Human
-
అంగారకుడిపై నిర్మాణాలకు నీటి రహిత కాంక్రీట్
చెన్నై: ఇతర గ్రహాలపై సమీప భవిష్యత్తులో మానవ ఆవాసాలు నిర్మించడం సాధ్యమేనని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి ఆవల గ్రహాలపై ఆవాసాలు నిర్మించుకొనే దిశగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయా గ్రహాలపై లభించే వనరులతోనే ఇళ్లు రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాసుకు చెందిన ఎక్స్ట్రాటెరెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్(ఎక్స్‌టెమ్) గణనీయమై పురోగతి సాధించింది. నీటితో సంబంధం లేని కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. అంగారక(మార్స్) గ్రహంపై ఇళ్ల నిర్మాణానికి ఈ కాంక్రీట్ చక్కగా సరిపోతుందని చెబుతున్నారు. సల్ఫర్ మిశ్రమంతో కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఎక్స్‌టెమ్ బృందం వెల్ల్లడించింది. అంగారకుడిపై సల్ఫర్ సమృద్ధిగా ఉంది. అక్కడ ఇప్పటివరకైతే నీటి జాడ కనిపెట్టలేదు. ఇదిలా ఉండగా, ఎలాంటి వాతావరణం లేని శూన్య స్థితిలో నిర్మాణాలపై ఎక్స్‌టెమ్ బృందం పరిశోధనలు చేస్తోంది. మైక్రోగ్రావిటీ డ్రాప్టవర్ను రూపొందించింది. జీరో గ్రావిటీలో వస్తువుల లక్షణాలపై దీనిద్వారా అధ్యయనం చేయొచ్చు. భూమిపై నుంచి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇతర గ్రహాలపై ఉన్న వస్తువులు, వసతులతోనే వ్యోమగాములు అక్కడ మనుగడ సాగించేలా చేయాలన్నదే తమ ఆశయమని ఎక్స్‌టెమ్ ప్రతినిధి ప్రొఫెసర్ సత్యన్ సుబ్బయ్య చెప్పారు. -
అక్కరలేని మనిషి
ఆడవాళ్ళు ఆయన్ని ‘బాబాయిగారు’ అని పిలుస్తారు. మగవాళ్ళలో కొందరు ‘రెడ్డిగారు’ అని పిలిస్తే, మరికొందరు రావుగారు అని, ఇంకొందరు మూర్తిగారు అని పిలుస్తారు. కుర్రాళ్లు ‘అంకుల్’ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా, ఆయన అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ, వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోతాడు .ఆయన అసలు పేరు ఎవరికీ తెలియక పోయినా, ఆయన మొబైల్ నెంబరు మాత్రం ఆ అపార్టుమెంటు వాసులందరికీ సుపరిచితమే!ఆ ఒక్క అపార్టుమెంటే కాదు, అక్కడ ఉన్న నాలుగైదు అపార్టుమెంట్లలో కరెంటు రిపేర్లు, నీళ్ళ ట్యాపులు, సెప్టిక్ టాంకులు, బాత్రూమ్ కమోడ్లు, చెక్క పనులు– ఇలా ఒకటేమిటి, సమస్త రిపేర్లకు ఎవరైనా సరే పిలిచేది ఆయన్నే! ఇంత పెద్ద నగరంలో ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరా అని మీకు అనుమానం రావచ్చు. రిపేర్లు ఎవరైనా చేస్తారు. కాని, అడిగిన వెంటనే రావటం; సకాలంలో పని పూర్తి చెయ్యటం; డబ్బులు డిమాండు చెయ్యకుండా ఎవరు ఎంతిచ్చినా చిరునవ్వుతో ‘పర్లేదులెండి’ అంటూ తీసుకోవటం వల్ల అందరూ వాళ్ళ ఇళ్ళలో ఏ రిపేరు పని వచ్చినా ఆయన్నే పిలుస్తారు.కొంతమంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని, పని చేయించుకుని కూడా డబ్బులిచ్చే వాళ్ళు కాదు. ఆయన కూడా, ‘అలాగేనండి, మీ దగ్గర డబ్బులెక్కడికి పోతాయి’ అంటూ నవ్వేసి వెళ్ళిపోయేవాడు .‘అదేమిటండీ వాళ్ళు అలా మీ చేత పని చేయించుకుని, డబ్బులు తరువాత ఇస్తామంటే ఊరుకుంటారు’ అని అడిగితే, ‘ఏమోలే సార్! వాళ్ళకే ఇబ్బంది వుందో! వాళ్ళకు వీలైనప్పుడు ఇస్తారు లెండి’ అనేవాడు. నాకు మాత్రం ఇతరుల కష్టం ఉంచుకోవటం ఇష్టం వుండదు. ఏ చిన్న పని చేసినా, మా ఇంట్లో ఆయన అడక్క ముందే డబ్బులిచ్చేసేవాడిని. ఆయనే , ‘ఎందుకు సార్, నేనేం పెద్ద పని చేశానని ఇంత పెద్దమొత్తం ఇచ్చారు’ అంటూ తిరిగి ఇవ్వబోయే వాడు. ఆయన మంచితనాన్ని నేనేనాడూ అలుసుగా తీసుకోలేదు. ఆయనంటే నాకు మా ఇంట్లో మనిషి అనే భావన వుండేది. మా నాన్నది ఆయనది ఒకటే వయసు. నాన్న లేకపోవటం వల్ల అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్లే వుండేది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన హాజరు తప్పనిసరి. భోజనానికి రమ్మని, వాళ్ళ ఆవిడని కూడా తీసుకు రమ్మని మా ఆవిడ మరీ మరీ చెప్పేది. కాని ఆయన మాత్రం ఒక్కడే, సిగ్గుపడుతూ వచ్చేవాడు, ఆ రోజు మా ఇంట్లో ట్యాపు రిపేరు చేసి వెళ్తు వెళ్తూ, ‘సార్, ఓ సెకండ్ హ్యాండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు చౌకగా అమ్మకానికి వచ్చింది’ అన్నాడు.‘మరింకేం బాబాయిగారు, తీసుకోక పోయారా?’ మా ఆవిడ ప్రోత్సహించింది.‘అదేనమ్మా! తీసుకుందామనే వుంది. కాకపోతే, ఓ యాభైవేలు తగ్గాయి’ నసుగుతూ నావంక చూశాడు.‘యాభై వేలే కదండి, సర్దుతాలెండి’ పెద్దాయనకు భరోసా ఇచ్చాను. ‘సంతోషం సార్! మీ బాకీ చిన్నగా తీర్చుకుంటాను, వుంటాను‘ అంటూ నిష్క్రమించాడు.‘ఆయన గుమ్మం దాటి వెళ్ళాడని నిర్ధారించుకుని, ‘ఏమిటి, నన్నడగకుండా అలా మాట ఇచ్చేయటమేనా?’ మా ఆవిడ నిలదీసింది. ‘నువ్వే కదోయ్, బాబాయిగారు! తీసుకోండి అన్నావు. నీకు ఇష్టమేనని మాట ఇచ్చాను’ చిన్నగా గొణిగాను. ‘ఎదో మాటవరసకు అంటాము. అన్నంత మాత్రాన ఉళ్ళోవాళ్ళకి ఊరికినే డబ్బులిచ్చేస్తామా, ఏమిటి?’ అంది మా ఆవిడ.‘ఆయన మనకు ఎప్పటినుండో తెలుసు. ఆయన్ని చూస్తే మా నాన్నను చూసినట్టే వుంటుంది. మా నాన్నకు సాయం చేశాను అనుకో’ అన్నాను. ఆ మాటలతో, ఆవిడ చల్లబడింది. ‘ఔను, మనల్ని ఉబ్బులడుగుతున్నాడు, ఆయనకు పిల్లలు లేరా?’ అనుమానంగా అడిగింది. ‘లేకేం, వున్నాడులే ఓ సుపుత్రుడు. హైదరాబాద్‌లో ఏదో పని చేస్తుంటాడు. వాడికే ఈయన నెలనెలా ఉబ్బులు పంపిస్తుంటాడు. ఇంక వాడేం సాయం చేస్తాడు?’ తేల్చి పారేశాను‘పెళ్ళయిందా?’‘ఆ అవ్వకేం, అయ్యింది. ఒక పిల్లాడు కూడా. వాడే సరిగ్గా వుంటే, ఆయనకు ఈ తిప్పలెందుకు చెప్పు?’ శ్రీమతికి అంతా వివరంగా చెప్పిన తరువాత ఇంక ఆవిడ మౌనంగావుండిపోయింది.‘అంతా కలిపి ఒకేసారి ఇస్తాం లెండి‘ ఎదురింటి ఆవిడ ఏమి రిపేరు చేయించుకుందో ఏమో, ఆయనతో అంటూ వుంటే, వరండాలో కూర్చున్న నా చెవిన బడింది ‘లేదమ్మా, కాస్త అవసరం పడింది. ఈమధ్యే ఓ ఇల్లు కొనుక్కున్నాను. అప్పలున్నాయి, తీర్చాలి’ ఆయన మాటలు ఆవిడకే కాదు, నాకు ఆశ్చర్యం అనిపించినా, నా అప్పు తీరబోతుందని సంతోషం వేసింది. ‘అదేమిటండీ. మేమిచ్చే పది, ఇరవైతోనే మీ అప్పులన్నీ తీరతాయా?’ నిష్ఠూరంగా అందావిడ. ‘లేదండి, పాతబాకీ, ఇప్పటిదీ అన్నీ కలిపి రెండువేల దాకా అయ్యిందండీ మీ బిల్లు’ చెప్పాడు పెద్దాయన.‘రెండువేలా? అంత ఎందుకు అవుతుందండి?’ అంటూ రుసరుస లాడింది.‘లేదమ్మా, ఇదిగో మీకు ఏమేం పనులు చేశానో, వాటికి సామాన్లు ఎంతయ్యాయో అన్నీ వివరంగా రాశాను’ అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఆవిడకిచ్చాడు పెద్దాయన.ఓ క్షణం ఆ కాగితం వంక ఎగాదిగా చూసి, ‘ఇవన్నీ మేము చేయించుకున్నామా?’ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘అవునమ్మా! మీరు చేయించుకున్నవే! పక్కన తారీఖులు కూడా వేశాను’ అన్నాడు పెద్దాయన.ఇక తప్పదన్నట్టు, ‘సరేనండి, ఇంట్లో మావారు లేరు. సాయంత్రం రండి’ అంటూ తలుపేసుకుంది.ఇక చేసేదేమీలేక పెద్దాయన చిన్నగా నిట్టూరుస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడని నిర్ధారించుకుని, బయటకొచ్చి, ఒకసారి అటూ ఇటూ చూసి పక్కింటివాళ్ళ తలుపు కొట్టింది. పక్కింట్లో నుంచి బయటకొచ్చిన మరో పెద్దావిడతో ‘చూశారా పిన్నిగారు! ఆయనేదో మంచివాడు అనుకున్నామా’ అంటూ ఆగింది. ‘ఇప్పుడేమైంది’ అన్నట్టు ఆవిడ మొహం పెట్టింది.‘మనకేదో ఉచితంగా సాయం చేస్తున్నాడనుకున్నాం కాని, ఈరోజు రెండువేలు బిల్లంటూ పట్టుకొచ్చాడు’ అంది కాస్త నీరసంగా. ‘అవునమ్మ, మాకూ వేశాడు, ఎప్పుడో మా తాతలకాలం నుండి రిపేర్లు చేస్తున్నాడట! మూడువేలు అంటూ వసూలు చేసుకెళ్ళాడు’ అంది పక్కింటి పెద్దావిడ మరింత నీరసంగా.ఇద్ద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే, అది ప్రపంచం మొత్తం పాకిపోతుంది అన్నట్టు ఆ వార్త ఆగమేఘాల్లో అపార్టుమెంటు మొత్తం పాకిపోయింది. ప్రతి ఒక్కళ్ళూ ఆయన్ని తిట్టు కోవటమే! దాదాపు ఓ యాభై ఇళ్ళవాళ్లైనా పెద్దాయనకు బాకీ వుండి వుంటారు. ఇంటికి రెండువేలు వేసుకున్నా, లక్ష అవుతుంది. అంటే నా బాకీ త్వరగా తీరబోతుంది అని ఆనందంగా వున్నా, అందరూ ఆయన్ని తిట్టుకోవటం కాస్త బాధ అనిపించింది. ఈ మనుషుల మనస్తత్వమే అంత. ఉచితంగా సేవలు చేస్తే రాముడు, దేవుడు అంటూ పొగుడుతారు. అదే చేసిన పనికి డబ్బు అడిగితే రాక్షసుడిలా చూస్తారు. ఆరోజు నుంచి అపార్టుమెంట్‌లోని వాళ్ళు తమ పనులకు ఆయన్ని పిలవటం తగ్గించారు. అసలు నన్నడిగితే తప్పు వాళ్ళది కాదు, పెద్దాయనదే! పని చేసినప్పుడు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకునుంటే ఎవ్వరికీ ఏ బాధ వుండేది కాదు. అంతా కలిపి ఒక్కసారి కట్టమని అడిగితే, ఇప్పుడు అందరూ ఆయన్ని ఓ అప్పులోడి కింద చూస్తున్నారు. బహశా అసలు డబ్బులు అడగడులే అనుకున్నారో ఏమో!ఎవరిదో అన్నోన్ నంబరు అదే పనిగా రింగ్ అవుతుంది. ఎవరై వుంటారబ్బా అని అనుకుంటూ ఎత్తాను.‘సార్ శ్రీనివాసరావుగారేనా? ‘అవతలి నుంచి ఎవరో ఆడగొంతు.‘అవునండి!’ సమాధానం ఇచ్చాను. ‘ఉదయ్ హాస్పిటల్స్ నుంచండి, మీ బంధువు ఒకాయన రాత్రి గుండెనొప్పితో హాస్పిటల్లో చేరారు. ఎవరన్నా వున్నారా అని అడిగితే మీ నంబరు ఇచ్చారు’ చెప్పుకు పోతోంది ‘నా బంధువా? గుండెనొప్పితో హాస్పిటల్లో చేరాడా? ఎవరై వుంటారు?’ అప్పటి దాకా ప్రశాంతంగా వున్న నా మనసులో ఆందోళన మొదలైంది.వెంటనే బయలుదేరి, పది నిమిషాల్లో ఉదయ్ హాస్పటల్ రిసెప్షన్ కౌంటర్ ముందు వాలాను. వాళ్ళను అడిగితే, ‘పేషంట్ పేరేమిటండి?’ అనడిగింది రిసెప్షనిస్టు. నిజమే! పేషంట్ పేరేమిటి? గాభరాలో అడగటం మర్చిపోయాను.‘తెలియదండి, మీ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది’ సమాధానం ఇచ్చాను. నా సమాధానానికి నా వంక విచిత్రంగా చూస్తూ, రిజిస్టరులో వెతకటం ప్రారంభించింది. ఓ రెండు నిమిషాల తరువాత, ‘ఐసీయూలో వున్నారు వెళ్ళండి’ అంది. ఆ జవాబు విన్న నేను ‘ఐసీయూలోనా!’ మనసులో మరింత ఆందోళనతో ఐíసీయూ వైపు నడిచాను. అప్పుడు కూడా పేషంట్ పేరు అడగటం మర్చిపోయాను.ఐసీయూ లోపలకు వెళ్ళి అడిగితే, వాళ్ళు కూడా పేషంట్ పేరేమిటి అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక, ‘రాత్రి చేరారు’ అన్నాను. ఎదురుగా వున్న బెడ్ వంక చూపించింది అక్కడ వున్న నర్సు. కర్టెన్ వేసి వుండటంతో పేషంటు కనపడట్లేదు నాకు. మెల్లిగా రెండడుగులు వేసి, కర్టెన్ పక్కకు తోసి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా పెద్దాయన, బెడ్ మీద, ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వుంది, ఛాతీ నిండా ఈసీజీ వైర్లు బిగించి వున్నాయి. పక్కన ఈసీజీ మెషిన్ బీప్.. బీప్.. అంటోంది. బహుశా, నిద్రపోతున్నాడు అనుకుంటా కళ్ళు మూసి వున్నాయి. దగ్గరకు వెళ్ళి నిలబడ్డా, అలికిడికి కళ్ళు తెరిచాడు పెద్దాయన. ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాని, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ వుండటం వల్ల సాధ్యం కాలేదు. కాని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళు మాత్రం మాట్లాడతున్నాయి.‘ఉళ్ళో అందరికీ సహాయం చేసే నాకెందుకు ఇలా అయ్యింది’ అని అడుగుతున్నట్టు వున్నాయి పెద్దాయన చూపులు. ఇంతలో ఒక పెద్దావిడ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసింది, నావంక చూస్తూ. బహుశా, ఆయన భార్య అనుకుంటా! ‘బాబుగారు! రాత్రి గుండెల్లో బాగా నొప్పిగా వుంది అంటే, వెంటనే హాస్పిటల్లో చేర్చాను. ఆ వెంటనే మీకు కబురు పెట్టమంటే పెట్టాను’ అంది గద్గద స్వరంతో ‘డాక్టర్లు ఏమన్నారు?’ అడగలేక అడిగాను.‘స్టెంట్ వెయ్యాలి, ఓ లక్షదాకా అవుతుంది అన్నారు’ సమాధానమిచ్చింది ‘మీ అబ్బాయికి కబురు పెట్టారా?’ ఓ క్షణం మౌనంగా వుండి పోయిందావిడ.‘ఏమ్మా, మీ అబ్బాయికి ..’ మాట పూర్తయ్యే లోపు ‘చెప్పాను బాబు, నే వచ్చి చేసేదేముంది అన్నాడు’ తలదించుకుని జవాబిచ్చింది.బహుశా ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా అని సిగ్గుపడుతోంది కాబోలు. ఆవిడ చెప్పిన జవాబుకి నా మనసంతా ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టు అనిపించింది.ఇంతలో పెద్దాయన మెల్లగా నా చెయ్యి మీద చెయ్యి వేసి, నా వంకే చూడటం మొదలు పెట్టాడు. ఆ చూపులలో భావం నాకు అర్థమయ్యింది.‘ఫరవాలేదమ్మా, అధైర్యపడకండి. నేను డాక్టరుతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను’ అన్నాను.నా మాటలకు ఇద్దరి కళ్ళల్లో మెరుపులు మెరవటం స్పష్టంగా చూశాను. ‘అంతదాకా ఇది వుంచండి’ అంటూ, నా పర్సు తీసి రెండువేలు ఆవిడకిచ్చాను. ఆవిడ వాటిని అందుకుంటూ, నాకు నమస్కారం చేసింది కృతజ్ఞతతో. ‘మరి నేను వెళ్ళి వస్తాను, భయపడకండి. సాయంత్రం మళ్లీ వస్తాను’ అంటూ అక్కడి నుంచి బయట పడ్డాను. ‘లక్ష రూపాయలా, మొన్నే కదండీ యాభైవేలు ఇచ్చారు. అవే ఇంకా తీర్చలేదు. ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా? పోనీ ఏమన్నా దూరపు బంధువా?’ అంది కాస్త చిరాగ్గా మా ఆవిడ. నేను మాట ఇచ్చి తప్పు చేశాను అన్నట్లు నావంక చూసింది. ‘ఆయన మనకు చేస్తున్న సహాయం ముందు ఇదెంత చెప్పు?’ అన్నాను కాస్త శాంతపరుస్తూ.‘మనకొక్కళ్ళకేనా? ఊళ్ళో అందరికీ చేస్తున్నాడు. అయినా ఎప్పటికప్పుడు డబ్బులిచ్చేçస్తూనే ఉన్నాముగా’అంది లెక్క లేస్తూ. ‘ఇచ్చామనుకో, మనిషిని అలా చూస్తూ చూస్తూ వదిలెయ్య లేక’.. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అని మనసులో అనుకుంటూ గొణిగాను ‘అసలు కొడుక్కే పట్టనప్పుడు మనకెందుకండీ?’మా ఆవిడ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థంకాక మౌనంగా వుండిపోయాను. ఓ నిమిషం తరువాత, మా ఆవిడే, ‘పోనీ అపార్ట్ట్మెంట్లో వాళ్ళందరినీ తలా కొంత సాయం చెయ్యమని అడుగుదాము’ అని సలహా ఇచ్చింది. ఆ సలహా ఏదో బాగుందనిపించి, వెంటనే అపార్ట్మెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వెంటనే ఆయన అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసి, విషయం అందరి ముందు వుంచాడు.‘దీనికా మీరు అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసింది? నేను ఇంకా ఏదో అనుకున్నా’ వాళ్ళలో ఓ వ్యాపారస్థుడు వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు.‘మేం ఇవ్వాల్సింది ఇచ్చేశాం. ఇంకేమీ బాకీలేదు’ ఎదురింటాయన కుండ బద్దలు కొట్టాడు.‘అపార్ట్మెంటు సర్వీసు చార్జీలే కట్టటం కష్టంగా వుంది. ఇంకా దానాలు, ధర్మాలు ఎక్కడ చేస్తాం’ అంటూ పక్కింటాయన లేచి వెళ్ళి పోయాడు.‘డబ్బులు లేనప్పుడు, ప్రైవేటు హాస్పిటల్లో చేరటం దేనికి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే సరిపోయేది కదా, ఆరోగ్యశ్రీ కుడా వస్తుంది’ ఓ ఉచిత సలహా పడేశాడు ఆఫీసర్ కేడర్‌లో పనిచేసే ఒకాయన.‘మెన్ననేగా ఇల్లు కొన్నాడు. అది తాకట్టు పెట్టుకుంటే సరి, ఇలా మనల్ని దేబిరించటం ఎందుకు’ మరో రిటైర్డ్ ఆఫీసర్.ఇలా తలా ఒక మాట విసిరి అక్కడి నుంచి అందరూ నిష్క్రమించారు. ఇంతకాలం పెద్దాయన చేత సేవలు చేయించుకున్న వీళ్ళకు ఇప్పుడు ఆయన అక్కరలేని మనిషి అయ్యాడు. ఏ మనిషైనా అంతే అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరగానే అక్కరలేని మనుషులుగా మారిపోతారు. వాళ్ళ మాటలు, ప్రవర్తనతో నాకు మనుషులంటేనే అసహ్యం వేసింది. తోటి మనిషి ఆపదలో వుంటే సాయం చెయ్యకపోగా, ఇలాగేనా మాట్లాడేది అని నాలో నేనే మనిషిగా పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నా పరిస్థితి అర్థమయిన వాడిలా, ‘సార్! అపార్టుమెంట్ వెల్ఫేర్ ఫండ్ నుండి ఓ పదివేలు ఇవ్వగలను’ అన్నాడు సెక్రటరీ. ‘దానికైనా వీళ్ళందరూ ఒప్పుకోవాలిగా!’ అన్పాను అనుమానంగా.‘గణేశ్ నవరాత్రుల ఖాతాలో రాసేస్తాను, ఫరవాలేదు లెండి’ అన్నాడుగణేశ్ నవరాత్రులంటే, కిక్కురుమనకుండా వేలకు వేలు చందాలిస్తారు. ఓ మనిషి ప్రాణం పోతోంది సాయం చెయ్యండి అంటే, ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఏం మనుషులో ఏమో! ఎక్కడికి పోతోంది ఈ లోకం అనుకుంటూ, సెక్రటరీ ఇచ్చిన పదివేలు తీసుకుని అక్కడి నుంచి కదిలాను.నేను ఎదురుపడగానే, ‘ఏమైంది?’ అంటూ అడిగింది మా ఆవిడ. జరిగింది మొత్తం చెప్పాను.‘మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు?’ ప్రశ్నించింది. ‘అదే అర్థం కావట్లేదు. తొందరపడ్డానేమో!’ అన్నాను. ఆవిడ నా మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికెళ్లింది. ఏం చెయ్యాలి, లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి, అనవసరంగా మాట ఇచ్చానా? అని నన్ను నేను తిట్టుకుంటూ సోఫాలో జారగిలపడి కళ్ళు ముశాను. రెండు నిమిషాల తరువాత ఏదో అలికిడి అయితే కళ్ళు తెరిచా. ఎదురుగా మా ఆవిడ చేతిలో డబ్బుతో.. ఓ క్షణం అర్థంకాక, ఆమెవంక ఆశ్చర్యంగా చూశాను. ‘మీరు హాస్పిటల్‌కు వెళ్ళిన తరువాత నాన్న వచ్చి వెళ్ళారు. నా పేరున రాసిన పొలం పంట తాలుకు కౌలు డబ్బులు ఇచ్చి వెళ్ళారు’ అంటూ నా చేతిలో డబ్బులకట్ట పెట్టింది.‘వీటితో నగలు చేయించుకుంటానన్నావు’ ‘పరవాలేదు లెండి ఓ మనిషి ప్రాణం కన్నా, నా నగలేమీ ఎక్కువ కాదు. మరోసారి చూద్దాం నగల సంగతి’ అంటూ ఓ చిన్న నవ్వు నవ్వింది.ఆ నిమిషాన మా ఆవిడని చూస్తుంటే, మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి వుంది అనిపించింది. ఆనందంతో శ్రీమతి నుదుట ముద్దాడి, హాస్పిటల్లో డబ్బు కట్టుడానికి బయలుదేరాను.ఓ నెల రోజుల తరువాత పెద్దాయన వాళ్ళ ఆవిడతో మా ఇంటికి వచ్చాడు. ఈ నెల రోజులు ఎక్కడా కనపడకపోతే విశ్రాంతి తీసుకుంటు న్నాడేమో అని సరిపెట్టుకున్నాను. వాళ్లని చూడగానే, ‘ఎలా వున్నారు? రండి కూర్చోండి’ అంటూ లోపలికి ఆహ్వానించింది మా ఆవిడ. ‘కాఫీ తెస్తాను..’ అని లోపలికెళుతుంటే ‘వద్దమ్మా, ఒక్క నిమిషం ఇలా కూర్చో’ అంది పెద్దాయన భార్య. ఆవిడ మాటలు అర్థం కాక వాళ్ల ఎదురుగా కూర్చుంది మా ఆవిడ.‘అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు’ అని నాలో నేను అనుకుంటూ వాళ్ళ వంక చూస్తూ వుండిపోయాను. ఇంతలో పెద్దాయన తనతో తెచ్చిన సంచిలో నుండి కొన్ని కాగితాలు తీసి, ‘అమ్మా! ఇవి మా ఇంటి కాగితాలు, మా తదనంతరం నీ పేరున రాయించాను’ అంటూ మా ఆవిడ చేతిలో పెట్టాడు.ఆ పరిణామానికి ఇద్దరం ఆశ్చర్యపోయాము. ముందుగా తేరుకున్న మా ఆవిడ, ‘ఏంటండి, ఇదంతా, మేం ఏం సాయం చేశామని? ఆ లక్ష చిన్నగా వాయిదాల్లో చెల్లిస్తే పోయేదిగా!’ అంది.ఆవిడ మాటల్లో ఆర్ద్రత నాకు అర్థమయ్యింది. ‘లేదమ్మా! డాక్టరుగారు కాస్త పని తగ్గించుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. మీ డబ్బు చెల్లించే దారి నాకు కనపడటం లేదు. అయినా నా ప్రాణాలు కాపాడిన మీ కన్నా నాకెవరూ ఎక్కువ కాదు. నా కూతురుకి ఇస్తున్నాను అనుకో అమ్మా!’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.వాళ్ళను చూసి మా ఆవిడ కూడా కళ్ళల్లోనుండి వస్తున్న కన్నీళ్ళను ఆపుకోలేక పోయింది. నిన్నటి దాకా వాళ్ళు ఎవరో, ఊళ్ళోవాళ్ళు అన్న మా ఆవిడను వాళ్ళు సొంత కూతురిలా భావించటంతో మా ఆవిడ మనసులో నుండి పెల్లుబికిన ప్రేమబాష్పాలవి. ఆ నిమిషాన మనుషుల మీద అప్పటిదాకా ఏర్పడిన అసహ్యం పోయి, మళ్ళీ నమ్మకం ఏర్పడటం మొదలయ్యంది. మనిషికి మనిషి సాయం చెయ్యటానికి స్నేహితుడో, బంధువులో కానక్కరలేదు. కాస్తంత గుండెల్లో తడి ఉంటే చాలు. అలా గుండెల్లో తడి ఉన్న మనుషులే నిజమైన ఆత్మబంధువులు అనుకుంటూ మా ఆవిడ వంక చూశాను, తను కూడా ఆనందంతో నా వంకే చూస్తోంది. ‘కాగితాలు తీసుకోవద్దు’ అన్నట్టు సైగ చేశాను. అలాగే అంటూ తల ఆడించింది. -
మనిషిలా తెలివి మీరుతున్న ఏఐ
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతికి ‘మెమోరీని ఏకీకృతం’ చేయడం కీలకంగా మారుతోంది. ఏఐ వ్యవస్థను నడిపించే ముఖ్య కారకాల్లో ఇది ప్రధానమైంది. సమస్యలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి మానవులు జ్ఞాపకశక్తిపై ఆధారపడినట్లే.. ఏఐ వ్యవస్థలు వాటి సామర్థ్యాలను మెరుగుపరచడానికి మెమరీని ఉపయోగించడం ఇప్పటికే ప్రారంభించాయి. ఈ మార్పు మరింత అధునాతనంగా, మానవ తరహా కృత్రిమ మేధకు మార్గం సుగమం చేస్తోంది.ఓహియో స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యూసు ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్నవారిలో ప్రముఖంగా ఉన్నారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో చేరడానికి ముందు తాను మైక్రోసాఫ్ట్ సెమాంటిక్ మెషీన్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు. అక్కడ తాను సంభాషణాత్మక ఏఐపై విధులు నిర్వహించారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెమరీ ఆగ్మెంటెడ్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిలో పరిశోదనలు చేశారు.సందర్భానుసారం స్పందించే ఏఐఅత్యాధునిక సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం కోసం గత సమాచారాన్ని గుర్తుంచుకుని, సందర్భానుసారం దాన్ని ఉపయోగించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంపై దృష్టి సారించినట్లు యూసు తెలిపారు. భాషా అవగాహన, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి పనులకు ఈ విధానం కీలకమని చెప్పారు. కృత్రిమ మేధస్సులో మెమోరీని చేర్చడం ద్వారా సాంకేతిక పరిశోధకులు.. గత అనుభవాల నుంచి నేర్చుకోగల, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను అందించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంలో నిమగ్నమయ్యారు.మెమోరీతో ఉపయోగాలు..ఏఐ వ్యవస్థలో మెమోరీ ఆగ్మెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణలో, రోగి చరిత్రలు, చికిత్స ఫలితాలను గుర్తు చేసుకోవడం ద్వారా వ్యాధులను నిర్ధారించడంలో ఇది సహాయపడుతుంది. ఫైనాన్స్ విభాగంలో గత డేటాను విశ్లేషించడం ద్వారా మార్కెట్ ధోరణులను అంచనా వేయడంలో తోడ్పడుతుంది. రోజువారీ పనులను మరింత మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడుతుంది. మరింత సహజంగా వినియోగదారు అవసరాలకు ప్రతిస్పందించేలా చేస్తుంది.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..సమర్థమైన వ్యవస్థలు..కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సాంకేతిక పరిశోధకుల సహకారం మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మరింత తెలివైనవిగా, సమర్థవంతమైనవిగా మారుతున్నాయి. ఈ రంగంలోని ఆవిష్కరణలు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఎంత అడ్వాన్స్డ్ పీచర్లతో ఏఐ వ్యవస్థలు వచ్చినా మనిషి మెదడుతో పోటీ పడలేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
పెద్దయ్య
మౌనంగా ఆయన నా వైపు చూశాడు కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఆయన శరీరంలో చివరిగా మిగిలిన రెండు కన్నీటి చుక్కలు కళ్లకు అడ్డుపడి మసకబారినట్టున్నాయి. అందుకే నేను సరిగా కనపడక గుర్తురాకపోయి ఉండవచ్చు. ఎంతకాలమని మనిషి తన జ్ఞాపకాలను నిలుపుకోగలడు? ఏదో ఓ రోజు అన్నీ చెదిరి పోవాల్సిందేగా! పదిలంగా దాచుకున్న ఆయన జ్ఞాపకాలు చెదిరిపోయే సమయం వచ్చింది. అదంతా అర్థమవుతూనే ఉంది.అంతలో ఆయన కుడి కన్ను నుంచి ఓ నీటిబొట్టు జారి, నేల రాలటం నా కంట పడింది. కంటికి అడ్డుపడిన పొర తొలగిపోయి ఇప్పుడు నేను స్పష్టంగా కనిపిస్తూ ఉండవచ్చు. నాలో కాస్త ధైర్యం వచ్చింది. ఆశ మెరిసింది. ముందుకు వంగి ఆయన వైపు చూశా. ఆనంద విషాదాలు లేని శూన్యస్థితిలో ఉన్న ఆయన నా వైపు పరికించి చూశాడు. కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకీ ఆయన గురించి చెప్పనే లేదు కదూ, ఆయన పెద్దయ్య. ఆయన పేరు ఇప్పటికీ నాకు తెలీదు. పెద్దయ్య కాబట్టి పేరుతో నాకేం పని? ఆయన గురించి చెప్పాలంటే ఓ కథ చెప్పినట్లే ఉంటుంది. ఇప్పటికి సరిగ్గా ముప్పై ఐదేళ్ల ఏళ్ళ క్రితం నాటి మాట. మొదటిసారి పెద్దయ్యని చూశాను. అప్పటికి నాకు పదేళ్ల వయసు. ఊహ తెలిసే వయసు కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ నాకు జ్ఞాపకమే!నేను పుట్టింది పెద్దయ్య ఊర్లోనే! కాని, మా చిన్నప్పుడే మా నాన్న ఉద్యోగరీత్యా పట్నం వలస వెళ్లిపోయాడు. చిన్నప్పుడు ఆ ఊరుతో ఉన్న జ్ఞాపకాలేవీ గుర్తులేవు. మా నాన్న, అమ్మతో కలిసి పెద్దయ్య ఇంటికి వెళ్ళింది ఆ ఊరుతో నాకున్న మొదటి జ్ఞాపకం. మొదటిసారి పట్నం నుంచి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇంటి ముందు కోడె దూడలకు సొద్ద బువ్వ తినిపిస్తూ పెద్దయ్య కనిపించాడు. ఎద్దులకు కడుపు నిండా తిండిపెట్టి, నీళ్లు తాగించి తీరిగ్గా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని పలకరించాడు. పెద్దయ్యకు మనుషులన్నా ఎద్దులన్నా ఒకటేనని కొన్నాళ్లకు తెలిసింది. ఇంటికి అల్లంత దూరంలో ఉన్న కొండపొలం అంటే ఆయనకు మరీ ఇష్టమని అర్థమైంది. ఆయన ఎద్దుల్ని ఇష్టపడ్డట్టే పిల్లలుగా ఉన్న మమ్మల్ని ఇష్టపడేవాడు. రాత్రి పూట మమ్మల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని, ఎన్నో కబుర్లు చెప్పేవాడు.ఆయన చెప్పే కబుర్లన్ని ఆ కొండపొలం గురించి, ఆయన ఎద్దుల గురించే! ఓ రోజు రాత్రి నులక మంచాల మీద పిల్లలందరం పడుకున్నాం. పెద్దయ్య కథలాంటి ఆయన అనుభవం చెప్పటం ప్రారంభించాడు. ఆ ఏడు జొన్న చేను ఇరగ్గాసింది. ఏడాది చివరి నెల కావడంతో చలి కూడా పెరిగింది. అసలే అది కొండపొలం. ఒంట్లో ఎముకల్లోకి చలి దూరి మెలిపెడుతోంది. అయినా చేనుకు కాపలా ఉండాలి. లేకపోతే అడవి పందులు గుల్ల చేస్తాయి. రాత్రంతా మంచె మీదే జాగారం చేయాలి. ఆరోజు అమావాస్య. ఎటు చూసినా చిమ్మ చీకటి. కాస్త కునుకు తీద్దామని పెద్దయ్య నడుంవాల్చాడు. కాసేపటికే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పడమట చుక్క మూరెడు దిగింది. రెండు ఝాములు గడిస్తే పొద్దెక్కుతుంది. ఇక ఇబ్బంది లేదు. ఇంటికి పోవచ్చు అనుకుని చేతికర్ర పట్టుకుని ఇంటిదారి పట్టాడు పెద్దయ్య.చలిగాలి ఒంటికి తగులుతుంటే వడివడిగా నడుస్తున్నాడు. దారిలో కాలికేదో మెత్తగా తగిలింది. కళ్ళు ఇడమర్చి చూశాడు. అది పేద్ద కొండచిలువ. దూడల్ని ఒక్క ఉదుటున మింగే కొండ చిలువ. ఆ దరి నుంచి ఈ దరి వరకు పరుచుకొని పడుకుంది. పెద్దయ్యకు ఒళ్ళు జలదరించింది. మంచె కాడ వదిలిన ఇనుప గొడ్డలి గుర్తొచ్చింది. ఒక్క ఉదుటున మంచె కాడికి పరిగెత్తి, గొడ్డలితో తిరిగొచ్చాడు. తాటిచెట్టులా ఆ రాకాసి కొండ చిలువ మెదలకుండా దారికి అడ్డంగా పడుకునే ఉంది. ధైర్యం కూడగట్టుకొని గొడ్డలి ఆకాశానికెత్తి, ఒకే ఒక్క ఏటేశాడు. అంతే, రెండుగా తెగిన కొండచిలువ చచ్చూరుకుంది. పెద్దయ్య చెప్పే ముచ్చట్లన్నీ ఇలాగే కథల్లా ఉండేవి. ఊ కొడుతూ వినేవాళ్ళం. ఓ రోజు రాత్రి చీకట్లో పొలం పోతుంటే పెద్దయ్యకు చిన్న మేకపిల్ల దారిలో కనిపించిందట. పాపం ఎక్కడిదో ఎవరు వదిలేశారో అని బుజ్జి మేకను భుజానికెత్తుకొని నాలుగడుగులు ముందుకు వేశాడో లేదో ఆ మేక పిల్ల రెండింతలైందట! ‘ఏందబ్బా ఇది’ అని ఆలోచిస్తూ ఇంకాస్త ముందుకు కదిలాడో లేదో మేకపిల్ల కొమ్ములు తిరిగిన పోతుమేకైందట. వెంటనే పెద్దయ్యకు విషయం అర్థమై, పోతుమేక రెండు వెనక్కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడట. ‘ఓరి భడవా! తప్పిచ్చుకున్నావ్ ఫో!’ అంటూ దెయ్యం రూపంలో ఉన్న మేక మాయమైపోయిందట! పెద్దయ్యకు భలే ధైర్యం. పొలం పోవాలంటే ఊరి చివర చింతచెట్లు దాటి వెళ్ళాలి. అర్ధరాత్రి ఆ చెట్ల మీద ఎన్నిసార్లు కొరివి దెయ్యాలు కనిపించాయో లెక్క లేదట! కొరివి దెయ్యం కనపడ్డప్పుడు దాని కళ్ళలోకి చూడకూడదు, పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకూడదని మాకు సలహాలు చెప్పేవాడు. పిల్లలందరం ఒకరినొకరం పట్టుకొని దుప్పట్లు కప్పుకొని నిద్ర పోయేవాళ్ళం. తెల్లారి లేస్తే పెద్దయ్య కనపడడు. పొద్దు పొడవక ముందు ఆయన పొలం పోతే, మళ్ళీ తిరిగి వచ్చేది పొద్దుగూకాకే! పంట బాగా ఏపుగా ఉంటే పగలూ రాత్రీ పొలమే ఆయన ఇల్లు. ఆయనకు పొలం, ఇల్లు, ఆ ఊరు తప్ప మరో ఊరు తెలియదు. పెద్దయ్య ఇంటికి మేము వెళ్ళటమే కాని, ఒక్కసారి కూడా ఆయన మా ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు.నాకు పెళ్లయి, పిల్లలు పుట్టినా పెద్దయ్య మా ఇంటికి రాలేదు. నాకు నలభై ఏళ్లు వచ్చాయి. ఇల్లు కట్టుకున్నా. ఒక్కసారి కూడా మా ఇంట్లో ఆయన చేయి కడగలేదు. ఓ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు అందరం ఇంటి వద్దే ఉన్నాం. కాలింగ్ బెల్ మోగితే నేనే వెళ్ళి తలుపు తీశా. ఎదురుగా పెద్దయ్య. మల్లెపువ్వులా తెల్ల పంచె, తెల్ల చొక్కాలో మెరిసిపోతూ పెద్దయ్య. ఎప్పుడూ పొలం పనిమీద చొక్కా లేని పెద్దయ్యను అలా చూసేసరికి నన్ను నేనే నమ్మలేక పోయా. నేరుగా ఇంట్లోకి వచ్చి నాన్న కూర్చునే టేకు కుర్చీలో కూర్చున్నాడు. మా అందరికీ ఒకటే సంతోషం. పొలంలో ఉండాల్సిన పెద్దయ్య పట్నంలో మా ఇంట్లో తేలాడు. కొట్టంలో ఎద్దుల పేడ ఎత్తుతూ కనిపించే పెద్దయ్య ఇప్పుడు మల్లెపువ్వులా మెరిసిపోతూ నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో మాకు మాటలే రాలేదు. మౌనంగా మూగమొద్దుల్లా చూస్తూ ఉన్నాం. అందుకే ఆయనే మా వైపు చూసి నవ్వుతూ నోరు విప్పాడు. ‘అవునయ్యా! రావాలనిపించింది, వచ్చాను. ఏం.. పట్నం నాకు తెలీదనుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళగలను. ఎద్దులు బేరం చేసేటప్పుడు ఎంతెంత దూరం వెళ్ళేవాళ్ళమో మీకేం తెలుసు? పట్నం నాకో లెక్క కాదు. మా అయ్య నాకు కొండవాలుగా అరెకరం పొలం ఇచ్చి పోయాడు.రెక్కలు ముక్కలు చేసుకుని ఇప్పుడు ఆరెకరాల పొలం చేశాను. ఇక చేసే ఓపిక లేదు. అందరూ పెద్దోళ్ళయ్యారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళయ్యారు. ఇక ఎంతకాలం ఆ పొలం చుట్టూ తిరగాలి. నేనూ హాయిగా విశ్రాంతి తీసుకోవద్దూ. అందుకే అన్నీ ఎవరివి వాళ్ళకి ఒప్పచెప్పి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు పనీ పాట లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాను? అందరిళ్లకూ తిరుగుతున్నాను. మంచాన పడక ముందే తిరగాలి కదయ్యా!..’ పెద్దయ్య నవ్వుతూ చెబుతూనే ఉన్నాడు. టేకు కుర్చీలో కాలు మీద కాలేసుకుని, తలగుడ్డ చుట్టుకుని నవ్వుతూ మాట్లాడే పెద్దయ్యను చూస్తే ఆ రోజు మాకు ఓ హీరోలా కనిపించాడు. ఆ క్షణంలో పెద్దయ్యని చూస్తే నీషే కలగన్న సూపర్‌మేన్ ఇతనే కదా అనిపించాడు. ఇంకెక్కడో ఉండే స్వర్గంతో అవసరం లేకుండా ఇక్కడే ఈ భూమినే భూతలస్వర్గంగా భావించిన పెద్దయ్య సూపర్‌మేన్ కాక మరేంటి? పెద్దయ్యకు స్వర్గ నరకాలు తెలీవు. ఆయనకు కొండపొలమే భూతలస్వర్గం.‘శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం అనేది నిగూఢ జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం’ అనే ఖలీల్ జిబ్రాన్ కవిత పెద్దయ్యకు అచ్చు గుద్దినట్టు సరిపోద్ది. పెద్దయ్య కూడా శ్రమించడం ద్వారానే జీవితాన్ని ప్రేమించాడు. జీవిత రహస్యాలను తెలుసుకున్నాడు. శ్రమ ఆయనకు ఆనందం. అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అయిన పెద్దయ్య ఇలా ఎలా జీవించాడు? ఇది నాకు ఎప్పుడూ అంతుచిక్కని ప్రశ్న!అక్షరజ్ఞానం లేని ఆయన, చదువు అవసరమే పడని ఆయన, చదువులేదని ఏ రోజూ బాధపడని ఆయన, ఎలా జీవించాలో థింకర్స్ భావించినట్లే జీవించాడు. ఆయన పనిని ప్రేమించాడు. పనిలోనే ఆనందం పొందాడు. పనే ఆయన దైవం. పని ఆయన స్వర్గం. ఇంతకన్నా సంపూర్ణమైన జీవితం ఏముంటుంది ? ఆందోళన లేకుండా, అనారోగ్యం బారిన పడకుండా, అత్యాశకు పోకుండా, జంతువులను మనుషులను సమంగా ప్రేమించే సుగుణాలు అందరిలోనూ ఉంటాయా? ఆ రోజంతా పెద్దయ్య మాతోనే గడిపాడు. మమ్మల్ని నవ్వించి, నవ్వుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.ఇప్పుడు నేను చెబుతున్న కథంతా ఆయన స్వచ్ఛంద పని విరమణ చేసిన ఇరవై సంవత్సరాల తర్వాత, పది రోజుల క్రితం జరిగింది. ఆ రోజు పెద్దయ్యకి ఒంట్లో బాగాలేదని కబురొచ్చింది. మందు బిళ్ళే మింగని ఆయనకు సుస్తీ చేయడమా? ఆలోచిస్తుంటే కాసేపటికి విషయం తెలిసింది. తెల్లవారుజామున మంచం మీద నుంచి కింద పడటంతో పెద్దయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు చెప్పారు. పచ్చటి ప్రకృతి మధ్య పక్షిలా ఎగిరే ఆయన మనసు ఆ రోగుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. ఎంతో గొడవ చేస్తుంటే ఇక లాభం లేదని ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాల ప్రవాహాలకు రక్తం గడ్డలు అడ్డుతగులుతున్నాయి. పది రోజుల్లోనే అందర్నీ మర్చిపోయాడు. నన్ను గుర్తుపడతాడేమోనని ఆశపడ్డా. అదే ఆశతో ఆ రోజు ఇంటికి వెళ్లా. ఒంటరిగా ఓ గదిలో పెద్దయ్య గువ్వలా కూర్చున్నాడు. తలుపు తీసిన అలికిడికి మెల్లగా తల ఎత్తి నాకేసి చూశాడు. అంతే, మెల్లగా తలదించుకున్నాడు. ఆయన్ను అలా చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు. పొలాలనన్నీ, హలాల దున్నీ, విరామ మెరుగక పరిశ్రమించిన పెద్దయ్య శాశ్వత విశ్రాంతికి సన్నద్ధమవుతున్నాడు. ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది. చల్లటి గాలి నా శరీరానికి తాకింది. అదే గాలి ఆయన శరీరానికీ తాకింది. ఆయన కప్పుకున్న దుప్పటి ఇంకాస్త బిగించి పట్టుకున్నాడు. ఆ దుప్పటి మాటున ఎముకల గూడు నా ఎక్స్‌రే కళ్లకు కనిపిస్తోంది. పది రోజుల నుంచి ముద్ద బువ్వ ముట్టని ఎనభై ఏళ్ల శరీరం ఎముకల గూడులా కాకుండా ఎలా ఉంటుంది. పట్టు విడిచే సమయం వచ్చిందని నాకు తెలుస్తూనే ఉంది.ఇవేమీ పెద్దయ్యకు తెలియదు. ఆయన ముఖంలో అలౌకిక ఆనందం కనిపిస్తోంది. కళ్ళు తడిగా ఉన్నాయి కాని, ముఖం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంది. శరీరంలోని అవయవాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు లేవు. లేకుంటే నవ్వే ముఖంలో కన్నీరు కార్చే కళ్ళు ఎలా ఉంటాయి? మౌనంగా అలానే నిలబడి ఉన్నా. ఆయన కూడా మౌనంగా అలానే కూర్చొని ఉన్నాడు. ఆ గదంతా ప్రశాంతమైన నిశ్శబ్దం. చిటుక్కుమన్నా చెవులు పగిలే నిశబ్దం.నా పక్కనే మరికొందరు నా వయసు వాళ్ళే నిలబడి ఉన్నారు. బయట కేరింతలు కొడుతూ పిల్లలు గోల చేస్తున్నారు. నేనూ, నా వయసు వాళ్లందరం పెద్దయ్యను చూస్తూ ఉన్నాం. ఎనభై ఏళ్లపాటు పోగేసిన జ్ఞాపకాలను భద్రంగా మా చేతుల్లో పెట్టి అలౌకిక ఆలోచనల్లో మునిగి పోయాడు పెద్దయ్య. -
ఈ వారం కథ.. వైతరిణికి ఈవల
నేను చనిపోయాను రాత్రి రెండుగంటలప్పుడు నీళ్లు తాగటానికని లేచి, తాగి పడుకున్నాను. సరిగ్గా అరగంట తర్వాత నేను చనిపోయాను. నేనేమీ ముసలోణ్ణి కాదు ఆయుష్షు తీరిపోవటానికి. యాభై ఐదు మొన్ననే దాటింది. అయినా అదికాదు నేనాలోచించేది. నేను మందు ముట్టను. సిగరెట్టు తాగను. మాంసం పెద్దగా తినను. పేకాట ఆడను. ప్రతిరోజు వాకింగ్, యోగా చేస్తాను. సంవత్సరంలో దాదాపు మూడొందల రోజులు ఆరోగ్యం కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఎందుకిలా జరిగింది? ఏమో తెలీదు. ప్రస్తుతానికి నన్నెవరూ చూడలేదు కాబట్టి కారణం తెలీదు. శరీరం మాత్రం ఇంకా మంచం మీదే వుంది నా భార్య ఉదయం కాస్త లేటుగా నిద్ర లేస్తుంది. అప్పటివరకూ నేను చనిపోయానన్న విషయం ఎవరికీ తెలీకపోవచ్చు. ఒక మనిషి పుట్టుక అతడి తలరాతని బట్టి వుంటుందట. మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా? ఒకవేళ చేసినా అవన్నీ చిన్నవా? లేక అనుభవించాల్సింది ఇంకా ముందు ముందు మిగులుందా?మందు, విందు లాంటి బయటికి కనపడేవే చెడ్డ అలవాట్లు, పాపాలుగా పరిగణిస్తే .. నేను అవి చేసి వుండకపోవచ్చు. మరి అవతలి వాళ్ళను పరోక్షంగా బాధపెట్టటం, అసూయగా ఆలోచించటం, ఒంటరిగా వున్నప్పుడు మనసులో కలిగే చీకటి ఆలోచనలు/ అలవాట్లు పాపాలు కాదా? తెలిసో తెలియకో నేను ఎగ్గొట్టిన డబ్బులు, నా వల్ల బాధపడిన మనుషులు, నేను ఈర్ష్యపడేట్టు చేసిన నా స్నేహితులు (పదప్రయోగానికి క్షమించాలి.. బంధువుల, స్నేహితుల ఉన్నతికి నేను పడిన ఈర్ష్య అసూయలు) మరి ఇవన్నీ తప్పులు కావా? అసలు తప్పులకి, పాపాలకి సంబంధం ఉందా? ఉదాహరణకి నేనో పామునో, కప్పనో చంపితే అది చెడ్డ పనా? తప్పు పనా? దాన్ని తప్పుగా భావించి దేవుడు నాకు శిక్ష వేస్తాడా? లేక, పోయిన జన్మలోనో, వచ్చే జన్మలోనో.. దానికీ నాకూ ఉన్న సంబంధాన్ని బట్టి అది అలా జరగాలని రాసి వుంటుందా? మరైతే ఒకపని చేసేటప్పుడు అది ఇప్పటిదా లేక పోయిన జన్మలో చేసిన దాని పర్యవసానమా అనేది ఎలా తెలుస్తుంది?అన్నట్టు పాపం అంటే గుర్తొచ్చింది. నా కొడుకు విడాకులనాడు మా వియ్యంకురాలు నన్ను తిట్టిన తిట్లమాటేమిటి? తన కూతురికి అన్యాయం చేసినందుకు ఆ పాపం ఊరికే పోదనీ, నాకు నా కుటుంబానికి ఆ పాపం తగులుతుందని, దాని వల్ల నా కుటుంబం సర్వనాశనం అవుతుందని శాపం కూడా పెట్టింది. మరి నా కొడుకు చేసిన పనిలో/ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుందా? ఒకరి పాపపుణ్యాల్లో మరొకరికి వాటా ఉంటుందా? అసలలా జరిగే వీలుంటుందా? ఏమో.. ఈసారి స్వర్గంలోనో, నరకంలోనో.. ఎవరైనా ప్రవచనకర్త కనిపిస్తే అడగాలి.సమయం కొంత గడిచి, ఉదయం ఐదున్నర అయింది. నా భార్య నిద్రలేచింది. కళ్ళు మూసుకునే దేవుడికి దణ్ణం పెట్టి తర్వాత తాళి కళ్ళకద్దుకుంది. మా పెళ్ళైనప్పటినించీ నిద్ర లేచాక ఆమె చేసే మొదటి పని అదే. పక్కనే ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. రోజూ ఐదింటికల్లా వాకింగ్‌కి వెళ్లే నేను ఈ రోజు ఇంకా నిద్ర కూడా లేవకపోవటం చూసి పడిన ఆశ్చర్యం అది. చిన్నగా తట్టి ‘ఏమండీ..’ అంది. శరీరం అటు ఇటు కాస్త కదిలిందే తప్ప చలనం లేదు. దగ్గరకొచ్చి ‘ఏమండీ..’ అని తోసినట్టు గట్టిగా కుదిపింది. ఉలుకు లేదు పలుకు లేదు. మొదటిసారి ఆమెకు అనుమానం వచ్చింది. రెండో నిమిషంలో అది రూఢి అయింది. ఇంకో గంటకి.. అక్కడ వందమంది దాక గుమికూడారు. వాళ్ళందరూ నేనెంత మంచివాణ్ణో(?) మాట్లాడుకుంటున్నారు. చిత్రమేమిటంటే.. అక్కడున్న వాళ్ళల్లో చాలామంది వాళ్లెవరో కూడా నాకు తెలీదు.ఒక మహానుభావుడు చెప్పినట్టు ‘నువ్వు హాస్పిటల్లో వున్నప్పుడు, కనీసం వందమంది నిన్ను పరామర్శించాలని నువ్వు భావిస్తే, ఆ వందమందికి బాలేనప్పుడు నువ్వెళ్ళి పరామర్శించి ఉండాలి’. కానీ, నేనా బాపతు కాదు. ఎవరినైనా పరామర్శించాల్సి వస్తే నేను వెళతాను కానీ, వాళ్లొచ్చి మళ్ళీ నా దగ్గిర అటెండె¯Œ ్స వేయించుకోవాలి అని నేనెప్పుడూ ఎదురుచూడను. చూడలేదు. అసలలాంటి ఆలోచన నేనెప్పుడూ చెయ్యను కూడా. అంతదాకా వస్తే నేనెప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడింది లేదు. అవతలి వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగింది లేదు. తిరగాలన్న కోరిక కూడా నాకెప్పుడూ ఉండేది కాదు. అలా తిరగటం తప్పని నా ఉద్దేశం కాదు. ఎవరి జీవన విధానం వాళ్ళది. ఎవరి ఆలోచనలు, పద్ధతులు వాళ్ళవి. నా ఆలోచనలన్నీ నా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండేవే తప్ప.. ఇతరులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం నాకెప్పుడూ లేదు. జీవితం పట్ల నా దృక్పథం వేరు. నా ఆలోచన, జీవన విధానమే వేరు. ఇలా ప్రతి ఒక్కరూ నేను వేరు అనుకుంటారేమో.. నాకు తెలీదు.ఇంకో అరగంటకి.. పూలమాలలు తెచ్చారు. బాడీని మంచం మీద నించి ఒక చిన్న బల్ల మీదకు మార్చారు. తర్వాత ఏం చెయ్యాలో, ఎలా చెయ్యలో దాని కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్లిస్తున్నారు. ‘పిల్లలకి ఫోన్ చేశారా?’ అని ఎవరో అడుగుతుంటే, ‘చేశాం. రాత్రికల్లా వస్తాం అన్నారు’ అంటున్నారు మరెవరో.అన్నట్టు చెప్పటం మరిచా. నాకు ఒక కొడుకు, కూతురు. కొడుకు బెంగళూరులో, కూతురు పుణెలో వుంటారు. నా పిల్లల్ని నేను కాలు కదపనీయకుండా.. అడుగు కింద పెట్టనీయకుండా.. లాంటివి కాదు కానీ ఉన్నంతలో బాగానే పెంచాను. వాళ్ళు అడిగినవి, అవసరమైనవి కొనివ్వగలిగాను. ఒక తండ్రిగా ఎంత చెయ్యాలో అంతా చేశాను. అలాని వాళ్ళకెప్పుడూ నేను ఆదర్శాలు వల్లించలేదు. నీతి సూక్తులు చెప్పలేదు. ధర్మం తప్పకుండా జీవించమని ఉద్బోధించనూ లేదు. పిల్లలు మనం చెప్పేదానికంటే, చేసేది చూసి నేర్చుకుంటారని చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, కౌన్సెలర్లు చెప్పగా విని, పాటించాను. ఒక అనుభవం.. అది మంచైనా, చెడైనా వాళ్ళు దాన్నించి నేర్చుకోవాలనేది నా సంకల్పం. ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు.నిజం చెప్పొద్దూ ఆమెను చూస్తే నాకు జాలేసింది. ఏమీ చెప్పకుండా సడన్‌గా నేనిలా వచ్చేస్తే.. తను ఎలా బతుకుద్ది? ఆ భారం తను మోయగలదా? ఆస్తులంటే ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కానీ, ఏ బ్యాంకులో ఎంత డబ్బుంది, ఎవరికి ఎంత అప్పుంది.. లాంటి డబ్బు సంబంధమైన విషయాలు నేనెప్పుడూ తనతో కనీసం చర్చించింది కూడా లేదే. మరిప్పుడెలా?పెళ్ళైనప్పటినించీ నేనే లోకంగా బతికింది. తను నన్ను ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఒక్క మా అబ్బాయి పెళ్లి మాత్రం తనిష్టప్రకారం తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో జరిపించాలంది. తెలిసిన వాళ్ళైతే సర్దుకుపోతారనేది తన ఆలోచన. ఆ ప్రకారమే తనూ మావాడూ ఇద్దరూ ఇష్టపడ్డ అమ్మాయితోనే మావాడి పెళ్ళిచేసింది. ఆ సంసారం నాలుగైదేళ్లు సజావుగా సాగింది. ఏమైందో ఏమో గాని మనస్పర్థలు మొదలయ్యాయి. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో కేవలం భగవంతుడికే తెలుసు. అటువైపు నించీ, మా వైపు నించీ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి అది విడాకుల దాకా వెళ్ళింది. విడాకులు మంజూరైన రోజు.. మా వియ్యపురాలు నన్నూ, నా కుటుంబాన్నీ తిట్టని తిట్టులేదు. తెలిసిన వాళ్ళని పిల్లనిస్తే ఇంత అన్యాయం చేస్తారా అంది. నడిరోడ్డు మధ్యలో అలా వదిలేసి వెళితే తమ పరిస్థితేంటని నిలదీసింది. అభం శుభం తెలియని ఆడపిల్లని ఇలా అర్ధాంతరంగా బయటికి గెంటేస్తే .. ఆ పాపం ఊరికే పోదనీ, దాని ఉసురు కచ్చితంగా తగులుతుందని శపించింది. చివరగా.. నీక్కూడా ఒక కూతురుందనీ దానికి కూడా ఇలాంటిది జరిగితే అప్పుడు తండ్రిగా ఆ బాధేమిటో తెలుస్తుందని దుమ్మెత్తి పోసింది. ఐతే అదృష్టవశాత్తూ అలాంటివేం జరగలేదు. కానీ, ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. జీవితంలో అంత వేదన అనుభవించటం అది రెండోసారి (మొదటిసారి.. శ్రుతిలయతో నేను విడిపోయినప్పుడు జరిగింది). చేయని తప్పుకి శిక్ష అనుభవించాలా? అయినా తప్పెవరిదో కూడా నిర్ణయించే పరిస్థితి లేనప్పుడు కేవలం నా కుటుంబాన్ని ఆడిపోసుకోవడం న్యాయమా? ఏదైతేనేం.. జరగకూడనిది జరిగిపోయింది. పచ్చని సంసారం పెటాకులైపోయింది. ఎదో దిగులు. మానసిక వ్యథ. కాస్తో కూస్తో పరువుగా బతుకుతున్న వాళ్ళం. ఎందుకిలా జరిగింది? సమాజం మారిందనటానికి ఇవన్నీ రుజువులేమో. కావొచ్చు కానీ ఎక్కడో జరిగితే మనం దానిమీద చర్చించొచ్చు, సులభంగా తీర్మానం చెయ్యొచ్చు. కానీ అది మనింట్లోనే జరిగితే..? మనసు ఏ పని మీదా లగ్నం కావటం లేదు. నిద్ర రాదు. ఆకలి వేయదు. ఒకటే అంతర్మథనం. దాదాపు మూడు నెలలు. మానసికంగా కుంగిపోయాను. ఆలోచించే కొద్దీ ఎవరో రెండు అరచేతుల మధ్యకి నా గుండెని తీసుకుని ఒత్తిన ఫీలింగ్. కాలమే అన్ని గాయాల్ని మాన్పుతుందన్నట్టు కొన్నాళ్ళకు నేను తేరుకున్నాను.. తేరుకుని చూస్తే.. మా ఆవిడ తమ్ముడు ఫ్రీజర్ బాక్స్ తెచ్చి సర్దుతున్నాడు. నా మనసెందుకో కీడు శంకించింది. ఇప్పటివరకూ లేని ఒక చిన్న జలదరింపు. నేనూహించినట్టుగానే నలుగురైదుగురు కలిసి ఆ బాడీని ఎత్తి ఫ్రీజర్‌లో పెడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యింది. శరీరం ఆ చల్లటి వాతావరణానికి అలవాటు పడుతుంది. కానీ నేనే బయట ఉండలేకపోతున్నా. అప్పటివరకూ అది నేనే, ఆ శరీరం నాదే అన్న ఆలోచన నన్ను ఏమీ ఆలోచించనీయలేదు కానీ ఇప్పుడు తొలిసారిగా నన్నూ, నా శరీరాన్నీ విడదీస్తున్నారన్న భావన. పావుగంటలో ఆ బాడీని లోపల సర్దేసి అందరూ చుట్టూ కూర్చున్నారు. నేను బయట బిక్కుబిక్కుమంటూ బిగుసుకుపోయాను. ‘మనిషి శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ అక్కడక్కడే తచ్చట్లాడుతుంటుంది. తిరిగి తన శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఒకసారి శరీరాన్ని వీడాక మళ్ళీ అందులోకి వెళ్ళటం అన్నది సృష్టి విరుద్ధం కాబట్టి అక్కడక్కడే తిరుగుతూ కర్మలన్నీ ముగిశాక ఇక ఏ దారీ లేక అక్కణ్ణించి నిష్క్రమిస్తుంది’ నా స్నేహితుడు రవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరి.. ఇప్పుడు నా పరిస్థితేంటి? మొదటిసారిగా నాకు భయం వేసింది. ఫ్రీజర్ బాక్స్ చుట్టూ చేరి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాతో వాళ్లకున్న జ్ఞాపకాలు, అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. అవన్నీ నా చెవికెక్కడం లేదు. నాకు తిరిగి ఆ బాడీలోకే వెళ్లాలని వుంది. కానీ దాన్ని ఫ్రీజర్‌లో పెట్టి ఆ చల్లదనం బయటికి పోకుండా చుట్టూ గ్లాసులతో బిగించేశారు. లోపలికి వెళ్లే మార్గమే కనపడటం లేదు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేక పోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా?ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు. అప్పడు.. మొదటిసారిగా నాకు అనుమానం కలిగింది. ఇకమీదట నేను తిరిగి ఆ శరీరంలోకి చేరలేనేమో! తిరిగి నేను మనిషిని కాలేనేమో! ఒక్కసారిగా భయం వేసింది. ఏదైనా ప్రయత్నం చెయ్యాలని వుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. ‘ఆ శరీరం నాది. నన్ను అందులోకి వెళ్లనివ్వండి’ అని గొంతెత్తి అరవాలనుంది. కానీ మాట పెగలటం లేదు. శబ్దం బయటికి రావటం లేదు. నాకేమీ పాలుపోవటం లేదు. ఇక ఇంతేనా? నేను నా శరీరంతో వేరైపోయానా? ఇక మీదట నాకు ఆ శరీరంతో ఏ సంబంధమూ లేదా? ఇలా నాకొక్కడికేనా? సృష్టిలో ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతుందా? మరైతే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు.. వీళ్లందరినీ ప్రజల సందర్శనార్థం కోసం అలానే గంటల తరబడి ఉంచుతారే? వీలయితే రోజుల తరబడి కూడా ఉంచుతారే మరి వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఎంతగా క్షోభించి ఉంటుంది? నా ఈ మానసిక క్షోభకి కారణం నేను చేసిన పాపాలేనా? మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా?పాపం అనగానే నాకు శ్రుతిలయ గుర్తొచ్చింది.శ్రుతిలయ నా కాలేజ్‌మేట్. మనిషి అందంగా ఉండేది. ఇష్టానికి, ప్రేమకు అందమే తొలిమెట్టు ఐతే.. నేనామెను ఇష్టపడ్డా. విజాతి ధ్రువాలు ఆకర్షించుకున్నట్టు ఆమె కూడా నన్నిష్టపడింది. ఎన్నో ఉత్తరాలు.. ఎన్నెన్నో కబుర్లు.. సమయం తెలిసేది కాదు. మొదటి సంవత్సరంలో మొదలైన మా పరిచయం చివరి సంవత్సరానికొచ్చింది. పెళ్లి ప్రాతిపదికగా మేమెప్పుడూ ఒకరొకర్ని ఇష్టపడలేదు. అందువల్ల ఆ టాపిక్ ఎప్పుడూ మా మధ్య రాలేదు. కేవలం అభిప్రాయాలు, ఆలోచనలు కలవటం వల్లనే మా మధ్య బంధం మొదలైంది. ఆ బంధాన్ని ఒక అనుభూతిగా, తీయని జ్ఞాపకంగా, మధురస్మృతిగా వుంచుకోవాలనుకున్నామే తప్ప కలిసి జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఇష్టంలో, బంధంలో, ప్రేమలో ఉన్న అందం పెళ్ళిలో రాదేమో! అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. చివరిరోజు ఇద్దరం కాలేజీ గ్రౌండ్లో.. ఒకరికొకరం రాసుకున్న ఉత్తరాలను వెనక్కి ఇచ్చేసుకున్నాం. డైరీలు చింపేసుకున్నాం. అనుభూతులు, అనుభవాలు చెరిపేసుకున్నాం. చెరిపేసుకోవడానికి ఇక ఏమీ మిగిలి లేవనుకున్నాం. కాని, జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాలను తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో గాయమైనట్టు ఒకటే బాధ. ఎర్రగా కాల్చిన కర్రుతో గుండెల్లో ఎవరో కెలుకుతున్న భావన. చెరుకు మిషన్‌లో గుండెను పెట్టి తిప్పినంత నొప్పి. అంత మానసిక క్షోభ అనుభవించటం అదే మొట్టమొదటిసారి నాకు ( రెండోసారి మా వాడి విడాకులప్పుడు). కొన్నాళ్ళు అలా గడిచాయి. ఆ తర్వాత తను ఏమైందో, ఎక్కడుందో కూడా ఆచూకీ లేదు. ఆ విధంగా ఆ ప్రేమకథ ముగిసింది. కాని, అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వచ్చే జ్ఞాపకాలు నన్ను నిలువెల్లా దహించి వేస్తుంటాయి సరిగ్గా ఇప్పుడీ బాధలాగానే. ఇంత బాధలోనూ నాకు శ్రుతిలయ గుర్తొచ్చిందంటే మా బంధం ఏపాటిదో మీకు అర్థమయ్యేవుంటుంది. జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి చూస్తే చీకటిపడి ఎంతసేపయ్యిందో. తల దగ్గర దీపం వెలుగుతోంది. నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలుతుంది. కాసేపటికి మా పిల్లలు వచ్చారు. మా మనవళ్లు, మనవరాళ్లు వాళ్లతో వున్నారు. నా భార్య వాళ్ళని దగ్గరకు తీసుకుంది. నా కూతురి కళ్ళు ఉబ్బి వున్నాయి. ఎంతగా ఏడ్చివుంటుందో. రాగానే నా శరీరం మీదపడి వెక్కివెక్కి ఏడుస్తున్నారు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకపోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా? నేనేమంత గొప్ప పని చేశానని.. నా కోసం ఈ ఏడుపులు? చరిత్ర గతిని మార్చిన గొప్పగొప్ప వాళ్ళు తమ ఆనవాలు వదిలివెళతారు. వాళ్ళకోసం వుంచుకోమ్మా నీ కన్నీళ్లు. అల్పుడినైన నా కోసం ఎందుకు వృథా చేసుకుంటావు? అని నా కూతుర్ని, కొడుకుని బుజ్జగించాలని వుంది. కానీ, వీలవడం లేదు.దేవుడా! ఎందుకయ్యా నాకీ కష్టాలు? ఓ దేవా.. మనుషుల మధ్య ఈ బంధాలు, పాశాలను ఎందుకు సృష్టించావు? ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయం అన్నట్టు.. మనుషుల మధ్య ఈ బంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వల్ల ఏర్పడేట్లు చేస్తావు. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగిపోయినట్లు ఈ అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మనిషికి మోక్షం రాదు. తన తర్వాత తన పిల్లలు ఏమైపోతారో అన్న ఆలోచన మనిషిని నిలవనీయదు. వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం, జారిపడే జాబిల్లి, ఆశల హారతి, కరిగే మబ్బు.. వీటన్నిటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది చివరికి తెగిన వీణలా బంధాలన్నిటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది. ఓ ఈశ్వరా! నీ సృష్టి ఎంత విచిత్రం? నువ్వే సృష్టిస్తావు. జ్ఞానమో, అజ్ఞానమో అన్నీ నువ్వే పంచుతావు. చివరికి ఏదీ శాశ్వతం కానట్టు, నువ్వే తీసుకెళతావు. ఓ ప్రభూ .. మనుషులుగా జన్మించినందుకు మాకిది తప్పదా? ప్రతి మనిషీ ఈ చట్రంలో బిగుసుకోవాల్సిందేనా? ఈ బంధాలనించీ, పునరావృతమయ్యే నీ లీలలనించీ ఎప్పుడయ్యా మాకు విముక్తి?మనసు ధారాపాతంగా రోదిస్తూనే వుంది. తర్వాతరోజు ఉదయం పది గంటల వేళ.. శరీరం అగ్నిలో దహనమయ్యింది. బంధాల్ని తెంచుకుని ఆత్మ ఊర్ధ్వముఖంగా శూన్యంలోకి పయనమయ్యింది. నడ్డా సుబ్బారెడ్డి(మిత్రుడు వైవీకే రవి చెప్పిన మాటల సౌజన్యంతో ) -
మూడ్‌ని బట్టి స్నానం చేయిస్తుంది!
అద్భుతమైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన జపాన్ తాజాగా వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి.. సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఆవిష్కరించింది. వామ్మో..! ఏంటిది అనుకోకండి. మాములుగా మనమే స్నానం చేయడం అనేది పాత ట్రెండ్. దీన్ని కూడా మిషన్ సాయంతో తొందరగా పనికానిస్తే.. అనే వినూత్న ఆలోచనతో జపాన్ చేసిన ఆవిష్కరణ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ మాదిరి "హ్యూమన్ వాషింగ్ మెషిన్" అన్నమాట. ఏంటీ మిషన్‌తో స్నానమా అని విస్తుపోకండి. ఇది వెల్‌నెస్‌ని దృష్టిలో ఉంచుకుని, అత్యాధుని ఫీచర్లతో రూపొందించారు. అసలేంటీ మిషన్ ? ఎలా పనిచేస్తుంది..? తదితరాల గురించి తెలుసుకుందామా..!ఈ "హ్యూమన్ వాషింగ్ మెషిన్"ని ఒసాకాకు చెందిన సైన్స్ కో కంపెనీ ఏఐ సాంకేతికతో రూపొందించింది. దీన్ని జపాన్‌లో మిరాయ్ నింగెన్ సెంటకుకిగా పిలుస్తారు. ఈ మిషన్ కేవలం 15 నిమిషాల్లోనే మనిషి శరీరాన్ని శుభ్రపరుస్తుందట. అలాగే మంచి విశ్రాంతితో కూడిన మానసిక ఆనందాన్ని అందిస్తుందట. దీంట్లో కేవలం స్నానమే కాదు మనసు రిలాక్స్ అయ్యేలా చక్కటి వేడినీళ్ల మసాజ్ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే ఐఏ సెన్సార్లు మానవుల బాడీ మూడ్ ఎలా ఉందో టెస్ట్ చేసి దానికనుగుణంగా నీటి ఉష్ణోగ్రత ఆటోమెటిక్‌గా సెట్ అవుతుందట. అలాగే మన భావోద్వేగా పరిస్థితికి అనుకుణంగా మంచి విజువల్స్‌ని కూడా ప్రొజెక్ట్ చేస్తుందట. కేవలం పరిశుభ్రత మాత్రేమ గాక మంచి వెల్నెస్ అనుభవాన్ని కూడా అందిస్తుందని ఈ ఒసాకా కంపెనీ చైర్మన్ యసుకి అయోమా చెబుతున్నారు. ముఖ్యంగా అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ మిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇది కొత్తదేం కాదు..ఇంతకు ముందే ఈ మానవ వాషింగ్ మిషన్‌ని రూపొందించారు. దీని తొలి వర్షన్‌ని 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పోలో సాన్యో ఎలక్ట్రిక్ కో పరిచయం చేసింది. అయితే అప్పట్లో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ..కమర్షియల్ ప్రొడక్ట్‌గా ప్రజల్లోకి బాగా వెళ్లలేదు. కానీ ప్రస్తుతం ఏఐ సాంకేతికతో కూడిన ఈ మిషన్‌ని అత్యాధునిక ఫ్యూచర్లతో డిజైన్ చేశారు. ఈ ప్రొడక్ట్‌ని పానాసోనిక్ హోల్డింగ్స్ కార్పోరేషన్ కంపెనీ తీసుకురానుంది. ఈ ఏడాది ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పోలో ఈ సరికొత్త సాంకేతిక హ్యూమన్ వాషింగ్ మిషన్‌ని ప్రదర్శించనున్నారు. అక్కడ దాదాపు వెయ్యిమందికి పైగా అతిథులు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో.. ప్రత్యక్షం అనుభవం ద్వారా తెలుసుకోనున్నారు. అలాగే ఈ మిషన్ పనితీరు వారెంటీల గురించి సంకిప్త సమాచారం గురించి వివరింనుంది సదరు కంపెనీ ఒసాకా. అయితే సదరు కంపెనీ దీని ధర ఎంతనేది ఇంక ధృవీకరించలేదు. కాగా, ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆఖరికి వ్యక్తిగత శుభ్రతను కూడా హై-టెక్ లగ్జరీగా మార్చడం జపాన్‌కే చెల్లిందని ఒకరూ, ఇంత చిన్న పనికోసం అంతప్రయాస పడ్డారా మీరు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. 🚨AI-POWERED HUMAN WASHING MACHINE: BECAUSE WHO HAS TIME TO SCRUB?Japan’s "Mirai Ningen Sentakuki" is here to wash your...everything. A 15-minute AI-powered bath capsule uses jets, microbubbles, and calming videos to cleanse bodies and soothe egos.Chairman Yasuaki Aoyama… pic.twitter.com/0GBwOtCV9r— Mario Nawfal (@MarioNawfal) December 3, 2024 (చదవండి: ‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!) -
బాధలో పలికే భావాలు.. ప్రపంచమంతటా ఒక్కటే
హాంకాంగ్: పల్లెటూరు మైదానం ఆటలాడేటప్పుడు కాలికి ముల్లు గుచ్చుకుంటే పిల్లలైనా, పెద్దలైనా ఒకేలా ‘అబ్బా’అనో, ‘ఆ’అనో అరుస్తారు. ఇది తెలుగుభాషలో వచ్చే అక్షరాలేకదా అని అనకండి. ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లోని అక్షరాలను గమనిస్తే మనిషి బాధపడినప్పుడు అసంకల్పితంగా వెలువడే చిట్టిచిట్టి పదాలు, శబ్దాల్లో తొలి అక్షరంగా ఎక్కువగా అచ్చులు ఉంటున్నట్లు ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇంగ్లిష్‌ను చక్కగా నోరంతా తెరిచి పలికితే చలిదేశాల్లో అదే ఇంగ్లిష్‌ను సగం నోరు తెరిచి లోపల గొణుకుతున్నట్లు పలుకుతారు. ఒక్క భాషనే భిన్నంగా పలికే ప్రపంచంలో వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు.. హఠాత్తుగా బాధపడినప్పుడు మాత్రం ఆయా భాషల అచ్చులను మాత్రమే అధికంగా పలకడం చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. ఏదైనా భాషలో ఒక పదం ఏమిటో తెలియాలంటే దాని అర్థం తెలిసి ఉండాలి. కానీ ఆశ్చర్యార్థకాలు, కొన్ని పదాలకు అర్థాలతో పనిలేదు. వాటిని వినగానే అవి బాధలో ఉన్నప్పుడు పలికారో సంతోషంతో పలికారో తెలుస్తుంది. బాధలో పలికే పదాల్లో ఎక్కువ అచ్చులు ఉండగా హఠాత్తుగా ఆదుర్తా, సంతోషం కల్గినప్పుడు పలికే పదాల్లో హల్లులు ఎక్కువగా ఉంటున్నాయి. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘అకౌస్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 131 భాషలను ఒడబోసి బాధ, సంతోషం, అసహనం, ఆదుర్దా ఇలా హఠాత్తుగా ఏదైనా భిన్న పరిస్థితిని మనిషి ఎదుర్కొన్నపుడు భాషతో సంబంధం లేకుండా రెప్పపాటులో మనిషి గొంతు నుంచి వచ్చే శబ్దాల్లో ఎక్కువగా హల్లులు ఉంటున్నాయా లేదంటే అచ్చులు ఉంటున్నాయా అనేది కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనకారుల బృందం బయల్దేరింది. ఆఫ్రికా, ఆసియా, ఆ్రస్టేలియా, యూరప్‌లలో అత్యధికంగా మాట్లాడే 131 భాషల్లో జనం బాధపడినప్పుడు, అసహనంగా ఫీల్ అయినప్పుడు, సంతోషపడినప్పుడు అత్యధికంగా వాడే 500కుపైగా ఆశ్చర్యార్థకాలు, పదాలను పరిశోధకులు అధ్యయనం కోసం ఎంపిక చేశారు. వీటిల్లో సంతోషం, బాధ, ఆదుర్దా ఇలా మూడు భాగాలుగా విడగొట్టి వాటిల్లో ఏ భావానికి ఏ పదం వాడారో, ఆ పదం అచ్చుతో మొదలైందో, హల్లుతో మొదలైందో లెక్కగట్టారు. ఇంగ్లిష్ మాట్లాడే దేశాల ప్రజల్లో సంభ్రమాశ్చర్యాలకు లోనైతే ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఎక్కువగా ఔచ్, వావ్ అనే పదాలనే ఎక్కువగా పలుకుతున్నారు. ఇలా అన్ని ఆశ్చర్యార్థకాలను పట్టికగా వేశారు. ఏం తేలింది? భాషతో సంబంధం లేకుండా జనమంతా బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా పలికిన శబ్దాల్లో ఎక్కువగా అచ్చులే ఉన్నాయి. భాషలు వేరుగా ఉన్నాసరే జనం ఏదైనా ఎమోషన్‌కు లోనైనప్పుడు పలికే తొలిపలుకుల ధ్వనులు దాదాపు ఒకేలా ఉంటాయని తేలింది. మానవుడుకాకుండా ఇతర జీవులు.. అంటే పక్షులు, జంతువులు భయపడినప్పుడు, వేదనకు గురైనప్పుడు ఒకేలా శబ్దాలు చేస్తాయనే భావనకు మూలం దాదాపు తెలిసినట్లేనని పరిశోధకులు చెప్పారు. -
115 ఏళ్ల బామ్మ..! ఆమె సుదీర్ఘకాల జీవిత రహస్యం ఇదే..!
