Causes
-
మోచేతి నొప్పులా..ఇవిగో టిప్పులు!
దాదాపుగా అందరికీ జీవితంలోనూ ఏదో ఒక సమయంలో మోచేయి నొప్పి రావచ్చు. మరీ ముఖ్యంగా ఇంటి పనులు చేస్తుండే గృహిణుల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఇలా మోచేతికి సమస్య రావడం ఎందుకంటే... ఇతర దేశాల్లోని మహిళలతో పోలిస్తే మన దేశంలోని మహిళలూ, గృహిణులూ నిత్యం ఏదో ఒక ఇంటిపని చేస్తూనే ఉంటారు. ఈ కారణంతో ఏదో ఓ సమయంలో మోచేతికి వచ్చే సమస్యలు వాళ్లలోనే ఎక్కువగా బయటపడుతుంటాయి. ఇక మరో కారణమేమిటంటే... నిర్మాణపరమైన తేడాలున్నప్పుడు కూడా కొందరిలో మోచేతి సమస్యలు బయటపడుతుంటాయి. మోచేతి సమస్యలపై అవగాహన, నివారణ కోసం ఈ కింది అంశాలు తెలుసుకుందాం. సాధారణంగా మోచేతికి ఈ కింద పేర్కొన్న సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మోచేతి విషయంలో కనిపించే కొన్ని సమస్యలు... ఆటల్లో గాయాల వల్ల : క్రికెట్ లేదా టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి రాకెట్‌తో ఆడే ఆటల్లోనూ, ప్రధానంగా పురుషుల్లో మరింత ఎక్కువ బరువు వేసి వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేసినప్పుడు మోచేయి గాయపడి నొప్పి రావచ్చు. చేతిని వాడాల్సిన పద్ధతిలో ఉపయోగించకుండా అకస్మాత్తుగా కదిలించడం, ఆటలకు ముందు తగినంత వార్మప్ చేయకపోవడం వంటి కారణాలతో ఇలా జరగవచ్చు. హైపర్ ఎక్స్టెండెడ్ ఎల్బోస్ : చేతిని పూర్తిగా చాచినప్పుడు... మోచేతి దగ్గర అది 180 డిగ్రీలు ఉంటుంది. కానీ కొందరిలో అంటే... దాదాపు 30 శాతం మందిలో (అందునా ప్రధానంగా మహిళల్లో) అది 180 డిగ్రీల కంటే ఎక్కువే ఒంపు తిరుగుతుంది. ఇలా 180 డిగ్రీల కంటే కాస్తంత ఎక్కువగా మోచేయి బయటివైపునకు ఒంపు తిరగడాన్ని ‘హైపర్ ఎక్స్టెండెడ్ ఎల్బో’గా చెబుతారు. ఇలా ఎక్కువగా ఒంగుతున్నట్లు కనిపించడమన్న అంశమే మహిళలు ఎక్కువగా బరువులు మోసినప్పుడు అది మోచేతి బెణుకుకు కారణమవుతుంటుంది.ఎపీకాండలైటిస్ : చేతి భాగంలోని ఎముక (ఎపికాండైల్)కు ఒకసారి గాయమయ్యాక, మళ్లీ అదే చోట పదే పదే దెబ్బతగులుతుండటం వల్ల ఆ గాయం తిరిగి రేగుతుండవచ్చు. భుజం కండరాలు కూడా ఈ చోటే ఎముకకు అతికి ఉంటాయి. దాంతో ఏ కొద్దిపాటి శ్రమ చేసినా మళ్లీ గాయం రేగిపోయి నొప్పి వస్తుండవచ్చు. ఒక్కోసారి ఆ నొప్పి ఒకే చోట ఉండవచ్చు లేదా చేయి అంతటికి పాకవచ్చు. ఇలా జరగడాన్నే ల్యాటరల్ ఎపికాండైలైటిస్ అంటారు. చాలా ఎక్కువగా శ్రమించేవారిలో, ఈ శ్రమలో భాగంగా మోచేతిని ఎక్కువగా వాడేవారిలో కొన్ని సందర్భాల్లో మోచేతి దగ్గర కండరాన్ని ఎముకకు అంటించే ‘టెండన్’ విపరీతంగా అరిగి΄ోవచ్చు. ఇలాంటి కండిషన్‌నే ‘టెన్నిస్ ఎల్బో’గా పేర్కొంటారు. చాలా సందర్భాల్లో ‘ల్యాటరల్ ఎపీకాండైటిస్’నూ ‘టెన్నిస్ ఎల్బో’నూ దాదాపుగా ఒకే అర్థంలో వాడుతుంటారు.మోచేతి నొప్పి తగ్గాలంటే... మోచేయి విషయంలో ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడానికి ఎవరికి వారే ఇలా చెక్ చేసుకోవచ్చు. మొదట చేతిని చాచాలి. అది 180 డిగ్రీలు చాచగలిగితే పరవాలేదు. లేదంటే ఏదైనా సమస్య ఉందని అర్థం. మోచేతి ప్రాంతంలో వేలితో నొక్కాలి. లేదంటే ఏదైనా పనిచేస్తున్నప్పుడైనా మోచేతి పరిసరాల్లో నొప్పి వస్తోందంటే ఏదో సమస్య ఉన్నట్లు భావించాలి.కొన్ని పరిష్కారాలు... సాధారణంగా మోచేతికి ఏదైనా సమస్య వచ్చినా లేదా నొప్పి మరీ ఎక్కువగా లేక΄ోయినా... ప్రతివాళ్లూ తాము రోజూ చేసినట్లే ఇంట్లోని బరువులు ఎత్తడం / ఆటలాడటం వంటివి చేయవచ్చు. మరీ నొప్పిగా ఉంటే మాత్రం చేతికి తగినంత విశ్రాంతినివ్వాలి. ఏదైనా ఆటలాడటం వల్ల నొప్పి వస్తుంటే... ఒకవేళ ఆ గాయం తాజాదైతే (1 – 3 రోజులది) దానికి ఐస్‌ప్యాక్ పెట్టవచ్చు. వేణ్ణీళ్లతోనూ కాపడం పెట్టవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రోథెరపీ వంటివి చేయించుకోవడం ఒక్కటే సరి΄ోదు. ఇలాంటి గాయాలైన సమయంలో మోచేతికి విశ్రాంతినివ్వడంతోపాటు ఎల్బో, రిస్ట్ స్ట్రెచ్చింగ్ వ్యాయాలు చేయాలి. ఆ సమయంలో మోచేతికి శ్రమ కలిగించడం గానీ లేదా తగిలిన చోటే మళ్లీ మళ్లీ గాయం రేగేలా దెబ్బతగలనివ్వడం గానీ చేకూడదు. అలాంటి సందర్భాల్లో గాయం రేగితే ‘టెండన్’ దెబ్బతినవచ్చు. అందుకే మోచేతి నొప్పి రెండు వారాలకుపైగా అదేపనిగా కొనసాగితే తప్పక డాక్టర్‌కు చూపించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మోచేతి నొప్పి అదే పనిగా వస్తుంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కారణంగా వస్తుందేమోనని చూసుకొని, అక్కడ సమస్య ఏమీ లేదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండవచ్చు. (చదవండి: అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..! -
గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..
పుట్టబోయే ఆ చిన్నారి ఒకింత బొద్దుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాస్తంత బొద్దుగా ఉంటే పర్వాలేదు గానీ మరీ ఎక్కువ బరువుండటం తల్లీ, బిడ్డా ఇద్దరికీ చేటు చేసే అంశం. అదెలాగంటే... మహిళలు గర్భం దాల్చినప్పుడు వారిలో కొంతమందికి తాత్కాలికంగా చక్కెరవ్యాధి వస్తుంది. ఇలా కేవలం వారు గర్భవతులుగా ఉన్నప్పుడు వచ్చే చక్కెరవ్యాధిని ‘జెస్టెషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ కండిషన్ ఉన్న మహిళలకు పుట్టే చిన్నారులు కాస్తంత ఎక్కువ బరువుతో పుట్టవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో కాస్తంత ఎక్కువ బరువుగా పిల్లలు పుడితే అది బిడ్డలకు ముప్పుగానూ పరిణమించవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్ ఉన్నవారికి పుట్టే పిల్లలు కాస్తంత ఎరుపు రంగులో ఉండటంతో వారిని ‘టొమాటో బేబీస్’ అంటారు. దీనికి కారణం... పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారికి ఆహారం అందించే క్రమంలోనూ, ఇతరత్రా రక్తప్రవాహం తోపాటు తల్లిలోని చక్కెర చిన్నారుల శరీరాల్లోకీ ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి చిన్నారిలోనూ ఇన్సులిన్ ఎక్కువగా స్రవిస్తుంది. దీని మరో పరిణామం ఏమిటంటే... గర్భంలోని బిడ్డ... తన తల్లి నుంచి చాలా ఎక్కువ మోతాదులో పోషకాలను స్వీకరిస్తుంది. అందుకే గర్భసంచిలో ఉన్న బిడ్డ సాధారణం కంటే చాలా ఎక్కువ బరువు పెరుగుతుంది. వీళ్లలో హిమోగ్లోబిన్ మోతాదు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా పిల్లలు మరీ ఎక్కువ బొద్దుగా, బరువు ఎక్కువగా ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘మాక్రోసోమియా’ అంటారు. సరిగ్గా ఈ అంశమే... ఇటు పుట్టబోయే బిడ్డకూ, అటు జన్మనిస్తున్న తల్లికీ... ఇద్దరికీ ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటి సందర్భాల్లో ... ప్రసవం చేసే డాక్టర్ అయిన అబ్స్ట్రెట్రీషియన్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా బిడ్డ ఏ మేరకు బొద్దుగా ఉన్నారనే అంశాన్ని అంచనా వేస్తారు. ఒక్కోసారి సాధారణ ప్రసవం అవుతుందని అనుకున్నా, తల మాత్రమే బయటకు వచ్చి (శీర్షోదయమై) భుజాలు ప్రసవమార్గంలో ఇరుక్కుపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘షోల్డర్ డిస్టోసియా’ అంటారు. అదొక మెడికల్ ఎమర్జెన్సీ సమస్య. ఇలాంటి అన్ని అంశాలూ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బిడ్డ మరీ బొద్దుగా ఉంటే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. పైగా బొద్దుగా ఉండటం అన్న అంశం ఆరోగ్యానికి ఏమాత్రం సూచిక కాదు. అది ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీకి దారితీయవచ్చు. దీనికి బదులుగా బిడ్డ సన్నగా ఉన్నా... ఆరోగ్యంగా ఉండటమనేది అందరూ కోరుకునే అంశం. అందుకే చిన్నారి బొద్దుగా పుట్టడం / ఉండటం కంటే ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవడం మంచిది. (చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!) -
ఎముక కేన్సర్ అంటే..?
