బంగారం, వెండీ, ప్లాటినం వంటి వాటిని కాలదన్నే విచిత్ర ఆభరణాలు రాబోతున్నాయి. మనం ఇంతవరకు తల్లిపాలతో చేసిన ఆభరణాలు గురించి విన్నాం. తల్లిపాలతో ఆభరణాలేంటి అనికొందరూ విమర్మించిన ఇందులో ఎలాంటి తప్పులేదని తయారుచేసి చూపించింది లండన్‌కి చెందిన జంట. ఐతే ఇప్పుడూ ఒక అడుగు ముందుకేసి మానవుని రక్తంతో తయారు చేసే ఆభరణాలు రూపొందిస్తున్నారు ప్రీతీ మాగో అనే మహిళ. పైగా ఇది మన ప్రియమైన వారి జ్ఞాపకంగా మన వద్ద ఉంటుందంటున్నారు.
ప్రీతీ మాగో కంటి ఆస్ప్రతిలో ఆప్టోమెట్రిస్ట్‌గా పనిచేసేవారు. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఉద్యోగాన్ని వదిలేయవలసి వచ్చింది. అదీగాక బిడ్డ సంరక్షణ నిమిత్తం ఆమె ఉద్యోగానికే వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఆర్థిక స్వాతంత్య్రం కూడా కోల్పోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న ఆమెకు తల్లిపాలతో జ్యూవెలరీ తయారు చేయడం గురించి సోషల్ మాధ్యమాల ద్వారా తెలుసుకుంది. దీంతో ఆమె ఆ దిశగా తన గమ్యాన్ని మార్చుకుంది. తన భర్త సాయంతో యూఎస్‌లో వివిధ జ్యూవెలరీ కోర్సులను నేర్చకుంది. తల్లిపాలతో చేసే ఆభరణాల దగ్గర నుంచి బొడ్డుతాడు, వెంట్రుకలు, దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు ఆమె.
ఇంతవరకు చాలామంది పలు రకాలైన ఆభరణాలను తయారు చేశారు గానీ రక్తంతో తయారు చేసే ఆభరణాలనేది అనేది అరుదైన కాన్సెప్ట్ అని, ఇంతవరుకు ఎవరూ ఇలాంటి ఆభరణాలు తయారు చేయలేదని చెబుతున్నారు ప్రీతీ. ఆమె మొదట్లో ఎన్నో వైఫల్యాలు చవిచూసిన అనంతరం 2019లో తన వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రీతీ తెలిపారు. మనకు ఇష్టమైన వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోయినప్పుడూ... వారి గుర్తుగా వారి శరీరం నుంచి సేకరించిన రక్తంతో అందమైన లాకెట్లుగా రూపొందిస్తారు. స్వర్గంలో ఉన్న మన ప్రియమైన ఆప్తులు గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు. తాను డీఎన్‌ఏ కలిగిన మెటీరియల్‌ని ఉపయోగించి ఈ ఆభరణాలను రూపొందించనట్లు ప్రీతీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment