న కేసులు... ప్రేక్షకపాత్రలో అధికార యంత్రాంగం - హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి: వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ - ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత ఏడాదికంటే మలేరియా కేసులు సంఖ్య పెరిగింది. 2016లో 1688 మందికి, 2017లో జనవరి నుంచి మే వరకు 2,676 మందికి... విలీన మండలాల్లో గత ఏడాది 699 మలేరియా కేసులు నమోదు. ఈ ఏడాది 1076 కేసులు నమోదయ్యాయి.. రంపచోడవరం: మలేరియా మరణాలు ఏజెన్సీని వణికిస్తున్నాయి. వర్షకాలం రాకుండానే తూర్పు ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తోంది. . వై రామవరం, మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లోని గిరిజనులు మలేరియా జ్వరాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంటికొకరు చొప్పున ఒకే గ్రామంలో జ్వరపీడితులున్నారు. గతంలోవలే మలేరియా నివారణకు ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంతో జ్వరాలు వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది.. వణుకుతున్న గిరిజన గ్రామాలు... మలేరియా జ్వరాలు సీజన్కంటే ముందే గిరిజనులపై పంజా విసిరింది. రెండు రోజుల్లో విలీన మండలాల్లో ముగ్గురు మలేరియా జ్వరాలతో మృత్యువాడ పడ్డారు. వై రామవరం మండలం చాపరాయిలో జ్వరాలు బారిన పడి 16 మంది మృతి చెందగా 15 మంది కాకినాడ జీజీహెచ్‌లోను, 15 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. మరో 13 మంది చాపరాయి గ్రామం నుంచి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. చాపరాయి పరిస్థితి ఇలా ఉంటే బొడ్డగండి పంచాయతీ పరిధిలోని 16 గ్రామాలు జ్వరాలతో వణుకుతున్నాయి. గొందికోట, నాగలోవ, అంటిలోవ తదితర గ్రామాలున్నాయి. గతకొన్ని రోజుల నుంచి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్ధితి అధికారులు దృష్టికి వచ్చిన వైద్య బృందాలను పంపలేదు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రయ్య మాట్లాడుతూ చాపరాయిలో ఐదు వైద్య బృందాలున్నట్లు తెలిపారు. చాపరాయి చుట్టుపక్కల గ్రామాలకు మరో ఏడు బృందాలను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు ఇంటింటి సర్వే చేస్తాయన్నారు. పెరిగిన మలేరియా కేసులు... ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత ఏడాదికంటే మలేరియా కేసులు సంఖ్య పెరిగింది. 2016సంవత్సరంలో 96,121 మంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తే 1688 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణయింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 110334 మంది జ్వర పీడితులు నుంచి రక్త నమూనాలు సేకరిస్తే 2,676 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణయింది. విలీన మండలంలో గత ఏడాది 699 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది 1076 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది దోమ తెర రెండు లక్షలు ప్రతిపాదనలు పంపగా 80 వేలు దోమతెరలు మాత్రమే వచ్చాయి. .ఏజెన్సీలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి... ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్థితులు తాండవిస్తున్నాయని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. తక్షణం హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మలేరియా బారినపడి విలీన మండలాల్లో ముగ్గురు చనిపోయారని భారీ మూల్యం చెల్లించకముందే తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పూర్తిస్థాయిలో వైద్య పోస్టులు, సిబ్బందిని నియమించాలన్నారు. అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రక్షిత మంచినీరు అందించాలన్నారు. గొందికోట గ్రామంలో 80 మంది జ్వరాలతో బాధపడుతున్నారని వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చాపరాయి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. తూతూ మంత్రపు చర్యలు... ప్రభుత్వం ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్ధితులను చక్కబెట్టేందుకు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ అన్నారు. బొడ్డగండి పంచాయతీలోని అన్ని గ్రామాలకు వైద్య బృందాలను పంపించి తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని తక్షణం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ సహాయంతో చాపరాయి గ్రామం వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్న గొప్పును తవ్వాలన్నారు. విలీన మండలంలో కాళ్లవాపు వ్యాధి వచ్చినప్పుడే గిరిజన గ్రామాల్లో ఆర్ఓ పాంట్లు ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోలేదన్నారు. ఈ రోజుల గిరిజనులు కలుషిత నీరు తాగి జ్వరాలు బారిన పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జూలై 1న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. -
వ్యాధులపై సమరం
► జిల్లాకు చేరిన మలేరియా ర్యాపిడ్ కార్డులు ► ఉమ్మడి జిల్లాకు 75వేలు ► క్లోరిన్ గుళికలు 7లక్షలు ► దోమలు, లార్వాల నివారణకు స్ప్రే, లిక్విడ్స్ ► కాంట్రాక్టర్ల ద్వారా జిల్లాల్లో స్ప్రే పనులు సాక్షి, ఆదిలాబాద్: సీజనల్ వ్యాధుల ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా సీజనల్ వ్యాధుల ప్రభావం కారణంగా అధికసంఖ్యలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగించేది. గత రెండేళ్లుగా మరణాల ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ వ్యాధుల ప్రభావం మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, నీటి కలుషితం నివారణకు చర్యలు తీసుకుంటోంది. వ్యాధులు ప్రబలినప్పుడు తక్షణం వివిధ పరీక్షల ద్వారా గుర్తించేందుకు అనువుగా టెస్ట్కార్డులను ఏటా సరఫరా చేస్తోంది. ఈయేడు కూడా ఉమ్మడి జిల్లాకు మలేరియా ర్యాపిడ్ కార్డ్ టెస్టు కిట్లు మంజూరు చేసింది. 75వేల ర్యాపిడ్ కార్డ్ టెస్టు కిట్లు.. తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌళిక సదుపాయాల అభివద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) నుంచి ఉమ్మడి జిల్లాకు 75వేల మలేరియా ర్యాపిడ్ కార్డ్ టెస్టులు మంజూరయ్యాయి. వీటిని నాలుగు జిల్లాలకు త్వరలో పంపించనున్నారు. మలేరియా వ్యాధిని తక్షణం గుర్తించేందుకు ఈ ర్యాపిడ్ కార్డు టెస్టుల ద్వారా నిర్ధారణ చేయవచ్చు. దీంతోపాటు ఇదివరకు మలేరియా పాజిటివ్ కేసులు రెండును మించి వచ్చిన చోటా పైరిత్రమ్ స్ప్రేను నాలుగు జిల్లాలకు కలిపి 200 లీటర్లు మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా దోమల ఉధృతి ఉన్న చోటా, ఇళ్ల లోపల పైరిత్రమ్ను స్ప్రే చేయడం జరుగుతుంది. నిల్వ ఉన్న నీళ్ల దగ్గర దోమల లార్వాలు వృద్ధి చెందే అవకాశం ఉండగా, అక్కడ టెమిఫోస్ లిక్విడ్‌ను చల్లడం ద్వారా లార్వాలను నిరోధించే అవకాశం ఉంటుంది. జిల్లాకు 550 లీటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నాలుగు జిల్లాలకు దీనిని సరఫరా చేయనున్నారు. ఇండోర్ రెసిడ్యూయల్ స్ప్రేగా పేర్కొనే దీన్ని జిల్లాల్లో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. వీటితోపాటు మైక్రోస్లైడ్స్, బ్లడ్ ల్యాన్సర్లు, స్లైడ్ బాక్సులను సైతం మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు ఇవి చేరుకున్నాయి. వీటిని నాలుగు జిల్లాలకు సరఫరా చేయనున్నారు. ఏడు లక్షల క్లోరిన్ గుళికలు.. ప్రధానంగా మంచినీటి ట్యాంకులు, బావుల్లో ఆర్డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో క్లోరినేషన్ చేయడం ద్వారా నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నివారించవచ్చు. ట్యాంకుల్లో ప్రతి 15 రోజులకోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. బావుల్లో వారానికి ఒకసారి క్లోరినేషన్ చేయాలి. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్ మండలం తడిహత్నూర్లో బావిలో నీరు కలుషితం కావడంతో వందమందికి పైగా అస్వస్థతకు గురైన విషయం విదితమే. నిల్వ ఉన్న నీటిలో క్లోరినేషన్ చేస్తారు. వాగులు, వంకల్లో ప్రస్తుతం కొత్త నీరు చేరుతోంది. పలు గ్రామాల్లో ఆ నీటిని కుండల్లో నింపుకొని గ్రామస్తులు తాగుతున్నారు. తద్వారా నీరు కలుషితంగా ఉండి డయేరియా వంటి వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు 7లక్షల క్లోరిన్ గుళికలను సరఫరా చేసింది. ఇప్పటికే ఇవి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరుకున్నాయి. నాలుగు జిల్లాలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా వాగులు, వంకల నుంచి బిందెల్లో పట్టుకున్న నీటిలో రాత్రిపూట ఒక క్లోరిన్ గుళిక వేసి మరుసటి రోజు కాచివడబోసి తాగిన పక్షంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉండదని వైద్యాధికారులు చెబుతున్నారు. పెరిత్రమ్ స్ప్రే.. ఉమ్మడి జిల్లాకు 200 లీటర్లు మంజూరు నాలుగు జిల్లాలకు 50 లీటర్ల చొప్పున పంపిణీ టెమిఫోస్ లిక్విడ్.. టెమిఫోస్ లిక్విడ్ 550 లీటర్లు నాలుగు జిల్లాలకు సమానంగా పంపిణీ మలేరియా టెస్టులు చేసేందుకు మైక్రోస్లైడ్స్.. ఉమ్మడి జిల్లాకు 2లక్షల 90వేలు రోగి నుంచి రక్తం సేకరించేందుకు బ్లడ్ ల్యాన్సర్స్.. ఉమ్మడి జిల్లాకు 2లక్షల 90వేలు రక్త సేకరణ తర్వాత నిల్వ కోసం స్లైడ్ బాక్సులు.. ఉమ్మడి జిల్లాకు స్లైడ్ బాక్సులు 400 జిల్లాకు 100 చొప్పున పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాల్లో స్ప్రే ఇదివరకు మలేరియా పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాల్లో ఇండోర్ రెసిడ్యూయ్ స్ప్రే చేయిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించాం. ఆదిలాబాద్ జిల్లాలోని 437 గ్రామాల్లో ఈ స్ప్రే చేపడుతున్నాం. ప్రతి గ్రామంలో స్ప్రే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్ప్రే పనులను నిరంతరం పర్యవేక్షిస్తాం. ఎక్కడైనా లోపాలు ఉన్నపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో -
డెంగీ సైరన్..