ఎముక మీద ఏదైనా అసాధారణ లేదా అవాంఛిత కణజాలం పెరుగుదలతో కనిపించే ‘ఎముక ట్యూమర్’లను ఎముక క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి ఎముక గడ్డలు శరీరంలోని ఏ ఎముకపైన అయినా రావచ్చు. అంటే ఎముక పైభాగంలో లేదా లోపలి వైపునా ఇంకా చెప్పాలంటే ఎముకలోని మూలుగ (బోన్ మ్యారో)లో... ఇలా ఎక్కడైనా రావచ్చు. ఈ బోన్ కేన్సర్ గురించి సాధారణ ప్రజలకూ అవగాహన కలిగేలా యూకే బర్మింగ్హమ్లోని రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు చెందిన మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. రాజేశ్, అలాగే అక్కడి వైద్యురాలు డాక్టర్ సుష్మితా జగదీశ్ చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఎముక కేన్సర్‌లో రకాలివి...ఎముకల గడ్డల గురించి... ఎముక మీద వచ్చే ఈ గడ్డ (బోన్ ట్యూమర్) అన్నది ప్రమాదాన్ని తెచ్చిపెట్టే (మేలిగ్నెంట్) బోన్ కేన్సర్ గడ్డ కావచ్చు లేదా అది ఎలాంటి ప్రమాదాన్నీ కలిగించని (బినైన్) గడ్డ కూడా కావచ్చు. ఇక ఎముక కేన్సర్ గురించి చెప్పాలంటే వచ్చే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గనక ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ ఈ కేన్సర్ దేహంలోని మరో చోట మొదలై... ఆ కణాలు ఎముక మీదికి చేరి ఎముక కణాలనూ క్యాన్సర్ కణాలుగా మార్చడం వల్ల వచ్చిన కేన్సరైతే దాన్ని ‘మెటాస్టాటిక్ బోన్ డిసీజ్’ అనీ ‘సెకండరీ బోన్ కేన్సర్’ అని డాక్టర్లు చెబుతారు. ప్రైమరీ బోన్ కేన్సర్లలో... మల్టిపుల్ మైలోమా (మూలుగలో వచ్చే కేన్సర్) ఆస్టియోసార్కోమా (ఇది టీనేజీ పిల్లల ఎముకల్లో కనిపించే సాధారణమైన కేన్సర్... సాధారణంగా మోకాలి చుట్టూ ఇది అభివృద్ధి చెందుతుంది) ఈవింగ్స్ సార్కోమా (ఇది కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తూ సాధారణంగా కాళ్లూ, కటి భాగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది) కాండ్రో సార్కోమా (ఇది ఎముకల్లో కనిపించే అతి సాధారణ రూన్సర్లలో రెండో ది, ఎక్కువగా మధ్య వయస్కుల్లో అందునా చాలావరకు కటి లేదా భుజం ఎముకల్లో కనిపిస్తుంది). సెకండరీ బోన్ కేన్సర్లలో దేహంలోని... రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రోస్టేట్ వంటి ఇతర ప్రాంతాల్లో వచ్చి కేన్సర్లు పెరుగుతూ ఆ కణాలు ఎముకలకూ చేరి అలా ఎముక కేన్సర్‌కూ కారణమవుతాయి. ఇక... ఏ హానీ చేయని బినైన్ ట్యూమర్స్ అని పిలిచే ఎముక గడ్డల విషయానికి వస్తే... తేడాలను బట్టి వాటిని ఆస్టియోకాండ్రోమా, జెయింట్ సెల్ ట్యూమర్స్ అని పిలుస్తారు. ఇవి ఎముకలపై పెరిగే అంతగా అమాయకరం కాని ‘నాన్ కేన్సరస్’ గడ్డలని చెప్పవచ్చు. లక్షణాలు..ఎముక కేన్సర్ లక్షణాలు తొలి దశల్లోనే గుర్తించడం అంతగా సాధ్యం కాదు. లక్షణాలిలా ఉంటాయి. నొప్పి : కేన్సర్ గడ్డ వచ్చిన ఎముక ప్రాంతంలో నిరంతరం నొప్పి వస్తూ సమయం గడుస్తున్నకొద్దీ దీని తీవ్రత పెరుగుతుంది. వాపు : ఎముక క్యాన్సర్ వచ్చిన చోట స్పష్టంగా వాచినట్లుగా వాపు కనిపిస్తుంది. ఫ్రాక్చర్లు: క్యాన్సర్ వచ్చిన ఎముక బలహీనంగా మారడంతో తేలిగ్గా విరగడానికి అవకాశాలెక్కువ. తీవ్రమైన అలసట, బరువు తగ్గడం : బాధితుల్లో బాగా నీరసం, నిస్సత్తువ, అలసట కనిపిస్తాయి. అలాగే బాధితులు ఎక్కువగా బరువు తగ్గుతారు. చికిత్స... ఒకసారి ఎముక కేన్సర్ నిర్ధారణ చేశాక... ఆ కేన్సర్ దశ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రాధాన్యక్రమంలో ఏ చికిత్స ప్రక్రియను తొలుత లేదా ఆ తర్వాత నిర్వహించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎముక కేన్సర్‌కు అవలంబించే సాధారణ చికిత్స ప్రక్రియల్లో ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : ఎముకపైన ఉన్న గడ్డనూ... దాంతోపాటు ఆ చుట్టుపక్కల కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. కీమోథెరపీ : కొన్ని మందులతో కేన్సర్ కణాలను తుదముట్టించే ప్రక్రియను కీమోగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియను ఆస్టియోసార్కోమా వంటి కేన్సర్ల కోసం వాడతారు. రేడియేషన్ థెరపీ : అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాల సహాయంతో కేన్సర్‌ను మాడ్చివేసే ప్రక్రియనే రేడియోషన్ థెరపీగా చెబుతారు. సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ గడ్డలను తొలగించలేని సమయాల్లో డాక్టర్లు ఈ ప్రక్రియను ఎంచుకుంటారు. అన్ని కేన్సర్లలో లాగే ఎముక కేన్సర్‌నూ ఎంత త్వరగా గుర్తించి, నిపుణులైన డాక్టర్లతో మంచి చికిత్స అందిస్తే ఫలితాలూ అంతే మెరుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా... పెరుగుతున్న పిల్లల్లో ఇవి వారి ఎదుగుదలను ప్రభావితం చేయడంతోపాటు కొన్నిసార్లు వైకల్యాలకూ కారణమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వీటిని కనుగొని, తగిన చికిత్స అందించాలి. బాధితుల్లో కనిపించే మెరుగుదల (ప్రోగ్నోసిస్) అనే అంశం... అది ఏ రకమైన కేన్సర్ లేదా ఏదశలో దాన్ని కనుగొన్నారు, బాధితుడికి అందుతున్న చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల మంచి అధునాతన చికిత్స ప్రక్రియలతోపాటు కొత్త కొత్త చికిత్స ప్రణాళికలు అందుబాటులోకి రావడం, సరికొత్త పరిశోధనలతో వచ్చిన ఆవిష్కరణల కారణంగా బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. ఎముక కేన్సర్‌తో జీవించాల్సి వస్తే... ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వచ్చే బాధితులకు తమ కుటుంబసభ్యుల నుంచి, డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షకుల నుంచి మంచి సహకరం అవసరం. ఎముక కేన్సర్ వచ్చిందని తెలియగానే అన్ని కేన్సర్లలో లాగానే బాధితులు షాక్‌కు గురికావడం, జీవితం శూన్యమైనట్లు అనుకోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం వంటివి ఉంటాయి. అయితే వాళ్లు బాగా కోలుకోవడం అన్నది... వాళ్లకు అందే చికిత్సతోపాటు వాళ్లకు నైతిక మద్దతు అందించే కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తమకు వచ్చిన కేన్సర్ రకం, దాని గురించి అవసరమైన సమాచారంతోపాటు తమకు వచ్చిన వ్యాధి గురించి డాక్టర్లు, తమకు నమ్మకమైనవాళ్లతో అరమరికలు లేకుండా చర్చించడం వంటి అంశాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఈ క్రమంలో నర్సులూ, తాము తీసుకునే మందులు, తమకు లభించాల్సిన ట్రాన్స్‌పోర్టు సహకారాలూ, బాధితుల బాధల్ని తమవిగా ఎంచి, సహానుభూతితో మద్దతు అందించే సపోర్ట్ గ్రూపుల సహకారం బాగుంటే కోలుకునే ప్రక్రియ కూడా మరింత మెరుగ్గా, వేగంగా జరుగుతుంది. ∙నిర్ధారణ...సాధారణంగా ఎక్స్–రే, ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలతోపాటు సాధారణంగా చిన్న ముక్క తీసి పరీక్షించే బయాప్సీ ద్వారా ఎముక కేన్సర్ నిర్ధారణ చేస్తారు. డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్ మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: చెదురుతున్న గుండెకు అండగా...!) -
నోట్లో పొక్కులు వస్తున్నాయా..?
కొందరికి నోట్లో, నాలుక మీద పగుళ్ళు రావడం, దాంతో ఏవైనా వేడిపదార్థాలూ లేదా కారపు పదార్థాలు తిన్నప్పుడు మంట, బాధ కలుగుతుండటం చాలా సాధారణం. ఇలా నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా... విటమిన్–బి లోపంతో ఈ సమస్య రావడం తోపాటు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగ్జైటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా కనిపించవచ్చు. ఇవి వచ్చినప్పుడు ముందుగా విటమిన్–బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారం పాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. అరుదుగా కొన్ని సిస్టమిక్ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశమున్నందున డాక్టర్లు తగిన పరీక్షలు చేయించి, కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్) -
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్‌ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్‌ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్‌లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
చిక్కే....‘సిస్ట్’ర్స్... జాగ్రత్త!
మహిళల్లో సాధారణంగా గర్భసంచి పక్కనే ఉండే ఓవరీస్‌లో లేదా వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో... రకరకాల సిస్ట్లు కనిపిస్తుంటాయి. సిస్ట్ అంటే నీరు లేదా నీటి వంటి ద్రవపదార్థంతో నిండి ఉన్న సంచి అని అర్థం. మహిళల్లో ఇలా సిస్ట్లు కనిపించడం మామూలే. సాధారణంగా కనిపించే కొన్ని రకాల సిస్ట్ల గురించి ప్రాథమిక అవగాహన కోసం... ఈ కథనం. ఫాలిక్యులర్ సిస్ట్: అండం విడుదల సమయంలో కనపించే సిస్ట్ ఇది. పీరియడ్స్ తరువాత ఐదు లేదా ఆరు రోజుల నుంచి క్రమంగా సైజ్ పెరుగుతూ ΄ోతుంది. సాధారణంగా 2 నుంచి 2.2 సెం.మీ. సైజ్‌కు చేరాక... మహిళల్లో అండం విడుదల జరిగాక కనుమరుగవుతుంది. కార్పస్ ల్యుటియల్ సిస్ట్: అండం విడుదలైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే... ఆ పిండాన్ని స΄ోర్టు చేయడానికి ఏర్పడే సిస్ట్ ఇది. సాధారణంగా ఈ సిస్ట్లు వాటంతట అవే కనుమరుగవుతాయి.ఎండోమెట్రియల్ సిస్ట్: రక్తంతో నిండి ఉండే ఈ సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో కనపడుతుంది. ఈ సిస్ట్లు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఇవి క్రమంగా పెద్దదై కొన్నిసార్లు పలిగి΄ోయే అవకాశం ఉన్నందున ఇటువంటి సిస్ట్‌లను ఇంజక్షన్ ద్వారా తాత్కాలికంగా పెరగకుండా చేయడంగానీ లేదా సర్జరీ ద్వారా తీసేవేయడం కానీ చేస్తుంటారు. ఇలా చేయాల్సిన అవసరమూ ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ సిస్ట్: ఓవరీస్‌లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్యూబ్‌తో కలిసి ట్యూబో–ఒవేరియన్ సిస్ట్ల పెల్విస్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా ఇది కనిపిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ : సాధారణంగా ప్రతినెలా 20 నుంచి 30 ఫాలికల్స్ ఓవరీస్‌లో పెరగడం ప్రారంభిస్తాయి. వీటన్నింటిలో అత్యంత అనువుగా ఉన్న ఫాలికల్ మాత్రమే అండంగా మారుతుంది. అది... మిగిలిన వాటికన్నా మరింత వేగంగా పెరిగి... పీరియడ్స్ వచ్చిన 12–16 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. ఇక మిగిలిన ఫాలికల్స్ అన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. కాని ఊబకాయం, హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో ఆ ఫాలికల్స్ అన్నీ ఒకే సైజ్ వరకు పెరుగుతాయిగానీ, ఏ ఒక్కటీ అండంగా మారదు. అలా పెరిగిపోయిన ఈ సిస్ట్ల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాక΄ోవడం, బరువు మరింతగా పెరగడం, అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. స్కానింగ్ చేసి చూసినప్పుడు ఈ ఫాలికల్స్ అన్నీ చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనపడతాయి. వీటినే డాక్టర్లు పాలిసిస్టిక్ ఓవరీస్’గా చెబుతారు. ఈ సమస్యను మందులతో, జీవనశైలి మార్పులతో తగ్గించడం సాధ్యమవుతుంది. సీరస్ లేదా మ్యూసినస్ సిస్ట్ : ఇవి కూడా ఓవరీస్‌లో సాధారణంగా కనిపించే సిస్ట్లే. నలభై ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. సైజును బట్టి చికిత్స నిర్ణయిస్తారు.చాలావరకు వాటంతట అవి తగ్గిపోయేవే... ఇన్ని రకాల సిస్ట్లు ఉన్నా ఫాలిక్యులార్, కార్పస్ ల్యుటియల్, చిన్న సైజ్‌లో ఉన్న సీరస్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సమయాలలో 6 సెం.మీ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే సిస్ట్లు లేదా నీరులాంటి పదార్థంతోపాటు గట్టిగా ఉన్న సిస్ట్లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ల వంటికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమ వుతుంది.శస్త్రచికిత్స అవసరమయ్యేవి... కొన్ని సిస్ట్లు మెలిక తిరిగి అంటే టార్షన్కు గురై పేషెంట్‌కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలను తెచ్చిపెట్టినప్పుడు ఆపరేషన్ తప్పని సరి. చివరగా... మహిళలు తామ ఓవరాల్ ఆరోగ్యం కోసం సరైన ఆహారం, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా మంచిది. దీనివల్ల ఇతరత్రా అనేక సమస్యలతో పాటు కొంతవరకు సిస్ట్లు కూడా నివారితమయ్యే అవకాశం ఉంది. - డా. స్వాతి హెచ్వికన్సల్టెంట్, అబ్‌స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు..
ప్రపంచవ్యాప్తంగా... ఆమాటకొస్తే భారతీయ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ విస్తృతియే చాలా ఎక్కువ. మొత్తం అన్ని రకాల క్యాన్సర్లను పరిగణనలోకి తీసుకుంటే రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యేవారు 28 శాతం ఉంటారని అంచనా. తాజా ‘గ్లోబకాన్’ లెక్కల ప్రకారం మన దేశంలో రొమ్ముక్యాన్సర్ల కేసుల సంఖ్య 1,78,361 కాగా దురదృష్టవశాత్తు దాని వల్ల 90,408 మరణాలు సంభవించాయి. అయితే కేవలం రొమ్ముక్యాన్సర్‌పై సరైన అవగాహన లేని కారణం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. సాధారణంగా మహిళల్లో 40 – 50 ఏళ్ల వయసప్పుడు వచ్చే ఈ రొమ్ముక్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తిస్తే దీని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని భరోసా ఇస్తున్నారు. అక్టోబరు నెల రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం కోసమే ఈ కథనం. మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్)తో ΄ాటు మరికొన్ని అంశాలూ కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని... రిస్క్ఫ్యాక్టరు...సాధారణంగా రొమ్ముక్యాన్సర్‌కు కారణమయ్యే రిస్క్‌లో పెరిగే వయసు, దాంతోపాటు కుటుంబంలో రొమ్ముక్యాన్సర్లు ఉండటం, మొదటి నెలసరి చాలా త్వరగా రావడం, మెనోపాజ్ చాలా ఆలస్యం కావడం, జీవితకాలంలో పిల్లలు లేకపోవడం వంటివి. ∙చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌కు గురి అయ్యే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. ఐదు నుంచి పది శాతం కేసుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారిలోనే వస్తుండటం గమనార్హం. బీఆర్సీఏ1, బీఆర్సీఏ 2 వంటి జెనెటిక్ మ్యూటేషన్లు ఉంటే ఆ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. ఇందులో బీఆర్సీఏ 1 జెనెటివ్ మ్యూటేషన్ వల్ల ముప్పు శాతం 72 % కాగా బీఆర్సీఏ 2 వల్ల 69% ముప్పు ఉన్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇక నివారించగలిగే రిస్క్‌ఫ్యాక్టర్లలో స్థూలకాయం ∙ఆధునిక జీవౖనశెలిలో భాగంగా కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు ∙ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం ∙తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైన బిడ్డకు రొమ్ము పాలు పట్టించడం మేలు. లక్షణాలు...మహిళలు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి లేదా స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అవి హానికలిగించని (బినైన్) గడ్డలా, లేక హానికరమైనవా (మేలిగ్నెంట్) అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం ∙రొమ్ము చర్మం మందంగా మారడం ∙రొమ్ములో సొట్ట పడినట్లుగా ఉండటం రొమ్ము ఆకృతిలో మార్పులు ∙సమస్య ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్. నిపుల్కు సంబంధించినవి: రొమ్ముపై దద్దుర్ల వంటివి రావడం నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటివి స్రవించడం రొమ్ము పరిమాణంలో మార్పులు రావడం, వాటిలో గమనించగలిగే తేడా రావడం బాహుమూలాల్లో :గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం చేతివాపు (లింఫ్ ఎడిమా)ఇమ్యూనో థెరపీ, టార్గెట్ థెరపీ : శస్త్రచికిత్సతోపాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాధితులకు సరిపడే చికిత్సను డాక్టర్లు అందిస్తారు. వ్యాధి తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడం తోపాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ విషయంలో గతంలోలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేన్సర్ ఎక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడు ‘నియో అడ్జువెంట్ థెరపీ’ అని ఇస్తారు. తర్వాతి చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండటం కోసం డాక్టర్లు ఈ చికిత్స ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ముందుగా ఆపరేషన్ చేయాలా, లేక కీమోథెరపీ ఇవ్వాలా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే కనుగొంటే 90% పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం ఉంది. చికిత్స... ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉండే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అ΄ోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి.నిర్ధారణ పరీక్ష... తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం ద్వారా మామోగ్రాఫీ అనే స్కాన్ ద్వారా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే పరీక్ష పూర్తి నిర్ధారణ కోసం వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ) ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ పెట్ స్కాన్. (చదవండి: కిడ్నీలను కిడ్స్‌లా కాపాడుకుందాం..!) -
పిల్లల అరచేతులు, అరికాళ్లలో దురదలా..ప్రమాదకరమా?
