ప్రపంచవ్యాప్తంగా... ఆమాటకొస్తే భారతీయ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ విస్తృతియే చాలా ఎక్కువ. మొత్తం అన్ని రకాల క్యాన్సర్లను పరిగణనలోకి తీసుకుంటే రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యేవారు 28 శాతం ఉంటారని అంచనా. తాజా ‘గ్లోబకాన్’ లెక్కల ప్రకారం మన దేశంలో రొమ్ముక్యాన్సర్ల కేసుల సంఖ్య 1,78,361 కాగా దురదృష్టవశాత్తు దాని వల్ల 90,408 మరణాలు సంభవించాయి. అయితే కేవలం రొమ్ముక్యాన్సర్‌పై సరైన అవగాహన లేని కారణం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. సాధారణంగా మహిళల్లో 40 – 50 ఏళ్ల వయసప్పుడు వచ్చే ఈ రొమ్ముక్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తిస్తే దీని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని భరోసా ఇస్తున్నారు. అక్టోబరు నెల రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం కోసమే ఈ కథనం.
మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్)తో ΄ాటు మరికొన్ని అంశాలూ కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని...
రిస్క్‌ఫ్యాక్టరు...
సాధారణంగా రొమ్ముక్యాన్సర్‌కు కారణమయ్యే రిస్క్‌లో పెరిగే వయసు, దాంతోపాటు కుటుంబంలో రొమ్ముక్యాన్సర్లు ఉండటం, మొదటి నెలసరి చాలా త్వరగా రావడం, మెనోపాజ్ చాలా ఆలస్యం కావడం, జీవితకాలంలో పిల్లలు లేకపోవడం వంటివి. ∙చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌కు గురి అయ్యే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. ఐదు నుంచి పది శాతం కేసుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారిలోనే వస్తుండటం గమనార్హం. బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ 2 వంటి జెనెటిక్ మ్యూటేషన్లు ఉంటే ఆ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. ఇందులో బీఆర్‌సీఏ 1 జెనెటివ్ మ్యూటేషన్ వల్ల ముప్పు శాతం 72 % కాగా బీఆర్‌సీఏ 2 వల్ల 69% ముప్పు ఉన్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది.
ఇక నివారించగలిగే రిస్క్‌ఫ్యాక్టర్లలో స్థూలకాయం ∙ఆధునిక జీవౖనశెలిలో భాగంగా కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు ∙ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం ∙తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైన బిడ్డకు రొమ్ము పాలు పట్టించడం మేలు.
లక్షణాలు...
మహిళలు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి లేదా స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అవి హానికలిగించని (బినైన్) గడ్డలా, లేక హానికరమైనవా (మేలిగ్నెంట్) అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి.
రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం ∙రొమ్ము చర్మం మందంగా మారడం ∙రొమ్ములో సొట్ట పడినట్లుగా ఉండటం
రొమ్ము ఆకృతిలో మార్పులు ∙సమస్య ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్.
నిపుల్‌కు సంబంధించినవి: రొమ్ముపై దద్దుర్ల వంటివి రావడం నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటివి స్రవించడం
రొమ్ము పరిమాణంలో మార్పులు రావడం, వాటిలో గమనించగలిగే తేడా రావడం
బాహుమూలాల్లో :
గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం
చేతివాపు (లింఫ్ ఎడిమా)
ఇమ్యూనో థెరపీ, టార్గెట్ థెరపీ : శస్త్రచికిత్సతోపాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాధితులకు సరిపడే చికిత్సను డాక్టర్లు అందిస్తారు. వ్యాధి తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడం తోపాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ విషయంలో గతంలోలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కేన్సర్ ఎక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడు ‘నియో అడ్జువెంట్ థెరపీ’ అని ఇస్తారు. తర్వాతి చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండటం కోసం డాక్టర్లు ఈ చికిత్స ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ముందుగా ఆపరేషన్ చేయాలా, లేక కీమోథెరపీ ఇవ్వాలా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.
రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే కనుగొంటే 90% పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం ఉంది.
చికిత్స...
ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉండే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అ΄ోహ మాత్రమే.
ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి.
నిర్ధారణ పరీక్ష...
తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం ద్వారా మామోగ్రాఫీ అనే స్కాన్ ద్వారా
ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే పరీక్ష
పూర్తి నిర్ధారణ కోసం వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ)
ఛాతీ ఎక్స్‌రే
కడుపు స్కానింగ్
ఎముకల స్కానింగ్
పెట్ స్కాన్.
(చదవండి: కిడ్నీలను కిడ్స్‌లా కాపాడుకుందాం..!)
Comments
Please login to add a commentAdd a comment