►విజృంభిస్తున్న మలేరియా ►పదిరోజుల్లో 17 మలేరియా, 6 డెంగీ కేసులు నమోదు ►అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యశాఖ సిటీబ్యూరో: ఇటీవల నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖాళీ కొబ్బరి బొండాలు, టైర్లలోకి నీరు చేరడంతో దోమలు వ్యాపించి బస్తీవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాంటిలార్వా, ఫాగింగ్ నిర్వహించి ఎప్పటికపుడు దోమలను నియంత్రించి, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఎంటమాలజీ విభాగం అధికారులు పట్టించుకోలేదు. గ్రేటర్లో కేవలం పది రోజుల్లో 17 మలేరియా, 15 డెంగీ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన డెంగీ, మలేరియా కేసుల వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చేరడం లేదు. ప్రభుత్వం ఐజీఎం ఎలీసా టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు ఎన్ఎస్–1 టెస్టు చేస్తున్నాయి. వీటిలో పాజిటివ్ వచ్చిన వాటిని డెంగీ జ్వరంగా నిర్థారిస్తున్నారు. నిజానికి రోగి నుంచి రెండో శాంపిల్స్ సేకరించి నిర్ధారణ కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపాలి. కానీ ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఐపీఎంకు రెండో శాంపిల్‌ను పంపడం లేదు. సీజనల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎపిడమిక్ సెల్‌కు తెలియజేయాల్సి ఉన్నా చాలా ఆస్పత్రులు సస్పెక్టెడ్ డెంగీగా పేర్కొంటూ చికిత్స చేసి పంపుతుండడం గమనార్హం. టైగర్ దోమతోనే డెంగీ.. ఈడిస్ ఈజిప్ట్(టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. ఒంటిపై తెల్లని చారలతో కనిపించే ఈ నల్లని దోమ పగటిపూట కుడుతుంది. కుట్టిన 7–8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు బయటపడుతాయి. కళ్లమంట, అధిక జ్వరం, చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ కౌంట్ 20 వేలలోపునకు పడిపోయి రక్తస్రావం అవుతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యుడు నీరు నిల్వలేకుండా చూడాలి డెంగీ బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇంటి పరిసరాల్లో మురుగు, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు నిల్వ ఉండకుండా చూడాలి. నీటి ట్యాంకులు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. గదుల్లో వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. పిల్లలకు పగటిపూట దోమ తెరలు వాడాలి. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లపై మూతలు విధిగా ఉంచాలి. – డాక్టర్ రమేష్ దంపూరి, నిలోఫర్ -
పారా‘చెక్’
► మలేరియా నిర్ధారణకు మీనమేషాలు ► పాత పద్ధతిలో స్లైడ్లతో రక్తపరీక్షలు ► జ్వర పీడితులకు సకాలంలో అందని వైద్యం ► ఎపిడమిక్‌కు ముందస్తు చర్యలు చేపట్టని ప్రభుత్వం మలేరియా అనగానే విశాఖ ఏజెన్సీ గుర్తుకొస్తుంది. ఈ మహమ్మారి విజృంభణతో ఆదివాసీలు పిట్టల్లా రాలిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుంటే భయం గొలుపుతుంది. ఈ ఏడాది మాత్రం దీని నియంత్రణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేకపోయింది. గిరిజనుల సంక్షేమమే ధ్యేయమని ఊకదంపుడు ప్రసంగాలిచ్చే పాలకులు మలేరియాను క్షణాల్లో నిర్ధారించే పారాచెక్ కిట్లను కూడా ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేకపోయారు. హుకుంపేట (అరకులోయ): పారాచెక్ కిట్లు ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో లేకపోవడంతో మలేరియా నిర్ధారణ సకాలం జరగడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే 28వ తేదీ వరకు మన్యంలో 11,073 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జ్వర పీడితులకు రక్తపరీక్షలను స్లైడ్స్ పద్ధతిలో ఇప్పుడు చేపడుతున్నారు. ఈ నివేదిక వచ్చేందుకు 24 గంటల సమయం పడుతోంది. మలేరియా బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించకుంటే ప్రాణాంతక సెరిబ్రల్గా మారి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అదే పారాచెక్లతో రక్తపరీక్షలు చేపడితే క్షణాల్లో అది మలేరియా..కాదా అన్నది నిర్ధారణ అవుతుంది. కానీ గ్రామాలలో తిరిగే వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తల వద్ద పారాచెక్లు లేవు. ఒకటి,రెండు కిట్లతో గ్రామాలను వైద్యసిబ్బంది సందర్శించాలిసిన దుస్థితి. ఏటా ఏప్రిల్ నెల నుంచి మన్యంలో వ్యాధుల కాలం మొదలవుతుంది. మలేరియా, ఇతరత్రా వ్యాధుల నివారణకు జనవరి నెల నుంచే ముందస్తుగా ,ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం, వైద్యఆరోగ్య, మలేరియా శాఖలు ప్రణాళికలు రుపోందించాలి. ఈ ఏడాది జనవరి నెల నుంచే మలేరియా తీవ్రత నెలకొంది. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 36 ఆరోగ్య కేంద్రాలతో పాటు, అరకులోయ, పాడేరు, నర్సీపట్నం, కె.కోటపాడు ఏరియా ఆస్పత్రులలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రులన్నింటిలోనూ పారాచెక్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో జ్వరపీడితులకు ,క్షణాల్లో రక్తపరీక్షలు జరగడం లేదు. ప్రతి ఆస్పత్రి పరిధిలో కనీసం 2వేల పారాచెక్ కిట్లు అందుబాటులో ఉండాలి. ఒక్కోదానిలో ప్రస్తుతం 100 కూడా లేవు. జ్వరంతో పరిస్థితి విషమించిన వారికి మాత్రమే ఉన్నవాటితో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. మిగతా జ్వరపీడితులకు రక్తపరీక్షలు ఆలస్యమవుతున్నాయి. పారాచెక్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని, ఈమేరకు జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామని మలేరియా శాఖాధికారులు గత నెలలో ప్రకటించారు.కానీ కొత్త కిట్లు మన్యానికి రాలేదు. పాత పద్ధతిలో స్లైడ్‌లపై రక్తపూతలు సేకరించి తెచ్చి ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నారు. ఎపిడమిక్ దృష్ట్యా ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి అధికంగా ఉంటోంది. ఈ కారణంగా పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. మరుసటి రోజున వ్యాధి నిర్ధారణ చేసి, సంబంధిత రోగి ఉండే గ్రామాలకు వైద్యసిబ్బంది పరుగులు తీస్తున్నారు.ఆసమయంలో మలేరియా సోకిన గిరిజనుడు ఉంటే వైద్యసేవలు కల్పిస్తున్నారు. రోగి లేకపోతే వైద్యసేవలు ఆలస్యమవుతున్నాయి. రెండు రోజుల్లో 20వేల కిట్లు... మలేరియాను సకాలంలో నిర్ధారించే పారాచెక్ ఆర్డీ కిట్లు 20వేలు రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తాం. జిల్లా కలెక్టర్ అనుమతి లభించడంతో పారాచెక్లను ఏజెన్సీలోని అన్ని ఆస్పత్రులకు పంపిణీకి చర్యలు చేపట్టాం. ప్రతి జ్వరపీడితుని క్షణాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలు జరుపుతాం. - ప్రసాదరావు, జిల్లా మలేరియా అధికారి -
అటవీ నిర్మూలనతో మలేరియా వ్యాప్తి!
