Breast cancer
-
పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..
ఎంత ఏఐ టెక్నాలజీ, చాటీజీపీటి వంటి సరికొత్త టెక్నాలజీలు వచ్చినా కొన్ని విషయాల్లో సమాజం తీరు విశాలంగా ఉండటం లేదు. సమాన అవకాశాలు, లింగ సమానత్వం అంటారే గానీ వర్కింగ్ మహిళలు అమ్మగా మారాక ఇవ్వాల్సిన వెసులుబాటు అటుంచి కనీస మద్దతు లేకపోవడం బాధకరం. ఇంకా చాలామంది తల్లలు తమ చిన్నారులకు పాలిచ్చేందుకు జంకే పరిస్థితులే ఎదురవ్వుతున్నాయి. ముఖ్యంగా పనిచేసే తల్లలు ఆరునెలల మెటర్నీటి సెలవుల అనంతరం ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిందే. అలా తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలిచ్చేందుకు ఎలాంటి పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్రెస్ట్ పంపింగ్ మిషన్ల సాయంతో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. పని ప్రదేశాల్లో సహ ఉద్యోగుల మద్దుతు గానీ అందుకోసం ప్రత్యేక ప్రదేశం గానీ అందుబాటు లేక విలవిలలాడుతున్నారు అతివలు. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సైతం వెల్లడించింది. అలాంటి పరిస్థితులను కాబయే తల్లులు ఎలా అధిగమించాలి..? దీని గురించి నిపుణుల ఏమంటున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా.ప్రతిష్టాత్మకమైన BAFTA అవార్డుల కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అందమైన డిజైనర్ వేర్‌తో సందడి చేసింది. ఓ పక్కన తల్లిగా తన బ్రెస్ట్ పంపింగ్ షెడ్యూల్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఈవెంట్లో పాల్గొంది. ఆ విషయాన్నే రాధికా ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. పని ప్రేదేశంలో నాలాంటి కొత్త తల్లులు బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బుందులు పడుతుంటారు. అందులోనూ సినీ పరిశ్రమలో అస్సలు మద్దతు ఉండదు. కానీ నాకు సపోర్ట్ లభించడమే గాక హ్యపీగా తన రొమ్ము పాల పంపింగ్ షెడ్యూల్‌కి ఆటంకం లేకుండా ప్రముఖ మోడల్ నటాష తనకెంతో సహాయం చేసిందని చెప్పుకొచ్చింది. ఒక నటిగా రాధికా వంటి వాళ్లకు కూడా పనిప్రదేశాల్లో ఇలాంటి సమయంలో ఇబ్బందుల తప్పవనే విషయం స్పష్టమవుతోంది. ఇక సామాన్య మహిళలైతే అంతకు మించి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఎందరో మహిళలు ఈ విషయమై ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకున్నారు కూడా . నిపుణులు ఏమంటున్నారంటే..తల్లిపాలు సరఫరా-డిమాండ్ ప్రాతిపదికన పనిచేస్తుందని చెబుతున్నారు గైనకాలజీ నిపుణులు. కొత్త తల్లులకు పాలివ్వడం లేదా రొమ్ము పంపింగ్ షెడ్యూల్‌కి కట్టుబడి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే దీని అర్థం పాలను టైం ప్రకారం పంపింగ్ లేదా ఫీడ్ చేస్తే శరీరం ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుందట, లేదంటే మానవ శరీరం తక్కువ పాలను ఉత్పత్తి చేయాలనే సంకేతాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా శిశువుకు దీర్ఘకాలం పాలను కొనసాగించే సామార్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తల్లిపాల వల్ల కలిగే లాభాలు..తల్లి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ కేన్సరలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందట. అదీగాక తల్లిపాలు శిశువు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాలు, యాంటీబాడీలు, ఎంజైమ్‌లు ఉంటాయి. తల్లిపాలను తాగే పిలలలకు చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయట. అలాగే తల్లి పాలిచ్చే సమయంలో శిశువుకి చర్మం నుంచి చర్మానికి సంపర్కం, భావోద్వేగ సంబంధం భద్రతను అందిస్తుందట. ఉద్యోగినులు ఆరోగ్యాన్ని, పాల సరఫరాను కాపాడుకోవాలంటే..పని ప్రదేశాల్లో సహజంగా కొత్త తల్లులు ఇలాంటి విషయంలో అసౌకర్యంగా సిగ్గుగా ఫీలవ్వుతుంటారు. ముందు అలాంటి వాటిని పక్కన పెట్టి..విరామ సమయంలో పంపింగ్ సెషన్ ప్లాన్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే గోప్యత కోసం కార్యాలయంలో సరైన సౌకర్యం లేదా ప్రదేశం గురించి కార్యాలయం యజమానులతో మాట్లాడండి. అసౌకర్యం ఏర్పడకుండా ఎవ్వరినీ లోపలకి రానివ్వకుండా చేసుకోండి. ముఖ్యంగా పాలను సరిగా నిల్వ చేయండి. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండేలా బాగా తినండి, తాగండి. అందుకోసం సహోద్యోగి, లేదా భాగస్వామి మద్దతు తోపాటు ఆఫీస్ హెడ్ సహాయం కూడా తీసుకోండి. ఆఫీస్ నిర్వాహకులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి తల్లిపాలు ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశం ఇచ్చేలా లేదా వెసులబాలు కల్పించమని కోరండి.(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు
సంపద, సంతోషం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ కష్టాలు, బాధలో ఉన్నప్పుడే అయినవాళ్లెవరో, కానివాళ్లెవరో తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాళ్లు చాలా తక్కువమంది. కానీ హీనా ఖాన్‌కు.. ఆమె కష్టాన్ని తన కష్టంగా భావించే ప్రియుడు దొరికాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న నటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.నాకోసం గుండు కొట్టించుకున్నావ్..ఇంత మంచి భాగస్వామి దొరకడం నా అదృష్టం అంటూ ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal)ను పొగుడుతూ ఓ పోస్ట్ షేర్ చేసింది హీనా ఖాన్ (Hina Khan). నాకు తెలిసిన మంచి వ్యక్తి ఇతడే! ట్రీట్మెంట్లో భాగంగా నేను గుండు చేయించుకున్నప్పుడూ అతడూ గుండు కొట్టించుకున్నాడు. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడే తన జుట్టు పెరగనిస్తానన్నాడు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వంద కారణాలు చెప్పి వెళ్లిపోయే అవకాశం ఉన్నా నాతోనే ఉన్నాడు. నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. జీవితకాలమంత అనుభవాన్ని మేము ఇప్పటికే పోగు చేసుకున్నాం.కరోనా సమయంలోనూ నాతో..సంతోషకర, బాధాకర సందర్భాల్లో కలిసున్నాం. మా తండ్రుల్ని కోల్పోయినప్పుడు ఇద్దరమూ ఏడ్చాం. ఒకరినొకరం ఓదార్చుకున్నాం. కరోనా సమయంలోనూ కలిసే ఉన్నాం. అప్పుడు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతడికి వైరస్ సోకకపోయినా నాతోపాటే కలిసున్నాడు. మూడు మాస్కులు ధరించి నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. క్యాన్సర్ బారిన పడ్డప్పుడు కూడా నా చేయి వదల్లేదు. అన్నీ వదిలేసి నాతోనే ఉంటున్నాడు.(చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్)సరైన దారిలోనే వెళ్తున్నా..ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల్ని అడగాలి.. ఇలా అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలా అతడు సూచించిన కరెక్ట్ డైరెక్షన్లోనే నేను అడుగులు వేస్తున్నాను. కీమో థెరపీ ప్రారంభించినప్పటి నుంచి నా బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. నాకు డ్రెస్సింగ్ చేయడం, తినిపించడం.. ఇలా అన్నీ తనే చేస్తున్నాడు. నా చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించాడు. గడిచిన రెండు నెలలు నాకెంతో నేర్పాయి.బాధపెట్టి ఉంటే క్షమించునా జీవితంలో నువ్వు నాకు దొరికిన అద్భుతానివి. నన్ను ధైర్యంగా నిలబడమన్నావ్.. నన్ను నేను ప్రేమించుకోమన్నావ్.. ఆందోళనను వదిలేసి ప్రశాంతంగా శ్వాస తీసుకోమన్నావ్.. నీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నేను నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు. మనం కలిసి నవ్వుకునేవాళ్లం, ఏడ్చేవాళ్లం, ఒకరి కన్నీటిని మరొకరు తుడిచేవాళ్లం.. అప్పటికీ, ఇప్పటికీ ఇదే జరిగింది. భవిష్యత్తులో కూడా మన మధ్య ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.గతేడాది క్యాన్సర్ బారిన పడ్డ నటిఇతడు దేవుడు పంపిన ఆశీర్వాదం అని హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి మంచి వ్యక్తి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీరు ఎప్పటికీ ఇలాగే కలిసుండాలని కామెంట్లు చేస్తున్నారు. టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కెరీర్లో పుంజుకుంటున్న సమయంలో క్యాన్సర్ హీనా ఖాన్‌పై దాడి చేసింది. గతేడాది నుంచి మూడో దశ బ్రెస్ట్ క్యాన్సర్‌తో నటి పోరాడుతోంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: పెళ్లిరోజు నాడే గుడ్‌న్యూస్.. తల్లిదండ్రులైన టాలీవుడ్ జంట -
బ్రెస్ట్ కేన్సర్: తొలిదశ గుర్తింపే అతిపెద్ద సవాలుగా..!
మహిళల్లో ప్రధానంగా కనిపిస్తున్న కేన్సర్ రొమ్ము కేన్సర్... పట్టణాలు, పల్లెలనే తేడా లేదు. అలాగే పెద్ద వయసు, చిన్న వయసు అనే తేడాలేకుండా దాడి చేస్తోంది. చాలామంది మహిళలు ఈ కేన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తూ చాలా సందర్భాల్లో వ్యాధి ముదిరేంతవరకూ దీన్ని గుర్తించలేకపోతున్నారు. తొలిదశలోనే గుర్తించగలిగితే ప్రాణాలు దక్కించుకునే అవకాశాలూ పెరుగుతాయి. భారతదేశం లాంటి దేశాల్లో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. అసలు తొలిదశలోనే ఈ కేన్సర్‌ని గుర్తించడంలో ఎదురవుతున్న అడ్డంకులు, ఎలాంటి ప్రయత్నాలతో ప్రజలకు అవగాహన కల్పించాలో తదితర విషయాలపై అమూల్యమైన సలహాలు సూచనలు అందించారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ అండ్ ఆంకోప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి.ప్ర: రొమ్ము కేన్సర్‌పై అవగాహన, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఏమిటి? జ: మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్ లాంటి దేశాల్లో రొమ్ము కేన్సర్‌పై నిత్యం కార్యక్రమాలు నిర్వహించాలి. చాలామందిలో వ్యాధిపై అవగాహన ఉండదు. కుటుంబ బాధ్యతల పేరుతో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూంటారు. పైగా వ్యాధి నిర్ధారణ, పరీక్షలకు తగిన వసతులు కూడా ఇక్కడ తక్కువే. రొమ్ము కేన్సర్ పరీక్షలు సొంతంగా ఎలా చేసుకోవచ్చో మామోగ్రామ్ వంటి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలో మహిళలకు తెలిసే అవకాశాలు తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో వీటి గురించి అస్సలు మాట్లాడుకోరు. దగ్గరలో కేన్సర్ చికిత్స కేంద్రాలూ ఉండవు.ప్ర: వీలైనంత తొందగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించడం ఎలా ముఖ్యమవుతుంది?జ: అవగాహన లేమి, స్క్రీనింగ్ సౌకర్యాలు లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల రొమ్ము కేన్సర్‌ను చాలా సార్లు ముదిరిన తరువాత మాత్రమే గుర్తిస్తున్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు వ్యాధి నుంచి బయటపడేందుకు తొలిదశల్లోనే గుర్తించడం చాలా కీలకం. అందుకే మేము గ్రామాలతోపాటు చిన్న చిన పట్టణాల్లో రొమ్ము కేన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం. వ్యాధి లక్షణాలు, సక్రమంగా గుర్తించడం ఎలా? నిర్ధారణ చేసుకోవడమెలా? సొంతంగా పరీక్షించుకునే విధానం, ట్రిపుల్ టెస్ట్ వంటి విషయాల గురించి వివరిస్తున్నాం. ప్ర: సాధారణంగా ఏ ఏ కారణాలతో మహిళలు తొలిదశ పరీక్షలకు ముందుకు రావడం లేదు?జ: ఎక్కువమంది కుటుంబ బాధ్యతలు చూసుకోవడంలో తలమునకలై ఉంటారు. తమ ఆరోగ్య అవసరాలను నిర్లక్ష్యం చేస్తూంటారు. తరచూ వైద్యపరీక్షలు చేసుకోవాలన్న అవగాహన లేకపోవడమే పెద్ద ప్రతిబంధకం. కొంతమందికి ఈ పరీక్షలు ఎలా చేయించుకోవాలో కూడా తెలియదు. పైగా కేన్సర్ వ్యాధ నిర్ధారణకు సంబంధించి చాలా అపోహలున్నాయి. తెలియకపోవడమే మేలని చాలామంది అనుకుంటూంటారు. ఈ కారణాల వల్లనే మేము ‘బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో గ్రామ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతున్నాం.ప్ర: రొమ్ము కేన్సర్‌పై ఉన్న అతిపెద్ద అపోహలేమిటి?జ: కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే మాత్రమే మామోగ్రామ్ చేయించుకోవాలన్నది అతి పెద్ద అపోహ. వాస్తవానికి ప్రతిమహిళ రొమ్ము కేన్సర్ బారిన పడే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరికీ రొమ్ము కేన్సర్ లేనప్పటికీ మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే నలభై ఏళ్లు దాటిన వారందరూ కచ్చితంగా ఏటా మామోగ్రామ్ చేయించుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే వారు ఈ పరీక్షలు చేయించుకోవడం మరీ ముఖ్యమవుతుంది. ప్ర: రొమ్ము కేన్సర్, అంకప్లాస్టిక్ సర్జరీని మీ వృత్తిగా ఎంచుకునేందుకు స్ఫూర్తి ఏమిటి?జ: దేశంలో కేన్సర్ సర్జన్లు చాలా తక్కువమంది ఉన్నారు. హైదరాబాద్‌లోనూ అంతే. అందుకే నేను ఈ రంగాన్ని ఎంచుకున్నా. మా అమ్మ శరీరంలోంచి కణితి (కేన్సర్ కాదు)ని తొలగించేందుకు తీసుకువెళ్లాల్సి రావడం ఒక రకంగా నేను ఆంకోప్లాస్టిక్ సర్జన్ అయ్యేందుకు కారణం. ప్ర: సాధారణ రొమ్ము కేన్సర్ శస్త్రచికిత్సలతో పోలిస్తే ఆంకోప్లాస్టీ సర్జరీ ఎలా భిన్నం?జ: ప్రధానమైన తేడా ఆంకోప్లాస్టిక్ సర్జరీ విధానంలో కేన్సర్ సోకిన రొమ్మును పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకూ రొమ్మును మిగల్చడం లక్ష్యంగా శస్త్రచికిత్స చేయడం వల్ల ప్రత్యేక కృత్రిమ పొరలను ఏర్పాటు చేసి కేన్సర్ తిరగబెట్టకుండా రేడియేషన్ థెరపీ ఇచ్చేందుకు అనువుగా చేయవచ్చు కూడా. ఒకవేల రొమ్ము మొత్తాన్ని తీసివేసినా.. శరీరంలోని కొవ్వు, కండరాల సాయంతో రొమ్మును మళ్లీ సిద్ధం చేయవచ్చు. కాబట్టి ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటే కేన్సర్ చికిత్సకు ప్లాస్టిక్ సర్జరీ తోడవడం అన్నమాట. ప్ర: బ్రెస్ట్ ఆంకాలజిస్ట్, ఆంకోప్లాస్టిక్ సర్జన్‌గా మీకు తృప్తినిచ్చే అంశం...?జ: శస్త్రచికిత్స తాలూకూ తుది ఫలితం. సర్జరీకి బాధితులు ఎలా స్పందిస్తున్నారు? అన్నది. కొన్ని కేసుల విషయంలో వ్యాధి నిర్ధారణ కూడా చాలా ముఖ్యమవుతుంది. తమ సమస్యలను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చారని రోగి నవ్వుతూ చెప్పినప్పుడు కలిగే ఆనందం అంత ఇంత కాదు. ఎంత పనిచేశామన్న దానికంటే ఎంత నాణ్యమైన పని చేశామన్నది ముఖ్యమని అనుకుంటా(చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!) -
‘సానుకూల శక్తి’కి నిలువెత్తు నిదర్శనం ఆమె..!
చెడు కాలం చెప్పి రాదు. కెరీర్లో బిజీగా ఉన్న టైమ్‌లో అలాంటి కాలం ఒకటి బాలీవుడ్ నటి హీనాఖాన్‌కు వచ్చింది. అయితే అది చెడు కాలం అని ఆమె అనుకోలేదు. ‘ఇది పరీక్ష కాలం’ అని మాత్రమే అనుకుంది. పరీక్షకు నిలబడాలంటే ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహమే శక్తి అవుతుంది. ఉత్సాహం దండిగా ఉన్న హీనాఖాన్ ఆ పరీక్షను తట్టుకొని నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ గ్లోబల్ లిస్ట్–2024’లో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల్లో హీనాఖాన్ 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎంతో మంది ఖాన్‌ను అభినందిస్తున్నారు. ఆమె మాత్రం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘చాలా మంది నన్ను అభినందించడం చూస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఇది విజయం, గర్వించదగిన విషయం అనుకోవడం లేదు’ అని రాసింది. ఆరోగ్య సవాళ్ల కంటే వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పింది ఖాన్.‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ అనే సీరియల్లో అక్షర పాత్రలో నటించి పాపులారిటీని పెంచుకున్న ఖాన్ బిగ్ బాస్, ఖత్రోస్ కే ఖిలాడీలాంటి రియాలిటీ షోలలో పాల్గొని పాపులారిటీని మరింత పెంచుకుంది. జూన్ 2024లో రొమ్ము క్యాన్సర్ గురించి బహిరంగంగా వెల్లడించింది హీనాఖాన్. ‘ఇది సవాలుతో కూడినది అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. చికిత్స ఇప్పటికే మొదలైంది. దీని నుంచి మరింత బలంగా బయటపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్న ఖాన్ తన చికిత్స గురించి, తన ఛాలెంజింగ్ జర్నీ గురించి ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో అప్డేట్స్ పంచుకుంటోంది. వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలని హీనాఖాన్ కోరుకుంటున్నప్పటికీ క్లిష్టమైన సమయాల్లో ఆమె చూపిన ధైర్యానికి ఎంతో మంది అభిమానులు అయ్యారు. సినిమా కష్టాలు ఖాన్‌కు నిజంగానే వచ్చినప్పటికీ సానుకూల శక్తితో పెదవులపై చిరునవ్వు కోల్పోలేదు.గుండెలో ధైర్యం కోల్పోలేదు.అందుకే నటిగానే కాదు ‘సానుకూల శక్తి’ విషయంలోనూ హీనాఖాన్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘హీనాఖాన్ అసాధారణ ధైర్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. కారుచీకట్లో కూడా కాంతిని కనుగొనే సామర్థ్యం ఆమెలో ఉంది’ అంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు.ఎంత బిజీగా ఉంటే అంత సంతోషంగా ఉంటాను!మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయి. మంచి రోజుల్లో ఎలా ఉన్నా చెడు రోజుల్లో మాత్రం ఉత్సాహంగా ఉండాలి. ఆ ఉత్సాహమే సానుకూల శక్తి ఇస్తుంది. సానుభూతి మాటలు విని బేలగా మారిపోకూడదు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. నాకు ఖాళీగా కూర్చోవడం కంటే పని చేయడం, బిజీగా ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది.– హీనాఖాన్ (చదవండి: భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!) -
బ్రెస్ట్ కేన్సర్ ఉంటే భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చా..?
మా కజిన్‌కి 26 ఏళ్లు. బ్రెస్ట్ కేన్సర్ అని తేలింది. కీమో వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చు అంటున్నారు. తనకి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? – పద్మజ, వెస్ట్గోదావరికేన్సర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయి. అలాగే ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసే కొత్త పద్ధతులు కూడా చాలా వచ్చాయి. కీమో రేడియేషన్‌తో అండాశయాలు దెబ్బతింటే భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల అండాశయాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి ఆంకో ఫర్టిలిటీ క్లినిక్స్‌లో డిస్కస్ చేస్తారు. ఒవేరియన్ కార్టెక్స్ అంటే అండాశయ బాహ్యపొరలో అపరిపక్వ అండాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా డెవలప్ అయ్యి పరిపక్వ అండాలుగా, మంత్లీ సైకిల్లో విడుదలవుతాయి. కాబట్టి ఒవేరియన్ లేయర్‌ని డామేజ్ చేసే ట్రీట్మెంట్ తీసుకునే ముందు మల్టీ డిసిప్లినరీ టీమ్ డిస్కషన్‌తో.. ఈ ఒవేరియన్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తారు. మత్తు మందు ఇచ్చి కీ హోల్ (లాపరోస్కోపీ) సర్జరీ ద్వారా ఒవేరియన్ టిష్యూని తీసి క్రయోప్రిజర్వ్ చేస్తారు. ఇందులో ఒక ఓవరీని లేదా ఒవేరియన్ టిష్యూ బయాప్సీస్ని తీసి ఫ్రీజ్ అండ్ ప్రిజర్వ్ చేస్తారు. మైనస్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ అల్ట్రా లో టెంపరేచర్లో ఉంచుతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో ఈ టిష్యూను తిరిగి ఇంప్లాంట్ చేస్తారు. కొన్ని నెలల తరువాత ఈ టిష్యూ బాడీలో నార్మల్ ఫంక్షన్‌లోకి వచ్చి.. మంత్లీ సైకిల్స్, ఎగ్ డెవలప్మెంట్కి సిద్ధమవుతుంది. ఇది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌లో ఉంది. దీనిద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసులూ ఉన్నాయి. మీ కజిన్‌ని ఒకసారి కౌన్సెలింగ్ సెషన్‌కి అటెండ్ అవమనండి. విషయం వివరంగా తెలుస్తుంది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అలా జన్మించిన శిశువుల్లో గుండె లోపాలు..!) -
భవిష్యత్తులో తగ్గొచ్చా?
మా కజిన్‌కి 26 ఏళ్లు. బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. కీమో వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చు అంటున్నారు. తనకి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? – పద్మజ, వెస్ట్గోదావరిక్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయి. అలాగే ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసే కొత్త పద్ధతులు కూడా చాలా వచ్చాయి. కీమో రేడియేషన్‌తో అండాశయాలు దెబ్బతింటే భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల అండాశయాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి ఆంకో ఫర్టిలిటీ క్లినిక్స్‌లో డిస్కస్ చేస్తారు. ఒవేరియన్ కార్టెక్స్ అంటే అండాశయ బాహ్యపొరలో అపరిపక్వ అండాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా డెవలప్ అయ్యి పరిపక్వ అండాలుగా, మంత్లీ సైకిల్లో విడుదలవుతాయి. కాబట్టి ఒవేరియన్ లేయర్‌ని డామేజ్ చేసే ట్రీట్మెంట్ తీసుకునే ముందు మల్టీ డిసిప్లినరీ టీమ్ డిస్కషన్‌తో.. ఈ ఒవేరియన్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తారు. మత్తు మందు ఇచ్చి కీ హోల్ (లాపరోస్కోపీ) సర్జరీ ద్వారా ఒవేరియన్ టిష్యూని తీసి క్రయోప్రిజర్వ్ చేస్తారు. ఇందులో ఒక ఓవరీని లేదా ఒవేరియన్ టిష్యూ బయాప్సీస్ని తీసి ఫ్రీజ్ అండ్ ప్రిజర్వ్ చేస్తారు. మైనస్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ అల్ట్రా లో టెంపరేచర్లో ఉంచుతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో ఈ టిష్యూను తిరిగి ఇంప్లాంట్ చేస్తారు. కొన్ని నెలల తరువాత ఈ టిష్యూ బాడీలో నార్మల్ ఫంక్షన్‌లోకి వచ్చి.. మంత్లీ సైకిల్స్, ఎగ్ డెవలప్మెంట్కి సిద్ధమవుతుంది. ఇది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌లో ఉంది. దీనిద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసులూ ఉన్నాయి. మీ కజిన్‌ని ఒకసారి కౌన్సెలింగ్ సెషన్‌కి అటెండ్ అవమనండి. విషయం వివరంగా తెలుస్తుంది. నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండవ నెల. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ రైట్ సైడ్ ట్యూబ్‌లో వచ్చింది. దాంతో రైట్ ట్యూబ్ తీసేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబ్‌లో ఉందని చెప్పారు. మెడికల్ ట్రీట్మెంట్తో ఏమైనా మేనేజ్ చేయవచ్చా?– అపర్ణ, నిర్మల్సహజంగా గర్భం దాల్చడానికి ఫాలోపియన్ ట్యూబ్స్ అవసరం. మీకు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ మాత్రమే ఉంది కాబట్టి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ట్యూబ్‌లో వచ్చే ప్రెగ్నెన్సీ)ని మెడికల్‌గా మేనేజ్ చేయడం అవసరం. కానీ దీనికి మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్ మీ కండిషన్, సిట్యుయేషన్, ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ, మీకు లివర్, కిడ్నీ టెస్ట్స్, Beta hcg టెస్ట్స్ చేసి, మెడికల్ మెథడ్ ట్రై చేయొచ్చా అని చెప్తారు. అందరికీ ఈ ట్రీట్మెంట్ పనిచేయకపోవచ్చు.Methotrexate అనే డ్రగ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ మెడిసిన్ వాడాలంటే మీకు పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ ఉండకూడదు. ట్యూబ్ రప్చర్ కాకుండా ఉందనే విషయం స్కాన్‌లో కన్ఫర్మ్ కావాలి. Beta hcg తక్కువ లెవెల్స్‌లో ఉండాలి. మీరు ఫాలో అప్‌కి రావటానికి రెడీగా ఉండాలి. ఆసుపత్రి దగ్గరలో ఉండాలి. ఇది ఇంజెక్షన్ ద్వారా ఫస్ట్ డోస్ ఇచ్చి, మూడురోజులకొకసారి Beta hcg లెవెల్స్ తగ్గుతున్నాయా అని చెక్ చేస్తారు. తగ్గుతోంది అంటే మెడిసిన్ పనిచేస్తోంది అని అర్థం. రెండు మూడు వారాలు కొంత పెయిన్, స్పాటింగ్ ఉండొచ్చు. నొప్పి తీవ్రంగా ఉంటే సర్జరీ చెయ్యాలి. పారాసిటమాల్ లాంటి మాత్రలు వాడొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ ఎమోషనల్‌గా కూడా సవాలుగా మారొచ్చు. అందుకే కౌన్సెలింగ్ సహాయమూ తీసుకోవాలి. ఈ మెడిసిన్‌తో నాలుగు నుంచి ఆరు వారాల సమయంలో ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ దానంతట అది కరిగిపోతుంది. ఒకవేళ రెండో వారంలో ఏ మార్పులూ కనిపించకపోతే లాపరోస్కాపిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తరువాత కనీసం మూడు వారాల వరకు ఆగి, మళ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ∙ -
రొమ్ము క్యాన్సర్‌కు అరుదైన చికిత్స
కేన్సర్.. ఒకప్పుడు పేరు వినడానికే భయపడిన మహమ్మారి.. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. అధైర్యపడకుండా చికిత్సతో దాన్ని జయిస్తున్నవారు కొందరైతే.. కారణాలేవైనా ఇంకొందరు ప్రాణాలు పోతున్నాయి. వ్యాధి భయం కంటే.. చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపీ చూపించే నరకం అధికం. అలాంటివేవీ లేకుంటా కేన్సర్‌ను జయించారో శాస్త్రవేత్త. తనకు వచ్చిన రొమ్ము క్యాన్సర్‌కు తానే చికిత్స చేసుకుని చరిత్రలో నిలిచారు. అయితే దీనిపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఇది అన్ని దశల్లోనూ ఉపయోగించలేమంటున్నారు. క్రొయేషియాకు చెందిన 50 ఏళ్ల బీటా హలాస్సీ శాస్త్రవేత్త. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. గతంలోనే కేన్సర్ డిటెక్ట్ అవ్వడంతో మాస్టెక్టమీ చేయించుకున్నారు. 2020లో మళ్లీ పునరావృతమైంది. ఈసారి మూడో స్టేజీ. సాధారణంగా హడలెత్తిపోతాం. కానీ ఆమె అలా కాదు. ధైర్యంగా ఎదుర్కొంది. కాకపోతే.. మొదటి సారి కీమోథెరపీతోనే విసిగిపోయిన ఆమె.. ఈసారి అటువైపు మొగ్గుచూపలేదు. తనకు తానే చికిత్స చేసుకోవాలనుకున్నారు. వైరాలజిస్ట్ కూడా కావడంతో.. యాంటీవైరస్ వేక్సిన్స్తోనే ప్రయోగం చేశారు. మీజిల్స్ వైరస్, ఫ్లూ లాంటి వ్యాధులకు ఇచ్చే వేక్సిన్స్ను కలిపి.. తన ప్రయోగశాలలోనే కొత్త వైరస్‌ను సృష్టించారు. దాన్ని ఇంజెక్ట్ చేసి చికిత్స చేసుకోవడం ప్రారంభించారు. ఇది కణితిపై నేరుగా దాడి చేసిన రోగనిరోధక వ్యవస్థను పెంచే శక్తివంతమైనన వైరస్‌గా పనిచేసింది. హలాస్సీ నాలుగు సంవత్సరాలుగా కేన్సర్ రహితంగా ఉంది. స్టేజ్ 3లో చికిత్స.. ఆంకోలిటిక్ వైరోథెరపీ (ఓవీటీ)గా పిలిచే ఈ ప్రయోగాత్మక వేక్సిన్ ఆమె స్టేజ్ 3 కేన్సర్ చికిత్సకు సహాయపడింది. ఓవీటీ.. క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చెందుతున్న విధానం. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి, వాటితో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. ఓవీటీ క్లినికల్ ట్రయల్స్ లాస్ట్స్టేజ్లో ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్ పై ప్రయోగించారు. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ప్రారంభ దశ కేన్సర్లకు కూడా దీన్ని సూచిస్తున్నారు. కణితి కణానికి మీజిల్స్ వైరస్, వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ ఉన్నట్టుగా గుర్తించిన హలాస్సీ.. రెండు వైరస్‌లను సరైన మోతాదులో మిళితం చేసి, తనకు తాను చికిత్స చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటివరకు ఈ రెండు వ్యాధికారక క్రిములను ఓవీటీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించారు. మీజిల్స్ వైరస్ మెటాస్టాటిక్ రొమ్ము కేన్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. భిన్న వాదనలు.. కేన్సర్ చికిత్సకు.. శస్త్రచికిత్స, కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీ, రేడియేషన్ వంటి ప్రస్తుత విధానాలకు బదులుగా ఓవిటిని ఉపయోగించాలని హలాస్సీ సూచిస్తున్నారు. దీనిని కొందరు వైద్య పరిశోధకులు విభేదిస్తున్నారు. ఆంకోలిటిక్ వైరస్‌లతో స్వీయ వైద్యం రోగ నిర్ధారణ చేసిన కేన్సర్‌ను ఎదుర్కోవడానికి సరైన విధానం కాదంటున్నారు. కానీ ప్రారంభ దశలో ఓవీటీని నియోఅడ్జువెంట్ థెరపీగా క్లినికల్ ట్రయల్స్ జరపాలని సూచిస్తున్నారు. -
కోరలు చాస్తున్నక్యాన్సర్
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ రక్కసి కోరలు చాస్తోంది. 2022 సంవత్సరంలో ఒక్క రొమ్ము క్యాన్సర్ కారణంగానే దేశంలో 98,337 మంది మహిళలు మృతి చెందినట్లు గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) నివేదిక వెల్లడించింది. అదే ఏడాది నోటి క్యాన్సర్ బారినపడి 79,979 మరణించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇది కచ్చితంగా ప్రమాద సూచికేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2045 నాటికి క్యాన్సర్ కేసులు, మరణాల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా హెచ్చరించింది. ముఖ్యంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో క్యాన్సర్ విజృంభణపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రొమ్ము క్యాన్సర్ కేసుల్లో 33.6 శాతం, మరణాల్లో 36.9 శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నట్టు వెల్లడించింది. అన్ని రకాల క్యాన్సర్ మరణాల్లో 42 శాతం ఈ దేశాల్లోనే సంభవించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 12.8 శాతం పెరుగుదల 2020తో పోలిస్తే 2025లో దేశంలో 12.8 శాతం మేర క్యాన్సర్ కేసుల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో పొగాకు వినియోగం వల్ల పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా ఉన్నాయి. వీటి కారణంగానే అత్యధిక మరణాలు నమోదవుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్ మినహా మిగిలిన బ్రిక్స్ దేశాల్లో మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణమని వెల్లడైంది.మహిళలు 40 ఏళ్ల నుంచి జాగ్రత్తలు పాటించాలి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 10 శాతం రొమ్ము క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి. 90 శాతం కేసులు సాధారణంగా వస్తుంటాయి. కుటుంబంలో ఒక తరం స్త్రీకి 50 ఏళ్లలో క్యాన్సర్ బయటపడితే తర్వాతి తరంలోని ఆమె కూతుళ్లు, వారి సంతానం 10 ఏళ్లు ముందే అంటే 40 ఏళ్లకే జాగ్రత్త పడాలి. బ్రాకాజీన్ టెస్ట్ చేయించుకుంటే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమణను గుర్తించవచ్చు. మిగిలిన మహిళలైతే 40 ఏళ్ల నుంచే నెలసరి సమయంలో కాకుండా మిగిలిన రోజుల్లో ఇంట్లోనే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. గడ్డలు ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 45 ఏళ్ల వయస్సు నుంచి రొమ్ము క్యాన్సర్‌కు మామోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్‌కు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే వైద్య రంగం అభివృద్ధి చెందింది. అధునాతన చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్టేజ్‌లో క్యాన్సర్ బయటపడినా చికిత్స చేయొచ్చు. – డాక్టర్ జె.విజయకృష్ణ, క్లినికల్ అంకాలజిస్ట్, విజయవాడ -
యువరాజా ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్..? ఏంటీ తీరు..?
‘సున్నితమైన విషయాలలో ఎలా స్పందించాలో, ఆరోగ్య సమస్యలపై ఎలా అవగాహన కలిగించాలో కొందరికి కనీస స్పృహ లేకుండా పోతోంది. ఒక దేశం బ్రెస్ట్ కేన్సర్‌పై ప్రజలలో అవగాహన ఎలా పెంచుతుంది?! రొమ్ము కేన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్లలో ‘మీ ఆరెంజ్‌లను చెక్ చేసుకోండి’ అంటూ తెలియజేసే ప్రకటన పోస్టర్‌ను ఢిల్లీ మెట్రోలో చూశాను. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. ఈ ప్రచారాలు ఎవరు చేస్తారు, వీటిని ఎవరు ఆమోదిస్తారు? ఈ పోస్టర్‌ను పబ్లిక్‌లోకి తీసుకు రాగలిగేటంత మూర్ఖులు మనల్ని పరిపాలిస్తున్నారా?!’ అంటూ ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా దుయ్యబట్టారు. కేన్సర్ సర్వైవర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్వచ్ఛంద సంస్థ ‘యువికాన్’ ఈ ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.దీని వెనుక ఉద్దేశం రొమ్ము కేన్సర్ పట్ల సామాన్యులలో అవగాహన కల్పించడమే. కానీ, ఇలాంటి ప్రచారాలు కొన్నిసార్లు అసౌకర్యంగానూ, పనికిమాలినవిగానూ కనిపిస్తాయి. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ యూజర్లు కామెంట్ల రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ‘ఇది క్రికెటర్ యువరాజ్‌సింగ్ క్యాంపెయిన్ అని తెలుసుకున్నాను. వీరి ఉద్దేశ్యం సరైనదే కావచ్చు. కానీ, ఇది నిజంగా అసహ్యకరమైనది. ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలనుకుంటున్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘భారతదేశంలో బ్రెస్ట్ కేన్సర్ పట్ల ఒక శాతం మందికి కూడా సరైన అవగాహన లేదు. తలాతోకా లేని ఇలాంటి ప్రకటన ద్వారా ప్రజలకు విషయం ఎలా చేరుతుంది అనుకుంటున్నారు? స్త్రీలను కించపరిచేలా ఉన్న ఈ ప్రకటన సరైనది కాదు’ అని ఇంకొకరు, ‘సమస్యను ఎంత బాగా అర్థమయ్యేలా తెలియజేయాలో ఆ ఫౌండేషన్ వాళ్లకే అర్థం కాలేదు’ అని మరొకరు ‘ప్రకటనదారులు సున్నితమైన విషయాలను పట్టించుకోరు, ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తారు’ అని ఒకరు ‘ఇది గ్రామీణ జనాభా కోసం కాదు. కేవలం ఇంగ్లిషు మాట్లాడే మహిళల కోసమే’ అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. (చదవండి: చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..? ) -
ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు..
ప్రపంచవ్యాప్తంగా... ఆమాటకొస్తే భారతీయ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ విస్తృతియే చాలా ఎక్కువ. మొత్తం అన్ని రకాల క్యాన్సర్లను పరిగణనలోకి తీసుకుంటే రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యేవారు 28 శాతం ఉంటారని అంచనా. తాజా ‘గ్లోబకాన్’ లెక్కల ప్రకారం మన దేశంలో రొమ్ముక్యాన్సర్ల కేసుల సంఖ్య 1,78,361 కాగా దురదృష్టవశాత్తు దాని వల్ల 90,408 మరణాలు సంభవించాయి. అయితే కేవలం రొమ్ముక్యాన్సర్‌పై సరైన అవగాహన లేని కారణం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. సాధారణంగా మహిళల్లో 40 – 50 ఏళ్ల వయసప్పుడు వచ్చే ఈ రొమ్ముక్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తిస్తే దీని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని భరోసా ఇస్తున్నారు. అక్టోబరు నెల రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం కోసమే ఈ కథనం. మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్)తో ΄ాటు మరికొన్ని అంశాలూ కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని... రిస్క్ఫ్యాక్టరు...సాధారణంగా రొమ్ముక్యాన్సర్‌కు కారణమయ్యే రిస్క్‌లో పెరిగే వయసు, దాంతోపాటు కుటుంబంలో రొమ్ముక్యాన్సర్లు ఉండటం, మొదటి నెలసరి చాలా త్వరగా రావడం, మెనోపాజ్ చాలా ఆలస్యం కావడం, జీవితకాలంలో పిల్లలు లేకపోవడం వంటివి. ∙చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌కు గురి అయ్యే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. ఐదు నుంచి పది శాతం కేసుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారిలోనే వస్తుండటం గమనార్హం. బీఆర్సీఏ1, బీఆర్సీఏ 2 వంటి జెనెటిక్ మ్యూటేషన్లు ఉంటే ఆ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. ఇందులో బీఆర్సీఏ 1 జెనెటివ్ మ్యూటేషన్ వల్ల ముప్పు శాతం 72 % కాగా బీఆర్సీఏ 2 వల్ల 69% ముప్పు ఉన్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇక నివారించగలిగే రిస్క్‌ఫ్యాక్టర్లలో స్థూలకాయం ∙ఆధునిక జీవౖనశెలిలో భాగంగా కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు ∙ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం ∙తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైన బిడ్డకు రొమ్ము పాలు పట్టించడం మేలు. లక్షణాలు...మహిళలు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి లేదా స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అవి హానికలిగించని (బినైన్) గడ్డలా, లేక హానికరమైనవా (మేలిగ్నెంట్) అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం ∙రొమ్ము చర్మం మందంగా మారడం ∙రొమ్ములో సొట్ట పడినట్లుగా ఉండటం రొమ్ము ఆకృతిలో మార్పులు ∙సమస్య ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్. నిపుల్కు సంబంధించినవి: రొమ్ముపై దద్దుర్ల వంటివి రావడం నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటివి స్రవించడం రొమ్ము పరిమాణంలో మార్పులు రావడం, వాటిలో గమనించగలిగే తేడా రావడం బాహుమూలాల్లో :గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం చేతివాపు (లింఫ్ ఎడిమా)ఇమ్యూనో థెరపీ, టార్గెట్ థెరపీ : శస్త్రచికిత్సతోపాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాధితులకు సరిపడే చికిత్సను డాక్టర్లు అందిస్తారు. వ్యాధి తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడం తోపాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ విషయంలో గతంలోలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేన్సర్ ఎక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడు ‘నియో అడ్జువెంట్ థెరపీ’ అని ఇస్తారు. తర్వాతి చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండటం కోసం డాక్టర్లు ఈ చికిత్స ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ముందుగా ఆపరేషన్ చేయాలా, లేక కీమోథెరపీ ఇవ్వాలా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే కనుగొంటే 90% పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం ఉంది. చికిత్స... ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉండే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అ΄ోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి.నిర్ధారణ పరీక్ష... తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం ద్వారా మామోగ్రాఫీ అనే స్కాన్ ద్వారా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే పరీక్ష పూర్తి నిర్ధారణ కోసం వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ) ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ పెట్ స్కాన్. (చదవండి: కిడ్నీలను కిడ్స్‌లా కాపాడుకుందాం..!) -
కళ్లు లేకున్నాక్యాన్సర్ చూపుతారు
‘చూపున్నా చూడలేని అంధుల కంటే....అంధులు బాగా చూడగలరు’ అంటుంది పెర్షియన్ సామెత. కంటిచూపు బాగున్నా వాస్తవాలు చూడలేని వారిపై ఈ సామెత ఒక చురక అనుకున్నప్పటికీ.... చూపులేని మహిళలు వైద్యరంగంలో కొత్త కాంతితో వెలుగుతున్నారు. తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’తో ఎర్లీ స్టేజ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తిçస్తూ ఎంతోమంది మహిళలు ప్రమాదం బారిన పడకుండా చూస్తున్నారు...మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ్రపారంభ సంకేతాలను గుర్తించడంలో చూపులేని అయేషా వైద్యులకు సహాయపడుతుంది. ఈ పరీక్షల కోసం తన చేతి వేళ్లను ఉపయోగిస్తుంది. ‘మా చేతి వేళ్లలోని అధిక స్పర్శ జ్ఞానం వక్షోజాలలోని చిన్న లంప్స్‌ను కనిపెట్టడంలో సహాయపడుతుంది. ఈ వృత్తి నాలాంటి చూపులేని మహిళలకు బాగా సరిపోతుంది’ అంటుంది అయేషా.బెంగళూరులోని ‘సైట్‌కేర్’ హాస్పిటల్లో పనిచేస్తుంది అయేషా. రోజుకు తొమ్మిది పరీక్షలు చేస్తుంది. ఒక్కొక్కరికి అరగంట సమయం తీసుకుంటుంది.‘కంటిచూపు లేని అయేషాలాంటి యువతులు ఎర్లీ స్టేజిలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను డిటెక్ట్ చేయడంలో మంచి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు’ అంటున్నాడు ‘సైట్‌కేర్’ హాస్పిటల్స్ కో–ఫౌండర్, సీయివొ సురేష్ రాము. చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయిన అయేషా డిగ్రీ పూర్తి చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అయేషా తన నెల జీతంలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంటుంది. (మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...)అయేషాలాగే కోలార్‌కు చెందిన 29 సంవత్సరాల నూరున్నీసా చిన్న వయసులోనే చూపు కోల్పోయింది. తన ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా ఎంతోమంది మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తుంటుంది.బెంగళూరులోని ‘జ్యోతి నివాస్ కాలేజీ’లో డిగ్రీ చేసిన నూరున్నీసాకు ఉద్యోగం దొరకడం కష్టం అయింది. ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా తనకు ఉపాధి దొరకడమే కాదు గుర్తింపు కూడా లభించింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ‘గతంలో మాదిరిగా కాదు. ఇప్పుడు చూపులేని వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది నూరున్నీసా.అయేషా, నూరున్నీసా...ఈ ఇద్దరిలో ఎవరికీ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు.బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి, టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించడానికి అయేషా, నూరున్నీసాలు దేశంలోని ఎన్నో ్రపాంతాలు తిరిగారు. టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు అనేవి చూపు లేని మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక పరీక్షలు. ఈ పరీక్షలను నిర్వహించేవారిని మెడికల్ టక్ట్యల్ ఎగ్జామినర్స్(ఎంఐటీ)లుగా వ్యవహరిస్తారు. ‘ఎంఐటీ’లుగా ఎంతో మంది చూపు లేని మహిళలు ఉపాధి పొందడమే కాదు తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎర్లీ స్టేజీలో గుర్తిస్తున్నారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)డిస్కవరింగ్ హ్యాండ్స్దిల్లీకి చెందిన ‘డిస్కవరింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ టక్ట్యల్ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలకు సంబంధించి చూపు లేని మహిళల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థ బెంగళూరులో కూడా శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళల్లో అయేషా, నూరున్నీసా ఉన్నారు. ‘మొదట్లో వైద్యానికి సంబంధించిన పదాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది’ అంటుంది లీనా మెహతా. పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె చూపు కోల్పోయింది. అయితే ట్రైనర్స్ ఒకటికి పదిసార్లు అర్థమయ్యేలా చెప్పేవాళ్లు. త్రీడీ మోడల్స్‌తో శరీర పనితీరును సులభంగా అర్థం చేయించేవారు. -
రొమ్ము క్యాన్సర్ చికిత్సకు మానుకా తేనె.. ఎలా పని చేస్తుందంటే!
తేనె అనేది ప్రకృతిలో ఓ అద్భుతం. తేనెటీగలు తేనెను సేకరించి… దాచుకోవడం, దాన్ని ప్రాసెస్ చేసి… ప్యాక్ చేసి మనకు ఇవ్వడం… ఆ శుద్ధమైన తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నాం. మన చర్మ కణాల్ని తేనె కాపాడుతోంది. జుట్టుకు కూడా రక్షణ కల్పిస్తోంది.తేనెలో చాలా రకాలు ఉంటాయి.. వీటిలో మానుకా తేనె చాలా ప్రత్యేకమైనది. దీనిని ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లలో తేనెటీగలు తయారు చేస్తాయి. మనుక చెట్టు మకరందంతో తేనెటీగలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ చెట్టు సంవత్సరంలో 2 నుంచి 6 వారాలు మాత్రమే పువ్వులు పూస్తుంది. ఇది చాలా అరుదైన తేనెగా చెబుతున్నారు. మామూలు తేనే కన్నా దీని తీపి కాస్త తక్కువగా ఉంటుంది. మామూలు తేనేలాగే మానుకా తేనేను కూడా రోజూ వాడొచ్చు. మానుకా తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, హీలింగ్ గుణాలు ఉన్నాయని అధికంగా ఉంటాయి. ప్రీ రాడికల్స్ వల్ల శరీరం దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మానుకా తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు చర్మ మీద అయిన గాయాలను తగ్గించడంతో సాయపడతాయి. తాజాగా మానుకా తేనే ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించకుండా రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 84% తగ్గించినట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఈ పరిశోధనలు సహజమైన, నాన్-టాక్సిక్ సప్లిమెంటరీ యాంటీకాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడనున్నాయి.ఇందులోని పోషకాహారం', 'ఫార్మాస్యూటికల్స్' కలయిక పోషక విలువలను అందించడమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. మానుకా తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, హీలింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. తాజాగా యూసీఎల్ఏ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనాల ద్వారా ఈ న్యూట్రాస్యూటికల్ రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో సహాయపడతాయని కనుగొన్నారు.ఈ పరిశోధనలు సాంప్రదాయ కీమోథెరపీకి ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగపడతాయని పరిశోధకులు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సలో సహజ సమ్మేళనాల ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, ఈ అధ్యయనం మరింత అన్వేషణకు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని చెప్పారు.ఈస్ట్రోజెన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో 60% నుంచి 70% వరకు- రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారే ఉన్నారు. క్యాన్సర్ కణాలలో గ్రాహకాలు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను వృద్ధి చేయడానికి ఉపయోగించుకునేలా చేస్తాయి. యాంటీ-ఈస్ట్రోజెన్ లేదా ఎండోక్రైన్తో చికిత్స చాలా మంది రోగులలో కణితి పెరుగుదలను నిరోధించవచ్చు.పరిశోధకులు మొదట తమ ప్రయోగంలో ఈఆర్ పాజిటివ్, ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలను పెంచారు, ఇది రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల్లో ఒకటి. మనుకా తేనె లేదాడీహైడ్రేటెడ్ మనుకా తేనె పొడితో చికిత్స చేసిన ఈఆర్ పాజిటివ్ కణాలలో.. నియంత్రణలతో చికిత్స చేయబడిన వాటితో పోలిస్తే క్యాన్సర్ కణాల విస్తరణ గణనీయమైన మోతాదు-ఆధారిత నిరోధాన్ని వారు గమనించారు. ట్రిపుల్-నెగటివ్ కణాల కోసం మనుక తేనెను టామోక్సిఫెన్తో కలిపినప్పుడు యాంటిట్యూమర్ ప్రభావం మరింత తక్కువగా ఉంటుంది.కణాలను మరింత నిశితంగా పరిశీలిస్తే, తేనె రక్తంలోని ఈస్ట్రోజెన్ స్థాయిలు, కణితుల్లో ఈస్ట్రోజెన్ గ్రాహకాలలో తగ్గుదలకు కారణమైందని తేలింది. కణితి కణాలలో అపోప్టోసిస్ లేదా సెల్ డెత్‌ను ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ పురోగతిని మరింత దెబ్బతీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.మనుకా తేనెను జంతు నమూనాలలో పరిశోధకులు పరీక్షించారు. మానవ ఈఆర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలతో అమర్చబడి కణితిని అభివృద్ధి చేసిన ఎలుకలకు మనుకా తేనెను నోటి ద్వారా అందించారు. తేనెతో చికిత్స చేయబడిన ఎలుకలు నియంత్రణలతో పోలిస్తే కణితి పెరుగుదలను గణనీయంగా అణిచివేసాయి. మొత్తంమీద ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా మానవ రొమ్ము క్యాన్సర్ కణితి పెరుగుదల, పురోగతిని 84% నిరోధించింది. -
రొమ్ము కేన్సర్‌ను ఐదేళ్లముందే ఏఐ పసిగట్టేస్తుంది
మహిళల్లో ప్రమాదకరంగా వ్యాపిస్తున్న కేన్సర్లలో రొమ్ము కేన్సర్ ఒకటి. కేన్సర్లను ముందుగా గుర్తించడం చాలా అవసరం. వ్యాధి బాగా ముదిరిన తరువాత గుర్తించడం వల్ల మరణాల రేటు బాగా పెరుగుతోంది. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో రొమ్ము కేన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించవచ్చని తేలింది. అధునాతన సాంకేతికత చికిత్స ఫలితం.. రోగ నిరూపణకి, కొత్త ఔషధాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోంది.యుఎస్‌లోని డ్యూక్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం మామోగ్రామ్‌ల సాయంతో ఐదేళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి కొత్త, అర్థమయ్యే కృత్రిమ మేధస్సు నమూనాను అభివృద్ధి చేసింది. రేడియాలజీ జర్నల్‌లో ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం రొమ్ము కేన్సర్ ముప్పును ఐదు సంవత్సరాల ముందే ప్రమాదాన్ని అంచనా వేjడంలో ఏఐ అల్గారిథమ్‌లు ప్రామాణిక క్లినికల్ రిస్క్ మోడల్‌ను అధిగమించాయని తెలిపింది.బయాప్సీ, మైక్రోస్కోప్‌ల క్రింద హిస్టోలాజికల్ పరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ, పెట్ స్కాన్ల వంటి ఇమేజింగ్ పరీక్షలు కేన్సర్‌ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్షలు. వీటిని ఏఐ సిస్టమ్‌లు మరింత లోతుగా, అద్భుతమైన ఖచ్చితత్వంతో విశ్లేషించగలవు. ఫలితంగా సాధారణ పరీక్షల్లో కనిపించ కుండా పోయిన సూక్ష్మకణాలను ఏఐ ముందస్తుగా గుర్తించగలదు. ఇది చికిత్స ఫలితాలను పెంచి, రోగులను రక్షించడంలో వైద్యులకు మార్గం సుగమం చేసి, ముందస్తు మరణాలను నివారించగలదని భావిస్తున్నారు. తాజా పరిశోధన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతోషం వ్యక్తం చేశారు. మనం ‘‘మేము ఊహించిన దానికంటే కృత్రిమ మేధస్సు ఎంతోవిలువైందని వ్యాఖ్యానించారు. -
చాలా ఏళ్లుగా.. ఈ క్యాన్సర్ తో బాధ పడుతున్నాను.. ఏదైనా??
నాకు 40 ఏళ్లు. చాలా ఏళ్లుగా బ్రెస్ట్ పెయిన్‌తో సఫర్ అవుతున్నాను. నెలసరి ముందు వచ్చే పెయిన్ నార్మలే అన్నారు. కానీ నాకు నెలంతా ఉంటోంది. ఇదేమైనా క్యాన్సర్‌కి దారితీస్తోందేమోనని భయంగా ఉంది. – పేరు, ఊరి పేరు రాయలేదు.పీరియడ్స్‌కి ముందు వచ్చే బ్రెస్ట్ పెయిన్ సాధారణంగా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. అదేం సమస్య కాదు. ఇలాంటి నొప్పికి బ్రెస్ట్కి మంచి సపోర్ట్ ఇచ్చే ఇన్నర్‌వేర్ వేసుకోవడం, పెయిన్ కిల్లర్స్ లేదా విటమిన్ ఇ మాత్రలు లాంటివి వాడితే తగ్గిపోతుంది. కానీ పెయిన్ నెలంతా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్ చేయించుకోవాలి.బ్రెస్ట్ టిష్యూలో జరిగే కొన్ని మార్పులతో ఫైబ్రస్ టిష్యూ పెరిగి పెయిన్ రావచ్చు. బ్రెస్ట్ కింద ఉన్న చెస్ట్ వాల్ నుంచి మజిల్ లేదా రిబ్ ప్రాబ్లంతో బ్రెస్ట్లోకి పెయిన్ రేడియేట్ కావచ్చు. అలాంటి పెయిన్‌ని కాస్టోకాన్డ్రైటిస్ (ఛిౌట్టౌఛిజిౌnఛీటజ్టీజీట) అంటారు. ఊపిరి తీసుకునేటప్పుడు పెయిన్ పెరుగుతుంది. బ్రెస్ట్‌లో ఇన్ఫ్లమేషన్ వచ్చినా పెయిన్ ఉంటుంది. అయితే ఇది అరుదుగా ఉంటుంది. బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ బ్రెస్ట్‌లోని టిష్యూ ఇన్ఫెక్షన్కి కారణం అవుతుంది.దీనికి హయ్యర్ యాంటీబయాటిక్స్‌తో వెంటనే చికిత్సను అందించాలి. కొంతమందికి హెర్పిస్ లేదా షింగల్స్తో బ్రెస్ట్ మీద దద్దుర్లు, నొప్పి ఉంటాయి. దీన్ని యాంటీవైరల్ మెడిసిన్‌తో ట్రీట్ చేయాలి. చాలా అరుదుగా బ్రెస్ట్ లంప్స్, బ్రెస్ట్ ట్యూమర్ ఉంటే పెయిన్ రావచ్చు. బ్రెస్ట్ సిస్ట్స్ అంటే బ్రెస్ట్‌లో ఫ్లూయిడ్‌తో నిండిన సిస్ట్స్ ఏర్పడతాయి. వాటివల్ల కూడా నడిచినప్పుడు, ప్రెషర్‌కి పెయిన్ వస్తుంది. చాలామంది.. పెయిన్ రావడంతోనే బ్రెస్ట్ క్యాన్సరేమో అని భయపడతారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మొదటి సింప్టమ్.. బ్రెస్ట్‌లో అసాధారణ రీతిలో లంప్ ఉండటం. చాలాసార్లు పెయిన్ ఉండదు.అయితే బ్రెస్ట్ నుంచి డిశ్చార్జ్ ఉన్నా, లంప్స్ ఉన్నా, స్వెల్లింగ్, రెడ్నెస్ ఉన్నా, చంకల్లో లంప్స్ ఉన్నా ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. రొటీన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్‌తో పెయిన్‌కి, లంప్కి కారణాలను డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా ఏది డిటెక్ట్ అయినా వెంటనే చికిత్స మొదలుపెడితే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతినెల పీరియడ్స్ అయిపోయిన వెంటనే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం మంచిది.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
హీనా ఖాన్ ధైర్యంగా ఉండు.. నువ్వో వారియర్‌వి: సమంత
బాలీవుడ్ ప్రముఖ నటి హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా హీనా ఖానే ఓ వీడియోలో పేర్కొంది. దీంతో ఇండస్ట్రీలోని పెద్దలు ఆమెకు ధైర్యాన్ని అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా హీనాఖాన్‌కు మానసిక ధైర్యాన్ని అందించింది.(చదవండి: ప్రభాస్‌కి చాలా సిగ్గు.. టికెట్ కొనిచ్చి థియేటర్‌కి పంపాడు: హంసనందిని) ‘నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా ఉండు’ అంటూ హీనా ఖాన్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘వారియర్’ అనే హ్యాస్ ట్యాగ్‌ని జోడించింది. సమంత పోస్ట్‌కు హీనా రిప్లై ఇచ్చింది. ‘సమంత మీరు అన్నిట్లోనూ స్టార్. జీవితంలో వచ్చే సవాళ్లను మీరు ఎదుర్కొనే తీరు అద్భుతం. మీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమ, ఆశీర్వచనాలకు ధన్యవాదాలు’ అని హీనా ఖాన్ రాసుకొచ్చింది.కాగా, సమంత కూడా ఆ మధ్య అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి.. ఇటీవల కోలుకుంది. తనకొచ్చిన వ్యాధిని దాచి పెట్టకుండా.. అందరికి తెలియజేసి..అవగాహన కలిపించింది. అంతేకాదు ఎంతో ధైర్యంగా ఉండి.. మంచి చికిత్స తీసుకోవడం కారణంగానే త్వరగా కోలుకుంది. సామ్ బాటలోనే హీనా ఖాన్ కూడా తనకొచ్చి వ్యాధి గురించి ధైర్యంగా బయటి ప్రపంచానికి తెలియజేసింది. మానసికంగా దృఢంగా ఉంటూ త్వరలోనే వ్యాధిని జయిస్తానని, ఈ కష్ట సమయంలో అందరు తోడుగా ఉండాలని కోరింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) -
నటికి ఎంత కష్టమొచ్చింది.. క్యాన్సర్ మూడో స్టేజ్! (ఫోటోలు)
-
క్యాన్సర్ బారిన పడిన ప్రముఖ నటి.. ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ హిందీ నటి హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడింది. మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో ప్రస్తుతం తాను బాధపడుతున్నానని బయటపెట్టింది. అలానే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుని తిరిగి మామూలు మనిషి అవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఈమె ఇన్ స్టాలో ఇప్పుడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె?(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో)జమ్ము కశ్మీర్లో పుట్టి పెరిగిన హీనా ఖాన్.. 2009 నుంచి నటిగా కొనసాగుతోంది. 'హే రిస్తా క్యా ఖేల్తా హై' సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టింది. దీని తర్వాత ఫియర్ ఖత్రోంకి ఖిలాడీ 8, బిగ్ బాస్ 11 రియాలిటీ షోల్లో పాల్గొంది. నాగిన్ 5, షద్యంత్రా తదితర సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి ఆకట్టుకుంది. పలు సీరియల్స్‌లో అతిథి పాత్రలు చేసింది. ఓ అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీసులు కూడా చేసింది.సీరియల్ నటిగా కొనసాగుతున్న టైంలోనే ప్రొడ్యూసర్ రాకీ జైశ్వాల్‌ని ప్రేమించి అతడిని 2014లో పెళ్లి చేసుకుంది. ఇకపోతే తనకు ఆస్తమా ఉన్నట్లు ఓ షోలో బయటపెట్టింది. ఇప్పుడు తాను మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు రివీల్ చేసింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరలో పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగొస్తానని చెప్పుకొచ్చింది. దీంతో ఈమె త్వరగా కోలుకోవాలని సహా నటీనటులు కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?) View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) -
Breast cancer బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుంది? ఎలా గుర్తించాలి!
ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో 157 దేశాల్లో మహిళల్లో రొమ్ము కేన్సర్ అత్యంత సాధారణంగా కనిస్తున్న కేన్సర్. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 70వేల మంది ఈ కేన్సర్ కారణంగా మృత్యువాత పడ్డారు. 2.3 మిలియన్ల మంది మహిళలు బాధ పడుతున్నారు. యుక్తవయస్సు తర్వాత ఏ వయస్సులోనైనా మహిళల్లో ఇది కనిపించవచ్చు. పురుషుల్లో కూడా ఈ తరహా కనిపిస్తున్నప్పటికీ చాలా తక్కువ (దాదాపు 0.5–1 శాతం) కనిపిస్తోంది.అమెరికాలో 8 మంది మహిళల్లో ఒకరు జీవితకాలంలో రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. 2024లో, 310,720 మంది మహిళలు, 2,800 మంది పురుషులు ఇన్వాసివ్ బ్రెస్ట్ కేన్సర్‌కు గురయ్యారని అంచనా. అసలు రొమ్ము కేన్సర్ లేదా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుంది. దీన్ని ఎదుర్కోవడం ఎలా అంశాలపై డా. శ్రీకాంత్ మిర్యాల ఎక్స్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన వివరాలు మీకోసం యథాతథంగా..ఆడవాళ్లలో చర్మ కేన్సర్(విదేశీయుల్లో) తప్పితే అత్యంత ఎక్కువగా వచ్చే క్యాన్సరు రొమ్ము కేన్సరు. ఇప్పుడు వస్తున్న కొత్త పద్ధతుల ద్వారా దీన్ని ముందుగానే కనిపెట్టడం అలాగే, చికిత్స వల్ల గత ముఫ్ఫైఏళ్లలో మూడోవంతు మరణాల్ని తగ్గించగలిగాం.సాధరణంగా 50ఏళ్ల కంటే వయసు ఎక్కువున్న వాళ్లలో వస్తుంది, కానీ ఇరవై నుంచి నలభై మధ్యలో కూడా రావటం అరుదు కాదు. 12 ఏళ్లకంటే ముందుగా రజస్వల అయిన వాళ్లలో, 35ఏళ్ల వరకూ ఒక్కసారి కూడా నిండు గర్భిణీ కానివాళ్లలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే వీళ్లలో ఈస్ట్రోజన్ హార్మోన్ కి రొమ్ములు ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన. అయితే గర్భం ఎప్పడు వచ్చినప్పటికీ పిల్లలకి ఎక్కువరోజులు పాలివ్వటం వలన తల్లిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి.ఆసియా దేశాల్లో, వ్యయసాయం చేసే ఆడవాళ్లలో పట్టణాల్లో, అమెరికావంటి దేశాల్లో ఉండే మహిళల కంటే పదివంతులు తక్కువగా వస్తుంది. గ్రామాలనుంచి పట్టణాలకి చిన్నప్పుడే వలస వెళ్లిన అమ్మాయిలలో మళ్లీ పట్టణాల్లో వచ్చేంత స్థాయిలోనే రొమ్ము కేన్సర్ వస్తుంది.గర్భనిరోధక మాత్రలు వాడటం వలన రొమ్ముకేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగినప్పటికీ అవాంఛిత గర్భాన్ని నివారించటంతో పాటు, అండాశయ, గర్భాశయ కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.బహిష్టు ఆగిపోయిన తర్వాత వాడే హార్మోన్ రీప్లేసెమెంట్ థెరపీ వలన రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.స్థూలకాయం, మధుమేహం, మద్యం సేవించటం వల్ల కూడా ఈ న్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే కుటుంబంలో ఇంకెవరికైనా ఉంటే ఆ జన్యువుల వలన వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎలా నివారించాలి?జన్యుపరమైన కారణాలున్నవాళ్లలో కచ్చితంగా వస్తుంది కాబట్టి ముందుగానే రొమ్ములు శస్త్రచికిత్స చేసి తొలగించటం. ఇది అందర్లో కాదు, జన్యులోపాలు ఉన్నవాళ్లలో మాత్రమే. మంచి ఆహారం, వ్యాయామం.అనవసరంగా హార్మోన్ థెరపీ వాడకుండా ఉండటం.స్క్రీనింగ్- అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతిఒక్కరూ వాళ్ల రొమ్ముల్ని అద్దం ముందు అనాచ్ఛాదితంగా నిలబడి పరీక్ష చేసుకోవాలి. ముందుగా రెండిటినీ గమనించాలి. వాటి రూపులో, పరిమాణంలో మునుపటికంటే తేడాలు ఏమైనా ఉంటే చూడాలి. చనుమొనలు ముందులానే ఉన్నాయా? వెనక్కి వెళ్లాయా? రక్తం, చీము, నీరు లేదా బాలింత కాకుండా పాలు ఏమైనా వస్తున్నాయా చూడాలి. చర్మంలో మార్పులు - పుళ్లు, పగుళ్లు, దళసరి అవ్వటం, నారింజ చర్మంలా గుంతలు కనపడటం ఏమైనా ఉందా చూడాలి. తర్వాత ఒకచెయ్యి నాలుగు వేళ్లతో రొమ్మును నాలుగు భాగాలుగా ఊహించి ప్రతీభాగంలో గుండ్రంగా తిప్పుతూ గడ్డలు ఏమైనా తగులుతున్నాయేమో అని చూడాలి, అలాగే పైకి వెళ్లి చంక భాగంలో కూడా చూడాలి. అలాగే రెండో రొమ్ము కూడా పరీక్షించాలి.ఇలా నెలకొకసారి పరీక్ష చేయించుకోవాలి.అలాగే మామ్మోగ్రాం అని ఎక్స్ రే పరీక్ష ఉంటుంది, యాభై ఏళ్లు దాటిన వాళ్లలో ప్రతి రెండేళ్లకి చెయ్యాలి. బిగుతైన రొమ్ములున్నవాళ్లకి కొన్నిసార్లు ఎమ్మారై అవసరం అవుతుంది.ఎలాంటి గడ్డలైనా వైద్యుడికి చూపించాలి. దాన్ని బయాప్సీ చేయించాలి. తద్వారా తర్వాత చికిత్స అవసరమా లేదా అన్నది తేలుస్తారు.ఇప్పటికే కుటుంబంలో రొమ్ము కేన్సర్ వచ్చినవాళ్లు (అమ్మమ్మ, అమ్మ, అక్కా చెల్లెళ్లు) ఉంటే జన్యుపరీక్ష చేయించుకుని, ఎప్పటికప్పుడు వైద్యుడితో రొమ్ములను పరీక్షించుకోవాలి.రొమ్ము కేన్సర్ నుంచి బయటపడటం అది యే దశలో గుర్తించారన్నదాన్ని బట్టి ఉంటుంది. -
నటి ఒలివియాకి కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!
సెలబ్రెటీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు చాలామంది ఈ బ్రెస్ట్ కేన్సర్ బారినే పడుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్లో తెలియదు గానీ ఈ భయానక వ్యాధుల బారిన పడటం జరుగుతోంది. అయితే ఈ రొమ్ము కేన్సర్ కొందరిలో రెండు రొమ్ములోనూ, మరికొందరిలో ఒక్కదానిలోనే వస్తోంది. అయితే చాలావరకు దీన్ని ముందుగానే గుర్తించడం సాధ్యపడదు. పైగా ఒక్కోసారి ఇది నిర్థారణ అయ్యాక వేగవంతంగా విస్తరిస్తుంటుంది. చాలా కేసుల్లో రేడియోథెరఫీతో నివారించగా, మరికొన్ని కేసుల్లో పూర్తిగా రొమ్ముని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వివరంగా తెలుసుకుందామా!.యూఎస్ నటి ఒలివియా మున్ గతేడాది రొమ్ము కేన్సర్ బారిన పడినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ విషాదకర వార్త తన చెవిన పడిందంటూ చెప్పుకొచ్చింది. తాను ఆ టైంలో పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడేంత వరకు ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తన రెండు రొమ్ముల్లో ఈ కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని పేర్కొంది. అయితే ఈ కేన్సర్ చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు స్కానింగ్‌లో తేలింది. దీంతో తాను డబల్ మాస్టెక్టమీ చేయించుకున్నాని అని తెలిపింది.ఆ తర్వాత సుమారు పది నెలల వరకు దాదాపు నాలుగు శస్త్ర చికిత్సలు చేయించుకున్నానని చెప్పింది. ఈ హెల్త్ జర్నీలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో మద్దతివ్వడం వల్లే దీన్నుంచి బయటపడగలిగానని చెప్పుకొచ్చింద. ఆమె ఇటీవల 2024 ఆస్కార అవార్డుల వేడుకల్లో తన భాగస్వామితో కలిస రెడ్‌కార్పెట్‌పై మెరిసింది కూడా. ఈ నేపథ్యంలో బ్రెస్ట్ కేన్సర్ ఇంత ప్రమాదమా? అన్ని సర్జరీలు తప్పవా? అనే ఆసక్తికర విషయాలు చూద్దాం!. View this post on Instagram A post shared by o l i v i a (@oliviamunn)రొమ్ము కేన్సర్ అంటే..రొమ్ము క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఆదిలోనే గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. దీని కారణంగా రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. ఇది ఎక్కువగా స్త్రీలకు వస్తుంది. చాలా అరుదైన సందర్భాల్లో పురుషులకు వస్తుంది. అంతేగాదు మహిళ్లో కూడా కొందరికీ రెండు రొమ్ములోనూ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎవరికీ ఎక్కువంటే..కుంటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన మహిళలకు వస్తుంది. అంతేగాదు 12 సంవత్సరాల కంటే ముందు రజస్వల అయినా లేదా 55 సంవత్సరాల తరువాత మోనోపాజ్ దశలో కూడా ఈ రోమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఊబకాయం, అధికబరువు, వల్ల రోమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.అధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకునేవాళ్లు కూడా ఈ కేన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పొగాకు, మద్యపానం సేవించే వారు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు..రొమ్ములో నొప్పి లేకుండా గడ్డలుగా ఉండటంరొమ్ముపై చర్మం మసకబారడంచనుమొనలపై దద్దుర్లు లేదా పుండ్లుచనుమొనల ఆకృతిలో మార్పులుచనుమొనల గుండా రక్తపు మరకల్లా కనిపించడంచంకలో వరకు రొమ్ము నిండుగా ఉన్నట్లు కనిపించటంచికిత్స విధానాలు..శస్త్రచికిత్సరేడియోథెరపీహార్మోన్ ల థెరపీకీమోథెరపీఈ బ్రెస్ట్ కేన్సర్‌లో చాలా వరకు కణితిని మాత్రమే తొలగించేందుకు సర్జన్లు యత్నిస్తారు. దీనిని బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ(Breast Conservation Surgery) అని అంటారు. కేన్సర్ తిరిగి వచ్చే అవకాశాలను తగ్గించడం కొరకు ఆపరేషన్ తరువాత కూడా రోగులకు రేడియేషన్, కీమోథెరపీ వంటివి ఇవ్వడం జరుగుతుంది. నివారణ..ఏ కేన్సర్ అయినా ముందుగానే గుర్తిస్తే ప్రమాదం నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఎప్పటికప్పుడూ మహిళలు ఏడాదికి ఒక్కసారైన రొమ్ముకి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచుకోవాలిరోజూ వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. (చదవండి: నో స్మోకింగ్ డే! ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహారపదార్థాలివే!) -
అనుకున్నామనీ జరగవు అన్నీ...కన్నీళ్లు పెట్టించే లవ్ స్టోరీ!
కొన్ని ప్రేమ కథలు హృద్యంగా ఉంటాయి. మరికొన్ని ప్రేమ కథలు కన్నీరు పెట్టిస్తాయి. అలాంటి వాటిల్లో ఒక జంట ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరి ప్రేమికుల్లాగానే ఎన్నో కబుర్లు చెప్పుకుంది ఈ జంట. అందమైన జీవితాన్ని కలగంది. నిశ్చితార్థాన్ని కూడా చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బావుండేది... కానీ విధి మరోలా ఉంది. మాయదారి మహమ్మారి వారి ప్రేమ కథను విషాదాంతం చేసింది. హీథర్, డేవిడ్ మోషెర్ 2015లో స్వింగ్ డ్యాన్స్ క్లాస్‌లో కలుసుకున్నారు. తొలుత చూపులు, ఆ తర్వాత మాటలు కలిసాయి. కొన్ని నెలల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. బంధువులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుకను నిర్వహించుకున్నారు. 2017, డిసెంబర్ 30 తమ పెళ్లి ముహూర్తంగా ఖాయం చేసుకున్నారు. అయితే ఇక్కడే వారి జీవితాల్లో పెద్ద అలజడి రేగింది. హీథర్‌కు చాలా ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ నిర్ధారణ అయింది. అంతే..అంతా తారుమారు. టెస్ట్‌లు, కీమోథెరపీలతో ఆసుపత్రులు చుట్టూ తిరగడమే సరిపోయింది. కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్లో తన ప్రియురాలు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. మరోవైపు ఉబికి వస్తున్న కన్నీళ్లను అదుముకుంటూ ఆసుపత్రి బెడ్ పైనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె కోరిక మేరకు ఆసుపత్రి బెడ్ పెళ్లి వేదికగా మారింది. ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న సరిగ్గా ఏడాదికి ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. పంటి బిగువున శారీరక బాధను భరిస్తూ భర్తగా మారిన ప్రియుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్న ఆ చేతులు 18 గంటల తరువాత అచేతనంగా మిగిలి పోయాయి. భర్తను చూస్తూ శాశ్వత నిద్రలోకి జారిపోయింది హీథర్. మరో విషాదం ఏమిటంటే పెళ్లి చేసుకోవాలనుకున్న డిసెంబరు 30నే ప్లాంట్స్విల్లే కాంగ్రెగేషనల్ చర్చిలో హీథర్ మోషర్ అంత్యక్రియలు ముగిసాయి. 2018లో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నాన్ ఈస్తటిక్ థింక్స్ అనే ట్విటర్ హ్యాండిల్ ఈ స్టోరీని ట్విటర్లో మళ్లీ షేర్ చేసింది. కేవలం 14 గంటల్లోనే 17 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. This woman got married in a hospital hours before she died of cancer 😢 pic.twitter.com/vKcVQPKaaK — non aesthetic things (@PicturesFoIder) January 29, 2024 -
అమ్మకు, అమ్మమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కచ్చితంగా వచ్చేస్తుందా?
నాకు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. మా అమ్మకు, అమ్మమ్మకు 50వ ఏట బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాకు కూడా అలా వచ్చే చాన్స్ ఉందా? ఎలాంటి టెస్ట్‌లు చేయించాలి? టెస్ట్‌ల ద్వారా ముందుగా కనుక్కోవచ్చా? – జి. చిన్ని, ఎమ్మిగనూరు కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఆ కుటుంబ సభ్యులు 25వ ఏట నుంచే గైనకాలజిస్ట్‌ని లేదా జెనెటిక్ కౌన్సెలర్‌ని కలవాలి. ఇప్పుడు ఫ్యామిలీ క్యాన్సర్ క్లినిక్స్, జెనెటిక్ క్లినిక్స్ చాలా చోట్ల ఉంటున్నాయి. ఈ రకమైన కన్సల్టేషన్‌లో.. మీ కుటుంబంలో ఏవిధమైన క్యాన్సర్ ఉంది? అది వంశపారంపర్యంగా మీ జీవితం కాలంలో మీకు వచ్చే చాన్స్ ఎంత? ఎలాంటి టెస్ట్‌తో ముందే కనిపెట్టి చెప్పవచ్చు? ఏ టెస్ట్‌తో నివారించవచ్చు? వంటివాటితో రిస్క్‌ను అంచనా వేస్తారు. కొన్ని జన్యుపరమైన పరీక్షలను సూచిస్తారు. కేవలం 5 శాతం బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రమే వంశపారంపర్యంగా వస్తాయి. కుటుంబంలో ఆల్టర్డ్ జీన్ కనుక ఉంటే తర్వాత తరానికీ బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్స్‌కి చాలా వరకు వంశ పరంపర ఉండదు. మీ కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంది కాబట్టి మీరు ప్రతి నెలసరి తరువాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామూలుగా అయితే దీన్ని 40 ఏళ్లకి మొదలుపెడతారు. 50 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏడు ఈ పరీక్షను చేయించుకోవాలి. 50–70 ఏళ్ల మధ్య ప్రతి మూడేళ్లకోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామోగ్రఫీ అంటే ఎక్స్ రేతో చేసేది. అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. నొప్పిలేని లంప్ ఏదైనా చేయికి తగిలినా.. బ్రెస్ట్ సైజ్, షేప్ మారినా, స్కిన్‌లో తేడా కనిపించినా.. నిపిల్ డిశ్చార్జ్ ఉన్నా.. చంకల్లో వాపు ఉన్నా.. వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. పెయిన్ అనేది చాలావరకు క్యాన్సర్ సింప్టమ్ కాదు. జీన్ టెస్టింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వశపారంపర్య బ్రెస్ట్ క్యాన్సర్‌కి ముఖ్యంగా బీర్సీఏ 1, బీఆర్సీఏ 2 జీన్స్ కారణం. ఇవి మీలో జీన్ చేంజెస్ అయినాయా లేదా అని జెనెటిక్ పానెల్ టెస్ట్ చేసి తెలుసుకుంటారు. జీవనశైలిలో మార్పు ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించవచ్చు. ఎత్తుకు తగిన బరువును మెయిన్టేన్ చేయడం, కనీసం 30 నిమిషాల వ్యాయామాన్ని వారానికి కనీసం అయిదురోజులు చేయడం, పౌష్టికాహారం వంటివన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడానికి దోహదపడతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?) -
మహిళలను వెంటాడుతున్న రొమ్ము క్యాన్సర్
మహిళలను రొమ్ము క్యాన్సర్ వెంటాడుతోంది.. ఒకప్పుడు 45 ఏళ్లు నిండిన వారిపైనే అధికంగా ఈ మహమ్మారి దాడి చేసేంది. ఇప్పుడు యుక్త వయసులోని అతివలను సైతం భయకంపితులను చేస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలనే కబళిస్తోంది. ఈ క్రమంలో ఆడపడుచుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేస్తోంది. అవగాహనతోనే నివారణ సాధ్యమనే నినాదంతో సదస్సులు నిర్వహిస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద క్షేత్రస్థాయిలో అనుమానితులను గుర్తిస్తోంది. ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తోంది. రోగులకు సకాలంలో అత్యుత్తమ చికిత్సలు అందిస్తోంది. చిత్తూరు రూరల్ : బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉచితంగా పరీక్షలు, చికిత్సలు చేయిస్తోంది. త్వరలో అన్ని సీహెచ్‌సీలో సైతం సీ్క్రనింగ్ టెస్ట్ సెంటర్లను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా.. గతంలో 45ఏళ్లు దాటిన వారిలోనే బ్రెస్ట్ క్యాన్సర్ కనిపించేంది. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా సోకుతోంది. పాశ్చాత్య దేశాల్ల 50 ఏళ్లు నిండి తర్వాతే పలువురు క్యాన్సర్ బారిన పడుతుండగా, మన దేవంలో 40 ఏళ్లు దాటిన వారిలో సైతం అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కోసారి 30ఏళ్ల వారిలోనూ, కొందరు పురుషుల్లో సైతం క్యాన్సర్ బయటపడుతోంది. జిల్లాలో సుమారు 2,211 మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా కనిపెట్టవచ్చని తెలియజేస్తున్నారు. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులువుగా ఉంటుందని వివరిస్తున్నారు. ముందుగా క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకుంటే గుర్తించడం సులభతరంగా మారుతుందని, తద్వారా నివారణకు అవకాశముంటుందని వివరిస్తున్నారు. ఎక్కువ మంది మహిళలకు దీనిపై అవగాహన లేకపోవడం వల్లే రెండు, మూడు దశల వరకు క్యాన్సర్ గుర్తించలేకపోతున్నారని చెబుతున్నారు. సకాలంలో వ్యాధిని కనిపెడితే వెంటనే చికిత్స ప్రారంభించి ప్రాణాలను కాపాడవచ్చని వెల్లడిస్తున్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో మేలు గ్రామీణ ప్రాంత మహిళలకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వరంలా మారింది. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామానికే వైద్యులు వెళ్లడం, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టు డాక్టర్లు సైతం అందుబాటులోకి వస్తుండడంతో గ్రామీణ మహిళలు హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఆయా శిబిరాల్లో మహిళలకు ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్ష ణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే మమోగ్రామ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పెద్దసంఖ్యలో మహిళలకు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తించారు. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కూడా వారికి వైద్య పరీక్షలు చేస్తూ మందులు అందజేస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇలా ► రుతుస్రావం వచ్చి, ఆగిన ఐదు రోజుల తర్వాత బ్రెస్ట్ చెక్ చేసుకోవాలి ► రొమ్ముపై గింజంత సైజులో కణితులు ఏమైనా వచ్చాయా, చర్మం రంగు మారిందేమో పరిశీలించుకోవాలి ► చంకల్లో గడ్డలు ఏర్పడ్డాయా అనే విషయాలను గమనించాలి ► రొమ్ము టైట్ అవుతోందా, అల్సర్స్ వచ్చాయా, చనుమొనల నుంచి రక్తం కారుతోందా వంటి అంశాలను చెక్ చేసుకోవాలి ► నొప్పిలేని కణితులను క్యాన్సర్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలి. కారణాలు అనేకం మహిళలల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయి. లేట వయసులో పిల్లలు పుట్టినవారు, బిడ్డకు పాలివ్వని తల్లులు, వంశపారంపర్యంగా కొందరికి, పన్నెండేళ్లోపు రజస్వల అయినవారు, రెడ్‌మీట్ అధికంగా తినేవారు, ఎక్కువ సమయంల కూర్చుని పనిచేసేవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఊబ కాయంతో ఉన్న మహిళలు, మెనోపాజ్ చేరే సమయంలో వచ్చే దుష్ఫలితాలకు వాడే మందులు కారణంగా ఈ మహమ్మారి బారిన పడవచ్చు. అలాగే వివాహం కాని మహిళలు,, సంతానం లేని వారు, ధూమపానం, ఆల్కాహాల్ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. – శిల్ప, సీ్త్ర వైద్య నిపుణులు, చిత్తూరు ప్రత్యేక దృష్టి ఫ్యామిలీ డాక్టర్ కింద కమ్యూనికల్ డిసీజెస్‌పై ప్రత్యేకంగా దష్టి సారించాం. అందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి లక్ష ణాలున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ చేస్తున్నాం. అలాగే ఆయా వ్యాధులతో చికిత్స పొందుతున్న వారిని సైతం మానిటరింగ్ చేసి మందులు అందిస్తున్నాం. రొమ్ముపై కణితులు, గడ్డలు ఉన్న మహిళలు వస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాం. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని పరీక్షలను ఉచితంగానే చేస్తున్నాం. – అమర్నాథ్, ఏసీడీ విభాగం వైద్యాధికారి, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి -
బ్రెస్ట్ క్యాన్సర్.. ప్రతి నాలుగు నిమిషాలకొక కేసు, ఇలా గుర్తుపట్టండి
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) గణాంకాల ప్రకారం మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకొక కొత్త కేసు నమోదవుతోందని ఒక అంచనా. ఏటా 1,78,000 కొత్త కేసులొస్తున్నాయంటూ ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి లక్షమంది మహిళల్లో 30 మంది కొత్తగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో దీని విస్తృతి ఎక్కువ. మహిళల్లో ఇంతగా కనిపించే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశల్లోనే కనుగొంటే, దాని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఈ నెల (అక్టోబరు) ‘రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం’ సందర్భంగా మహిళలను వెన్నాడే ఈ ఆరోగ్య సమస్య నివారణ, విముక్తిమార్గాల వంటి అంశాలతో ఓ కథనం. అన్ని క్యాన్సర్లలాగే రొమ్ముక్యాన్సర్ వ్యాప్తినీ డాక్టర్లు నాలుగు దశలుగా పేర్కొంటారు. ఇందులోని తొలిదశ లేదా రెండోదశల్లో దీన్ని గుర్తిస్తే వ్యాధిని సులభంగానే తగ్గించవచ్చు. మూడు, నాలుగు దశల్లో కూడా విముక్తి పొందేందుకు చాలావరకు అవకాశమున్నా... చికిత్స ఒకింత కష్టమవుతుంది. రొమ్ముక్యాన్సర్ నుంచి పూర్తిగా నయమయ్యేవారి సంఖ్య ఇటీవల చాలా ఎక్కువ. కొన్ని కారణాలు రొమ్ముక్యాన్సర్‌కు ప్రధానంగా రెండు రకాల కారణాలుంటాయి. మొదటిది నివారించలేనివీ, రెండు... నివారించగలిగే కారణాలు. ∙వయసు పెరుగుతున్నకొద్దీ రొమ్ముక్యాన్సర్ ముప్పూ పెరుగుతూ ఉంటుంది. ఇది నివారించలేని కారణం. ఇక కొందరు మహిళల్లో హార్మోన్లు ఎక్కువగా స్రవించడం. ఇవి మినహా మిగతావన్నీ దాదాపుగా నివారించదగిన కారణాలే. ఉదాహరణకు... ∙ఉండాల్సినదానికి మించి బరువు పెరగడం (ఊబకాయం). ∙ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆహారాల్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవడం. ∙పెళ్లి, తొలిచూలు బిడ్డ పుట్టడంలో ఆలస్యం జరగడం. ముప్పు ఎవరెవరిలో... ∙రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వచ్చిన కుటుంబాల వారిలో ఆ కుటుంబాల్లో ఒకవేళ పురుషుల్లోనూ అదే క్యాన్సర్ వస్తే బాగా దగ్గరి బంధువుల్లో (అమ్మ, అమ్మమ్మలు, అక్కచెల్లెళ్లు, మేనత్తల్లో) రొమ్ము క్యాన్సర్ ఉండటం. వారిలోనూ 40 ఏళ్లకి తక్కువ వయసులోనే దీని బారిన పడటం. ఆ కుటుంబ సభ్యుల్లోనే ఇతర క్యాన్సర్లు ఎక్కువగా కనిపించడం (ముఖ్యంగా అండాశయాల క్యాన్సర్స్ రావడం) ∙జీన్ మ్యుటేషన్స్ కనిపించడం, పదేళ్ల వయసుకు ముందే రజస్వల కావడం అలాగే 50 ఏళ్లు పైబడినా నెలసరి ఆగకపోవడం. ముందస్తు నివారణ ఇలా... మామూలుగా క్యాన్సర్ నివారణ దాదాపు అసాధ్యమే అయినా... తొలి రెండు దశల్లో గుర్తించడం ఇంచుమించు నివారణతో సమానం. కొందరిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఇలాంటివారు కొన్ని పరీక్షలు ద్వారా తమ ముప్పును ముందే గుర్తించవచ్చు. ఇలా గుర్తించగలిగితే, వ్యాధి నుంచి ఇంచుమించు పూర్తిగా తప్పించుకున్నట్లే. ►ఊబకాయాన్ని తగ్గించుకోవడం (ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార, వ్యాయామాలతో ఎత్తుకు తగినట్లు బరువును నియంత్రించుకోవాలి). ►కుటుంబ ఆరోగ్య చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఉన్నప్పుడు... బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ఈ జన్యుపరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. ఆ రిపోర్టుల ఆధారంగా డాక్టర్ల కౌన్సెలింగ్‌తో...రొమ్ములుగానీ, ఫెలోపియన్ ట్యూబులు, అండాశయాలు తొలగించడం వల్ల రొమ్ముక్యాన్సర్ రాకుండానే నివారించవచ్చు. ►నివారించదగిన కారణాలను గుర్తించి, జీవన శైలిని మెరుగుపరచుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్ గుర్తింపు ఇలా... ►సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (ఎస్‌బీఈ) అనే సొంతంగా చేసుకునే పరీక్షల ద్వారా రొమ్ముల్లోని తేడాలను బట్టి...చాలావరకు ఎవరికివారే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం సాధ్యమే. అందుకు చేయాల్సినవి... ► మహిళలు తమ రొమ్ముల్ని తాకుతూ పరీక్షించుకున్నప్పుడు అంతకు ముందు లేని గడ్డల వంటివి చేతికి / స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. నెలసరి అయిన ఏడవరోజున, స్నానం చేస్తున్నప్పుడు సబ్బుచేతితో చూసుకోవాలి. ► చర్మంపై నుంచి తాకినప్పుడు రొమ్ములోపల గడ్డ తగులుతూ ఉన్నా లేదా రొమ్ము ఆకృతిలో మార్పు కనిపించినా, చంకల్లో ఏదైనా గడ్డ కనిపించినా డాక్టర్‌కు తెలపాలి. ►ఇలాంటి గడ్డల్లో నొప్పి లేకపోయినా, రొమ్ములో సొట్టలు ఉన్నా, రొమ్ము పరిమాణంలో మార్పులు గమనించినా డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ఇక నిపుల్ విషయానికి వస్తే... అది ముడుచుకున్నట్లుగా లోపలివైపునకు తిరిగి ఉన్నా, నిపుల్ నుంచి రక్తస్రావం కనిపిస్తున్నా, పుండ్ల వంటివి కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమయ్యే వైద్యపరీక్షలు... తొలుత డాక్టర్లు భౌతికంగా పరీక్షలు చేయడం, తర్వాత మామోగ్రఫీ / ఎమ్మారై / అల్ట్రాసౌండ్, కోర్ బయాప్సీ (సూది పరీక్ష), అవసరమైతే జెనెటిక్ స్క్రీనింగ్‌తో నిర్ధారణ చేస్తారు. అన్ని సందర్భాల్లోనూ ఈస్ట్రోజెన్ రిసెప్టర్, ప్రొజెస్టిరాన్ రిసెప్టర్, హర్–2 పరీక్షలూ; కొన్ని సందర్భాల్లో ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ ∙ఛాతీ ఎక్స్‌రే ∙కడుపు స్కానింగ్‌తో పాటు అవసరమైతే ఎముకల స్కానింగ్ (మూడో దశలో) లేదా పెట్‌స్కాన్ చేస్తారు. చికత్స మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. తొలి లేదా రెండో దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌ను దాదాపుగా పూర్తిగా తగ్గించవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి చికిత్సలు అవసరం పడవచ్చు. క్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. అప్పుడు మొదట సర్జరీ చేసి, వ్యాప్తి నివారణ కోసం ఆ తర్వాత హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్‌ను మొదటిదశలోనే కనుగొంటే ఆంకో΄్లాస్టీ అనే శస్త్రచికిత్సతో రొమ్మును పూర్తిగా రక్షించడమూ సాధ్యమే. -డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. -
సరోగసి ద్వారా బిడ్డను కంటే క్యాన్సర్ వస్తుందా? డాక్టర్లు ఏమంటారంటే..
నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్‌కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్‌లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
రొమ్ము తొలగించకుండానే..కేన్సర్ కొమ్ము వంచేలా..
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ వచ్చిన మహిళా రోగులకు రొమ్ము తొలగించకుండా నిర్వహించే ‘ఆంకోప్లాస్టీ’ చికిత్స పద్ధతికి ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ ఎయిమ్స్, ముంబైలోని టాటా కేన్సర్ ఆస్పత్రి, పుణే, కోల్‌కతాలతో పాటు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రిలోనే ఈ అధునాతన ఆంకోప్లాస్టీ పద్ధతిలో రొమ్ము కేన్సర్‌కు చికిత్స చేస్తున్నారు. ఎంఎన్‌జేలోని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మాటూరి రమేష్ నేతృత్వంలోని వైద్యబృందం ఈ అధునాతన చికిత్స నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 50 మంది మహిళలకు ఆంకోప్లాస్టీ పద్ధతిలో చికిత్స చేశారు. పెరుగుతున్న రొమ్ము కేన్సర్ కేసులు రొమ్ము కేన్సర్లలో 70–80 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే మేలుకొంటున్నారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో ఇలాంటి వారే ఎక్కువగా ఉంటున్నారు. మహిళా కేన్సర్ కేసుల్లో 15 శాతం వరకు రొమ్ము కేన్సర్వే ఉంటున్నాయి. అందులో 80 శాతం చాలా అడ్వాన్స్ స్టేజీలో చికిత్సకు వస్తున్నారు. అక్టోబరు నెలను బ్రెస్ట్ కేన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. రొమ్ము కేన్సర్లకు చికిత్సపరంగా కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ఉంటాయి. వ్యాధి రొమ్ము వరకు ఉంటేనే సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండి ఫోర్త్ స్టేజ్‌కు వస్తే నయం చేయలేం. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ కేన్సర్ స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి. ఎంత ముందుగా గుర్తించగలిగితే నయం చేయడానికి అంత ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆంకోప్లాస్టీ చికిత్స ఇలా.. సాధారణంగా రొమ్ము కేన్సర్‌కు చికిత్సలో మహిళ రొమ్ము మొత్తం తీసేస్తారు. దీనివల్ల వారు మానసికంగా ఆందోళనకు గురవుతారు. అయితే పూర్తిగా రొమ్ము తీసే పద్ధతికి ఎంఎన్‌జే ఆస్పత్రి వైద్యులు చెక్ పెట్టారు. ఆంకోప్లాస్టీ పద్ధతిలో రొమ్ము తొలగించకుండానే సాధారణంగా ఉండేలా చేస్తున్నారు. ఎవరైనా మహిళకు రొమ్ము కేన్సర్‌ను గుర్తించినప్పుడు లేదా ఒకవేళ అది సైజు పెద్దగా ఉంటే కీమోథెరపీ ఇచ్చి గడ్డగా చిన్నగా చేస్తారు. గడ్డ వరకే ఆపరేషన్ చేసినప్పుడు మిగిలిన రొమ్ముపై గుంటలాగా ఉంటుంది. దాన్ని ఆంకోప్లాస్టీ ద్వారా దాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తారు. ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్‌ను వాడుకొని ఏడాదిన్నరగా ఈ ఆంకోప్లాస్టీ చేస్తున్నారు. ఆంకోప్లాస్టీ సర్జరీ చేయడానికి నాలుౖగెదు గంటలు పడుతుంది. రొమ్ము పక్కన చంక సమీపంలోని కండను అంతర్గతంగానే ప్రత్యేక పద్ధతిలో తీసుకొచ్చి రొమ్ములో సర్దుబాటు చేస్తారు. అంటే చంకలో ఉండే అదనపు కొవ్వు, కండ, అవసరమైతే చర్మం కూడా తీసుకొని రొమ్ములో ఎక్కడ అవసరం పడుతుందో అక్కడకు తీసుకొచ్చి కుడతారు. పైకి ఎలాంటి కోత కనిపించకుండా ఆంకోప్లాస్టీ పద్ధతిలో చేస్తారు. ఎంఎన్జేలో ఇది పూర్తిగా ఉచితం. అదే కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆంకోప్లాస్టీ సర్జరీకి ఏకంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది. మూడువారాల్లో సాధారణ స్థితిలోకి.. ఆంకోప్లాస్టీ విధానంపై మేం ప్రత్యేకంగా శిక్షణ పొందాం.ఆంకోప్లాస్టీ సర్జరీ చేశాక మూడునాలుగు రోజుల్లో ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జి చేస్తాం. ఈ చికిత్సలో కుట్లు వాటంతట అవే కరిగిపోయేలా ఉంటాయి. కాబట్టి కుట్లు తీయాల్సిన పనిలేదు. మూడువారాల్లో రోగి సాధారణ జీవితం గడపొచ్చు. నొప్పులేమీ ఉండవు. ఇంటికి వెళ్లేప్పుడు డోలో వంటి మాత్రలు మాత్రమే ఇచ్చి పంపిస్తాం. – డాక్టర్ మాటూరి రమేష్,సర్జికల్ ఆంకాలజిస్ట్, ఎంఎన్‌జే, హైదరాబాద్ రొమ్ము కేన్సర్‌లో ఆంకోప్లాస్టీ ప్రాచుర్యం పొందింది ఈ నెల 13వ తేదీన ప్రత్యేకంగా రొమ్ము కేన్సర్‌పై అవగాహనకు వాక్ నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆంకోప్లాస్టీ విధానం ప్రపంచంలో ప్రాచుర్యం పొందుతుంది. ఇండియాలో కొన్నిచోట్ల మాత్రమే ఈ చికిత్స చేస్తున్నారు. అందులో హైదరాబాద్‌లో ఎంఎన్జేలో చేస్తున్నాం. – డాక్టర్ జయలత, డైరెక్టర్,ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి -
ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్...