ఇటీవల మనుషులు మహా అయితే 60 లేదా 70కి మించి బతకడం కష్టంగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చామంది 30 లేదా 40కే టపా కట్టేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సుదీర్థకాలం జీవించి ఔరా అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ వృద్ధ మహిళ కూడా. వయసు పరంగా సెంచరీ కొట్టిన ఈ వృద్ధ మహిళ తన సుదీర్ఘకాల జీవిత రహస్యాన్ని షేర్ చేసుకుంది. ఆ వృద్ధురాలి ప్రకారం..సుదీర్థకాలం జీవించడం ఎలా అనే దాని గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అమెరికాలో అత్యంత వృద్ధురాలు ఎలిజబెత్ ఫ్రాన్సిస్ ఇటీవల తన 115వ పుట్టిన రోజును జరుపుకుంది. ఆమె ముఖంతో సంతృప్తికరంగా జీవిస్తున్నానే ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు కనిపిస్తుంది. యూఎస్‌లో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు కూడా ఆమెనే. ఈ నేపథ్యంలో ఎలిజబెత్ తన సుదీర్ఘ ఆరోగ్య రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె సుదీర్ఘ ఆరోగ్య రహస్యం ఏంటంటే..ఎలిజబెత్ చిన్న వయసులోనే తన తోడబుట్టిన వాళ్ల నుంచి విడిపోయి అత్త వద్ద పెరిగింది. చిన్నతనంలో కొద్దిపాటి సవాలును ఎదుర్కొన్న ఎలిజబెత్ పెద్ద కుటుంబాన్ని నిర్మించుకుని ఆనందకరంగా జీవించింది. ప్రస్తుతం ఆమె ముగ్గురు మనవళ్లు, ఐదుగురు మనవరాళ్లు, నలుగురు మునిమనవళ్లతో సంతోషంగా ఉంది. ఆమె సుదీర్ఘ జీవిత రహస్యానికి కారణం తన కుటుంబమే అంటోంది. తన కుటుంబ సభ్యుల పట్ల ఉన్న బలమైన బంధం, ప్రేమానురాగాలే ఇంత కాలం బతికేలా చేశాయని చెబుతోంది. ఇక ఆమె దీర్ఘాయువుకి దోహదపడిన జీవనశైలి వద్దకు వస్తే..ఎలిజబెత్ డ్రైవింగ్ నేర్చుకోకపోవడంతో ఎక్కడికి వెళ్లిన నడుచుకునే వెళ్లేది. ఈ శారీరక శ్రమ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నివారించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. పైగా ఆమె ఆయుర్దాయాన్ని పెంచింది. ఇక రోజులో కాసేపే ఏకాంతంగా గడిపే అలవాటు మానసిక భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చేసి మానసికంగా స్థైరంగా ఉండేలా చేసింది. ఒత్తిడిని ఎదుర్కొనే సామార్థ్యాన్ని పెంపొందడమే కాకుండా మెరుగైన సంబంధాలను ఏర్పరుచుకునేలా చేసింది. అలాగే ఎలిజబెత్‌కు ఉన్న ఆశావాహ దృక్పథం ఆరోగ్యకరమైన జీవితానికి దోహదం చేసింది. అలా అని ఆమె జీవితం ఏమీ పూలబాట కాదు. చిన్నతనంలో తల్లిని కోల్పోయి మరోకరి వద్ద పెరగడం దగ్గర నుంచి ఒంటరి తల్లిగా తన పిల్లలను పెంచాల్సిన కష్టాలను కూడా ఫేస్ చేసింది. అయితే ఆమె కష్ట సమయంలో ధైర్యంగా ప్రతికూల పరిస్థితులతో పోరాడి తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేలా కృషి చేసింది. ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు, సవాళ్లు బలంగా ఎదిగేందుకు, సుదీర్ఘకాలం జీవించేందుకు ఉపకరించింది. ఇక్కడ ఎలిజబెత్ జీవితం కాలానుగుణంగా వచ్చే కష్టాలు, కన్నీళ్లతో పోరాడుతూ.. మంచి ఆరోగ్యపు అలావాట్లతో సుదీర్ఘకాలం జీవించొచ్చని చాటి చెప్పింది. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ల కంటే కష్టాల కడలిని ఎదుర్కొని వచ్చే విజేతలకే ఎక్కువ ఆత్మబలం ఉంటుందని ఎలిజబెత్ గాథ చెబుతోంది.(చదవండి: నాన్‌స్టిక్ పాన్‌తో పెరుగుతున్న టెఫ్లాన్ ఫ్లూ కేసులు!) -
ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. వివాదానికి కారణమైన ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు శుక్రవారం పుణేకు చెందిన ఐస్‌క్రీమ్ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్‌డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!తన సోదరి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బ్రెండన్ ఫిర్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్ ఐస్‌క్రీమ్ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ నెట్టింట్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.. -
దృష్టిని బట్టి.. సృష్టి!
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు ఇవే..!
మనం ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం. కానీ అది మన చేతిలోని పనే. పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. సులభంగా మన నిత్య జీవితంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటామట. మన దీర్ఘాయువుకు మూలం అవేనట చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనిషి ఆనందాన్ని నిర్ణయించే ఈ హార్మోనులు గురించి తెలుసుకుంటే సంతోషంగా ఎలా ఉండాలో తెలుస్తుందని చెబుతున్నారు నిపుణులు. తద్వారా మనశ్శాంతిని, సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకోగలం అని అంటున్నారు. అవేంటో చూద్దామా..!ఆ హార్మోనులు ఏంటంటే..ఎండార్ఫిన్స్, డోపామిన్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు గురించి పూర్తిగా తెలుసుకుంటే హాయిగా సంతోషంగా ఉంటాం అని చెబుతున్నారు నిపుణులు. ముందుగా ఒక్కొక్కదాని గురించి సవింరంగా తెలుసుకుందాం..ఎండార్ఫిన్స్: వ్యాయామాలు చేసేటప్పుడూ విడుదలయ్యేదే ఈ ఎండార్ఫిన్స్. ఇవి వ్యాయామం వల్ల కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి. అలాగే నవ్వడం వల్ల కూడా ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే యోగాలో హాస్యాసనం కూడా ఒక ఆసనంగా మన పూర్వీకులు చేర్చారు. అందువల్ల ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయడం, హాస్య భరిత సీన్లు, వీడియోలు చూడటం వంటివి చేయాలి. డోపామిన్: ఎవరైన పొగడగానే లోపల నుంచి తన్నుకుంటే వచ్చే ఆనందానకి కారణం ఈ హార్మోనే. దీని స్థాయిని పెంచుకుంటే ఆనందంగా ఉంటాం. కొత్త బట్టలు, వస్తువులు కొనుక్కున్నప్పుడు కలిగే ఫీలింగ్ ఇదే. ముఖ్యంగా భార్యభలు ఈ విషయాన్ని గ్రహించి పొగడటం ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ సంతోషాన్ని పొందడమే గాక మీ మధ్య బంధం కూడా బలపడుతుంది. సెరిటోనిన్: ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగేది. సమాజానికి, స్నేహితులకు ఏదైన సాయం చేయడం వల్ల వచ్చే ఒక విధమైన ఆనందానికి మూలమే ఈ సెరిటోనిన్. అందుకే మొక్కలు నాటడం, రక్తదానం, అనాథలకు సేవ తదితరాల వల్ల సంతోషంగా ఉంటారు.ఆక్సిటోసిన్: పెళ్లైన కొత్తలో శరీరంలో బాగా విడుదలయ్యే హార్మోన్ ఇదే. ఎవరినైనా మన దగ్గరకు తీసుకున్నప్పడూ మనలో విడుదలయ్యే హార్మోన్ ఇది. స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వల్ల విడుదలవుతుంది. మన పిల్లలను, జీవిత భాగస్వామిని కౌగలించుకున్నప్పుడు మనలో కలిగే ఒక విధమైన సంతోషానికి కారణం ఈ హార్మోన్. అందువల్ల తరుచుగా మీకు ప్రియమైన వాళ్లను హగ్ చేసుకుంటూ ఉండటం వంటివి చేయండి. దీని వల్ల ప్రేమానుబంధాలు బలపడి కుటుంబ ఐక్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఇలాంటివి అలవాటు చేసుకోవాలి..ఓ అరంగంట వ్యాయామం చేయండిచిన్న పనులకు సంతృప్తిగా ఫీలవ్వుతూ గర్వంగా ఫీలవ్వండి. ఇక్కడ కళ్లు నెత్తికెక్కెలా కాదు. కేవలం చిన్న లక్ష్యాలను అందిపుచ్చుకున్నామని, సంతోషంగా భావించడం. అలాగే మీ పిల్లలను, భాగస్వామిని తరుచుగా ప్రశంసిచండి.తోచినంతలో సాయం చేసే యత్నం చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేయండి. మీ పిల్లలను, భాగస్వామిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడం, ప్రేమను వ్యక్తం చేసేలా హగ్ చేసుకోవడం వంటివి చేస్తే వాళ్లు భరోసాగా ఫీలవ్వుతారు. పైగా మీరు కూడా సంతోషంగా ఉంటారు. పైసా ఖర్చు పెట్టకుండా ఆనందాన్ని పొందడమే గాక సంతోషంగా హాయిగా జీవిద్దాం. (చదవండి: రాజకీయ నాయకులే దేవుళ్లుగా పూజలందుకుంటున్న ఆలయాలు ఇవే..!) -
ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి మృతి నమోదు
కరోనాకు మించిన ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్న హెచ్5 ఎన్1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) పలు దేశాలకు విస్తరిస్తోంది. పశువులు, పాల ద్వారా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకుతోంది. అమెరికాలోని పలు నగరాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో హెచ్5ఎన్1 వైరస్ కేసుల పెరుగుదలపై భారతదేశం కూడా అప్రమత్తమైంది. హెచ్5ఎన్1 వైరస్‌ను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు.తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మరణం నమోదయ్యిందని తెలిపింది. మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ఏజెన్సీ వెల్లడించలేదు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు తదితర లక్షణాలతో బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అతను అప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడుతున్నాడు.మే 23న ఈ కేసు గురించి తమకు మొదట తెలిసిందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది కరోనావైరస్ కంటే వంద రెట్లు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన నివేదికలో ప్రస్తుతానికి ఒకరి నుండి మరొకరికి హెచ్5ఎన్1 వైరస్ సోకిన సందర్భాలు కనిపించలేదు. అయినప్పటికీ ఈ వైరస్ విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈ వైరస్ సంక్రమించినప్పుడు దాని లక్షణాలు తేలికపాటి నుండి తీవ్ర స్థాయి వరకూ ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో బర్డ్ ఫ్లూపై భారత ప్రభుత్వం ఒక సలహాను జారీ చేసింది. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి
బోస్టన్: ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. అమెరికాలోని వేమౌత్ పట్టణంలో నివసించే 62 ఏళ్ల రిచర్డ్ ‘రిక్’ స్లేమాన్‌కు మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో మార్చి నెలలో వైద్యులు విజయవంతంగా కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పనిచేస్తుందని వైద్యులు ఆనాడు తెలిపారు. అయితే శనివారం ఆయన హఠాన్మరణం చెందారని వైద్యులు వెల్లడించారు. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వల్లే ఆయన మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యంకాలేదని వైద్యులు స్పష్టంచేశారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్లోనే స్లేమాన్‌కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. అయితే ఐదేళ్ల తర్వాత అది నెమ్మదిగా పాడవుతూ వచి్చంది. దీంతో గత ఏడాది నుంచి మళ్లీ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యులు ఈసారి మరో ప్రత్యామ్నాయంలేక జన్యుమారి్పడి పంది కిడ్నీ అమర్చేందుకు ఆయనను ఒప్పించి రెండు నెలల క్రితం అమర్చారు. -
రోగికి పంది కిడ్నీ మార్పిడి.. అంతలోనే విషాదం
అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. మసాచుసెట్స్ పంది కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేసిన రిచర్డ్ స్లేమాన్ (62) మరణించారు.ఇంగ్లాండ్ వేమౌత్ నగరానికి చెందిన రిచర్డ్ స్లేమాన్ (62) కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే 2018లో వైద్యులు అతనికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కొంత కాలం బాగున్నా.. ఆ తర్వాత కిడ్నీ సమస్య మొదటికి రావడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఫలితం లేకపోవడంతో వైద్యులు స్లేమాన్‌కు పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సలహా ఇచ్చారు.మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులుఈ ఏడాది మార్చి 16న అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు నాలుగు గంటల శ్రమించి స్లేమాన్‌కు పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ తరుణంలో ఏప్రిల్ 11న (నిన్న) స్లేమాన్ మరణించినట్లు కుటుంబసభ్యులు, మసాచుసెట్స్ వైద్యులు తెలిపారు.ఆధారాలు లేవుఈ సందర్భంగా పందికిడ్నీని అమర్చడం వల్లే స్లేమాన్ మరణించినట్లు ఆధారాలు లేవని వైద్యులు వెల్లడించారు. కుటుంబసభ్యులు తమకు స్లేమాన్తో మరికొంత కాలం పాటు తమతో గడిపేందుకు కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్పారు.గతంలో గతంలో బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. రెండు నెలల వ్యవధిలోనే బాధితుడు మరణించాడు. స్లేమాన్ మాత్రం తాను రెండేళ్లు జీవిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు పంది కిడ్నీని అమర్చాలని కోరడంతో మసాచుసెట్స్ వైద్యుల్ని బాధితునికి పంది కిడ్నీని అమర్చారు. కానీ స్వల్ప వ్యవధిలో స్లేమాన్ మరణించడం వైద్య చరిత్రలో విషాదం నెలకొంది. -
ఈ సంగతి విన్నారా! ఒకే కాన్పులో.. 'నైన్ ఆల్ ఫైన్'..!!
సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు! -
మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాతో టీబీ కొత్త వ్యాక్సిన్!
క్షయ వ్యాధి ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అయినా..చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోని దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. ఇది మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన వస్తుంది. క్షయ ఈ వ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు. మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది. అలాంటి ఈ వ్యాధికి ఇప్పటి వరకు బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్ మరియు గురిన్), బోవిన్ టీబీ పాథోజెన్ అటెన్యూయేటెడ్ వేరియంట్ అనే ఏళ్ల నాటి పాత వ్యాక్సిన్లే ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ పరిమిత ప్రభావమే ఉంది. అందువల్లే ప్రభావవంతంగా పనిచేసేది, ముఖ్యంగా చిన్నారులు, పెద్దలకు మెరుగైన ఫలితాలనిచ్చే వ్యాక్సిన్‌పై ఎన్నే ఏళ్లుగానో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ పరిశోధనల ఫలితమే ఎంటీబీ వ్యాక్సిన్(ఎంటీబీవీఏసీ). ఇది మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియా నుంచే క్షయ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేసేలా వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. అయితే ఇది ఎంత ప్రభావవంతంగా ఉందనే దానిపై పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్‌ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ Biofabri సహకారంతో 2025లో భారత్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని(మార్చి 24) పురస్కరించుకుని ఈ విషయాన్ని బయోఫాబ్రి ప్రకటించింది. ఆ ట్రయల్స్ ద్వారా ఎంటీబీవీఏసీ వ్యాక్సిన్ భద్రత, సమర్థతను అంచనా వేస్తారు. ఈ ఎంటీబీ వ్యాక్సిన్ బీజీజీ కంటే ప్రభావవంతమైనది, ఎక్కువకాలం పనిచేసే వ్యాక్సిన్‌గా పేర్కొన్నారు పరిశోధకులు. ఇది పెద్దలు, యుక్త వయసులు వారికి మంచి సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా అని చెప్పొచ్చన్నారు. ఈ మేరకు బయోఫ్యాబ్రి సీఈవో ఎస్టేబాన్ రోడ్రిగ్జ్ మాట్లాడు.. ఈ క్షయ వ్యాధి కారణంగా ఏటా 1.6 మిలియన్లకు పైగా ప్రజలు చనిపోతున్నారు. అంంతేగాక ప్రపంచవ్యాప్తంగా క్షయకు సంబంధించిన కేసులు దాదాపు 28% ఉన్నాయని అన్నారు. ఈ కొత్త వ్యాక్సిన్ కొత్త ఆశను రేకెత్తించేలా భారత్‌లోనే పెద్దలు,కౌమర దశలో ఉన్నవారిపై ట్రయల్స్ నిర్వహించడం అనేది గొప్ప మైలురాయి అని అన్నారు. ఇక బయోఫ్యాబ్రి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..ప్రభావవంతమైన వ్యాక్సిన్ కోసం పడ్డ అన్వేషణ ఇన్నేళ్లకు ఫలించింది. దీనికి తోడు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్‌తో పెద్ద ప్రొత్సాహం అందినట్లయ్యిందన్నారు. ఈ కొత్త టీబీ వ్యాక్సిన్‌ని ఆవిష్కరించడంలో డాక్టర్ ఎస్టేబాన్ రోడ్రిగ్జ్, డాక్టర్ కార్లోస్ మార్టిన్ల భాగస్వామ్యం ఎంతగానో ఉందన్నారు. ఈ ట్రయల్స్‌కి ముందే ఈ వ్యాక్సిన్ అనేక మైలు రాళ్లను సాధించింది. వాటిలో ఫేజ్2 డోస్ ఫైండింగ్ ట్రయల్ ఇటీవలే పూర్తైయ్యింది. ఇక నవజాత శిశువులలో డబుల్ బ్లైండ్, కంట్రోల్డ్ ఫేజ్3 క్లినికల్ ట్రయల్ 2023లో ప్రారంభమైంది. కాగా, ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి ఏడు వేల మంది, మడగాస్కర్ నుంచి 60 మంది, సెనెగల్ నుంచి 60 మంది నవజాత శిశువులకు టీకాలు వేయనున్నారు. ప్రధానంగా శిశువుల్లో ఈ ఎంటీబీ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని, సామర్థాన్ని అంచనావేయడమే లక్ష్యం. అంతేగాదు హెచ్ఐవీ-నెగిటివ్, హెచ్ఐవీ-పాజిటివ్ పెద్దలు ,కౌమారదశలో ఉన్నవారిపై కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావంపై అంచనా వేయనుండటం గమనార్హం. ఈ ట్రయల్స్‌ని 2024 ద్వితీయార్ధంలో సబ్-సహారా ఆఫ్రికాలో ప్రారంబించనున్నారు. (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!) -
మనిషి ఎంతకాలం జీవించవచ్చు? పరిశోధనల్లో ఏం తేలింది?
దీర్ఘాయుష్షు... ఇది ప్రతీమానవునికీ ఉండే కోరిక. అందుకే శాస్త్రవేత్తలు నిరంతరం మనిషి ఆయుష్షు పెంపుదలకు సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల డచ్ పరిశోధకులు మానవుడు ఎంత సుదీర్ఘకాలం పాటు జీవించవచ్చనే విషయాన్ని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. డచ్ పరిశోధకులు మనిషి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను కూడా వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన స్థితిగతులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని డచ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు తమ పరిశోధనల కోసం ముందుగా వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరుల డేటాను సేకరించారు. దీని ని సమూలంగా విశ్లేషించారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక రూపొందించారు. రోటర్‌డామ్‌లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లని తమ పరిశోధనల ద్వారా కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త ఎక్కువేనని వారు చెబుతున్నారు. పరిశోధకులు మూడు దశాబ్దాల డేటా ఆధారంగా మానవుని గరిష్ట ఆయుష్షును అంచనావేయగలిగారు. ఈ పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మనిషి ఆయుష్షు పెరుగుతూ వస్తోందని, వృద్ధాప్యం కూడా దూరమవుతున్నదన్నారు. ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అని డచ్ పరిశోధకులు పేర్కొన్నారు. కాగా ఈ డచ్ శాస్త్రవేత్తల పరిశోధనలు అంతకుముందునాటి అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనల నివేదికలను పోలివుండటం వివేషం. అమెరికా శాస్త్రవేత్తలు కూడా డచ్ పరిశోధకులు వెల్లడించిన గరిష్ట వయో పరిమితినే గుర్తించారు. అయితే తమ దేశంలో ప్రస్తుతం ఉన్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు వివరించారు. డచ్ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ఈ పరిశోధనల కోసం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తొలగించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే 122 సంవత్సరాల164 రోజులు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ తన ఆయుష్షుకు అడ్డుపడే అన్ని పరిధులను అధిగమించారని ఐన్‌మహ్ల్ పేర్కొన్నారు. ఈయన మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ పరిశోధనల వివరాలు త్వరలోనే ప్రచురితమై అందుబాటులోకి రానున్నాయి. -
‘కణా’కష్టం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోందా? 4.85 కోట్ల జంటలు సంతానలేమితో బాధ పడటానికి ఇదే కారణమా? ఐదారు వందల సంవత్సరాల తర్వాత పరిస్థితి మరింత తీవ్రం కానుందా? అంటే... అంతర్జాతీయ అధ్యయనాలు అవుననే అంటున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్లే ఈ పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పురుషుల్లో శుక్రకణాలు తగ్గడమే సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని చెబుతున్నాయి. సమాజంలో సాధారణంగా స్త్రీల పునరుత్పత్తి సామర్థ్యంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంటుందని, పురుషులకు సంబంధించి పెద్దగా చర్చ జరగడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. పితృస్వామ్య వ్యవస్థ కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నాయి. ఆఫ్రికా, ఆసియా వంటి దేశాల్లోనైతే సంతానలేమికి స్త్రీనే కారణంగా పేర్కొంటూ నిందిస్తారు. కాగా కొన్ని ప్రాంతాల్లో బహు భార్యత్వం ఇప్పటికీ కొనసాగుతుండటానికి గల కారణాలలో సంతానలేమిని అధిగమించాలన్నది ఒకటని అంటున్నారు. 51 శాతం తగ్గిన శుక్రకణాలు ప్రపంచ వ్యాప్తంగా సంతానలేమిపై ‘çహ్యూమన్ రిప్రొడక్షన్ అప్డేట్–2023’నివేదిక వెలువడింది. 20, 21 శతాబ్దాలలో ఏం జరిగిందనేది దీని సారాంశం. 1973 నుంచి 2020 వరకు 50 ఏళ్ల కాలంలో పరిస్థితిని నివేదిక వివరించింది. 1970లో 20–30 వయస్సు గల ఒక యువకుడికి వంద మిలియన్ల శుక్రకణాలు ఉన్నాయనుకుంటే.. 2020 వచ్చే నాటికి అదే వయస్సుగల వారు కొందరిలో 50 శాతం వరకు తగ్గిపోయాయి. అంటే 50 మిలియన్లకు శుక్రకణాలు తగ్గిపోయాయన్న మాట. అలాగే 1972లో ఒక వ్యక్తికి శుక్రకణాలు 101 మిలియన్లు ఉంటే... 2018లో అదే వయస్సు గల వారిలో శుక్రకణాల సంఖ్య 49 మిలియన్లకు పడిపోయాయి. ఇలా గడిచిన ఐదు దశాబ్దాలలో మానవ శుక్రకణాల సాంద్రత 100 మిలియన్ల నుంచి 49 మిలియన్లకు పడిపోయింది. అంటే సుమారుగా 51 శాతం తగ్గిందన్న మాట. అంటే పునరుత్పత్తి సామర్థ్యం ఆ మేరకు తగ్గిపోయిందన్నమాట. ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతుండటం గమనార్హం. భారత్‌లో 2.75 కోట్ల మంది.. సంతానలేమితో బాధపడేవారిలో 80 శాతం మందికి ప్రధానంగా శుక్రకణాలు తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి జీరో కూడా ఉండొచ్చు. జీరో శుక్రకణాలు ఉండేవారు జనాభాలో 7 నుంచి 10 శాతం మంది ఉంటారని అంచనా. ఇక ఇండియాలో 2.75 కోట్ల మంది సంతాన లేమితో బాధపడుతున్నారు. 48 శాతం మందిలో స్త్రీలు కారణం కాగా, 20.4 శాతం ఇద్దరిలో సమస్యల వల్ల, 31.6 శాతం మందిలో పురుషుల కారణంగా సంతాన సమస్య ఏర్పడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో బాధపడే జంటలు 4.85 కోట్లు ఉన్నట్లు అంచనా. సంతానలేమితో బాధపడేవారిలో శుక్రకణాల సంఖ్య 15 మిలియన్ల నుంచి 20 మిలియన్ల కంటే తక్కువగా ఉంటుంది. పురుషులలో హార్మోన్ల లోపం, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పుట్టుకతో వచ్చే లోపాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఇన్ఫెక్షన్లు, మారుతున్న జీవన విధానం, మానసిక, శారీరక, వృత్తిపరమైన ఒత్తిడులు, ఆలస్యంగా జరుగుతున్న వివాహాలు, ఆహార కల్తీలు, ధూమ మద్యపానానికి అలవాటు పడడం, మాదకద్రవ్యాలకు బానిసలవటం, వాతావరణ కాలుష్యం, మొబైల్స్ విపరీత వినియోగం లాంటివి సంతానలేమికి కారణాలుగా చెబుతున్నారు. వైద్య చికిత్సలతోసమస్యను అధిగమించొచ్చు సంతానోత్పత్తి సవ్యంగా జరగాలంటే ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. శుద్ధిచేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. ధూమ, మద్యపానానికి దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయడం, ధ్యానం లాంటివి అలవరుచుకోవాలి. ఏడెనిమిది గంటల నిద్ర ఉండాలి. అయితే శుక్రకణాల సంఖ్యను పెంచాలన్నా, పునరుత్పత్తి సామర్థ్యం పెంచాలన్నా అనేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స చేయించుకుంటే సంతానోత్పత్తి సమస్యలను అధిగమించవచ్చు. ఎజోస్పెర్మియా (జీరో స్పెర్మ్ కౌంట్) లోపాన్ని సరిదిద్దేందుకు ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. రెండు రకాలైన (నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా) ఎజోస్పెర్మియా లోపాలను వైద్యపరంగా సరిదిద్దేందుకు అవకాశం ఉంది. ఇక వ్యారికోసి సమస్య కారణంగా శుక్రకణాలు తగ్గిన పురుషులకు మైక్రోసర్జికల్ వ్యారోకోసిలెక్టమీ చేయడం ద్వారా వాటిని పెంపొందించవచ్చు. – డాక్టర్ రాఘవేంద్ర కోస్గి, సీనియర్ కన్సల్టెంట్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్,అపోలో ఆస్పత్రి, హైదరాబాద్ -
తొలిసారిగా మానవ మెదడులో విజయవంతంగా చిప్ ఇంప్లాంటేషన్!
నేరుగా మనుషుల మెదడులోకి చిప్‌ని ప్రవేశపెట్టే ప్రయోగాలకు టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే ఈ ప్రయోగం ఉద్దేశం. అమెరికా ప్రభుత్వ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి ఈ అనుమతి లభించడంతో ఈ సరికొత్త ఆవిష్కరణకు నాందిపలికింది ఇలాన్ మస్క్ స్టార్ట్ప్ కంపెనీ న్యూరాలింక్. తొలుత కోతుల మెదడులో ఈ చిప్ అమర్చి ప్రయోగాలు చేయగా, అవి సత్ఫలితాలు ఇవ్వడంతో మానవులపై ప్రయోగాలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఓ రోగి బ్రెయిన్లో న్యూరాలింక్ తొలిసారిగా వైర్లెస్ బ్రెయిన్ చిప్‌ని అమర్చింది. ఈ విషయాన్ని ఇలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. సదరు రోగి కూడా కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ చిప్ ఇంప్లాంటేషన్ చిన్నపాటి సర్జరీ అమర్చుతారు . 'ఇన్వాసిస్' అనే సర్జరీ ద్వారా మెదడులో ఐదు నాణేలతో పేర్చబడినట్లు ఉండే చిప్‌ని అమర్చినట్లు న్యూరాలింక్ పేర్కొంది. ఇది లింక్ అనే ఇంప్లాంట్ ద్వారా పనిచేస్తుంది. మస్క్ కంపెనీ చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలిస్తే బ్రెయిన్ మెషిన్ లేదా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రీసెర్చ్‌లో గొప్ప పురోగతి లభించినట్లు అవుతుంది. దీనివల్ల నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. అంతిమంగా ఈ ప్రయోగంతో 'మానవాతీత శక్తి'ని పొందగలుగుతాం. అంతేగాదు ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యితే గనుక మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేపినట్లు అవుతుంది. మెదడులో చిప్ అమర్చేది ఇలా.. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. అందువల్ల సమీపంలోని కణజాలానికి నష్టం ఉండదు. చిప్‌ను సురక్షితంగా, అత్యంత కచ్చితత్వంతో, చిన్నపాటి సర్జరీతో నేరుగా అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను 'న్యూరాలింక్' అభివృద్ధి చేసింది. చిప్‌లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జి అవుతుంది. అందువల్ల దీన్ని ధరించినవారు సాధారణంగానే కనిపిస్తారు. కంటికి చేసే లేసిక్ సర్జరీ తరహాలో భవిష్యత్‌లో చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో బీసీఐ(బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ చిప్)లను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునికీకరించాలని మస్క్ భావిస్తున్నారు. ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తోంది. పనిచేసేది ఇలా.. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి ఎన్1 చిప్‌కు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది. కలిగే ప్రయోజనాలు.. న్యూరాలింక్ బీసీఐ చిప్ .. మానవులు, కంప్యూటర్ల అనుసంధానానికి బాటలు వేస్తుంది. ఆలోచనశక్తి ద్వారా.. తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను ఆపరేట్ చేసేందుకు ఇది సాయపడుతుందని ఆ సంస్థ చెబుతోంది. భవిష్యత్‌లో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలను సాధించొచ్చని పేర్కొంది. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంది. వీరు సులువుగా ఉపకరణాలను ఉపయోగించగలుగుతారు. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వీలుంది. డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం వాడొచ్చు. ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్ సాగించడానికి, బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని కూడా నియంత్రించొచ్చు. కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటి చూపును, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు. అంతేగాదు సుదీర్ఘ భవిష్యత్‌లో దీనివల్ల ‘మానవాతీత విషయగ్రహణ సామర్థ్యం’ (సూపర్ హ్యూమన్ కాగ్నిషన్) సాధించడమే తమ లక్ష్యమని మస్క్ చెబుతున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమని స్పష్టంచేస్తున్నారు. అవసరమైతే ఏఐతో 'సురక్షిత సహజీవనం' చేయడానికీ ఇది సాయపడుతుందని కూడా చెబుతున్నారు. (చదవండి: షుగర్‌ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్?) -
కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?
మానవ తప్పిదాలతో పర్యావరణాన్ని చేజేతులారా కలుషితం చేశాం. దానికి ప్రతిగా రోజుకో కొత్త వింత వ్యాధులు ప్రకృతి ప్రకోపానికి ఫలితమా! అన్నట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆ వ్యాధులు జంతువులను నుంచి మొదలు పెట్టి మానవులకు సంక్రమిస్తున్నాయి. వాటికి చికిత్స విధానం ఉందో లేదో తెలియని స్థితి. పోనీ రాకుండా నివారించేలా ఏం చేయాలో ఎలా సంక్రమించకుండా చెయ్యాలనేది కూడా చిక్కు ప్రశ్నే. అలాంటి మరో వింత వ్యాధి అగ్రరాజ్యాన్ని ఓ కుదుపు కుదుపేస్తుంది. అక్కడ ఏటా వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో ఎక్కడ మానవులకు సంక్రమిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా వ్యాధి? మానువులకు సంక్రమించే అవకాశం ఉందా? అగ్రరాజ్యం అమెరికాలో 'జాంబీ డీర్ వ్యాధి' కలకలం సృష్టిస్తోంది. అక్కడ వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లోని జంతువుల్లో తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి వందల కొద్ది జంతువులు ఈ వ్యాధి బారినే పడటం శాస్త్రవేత్తలను ఒకింత భయాందోళనలకు గురి చేసింది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్ధకం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి. ప్రధానంగా జంతువులకే సంక్రమించినప్పటికీ అది చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ 'జాంబీ డీర్ డిసీజ్'ని వైద్య పరిభాషలో (క్రానిక్ వేస్టింగ్ డిసీజ్(సీడబ్ల్యూడీ) అంటారు. అంటే ప్రోటీన్ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి. దీన్ని చాలా నెమ్మదిగా చుట్టుముట్టే ప్రమాదకర వ్యాధిగా నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో వచ్చిన 'మ్యాడ్ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)' గుర్తు చేసుకున్నారు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. It starts. You watch: be walking down the street one day, happy about how things are finally going right, and CHOMP!! zombie deer bites ya in the ass. pic.twitter.com/HOgQuQ5lEp — Ryan (@Ryno_Charger) December 24, 2023 ఈ మేరకు సీడబ్ల్యూడీ పరిశోధకుడు డాక్టర్ కోరి ఆండర్సన్ మాట్లాడుతూ..మానువులకు వస్తుందా? రాదా? అని నిర్థారించి చెప్పకలేకపోయినప్పటికీ.. సంసిద్ధగా ఉండటం మాత్రం ముఖ్యమని నొక్కిచెప్పారు. ఇది ఒక ప్రాంతంలో విజృంభిస్తే..పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అని అన్నారు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ప్రోటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రోటీన్ల వ్యాధి. Scientists confirm this is the best approach to combating the zombie deer disease pic.twitter.com/HmQKCF8STO — Hot White Hennessy (@Phillystunna221) December 25, 2023 ఇది సోకిన జంతువులు గానీ మనుషులు గానీ చనిపోతే అక్కడ భూమిలోనే డికంపోజ్ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు ఉండిపోతాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్, రేడియేషన్ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని మరింతగా నిరోధకతను చూపిస్తుందని అన్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 1997 నుంచే సీడబ్ల్యూడీకి సంబంధించిన వ్యాధులు మానవులకు సంక్రమించకుండా నిరోధించే ప్రాముఖ్యత గూర్చి నొక్కి చెబుతుండటం గమనార్హం. Damn, Rudolph caught the zombie deer disease 💀 pic.twitter.com/vdEZr9aHyh — Creepy.org (@CreepyOrg) December 25, 2023 (చదవండి: అనుకోని ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించిన శాస్త్రవేత్తలు!) -
మీకు తెలుసా..?
-
దేవుడు మనిషికి ఇచ్చిన శక్తి ఎంతో తెలుసా?
మానవుడు శక్తి హీనుడనని డీలా పడిపోతాడు. ధనం,అధికారం లేదు కాబట్టి తాను పనిరానివాడిగా భావిస్తాడు. ఇక ఇంతే జీవితమని నిరాశ నిస్ప్రుహలకు స్థానం ఇచ్చి జీవితాన్ని చీకటి మయం చేసుకుంటాడు. ఏదో ఒకరోజు ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే కదా అని తన ఆఖరి ఘడియ కోసం నిర్లిప్తంగా ఎదురు చూస్తాడు. నిజానికి ప్రతి వ్యక్తికి దేవుడు చాలా శక్తిని ఇచ్చాడు. ధనం, అధికారం, ప్రతిష్టా, మంచి వంశం అనేవి పక్కన పెట్టండి. ప్రతి మనిషికి స్వతహగా ఎంతో శక్తిని ఇచ్చాడు. దాన్ని గుర్తించం, తెలుసుకుని ప్రయోజనం పొందే యోచన చెయ్యం. నిజానికి సైన్సు పరంగా మనిషిక ఎంత శక్తి ఉందో తెలిస్తే షాకవ్వడం ఖాయం!. అదేంటో సవివరంగా తెలుసుకుందాం!. మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణాలు ఉన్నాయి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నాయి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలి. ఇక హార్మోన్స్‌లో 45కేలరీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి. శరీరం వద్దకు వస్తే ప్రతి మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళాలు ఉన్నాయి. ప్రతి క్షణమునకు 20 లక్షల కణాలు తయారవుతాయి. గుండె దగ్గరకు వస్తే. మానవుని హృదయము నిముషానికి 72 సార్లు చొప్పున రోజుకు ఇంచు మించు 1,00,000 (ఒక లక్ష) సార్లు, సంవత్సరానికి 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొట్టుంది. మానవుని జీవిత కాలములో హృదయములోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేస్తాయి. మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వస్తాయి. మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోప్పడటానికి 43 కండరములు పనిచేస్తాయి. మనిషి చర్మంలో 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి. మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉంటుంది. మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును. మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి. మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి. మానవుని పంటి దవడ 276 కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు. మానవుని శరీరములో 206 ఎముకలు కలవు. మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 కిలోగ్రాముల ఫుడ్‌ని తింటాడు. మనిషి నోటిలో రోజుకు 2 నుంచి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది . మనిషి జీవిత కాలములో గుండె 100 ఈత కోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది. మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము. మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి. మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది. మానవుని మెదడుకు నొప్పి తెలియదు. మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది. మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది. మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది. ఒక్క తుమ్ము ఏకంగా.. తుమ్ము గంటకు వంద మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది. చేతి వేలి గోళ్ళు కాలి వేళ్ల గొళ్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి. స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది. స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు ఆర్పుతారు. రక్తం, నీరు కుడా వారికి 6 రెట్లు చిక్కగా ఉంటుంది. మానవుని మూత్రపిండములు నిముషానికి 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల మూత్రమును విసర్జిస్తాం. స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి. మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది. మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన. ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది. రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది. మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి. మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు. మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది. మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేస్తుంది. మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును. మనిషి ముఖములో 14 ఎముకలు ఉంటాయి. మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకుంటుంది. ప్రతి ఏడు రోజులకొకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడతాయి. కంటితో 2.4 మిలియన్ల.. మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేస్తుంది. ఆహారము నోటిలో నుంచి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది. మనిషి శరీరములో దాదాపు 75% నీరు ఉంటుంది. మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడగలడు. అది సుమారుగా 528 మెగా పిక్సల్ లెన్స్‌కి సమానం. ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండటమే గాక మన శరీరీ అవయవాల ప్రాముఖ్యతను గుర్తించి ఆరోగ్యంగా ఉండేందుక ప్రయత్నించాలి. ఇదంతా విన్నారు కదా ఇప్పుడు చెప్పండి మనకు ఏమి తక్కువగా ఉంది? . కాబట్టి అస్సలు నిరాశ , నిస్పృహను దరిచేరనీయొద్దు. గమ్యం చేరే వరకు ప్రయాణించండి. ఇక్కడకి కేవలం వచ్చి పోవడానికి రాలేదు. వెళ్లేలోపు ఏదోఒకటి ఇచ్చి పోవడానికే వచ్చాము. బీ స్ట్రాంగ్.. ఏదైనా సాధించాలని పట్టుదలను పెంపొందించుకోండి. విజయం తథ్యం. (చదవండి: నమస్కారం అంటే..ఏదో యాంత్రికంగా చేసేది కాదు! ఎక్కడ? ఎలా? చేయాలో తెలుసుండాలి!) -
ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
-
మనిషి చెప్పులు వేసుకున్నది ఎన్నడు? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు!
