Blood
-
గర్భధారణ సమయంలో ఎటాక్ చేసే వ్యాధి..! హాలీవుడ్ నటి సైతం..
హాలీవుడ్ నటి, మోడల్ గాల్గాడోట్ వైవిధ్య భరితమైన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి గాల్గాడోట్ ఇజ్రాయెల్‌కి చెందిన నటి, మోడల్‌గా, నాట్యకారిణిగా కెరీర్ సాగిస్తుండగానే అనూహ్యంగా హాలీవుడ్లో నటించే అవకాశం వచ్చింది. అక్కడ నుంచి ఆమె వెనుదిరిగి చూడలేనంతగా సక్సెస్‌ని అందుకుంది. కెరీర్ మంచి పీక్‌లో ఉండగానే 2008లో ఇజ్రాయెలీ రియల్ ఎస్టేట్ డెవలపర్ జారోన్ యారోన్ వర్సనోను వివాహం చేసుకుంది.ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కూడా. అయితే నాల్గోసారి గర్భందాల్చడం గాల్‌కి ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. మహిళలంతా తప్పక ఈవ్యాధిపై అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం అంటూ ఆరోగ్య స్ప్రుహని కలిగిస్తోంది. ఇంతకీ గాల్ నాల్గోసారి గర్భందాల్చినప్పుడూ ఏ వ్యాధిని ఎదుర్కొంది? ఎందువల్ల వస్తుంది..? తదితరాa గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!.గాల్గాడోట్కి నాల్గో గర్భధారణలో అది పెద్ద ఆరోగ్య సవాలుని ఎదుర్కొంది. సరిగ్గా ఎనిమిదోనెలలో ఉండగా సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ (CVT) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చుస్తుండగానే ఆమె పరిస్థితి విషమించడం మొదలైంది. దీంతో వైద్యులు ఆమెకు గర్భంతో ఉండగానే బ్రెయిన్‌కి సర్జరీ చేశారు. ఆ క్లిష్ట సమయంలోనే ఓరి అనే బిడ్డకు జన్మనిచ్చింది గాల్. అంతటి పరిస్థితిలోనూ సడలని నమ్మకంతో ఆ సమస్య నుంచి నెమ్మదిగా బయటపడటం మొదలు పెట్టింది. ఈ విషయాన్నే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. అందరికీ ఈ వ్యాధిపై కచ్చితంగా అవగాహన ఉండాలని చెబుతోంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు దీనిపై అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమని తెలిపింది. సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటే..సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అనేది స్ట్రోక్ సంబంధిత అరుదైన రూపమని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా విపరీతమైన తలనొప్పి, మూర్చ వంటివి వస్తాయని అన్నారు. మెదడు సిరల సైనస్లలో రక్తం గడ్డకట్టడం లేదా సరైన రక్తప్రసరణ లేకుండా నిరోధించడం వల్లన ఈ పరిస్థితి ఏర్పడుతుందట. దీంతో బ్రెయిన్లో ఒక విధమైన ఒత్తిడి పెరిగి తత్ఫలితంగా తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్యలు లేదా ఫిట్స్ వంటి సమస్యలు వస్తాయని అన్నారు వైద్యులు. లక్షణాలు..తీవ్రమైన నిరంతర తలనొప్పిదృష్టి సమస్యలుమూర్చవికారం లేదా వాంతులుమాట్లాడటంలో ఇబ్బంది, నరాల సంబంధిత సమస్యలుకారకాలు..గర్భం దాల్చినప్పుడు, ముఖ్యంగా ప్రసవానంతర కాలంలోనూ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందది. డీ హైడ్రేషన్మెనింజైటిస్ వంటి అంటువ్యాధులు కారణంగానివారణ:దీన్ని సకాలంలో గుర్తిస్తేనే నివారించగలం. ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్లతో ఈ సమస్యను గుర్తిస్తారు వైద్యలు. మెదుడులోని గడ్డకట్టిన ప్రాంతాన్ని కరిగించేలా మందులు ఇవ్వడం లేదా సమస్య తీవ్రతను అనుసరించి సర్జరీ చేయాల్సి రావడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలామటుకు సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటేనే ఈ సమస్య నుంచి త్వరితగతిన బయటపడగలుగుతారు. అయితే కొందరూ రోగులు నాడీ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటారని అన్నారు వైద్యులు. (చదవండి: ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!) -
మరో మహమ్మారి.. 15 మందిని కబళించిన ‘బ్లీడింగ్ ఐ’
కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో వ్యాధుల భయం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మార్బర్గ్, ఎంపాక్స్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 17 దేశాలను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. మార్బర్గ్ వైరస్‌ను ‘బ్లీడింగ్ ఐ’ వైరస్ అని కూడా అంటారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో ఈ వైరస్ కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారు. కొన్నివందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారినపడి, ప్రాణాలతో పోరాడుతున్నారు.తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో..ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బ్లీడింగ్ వైరస్ అనేది 50శాతం మరణాల రేటుతో తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో ఉంది. ఈ వైరస్ రువాండాలో విధ్వంసం సృష్టిస్తూ, ప్రపంచదేశాలను వణికిస్తోంది. మార్బర్గ్ వైరస్ కారణంగా కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీనిని ‘బ్లీడింగ్ ఐ’ అని పిలుస్తున్నారు. ఇప్పటికే ఇతర వైరస్ల వ్యాప్తితో పోరాడుతున్న ఆఫ్రికా దేశాలను ఈ కొత్త వైరస్ ఇప్పుడు చుట్టుముట్టింది.లక్షణాలివే..బ్లీడింగ్ ఐ వైరస్ సోకినప్పుడు తొలి లక్షణాలు రెండు నుండి 21 రోజుల తర్వాత కనిపిస్తాయి. ముందుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట, శరీర నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తాయి. తరువాత అతిసారం, వికారం, వాంతులు, దురద, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీటి తరువాత ముక్కు, పంటిచిగుళ్ళు, కళ్ళు, నోరు, చెవుల నుండి రక్తస్రావం అవుతుంది. అలాగే వాంతులు, మలంలో రక్తం, అంతర్గత రక్తస్రావం, వృషణాల వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. తరువాత బ్లీడింగ్ ఐ వైరస్ బాధితునికి ప్రాణాంతకంగా మారుతుంది.కరోనా కంటే ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గనులు లేదా గుహలలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తులలో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలలో గబ్బిలాలు నివసిస్తాయి. ఇవి ఈ వైరస్‌కు ప్రధాన కారకంగా గుర్తించారు. కరోనా కంటే మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైనదని పలు నివేదికలు చెబుతున్నాయి. వ్యాధి సోకిన గబ్బిలాల ద్వారా లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ వైరస్‌కు ఎటువంటి మందులు లేవు. నివారణ చర్యలే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు -
‘బ్లడ్‌బ్యాంకులకు ‘రక్తహీనత’ అధ్వాన్నంగా పరిస్థితి
సాక్షి, దాదర్: ముంబైసహా రాష్ట్రంలోని వివిధ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు భారీగా తగ్గిపోయాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే వివిధ ప్రభుత్వ, కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అత్యవసరమైనవి మినహా సాధారణ ఆపరేషన్లన్నిటినీ వాయిదా వేయాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో కేవలం 43,062 యూనిట్ల రక్తం నిల్వలున్నాయి. అయినప్పటికీ కొన్ని బ్లడ్‌బ్యాంకులు ఇక్కడి రోగులకు అందించాల్సిన రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర రక్త నిల్వల పరిషద్ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పరిస్ధితులు సాధారణ స్ధితికి వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు రక్తాన్ని పంపించడాన్ని నిషేధించాలని పరిషద్ నిర్ణయించింది. ప్రైవేట్ బ్లడ్‌బ్యాంకుల దోపిడీ... సాధారణంగా ఏటా దీపావళి, వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో జనాలు తమ కుటుంబ సభ్యులతో స్వగ్రామాలకు లేదా విహార యాత్రలకు, పుణ్యక్షేత్ర సందర్శనకు వెళుతుంటారు. ఈ సమాయల్లో స్వచ్చంద సేవా సంస్ధలు, రాజకీయ పార్టీలు అక్కడక్కడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ దాతలు ఎవరూ ముందుకురారు. దీంతో దీపావళి, వేసవి సెలవుల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత తీవ్రంగా ఉంటుంది. ఈసారి దీపావళి పర్వదినానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా తోడు కావడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పదాధికారులు బిజీగా ఉన్నారు. వీరిలో రక్తదాతలు కూడా ఉండడంతో పరిస్ధితి అధ్వాన్నంగా తయారైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రాజకీయ పార్టీల తరఫున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలులేకుండా పోయింది. స్వయం సేవా సంస్ధలు శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు బిజీగా ఉండడంతో రక్త దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోవడంతో అత్యవసర ఆపరేషన్లకే రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి వెంట ఉన్న బంధువులు రక్తం కోసం ఉరుకులు, పరుగులు తీయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో రక్తం లభించకపోవడంతో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులపై దృష్టిసారించారు. గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించి రక్తాన్ని తీసుకువస్తున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో అయితే రోగుల బంధువులు రక్త దానం చేస్తేనే అందుకు బదులుగా అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ గ్రూపు రక్తాన్ని ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా కొద్ది రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలతో రాజకీయ పార్టీలు చాలా బిజీగా ఉంటాయి. అంతేగాకుండా పదాధికారులు, కార్యకర్తలు విందులు, వినోదాలతో బిజీగా ఉండడంవల్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి సమయం దొరకదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పరిస్ధితులన్నీ సాధారణ స్ధితికి వస్తే తప్ప రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలుకాదు. అంతవరకు రక్తం కొరతను చవిచూడక తప్పదని తాజా పరిస్ధితులను బట్టి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల తరపున కాకుండా వివిధ ధార్మిక, సామాజిక సేవా సంస్ధల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పరిషద్ పిలుపు నిచ్చింది. నివాస సొసైటీల ఆవరణలో, పాఠశాల మైదానాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. శిబిరాలు తమకు దగ్గరలోనే ఉండటం వల్ల రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వస్తారని పరిషద్ భావిస్తోంది. లేదంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్ధితి చేయి దాటిపోయే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తంచేసింది. -
Clinical Vampirism: ఈ జబ్బు గురించి తెలుసా?
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలా రక్తాన్ని రుచి చూసే ఆ పిశాచాల్లాంటి క్యారెక్టర్స్‌ను ఇంగ్లిష్‌లో ‘వాంపైర్స్’ అని పిలుస్తారు. కానీ అలా రక్తం తాగే కోరికతో ఉండే ఒక జబ్బు ఉంటుందనీ, ఆ మెడికల్ కండిషన్ పేరే ‘వాంపైరిజమ్’ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ వాంపైరిజమ్ గురించిన కథనమే కాస్త సంక్షిప్తంగా... ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతో కొంత రుచి చూస్తుంటాడు. దీనికి ఉదాహరణే... వేలు తెగినప్పుడు గబుక్కున అకస్మాత్తుగా చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఇందులో రక్తాన్ని రుచిచూడడానికంటే... అలా కంటిన్యువస్‌గా రక్తస్రావం జరగకుండా నివారించేందుకే ఇలా తెగిన వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఎవరికి వారు తమ సొంత రక్తాన్ని రుచి చూసే ఆ ప్రక్రియకు ‘ఆటో వాంపైరిజమ్’ అంటారు. వేలు తెగి రక్తస్రావం అవుతున్నప్పుడు చాలామందిలో కనిపించే ఈ ప్రక్రియ చాలా సాధారణమైన ప్రతిక్రియగా భావించవచ్చు. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఓ అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారిలో రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరిక పుట్టడాన్ని ‘క్లినికల్ వాంపైరిజమ్’ అంటారు. మరికొందరిలోనైతే ఇది కాస్త రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ ‘బిహేవియరల్ థెరపీ’ అనే చికిత్స చేస్తారు. అన్నట్టు... ఈ జబ్బు ‘రెన్‌ఫీల్డ్స్’ పేరిట 2023లో ఓ అమెరికన్ మూవీ కూడా విడుదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది ఓ ‘అమెరికన్ యాక్షన్ కామెడీ హారర్’ థీమ్‌తో తయారైన సినిమా. -
ఆస్పత్రి వద్దు.. బడికి వెళ్తానమ్మా..
గార్లదిన్నె: తన ఈడు పిల్లలతో కలసి బడికెళ్లాల్సిన ఓ చిన్నారి తలసేమియా వ్యాధి బారిన పడి ఆస్పత్రి పాలయ్యాడు. ‘అమ్మా... ఈ ఆస్పత్రి వద్దు.. నేనూ బడికి పోతా’నంటూ ఆ చిన్నారి అమాయకంగా అడుగుతుంటే నిరుపేద తల్లిదండ్రుల కంట నీరు ఆగడం లేదు. చాపకింద నీరులా కబళిస్తున్న మృత్యువు బారి నుంచి తమ బిడ్డను దక్కించుకునేందుకు ఆ నిరుపేద తల్లిదండ్రులు పడుతున్న వేదన మాటల్లో వర్ణించలేం. తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు.కూలికెళితేనే పూట గడుస్తుంది..గార్లదిన్నె మండలం పాత కల్లూరులో నివాసముంటున్న సురేంద్ర, సుజాత దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఆదాయం అరకొరగా ఉన్నా... ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు శ్రీకాంత్ అరుదైన వ్యాధిబారిన పడి మృత్యువుతో పోరాడుతున్నాడు.15 రోజులకోసారి రక్తమార్పిడిఏడేళ్ల వయసున్న శ్రీకాంత్... నెల రోజుల క్రితం జ్వరం బారిన పడడంతో సమీపంలోని పామిడిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మరో ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిలో ఎర్ర రక్తకణాలు క్షీణిస్తున్న విషయాన్ని పసిగట్టిన సదరు వైద్యుడి సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైద్యులు వెంటనే రక్తం ఎక్కించారు. అయినా మార్పు కనిపించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని హయ్యర్ ఇన్స్టిట్యూట్కు రెఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు... హైదరాబాద్ లేదా బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తలసేమియా వ్యాధితో శ్రీకాంత్ బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.18 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆపరేషన్ చేసే వరకూ ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. దీంతో కుమారుడి వద్ద తన భార్యను ఉంచి సురేంద్ర స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబపోషణ కోసం తన వద్ద ఉన్న రెండు గేదెలు అమ్మడంతో పాటు ఇతరుల వద్ద అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని బెంగళూరుకు వెళ్లాడు. ఇప్పటి వరకూ వైద్యం కోసం దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇన్‌పేషెంట్‌గా ఉంటే ఆస్పత్రి ఖర్చులు భరించలేని దుస్థితికి చేరుకోవడంతో అదే ఆస్పత్రి బయట ఓ గదిని అద్దెకు తీసుకుని రోజూ వెళ్లి చికిత్స చేయించుకుని వస్తున్నారు. ఈ క్రమంలో సురేంద్ర అక్కడే కూలి పనులకు వెళుతుండగా.... తల్లి సుజాత కుమారుడి బాగోగులు చూసుకుంటోంది.బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి ...రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తున్న కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు నిరుపేద తల్లిదండ్రులు మొక్కని దేవుడంటూ లేడు. రక్తం ఎక్కించాల్సిన ప్రతిసారీ రూ.20 వేలు ఖర్చు వస్తోంది. ప్రస్తుతం చేతిలో నయా పైసా లేదు. బెంగళూరులోనే సురేంద్ర కూలీ పనుల ద్వారా సంపాదిస్తున్న అరకొర డబ్బు రోజు వారి అవసరాలకు సరిపోతోంది. స్వశక్తితో కుమారుడికి నయం చేయించుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. ఇలాంటి పరిస్థితిలో తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు.బ్యాంక్ వివరాలు...ఖాతాదారు పేరు : కె.సుజాతబ్యాంక్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కల్లూరు శాఖ, గార్లదిన్నె మండలంఖాతా నంబర్ : 3879 010 6265ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0002737ఫోన్‌పే నంబర్లు : 90145 15056,81067 51483 -
క్యాన్సర్‌కు నమ్మకమే ఆన్సర్
బ్లడ్ క్యాన్సర్ సోకిన డాక్టర్ నేత్రావతి... తన గురించి తన ఆరేళ్ల కొడుకు ఎక్కడ భయపడతాడో, అసలే ఆందోళనలో ఉన్న తనను చూసి అతడెక్కడ బెంగపడతాడో అని తనకు జబ్బును ఆ చిన్నారి నుంచి దాచిపెట్టింది. తాను స్వయానా డాక్టర్. అందునా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావడంతో కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా చూస్తుండేది. దాంతో మొదట్లో తనలో కనిపించిన లక్షణాలను చూసి తనకూ కోవిడ్ సోకిందేమో అనుకుంది. ఎట్టకేలకు అది చాలా తీవ్రమైన ఓ తరహా బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. చికిత్స జరగకపోతే బతికేది రెండువారాలూ... మహా అయితే మూడు వారాలు!! ఇప్పుడామె పూర్తిగా కోలుకుని, తనలా క్యాన్సర్ బారిన పడి ఆందోళనతో బెంబేలెత్తుతున్నవారికీ కౌన్సెలింగ్ చేయడం, ధైర్యం చెప్పడం చేస్తోంది. అదీ తాను చికిత్స తీసుకున్న మణిపాల్ హాస్పిటల్లోనే. ఈలోపు మరికాస్త ఎదిగిన కొడుకు ఆమె వీడియోలను చూసి... ‘అమ్మా... నువ్వెంత ధైర్యవంతురాలివి. నిజంగా నువ్వు విజేతవమ్మా’’ అంటుంటే... క్యాన్సర్ మీద కంటే పెద్ద విజయమిది అంటోంది ఆ తల్లి. ఆ విజయగాధను విందాం రండి. డాక్టర్ నేత్రావతి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఊరట కలిగిస్తున్న సమయమది. అప్పట్లో 2020 – 2021 నాటి రోజుల్లో కరోనా వైరస్ ఉద్ధృతంగా ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆ క్షణాల్లో ఒకనాడు తనకూ జ్వరంగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. తీవ్రమైన అలసట. ఒకవైపు చెయ్యి లాగేస్తోంది. విపరీతమైన నిద్రలేమి. ఒకవేళ నిద్రపడితే అకస్మాత్తుగా మెలకువ వచ్చి చూసుకుంటే ఒళ్లంతా చల్లటి చెమటలు. ఈ లక్షణాలన్నీ దాదాపుగా కోవిడ్‌నే తలపిస్తున్నాయి. అందునా తాను రోజూ కరోనా రోగులకు సేవలందిస్తూ ఉండటంతో కోవిడ్ సోకిందేమోనని మొదట అనుకుంది.తీరా చూస్తే తీవ్రమైన బ్లడ్‌క్యాన్సర్... అసలు సమస్య తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించుకుని రి΄ోర్టు చూసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ 10,000 కంటే కిందికి పడి΄ోయింది. (ఇవి కనీసం 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి). హిమోగ్లోబిన్ కౌంట్ ఐదు కంటే తక్కువ! (ఇది మహిళల్లో 12 నుంచి 15 వరకు ఉండాలి). తెల్లరక్తకణాల సంఖ్య అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోయి ఉంది. అవేవీ కోవిడ్‌కు సంబంధించినవి కావు. ఏదో తేడా కొడుతోంది అనుకుంది. మణిపాల్ హాస్పిటల్‌లోని హిమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున కళాషెట్టిని సంప్రదించింది. వ్యాధి నిర్ధారణలో అది ‘అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అనే బ్లడ్ క్యాన్సర్‌గా తేలింది.