సాధారణంగా పిల్లల్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు... మరీ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చాక కొందరు చిన్నారుల్లో ఈ విధమైన లక్షణాలు కనిపి స్తుంటాయి. మొదట్లో అవి చాలా తీవ్రంగా కనిపించినా క్రమేపీ తగ్గిపోతాయి. ఇది చాలా సాధారణం. అలాగే ఎగ్జిమా వంటి మామూలు సమస్యలతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, స్ట్రెస్ వంటి కొన్ని సిస్టమిక్ వ్యాధులు ఉన్నప్పుడూ, ఇక సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్లతోపాటు, కొన్నిసార్లు విటమిన్ లోపాలు... ఇలాంటి కారణాల వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అంత ప్రమాదకరం కాదు గానీ... పైన పేర్కొన్న సోరియాసిస్ వంటివి మినహాయిస్తే ఇలా చర్మం ఉడి΄ోతూ కొత్త చర్మం వచ్చే ఎగ్జిమా వంటి వాటితపాటు... కొంతమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లాగా కూడా వచ్చే ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అనే కండిషన్లు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లో వాటంతట అవే పూర్తిగా తగ్గి΄ోతాయి. దాదాపుగా ఏమాత్రం ప్రమాదకరం కాదనే చెప్పవచ్చు.ఈ జాగ్రత్తలు పాటించాలి... ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు చేతులు తేమగా ఉంచుకోవడం (వెట్ సోక్స్), మాయిçశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం వంటివి చేయాలి. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) వల్ల ఉపశమనం ΄÷ందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న జాగ్రత్తల తర్వాత కూడా తగ్గక΄ోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ తీవ్రతరమవుతున్నా పీడియాట్రీషియన్ లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. ∙ చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో దురదలా? -
అన్ని డార్క్ సర్కిల్స్ ఒకటి కాదు..
చాలా మంది.. కంటికింద నల్లని వలయాలు కనిపిస్తుంటే ఒత్తిడికి గురవుతున్నామనో నిద్ర సరిగా పోవడం లేదనో అనుకుంటూ ఉంటారు. మార్కెట్లో లభించే క్రీములను రాస్తూ ఉంటారు. కానీ, సరైన పరిష్కారం లభించదు. డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అనారోగ్యం అని తెలుసుకుంటే పరిష్కారం కూడా సులువు అవుతుంది.΄ాతికేళ్ల ఏంజెల్ మెడిసిన్ విద్యార్థిని. కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు తన శరీరంలో ఏదో తీవ్రమైన సమస్యకు సంకేతమని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఒక ఈవెంట్లో ఏంజెల్‌ను కలిసిన డెర్మటాలజిస్ట్ ఆమె కళ్లకింద నల్లటి వలయాలను చూసి, అలెర్జీల సమస్యలను సూచిస్తున్నాయనిచెప్పాడు. అందరిలో ఆ విషయం గురించి ఎక్కువ చర్చించలేక ఇంటికి వెళ్లాక డెర్మటాలజిస్ట్కు ఫోన్ చేసింది. డెర్మటాలజిస్ట్ లారెన్ మాట్లాడుతూ – ‘ఈ సమస్యను పెరియార్బిటల్ హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. రక్తనాళాలకు సంబంధించిన సమస్య వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయ’ని వివరించారు. ఇన్నాళ్లూ నిద్రలేమి వల్ల కలిగే సాధారణ సమస్య ఇది అనుకుంది. డాక్టర్ చెప్పిన విధంగా తన కుటుంబంలో జన్యుపరంగా ఉబ్బసం, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంది. ‘మీకున్న అలెర్జీ ఏంటో కనుక్కొని, దానికి తగిన మందులు తీసుకుంటే నల్లని వలయాల సమస్య దూరం అవుతుంది’ అని డాక్టర్ చెప్పడంతో తగిన చికిత్స తీసుకోవడం మొదలుపెట్టింది. రోగనిరోధక శక్తి తగ్గుదలకళ్ల కింద వలయాలు మాత్రమే కాదు చర్మం ముడతలు పడటం, ముక్కుకు అడ్డంగా ఉన్న అలెర్జీ మచ్చలు కూడా తగ్గుతుండే రోగనిరోధక శక్తికి సూచికలు అంటున్నారు వైద్యులు. పోషకాహార నిపుణులు, బ్యూటీషియన్స్ కూడా నల్లటి వలయాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరిస్తున్నారు. వాటిలో... ∙జన్యుపరమైనవి, పోషకాహార లో΄ాలు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అలసట, జీర్ణకోశ సమస్యలు, ఏదీ తినాలని లేకపోవడం.. వంటివన్నీ కంటికింద భాగాన్ని నల్లగా చేస్తాయి. రకరకాల అలెర్జీలు, సైనస్ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. కారణాన్ని గుర్తించి, వాటికి దూరంగా ఉంటే అవే తగ్గిపోతాయి. క్రీములకన్నా మేలైనవి.. నల్లటి వలయాలు తగ్గడానికి మార్కెట్లో రకరకాల క్రీములు లభిస్తుంటాయి. వీటిని వాడినా మార్పు రాలేదంటే సాధారణ సమస్య కాదని గుర్తించాలి. ∙రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత ద్రవాహారాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. →ఫేషియల్ ఎక్సర్సైజ్ల వల్ల చర్మ కణాలు చురుకు అవుతాయి. రక్తప్రసరణ మెరుగై చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. → అలోవెరా, తేనె .. వంటి వాటిని అప్లై చేస్తూ సాధారణ చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకోవచ్చు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఅనర్థాలను నివారించాలంటే.. తీవ్ర అనారోగ్య సమస్యలను గుర్తించడానికి నల్లని వలయాలను ఒక సూచికగా తీసుకోవాలి. ఆస్తమా, బ్రాంకైటిస్, డస్ట్ అలెర్జీల వల్ల నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. చర్మం ΄÷డిబారినా, బి12, ఐరన్ లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బరువు పెరగడంతో చర్మం మందం అవడం, బరువు తగ్గినప్పుడు చర్మం పలచబడటం, వయసు పైబడటం వల్ల చర్మంలో వచ్చిన మార్పుల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కంటి దగ్గర ఉండే భాగాన్ని అలెర్జీ ఉన్నప్పుడు రుద్దుతూ ఉన్నా, మొబైల్, లాప్టాప్.. వంటి స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉపయోగించినా, నైట్ షిఫ్ట్స్ వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడతాయి. 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. డ్రై స్కిన్ ఉందంటే మాయిశ్చరైజర్ వాడాలి. బరువు పెరుగుతున్నారంటే ఫిట్నెస్, పోషకాహారం జాగ్రత్తలు తీసుకోవాలి. అలెర్జీ సమస్యలకు వైద్య చికిత్స తప్పనిసరి. – డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
‘పొగ’బెడుతున్నా...పొమ్మనలేమా?
నగరానికి చెందిన ఒక బహుళజాతి సంస్థలో ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తన యుక్తవయస్సు నుంచి ధూమపానం చేస్తున్నాడంటే... అతని ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పొగాకుపై ఖర్చు చేస్తున్నట్లే అర్థం. ఉత్సుకత, తోటివారి ఒత్తిడితో, కుటుంబ సభ్యుడు ఒకరు పొగతాగుతున్నట్లు చూసిన తర్వాతే అతనికి ధూమపానం అలవాటు ప్రారంభమైంది. సామాజిక అలవాటుగా మొదలై, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఒక విధానంగా పరిణామం చెందింది. ఆరోగ్య ప్రమాదాలు తెలిసినప్పటికీ, దాన్ని విడిచిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, కష్టపడినా దాన్ని అతను ఆపలేకపోయాడు. ఇది ఒకరికే ప్రత్యేకమైనది కాదు; ఇది దేశంలోని లక్షలాది మందికి సంబంధించింది.నియంత్రణలో సవాళ్లెన్నో...భారతదేశంలో, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన జనాభా కారణంగా పొగాకు నియంత్రణ సంక్లిష్టమైన సవాలును విసురుతుంది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల వల్ల వ్యక్తులు ఈ ఉత్పత్తులపై ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది వారి ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే అధిక పన్నులు అక్రమ పొగాకు వ్యాపారానికి కూడా ఆజ్యం పోస్తున్నాయి. మూడవదిగా చెపపుకోవాల్సింది పొగాకు వినియోగదారులు పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను అధికం అవుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మరింత భారంగా మారుస్తుంది.పొగాకు వాడకంలో... రెండో స్థానం...ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి.. 2018 నాటికి 16 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న 250 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. 2020 నాటికి 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 27% మంది పొగాకుకు బానిసలని తేలింది.. పొగాకు వినియోగదారులతో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా, చట్టబద్ధంగా ఉత్పత్తి చేస్తున్న సిగరెట్లు మొత్తం పొగాకు వినియోగంలో 8% మాత్రమే ఉండగా, మిగిలిన 92% బీడీలు పొగాకు నమలడం వంటి చౌకైన ఉత్పత్తులను వినియోగానిదే కావడం గమనార్హం.ఆడవారిలోనూ పెరుగుతున్న వినియోగం...జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–21 ప్రకారం... పురుషులు స్త్రీల మధ్య పొగాకు వినియోగంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ... మరోవైపు ఆడవారిలో సైతం పొగాకు వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒత్తిడి మారుతున్న సామాజిక ఆర్ధిక పరిస్థితుల కారణంగా మగవారిలో ఇప్పటికీ పొగాకు వినియోగం గణనీయంగా ఉంది. పొగాకు వినియోగం ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఎక్కువగా ఉంది, వీరికి పొగాకు సంబంధిత హాని ఎక్కువగా ఉంటుంది. విషపూరిత పదార్థాలతో నిండి, ఫిల్టర్లు లేకపోవడం వల్ల బీడీలు సిగరెట్ కంటే ఎక్కువ హానికరమైనవి అయినప్పటికీ, బాగా వినియోగిస్తారు. . బీడీ ఉత్పత్తి మార్కెటింగ్ లపై పెద్దగా తనిఖీలకు అవకాశం లేదు. వీలు కల్పిస్తుంది. చౌకైన పొగాకు ఉత్పత్తుల విక్రయం పేదరికపు ఉచ్చును శాశ్వతం చేస్తుంది.ప్రత్యామ్నాయాలు లేక...మానలేక...యువకులలో (20–44 ఏళ్ల వయస్సులో) ధూమపానం ప్రాబల్యం ఆందోళనకరంగా ఉంది, ఇది శ్రామికశక్తిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉందనేది మరవకూడదు. నికోటిన్ గమ్‌లు, ప్యాచ్‌లు, లాజెంజ్‌లు, హీట్–నాట్–బర్న్ వంటి ఇతర సాంకేతిక ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల 45% మంది యువకులు ధూమపానం లేదా పొగాకు నమలడం మానుకోలేకపోతున్నారని గత ఏడాది ఒక సర్వే తేటతెల్లం చేసింది. ‘హ్యూమన్–సెంట్రిక్ అప్రోచ్ టు టుబాకో కంట్రోల్’ నివేదికలోని సమీక్షకు స్పందించిన వారిలో 66% మంది 20–25 సంవత్సరాల మధ్య పొగాకును ఉపయోగించడం ప్రారంభించారని, వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుకున్నామని గుర్తించారు.ఇది చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!సమగ్రవిధానంతోనే పరిష్కారం...పొగాకు నివారణలో పొగాకు వినియోగానికి దోహదపడే సామాజిక సాంస్కృతిక కారకాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకుపై పూర్తి నిషేధం ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది పొగాకు సాగులో నిమగ్నమైన రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పన్ను ఆదాయాన్ని తగ్గిస్తుంది అక్రమ వ్యాపారాన్ని పెంచుతుంది. బదులుగా, విరమణ విద్య రెండింటిపై దృష్టి పెట్టి మరింత సమగ్ర విధానానికి మారాలి.అలాగే, 74% మంది ధూమపానం చేసేవారు, పొగాకు నమిలే వినియోగదారుల కుటుంబంలో పెద్దలు సైతం ధూమపానం అలవాటును కలిగి ఉన్నట్టు తెలుస్తోంది, ఈ పరిస్థితుల్లో వారికి సుదీర్ఘమైన మద్దతు అవసరం. సైన్స్ ఆధారిత పరిష్కారాలు, ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యావేత్తలు కమ్యూనిటీ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా, భారతదేశం పొగాకు వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు దానితో సంబంధం ఉన్న పేదరికం వ్యాధుల చక్రాన్ని అడ్డుకోవచ్చు. -
అర్లీ మెనోపాజ్ ప్రమాదమా..?