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు 45 ఏళ్లు నిండిన వారిలో కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్, ఇప్పుడు యుక్త వయస్సు వారిలో కూడా గుర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రొమ్ము క్యాన్సర్‌ను వైద్యుడి వద్దకు వెళ్లకుండానే సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా గుర్తించే అవకాశం ఉన్నా, చాలా మంది రెండు, మూడు దశల వరకూ గుర్తించలేక పోతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కొంత వరకూ సత్ఫలితాలు ఇస్తున్నా, ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో 50 ఏళ్లు దాటిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతుండగా, మన దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలా అరుదుగా 30 ఏళ్ల వయస్సులోనూ, పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతోంది. ప్రభుత్వం సైతం క్యాన్సర్ వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్రంలో కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, అత్యుత్తమ చికిత్సలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా వివిధ సంస్థలు ప్రజల్లో దీనిపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’తో మేలు.. గ్రామీణ ప్రాంత మహిళలకు కుటుంబ డాక్టర్ కార్యక్రమం వరంలా మారింది. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామానికే వైద్యులు వెళ్లడం, ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టు వైద్యులు సైతం వెళ్లడంతో గ్రామీణ మహిళలు ఆరోగ్య చెకప్ చేయించుకుంటున్నారు. అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే మమోగ్రామ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఇప్పటికే అనేక మందికి ప్రాథమిక దశలో గుర్తించారు. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కూడా వారిని ఫాలోఅప్ చేస్తూ మందులు అందజేస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇలా.. ► పీరియడ్ వచ్చి, ఆగిన ఐదు రోజుల తర్వాత రొమ్ము సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ► రొమ్ముపై గింజంత సైజులో కణితులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందేమో చూడాలి. ► చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్ చేసుకోవాలి. ► రొమ్ముపై ఏమైనా కాయలు ఉన్నాయా, రొమ్ము టైట్ అవుతుందా, అల్సర్స్ వచ్చాయా, చనుమొనల నుంచి రక్తకారుతుందా వంటి అంశాలను సెల్ఫ్‌చెక్ చేసుకోవచ్చు. ► నొప్పిలేని కణితులను క్యాన్సర్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి. వీరికి రొమ్ము క్యాన్సర్ రావచ్చు.. లేటు వయస్సులో పిల్లలు పుట్టిన వారికి, బిడ్డకు పాలివ్వని తల్లులకు, వంశపారంపర్యంగా, జీవనశైలి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, రెడ్‌మీట్ తినేవారిలో, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. ఊబకాయంతో ఉన్న మహిళలు, మోనోపాజ్ చేరే సమయంలో వచ్చే దుష్ఫలితాలకు వాడే మందులు కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ రావొచ్చు. పెళ్లిచేసుకోని మహిళలకు, పిల్లలు లేని మహిళలకు, ధూమపానం, ఆల్కాహాల్ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలపై అవగాహన ఉండాలి.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలపై ప్రతి మహిళా అవగాహన పెంచుకోవడం ద్వారా తొలిదశలో గుర్తించవచ్చు. మన దేశంలో 40 ఏళ్లు దాటిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతొంది. మహిళలకు సోకే క్యాన్సర్లలో 70 శాతం మందిలో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు ఉంటున్నాయి. ప్రతి మహిళ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. రొమ్ముపై నొప్పిలేని కణితి వచ్చినా, చంకలో గడ్డలు ఏర్పడినా వైద్యుడిని సంప్రదించాలి. రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ ఎన్. సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు ప్రత్యేక దృష్టి.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో నాన్ కమ్యూనికల్ డిసీజెస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. అందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి లక్షణాలతో వచ్చిన వారిని గుర్తించి స్క్రీనింగ్ కోసం పంపుతున్నాం. అంతేకాకుండా ఆయా వ్యాధులతో చికిత్స పొందుతున్న వారిని సైతం మానిటరింగ్ చేసి మందులు అందిస్తున్నాం. రొమ్ముపై కణితులు, రొమ్ములో గడ్డలు ఉన్నట్లు మహిళలు వస్తే వారి లక్షణాలను పరిశీలించి నిర్ధారణ పరీక్షల కోసం పంపుతున్నారు. అన్ని పరీక్షలు ప్రభుత్వాస్పత్రిల్లో ఉచితంగా నిర్వహిస్తున్నాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్జిల్లా -
సరోగసీలో బిడ్డకు పాలివ్వలేం!..మరీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా?
బిడ్డకు పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చదివాను. నిజమేనా? నా ఫ్రెండ్ కెరీర్ ఒత్తిడి వల్ల పిల్లల కోసం సరోగసీకి వెళదామనుకుంటోంది. దీనివల్ల బ్రెస్ట్ ఫీడ్ కుదరదు కదా! అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని చెప్పాను. అలా ఏమీ ఉడదు.. బిడ్డను కన్నా పాలు పడకపోతే కూడా అంతే రిస్క్ ఉంటుంది కదా అని వాదిస్తోంది. నా డౌట్ క్లియర్ చేయగలరు. – కె. పృథ్వీ దీప్తి, పుణె సరోగసీ ద్వారా పిల్లలను ప్లాన్ చేసినా.. కొంతమందికి మందుల సహాయంతో బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చేయొచ్చు. దీన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ కన్నా ముందు నుంచి బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చెయ్యడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది అందరిలోనూ విజయవంతం కావచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉన్న ఉపయోగాలు దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ఏడాది పాటు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల 4 నుంచి 5 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి వంటివాటి వల్ల పెరుగుతుంది. హార్మోన్స్ చేంజెస్ వల్ల 50 శాతం రిస్క్ పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వనందు వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ స్వల్పమే. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా సరైన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్)ని మెయిన్టేన్ చేస్తూ .. పోషకాహారం తీసుకుంటూంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. జన్యుపరమైన కారణాలతో హైరిస్క్‌లో ఉన్నవారికి స్క్రీనింగ్‌లో బీఆర్సీఏ జీన్ పాజిటివ్ అని తేలిన వారికి ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ని తగ్గించవచ్చు. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ లేదా మామోగ్రఫీ ద్వారా తేలిగ్గానే క్యాన్సర్ చేంజెస్‌ను కనిపెట్టవచ్చు. ఈరోజుల్లో కొన్ని మెడికేషన్స్ ద్వారా .. సరోగసీ ద్వారా పిల్లలు కన్న తల్లులతో కూడా బ్రెస్ట్ఫీడింగ్కి, బిడ్డతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్‌ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. (చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!) -
పదిసార్లు ఫోన్ చేసినా సాయం లేదు.. డబ్బులేక ప్రాణాలు వదిలేసిన సింధు
కోలీవుడ్‌లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది. గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది. (ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!) గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది. వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు. (ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?) రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు. అజిత్ సాయం కోరితే... తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్‌కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్‌గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది. కనీసం ఫోన్లో అయినా తమ గురించి అజిత్‌కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు. కోలీవుడ్‌లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్‌లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. (ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో) -
ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!
నటీనటులు అనగానే కోట్లకు కోట్లు గడిస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ అదృష్టం తక్కువమందికి దక్కుతుందనేది నిజం. హీరోహీరోయిన్ల తప్పితే మిగతావాళ్లకు ఇచ్చే డబ్బులు తక్కువగానే ఉంటాయి. ఇక సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లయితే చాలావరకు సాధారణ జీవితం గడుపుతుంటారు. అలా ఉండే ఓ నటి.. ఇప్పుడు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. సోమవారం వేకువజామున 2:15 గంటలకు చనిపోయింది. (ఇదీ చదవండి: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం) తెలుగమ్మాయి అంజలి నటించిన 'షాపింగ్‌మాల్' సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ మూవీలో సింధు(44) అనే నటి కూడా ఓ పాత్ర చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. 2020లో ఈమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. అసలే మధ్య తరగతి జీవితం.. దీనికి తోడు క్యాన్సర్ మహమ్మారి వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులో డబ్బులేక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. కొన్నిరోజుల ముందు ఆరోగ్యం మరింత విషమించడంతో చేసేదేం లేక కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సింధు చేరింది. కానీ చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కష్టాలతో పోరాడుతూ వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ ఏట పెళ్లి చేశారు. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నటి అయినప్పటికీ సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ఈమెని కబళించేసి, కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిల్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
ప్రముఖ యూట్యూబర్‌కు ప్రాణాంతక వ్యాధి.. ఇంతకీ ఏమైందంటే?
ప్రముఖ యూట్యూబ్ స్టార్, గ్రేస్ హెల్బిగ్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఫుల్ ఎమోషనల్‌గా కనిపించింది గ్రేస్ హెల్బిగ్. (ఇది చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) ఆమెకు ప్రస్తుతం ట్రిపుల్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. దాదాపు నెల రోజుల క్రితమే వైద్యులు నిర్ధారించినట్లు వెల్లడించింది. క్యాన్సర్ ఉందని తెలియడంతో షాక్‌కు గురైనట్లు పేర్కొంది. ఈ విషయాన్ని తాను మొదట నమ్మలేకపోయానంటూ ఎమోషనల్ అయింది. తన ఇన్‌స్టాలో రాస్తూ..' దాదాపు నెల రోజుల క్రితం నాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసి నేను కూడా షాకయ్యా. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ప్రస్తుతానికి బాగానే ఉన్నా. నాకు భర్త,ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలుస్తున్నారు. డాక్టర్లు కూడా నాకు ధైర్యం చెప్పారు. రొమ్ము క్యాన్సర్‌ను జయించి త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. హెల్బిగ్ యూట్యూబ్ ఛానెల్‌కు 2.6 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. (ఇది చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..) View this post on Instagram A post shared by Grace Helbig (@gracehelbig) -
మీ బ్రెస్ట్ ఇలా ఉంటే మీరు చాలా డేంజర్ లో ఉన్నట్లే
-
వారానికి ఒకసారి ఇలా చేస్తే.. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు
-
క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం
మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడింది. మూడు నెలల క్రితం నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పటినుంచి క్యాన్సర్‌తో పోరాడిన ఆమె ఎట్టకేలకు దాని నుంచి విముక్తి పొందినట్లు స్వయంగా ప్రకటించింది. ''క్యాన్సర్ మహమ్మారి నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు. చికిత్స సందర్భంగా 15 పౌండ్ల బరువు తగ్గాను. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అన్ని భరించి ఇవాళ మహమ్మారి నుంచి విముక్తి సంపాదించా. ఇక క్యాన్సర్ నుంచి విముక్తి కలగగానే టీవీ చానల్ బాధ్యతల్లో లీనమయ్యా.'' అంటూ తెలిపింది. ప్రస్తుతం 66 ఏండ్ల నవ్రతిలోవా మియామీ ఓపెన్‌లో టీవీ చానల్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాకు చెందిన మార్టినా నవ్రతిలోవా 18 సింగిల్స్ , 31 మహిళల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్‌తో మొత్తంగా 59 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 1970,80వ దశకంలో ఆమె సమకాలీకురాలు క్రిస్ ఎవర్ట్‌తో పోటీ పడిన నవ్రతిలోవా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.1981లో అమెరికా పౌరసత్వం రాగానే తనను తాను లెస్బియన్‌గా ప్రకటించుకున్న నవ్రతిలోవా అప్పటి నుంచి ఎల్జీబీటీ(LGBT) హక్కుల కోసం పోరాడుతూ వచ్చింది. చదవండి: దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు? అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై -
9 సార్లు కీమోథెరపీ..అంతలోనే మరో రొమ్ముకి కూడా కేన్సర్: హంసా నందిని
‘‘కేన్సర్ అని నిర్ధారణ అయ్యాక గతం తాలూకు భయాలు, అయోమయాలు, ఒత్తిడి... అన్నీ మళ్లీ నన్ను చుట్టుముట్టినట్లు అనిపించింది. పలుమార్లు వైద్య పరీక్షలు, పలు స్కానింగ్స్ చేయించుకుని, శస్త్ర చికిత్స పూర్తయ్యాక ఇక ఏ భయం లేదు అనుకుంటున్న సమయంలో మరో రొమ్ముకి కూడా కేన్సర్ సోకే ప్రమాదం ఉందని నిర్ధారణ అయింది. మళ్లీ పోరాటం ఆరంభం’’ అని హంసా నందిని చెప్పా రు. 2020లో ఆమెకు గ్రేడ్ 3 ‘కార్సినోమా’ (రొమ్ము కేన్సర్) నిర్ధారణ అయింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హంసా నందిని ఆ సంగతులు పంచుకున్నారు. ‘‘18 ఏళ్ల క్రితం మా అమ్మగారికి బ్రెస్ట్ కేన్సర్ అని నిర్ధారణ అయింది. దురదృష్టం కొద్దీ ఆ పో రాటంలో ఆమె ఓడిపోయారు. ఇక నాకు కేన్సర్ నిర్ధారణ అయ్యాక 9 సార్లు కీమోథెరపీ జరిగింది. ఈ క్లిష్ట పరిస్థితి ముగిసిందనుకున్నాను. కానీ ఆ ఆనందం కొన్నాళ్లే. ఎందుకంటే ‘బీఆర్సీఏ1’ (వంశపారంపర్య రొమ్ము కేన్సర్) అని, జీవితంలో మరో రొమ్ముకి కూడా 70 శాతం కేన్సర్ సోకే ప్రమాదం ఉందని తేలింది. దాంతో పలు శస్త్ర చికిత్సలు, మరో ఏడు సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. నిజానికి ఇది ఎంతో సవాల్‌తో కూడుకున్నది. అందుకే ‘చిరునవ్వుతో పోరాడాలి. మళ్లీ స్క్రీన్ మీద (నటించాలి) కనబడాలి. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా మన జీవితం గురించి చెప్పా లి’ అని నాకు నేనుగా వాగ్దానం చేసుకున్నాను. నేను జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ముందుగా రోగ నిర్ధారణ కావడం, మంచి డాక్టర్లు, నా ఫ్యామిలీ, నా పాజిటివ్ మైండ్ కారణం. గత నవంబర్‌లో షూటింగ్ సెట్లోకి కూడా అడుగుపెట్టాను. ఎప్పటికప్పుడు అందరూ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. నేను సజీవంగా ఉన్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు నాకు నేనుగా ఓప్రామిస్ చేసుకున్నాను. ‘ప్రతి నిమిషాన్ని ఇదే చివరి నిమిషం అనుకుని బతకాలన్నది’ ఆప్రామిస్. ఈ సందర్భంగా మా అమ్మగారి పేరు మీద ‘యామినీ కేన్సర్ ఫౌండేషన్’ని ఆరంభించాలనుకుంటున్న విషయాన్ని ఆనందంగా పంచుకుంటున్నాను. -
Martina Navratilova: మాజీ ఛాంపియన్‌కు ఒకేసారి రెండు క్యాన్సర్లు
మియామి: టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా(66) మళ్లీ క్యాన్సర్ బారిన పడ్డారు. తాజాగా ఆమెకు గొంతు, రొమ్ము క్యాన్సర్ సోకినట్లు తాజాగా తేలింది. అది స్టేజ్ వన్‌లోనే ఉందని తెలుస్తోంది. అంటే ఆరంభ దశ అన్నమాట. మెడ దగ్గర చిన్నకణితి ఏర్పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో.. గొంతు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఉందని వెల్లడైంది. కాగా, నవ్రతిలోవా క్యాన్సర్ బారిన పడడం రెండోసారి. తన కెరీర్లో 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచారు ఆమె. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌తో కలిపి గ్రాండ్‌స్లామ్‌లో మొత్తం 59 సార్లు ఛాంపియన్‌గా నిలిచారు. ప్రపంచ ఉత్తమ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన మార్టినా నవ్రతిలోవాకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకగా.. ఆరు నెలల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ‘‘ఒకేసారి రెండు రకాల క్యాన్సర్లు సోకడం తీవ్రమైన అంశమే. కానీ, చికిత్సతో జయించే అవకాశం ఉంది. ఫలితం సానుకూలంగా వస్తుందనే నమ్ముతున్నా. కొద్దికాలం హాస్పిటల్ వాసన భరించక తప్పదు. నా శక్తికొద్దీ పోరాడతా’’ అని 66 ఏళ్ల నవ్రతిలోవా తెలిపారు. 2010లో క్యాన్సర్ బారిన పడినప్పుడు నిస్సహాయంగా మారనని, అందుకే ఇలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వల్ల తనలా బాధపడుతున్న మహిళలకు సహాయం చేయవచ్చని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. చెక్-అమెరికన్ అయిన నవ్రతిలోవా కుటుంబంతో ప్రస్తుతం ఫ్లోరిడా మియామీలో ఉంటున్నారు. త్వరలోనే ఆమె చికిత్స తీసుకుంటారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
క్యాన్సర్‌ను జయించిన ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
నటి హంసానందిని క్యాన్సర్‌ను జయించింది. సుమారు ఏడాదిగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె 16 సైకిల్స్ కీమోథెరపీ తర్వాత విజయవంతంగా కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చిన హంసా నందిని తాజాగా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. మూవీ సెట్లో మళ్లీ అడుగుపెట్టాను. ఇది నాకు పునర్జన్మ లాంటిది. నా పుట్టినరోజును నా కోస్టార్స్, మూవీ టీంతో సెలబ్రేట్ చేసుకోబోతున్నా. మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే నేను కోలుకోగలిగాను. ఐ యామ్ బ్యాక్ అంటూ హంసా నందిని రాసుకొచ్చింది. షూటింగ్లో పాల్గొన్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసుకుంది. దీంతో వెల్కమ్ బ్యాక్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నటిగా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన హంసానందిని అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలో ఐటెం సాంగ్స్‌లో కనువిందు చేసింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
Health: క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్‌తో..
Health Tips- Mammogram- Heart Disease: నలభై ఏళ్లు దాటాక మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పును ముందే తెలుసుకునేందుకు మామోగ్రామ్ చేయించుకొమ్మని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. కుటుంబ ఆరోగ్య చరిత్రను బట్టి రిస్క్ ఉన్న చాలామంది ఇటీవల డాక్టర్ల సిఫార్సుతో ఏడాదికో లేదా రెండేళ్లకో ఈ పరీక్ష చేయించుకోవడం పరిపాటి అయ్యింది. ఇక కొద్దిరోజుల్లోనే మామోగ్రామ్ చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్ ముప్పుతో పాటు... గుండెజబ్బుల ముప్పు అందునా ప్రత్యేకంగా గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలు బిరుసుగా మారే అథెరో స్క్లిరోసిస్ కార్డియో వాస్క్యులార్ డిసీజ్ గురించి కూడా తెలిసిపోయే అవకాశం రానుంది. ఫలితంగా కేవలం ఒకే పరీక్షతో రెండు మూడు రకాల సమస్యల గుట్టుమట్లు తెలిసిపోనున్నాయి. ఆ వివరాలివి... మన దేశంలో ప్రతి వేయి మంది మహిళల్లో ఇద్దరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రతి వందమందిలో 11 మందికి రొమ్ముల్లోని రక్తనాళాలు సైతం గట్టిగా బిరుసుబారిపోయి బ్రెస్ట్ ఆర్టీరియల్ క్యాల్సిఫికేషన్ జరిగే అవకాశముంది. అలాగే రొమ్ముల్లోని రక్తనాళాలతో పాటు ఇతర రక్తనాళాల్లోనూ క్యాల్షియమ్ చేరడంవల్ల, అవి ఫ్లెక్సిబుల్‌గా కాకుండా గట్టిగా, బిరుసుగా మారే అవకాశాలుంటాయి. ఇలా జరగడం వల్ల ‘కార్డియో వాస్క్యులార్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే కరోనరీ ఆర్టరీల్లో ఈ పరిణామం చోటు చేసుకుంటే అవి బిరుసెక్కిపోయి గుండెకు సరిగా రక్తం అందనందున ‘గుండెపోటు’ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలా రక్తనాళాలు బిరుసుబారడాన్ని ‘అథెరోస్లి్కరోటిక్ కార్డియో వాస్కులార్ డిసీజ్’ అని కూడా అంటారు. రెండు జబ్బుల గురించి తెలిసేది ఇందుకే/ఇలాగే... మామోగ్రామ్‌తో రొమ్ముక్యాన్సర్ ఎలాగూ తెలుస్తుంది. దాంతోపాటు గుండెజబ్బుల ముప్పు ఎలా తెలుస్తుందో తెలియాలంటే రక్తనాళాల గురించి కాస్త అవగాహన అవసరం. రక్తనాళం ఎటుపడితే అటు ఒంగిపోయేలా చాలా మృదువుగా, సరళంగా ఉంటుంది. రక్తప్రవాహానికి వీలుగా రక్తనాళం అలలు అలలుగా కదులుతుంటుంది. మణికట్టు దగ్గర నాడి పట్టుకుని చూసినప్పుడు తెలిసే విషయం నిజానికి అలలు అలలుగా కదిలే రక్తనాళమే. దీన్నే ‘పల్స్’గా మనం చెప్పుకుంటాం. రక్తనాళం ఇలా మృదువుగా ఉండితీరాలి. అప్పుడే రక్తప్రవాహంలోని ఒడిదుడుకులకు తట్టుకోవడం, ఒక్కోసారి రక్తప్రవాహ వేగం పెరిగినా చాలావరకు తట్టుకోవడం జరుగుతుంది. ఈ రక్తనాళం మూడు పొరలతో నిర్మితమై ఉంటుంది. రక్తం ప్రవహించే లోపలి పొరను ‘ఇంటిమా’ అనీ, మధ్యపొరను ‘మీడియా’ అనీ, బయటి పొరను ‘అడ్వంటీషియా’ అని అంటారు. రక్తం ప్రవహించే సమయంలో జరిగే ప్రమాదాల వల్ల అప్పుడప్పుడూ ‘ఇంటిమా’ దెబ్బతింటుంది. కానీ మన శరీరంలో ఏ భాగమైనా దెబ్బతింటే దాన్ని రిపేరు చేసుకునే శక్తి దేహానికి ఉంటుంది. ఈ క్రమంలో ఇలా రిపేర్ జరిగే సమయంలో ఒకవేళ ఇంటిమాలోని దెబ్బతిన్న భాగం కొవ్వులతో (లైపిడ్స్తో) రిపేర్ అయితే అక్కడ క్రమంగా కొవ్వు పాచిలా పేరుకుపోయి, ఉండలాగా మారి రక్తప్రవాహానికి అడ్డుపడవచ్చు. ఒకవేళ పీచు కణాలతో రిపేర్ జరిగితే, అక్కడ సన్నబారి పోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని ‘స్టెనోసిస్’ అంటారు. ఒకవేళ రిపేర్ సమయంలో ఆ భాగంలో క్యాల్షియమ్ పేరుకుపోతే... మృదువుగా ఉండాల్సిన రక్తనాళం గట్టిగా బిరుసెక్కి ఎటూ వంగని గట్టి పైప్‌లా మారుతుంది. వీటిల్లో ఏది జరిగినా రక్తప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అలా వచ్చే రక్తనాళాల సమస్యనే అథెరోస్కి›్లరోసిన్ అంటారు. ఒకవేళ ఇవి గుండెకు రక్తాన్ని అందించే కరొనరీ ఆర్టరీలో జరిగితే... గుండెకండరానికి పోషకాలు, ఆక్సిజన్ అందక గుండెపోటు వస్తుంది. మామోగ్రామ్తోనే గుండె, రక్తనాళాల పరీక్షలిలా... మామోగ్రామ్ సహాయంతో రొమ్ములోని రక్తనాళాల్లో క్యాల్షియమ్ చేరడాన్ని (బ్రెస్ట్ ఆర్టీరియల్ క్యాల్సిఫికేషన్) కూడా గుర్తించవచ్చు. నిజానికి... రొమ్ము కండరాల్లోని రక్తనాళాలతో పాటు గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగే క్యాల్సిఫికేషన్ను అంచనా వేసేందుకు అవకాశముందా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరిగాయి. దానివల్ల రేడియేషన్‌కు గురికాకుండా ఉండటంతో పాటు, కేవలం ఒక పరీక్షకు అయ్యే ఖర్చుతోనే రెండుమూడు అంశాలను తెలుసుకునే అవకాశం ఉందంటూ వైద్యశాస్త్రవేత్తలు, అధ్యయనవేత్తలు ఈ ప్రయత్నాలు చేశారు. మామోగ్రామ్ నిర్వహించినప్పుడు ఆ పరీక్ష తాలూకు స్కోర్స్తోనే... రాబోయే ముప్పు ఏదీ లేదు అనీ, హానికరం కాని గడ్డలు రావచ్చనీ, క్యాన్సర్ ముప్పు ఉందనీ.. ఇలా అంచనా వేస్తుంటారు. అయితే అదే పరీక్షతో వచ్చే క్యాల్షియం స్కోర్ ఆధారంగా కొన్ని దేశాల్లో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని క్యాల్సిఫికేషన్ను సైతం తెలుసు కున్నారు. రక్తనాళాలు గట్టిబారడం వల్ల వచ్చే కార్డియోవాస్క్యులార్ డిసీజ్, అథెరో స్క్లిరోటిక్ కార్డియోవాస్క్యులార్ డిసీజ్‌తో పాటు గుండెపోటుకు గల అవకాశాలనూ లెక్కగట్టారు. ఈ లెక్కల ద్వారా ఇప్పటికే స్వీడన్లో ఒక్క మామోగ్రామ్ పరీక్షతోనే ఇటు రొమ్ముక్యాన్సర్ ముప్పునూ, అటు కార్డియో వాస్క్యులార్ జబ్బు / గుండెపోటు ముప్పునూ తెలుసుకోగలుగుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యక్తులూ, మరెన్నో దేశాల ప్రజల్లో అందరికీ సరిపోయేలాంటి ప్రామాణికత ఇంకా సాధించనందున ఈ పరీక్షలు అన్ని దేశాల్లోనూ జరగడం లేదు. కానీ ప్రామాణికతలు రూపొందించడం కోసం విరివిగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇవి నేడో, రేపో సాకారం కానున్నాయి కూడా. ఇదే జరిగితే... కేవలం మరికొద్ది రోజుల్లోనే మన దేశంలోనూ కేవలం మామోగ్రామ్ అనే ఒక్క పరీక్షతోనే రొమ్ముక్యాన్సర్ ముప్పులూ, రక్తనాళాల ఆరోగ్య పరిస్థితి, గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల ఆరోగ్యం, గుండెపోటుకు గల రిస్క్... ఇవన్నీ తెలిసిపోనున్నాయి. రక్తనాళం ఆరోగ్యాన్ని తెలుసుకునే పరీక్షలివి... కెరోటిడ్ డాప్లర్ అనే పరీక్షతో దేహంలోని రక్తనాళాల పరిస్థితిని, ఇంటిమా తాలూకు ఆరోగ్యాన్ని పరోక్షంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. మూత్రపిండాల వంటి అతి సున్నితమైన, దేహంలో చాలా లోపలికి ఉండే కీలక అవయవాల రక్తనాళాల కండిషన్‌ను నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. అందుకే మెడకు ఇరువైపులా ఉండే ‘కెరోటిడ్’ రక్తనాళాలను పరీక్షించడం ద్వారా లోపలి కీలక అవయవాల్లోని రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. అలాగే ఇక గుండెకు రక్తాన్ని అందించే నాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు యాంజియోగ్రామ్... ఇందులోనూ రేడియేషన్ వల్ల తెలుసుకునే సీటీ యాంజియో వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అటు కెరోటిడ్ డాప్లర్గానీ లేదా సీటీ యాంజియో వంటి పరీక్షలను తరచూ చేయించడానికి అంతగా అవకాశం ఉండదు. కానీ మహిళల విషయానికి వస్తే వారిలో మామోగ్రామ్ పరీక్ష మాత్రం తరచూ చేయించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... కొన్ని ఒకేలాంటి రిస్క్‌ఫ్యాక్టర్లు ఇటు క్యాన్సర్‌కూ, అటు గుండెజబ్బులకూ కారణమవుతాయి. ఉదా: పెరిగే వయసు, స్థూలకాయం, హైబీపీ, అదుపులో లేని డయాబెటిస్ లాంటివి... ఇటు క్యాన్సర్‌నూ, అటు గుండెజబ్బులనూ తెచ్చిపెట్టవచ్చు. పెరిగే వయసు లాంటి మన ప్రమేయం లేని వాటిని మినహాయించి, మిగతా అంశాలను నివారించడం లేదా అదుపులో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్‌నూ, గుండెపోటునూ, రక్తనాళాల సమస్యలనూ నివారించుకోవచ్చు. మిగతా సమస్యలెలా ఉన్నా రెండో దశ దాటిపోతే క్యాన్సర్ ప్రాణాంతకంగా మారే అవకాశముంది. ఒకవేళ అది రొమ్ముక్యాన్సర్ అయితే దాన్ని మొదటి లేదా రెండో దశలో తెలుసుకుంటే దాన్ని సమూలంగా నయం చేసుకునే వైద్యపరిజ్ఞానం ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. అందుకే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ చరిత్ర ఉండటం, అందునా తల్లి లేదా తల్లిగారి అక్కచెల్లెళ్లలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం, బీఆర్సీఏ వంటి జన్యుపరీక్షల్లో క్యాన్సర్ ముప్పు ఉన్నట్లు తేలడం వంటివి జరిగితే... నిర్దిష్ట సమయాల్లో మామోగ్రామ్ పరీక్ష చేయించుకొమ్మంటూ డాక్టర్లు ఇచ్చే సలహా మేరకు మహిళలు తరచూ ఆ పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. -డాక్టర్ సురేశ్ ఏవీఎస్, సీనియర్ మెడికల్ , ఆంకాలజిస్ట్ చదవండి: What Is Varicose Veins: పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే దుర్వాసన లేకుండా బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోండిలా! లేదంటే అతిథులు యాక్ అంటూ పారిపోతారు మరి.. -
3డి మామోగ్రామ్: అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు.. ఇంకా వీరికి..