నాగరకత తొలినాళ్లలో మనిషి తన శరీరాన్ని రక్షించుకునేందుకు దుస్తులు వాడటం మొదలుపెట్టాడు. మరి కాలికి వేసుకునే చెప్పులు, బూట్ల వాడకం మొదలైందెన్నడు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? దీనికి ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాధానం కనుగొన్నారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇది మానవజాతి చరిత్రలోని అత్యంత పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మానవులు మధ్య రాతి యుగంలోనే బూట్లు ధరించి ఉండవచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నాటి కాలాన్ని మెసోలిథిక్ టైమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికన్ పూర్వ చరిత్రలో ఒకనాటి కాలం. ఈ నూతన ఆవిష్కరణ 75 వేల నుంచి ఒక లక్షా 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రకారం పురాతన మానవులు.. మనం ఇంతవరకూ భావిస్తున్నదానికన్నా ఎంతో నేర్పరులని తేలింది. ఈస్ట్ హార్ట్‌ఫోర్డ్‌లోని గుడ్విన్ యూనివర్శిటీకి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రాండీ లైస్ట్ ఒక వ్యాసంలో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణల్లో షూస్ అంటే బూట్లు ఒకటని తెలిపారు. ఈ వివరాలు 2020 ఆగస్టులో ప్రచురితమయ్యాయి. కార్లు, పడవలు, రాకెట్ షిప్‌ల వంటి వాహనాలు భారీ పరమాణంలోని బూట్ల మాదిరిగా ఉంటాయని లైస్ట్ దానిలో పేర్కొన్నారు. బూట్ల ఆలోచన నుంచే ఇటువంటి ఇటువంటి సాంతకేతికత ఆవిర్భవించిందని లైస్ట్ భావించారు. మానవజాతి ప్రారంభ సాంకేతిక ఆవిష్కరణలలో బూట్లు ఒకటి. గత పురావస్తు పరిశోధనలలో బూట్లు దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివని, ఇవి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చాయని భావించారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో సాగిన నూతన పరిశోధనలు బూట్ల ఆవిష్కరణకు సంబంధించిన పాత సిద్ధాంతాలను తుడిచిపెట్టాయి. విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు బెర్న్‌హార్డ్ జిప్‌ఫెల్ వెల్లడించిన వివరాల ప్రకారం మధ్య రాతి యుగంలో కేప్ తీరం వెంబడి బీచ్‌లో పురాతన మానవుల పాదముద్రల శిలాజాలను పరిశీలించినప్పుడు, వారు బూట్లు ధరించి ఉండవచ్చని పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. సదరన్ కేప్ కోస్ట్ ఆ సమయంలో చాలా పదునైన రాళ్లతో ఉండేదని, ఇవి బాధ కలిగించకుండా ఉండేందుకు నాటి మానవులు పాదరక్షలను ఉపయోగించి ఉండవచ్చని ఆయన అన్నారు. అయితే పురాతన మానవులు ఏ రకమైన బూట్లు ధరించారనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు నేటికీ స్పష్టంగా ఏమీ తెలుసుకోలేకపోయారు. పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదరక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పరిశోధనలు సాగిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జిప్‌ఫెల్ స్పందిస్తూ నాటి పురాతన బూట్లు ఇంత కాలం ఉండకపోవచ్చని, నాటి మానవులు పాదముద్రల శిలాజాలు కనుగొనగలిగితే పూర్వీకులు ధరించిన పాదరక్షల గురించి అధ్యయనం చేయడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. నాటి మానవులు బూట్లు ధరించారా లేదా అనేదానిని తెలుసుకునేందుకు పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాలలో నాటి మనిషి ఎముకల ఆకారం, పరిమాణాన్ని విశ్లేషించారు. అక్కడ నివసించే ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా, తక్కువ దృఢంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. కాలి స్వరూపంలో ఈ మార్పు బూట్లు ధరించడం వల్ల సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. షూస్ అనేవి పదునైన రాళ్లు, ముళ్లు, పరాన్నజీవుల నుండి రక్షణను అందిస్తాయి. ఈ అధ్యయనం మధ్య రాతి యుగంనాటి మానవుల సాంస్కృతిక చరిత్ర, పరిజ్ఞానాలను మరింతగా తెలియజేలా ఉంది. ఆ కాలంలో జరిగిన బూట్ల ఆవిష్కరణ, వాటి ఉపయోగం నాటి విస్తృత సాంస్కృతిక మార్పులో భాగంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
మనిషికి చిరాయువు ఇక సాధ్యమే?
సాధారణంగా ఎవరైనా ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు కూడా మనిషి జీవిత కాలం పొడిగించేందుకు పలు పరిశోధనలు సాగిస్తుంటారు. ఈ నేపధ్యంలో అనేక సిద్ధాంతాలు, ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తల నూతన పరిశోధనలు మనిషి దీర్ఘాయువుకు గట్టి హామీని ఇచ్చేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు యాంటీ ఏజింగ్ డ్రగ్ కోసం పలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు మనిషి దీర్ఘాయువుకు దోహదపడేలా పలు పరిష్కార మార్గాలను కనుగొంటున్నారు. వృద్ధాప్య కణాలను తొలగించి, అదే సమయంలో వాటి స్థానంలో కొత్త కణాలను సృష్టించడం ద్వారా దీర్ఘాయువు పొందవచ్చని చాలామంది భావిస్తుంటారు. తాజాగా బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ అనే నెమటోడ్లు (నీటిలో నివసించే సూక్ష్మజీవులు)లను ఎలుకలలో ప్రవేశపెట్టి వాటి జీవితకాలాన్ని పొడిగించడంలో విజయం సాధించారు. ఈ ప్రయోగాలు మనిషికి దీర్ఘాయువును అందించేందుకు చేస్తున్న పరిశోధనలకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు పుష్కలంగా మైక్రోఫాగీలను కలిగివుంటాయి. మైక్రోఫాగీ అనేది ఒకరరమైన తెల్లరక్త కణం. ఇది మనిషి రోగ నిరోధకశక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మృత కణాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మైక్రోఫాగీ అనేది యాంటీఆక్సిడెంట్ కావడానికి తోడు న్యూరోప్రొటెక్టివ్ ప్రయోజనాలను అందిస్తుంది. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు అందించే ప్రయోజనాలను కొమారిన్లో కూడా ఉన్నాయని కనుగొన్నారు. ఇవి మొక్కలలో కనిపిస్తాయి. ముఖ్యంగా దాల్చినచెక్కలో అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్క అనేది సెల్యులార్ ఆటోఫాగి, లైసోసోమల్ ఫంక్షన్లను నిర్దేశించడంలో కీలకంగా ఉండే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ కార్యాచరణను ప్రోత్సహిస్తున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొమారిన్ అనేది శరీరంలో కణాంతర రీసైక్లింగ్ వ్యవస్థను చక్కగా నిర్వహిస్తుంది. దీని కారణంగా వయస్సు పెరిగే ప్రక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్త, పరిశోధకులు శంకర్ చింతా.. న్యూరోనల్ కణాలపై సహజ సమ్మేళనాల ప్రభావం గురించి అధ్యయనం సాగిస్తున్నారు. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని ఈ అధ్యయనానికి సారధ్యం వహిస్తున్న శాస్త్రవేత్త జూలీ ఆండర్సన్ చెప్పారు. మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు యాంటీ ఏజింగ్ థెరపీకి కీలకంగా ఉపయుక్తమవుతాయి. ఇవి ఎలుకల కండరాల కణాలలో మైటోకాన్డ్రియల్ పనిచేయకపోవడాన్ని కూడా నిరోధించాయని పరిశోధనల్లో తేలింది. మైటోకాండ్రియా అనేది ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. లోపభూయిష్టమైన మైటోకాన్డ్రియల్ ఫంక్షన్ పార్కిన్సన్స్, అల్జీమర్స్ , అనేక హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, జీవక్రియ వ్యాధులు, వయసు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. మైటోకాన్డ్రియల్ కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు అవసరం అవుతాయి. సమర్థవంతమైన మైటోఫాగి.. జీవుల జీవితకాలం పొడిగించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై జరుగుతున్న పరిశోధనలు మనిషికి చిరాయువును ప్రసాదించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
దీర్ఘాయుష్షు అంటే ఎంత?
మనిషి ఆయుష్షుకు సంబంధించిన పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డచ్ పరిశోధకులు మానవుని గరిష్ట వయస్సు ఎంతనే విషయంతో పాటు ఇలాంటి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన పరిస్థితులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని తమ పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరులు డేటా ఆధారంగా నిపుణులు ఈ విశ్లేషణ చేశారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. రోటర్‌డామ్‌లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లు అని కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని తెలియజెప్పారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త గట్టిదేనని చెప్పవచ్చు. మూడు దశాబ్దాల డేటా ఆధారంగా పరిశోధకులు మానవుని గరిష్ట ఆయుర్దాయాన్ని అంచనావేయగలిగారు. ఈ అధ్యయనాన్ని చేపట్టిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ ‘సాధారణంగా ప్రజలు దీర్ఘకాలమే జీవిస్తారు. గత 30 ఏళ్లలో మనిషి ఆయుష్షు పెరుగుతోంది. వృద్ధాప్యం దూరమయ్యింది. నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది’ అని అన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అంటారు. ఈ డచ్ పరిశోధనలు.. గత ఏడాది అమెరికా పరిశోధకుల పరిశోధనల నివేదికలను పోలివున్నాయి. అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఇదే గరిష్ట వయో పరిమితిని గుర్తించారు. అయితే తమ దేశంలో ఇప్పుడున్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు పేర్కొన్నారు. డచ్ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తీర్చేందుకు ఉపకరిస్తుంది. కాగా 122 సంవత్సరాల164 రోజులపాటు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ ఆయుష్షుకు అడ్డుపడే అన్ని అడ్డంకులను దాటారని ఐన్‌మహ్ల్ ఉదహరించారు. ఇప్పటివరకూ జీన్ కాల్మెంట్ అత్యధిక కాలం జీవించిన మహిళగా చరిత్రలో నిలిచారు. ఐన్‌మహ్ల్ మార్గదర్శకత్వలో జరుగుతున్న ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలు త్వరలోనే సమగ్రంగా ప్రచురితం కానున్నాయి. ఇది కూడా చదవండి: ‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు -
కాలాన్ని గెలిచినవాడు
గతం అనేది ఎక్కడుంది? గతంలో జీవించిన మనుషులు కాలపు పొరల్లో ఎక్కడ చిక్కుకుని ఉన్నారు? గత సంఘటనలు ఏ కాలగర్భంలో వెచ్చగా దాగి ఉన్నాయి? గతం తాలూకు ఆలంబన అంటూ లేకపోతే మనిషికి వర్తమానంలో ఉన్నదేమిటి? గతం అనేది మనిషి యావజ్జీవితపు ధ్రువపత్రం. కానీ గతాన్ని వర్తమానంలోకి లాగే మంత్రదండం ఎక్కడుంది? జ్ఞాపకం ద్వారా మాత్రమే గతాన్ని చైతన్యవంతం చేయగలం. కానీ ఆ జ్ఞాపకం స్వచ్ఛందంగా మనసులోకి దూకాలి. అలా దూకాలంటే ఇంద్రియాలను ఏదో కదిలించాలి. అది ‘బలమైనదే’ కానక్కరలేదు.బలంగా ముద్ర వేసినదైతే చాలు. అనుకోకుండా ఒక చలికాలం పూట వెచ్చదనం కోసం అమ్మ ఇచ్చిన టీ కప్పులో ‘మడలీన్ ’ అనే చిన్న గుండ్రపాటి కేకును అద్దుకోగానే, ఆ మొదటి రుచి అంగిలికి తాకగానే, ఎప్పుడో చిన్నతనంలో తాము నివసించిన ‘కోంబ్రే’లో అనుభవించిన అదే రుచి మార్సెల్ ప్రూస్ట్‌కు చప్పున గుర్తొస్తుంది. ఆ వెనువెంటనే బాల్యంలో తిరగాడిన ఆ ఊరు, ఆ మనుషుల తాలూకు జ్ఞాపకాలు జలజలా రాలుతాయి. ఇక కాలంలో వెనక్కి ఈదుకుంటూ వాళ్ల కుటుంబీకుల పుట్టుపూర్వోత్తరాలు ఏకధారగా వల్లెవేయడానికి కూర్చుంటాడు. అలా గతాన్ని స్వగతంగా మార్చుకోవడం ద్వారా ఇరవయ్యో శతాబ్దపు అత్యంత విస్తారమైన ఆత్మకథాత్మక నవలారాజం ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ సాహిత్యలోకానికి అందింది. సుమారు నాలుగు వేల పేజీలున్న ఈ నవల 1913 నుంచి 1927 మధ్య ఏడు భాగాలుగా ప్రచురితమైంది. ఏ రచయితకైనా గతమే పెట్టుబడి. కానీ ప్రత్యేకించి ఆ గతంలో జీవిత పరమార్థాన్ని అన్వేషించడంలోనే ప్రూస్ట్ రచనా వైభవం దాగివుంది. కాలం అనే విధ్వంసక శక్తిని కళ అనే సాధనంతో ఆయన ఎదుర్కొన్నాడు. కాలంలో కలిసిపోయిన వారిని సాహిత్యం ఊతంగా సజీవ మూర్తులుగా నిలబెట్టాడు. సమకాలీన ఫ్రెంచ్ సమాజపు రీతులు, బాధలు, భయాలు, తపనలు, ఒంటరితనాలు, సరదాలు, సంతోషాలు, నిర్దయలు, క్షమలు, ఇంకా ఆయన సంక్లిష్ట లైంగికేచ్ఛలు అన్నీ అక్షరాల్లోకి తెచ్చాడు. కిటికీలోంచి సముద్రం మీద కనబడే సూర్యోదయాన్ని చూస్తూ అనుభవించే తన్మయత్వంలా రాతను మలిచాడు. చరిత్రకారుడు, తాత్వికుడు, మానసిక శాస్త్రజ్ఞుడు, రాజకీయాంశాల వ్యాఖ్యాత, ఇంకా ‘పర్వర్టు’, ఇంకా ఒక కవి– ఇలా ఆరుగురు ప్రూస్టులు ఇందులో కనబడతారంటారు ఆడమ్ గోప్నిక్. సంగీతం, సాహిత్యం, యుద్ధం, సమాజం, పెయింటింగ్, శృంగారం, కళలు, అసూయ, ఫ్యాషన్లు– ఇలా ప్రూస్ట్ అభిప్రాయానికి చిక్కకుండా మిగిలిపోయేది ఏదీ ఉండదు. ‘తన జీవితపు మెటీరియల్‌ను ఇంత బాగా ఏ రచయితా వాడుకోలేదు’ అంటారు టెన్నెస్సీ విలియమ్స్. ‘ఒక రచయిత ఒకసారి చదివితే పూర్తయ్యేట్టయితే ఆ రచయిత పెద్దగా ఏమీ చెప్పనట్టు! హోమర్లాగా జీవితకాలం వెంటతెచ్చుకోగలిగే రచయిత ప్రూస్ట్’ అంటారు డేనియల్ మెండెల్సన్ . కలిగిన ఫ్రెంచ్–యూదు కుటుంబంలో పుట్టాడు మార్సెల్ ప్రూస్ట్ (10 జూలై 1871– 18 నవంబర్ 1922). ఐఫిల్ టవర్‌ను నిర్మించిన ఇంజినీర్ గుస్తావ్ ఐఫిల్... ప్రూస్టులకు సన్నిహితుడు. తొమ్మిదో ఏట నుంచే ప్రూస్టుకు ఉబ్బసంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలుండేవి. ప్యారిస్ ఉన్నత సమాజంలో ముందు కలియ తిరిగినప్పటికీ రానురానూ ఏకాంతంలోకి వెళ్లిపోయాడు. బయటి నుంచి వచ్చే పెద్ద శబ్దాలను కూడా భరించేవాడు కాదు. హైపర్ సెన్సిటివ్. అందుకే పగలు పడుకొని రాత్రుళ్లు రాయడం అలవాటు చేసుకున్నాడు. ‘నిశాచర సరస్వతి!’. కల్పనతో కూడిన తన ఆత్మకథలోని మొదటి భాగమైన ‘స్వాన్స్ వే’ను ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు. దాంతో సొంత డబ్బుతో అచ్చు వేయించుకున్నాడు. దాన్ని తిరస్కరించినవారిలో అప్పటి ప్రఖ్యాత రచయిత ఆంద్రే గిదె కూడా ఒకరు. ‘నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద తప్పిదం’ అని ఆయన తర్వాత పశ్చాత్తాపపడ్డారు. తన మృత్యువు సమీపంలో ఉందని ప్రూస్ట్‌కు తెలుసు. తన రచన ఎక్కడ పూర్తవ్వదో అనే ఆందోళన ఉండేది. నాలుగు భాగాలు ప్రూస్ట్ బతికి ఉన్నప్పుడే వచ్చాయి. ఆయన రాసుకున్న డ్రాఫ్టుల ఆధారంగా తర్వాతి మూడు భాగాలు ఆయన తమ్ముడు రాబర్ట్ ప్రూస్ట్, రచయిత జాక్వెస్ రివియేరీ సంపాదకులుగా వచ్చాయి. ఇందులో ఐదో భాగం అయిన ‘ద ప్రిజనర్’ సరిగ్గా నూరేళ్ల కింద 1923లో వచ్చింది. ఇది అనారోగ్యంతో ప్రూస్ట్ చనిపోయాక విడుదలైన మొదటి భాగం. ఇప్పుడు ఆంగ్లంలో ప్రామాణిక అనువాదంగా పరిగణిస్తున్నది బ్రిటిషర్ అయిన సి.కె.స్కాట్ మాంక్రీఫ్ చేసినది. ఆయన పెట్టిన పేరు ‘రిమెంబ్రన్స్ ఆఫ్ థింగ్స్ పాస్ట్’. చాలా ఏళ్లు ఈ పేరుతోనే వ్యాప్తిలో ఉన్నప్పటికీ, ఈ అనువాదానికి తర్వాత మెరుగులు దిద్దినవారిలో ఒకరైన డి.జె.ఎన్ రైట్ నవల పేరును ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’గా మార్చారు. ఈ శీర్షికే ప్రూస్ట్ మానసిక ప్రపంచానికి దగ్గరగా ఉండి, స్థిరపడిపోయింది. ప్రూస్ట్ ఇల్లియర్స్ అనే చోట తన చిన్నతనం గడిపాడు. దాని ఆధారంగానే ‘కోంబ్రీ’ని సృష్టించాడు. 1971లో ప్రూస్ట్ శతాబ్ది సందర్భంగా దానికి ‘ఇల్లియర్స్–కోంబ్రీ’గా నామకరణం చేసి రచయిత పట్ల గౌరవం చాటుకున్నారు. జీవితం లోంచి సాహిత్యంలోకి వచ్చిన పేరు, మళ్లీ సాహిత్యం లోంచి జీవితంలోకి వచ్చింది. ఒక కొత్త మనిషిని అర్థం చేసుకోవడానికి పాత్రికేయులు ‘ప్రూస్ట్ ప్రశ్నావళి’(ప్రూస్ట్ క్వశ్చనెయిర్) అని అడుగుతుంటారు. మన జీవితానికి దగ్గరగా వెళ్లాలంటే– నేనెవరు? ఈ జీవితంతో ఏం చేసుకోవాలి? అనే ప్రశ్నలను అన్వేషిస్తూ జీవిత సాగరాన్ని అన్వేషించిన ప్రూస్టియన్ ప్రపంచంలోకి వెళ్లాలి. -
ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా..
వెర్రీ వెయ్యి రకాలు..పైత్యం పలు రకాలు అనే సామెతను మన పెద్దలు ఎందుకన్నారో గానీ కొందరూ మనుషులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. బహుశా పిచ్చి ఆలోచనలు కలిగిన వ్యక్తుల చూసే అన్నారు కాబోలు. మొన్నటికి మొన్న ఓ మనిషి మానవ కుక్కలా కనపడాలని ఆరాటపడటం వార్తలో హాట్‌టాపిక్‌గా మారింది. లక్షలు ఖర్చు పెట్టి మరీ నిజం చేసుకున్నాడు. అది మరువక మునుపే ఇప్పుడో మహిళ మానవ పిల్లిలా కనిపించాలనుకుంటోంది. దేవుడిచ్చిన రూపం కంటే జంతువుల్లా ఉండటానికి ఇష్టపడటం విడ్డూరం అనుకుంటే అందుకోసం వీళ్లు చేసే ప్రయత్నాలు చాలా జుగప్సకరంగా ఉంటాయి. కుక్కలా మారాలనుకున్న వ్యక్తి జస్ట్ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్ ధరించాడంతే. కానీ ఈమె అచ్చం ఆడ పిల్లిలా కనిపించేందుకు ఎంతకు తెగించిందో వింటే కంగుతినండ ఖాయం! ఇటాలియన్‌కు చెందిన 22 ఏళ్ల చియారా డెల్ అబేట్ సోషల మీడియాలో మంచి క్రేజ్ ఉన్న టిక్‌టాకర్. మరెందుకు అనిపించిందో గానీ ఆడ పిల్లిలా కనిపించాలనేది ఆమె ప్రగాఢ కోరిక. అందుకోసం తల దగ్గర నుంచి కాలి వరకు 20కి పైగా మార్పులు చేసింది. ప్రతి అంగాన్ని పిల్లిలా ఉండేలా మార్చింది. వామ్మో!.. ఇదేలా సాధ్యం అని అనుకోకండి!. ఎందుకంటే అసమంజసమైన కోరికను నిజం చేసి పాపులర్ అవ్వాలన్నదే ఆమె బలమైన కాంక్ష. ఈ కోరిక చిన్నినాటి నుంచి ఉందట. శరీరాన్ని పిల్లిలా మార్చుకునేందుకు శరీరంపై ఎన్ని కుట్లు పడ్డాయో చెబితే షాక్ అవుతారు. 11 ఏళ్ల వయసు నుంచి శరీర ట్రాన్స్ఫార్మేషన్ ప్రకియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఇలా ఇప్పటి వరకు శరీరంపై 72 కుట్లు పడ్డాయి. ముక్కు రంధ్రాల నుంచి, పైపెదవి వరకు చాల కుట్లు పడ్డాయి. కనురెప్పలపై అదనంగా ఉన్న చర్మం తొలగించుకునేలా కాస్మెటిక్ సర్జరీ, ప్రతి చేతికి 10 సబ్‌డెర్మల్ ఇంప్లాంట్లు, ఆఖరికి బ్రెస్ట్, అంతర్గత జననేంద్రియాలను కూడా వదలలేదు. వాటిని కూడా ఆడ పిల్లికి ఉన్నట్లుగా మార్పులు చేయించుకుంది. తాను ఏదో కామెడీగా కార్టూన్లో కనిపించే పిల్లిలా కనిపించాలనుకోవడం లేదని అచ్చం "మానవ పిల్లిలా" కనిపించడమే తన ధ్యేయం అని తెగేసి చెబుతోంది చియారా. అందుకే ఆమె అక్కడితో ఆగకుండా పూర్తిగా ఆడ పిల్లిలా కనిపించేలా..బాదం ఆకారంలో ఉండే పిల్లి కళ్లు, దంతాలు, పైపెదవి, తోక తదితర మార్పులు కోసం కాంటోప్లాస్టీ అనే కాస్మెటిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతోంది. పైగా తన శరీరం ఆయా మార్పులకు అనుగుణంగా ఫిట్‌గా ఉంటుందని ధీమాగా చెబుతోంది చియారా. ఇలాంటి ఆలోచన రావడమే విచిత్రం అనుకుంటే అంతలా సర్జరీలు చేయించుకోవడానికి కూడా మంచి గట్స్ ఉండాలేమో!. చిన్న సర్జరీకే బెంబేలెత్తిపోతాం. ఏకంగా 20 సార్లు శరీర మార్పులు చేయించుకోవడమేగాక ఇంకా కొన్ని సర్జరీలు చేయించుకునేందుకు రెడీ అయిపోతోంది చియారా. పిచ్చి పీక్స్‌లో ఉంటే ఎంతకైన తెగిస్తారంటే ఇదేనేమో!. (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
అత్యంత పురాతన మానవుల పాదముద్రలు లభ్యం
అమెరికాలోని న్యూ మెక్సికోలో పురాతన మానవ పాదముద్రలను కనుగొన్నారు. ఇవి ఇక్కడి వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌లో గుర్తించారు. ఒక నూతన అధ్యయనంలో కనుగొన్న ఈ పాలియో-మానవ పాదముద్రలు 23,000 నుండి 21,000 సంవత్సరాల క్రితం నాటివని తెలుస్తోంది. ఈ మానవ పాదముద్రలు ఏనాటివో తెలుసుకునేందుకు అధ్యయనంలో రెండు పద్ధతులు ఉపయోగించారు. ఈ పాదముద్రలు కనిపించిన ట్రాక్‌వేలు 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని అంచనా వేశారు. అంటే అవి మంచు యుగంలోని అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’ (26,500 నుండి 19,000 సంవత్సరాల క్రితం) కాలం నాటివి. 13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొదటి మానవులు క్లోవిస్ ప్రజలు అని పురావస్తు శాస్త్రవేత్తలు గతంలో భావించారు. గత కొన్ని దశాబ్దాలలో పురావస్తు శాస్త్రవేత్తలు క్లోవిస్‌కు పూర్వం అంటే 13 వేల సంవత్సరాల క్రితం అమెరికాలో నివసించే వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అయితే ఆయా ప్రదేశాలలో చాలా వరకు ఆధారాలు నిర్థారించే స్థాయిలో లేవు. వైట్ సాండ్స్ ట్రాక్‌వే ఇప్పుడు ఉత్తర అమెరికాలో పురాతన మానవులకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. ఫలితంగా మొదటి అమెరికన్ల రాక తేదీని గణనీయంగా వెనక్కి నెట్టినట్లయ్యింది. కాథ్లీన్ స్ప్రింగర్‌తో కలిసి అధ్యయనానికి నాయకత్వం వహించిన జెఫ్రీ పిగటి మాట్లాడుతూ లాస్ట్ గ్లేసియల్ మాగ్జిమమ్ సమయంలోనే ప్రజలు ఇక్కడ ఉన్నారనడానికి మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఇది కూడా చదవండి: బిల్డింగ్‌ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? -
ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది?
మానవులు భూమిపై అనేక విపత్తులను చవిచూశారు. ప్రతి సంవత్సరం లెక్కలేనంత జనాభా.. భూకంపాలు, వరదలకు బలవుతూవస్తోంది. ఇటీవలి కరోనా విధ్వంసం లక్షలాదిమంది ప్రాణాలను బలిగొంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న విధ్వంసం గురించి విన్నప్పుడు ఎవరికైనా సరే కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. నాటి ఆ విపత్తు తీవ్రతకు ఈ భూమండలంపై కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారు. ఈ పెను విపత్తు ఎప్పుడు సంభవించింది? మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటన తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అంతటి విపత్తులో తమను తాము రక్షించుకోగలిగిన 1,280 మంది మాత్రమే మిగిలారు. వారి కారణంగానే ఈ రోజు ఈ భూమిపై ఎనిమిది బిలియన్ల మంది ప్రజలు జీవించి ఉన్నారని చెబుతారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జర్మన్ న్యూస్ వెబ్సైట్ డీడబ్ల్యు తెలిపిన వివరాల ప్రకారం మనిషి పూర్వీకులు ఒకప్పుడు విపత్తులకు చాలా దగ్గరగా ఉండేవారు. ఈ విషయాన్ని జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. మానవ జనాభా దాదాపు అంతరించిపోయిన కాలం ఒకప్పుడు ఏర్పడిందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధన రెండు లక్షల సంవత్సరాల క్రితం దొరికిన ఆదిమ మానవుల అవశేషాలపై జరిగింది. ఈ పరిశోధన ఎవరు సాగించారంటే.. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఈ పరిశోధన చేసింది. తొమ్మిది లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం భూమిపై తలెత్తిన ఆ విపత్తు అనంతరం భూమిపై కేవలం 1280 మంది మాత్రమే మిగిలారని పరిశోధకులు కంప్యూటర్ మోడలింగ్ ద్వారా కనుగొన్నారు. నాటి భీకర విపత్తులో 98.7 శాతం మానవ జనాభా నాశనమైందని ఈ పరిశోధన నిర్వహించిన ప్రధాన పరిశోధకుడు హైపెంగ్ లీ వివరించారు. ఇంతకీ నాడు భూమిపై ఏమి జరిగింది? ఈ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం మంచు యుగంలో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గడం వల్ల ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ మంచు యుగంలో మానవులు దాదాపు అంతరించిపోయారు. అయితే అంతటి దుర్భర పరిస్థితిలోనూ తమను తాము రక్షించుకోవడంలో కొందరు మానవులు విజయం సాధించారు. ఈ మానవులే తదుపరి మానవ నాగరికత అభివృద్ధికి కారణమయ్యారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష? -
కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..
ఓ జపాన్ వ్యక్తి ఇటీవల కుక్కలా మారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో.. కుక్కలా మారిన తర్వాత తన అసాధారణ జీవితం ఎలా ఉందో వివరిస్తూ..చాలా షాకింగ విషయాలు చెప్పాడు. అతడు చెప్పిన విషయాలు చూస్తే వామ్మో ఇవేం కోరికలు అనిపించేలా ఉన్నాయి. వివరాల్లోకెళ్తే..ఇటీవలే జపాన్‌కి చెందిన వ్యక్తి తనకెంతో ఇష్టమైన "కోలీ" అనే కుక్కలా మారి ఆశ్చర్యపర్చాడు. అందుకోసం ఎన్నో కంపెనీలు సంప్రదించగా ఓ కంపెనీ ముందుకు వచ్చి కుక్కను తలిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసేందుకు ముందుకు వచ్చింది. . ఇటీవలే అచ్చం కుక్కలా కనిపించే ఆ కాస్ట్యూమ్ని ధరించి వీధుల్లో హల్చల్ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు కూడా. ఇప్పుడా వ్యక్తి తనకు ఇలా కుక్క జీవితం ఎంతో నచ్చిందని చెబుతున్నాడు. కుక్క మాదిరిగా నాలుగు కాళ్లపై నడవడం ఇబ్బందిగా ఉన్నా సంతృప్తిగా ఉందని చెప్పడం విశేషం. ఆ వ్యక్తి ఆ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్ కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చుపెట్టాడు. అంత ఖర్చుపెట్టాడు కాబట్టి ఇష్టపడక ఏం చేస్తాడులే! అని అనుకోకండి. పైగా కుక్కలా అసాధారణ జీవితం గడుపుతున్న అతడికి కలుగుతున్న కోరికలు వింటే మాత్రం ఓర్నీ ఇవేం కోరికలు అని నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ కుక్కలా మారిన వ్యక్తి తనలానే కుక్కలా మారాలనుకునే స్త్రీ కూడా ఉంటే బాగుండనని, ఆమెతో ప్రేమలో పడాలని అనుకుంటున్నాడట. అంతేకాదు కుక్కలా ఉన్న తనకు సినిమాలో నటించే అవకాశం వస్తే బావుండనని అంటున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో చూపించుకుంటానని చెబుతున్నాడు. ఇలా జీవితం గడపడం ఎంత అసౌకర్యంగా అసాధారణంగా ఉన్నా తనకు అలా ఉండటమే ఇష్టమని తేల్చి చెప్పాడు. కోలీ జాతి కుక్కలంటే తనకెంతో ఇషమని అలా ఉండాలన్న కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉందని మరీ చెబుతున్నాడు. ఓర్నీ వెర్రీ వెయ్యి రకాలు అంటే ఏంటో అనుకున్నాం. ఇలానే ఉంటుందేమో కదా!. (చదవండి: వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్) -
తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది?
భూమి చరిత్ర- మానవ పరిణామ ప్రకియ అనేవి దగ్గరి సంబంధం కలిగిన అంశాలు. మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు నాటి మానవులు వేట కోసం వినియోగించిన ఆయుధాలను పరిశీలించారు. ఆహారం పరిమాణం, మానవ సాంస్కృతిక, భౌతిక అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని కనుగొన్నారు. రెండు సంవత్సరాల క్రితం పరిశోధకుల పరికల్పనను పరీక్షించడానికి ఈ అధ్యయనం చేపట్టారు. చిన్న, చురుకైన జంతువులను వేటాడాల్సి రావడం అనేది తొలి మానవుల తెలివితేటల అభివృద్ధికి సహాయపడింది. ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త మిక్కీ బెన్-డోర్ మాట్లాడుతూ ఏనుగుల వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు చెక్క ఈటెలు సరిపోతాయని అన్నారు. అయితే జింక వంటి చిన్న జంతువులు పట్టుకోవడం చాలా కష్టమని, వాటిని చేజిక్కించుకునేందుకు చెక్క ఈటెలు సరిపోవని, ఈ నేపధ్యంలో నాటి మానవులు రాతి ఆయుధాలు ఆవిష్కరించారని పరిశోధకులు కనుగొన్నారు. తొలి మానవుల్లో ఒకరైన హోమో ఎరెక్టస్ చెక్క ఈటెలను ఉపయోగించారు. నియాండర్తల్‌లు,హోమో సేపియన్లు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం రాతితో కూడిన ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. 50 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్లు విల్లు, బాణం, ఈటె లాంటి విసిరే ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే 25 వేల సంవత్సరాల క్రితం, వేట కోసం వలలతో పాటు శునకాల సహకారం తీసుకోవడం ప్రారంభమైంది. ఈ తరహా ఆయుధాల అభివృద్ధితో మానవ వికాసం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత పదేళ్లుగా పలువురు పరిశోధకులు చరిత్రపూర్వ మానవ వికాసానికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో తొలినాళ్లలో ఏనుగులు చాలా కాలం పాటు మానవులకు ఆహారంగా ఉండేవని వారు కనుగొన్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం అవి అంతరించడంతో నాటి మానవులు చిన్న జంతువులను వేటాడవలసి వచ్చింది. కాలానంతరంలో వేట సాధ్యం కానప్పుడు నాటి మానవులు పశుపోషణ, వ్యవసాయం ప్రారంభించారు. 2021లో, పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిలో తగ్గుతున్న ఆహార పరిమాణానికి వేటాడేందుకు వినియోగించే ఆయుధాల అభివృద్ధికి మధ్య సంబంధం ఉందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన పరిశోధన కూడా ఈ సిద్ధాంతానికి మద్దతు నిచ్చింది. దీనిలో 1.5 లక్షల నుండి 20 వేల సంవత్సరాల క్రితం నాటి డేటాను అనుసంధానించారు. ఇది కూడా చదవండి: వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది? -
ఏఐ ముప్పు లేని టెక్ జాబ్‌లు! ఐటీ నవరత్నాలు ఇవే..
డిజిటల్ పరివర్తన వేగవంతంగా జరుగుతున్న ప్రస్తుత యుగంలో సంచలనంగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ, డేటా సైన్స్ పట్ల దృక్ఫథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది టెక్ పరిశ్రమలో అనేక ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించందన్న ఆందోళనల నేపథ్యంలో పూర్తిగా ఆటోమేషన్‌కు ఆస్కారం లేని కొన్ని కెరియర్ మార్గాలు ఉన్నాయి. మానవ అంతర్దృష్టి, సృజనాత్మక సమస్య-పరిష్కారం, భావోద్వేగ మేధస్సుతో ముడిపడిన కొన్ని జాబ్‌లు ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్య కాలంలో కీలకంగా ఉంటాయి. లెర్న్బే వ్యవస్థాపకుడు, సీఈవో కృష్ణ కుమార్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు లేని తొమ్మిది రకాల ఐటీ జాబ్‌ల గురించి తెలియజేశారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. డేటా సైంటిస్టులు డేటా సైన్స్ అనేది డేటా క్లీనింగ్, ప్రీ-ప్రాసెసింగ్ వంటి అనేక అంశాలను ఏఐ ఆటోమేట్ చేసిన ఒక ఫీల్డ్. అయినప్పటికీ, దాని ప్రధాన భాగంలో డేటా సైన్స్‌కు ప్రోగ్రామ్ చేయలేని మానవ అంతర్ దృష్టి, చాతుర్యం అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పనితీరు కేవలం అంకెలు, సంఖ్యల్లో మాత్రమే ఉంటుంది. కానీ డేటా సైంటిస్టులు తమ మేధస్సుతో అర్థవంతవంతమైన ఫలితాలను సాధించగలరు. ఏఐ ఎథిసిస్ట్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఏఐ ఎథిక్స్ నిపుణుల అవసరం చాలా కీలకంగా మారింది. ఈ నిపుణులు ఏఐ సిస్టమ్‌ల ఎథిక్స్ అమలుకు మార్గనిర్దేశం చేస్తారు. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, వినియోగదారు గోప్యతను రక్షించే విధంగా ఉండేలా చూస్తూరు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం నుంచి ఉత్పన్నమయ్యే రిస్కులు, సామాజిక చిక్కులను అంచనా వేస్తారు. ఈ పని చేసేవారికి సామాజిక నిబంధనలు, నైతికత, మానవ హక్కుల గురించి లోతైన అవగాహన అవసరం. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అసాధారణ నెట్వర్క్ ప్రవర్తన లేదా పొటెన్షియల్ థ్రెట్స్‌ను గుర్తించడం ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీకి సహాయపడుతుంది. అయినప్పటికీ, సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర కీలకమైనది. వ్యూహరచన చేయడం, ఏఐ గుర్తించిన అంశాలను సమీక్షించడం, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న థ్రెట్స్‌ను గుర్తించి సృజనాత్మకంగా స్పందించడం వీరి ముఖ్యమైన విధులు. మానవ మనస్తత్వం సూక్ష్మ నైపుణ్యాలు, సైబర్ నేరస్థుల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులను వీరు చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు కోడ్ రాయడం, డీబగ్గింగ్, టెస్టింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విలువైన సాధనంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, వినూత్న సాఫ్ట్వేర్ రూపకల్పన, వినియోగదారు అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్య-పరిష్కారంలో సృజనాత్మకత వంటివి మానవులకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన లక్షణాలు. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో నైతిక పరిగణనలు, మానవ ప్రమేయం ఇప్పటికీ అవసరం. యూఎక్స్ డిజైనర్లు యూజర్ ఎక్స్పీరియన్స్ (UX) డిజైనర్లు సహజమైన, యూజర్లను ఆకర్షించేలా ఇంటర్‌ఫేస్‌లను రూపొందిస్తారు. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మానవ మనస్తత్వం, సాంస్కృతిక అంశాలను అర్థం చేసుకోవాలి. టెస్టింగ్, డేటా అనాలిసిస్ వంటి కొన్ని అంశాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేయగలిగినప్పటికీ సంతృప్తికరమైన యూజర్ ఎక్స్పీరియన్స్ రూపొందించడంలో డిజైన్ థింకింగ్, సృజనాత్మకత వంటివి యూఎక్స్ డిజైనర్లు మాత్రమే చేయగలరు. డెవాప్స్ ఇంజినీర్లు డెవలప్మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, డెవలప్మెంట్, ఆపరేషన్స్ టీమ్స్ మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ప్రధానంగా డెవాప్స్ (DevOps) ఇంజనీర్లు చేసే పని. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్‌సైకిల్‌లోని భాగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేట్ చేయగలదు. కానీ కమ్యూనికేషన్, సహకారం, నిర్ణయం తీసుకోవడానికి మానవ అవసరం కీలకం. ఏఐ/ ఎంఎల్ రీసెర్చర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) రీసెర్చర్లు ఏఐ డెవలప్మెంట్లో ముందంజలో ఉంటారు. మోడల్ ఆప్టిమైజేషన్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలిగినప్పటికీ, ఏఐ, ఎంఎల్ పురోగతిని నడిపించే ప్రాథమిక పరిశోధనకు మానవ ఉత్సుకత, చాతుర్యం, క్రిటికల్ థింకింగ్ అవసరం. మానవ రీసెర్చర్లా ప్రశ్నించడం, ఊహించడం, ఆవిష్కరణలు వంటివి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. టెక్ ప్రాజెక్ట్ మేనేజర్లు ప్రాజెక్ట్ ట్రాకింగ్, రిస్క్ మేనేజ్మెంట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతున్నప్పటికీ ప్రాజెక్ట్ మేనేజర్ల పాత్ర కీలకం. టీమ్ కోఆర్డినేషన్, సమస్యలను పరిష్కరించడం, తమ అనుభవం, అంతర్ దృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. డేటా స్టోరీటెల్లర్స్ డేటా స్టోరీటెల్లర్లు సంక్లిష్ట డేటాను ఆకర్షణీయమైన కథనంలోకి మార్చే నిపుణులు. డేటాను అర్థమయ్యేలా ప్రదర్శించడానికి వీక్షకుల గురించి లోతైన అవగాహన, సందర్భ భావం, సృజనాత్మకత అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాను హ్యాండిల్ చేయగలదు కానీ మనుషులను అర్థం చేసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పలేదు. ఇదీ చదవండి: Millennials: చాలా మంది అప్పడు పుట్టినవాళ్లే! భారత్‌లో ఉద్యోగులపై ఆసక్తికర రిపోర్ట్ -
అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం!
ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లేముందు వందసార్లు ఆలోచించాల్సి వస్తుంటుంది. నిజానికి ఈ భూమి మీద చాలామేరకు పచ్చదనం, జీవం కనిపిస్తుండగా, ఆ ప్రాంతంలో చావు, నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం భూమిపై అత్యంత విషపూరితమైన ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ఏ ఎడారిలోనే లేదు. ఫ్రాన్స్‌లోని పట్టణ ప్రాంతానికి కొంచెం దూరంలో ఉంది. ఒకప్పుడు మనుషులతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రదేశంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషపూరిత ప్రదేశం ఎక్కడుంది? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషపూరిత ప్రదేశాన్ని జోన్ రోగ్ అని అంటారు. కొందరు ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఫ్రాన్స్‌లో ఉంది. గడచిన వంద సంవత్సరాలుగా ఈ ప్రదేశాన్ని ఎవరూ సందర్శించలేదు. ఇక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం నిషేధించింది. నిజానికి ఈ ప్రాంతపు మట్టిలోనే కాదు ఇక్కడి నీటిలోనూ పూర్తిగా విషం నిండివుంది. ఇక్కడి పదార్థం ఏదైనా మనిషి, లేదా మరో జీవి నోటిలోకి వెళితే మరణం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రదేశం విషపూరితంగా ఎలా మారింది? మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రదేశం జనం సందడితో ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒకప్పుడు మానవ నివాసాలు ఉండేవి. అయితే ఈ ప్రదేశం ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైంది. ఇక్కడ లెక్కకు మించిన బాంబులు ప్రయోగించారు. ఈ ప్రాంతంలో రసాయన దాడులు జరిగాయి. ఇక్కడి గాలి కూడా విషపూరితమే. కొంతకాలం క్రితం ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఇక్కడికి వెళ్లారు. ఇక్కడి మట్టిలోనే కాదు నీళ్లలో కూడా ఆర్సెనిక్ అధికమోతాదులో ఉందని తేలింది. దీనిలోని ఒక్క రేణువైనా ఏ జీవి నోటిలోకి వెళ్లినా మరణం ఖాయమని వారు తమ పరిశోధనలో గుర్తించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
మనిషి... మనుగడ
మనుగడ అనేది ప్రతి మనిషికీ ఉంటుంది. మనిషికి మాత్రమే మనుగడ ఉంటుందా? ప్రతి జీవికీ మనుగడ ఉంటుంది. ఏ జీవి మనుగడ దానిదే. కొన్ని జంతువుల మనుగడ మనిషికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి మనిషి మనుగడా తనకు, సమాజానికి ప్రయోజనకరంగానే ఉండాలి; ప్రయోజనకరంగా ఉండేందుకు మనిషి తన మనుగడను ఒక అవకాశంగా తీసుకుని, చేసుకుని ప్రయత్నించాలి. మనుగడ ప్రయోజనకరంగా పరిణమించడానికి ఏ మనిషికి ఐనా మెదడు, మనసు ఈ రెండూ కీలకం ఐనవి. మనసు తిన్ననైంది కాకపోవడం మాత్రమే మనిషికి లోటు కాదు; మెదడు సరిగ్గా పనిచెయ్యక పోవడం మాత్రమే మనిషికి లోటు కాదు. మెదడుకు మనసు లేకపోవడమే, మనసుకు మెదడు లేకపోవడమే మనిషికి లోతైన లోటు! మెదడుకు మనసు ఉండాలి; మనసుకు మెదడు ఉండాలి. మెదడు, మనసు కలిసి ఉద్యుక్తం ఐతే, ఉన్ముఖం ఐతే, ఉద్యమిస్తే ఉన్నతం ఐన ఫలితం వస్తుంది. మనుగడ ఉచ్చస్థితికి చేరుతుంది. సగటు మనిషి తన చేతిలోనే తాను ఓడిపోతూ ఉంటాడు; తన ప్రవర్తనవల్ల తాను సరిగ్గా ఉండడం జరగదు సగటు మనిషికి; చేసిన లేదా జరిగిన తప్పులు దిద్దుకోబడడం ఉండదు చాలమంది విషయంలో; చెడిపోవడం అన్నది చెరిగిపోవడం జరగడం లేదు పలువురిలో. వీటికి కారణం మెదడుకు మనసు లేకపోవడమే; మనసుకు మెదడు లేకపోవడమే. మనిషి మెదడు, మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఏవేవో, ఎన్నెన్నో వాటిలో ఉంటూ ఉంటాయి. అవసరం ఐనవి తక్కువగా, ఎక్కువగా అనవసరం ఐనవి మెదడు, మనసుల్లో ఉండి మనిషి మనుగడ మందమైపోవడానికి, మొద్దుబారిపోవడానికి కారణాలు ఔతూ ఉంటాయి. మెదడు, మనసుల పనితీరువల్లే మనిషికి మేలు, కీడులు కలుగుతూ ఉంటాయి; మనిషిని పనికి వచ్చేట్టుగానూ, పనికిరానట్టుగానూ చేసేవి మెదడు, మనసులే. మెదడుకు మనసును, మనసుకు మెదడును నేర్పుతో అనుసంధానం చేసుకోవడమూ, ఆ అనుసంధానంతో దైనందిన జీవనాన్ని ఎదుర్కోవడమూ తెలిసిన మనిషికి అభివృద్ధి అలవడుతుంది. మనిషి అభివృద్ధిని అలవాటు చేసుకోవాలి; మనిషికి అభివృద్ధిలో అభినివేశం ఉండి తీరాలి. అభివృద్ధిలేని మనిషి అక్కరకురాని మనిషి ఔతాడు ఆపై అక్కర్లేని మనిషి ఔతాడు. మనిషి మనుగడ అనవసరం ఐంది, పనికిరాంది కాకూడదు; మనిషి మనుగడ వెలవెలపోకూడదు. మనిషి మనుగడ విలువైంది కావాలి. మనిషి తన మనుగడకు తానే విలువను, వన్నెను సమకూర్చుకోవాలి. మెదడు, మనసుల్ని సంయుక్తంగా సంప్రయోగించి మనిషి తన మనుగడను విజయవంతంగా నడుపుకోవాలి. ‘తిండిని వెతుక్కుంటూ రోజూ తిని/ ఏవేవో అల్పమైన కథలు చెప్పుకుని/ మనసు ఒడిలి బాధల్ని అనుభవించి/ ఇతరుల్ని బాధించేవెన్నో చేసి/ తల నెఱుపు వచ్చి ముసలితనాన్ని పొంది/ ఘోరమైన మరణానికి బలై / మాసిపోయే పలు విదూషకుల్లా నేను కూలిపోతాననుకున్నావా?’ అని, అని తమిళ్ కవి సుబ్రమణియ బారతి పేలవంగా ఉండడాన్ని తిరస్కరించారు. కూలిపోయేందుకు కాకుండా, విదూషకత్వంతో కాకుండా, మాసిపోయేందుకు కాకుండా, ఇతరుల్ని బాధించేందుకు కాకుండా, బాధల్ని అనుభవిస్తూ ఉండేందుకు కాకుండా, అల్పుడుగా కాకుండా, ఏదో తింటూ కాలం గడిపేందుకు కాకుండా మిన్నగా మసలేందుకు, మిన్నులా ఎత్తుల్లో నిలిచేందుకు మెదడుతో మనసును, మనసుతో మెదడును సంయుక్తం చేసుకుని మనిషి కార్యాచరణకు పూనుకోవాలి. మనిషి మనుగడ ప్రయోజనకరంగా ఎందుకు ఫలించకూడదు? మనిషి తన మనుగడను పట్టుదలతో ప్రయోజనకరం చేసుకోవాలి. మెదడు, మనసుల సమన్వయంతో, సంయోగంతో మనిషి సంపూర్ణంగా సఫలం అవాలి. మనిషి తన మనుగడకు సత్ప్రయోజనాన్ని సాధించుకోవాలి; సమాజానికీ సాధ్యం ఐనంత ప్రయోజనకరంగా మనిషి మెదులుతూ ఉండాలి. మనిషికి మెదడు, మనసు ఉంటాయి. అవి సరిగ్గా, మెరుగ్గా ఉంటే మనిషి సరిగ్గా, మెరుగ్గా ఉంటాడు; అవి మేలుగా ఉంటే మనిషి మేలుగా ఉంటాడు. మెదడు, మనసు రెండూ కలిసి జతగా పనిచేస్తూ ఉంటేనే మనిషి గొప్ప స్థితిని, స్థాయిని, గతిని ఆపై ప్రగతిని పొందుతూ ఉంటాడు. – రోచిష్మాన్ -
కాలం కార్ఖానా
కాలం ఒక కార్ఖానా. మనం నేల మీద పడిన క్షణం నుంచి కాలం కార్ఖానాలో మన కోసం ఉత్పత్తి మొదలైపోతుంది. ఆ ఉత్పత్తులలో మనకు కావలసిన రకరకాల ఆహార్యాలు, ఆలోచనలు, రుచులు, అభిరుచులు, అలవాట్లే కాదు; వాటిని నియంత్రించే హద్దులూ ఏర్పడిపోతాయి. పుట్టిన మరుక్షణం నుంచి కాలం మనకు తెలియకుండానే మనతో కలసి నడుస్తుంది, మనల్ని నడుపుతుంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం, మనల్ని మనమే నడుపుకుంటున్నామనుకుంటాం. అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్‌గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది. కాలంలో ఒకానొకనాడు మనిషి నగ్నత్వాన్నే ఒంటికి చుట్టుకున్నాడు. తర్వాత తర్వాత ఒళ్ళంతా వస్త్రంతో కప్పుకోవడమే సంస్కారంగా, నాగరికతగా మారింది. మొన్నటికి మొన్న, తగినంత తిండికీ, చాలినంత ఆచ్ఛాదనకూ నోచుకోని ఈ దేశంలోని కోట్లాది నిరుపేదల బతుకు టద్దంగా మారుతూ మోకాళ్ళు దాటని అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకోవడం ఆదర్శం కాదు, అవసరమనుకున్నాడు మహాత్మా గాంధీ. ఆ తర్వాత స్త్రీ పురుష వస్త్రధారణ అనేకానేక మార్పుల మలుపులు తిరుగుతూ ఒంటినిండా కప్పుకోవడమనేది ‘అనాగరికం’గా మారి గాంధీగారి అంగవస్త్రంలా మోకాళ్ళు దాటని షార్ట్స్ ధరించడం అతి నవీనమైన పోకడగా మారింది. కాలం చేసే చిత్రాలు అలా ఉంటాయి. అది మన పట్టు తప్పించుకుంటూ ముందుకే కాదు, వెనక్కీ, పక్కలకీ కూడా పరుగులెడుతూ మనతో ఆడుకోగలదు. కాలం అఖండంగా ఉంటూనే నిన్న, నేడు, రేపు రూపంలో ఖండితంగానూ ఉంటుంది. కానీ మన ఊహాపోహలకు, జీవనగమనానికి మేకులు దిగేసి వర్తమానమనే కట్టుకొయ్యకు బంధించి ఉంచుతుంది. కవి ఎంత క్రాంతదర్శి అయినా ఆ మేకుబందీ నుంచి పూర్తిగా తప్పుకోలేడు. రేపటి కాలంలో పోస్ట్ మ్యాన్ ఆరోవేలుగా మారబోతున్నాడని తెలిసి ఉంటే దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రసిద్ధ కవిత ‘తపాలా బంట్రోతు’ ఏ రూపం దిద్దుకొని ఉండేదో! ‘దేశాంతరగతుడైన ప్రియుడి వార్త’ మొబైల్ రూపంలో అరచేతి దూరంలో ఉన్న ఈ రోజున, ఏ అమ్మాయీ ‘పద్దెని మిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్లెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించా’లనే ఆశతో, ‘చూపులు తుమ్మెద బారులు కట్టి’ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేదు. చిరునవ్వుతోనే కబురు లేదని చెప్పి వెళ్లిపోతున్న తపాలా బంట్రోతు వెనుక ఆ కళ్ళు ‘విచ్చిన రెండు కల్హార సరస్సులు’ కావలసిన అవసరమూ లేదు. అలాగని ప్రియుడి వార్త కోసం పడుచు దనం పడే ఆరాటం కాలభేదాలకు అతీతంగా నిత్యనూతనమూ అవుతుంది కనుక ఒక అపురూప భావస్పందన కలిగించే కవితగా అది భవిష్యత్తులోకి తన అస్తిత్వాన్ని పొడిగించుకుంటూనే ఉంటుంది. మరోపక్క గతకాలపు చరిత్ర శకలంగానూ మారుతుంది. గతంపై మసక తెర కప్పి మాయ చేయడం కాల స్వభావాలలో ఒకటి. మన పాదముద్రలు గతంలోకి వ్యాపించి ఉన్నాయన్న ఎరుక తప్పి, మన నడక వర్తమానంలోనే మొదలైందని అపోహ పడతాం. నేడు మన కళ్ళముందు ఉన్నవే నిత్యాసత్యాలు కావనీ, మొదటి నుంచీ ఈ ప్రపంచం ఇలాగే లేదనీ కొంత తెలిసినా కొంత తెలియనట్టే భ్రమావలయంలో గడుపుతూ ఉంటాం. ఎన్నో రకాల నియంతృత్వాలను దాటి ప్రజాస్వామ్యంలోకి వచ్చామనీ, అది కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది తప్ప పూర్తిగా పాదుకోలేదనీ, నేటి మన అనేకానేక సమస్యలు, సంక్షోభాల మూలాలు గతంలో ఉన్నాయనీ, వాటి పరిష్కారాల వెతుకులాటలో వందలు, వేల సంవత్సరాల గతంలోకి మన చూపుల నిడివి పెంచుకోవాలనే ఊహ రాకుండా మన బుద్ధికి కాలం దడి కడుతుంది. వర్తమానాన్ని ఒక మత్తుమందులా అలవాటు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాఙ్మయ పరిణామ క్రమాన్నే కనుక చూస్తే, క్రతు సంబంధమైన తంతు నుంచి మూకాభినయమూ, దాని నుంచి నాట్యమూ, నాట్యం నుంచి నాటకమూ ఎలా అభివృద్ధి చెందాయో; క్రతు సందర్భ గానం నుంచే పాట పుట్టి కావ్యస్థాయికి ఎలా పెరిగిందో; అనేకమంది అజ్ఞాతకర్తలు కలిగిన మౌఖిక సంప్రదాయం నుంచి, ఏక కర్తృకమైన లేఖన సంప్రదాయానికి వాఙ్మయం ఎలా పరివర్తన చెందిందో చెప్పే ఆసక్తికరమైన అధ్యయనాలు ఈరోజున అందు బాటులో ఉన్నాయి. అయినాసరే, నాట్యం, నాటకం, పాట, పద్యం, వచనపద్యం, గద్యం, కథ, నవల వంటి వివిధ ప్రక్రియలను పరస్పర సంబంధం లేని భిన్న రూపాలుగా విడదీసి చూడడాన్ని కాలం మనకు అలవాటు చేసింది. మౌఖిక సంప్రదాయానికి, అనేక కర్తృకానికి చెందినవాటిని కూడా లిఖిత సంప్రదాయం నుంచీ, ఒక్కరే రచించారన్న భావన నుంచీ చూడడం కూడా కాలం మప్పిన అలవాటే. కాలం పోయే చిత్రగతులు మనిషిని మొదటినుంచీ తికమకపెడుతూ ఆలోచనకు లోనుచేస్తూనే ఉన్నాయి. మహాభారత కథకుడు కాలానికి చెప్పిన భాష్యంలో అసాధారణమైన లోచూపు కనిపించి ఆశ్చర్యచకితం చేస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన అన్ని భావాలూ కాలనిర్మితాలేనంటాడు. భావాలు మనిషివే కనుక మనిషీ కాలనిర్మితుడే నన్నమాట. కాలం గురించిన తెలివిడితోనే దాని మాయాజాలం నుంచి ఏ కొంచెమైనా తప్పించుకోగలం. -
ఓ వ్యక్తి 'మానవ శునకం'గా రూపాంతరం..కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..
జపాన్‌కి చెందిన వ్యక్తి కుక్కలా మారాలనుకున్న వెర్రి ఆలోచన సంగతి గురించి తెలిసిందే. అతడు గతేడాది ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు కూడా. అందుకోసం తాను దాదాపు రూ. 12 లక్షల దాక ఖర్చు పెడుతున్నట్లు కూడా చెప్పాడు. తనను కుక్కలా మార్చేందుకు ఓ జపాన్ కంపెనీ ముందుకొచ్చిందన్నాడు. ఆ కంపెనీ కుక్కలా కనిపించేలా దుస్తులు తయారు చేస్తుందని, అవి వేసుకుంటే తాను అచ్చం కుక్కలానే కనిపిస్తానని చెప్పుకొచ్చాడు. ఆ దుస్తుల తయారీకి కొంత టైం పడుతుందని కూడా అన్నాడు. ఔనా! అప్పుడు అందరూ ఏంటీ పిచ్చి? అంటూ చివాట్లు పెట్టారు. అక్కడితో కథ అయిపోయిందనుకున్నాం. కానీ ఆ వ్యక్తి అన్నంత పని చేశాడు. అతడు చెప్పినట్లుగానే కుక్కలా మారిపోయాడు. అది కూడా ఏదో వేషం వేసినట్లు లేదు..నిజమైన కుక్కని తలపించేలా ఉంది. అతని రూపు, ఆహార్యం అన్ని కూడా కుక్కలానే ఉంది. ఏకంగా వీధుల్లో మానవ కుక్కలా సంచరిస్తున్నాడు కూడా. చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు, వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి తాను పూర్తి స్థాయిలో కోలీ అనే డాగ్‌గా మారిపోయానోచ్చ్! అని సంబరపడిపోతున్నాడు. అతగాడి కుక్క రూపాన్ని చూస్తూన్న వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు భయంతో దూరంగా వెళ్లిపోతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోని 'ఐ వాంట్ టు బీ ఏ యానిమల్' అనే పేరుతో సోషల్‌మీడియాలో అప్ప్లోడ్ చేశాడు కూడా. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదండోయ్ ఆ జపనీస్ కంపెనీ జీపెట్కి నిజమైన కుక్కలా కనిపించేలా ఆ దుస్తులు తయారు చేసేందుకు చాలా రోజులే పట్టిందట. (చదవండి: పామే కదా ! అని పరాగ్గా ఉంటే..స్పేక్ క్యాచర్ అయినే అంతే సంగతి!) -
కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. మొదటి కథ ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. మనిషి పాత్ర అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది. క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది. ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది. అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ కథలో... ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo. పులి- అహంకారం నిండి ఉన్న మనస్సు. యజమాని - సద్గురువు/పరమాత్మ బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇందులో నీతి ఏంటేంటే.. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. లోకా సమస్తా సుఖినోభవన్తు! -
మనిషి సైజులో వేలాడుతున్న గబ్బిలం.. చూస్తే వెన్నులో వణుకు ఖాయం!
చెట్లపై తలకిందులుగా వేలాడే గబ్బిలాల గురించి మనకు తెలిసిందే. అవి ఏ సైజులో ఉంటాయో కూడా మనకు తెలుసు. అయితే మనిషంత సైజులో గబ్బిలం ఉండటాన్ని మనం ఊహించగలమా? ఊహించడానికే మనకు భయం వేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూపరులను భయకంపితులను చేస్తోంది. మనిషి సైజులో ఉన్న ఈ గబ్బిలం ఇంటి చూరుకు వేలాడుతూ భయపెడుతోంది. గబ్బిలాలను పిశాచాలతో పోలుస్తుంటారు. కొన్ని జాతులకు చెందిన గబ్బిలాలు ఇతర జంతువుల రక్తం తాగుతాయి. ఈ కారణంగా వీటిని పిశాచాలతో పోలుస్తారు. అయితే ఈ ఫొటోను చూసి ఎవరూ భయపడనక్కరలేదు. ఎందుకుంటే ఎవరో గబ్బిలం తరహా వేషధారణతో జనాలను భయపెట్టేందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇది ఎంత సహజంగా ఉందంటే నిజమైన గబ్బలం వేలాడుతున్నదని ఈ ఫొటో చూసినవారంతా హడలెత్తిపోతున్నారు. అయితే అసలు విషయం తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఫొటోలో గబ్బిలం రూపం అంత పెద్దగా కనిపించడానికి కెమెరా ట్రిక్ కారణమట. ఆప్టికల్ ఇల్యూజన్ సృష్టించారట. ఒక సాధారణ గబ్బిలం ఫొటోను పెద్దదిగా చేసి చూపారుట. ట్విట్టర్‌లోని ఈ ఫొటో అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తోంది.ఈ ఫొటోకు ఇప్పటివరకూ 58కే కు మించిన రీట్వీట్లు, 234కే కు మంచిన లైక్స్ వచ్చాయి. ఈ ఫొటో చూసిన ఒక యూజర్ ఇంత పెద్ద గబ్బిలం ప్రపంచంలో ఉంటే ఏమవుతుందో అని రాయగా, ఇది ఎడిటింగ్ పిక్చర్ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది! Remember when I told y'all about the Philippines having human-sized bats? Yeah, this was what I was talking about pic.twitter.com/nTVIMzidbC — hatdog² (@AlexJoestar622) June 24, 2020 -
‘హ్యూమన్ రైట్స్ హీరో-2023’గా హెరాల్డ్ డిసౌజా
ఇండియన్-అమెరికన్ లేబర్ ట్రాఫికింగ్ సర్వైవర్, యాక్టివిస్ట్ హెరాల్డ్ డిసౌజాను హ్యూమన్ రైట్స్ హీరో అవార్డు- 2023తో సత్కరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 17వ వార్షిక అంతర్జాతీయ మానవ హక్కుల యూత్ సమ్మిట్ సందర్భంగా హెరాల్డ్ డిసౌజా ఈ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది సమ్మిట్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సంబంధించి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. డిసౌజాతో సహా అంతర్జాతీయ వక్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు దీనిలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ సంవత్సరం సమానత్వం, గౌరవం, ఐక్యత థీమ్‌తో కార్యక్రమం జరిగింది. ‘ప్రతి బిడ్డకు మానవ హక్కులు తెలియజేయాలి’ డిసౌజా తన ప్రసంగంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు మానవ హక్కులకు సంబంధించిన 30 ఆర్టికల్స్ నేర్పించాలని అన్నారు. అవి 1948లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే పత్రంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తన ముందు ప్రేక్షకుల్లో కూర్చున్న ప్రతీ ప్రతినిధి నిజమైన హీరోనే అని డిసౌజా అభివర్ణించారు. మనుషుల అక్రమ రవాణా, తరలింపు నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి, గౌరవించి, అవార్డు ఇచ్చినందుకు యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మేరీ షటిల్వర్త్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మానవ అక్రమ రవాణాదారుని చేతిలో.. డిసౌజా హ్యూమన్ ట్రాఫికర్‌గా యుఎస్‌కి వచ్చారు. 18 నెలలకు పైగా ఆయన మానవ అక్రమ రవాణాదారుని చేతిలో దోపిడీకి గురయ్యారు. తన స్వేచ్ఛను కోల్పోయారు. నేడు ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. హెరాల్డ్ డిసౌజా న్యాయవాది, పబ్లిక్ స్పీకర్. అతని చేదు అనుభవం అతనికి జీవితంలో కొత్త లక్ష్యాన్ని, అర్థాన్ని అందించింది. డిసౌజా ఐస్ ఓపెన్ ఇంటర్నేషనల్‌కు సహ-వ్యవస్థాపకుడు. ఈ సంస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సమాచార పరిశోధనకు సహకరిస్తుంది. బాధితులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2015లో యునైటెడ్ స్టేట్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో సభ్యునిగా డిసౌజాను నియమించారు. ట్రాఫికింగ్‌ను పర్యవేక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫీస్‌కు నిపుణుల సలహాదారుగా కూడా డిసౌజా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అట్లాంటాకు చెందిన స్వచ్ఛంద సంస్థ శారీస్ టు సూట్స్ వ్యవస్థాపకుడు పట్టి త్రిపాఠి మాట్లాడుతూ డిసౌజా తన కుటుంబంతో కలిసి కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి, దీనిపై మరింత అవగాహన పెంచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భయం నుంచి స్వేచ్ఛకు.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి 46 దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశంలోని మంగళూరుకు చెందిన డిసౌజా ప్రస్తుతం ఒహియోలోని సిన్సినాటిలో ఉంటున్నారు. అతని జీవిత అనుభవాలు అతనిని.. బానిసత్వం నుండి క్రియాశీలతకు, బాధ నుంచి ఆనందానికి, భయం నుంచి స్వేచ్ఛకు.. ఇప్పుడు ‘హ్యూమన్ రైట్స్ హీరో అవార్డ్ 2023’అందుకునేందుకు సహకరించాయి. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాదు! కొండే అడ్డు రానీ..
ఆచరణల ప్రసంగం, ఆశల ప్రణాళిక, నమ్మకాల ప్రదర్శన, అభిప్రాయాల ప్రకటన, గుణాల ప్రతాపం, భావాల ప్రవాహం, ఆలోచనల ప్రస్థానం మనిషి జీవనం, జీవితం. జీవనం, జీవితం వీటిని మనిషి ఏ మేరకు ఫలవంతం చేసుకుంటున్నాడు? ఎంత సారవంతం చేసుకుంటున్నాడు? తన జీవనం, జీవితం వీటివల్ల మనిషి ఏ మేరకు ఫలవంతం ఔతున్నాడు? ఎంత సారవంతం ఔతున్నాడు? ఈ ప్రశ్నలకు సంతప్తికరమైన జవాబులు మాత్రమే రావాలి లేదా సాధించుకోవాలి. అందుకనే మనిషికి జీవనం, జీవితం ఉన్నాయి; అందుకనే జీవనం, జీవితం వీటితో మనిషి ఉన్నాడు. మనిషికి జీవనం లేకపోతే జీవితం లేదు; జీవితం లేకపోతే జీవనం లేదు. జీవనం, జీవితం ఈ రెండూ లేకపోతే మనిషి లేడు. ఉన్న మనిషికి ఉండే జీవనం, జీవితం మనిషి సఫలం అయ్యేందుకే కాని విఫలమూ, విధ్వంసమూ అయ్యేందుకు కాదు; విఫలమూ, విధ్వంసమూ చేసేందుకు కాదు. మనిషి మస్తిష్కం ఆకాశం ఐతే అక్కడ నుంచి నాణ్యమైన, సరైన భావనల వానపడితే ఆ వానకు మనసు తడిస్తే జీవనం పూస్తుంది; జీవితం రూపొందుతుంది. జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ అవాలంటే మస్తిష్కమూ, మనస నాణ్యతతోనూ, సరిగ్గానూ ఉండాలి లేదా నాణ్యతతోనూ, సరిగ్గానూ పని చేస్త ఉండాలి. మస్తిష్కమూ, మనస నాణ్యతతోనూ, సరిగ్గానూ పని చేస్త ఉంటే జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ ఔత మనిషికి మాన్యత వస్తుంది. పుట్టేశాం కదా అని కాలాన్ని తోసెయ్యడం జీవనం కాదు; కాలంవల్ల తోసెయ్యబడడం జీవితం కాకూడదు. అభిప్రాయాల్నీ, మనోభావాల్నీ పేర్చుకుంటూపోవడం జీవనం కాదు; వాటినే మోసుకుంటూ వాటి బరువుకు కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాకూడదు. వాగులో కొట్టుకుపోవడం కొనసాగడం ఔతుందా? ప్రవాహంలో ముందుకు ఈదడమూ, అవసరానికి ఆనుగుణంగా ప్రవాహానికి ఎదురు ఈదడమూ జీవనం అవుతుంది; నదిలో కొట్టుకుపోవడమా? కాదు, కాదు నదిలా ప్రవహించడం జీవితం ఔతుంది. రాని పిలుపును విని వడివడిగా వెళ్లడం జీవనం కాదు; లేని చోటును వెతుక్కుంటూ వెళ్లడం జీవితం కాదు. ఉన్న దారిలో లేని తలుపులు మూసుకుని ఉన్నాయి అని అనుకుని ఊరికే పడి ఉండడం జీవనం కాదు; కొండే అడ్డుగా ఉన్నా దారీ, తీరూ మార్చుకుని నీరులా ముందుకు సాగడమే జీవితం. మనిషికీ జీవితం ఒక గుంటగానూ, ఆ గుంటలో పడిపోయి పరుగెత్తుతూ ఉండడం జీవనంగానూ అవకూడదు. తనను తాను కోల్పోవడం మనిషికి జీవితం అవుతుందా? అవదు, అవదు; తన నుంచి తాను కోలుకోవడం ఏం ఔతుంది? అదే జీవితం ఔతుంది! పోగొట్టుకోవడం జీవనం అవదు అన్న తెలివిడి వస్తే పొందడం అన్నది జీవితం అవుతుంది అని తెలియవస్తుంది మనిషికి. మనిషి తననుంచి తాను విడివడడం అన్న కళను అభ్యసించి నేర్చుకోవాలి. జన్మతః మనిషికి మానసికంగానూ, చింతనపరంగానూ లోపాలు, దోషాల ఉంటాయి. లోపాలు, దోషాల లేని మనిషి ఉండడం ఉండదు. తన లోపాల్నీ, దోషాల్నీ వదులుకోవడం కోసం మనిషి తన నుంచి తాను విడివడాలి లేదా విడుదలవ్వాలి. అలా జరిగితే అప్పుడు అది జీవనం ఔతుంది. తనను తాను మాటిమాటికీ సరి చూసుకుంటూ, సరి చేసుకుంటూ తనలోకి తాను చేరుతూ ఉంటే అప్పుడు అది జీవితం ఔతుంది. జీవితం తనతో ఉన్నప్పుడు మనిషి దాన్ని ఉపయోగించుకోవడం జీవనం; జీవనం ఉపయోగపడడంవల్ల ఉన్నతిని పొందడం జీవితం. జీవనానికి జీవితం ఉండాలి; జీవితానికి జీవనం పండాలి; మహిలో మనిషి మెరవాలి. జీవనమూ, జీవితమూ ఉన్నాయి కాబట్టి మరణించాక కూడా మనిషి పరిమళించాలి. ఇక చివరిగా ఏది మనిషికి విజయం తన జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ ఐనా జీవనం, జీవితానికి విజయం, ఫలవంతమూ సారవంతమూ ఐతే జీవితానికి జీవనం విజయం. – రోచిష్మాన్ (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
మనుష్యులు చూడని ప్రాంతాలివే
-
World's Most Dangerous Day: సెకెన్ల వ్యవధిలో ఊహకందని ఘోరం.. 8 లక్షలమంది..
మనిషి లక్షలాది సంవత్సరాలుగా ఊహికందని ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇటువంటి సమయాల్లో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతుండగా, లెక్కకు అందని సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇక నిరాశ్రయులయ్యేవారి సంఖ్య చెప్పనలవి కాదు. ఇప్పుడు మనం ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత భారీ విపత్తు గురించి తెలుసుకుందాం. ప్రపంచానికే అత్యంత ప్రమాదకరమైన రోజు.. సైన్స్ అలర్ట్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం 1556 జనవరి 23.. ఆరోజు మానవాళి పెను విపత్తును భీకర భూకంపం రూపంలో ఎదుర్కొంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో 8 లక్షలమంది జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఈ ఒక్క ఘటనతో చైనాలో అప్పటివరకూ సంతరించుకున్న నాగరిత సర్వనాశనం అయ్యింది. ఎంత శక్తివంతమైన భూకంపం అంటే.. సాధారణంగా ఎక్కడో ఒకచోట భూకంపం వస్తూనే ఉంటుంది. అయితే 1556 జనవరి 23న సంభవించినంతటి పెను భూకంపం ఇంతవరకూ ఎన్నడూ సంభవించలేదు. సాధారణంగా స్వల్పస్థాయి భూకంపాలు రిక్టర్ స్కేలుపై 2.3 లేదా 3.2గా నమోదవుతుంటాయి. అయితే 1556 జనవరి 23న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 8.0 నుంచి 8.3 మధ్యలో నమోదయ్యింది. ఇది పెను విపత్తుకు దారితీసింది. భూకంప కేంద్రం నగరం మధ్యలో ఉండటమే ఇంతటి భారీ విపత్తుకు కారణంగా నిలిచింది. మానవ నాగరికత భవిష్యత్‌కు సన్నాహాలు ఈ భారీ వినాశకర భూకంపం భవిష్యత్‌లో ఇటువంటి ఉత్పాతాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఘటన అనంతరం చైనాలో అత్యధికశాతం ఇళ్లను తేలికపాటి కలపతో నిర్మించసాగారు. అయితే ఇప్పటి ఆధునిక సాంకేతికతతో భూకంపాలను ముందుగానే పసిగట్టే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. భూకంపాల నుంచి ఎలా తప్పించుకోవాలనే విధానాలను కనుకొన్నారు. ఇదేవిధంగా తుపానులను, ఇతర ప్రకృతి వైపరీత్యాలను మనిషి ముందుగానే గుర్తించగలుగుతున్నాడు. ఇది కూడా చదవండి: పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే.. -
Odisha Train Crash: ఇది సాంకేతిక సమస్య? మానవ తప్పిదమా?..
ఒడిశాలో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు, లోపాలు గురించి పలు ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీ కొట్టిన కోరమాండల్ ప్యాసింజర్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీన్ని మరోక రైలు యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ పట్టాలు తప్పిన బోగీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అసలు ఇదే ఎలా జరిగిందనే దానిపై పలు అనుమానాలకు లెవనెత్తాయి. ఈ మేరకు ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. వెంటవెంటనే రైళ్లు ఎలా ఢీ కొన్నాయి. అదే ప్రదేశంలో ఎలా జరిగిందనే దానిపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అదీగాక గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్‌లోనే కోరమాండల్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ స్టేషనరీ గూడ్స్ రైలు ఎలా ఉందనేది పలు సందేహాలకు దారితీసింది. ఒకవేళ ఇది సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనేది సందేహాస్పదంగా ఉంది. సిగ్నల్ లోపమే.. ఈ ఘటనతో రైల్వే మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా యాంటీ కొలిజన్ సిస్టమ్ కవాచ్ని ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ఉంది. రైలు ఢీ కొనడానికి ప్రధాన కారణం అయిన సిగ్నల్(సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ ఎస్పీఏడీ) ఉన్నప్పుడూ ఈ కవాచ్ హెచ్చరిస్తుంది. ఈ సిస్టమ్ రైలు డ్రైవర్ని అప్రమత్తం చేయగలదు, బ్రేక్‌లను నియంత్రించగలదు. అదే సమయంలో ట్రాక్‌పై రైలుని గమనించి వెంటనే రైలుని ఆపగలదు కూడా. అయితే ప్రమాదం జరిగిన మార్గంలో కవాచచ్ అందుబాటులో లేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ అన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యంత ప్రభావితమైన భాగాలు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, సాధారణంగా సెలవు దినాల కావడంతో వాటిల్లో అత్యంత రద్దీగా ఉంటుంది. రిజర్వ్ చేయని ప్రయాణికులు కూడా ప్రవేశిస్తారు. అందువల్ల గుర్తు తెలియని వారి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండొచ్చని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఘటన స్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులోనే తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీపి నియమించనున్నట్లు తెలిపారు. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
షాకింగ్ ఘటన: ఏకంగా 45 బ్యాగుల్లో మానవ అవశేషాలు!