నాకే ఎందుకిలా... డాక్టర్ నేత్రావతి మంచి ఆరోగ్యస్పృహ ఉన్న వ్యక్తి. తానే స్వయానా డాక్టర్. ప్రతి వీకెండ్‌కూ బెంగళూరు కబ్బన్ పార్కులో పచ్చటి చెట్ల మీది నుంచి వచ్చే పచ్చి గాలి పీలుస్తూ కొడుకూ, భర్తతో సైక్లింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తుంటుంది. వేళకు నిద్రలేవడం, సమయానికి నిద్ర΄ోవడంతో పాటు డాక్టర్ కావడంతో మంచి ఆరోగ్య స్పృహతో ఉండటం, ఆరోగ్యకరమైనవి తినడం ఇవన్నీ చేస్తుండేది. తీరా బ్లడ్ క్యాన్సర్ కనిపించాక... అందరూ చెప్పే మాటే తన నోటి నుంచీ వచ్చింది. అందరిలాగే తానూ అనుకుంది... ‘‘నాకే ఎందుకిలా?!’’ ఆమె వెతలు ఆమె మాటల్లోనే...‘‘ఎట్టకేలకు చికిత్స మొదలైంది. నిజానికి క్యాన్సర్ వ్యాధి కంటే దాని చికిత్సా... అది మనిషి మీద చూపే శారీరక, మానసిక దుష్ప్రభావాలే ఎక్కువగా కుంగదీస్తుంటాయి. నాకున్న ΄÷డవాటి ఒత్తైన జుట్టును చూస్తూ చూస్తూ కోల్పోవాల్సి వచ్చింది. కీమోతో నోట్లోని, కడుపులోని మ్యూకస్ పారలు తీవ్రంగా దెబ్బతిని, ‘మ్యూకోసైటిస్’ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. కీమో మొదలైన రెండు లేదా మూడు వారాల పాటు నోట్లో ఉండే మ్యూకస్ పారలు దెబ్బతినడం వల్ల నోట్లో తెల్లటి చీముమచ్చలు వస్తాయి. దాంతో తినడం, తాగడం, మాట్లాడటం కష్టమయ్యేది. కీమోథెరపీలోని మందులు ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను తుదముట్టిస్తూనే ఆరోగ్యకరమైన మంచి కణాలనూ దెబ్బతీస్తుంటాయి. దాంతో ఈ దుష్ప్రభావాలన్నీ కనిపిస్తుంటాయి. కష్టమనిపించనప్పునడు నా ఆరేళ్ల కొడుకు రూపాన్ని కళ్లముందుకు తెచ్చుకున్నా.’’డాక్టరే పేషెంట్ అయితే...‘‘ఈ చికిత్స ప్రక్రియల సమయంలో మరెన్నో కాంప్లికేషన్లు కనిపించాయి. ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరింది. కిడ్నీ సరిగా పనిచేయడం మానేసింది. రక్తపోటు పడిపోయింది. ఎందుకు వస్తోందో తెలియని తరచూ వచ్చే జ్వరాల మధ్య ఒక్కోసారి శ్వాస ఆడేది కాదు. ఊపిరి అందడమే కష్టమయ్యేది.’’ ‘‘ఇలాంటి దశలో చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. తమను తాము తమాయించుకోలేరు. ఇక ఆ బాధితురాలు ఒక డాక్టరైతే... లోపల ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కాబట్టి అది ఆవేదన మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఒక్కమాటలో చెప్పాలంటే జబ్బుకూ, నాకూ జరిగే ఈ పోరులో... నా మానసిక బలం, నా మీద నాకున్న విశ్వాసం ఇవన్నీ గతంలో నేనేనాడూ చూడని స్థాయికి పెరిగాయి. నేను తట్టుకోగలిగే నా సహనపు చివరి అంచు సరిహద్దును మరింత ఆవలకు నెట్టాను’’ అంటూ తన ఆవేదనను కళ్లకు కట్టారు డాక్టర్ నేత్రావతి. చివరగా...డాక్టర్ నేత్రావతి చెబుతున్న మాటలివి... ‘‘జబ్బు తర్వాత మంచి క్రమశిక్షణతో కూడిన జీవితం క్రమం తప్పకుండా ఫాలోఅప్, డాక్టర్ సలహాలు ఖచ్చితంగా పాటించడం. ఇతరులు చెప్పే ప్రత్యామ్నాయ చికిత్సలను పెడచెవిన పెట్టడం, ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం, ఎనిమిది గంటల నిద్ర, మధ్యాహ్నం ఓ చిన్న పవర్‌న్యాప్... ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పడు కంప్లీట్ బ్లడ్ కౌంట్‌లో తెల్లరక్తకణాలు నార్మల్‌గా ఉన్నాయేమో చూసుకుంటూ ఉన్నా.ఇప్పుడు అంత ప్రమాదకరం కాదు... ‘అక్యూ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అని పిలిచే ఆ బ్లడ్ క్యాన్సర్ ఒకప్పుడు చాలా ప్రమాదకరం. కానీ ఇటీవల కొత్త చికిత్సా ప్రక్రియలు వస్తున్న కొద్దీ దాని గురించిన భయం తగ్గుతూ వస్తోంది. కొన్ని గణాంకాల ప్రకారం ఈ జబ్బుకు చికిత్స తీసుకున్నవారిలో 99% మంది నాలుగేళ్లు పైబడి జీవిస్తుంటే... ఐదేళ్లకు పైబడి జీవిస్తున్నవారు 86% మంది ఉన్నారు. -
50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!
బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ (ఎన్హెచ్ఎస్బీటీ(NHSBT)) శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనుగొన్నారు. దీంతో దాదాపు 50 ఏళ్లుగా నిపుణులను కలవరపరుస్తున్న వైద్య రహస్యానికి తెరపడింది. ఈ సరికొత్త ఆవిష్కరణ రక్తమార్పిడి పద్ధతులను మార్చడమే కాకుండా రోగులకు కొత్త ఆశను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. పరిశోధకులు కనుగొన్న కొత్తబ్లడ్ రూప్ మాల్(MAL). ఇది ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్ నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్‌కి సంబంధించిన జన్యుపర మూలం. దీన్ని 1972లో మానవులు రక్తంలో గుర్తించారు. దీని వల్ల రక్త మార్పిడిలో ప్రతి చర్యలు లేదా సమ్యలు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందనేది నాటి శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు. నిజానికి ఏనడబ్ల్యూజే యాంటిజన్ అనేది అధిక సంఘటన యాటిజన్‌లని అర్థం. దాదాపుగా మానవులందరి ఎర్రరక్త కణాలపై ఈ యాంటిజెన్లు ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఉండవు. దీన్ని గుర్తించడం కష్టం కూడా. అందువల్ల రక్తమార్పిడిలో కొందరు రోగులకు సమస్యలు ఎదురయ్యేవి. ఇది వైద్య శాస్త్రంలో చేధించలేని మిస్తరీగా ఉండేది. అది ఈ కొత్త బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణతో 50 ఏళ్ల మిస్టరీని చేధించగలిగారుఈ మేరకు దాదాపు 20 ఏళ్లుగా ఈ ఎన్హెచ్ఎస్ బ్లండ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ పరిశోధనకే అంకితమైన పరిశోధకుడు లూయిస్ టిల్లీ మాట్లాడుతూ.. తాము ఈ ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్ బ్లడ్ గ్రూప్ లేని వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపారు. తాము కనిపెట్టిన ఈ కొత్త రక్త నమునా అరుదైన రక్తరకాలు ఉన్న రోగులకు సంరక్షణ ఇస్తుందని చెబుతున్నారు. రక్తమార్పిడి సమయంలో ఎదురయ్యే ప్రతిచర్యలకు లేదా సమస్యలను నివారించడానికి ఈ పరిశోధన అత్యంత కీలకం. ప్రతిఏడాది దాదాపు 400 మంది రోగులు రక్తమార్పిడితో సమస్యలు ఎదుర్కుంటున్నారని చెప్పారు. వారికి రక్తం సరిపోలక పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ఆ సమస్యలన్నింటికి ఈ కొత్త రక్తనమునా చెక్ పెట్టిందన్నారు. ఈ కొత్త బ్లడ్‌గ్రూప్ ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్ నెగిటివ్ ఉన్న దాతలు, గ్రహితలు ఇద్దరిని గర్తించడానికి జన్యు రూప పరీక్షలకి అనుమతిస్తుంది కాబట్టి అరుదైన కేసుల్లో రోగులకు ఎదురయ్యే రక్తమార్పిడి సమస్యలను ఇది నివారించగలుగలదని ధీమాగా చెబుతున్నారు. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగుల సంరక్షణను మెరుగుపరుచడమే కాకుండా రక్తమార్పిడి భద్రత, ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప అద్భత ఆవిష్కరణగా పేర్కొన్నారు నిపుణులు.(చదవండి: ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్‌లోనే పెట్టి పడేస్తున్నారా?) -
గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!
రక్తంలో పలు రకాల గ్రూప్‌లు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్‌లు ఉంటాయి. దాన్ని అనుసరించే ఎవరికైన రక్తదానం చేయడం వంటివి చేస్తాం . అయితే బ్లడ్ గ్రూప్‌ని బట్టి వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా చూద్దామా..!గుండె సమస్యలు వచ్చే ప్రమాదం..ఈ రోజుల్లో చాలా మందికి గుండెజబ్బుల బారినపడుతున్నారు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయట. మిగతా బ్లడ్ గ్రూప్‌లు ఏ, బీ, ఏబీ వాళ్లకి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా కొలెస్ట్రాల్, కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయని తెలిపారు.పెప్టిక్ అల్సర్..ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు. అయితే ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి వస్తుంది.కేన్సర్కేన్సర్ ఎక్కువగా ఏ,బీ, ఏమీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. ముఖ్యంగా ఫైలోరీ ఇన్ఫెక్షన్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెద్దపెద్ద కేన్సర్లు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా ఉంటుందట.ఒత్తిడిసాధారణంగా సమస్యలు వస్తే ఒత్తిడికి గురవుతారు. సమస్యను బట్టి కొందరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు.వెయిన్స్ త్రాంబోఎంబోలిజంకొంతమందికి కాళ్ల వేయిన్స్ లో రక్తం గడ్డ కడుతుంది. దీనినే వెయిన్స్ త్రాంబోఎంబోలిజం అంటారు. అయితే ఇది ఎక్కువగా ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధుమేహ వ్యాధి..ప్రస్తుతం చాలా మందికి మధుమేహం వస్తోంది. అయితే డయాబెటిస్ ఎక్కువగా ఏ, బీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం మాత్రమే. పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుని వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
పిక్కకు ఓ లెక్కుంది..! అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులు..!
మనిషికి శరీరం పైభాగంలో అంటే రొమ్ములో ఒక గుండె ఉంటుంది. అదే రీతిలో రెండు కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... పిక్కలు. నిజానికి అవి అచ్చంగా గుండెలు కాకపోయినప్పటికీ గుండె చేసే పనినే పిక్కలూ కొంతవరకు చేస్తాయి. గుండె రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేసినట్టే సరిగ్గా పిక్క కూడా రక్తాన్ని పైకి పంప్ చేయడంతోపాటు పైకెళ్లాల్సిన రక్తం భూమ్యాకర్షణకు లోనై కిందికి వెళ్లకుండా అక్కడి కవాటాలు ఆపుతాయి. అందుకే ‘పిక్క’ను శరీరపు రెండో గుండెకాయగా కొందరు చెబుతుంటారు. గుండె చేసే పనిని పిక్కలు ఎలా చేస్తాయో చూద్దాం. పిక్కను పరిశీలనగా చూసినప్పుడు అది కూడా ఇంచుమించూ ‘హార్ట్ షేపు’లోనే కనిపిస్తుంది. గుండె తన పంపింగ్ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంటే... కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి వచ్చేలా చూస్తుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. గుండె డ్యూటీలను పిక్క ఎలా చేస్తుందంటే... పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడి రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ అనే కండరాలు ఈ పనిలో కీలకంగా ఉంటాయి. ఈ కండరాలు క్రమబద్ధమైన రీతిలో స్పందిస్తూ... ముడుచుకోవడం (కాంట్రాక్ట్ కావడం), తెరచుకోవడం (రిలాక్స్‌కావడం)తో కాళ్లకు సరఫరా అయ్యే రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. రక్తం మళ్లీ కిందికి పడిపోకుండా వాల్వ్స్ (కవాటాల) సహాయంతో మూసుకు΄ోతూ పైవైపునకే ప్రవహించేలా చూస్తాయి. ఒకవేళ అలా పిక్కలు పనిచేయకపోతే రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అప్పటికీ ఈ రక్తంలోని ఆక్సిజన్‌ను కండరాలు వినియోగించుకున్నందున తగినంత ఆక్సిజన్ అందక తీవ్రమైన అలసటకు గురవుతాయి. పిక్క గుండెలా పనిచేయకపోతే... కాళ్ల చివరలకు రక్తసరఫరా తక్కువగా జరగడం వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం సరిగా జరగకపోవడం చెడు రక్తాన్ని తీసుకు΄ోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడంతో ఈ కింది పరిణామాలు జరగవచ్చు. అవి... ⇒ కాళ్లు అలసిపోవడం ⇒ కాళ్లూ, పాదాలలో వాపు ⇒ కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకపోవడం ⇒ కాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటం వేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరలు ఉబ్బి చర్మం నుంచి బయటకు కనిపించడం) ∙కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్). ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటే...? చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారిలో ∙ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండే లెక్చరర్లు, టీచర్లు, కండక్టర్లు, ట్రాఫిక్ ΄ోలీసులు... మొ‘‘ వారిలో స్థూలకాయుల్లో గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలల్లో ఈ సమస్య కనిపించవచ్చు.సమస్యను అధిగమించడం కోసం... పాదాలను మడమ దగ్గర్నుంచి పైకీ కిందికీ (ఫ్లెక్స్ అండ్ పాయింట్) కదిలిస్తూ ఉండటం ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్) బరువును / ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం. కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమిపెట్టేలా ‘వీనస్ స్టాకింగ్స్’ వంటి తొడుగులను ధరించాలి. అప్పటికీ అలాగే కనిపిస్తుంటే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. --డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, సీనియర్ వాస్కులార్ అండ్ ఎండో వాస్కులార్ సర్జన్(చదవండి: డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్) -
కవలలకు జన్మనిచ్చిన బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు
ఇండోర్(మధ్యప్రదేశ్): ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు కవలలకు జన్మనిచ్చారు. ప్రపంచంలోనే ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మైయెలాయిడ్ లుకేమియా అనే ప్రాణాంతక రక్త క్యాన్సర్‌తో బాధ పడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా చూడటం సవాల్‌తో కూడుతున్న వ్యవహారమని ఆస్పత్రిలోని క్లినికల్ హెమటాలజీ విభాగం ప్రొఫెసర్ అక్షయ్ లహోటీ తెలిపారు. ‘ఈ గర్భవతిని మా ఆస్పత్రిలో చేరి్పంచిన సమయంలో ఆమె శరీరంలో తెల్ల రక్త కణాల(డబ్ల్యూబీసీ)సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో, కీమో థెరపీతోపాటు సాధారణ క్యాన్సర్ మందులు ఇవ్వలేకపోయాం’అని ఆయన చెప్పారు. ‘దేశ, విదేశాల్లోని నిపుణులను సంప్రదించాక ఆమె ఆరోగ్యంతోపాటు గర్భంలోని ఇద్దరు శిశువులకు ఎటువంటి హాని వాటిల్లకుండా ప్రత్యేకంగా మందులు ఇచ్చాం’అని లహోటీ తెలిపారు. ‘మొదటిసారి గర్భం దాలి్చన బాధితురాలికి బ్లడ్ క్యాన్సర్ ఉన్న విషయం చెప్పలేదు. గర్భవతిగా ఉండగా ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఆమెకు సాధారణ ప్రసవం చేశాము. బాబు, పాప జని్మంచారు. వారు ఆరోగ్యంగా ఉన్నారు’ అని గైనకాలజిస్ట్ డాక్టర్ సుమిత్రా యాదవ్ వివరించారు. మైయెలాయిడ్ లుకేమియా ఉన్న మహిళలకు సురక్షిత ప్రసవం ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు. -
పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్: ఈ కేన్సర్‌ని ఎలా గుర్తించాలి..?
భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ 71 ఏళ్ల వయసులో మరణించాడు. గైక్వాడ్ 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. వాటిలో 2 సెంచరీలతో కలిపి మొత్తం 2,254 పరుగులు చేశాడు. అతను 1983లో పాకిస్తాన్‌పై 201 పరుగులు చేశాడు. అయితే గైక్వాడ్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. అసలు ఈ ప్రాణాంతకమైన వ్యాధి అంటే ఏంటీ..? ఎందువల్ల వస్తుంది..? అంటే..ఇది ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి. ఇక్కడ మాజీ గైక్వాడ్ తన అనారోగ్యంతో ఒక సంవత్సరం పాటు ధైర్యంగా పోరాడుతూ లండన్‌లో చికిత్స తీసుకున్నారు అయినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. బ్లడ్ కేన్సర్ అంటే..కేన్సర్ అంటే కణాల నియంత్రణ లేని పెరుగుదల. అదే విధంగా, బ్లడ్ కేన్సర్ అంటే రక్త కణాల అనియంత్రిత పెరుగుదల. రక్త కేన్సర్ హెమటోలాజిక్ కేన్సర్ అని కూడా పిలుస్తారు. ఎముక మజ్జ, శోషరస వ్యవస్థ, రక్త కణాల వంటి రక్తం-ఏర్పడే కణజాలాలలో (ప్రాధమిక, ద్వితీయ లింఫోయిడ్ అవయవాలు) ప్రారంభమవుతుంది.ఎలా ప్రభావితం చేస్తుందంటే..రక్త కణాల విధులు,ఉత్పత్తిలు బ్లడ్ కేన్సర్ ద్వారా ప్రభావితమవుతాయి. చాలా వరకు కేన్సర్లు రక్తం ఉత్పత్తి అయ్యే ప్రదేశం నుంచి అంటే ఎముక మజ్జ నుంచి ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ రక్త కణాల అభివృద్ధి ప్రక్రియ అసాధారణ రకం కణాల పెరుగుదల ద్వారా చెదిరిపోతుంది. ఈ కేన్సర్ రక్త కణాలు రక్త నష్టాన్ని నివారించడం, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడం మొదలైన ప్రాథమిక విధులను నిర్వహించకుండా రక్తాన్ని ఆపుతాయి.లుకేమియా సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది.లింఫోమా సాధారణంగా 16 నుంచి 24 ఏళ్ల వయసు గల వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవారితో పోలిస్తే 31% మంది పురుషులు లుకేమియాతో బాధపడుతున్నారు.ఈ కేన్సర్‌లో రకాలు..మైలోమా: ఎముక మజ్జలో మొదలై ప్లాస్మా కణాలను ప్రభావితం చేసే కేన్సర్లింఫోమా: ఇది ఎముక మజ్జను కలిగి ఉన్న శోషరస వ్యవస్థకు సంబంధించిన కేన్సర్లుకేమియా:ఇది పిల్లలు,యుక్తవయస్కులలో వచ్చే అత్యంత సాధారణ రక్త కేన్సర్ఎందువల్ల అంటే..దీనికి డీఎన్ఏ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. డీఎన్ఏ రక్తకణాలు ఎప్పుడూ విభజించాలి, లేదా గుణించాలి లేదా ఎప్పుడు చనిపోవాలనేది చెబుతుంది. ఇక్కడ డీఎన్ఏ సూచనలు ఆధారంగా శరీరం అసాధారణమైన రక్త కణాలను అబివృద్ధి చేస్తుంది. ఇవి సాధారణం కంటే వేగంగా పెరుగుతాయి,గుణించబడతాయి. అలాగే ఒక్కోసారి సాధారణం కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. దీంతో సాధారణ కణాలు గుమిగూడి ఎముక మజ్జలో స్థలాన్ని గుత్తాధిపత్యం చేసే అసాధారణ కణాల సముహంలోకి సాధారణ రక్త కణాలు పోతాయి. అందువల్ల ఎముక మజ్జ సాధారణ కణాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల జన్యుమార్పిడి మూడు రకాలు కేన్సర్లకు కారణమవుతుంది. సంకేతాలు, లక్షణాలుబ్లడ్ కేన్సర్‌ని బట్టి లక్షణాలు మారతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మూడు రకాల బ్లడ్ కేన్సర్‌లో కామన్‌గా కనిపించే సంకేతాలు ఏంటంటే..అలసట తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా నిరంతర అధిక జ్వరంరాత్రి చెమటలతో తడిచిపోవడంఅసాధారణ రక్తస్రావం లేదా గాయాలుఊహించని విధంగా బరువు తగ్గడంరోగనిరోధక వ్యవస్థపై ప్రభావం కారణంగా తరచుగా ఇన్ఫెక్షన్లువాపు శోషరస కణుపులు లేదా విస్తరించిన కాలేయం లేదా ప్లీహముఎముక నొప్పిఈ లక్షణాలన్నీ కొన్ని వారాలకు మించి శరీరంలో ఉంటే తక్షణమే వైద్యుడుని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: రియల్ లైఫ్ వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే 14 కిలోలు..!) -
అన్యురిజమ్స్ అంటే?
మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అకస్మాత్తుగా ప్రమాదకరంగా పరిణమించే ఈ సమస్య గురించి...మెదడులోని ఏప్రాంతంలో రక్తనాళాలు ఉబ్బి ఉంటే ఆప్రాంతం పేరుతో అన్యురిజాన్ని చెబుతారు. ఉదాహరణకు సెరిబ్రమ్ అనే ప్రదేశంలో ఉంటే సెరిబ్రల్ అన్యురిజమ్స్ అంటారు. మెదడు చుట్టూ ఉండే ప్రధాన ప్రాంతం సబార్కనాయిడ్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావమైతే దాన్ని ‘సబార్కనాయిడ్ హ్యామరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రదేశాన్ని బట్టి మెదడు ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో, ఆ అవయవం ప్రభావితమవుతుంది. అయితే ఇలా అన్యురిజమల్ బ్లీడ్కి గురైన ప్రతి ఏడుగురిలోనూ నలుగురు ఏదో ఒక రకమైన వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. కీలక ప్రాంతంలో రక్తస్రావం కాగానే మొదట అది పక్షవాతానికీ (స్ట్రోక్‌కు), తీవ్రతను బట్టి కోమాలోకి తీసుకెళ్లే అవకాశాలెక్కువ.బయట పడేందుకు అవకాశం తక్కువ... ఎందుకంటే? అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో అవి వారి జీవితకాలంలో అవి చిట్లక΄ోవచ్చు. ఉబ్బు చిన్నగా ఉన్నవి కాకుండా... ‘జెయింట్ అన్యురిజమ్స్’ అని పిలిచే పెద్దవి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలెక్కువ. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా వస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక వల్ల గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు: కంట్రోల్లో లేని అధిక రక్త΄ోటు, డయాబెటిస్ వంటి జబ్బులు. చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు (ఈ కారణంగా ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ) రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్తో కలిగే కాంప్లికేషన్లు ఆరోగ్యకరంగా లేని జీవనశైలి పొగాకు వాడకం, మద్యం అలవాటు యాక్సిడెంట్లో రక్తనాళాలకు గాయం కొన్ని అరుదైన కేసుల్లో : ఉదా. ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియాకిడ్నీల్లో నీటితిత్తులు వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్.చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు: జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం.చికిత్సలు: మందులిస్తూ చేసే చికిత్స: ఇది రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స. రక్త΄ోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొన్ని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె (క్రేనియమ్) తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిగాక ముందులాగే రక్తప్రసరణ జరిగేలా చూస్తారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్‌ను ప్రవేశపెట్టి... అందులో నుంచి మరింత చిన్నపైప్లను అన్యురిజమ్స్ వరకు చేరేలా చేసి, అక్కడ కాయిల్ అనే డివైజ్‌ని అన్యురిజమ్ నింపడానికి వాడతారు. దాంతో ఉబ్బిన బలహీన ప్రాంతానికి రక్తసరఫరా ఆగడంతో చిట్లడం జరగదు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియతో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. దాంతో పెద్ద రక్తనాళాల దగ్గర ఉన్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇక ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’తో రక్తపు దిశను మళ్లించి ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. (చదవండి: కేరళలో నిఫా వైరస్ కలకలం..!) -
ఉత్తరప్రదేశ్.. రక్తదానంలో నంబర్ వన్
రక్తదానం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు ముందున్నారు. రాష్ట్ర జనాభాలోని 14.61 శాతం మంది ప్రజలు 2023లో రక్తదానం చేసి, తమ సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడంలో యూపీ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో నిలవగా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది.ఆర్టీఐ కార్యకర్త విపుల్ శర్మ దరఖాస్తుకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ-రక్తకోష్ పోర్టల్ డేటాను షేర్ చేసింది. దీనిలోని వివరాల ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో రక్తదానం చేసేవారి సంఖ్య ప్రతి ఏటా 50 శాతానికి పైగా పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ 2021లో 45 లక్షల యూనిట్ల రక్తం సేకరించగా, అది 2022 నాటికి 80 లక్షల యూనిట్లకు పెరిగింది. 2023లో దేశంలోని మూడు వేలకు పైగా బ్లడ్ బ్యాంక్‌లలో మొదటిసారిగా 1.29 కోట్ల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో అత్యధికంగా 18.11 లక్షల యూనిట్ల రక్తాన్ని ఉత్తరప్రదేశ్‌లోని 400కు పైగా బ్లడ్ బ్యాంకులు అందించాయి.మహారాష్ట్రలో 15.20 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా, గుజరాత్లో 10.51 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అమెరికన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ సగటున 4.3 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఒక పురుషునిలో సగటున 5.7 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి రోజూ 400 నుండి రెండు వేల మిల్లీలీటర్ల రక్తాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఒక వ్యక్తి ఒకసారి అర లీటరు రక్తాన్ని దానం చేయవచ్చు. 2018లో దేశంలోని 124 బ్లడ్ బ్యాంకులు ఈ-రక్తకోష్ పోర్టల్‌లో నమోదయ్యాయి. ఆ ఏడాది వీటిలో మొత్తంగా 35 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 2019లో రక్తదానం 43 లక్షల యూనిట్లకు పెరిగింది. అయితే 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో కేవలం 40 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించారు. -
అమ్మానాన్న బొమ్మను రక్తంతో గీసి...
యాక్రలిక్, ఆబ్స్ట్రాక్ట్, పాప్ ఆర్ట్, పెయింటర్లీ, వాటర్ కలర్, ఆయిల్ పెయింట్, పేస్టల్స్ కాదేదీ పెయింటింగ్‌కు అనర్హం అన్నట్లు... విచిత్రంగా రక్తంతో బొమ్మలు గీసి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.. నగరానికి చెందిన అనిల్ కుమార్. కొందరు కాన్వాస్‌పై యాక్రిలిక్‌తో అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తే మరికొందరు మట్టిముద్దలతో శిల్పాలను రూపొందిస్తున్నారు.. ఇటీవల ఈ క్రియేటివిటీ మరింత పెరగడంతో ఒక్కొక్కరూ ఒక్కో వైవిధ్యమైన రీతిలో కళాకారులు మ్యాజిక్ చేస్తున్నారు. నగరానికి చెందిన యువ చిత్రకారుడు అనిల్ కుమార్ దీని కోసం బ్లడ్‌ను ఉపయోగిస్తూ... ‘రక్త’ సంబంధాలను సరికొత్తగా పునర్నిర్వచిస్తున్నాడు. అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. బ్లడ్ ఆర్ట్ అనే పదం వినడానికి ప్రత్యేకంగా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ‘బ్లడ్ పెయింటింగ్ భావోద్వేగాలను పంచుకునేందుకు సాటిలేని మార్గం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ప్రేమికులు...తమ మధ్య ఉన్న బలమైన సంబంధాలను తెలియజెప్పేందుకు ఓ శక్తివంతమైన సాధనమని’ అనిల్ అంటున్నాడు. దైవకృపతో అబ్బిన కళ... దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అనిల్ కుమార్‌కు ఎటువంటి చదువు, సాధన లేకుండా చిత్రకళ అబ్బింది...అతని కళాత్మక ప్రయాణం 2019లో బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా ప్రారంభమైంది. ‘చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం హాబీ..అలా అలా పోట్రెయిట్స్ గీయడం అలవాటైంది. బీటెక్ పూర్తి చేసినా ఏదో ఒక ఉద్యోగంలో ఇమడలేక పోట్రెయిట్ (పెన్సిల్ స్కెచింగ్) కళలో ప్రావీణ్యం సంపాదించాను. అప్పుడు నేను పెన్సిల్స్ (మైక్రో ఆర్ట్) మీద పేర్లు చెక్కడం ప్రారంభించాను’ అని అనిల్ చెప్పాడు. అయితే ఫేస్ డ్రాయింగ్లు మైక్రో ఆర్ట్ ద్వారా ప్రొఫెషనల్ అనిపించుకున్నప్పటికీ సరైన ఆర్డర్స్ లేక ఏదో ఒక ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమ్మాయి ‘కళ్ల’తో పుట్టిన కళ... బెంగుళూర్‌కు చెందిన మైక్రో ఆర్ట్ కస్టమర్ తన సోదరి కళ్లను తన రక్తంతో గీయమని అడిగారు. ‘తొలుత నేను ఒప్పుకోలేదు. బాగా రిక్వెస్ట్ చేయడంతో చేసిన ఆ వర్క్‌ని నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే బాగా రీచ్ వచ్చింది. అయినా అప్పుడు కూడా బ్లడ్ ఆర్ట్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత మా అమ్మానాన్నల మ్యారేజ్ డే రోజున నా రక్తాన్ని ఉపయోగించి వారిద్దరి చిత్రాలనూ గీశాను. అది వారి మనసుకు హత్తుకోవడం మాత్రమే కాదు నా భవిష్యత్తును మార్చేసింది’ అని అనిల్ గుర్తు చేసుకున్నాడు. దేశవిదేశాల నుంచి... అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. వేలాది మంది తమ ప్రియమైన వారి బ్లడ్ పెయింటింగ్స్ కోసం నాకు మెసేజ్ చేయడం ప్రారంభించారు. ‘దాంతో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనీసం కొన్ని వారాల పాటు సమయం తీసుకోవాల్సి వస్తోంది’ అని అనిల్ చెప్పాడు. జాగ్రత్తలు తప్పనిసరి..‘ఈ మాధ్యమాన్ని ఉపయోగించి చిత్రాలు గీసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రభావితమయ్యే మొదటి వ్యక్తి చిత్రకారుడే.. కాబట్టి.. గ్లవ్స్, మాస్క్ ధరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి’ అని అనిల్ కుమార్ స్పష్టం చేశాడు. రక్తాన్ని సేకరించడం నుంచి గోడపై కళాకృతిని అలంకరించడం వరకూ... ప్రతీది కఠినమైన పరిశుభ్రతతో జరుగుతుందని చెప్పాడు. తమకు కావాల్సిన పోట్రెయిట్‌ను గీయించుకోవాలనుకున్న కస్టమర్స్... అనుభవజ్ఞులైన ల్యాబ్ టెక్నీషియ సాయంతో చిన్న ట్యూబ్ ద్వారా సేకరించిన బ్లడ్ (సుమారు 3 నుంచి 4గ్రా) అనిల్‌కు అందిస్తారు. దానిని కనీసం వారం రోజుల వరకూ భద్రంగా నిల్వచేసే అవకాశం ఉంటుంది. రోజుకు ఒక పోర్ర్టెయిట్ను మాత్రమే పూర్తి చేస్తున్నానని అనిల్ చెబుతున్నాడు. కస్టమర్ తీసుకెళ్లేవరకూ దుర్వాసన లేదా తేమను గ్రహించకుండా ఆర్ట్‌వర్క్‌ను సంరక్షించడానికి ఫిక్సేటివ్ స్ప్రేని ఉపయోగిస్తామన్నాడు. ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతితో వేసిన సిసలైన చిత్రకళ అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఏఐ కూడా రీ క్రియేట్ చేయలేని బ్లడ్ ఆర్ట్ భవిష్యత్తులో మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది’ అంటున్నాడు అనిల్. -
రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..
