లండన్: 'ఒ' బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాత అంటారు. వీరు ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటం వీరికంటే ఇతరులకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా వీరి గ్రూపు రక్తం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ గ్రూపుతో వీరికి కూడా లాభం ఉందని లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మలేరియా వ్యాధి రాకుండా ఈ బ్లడ్ గ్రూపు రక్షిస్తుందని వీరి పరిశోధనలో వెల్లడైంది. దీని కోసం ఈ గ్రూపు వారిలో జరిగే చర్యల క్రమాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇందులో భాగంగా మానవులు, జంతువులకు సంబంధించిన అనేక రకాల కణాలపై అధ్యయనం చేశారు. ఇందులో రిఫిన్ అనే ప్రొటీన్‌కు సంబంధించిన అనేక అంశాలను కనుగొన్నారు. మలేరియా వ్యాధికి కారణమైన ‘ప్లాస్మోడియం ఫాల్సిపారమ్’ పరాన్న జీవి ఈ రిఫిన్ అనే ప్రొటీన్‌ను విడుదల చేస్తుందని, ఇది రక్త ప్రవాహంపై జిగురులా పట్టి ఉంటుందని అన్నారు. ఇదే మలేరియా వ్యాధికి అసలు కారణమని తెలిపారు. అయితే 'ఒ' గ్రూపు వ్యక్తుల రక్తం ఉపరితలంపై మాత్రం ఇది అంత బలంగా అంటుకుని ఉండలేదని వివరించారు.
ఈ కారణంతోనే ఈ గ్రూపు వ్యక్తులకు మలేరియా వ్యాధి సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఈ రిఫిన్ ప్రొటీన్ కేవలం మానవుల్లోనే కాకుండా జంతువుల్లోను ఉంటుందని చెప్పారు. అయితే 'ఎ' బ్లడ్ గ్రూపు వ్యక్తులు ఎక్కువగా మలేరియా బారిన పడుతున్నట్టు తమ పరిశోధనలో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏటా ప్రపంచంలో 200 మిలియన్ల మంది ఈ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒ' అయితే 'నో' మలేరియా..
Published Wed, Mar 11 2015 2:18 PM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM
Advertisement