అమెరికాలోని పశ్చిమ మెక్సికో రాష్ట్రంలో ఒళ్లు గగ్గుర్పొడిచే భయానక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు జాలిస్కోలోని ఓ లోయలో మానవ శరీర భాగాలతో కూడిన దాదాపు 45 బ్యాగులు లభించాయని అధికారులు తెలిపారు. అందులో స్త్రీ, పురుషులకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద పారిశ్రామిక కేంద్రమైన గ్వాడలజారా శివారు ప్రాంతమైన జపోపాన్ మున్సిపాలిటీ వద్ద ఓ 40 మీటర్ల లోయలో ఈ భయానక ఘటన వెలుగు చూసిందని తెలిపారు. 30 ఏళ్ల వయసుగల ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు తప్పిపోయినట్లు ఫిర్యాదు రావడంతో వారి ఆచూకి కోసం వెతుకుతుండగా..ఈ ఘటన బయటపడింది. ఆయా వ్యక్తుల మిస్సింగ్ కేసులు వేర్వేరు రోజుల్లో వేర్వేరుగా అందినట్లు చెప్పుకొచ్చారు. అయితే వారందరూ ఒకే కాల్ సెంటర్లో పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతంలోనే కాల్‌సెంటర్ కూడా ఉంది. పోరెన్సిక్ నిపుణులు భాదితులు సంఖ్య, గుర్తింపును వెల్లడించాల్సి ఉంది. కాల్ సెంటర్లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగి ఉండవచ్చిని అనుమానిస్తున్నారు. ఆ కాల్ సెటర్ వద్ద మాదక ద్రవ్యాలు, రక్తపు మరకలతో కూడిన వస్తువులు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలిపారు. ఐతే బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం వారిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు యత్రిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా, జాలిస్కాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తొలిసారి కాదు. 2021లో, జాలిస్కోలోని తోనాలా మునిసిపాలిటీలో, 11 మంది మానవ అవశేషాలతో 70 బ్యాగులు బయటపడ్డాయి. అంతకుమునుపు 2019లో జపోపాన్‌లోని జనావాసాలు లేని ప్రాంతంలో 119 బ్యాగుల్లో 29 మంది మానవ అవశేషాలను కనుగొన్నారు. కానీ 2018లో ముగ్గురు చలన చిత్ర విద్యార్థులు మిస్సింగ్ కేసులో.. వారి అవశేషాలు యాసిడ్‌లో కరిగిపోవడం అత్యంత వివాదాస్పదంగా మారి నిరసనలకు దారితీసింది. (చదవండి: ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరసిస్తూ.. నగ్నంగా నిలబడి..) -
మంచి మాట: ఉండాల్సిన లక్షణం
మంచితనం; మానవ జాతి మొదలయిన రోజు నుంచి ప్రతిమనిషికి అతిముఖ్యంగా కావాల్సి వచ్చింది ఏదైనా ఉంది అంటే అది మంచితనం. ఒక మనిషి నుంచి మరొక మనిషికి జారి పోకుండా అందాల్సింది ఏది అని అంటే అది మంచితనం. మొత్తం మానవ జాతికి సర్వదా, సర్వథా క్షేమకరం అయిందీ, లాభకరం అయిందీ ఏదైనా ఉందీ అంటే అది మంచితనం. మానవజాతిలో మంచితనానికి ఆది నుంచీ కొరత ఉండడం కాదు అసలు మంచితనం మనలోకి, ప్రపంచం లోకి ఇంకా రానేలేదు. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఇకపైనైనా మనలో మంచితనం కోసం మంచి ప్రయత్నాలు మెదలు అవచ్చు. మంచితనం అని మనం అనుకుంటోంది నిజానికి మంచితనం కాదు. మంచితనం అని మనం అనుకుంటోంది మంచితనమే అయి ఉంటే మన ప్రపంచంలో జరుగుతూ వస్తున్న హాని, విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాలు, ద్రోహాలు, దొంగతనాలు, కుట్రలు, మనుషుల బతుకులు అల్లకల్లోలం అవడమూ మనకు తెలుస్తూ ఉన్నంత తెలుస్తూ ఉండేవి కావు; ఇప్పటిలా మనం వాటివల్ల దెబ్బతినేవాళ్లం కాము. మంచితనానికి మంచి జరగలేదేమో? అందుకే మనలోకి, ప్రపంచంలోకి రావడానికి మంచితనానికి ఇంకా మంచిరోజు రాలేదేమో? మంచితనానికి మంచి జరిగే ఉంటే ఎంతో బావుండేది. మనకు నెమ్మది, మన బతుకులకు భరోసా ఉండేవి. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని యోగులు, గురువులు, కవులు, జ్ఞానులు అందరినీ మంచితనంవైపు మళ్లించే మాటలు చెప్పారు. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. ఎందుకో చెడు అబ్బినట్టుగా మనిషికి మంచి అబ్బలేదు. ఏమిటో మరి చెడుకు మాలిమి అయినట్టుగా మనిషి మంచికి మాలిమి అవలేదు. ఇందుకు కారణాలు తెలిసిపోతే మంచికి రోజులు వచ్చేస్తాయేమో? చెడుకు రోజులు చెల్లిపోతాయేమో? మనిషి చెడుతోనే పుడతాడు. చెడు అన్నది ఎవరికైనా పుట్టకతోనే వచ్చేస్తుంది. మనిషిలో చెడు సహజంగానే ఉంటుంది. మనిషి తనలో ఉన్న చెడును తొలగించుకుంటూ మంచిని అభ్యసిస్తూ ఆపై దాన్ని సాధించాల్సి ఉంటుంది. మనిషికి చెడు అన్నది లక్షణం; మంచి అన్నది లక్ష్యం. మనిషి తన లక్షణాన్ని వదులుకుని ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాడు. మనకు ప్రశాంతత కావాలి; అందుకు మంచితనం వచ్చి తీరాలి. మంచితనం వేగంగా రావాలి; మంచితనం నిజంగా రావాలి. కొత్తగా పుట్టిన నదిలా అది ఎప్పటికీ ఉండేలా మంచితనం మనలోకి ప్రవహించాలి. ‘ఓ మంచితనమా, నువ్వు ఎక్కడ ఉన్నావ్? నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఇదే మా స్వాగతం; ఇంకా నువ్వు వేచి ఉండకు రా మాలోకి. రాయని కవితలా ఎక్కడో ఉండిపోకు; సరైన తరుణం ఇదే రా మాలోకి. మాకు నీ అవసరం చాలా ఉంది; నువ్వు లేకపోవడం వల్ల మా ఈ లోకం అపాయకరం అయిపోతూ ఉంది. వెంటనే వచ్చేసెయ్ ఓ మంచితనమా, ఎదురు చూస్తూ ఉన్నాం రా మంచితనమా రా’ అంటూ మనం అందరమూ మన క్షేమం కోసం మంచితనాన్ని మనసా, వాచా తప్పనిసరిగా ఆవాహన చెయ్యాల్సిన అవసరం ఉంది. మంచితనం మనలో లేనందువల్ల మనం విరిగిపోయిన వాక్యాలం అయ్యాం; అందువల్ల మనం అనర్థదాయకం అయ్యాం. ఈ స్థితిని అధిగమించి మంచితనాన్ని సాధిద్దాం; మనుగడను సాత్వికం చేసుకుందాం. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. – రోచిష్మాన్ -
అచ్చం మనిషిలానే తింటున్న ఏనుగు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఏనుగులు శాంతంగా ఉంటే ఎంత సరదాగా ఉంటాయో కోపమొస్తే గజరాజులా మారి అదే స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వీటికున్న ప్రత్యేకత ఏంటంటే మావాటి చెప్పేవి బుద్ధిగా వినడంతో పాటు వాటిని పాటిస్తాయి కూడా. వీటి ప్రవర్తన చూసి మనుషులు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. మరీ పిల్ల ఏనుగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ఏనుగు అరటి పండు తినే తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. బెర్లిన్ జూలో ఉన్న ఓ ఏనుగు అరటి పండును తినే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. పంగ్ ఫా అనే ఆసియా ఏనుగు అరటి పండు ఇస్తుంటే.. ముందుగా అది అరటిపండు తొక్క తీసేసి ఆపై పండును మాత్రం తింటోంది. ఇది తినే తీరు చూస్తే అచ్చం మనిషిలానే తిన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండోయ్ పసుపు రంగులో బాగున్న అరటిపండ్లను మాత్రం తింటూ.. గోధుమ రంగు (సరిగా లేని) అరటి పండ్లను తినేందుకు ససేమిరా అంటోంది. దీన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 32,000 మంది వీక్షించారు. -
మార్పు ఒక సాంత్వన
మార్పును పొందడం, మారడం బతుకుతున్న మనిషికి ఎంతో అవసరం. మనిషి రాయి కాదు మార్పును పొందకుండా మారకుండా పడి ఉండడానికి. బతుకుతున్న మనిషి మార్పును పొందుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. బతకడానికి సిద్ధంగా ఉన్న మనిషి మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక మనిషి మారకపోవడం అతడు సరిగ్గా బతకలేక పోవడమూ, బతకకపోవడమూ అవుతుంది. ‘నువ్వు ఇక్కడ ఉంది బతకడానికి; నువ్వు ఇక్కడ ఉంది ఆడడానికి; నువ్వు ఇక్కడ ఉంది బతుకును అనుభవించడానికి‘ అని ఓషో చెప్పా రు. మార్పు లేకుండా, మారకుండా రాయిలా బతికితే ఎలా? బతుకుతూ ఉండడానికి, బతుకును అనుభవిస్తూ ఉండడానికి మనిషిలో ఎప్పటికప్పుడు మార్పు వస్తూ ఉండాలి; మనిషి తనను తాను మార్చుకుంటూ, తనకు తాను మార్పులు చేసుకుంటూ బతుకును ఆస్వాదిస్తూ ఉండాలి. ర్పుల్ని స్వీకరించని మనిషికి, మారని మనిషికి, ఊరట ఉండదు, సాంత్వన ఉండదు. ‘ఎవరికి ఏది తెలియదో అది వాళ్లకు ఉండదు’ అని తాత్త్వికకృతి త్రిపురారహస్యం మాట. మారడం తెలియనివాళ్లకు మార్పు అనేది ఉండదు. మార్పు లేనివాళ్లకు బతుకు సరిగ్గా ఉండదు. అంతేకాదు బతకడమే భారమైపోతుంది. మనిషిలో మార్పులు రాకపోడానికి ముఖ్యమైన కారణాలు అభిప్రాయాలు. అభిప్రాయాల వలలో చిక్కుకుపోయినవాళ్లు మారడం చాతకాకుండా మానసికంగా బాధపడుతూనే ఉంటారు; తమవాళ్లను అదేపనిగా బాధపెడుతూనే ఉంటారు. అభిప్రాయాలకు అతీతమైన అవగాహన మనిషికి అవసరమైన మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది. వయసువల్ల మనిషికి శారీరికమైన మార్పులు రావడం సహజం. ఆ విధంగానే ప్రతి మనిషికీ ఆలోచనపరంగా, దృక్పథంపరంగా, ప్రవర్తనపరంగా, మనస్తత్వంపరంగా మార్పులు రావాలి. మన దైనందిన జీవితంలో భాగం అయిపోయిన కంప్యూటర్లను మనం రిఫ్రెష్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనల్ని కూడా మనం మాటిమాటికీ రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉండడంవల్ల జడత్వం లేదా స్తబ్దత తొలగిపోతుంది. జడత్వం, స్తబ్దతలు తొలగిపోతున్న కొద్దీ మనలో మార్పు వస్తూ ఉంటుంది. మన జీవితాన్ని మన మస్తిష్కం నిర్ణయిస్తుంది. మస్తిష్కంలో మార్పులు రాకపోతే జీవితంలో మార్పులు రావు. మారని మస్తిష్కం మొద్దులాంటిది. మస్తిష్కం మొద్దుగా ఉంటే జీవితం మొద్దుబారిపోతుంది. మన చుట్టూ ఉన్నవాళ్లలో ఇలా మొద్దుబారిన జీవితాలతో చాలమంది కనిపిస్తూ ఉంటారు. మార్పులకు మాలిమి అవని వాళ్లు మానసికరోగులుగా కూడా అయిపోతారు. కొంతమంది ఉన్మాదులుగా అయిపోవడానికి కారణం వాళ్లలో మార్పు అనేది రాకపోవడమే; వాళ్లకు మార్పు అవసరం అని వాళ్లు గ్రహించకపోవడమే. ప్రపంచానికి ఎంతో కీడు చేస్తున్న మతోన్మాదం,ప్రాం తీయవాదం, ముఠాతత్త్వం వంటివాటికి మూలం మారని, మారలేని మనుషుల మనస్తత్వమే. మనుషులు పసితనం నుంచి మారుతూ వచ్చాక ఒక వయసు తరువాత మారడాన్ని ఆపేసుకుంటారు. తమ అభిప్రాయాలు, నమ్మకాలు, ఆలోచనలు, అభిరుచులు, ఉద్దేశాలు, ప్రవర్తన సరైనవే అని తీర్మానించుకుని తమలో తాము కూరుకుపోతూ ఉంటారు. మారకపోవడం తమ గొప్పతనం అని నిర్ణయించుకుంటారు. అటుపైన వాళ్లు మూర్ఖులుగానో, చాదస్తులుగానో, తిక్కవ్యక్తులుగానో, పనికిరానివాళ్లుగానో, అసూయాపరులుగానో, దొంగలుగానో, ఇంగితం లేనివాళ్లుగానో, వంచకులుగానో, చెడ్డవాళ్లుగానో, హంతకులుగానో రూపొందుతూ ఉంటారు. సంఘానికి, ప్రపంచానికి మారని పలువురివల్ల ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. మారకపోవడంవల్ల మనుషులు మనుషులకు అపాయకరమైపోతూ ఉన్నారు. మార్పును పొందడం, మారడం మనుషులకు ఉండి తీరాల్సిన లక్షణం. ఊరట, సాంత్వన కావాలంటే, రావాలంటే, ఉండాలంటే మనుషులు మారడం నేర్చుకోవాలి. మారడం నేర్చుకుని మనుషులు శాంతంగా బతకాలి. – రోచిష్మాన్ -
ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది
ప్రపంచంలోనే తొలి రోబో లాయర్ కేసును లాయర్ మాదిరిగా సలహాలిచ్చి కేసును వాదించుకునేలా గైడ్ చేస్తుంది. 2015లో జాషువా బ్రౌడర్ అనే శాస్త్రవేత్త రోబో లాయర్ని రూపొందించారు. ఆయన డూనాట్‌పే లీగల్ సర్వీస్ చాట్‌బోట్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీని స్థాపించి న్యాయ సేవలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ స్మార్ట్‌ఫోన్‌లో రన్ అవుతోంది. నిజ జీవితంలోని కేసులన్నింటిని హెడ్‌ఫోన్ సాయంతో విని తన క్లయింట్‌కి సలహలు, సూచనలు ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో రూపొందించిన ఈ రోబో లాయర్ తొలుత కేసులకు సంబంధించిన జరిమానాలు, ఆలస్యంగా చెల్లించే రుసుమలు విషయంలో వినియోగదారులకు చట్టపరమైన సలహాలు అందించేది. ఇప్పుడూ ఏకంగా కేసును లాయర్ మాదిరిగా టేకప్ చేసి క్లయింట్‌ని తగిన విధంగా గైడ్ చేసి వాదించుకునేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ రోబో యూకేలోని ట్రాఫిక్ టిక్కెట్‌కి సబంధించిన ప్రతివాది కేసును వచ్చే నెలలో వాదించనుంది. ఈ కేసుకు సంబంధించి రోబోకి శిక్షణ ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని బ్రౌడర్ అన్నారు. ఫిబ్రవరిలో యూకే కోర్టులో ఈ కేసు విచారణ జరగనున్నట్లు తెలిపారు. కోర్టులో సమాచారాన్ని ప్రాసెస్ చేసి, వాదనలను విశ్లేషించి తన క్లయింట్‌కి తగిన సలహాలిస్తుంది. ఒక వేళ ఈ కేసు ఓడిపోతే జరిమాన కట్టడానికి సదరు సంస్థ అంగీకరించినట్లు సమాచారం. పార్కింగ్, బ్యాంకులకు, కార్పొరేషన్, బ్యూరోక్రసీకి సంబంధించిన కేసుల విషయమై కోర్టులో దావా వేయడం, వాదించడం వంటి వాటిల్లో ప్రజలకు సాయం చేస్తోంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతోంది. దీనివల్ల క్లయింట్‌కి కోర్టు ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే యూకేలో న్యాయవాదిని నియమించుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడిన పని, పైగా సుమారు రూ. 20 వేల నుంచి లక్ష రూపాయాల వరకు ఖర్చు పెట్టాలని బ్రౌడర్ చెబుతున్నారు. అంతేగాదు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో ఇంకా చాలా మంది మంచి లాయర్లు ఉంటారు, కానీ చాలా మంది లాయర్లు డాక్యుమెంట్లను కాపీ చేసి పేస్ట్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ ఈ రోబో లాయర్ చెక్ ్పెడుతుందని ఆనందంగా వెల్లడించారు సైంటిస్ట్ బ్రౌడర్. ఐతే ఈ రోబో లాయర్ యూకేలోని ఏకోర్టులో ఏ క్లయింట్ తరుఫున వాదిస్తుందన్నది శాస్త్రవేత్త వెల్లడించలేదు. Here it is! The first ever Comcast bill negotiated 100% with A.I and LLMs. Our @DoNotPay ChatGPT bot talks to Comcast Chat to save one of our engineers $120 a year on their Internet bill. Will be publicly available soon and work on online forms, chat and email. pic.twitter.com/eehdQ5OXrl — Joshua Browder (@jbrowder1) December 12, 2022 (చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం..షర్ట్ లేకుండా పిడిగుద్దులతో..) -
వింత ఘటన: గుండె లేకుండా జీవించిన తొలి మానవుడు!
సాటి మానవుల పట్ల జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తే.. నీకు అసలు హృదయమే లేదంటూ నిందిస్తాం. అసలు మానవుడి గుండె ఒక్కనిమిషం ఆగినా చనిపోయినట్లే. అలాంటిది అసలు గుండె లేకుండా బతకడమేమిటి. నిజమేనా! అన్న డౌటు వస్తుంది ఎవరికైనా. ఎలా చూసినా, ఏవిధంగా ఆలోచించినా అది అసాధ్యం. కానీ ఇక్కడొక మనిషిని చూస్తే ఔను! అని తల ఊపకతప్పదు. ఈ అత్యంత ఆశ్చర్యం కలిగించే ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..క్రెయిగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తి 2011లో అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది అసాధారణమైన ప్రోటీన్ల పెరుగుదలకు కారణమయ్యే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వేగంగా గుండె, మూత్రపిండాలు, కాలేయంపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్ బిల్లీకోన్, డాక్టర్ బడ్ ఫ్రేజియర్, లూయిస్ రక్తాన్ని పల్స్ లేకుండా రక్తం ప్రసరించడానికి సహాయపడే పరికరాన్ని అమర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరికరాన్ని ఆ ఇద్దరు వైద్యులే రూపొందించారు. ఆ వైద్యులు ఈ పరికరాన్ని దాదాపు 50 దూడలపై పరీక్షించారు. వారు ఆయా జంతువుల హృదయాలను తీసేసి వాటి స్థానంలో ఈ పరికరాన్ని అమర్చారు. అవి తమదైనందిన విధులను గుండె లేకుండానే నిర్వర్తించగలిగాయి. అంతేగాదు సెతస్కోపును ఆవు ఛాతి వద్ద పెట్టి వింటే గుండె చప్పుడూ వినిపించదు. మనం ఈసీజీ పరీక్ష చేసిన ప్లాట్‌లైన్ చూపిస్తుందని డాక్టర్ కోన్ చెప్పుకొచ్చారు. ఐతే లూయిస్ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అతని భార్య లిండా ఆపరికరాన్ని తన భర్త శరీరంలోకి అమర్చడానికి వైద్యులకు అనుమతిచ్చింది. ఈ మేరకు వైద్యులు అతడి గుండెను తీసివేసి ఈ పరికరాన్నిఅమర్చారు. ఇది శరీరంలో నిరంతరం ప్రవహిస్తున్న రక్తం ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరాన్ని అమర్చడానికి ముందు లూయిస్‌ని డయాలసిస్ మెషిన్, శ్వాసయంత్రం తోపాటు బాహ్య రక్త పంపుపై ఉంచారు. భార్య లిండా తన భర్త పల్స్ విన్నప్పుడూ ఆశ్చర్యపోయింది. అతనికి పల్స్ లేదని, ఇది చాలా అద్భుతమైనదని ఆమె చెబుతోంది. కానీ పాపం ఆ వ్యాధి కాలేయం, మూత్రపిండాలపై దాడి చేయడంతో లూయిస్ పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అతను ఇలా పల్స్ లేకుండా ఒక నెలకుపైగా జీవించాడు. ఐతే శరీరానికి అమర్చిన పంపులు సరిగా పనిచేయకపోవడంతోనే అతను మరణించాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో ప్రపంచంలోనే గుండె లేకుండా జీవించిన తొలి మానవుడిగా లూయిస్ నిలిచాడు. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
మెక్సికో విమానాశ్రయంలో యునైటెడ్స్టేట్స్కు వెళ్లే ప్యాకేజీలో మానవ పుర్రెలు ఉన్నాయంటూ కలకలం రేగింది. ఈ మేరకు సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక కార్డ్బోర్డ్ పెట్టేలో అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టబడిన పుర్రెలు కనుగొన్నారు అధికారులు. ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ప్యాకేజిని అధికారులు గుర్తించారు. దేశంలో అత్యంత హింసాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర రాష్ట్రమైన మిచోకాన్ నుంచి ప్యాకేజి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇది సౌత్ కరోలినాలోని మన్నింగ్‌లోని చిరునామకు వెళ్లనుందని తెలిపారు. ఆ మానవ అవశేషాలు ఏ వయసు వారివి? ఎవరివీ? అనే వివరాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి మానవ అవశేషాలను పంపించాలంటే హెల్త్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఐతే ఈ ప్యాకేజి ఆ అనుమతిని పొందలేదని ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇలానే కెన్యా నుంచి అమెరికాకు జిరాఫీ, జీబ్రా ఎముకలను తీసుకురావడానికి ప్రయత్నించినందుకు వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది ఒక మహిళను అడ్డుకున్నారని కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) తన నివేదికలో పేర్కొంది. (చదవండి: చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్.. షాక్‌లో బీజింగ్) -
తొలి అడుగులు చెట్ల మీదే!
భూమిపై మానవ వికాసం జరిగిన తీరు మనకిప్పటికీ పెద్ద మిస్టరీయే. అందులో అత్యంత కీలకమైన ‘ముందడుగు’ నడక. వెన్నును నిటారు చేసి రెండు కాళ్లపై సాగడం మానవ పరిణామ క్రమంలో నిజానికి చాలా పెద్ద మలుపు. ఇతర చతుష్పాద జంతువులన్నింటి నుంచీ ఇదే మనిషిని పూర్తిగా వేరు చేసి అత్యంత ప్రత్యేకంగా నిలిపింది. ఇంత కీలకమైన నడకను మన పూర్వ మానవుడు ఎప్పుడు నేర్చాడన్నది మనకే గాక పరిశోధకులకు కూడా అత్యంత ఆసక్తికరమైన టాపికే. దీనిపై దశాబ్దాలుగా ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. అడవులు, తత్ఫలితంగా చెట్లు బాగా తగ్గి మైదాన ప్రాంతం పెరుగుతూ పోవడం వల్లే మనిషి రెండు కాళ్లపై నడక నేర్చుకోవాల్సి వచ్చిందని అవన్నీ దాదాపుగా ముక్త కంఠంతో చెప్పే మాట. కానీ అది పూర్తిగా తప్పంటోంది తాజా పరిశోధన ఒకటి. మన పూర్వీకులు చెట్లపై నివసించే రోజుల్లోనే రెండు కాళ్లపై నడవడం నేర్చారట. అదీ నిటారుగా! ఆ తర్వాతే పూర్తిస్థాయిలో నేలపైకి దిగారని వాదిస్తోంది! తెలివితేటల్లోనూ ఇతరత్రా కూడా జంతుజాలమంతటిలో మనిషికి అత్యంత సమీప జీవి అయిన చింపాంజీలపై 15 నెలల పాటు లోతుగా పలు కోణాల్లో పరిశోధనలు చేసి మరీ ఈ మేరకు తేల్చామంటోంది!! ఏం చేశారు? తూర్పు ఆఫ్రికాలో టాంజానియాలోని ఇసా లోయలో కొద్దిపాటి చెట్లు, కాస్తంత దట్టమైన అడవి, విస్తారమైన మైదాన ప్రాంతం మధ్య జీవిస్తున్న 13 అడవి చింపాంజీలను పరిశోధనకు ఎన్నుకున్నారు. మన పూర్వీకులు నడిచేందుకు దారి తీసిందని భావిస్తున్న చెట్ల లేమి, అపారమైన బయలు ప్రదేశం కారణంగా అవి కూడా అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తాయేమో గమనించడం అధ్యయనం ఉద్దేశం. ‘‘ఇందుకోసం చింపాంజీల ప్రవర్తనను అతి దగ్గరగా పరీక్షించి ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చాం. వాటి తాలూకు ఏకంగా 13 వేల రకాలుగా హావభావాలను లోతుగా గమనించాం’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్ట ర్ అలెక్స్ పీల్ వివరించారు. కానీ అవి అచ్చం అ త్యంత దట్టమైన అడవుల్లోని చింపాంజీల మాదిరిగానే అత్యధిక సమయం తమకందుబాటులో ఉన్న కొద్దిపాటి చెట్లపైనే గడుపుతూ వచ్చాయి నడిచే ప్రయత్నమే చేయలేదని చెప్పుకొచ్చారు. ‘‘కనుక దాదాపు 50 లక్షల ఏళ్ల క్రితం అటవీ సంపద తరిగిపోయి మైదాన ప్రాంతం ఎక్కువైన క్రమంలోనే ఆదిమ మానవుడు చెట్ల నుంచి నేలపైకి దిగి నిటారు నడక నేర్చాడన్న భావన తప్పు. దాన్నతను కచ్చితంగా చెట్లపైనే నేర్చుంటాడు. తర్వాత కూడా ఆహార వృక్షాల అన్వేషణలో చాలాకాలం పాటు చెట్లపై నిటారుగానే నడిచుండాలి. ఆ రకంగా మానవ వికాసానికి చెట్లే ఊతమిచ్చాయని భావించవచ్చు’’ అని ఆయన వివరించారు. ఈ అధ్యయనం జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో పబ్లిషైంది. కొసమెరుపు ఇంతా చేస్తే, తోకలేని కోతుల (ఏప్)న్నింట్లోనూ మన పూర్వీకులు మాత్రమే రెండు కాళ్ల నడకను ఎలా, ఎందుకు నేర్చారన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీయేనని అధ్యయనకర్తలు అంగీకరించారు! విస్తారమైన మైదాన ప్రాంతం అందుబాటులో ఉన్నా చింపాంజీలు చెట్లపైనే ఎందుకు అత్యధిక సమయం గడిపిందీ తేలితే బహుశా ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏమైనా క్లూ దొరకవచ్చంటున్నారు. అందుకే తమ తర్వాతి అధ్యయనం దీని మీదేనని ప్రకటించారు!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ల్యాబ్‌లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
సిడ్నీ: మానవ మేథోశక్తిని ప్రయోగశాలలో పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు ఆ క్రతువులో స్వల్ప విజయం సాధించారు. 1970ల నాటి టెన్నిస్ క్రీడను తలపించే పోంగ్ కంప్యూటర్ వీడియోగేమ్‌ను ప్రయోగశాలలో అభివృద్ధిచేసిన మెదడు కణాలు అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొత్త తరం బయోలాజికల్ కంప్యూటర్ చిప్స్ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని కార్టికల్ ల్యాబ్స్ అంకురసంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోని న్యూరో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎదగని ఎలుక నుంచి మొత్తంగా దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్‌లో పెంచుతోంది. డిష్‌బ్రెయిన్‌గా పిలుచుకునే ఈ మెదడు కణాల సముదాయం ఎలక్ట్రోడ్ వరసలపై ఉంచినపుడు పోంగ్ వీడియోగేమ్‌కు తగ్గట్లు స్పందించిందని పరిశోధనలో భాగస్వామి అయిన డాక్టర్ బ్రెడ్ కగాన్ చెప్పారు. ఈ తరహా ప్రయోగం కృత్రిమ జీవమేథో ప్రయోగాల్లో మొదటిది కావడం గమనార్హం. మూర్ఛ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యలను మరింతగా అర్ధంచేసుకునేందుకు, భవిష్యత్‌లో కృత్రిమంగా ప్రయోగశాలలోనే జీవమేథ రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. తదుపరి పరీక్షలో తాము మత్తునిచ్చే ఇథనాల్‌ను వాడి కణాల పనితీరు.. మద్యం తాగిన మనిషి ‘పనితీరు’లా ఉందో లేదో సరిచూస్తామన్నారు. ఈ పరిశోధన వివరాలు న్యూరాన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం
న్యూయార్క్: పురావస్తు శాస్త్రవేత్తలు జార్జియాలో 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతాన్ని కనుగొన్నారు. టిబిలిసికి నైరుతి దిశలో సుమారు 100 కి.మీ దూరంలో ఒరోజ్‌మని గ్రామం వద్ద జరుపుతున్న తవ్వకాల్లో బయటపడింది. ఈ దంతాన్ని ఒక విద్యార్థి గుర్తించాడు. ఒరోజ్‌మని గ్రామం దమనిసికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో 1.8 మిలియన్ ఏళ్ల క్రితం మానవ పుర్రెలను 1990ల చివరిలోనూ, 2000ల ప్రారంభంలో కనుగ్నొన్నారు. ఈ సందర్భంగా జార్జియన్ నేషనల్ మ్యూజియంలోని పురావస్తు శాస్త్రవేత్త జార్జి కోపలియాని మాట్లాడుతూ....ఆ విద్యార్థి తవ్వకాలు జరపడానికి మ్యూజియం నుంచి వచ్చిన బృందానికి నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. ఆ సమయంలోనే పురాతన దంతాన్ని కనుగ్నొట్లు పేర్కొన్నారు. తాము ఈ దంతం విషయమై పాలియోంటాలజిస్ట్ని సంప్రదించామని, అతను కూడా దీన్ని 'హోమిన్ టూత్గా' నిర్ధారించాడని చెప్పారు. 2019 నుంచి తమ బృందం మళ్లీ ఒరోజ్‌మని వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించిదని జార్జికోపలియాన్ చెప్పారు. కానీ కోవిడ్-19 కారణంగా ఆ తవ్వకాలు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. తమ బృందం గతేడాది నుంచి ఈ తవ్వకాలు తిరిగి ప్రారంభించినట్లు తెలిపింది. అప్పటి నుంచి తమ బృందం చరిత్ర పూర్వంకు ముందు రాతి పనిముట్లు, అంతరించిపోయిన జాతుల అవశేషాలను కనుగొందని వెల్లడించారు. అంతేకాదు ఈ దంతం ఆధారంగా ఈ ప్రాంతంలో సంచరించే హోమినిన్ల జనాభా గురించి అధ్యయనం చేయగలగడమే కాకుండా తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని అన్నారు. (చదవండి: వింత ఘటన ఆకాశంలో కనువిందు చేస్తున్న క్వీన్ ఆకృతి) -
ప్రపంచ అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’
చండీగఢ్: ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని బలోపేతం చేసేలా చండీగఢ్ వాసులు ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో బాగంగా అతి పెద్ద జాతీయ జెండాలా మానవహారంగా నిలబడి రికార్డు సృష్టించారు. ఈ మేరకు చండీగఢ్ విశ్వవిద్యాలయంలోని సుమారు 16 ఎకరాల క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మందికి పైగా మానవహారంగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్ఐడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి మీనాకాశీ లేఖి, చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధు, విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు హజరయ్యేరు. దాదాపు 5 వేల మందికి పైగా అతిపెద్ద మానవహారంలా ఏర్పడి జాతీయ జెండాను రెపరెపలాడించి సరికొత్త రికార్డును సృష్టించారు. ‘హర్ ఘర్ తిరంగ’ అనేది జాతీయ జెండాతో ఉన్న సంబంధాన్ని అధికారికంగా లేదా సంస్థాగతంగా ఉంచడం కంటే వ్యక్తిగతంగా దేశభక్తిని పెంపొందించేలా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం. భారతదేశ ప్రజలు, మన దేశ సంస్కృతి, సమర యోధులు సాధించిన విజయాలు వాటి వెనుక దాగి ఉన్న అద్భుతమైన చరిత్రను స్మరించుకుంటూ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రోత్సహించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా వీక్షించండి. #WATCH | Guinness World Record for the largest human image of a waving national flag achieved by Chandigarh University and NID Foundation at Chandigarh today. Union Minister Meenakashi Lekhi was also present here on the occasion. pic.twitter.com/6jRgnsi5um — ANI (@ANI) August 13, 2022 (చదవండి: -
క్రయోనిక్స్: మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందా?
Cryonics Part 8: అమెరికాలోని బేస్ బాల్ క్రీడాకారుడు టెడ్ విలియమ్స్ 2002లో చనిపోయాడు. అతడు తన తల, శరీరాన్ని వేర్వేరుగా ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ లో నిల్వ చేసుకున్నాడు. తిరిగి అతని శరీరానికి జీవం పోయగల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినపుడు వైద్యులు విలియమ్స్ తలను శరీరానికి అతికించి బ్రతికించగలరని నమ్మకంతో ఇలా చేశారు. నిప్పును చూసి భయపడే ఆదిమ కాలం నుంచి క్షణంలో ఆకాశానికి ఎగిరిపోయే అత్యంత ఉన్నత స్థాయి టెక్నాలజీ రూపొందించే స్థాయికి మనిషి అభివృద్ధి చెందాడు. అవసరాల్లో నుంచి అనేక అన్వేషణలు పుట్టుకువచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నాడు. మనిషి తన ఉనికికి కారణమైన భూమిని, ప్రకృతినే ధ్వంసం చేసుకుంటున్నాడు. అదే సమయంలో వాటిని కాపాడుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన డైనోసార్లకు ప్రాణం వస్తుందా అని వాటి శిలాజ అండాలను పరిశోధిస్తున్నాడు. అంతరించిపోతున్న జీవ జాతుల్ని పరిరక్షించడానికి క్రయోనిక్స్ విధానం ఉపయోగపడుతుందా అని కూడా ఆలోచిస్తున్నాడు. అలాగే చనిపోయిన వారిని బ్రతికించడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మనిషి ఆశకు అంతం లేదు. నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందో రాదో లేదో కాలమే చెబుతుంది. చదవండి: Cryonics Part7: మృత శరీరాన్ని నిల్వ చేసేందుకు కోటిన్నర ఖర్చు -
క్రయోనిక్స్: మృత శరీరాన్ని నిల్వ చేసేందుకు కోటిన్నర ఖర్చు
Cryonics Part 7: సృష్టిలో కొన్ని జీవులు అతి శీతల వాతావరణంలో జీవించడానికి వీలుగా.. సహజంగానే తమ శరీరంలో రసాయన మార్పులు జరగకుండా స్తంభింపచేసి.. కొన్ని నెలలు లేదా సంవత్సరాలు జీవిస్తున్నాయి. తర్వాత జీవించడానికి అనువైన పరిస్థితులు వచ్చినపుడు వాటి శరీరంలో తిరిగి రసాయన మార్పులు మొదలవుతాయి. కొన్ని రకాల కప్పలు, మొసళ్ళు, తొండలు వంటివి ధృవ ప్రాంతాల్లో ఇలాగే జీవిస్తాయి. వీటన్నిటినీ శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఆ జీవుల్లో స్వతహాగా సాధ్యం అవుతున్న జీవ స్తంభన ప్రక్రియలు, తిరిగి కొనసాగే విధానాలను మనిషిలో ఎందుకు తీసుకురాలేమనే కోణం నుంచే క్రయోనిక్స్ పద్ధతి ఊపిరి పోసుకుంది. ఆల్కర్ సంస్థలో 2009 నుంచి జంతువుల మృత శరీరాలను కూడా నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 33 జంతువుల శరీరాలను విట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా కంటెయినర్లలో నిల్వ చేశారు. అమెరికా, రష్యా వంటి అగ్ర దేశాల్లో మాత్రమే 50 ఏళ్లనుంచి క్రయోనిక్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఒక్క ఆల్కర్ సంస్థలోనే 1353 మృత శరీరాల్ని భద్రపరిచారు. రెండు అగ్రదేశాల్లో మొత్తం రెండు వేలకు పైగానే చనిపోయినవారి శరీరాలు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక వేల మంది తమ శరీరాలను భవిష్యత్ లో తిరిగి జీవించే ఆశతో నిల్వ చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నారు. చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా! దానికి అవసరమైన ఫీజును రెడీ చేసుకున్నారు. అయితే క్రయోనిక్స్ విధానాన్ని సమర్థించేవారిలో చాలా మంది...మరణాన్ని జయించే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటున్నారు. అసలు సాధ్యం అవుతుందో లేదో కూడా తెలీదంటున్నారు. విట్రిఫికేషన్ విధానంలో కంటెయినర్లలో భద్రపరిచిన శరీరాలు నిజంగా పాడవకుండా ఉన్నాయో లేదో కూడా తెలీదంటున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజిలో న్యూరోసైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్న క్లైవ్ కోయెన్ ఇలా మెదడును లేదా శరీరాన్ని భద్రపరిచే క్రయోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం విఫలమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ క్రయోనిక్స్ విధానం ద్వారా చనిపోయిన మనిషికి చికిత్స చేసి జీవం పోసినా..కచ్చితంగా అనేక రుగ్మతలు వెంటాడుతాయని, మెదడు దెబ్బతింటుందని, ఆ వ్యక్తి స్పృహలోకి రాకపోవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భరించలేని నొప్పి, బాధలు అనుభవించాల్సి వస్తుందని కూడా అంటున్నారు. అసలు మృత శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీని ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు చేయలేదు. కేవలం ఊహాజనితంగానే ఆ విధానం ఉంది. వందేళ్ళ నాడు లేని టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినపుడు.. ఆనాడు లేని చికిత్సలు, ప్రాణాంతక రోగాలకు మందులు, చికిత్సలు కనిపెట్టినపుడు.. చావును ఎందుకు జయించలేమనే ఒకే ఒక ప్రశ్న నుంచి వ్యాపార అవకాశాలు పుట్టుకువచ్చాయి. ఎప్పటికీ జీవించి ఉండాలనే ఆశగల ధనికులు ఈ క్రయోనిక్స్ వ్యాపారానికి ఊపిరి పోస్తున్నారు. ఒక మృత శరీరాన్ని నిల్వ చేయడానికి ప్రస్తుత మనదేశ కరెన్సీలో కోటిన్నర ఖర్చవుతుంది. చదవండి: Cryonics 6: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది.. -
క్రయోనిక్స్: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది.. ఆపై..
Cryonics Part 6: బ్రతికున్న మనిషి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే అతి శీతలీకరణ వాతావరణంలో మానవ అండాల్ని ఏళ్ళతరబడి నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అండంలో ఎలాంటి రసాయన మార్పులు చోటు చేసుకోకపోవడం వల్ల జీవితం స్తంభించిపోతుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అండం జీవితం మళ్ళీ మొదలవుతుంది. ఇటువంటి శీతలీకరణ వాతావరణంలో పెద్దవారి గుండె, మెదడు, ఇతర అవయవాలను నిల్వ ఉంచితే అవి స్తంభించిపోతాయి. అలా గంట సేపటి వరకు వాటిలో ఎటువంటి రసాయన మార్పులు జరగకుండా నిరోధించి తర్వాత యధాస్థితికి తీసుకురావచ్చు. అవయవాల మార్పిడి కోసం వీటిని ఒక చోటు నుంచి మరో చోటుకు ఇటువంటి పరిస్థితుల్లో నిల్వ చేసే తీసుకువస్తారు. ప్రస్తుత కాలంలో అండంతో సహా అవయవాల్లో జీవాన్ని స్తంభింపచేసి, తిరిగి యధాస్తితికి తీసుకురావడంలో సక్సెస్ అయిన సైంటిస్టులు భవిష్యత్ లో మనిషి ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శరీరాలను ఫ్రీజ్ చేయకుండా విట్రిఫికేషన్ చేయడం ద్వారా మానవ శరీర కణజాలం శిధిలం కాకుండా కాపాడుతారు. ఫ్రీజర్ లో ఐస్ ఏర్పడుతుంది. కాని మైనస్ 120 సెంటిగ్రేడ్ కంటే తక్కువలో కూడా ఐస్ ఏర్పడకుండా కేవలం శీతలీకరించడాన్నే విట్రిఫికేషన్ గా పిలుస్తారు. ఇందులో క్రయో ప్రొటెక్టెంట్స్ గా పిలిచే అత్యంత గాఢమైన రసాయనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల మృత శరీరం వందేళ్లయినా ఎలా ఉంచింది అలాగే ఉంటుంది. పంచభూతాలతో నిర్మితమైన మృత శరీరాన్ని వందేళ్ళయినా శిధిలం కాకుండా నిల్వ చేయగలిగే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినపుడు.. ఆ శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీ కూడా కచ్ఛితంగా రూపొందుతుందని ఆశిస్తున్నారు. ఒక జీవిలో సాధారణంగా జరిగే రసాయనమార్పులు క్రమం తప్పితే, ఒక పద్ధతి లేకుండా సాగితే మరణం సంభవిస్తుంది. అటువంటపుడు రసాయన మార్పులను యధాస్థితికి తీసుకురావడం సాధ్యం కాదు. అయితే క్రయోనిక్స్ విధానంలో చనిపోయిన మనిషి శరీరంలో కణజాలం ధ్వంసం కాకుండా రసాయనమార్పులను స్తంభింపచేయడం ద్వారా నిల్వ చేసి భవిష్యత్ లో తిరిగి వారికి జీవం రప్పించడమే క్రయోనిక్స్ లక్ష్యమంటున్నారు. చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా! -
సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా!
Cryonics Part 5: జీవిత కాలంలో సర్వ సుఖాలు అనుభవిస్తున్నా మనిషి ఆశకు అంతులేకుండా పోయింది. అందుకే ఎప్పటికైనా మరణాన్ని జయించాలనుకుంటున్నాడు. వందేళ్ళకైనా సాధ్యమవుతుందని ఆశిస్తున్నాడు. దాని కోసం 50 ఏళ్ళ క్రితమే ఏర్పాట్లు ప్రారంభించాడు. ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేసుకుంటున్నాం. చావును జయించలేమా అని తనకు తాను ప్రశ్నించుకుంటున్నాడు. దీనిపై సైంటిస్టులంతా ఏకాభ్రిపాయంతో ఉన్నారా? మనిషి ఆశాజీవి. సైంటిస్టులు కూడా అంతే. ఈ రోజు సాధ్యం కానిది మరో రోజు సాధ్యమవుతుందని విశ్వసిస్తారు. అంతేగాని సాధ్యం కాదని చెప్పరు. క్రయోనిక్స్ టెక్నాలజీని సమర్థించే శాస్త్రవేత్తలు కూడా ఆశావాదులు. మృత శరీరాన్ని పాడు కానీయకుండా, శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా నిర్ధిష్టమైన టెంపరేచర్ లో ఎంతకాలమైనా నిల్వ చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 50 సంవత్సరాలుగా క్రయోనిక్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు. ఆల్కర్ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలైంది. అప్పటికి ఇప్పటికీ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి అయింది కదా అని సంస్థలోని సైంటిస్టులు అంటున్నారు. వందేళ్ళ క్రితం గుండె ఆగితే మరణించినట్లే..కాని ఇప్పుడు నూతన ఆవిష్కరణల ద్వారా పది నిమిషాల పాటు ఆగిన గుండెను కూడా కొట్టుకునేలా చేయగలుగుతున్నారు. అంతర్గత అవయవాలను విజయవంతంగా ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరానికి మార్చుతున్నారు. అదేవిధంగా భవిష్యత్ లో చనిపోయినవారి శరీరాలకు అవసరమైన చికిత్స చేసి వారికి తిరిగి ప్రాణం పోయగలమని నమ్ముతున్నట్లు చెబుతున్నారు. చదవండి: Cryonics 3: గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా! గుండె లేదా బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. సర్జరీ పూర్తయ్యాక తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువస్తారు. శరీరాన్ని మొత్తంగా భద్రపరచడం కూడా ఇలాంటిదే అని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ రెండూ ఒకే విధంగా కనిపించినా, శాస్త్ర పరిభాషలో ఈ రెండూ వేర్వేరు పద్ధతులు. క్రయానిక్స్ విధానం మరణాంతరం శరీరాన్ని భద్రపరచడానికి సంబంధించిన అంశం. క్రయోనిక్స్ టెక్నాలజీని ఇప్పటికే వైద్యానికి సంబంధించి అనేక చోట్ల ఉపయోగిస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం వీర్యం, అండాలు, చర్మం మొదలైన వాటిని మైనస్ 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. క్లోనింగ్ ద్వారా పునరుత్పత్తి చేయడం, సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం కూడా మానవ మేధాశక్తికి గొప్ప ఉదాహరణలుగా సైంటిస్టులు చెబుతున్నారు. ........................ఐదో భాగంలో చదవండి.. చదవండి: Cryonics 4: చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమా? -
రక్త ఆభరణాలు! ఔను! మానవుని రక్తంతో చేసినవి...