బాలికకు యుక్తవయసు నాటి నుంచి ప్రతి నెలా వస్తుండే రుతుక్రమం ఒక వయసులో ఆగి΄ోతుంది. అలా ఆగిపోవడాన్ని ‘మెనో΄పాజ్’ అంటారు. మామూలుగా వచ్చే నెలసరి కనీసం ఏడాది పాటు ఏ నెలలోనూ కనిపించకుండా పూర్తిగా ఆగిపోతే అప్పుడే దాన్ని ‘మెనో΄పాజ్’గా చెప్పవచ్చు. సాధారణంగా ఇది మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య జరుగుతుంది. అంటే సగటున 51వ ఏట ఇది సంభవిస్తుంది. కానీ కొందరిలో మామూలుగా ఆగిపోయే సమయం కంటే చాలా ముందుగానే ఆగితే దాన్ని ‘అర్లీ మెనో΄పాజ్’గా చెబుతారు. ఇలా జరిగినప్పుడు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. కొందరు మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య రుతుక్రమం ఆగిపోవడానికి బదులు 40 ఏళ్ల లోపు కూడా రుతుక్రమం ఆగి΄ోవచ్చు. ఇలా జరగడాన్ని అర్లీ మెనోపాజ్ లేదా ప్రి–మెచ్యుర్ ఒవేరియన్ ఇన్సఫిషియెన్సీ అని కూడా అంటారు. దీనికి నిర్దిష్టంగా కారణం ఏమిటో స్పష్టంగా తెలియదు. అయితే... కొందరిలో శస్త్రచికిత్స చేసి అండాశయాలు (ఓవరీలు) తొలగించాల్సి రావడం. కొన్ని కుటుంబాల్లో జన్యుపరంగా త్వరగా రుతుస్రావం ఆగిపోతుండవచ్చు కొందరిలో క్రోమోజోముల సమస్య కారణంగా... అంటే టర్నర్ సిండ్రోమ్ వంటివాటితో మానసిక ఒత్తిడి, మంచి ఆహారం తీసుకోకపోవడం, ఏదైనా దెబ్బతగలడం కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వాల్సి రావడం (ముఖ్యంగా నడుము దగ్గర) అండాశయాలను తొలగించడం పళ్లు, కూరగాయలపై ఉండే రసాయనాలు పొగ, మద్యం అలవాట్లు (విదేశాల్లో ఎక్కువ) థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవించడం కుటుంబ నియంత్రణ కోసం వాడే మందులు డాక్టర్ సలహా లేకుండా విచక్షణరహితంగా వాడటం పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) స్థూలకాయం.త్వరగా రుతుక్రమం ఆగడం ప్రమాదమా? మెనోపాజ్ రాబోతున్న సూచనగా కొందరు మహిళల ఒంట్లో నుంచి వేడి సెగలు వస్తున్నట్లు అనిపించడం (హాట్ ఫ్లషెస్), భావోద్వేగాలు వెంటవెంటనే మారడం (మూడ్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి కొందరిలో ఎముకలు పెళుసుబారి తేలిగ్గా విరిగిపోయేలా చేసే ‘ఆస్టియోరోసిస్’ ముప్పు నెలసరి ఆగి΄ోవడంతోనే ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల కొందరిలో గుండెపోటు, గుండెజబ్బుల ముప్పు ∙మూత్ర సంబంధమైన వ్యాధులు (యూరిన్ ఇన్ఫెక్షన్స్) ∙బరువు పెరగడం ∙కొందరిలో డిప్రెషన్, అయోమయం, త్వరగా కోపగించుకోవడం, అలసట వంటి మానసికమైన సమస్యలూ కనిపిస్తాయి.అర్లీ మెనోపాజ్‌కు తర్వాతి పరిణామాలకు చికిత్స? ఒకసారి మెనో΄పాజ్ ఆగి΄పోయాక దాన్ని పునరుద్ధరించడానికి ఏ చికిత్సతోనూ అవకాశముండదు. కాక΄ోతే మెనో΄ాజ్ తర్వాతి పరిణామంతో మహిళల్లో కొన్ని ఇబ్బందులు కనిపించవచ్చు. వీటికే చికిత్స అవసరం ఒంట్లోంచి వేడి సెగలు (హాట్‌ఫ్లషెస్) వస్తుండటం వల్ల బాధపడేవారికి హార్మోన్లను భర్తీ చేసేందుకు వచ్చే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) ఇవ్వాల్సి రావచ్చు. ఈ మందుల వల్ల ఒంట్లోంచి సెగలు రావడం ఆగడంతో పాటు ఎముకలూ బలంగా మారతాయి.అర్లీ మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తుండగా మొదలయ్యే ఈ చికిత్సను స్వాభావికంగా మెనోపాజ్ వచ్చే వయసు వరకు కొనసాగించాలి. హెచ్ఆర్టీలో ఇచ్చేవి ప్రత్యేకమైన మందులేమీ కావు. శరీరంలోనే స్రవించాల్సిన హార్మోన్లు కొన్ని కారణాల వల్ల స్రవించక΄ోవడంతో వాటిని డాక్టర్లు మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. కాబట్టి వీటితో ముప్పు ఏదీ ఉండదు.ప్రిమెచ్యుర్ మెనోపాజ్‌తో వచ్చే సమస్యలు, వాటి నివారణ కోసం... ఆకుకూరలు, పళ్లు సరిగ్గా కడిగి తీసుకోవాలి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. అంటే... ΄పొట్టుతో ఉండే గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు నిద్ర΄ోవడం, శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం.డాక్టర్ క్రాంతి శిల్ప, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అబ్స్ట్రెట్రీషియన్ (చదవండి: ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి) ప్రిమెచ్యుర్ మెనో΄ాజ్తో వచ్చే సమస్యలు, వాటి నివారణ కోసం... ∙ఆకుకూరలు, పళ్లు సరిగ్గా కడిగి తీసుకోవాలి ∙క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారం ∙ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. అంటే... ΄÷ట్టుతో ఉండే గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు నిద్ర΄ోవడం, శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం. -
అన్యురిజమ్స్ అంటే?
మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అకస్మాత్తుగా ప్రమాదకరంగా పరిణమించే ఈ సమస్య గురించి...మెదడులోని ఏప్రాంతంలో రక్తనాళాలు ఉబ్బి ఉంటే ఆప్రాంతం పేరుతో అన్యురిజాన్ని చెబుతారు. ఉదాహరణకు సెరిబ్రమ్ అనే ప్రదేశంలో ఉంటే సెరిబ్రల్ అన్యురిజమ్స్ అంటారు. మెదడు చుట్టూ ఉండే ప్రధాన ప్రాంతం సబార్కనాయిడ్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావమైతే దాన్ని ‘సబార్కనాయిడ్ హ్యామరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రదేశాన్ని బట్టి మెదడు ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో, ఆ అవయవం ప్రభావితమవుతుంది. అయితే ఇలా అన్యురిజమల్ బ్లీడ్కి గురైన ప్రతి ఏడుగురిలోనూ నలుగురు ఏదో ఒక రకమైన వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. కీలక ప్రాంతంలో రక్తస్రావం కాగానే మొదట అది పక్షవాతానికీ (స్ట్రోక్‌కు), తీవ్రతను బట్టి కోమాలోకి తీసుకెళ్లే అవకాశాలెక్కువ.బయట పడేందుకు అవకాశం తక్కువ... ఎందుకంటే? అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో అవి వారి జీవితకాలంలో అవి చిట్లక΄ోవచ్చు. ఉబ్బు చిన్నగా ఉన్నవి కాకుండా... ‘జెయింట్ అన్యురిజమ్స్’ అని పిలిచే పెద్దవి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలెక్కువ. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా వస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక వల్ల గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు: కంట్రోల్లో లేని అధిక రక్త΄ోటు, డయాబెటిస్ వంటి జబ్బులు. చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు (ఈ కారణంగా ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ) రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్తో కలిగే కాంప్లికేషన్లు ఆరోగ్యకరంగా లేని జీవనశైలి పొగాకు వాడకం, మద్యం అలవాటు యాక్సిడెంట్లో రక్తనాళాలకు గాయం కొన్ని అరుదైన కేసుల్లో : ఉదా. ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియాకిడ్నీల్లో నీటితిత్తులు వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్.చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు: జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం.చికిత్సలు: మందులిస్తూ చేసే చికిత్స: ఇది రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స. రక్త΄ోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొన్ని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె (క్రేనియమ్) తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిగాక ముందులాగే రక్తప్రసరణ జరిగేలా చూస్తారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్‌ను ప్రవేశపెట్టి... అందులో నుంచి మరింత చిన్నపైప్లను అన్యురిజమ్స్ వరకు చేరేలా చేసి, అక్కడ కాయిల్ అనే డివైజ్‌ని అన్యురిజమ్ నింపడానికి వాడతారు. దాంతో ఉబ్బిన బలహీన ప్రాంతానికి రక్తసరఫరా ఆగడంతో చిట్లడం జరగదు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియతో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. దాంతో పెద్ద రక్తనాళాల దగ్గర ఉన్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇక ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’తో రక్తపు దిశను మళ్లించి ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. (చదవండి: కేరళలో నిఫా వైరస్ కలకలం..!) -
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
జుట్టు రాలకుండా జాగ్రత్త ఇలా...జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. అయితే మనం మామూలుగా ఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రొటీన్ల లోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో నివారించవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే మార్గాలూ..ప్రొటీన్ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం... వారు తగినంతగా ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకోక΄ోవడమే. ఈ ప్రొటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు రిపేర్లకూ దోహదపడతాయి. అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారంలో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు చాలా ఎక్కువ. శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలి΄ోయేలా చేస్తాయి. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండి΄ోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. నివారణ ఇది: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి. -
డయాబెటిస్ లేకపోయినా..తరచు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందా?
తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారిలో సహజంగానే ఇలా జరుగుతుంది. కనుక ఆ వ్యాధి ఉందో, లేదో చెక్ చేయించుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ లేకపోయినా మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందంటే.. దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ముఖం అంతా వాపులకు గురై ఉబ్బిపోయి కనిపిస్తుంది. కాలి మడమలు, కాళ్లు, పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి కిడ్నీ సమస్యలు ఉంటే తీవ్రమైన అలసట వస్తుంది. కొందరిలో రక్తహీనత సమస్య కూడా ఏర్పడుతుంది చర్మం పొడిగా మారి దురదలు పెడుతుంది ∙నోటి దుర్వాసన ఉంటుంది ∙కిడ్నీ సమస్యలు ఉంటే కొందరిలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొందరికి తల తిరిగినట్లు అనిపిస్తుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో వెన్ను నొప్పి వస్తుంటుంది వాంతి వచ్చినట్టుగా... వికారంగా అనిపిస్తుంది కిడ్నీ సమస్యలు ఉంటే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారు వేడి వాతావరణంలో ఉన్నప్పటికీ చలిగా అనిపిస్తుంది. కొందరు వణుకుతారు. పైన తెలిపిన లక్షణాలు కనుక ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తినాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. (చదవండి: ఆరోగ్య చిట్కాలు చెప్పనున్న సమంత.. అందుకోసం..!) -
చిన్న వయసులోనే అని.. జుట్టు పీక్కుంటే ఏం లాభం, ఇవి తెలుసుకోండి!
కాస్త వయసు మీద పడ్డాక అంటే దాదాపు 40-50 ఏళ్ల మధ్య నల్లటి జుట్టు తెల్లగా మారడం సహజమే. కానీ మారుతున్న జీవనశైలి ఇతర కారణలతో చిన్న వయస్సులోనే వైట్ హెయిర్ రావడంపెద్ద సమస్యగా మారుతోంది. దీనికి కారణాలేంటి? చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చిన్న వయసులోనే,అనుకున్నదానికంటే ముందుగానే జుట్టు మెరిసిపోవడం అనేది జన్యుపరమైన సమస్యలతో పాటు అంతర్లీన ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. హెయిర్ ఫోలికల్స్ కణాల ద్వారా తగినంత మెలనిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు, జుట్టు రంగు మారిపోతుంది. ఇంకా ఒత్తిడి, హార్మోన్ల మార్పులు లేదా బొల్లి లాంటి చర్మ వ్యాధి లాంటి అనేక కారణాలు దీనికి కారణమవుతాయంటున్నారు. డెర్మటాలజిస్ట్‌లు జన్యుపరమైన కారణం: తల్లిదండ్రులులేదా తాతల్లో ఇలానే చిన్న వయసులోనే జుట్టు తెలబడిపోయిందా? ఒక్కసారి పరిశీలించు కోండి. మన శరీరంలోని కొన్ని జన్యువులు మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇది గ్రే హెయిర్‌కు దారితీస్తుంది. ఒత్తిడి: శరీరంలో ఫ్రీ రాడికల్స్ ,యాంటీఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సిడేటివ్ ఒత్తిడి ఏర్పడుతుంది. కాలుష్యం,యూవీ రేడియేషన్ , అనారోగ్యకరమైన ఆహారం వంటి బాహ్య కారకాలుదీనికి కారణం. ఈ ఒత్తిడి జుట్టు రంగుకు కారణమైన మెలనోసైట్లను దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ లోపాలు: అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లోపం కూడా మరో ముఖ్య కారణం. ముఖ్యంగా విటమిన్ B12,ఐరన్,, రాగి, జింక్ తగినంతగా తీసుకోకపోవడం వల్ల జుట్టు తెల్లబడిపోతాయి. ఈ పోషకాలు మెలనిన్ ఉత్పత్తిలోనూ, హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్లు: శరీరంలో హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా యుక్తవయస్సు, గర్భధారణ లేదా బహిష్టు సమయంలో జుట్టును ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెలనోసైట్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) , కార్టిసాల్ వంటి హార్మోన్లలో హెచ్చుతగ్గులు తెల్ల జుట్టుకు దోహదం చేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడికి ఎక్కువ కాలం గురికావడం ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది, జుట్టు రంగును మాత్రమే కాదు వివిధ శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక లేదా అధిక స్థాయి ఒత్తిడి మెలనోసైట్లను ప్రభావితం చేస్తుంది. ధూమపానం: వివిధ ఆరోగ్య సమస్యలకారణమై, ఆరోగ్యాన్ని పాడు చేసే ధూమపానంవల్ల శరీరంలోకి హానికరమైన టాక్సిన్స్ చేరతాయి. ఫలితంగా మెలనిన్ ఉత్పత్తితో సహా సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. బొల్లి: ఈ చర్మ వ్యాధి సోకిన వారిలో రోగనిరోధక వ్యవస్థ వర్ణద్రవ్యం కణాలపై దాడి చేస్తుంది. ప్రధానంగా చర్మం,జుట్టు రంగును కూడా ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ : థైరాయిడ్ (హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం) ఉన్నవారిలో కూడా చిన్న వయసులోనే గ్రే హెయిర్ వచ్చే అవకాశః ఉంది. రక్తహీనత ,కీమోథెరపీ, ఇతర కొన్ని మందుల వల్ల కూడా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టుకు దోహదం చేస్తుంది. కెమికల్ ప్రొడక్ట్స్: రసాయనాలతోకూడిన బ్లీచ్ లేదా కలరింగ్ ఏజెంట్లను ఉపయోగించడం ,హెయిర్ ట్రీట్మెంట్స్ ఎక్కువైతే హెయిర్ షాఫ్ట్ దెబ్బతింటుంది . మెలనోసైట్లను ప్రభావితం చేయవచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్: రోగనిరోధక వ్యవస్థను ప్రభావితంచేసే ఆటోఇమ్యూన్ వ్యాధులు, లోపాలవల్ల కూడా తెల్లజుట్టు తొందరగా వచ్చేస్తుంది. అలోపేసియా అరేటా లాంటి డిజార్డర్ కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోవడంతో పాటు తెల్ల జుట్టు, ఇంకా పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి. కాలుష్యం: వాయు, ఇంధన కాలుష్యం లాంటి పర్యావరణ కాలుష్య కారకాలు జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ కాలుష్య కారకాలు ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఫలితంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. నోట్: ఈ కారణాల్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, లోపాలేంటో గమనించండి. వీలైతే పరిష్కరించుకోండి. దీంతో పాటు చక్కటి ఆహారం, నిద్ర, క్రమం తప్పని వ్యాయామం లాంటి నిబంధనలు పాటించండి. అదీ కానపుడు.. ఇపుడు గ్రే హెయిర్ కూడా ఒక ఫ్యాషనోయ్... అనుకుంటూ ముందుకుసాగిపోండి జాలీగా..! -
సూసైడ్ హెడేక్: ఈ 'తలనొప్పి'తో అంత ఈజీ కాదు!