Breast Cancer Screening- 3D Mammography: మనలో చాలామందికి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలంటేనే భయం. ఎక్కడ ఆ రిపోర్ట్లలో తప్పుడు రిజల్ట్స్ వచ్చి అనవసర భయాలకు గురిచేస్తాయేమోనని ఓ ఆందోళన. అంతేకాకుండా ఏ రెండు లాబ్స్లోనూ ఒకేలాంటి రిపోర్ట్స్ రావనే అభిప్రాయం మరింత ఎక్కువ అనుమానాలకు తావిస్తుంటుంది. టెస్ట్ చేయించుకునేటప్పుడు మంచి ప్రమాణాలతో కూడిన అధునాతన ల్యాబ్‌ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, వారు నిర్ధారణ చేసే పద్ధతులను కూడా తెలుసుకుంటే ఈ తేడాలు అంతగా ఉండకపోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ను తొలిదశలోనే పసిగట్టే స్క్రీనింగ్ టెస్ట్‌లంటే మనలో చాలామందికి భయం, అనుమానం. నేటి స్త్రీని ఎక్కువగా బాధిస్తున్న రొమ్ముక్యాన్సర్‌ను ముందే పసిగట్టడానికి స్క్రీనింగ్ టెస్టుల్లో ఎన్నో ఆధునికతలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఖచ్చితత్వం మరింతగా పెరిగింది. కాబట్టి స్త్రీలు అనవసర భయాందోళనకు గురికావాల్సిన అవసరం అస్సలు లేదు. రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... సాంకేతిక విప్లవం... టోమోసింథసిస్ 3డి మామోగ్రఫీ రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే పసిగడితే కణితి వరకు మాత్రమే తొలగించగలిగే లంపెక్టమీతో పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడంతో పాటు డాక్టర్ సలహా మేరకు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. వాటిల్లో ఇప్పటివరకు ఉన్న 2డి డిజిటల్ మామోగ్రామ్ స్థానంలో ఇప్పుడు 3డి మామోగ్రామ్ అందుబాటులోకి రావడం స్త్రీలకు ఒక వరం అనేది నిస్సందేహం. 2డి మామోగ్రామ్ వర్సెస్ 3డి మామోగ్రామ్... ►3డి మామోగ్రామ్‌లో రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ... 2డి మామోగ్రామ్‌తో పోలిస్తే 40% మరింత ఖచ్చితంగా జరుగుతుంది ►క్యాన్సర్ కాని కణుతులను క్యాన్సర్‌గా చూపించడం, క్యాన్సర్ కణుతులను పసిగట్టలేకపోవడం 3డి మామోగ్రామ్‌లో జరగవు ►2డి మామోగ్రామ్‌తో పోలిస్తే ఫాల్స్ నెగెటివ్, పాజిటివ్‌లకు అవకాశం తక్కువ ►2డి మామోగ్రామ్ రొమ్ము పై నుంచి / పక్క నుంచి పరీక్షిస్తే... 3డి మామోగ్రామ్‌లో రొమ్మును పుస్తకంలోని పేజీల మాదిరిగా ఒక మిల్లీమీటరు స్లైస్‌గా విభజించి, పరిశీలించి ఇమేజ్‌లు పంపుతుంది ►2డి లో మామూలు కణితి వెనక ఉండే క్యాన్సర్ కణితిని పసిగట్టలేకపోవచ్చు. కానీ 3డి మామోగ్రామ్‌లో అలాంటి పొరపాట్లకు తావు లేదు ►రొమ్ము కణజాలం గట్టిగా (డెన్స్‌గా) ఉన్నవారికి, చిన్నవయసు స్త్రీలకు 3డి మామోగ్రామ్‌తో నిర్ధారణ సాధ్యం. ►2డి లో 40 ఏళ్లు పైబడిన స్త్రీలను మాత్రమే పరీక్షించగలం ►3డి మామోగ్రామ్ ఏ వయసు స్త్రీలైనా చేయించుకోవచ్చు. రేడియేషన్ కూడా చాలా తక్కువ ►3డి మామోగ్రామ్ యూఎస్ఎఫ్డిఏ ఆమోదం పొందింది ►క్యాన్సర్ కణితిని మామూలు కణితిగా చూపించడం... దాంతో రొమ్ముక్యాన్సర్ లేటు దశకు చేరుకోవడం, మామూలు కణితిని క్యాన్సర్‌గా చూపించడం... దాంతో బయాప్సీ చేయాల్సిరావడం, ఆందోళన–అనుమానం ఎక్కువకావడం లాంటి సందర్భాలు 3డి మామోగ్రామ్‌లో గణనీయంగా తగ్గుతాయి ►క్యాన్సర్ నిర్ధారణ ఖచ్చితంగా జరగడం వల్ల 2డి మామోగ్రామ్‌తో పోలిస్తే 3డి మామోగ్రామ్‌లో బయాప్సీ చేయాల్సిన సందర్భాలు గణనీయంగా తగ్గుతాయి ►స్క్రీనింగ్ టెస్ట్ సమయం 2డి మామోగ్రామ్ కంటే... 3డిలో కొంచెం ఎక్కువ ►రొమ్ముని నొక్కి (కంప్రెస్) పరీక్షించాల్సిన అవసరం లేదు కాబట్టి 2డి మామోగ్రామ్లోలా స్త్రీలకు అసౌకర్యం, నొప్పి వంటివి 3డి మామోగ్రామ్‌లో ఉండవు. ఎవరికి అవసరం ఈ 3డి మామోగ్రామ్ (టోమోసింథసిస్) రొమ్ములో కణితి చేతికి తగలడం, చనుమొన, రొమ్ముసైజు, చర్మంలో మార్పులు, రొమ్ముమీద నయం కాని పుండు, చనుమొన నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపించేసరికి రొమ్ముక్యాన్సర్ లేటు దశకు చేరుతుందని అర్థం. ఎలాంటి లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా, రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్నా, లేకపోయినా ప్రతి స్త్రీ 40 ఏళ్లు పైబడ్డాక పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అందునా... ►అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు ►దీర్ఘకాలం పాటు సంతానలేమికి మందులు వాడినవారు ►తల్లిపాలు ఇవ్వని స్త్రీలు ►పదేళ్లలోపు రజస్వల అయినవారు ►యాభైఐదేళ్ల తర్వాత కూడా నెలసర్లు వచ్చేవారు ►దీర్ఘకాలం పాటు హార్మోన్ల మీద ప్రభావం చూపే మందులు వాడినవారు ►గర్భాశయం, అండాశయాల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న స్త్రీలు ►స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారు ►సాధారణ మహిళలతో పోలిస్తే... దగ్గర బంధువులు, రక్తసంబంధీకుల్లో బ్రెస్ట్‌క్యాన్సర్ ఉన్న స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ కాబట్టి డాక్టర్ సలహా మేరకు వీరు ముందుగానే స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది. తమకు ఎలాంటి లక్షణాలూ, ఇబ్బందీ లేవు కాబట్టి ఎక్కడో టెస్ట్‌లో తప్పుడు నిర్ధారణ జరిగి తమలో అనవసర ఆందోళన కలుగుతుందేమో అని భయపడి స్క్రీనింగ్ టెస్ట్‌లకు దూరంగా ఉండే మహిళలకు ఖచ్చితమైన రిపోర్టును ఇచ్చే 3డి మామోగ్రామ్ ఓ మంచి ప్రత్యామ్నాయం. -డా. సీహెచ్. మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్. ఫోన్ నంబరు 98490 22121 చదవండి: High Uric Acid Level: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే.. -
Health: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో..
క్యాన్సర్ కణాన్ని తుదముట్టించడానికి సర్జరీ, కీమో, రేడియేషన్ లాంటి ఎన్నో ప్రక్రియలున్నాయి. ఈ ప్రక్రియలన్నింటిలోనూ ఆరోగ్యకరమైన కణాలకు ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా కీమోలో. అదే క్యాన్సర్‌ను చంపేసే అదే రసాయనాన్ని చాలా కచ్చితత్త్వంతో కేవలం క్యాన్సర్ కణంపైనే ప్రయోగించేలా చూడగలిగితే...? అదే ‘ప్రెసిషన్ ఆంకాలజీ’!! అంటే క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో రసాయనాన్ని గురిపెట్టి కొట్టడమనే ఆ ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్యాన్సర్ కణాలను తొలగించడానికి సర్జరీలు, రేడియేషన్, కిమో చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ... వాటిల్లో ఆరోగ్యవంతమైన కణాలకు ఎంతకొంత ముప్పు ఉంది కాబట్టి... ఆ అనర్థాలను తప్పిస్తూ... సరిగ్గా క్యాన్సర్ కణాన్నే గురిపెట్టేలాంటి (టార్గెట్ చేసేలాంటి) మందుల పైనా, చికిత్స ప్రక్రియలపైనా మొదట్నుంచీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కచ్చితంగా క్యాన్సర్ కణాన్నే దెబ్బతీసేలాంటి చికిత్స కాబట్టి... దీన్ని ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటారు. కేవలం క్యాన్సర్ కణాన్నే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి టార్గెటెడ్ థెరపీ అంటున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన కణానికి ఏమాత్రం దెబ్బతగలకుండానో లేదా అత్యంత తక్కువగా నష్టం జరిగేలాగానో జరిగే మందులు రానున్నాయి. అది కూడా కొంత బాధాకరమైన కీమోలోలా రక్తనాళంలోకి ఎక్కించడం కాకుండా... సింపుల్‌గా నోటి ద్వారా తీసుకునే మాత్ర రూపంలో అందుబాటుకి ఇప్పటికే వచ్చాయి, ఇంకా రానున్నాయి. దెబ్బతిన్న జన్యువుకు గురిపెట్టి, క్యాన్సర్‌ను మొగ్గలోనే తుంచేయడం ఎలా? ఈ సహస్రాబ్దం మొదట్లో అంటే 2001లో మానవ జన్యుపటలాన్ని పూర్తిగా నిర్మించడం సాధ్యమైంది. ఈ జన్యుపటలంలో ని ఏ కణమైతే దెబ్బతిన్నదో, అది ఇష్టం వచ్చినట్లుగా అపరిమితంగా అనారోగ్యకరంగా పెరిగి క్యాన్సర్ గడ్డలకు కారణమవుతుంటుంది. ఇప్పుడు మొత్తం మానవ జన్యుపటలంలో సరిగ్గా నిర్దిష్టంగా ఏ కణం తాలూకు జన్యువు దెబ్బతిని, అక్కడ్నుంచి అది క్యాన్సర్‌గా మారుతుందో తెలుసుకుని, సరిగ్గా అపరిమితమైన కచ్చితత్త్వంతో దాన్ని మాత్రమే తుదముట్టించేలా ఔషధాన్ని ప్రయోగించామనుకోండి. అప్పుడు పెరగబోయే క్యాన్సర్ గడ్డను సమూలంగా నాశనం చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ పెరగదు. ఇది స్థూలంగా ‘టార్గెటెడ్ థెరపీ’ తాలూకు సిద్ధాంతం. ఇందుకు ఉపయోగపడేదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ తల్లిదండ్రుల తాలూకు వీర్యకణం, అండం కలిసి పిండం ఏర్పడి... అదే తర్వాత బిడ్డగా ఎదుగుతుంది. ఓ జీవరాశి కలిగి ఉన్న వ్యక్తికి కణం ఎలా మూలమో, ఓ కణానికి దాని తాలూకు జన్యువులు అలా మూలం. ఆ జన్యుపటలంలో ఏదైనా జన్యువు దెబ్బతిని ఉంటే... ఆ తర్వాతి తరం వ్యక్తిలో అది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అందుకే తర్వాతి తరం బిడ్డకు ఎలాంటి జీవకణాలు రాబోతున్నాయో తెలుసుకునేందుకు ఓ పరీక్ష ఉపయోగపడుతుంది. అదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ పరీక్ష. దీన్నే సంక్షిప్తంగా ‘ఎన్జీఎస్’ అంటారు. దీనితో భవిష్యత్తులో బిడ్డపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతగా ఉందో తెలుస్తుంది. అలా క్యాన్సర్ గనకా వస్తే అది భారమే కదా. అందుకే ఆ భారాన్ని ‘ఎన్జీఎస్ ట్యూమర్ మ్యుటేషనల్ బర్డెన్’గా పేర్కొంటారు. ఇలా రాబోయే తరాల్లో ఎవరెవరికి క్యాన్సర్ రానుందో తెలుసుకుని... సరిగ్గా క్యాన్సర్‌ను కలగజేయబోయే ఆ నిర్దిష్ట జన్యువుకు తగిలేలా చికిత్స అందించడం అన్నదే ఈ ప్రక్రియ వెనకనున్న సిద్ధాంతం. ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అన్నది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జన్యువు తీరును బట్టి ప్రత్యేకమైన చికిత్స (టైలర్ మేడ్) చికిత్సలూ సాధ్యం కానున్నాయి. అప్పుడు నొప్పి, బాధాలేని అనేక దీర్ఘకాలిక క్యాన్సర్లను తేలిగ్గా తగ్గించే రోజు త్వరలోనే రానుంది. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’కి మంచి ఉదాహరణ ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ పదేళ్ల కిందట నాలుగో దశలోని లంగ్ క్యాన్సర్ అంటే ఇక అది మరణంతో సమానం. కేవలం 7 శాతం మంది మాత్రమే బతికేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పడు ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ ప్రక్రియ ద్వారా ఏ జన్యువులు దెబ్బతిన్నాయో వాటిని మార్చడం వల్ల బతికి బయటపడే వారు 40 శాతానికి పెరిగారు. పూర్తిగా ఆశవదిలేసుకున్న బాధితులు సైతం కనీసం ఐదేళ్లకు మించి ఆయుష్షు పొందారు. అంతేకాదు... వీళ్లు సాధారణ కీమోతో మిగతా అవయవాలకూ, కణాలకూ జరిగే నష్టాన్ని, తద్వారా వాళ్లకు కలిగే అమితమైన బాధనుంచి విముక్తమయ్యారు. రొమ్యు క్యాన్సర్ నుంచి విముక్తం కావడం కూడా ప్రెసిషన్ ఆంకాలజీకి ఓ మంచి ఉదాహరణ. ఈ క్యాన్సర్‌లో ‘హర్ 2’ అనేది ఓ రకం. దీనికి గురైనవారిలో తొలిదశలో క్యాన్సర్ కణాలు చాలా చురుగ్గా, దూకుడుగా పెరుగుతాయి. వేగంగా ఇతర కణాలకు వ్యాపిస్తాయి. అయితే అమితమైన కచ్చితత్త్వంతో మంచి కణాలను వదిలేసి, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే దెబ్బతీసే టార్గెట్ థెరపీ మందులు రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఓ విప్లవాన్నే తీసుకొచ్చాయి. -డాక్టర్ సాద్విక్ రఘురామ్ వై. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ –హెమటో ఆంకాలజిస్ట్ -
బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! ఇంకా..
World Breastfeeding Week 2022: శిశువు భూమ్మీదకు వచ్చి ‘కేర్’మనగానే తల్లి స్థనం పాలతో ఉప్పొంగుతుంది. పాలా అవి? శిశువు పాలిటి అమృతం. పుట్టిన బిడ్డ నోటికి స్థన్యమందించడం పాలిచ్చే ప్రతి జీవరాశిలో అత్యంత సహజం. కాని మనిషికి తెలివి జాస్తి. కొందరు తల్లులు కొన్ని కారణాల రీత్యా పిల్లలకు తల్లిపాలను నిరాకరిస్తారు. ‘తల్లి పాలు ఇవ్వండి’ అని వారోత్సవాలు జరపడమే ఒక రకంగా ప్రకృతి విరుద్ధం. బిడ్డకు తల్లి పాలివ్వడమే కదా ప్రకృతి సహజం. తల్లి పాలకు దూరమైన బిడ్డ అమృతానికి దూరమైనట్టు కాదా? ఇంతకాలం తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠం అనుకుంటూ వచ్చాం. కాని తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఎంత ప్రయోజనమో తల్లికీ అంతే ప్రయోజనం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘తల్లి తన బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవానంతర కుంగుబాటుకు దూరమయ్యి ఆనందం, సంతృప్తి పొందుతుంది. ఆరోగ్య లాభాలు! ఆమెకు భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, రక్తపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అన్నింటి కంటే మించి బ్రెస్ట్ కాన్సర్ ప్రమాదం కూడా తప్పుతుంది. ప్రపంచంలో తల్లిపాలు ఇవ్వాలనే చైతన్యం వల్ల తల్లిపాలు ఇచ్చే తల్లుల సంఖ్య పెరగడంతోపాటు బ్రెస్ట్ కాన్సర్ బారిన పడే స్త్రీల సంఖ్య ఏటా 20 వేల చొప్పున తగ్గుతోంది’ అంటారు ఆగ్రాకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ నిహారికా మల్హోత్రా. ముగ్గురికి ఇద్దరు... ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి తల్లిపాలు అందడం లేదు. ‘తల్లిపాలలో యాంటీబాడీస్ ఉంటాయి. పసిపిల్లలకు వచ్చే వ్యాధులను నివారించే శక్తి తల్లిపాలకు ఉంది. బిడ్డ పుట్టాక మొదటి గంటలోనే మొదలెట్టి కనీసం 6 నెలల పాటు తల్లి పాలు ఇవ్వడం మేలని డబ్యు.ఎచ్.ఓ అధ్యయనం తెలుపుతోంది’ అంటారు నిహారిక మల్హోత్రా. పిల్లలకు కూడా! తల్లిపాలు తాగిన పిల్లల కంటే పోతపాలు తాగిన పిల్లల్లో స్థూలకాయం, అధిక బరువు కనిపిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం మిగిలిన పిల్లల్లో కనిపించడం లేదని నిర్థారణ అయింది. అంతే కాదు తల్లిపాలు తాగిన పిల్లల్లో మాటలు తొందరగా రావడం, భాషను గ్రహించే శక్తి ఎక్కువగా ఉండటం కూడా గుర్తించారు. తల్లికి సహాయంగా... బిడ్డకు పాలు ఇవ్వడం బిడ్డను అనుక్షణం గమనించుకోవడం ఇవి తల్లికి చాలా ముఖ్యం అవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఇంటి వాతావరణం ఉండాలి. అందుకే పెద్దలు కాన్పుకు పుట్టింటికి పంపేవారు. పుట్టింట్లో తల్లిదండ్రులు తల్లిని చూసుకునేవారు. కాని రెండో కాన్పుకు వచ్చేసరికి ఈ మర్యాదను తప్పిస్తారు. తప్పించవచ్చు... అంతే విశ్రాంతి... చూసుకునే మనుషులు ఉంటే. ఆహారం విషయంలో.. కాన్పు తర్వాత బిడ్డను చూసుకునే తల్లికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వీటి మధ్య వంట– వార్పు ఇతర సంతానం బాగోగులు చూసుకోవడం కూడా భారంగా మారతాయి. భర్త, తల్లిదండ్రులు, అత్తామామలు ఈ విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు... పాలిచ్చే తల్లి ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఏవి తింటే ఎక్కువ శక్తి వచ్చి పాలు బాగా పడతాయో తల్లి ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకొని ఆ ఆహారం ఇవ్వాలి. లేకపోవడం తప్పు కాదు... కొందరు తల్లులు ఉద్యోగాలకు వెంటనే వెళ్లాల్సి రావడం వల్ల తల్లి పాలు ఇవ్వడం వీలవదని అంటారు. కొందరికి థైరాయిడ్ వంటి సమస్యల వల్ల తక్కువ పాలు పడవచ్చు. కొందరు తల్లుల్లో ఏ సమస్యలూ లేకపోయినప్పటికీ తగినన్ని పాలు ఉండవు. ఈ సందర్భాలను కూడా కుటుంబం అర్థం చేసుకోవాలి తప్ప ఒత్తిడి పెట్టడం సరి కాదు. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోందంటే తల్లిపాలు ఏ మాత్రం కల్తీ కాలేవు. కాని కలుషితమైన నీటిలో కలిపే పౌడర్, పోతపాల వల్ల జరుగుతున్న పసికందుల మరణాలను తల్లిపాలు ఇవ్వడం ద్వారా 13 శాతం నివారించవచ్చు అని. పోతపాలు తప్పనిసరి అయితే రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు పెట్టుకోవాలి. కాని తల్లిపాలు పొందడం పిల్లల ప్రాథమిక హక్కు. ఎందుకంటే ‘బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ మిల్క్’ అనేదే అందరు నిపుణుల నినాదం. చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా? -
Health: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్ కాదు! వెంటనే..