బంగారం, వెండీ, ప్లాటినం వంటి వాటిని కాలదన్నే విచిత్ర ఆభరణాలు రాబోతున్నాయి. మనం ఇంతవరకు తల్లిపాలతో చేసిన ఆభరణాలు గురించి విన్నాం. తల్లిపాలతో ఆభరణాలేంటి అనికొందరూ విమర్మించిన ఇందులో ఎలాంటి తప్పులేదని తయారుచేసి చూపించింది లండన్‌కి చెందిన జంట. ఐతే ఇప్పుడూ ఒక అడుగు ముందుకేసి మానవుని రక్తంతో తయారు చేసే ఆభరణాలు రూపొందిస్తున్నారు ప్రీతీ మాగో అనే మహిళ. పైగా ఇది మన ప్రియమైన వారి జ్ఞాపకంగా మన వద్ద ఉంటుందంటున్నారు. ప్రీతీ మాగో కంటి ఆస్ప్రతిలో ఆప్టోమెట్రిస్ట్‌గా పనిచేసేవారు. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఉద్యోగాన్ని వదిలేయవలసి వచ్చింది. అదీగాక బిడ్డ సంరక్షణ నిమిత్తం ఆమె ఉద్యోగానికే వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఆర్థిక స్వాతంత్య్రం కూడా కోల్పోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న ఆమెకు తల్లిపాలతో జ్యూవెలరీ తయారు చేయడం గురించి సోషల్ మాధ్యమాల ద్వారా తెలుసుకుంది. దీంతో ఆమె ఆ దిశగా తన గమ్యాన్ని మార్చుకుంది. తన భర్త సాయంతో యూఎస్‌లో వివిధ జ్యూవెలరీ కోర్సులను నేర్చకుంది. తల్లిపాలతో చేసే ఆభరణాల దగ్గర నుంచి బొడ్డుతాడు, వెంట్రుకలు, దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు ఆమె. ఇంతవరకు చాలామంది పలు రకాలైన ఆభరణాలను తయారు చేశారు గానీ రక్తంతో తయారు చేసే ఆభరణాలనేది అనేది అరుదైన కాన్సెప్ట్ అని, ఇంతవరుకు ఎవరూ ఇలాంటి ఆభరణాలు తయారు చేయలేదని చెబుతున్నారు ప్రీతీ. ఆమె మొదట్లో ఎన్నో వైఫల్యాలు చవిచూసిన అనంతరం 2019లో తన వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రీతీ తెలిపారు. మనకు ఇష్టమైన వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోయినప్పుడూ... వారి గుర్తుగా వారి శరీరం నుంచి సేకరించిన రక్తంతో అందమైన లాకెట్లుగా రూపొందిస్తారు. స్వర్గంలో ఉన్న మన ప్రియమైన ఆప్తులు గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు. తాను డీఎన్ఏ కలిగిన మెటీరియల్‌ని ఉపయోగించి ఈ ఆభరణాలను రూపొందించనట్లు ప్రీతీ పేర్కొంది. (చదవండి: నడి రోడ్డు పై ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్) -
పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్
టోక్యో: పేరులో ఏముంది లెమ్మని అనుకోలేం. ఎందుకంటే పిల్లులు కూడా పేర్లను బాగా గుర్తు పడతాయని తాజా అధ్యయనంలో తేలింది. తమతో కలిసిమెలిసి ఉండే ఇతర పిల్లులు, యజమానుల పేర్లను పిల్లులు పసిగట్టేస్తాయని జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. పిల్లుల జ్ఞాపకశక్తిపై వారు రెండు వేర్వేరు అధ్యయనాలు చేశారు. ఒకదాంట్లో వాటితో కలిసిమెలిసి తిరిగే ఇతర పిల్లి ఫోటోను వాటి దగ్గరుంచారు. కొన్నిసార్లు ఫోటోలోని పిల్లి పేరును, మరికొన్ని సార్లు వేరే పేరును పిలిచారు. ఫోటోలోని పిల్లి పేరు పిలవగానే అవి ఫొటోవైపే కన్నారప్పకుండా చూశాయి. వేరే పేరుతో పిలిస్తే పట్టించుకోలేదు. అలాగే యజమానుల ఫోటోలను వాటి దగ్గరుంచి పేరు పెట్టి పిలిచినా గుర్తించగలిగాయని శాస్త్రవేత్తలు వివరించారు. 40 పిల్లులపై ఈ అధ్యయనం చేసినట్టు వాళ్లు చెప్పారు. -
అంతా బానే ఉంది!
చింతనాపరుడైన ఒక బాటసారి ఏవో యాత్రలు చేస్తూ మార్గమధ్యంలో అలసి కాసేపు విశ్రమిద్దా మనుకున్నాడు. అడవిలోని పిల్ల బాట అది. దగ్గరలోనే పుచ్చకాయల తీగ ఒకటి కనబడి, ఆకలి కూడా పుట్టించింది. మోయలేనంత పెద్ద కాయను ఒకదాన్ని తెంపుకుని, అక్కడే ఉన్న మర్రిచెట్టు నీడన కూర్చున్నాడు. ఏ పిట్టలు కొరికి వదిలేసినవో అంతటా మర్రిపండ్లు పడివున్నాయి. ‘‘ఈ తమాషా చూడు! అంత సన్నటి తీగకేమో ఇంత బరువైన కాయా? ఇంత మహావృక్షానికేమో ఇంతింత చిన్న పండ్లా? ఈ సృష్టి లోపాలకు అంతం లేదు కదా! పరిమాణం రీత్యా ఆ తీగకు మర్రి పండ్లు, ఈ చెట్టుకు పుచ్చకాయలు ఉండటం సబబు’’ అనుకున్నాడు. ఆలోచిస్తూనే ఆ కాయను కడుపునిండా తిన్నాడేమో, ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండ తన మీద పడకుండా చెట్టు కాపు కాస్తున్న దేమో, అటే నిద్ర ముంచుకొచ్చింది. మర్రిపండు ఒకటి ముఖం మీద టప్పున రాలినప్పుడు గానీ మెలకువ రాలేదు. ‘‘ఆ, నేను తలపోసినట్టుగానే ఆ కాయ దీనికి కాసి ముఖం మీద పడివుంటే ఏమయ్యేది నా పరిస్థితి? ఔరా, ఈ సృష్టి విలాసం!’’ అనుకుని చక్కా పోయాడు బాటసారి. ఏ దేశపు జానపద గాథో! ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉందని సృష్టి క్రమాన్ని అభినందిస్తుంది. పాలగుమ్మి పద్మరాజు రాసిన ఓ కథలో కూడా ఇంకా సున్నితం కోల్పోని కాంట్రాక్టర్ అయిన కథా నాయకుడికి ఇలాంటి సందేహమే వస్తుంది. ఆ కూలీలు ఎర్రటి ఎండలో ఆ ఇంటి నిర్మాణం కోసం చెమటలు కక్కడమూ, వారి తిండీ, వారి బక్కటి శరీరాలూ, వారి మోటు సరసాలూ, అరుపులూ, ఇవన్నీ చూశాక అతడికి ఊపిరాడదు. సాయంత్రం పని ముగించి, తిండ్లు తినేసి, ఎక్కడివాళ్లక్కడ ఆదమరిచి నిద్రలోకి జారుకుంటారు. కలత నిద్రలో ఉన్నాడేమో, ఆ రాత్రి వీస్తున్న చల్లటి గాలి ఎందుకో అతడిని ఉన్నట్టుండి నిద్రలేపుతుంది. దూరంగా ఆ వెన్నెల కింద తమదైన ఏకాంతాన్ని సృష్టించుకుని ఆనంద పరవశపు సాన్నిహిత్యంలో ఉన్న ఒక కూలీల జంటను చూడగానే అతడిలోని ఏవో ప్రశ్నలకు జవాబు దొరికినట్టు అవుతుంది. ప్రపంచం మనం అనుకున్నంత దుర్మార్గంగా ఏమీ లేదు అనుకుంటాడు. అసలైనదీ, దక్కాల్సినదీ ఈ భూమ్మీద అందరికీ దక్కితీరుతుందన్న భావన లోనేమో అతడు తిరిగి హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. ఈ భూమండలం నిత్య కల్లోలం. మూలమూలనా ఏదో అలజడి, ఏదో ఘర్షణ, ఏదో సమస్య, ఏదో దారుణం. శ్రీలంకలో బాలేదు, పాకిస్తాన్లో బాలేదు, ఉక్రెయిన్‌లో అంతకంటే బాలేదు. రష్యాలో మాత్రం బాగుందని చెప్పలేం. ఇక్కడ మనదేశంలో మాత్రం? ఇన్ని యుద్ధాలు, ఇన్ని సంక్షో భాలు చుట్టూ చూస్తూ కూడా ఈ లోకం బానేవుంది అని ఎవరూ అనే సాహసం చేయరు. కానీ ఎప్పుడు ఈ ప్రపంచం బాగుందని! కనీసం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉందని! ప్రపంచం దాకా ఎందుకు? వ్యక్తిగత జీవితంలో మాత్రం నేను బాగున్నానని గట్టిగా చెప్పగలిగేవాళ్లు ఎందరు? ‘నా ప్రపంచంలో అంతా బాగానే ఉంది’ అని అనుకోగలిగే వాళ్లెవరు? దీనివల్లే అసంతృప్తులు, కొట్లాటలు, చీకాకులు, ఇంకా చెప్పాలంటే అనారోగ్యాలు. అవును, అనారోగ్యం! ఇదొక్కటే ప్రపంచంలో అసలైన సమస్య. దీని ప్రతిఫలనాలే మిగిలినవన్నీ! మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ ప్రతికూలతకూ కారణం కాలేడు– అది ప్రపంచంలోనైనా, ఇంట్లోనైనా. అందుకే మనిషికి సర్వతో ముఖ ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యంతో సంతోషం కలుగుతుంది, ఆ సంతోషంతో ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే మనంబాగుంటాం. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ‘‘అనారోగ్యంగా పిలవబడే ప్రతిదాన్నీ మన శరీరంలో మనమే సృష్టించుకుంటాం,’’ అంటారు తొలితరం కౌన్సిలర్ లూయిస్ హే. బలమైన సంకల్పం, సానుకూల ఆలోచనలు తేగలిగే అనూహ్య మార్పులను గురించి ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు. మన సమస్యలన్నీ మన అంతర్గత ఆలోచన విధానాల వల్ల కలిగే బాహ్య ప్రభావాలు మాత్రమేనని చెబుతారామె. నెగెటివ్ థింకింగ్ వల్ల బ్రెయిన్లో ఆటంకాలు ఏర్పడుతాయి; అక్కడ ఫ్రీగా, ఓపెన్‌గా సంతోష ప్రవాహం ముందుకు సాగ డానికి అవకాశం ఉండదంటారు. ఏ రకమైన ఆలోచనా విధానం ఏయే రకమైన జబ్బులకు కారణ మవుతుందో... దురద, చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, సైనస్, మలబద్ధకం, చిగుళ్ళ సమస్యలు, మైగ్రేన్... ఇలా పెద్ద జాబితా ఇస్తారు. అయితే ఏ రకమైన వ్యాధికైనా భయం, కోపం– ఈ రెండు మెంటల్ పాటరన్స్ మాత్రమే మూలకారకాలుగా ఉంటాయంటారు. మనల్ని మనం నిజంగా ప్రేమించుకోవడం, ఎదుటివాళ్లను నిందించి మన శక్తిని అంతా వదిలేసుకునే బదులు ఇవ్వాల్సిన ‘క్షమాపణ’ ఇచ్చేయడం, ఆమె సూచించే మార్గాలు. ఈ ప్రేమకు సమస్త భూగోళాన్నీ హీల్ చేయగల శక్తి ఉందని ఆమె స్థిర విశ్వాసం. ‘‘మనం ఏది ఆలోచించాలనుకుంటామో, ఏది నమ్మాలనుకుం టామో, ఆ ప్రతి ఆలోచననీ, నమ్మకాన్నీ విశ్వం పూర్తిగా సమర్థిస్తుంది, అవి జరగడానికి సహకరి స్తుంది’’ అంటారు. ఈ సృష్టి మనకోసం మన జీవితాన్ని దాని సర్వశక్తితో డిజైన్ చేసేవుంటుంది. మనం సమస్యలు అనుకునేవి సృష్టి విన్యాసంలో అసలు సమస్యలే కాకపోవచ్చు. కానీ మన ప్రాణాలకు అవన్నీ నిజమే. ‘గజం మిథ్య, ఫలాయనం మిథ్య’ అని మన సాధారణ చూపుతో అనుకోలేక పోవచ్చు. కానీ ఈ సృష్టి అశాశ్వతత్వంపై ఒక ఎరుక ఉంటే, జీవితాన్ని చూసే తీరు మారిపోవచ్చు. జీవితంతో కొనసాగిస్తున్న ఒక ఘర్షణ ఏదో తొలగిపోవచ్చు. ఎక్కడో ఒకరు మరణిస్తున్నప్పుడు కూడా ఇంకెక్కడో ఎవరో పుడుతూనే ఉన్నారు! -
రక్తంలో తిష్ట వేసిన ప్లాస్టిక్ కణాలు..షాక్‌లో శాస్త్రవేత్తలు!
Microplastic in human blood: ప్లాస్టిక్ వాడొద్దు అంటూ ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఎన్నోఏళ్లుగా మొత్తుకుంటున్నారు. కానీ ప్రజలు తమ నిత్య జీవన విధానంలో ఈ ప్లాస్టిక్ వస్తువులకు అలవాటుపడిపోయారు. అంతతేలిగ్గా బయటేపడే అవకాశం తక్కువ. అదీగాక ప్లాస్టిక్ చాలా చౌకగా దొరకడమే కాకుండా సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉంటుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరం అందువల్ల దయచేసి వాడొద్దు అంటూ నినాదాలు చేసి మరీ సహజ పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు కూడా. ప్రజలు ఇటీవలే వాటిని వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గానీ ఆ ప్లాస్టిక్ వల్ల జరగవల్సిన నష్టం ఎప్పడో మనిషికి జరిగిపోయింది అంటున్నారు డచ్ శాస్త్రవేత్తలు. అసలేం జరిగిందంటే...పది మంది వ్యక్తుల రక్త నమూనాల్లో దాదాపు 8 మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించామని డచ్ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనాల్లో వెల్లడించారు. తాము పరిశోధనలు చేసిన సుమారు 77 శాతం మందిలో రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ గాలితో పాటు ఆహారం, పానీయాల ద్వారా కూడా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని వ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్లోని ఎకోటాక్సికాలజీ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ డిక్ వెథాక్ నివేదికలో తెలిపారు. పైగా పాలీప్రొఫైలిన్, పాలీస్టైరిన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలిన్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ) వంటి ఐదు రకాల ప్లాస్టిక్‌ల గురించి పరిశోధనాలు చేయడం మెదలు పెట్టారు. అందులో భాగంగా దాదాపు 22 మంది రక్త నమునాలను సేకరించారు. అయితే ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుమారు 17 మంది రక్తదాతల రక్తంలో ప్లాస్టిక్ రేణువుల ఉన్నాయని తెలిపారు. ఆ పరిశోధనల్లో కొంతమంది రక్తదాతల్లో గృహోపకరణాలకు వినియోగించే ప్లాస్టిక్ ఉందని, మరికొంతమంది రక్తం క్యారియర్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పాలిథిన్‌ని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాదు పరీక్షించిన వారిలో 50 శాతం మంది రక్తంలో పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, 36 శాతం మంది రక్తప్రవాహంలో పాలీస్టైరిన్ కూడా ఉందని వెల్లడించారు. ఏదీఏమైన మానవుని ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలోకి చేరకమునుపే ప్లాస్టిక్‌కి సంబంధించిన వస్తువులను పూర్తిగా బ్యాన్ చేయాల్సిందే. (చదవండి: బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట! -
మానవ మనుగడకి ముప్పుగా కాలుష్యం.. ఏటా 70 లక్షల మరణాలు!
ప్రకృతి ఒడిలో ఎక్కడో కొండకోనల్లో జీవిస్తున్నవారు తప్ప ప్రపంచంలో మిగతా ప్రజలంతా కలుషిత గాలినే పీల్చుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మించి కలుషితమైన గాలినే పీల్చుకుంటోంది ప్రపంచంలోని 99 శాతం జనాభా. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తాజా గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఎక్కువమంది ప్రాణాలను హరిస్తున్న కాలుష్య మహమ్మారి ఇది. ఏటా ఈ కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది బలవుతున్నారు. ఈ కాలుష్యం ఇంటా బయటా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఆరుబయటను పీల్చటం వల్ల ఏటా 42 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. వంటగదుల్లో పొగ కాలుష్యం వల్ల ఏటా 38 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగటం వల్ల వస్తున్న క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్ సహా అనేక దీర్ఘకాలిక రోగాలతో ఏటా మన దేశంలో దాదాపు 13.5 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా 2019లో దాదాపు 17 లక్షల మరణాలు సంభవించాయి. మనదేశంలో నమోదైన మొత్తం మరణాలలో ఇది 18 శాతం. మరణాలు, వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల వల్ల ఏకంగా రూ. 2,60,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. స్థూల జాతీయోత్పత్తి లో ఇది 1.4 శాతం మేరకు ఉంటుందని ఒక నివేదిక చెబుతోంది. కోవిడ్ –19 కారణంగా దాదాపు రెండేళ్లలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 54.4 లక్షలు. అయితే ఏటా వాయు కాలుష్యం 70 లక్షల మందిని బలిగొంటున్నా పాలకులకు అంతగా పట్టట్లేదు. ఇంతకీ వాయు కాలుష్యం అంటే ఏమిటి? భూ ఉపరితల వాతావరణంలో ప్రకృతిసిద్ధమైన గాలి సహజ గుణగణాలను ఇంటా బయటా రసాయనిక, భౌతిక, జీవ సంబంధమైన వాహకం ద్వారా కలుషితం కావటం. ఒక్కమాటలో చెప్పాలంటే అసాధారణమైన రసాయనాలు లేదా ధూళి కణాలు కలిగి ఉన్న గాలే కలుషితమైన గాలి. వాయు కాలుష్య రకాలు.. వంట కలప, మోటారు వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగం, అడవులు తగులబడటం వంటివాటి ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున పంట అవశేషాలను కాల్చడం.. పొగ, పొగమంచు, సూక్ష్మరేణువులతో కూడి వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం, రాడాన్ ప్రధాన కారణాలు. ఇంట్లో వాయు కాలుష్య కారకాలైన అత్యంత ప్రమాదరకమైన మూడు కారకాల్లో రాడాన్ ఒకటి. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రధాన కాలుష్య కారకాలు.. అతిచిన్న ధూళి కణాలు (పిం.ఎం. 2.5, పి.ఎం. 10), కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్తో పాటు సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఉంది. ఇవేకాక గ్యాసోలిన్, బెంజీన్, స్టైరిన్, ఫార్మాల్డిహైడ్ వంటి అస్థిర సేంద్రియ సమ్మేళనాలూ వాయు కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. సహజ వాయు కాలుష్య కారకాలు... అడవులను దహించే కార్చిచ్చు, పుప్పొడి, ధూళి తుపాను, రాడాన్ వాయువు మొదలైనవి. అసహజ కాలుష్య కారకాలు.. మనుషుల పనులు, వాహనాల్లో మండించే ఇంధనం, ఇళ్లు, ఫ్యాక్టరీలలో ఉపయోగించే బొగ్గు, కలప ఇతర ఇంధనాలు వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. హరిత గృహ వాయువులు.. వాతావరణ మార్పు వాతావరణ మార్పులతో వాయు కాలుష్యకారకాలు సంక్లిష్ట సంబంధాన్ని కలిగి ఉంటాయి. పార్టిక్యులేట్ మ్యాటర్ (పి.ఎం.) ధూళి కణాలు వాతావరణాన్ని వేడిక్కిస్తాయి లేదా చల్లబరుస్తాయి. బ్లాక్ కార్బన్, ఓజోన్ వంటి కొన్ని కాలుష్య కారకాలు వాతావరణంలో వేడిని బంధించడం ద్వారా ఉష్ణోగ్రతను పెంచుతాయి. అయితే సల్ఫర్ డయాక్సైడ్ వంటివి కాంతిని పరావర్తనం చెందించే కణాలను ఏర్పర్చి వాతావరణాన్ని చల్లబరుస్తుంటాయి. సూర్యరశ్మిని భూవాతావరణంలో బంధిస్తూ హరిత గృహ వాయువులూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానమైనవి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి (ఇవన్నీ సహజంగా ఏర్పడతాయి)తో పాటు ఫ్లోరినేటెడ్ వాయువులూ (ఇవి సింథటిక్) ఉన్నాయి. వీటిని హరిత గృహ వాయువులని, వీటి ప్రభావాన్ని హరిత గృహ ప్రభావమని అంటున్నాం. మన దేశంలో హరిత గృహ వాయువుల తలసరి ఉద్గారాలు తక్కువ. అయితే మొత్తంగా చూస్తే కాలుష్యకారక దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉంటే మూడో స్థానంలో మన దేశం ఉంది. మనుషుల అవసరాల కోసం బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే భూతాపోన్నతి.. గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. దీన్ని పారిశ్రామిక పూర్వకాలం (క్రీ.శ. 1850– 1900 మధ్య) నుంచే గమనిస్తున్నాం. ఇప్పుడు వాతావరణం వేగంగా మారుతోంది. 2100 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 5.4 డిగ్రీల సెల్సియస్ దాకా పెరగవచ్చు. ఈ మార్పు వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. ప్రజారోగ్యానికీ హాని కలుగుతోంది. జాతుల మనుగడకూ ముప్పే. దీన్ని తట్టుకొని నిలబడడం ప్రపంచానికే సవాలుగా మారింది. విధాన నిర్ణేతలు తప్పనిసరిగా మెరుగైన వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో వాయు కాలుష్య నివారణ,నియంత్రణ చట్టం – 1981 వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పొచ్చు. పిల్లలను బడులకు పంపొద్దు పిల్లల ఊపిరితిత్తులు నాజూగ్గా ఉంటాయి. కాబట్టి వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని బడులకు పిల్లలను పంపవద్దు. ఎర్త్ లీడర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కార్యక్రమం కింద వ్యాస రచయిత సారథ్యంలో అహ్మదాబాద్, సూరత్‌లోని కొన్ని పాఠశాలల్లో వాయు కాలుష్యం ఎంత ఉందో చెప్పే కిట్లను పిల్లలతోనే తయారుచేయించి, ఆయా పాఠశాలల్లో అమర్చారు. వాయు కాలుష్యం ఎప్పుడు, ఎంత ఉంటున్నదని తల్లిదండ్రులతో పాటు ఇంకా ఎవరైనా తెలుసుకోవడానికి వీలుగా డేటాను క్లౌడ్‌తో అనుసంధానించారు. వాయు కాలుష్య సమస్యను అర్థం చేసుకోవడానికి, పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతోంది. గాలిలో కాలుష్య కణాలు.. సల్ఫేట్, నైట్రేట్లు, అమ్మోనియా, సోడియం క్లోరైడ్, బ్లాక్ కార్బన్ (డీజిల్ వాహనాల నుంచి విడుదలయ్యే కణాలు బ్లాక్ కార్బన్‌ను కలిగి ఉంటాయి), ఖనిజాల «ధూళి వంటివన్నీ కాలుష్య కణాలే. గాలిలో తేలియాడే ఈ అతిచిన్న కణాలన్నిటినీ మనం పీల్చుకుంటున్నాం. పది మైక్రో మీటర్లు (మీటరులో 10లక్షల వంతు) లేదా అంతకంటే చిన్న కణాలు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లగలవు. అయితే వీటికన్నా ఇంకా చిన్న కాలుష్య కాణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. 2.5 మైక్రో మీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం ఉన్న (పి.ఎం. 2.5) కాలుష్య కణాలు ఊపిరితిత్తులను దాటుకొని మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. పి.ఎం. 2.5 కణాలు మన వెంట్రుక వ్యాసంలో ముప్పయ్యవ వంతు సూక్ష్మంగా ఉంటాయి. మనుషులను మరణానికి చేరువ చేస్తున్న అయిదవ అతి ప్రమాద కారకాలివి. 80 శాతం వాయు కాలుష్య మరణాలకు పి.ఎం. 2.5 కాలుష్య కణాలే కారణం. వీటి మూలంగా 2010లో 6, 27,000 మంది మృత్యువాత పడ్డారని, ఆ ఏటి మరణాల్లో ఇవి 6 శాతమని 2012లో జీబీడీ – లాన్సెట్ పేర్కొంది. గాలి నాణ్యతపై నిఘా గాలి నాణ్యత విషయంలో ప్రతి దేశానికి వేరువేరు ప్రమాణాలున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను నిర్దేశించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ సూచీలో కాలుష్య తీవ్రతను తెలియజెప్పే ఆరు విభాగాలున్నాయి. ఎనిమిది కాలుష్య కారకాలను పరిగణనలోకి తీసుకొని నాణ్యత ఏ మేరకు ఉందో నిర్ధారిస్తారు. రెండేళ్లుగా బిఎస్6 ప్రమాణాలు శిలాజ ఇంధనాలు వినియోగించే మోటారు వాహనాలు తదితర యంత్రాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ (బీఎస్ఈఎస్)ను ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, భూతాపోన్నతి శాఖ పరిధిలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్ణీత కాలవ్యవధిలో ఈ గాలి కాలుష్య ప్రమాణాలు అమలవుతున్నాయి. భారత్స్టేజ్ 6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాలకు మాత్రమే దేశవ్యాప్తంగా 2020 నుంచి రిజిస్ట్రేషన్ సాధ్యపడుతోంది. చమురు కంపెనీలు కూడా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా 100 పీపీఎం మేరకు గంధకం కలిగిన పెట్రోలు డీజిల్‌ను సరఫరా చేస్తున్నాయి. తక్కువ కాలుష్య కారకమైన ఇంధనంగా పేరుగాంచిన సిఎన్జీతో సమానమైన సామర్థ్యం బిఎస్6 ప్రమాణాలతో కూడిన డీజిల్, పెట్రోల్‌కు ఉండడం విశేషం. కాటేస్తున్న వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా 2019లో వాయు కాలుష్యం వల్ల 67 లక్షల మంది చనిపోయారు. చైనాలో అత్యధికంగా 18.5 లక్షల మంది, భారత్‌లో 16.7 లక్షల మంది వాయుకాలుష్యానికి బలయ్యారు. మన దేశంలో ప్రతి నలుగురు మృతుల్లో ఒకరు వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీస్తున్న కారణాల్లో రక్తపోటు, పొగాకు, నాసిరకం ఆహారం తర్వాత నాలుగో స్థానం వాయు కాలుష్యానిదే. దీర్ఘకాలం పాటు వాయుకాలుష్యానికి గురైతే అనేక రకాల జబ్బుల పాలు కావడమే కాకుండా మరణాలూ సంభవిస్తున్నాయి. వాయు కాలుష్య మరణాలు ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది తెలంగాణలో35,364 మంది ∙ 2019లో దేశంలో వాయుకాలుష్యంతో చనిపోయిన వారిలో సగం మంది ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌కు చెందిన వారే. తద్వారా జరిగిన ఆర్థిక నష్టం 3,680 కోట్ల డాలర్లు. ఇంకా చెప్పాలంటే మన దేశ స్థూల ఉత్పత్తిలో 1.36 శాతం. ∙2019లో ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది వాయు కాలుష్యం బారిన పడి మృత్యువాత పడ్డారు. ఏపీలో 15.6 శాతం మరణాలకు కారణం వాయుకాలుష్యమే. ఆర్థిక నష్టం 134.95 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 1.09 శాతం. ∙తెలంగాణలో 2019లో వాయు కాలుష్యం కారణంగా 35,364 మంది ప్రాణాలొదిలారు. రాష్ట్రంలో చనిపోతున్న వంద మందిలో 15.5 శాతం మంది వాయు కాలుష్యం వల్లనే చనిపోతున్నారు. ఆర్థిక నష్టం 111.59 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 0.91 శాతం. (సౌజన్యం: స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020) మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాలు ∙వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ∙వాయు కాలుష్యం ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. వృద్ధులు, శిశువులు, గర్భిణీలు, గుండె, శ్వాసకోశానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వంటి హై రిస్క్ గ్రూపులోని వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ∙పిల్లల్లో ఊపిరితిత్తులు ఇంకా ఎదిగే దశలో ఉంటాయి కాబట్టి వాళ్లు వాయు కాలుష్యానికి బహిర్గతమైనప్పుడు అది వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ∙వాయు కాలుష్యం వల్ల కంటి దురదలు, తలనొప్పి, వికారం వంటి చిన్న చిన్న అనారోగ్యాలతోపాటు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. అంతేకాదు దీర్ఘకాలం పాటు విషపూరిత వాయువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి జబ్బులూ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ వాయు కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల దిగువ భాగాలకు చేరి శ్వాసనాళాల వాపు, సంధి వాపు వంటి వ్యాధులకూ కారణమవుతున్నాయి. డాక్టర్ ఎన్. సాయి భాస్కర్ రెడ్డి, జియో సైంటిస్ట్ 92463 52018 -
ఆమెను కిస్ చేసినప్పుడు రోబోలా ఫీల్ అయ్యాను..
బాలీవుడ్ బ్యూటీ కీర్తీ కుల్హారీ, సీనియర్ నటి షెఫాలీ షా కలిసి నటించిన హిందీ వెబ్ సిరీస్ 'హ్యూమన్'. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ఇద్దరు మహిళా వైద్యులు డ్రగ్ ట్రయల్స్, దాని చుట్టూ ఉండే రాజకీయ కోణం, నేరం, చంపేస్తామనే బెదిరింపులను ఎలా ఎదుర్కొన్నారనేదే కథ. ఇందులో కీర్తి కుల్హారీ స్వలింగ సంపర్కురాలైన డాక్టర్ సైరా సబర్వాల్ పాత్రలో నటించింది. అయితే కథలో భాగంగా తన సహనటి షెఫాలీ షాతో కీర్తి ముద్దు సీన్లో నటించాల్సి ఉంది. అప్పుడు వారు ముద్దు పెట్టుకున్న సీన్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది కీర్తి. ఆ కిస్ సీన్‌ను తీసేటప్పుడు డైరెక్టర్ మోజెజ్ సింగ్ చాలా నెర్వస్ అయ్యారని చెప్పుకొచ్చింది. అలాగే ' ఆ సమయంలో నాకు ఒకే ఒక ఆలోచన నా మనసులో మెదిలింది. ఆమెను కిస్ చేస్తే ఏమైనా అనుభూతికి లోనవుతానా ? ఒకేవేళ నాకు మూడొచ్చేస్తే ? మళ్లీ కాస్తా ఆగి వెనక్కి వెళ్లి ఆలోచించాను. ఏంటీ ? నేను మరో స్త్రీని ఇష్టపడుతున్నానా ? ముద్దు సన్నివేశం అయ్యాక హమ్మయ్యా అనిపించింది. షెఫాలీతో నేను రిహార్సల్స్ వంటివి ఏం చేయలేదు. కానీ ముద్దు సన్నివేశాన్ని విభిన్న కోణాల్లో తీసేందుకు 8-10 సార్లు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి రెండు టేక్‌ల తర్వాత మేము మాకు రోబోల్లాగా అనిపించాం. ఎందుకంటే తెరపైన కిస్, శృంగార సన్నివేశాలు వస్తే ప్రజలు అనుభూతి చెందుతారేమో కానీ మాకు మాత్రం చాలా బోరింగ్‌గా ఉంటుంది. మీ చుట్టూ 100 మంది ఉంటారు. ఎలాంటి ప్రైవసీ ఉండదు. కేవలం డైరెక్టర్ చెప్పే యాక్షన్, కట్ వంటి దయాదాక్షిణ్యాల మధ్య ఆ సన్నివేశాల్లో నటించాలి కాబట్టి. అలాంటి సమయంలో మీరు మీరు అస్సలు అనుభూతి చెందలేరు. నన్ను నమ్మండి.' అని కీర్తి చెప్పింది. ఈ సన్నివేశంతో తాను ఆన్‌స్క్రీన్ వర్జినిటీ కోల్పోయానని షెఫాలీ షా పేర్కొంది. ఇంతకుముందు తాను ఇలాంటి సీన్లలో ఎప్పుడూ నటించలేదని స్పష్టం చేసింది. ఈ మెడికల్ థ్రిల్లర్ జనవరి 14 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
చారిత్రక ఘట్టం.. పంది గుండె మనిషికి!
Pig Heart Transplantation To Human: వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికన్ వైద్యులు. తద్వారా అవయవాల కొరత, అవి దొరక్క చనిపోతున్న వేల మందికి ప్రాణదానం చేసే అవకాశం లభించినట్లయ్యింది. శుక్రవారం బాల్టిమోర్ ‘మేరీలాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్‌కు ప్రాణదానం చేసినట్లయ్యింది. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ మార్పిడికి పేషెంట్ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఇందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది. వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్స్ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది అక్టోబర్‌లో న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేయగా.. పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. వేలల్లో మరణాలు అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. ఇక పంది శరీరాకృతి, ఎదుగుదల, పైగా మాంసం తింటారు కాబట్టి ఆధారంగా.. అవయవాలు తీసుకోవడానికి ఉత్తమమైందని అమెరికన్ డాక్టర్లు భావిస్తున్నారు. సంబంధిత వార్త: పేషెంట్‌కు పంది కిడ్నీ అమర్చారు -
మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి!
Suit Made of Men's Mustache: తలపై జుట్టు ఉన్నప్పుడు, చాలా అందంగా కనిపిస్తుంది. అవే వెంట్రుకలు ధరించే దుస్తులపై కనిసిస్తే చాలా ఆసహ్యంగా ఉంటుంది కదూ! కానీ, మొత్తం మీసాల వెంట్రుకలతో తయారైన ఈ సూటు ఎంత అందంగా ఉందో చూడండి! ఫొటోలో ఉన్న ఈ సూట్ పేరు ‘పొలిటిక్స్ మువెంబర్’. నో షేవ్ నవంబర్‌లో భాగంగా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు దానం చేసే వెంట్రుకలను ఉపయోగించి, మెల్బోర్న్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ పమేలా క్లీమన్ పాస్సీ దీనిని రూపొందించారు. నిజానికి ఈ రూపకల్పన వెనుక ఓ కథ ఉంది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించకపోవడమే తన భర్త క్యాన్సర్‌తో మరణించడానికి కారణమైందని పమేలా భావించింది. ఆ అవగాహనా కార్యక్రమమేదో తానే మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అలా 2016 నుంచి వివిధ సెలూన్ల నుంచి మీసాల వెంట్రుకలను పోగు చేయసాగింది. రీసైక్లింగ్ ద్వారా వీటిని శుభ్రం చేసి, కాటన్‌తో కలిపి నేయించి, ఓ ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌ను తయారుచేసింది. ఇందుకు ప్రముఖ సంస్థ ‘పొలిటిక్స్’ సహకారం అందించడంతో అద్భుతమైన ఈ సూటు రూపొందింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన ఎంతోమంది ఆమెకు నేరుగా వెంట్రుకలను పంపిస్తున్నారు. వీటిని ఉపయోగించి మరెన్నో డిజైన్స్‌ను రూపొందించి, మరింత అవగాహన కల్పిస్తానని డిజైనర్ పమేలా క్లీమన్ పాస్సీ చెప్పింది. -
ఉడుతను పొడిచిన కాకులు.. వైద్యం చేయించడంతో అక్కడే మకాం..!
సాక్షి,సూర్యాపేట( నల్గొండ): గంతులు వేస్తూ చెట్లపై తిరగాల్సిన ఓ చిన్ని ఉడుత ఇంట్లో అల్లారుముద్దుగా ఆడుకుంటోంది. ఏకంగా మనుషుల మీదనే కోలాడుతోంది. ఈ దృశ్యాలు చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట మండలం జనగామ క్రాస్‌రోడ్డులో నివాసముంటున్న షేక్ ఖలీం–హలీమా దంపతుల కుమారుడు అస్లం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండునెలల క్రితం అస్లం ఓ రోజు జనగామ క్రాస్ సమీపంలోని పిల్లలమర్రి రోడ్డులో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే క్రమంలో నాలుగైదు కాకులు కలిసి ఓ చిన్న ఉడుత పిల్లను పొడుస్తున్నాయి. రక్తం కారుతున్న ఆ ఉడుతను చూసి చలించిపోయిన అస్లం వెంటనే దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దానికి అయిన గాయానికి ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించి అప్పటినుంచి ఇంట్లోనే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రోజూ ఆ ఉడుతకు పాలు పోస్తూ, ఆహారం పెడుతున్నారు. ఇంకేముంది ఆ ఉడుతకు ఆ ఇంటి వాళ్లంతా తెగ నచ్చేసినట్టున్నారు కాబోలు నిత్యం వాళ్ల మీదనే ఆడుకుంటోంది. చదవండి: ఎవరు ఈమె..నా పియానో వాయిస్తుంది ? -
జీవనయానం వలస ప్రయాణం
చరిత్ర గురించి చాలా నిర్వచనాలే ఉండొచ్చు. స్థూలంగా మానవుల వలస పరిణామాన్ని నమోదు చేసే కథనమే చరిత్ర. వలసలు లేకుండా మానవాళికి మనుగడ లేదు. చరిత్ర అంతా వలసల మయమే! ప్రకృతి సానుకూలత లేని ప్రదేశాలను విడిచిపెట్టి, సురక్షిత ప్రదేశాలకు వలస వచ్చిన మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు నాగరికతలు ఏర్పడ్డాయి. నాగరికతల పరిణామ క్రమంలో స్థిర నివాసాల సంస్కృతి వ్యాప్తిలోకి వచ్చినంత మాత్రాన మనుషుల వలసలు ఆగిపోలేదు. ప్రకృతి బీభత్సాల నుంచి, యుద్ధాల నుంచి, నియంతృత్వ పీడనల నుంచి, కరవు కాటకాల నుంచి వీలైనంత దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవడానికే మనుషులు ప్రయత్నిస్తారు. పుట్టిపెరిగిన చోట చాలీచాలని బతుకులను బలవంతంగా నెట్టుకొచ్చే కంటే, ఎంత దూరమైనా వెళ్లి బతుకులను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మెరుగైన జీవితాల కోసం మనుషులు తాము పుట్టి పెరిగిన ప్రదేశాలను విడిచిపెట్టి, దేశాలను దాటి వలసలు వెళుతూనే ఉన్నారు. వలసలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. భూమ్మీద మనుషులే కాకుండా, జలచర ఖేచరాదులు కూడా సానుకూల పరిసరాలను వెదుక్కుంటూ సుదూర ప్రదేశాలకు వలస వెళతాయి. ఇప్పుడు మన దేశంలో వలసపక్షుల కాలం మొదలైంది. ఖండాంతరాలను దాటి శరదృతువులో ఇక్కడకు చేరుకునే నానాజాతుల పక్షులు వసంత రుతువు వరకు ఉంటాయి. మనుషుల వలసలకు, పక్షుల వలసలకు తేడాలున్నాయి. మనుషులకు తాము పుట్టి పెరిగిన ప్రదేశం కంటే వలస వచ్చిన ప్రదేశమే సురక్షితంగా, తమ అభివృద్ధికి భేషుగ్గా ఉన్నట్లయితే, అక్కడే స్థిరపడిపోయి, తరతరాలుగా పాతుకుపోతారు. పాపం, పక్షులు అలా కాదు. వాటి వలసలన్నీ కేవలం రుతుధర్మాన్ని అనుసరించే సాగుతాయి. వలసల్లో పక్షుల క్రమశిక్షణ తిరుగులేనిది. కచ్చితంగా నిర్ణీత కాలానికి వస్తాయి.æఅంతే కచ్చితంగా నిర్ణీత కాలానికి తమ తమ నెలవులకు తిరిగి వెళ్లిపోతాయి. మనుషుల మాదిరిగా ఆస్తులు కూడబెట్టుకుని, శాశ్వతంగా ఉండిపోవాలనుకోవు. శరదృతువు ఆగమనంతోనే మన దేశంలోని ప్రధానమైన సరస్సుల వద్ద వలసపక్షుల సందడి మొదలవుతుంది. ఒడిశాలోని చిలికా, ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్, కొల్లేరు, గుజరాత్‌లోని నలసరోవర్, కేరళలోని కుమరకోమ్ వంటి సరస్సుల వద్దకు, పశ్చిమబెంగాల్లోని సుందర్బన్, అరుణాచల్‌లోని ఈగల్నెస్ట్ వంటి అభయారణ్యాలకు వందలాది జాతులకు చెందిన లక్షలాది వలస పక్షులు వస్తాయి. ధ్రువప్రాంతంలోని శీతల వాతావరణానికి దూరంగా, కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలకు ఈ పక్షులు వలస వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. పిల్లలకు రెక్కలు రాగానే, వాటితో కలసి వేసవి మొదలవుతుండగా తిరిగి వెళ్లిపోతాయి. వలసల్లో మనుషుల పద్ధతి కాస్త భిన్నం. తరతరాల కిందట మన దేశం నుంచి వలసవెళ్లిన మనవారు వివిధ దేశాల్లో పూర్తిగా స్థిరపడిపోయారు. కొన్ని దేశాల్లో అధికార పదవులనూ దక్కించుకున్నారు. అలాగని వలసలన్నీ సుఖప్రదమైన ప్రయాణాలు కావు. పక్షులకైనా, మనుషులకైనా వలసల్లో ఆటుపోట్లు, అడుగడుగునా ప్రమాదాలూ తప్పవు. ప్రకృతి వైపరీత్యాల నుంచి వలసపక్షులకు మార్గమధ్యంలో ఆపదలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ అధిగమించి సానుకూల వాతావరణంలోకి వలస వచ్చి, గూళ్లు ఏర్పాటు చేసుకున్నా, వాటి మనుగడకు పూర్తి భద్రత ఉండదు. వేటగాళ్ల వలలకు, ఉచ్చులకు చిక్కి బలైపోతుంటాయి. ఇన్ని కష్టనష్టాల తర్వాత ప్రాణాలతో మిగిలినవి మాత్రమే తిరిగి తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోగలుగుతాయి. బతుకుతెరువు కోసం వలస వెళ్లే మనుషుల పరిస్థితీ అంతే! ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులు దళారుల చేతిలో మోసపోయి, వెట్టి చాకిరి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. అనుకోని దుర్ఘటనల్లో అయినవారికి దూరంగా ప్రాణాలు పోగొట్టుకునే ఉదంతాలూ ఉన్నాయి. మంచు గడ్డకట్టే శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు ఏకకణ జీవి అమీబా మొదలుకొని, క్షీరదమైన మంచు ఎలుగుబంటి వంటి జీవులు శీతాకాలమంతా ఉన్న చోటనే కదలకుండా పడిఉండి సుప్తావస్థలో గడుపుతాయి. నిత్యచైతన్యశీలత కలిగిన పక్షులు ఇలా సుప్తావస్థలోకి జారుకోలేవు. అందుకే తమ స్వేచ్ఛా విహారానికి తగిన మెరుగైన పరిసరాలను అన్వేషిస్తూ వలసలు ప్రారంభిస్తాయి. వాతావరణం ఎంత ప్రతికూలంగా మారినా, ఎక్కడికక్కడే ఉండిపోయి సుప్తావస్థలోకి జారుకోవడం స్తబ్ధతకు పరాకాష్ఠ! ఇలాంటి స్తబ్ధత కొందరు మనుషుల్లోనూ ఉంటుంది. పరిస్థితుల్లోని మార్పులకు స్పందించకుండా, ఎలాంటి కదలికా లేకుండా శీతలనిద్రలోకి జారుకునే మనుషులు చరిత్ర ప్రవాహంలో ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోతారు. బలమైన ఆకాంక్షలతో వలసల బాట పట్టిన సమూహాలు, వ్యక్తులు చరిత్రగతిని మార్చేసిన ఉదంతాలు మనకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చిన సమూహాలు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని, శతాబ్దాల తరబడి పాలన సాగించాయి. స్థానికులపై నిర్దాక్షిణ్యంగా అణచివేత సాగించాయి. ఉన్నత విద్య కోసం బ్రిటన్‌కు, ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన గాంధీజీ, తన వలస ప్రస్థానాన్ని స్వాతంత్య్రోద్యమానికి పునాదిగా మలచుకున్నారు. శ్వేతజాతీయుల వలస ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తే, గాంధీజీ వంటి జాతీయ నాయకుల వలస ఈ దేశ స్వాతంత్య్రానికి ఊపిరిపోసింది. అన్ని ప్రయాణాల్లో మాదిరిగానే వలసల్లోనూ ప్రమాదాలు అనివార్యం. అంతమాత్రాన వలసలు ఆగిపోవు, చరిత్రా ఆగిపోదు! -
స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు
బెంగళూరు: అంతరిక్షంలో జరిపే జీవసంబంధిత ప్రయోగాలకు ఉపయోగపడే ఒక సాధనాన్ని ఇస్రో, ఐఐఎస్సీ సైంటిస్టులు రూపొందించారు. ఈ మాడ్యులర్ సాధనంతో జీవప్రయోగాలకు అవసరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తారు. అక్టా ఆస్ట్రోనాటికాలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. స్పొరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాను చాలా రోజులపాటు పెంచి పోషించేందుకు కొత్త సాధనం ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధనలో వివరించారు. అంతరిక్షంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల్లో సదరు సూక్ష్మజీవులు ఎలా స్పందిస్తాయన్న విషయాలను అవగతం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటి స్పందనల ఆధారంగా మనిషికి ఎదురయ్యే సవాళ్లను పసిగట్టవచ్చు. గగన్‌యాన్ పేరిట త్వరలో స్వదేశీయ అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సాధనంలో ఎల్ఈడీ, ఫొటోడయోడ్ సెన్సార్లతో బ్యాక్టీరియా పెరుగుదలను గమనిస్తారు. కొత్త పరికరం వంద శాతం లీక్ప్రూఫ్ అని, ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది.జీవేతర ప్రయోగాలకు సైతం దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశోధకుల్లో ఒకరైన కుమార్ చెప్పారు. చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం! -
ఇంటి వరండాలో అస్థి పంజరం.. ఒక్కసారిగా షాక్..
తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై అమింజికరైలో చాలా రోజులుగా తాళం వేసి ఉన్న ఇంటిలో అస్థిపంజరం బయటపడింది. రైల్వే కాలనీ 3వ వీధికి చెందిన మహేష్ (45)కు అదే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. అది శిథిలం కావడంతో తాళం వేశారు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడానికి తాళం తీశారు. ఆ ఇంటి వరండాలో అస్థిపంజరం ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ కృపానిధి విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి మహేష్ అన్న రమేష్ (49)గా తేలింది. రమేష్ కారు డ్రైవర్ అని, అతనికి పెళ్లి కాకపోవడంతో ఆ ఇంటిలో ఒంటరిగా ఉన్నట్టు గుర్తించారు. ఎముకల గూటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం ల్యాబ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మానవీయ సమాజం కోసమే... ‘ఆద్యకళ’
కళ నేటి మనిషికి విశ్రాంతే కాదు, నిన్నటి మానవుడి చరిత్ర కూడా. చరిత్ర పట్ల ఆసక్తిలేని భారతీయులకు కళల చరిత్ర గురించి ఆసక్తి లేకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, భిన్న సమాజాలు సహజీవనం చేసే దేశంలో సమతను సాధించా లంటే భిన్నత్వాన్ని కాపాడుకోవాలి. ఆధిపత్య వర్గాల వెలి వేతకు, పీడనకు గురవుతున్న బాధిత సమూహాల సాంస్కృతిక జీవనం చరిత్ర పొడవునా ధ్వంసమైంది. రాజాస్థానాలను ఆశ్రయించి, మతం నీడలో బతికిన కళలకు నేటికీ అదే ఆదరణ దక్కుతోంది. కానీ, ఉత్పత్తి కులాల కళలు కొన్ని శతాబ్దాలు బతికి బట్టకట్టినా ఇక బతికే పరిస్థితులు లేవు. ఉత్పత్తిలో భాగమైన మనిషి పనిముట్లను ఎట్లా సృష్టిం చాడో అట్లనే ఉత్పత్తి సంబంధాల్లోని ప్రేమానురాగాల్ని చాటు కోవడానికి అనురాగాల పల్లవి అల్లుకున్నాడు. ఆ పల్లవికి రాగాలు పలికే నాదాలు తయారు చేసిండు. పాటతోపాటే ఆటలోకీ అడుగుపెట్టిన మనిషి తాళగతులను నేర్చాడు. చరిత్రలో మానవ సమూహాలు ఎన్ని దారులగుండా నడిచొ చ్చాయో అన్ని వాద్యాలను మోసుకుంటూ ఇక్కడికి వచ్చాయి. ఆ తాళగతులు మనిషి ఆత్మను ప్రతిబింబిస్తే, ఆ కాలపు సమూహాల చరిత్రను వాద్యాలు గుర్తుచేస్తాయి. విశ్వకర్మలు వెయ్యేళ్ల కిందనే ‘రుంజ’ను గఢగఢ మోగించినట్లు సాహిత్య చరిత్ర చెబుతోంది. నాయకపోడు ఆదివాసీల ‘మూగడోలు’, బైండ్లవారు వాయించే ‘జమిడిక’, రాజన్నలు వాయించే ‘చామల్లాలి’, డమడమ మోగే మాదిగ ‘డప్పు’, ఆఫ్రికానుంచి వలసొచ్చిన సిద్దీల ‘మర్ఫా’, కోయల డోలు, చెంచుల ‘జేగంటలు’, గొత్తికోయ మహిళల ‘గుజ్జిడి మొగ్గలు’ సంగీ తంలోని వైవిధ్యాన్నే కాదు, సామాజిక కూర్పులోని వైవిధ్యాన్ని ఎరుకజేస్తాయి. ఈ కళలు మానవ సమాజ వికాసాన్ని చెప్పే పాఠాలు. జానపదుల కళలు అంతరించడమంటే మనిషి అంత రించిపోవడమే. దేవర కొలుపు, పెండ్లి, చావు, సమావేశం డప్పు మోగకుండా మొదలుకాలేదు. యుద్ధబేరీలు మోగించిన చరిత్ర సంగీతానిది. ఉత్పత్తి సంబంధాలు బలహీనపడిన ప్పుడు మానవ సంబంధాలు యాంత్రికమయ్యాయి. ఆ యాంత్రికతలో ఆటపాటలు తగ్గిపోయాయి. సంగీత వాయి ద్యాల అవసరమూ పోయింది. రాజాస్థానాలకు చేరి జావళీలు పాడిన కళలు ఎట్లా బతికాయో ఇప్పుడు సబ్బండ కులాల కళలు కూడా సాంస్కృతిక సారథుల పోషణలో బతుకు తున్నాయి. కానీ, అవి ఉత్పత్తి సంబంధాల్లోని ఆర్తిని వదిలేసి, పాటల పల్లకీలో ప్రభువుల్ని మోస్తున్నాయి. చరిత్రను కూడా ఒక పావుగా వాడుకునే చాతుర్యం ఉన్న పాలకుల పాలనలో ఉన్నాం. కాకతీయుల్ని కమ్మవారిలో కలిపే యమని కోరిన పాలకుడికి లొంగని పండితుడు వాస్తవ చరిత్రను నిలబెట్టినట్టే, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించే వారంతా జానపదుల సాంస్కృతిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటాలి. ‘‘నెత్తురుమండే, శక్తులు నిండే యువకుల్లారా రారండి’ అన్న పిలుపులు పోయి, మార్కుల కోసం, ర్యాంకుల కోసం వ్యక్తిత్వాలను త్యాగం చేయమంటోంది. మనం చూసున్న నేరాలన్నీ యాంత్రిక జీవనం, మార్కెట్ మనస్త త్వాలు పెంచిన సంకుచిత భావాల ఫలితమే. కాలాన్ని బట్టి బతుకుదెరువుని వెదుక్కునే సంచారుల బతుకు దారితప్పింది. ఆ కళలను కాపాడ లేకున్నా వాటి చరిత్రనైనా కాపాడుకుందాం. పంట లాభాలు ఇవ్వకపోయినా, మరో పంటకు విత్తనాలు పండితే మళ్లీ ఎవుసం చేయాలంటాడు రైతు. ఉత్పత్తి కులాల కళాకారులను తయారు చేయకున్నా విత్తనాల్లాంటి ఆ కళల వాయిద్యాలు పరిరక్షించుకుందామని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అంటున్నాడు. రేపటి సేద్యం కోసం జయధీర్ జానపదుల వాయిద్యాలను విత్తనాల్లా పదిలం చేసిండు. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆయన సేకరిం చిన కళాఖండాలన్నిటినీ హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రదర్శనకు ఉంచింది. మన తాతలు రాగాలు పలికించిన ఊదు వాద్యాలు, కొలుపులో మోగిన డప్పులు, పెళ్లిలో పలికిన సన్నాయిలు... ఎన్నెన్నో ఇందులో కొలువుదీర్చారు. సంగీతంతోపాటే వికసిం చిన లిపిని కూడా ఆయన పదిలం చేసే ప్రయత్నం చేసిండు. తొలి శతాబ్దాల నుంచి ఆధునిక కాలం వరకు లిపి పరిణా మాన్ని చెప్పే ఎముకలు, తోలు, తాళప్రతులు, వస్త్రాలు, దస్తావేజులను సేకరించిండు. నలభై ఏళ్లపాటు భద్రపరిచిన ఆ చారిత్రక భాండాగారాన్ని చూద్దాం రమ్మని ‘ఆద్యకళ’ ప్రదర్శ నకు ఆహ్వానిస్తున్నారు. నేడు (1 ఆగస్టు 2021న ఉదయం 11 గంటలకు) ప్రారంభమవుతున్న ఈ ప్రదర్శన కళలకు దూర మైన తరాన్ని మేల్కొలిపి, రేపటికి కొత్తదారులు వేస్తుందని ఆశిద్దాం. పదండి, జయధీర్ చెప్పే ప్రాచీన మానవుడి ‘తొవ్వ ముచ్చట్లు’ వింటూ కొత్తదారిలోకి నడుద్దాం. – నాగవర్ధన్ రాయల జర్నలిస్ట్ -
చైనాలో మరో వైరస్, ఒకరు మృతి
బీజింగ్: చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా మహమ్మారి పుట్టిందన్న విమర్శల మధ్య చైనాలో మనుషుల్లో మరో వైరస్ ఉనికి కలకలం రేపుతోంది. మంకీ బీ వైరస్ సోకి తొలిసారిగా బీజింగ్‌కు చెందిన పశువుల వైద్యుడు (53) కన్నుమూశాడు. ఈ మంకీ బీవైరస్ (బీవీ) సోకిన తొలి మానవ కేసుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం వెల్లడించింది. అయితే అతనితో సన్నిహితంగా మెలిగిన వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టు తెలిపింది. నాన్-హ్యూమన్ ప్రైమేట్లపై పరిశోధన చేస్తున్న సంస్థలో పనిచేసే పశువైద్యుడు మంకీ బీవీ వైరస్ బారినపడ్డాడు. మొదట వికారం వాంతులు లాంటి లక్షణాలతో బాధపడ్డాడు. అనేక ఆసుపత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో చివరికి మే 27న మరణించాడు. మార్చి ప్రారంభంలో చనిపోయిన రెండు కోతులను విడదీసిన ఒక నెల తరువాత అతను వైరస్ బాడిన పడ్డారని సీడీసీ వెల్లడించింది. ఏప్రిల్‌లో అతని సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని సేకరించిన పరిశోధకులు అతన్ని మంకీ బీవీకి పాజిటివ్‌గా గుర్తించారు, అయితే అతని దగ్గరి పరిచయాలున్నవారి నమూనాల పరీక్షలు నెగిటివ్ వచ్చాయి. 1932 లో గుర్తించిన ఇది మకాకా జాతికి చెందిన మకాక్లలో ఆల్ఫాహెర్పెస్వైరస్ ఎంజూటిక్. డైరెక్ట్ లేదా శారీరక స్రావాల ద్వారా సోకుతుంది. మరణాల రేటు 70 శాతం నుండి 80 శాతం వరకు ఉంది. -
కలకలం: తొలిసారిగా మానవుడికి సోకిన బర్డ్ ఫ్లూ
బీజింగ్: పక్షులకు వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. చైనాలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ ఓ వ్యక్తికి సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం ప్రకటించింది. హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని వెల్లడించింది. వెంటనే వైద్యారోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మానవుడికి బర్డ్ ఫ్లూ వ్యాపించిన వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బర్డ్ ఫ్లూ సోకిందని జాతీయ ఆరోగ్య కమిషన్ వివరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్ ఫ్లూ కేసు తమ దేశంలోనే మానవుడికి సోకిందని కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొంది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం కింద రక్త పరీక్షలు చేయగా అతడికి బర్డ్ ఫ్లూ సోకిందని ఫలితాల్లో నిర్ధారణ అయ్యింది. అతడికి బర్డ్ ఫ్లూ సోకడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఎవరెవరిని కలిశారో వారిని గుర్తించి వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. చదవండి: జూన్‌లోనే తగ్గుముఖం పడుద్ది -
మగవారి కొంపముంచుతున్న కెమికల్స్, ఇలాగైతే కష్టమే!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మానవజాతిలో ఫలదీకరణ సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతోందా? అవునంటున్నారు షన్నా స్వాన్ అనే ఎన్విరానమెంటల్ ఎమిడమాలజిస్టు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పలు రకాల రసాయనాలు క్రమంగా మగవాళ్లలో వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు, అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. కౌంట్‌డౌన్ పేరిట తాజాగా విడుదల చేసిన పుస్తకం ప్రకారం మనుషుల్లో వీర్యకణాల సంఖ్య 1973తో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం మేర తగ్గిందని, ఇదే తరహా కొనసాగితే 2045 నాటికి స్పెర్మ్‌కౌంట్ జీరోకు చేరవచ్చని చెప్పారు. ఇదే నిజమైతే భవిష్యత్‌లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదని హెచ్చరించారు. ఈ విపత్తుకు కారణమైన రసాయనాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయని, రోజూవారీ ఫుడ్ర్యాపింగ్స్ మొదలు, ప్లాస్టిక్ కంటైనర్ల వరకు వాటర్‌ప్రూఫ్ బట్టల నుంచి రోజూవారీ డియోడరెంట్లు, సబ్బుల వరకు అన్ని చోట్ల ఈ రసాయనాల జాడ ఉందని వివరించారు. వీటిలో పీఎఫ్ఏఎస్గా పిలిచే ఫరెవర్ కెమికల్స్ ఎప్పటికీ ప్రకృతిలో బ్రేక్‌డౌన్ కావని, ఇవి శరీరంలో పర్మినెంట్‌గా ఉంటాయని చెప్పారు. ఇవి శరీరంలో పేరుకుపోయేకొద్దీ హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందన్నారు. కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీయింగ్ పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌పై ఆయాదేశాలు స్పందించే తీరులో వ్యత్యాసాలున్నాయని, కొన్ని దేశాల్లో వీటిని పూర్తిగా నిషేధిస్తే, కొన్ని చోట్ల పరిమితంగా వాడుతున్నారని, కొన్ని చోట్ల ఎలాంటి నియంత్రణా లేదని స్వాన్ వివరించారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా నిషేధించకుండా కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రసాయనాల ప్రభావం మహిళల్లో సైతం ఫెర్టిలిటీపై పెరిగిందని స్వాన్ చెప్పారు. ప్రస్తుత మహిళ తన ముత్తవ్వతో పోలిస్తే 35వ ఏట గర్భం దాల్చే శక్తి తగ్గిందన్నారు. అలాగే ఒక మగవాడి వీర్యకణాలు అతడి తాతతో పోలిస్తే సగమయ్యాయన్నారు. ఇది మానవాళి అంతానికి దారి తీసే విపత్తని చెప్పారు. కేవలం స్పెర్మ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఈ కెమికల్స్ కారణంగా మగవారి అంగ పరిమాణం, వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశాలు మేలుకొని ఈ కెమికల్ గండాన్ని ఎదుర్కోవాలని సూచించారు. -
వ్యాక్సిన్‌పై సాధారణ సందేహాలు!
గత ఏడాదంతా కరోనా బాధపెట్టినా... ఈ ఏడాది తొలిరోజుల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న చల్లటి కబురు అందరినీ ఆహ్లాదపరచింది. దీనికి తోడు మనదేశంలోనూ రెండు వ్యాక్సిన్లకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి దొరికింది. త్వరలోనే పంపిణీ కూడా మొదలుకాబోతోంది. అయితే ఇప్పుడు సగటు మనిషికి అన్నీ సందేహాలే. వ్యాక్సిన్ తీసుకోడానికి పరగడుపున వెళ్లాలా, ఏదైనా తిని వెళ్లవచ్చా? పల్స్ పోలియో వ్యాక్సిన్స్ ఇచ్చేప్పుడు కొద్దిపాటి జ్వరం ఉన్నా ఇవ్వవచ్చన్నారు. ఇదీ అలాగేనా? జ్వరం ఉంటే మానేయాలా? గతంలో వ్యాక్సిన్స్ ఇవ్వగానే ఇవ్వగానే జ్వరాలు వచ్చేవి. దీనికీ అలాగే జ్వరాలు వస్తాయా? వ్యాక్సిన్ పరగడుపున తీసుకోవాలా లేదా తీసుకున్న తర్వాత పథ్యం లాంటివి ఏవైనా ఉంటాయా? ఇక కొంతమంది రోజూ ఆల్కహాల్ తీసుకునేవారుంటారు. వ్యాక్సినేషన్ తర్వాత వాళ్లు ఎప్పటిలాగే సాయంత్రం ఆల్కహాల్ తీసుకోవచ్చా, లేదా?... మామూలు మనుషుల మదిలో మెదిలే ఎన్నో సగటు సందేహాలకు జవాబులివి. ఎవరికి ఈ వ్యాక్సిన్ ని ఇస్తారు? ముందుగా సుమారుగా కోటిమంది ఉండే వైద్యసిబ్బందికి, వారి తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్ కి ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాతి వరుసలో 50 ఏళ్ల పైబడిన వారితో పాటు అంతకన్నా తక్కువ వయసులో ఉండి వేరే విధమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. దేశవాసుల్లో ఇలాంటి వారు సుమారుగా 27 కోట్ల మంది ఉన్నారని అంచనా. మొత్తం 30 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి తొలివిడత ప్రయత్నం జరుగుతోంది. పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చా? పిల్లలకు ఈ వ్యాక్సిన్ అవసరం చాలా తక్కువ. పిల్లల్లో కరోనా వచ్చిన తర్వాత కూడా ప్రమాదం ఉండే అవకాశం చాలా అరుదు. అందుకే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా 18 ఏళ్లు దాటిన వాళ్లకి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ని ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? ఇప్పటికి ఉన్న నిబంధనల ప్రకారం... కరోనా వ్యాక్సిన్‌కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మొదట కోవిన్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఈ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో వ్యాక్సిన్‌కి పైన చెప్పిన మేరకు అర్హతలున్నవారు తొలుత నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత అర్హులైన వారికి ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది. ప్రస్తుతానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే వాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. (వెద్యం, దాని సంబంధిత రంగాల్లో ఉన్న వారు కోవిన్ రిజిస్ట్రేషన్ చేయించుకోనక్కరలేదు.) క్యాన్సర్ గాని లేక ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్లకు ఏ విధమైన వాక్సిన్ ఇవ్వచ్చు? మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ వాక్సిన్ పూర్తిగా నిర్వీర్యం చేసిన వైరస్ నుంచి తయారైంది. అందువలన ఈ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ తక్కువ ఉండే వారిలో కూడా సురక్షితమైనది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్. ఇందులో విభజన చెందని అడినో వైరస్ ఉంటుంది. అయినప్పటికీ ఈ వ్యాక్సిన్ కూడా క్యాన్సర్ రోగుల్లో ప్రమాదకరమైనది కాదు. కాకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉండే వారిలో యాంటీబాడీస్ ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిలో ఈ వ్యాక్సిన్ల వలన పూర్తి రక్షణ ఉండకపోవచ్చు. ఒకసారి కరోనా వచ్చిన తగ్గిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవలసిన అవసరం ఉంటుందా? ఒకసారి కరోనా వచ్చి తగ్గిన వారిలో యాంటీబాడీస్ వృద్ధి అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంటీబాడీస్ సరైన మోతాదులో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఈ యాంటీబాడీస్ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత అవి ఎన్ని రోజుల పాటు శరీరంలో ఉంటాయి అనే విషయంలో కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. అదురుగానే అయినప్పటికీ... ఇప్పటికీ ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత మరొకసారి కరోనా వచ్చిన దాఖలాలున్నాయి. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని... కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా టీకా తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. శరీరంలో కరోనా యాంటీబాడీస్ ఉన్నవారికి మళ్లీ కరోనా వచ్చే అవకాశం తక్కువే. కానీ అలా అని ప్రజలందరికీ యాంటీబాడీస్ పరీక్ష చేసి తరువాత వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదు. కరోనా వ్యాధి వచ్చి తగ్గిన వారిలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ కనపడలేదు కాబట్టి వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత కూడా కరోనా వాక్సిన్ తీసుకోవడమే మంచిది. కరోనా వ్యాక్సిన్‌ని తీసుకునే ముందు రోజు లేదా తీసుకున్న రోజు మద్యపానం చేయవచ్చునా? స్పుత్నిక్ వ్యాక్సిన్‌ని తీసుకునే ముందు మద్యపానం చేయరాదని రష్యన్ అధికారులు చెప్పడంతో కొంతమేరకు దుమారం చెలరేగింది. వారు అలా చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గినట్లయితే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ సరిగ్గా తయారు అవ్వకపోవచ్చు. అందువల్ల వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఆ తర్వాత మళ్లీ వాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంకొన్ని రోజులు ఎక్కువ మోతాదులో మద్యపానం తీసుకోకపోవడమే మంచిది. అంటే కొద్దిరోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం వల్లనే ప్రయోజనం ఎక్కువ అన్నమాట. ఇంట్లో డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉన్న పెద్దవాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఇప్పటికి కేవలం ఇంట్లో పెద్ద వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చే సదుపాయం ఉంది. వీళ్లలో చాలామంది కి బీపీ షుగర్ లు ఉండే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్లకే వ్యాక్సిన్ అవసరం ఎక్కువ కూడా. అంతేకాదు వాళ్లకే కరోనా వల్ల ముప్పు అవకాశాలూ ఎక్కువ. అందువల్ల వీళ్లను వ్యాక్సినేషన్ సెంటర్ కి తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వీళ్లు మాస్క్ ధరించడమే కాకుండా భౌతిక దూరాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో కూడా చాలావరకు సురక్షితమైనవి. అందువల్ల అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా వీళ్లకు వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పటికి అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ అనే ఈ రెండు వ్యాక్సిన్లు కూడా చాలావరకు సురక్షితమైనవి. అయితే అన్ని వ్యాక్సిన్లు లాగానే కొంతవరకూ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వీటికి కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఇంజక్షన్ తీసుకున్న దగ్గర నొప్పి, కొద్దిగా జ్వరం, తలనొప్పి లేదా వొళ్ళు నొప్పులు వీటివల్ల రావచ్చు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి కళ్లు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ... వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండటానికి వీలుగా వారిని వ్యాక్సినేషన్ సెంటర్లో ఒక అరగంట సేపు అక్కడే ఉంచేస్తారు. (గుర్తుంచుకోవాల్సిన అంశమేంటంటే... కొన్ని సందర్భాల్లో క్లినికల్ ట్రయల్స్‌లో ఎదురుకాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాస్తవ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కనిపించవచ్చు.) వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి పరగడుపున వెళ్లాలా లేకపోతే ఏమైనా తిని వెళ్ళవచ్చా? సాధారణంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుగా పరగడుపున ఉండాల్సిన అవసరం ఉండదు. కరోనా కి సంబంధించిన వ్యాక్సిన్లన్నీ ఇంజక్షన్ రూపంలో ఇచ్చేవి కావడంతో ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు అవసరం లేదు. అయితే కొన్నిసార్లు వాక్సిన్ తీసుకున్న తర్వాత వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకుంటే మంచిది. కొద్దిపాటి జ్వరం ఉన్నప్పటికీ వాక్సిన్ ఇవ్వచ్చునా? సాధారణంగా కొద్దిగా ఒళ్లు వేడిగా ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్వరం ఒకవేళ కరోనా వల్ల వచ్చినట్లయితే పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు వాక్సినేషన్ సెంటర్‌కి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మనకు అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు ఎంతవరకు సమర్థంగా పనిచేస్తాయి? కోవిషీల్డ్ వ్యాక్సిన్ సుమారుగా 70 శాతం వరకు సమర్థంగా పనిచేయవచ్చు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సమర్థత ఫేజ్ 3 ట్రయల్స్‌లో ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ 90 శాతానికి పైగా పనిచేస్తుందని తెలిసింది. ఈ రెండు వ్యాక్సిన్లు కూడా కొత్తగా వస్తున్న బ్రిటిష్ వేరియెంట్‌కి సైతం వ్యతిరేకంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాస్క్ ధరించడం మానేయవచ్చా? కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత పూర్తి రక్షణ రాకపోవచ్చు. రెండవ డోసు తీసుకున్న పదిహేను రోజుల తర్వాత మాత్రమే పూర్తి రక్షణ లభించే అవకాశం ఉంది. అందువల్ల రెండు డోసులూ పూర్తయిన 15 రోజుల వరకు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. ఆ తర్వాత కూడా మాస్క్ ధరించడమే ఉత్తమం. మాస్క్ అనేది అనేక రకాల వ్యాధులను రాకుండా చూస్తుందని గుర్తుంచుకోవాలి. కేవలం ఈ పాండమిక్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ జాగ్రత్తల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. - డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్, కార్డియాలజిస్ట్ -
నిమ్స్‌లో కోవాగ్జిన్ ఫేజ్- 3 ట్రయల్స్ షురూ
సాక్షి, హైదరాబాద్: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి నగరానికి చెందిన భారత్ బయోటెక్స్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ దిశగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ శరవేగంగా జరుగుతున్నాయని నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. కోవాగ్జిన్ టీకాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి రెడీ చేసేందుకు ఐసిఎంఆర్ కార్యచరణ ప్రణాళికలను రూపొందించినట్టు సమాచారం. ఇప్పటి వరకు మొదటి రెండు దశల్లో ట్రయల్స్ విజయవంతంగా జరిగాయి. ఆయా దశల్లో టీకా వేయించుకున్న వాలంటీర్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ చివరి దశ టీకా ప్రయోగానికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ట్రయిల్స్‌ని నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో ఒకటైన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) సోమవారం నుంచి ట్రయల్స్‌ను కొనసాగించేందుకు సమాయత్తమవుతుంది. ఈ దశలో దాదాపుగా 600 మంది వాలంటీర్లకు టీకాలు వేయనున్నామని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ వైద్య బృందం వెల్లడించింది. -
కరోనా టీకా: మరో కీలక అడుగు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కరోనా మహమ్మారి వ్యాక్సిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. తొలి స్వదేశీ వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’ ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలకు అనుమతులను సాధించింది. జూలైలో దేశవ్యాప్తంగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులిచ్చింది. కోవిడ్ నియంత్రణకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్), నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)సహకారంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’. కరోనా కట్టడికి మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నామని, ఇదొక మైలురాయి లాంటిదని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటించారు. ఈ టీకా అభివృద్ధిలో ఐసీఎంఆర్, ఎన్ఐవి సహకారం కీలక పాత్ర పోషించాయనీ, అలాగే తమ ఆర్‌అండ్‌డి, తయారీ బృందాలు అవిశ్రాంతంగా కృషి చేశాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నఔషధ తయారీదారులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేసులో భారత్, వ్యాక్సిన్లు, జెనెరిక్ ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషించనుంది. టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు 30 గ్రూపులు పనిచేస్తున్నాయని మేలో ప్రభుత్వం తెలిపింది. కాగా భారతదేశంలో 16,475 మంది సహా ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ మహమ్మారికి బలి కాగా, భారతదేశంలో దాదాపు 5.5 లక్షలతో సహా ప్రపంచవ్యాప్తంగా 1.01 కోట్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. కరోనాకు భారీగా ప్రభావితమైన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. -
నాగుర్రప్పిల్ల విశ్లేషణ
ఎమర్జెన్సీలో పనిచేయటం నాకిష్టం– అక్కడ మనం ఎటూ మగవాళ్లనే కలుస్తాం. నిజమైన మగవాళ్లు, హీరోలు. ఫైర్మ్యాన్లు, జాకీలు. వాళ్లెప్పుడూ ఎమర్జెన్సీ గదుల్లోకి దూరుతుంటారు. జాకీల ఎక్స్‌రేలు అద్భుతంగా ఉంటాయి. వాళ్లు ఎప్పుడూ ఎముకలు విరగ్గొట్టుకుంటుంటారు, కానీ తమకు తామే కేవలం ఏదో టేపు చుట్టేసుకుని తరువాతి పందెంలో పాల్గొంటుంటారు. వాళ్ల అస్థిపంజరాలు చెట్లలా కనబడతాయి, పునర్నిర్మించిన బ్రాన్టోసారస్లా. సెయింట్ సెబాస్టియన్ ఎక్స్‌రేలా. నా దగ్గరికే జాకీల్ని ఎందుకు పంపుతారంటే వాళ్లందరూ మెక్సికన్లు, నేను స్పానిష్ మాట్లాడగలను. నేను కలిసిన మొదటి జాకీ మున్యోజ్. వచ్చినవాళ్లందరి బట్టల్ని నేను విప్పాల్సివుంటుంది, అదేం పెద్ద విషయం కాదు, కొన్ని సెకన్లలో అయిపోతుంది. మున్యోజ్ అక్కడ పడివున్నాడు, స్పృహలో లేకుండా, దేవుడా! కామరూపంలోని యాజ్టెక్ శిల్పంలా. అతడి దుస్తులు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయంటే నేనేదో సుదీర్ఘ క్రతువును నిర్వహిస్తున్నట్టు అనిపించింది. అవి విప్పేసరికి అలసిపోయినంత పనైంది, మిషిమా రచనల్లో గొప్పింటి మహిళ తన కిమోనో విప్పడానికి మూడు పేజీలు పట్టినట్టు. అతడి రాణీరంగు సిల్కు చొక్కాకు భుజం వెంబడి ప్రతి చిన్న మలుపు దగ్గరా ఎన్నో బొత్తాములున్నాయి. అతడి ప్యాంటు దట్టమైన అల్లికతో కట్టబడివుంది. అన్నీ పాతకాలపు(ప్రి–కొలంబియన్) ముడులు. అతడి బూట్లు పేడ, చెమట వాసన వేస్తున్నాయి, కానీ అవి సిండెరెల్లా బూట్లంత మెత్తగా, నాజూగ్గా ఉన్నాయి. అతడు పడుకొనే ఉన్నాడు, వశం చేసుకోగలిగే యువరాజు. అతడు మేలుకోవడానికి ముందే వాళ్లమ్మ గురించి కలవరించడం మొదలుపెట్టాడు. అతడు కేవలం నా చేయిని మాత్రమే పట్టుకోలేదు కొందరు రోగుల్లా, నా మెడను వాటేసుకొని మామసీటా, మామసీటా అని వెక్కడం మొదలుపెట్టాడు. ఊయల్లోని బుజ్జాయిలా నేను పట్టుకున్నప్పుడు మాత్రమే అతడు డాక్టర్ జాన్సన్‌ను పరీక్షించనిచ్చాడు. అతడు పిల్లాడంత బుజ్జిగా ఉన్నాడు కానీ బలంగా, మగటిమితో ఉన్నాడు. నా ఒడిలో ఒక మగవాడు. కలల పురుషుడు? కలల చిన్నారి? నేను మున్యోజ్ను స్ట్రెచర్ మీదికి మార్చడానికి తంటాలు పడుతున్నప్పుడు డాక్టర్ జాన్సన్ నా నుదుటిని స్పాంజితో తుడిచాడు. కచ్చితంగా ఇతడి కంటె ఎముక విరిగివుంటుంది, కనీసం మూడు పక్కటెముకలు విరిగుంటాయి, బహుశా మెదడుకో గట్టి దెబ్బ తగిలేవుంటుంది. లేదు, అన్నాడు మున్యోజ్. రేప్పొద్దుటి పందెంలో అతడు స్వారీ చేయాలి. ఇతణ్ని ఎక్స్ రే తీయండి, అన్నాడు డాక్టర్ జాన్సన్. స్ట్రెచర్ మీద అతడు పడుకోవడం లేదు కాబట్టి కిందికి కారిడార్ దాకా నేనే మోసుకెళ్లాను, కింగ్ కాంగ్‌లాగా. అతడు భీతిల్లి ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు, అతడి కన్నీళ్లతో నా రొమ్ము తడిచిపోయింది. ఎక్స్ రే టెక్నీషియన్ వచ్చేవరకూ ఆ చీకటి గదిలో మేము వెయిట్ చేశాం. ఒక గుర్రాన్ని ఉపశమింపజేసినట్టుగా నేను అతడిని ఓదార్చాను. కాల్‌మాతే, లిండో, కాల్‌మాతే, ఏం ఫర్లేదు, బంగారం, ఏం ఫర్లేదు. డిస్పాసియో... డిస్పాసియో. నెమ్మదిగా... నెమ్మదిగా. నా చేతుల్లో శాంతించాడు, మృదువుగా ఎగబీల్చాడు, బుస కొట్టాడు. అతడి చక్కటి వెన్నుపూసను నిమిరాను. ఒక దివ్యమైన గుర్రప్పిల్లలాగా అదోసారి చిన్నగా పులకించింది, కంపించింది. అద్భుతంగా ఉండిందది. (బ్రాన్టోసారస్= ఒక రకం డైనోసార్; యుకియో మిషిమా= జపాన్ రచయిత; యాజ్టెక్= పదిహేనో శతాబ్దంలో మెక్సికోలో వర్ధిల్లిన సామ్రాజ్యం) లూసియా బ్రౌన్ బెర్లిన్ (1936–2004) రచనలు ఇప్పుడు ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి. అమెరికా దాచుకున్న రహస్యం అని ఆమెను అభివర్ణిస్తున్నారు. ‘ఎ మాన్యువల్ ఫర్ క్లీనింగ్ విమెన్’ ఎంపిక చేసిన ఆమె కథల సంపుటి. ఈ అమెరికన్ రచయిత్రి ఆలస్యంగా రాయడం ప్రారంభించింది. అనారోగ్యం ఆమెను దీర్ఘకాలం బాధించింది. క్లుప్తంగా రాయడం లూసియా ప్రత్యేకతల్లో ఒకటి. ఐదు పేరాలు మాత్రమే ఉన్న ఈ కథ 1985లో జాక్ లండన్ షార్ట్ ప్రైజ్ గెలుచుకుంది -
మరణంలోనూ యాజమానికి తోడుగా..
ఎడిన్బర్గ్ : మరణంలోనూ యాజమానికి తోడుగా నిలిచిందో శునకం. యాజమాని చనిపోయిన 15 నిమిషాల్లోపే వెన్నెముక విరగ్గొట్టుకుని చనిపోయింది నిరో అనే ఓ బుల్డాగ్. వివరాల్లోకి వెళితే.. స్కాట్లాండ్కు చెందిన స్టువర్ట్ హట్చిసన్ అనే వ్యక్తి నిరో అనే ఫ్రెంచ్ బుల్‌డాగ్‌తో పాటు మరో రెండు కుక్కలను పెంచుకునే వాడు. నిరో అంటే అతడికి ఓ ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. అది కూడా అంతే! అతడిని విడిచి ఒక్కనిమిషం కూడా ఉండేది కాదు. ఇదిలా ఉండగా 2011లో స్టువర్ట్‌కు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స చేయించుకుంటునప్పటికి అది కాస్తా పెరిగి ఎముకకు వ్యాపించింది. దీంతో అతడి కుటుంబసభ్యులు నిరోను మిగిలిన రెండు కుక్కలను వేరేవాళ్లకు దత్తతకు ఇచ్చేశారు. స్టువర్ట్ గత నెలలో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించాడు. యాజమాని మీద ప్రేమో లేక యాధృచ్ఛికమో తెలీదు కానీ, సరిగ్గా అతడు మరణించిన 15 నిమిషాల్లో నిరో వెన్నెముక విరగ్గొట్టుకుని మరణించింది. దీనిపై స్టువర్ట్ తల్లి ఫియానా కొనెఘన్ మాట్లాడుతూ.. ‘‘ నా కొడుకు సరిగ్గా మధ్యాహ్నం 1:15నిమిషాలకు మరణించాడు. అతడు మరణించిన దాదాపు 15 నిమిషాలకే నిరో వెన్నెముక విరగ్గొట్టుకుని మరణించింది. అతడు మొత్తం మూడు కుక్కలను పెంచుకునేవాడు. కానీ, నిరో అంటే అతడికి ప్రత్యేకమైన అభిమానం. అది ఎల్లప్పుడు అతని వెంటే ఉండేది. అతడు చనిపోయే నాలుగు వారాల ముందు అతన్ని ఇంటికి తీసుకొచ్చాము. ఇంట్లో కళ్లు మూయాలన్నది అతడి చివరికోరిక’’ అని తెలిపిందామె.