బీపీ వల్లనో లేదా నిద్ర సరిగా పట్టకపోవడం వల్లో కాస్త తల నొప్పిగా ఉంటుంది. కొంతమందకి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్న ఈ భయానక తలనొప్పిని అనుభవిస్తారు. తలలో కంతుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉత్తిపుణ్యానికి వచ్చే తలనొప్పి ఒకటి ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే..భరించలేక ప్రజలు కెవ్వుకెవ్వుమని అరుస్తూనే ఉంటారట. కొందరైతే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని వైద్యుల చెబుతున్నారు. ఇలాంటి తలనొప్పి బారినే డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి పడ్డాడు. దీంతో అతని జీవితం గందరగోళంగా మారిపోయింది. ఆఖరికి వైద్యులు సైతం దీనికి మందు లేదని జీవితాంత ఆ వ్యాధిని భరించాల్సిందేనని షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నారు. యూకేకి చెందిన డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి 17 ఏళ్లుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈనొప్పిని తట్టుకోలేక ఆయన గట్టిగా అరవడం, తలను గోడకేసి బాదుకోవడం వంటివి చేసేవాడని తెలిపాడు. తలపై బేస్‌బాల్ బ్యాట్‌తో గట్టిగా కొడుతున్నట్లు, కత్తితో కంట్లో పొడుస్తున్నట్లు ఆ నొప్పి ఉంటుందని ఈ 53 ఏళ్ల డారెన్ చెబుతున్నారు. ఆయన ఒక హార్టికల్చర్ఇంజనీర్. ఆయన ప్రతీక్షణం ఈ తలనొప్పి మళ్లీ ఎప్పుడూ వస్తుందో అన్న భయంతో బతుకుతున్నాడు. ఈ తలనొప్పి ఎప్పుడైన రావచ్చొనే సంగతి నాకు తెలుసు గానీ, ఇలా భయంతో బతకడం మాత్రం నరకంగా ఉందని ఆవేదనగా చెప్పారు డారెన్. ఆ నొప్పి 15 నిమిషాల నుంచి మూడు గంటల పాటు ఉంటుందని చెప్పారు. ఇది మొదటగా తన తలకు ఎడమ కన్నుపై నుంచి ప్రారంభమై తర్వాత కన్ను నీరు కారడం మొదలవ్వుతుందని తెలిపారు. ఎవరో కంటిలోపల కత్తితో గుచ్చుతున్న భావన కలిగి, దిండుని పట్టుకుని తట్టుకోలేక అరుస్తుంటానని చెప్పుకొచ్చారు. ఈనొప్పి వచ్చినప్పుడూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో ఈ బాధ మరింత ఎక్కువయ్యిందని అన్నారు. ఈ తలనొప్పిని వైద్య పరిభాషలో 'క్లస్టర్ తలనొప్పి లేదా సూసైడ్ తలనొప్పి' అంటారు. దీని కారణంగా అనుభవించే మానసిక వేదన చనిపోవాలనిపిస్తుంది కాబట్టి ఆ వ్యాధికి ఆ పేరు వచ్చింది. క్లస్టర్ హెడేక్స్ అంటే.. క్లస్టర్ తలనొప్పులు అరుదైనవి. వెయ్యి మందిలో ఒకరిని ఈ నొప్పి వేధిస్తుంటుంది. యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు అంచనా. తలనొప్పి కంటే ఇది చాలా తీవ్రమైనదని బ్రెయిన్ రీసెర్చ్ యూకే రీసెర్చి మేనేజర్ కేటీ మార్టిన్ అన్నారు. బాధితుడు డారెన్ వివరించినట్లుగా క్లస్టర్ అటాక్ వల్ల కలిగే నొప్పి భరించలేనిది. ఆ నొప్పిని తట్టుకోలేక ప్రజలు అరుస్తారు, గోడలకు తలను బాదుకుంటారు. బాధితులకు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందించేందుకు కొత్త చికిత్సల కోసం అవసరమైన పరిశోధనల కోసం తాము నిధులు సమకూర్చుతున్నాం అని పరిశోధకుడు కేటీ మార్టిన్ చెబుతున్నారు. ఈ తలనొప్పి మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిసిస్తుంది. బాధితులు 30 ఏళ్లు పైబడినవారై ఉంటారు. నొప్పి వచ్చే తీరు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి కొన్ని రోజుల వ్యవధిలో ఒకసారి నొప్పి వస్తే, కొన్నిసార్లు ఒకే రోజులో పలుమార్లు ఈ నొప్పి వస్తుంది. అయితే నొప్పి వచ్చిన ప్రతీసారి 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు అది కొనసాగవచ్చు. నొప్పితో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి రావొచ్చు. ఇది ప్రజల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగానికి దారి తీస్తుంది. దీనివల్ల డిప్రెషన్ వచ్చే ముప్పు మూడు రెట్లు పెరుగుతుంది. పైగా ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పుతున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే దీనికి చికిత్స లేదని చెబుతున్నారు. ఇక్కడ డారెన్ కూడా జీవితాంతం ఆ తలనొప్పిని భరించాల్సిందే అని తెలిపారు. వైద్యుల దీనికి మంచి చికిత్స కనిపెట్టే క్రమంలో ఆయనపై ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. ఆ నొప్పి ఉశమించేలా స్టెరాయిడ్స్, లిథియం సహా గుండె సంబంధిత మందులు, మూర్చకు ఇచ్చే మందులను సైతం వైద్యులు సూచించినట్లు డారెన్ చెబుతున్నాడు. అయితే అవేమి పనిచేయ లేదని అన్నాడు. చివరికి వైద్యులు తనకు ఇంజెక్షన్‌ని సిఫార్సు చేశారు. ఒక్కోసారి అది పనిచేస్తుంది. ఒక్కోక్కసారి అది కూడా పని చేయదని బాధగా చెబుతున్నాడు. అలాగే మత్తుమందులు నరాలను మొద్దుబారేలా చేయగా, స్టెరాయిడ్స్ ఒక ఏడాది వరకు తలనొప్పి రాకుండా ఆపగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా డారెన్ వైవాహిక జీవితం కూడా దెబ్బతింది. ప్రస్తుతానికి వైద్యులు చికిత్సలో భాగంగా ఆయనకు తలలో ఒక నర్వ్ బ్లాక్‌ను ఇంజెక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు కూడా లేవు. ఇక్కడ డారెన్ వైద్యలు సరైన చికిత్సా విధానం కనుగొనేంత వరకు ఆయన ఈ తలనొప్పితో జీవించాల్సిందే. అయితే యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు నివేదికలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..) -
అమ్మకు, అమ్మమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కచ్చితంగా వచ్చేస్తుందా?
నాకు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. మా అమ్మకు, అమ్మమ్మకు 50వ ఏట బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాకు కూడా అలా వచ్చే చాన్స్ ఉందా? ఎలాంటి టెస్ట్‌లు చేయించాలి? టెస్ట్‌ల ద్వారా ముందుగా కనుక్కోవచ్చా? – జి. చిన్ని, ఎమ్మిగనూరు కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఆ కుటుంబ సభ్యులు 25వ ఏట నుంచే గైనకాలజిస్ట్‌ని లేదా జెనెటిక్ కౌన్సెలర్‌ని కలవాలి. ఇప్పుడు ఫ్యామిలీ క్యాన్సర్ క్లినిక్స్, జెనెటిక్ క్లినిక్స్ చాలా చోట్ల ఉంటున్నాయి. ఈ రకమైన కన్సల్టేషన్‌లో.. మీ కుటుంబంలో ఏవిధమైన క్యాన్సర్ ఉంది? అది వంశపారంపర్యంగా మీ జీవితం కాలంలో మీకు వచ్చే చాన్స్ ఎంత? ఎలాంటి టెస్ట్‌తో ముందే కనిపెట్టి చెప్పవచ్చు? ఏ టెస్ట్‌తో నివారించవచ్చు? వంటివాటితో రిస్క్‌ను అంచనా వేస్తారు. కొన్ని జన్యుపరమైన పరీక్షలను సూచిస్తారు. కేవలం 5 శాతం బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రమే వంశపారంపర్యంగా వస్తాయి. కుటుంబంలో ఆల్టర్డ్ జీన్ కనుక ఉంటే తర్వాత తరానికీ బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్స్‌కి చాలా వరకు వంశ పరంపర ఉండదు. మీ కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంది కాబట్టి మీరు ప్రతి నెలసరి తరువాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామూలుగా అయితే దీన్ని 40 ఏళ్లకి మొదలుపెడతారు. 50 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏడు ఈ పరీక్షను చేయించుకోవాలి. 50–70 ఏళ్ల మధ్య ప్రతి మూడేళ్లకోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామోగ్రఫీ అంటే ఎక్స్ రేతో చేసేది. అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. నొప్పిలేని లంప్ ఏదైనా చేయికి తగిలినా.. బ్రెస్ట్ సైజ్, షేప్ మారినా, స్కిన్‌లో తేడా కనిపించినా.. నిపిల్ డిశ్చార్జ్ ఉన్నా.. చంకల్లో వాపు ఉన్నా.. వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. పెయిన్ అనేది చాలావరకు క్యాన్సర్ సింప్టమ్ కాదు. జీన్ టెస్టింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వశపారంపర్య బ్రెస్ట్ క్యాన్సర్‌కి ముఖ్యంగా బీర్సీఏ 1, బీఆర్సీఏ 2 జీన్స్ కారణం. ఇవి మీలో జీన్ చేంజెస్ అయినాయా లేదా అని జెనెటిక్ పానెల్ టెస్ట్ చేసి తెలుసుకుంటారు. జీవనశైలిలో మార్పు ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించవచ్చు. ఎత్తుకు తగిన బరువును మెయిన్టేన్ చేయడం, కనీసం 30 నిమిషాల వ్యాయామాన్ని వారానికి కనీసం అయిదురోజులు చేయడం, పౌష్టికాహారం వంటివన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడానికి దోహదపడతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?) -
మన ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ మయమా? అదే సుగర్‌కి కారణమా?
పెద్ద పెద్ద ఆహార నిపుణులని పిలవబడేవాళ్ళందరూ భారతీయ ఆహారంలో ప్రొటీన్లు లేవు, పిండిపదార్థాలే ఎక్కువ ఇవే మధుమేహానికి కారణం అని ఊదరగొట్టి భయపెడుతుంటారు. అది నిజం కాదు అంటూ ట్విటర్ ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రముఖ వైద్యులు శ్రీకాంత్ మిరియాల. ఆ వివరాలు మీకోసం యథాతథంగా . డా. శ్రీకాంత మిర్యాల ట్విటర్లో షేర్ చేసిన వివరాలు ►ప్రొటీన్లు అనేవి మన శరీర నిర్మాణానికే కాకుండా దేహంలో ఎన్నో జీవక్రియలు చేస్తుంటాయి. ఈ ప్రొటీన్లు ఉన్నపళంగా ఆహారంలోనివి మన ఒంట్లోకి చేరుకోవు, చేరుకున్నా అవి మన ప్రోటీన్లు కావు కాబట్టి దానికి మన దేహం వాటికి ప్రతిచర్య చూపిస్తుందే కానీ వాడుకోవు దాన్ని. ► ప్రొటీన్లు అనేవి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి, ఇవేంటంటే గోడలో ఇటుకల్లా ఒక్కో అమైనో ఆమ్లం ఇంకో దాంతో జతచేరి అలా పొడవైన గొలుసులు ఏర్పడి, అ గొలుసులు మడతపడి గట్టి లేదా మెత్తటి ప్రొటీన్లు తయారవుతాయి. బాక్టీరియా, మొక్కలు, జంతువులు, మనిషి ఎవరైనా ఇదే పద్ధతి. ఇప్పుడు మనం ఈ ప్రోటీన్లని తిన్నప్పుడు మన జీర్ణాశయం వాటిని ముక్కలు చేసి, పేగుల్లో ఆ ప్రోటీన్లు జీర్ణం అయ్యి అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైనవాటిని మనశరీరం శోషించుకుని వాడుకుని మనకి కావలసిన ప్రొటీన్లని తయారుచేసుకుంటుంది. ► మొత్తంగా ఈ అమైనో ఆమ్లాలు ఇరవై ఉంటాయి. వీటిలో తొమ్మిది మాత్రమే ఆవశ్యకమైనవి. అంటే మిగతా 11 మనదేహం తయారుచేసుకుంటుంది. ఆ తొమ్మిది మాత్రం ఆహారంలోంచి తీసుకోవాలి. ► భారతీయ ఆహారం చాలా వైవిధ్యమైనది. ఇందులో మనకి కావాల్సిన అన్ని పోషకాలుంటాయి. కాకపోతే అవి తినే మోతాదు సరిచూసుకోవాలి. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయాధారిత జనాభా కాబట్టి పనిచేసేందుకు చాలా శక్తి అవసరం అందుకోసం పిండిపదార్థాలు ఎక్కువ తీసుకునేవాళ్లు. ఇప్పుడు దాదాపు 30-40% జనాభా పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు. వీరి రోజువారీ పనిలో శ్రమ వ్యవసాయమంత ఉండదు కానీ పాత మోతాదులోనే అన్నం, గోధుమలు తినడం వలన శక్తి ఖర్చవక ఊబకాయం వస్తోంది. ► పూర్వం నూనె ఖరీదైంది అందువలన భారతీయ వంటకాల్లో దాని వాడకం తక్కువ, కానీ ఇప్పుడు మెల్లిగా నూనె వాడకం ఎక్కువయ్యి ఉడికించిన కూరల బదులు వేపుళ్లు, అలాగే నూనెలో మునిగితేలి వేయించిన పిండి పదార్థాలు ఎక్కువయ్యాయి. ఐది కూడా ఊబకాయానికి దారి తీస్తోంది. ► కాబట్టి పాత పద్ధతిలో సమతుల్య ఆహారం తింటూ వ్యాయామం ద్వారా ఎక్కువ శ్రమ చెయ్యగలిగితే భారతీయ ఆహారం, అది యే రాష్ట్రానిదైనా మంచిదే. -
పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాణాంతక వ్యాధా? ఎలా నివారించాలి?
పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ)ని ఆయుర్వేద వైద్యంలో "కంపా వట" అని పిలుస్తారు, ఇది శరీరం యొక్క అవయవాలు అతిశయోక్తి కదలికలను ప్రదర్శిస్తాయని అర్థం. పీడీ అనేది కేంద్ర నాడీ వ్యవస్థ క్షీణించిన వ్యాధి, ఇది మోటారు నైపుణ్యాలు, ప్రసంగం మరియు అనేక ఇతర విధులను ప్రభావితం చేస్తుంది, ఇది ప్రధానంగా డోపమైన్-ఉత్పత్తి చేసే కణాల నష్టం కారణంగా సంభవిస్తుంది. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.! పార్కిన్సన్స్ వ్యాధి అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక క్షీణత అనే రుగ్మత. ఇది ప్రధానంగా మోటారు వ్యవస్థను, అనగా శరీర అవయవ చలనమును ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్ర పడే కొద్ది, నాన్ మోటార్ లక్షణాలు సర్వసాధారణం అవుతాయి. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా బయటపడతాయి..వ్యాధి ప్రారంభంలో, చాలా స్పష్టమైన లక్షణాలు అంటే వణుకు, బిగుసుకు పోవడం , కదలిక మందగించడం, నడకలో ఇబ్బంది వంటివి ఉంటాయి. ఆలోచించడం, ప్రవర్తనా సమస్యలు కూడా సంభవించవచ్చు. వ్యాధి ప్రారంభదశల్లో చిత్తవైకల్యం, జ్ఞాపక శక్తి తగ్గటం సాధారణం అవుతుంది. లక్షణాలు: కండరాల దృఢత్వం వణుకు నెమ్మదిగా శారీరక కదలిక (బ్రాడికినిసియా) మరింత తీవ్రమైన సందర్భాల్లో భౌతిక కదలిక (అకినేసియా) తోపాటు సంతులనం పూర్తిగా కోల్పోవడం. సాధారణ నిర్వహణ: విటమిన్ ఇ, బి12, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి ఎందుకంటే ఈ పోషకాలు మొత్తం మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఉదా. అవకాడో, సాల్మన్, సార్డిన్, అవిసె గింజలు, నానబెట్టిన గింజలు మొదలైనవి. బెర్రీలు, తాజా సాల్మన్ మొదలైన యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ తీసుకోండి. అశ్వగంధ, కర్కుమిన్ కూడా ఈ పరిస్థితికి చాలా సహాయకారిగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి దూలగొండి (ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens(కపికచ్చు)), దాని సహజ L-డోపా కంటెంట్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి ప్రామాణిక ఔషధ చికిత్సలో ఎల్-డోపా కీలకమైన భాగం. --ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్) -
కాపాడే కన్నీరు పొడిబారితే..!
కన్ను ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఏదైనా కాస్త తగలగానే కళ్లల్లోంచి నీళ్లు కారిపోతుంటాయి. కన్ను పొడిబారితే ప్రమాదమని ప్రకృతి ఈ కన్నీళ్లను ఏర్పాటు చేసింది. నిత్యం ఏసీ గదుల్లో ఉండటం, కంప్యూటర్దో, ల్యాప్టాప్లదో, ఆఖరికి మొబైల్ స్క్రీన్నో ఎప్పుడూ చూస్తూ ఉండటంతో పాటు... కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు, జబ్బులు ఉన్నప్పుడు కూడా కన్నుపొడిబారుతుంది. ఇలా పొడిబారడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చేందుకూ, ఒక్కోసారి చూపు కోల్పోయేందుకూ అవకాశముంది. కన్ను పొడిబారే సమస్యను వైద్య పరిభాషలో ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’(డ్రై ఐ) అని చెబుతారు. ఈ కండిషన్ అవగాహన పెంచుకుని, కంటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. కంటిని తడిగా ఉంచడానికి లాక్రిమల్ గ్లాండ్స్ అనే ప్రధాన కన్నీటి గ్రంథితో పాటు మ్యూసిన్ గ్లాండ్స్, మొబిమియన్ గ్లాండ్స్ అనే మరో రెండు రకాల గ్రంథులూ తోడ్పడతాయి. ఇందులో లాక్రిమల్ గ్లాండ్స్ నీటి మోతాదులెక్కువగా ఉండే కన్నీటినీ, మ్యూసిన్ గ్లాండ్స్ కాస్త జిగురుగా ఉండే పదార్థ్ధాన్నీ, ఇక మెబొమియాన్ గ్లాండ్స్ అనేవి కాస్త నూనెలా ఉండే పదార్థాన్ని (ల్యూబ్రికెంట్గా ఉపయోగపడేందుకు) స్రవిస్తాయి. ఈ మూడూ కలిసి పూర్తి కన్నీటి స్రావాలకు కారణమవుతాయి. గ్రంథుల పనితీరు మారుతుండే లోపాలు... ఈ మూడు గ్రంథుల పనితీరుల్లో, దేనిలో లోపం వచ్చినా... కన్నీటి నాణ్యత దెబ్బతింటుంది. ఏయే గ్రంథుల్లో లోపాలుంటాయో, దాన్ని బట్టి కన్నుపొడిబారడమనే ప్రక్రియలోనూ తేడాలొస్తాయి. ఉదాహరణకు... లాక్రిమల్ గ్లాండ్ కన్నీటిలోని నీళ్లను స్రవిస్తుంది. కాబట్టి దీనిలో లోపంతో కన్నీటిలోని నీరు మోతాదులు తగ్గుతాయి. మ్యూసిన్ తగ్గితే ‘టియర్ బ్రేకింగ్ టైమ్’ తగ్గుతుంది. అంటే కన్నీరు స్రవించాక అది ఓ పొర (ఫిల్మ్)లా ఏర్పడి... కొంతసేపు కన్ను ఉపరితలం మీద ఉంటుంది. ఏర్పడ్డ తర్వాత ఆ ఫిల్మ్ ఎంతసేపు ఉంటే... కంటికి అంత రక్షణ. ఇక కన్ను త్వరగా పొడిబారుతుందంటే... (అంటే నీరు త్వరత్వరగా ఆవిరైపోతుందంటే) మెబోమియన్ గ్లాండ్స్ పనితీరు తగ్గిందని అర్థం. బయట గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు (విసురుగా గాలి వీస్తున్నప్పుడు), టూవీలర్ డ్రైవింగ్‌లో కన్నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. కానీ జీవనశైలి మార్పులతో అంటే ఏసీలు, స్క్రీన్‌ను చాలాసేపు చూడటం, పొగతాగడం వంటి అలవాట్లతో ఆవిరి కావడం పెరుగుతుంది. దీన్నే ‘ఎవాపరేటివ్ డ్రై ఐ’ అంటారు. కన్ను పొడిబారడానికి మరికొన్ని కారణాలు... కన్ను పొడిబారడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి... ∙వయసు పైబడటం: వయసు పెరుగుతున్న కొద్దీ కన్ను పొడిబారడమూ పెరుగుతుంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఇది ఎక్కువ. ∙కొన్ని వైద్య సమస్యలు: థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సాధారణ ఆటోఇమ్యూన్ సమస్యలు, కొలాజన్ వాస్క్యులార్ డిసీజ్, దీర్ఘకాలిక డయాబెటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమటోసిస్ వంటి రుగ్మతలు ఉన్నవారిలో, కీళ్లనొప్పులతో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువ. కొన్ని రకాల మందులు: యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జైటీని తగ్గించే మందులు, శరీరంలో నీటిని బయటకు పంపించే డైయూరెటిక్స్, మహిళల్లో గర్భనిరోధక మందులు, స్టెరాయిడ్స్, దీర్ఘకాలం పాటు గ్లకోమాకు మందులు వాడేవారిలో... ఇలా అనేక మందులతో ఈ సమస్య పెరుగుతుంది. జీవనశైలి మార్పులతో : ∙ ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం కనురెప్పలను తక్కువగా కదిలించడం... కంప్యూటర్‌పైనా లేదా ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్ వరకూ ఏదైనా స్క్రీన్‌ను ఎక్కువగా సేపు చూస్తుండటం, మైక్రోస్కోప్ వంటి ఉపకరణాలపై ఎక్కువగా పనిచేయడం. ∙కనురెప్పలను పూర్తిగా మూయలేకపోవడం. కంటికి గాయం కావడం వల్ల కనురెప్పలను తగినంత కదిలించలేనప్పుడు. ∙కనురెప్ప అంచుల్లో ఇన్ఫెక్షన్ (బ్లెఫరైటిస్) ఉన్నవారిలో కన్ను పొడిబారడం ఎక్కువ. ∙కంటికి లేజర్ చికిత్స చేయించుకున్నవారిలో మొదటి మూడునెలల్లో మాత్రం కన్నుపొడిబారే సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక కొందరిలో కారణాలేవీ కనిపించకుండానే ఈ సమస్య రావచ్చు. కళ్లలో మంట: కళ్లలో తగినంతగా నీరు స్రవించనప్పుడు కళ్లు మంటలు వస్తాయి. కానీ కళ్లు ఎర్రబారవు. మసక బారడం: కొందరిలో చూపు కాస్తంత మసకబారవచ్చు. వెలుగును చూడలేకపోవడం: ఎక్కువ వెలుగును చూడలేకపోవడం, ప్రకాశవంతమైన కాంతిని భరించలేకపోవడం. కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకునేవారిలో: కాంటాక్ట్‌లెన్స్‌లు వాడటంలో ఇబ్బందిగా ఉండటం. ఇబ్బందులివీ.. కన్ను పొడిబారడం వల్ల వచ్చే సమస్యలు అందరిలో ఒకేలా ఉండవు. ఈ కింద పేర్కొన్న వాటిలో కొన్ని కనిపించవచ్చు. ∙కొందరిలో కంటిపైన ఉండే కంజెక్టివా పొరలో ఇన్ఫెక్షన్ రావచ్చు. (కంజంక్టివైటిస్). ∙కొందరిలో కార్నియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సమస్య తీవ్రతను బట్టి కొందరి కళ్లలో చిన్న చిన్న పుండ్లు రావచ్చు. చాలా అరుదుగా కొందరిలో కార్నియా దెబ్బతినే ప్రమాదంకూడా ఉండవచ్చు. నిర్ధారణ ఇలా... లక్షణాలను బట్టి కంటి డాక్టర్లు సమస్యను నిర్ధారణ చేస్తారు. అయితే కొందరిలో కొన్ని రకాల ఇతర వ్యాధుల వల్ల (జోగ్రన్స్ సిండ్రోమ్ వంటి వాటి కారణంగా) ఇలా జరుగుతుందేమో అని చూస్తారు. అందుకే కన్ను పొడిబారిన లక్షణాలు ఉండేవారికి వ్యాధి నిర్ధారణ చేసే సమయంలో అనేక ఇతర లక్షణాలను కూడా డాక్టర్లు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ష్కిర్మర్ టియర్ టెస్ట్: కొన్ని సందర్భాల్లో ష్కిర్మర్ పరీక్షతో దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో ఒక రకం ఫిల్టర్ పేపర్‌ను కంటి కిందివైపు రెప్ప కింద ఐదు నిమిషాల పాటు ఉంచుతారు. ఆ వ్యవధిలో ఆ పేపర్ ఎంత తడి అవుతుందో పరిశీలించడం ద్వారా లాక్రిమల్ గ్లాండ్ లోపాల్ని పరీక్షిస్తారు. టియర్ బ్రేకప్ టైమింగ్ : కంటి ఉపరితలంపై ఏర్పడే టియర్ ఫిల్మ్ ఎంతసేపటికి బ్రేక్ అవుతుందో తెలుసుకునే ఈ పరీక్షతో మ్యూసిన్ గ్రంథి లోపాలను తెలుసుకుంటారు. మెబోమియోగ్రఫీ : ఈ టెస్ట్‌తో మెబోమియన్ గ్రంథి లోపం తెలుస్తుంది. ఓసీటీ : ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ (ఓసీటీ) అనే పరీక్ష ద్వారా టియర్ ఫిల్మ్ మందం ఎంత ఉందో తెలుసుకుంటారు. చికిత్స... గతంలో కన్నీటిని స్రవించే చుక్కల మందులు, జెల్స్‌తో చేసే చికిత్స స్థానంలో ఇప్పుడు ఏయే గ్రంథి లోపాలు ఏమిటో తెలుసుకుని, వాటికి అనుగుణంగా చేసే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు... కృత్రిమ కన్నీటి మందులు: కృత్రిమంగా కన్నీళ్లను పెంచే చుక్కల మందులు, జెల్ రూపంలో లభ్యమయ్యే మందుల్ని వాడటం ద్వారా డాక్టర్లు లాక్రిమల్ గ్లాండ్ పనితీరును చక్కదిద్దుతారు. ‘సైక్లో ఇమ్యూన్ ఐ డ్రాప్స్’ కూడా డ్రై ఐ చికిత్సకు ఉపయోగపడతాయి. అలాగే లాక్రిమల్ ప్లగ్స్‌ను వాడతారు. వీటివల్ల కన్నీళ్లు ముక్కులోకి జారిపోవు. దాంతో అవి కళ్ల లోనే ఎక్కువసేపు ఉండి కళ్లను తడిగా ఉంచుతాయి. ఇక మ్యూసిన్ గ్రంథి పనితీరు మెరుగుపరచడానికి ‘సెక్రిటోగ్యాగ్స్’ అనే ఉపకరణాలు ఉపయోగిస్తారు. మొబోమియన్ గ్లాండ్స్ పనితీరును మెరుగుపరచడానికి కొన్ని రకాల మసాజ్‌లు, థెర్మో థెరపీలతో పాటు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడతారు. డ్రై ఐ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారిలో సంప్రదాయ చికిత్సలతో తగ్గనప్పుడు బాధితుని నుంచి సీరమ్ (ఆటోలాగస్ సీరమ్) సేకరించి, చుక్కల రూపంలో వాడతారు. ∙శస్త్ర చికిత్స : ఈ చికిత్సలో భాగంగా నోటిలోని అతి మృదువైన పొరలను తీసి, కంటిలో అమర్చి... పరిస్థితిని చక్కబరుస్తారు. ఇవేకాకుండా... పని ప్రదేశాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, కంప్యూటర్ ముందు కంటిని హాని తక్కువగా ఉండేలా ఎలా కూర్చోవాలో, తగిన వ్యాయామాలేమిటో, బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి పనిచేసే గదిలో తేమ (హ్యుమిడిటీ) పెంచుకోవడం... ఇవన్నీ బాధితులకు కౌన్సెలింగ్‌లో డాక్టర్లు చెబుతారు. కన్నుపొడిబారిపోవడం వల్ల ఒక్కోసారి చూపుకోల్పోవడం లాంటి పెను ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకే కన్నుపొడిబారుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు వాడాలి. ∙ (చదవండి: ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే? తలెత్తే సమస్యలు.. -
‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే?
