
డెంగీ మరణమృదంగం
♦దేశంలో రికార్డు స్థారుులో బోనకల్‌లో 305 పాజిటివ్ కేసులు
♦ఇప్పటి వరకు 18 మంది మృత్యువాత
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం దేశ వైద్య, ఆరోగ్యశాఖ రికార్డుల్లోకెక్కింది. మూడు నెలల్లో డెంగీ, మలేరియా, టైఫారుుడ్, ఇతర విషజ్వరాలతో మండలంలో సగటున ఒక్కో నెలలో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యారుు. డెంగీ పాజిటివ్ కేసులు 305 నమోదు కావడంతో దేశంలోనే అత్యధికంగా ఈ కేసులు బోనకల్ మండలంలో నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. మూడు నెల లుగా ఈ మండలంలోని ఏ పల్లె చూసినా వందల సంఖ్యలో కుటుంబాలు మంచం పట్టారుు. ఇప్పటికే 18 మంది డెంగీతోనే మృతి చెందారు. ఈ మండలం లోని 15 గ్రామాల్లో డెంగీ పంజాతో వందలాది కుటుంబాలు విషజ్వరాలతో విలవిలలాడుతున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో 5,143, సెప్టెంబర్‌లో 6,138, ఈ నెలలో ఇప్పటి వరకు 6,735 మందికి విషజ్వరాలు సోకారుు. ఇందులో బోనకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స చేరుుంచుకున్నవారిలో 305 మందికి డెంగీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వందలాది మంది ఖమ్మం, కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేరుుంచుకుంటున్నారు. పీహెచ్‌సీలో చికిత్స పొందినవారిలో ఎవరూ మృతి చెందలేదని వైద్యాధికారులు పేర్కొంటుండగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికి త్స చేరుుంచుకున్నవారిలో 18 మంది చనిపోయారు.
మూడు నెలలుగా పీహెచ్‌సీ కిటకిట..
బోనకల్ పీహెచ్‌సీది ఆరు పడకల స్థారుు. విషజ్వరాలతో జనం పీహెచ్‌సీ బాట పట్టడంతో తాత్కాలికంగా 60 మంచాలు ఏర్పాటు చేశారు. ఆరు బయట కూడా వైద్యం అందిస్తున్నారు. రోజుకు 50 లోపే ఉండే ఓపీ ఈ పీహెచ్‌సీలో వరుసగా ఈ మూడు నెలలు 200 పైగానే ఉంటోంది. గతంలోనే ఒక్కరే డాక్టర్ ఉండగా.. అదనంగా ముగ్గురు డాక్టర్లను నియమించారు. వీరే కాకుండా ఒక్కో బృందానికి ఇద్దరు డాక్టర్ల చొప్పున ఐదు బృందాలకు మొత్తంగా 10 మంది డాక్టర్లను నియమించి.. మండలంలో 150 మెడికల్ క్యాంపులు నిర్వహించారు.
బోనకల్, ఆళ్లపాడులో అత్యధికం
బోనకల్‌లో 77, ఆళ్లపాడులో 71 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు చేశారు. మొత్తం మండలంలో 18 మంది ఈ మూడు నెలల్లో డెంగీతో మృతి చెందారు. ఇందులో రావినూతలలో 5, ఆళ్లపాడు లో 1, చిరునోములలో 2, బోనకల్‌లో 3, ముష్టికుంట్లలో 1, బ్రహ్మణపల్లి 1, గోవిందాపురం ఎల్‌లో 2, రామాపురంలో 2, గార్లపాడులో ఒకరు మృతి చెందారు.