నేను ప్రెగ్నెంట్‌ను. ఇప్పుడు అయిదవ నెల. ఈ మధ్య అంటే ఓ పదిరోజులుగా .. ఎడమ బ్రెస్ట్‌లో గడ్డలాగా తగులుతోంది. అది నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో అలా ఉంటుందా? చెకప్ చేయించుకోవాలా? తెలియజేయగలరు. – వి. ఆనంది, జగదల్పూర్ ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్స్లో చాలా మార్పులు జరుగుతుంటాయి. మూడవ నెల నుంచే ఈ మార్పులు కనిపిస్తాయి. బ్రెస్ట్స్ సైజ్ పెరగడం, నిపుల్ ఏరియా డార్క్‌గా అవడం, కొంచెం నొప్పి వంటివి ఉండడం సహజం. కానీ గడ్డలు తగలడం.. ఈ అయిదవ నెల సమయంలో నార్మల్ కాదు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న ప్రసూతి వైద్యులను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ అనేది సురక్షితం. డాక్టర్ పరీక్ష చేసి.. రెండు వైపులా బ్రెస్ట్స్కి అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తారు. ఎక్స్‌రే సురక్షితం కాదు. స్కానింగ్‌లో బ్రెస్ట్ టిష్యూలో ఉండే మార్పులను కనిపెట్టవచ్చు. చాలాసార్లు అంటే 90 శాతం ఇవి క్యాన్సర్ గడ్డలు కావు. ఇవి క్యాన్సర్కారకం కాని ఫైబ్రోఎడినోమా గడ్డలే అయి ఉంటాయి. ఇవి బ్రెస్ట్ సైజ్‌తోపాటు కొంచెం పెరిగి, ప్రెగ్నెన్సీలో బయటపడవచ్చు. ఒక చోట బ్రెస్ట్ టిష్యూ గట్టిపడి ఇవి ఏర్పడతాయి. చాలా మందిలో ఇవి 1–2 సెంటిమీటర్ల నుంచి 5–6 సెంటిమీటర్ల పరిమాణంలో ఉండొచ్చు. వీటిని అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. కానీ ప్రసవం తర్వాత కూడా ఫాలోఅప్ స్కాన్ చేయించుకుంటూ సైజులో మార్పులు కనిపెట్టుకుంటూ ఉండాలి. వీటివల్ల ఫ్యూచర్లో పాలు ఏర్పడడానికి కానీ, ఇవ్వటానికి కానీ ఏ ఇబ్బందీ ఉండదు. కొంతమందిలో ఇవి చాలా పెద్దగా అయి అయిదు సెంటిమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే excision బయాప్సీ ద్వారా చిన్న సర్జరీతో తీయటం జరుగుతుంది. కానీ అది ప్రెగ్నెన్సీలో ఎమర్జెన్సీ గా చెయ్యవలసిన అవసరం లేదు. అరుదుగా నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ రావటం, నిపుల్ ఏరియాలో గుంటలు పడడం, బ్రెస్ట్ అంతా ష్రింక్ అవటం లాంటి మార్పులు ఉంటే అవి ప్రమాద సంకేతాలన్నమాటే. అలాంటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో abdominal shielding చేసి బిడ్డకు ఎక్స్‌రే కణాలు పడకుండా మమ్మోగ్రఫీ అనే టెస్ట్ చేస్తారు. ఇది క్యాన్సర్‌ను కనిపెట్టే టెస్ట్. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో సీనియర్ ప్రసూతి వైద్యులు, బ్రెస్ట్ స్పెషలిస్ట్ మీ కేస్‌ను హ్యాండిల్ చేసి తగిన ట్రీట్మెంట్/ బయాప్సీ/ సర్జరీ గురించి అవగాహన కల్పిస్తారు. అందుకే బ్రెస్ట్‌లో ఎలాంటి గడ్డలు తగిలినా వెంటనే డాక్టర్‌ను కన్సల్ట్ చేయాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
రొమ్ముక్యాన్సర్.. కొత్త మార్పు తెచ్చే పరిశోధన
రొమ్ముక్యాన్సర్ బాధితులు రాత్రివేళ నిద్రపోగానే... రొమ్ముక్యాన్సర్ కణాలు ఒళ్లు విరుచుకుని నిద్రలేస్తాయంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన ఆధారంగా రొమ్ముక్యాన్సర్ రోగుల నుంచి పరీక్షల కోసం రక్తాన్ని సేకరించే వేళలు ఇకపై పగటిపూటగాక... రాత్రివేళల్లోకి మారే అవకాశం లేకపోలేదనీ పరిశోధకులు చెబుతున్నారు. అలాగే డాక్టర్లు తాము చేసే బయాప్సీలను మరింత కచ్చితంగా నిర్వహించేందుకు ఈ అంశం తోడ్పడనుందని చెబుతున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ప్రధాన అధ్యయనవేత్త, ఈటీహెచ్ జ్యూరిక్ (స్విట్జర్లాండ్)కు చెందిన యూనివర్సిటీలోని మాలెక్యులార్ బయాలజీ ప్రొఫెసర్ నికోలా అసెటో. ఆయన మాట్లాడుతూ... ‘‘ఈ పరిశోధన కోసం మా సహచరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు... అలాగే కొన్నిసార్లు రాత్రివేళల్లోనూ అనేక సమయాల్లో బాధితుల నుంచి రక్తాన్ని సేకరిస్తూ వచ్చారు. ఆ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది’’ అని వివరించారు. ఇక ఇదే అధ్యయనంలో పాలుపంచుకున్న మాలెక్యులార్ ఆంకాలజీ విభాగానికి చెందిన మరో పరిశోధకుడు జోయ్ డయామాంటోపౌలో మాట్లాడుతూ ‘‘క్యాన్సర్ కణాలు తొలుత ఉద్భవించిన (ప్రైమరీ) ప్రదేశం నుంచి మరో చోటనున్న (సెకండరీకి) కణజాలాలకు వ్యాప్తి చెందుతాయి. నిద్రను కలిగించే మెలటోనిన్ ఆ వేగాన్ని ప్రభావితం చేస్తోంది. మెలటోనిన్ చురుగ్గా ఉన్న సమయంలోనే క్యాన్సర్ గడ్డ నుంచి కణాలు మరోచోటికి చురుగ్గా ప్రసరిస్తున్నాయి’’ అని వివరించారు. అయితే నిద్రవేళల్లో క్యాన్సర్ విస్తరిస్తుందనే పరిశోధనల ఆధారంగా రాత్రుళ్లు మెలకువతో ఉన్నంత మాత్రాన ఆ అంశం క్యాన్సర్ నివారణకూ, వ్యాప్తిని తగ్గించడానికి దోహదపడుతుందనుకుంటే పొరబాటే. సర్కాడియన్ రిథమ్‌కు తోడ్పడే మెలటోనిన్ తగ్గుదల కారణంగా నిద్రపట్టకపోతే క్యాన్సర్ వ్యాప్తి వేగం తగ్గుతుందనుకోవడం తప్పే. నిద్రలేకపోవడం వల్ల కలిగే ఒత్తిడి వల్ల వ్యాప్తి, విస్తరణ మరింత పెరుగుతాయి. అందువల్ల నైట్‌డ్యూటీలు చేసేవారికి క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందనుకోవడం సరికాదు. వాళ్లకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉంటుంది. అందుకే నైట్ డ్యూటీలు చేసేవారు కనీసం ఐదుగంటల పాటైనా నిద్రపోవడం మేలు. పై పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. చదవండి: మహిళల క్యాన్సర్లు: ఓ అవగాహన -
సినిమా ఛాన్స్.. అప్పుడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను: నటి
ప్రముఖ నటి మహిమ చౌదరి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందని నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించాడు. '‘నా 525వ చిత్రం ‘ద సిగ్నేచ’ర్లో ఓ కీ రోల్ కోసం నెల రోజుల క్రితం అమెరికా నుంచి మహిమకు కాల్ చేశాను. అప్పుడే తను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకుంది’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో మహిమ.. క్యాన్సర్ వ్యాధితో తాను చేసిన పోరాటం గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది. ‘మీ 525 సినిమాలో నటించాలని మీరు కాల్ చేసినప్పుడు నేను హాస్పిటల్ బెడ్‌పై ఉన్నాను. నా చుట్టూ డాక్టర్లు, నర్సులు ఉన్నారు. నా జుట్టు పూర్తి పోయింది. మీరు ఇప్పుడు కాల్ చేశారేంటి అనుకున్నాను. ఇంకా వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించాలని ఇంకా నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి. నేను నటిస్తానని చెప్పలేను. ఎందుకంటే నా హెయిర్ మొత్తం లాస్ అయ్యింది’ అని చెప్పుకొచ్చింది. ‘సాధారణ చెకప్ కోసం వెళ్లగా క్యాన్సర్ బయటపడింది. నాకు ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు కూడా కనిపించలేదు. కానీ క్లారిటీ కోసం చెకప్‌కు వెళ్లాను. టెస్ట్ చేసిన డాక్టర్లు ఇది క్యాన్సర్ కణతి అయ్యుండొచ్చు అన్నారు. మీరు దీన్ని తీసేయాలనుకుంటున్నారా? అని అడిగారు. వద్దు వద్దు నేను జస్ట్ చెకప్ కోసం వచ్చాను అన్నాను. చివరకు బయాప్సీ చేసి కణతి తీసి టెస్ట్ చేయగా క్యాన్సర్‌గా తేలింది. ఆ తర్వాత కీమోలు ఇస్తున్న సమయంలో చాలా నీరసించి పోయాను. ఎనర్జీ లాస్ అయ్యాను. నా హెయిర్ పోయింది. కానీ ధైర్యంతో ఈ వ్యాధిని ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని వివరించింది. కాగా క్యాన్సర్‌పై ఎంతో మంది మహిళలకు అవగాహన కల్పించేందుకు మహిమ తనని కూడా భాగం చేశారని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
Nidhi Agarwal: అసలే భర్త పరిస్థితి బాగాలేదు.. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్.. అయినా సరే!
ఎంతో ఆనందంగా సాగిపోతున్న పచ్చని సంసారంలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన ఉపద్రవాలు కుటుంబంలోని సంతోషాన్ని చిదిమేశాయి. అయినా తట్టుకుని నిలబడి, మరెంతో మంది అభాగ్యుల జీవితాల్లో సంతోషం అనే పువ్వులు పూయిస్తోంది ఆ ఇంటి ఇల్లాలు నిధీ అగర్వాల్. ఢిల్లీకి చెందిన నిధీ అగర్వాల్ భర్త అతుల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో లాజిస్టిక్ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. 2012లో అరుదైన వ్యాధి ‘మల్టిపుల్ సిస్టమ్ అట్రోఫీ’ వచ్చింది. దీంతో అతుల్ మెదడులోని కణాలు క్రమంగా క్షీణించడంతో శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి. దీంతో మాటలు, శరీరంలో కదలికలు ఆగిపోయి మంచానికే పరిమితమయ్యాడు. రోజులు గడిచే కొద్ది ఆహారం కూడా తీసుకోవడం కష్టమైంది. పైపు ద్వారా తీసుకోవాల్సి వచ్చింది. పచ్చని సంసారంలో ఏర్పడిన ఈ విపత్తు నుంచి కోలుకోక ముందే, నిధీ అగర్వాల్‌కు ఆరోగ్యం బాగుండకపోవడంతో పరీక్షలు చేసిన వైద్యులు 2014 లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అసలే భర్త పరిస్థితి బాగాలేదు. ఈ సమయంలో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తెలియడంతో బాధను ఆపుకోలేకపోయింది. అయితే అదృష్టవశాత్తూ తొలిదశలోనే తెలియడం కొంత మెరుగైంది. తనకొచ్చిన కష్టాన్ని దిగమింగుకుని కీమోథెర పీ తీసుకుని కాస్త కుదుటపడింది. ఆతరువాత బ్యూటీ థెరపీ తీసుకుంది. ఈ థెరపీ తో నిధీ అగర్వాల్‌కు కొంత ఉపశాంతితోపాటు, జీవితంపై ఆశలు చిగురించాయి. బ్లిస్ ఫౌండేషన్.. తనలాగా అనేక కుటుంబ కష్టాలు, వివిధ రకాల రోగాలతో బాధపడుతోన్న వారికి బ్యూటీథెరపీతో తను పొందిన ఉపశాంతిని అందించాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే తన కొడుకు సాయంతో ‘బ్లిస్ ఫౌండేషన్’ను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ ద్వారా.. క్యాన్సర్ రోగులకు బ్యూటీ థెరపీ అందిస్తోంది. ఈ థెరపీలో భాగంగా రోగులకు మేకప్ వేయడంతోపాటు, మోడల్ హెయిర్ స్టైల్స్‌తో అందంగా, సరికొత్తగా చూపిస్తూ వారికి జీవితం మీద ఆశలు కల్పిస్తోంది. రోగులను అందంగా అలంకరించి వారిని ర్యాంప్ వాక్ చేయించి వారిలో రోగులమన్న భావనను తీసివేసేందుకు కృషి చేయసాగింది. జుంబా కూడా.. బ్యూటీ థెరపీతోపాటు జుంబా, థియేటర్ థెరపీ తో రోగుల బాధాకర భావోద్వేగాలను నియంత్రిస్తోంది. ఈ థెరపీలే కాదు, క్యాన్సర్‌ను ఎలా జయించాలో తెలిపే అవగాహన కార్యక్రమాలను ‘క్యాన్సర్ సర్వైవర్ మంత్’ పేరిట నిర్వహిస్తోంది. క్యాన్సర్‌ను తొలిదశలో ఎలా గుర్తించాలి? ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కొవాలో అవగాహన కార్యక్రమాల ద్వారా వివరిస్తూ అనేకమంది రోగులకు సాంత్వన కలిగిస్తోంది. కష్టాలను జయిస్తూనే, సంతోషంగా ఎలా ఉండవచ్చనే మాటకు ఉదాహరణగా నిలుస్తోంది నిధీ అగర్వాల్. చదవండి: Surat Old Couple Inspirational Story: కూతురి జుట్టు బాగా ఊడిపోవడం చూసి... ఇంటర్నెట్లో వెదికి.. వృద్ధ దంపతులు! -
క్యాన్సర్ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి
Chhavi Mittal About Her First Radiation Therapy Experience: ప్రముఖ టీవీ నటి ఛవి మిట్టల్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. గత నెల తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన ఆమె ఏమాత్రం బాధపడకుండా తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా వేదికగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రొమ్ము క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకున్న ఆమె ఈ రోజు తొలి రేడియేషన్ థెరపీ చేయించుకున్నట్లు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె తొలి రేడియేషన్ థెరపీ అనుభవాన్ని పంచుకుంది. చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్! ‘నా రేడియేషన్ థెరపీ ఈ రోజే మొదలైంది. దీనికి ముందు ఈ రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందని కొందరితో చర్చించాను. దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని, వాటితో అంత సౌకర్యంగా ఉండకపోవచ్చని నాకు చెప్పారు. కీమో లేదా రేడియోథెరపీ అన్నది పేషెంట్ ఎంపికే అని చాలా మంది అన్నారు. సాంకేతికంగా అనుమతి పత్రంపై సంతకం చేయడమే మనం చేయాల్సింది. మొత్తానికి చికిత్స ఏంటన్నది మీ డాక్టర్ నిర్ణయించాల్సిందే. డాక్టర్ దృష్టి మన ప్రాణాలు కాపాడడంపైనే కానీ, మన సైడ్ ఎఫెక్ట్స్‌ను దూరం చేయడంపై కాదు’ ఆమె రాసుకొచ్చింది. చదవండి: భర్తతో హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు, వైరల్ ‘అయితే నేను కేవలం జీవించాలనుకోవడం లేదు. నా లైఫ్‌ని సంతోషంగా గడపాలనుకుంటున్నా. ఎలాగు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను. అందుకే రేడియేషన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలను గురించి పట్టించుకోవాలని అనుకోవడం లేదు. ఇక ఈ జర్నీలో నాకు సహాకరిస్తూ వెన్నంటే ఉంటున్న నా డాక్టర్లకు కృతజ్ఞతలు. ఈ రేడియేషన్ థెరపీ అనేది 4 నెలల పాటు వారానికి లేదా 5 రోజుల చొప్పున 20 సైకిల్స్‌గా ఇవ్వనున్నారు’ అని ఛవి మిట్టల్ పేర్కొంది. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) -
క్యాన్సర్‌తో బాధపడుతున్న బుల్లితెర నటి.. ఎమోషనల్‌గా పోస్ట్
Actress Chhavi Mittal Suffering With Breast Cancer: హిందీ సీరియల్స్‌తో పాపులారిటీ దక్కించుకుంది ఛవి మిట్టల్. తాజాగా ఛవి మిట్టల్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్‌లో వర్క్అవుట్ చేస్తుండగా ఛవి గాయపడింది. వెంటనే డాక్టర్లను సంప్రదించగా రొమ్ములో కణితి ఉందని గుర్తించారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. త్వరలో సర్జరీ చేయించుకోనుంది ఛవి మిట్టల్. అయితే ఇలాంటి క్యాన్సర్ బారిన పడితే సాధారణంగా ఎవరైనా భయపడుతారు. కానీ ఛవి మాత్రం ఈ విషయం తెలిసినప్పటినుంచి తనలా బాధపడుతున్న మరెంతో మందికి రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. అలాగే తనకు క్యాన్సర్ అనే విషయాన్ని చెబుతూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది. 'డియర్ బ్రెస్ట్స్.. ఇది మీకు అభినందనల పోస్ట్. మీ మ్యాజిక్ ఏంటో మీరు నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చినప్పుడు నేను తొలిసారి గమనించాను. ఈరోజు మీలో ఒకరు క్యాన్సర్‌తో పోరాడినప్పుడు మీకు అండగా ఉండటం నా వంతు. ఇలా జరగడం గొప్పేమి కాదు గానీ విచారించాల్సిన అవసరం లేదు. ఇది సులభమైనదేం కాదు. అలా అని కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను మళ్లీ అదే విధంగా కనిపించకపోవచ్చు. అలాగే కచ్చితంగా నాకు భిన్నమైన అనుభూతి కలగదు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడి గెలిచి వారందరి నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందుతున్నానో మీకు తెలియదు. అలాగే, మీలో ఇప్పటికే తెలిసిన వారికి, ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చేసే ప్రతీ కాల్కి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ రాసుకొచ్చింది ఛవి మిట్టల్. 41 ఏళ్ల మొహీత్ హుస్సేన్‌ను వివాహం చేసుకుంది ఛవి మిట్టల్. వారికి అర్హమ్ అనే కుమారుడు, అరీజా అనే కుమార్తె ఉన్నారు. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) -
పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. అయితే... ఆ ముప్పు మాత్రం..
కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు మహిళల్లో ఎక్కువ. సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుంది. అలాగే చాలా అరుదుగానైనా పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ కనిపించినా... మహిళల్లోనే అది ఎక్కువ. మహిళలకు వచ్చే క్యాన్సర్ల గురించి అవగాహన కోసమే ఈ కథనం. సర్వికల్ క్యాన్సర్... సర్వికల్ క్యాన్సర్ అన్నది మునుపటి అంత ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ చాలా ముందుగానే గుర్తించవచ్చు. దీనికి కారణం... క్యాన్సర్ వచ్చే ముందర ఉండే ప్రీ–క్యాన్సర్ దశ... దీనికి చాలా ఎక్కువ. అంటే తనను గుర్తించడానికి అది చాలా ఎక్కువ వ్యవధి ఇస్తుందన్నమాట. ఈ ప్రీ–క్యాన్సర్ లక్షణాలతో అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందే దాన్ని పసిగట్టవచ్చు. దాంతో నిరోధించడానికి అవకాశాలు కూడా ఎక్కువే. దానికోసం పాప్‌స్మియర్ అనే పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలు ఇలా... ప్రతి మహిళా 25 ఏళ్లు దాటాక ఒకసారి పరీక్ష చేయించాలి. ప్రీ–క్యాన్సర్ ఏదీ కనిపించకపోతే అప్పట్నుంచి ప్రతి మూడేళ్లకోమారు ఈ పరీక్ష చేయించుకోవాలి. వ్యాక్సిన్: సర్వికల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వస్తుందని కనుక్కున్నారు. దానికి వ్యాక్సిన్ రూపొందించడమూ సాధ్యమయ్యింది. అయితే దీన్ని వ్యాధి రాకమునుపే తీసుకోవాలి. మనదేశంలో ఈ వ్యాధి విస్తృతి దృష్ట్యా అమ్మాయిలు ఈ వ్యాక్సిన్‌ను 10–15 ఏళ్లప్పుడే తీసుకుంటే మంచిది. రొమ్ము క్యాన్సర్: ఈ తరహా క్యాన్సర్లలో వయస్సుకూ వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది. అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు మరింతగా పెరుగుతుంటాయన్నమాట. మరీ స్పష్టంగా చెప్పాలంటే 80 ఏళ్లు పైబడ్డ ప్రతి పదిమందిలో ఒకరికి ఇది తప్పక కనిపిస్తుంది. ఎవరెవరు రిస్క్ గ్రూప్ : విస్తృతి ఎక్కువ కాబట్టే మహిళల్లో దీని గురించి ఆందోళన కూడా అధికమే. అయినా అంతగా బెంగ పడనక్కర్లేదు. కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు, రక్తసంబంధీకులలో ఈ వ్యాధి వచ్చిన వారు ఉంటే ∙పిల్లలు లేని వాళ్లలో ∙మొదటిసారి గర్భం ముప్ఫయి ఏళ్లు దాటాక వస్తే ఐదేళ్లకు పైబడి హార్మోనల్ చికిత్స తీసుకుంటూ ఉంటే... వీళ్లకు ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అలాంటివాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ రిస్క్ గ్రూపులు చేయించాల్సిన మూడు పరీక్షలు చేయించుకోవాలి. మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో వాళ్లకు తమ రొమ్ము ఎలా ఉంటుందన్న అంశంపై అవగాహన పెరుగుతుంది. ఫలితంగా అందులో ఏ చిన్నమార్పు వచ్చినా అర్థమైపోతుంది. దాంతో ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరితంగా గుర్తించగలరు. దాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. ఈ పరీక్షలు ఎలాగంటే... ►ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి. ►ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి. ►40 ఏళ్లు దాటాక 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండాలి. ►50 ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించడం మంచిది. ►ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లకు డాక్టర్ సలహా మేరకు పరీక్షలు ఇంకా త్వరితంగానే అవసరం కావచ్చు. చాలా హై రిస్క్ ఉంటే... కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు అనుకుంటే... వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేదీ లేనిదీ... కొన్ని జన్యుపరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా అన్నదాన్ని బట్టి కనుక్కోవచ్చు. ఓ చిన్ని రక్తపరీక్ష ద్వారా దీన్ని కనుక్కోవడం చాలా సులభం. కాబట్టి రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. -డాక్టర్ సీహెచ్. మోహనవంశీ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్z ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబర్: 98480 11421 చదవండి: Health Tips: గర్భవతుల్లో తినగానే కడుపులో ఇబ్బందిగా ఉంటే... -
Health: రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలా? అయితే..
మహిళల్లో కనిపించే కొన్ని సమస్యలు చాలా ఆందోళన కలిగిస్తాయి. ఉదాహరణకు రొమ్ముల్లో కనిపించే స్రావాలు క్యాన్సర్ కారణంగానా అని భయపెడతాయి. కానీ ఆ లక్షణం తప్పనిసరిగా క్యాన్సర్ వల్లనే కానక్కర్లేదు. బిగుతైన దుస్తుల వల్ల కూడా కావచ్చు. అలాగే తినగానే గర్భిణుల్లో ఇబ్బంది కలగవచ్చు. ఇలాంటి కొన్ని సమస్యలపై ఉండే సాధారణ అపోహలు తొలగించి, అవగాహన కలిగించే కథనాలివి... కొందరిలో రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలు వస్తుంటాయి. ఈ కండిషన్‌ను గెలాక్టోరియా అంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మహిళల్లో చాలా మంది దాన్ని క్యాన్సర్‌గా అనుమానించి, చాలా ఆందోళనకు గురవుతుంటారు. నిజానికి రొమ్ము నుంచి నీరు రావడానికి చాలా కారణాలుంటాయి. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతున్నప్పుడూ, మెదడులో ఏమైనా కంతుల వల్లగానీ, హైపోథైరాయిడిజమ్ వల్ల గానీ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుండటం వల్ల గానీ, లోదుస్తులు బాగా బిగుతుగా ఉన్నా, రొమ్ములో కంతులు ఉన్నా లేదా యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతున్నా, అవే కాకుండా మరికొన్ని రకాల మందుల్ని చాలాకాలంగా వాడుతున్నా కూడా రొమ్ముల్లో నీరు రావచ్చు. అయితే క్యాన్సర్‌లో కూడా ఇలా రొమ్మునుంచి స్రావాలు వస్తుండవచ్చు. అయితే... స్రావాలు కనిపించిన ప్రతిసారి అందుకు రొమ్ముక్యాన్సరే కారణం కాబోదు. అందుకే ఇలాంటి సమయాల్లో అనవసరంగా ఆందోళన చెందకుండా... తొలుత డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. దానికి కారణం ఏమిటో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. రొమ్ము పరీక్ష చేయించుకున్నప్పుడు ఏవైనా గడ్డలుగానీ, ఇన్ఫెక్షన్గానీ ఉన్నాయా అని చూడాలి. కొన్నిసార్లు రొమ్ము స్కానింగ్, మామోగ్రఫీ ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, సీబీపీ, ఈఎస్ఆర్ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. దానిలో బయటపడ్డ సమస్య లేదా కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కొన్ని మందులను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటే మందుల్ని ఆపడం లేదా మార్చడం జరుగుతుంది. కొన్నిసార్లు సింపుల్‌గా దుస్తులను కాస్త వదులుగా వేసుకోవడం వల్లనే ఈ సమస్య తీరిపోవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందకుండా డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
Cancer: క్యాన్సర్ గురించి అవి కేవలం అపోహలు మాత్రమే.. వాస్తవాలేమిటి?