కొన్ని వ్యాధులు ప్రధానంగా చర్మం, ఎముకలు, కీళ్లు, కండరాల వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్ అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమాహారాన్ని కలిపి ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్’గా చెబుతారు. వీటిల్లో జోగ్రన్స్ డిసీజ్, సిస్టమిక్ స్మ్లికరోసిస్, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్‌తో పాటు వెజెనెర్స్, పాలీకాండ్రయిటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బులు ఉంటాయి. ఇవి తమ ఆటో యాంటీబాడీస్ కారణంగా ఎముకలనూ, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. పురుషులతో పోలిస్తే ఇవి మహిళల్లోనే ఎక్కువ. ఈ కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్ లక్షణాలూ, ఇవి చేసే హానీ, వీటికి చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్‌లో ప్రధానమైనది లూపస్ అని పిలిచే వ్యాధి. లూపస్ అంటే తోడేలు అని అర్థం. ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలులా కనిపించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లూపస్ అంటారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న కీళ్లపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు... లూపస్‌లో కనిపించే ఈ (మాలార్) ర్యాష్ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరగవచ్చు. కొందరిలో వెంట్రుకమూలాలు మూసుకుపోతాయి. లూపస్‌లో ఇది ఒక రకం. దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా కూడా ర్యాష్ రావచ్చు. తరచూ జ్వరం వస్తుంటుంది. బరువు తగ్గుతుంది. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో దీన్ని ఓ మానసికమైన లేదా నరాలకు సంబంధించినది సమస్యగా పొరబాటు పడేందుకు ఆస్కారం ఉంది. అయితే డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి... మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమో తెలుసుకోవాలి. కొందరిలో ఫిట్స్ రావచ్చు. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పాటు మిగతా వాస్క్యులార్ జబ్బుల లక్షణాలు ఇలా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లను ప్రభావితం చేసి, వైకల్యానికి దారితీయవచ్చు. అప్పుడు సర్జరీతో మినహా దాన్ని చక్కదిద్దడం సాధ్యం కాకపోవచ్చు. అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరగడంతో గ్లకోమాకు దారితీయడం, కన్ను పొడిబారడం, రెటీనాకూ, తెల్లగుడ్డులోని స్కెర్లా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... కొలాజెస్ వాస్క్యులార్ డిసీజ్లోని లూపస్ పిల్లల్లోనూ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అంటారు. చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్‌ఎల్‌ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి రుమటాలజిస్టుల ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చి చికిత్స చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అందించాల్సిన చికిత్స. --డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..) -
ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?
‘సర్, చూడండీ.. అతను ఇక్కడే ఉన్నాడు. ఆ తలుపు చాటు నుంచి చూస్తున్నాడు’ అంది శోభ. నిజానికి అక్కడెవ్వరూ లేరు. అయినా ‘అతనెవరూ?’ అని అడిగాను. ‘తెలీదు సర్. కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఆఖరికి వాష్‌రూమ్‌కి కూడా. అందుకే స్నానం చేయడం కూడా మానేశా. ’‘ఎన్నాళ్ల నుంచీ ఇలా జరుగుతోంది? ’‘రెండు నెలల నుంచి సర్. ’‘ఇంకా ఏం జరుగుతోంది? ’‘నిన్ను చంపేస్తా అంటున్నారు సర్. ’‘ఎవరంటున్నారు? ’‘ఎవరో తెలియదు సర్. నాలోంచే మాటలు వినిపిస్తున్నాయి. చాలా భయమేస్తోంది. అందుకే ఎక్కడికీ వెళ్లడం లేదు. ’‘సర్లెండి. వాళ్లతో నేను మాట్లాడతాను’ అని ధైర్యం చెప్పా. శోభ ఒక గృహిణి. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. అందమైన కుటుంబం. అయితే గత రెండు నెలలుగా శోభ ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. తనతో ఎవరో మాట్లాడుతున్నారని, తనకు ఎవరో కనిపిస్తున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడుతూ తన గది నుంచి బయటకు రావడంలేదు. మొదట సర్ది చెప్పాలని ప్రయత్నించిన భర్త తన ప్రయత్నాలు విఫలం కావడంతో కౌన్సెలింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. శోభ డెల్యూజన్స్, హెలూసినేషన్స్తో బాధపడుతోందని అర్థమైంది. సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె స్కిజోఫ్రీనియాతో బాధపడుతోందని నిర్ధారించుకుని చికిత్సకోసం సైకియాట్రిస్ట్‌కు రిఫర్ చేశాను. తీవ్రమైన మానసిక రుగ్మత స్కిజోఫ్రీనియా తీవ్రమైన మానసిక రుగ్మత. అది మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తూ ఆలోచనలు, జ్ఞాపకశక్తి, ప్రవర్తనలో జోక్యం చేసుకుంటుంది. దానివల్ల రోజువారీ జీవితం కష్టంగా మారుతుంది. ఇది లక్షకు 220 మందిలో కనిపిస్తుంది. ప్రాణాంతకం కాదు. కానీ ప్రమాదకరమైన, హానికరమైన ప్రవర్తనలకు దారితీయవచ్చు. మూడింట ఒక వంతు మందిలో లక్షణాలు కాలక్రమేణా తీవ్రం అవుతాయి. పదిశాతం మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువల్ల సక్రమంగా చికిత్స చేయిస్తూ, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. మూడు ప్రధానకారణాలు.. స్కిజోఫ్రీనియాకు నిర్దిష్టంగా ఒక కారణమంటూ లేదు. వివిధ కారణాల వల్ల సంభవిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, తీవ్రమైన ఒత్తిడి కారణాలు కాగలవు. అలాగే గర్భధారణ సమయంలో తల్లి అనారోగ్యం, తక్కువ బరువుతో పుట్టడం వల్ల కూడా స్కిజోఫ్రీనియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. యుక్తవయసులో భారీగా గంజాయి వాడకం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కుటుంబంలో స్కిజోఫ్రీనియా ఉంటే వచ్చే ప్రమాదం ఎక్కువ. స్కిజోఫ్రీనియాకు మూడు ప్రధాన కారణాలు: 1. సెల్–టు–సెల్ కమ్యూనికేషన్ కోసం మీ మెదడు ఉపయోగించే రసాయన సంకేతాలలో అసమతుల్యత. 2. పుట్టుకకు ముందు మెదడు అభివృద్ధి సమస్యలు. 3. మెదడులోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్షన్లు నష్టపోవడం. శాశ్వత చికిత్స లేదు.. స్కిజోఫ్రీనియాను శాశ్వతంగా నయం చేసే చికిత్స లేదు. అయితే చికిత్సతో లక్షణాలను మేనేజ్ చేయవచ్చు. కొద్దిమంది పూర్తిగా కోలుకోవచ్చు. స్కిజోఫ్రీనియా చికిత్సలో సాధారణంగా యాంటీసైకోటిక్స్ మందులు ఉపయోగిస్తారు. ఇవి సెల్–టు–సెల్ కమ్యూనికేషన్ కోసం మెదడు స్రవించే రసాయనాలను అడ్డుకుంటాయి ∙కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) వంటి టాక్ థెరపీ పద్ధతులు పరిస్థితిని ఎదుర్కోవటానికి సహాయపడతాయి. ఇతర చికిత్సలు పని చేయకపోతే వైద్యులు ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ (ఉఇఖీ)ని సిఫార్సు చేయవచ్చు ∙స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. వైద్యులు చెప్పకుండా ఆపకూడదు నిర్దేశించినట్లుగా డాక్టర్ని సంప్రదించాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా చర్చించాలి. ∙మద్యం, మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలి ∙కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. ఐదు ప్రధాన లక్షణాలు.. స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వ్యక్తులు లక్షణాలను గుర్తించలేరు. కానీ చుట్టూ ఉన్నవారు గుర్తించవచ్చు. దీనికి ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. వీటిలో ఏ మూడు లక్షణాలు నెలకు పైబడి కనిపించినా వెంటనే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. సైకోడయాగ్నసిస్తో పాటు వైద్య పరీక్షల అనంతరం నిర్ధారణ చేసుకోవాలి. 1. కొన్ని నమ్మకాలు తప్పు అని చాలా సాక్ష్యాలు ఉన్నప్పటికీ అవి నిజమేనన్న భ్రమలో ఉండటం. 2. ఎవరికీ వినిపించని స్వరాలను వినడం, ఎవరూ చూడలేని వాటిని చూడటం. అలాగే వాసన, రుచి చూడగలగడం. 3. ఆలోచనల్లో గందరగోళం వల్ల మాటల్లో కూడా స్పష్టత లేకపోవడం. అసంబద్ధంగా మాట్లాడటం. 4. చుట్టూ ఉన్న వ్యక్తులు ఊహించిన దానికంటే భిన్నంగా కదలడం లేదా ఎలాంటి కదలికలూ లేకుండా రాయిలా ఉండిపోవడం. 5. రోజువారీ పనులను చేయగల సామర్థ్యం తగ్గడం లేదా కోల్పోవడం. మాటల్లో, ముఖకవళికల్లో ఎలాంటి ఎమోషన్స్ చూపకపోవడం. 6. ఇంకా పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, అనుమానించడం, భయపడటం, నిరాశ, ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలు. సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
విపరీతమైన దగ్గు, ఆయాసంతో ఊపిరి సలపనివ్వడం లేదా? ఐతే ..
ఇది పొగచూరడం లాంటి ఏవో అడ్డంకులతో, ఊపిరిత్తుల్లో వచ్చే సమస్యతో, దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధితుల్ని వేధించే జబ్బు అని పేరును బట్టి తెలుస్తుంది. దగ్గు, ఆయాసంతో వ్యక్తమయ్యే ఈ సమస్య ప్రధానంగా పెద్దవారినే వేధిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక (జన్యు) కారణాలతో చిన్న వయసువారిలో కూడా కనిపించవచ్చు. పొగతాగే అలవాటుతో పురుషుల్లో, ఇంకా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ ఉంటే... ఈ కారణంగా మహిళల్లో ఈ జబ్బు కనిపించే అవకాశాలెక్కువ. అసలే దగ్గుతో ఊపిరి సలపనివ్వని ఈ సమస్య, చలి కాలంలోని చల్లటి వాతావరణానికి మరింత పెచ్చరిల్లే అవకాశం ఉంది. దీని పేరే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. సంక్షిప్తంగా సీఓపీడీ అని పిలిచే ఈ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. దగ్గు ప్రధానంగా లక్షణంగా వ్యక్తమయ్యే సీవోపీడీ సమస్య పెద్దల్లో... అందునా 40 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లూ, బీడీలూ, చుట్టలూ, హుక్కా కాల్చే వారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యాల్లో ఉండే దుమ్మూ, ధూళితో పాటు బొగ్గుగనులు, సిమెంట్, టెక్స్టైల్స్, రసాయనాల కాలుష్యం వెలువడే పరిశ్రమల దగ్గర ఉండేవారిలోనూ, ఆభరణాలకు పూతపూసే ఎలక్ట్రోప్లేటింగ్ వంటి కార్ఖానాల్లో పనిచేసేవారిలో కూడా ఇది ఎక్కువ. కారణాలు.. పొగతాగే అలవాటు ఉన్నవారిలో లేదా నిత్యం కాలుష్యాలకు ఎక్స్పోజ్ అవుతున్నవారిలో ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లే శ్వాసనాళాలు వాపునకు గురవుతాయి. దాంతో ఊపిరి సరిగా అందదు. లంగ్స్ నిండుగా, కాస్త బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటుంది. ఇక ఆస్తమా ఉన్న వ్యక్తులు సరైన చికిత్స తీసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోని సందర్భాల్లో... దీర్ఘకాలిక దుష్ప్రభావంగా సీవోపీడీ రావచ్చు. లక్షణాలు.. సీవోపీడీలో దగ్గు, ఆయాసాలు ప్రధాన లక్షణాలు. అయితే తీవ్రతను బట్టి ఇతరత్రా లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా తీవ్రతను బట్టి ఈ వ్యాధిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... గోల్డ్ 1 (మైల్డ్), గోల్డ్ 2 (మోడరేట్), గోల్డ్ 3 (సివియర్), గోల్డ్ 4 (వెరీ సివియర్). ఇక్కడ గోల్డ్ అనేది ‘గ్లోబల్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్’ అనే సంస్థకు సంక్షిప్త రూపం. ‘గోల్డ్’ సంస్థ... సీవోపీడీ మీద పరిశోధనలు చేస్తూ పల్మనాలజిస్టులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తుంది. సీవోపీడీ అనగానే కేవలం ఊపిరితిత్తుల సమస్య అనే అనుకుంటాం. కానీ బాధితులలో వివిధ అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలూ ఎక్కువే ఉంటాయి. మచ్చుకు... ఆస్టియో పోరోసిస్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కార్పెల్ పల్మొనాలె... మొదలైన సమస్యలతో ఇది కలిసి ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలను గుర్తిస్తూ, చికిత్స అందించాల్సి ఉంటుంది, దీనినే ‘సిండమిక్ అప్రోచ్’ అంటారు. ఈ నెలలోనే 2024కు సంబంధించిన కొత్త చికిత్స మార్గదర్శకాలను ‘గోల్డ్’ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ.. స్పైరోమీటర్ అనే పరికరం సహాయంతో సీవోపీడీని నిర్ధారణ చేస్తారు. దీనితో కొన్ని శ్వాస పరీక్షలు చేసి, సమస్య తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. అంటే మైల్డ్, మోడరేట్ లేదా సమస్య తీవ్రం (సివియర్)గా ఉందా అని తెలుసుకుంటారు. ఈ పరీక్షకు ముందరే... బాధితులను వ్యక్తిగతంగా / క్లినికల్‌గా పరీక్షించడంతో డాక్టర్లకు కొంత అవగాహన వస్తుంది. ఇలా చేసే క్లినికల్ పరీక్షల్లో బాధితుల వృత్తి వివరాలూ (ప్రొఫెషనల్ హజార్డ్స్), వారు పనిచేసే చోటు, వారుండే చోట కాలుష్య ప్రభావాలూ, పొగతాగడంలాంటి వారి అలవాట్లు... ఇవన్నీ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఐఓఎస్ అనే పరికరం ప్రారంభ దశలో ఉన్న సీవోపీడీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అపోహ–వాస్తవం ఈ వ్యాధి ఉన్నవారు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ ఉంటారు. దాంతో ఇదో అంటువ్యాధిలా అనిపిస్తుంది గానీ నిజానికి ఇది అంటువ్యాధి కానే కాదు. చికిత్స.. పేరులోనే దీర్ఘకాలిక సమస్య అని చెప్పే ఈ వ్యాధికి చికిత్స కూడా దీర్ఘకాలికంగానే అవసరమవుతుంది. సీవోపీడీ లక్షణాలు కనిపించినప్పుడు దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలు పెరిగేదాకా ఆగడం లాంటి నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి, సీవోపీడీని అంత తేలిగ్గా/సమర్థంగా అదుపు చేయవచ్చు. వాయునాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ (ఇన్హేలర్స్ / నెబ్యులైజర్స్)ను ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించగానే అవి శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత హాయిగా, తేలిగ్గా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. సీవోపీడీకి దీర్ఘకాలం చికిత్స అవసరం కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధి పూర్తిగా తగ్గినట్లుగా అనుకోకూడదు. లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించినట్లు ఫాలో అప్‌కు వెళ్తూ చికిత్స పూర్తయ్యేవరకు కొనసాగించాలి. నాన్ ఫార్మలాజికల్ థెరపీ.. సీవోపీడీతో బాధపడేవారిలో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దానిని క్లియర్ చేసే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది. హోమ్ ఆక్సిజన్ థెరపీ : ఇది చికిత్సలో మరో ప్రక్రియ. తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారికి 19 గంటల పాటు ఇంటి దగ్గరే ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది. పల్మునరీ రీ–హ్యాబిలిటేషన్: ఇది చికిత్సలో ఇంకో ప్రక్రియ. తేలిక నుంచి ఓ మోస్తరు వరకు అవసరమున్న వ్యాయామాలు (పర్స్ లిప్ బ్రీతింగ్), అబ్డామినల్ బ్రీతింగ్‌తో పాటు చిన్న బరువులతో కండరాలను బలంగా చేసే (మజిల్ స్ట్రెంతెనింగ్) వ్యాయామాలు చేయడం అవసరం. నివారణ.. పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండటం / అప్పటికే పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయడం మంచి నివారణ. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం/కళ్లె మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మోతాదు బాగా తగ్గి, పనిచేసే శక్తి, సామర్థ్యాలు తగ్గుతాయి. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) ∙ -
ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?