చంద్రమండలంలో అడుగుపెట్టే మేధా శక్తి ఉన్న మనిషి సృష్టించలేనిది.. అరచేతిలోనే ప్రపంచాన్ని అందిపుచ్చుకునే సాంకేతికత ఉన్నా కూడా తయారు చేయలేని పదార్థం. ఎన్ని కొంగొత్త ఆవిష్కరణలు చేసినా.. కృత్రిమంగా తయారు చేయడానికి వీలుపడనిది...'రక్తం'. నిరంతరం వ్యాధులతో పోరాడే వారికి..రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు అత్యవసరమైనది.. 'రక్తమే'. ఈ నేపథ్యంలోనే రక్తదానాన్ని ప్రోత్సహించడం కీలకమన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్ 14న నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రక్తదానంపై ఉన్న అపోహలు, సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్ గురించి సవివరంగా తెలుసుకుందాం.ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. జూన్ 14నే ఎందుకంటే.. నోబెల్ గ్రహిత శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ పుట్టినరోజున జరుపుకుంటున్నాం. ఆయన ఏబీఓ బ్లడ్ గ్రూప్ కనుగొన్నందువల్లే రక్తమార్పిడి గురించి ప్రపంచానికి తెలిసింది. అందువల్లే కార్ల్ ల్యాండ్‌స్టైనర్ గౌరవార్థం ఇలా ఆయన జయంతి రోజున రక్తదాతల దినోత్సవం పేరుతో రక్త దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.ఈ రోజున మనమిచ్చే రక్తంతో ఎన్ని ప్రాణాలు నిలబడతాయో శిబిరాలు నిర్వహించి మరీ తెలియజేస్తారు అధికారులు. అయితే చాలామందిలో రక్తదానం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. మనం గనుక ఇప్పుడు దానం చేస్తే ఏమైనా.. అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. ఒక్కసారి రక్తదానం చేశాక మళ్లీ తొందరగా కోలుకుంటామా అనే భయం కూడా ఉంటుంది చాలమందిలో. అయితే వైద్యులు అవన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు. పైగా రక్తదానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు..రక్తదానం చేసిన 48 గంటల్లోనే ఒక వ్యక్తి రక్త పరిమాణం సాధారణ స్థితికి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. వృద్ధులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రక్తదానం చేయవచ్చని చెబుతున్నారుమందులు వాడుతున్నావారు కూడా రక్తదానం చెయ్యొచని చెబుతున్నారు. రక్తదానం కేంద్రంలో వారే వాడే మందులు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్ని సమయాల్లో కొన్ని రోజుల పాటు ఆయా మందులను నిరోధించమని చెప్పి..తర్వాత దాత నుంచి రక్తాన్ని తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు.అలాగే రక్తదానం చేసే ప్రక్రియ సాధారణంగా 15 నిమిషాలకు మించి సమయం పట్టదు. జీవితాలను నిలబట్టే మహత్తర కార్యం ఇది అని చెబుతున్నారు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడతాం అనుకుంటారు. ఇది కూడా అపోహ అని తేల్చి చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే రక్తదాన కేంద్రాలు అంటువ్యాధులను నివారించడానికి కఠినమైన భద్రతా ప్రోటాకాల్లను పాటిస్తాయి. పైగా దానం చేసిన రక్తాన్ని ఉపయోగించే ముందు అంటువ్యాధుల కోసం క్షణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది నొప్పి లేకుండా దాతనుంచి సునాయాసంగా చిన్న పాటి సుదితో రక్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానం చేసే వ్యక్తి, వయసు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా ఏడాదికి చాలాసార్లు రక్తదానం చెయ్యొచ్చని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి 2 నెలలు లేదా 56 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్..భారతదేశంలోని ఆస్పత్రుల్లో దాదాపు 14.6 మిలియన్ల యూనిట్ల రక్తం డిమాండ్ ఉన్నట్లు అంచనా వేశాయి. అయితే ఈ డిమాండ్ తగ్గట్టు కేవలం 96% మాత్రమే రక్తం అందుబాటులో ఉందని, దాదాపు ఒక మిలియన్ యూనిట్ వరకు చాలా సెంటర్లలో కొరత ఉందని పేర్కొంది నివేదిక. అందువల్లే స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రజల్లో చైత్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు వంటివి ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రక్తం కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 2017లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 మిలియన్ల యూనిట్ల రక్తం కొరతను ఉందని, ఏకంగా 119 దేశాల్లో బ్లడ్ సెంటర్లలో రక్తం అందుబాటుల్లో లేదని వెల్లడించాయి నివేదికలు.దీన్ని పరిష్కరించేందుకు స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలి. రక్త నిర్వహణ పద్ధతులను మెరుగుపరచాలి, రక్తమార్పిడి వ్యవస్థలను బలోపేతం చేయాలి. రక్త మార్పిడి ఎలాంటప్పుడంటే..ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు తక్షణమే రక్తం అవసరం. సురక్షితమైన రక్తం అందుబాటుల్లో ఉండే ప్రాణాలను రక్షించగలుగుతాం. వైద్య విధానాలు: శస్త్ర చికిత్సలు, కేన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడి, ప్రసవం తదితర వాటికి రక్తమార్పిడి అవసరం అవుతుంది. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హిమోఫిలియా వంటి పరిస్థితుల్లో బాధపడుఉన్న రోగులకు వారి ఆరోగ్యాన్ని నిర్వహించడానికి క్రమం తప్పకుండా రక్తమార్పిడి అవసరం. రక్తహీనత: ఐరన్ లోపం లేదా ఇతర కారణాల వచ్చే రక్తహీనత, ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిలను పునరుద్ధరించడానికి రక్తమార్పిడి అవసరంబ్లడ్ డిజార్డర్స్: లుకేమియా, లింఫోమా, రక్త సంబంధిత రుగ్మతల చికిత్స కోసం రక్తమార్పిడి కీలకం. ప్రసూతి మరణలను నివారించడానికి, గర్భధారణ, ప్రసవ సమయంలో సురక్షితమై రక్త మార్పిడి చాలా కీలకం.తదితర వాటిలో సురక్షితమైన రక్తం అవసరమవుతుంది. అందువల్ల ఈ దినోత్సవం రోజున ప్రజలు స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేస్తే సురక్షితమైన రక్తం కొరతను నివారించగలుగుతాం. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం. అంతేగాదు రక్తం ఇవ్వడం అంటే ప్రాణం ఇచ్చినట్లే అని అందరూ గ్రహించాలి. ఈ మహాత్తర నిస్వార్థ కార్యక్రమంలో మనమందరం పాలుపంచుకుని ఈ సమస్యను నివారిద్దాం.(చదవండి: రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!) -
పుణే పోర్షే కేసు: మకందర్‌కు ఫోన్ చేసిందెవరు?
ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్ జస్టిస్ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్ వార్డు బాయ్‌కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. బ్లడ్ శాంపిళ్లను తన భార్య బ్లడ్ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగం హెడ్ డా.అజయ్ తవారే, డా.శ్రీహరి హాల్కర్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగంమొదట బాలుడి బ్లడ్ శాంపిల్ నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్ శాంపిల్‌ను అతని తల్లి శాంపిల్‌తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మకందర్.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడుమే 20న మకందర్ సాసూన్ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్ అగర్వాల్‌కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్ కాల్ వచ్చింది. తర్వాత మకందర్, డాక్టర్ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్ కాల్ చేసి.. విశాల్‌కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్ వద్ద మకందర్ ఉండటం గమనార్హం. మే19న మైనర్ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది. -
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్‌ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్‌గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్‌కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్‌తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్‌కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్‌ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్‌గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్‌పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్‌తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్‌లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్‌తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్‌కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్‌ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?
లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే డైట్లో మామిడిపండ్లు తీసుకోవడం, టీలో చక్కెర వేసుకోవడం వంటివి చేస్తున్నారని ఈడీ ఆరోపణలు చేసింది. అయితే కోర్టు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం తినడానికి అనుమతించినందున మామిడిపండ్లు, స్వీట్లతో సహా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవ్యక్తి ఇలాంటివి తింటారా అనేది ఈడీ వాదన, కానీ కేజ్రీవాల్ న్యాయవాది మాత్రం డాక్టర్ సూచించన ప్రకారమే ఇంటి నుంచి ఆహారం పంపిస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ మామిడి పండు కారణంగా డయాబెటిస్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయలు పెరుగుతాయా అంటే..? నిజానికి అరవింద్ కేజ్రీవాల్ టైప్2 డయాబెటిస్ పేషెంట్. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. ఇక్కడ ఆయన డైట్లో మామిడిపండ్లు తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? అసలు షుగర్ పేషెంట్లు తినోచ్చా అంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో మామిడి పండు ఒకటి. ఇది అధిక చక్కెర కంటెంట్ తోపాటు ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ సీ, ఫైబర్, కాపర్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే ఇందులో 90 శాతానికి పైగా కేలరీలు చక్కెర నుంచే వస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చక్కెర స్థాయిలను ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా మామిడి, అరటి పండ్లు, సపోటా, వంటివి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎల్ సుదర్మన్ రెడ్డి అన్నారు. అయితే ఇందులో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాటి మొత్తం చక్కెర ప్రభావాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. అందులో ఉండే ఫైబర్ శరీరంలోని రక్తం చక్కెరను గ్రహించే రేటుని తగ్గిస్తుంది. పైగా శరీరంలోని కార్బోహైడ్రేట్లు ప్రభావాన్ని తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ పండుని తీసుకుంటే షుగర్ పేషంట్లకు కూడా ఎలాంటి హాని ఉండదని తెలిపారు. అయితే దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందేలా షుగర్ పేషెంట్లు ఎలా తీసుకుంటే మంచిదంటే.. మామిడి పండును డయాబెటిక్ ఫ్రెండ్లీగా మార్చే మార్గాలు.. ముందుగా డైట్‌ని అరకప్పు మామిడి కప్పులతో ప్రారంభించండి ఆ రోజు అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదు. ప్రోటీన్లు తీసుకోవాలి. అందుకోసం గుడ్డు, కొన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. మామిడి పండ్లు అమితంగా ఇష్టం అనుకునేవారు ఆరోజు మంచిగా పండ్లు తింటూనే సరిపడ ప్రోటీన్ ఫైబర్ అందేలా ఫుడ్స్‌ని జోడిస్తే సరి. అప్పుడు మామిడిపండ్లు డయాబెటిస్ పేషెంట్లు తిన్నా ఏం కాదు. (చదవండి: 61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!
డైట్ల ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారపదార్థాలను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఫైబర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే..శరీరానికి ఉపయోగపడే గట్ బ్యాక్టీరియా అందిస్తుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుందని పరిశోధన పేర్కొంది. అంతేగాదు ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎలా రక్తపోటుని తగ్గిస్తాయో సవివరంగా పేర్కోంది. ఏం చెబుతోందంటే.. మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మహిళలు, పురుషులు బీపీని తగ్గించడానికి తినాల్సిన డైటరీ ఫైబర్(ఎక్కువ ఫైబర్ ఉన్నవి) కొద్ది మొత్తంలో అందించారు. ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్న వారిలో రక్తపోటు తగ్గడమే గాక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. మందులతో సంబంధంల లేకుండా బీపీ గణనీయంగా తగ్గడం గుర్తించామనని అన్నారు పరిశోధకులు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బీపీ ఎక్కువ ఉన్న మహిళలు ఉదాహరణకు 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రోజుకి సుమారు 28% పైబర్ తీసుకోవాలని సూచించింది. అదే పురుషులకైతే రోజుకి 38 గ్రాముల వరకు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రతి అదనపు 5 గ్రా సిస్టోలిక్ బీపీ 2.8 mmHgకి, డయాస్టోలిక్ బీపీ 2.1 mmHgకి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ పైబర్ కంటెంట్ ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన గట్ మైక్రోబయోమ్‌ని అందించి తద్వారా బీపీకి దోహదపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ రెగ్యులేటరీ యాసిడీలను ఉత్పత్తి చేసేలా అనుమతిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనం హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ కోసం డైటరీ ఫైబర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం గురించి హైలెట్ చేసిందని పరిశోధకుడు మార్క్స్ చెప్పారు. తాము రోగులకు ట్రీట్మెంట్లో భాగంగా అధిక ఫైబర్ ఉన్న పదార్థాలను ఇచ్చాక రక్తపోటు తగ్గి హృదయ నాళాలను మెరుగ్గా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యుల ఆహారంలో పుష్కలంగా పీచు పదార్థాలు ఉండవని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) పేర్కొంది. అలాగే పెద్దలు సగటు ఆహారంలో కనీసం 15 గ్రాముల చొప్పున ఫైబర్ తీసుకోవాలని పేర్కొంది. ఇక్కడ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి సాధారణ నియమంగా, ప్రతి భోజనంలో కనీసం ఒక తృణధాన్యాలు (ఉదా., బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, క్వినోవా, బుల్గుర్) చేర్చండి హోల్‌గ్రెయిన్ బ్రెడ్‌ను ఎంచుకోండి (ఒక స్లైస్‌లో అత్యధిక మొత్తంలో పీచు ఉంటుంది) తెల్ల బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్‌తో ఉడికించాలి సలాడ్లకు బీన్స్ జోడించండి - దీనిలో ప్రతి ½ కప్పు సర్వింగ్‌లో 7 నుంచి 8 గ్రా ఫైబర్ ఉంటుంది వారానికి రెండు లేదా మూడు సార్లు, సూప్‌లు, కూరలు వంటి వాటిలో మాంసానికి బదులుగా చిక్కుళ్ళు (ఉదా., పప్పులు, బఠానీలు, బీన్స్, చిక్పీస్, వేరుశెనగలు) వేయండి. రోజుకు కనీసం ఐదు పండ్లు లేదా కూరగాయలను తినే యత్నం చేయండి తృణధాన్యాలకు పండ్లను జోడించడం మరింత మంచిది. పండ్ల రసాల కంటే పండు పలంగా తినడానికే ప్రయత్నించండి. ఇలా చేస్తే శరీరానికి అవసరమయ్య ఫైబర్ అంది రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది లేదా మందుల అవసరం లేకుండానే రక్తపోటు తగ్గిపోవడం జరుగుతుంది. (చదవండి: పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..) -
జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన జైలులో ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు ‘ఎక్స్ ’వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. అయితే ఆయనకు ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ దేశం కోసం 24 గంటలు పని చేసేవారిని ఆతీసీ అన్నారు. కానీ తీహార్ జైలు అధికారులు ఆ ఆరోపణలన్నింటిని కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, షుగర్ లెవెల్స్ కూడా తగ్గలేదని పేర్కొనడం గమనార్హం. అయితే ఇక్కడ మధుమేహ వ్యాధితో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులు బరువు మీద ప్రభావం చూపిస్తాయా? అలాంటప్పుడు ఏం చేయాలి? తదితరాల విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం!. ఇన్సులిన్ నిర్వహణ: ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు..వారి శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయదు. పైగా ప్రతిస్పందించదు. దీని వల్లే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఎప్పుడైతే శరీరం ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించలేకపోతుందో అప్పుడు రక్తప్రవాహంలో చక్కెర ప్రసరణకు దారితీస్తుంది. ఫలితంగా అదికాస్త కొవ్వుగా పేరుకుపోయి అధిక బరువుకి దారితీస్తుంది. కొందరూ బరువు ఎలా తగ్గిపోతారు.. రక్తంలోని చక్కెర స్థాయిలు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే శరీరం ముఖ్యమైన శక్తి వనరులను కోల్పోతుంది. శక్తి కోసం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగిచదు. దీంతో శక్తికోసం శరీరం ఉన్న కొవ్వు నిల్వలను, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంద. దీంతో బరువు తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 1తో బాధపడేవారిలో ఈ పరిస్థితి ఎదురవ్వుతుంది. ద్రవాలను కోల్పోతుంది.. రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు డీ హైడ్రేషన్, నీటి నిలుపదలకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కారణంగా మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ వెళ్లపోతుండటంతో నిర్జలీకరణ దారితీసి, శరీర బరవును తాత్కలికంగా పెంచే రీహైడ్రేషన్కి గురై బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీవక్రియ ప్రభావం దీర్థకాలికి వ్యాధి అయిన బ్లడ్ షుగర్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇక్కడ కణాలలోకి గ్లూకోజ్ పొందాలంటే శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ఈ అదనపు ఇన్సులిన్ కొవ్వు నిల్వకు దారితీస్తుంది. ముఖ్యంగా పొత్తి కడుపు ప్రాంతంలో బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకుంటే..? బరువు నిర్వహణకు ఇది అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ఈ వ్యాధిగ్రస్తులు సరైన మందులు వాడుతూ..ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలాగే శారీర శ్రమ, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా పర్యవేక్షించడం వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతాం. బరువు కూడా అదుపులో ఉంటుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. వ్యక్తిగత నిపుణులు, వైద్యులు సలహాలు సూచనలతో మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తల తీసుకుని ఆచరిస్తే మంచిది అనేది తెలసుకోవడం ఉత్తమం. (చదవండి: మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్) -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్‌వెజ్‌గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్‌వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి చికెన్ లేదా మటన్‌ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్‌వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్‌వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్‌లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్‌గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్‌వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్‌ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!