న్యూయార్క్: అడవులను నాశనం చేయడం ద్వారా మలేరియా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు 67 తక్కువ అభివృద్ధి చెందిన, మలేరియా ప్రభావిత దేశాలపై అమెరికాలోని లేహై విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించి తెలిపారు. అడవులను నాశనం చేయడంతో సూర్యకాంతి అధికంగా భూమిని చేరడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో నీరు ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రవహించకుండాపోయి ఒకే ప్రదేశంలో తటస్థంగా నిల్వ ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పరిస్థితులు మలేరియా వ్యాప్తికి ముఖ్య కారకాలైన ‘అనాఫిలెస్’ జాతికి చెందిన దోమలు పెరగటానికి దోహదపడతాయని చెప్పారు. తద్వారా మలేరియా కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని లేహై విశ్వవిద్యాలయానికి చెందిన కెల్లీ ఆస్టిన్ వివరించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 1990 నుంచి దాదాపు 130 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని నాశనం అయినట్లు ఐకరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ నివేదికలో వెల్లడించింది. -
డెంగీ, మలేరియాపై విస్తృత ప్రచారం
జిల్లా కలెక్టర్ ఆదేశం కాకినాడ వైద్యం : డెంగీ, మలేరియాపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వనీటిలో దోమలు ఉంటాయన్నారు. దోమల కారణంగానే డెంగీ సంభవిస్తుందన్నారు. గతేడాది జిల్లాలో 336 డెంగీ కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వ్యాధి నివారణ కోసం వర్షాలు పడక ముందే జూన్ నెలలో గ్రామాల్లో సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. దోమల నిర్మూలన కోసం డ్రైనేజీలు, నిల్వనీటి ఆవాసాలపై యాంటీలార్వా స్ప్రే చేయించాలన్నారు. డెంగీ నివారణ కోసం పైరీత్రమ్ మందు చల్లడం, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. గ్రామసభల్లో డెంగీ, మలేరియాపై అవగాహన కల్పించాలని డీపీఓను ఆదేశించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా శక్తి సంఘ సభ్యులు, పింఛన్‌దారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాకినాడ ,రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులలో డెంగీ మందులు, ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎన్ ప్రసాద్, జెడ్పీ సీఈవో పద్మ, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు పాల్గొన్నారు. ‘గుడా’ కార్యకలాపాలు ప్రారంభించాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గోదావరి అర్భన్ డెవలెప్మెంట్ అథారిటీ (గుడా) కార్యకలాపాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాల్లో మంగళవారం గుడా తొలి కార్యవర్గ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లో కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో గుడా తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని కమిషనర్ అలీంబాషాను ఆదేశించారు. కాకినాడలో 15 రోజుల్లో రెగ్యులర్ కార్యాలయం ఏర్పాటుకు చేయాలని గుడా వైస్ చైర్మన్‌ను కోరారు. ఈ నెల 24 నుంచి గుడా కార్యకలాపాలు ప్రారంభమతున్న నేపథ్యంలో 22 నాటికే గుడా పరిధిలోని 240 పంచాయతీ కార్యదర్శులు, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపల్ అధికారులు, గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్లకు అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో 300 చదరపు మీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వెయ్యి చదరపు మీటర్లు పైబడిన విస్తీర్ణంలోని స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు గుడా అనుమతి అవసరమన్నారు. గుడా నిర్వహణకు సర్వే, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఆడిట్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల నుంచి కొంతమంది సిబ్బందిని అదనపు బాధ్యతలపై నియమించాలన్నారు. గుడా వైస్ చైర్మన్ వి.విజయరామరాజు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, డీపీఓ టీబీఎస్జీ కుమార్, అర్అండ్బీ ఎస్ఈ ఎస్‌ఎన్‌మూర్తి, ట్రాన్స్‌కో ఎస్ఈ రత్నకుమార్ పాల్గొన్నారు. -
మలేరియా దోమరణం
పరిపరి శోధన మలేరియా దోమతో తమాషా కాదు. అలా కుట్టి ఇలా వెళ్లిపోతుంది. కానీ ఈ మలేరియా దోమ కాటుతో ప్రపంచంలో సగం మంది జనాభా మలేరియా బారిన పడే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి 45 సెకన్లకు ఒక శిశువు మలేరియా దోమ కాటు మూలంగా ప్రాణం విడుస్తున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. అలాగే మలేరియా మరణాల్లో 90 శాతం మరణాలు ఆఫ్రికా ఖండంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశాల్లో మలేరియా వ్యాధి విజృంభిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మలేరియా దోమ రాత్రిపూట కుడుతుంది. మనిషి రక్తంలోకి పేరసైట్లను ప్రవేశపెట్టి రోగానికి కారణమవుతుంది. మలేరియా వ్యాధి... 9 నుంచి 14 రోజులపాటు జ్వరం, వణకడం, వాంతులు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. -
మలేరియాను అంతం చేద్దాం
–జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ కర్నూలు(హాస్పిటల్): సమాజం నుంచి మలేరియాను అంతం చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ వద్ద ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్ నుంచి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు కొనసాగింది. కలెక్టర్ మాట్లాడుతూ 2030 నాటికి మలేరియాను అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి మలేరియాపై ప్రజలకు చైతన్యపరిచినట్లు తెలిపారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని సూచించారు. ఈ మేరకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ టి. రామనాథ్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ మీనాక్షిమహదేవ్, మలేరియా జిల్లా అధికారి జె.డేవిడ్‌రాజు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణచక్రవర్తి, డీఐవో డాక్టర్ వెంకటరమణ, ఇన్‌ఛార్జి డెమో ఎర్రంరెడ్డి, ఆర్బీఎస్కే ప్రాజెక్టు కో ఆర్డినేటర్ హేమలత పాల్గొన్నారు. -
దోమల దండయాత్ర!
⇒ గ్రేటర్ చుట్టూ చెరువుల్లో పెరిగిన కాలుష్యం ⇒ విపరీతంగా బ్యాక్టీరియా, కోలిఫాం ఉనికి ⇒ వేగవంతంగా దోమ లార్వాల వృద్ధి.. ⇒ పొంచిఉన్న డెంగీ, మలేరియా ముప్పు ⇒ పీసీబీ తాజా పరిశీలనలో వెల్లడి సిటీబ్యూరో: డెంగీ..మలేరియా..స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులతో అల్లాడుతున్న సిటీపై ఇప్పుడు దోమలు దండయాత్ర చేస్తున్నాయి. చెరువుల కాలుష్యం శాపంగా మారుతోంది. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు జలాశయాలు కాలుష్య కాసారమవుతుండడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. గ్రేటర్ వాసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి చేరుతున్న వ్యర్థజలాలతో నగరం చుట్టూ ఉన్న చెరువులు దుర్గంధభరితంగా మారుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఆయా చెరువుల్లో కోలిఫాం, హానికారక బ్యాక్టీరియా ఉనికి అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పలు జలాశయాల్లో గుర్రపుడెక్క పెరగడంతోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దోమ లార్వాలు భారీగా వృద్ధిచెందేందుకు అనుకూలంగా ఉండి.. మహానగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దుస్థితి కారణంగా సిటీజన్లకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు పొంచిఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిలువెల్లా కాలుష్యమే.. నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలంకావడం శాపంగా పరిణమిస్తోంది. పలు చెరువుల్లో గుర్రపుడెక్క ఉధృతి అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా డ్రైనేజీ నీరు, వ్యర్థజలాల్లో ఉండే ఫేకల్ కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరిగినట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. దీంతో ఆయా చెరువుల్లో హానికారక షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా ఉనికి పెరిగినట్లు స్పష్టమైంది. దీనికి తోడు ప్రస్తుతం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిలో నమోదవుతుండడంతో పలు చెరువుల్లో దోమల లార్వాలు ఉధృతంగా వృద్ధిచెందుతున్నాయి. ఈ దుస్థితికి కారణాలివే.. కూకట్పల్లి ప్రగతి నగర్ చెరువులో 2015తో పోలిస్తే 2016 సంవత్సరంలో ప్రతి వంద మి.లీ నీటిలో 406 మైక్రోగ్రాముల మేర కోలిఫాం ఉనికి పెరిగింది. సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా మినీ మురుగు శుద్ధికేంద్రాలను నిర్మించడంలో జీహెచ్ఎంసీ విఫలం కావడంతో పరిస్థితి విషమిస్తోంది. గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాకు గురవడం..చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు పెరిగింది. చాలా వరకు చెరువులు వాటి ఎఫ్టీఎల్ పరిధిలోని సగం భూములను కోల్పోయి చిక్కి శల్యమై కనిపిస్తున్నాయి.చెరువుల్లో కనీసం గుర్రపు డెక్కను, దోమల లార్వాలను కూడా పూర్తిస్థాయిలో తొలగించడంలేదు. కూకట్పల్లి అంబీర్ చెరువులోకి సమీప ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు నేరుగా వచ్చి చేరుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఈ చెరువు చుట్టూ భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినా బల్దియా యంత్రాంగం ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. చెరువులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం నగరంలోని అంబర్ చెర్వు, ప్రగతినగర్, కాప్రా, పెద్ద చెర్వు, సాయిచెర్వు, దుర్గంచెర్వు, నల్లచెర్వు, లక్ష్మీనారాయణ చెర్వులకు సమీపంలో ఉన్న కూకట్పల్లి, కెపిహెచ్బీ, మూసాపేట్, శేరిలింగపల్లి, మణికొండ, జిల్లెలగూడా, బాలాపూర్, బాలానగర్ ప్రాంతాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలోని మెహిదీపట్నం, మసాబ్‌ట్యాంక్, చాదర్‌ఘాట్, కోఠి, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, రాజేంద్రనగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిలో అంటే కనిష్టంగా 18, గరిష్టంగా 33 డిగ్రీల మేర నమోదవుతుండడంతో దోమ లార్వాలు గణనీయంగా వృద్ధిచెంది ఆయా ప్రాంతాలను దోమలు ముంచెత్తుతున్నాయి. లార్వాల వృద్ధిని నిరోధించేందుకు యాంటీ లార్వా స్ప్రే చేయడంలోనూ జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమవుతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. -
ఆ రక్తమంటే దోమలు పడిచస్తాయట!