గత కొద్దికాలంగా జ్వరాలు, దగ్గు, జలుబుతో పాటు శ్వాస సరిగా అందకపోవడం వంటి ఫ్లూ లక్షణాలతో చాలామంది హాస్పిటళ్లకు పరుగులెత్తుతున్నారు. జ్వరం తగ్గాక కూడా పొడి దగ్గు, కొందరిలో కఫంతో కూడిన దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడంతో ఆందోళన పడుతున్నారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. బాధితుల నుంచీ ఇవే కంప్లెయింట్స్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఫ్లూ జ్వరాలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇవి ఎందుకిలా వస్తున్నాయి, లక్షణాలేమిటి, ముందస్తు నివారణకూ లేదా ఇప్పటికే వచ్చి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. ఫ్లూలాంటి జ్వరాలు... లక్షణాలూ, జాగ్రత్తలుఇటీవల వస్తున్న ఫ్లూలాంటి జ్వరాలన్నింటికీ ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణమని వైద్య నిపుణుల భావన. రెండుమూడేళ్ల కిందట వచ్చిన కరోనా వైరస్ తాలూకు తీవ్రత బాగా తగ్గిపోయి, పెద్దగా ప్రమాదకరం కాని కోవిడ్ కూడా ఈ జ్వరాల కారణాల్లో ఒకటి కావచ్చునని కూడా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. రాబోయేది చలికాలం కావడంతో ఇవే జ్వరాలు... దాదాపు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. లక్షణాలు : దాదాపు ఫ్లూ జ్వరాల్లో కనిపించే అన్ని లక్షణాలూ ఈ సీజనల్ ఫీవర్స్‌లో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు... ∙జ్వరం ∙తలనొప్పి ∙ఒళ్లునొప్పులు ∙గొంతునొప్పి ∙గొంతు కాస్త బొంగురుగా మారడం ∙కొన్నిసార్లు (తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఈ లక్షణాలు ఐదు నుంచి దాదాపు గరిష్ఠంగా పదిరోజులు ఉంటాయి. నిర్ధారణ పరీక్షలు / చికిత్స ముక్కు, గొంతు స్వాబ్‌తో కరోనా లేదా ఇతర ఇన్ఫ్లుయెంజా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని నిర్ధారణ చేయవచ్చు. తీవ్రత తక్కువగా ఉన్నవాళ్లకి (జ్వరం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు లక్షణాలు గలవారికి) ఇంటివద్దనే లక్షణాలకు తగినట్లుగా పారాసిటమాల్, ఓఆర్ఎస్, దగ్గు సిరప్‌లతో చికిత్స అందించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి అంటే... విపరీతమైన దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ తగ్గిపోవడం వంటి లక్షణాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించాలి. నివారణ / జాగ్రత్తలు: దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు తమ ఫుల్ స్లీవ్స్లోకి తుమ్మడం మంచిది. దీని వల్ల వైరస్ లేదా వ్యాధిని సంక్రమింపజేసే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. కరోనా సమయంలోలా వీలైతే జ్వరం, దగ్గు తగ్గేవరకు మాస్క్ ధరించడం మేలు. ∙దగ్గు లేదా తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు, తర్వాత చేతుల్ని 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి. దగ్గు/తుమ్ము సమయంలో ఒకరు వాడిన రుమాలును వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి. జలుబు లేదా ఫ్లూ లక్షణాలున్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి ∙బాధితుల పక్కబట్టలను, పాత్రలను విడిగా ఉంచాల్సినంత అవసరం లేదుగానీ... వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పాత్రలను మరొకరు వాడకపోవడమే మంచిది. బాధితుల్ని మిగతావారి నుంచి కాస్త విడిగా (ఐసోలేషన్) ఉంచటం మేలు. ∙ఇన్ఫ్లుయెంజాకు, కోవిడ్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాధి తీవ్రత తగ్గించడానికీ, హాస్పిటల్లో చేరికల నివారణకు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ఈ జ్వరాలు చాలావరకు పెద్దగా ప్రమాదకరం కావు. అరుదుగా ఎవరిలోనైనా పరిస్థితి మరీ తీవ్రంగా మారితే... తక్షణం బాధితుల్ని ఆసుపత్రికి తరలించాలి. వీళ్లలో తీవ్రత ఎక్కువ... ఇప్పటికే ఆస్తమా, దీర్ఘకాలిక లంగ్స్ సమస్యలు, బ్రాంకైటిస్, దీర్ఘకాలిక గుండెజబ్బులతో బాధపడేవారు, హార్ట్ ఫెయిల్యూర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ బాధితులు, దీర్ఘకాలిక కిడ్నీ/లివర్ వ్యాధులున్నవారు, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్‌లతో బాధపడుతూ స్టెరాయిడ్ చికిత్స తీసుకుంటున్నవారూ, లుకేమియా, సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవారు, వయోవృద్ధులూ వారితోపాటు ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు... వీళ్లందరి లోనూ లక్షణాల్లో తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిద్రలేమి, పల్స్ ఆక్సిమీటర్‌తో పరీక్షించినప్పుడు ఆక్సిజన్ శాచ్యురేషన్స్ తగ్గడం, ఆక్సిజన్ మోతాదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి బాధితుల్ని ఆసుపత్రులకు తీసుకురావాల్సిన అవసరమూ ఏర్పడుతుంది. డాక్టర్ వి రాజమనోహర్ ఆచార్యులు, సీనియర్ కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్ (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!) -
చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?
చిన్నారుల్లో ఫిట్స్ (సీజర్స్) రావడం సాధారణంగా చూస్తుండేదే. ఇలా ఫిట్స్ రావడాన్ని వైద్యపరిభాషలో ‘ఎపిలెప్సీ’గా చెబుతారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ... ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. ఈ సీజర్స్లోనూ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ అనేవి ఇంకాస్త వేరు. నాలుగేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్లో వచ్చే వీటి కారణంగా చిన్నారులు ఏ భంగిమలో ఉన్నా... ఉన్నఉన్నవారు ట్లుగానే వారు స్పృహ కోల్పోతారు. ఇవి పిల్లల్లో అకస్మాత్తుగా మొదలవుతాయి. హఠాత్తుగా వాళ్లను స్పృహలో లేకుండా చేస్తాయి. కనీసం 10 – 20 సెకండ్లు అలా ఉండిపోయి, మెల్లగా ఈలోకంలోకి వస్తారు. ఇలా హఠాత్తుగా కనిపించి, తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేసే ‘ఆబ్సెన్స్ సీజర్స్’పై అవగాహన కోసం ఈ కథనం. చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?పిల్లల్లో వచ్చే ఫిట్స్‌లో... ఆబ్సెన్స్ సీజర్స్ అనేవి కనీసం 20 నుంచి 25% వరకు ఉంటాయి. సాధారణంగా ఇవి జన్యుపరమైన (జెనెటిక్), జీవక్రియ పరమైన (మెటబాలిక్) సమస్యల వల్ల వస్తుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ‘ఆబ్సెన్స్ సీజర్స్’ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. అసాధారణంగా కొందరు చిన్నారుల్లో ఏడాదిలోపు వయసున్నప్పుడు కూడా ఇవి మొదలు కావచ్చు. చాలా మంది ఆరోగ్యకరమైన పిల్లల్లో హఠాత్తుగా మొదలైనప్పటికీ... కొందరు చిన్నారుల్లో మాత్రం... వారికి జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఫిట్స్‌తో ఇవి మొదలవుతాయి. అలాగే ఎదుగుదలలో లోపాలు (డెవలప్మెంటల్ డిలే) వంటి నాడీ సంబంధమైన సమస్యలున్నవారిలోనూ కనిపిస్తుంటాయి. ఇంక కొందరిలోనైతే... వాస్తవంగా కనుగొన్న నాటికి చాలా పూర్వం నుంచే... అంటే నెలలూ, ఏళ్ల కిందటి నుంచే ఇవి వస్తుంటాయి. కానీ తల్లిదండ్రులు (లేదా టీచర్లు) చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ... వీటినంత తేలిగ్గా గుర్తించడం సాధ్యం కాకపోవడంతో పిల్లలేదో పగటి కలలు కంటున్నారనీ, ఏదో వాళ్ల లోకంలో వాళ్లు ఉన్నారంటూ తల్లిదండ్రులు, టీచర్లు, లేదా పిల్లల్ని చూసుకునే సంరక్షకులు పొరబడుతూ ఉండవచ్చు. సాధారణ సీజర్స్‌లో అవి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆబ్సెన్స్ సీజర్స్‌లో అవి వచ్చిన దాఖలా కూడా స్పష్టంగా తెలియదు. కొన్ని సందర్భాల్లో చాలాకాలం వరకూ తెలిసిరాదు. ప్రేరేపించే అంశాలు... ఈ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ను కొన్ని అంశాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి... తీవ్రమైన అలసట వేగంగా శ్వాస తీసుకోవడం పిల్లలు టీవీ, మొబైల్ చూస్తున్నప్పుడు తరచూ హఠాత్తుగా మారిపోతూ ఉండే కాంతిపుంజాలూ, ఫ్లాష్లైట్ల కారణంగా... ఆబ్సెన్స్ సీజర్స్ రావచ్చు. ఆబ్సెన్స్ సీజర్స్ లక్షణాలు... ఈ సందర్భాల్లో పిల్లలు... అకస్మాత్తుగా చేష్టలుడిగి (బిహేవియర్ అరెస్ట్‌తో) నిశ్చేష్టులై ఉండిపోవడం ∙ముఖంలో ఎలాంటి కవళికలూ కనిపించకపోవడం ∙కళ్లు ఆర్పుతూ ఉండటం, ఒంటి మీద బట్టలను లేదా ముఖాన్ని తడబాటుగా చేతి వేళ్లతో నలపడం, నోరు చప్పరించడం, మాటల్ని తప్పుగా, ముద్దగా ఉచ్చరిస్తూ ఉండటం (ఫంబ్లింగ్), చేస్తున్నపనిని అకస్మాత్తుగా నిలిపివేయడం / ఆపివేయడం ∙బయటివారు పిలుస్తున్నా జవాబివ్వకపోవడం / ఎలాంటి స్పందనలూ లేకపోవడం పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాళ్లు బయటకు పూర్తిగా నార్మల్‌గానూ కనిపించవచ్చు. మాట్లాడటం మాత్రం చాలావరకు నార్మల్‌గా ఉండిపోవచ్చు. కొందరిలో మాత్రం కొంచెం అస్పష్టత కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ వారు ఆటలాడుకుంటున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడూ లేదా కొన్నిసార్లు నిద్రలో కూడా కొనసాగుతుంటాయి. చిన్నారులు అన్యమనస్కంగా ఉండటమో లేదా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించడాన్ని తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. నిర్ధారణ ఇలా... ఆబ్సెన్స్ సీజర్స్‌లో ఎన్నో రకాలున్నప్పటికీ... సాధారణంగా టిపికల్ (అంతగా సంక్లిష్టం కానివి), అటిపికల్ (సంక్లిష్టమైనవి) అనే రకాలు ఉంటాయి. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ఎమ్మారై (బ్రెయిన్) వంటి మరికొన్ని పరీక్షలతో వీటిని నిర్ధారణ చేయవచ్చు. ఇక అటిపికల్ రకాల విషయంలో ఇతర నాడీ సంబంధమైన సమస్యలనూ, జీవక్రియలకు(మెటబాలిక్) సంబంధించిన, జన్యుసంబంధమైన మరికొన్ని పరీక్షలతో పాటు మెదడు / వెన్నుపూస చుట్టూ ఉండే ద్రవం (సెరిబ్రో స్పైనల్ ఫ్లుయిడ్ – సీఎస్ఎఫ్)ను పరీక్షించడం ద్వారా ఈ (అటిపికల్) రకాన్ని తెలుసుకుంటారు. చికిత్స సమస్య నిర్దారణ అయిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఇందుకోసం ఫిట్స్ మందులు (యాంటీ సీజర్ మెడిసిన్స్) వాడాలి. వీటిని కనీసం రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడుతూ, బాధితుల మెరుగుదలను గమనిస్తూ, దాని ప్రకారం మోతాదును క్రమంగా తగ్గిస్తూ పోవాలి. ఈ మందులు చిన్నారుల్లో... కేవలం ఫిట్స్ తగ్గించడం మాత్రమే కాదు, వాళ్ల జీవన నాణ్యతనూ మెరుగుపరుస్తాయి. స్కూల్లో వాళ్ల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సామాజికంగా ఒంటరి కాకుండా... నలుగురితో కలిసిపోయేలా చేస్తాయి. మందుల గుణం కనిపిస్తోందా లేదా అన్న విషయాన్ని నిర్ణీత వ్యవధుల్లో ఈఈజీ తీయడం ద్వారా పరిశీలిస్తూ ఉండాలి. ఇక సహాయ చికిత్సలు (సెకండ్ లైన్ ట్రీట్మెంట్)గా వాళ్లకు కీటోజెనిక్ డైట్ (కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం) ఇవ్వడం, వేగస్ నర్వ్ అనే నరాన్ని ప్రేరేపించడం (వేగస్ స్టిమ్యులేషన్) జరుగుతుంది. దాదాపు 70 శాతం కేసుల్లో చిన్నారులు యుక్తవయసునకు వచ్చేనాటికి మంచి స్పందన కనిపిస్తుంది. (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!)