మనం పాములను దేవతగా పూజిస్తాం. చంపేందుకు కూడా వెనకడతాం. ఎంతో పరిస్థితి సివియర్‌గా ఉంటేనే గానీ వాటి జోలికి వెళ్లం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ, కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకుని ఇలా తాగుతారో వింటే గుండెఝల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యంచుకుంటారో కూడా. ఇంతకి ఎక్కడ ఇలా చేస్తారు? దేని కోసం అంటే. విష సర్పాన్ని చూసి అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు. వాటి రక్తం తాగితే శరీరాన్ని ఫిట్‌గా అందంగా ఉంటుందని వారు ప్రగాఢం నమ్ముతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఓ రేంజ్లో ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం విశేషం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తాన్ని తప్పక తాగుతారట. అంతేకాదు జకర్తాలో ఈ పాము రక్తానికి మంచి డిమాండ్, ట్రెండ్ కూడా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగ గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్‌లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతామో అలా అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు. ఎందుకు తాగుతున్నారంటే.. ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి స్త్రీలు తమ అందం పెంచుకునేందుకు తప్పనిసరిగా ఈ పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట. ఆరోగ్యం బాగుంటుందట. ఇలా పాము రక్తం తాగే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఇండోనేషియన్ వాసులకు అనాదిగా వస్తుందట. అయితే వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమే కాదు వాటిని ఆహారంగా తింటారట కూడా. వాటిని చక్కగా నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ తింటారట. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!) -
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చికిత్స చేస్తారట. దీన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాప్మా థెరపీ అని అంటారు. ఈ కొత్త చికిత్స విధానాన్ని హార్వర్ మెడికల్ వైద్య బృందం అభివృద్ధి చేసింది. దీని వల్ల బట్టతల, ఆడవాళ్ల జుట్టు రాలు సమస్యను తగ్గించొచ్చిన చెబుతున్నారు. ఇక్కడ వైద్యులు బాధితుల సొంత రక్తంతోనే వారి హెయిర్ గ్రోత్‌ని డెవలప్ అయ్యేలా చేస్తారు. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి!. ఎందుకంటే మన రక్తంలోని ప్లాస్మాలో పుష్కలంగా ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి హెయిర్‌ని పెరిగేలా చేయగలవట. అందుకని రోగి నుంచి తీసుకున్న రక్తంలోని ప్లాస్మాని తీసుకుని దానిని తలలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయగానే ఆ ప్రదేశంలోని చర్మం ఆకృతి మెరుగపడి తిరిగి జుట్టు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. చెప్పాలంటే ఈ చికిత్స హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వివిధ చికిత్సల కంటే సురక్షితమైనది, సమర్థవంతమైనది. ఈ చికిత్స విధానం గురించి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ప్రచురితమయ్యింది. ఈ థెరఫీని జుట్టు రాలు సమస్యలను, బట్టతల సమస్యను నివారిస్తుందని అన్నారు. ఈ చికిత్స విధానంలో ప్లాస్మాలోని ప్లేట్లెట్స్ ఇంజెక్షన్ రూపంలో తలపై ఇవ్వడంతో వెంట్రుకల కుదుళ్ల దగ్గర జుట్టు పెరిగేలా వృద్ధికారకాలను ఉత్ఫన్నం చేస్తాయి. తద్వారా వంశపారంపర్యంగా వచ్చే ఆండ్రోజెనెటిక్ అలోపేసియా లేదా బట్టతల, ఆడవారిలో వచ్చే జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. జుట్టు బాగా కురుల్లా ఉండాలనుకునేవారు ఈ థెరపీని సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లు చేయించుకోవచ్చట. అలాగే రోగి రక్తాన్ని సేకరించేటప్పుడూ గడ్డకట్టకుండా, ప్లేట్లెట్స్ యాక్టివ్‌గా ఉండేలా ప్రత్యేకమైన ట్యూబలో సేకరిస్తారు. ఆ తర్వాత ఎర్ర రక్త కణాలను వేరు చేసి ప్లేట్లెట్లను మాత్రమే తీసుకునేలా మొత్తం రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఇలా వేరు చేసిన ప్లేట్లెట్లను సిరంజి ద్వారా నెత్తిపై చర్మానికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల్లో గ్రోత్ మొదలవుతుంది. ఎవరెవరూ చేయించుకోవచ్చంటే.. ఈ ప్లాస్మా థెరపీ ఆరోగ్యవంతమైన పెద్దలకు చెయ్యొచ్చు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు సిఫార్సు చెయ్యరు. అలాగే రక్తస్రావం, ప్లేట్లెట్ పనిచేయకపోవడం లేదా ప్లేట్లెట్ సమస్య ఉన్నా, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా ఈ ప్లాస్మా థెరపీని సిఫార్సు చెయ్యరు వైద్యులు. దీన్ని ఇంజెక్ట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ప్రీ హెచ్ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్-అప్ తదితరాలను చెక్ చేసి గానీ రక్తాన్ని సేకరించారు సురక్షితమా..? ఈ చికిత్స చాలా సురక్షితమైనదని వైద్యులు ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రోగులు సొంత రక్తంతోనే ఈ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఈ ప్రక్రియ సమయంలో వైద్యులు సరైన స్టెరిలైజేషన్ నిర్వహించకపోతే మాత్రం రోగికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది. తలపైన ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం కాబట్టి ఆ ప్రాంతమంతా కాస్త నొప్పిగా కూడా ఉండొచ్చు, గానీ అది ఒక్కరోజులోనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలని సూచించారు. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
షేవింగే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది, నెల రోజులు కోమాలో!
ఇన్ గ్రోయిన్ హెయిర్ అమెరికాలో ఒక వ్యక్తిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ సెప్పిస్ బారిన పడ్డాడు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. బతికే అవకాశం చాలా తక్కువని చెప్పారు.చివరికి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. కానీ అనూహ్యంగా.. కోలుకోవడం విశేషంగా నిలిచింది.. వివరాలు ఇలా ఉన్నాయి న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అమెరికాటెక్సాస్ రాష్ట్రానికి చెందిన36 ఏళ్ల స్టీవెన్ స్పైనాల్ గజ్జల వద్ద ఉన్న ఇన్గ్రోన్ హెయిర్‌ను తొలగించుకున్నాడు. దీనికి ఇన్ఫెక్షన్ సెప్సిస్ సోకి చివరికి సెప్సిస్షాక్కు దారి తీసింది. రక్తం గడ్డకట్టడం, డబుల్ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కి దారితీసింది. ఇన్ఫెక్షన్ అతని గుండెకు కూడా చేరింది. దీంతొ కోమాలోకి వెళ్లి పోయాడు. ఇక కష్టం అని ప్రకటించిన వైద్యులు చివరి ఆశగా వెంటిలేటర్‌పై ఉంచి దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ చికిత్సకు స్పందించిన స్టీవెన్ కొద్దిగా కోలుకున్నాడు. మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని సోదరి మిచెల్ పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో సమాచారం ప్రకారం 2022 ఏడాది చివరల్లో అనారోగ్యానికి గురైన స్టీవెన్ 2023 చివరినాటికి కొద్దిగా బలం పుంజు కున్నాడంటూ స్టీవెన్ రికవరీ జర్నీనీ షేర్ చేసింది. ఇందు కోసం 8వేల డాలర్లు ఖర్చు అయినట్టు తెలిపింది. గోఫండ్‌మీ ద్వారా విరాళాలకోసం అభ్యర్థించింది. (ఇన్ గ్రోయిన్ హెయిర్: పురుషులు ఛాతీ, చంకలు, వీపు, గజ్జలు తదితర ప్రదేశాల్లో ముఖ్యంగా వ్యతిరేకదిశలో(ఎదురు) షేవ్ చేసుకున్నా, కట్ అయినా వెంట్రుకల కుదుళ్ల వద్ద ఎరుపు దురద గడ్డలు వస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. అలాగే వీటిమీద రాంగ్ డైరెక్షన్లో వెంట్రుకలొస్తాయి. దీనికి సాధారణంగా వైద్య చికిత్స అవసరం లేదు. వాటికవే తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ షేవింగ్ జెల్ లేదా క్రీమ్ లాంటివి వాడతారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ప్రమాదం. నిర్లక్ష్యం చేస్తే సెప్సిస్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. దీన్నే " సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. మహిళలల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంచనా ప్రకారం ప్రతీ ఏడాది 1.7 మిలియన్ల అమెరికన్లు సెప్సిస్ బారిన పడుతున్నారు. ఏటా దాదాపు 270,000 మంది మరణిస్తున్నారు.) -
Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..!
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన బ్రెయిన్లో రక్త స్రావం జరగడంతో అపోలో హాస్పిటల్లో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఇలా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది? దేనివల్ల అనే విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. నిజానికి ఇక్కడ సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అంత నొప్పి ఉన్నప్పటికీ రోజువారీ షెడ్యూల్ ప్రకారం తన సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. ఓ పక్క బ్రెయిన్ లో రక్త స్రావం జరుగుతున్నా.. ఈ నెల 8వ తేదీ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడూ ఆయనకు ఇలా జరగడం అందర్నీ తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంటే ఇక్కడ సద్గురు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారనే విషయాన్ని గమనించాలి. నిజానికి ఇలా మెదడులో రక్తస్రావం అవ్వడానికి ముందు సంకేతమే తీవ్రమైన తలనొప్పి అనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టైంలోనే వైద్యులను సంప్రదిస్తే మెదడులో బ్లీడింగ్ జరగకుండా కొంత నిరోధించగలమని చెబుతున్నారు. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుందంటే..? బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే ఇది. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.. ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇక్కడ సద్గురు నాలుగువారాలుగుఆ తీవ్రమైన తలనొప్పిని ఫేస్ చేశారు. అయినప్పటికీ సామాజికి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో సమస్య తీవ్రమయ్యిందని చెప్పొచ్చు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఎందుకు వస్తుందంటే.. అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. అయితే జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి కూడా స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ బ్రెయిన్స్ట్రోక్కి సంబంధించిన లక్షణాలను ఒక నెల ముందు నుంచి కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముందుగా పసిగడితే ప్రాణాపాయం నుంచి బయటపడగలమని అంటున్నారు నిపుణులు. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!)