ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవాలలో మాట్లాడుతున్న మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ శంకర్
-
ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవాలలో శంకర్
ఖమ్మం మామిళ్లగూడెం: మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ శంకర్ అన్నారు. సోమవారం ఖమ్మం ఆర్టీసీ గ్యారేజ్‌లో ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ వాహనాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రమాదాలు జరగవన్నారు. ఓవర్ టేక్ చేయటం, డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ మాట్లాడటం, డ్రంక్‌అండ్‌డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. ఆర్టీసీ సీఎంఈ జాన్‌రెడ్డి ,డిప్యూటీ సీటీఎం రామ్మూర్తినాయక్ మాట్లాడుతూ బస్సులోని ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యాలను చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. ఒక వ్యక్తిపై కుటుంబాలు ఆధార పడి ఉంటాయన్నారు. ఖమ్మం డీఎం సుగుణాకర్ మాట్లాడుతూ బస్సు కండీషన్, టెక్నికల్ ఫెయిల్ అయినపుడే ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ప్రయాణికులకు భరోసా కలిగించాలన్నారు.