న్యూఢిల్లీ: దోమల కారణంగా మానవులకు వచ్చే జబ్బులు చాలానే ఉన్నాయి. అందులో మలేరియా కూడా ఒకటి. మలేరియా గురించిన ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని స్టోక్ హోమ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు బయటపెట్టారు. మలేరియా సోకిన వ్యక్తి రక్తమంటే దోమలు పిచ్చెక్కిపోతాయట. మలేరియా సోకిన వ్యక్తి శరీరంలోని క్రిమి హెచ్ఎమ్బీపీపీ అనే మాలిక్యూల్స్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. దాని వల్ల మనుషుల్లోని ఎర్ర రక్తకణాలు కార్బన్ డై ఆక్స్‌డ్ ను అధిక మొత్తంలో విడుదల చేస్తాయని చెప్పారు. ఆ సమయంలో మనిషి శరీరం నుంచి వచ్చే వాసన దోమలను ఆకర్షిస్తుందని తెలిపారు. వ్యక్తి నుంచి దోమలు సేకరించిన రక్తంలో ఉన్న మలేరియా క్రిములు వేరే వ్యక్తిని కుట్టినప్పుడు అతని శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. తాజా పరిశోధనలతో ప్రమాదకర రసాయనాలను వినియోగించకుండా మలేరియాను నయం చేసేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
దేశంలో 80 వేల మందికి డెంగీ
-
దేశంలో 80 వేల మందికి డెంగీ
7.42 లక్షల మలేరియా కేసులు నమోదు మలేరియాతో 188.. డెంగీతో 166 మంది మృతి - తెలంగాణలో 1,916 డెంగీ కేసులు.. మృతులు ముగ్గురు! - 1,765 మలేరియా కేసులు - ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య పరిస్థితి ఇదీ.. - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ఏడేళ్లలో ఏకంగా మూడు రెట్లు అధికంగా డెంగీ కేసులు నమోదయ్యారుు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం ఈ మేరకు ఒక నివేదికలో తెలిపింది. అలాగే మలేరియా కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నారుు. పారిశుధ్య లోపం, దోమల స్వైర విహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారుు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 79,800 డెంగీ కేసులు నమోదు కాగా.. 166 మంది చనిపోరుునట్లు కేంద్రం తన నివేదిక వెల్లడించింది. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదవగా.. 110 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏడాదికేడాదికి కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. 2012లో ఏకంగా 50 వేల మందికి డెంగీ సోకగా... 242 మంది చనిపోయారు. 2013లో 75,808 డెంగీ కేసులు నమోదు కాగా.. 193 మంది మృత్యువాత పడ్డారు. 2015లో లక్ష డెంగీ కేసులు నమోదుకాగా... 220 మంది చనిపోయారు. అలాగే మలేరియా కేసులు ఈ ఏడాది ఇప్పటివరకు 7.42 లక్షలు నమోదయ్యారుు. 188 మంది చనిపోయారు. గతేడాది 11.69 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా... 384 మంది మరణించారు. రాష్ట్రంలో ముగ్గురేనట తెలంగాణలో డెంగీతో ముగ్గురు మాత్రమే చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అరుుతే ఇటీవల ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఏకంగా 22 మంది చనిపోయారని వెల్లడైంది. దీన్ని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,916 డెంగీ కేసులు నమోదయ్యాయని కేంద్ర నివేదికలో వెల్లడించారు. దేశంలో ఈ ఏడాది అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 29 మంది డెంగీతో చనిపోయారు. ఆ రాష్ట్రంలో 5,456 డెంగీ కేసులు నమోదయ్యారుు. పశ్చిమ బెంగాల్లో 11 వేల డెంగీ కేసులు నమోదు కాగా... 28 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 5,391 డెంగీ కేసులు నమోదు కాగా... 22 మంది చనిపోయారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో 12 మంది చొప్పున డెంగీతో మరణించారు. మలేరియా కేసులు దేశంలో అత్యధికంగా ఒడిశాలో నమోదయ్యారుు. ఆ రాష్ట్రంలో ఏకంగా 3.36 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా... 65 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్లో 22,030 కేసులు నమోదు కాగా.. 55 మంది చనిపోయారు. మేఘాలయలో 28,973 కేసులు రికార్డు కాగా.. 33 మంది మరణించారు. తెలంగాణలో మలేరియా కేసులు 1,765 నమోదు కాగా.. ఒక్కరూ చనిపోలేదని కేంద్ర నివేదిక వెల్లడించింది. -
డెంగీ మరణమృదంగం
♦దేశంలో రికార్డు స్థారుులో బోనకల్లో 305 పాజిటివ్ కేసులు ♦ఇప్పటి వరకు 18 మంది మృత్యువాత సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం దేశ వైద్య, ఆరోగ్యశాఖ రికార్డుల్లోకెక్కింది. మూడు నెలల్లో డెంగీ, మలేరియా, టైఫారుుడ్, ఇతర విషజ్వరాలతో మండలంలో సగటున ఒక్కో నెలలో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యారుు. డెంగీ పాజిటివ్ కేసులు 305 నమోదు కావడంతో దేశంలోనే అత్యధికంగా ఈ కేసులు బోనకల్ మండలంలో నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. మూడు నెల లుగా ఈ మండలంలోని ఏ పల్లె చూసినా వందల సంఖ్యలో కుటుంబాలు మంచం పట్టారుు. ఇప్పటికే 18 మంది డెంగీతోనే మృతి చెందారు. ఈ మండలం లోని 15 గ్రామాల్లో డెంగీ పంజాతో వందలాది కుటుంబాలు విషజ్వరాలతో విలవిలలాడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 5,143, సెప్టెంబర్‌లో 6,138, ఈ నెలలో ఇప్పటి వరకు 6,735 మందికి విషజ్వరాలు సోకారుు. ఇందులో బోనకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స చేరుుంచుకున్నవారిలో 305 మందికి డెంగీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వందలాది మంది ఖమ్మం, కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేరుుంచుకుంటున్నారు. పీహెచ్సీలో చికిత్స పొందినవారిలో ఎవరూ మృతి చెందలేదని వైద్యాధికారులు పేర్కొంటుండగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికి త్స చేరుుంచుకున్నవారిలో 18 మంది చనిపోయారు. మూడు నెలలుగా పీహెచ్సీ కిటకిట.. బోనకల్ పీహెచ్సీది ఆరు పడకల స్థారుు. విషజ్వరాలతో జనం పీహెచ్సీ బాట పట్టడంతో తాత్కాలికంగా 60 మంచాలు ఏర్పాటు చేశారు. ఆరు బయట కూడా వైద్యం అందిస్తున్నారు. రోజుకు 50 లోపే ఉండే ఓపీ ఈ పీహెచ్సీలో వరుసగా ఈ మూడు నెలలు 200 పైగానే ఉంటోంది. గతంలోనే ఒక్కరే డాక్టర్ ఉండగా.. అదనంగా ముగ్గురు డాక్టర్లను నియమించారు. వీరే కాకుండా ఒక్కో బృందానికి ఇద్దరు డాక్టర్ల చొప్పున ఐదు బృందాలకు మొత్తంగా 10 మంది డాక్టర్లను నియమించి.. మండలంలో 150 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. బోనకల్, ఆళ్లపాడులో అత్యధికం బోనకల్లో 77, ఆళ్లపాడులో 71 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు చేశారు. మొత్తం మండలంలో 18 మంది ఈ మూడు నెలల్లో డెంగీతో మృతి చెందారు. ఇందులో రావినూతలలో 5, ఆళ్లపాడు లో 1, చిరునోములలో 2, బోనకల్లో 3, ముష్టికుంట్లలో 1, బ్రహ్మణపల్లి 1, గోవిందాపురం ఎల్లో 2, రామాపురంలో 2, గార్లపాడులో ఒకరు మృతి చెందారు. -
వ్యాధుల విజృంభణ
* పెరుగుతున్న డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ కేసులు * ఇప్పటివరకు 1,073 డెంగీ కేసులు నమోదు... ఇద్దరు మృతి * బెంబేలెత్తుతున్న జనం... ఆస్పత్రులు కిటకిట సాక్షి, హైదరాబాద్: వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. పారిశుద్ధ్యం లోపించింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ కేసులూ నమోదవుతుండటంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదని, పూర్తిస్థాయిలో మందులులేవన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హెదరాబాద్లోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలుడు, అంబర్‌పేటకు చెందిన 22 ఏళ్ల యువతి డెంగీతో చనిపోయారు. సర్కారు లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 1,073 డెంగీ కేసులు, 2,435 మలేరియా కేసులు, 31 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. సాధారణ విషజ్వరాలు దాదాపు 3 లక్షల వరకు ఉంటాయని అంచనా. గత నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్రంలో 45 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు నిలువుదోపిడీకి తెగబడ్డాయి. 20 వేల నుంచి 50 వేలలోపున్న ప్లేట్లెట్లు ఉన్నవారికి కూడా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయి. మందులకు నిధుల కొరత రాష్ట్రంలో 750 పీహెచ్‌సీలు, 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 30 ఏరియా ఆస్పత్రులు, 7 జిల్లా ఆస్పత్రులున్నాయి. వాటికి రోజువారీగా దాదాపు 330 రకాల మందులను అందుబాటులో ఉంచాలి. దీనికోసం సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో మందులను తీసుకెళ్లాలి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో అవసరమైన స్థాయిలో మందులు లేవని అంటున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులందరికీ మందులిచ్చే పరి స్థితి లేకపోవడంతో బయట కొనుక్కోవాల్సి వస్తోంది. రెండో త్రైమాసికం పూర్తి కావస్తున్నా నిధులు విడుదల చేయలేదు. అయితే అన్ని మందులను అందుబాటులో ఉంచామని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాలరావు తెలిపారు. ‘ఆన్లైన్లో ఏమేమి ఉన్నాయో ఆ ప్రకారం పీహెచ్‌సీలు ఇండెంట్ పెట్టుకొని తీసుకెళ్లవచ్చు. తీసుకెళ్లలేదంటే అది వాళ్ల సమస్యే. దానికి మేం బాధ్యులం కాదు. డిమాండ్‌ను బట్టి రోగులందరికీ మందులు ఇవ్వడం సాధ్యంకాదు. మా బడ్జెట్ ప్రకారమే మందులు కొనుగోలు చేస్తాం. అయినా మందులు లేవంటూ మాకు ఫిర్యాదులు రాలేదు’ అని ఆయన అన్నారు. -
దోమల నివారణ అంటే...ఆ వ్యాధుల నివారణే!
ఇటీవల మన తెలుగు రాష్ట్రాలలో దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఆయా వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే వాటి నివారణ ఎంతో మేలు. అయితే మన రాష్ట్రాల వాతావరణం కూడా ఇందుకు దోహదపడేలా ఉంటుంది. ఒక ప్రదేశంలో తీవ్రమైన వేడిమి, చాలా ఎక్కువగా తేమ, అదేపనిగా నీళ్లు నిల్వ ఉండే పరిసితులు ఉంటే అక్కడ దోమలు విపరీతంగా పెరుగుతుంటాయి. మనం ట్రాపికల్ ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇక్కడి వాతావరాణ్ని బట్టి ఎక్కువ వేడి, తేమ, నీళ్లు ఉంటాయి. ఇదే వాతావరణం వరి పెరగడానికి అనువైనది. దురదృష్టవశాత్తు ఇదే వాతావరణం దోమ పెరగడానికి కూడా అనువైనది. ఒక దోమ జీవించే కాలం (ఆయుఃప్రమాణం) దాదాపు 30 రోజులు. ఈ కాలంలో అది రోజు విడిచి రోజు 150 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టడానికి చిన్న కొబ్బరి చిప్ప పరిమాణంలో 50 ఎం.ఎల్. నీళ్లు చాలు. దాంతో ఇలా చిన్న పాటి గుంటలూ, కొబ్బరి చిప్పలూ, చెడిపోయిన టైర్లు, వాడి ఆపేసిన కూలర్లు వంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. వాటిని నిర్మూలించడానికి మనం ఎన్ని దార్లు వాడుతుంటామో, వాటి పట్ల తమ నిరోధకతను పెంపొందించుకోడానికీ అవి అన్ని దార్లూ వెతుకుతుంటాయి. ఇలా తమ మనుగడను సాగిస్తుంటాయి. ఇలా అవి బలపడటానికి పరోక్షంగా మనమూ దోహదపడుతున్నామన్నమాట. అయితే ఒక్క మాట... పారే నీరు ఉన్న చోట అవి గుడ్లు పెట్టలేవు. అందుకే వాటిని నివారించాలంటే వారంలో ఏదో ఒక రోజు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు, మురుగుకాల్వల వంటి చోట్ల నీరు పారేలా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచి మార్గం. నివారణ మార్గాలివి... ⇔ దోమల నివారణే వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, చికన్‌గున్యా, మలేరియా వంటి వ్యాధుల నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే ఆ వ్యాధుల నుంచి మనల్ని మనం అంత సమర్థంగా కాపాడుకోవచ్చు. ⇔ మనం ఉండే ఇంటిలో, గదిలో దోమలు రాకుండా చూసుకోడానికి అవసరమైన రిపెల్లెంట్లు, దోమతెరలు వాడాలి. ⇔దోమలు కుట్టకుండా పొడువు చేతుల చొక్కాలు ధరించడం, ఒంటినిండా బట్టలు ఉండినా, ఒంటినంతా అవి కప్పి ఉంచేలా చూసుకోవడం అవసరం. ⇔ దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం. ⇔ దోమలు మురికిగా ఉండే దుస్తులకు వెంటనే ఆకర్షితమవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. ఇక కొంతవరకు లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ⇔ అలాగే ఘాటైన వాసనలున్న పెర్ఫ్యూమ్స్కీ దూరంగా ఉండాలి. ⇔ దోమలను తరిమివేసే మస్కిటో కాయిల్స్ ఉపయోగించవచ్చు. అయితే ఆరోగ్యానికి వాటి వాసన సరిపడని వాళ్లు, పిల్లలు, వృద్ధులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట దోమ తెరల్ని వాడాలి. వేపాకులతో పొగవేయడం వంటి సంప్రదాయ మార్గాలను కూడా చేపట్టవచ్చు. ⇔ ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల సరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం మంచిది. దీనితో పాటు కాల్వల్లో నీరు ఒకేచోట చేరి ఉండకుండా నిత్యం పారేలా వాటిని శుభ్రం చేసుకోవడం అవసరం. -
మన్యంపై మలేరియా పడగ
మన్యగ్రామాల్లో పెరుగుతున్న జ్వరాల కేసులు తాజాగా రెండేళ్ల పసివాడిని కబళించిన మహమ్మారి ఇప్పటికీ పూర్తి కాని నివారణ మందు పిచికారీ నియంత్రణలో అలసత్వం వహిస్తున్న అధికారులు రంపచోడవరం : మన్యప్రాంతంలో మలేరియా మహమ్మారి విస్తరిస్తోంది. సీజనల్ వ్యాధులను నియంత్రించలేని వైద్యాధికారుల వైఫల్యానికి గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. దేవీపట్నం మండలం చింతలగూడెంకు చెందిన పొడియం బన్నీ అనే రెండేళ్ల పసివాడు మలేరియా బారిన పడి మృతి చెందాడు. తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితికి చేరిన బన్నీని బుధవారం దేవీపట్నం నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే మృతి చెందాడు. ఇటీవల మలేరియా తీవ్రతకు పలువురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ మరణాలు మలేరియా అధికారుల రికార్డుల్లో నమోదు కావడం లేదు. 27 రోజులు ఆలస్యంగా పిచికారీ ఏజెన్సీలోని 11 మండలాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది మలేరియా జ్వరాల సంఖ్య ఎక్కువైంది. దీనికి అధికారుల అలసత్వమే ప్రధాన కారణం. గ్రామాల్లో రెండు విడతల్లో జరగాల్సిన మలేరియా మందు పిచికారీని సుమారు 27 రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం జిల్లా మలేరియా కార్యాలయానికి నిధుల కొరతతో మలేరియా మందు పిచికారీ సకాలంలో చేపట్టలేకపోయారు. ఫలితంగా ఆ ఏడాది 20 మంది వరకు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే ఒకటిన ప్రారంభించాల్సిన పిచికారీని మే 27న ప్రారంభించారు. నలభై ఐదు రోజులకు ఒకసారి చొప్పున మలేరియా మందును రెండుసార్లు పిచికారీ చేయాలి. మెుత్తం 935 గ్రామాలకు ఇప్పటికి 480 గ్రామాల్లో మాత్రమే పిచికారీ పూర్తి చేశారు. ఏజెన్సీకి 3.60 లక్షల దోమతెరలు కావాలని ప్రతిపాదనలు పెడితే నేటికీ రంపచోడవరం డీఎంఓ కార్యాలయానికి చేరుకోలేదు. దోమ తెరలు ఇవ్వడంతో పాటు వాటి వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తేనే ఫలితాలు సాధించవచ్చు. నమోదైన వాటి కంటే ఎక్కువ కేసులు.. గత ఏడాది కంటే మలేరియా కేసులు గణనీయంగా పెరిగాయి. ఏజెన్సీ 11 మండలాల్లో 26 పీహెచ్‌సీలు ఉన్నాయి. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 1,85,306 మంది నుంచి రక్త నమునాలు సేకరించి, వారిలో 3,616 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 2,06,392 మంది రక్త నమునాలు సేకరించి, వారిలో 4,496 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. మారేడుమిల్లి పీహెచ్సీ పరిధిలో గత ఏడాది 231 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది 335 కేసులు నమోదయ్యాయి. తులసిపాకలలో 508 కేసులు నమోదు కాగా ఇక్కడ గత ఏడాది కంటే వంద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మంగంపాడు పీహెచ్సీలో 440 కేసులు నమోదు చేశారు. ఇక్కడ కూడా గతం కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. చవిటిదిబ్బల పీహెచ్సీలో గత ఏడాది 277 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 439 కేసులు నమోదు చేశారు. గిరిజనుల్లో అత్యధికులు జ్వరం వస్తే ఆర్ఎంపీల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు. అంటే మలేరియా అధికారుల లెక్కల కంటే ఏజెన్సీలో మలేరియా కేసులు సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. సిబ్బంది కొరతతో వెల్లడి కాని వ్యాధి తీవ్రత వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన సిబ్బంది తగినంతమంది లేరు. ఎంపీహెచ్‌ఎస్‌లు 64 మంది పనిచేయాల్సి ఉండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విధి నిర్వహణలో గ్రామాల్లో పర్యటించి జ్వరాల కేసులు ఉంటే వారి రక్తనమూనాలు తీసుకుని మలేరియా నిర్ధారణ అయిన తరువాత మందులు ఇవ్వాలి. అలాగే రోగికి జ్వరం తగ్గిందా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ సిబ్బంది కొరత కారణంగా గ్రామస్థాయిలో రోగాల తీవ్రత బయటకు తెలియడం లేదు. కాగా మలేరియా వ్యాప్తిపై జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎస్ ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండో విడత మలేరియా మందు పిచికారీ జరుగుతోందన్నారు. -
ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు చర్యలు
వైద్యులు, సూపర్వైజర్ల నియామకం డీఎంఅండ్ హెచ్‌వో చంద్రయ్య చింతూరు: ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు డీఎం అండ్ హెచ్‌వో కె.చంద్రయ్య తెలిపా రు. గురువారం ఆయన చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇటీవలే 10 మంది వైద్యులను నియమించినట్లు తెలిపారు. విలీన మండలాల్లోని తొమ్మిది పీహెచ్‌సీలకూ ఇద్దరు చొప్పున సూపర్వైజర్లను మైదాన ప్రాం తం నుంచి డిప్యుటేషన్‌పై నియమించామన్నారు. వారు క్షేత్రస్థాయిలో మలేరియా కేసులను స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పా రు. వీరికితోడు దోమల నివారణ, యాంటీ లార్వా చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సబ్యూనిట్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చూస్తున్నామని, ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇటీవల హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయన్నారు. విద్యార్థులకు జ్వరం వస్తే ఇళ్ళకు పంపివేయకుండా ఆసుపత్రులకు పంపి పరీక్షలు నిర్వహించాలని హాస్టళ్ల సిబ్బందికి సూచించారు. హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను వార్డెన్, ఏఎన్ఎంలకు అప్పగించినట్లు తెలిపారు. జ్వరాల నియంత్రణకు ఏజెన్సీలో 104 వెళ్లలేని గ్రామాల్లో 650 వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, లక్ష్మీపురం పీహెచ్‌సీల సిబ్బందితో సమావేశం నిర్వహించి మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అడిషనల్ డీఅండ్‌హెచ్‌వో పవన్‌కుమార్, డీఎంవో ప్రసాద్, ఎస్పీహెచ్వో సుబ్బమ్మ పాల్గొన్నారు. -
మలేరియాను అరికట్టాలి
సబ్ యూనిట్ అధికారులకు డీఎంహెచ్ఓ సూచన ఎంజీఎం/హసన్‌పర్తి : సబ్ యూనిట్ అధికారులు పీహెచ్‌సీల్లోని సిబ్బంది కి, ప్రజలకు మధ్య సమన్వయకర్తలుగా పనిచేసి మలేరియా అరికట్టాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. హసన్‌పర్తి పీహెచ్సీ ఆవరణలోని క్లస్టర్ సమావేశ మందిరంలో జోనల్ (వరంగల్, కరీంనగర్) మలేరియా వర్క్‌షాప్ మంగళవారం జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంహెచ్ఓ మాట్లాడారు. ఏటా 1.5 మిలియన్ల ప్రజలు మలేరియా బారిన పడుతున్నారని తెలిపారు. సబ్ యూనిట్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్న సమయంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమలతో ప్రాణాంతక మెదడువాపు, డెంగీ, మలేరియా, చికున్ గున్యా, బోధకాలు వ్యాపిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మలేరియా అధికారి జయశ్రీ, జిల్లా మలేరియా అధికారి పైడిరాజు, జిల్లా హెల్త్ ఎడ్యూకేటర్ అన్వర్, సమన్వయర్తగా వ్యవహరించిన పరంజ్యోతి, పళినాకుమారి, విప్లవ్‌కుమార్ పాల్గొన్నారు. -
సిటీకి ఫీవర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో డెంగీ, మలేరియా, కలరా, స్వైన్‌ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు మురుగు కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్ల మధ్య నీరు నిల్వ ఉండటంతో దోమలు, ఈగలు వ్యాపించి బస్తీ వాసుల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రులతో పాటు బస్తీల్లోని క్లినిక్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 98 డెంగీ, 80 పైగా మలేరియా, 40 కలరా, నాలుగు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే రెండో వారం నుంచే వర్షాలు ప్రారంభం కావడంతో మూసీ పరీవాహక ప్రదేశాలే కాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బేగంపేట్ వంటి ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరంతో చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే రోగులను కూడా మలేరియా, డెంగీ జ్వరాలను బూచిగా చూపుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోయాయని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేస్తుండటం విశేషం. రికార్డులకెక్కని కార్పొరేట్ వైద్యం ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదైనవి తప్పితే కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లోని డెంగీ, మలేరియా కేసుల వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చేరడం లేదు. ప్రభుత్వం ఐజీఎం ఎలీసా టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ ఎన్ఎస్–1 టెస్టు చేస్తున్నాయి. వీటిలో పాజిటివ్ వచ్చిన వాటిని డెంగీ జ్వరంగా నిర్ధారిస్తున్నారు. నిజానికి రోగి నుంచి రెండో శాంపిల్ సేకరించి నిర్ధారణకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపాలి. ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఐపీఎంకు రెండో శాంపిల్‌ను పంపడం లేదు. సీజన ల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఎపిడమిక్ సెల్‌కు తెలియజేయాలి. కానీ ఏ ఒక్కరూ ఇవ్వడం లేదు. ఇదే అంశంపై ఆస్పత్రికి నోటీసులు జారీ చేసినా, వైద్యాధికారులు తనిఖీలు చేసినా వెంటనే ప్రభుత్వంలోని పెద్దల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో నమోదైన సీజనల్ వ్యాధులు ఇలా.. వ్యాధి 2011 2012 2013 2014 2015 2016 మలేరియా 352 528 189 125 84 80 డెంగీ 177 452 52 19 140 98 స్వైన్‌ఫ్లూ 11 320 67 31 1082 4 -
మలేరియా నివారణకు మంచి చిట్కా
స్టాక్‌హోమ్: మనం కోళ్ల ఫారాలకు వెళ్లినప్పుడు లేదా కోళ్ల గంప వద్ద కూర్చున్నప్పుడు వచ్చే ఒక విధమైన వాసనను తట్టుకోలేక అబ్బా కోళ్ల కంపు! అని ముక్కు మూసుకుంటాం. నొసలు చిట్లిస్తాం. అలవాటు పడకపోయినా మనం అంతో ఇంతో ఆ వాసనను భరించగలం. అదే మలేరియా నుంచి ఇటీవల బయటపడిన ప్రాణాంతక జికా వైరస్ వరకు వ్యాధులను సంక్రమింప చేస్తున్న దోమలైతే కోళ్ల కంపును అసలు తట్టుకోలేవని, కోళ్ల కంపుకు ఆమడ దూరం పారిపోతాయని ఓ తాజా పరిశోధనలో తేలింది. స్వీడన్‌లోని అగ్రికల్చర్ సైన్స్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న అనాఫెలెస్ అరేబియెన్సిస్ జాతి దోమలు మానవులకే కాకుండా ఇతర జంతువులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై పరిశోధనలు చేయాలనుకున్నారు. అందులో భాగంగా మలేరియా వ్యాధి ఎక్కవగా ఉన్న సబ్ సహారా ఆఫ్రికాలో మలేరియాకు కారణమవుతున్న జాతి దోమల రక్తాన్ని పరిశీలించారు. ఆశ్చర్యంగా వాటిలో కోళ్ల రక్తం మినహా మిగతా ఫారమ్ జంతువుల రక్తాల నమూనాలు దొరికాయి. ఎందుకు దోమలు కోళ్లను కుట్టడం లేదు? ఎందుకు వాటి రక్తాన్ని పీల్చుకోవడం లేదు? కోళ్ల పక్కన పడుకునే మనుషులపై అవి దాడి చేస్తాయా, లేవా? అన్న దిశగా మరిన్ని పరిశోధనలు చేయాలనుకున్నారు. ఈ ప్రయోగానికి స్వచ్ఛందంగా సంసిద్ధత వ్యక్తం చేసిన మనుషులను ఎంపిక చేసి వారిని దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కోళ్లతో సహా గొర్రెలు, మేకలు లాంటి ఫారమ్ జంతువుల పక్కన పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి 1,172 దోమలను సేకరించి వాటిలోని రక్తం నమూనాలను పరిశీలించారు. వాటిల్లో దాదాపు అన్ని దోమల్లో బాధిత మనుషులు, జంతువుల రక్తం నమూనాలు దొరికాయి. ఒకే ఒక్క దోమలో మాత్రమే కోడి రక్తం దొరికింది. అలాగే కోళ్లు, ఇతర జంతువుల పక్కన పడుకున్న వారి నుంచి కూడా రక్తం నమూనాలను సేకరించి దోమల కుట్టిన ఆనవాళ్లను తెలుసుకున్నారు. కోళ్ల పక్కన పడుకున్న వారిలో 85 శాతం మందికి దోమలు అసలు కుట్టలేదని, మిగతా జంతువుల పక్కన పడుకున్న వారికి కూటికి నూరు శాతం దోమలు కుట్టాయని తెల్సింది. ఈ ప్రయోగం ద్వారా దోమలు కోళ్లనే కాకుండా, కోళ్ల పక్కన పడుకున్న వారిని కూడా కుట్టడం లేదని తేలింది. దోమలకు కోళ్ల రక్తం నచ్చకపోతే, కోళ్ల పక్కన పడుకున్న వారిని ఎలా వదిలేశాయన్న ప్రశ్న పుట్టుకొచ్చింది. దీంతో కోళ్ల రక్తం కాకుండా కోళ్ల కంపుకు, దోమలు కుట్టకపోవడానికి ఏదో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గ్రహించారు. వెంటనే మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ సారి కోళ్లను, జంతువులను కాకుండా వాటి వాసన వచ్చేలా వాటి ఈకలను, చర్మాన్ని సేకరించి, వాటికి సమీపంలో వాలంటీర్లను పడుకోబెట్టారు. ఆశ్చర్యంగా ఈసారి కోళ్ల వాసన పక్కన పడుకున్న మనుషుల్లో 95 శాతం మందికి మలేరియా వ్యాధికి కారణం అవుతున్న దోమలు కుట్టలేదు. అంటే కోళ్ల కంపు మస్కిటో రిపెల్లెంట్స్ గా పనిచేస్తున్నట్లు స్పష్టమైంది. ప్రస్తుతం తాము అనాఫెలెస్ అరేబియెన్సిస్జాతి దోమలపైనే పరిశోధనలు జరిపామని, పలు వైరస్ రోగాలకు కారణమవుతున్న అన్ని దోమల జాతులపై తదుపరి ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని మలేరియా జర్నల్ లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులో కోళ్ల కంపునే ఆల్ అవుట్ గుడ్‌నైట్ లాంటి మస్కిటో రిపెల్లెంట్స్లో మందుగా మన ముందుకు వస్తుందని ముందుగానే ఊహించవచ్చు. అప్పటి వరకు నిరీక్షించలేని వాళ్లు కోళ్ల పక్కన పడుకుంటే సరిపోతుందేమో! -
వ్యాపిస్తున్న జ్వరాలు..వణుకుతున్న జనాలు
♦ జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన జ్వరం కేసులు 619 ♦ వీటిలో మలేరియా 441, డెంగీ 15, టైఫాయిడ్ 163 ఖమ్మం వైద్య విభాగం : జిల్లావాసులను సీజనల్ వ్యాధులైన జ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాలు, వరదలతో ఏజెన్సీలో ఇప్పటికే అనేకమంది మంచాన పడ్డారు. జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,93,187 మంది నుంచి రక్త నమూనాలను ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. 441 మందికి మలేరియా, 15 మందికి డెంగీ, 163 మందికి (జూన్‌లో 93, జూలైలో 70) టైఫాయిడ్ సోకినట్టుగా గుర్తించారు. ప్రయివేటు ఆసుపత్రులు, ఆర్ఎంపీ వైద్యుల వద్దకు వెళ్లిన కేసులు ఇంకా ఎన్ని ఉంటాయో..?! కానరాని దోమ తెరలు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో 2012లో 2.60 లక్షల దోమ తెరలను వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దోమ తెరలు పంపిణీ చేయలేదు. ఈ ఏడాది 1.40 లక్షల దోమతెరలు కావాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటివరకూ స్పందన లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ‘‘దోమ తెరలను వెంటనే అందేలా చూస్తా’’నని ఇచ్చిన హామీ గాల్లో కలిసింది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటింది. వర్షాలు, గోదావరి వరదలతో ప్రధానంగా ఏజెన్సీ (పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని) గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు ఎక్కువయ్యాయి. అందుకే, ఆయా గ్రామాల్లో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. వ్యాధుల నివారణకు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆరోగ్య శాఖ సమన్వయంగా కృషి చేస్తే ఫలితం కనిపించేంది. కానీ, ఈ మూడు శాఖల మధ్య సమన్వయ లోపం కూడా వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇల్లెందు: జిల్లాలో జ్వరాల వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మలేరియా అధికారి(డీఎంఓ) డాక్టర్ రాంబాబు చెప్పారు. ఇల్లెందు మండలంలోని డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాలైన కాకతీయనగర్, రొంపేడును ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం, ఇల్లెందులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి నెల 7 నుంచి 17వ తేదీ వరకు గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1266 గ్రామాల్లో సుమారు 5.22 లక్షల మందిని సర్వే చేశామన్నారు. 658 గ్రామాలను డెంగీ ప్రభావిత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్టు చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లో ఇప్పటికే 166 వైద్య శిబిరాలు నిర్వహించినట్టు, 464 గ్రామాల్లో ఇండోర్ రెసిడ్యూల్ స్ప్రే పూర్తిచేసినట్టు చెప్పారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఏ జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గుతాయని, అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం వచ్చిన వెంటనే ప్యారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుని, ఒంటిని తడి గుడ్డతో పూర్తిగా తుడిస్తే జ్వరం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అంతకీ తగ్గనప్పుడు దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలన్నారు. ఇల్లెందు పట్టణంలోని కాకతీయనగర్, మండలంలోని రొంపేడులో; గుండాల మండలంలోని గుండాల, ఆళ్లపల్లిలో డెంగీ లక్షణాలు ఉన్నాయన్నారు. నర్సాపూర్, మంగపేట, ఎదిర, అశ్వాపురం తదితర ప్రాంతాల్లో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. మురుగు నీటిలో జీవించే దోమలు కుట్టితే పైలేరియా వ్యాధి సోకుతుందన్నారు. జిల్లాలో ఇటువంటివి 2360 కేసులు ఉన్నాయన్నారు. వీరికి ఆసరా పింఛన్ కోసం ప్రతిపాదించామన్నారు. ఇలా వస్తాయి... ఇవీ లక్షణాలు మలేరియా: ‘ఎనాఫలిస్’ అనే ఆడ దోమ కాటుతో వస్తుంది. ఇది మనిషి నుంచి రక్తంతోపాటు కొన్ని సూక్ష్మ జీవులను పీల్చుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు దోమ ఉదరంలో 10 నుంచి 14 రోజుల్లో పెరుగుతాయి. ఆ తరువాత, ఈ దోమ ఎవరినైనా కుట్టినప్పుడు.. దానిలోని సూక్ష్మజీవులు (ఆ వ్యక్తి) శరీరంలోకి ప్రవేశించి, మలేరియా జ్వరం వస్తుంది. ఇది ముందుగా చలి, వణుకుతో మొదలవుతుంది. తల, ఒళ్లు నొప్పులు వస్తాయి. ఆ తరువాత తీవ్రమైన జ్వరం వస్తుంది. జ్వరం తీవ్రత తగ్గినప్పుడు విపరీతంగా చెమటలు పోస్తాయి. ఈ జ్వరం ప్రతి రోజుగానీ, రోజు విడిచి రోజుగానీ, నాలుగు రోజులకు ఒకసారిగానీ వస్తుంది. జ్వరం వచ్చిన వెంటనే మలేరియా పరీక్ష చేయించుకుంటే మంచిది. డెంగీ: ‘ఆర్ధ్రెటిస్’ జాతికి చెందిన సూక్ష్మజీవితో వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందటానికి ‘ఏడిస్’ అనే ఈజిప్ట్ దోమలు ముఖ్య కారణం. ఇవి డెంగీ, చికున్‌గున్యా వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఈ దోమలు పగటి పూట మాత్రమే కుడతాయి. వీటిని ‘టైగర్ దోమలు’ అని కూడా అంటారు. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తల నొప్పి, కళ్ళు తెరవడం కూడా కష్టమవడం, కదిపితే నొప్పి రావడం, చర్మంపై దద్దుర్లు, కండరాలు.. కీళ్ళ నొప్పులు, అధిక దాహం, రక్తపోటు (బీపీ) పడిపోవటం.. ఈ లక్షణాలు ఉన్నట్టయితే డెంగీగానీ, చికున్గున్యాగానీ వచ్చినట్టుగా భావించి చికిత్స చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ♦ నివాస పరిసరాల్లో రోజులతరబడి నీరు నిల్వ ఉండకుండా (పడేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, కుండలు, వాటర్ బాటిళ్లు, సిమెంట్ డ్రమ్ములు, వాడని రోళ్ళు, ఖాళీ డబ్బాలు, మురుగు కాల్వలు.. గుంతల్లో) చూసుకోవాలి. ♦ నీరు నిల్వ ఉండే కుండలు, డ్రమ్ములు, ట్యాంకులు, కూలర్లు తదితరాలను కనీసంగా వారినికి ఒక్కసారైనా శుభ్రపరిచి ఆరబెట్టి, ఆ తరువాత వాడుకోవాలి. ♦ నీరు నిల్వ ఉంచే పాత్రలు, నీటి తొట్టెలు, డ్రమ్ములు, ట్యాంకులపై సరైన రీతిలో మూతలు ఉంచాలి. ♦ దోమ తెరలు, కిటికీలకు మెష్‌లు అమర్చుకోవాలి. నిండు దుస్తులు ధరించాలి. ♦ కాయిల్స్, లిక్విడ్స్ ఓడోమాన్ వంటివి వాడాలి. ఇంట్లో వేపాకు పొగ కూడా వేసుకోవచ్చు. ♦ దోమలు కుట్టకుండా వీలైనంత వరకు పగటిపూట పొడుగు చేతుల చొక్కా, పైజామా, ప్యాంట్, పంచె, కాళ్ళకు మేజోళ్లు వేసుకోవాలి. ♦ తీవ్ర జ్వరం ఉన్నప్పుడు పారాసిటమల్ మాత్రలు వాడాలి. ఇతర వివరాలకు దగ్గరలోని ఏరియా ఆస్పత్రి... ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగాని, ఆరోగ్య కార్యకర్తనుగానీ సంప్రదించాలి. -
రాష్ట్రానికి విషజ్వరం!
విజృంభిస్తున్న మలేరియా, డెంగీ, కలరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. సాధారణ జ్వరాలతోపాటు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా పంజా విసురుతున్నాయి. వర్షాలు కురుస్తుండడం, పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరికొండలో సిద్ధార్థ అనే విద్యార్థి మెదడు వ్యాపు వ్యాధి సోకి చనిపోయాడు. చాలా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విష జ్వరాలు, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. కొందరు కలరా బాధితులు ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది జ్వరాల కేసులు నమోదయ్యాయని, వందలాది మంది మలేరియా, డెంగీ, చికున్‌గున్యాలతో బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఏజెన్సీలో జూన్ 1 నుంచి16వ తేదీ వరకు 7 వేల మంది జ్వరాల బారిన పడ్డారని అక్కడి అధికారులు తేల్చారు. అందులో 18 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారించారు. ఈ సంఖ్య రెండింతలకు పైగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. దోమ తెరల పంపిణీపై నిర్లక్ష్యం మలేరియా అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఏటా దోమ తెరలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ చివరగా 2012లో దోమ తెరలను పంపిణీ చేశారు. తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేయకపోవడంతో దోమల వల్ల వచ్చే వ్యాధులు రెండింతలకుపైగా నమోదైనట్లు అంచనా. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లే దోమ తెరలను పంపిణీ చేయలేకపోయామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మలేరియా అత్యధికంగా ఉండే ప్రాంతాలకు 3 లక్షల వరకు దోమ తెరలు సరఫరా చేయాల్సి ఉంది. డెంగీ వస్తే అంతే సంగతులు రాష్ట్రంలో సుమారు 2 వేల మలేరియా పీడిత గ్రామాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. జ్వరాలతో వచ్చే బాధితులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తున్నాయి. డెంగ్యూ సోకితే సాధారణ వైద్యంతో నయం చేసే అవకాశమున్నా ప్లేట్లె ట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. ప్లేట్లెట్లు 10 వేలలోపును తగ్గితేనే ఎక్కించాలి. కానీ 20 వేల నుంచి 50 వేల వరకు ఉన్నవారికి కూడా ప్లేట్లెట్లు ఎక్కిస్తూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు. నగరంలో రెండు నెలల్లో 10 కలరా కేసులు నమోదయ్యాయని అంటువ్యాధుల విభాగం అధికారిణి సుబ్బలక్ష్మి తెలిపారు. -
కొత్త మలేరియా వ్యాక్సిన్ కనిపెట్టారు..
మెల్బోర్న్ః మలేరియా నివారణకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ ను కనిపెట్టారు. ఎర్ర రక్తకణాలను హరించి మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కొనేందుకు నూతన యాంటీ మలేరియా చికిత్సను అభివృద్ధి చేశారు. వాల్తేర్ అండ్ ఎలీజా హాల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ అలాన్ కౌమాన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో, ఎర్ర రక్తకణాల్లోకి కీ ప్రొటీన్లు పంపించడం ద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములు లోపలికి చొచ్చుకొని వెళ్ళలేవని తెలుసుకున్నారు. దోమకాటుద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 30 కోట్ల నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మలేరియా సోకినవారిలో ప్రతియేటా 4.5 లక్షలమంది దాకా చనిపోతున్నారు. అంతేకాక చిన్నపిల్లల్లో పెరుగుదలను కూడ దెబ్బతీసే ఈ వ్యాధి... గర్భిణీలకు మరింత ప్రమాదకరం. అటువంటి వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చని అధ్యయనకారులు చెప్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మలేరియా నివారణకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను అందించడమే కాక, పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రతపై కూడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా 5 ఏళ్ళలోపు వయసున్న పిల్లలపై మలేరియా ప్రభావం అధికంగా ఉంటోందని, దోమల్లో గ్రహణ శక్తి పెరగటంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న యాంటీ మలేరియల్ మందులు ప్రభావం తగ్గుతోందని, అందుకే కొత్త పరిశోధనలద్వారా మలేరియా క్రిములను ఎదుర్కొనే మందులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. కౌమాన్ బృందం తాజాగా ఆర్ హెచ్ 5, ఆర్ ఐపీఆర్, సీవై పీఆర్ ఏ మొదలైన మూడు ప్రొటీన్లను కలిపి, ఆరోగ్యంగా ఉన్న మానవ రక్త కణాల్లోకి పంపించడంద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కోవచ్చునని కనుగొన్నారు. ఇలా చేయడంవల్ల మలేరియా క్రిములు ఎర్ర రక్తకణాలను హరించలేకపోయాయని తమ పరిశోధనలద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రొటీన్లతో టీకాలు వంటివి అభివృద్ధి చేసి, వ్యాక్సిన్లుగా ఇవ్వొచ్చని కౌమాన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మలేరియాకు కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి పరిచే పరిశోధనలకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక వ్యాక్సిన్లకు మలేరియా క్రిములు అలవాటు పడిపోయాయని, ఈ పరిస్థితుత్లో కొత్త చికిత్సల అవసరం ఎంతైనా ఉందన్నారు. సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ జర్నల్ లో కౌమాన్ బృందం.. తమ తాజా పరిశోధనలను నివేదించారు.