క్యాన్సర్ గడ్డపై కత్తి ఆనిస్తే అది మరింతగా విజృంభించి విస్తరిస్తుందనీ, క్యాన్సర్ ఏదైనా... సర్జరీ చేయకూడదనే అపోహలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. అయితే తొలిదశ లో క్యాన్సర్‌ను కనుగొంటే దాన్ని నూరు శాతం నయం చేయడానికి శస్త్రచికిత్సే ప్రధాన ప్రక్రియ అనీ, దాదాపు అరవై శాతానికి పైగా క్యాన్సర్లు నయం చేయవచ్చని అంటున్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు (సీఎస్ రావు). క్యాన్సర్‌పై ఉన్న అపోహా వాస్తవాల గురించి ఆయన ఏమన్నారో చదవండి. కొన్ని క్యాన్సర్లకు (ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ల వంటివాటికి) కేవలం శస్త్రచికిత్సే అసలైన చికిత్స అంటారు కదా. అది ఎంతవరకు వాస్తవం? జ. హార్మోన్ల తేడాలతో వచ్చే అనేక రకాల క్యాన్సర్లతో పాటు ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ వంటి వాటికి శస్త్రచికిత్సే ప్రధాన చికిత్స. నిజానికి సరైన రీతిలో శస్త్ర చికిత్స చేసినప్పుడు తొలిదశ రేడియేషన్ అవసరమే ఉండకపోవచ్చు. కాకపోతే అప్పటికే వేరేచోటికి క్యాన్సర్ కణాలు పాకి ఉండవచ్చుననే అభిప్రాయంతోనే రేడియేషన్ లేదా కీమో ఇవ్వాల్సి వస్తుంటుంది. లేదంటే కేవలం శస్త్ర చికిత్సతోనే మొత్తం రొమ్ముక్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది. శస్త్రచికిత్స వల్ల వ్రణాన్ని తొలగించడం వల్ల దేహంలో కొన్ని చోట్ల సొట్టలు కూడా పడే అవకాశముంది కదా... వాటిని సరిదిద్దడానికి ఏవైనా మార్గాలున్నాయా? జ. శస్త్రచికిత్స తర్వాత పడే సొట్టలు రెండు రకాలు. అవి... 1. బయటకు కనిపించేవి 2. బయటకు కనిపించనివి. బయటకు కనిపించే వాటికే ప్లాస్టిక్ సర్జరీ అవసరం వస్తుంది. బయటకు కనిపించని వాటి కారణంగా మనలో... అంటే మనం నిర్వహించే పనుల్లో ఏవైనా లోపాలు (ఫంక్షనల్ లాస్) తలెత్తినప్పుడు మరికొన్ని శస్త్రచికిత్సల సహాయంతో వాటిని అధిగమించవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనూ మళ్లీ మనకు పనికి వచ్చేది ‘శస్త్రచికిత్స’ ప్రక్రియే. ‘కత్తి ఆనిస్తే చాలు... క్యాన్సర్ మరింతగా రెచ్చిపోతుంది. ఇంకా ఎక్కువగా పాకుతుంది’ అంటారు అందుకే క్యాన్సర్‌పై కత్తే పెట్టకూడదు అనే మాట చాలామందిలో ఉంది. అది కేవలం అపోహా? ఇందులో ఏదైనా వాస్తవం ఉందా? జ: నిజానికి క్యాన్సర్గురించి వైద్యశాస్త్ర పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో క్యాన్సర్ బాగా ముదిరిపోయిన దశలో శస్త్రచికిత్స చేస్తుండేవారు. అప్పటికే క్యాన్సర్ కణాలు వేర్వేరు అవయవాలకు విస్తరించి ఉండటంతో, అసలు క్యాన్సర్ గడ్డను (ప్రైమరీని) తొలగించినప్పటికీ... ఇతర ప్రాంతాలకు విస్తరించిన గడ్డలు (సెకండరీ ట్యూమర్స్) పెరుగుతుండేవి. ఫలితంగా క్యాన్సర్‌కు కత్తి పెట్టకూడదనే దురభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడు మొదటి, రెండో దశలోనే క్యాన్సర్లను కనుగొంటున్నందున శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయమైపోయిన రోగులెందరో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కత్తి పెట్టలేని మారుమూల ప్రదేశాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలకీ , లేదా కత్తి ఆనించడమే సమస్య గా మారే మెదడు వంటి కీలకమైన అవయవాల్లోని లోపలి భాగాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి శస్త్రచికిత్సల్లో ఏవైనా అధునాతన ప్రక్రియలు ఉన్నాయా? జ. మనం శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రాంతాల్లో ఉన్న క్యాన్సర్ గడ్డల (డీప్ సీటెడ్ ట్యూమర్స్)ను తొలగించేందుకు... ఎమ్మారై గైడెడ్ సర్జరీ, సింటిగ్రఫీ గైడెడ్ సర్జరీ, అల్ట్రా సౌండ్ గైడెడ్ సర్జరీ వంటి కొన్ని ప్రక్రియలు సమర్థంగా ఉపయోగపడతాయి. వాటి సహాయంతో దేహంలోని మారుమూల ప్రాంతాల్లో చాలా లోతుగా ఉన్న గడ్డలనూ తొలగించవచ్చు. భవిష్యత్తులో శస్త్రచికిత్స విషయంలో రాబోయే విప్లవాత్మకమైన మార్పులు ఏవైనా ఉన్నాయా? జ. గతంలో క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా కనుగొనేవారు. కానీ ఇటీవల క్యాన్సర్ తొలిదశలో ఉండగానే లేదా అంతకు చాలా ముందుగానే కనుగొనడమే ఓ విప్లవవాత్మకమైన మార్పు. కేవలం ఈ కారణంగానే కొన్ని క్యాన్సర్లు సమూలంగా నయమయ్యే అవకాశం దక్కింది. అందుకే మూడు దశాబ్దాలకు ముందు... క్యాన్సర్లలో 85 శాతం నయం కానివి ఉండేవన్న అపప్రథ ఉండేది. కానీ ఇప్పుడు 85 శాతం పూర్తిగా నయమైపోతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్స వల్లే సమూలంగా తొలగించడం సాధ్యమవుతోంది. దీనికి తోడు రేడియో గైడెడ్ లోకలైజెషన్, రేడియోలాజికల్ లోకలైజెషన్, ఇంట్రా ఆపరేటివ్ కీమో థెరపీ, ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ లాంటి విప్లవాత్మకమైన ప్రక్రియల ద్వారా మరింత సమర్థమైన చికిత్సకు అవకాశం దక్కింది. క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ప్రాధాన్యమేమిటి? పరిమితులు ఏమిటి? జ: క్యాన్సర్‌కు మొట్టమొదటి వైద్యం శస్త్ర చికిత్సయే. ఇది ఎక్కువగా గడ్డల రూపంలో కనిపించే క్యాన్సర్ వ్రణాల్లో (సాలిడ్ ట్యూమర్స్) బాగా ఉపయోగపడుతుంది. ఉదా: థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయం, పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఎముకల్లో వచ్చే సార్కోమా, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్. అంటే దాదాపు 60 శాతం క్యాన్సర్ లకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్ర చికిత్స వల్ల వ్యాధి ఏయే దశలలో ఉందన్న సమాచారమూ తెలుస్తుంది. తొలి దశలలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ శస్త్రచికిత్స సహాయంతో పూర్తిగా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాలలో ముదిరి పోయిన క్యాన్సర్‌లో శస్త్ర చికిత్స వల్లనే ఉపశమనం లభిస్తుంది. ఉదా: వాసన వచ్చే పుండు, పేగుకు రంధ్రం పడినప్పుడు, శ్వాస తీసుకునేందుకు అంతరాయం కలుగుతున్న సందర్భాల్లో శస్త్ర చికిత్సతోనే రోగికి ప్రాణదానం చేయవచ్చు. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చదవండి: Gas Problem Solution: గ్యాస్ సమస్యా... పాస్తా, కేక్ బిస్కెట్స్, ఉల్లి, బీట్రూట్స్ తింటే గనుక అంతే! -
నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్‌లను రూపొందించి..
ముప్పై ఆరేళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకున్న డాక్టర్ రోహిణి పాటిల్ తను అనుభవించిన బాధ ఇతర బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు రాకూడదనుకుంది. సిలికాన్ ప్రొస్తెటిక్ బ్రెస్ట్కు అయ్యే ఖర్చు అందరూ భరించలేరని, నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్‌లను రూపొందించి, ఉచితంగా అందజేస్తోంది. 2018లో ప్రారంభించిన ‘నిటెడ్ నాకర్స్ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు చేరవవుతున్నారు డాక్టర్ రోహిణి. నూలు రొమ్ముల తయారీ వెనకాల కృషి గురించి, మహిళలకు ఉచితంగా అందజేస్తున్న విధానాల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఒక రోజు ఓ పెద్దావిడ నా శిబిరానికి వచ్చింది. ‘పది నెలల క్రితం రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు అదే ప్లేస్‌లో గాయం కావడంతో ఆసుపత్రికి వచ్చాను’ అని చెప్పింది. నేనావిడచేత ఇంకాస్త మాట్లాడించాను. అప్పుడు ఆమె చెప్పింది విని చాలా బాధపడ్డాను. వెదురు బుట్టకు ఒక క్లాత్‌ను కలిపి కుట్టి, రొమ్ము స్థానంలో పెట్టుకుంటున్నట్టు, ఆ వెదురు కొన ఒరిపిడి వల్ల గాయమయ్యిందని చెప్పింది. రొమ్ము క్యాన్సర్ కారణంగా చికిత్సలో భాగంగా రొమ్మును తీసేస్తే అది ఆ మహిళల మానసిక స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సిలికాన్ ప్రొస్తెటిక్ బ్రెస్ట్ల ఖరీదు ఎక్కువ కావడంతో వాటిని మహిళలకు ఉచితంగా అందించలేకపోయాను. ఒంటరి తల్లిని..? 2002లో నాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు ఆలోచనలో పడ్డాను. మా కుటుంబంలో చిన్న వయస్సులో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు లేవు. దీంతో నేను ఈ వ్యాధిని అంత తొందరగా అంగీకరించలేక పోయాను. పైగా ఎనిమిదేళ్ల బిడ్డకు ఒంటరి తల్లిని. నా బిడ్డ పోషణకు, చదువుకు ఖర్చులను నేనే చూసుకోవాలి. దీంతో నా చికిత్స కాస్త ఆలస్యం అయ్యింది. రొమ్ము భాగాన్ని తీసేయాల్సి వచ్చింది. చీర కట్టేటపుడు రెండు భుజాల మీదా పల్లూ పట్టుకుని ఛాతీ కనిపించకుండా ఉండేదాన్ని. నేను డాక్టర్ అయినప్పటికీ, రొమ్ము తొలగిం^è డాన్ని ఆపలేకపోయాను. చికిత్స గాయాలు మానాయి. దీంతో క్లాత్‌ను ఒక బంతిలా చేసి బ్లౌజ్ లోపల ఉంచడం ప్రారంభించాను. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ... మా కుటుంబసభ్యుల సలహా మేరకు మరో డాక్టర్ని కలిసినప్పుడు ‘మీరు ప్రొస్తెటిక్ బ్రెస్ట్ ఎందుకు ఉపయోగించకూడదు’ అని నన్ను అడిగాడు. డాక్టర్ అయిన తర్వాత కూడా ఈ ప్రశ్న నా మదిలో ఎందుకు రాలేదనే ప్రశ్న నన్ను ఆశ్చర్యపరిచింది. వెంటనే ప్రొస్తెటిక్ బ్రెస్ట్ కొనడానికి వెళ్లాను, దాని ఖరీదు రూ. 6,000 అని చెప్పారు. ఈ మొత్తం నాకు చాలా ఎక్కువ. దీంతో సిలికాన్‌తో చేసిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్ వద్దనుకున్నాను. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, నేను జీవించాలనే నా ఆశ వదులుకోలేదు. ప్రయత్నాల ఫలితం తక్కువ ఖర్చుతో కృత్రిమ స్తనాలను తయారు చేయాలనే విషయంపైన నా ప్రయత్నాలు సంవత్సరం పాటు కొనసాగాయి. వీటన్నింటి మధ్యలోనే నా కొడుకు పై చదువులకోసం అమెరికా వెళ్లాడు. ఒకసారి నేను మా అబ్బాయిని కలవడానికి అమెరికా వెళ్లాను. అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రూప్‌ని కలిసాను. సిలికాన్ బ్రెస్ట్‌లకు బదులుగా నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్‌లను వారు ఉపయోగిస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ వాటిని ప్రారంభించాలనుకుని, చాలా మందిని కలిశాను. నూలు కు సరిపడా డబ్బులు ఒకరు, అల్లిన బ్రెస్ట్ పోస్టింగ్‌కు అయ్యే ఖర్చును ఒకరు.. ఇలా నా స్నేహబృందంలో కొందరు తీసుకున్నారు. అలా ‘నిటెడ్ నాకర్స్ ఇండియా’ మొదలైంది. నాకేదో ప్రయోజనం అనుకున్నవారంతా! నాతో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు ప్రజలకు చేరుతూనే ఉంది. మహిళలు కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చి చేరడం మొదలుపెట్టారు. కొందరు ఖర్చుకు డబ్బులు ఇవ్వడం, మరికొందరు నూలు బ్రెస్ట్ల అల్లిక పనిని చేపట్టారు. ముందుగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి అవసరమైన మహిళలు నిట్ నాకర్లను తీసుకోమని చెబుతుండేదాన్ని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. ఒకరోజు ఆసుపత్రికి చేరుకోవడం ఆలస్యమైతే చాలు మహిళల క్యూ చాంతాడంత అయి ఉంటుంది. అక్కడి వైద్యులు నన్ను చూస్తూనే ‘కృత్రిమ స్తనాలు ఇచ్చే చెల్లెలు ఎప్పుడు వస్తారు’ అని అడుగుతున్నారు. అని చెప్పేవారు. రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడిన వ్యక్తిగా, ముఖ్యంగా డాక్టర్ అయినందున మహిళలకు అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావించాను. మొదట్లో నాగపూర్‌లోని కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు, ఇరుగు పొరుగు గ్రామాలకు వెళ్లి కనుక్కోమని మహిళలనే కోరాను. ‘మా కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేద’ని చాలా చోట్ల విన్నాను. సాధారణంగా ప్రజలు క్యాన్సర్‌ను జన్యుపరమైన వ్యాధిగా భావిస్తారు. అదే సమయంలో గ్రామాల్లోని మహిళల పని వ్యవసాయంతో ముడిపడి ఉండటంతో ఒకరోజు జీతం వదులుకొని, చెకప్‌కు డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకో వారికి అర్థం కాలేదు. దీంతో స్వయంగా శిబిరాలు నిర్వహించి, చెకప్‌ల కోసం మహిళలకు 50 శాతం రాయితీతో కూపన్లు పంపిణీ చేసేదానిని. ఇప్పుడు మహిళలు అర్ధం చేసుకుంటున్నారు. తమ సమ్మతిని తెలియజేస్తున్నారు’’ తన పని గురించి వివరిçస్తారు రోహిణీ పాటిల్. డాక్టర్ రోహిణీ పాటిల్ పాతికేళ్లుగా వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు డాక్టర్ రోహిణి పాటిల్. మెడికల్ ఆఫీసర్‌గా, లెక్చరర్‌గా, క్యాన్సర్ అవేర్నెస్ స్పీకర్‌గా ఉన్నారు. ‘నిట్టెడ్ నాకర్స్ నాగపూర్ అనే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడి, తగ్గిన వారికి నూలుతో అల్లిన కృత్రిమ రొమ్మును అందిస్తున్నారు. -
హంసానందిని ఫొటోషూట్ వైరల్, 'ఫస్ట్ లవ్ కోసం బలంగా తిరిగొస్తా'
ఫొటోలు భావాలు చెబుతాయా? అంటే కొన్ని ఫొటోలు చెబుతాయి. అందుకు తాజా ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్న హంసా నందిని ఫొటో. ఇటీవల హంస చేయించుకున్న ఫొటోషూట్ ఇది. మామూలుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నవాళ్లు, సినిమాలో గెటప్ ఎలా ఉంటుందో ముందే చూసుకోవాలనుకునేవాళ్లు.. ఇలా రకరకాల కారణాలతో ఫొటోషూట్ చేయిస్తారు. అయితే హంసా నందిని తాజా ఫొటోషూట్‌కి ఇవేవీ కారణాలు కావని ఊహించే ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు రొమ్ము కేన్సర్‌కి సంబంధించిన చికిత్స జరుగుతోంది. తాను కేన్సర్ బారిన పడిన విషయాన్ని గత ఏడాది డిసెంబరులో హంస సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫొటోషూట్ చేయించుకున్నారు. గుండుతో ఉన్న ఈ ఫొటోలో హంస ముఖంలో కొన్ని భావాలు కనిపించాయని ఆమెకు స్టయిలిస్ట్‌గా చేసిన అమీ పటేల్ అంటున్నారు. ‘మీరు (హంసా నందిని) చాలా అందంగా కనబడుతున్నారు. మీ ఫొటో ‘బలం, నమ్మకం, అందాన్ని’ ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు కేన్సర్‌తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మీరు దీన్నుంచి విజయవంతంగా, మరింత అందంగా బయటికొస్తారు. మేమంతా మీ వెంటే ఉంటాం’ అని అమీ పటేల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గత డిసెంబరు నాటికే తొమ్మిది విడతల కీమోథెరపీ పూర్తయిందని, ఇంకా ఏడుసార్లు చేయించుకోవాలనీ హంస పేర్కొన్నారు. యాక్టింగ్ అనేది నా ఫస్ట్ లవ్... ఇంకా చాలా బలంగా, మెరుగ్గా తిరిగి వస్తానని కూడా అన్నారు. ఆమె నమ్మకం నిజమవుతుందని ఈ ఫొటో స్పష్టం చేస్తోంది కదూ. -
షాకింగ్.. ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందినికి క్యాన్సర్, గ్రేడ్-3 స్టేజ్
Actress Hamsa Nandini Revealed She Suffer With Breast Cancer: నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని ధీమా వ్యక్తంచేశారు. తన జీవితంలో కాలం ఏవిధమైన ప్రభావాలు చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదన్నారు హంస. చదవండి: Samantha-Pushpa Movie: ఎట్టకేలకు పుష్ప స్పెషల్ సాంగ్ ట్రోల్స్‌పై స్పందించిన సామ్ 18 ఏళ్ల క్రితం క్యాన్సర్‌తో తన తల్లి కన్నుమూశారని.. నాటి నుంచి అదే భయంతో జీవిస్తున్నానని తెలిపారు. జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు తాజాగా నిర్ధారించారని వివరించారు. ప్రస్తుతానికి 9 విడతల కిమోథెరపీలు చేయించుకున్నానని.. మరో ఏడు చేయించుకోవాల్సి ఉందన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తానని అభిమానులకు తెలిపారు. అంతేగాక క్యాన్సర్‌ను జయించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తానంటూ ఆమె ధీమా వ్యక్తం చేసింది. కాగా ఆర్యన్ రాజేశ్ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హీరోయిన్గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కనువిందు చేసింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: తోటి మహిళలు ఆరోగ్యం, పరిశుభ్రతపై తమకున్న ఆందోళనలను స్వేచ్ఛగా బయటకు వెళ్లడించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే తన ధ్యేయమని మిస్ యూనివర్స్–2021 కిరీటధారి హర్నాజ్ సంధు(21) చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తోపాటు రుతుక్రమ సమయంతో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్న తన తల్లి, గైనకాలజిస్ట్ రవీందర్ కౌర్ సంధుయే తనకు ఆదర్శమన్నారు. ‘మహిళలు తమ ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా బయటకు చెప్పుకోగలగాలి. మా వర్గీయుల్లో చాలామంది మహిళలు ఇప్పటికీ తమ శరీరం, ఆరోగ్యం గురించి ఏదైనా మాట్లాడటం అసౌకర్యంగా భావిస్తారు. ఇలాంటి అంశాలపై వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. సరైన సమయంలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ను కూడా నయం చేయవచ్చు’అని ఆమె చెప్పారు. పలు పంజాబీ సినిమాల్లో నటించిన హర్నాజ్ సంధు..బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్–2021గా తన ఎంపిక దేశానికే వేడుక వంటిదన్నారు. సాధ్యమైనంత త్వరలో స్వదేశం వచ్చి విజయోత్సవం జరుపుకునేందుకు, తన తల్లిని కౌగలించుకునేందుకు తహతహలాడుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె ఇజ్రాయెల్‌లోని ఐలాత్ నుంచి ఫోన్ ద్వారా పీటీఐ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుస్మితాసేన్, లారాదత్తాల తర్వాత మిస్ యూనివర్స్‌ను సొంతం చేసుకున్న మూడో భారతీయ యువతిగా హర్నాజ్ సోమవారం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ నుంచి ఆమె నేరుగా న్యూయార్క్ వెళతారు. అక్కడ ఆమె మిస్ యూనివర్స్ సంస్థతోపాటు పలు సంస్థలకు ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి..
ప్రాచీనకాలం నుంచి పసుపు మన జీవితాలతో ముడిపడి ఉంది. తాపనివారణ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వరకు దీనిలోని ఔషధగుణాలను శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఏదిఏమైనప్పటికీ దీని ప్రయోజనాలు లెక్కకుమించి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐతే తాజాగా వివిధ రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో పసుపు ఏ విధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై అనేక పరిశోధన అధ్యయనాలు దృష్టి సారించాయి. దీర్ఘకాలిక తాపం, క్యాన్సర్ అభివృద్ధికి మధ్య సహసంబంధం ఉన్నందువల్ల, పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వ్యాధితో పోరాడడంలో ప్రయోజనకరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చదవండి: The Singing Ringing Tree: ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే.. 2019లో న్యూట్రియంట్స్ అనే సైంటిఫిక్ జర్నల్ ప్రచురించిన నివేధికలో కూడా.. పసుపు రొమ్ము క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుందని, కణితి పెరుగుదల మందగించేలా ప్రేరేపిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు, పెద్దపేగు, క్లోమ.. వంటి కొన్ని ఇతర రకాల క్యాన్సర్లకు చికిత్సగా పసుపును వినియోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెల్పింది. ఇప్పటికీ పరిశోధనల ఫలితాలు ఒక కొలిక్కిరాన్పటికీ, టెస్ట్ ట్యూబ్, జంతు అధ్యయనాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు ఈ నివేదిక తెల్పింది. చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! క్యాన్సర్ చికిత్సలో పసుపును ఉపయోగించడంలో అతిపెద్ద అడ్డంకి ఏంటంటే.. పసుపును ఎక్కువ మోతాదులో మానవ శరీరం గ్రహించలేకపోవడం. ఈ అడ్డంకిని అధిగమించడానికి ఫార్మకాలజిస్టులు కృషి చేస్తున్నారు. ఐతే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకు... పసుపును క్యాన్సర్‌కు చికిత్సగా ఉపయోగించడం కుదరదు. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. -
Susmita Basak: వారి కోసం ప్రత్యేకంగా లోదుస్తులు, అవయవాలు..
క్యాన్సర్ పేరు చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతాం. కాని తప్పించలేం. ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ భాగాన్ని తొలగించేస్తారు. అలా చేయటం వలన ఆడవారు ఆత్మన్యూనతకు లోనవుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఒక పక్కన అనారోగ్యంతో బాధపడటం, మరోపక్క మానసిక దిగులు. అటువంటివారి కోసం ప్రత్యేకంగా లోదుస్తులు, అవయవాలు తయారుచేస్తున్నారు సుస్మిత అనే టెక్నాలజీ విద్యార్థి. సుస్మిత తన కుటుంబ సభ్యులతో కలిసి సుగర్‌షెల్ అనే స్టార్టప్ ప్రారంభించి, ఇన్నర్లు, అవయవాలు తయారుచేస్తున్నారు. సుగర్‌షెల్.. సుస్మిత బసక్, దేబ్రప్ మజుందార్, మౌమిత బసక్, శివశంకర్ బసక్... అందరూ ఒకే కుటుంబీకులు. ఈ కుటుంబ సభ్యుల ఆలోచన నుంచి పుట్టినదే సుగర్‌షెల్ స్టార్టప్. ్ర»ñ స్ట్ క్యాన్సర్ రోగులకు, ఆ అనారోగ్యం నుంచి బయటపడిన వారికి... వారి శరీరానికి అనుకూలంగా ఇన్నర్వేర్లను, అవయవాలను ఈ కంపెనీ తయారుచేస్తుంది. సుస్మిత బసక్‌కు ఇంజినీరింగ్ చదువుకునే రోజుల్లోనే ఏదైనా ప్రత్యేకంగా డిజైన్ చేయాలనే ఆకాంక్ష ఉండేది. బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి కాగానే కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగానికి చేరారు. తన మనసుకు తగ్గ పని కావటంతో ఉత్సాహంగా పనిచేశారు. నైపుణ్యం ప్రదర్శించి ఏదో ఒకటి డిజైన్ చేయాలనే కోరిక కారణంగా సుస్మిత నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) లో చేరారు. తను చదువుకున్న ఇంజినీరింగ్ టెక్నాలజీ ఉపయోగించి, ఏదో ఒకటి కొత్తది డిజైన్ చేయాలనే కోరిక రోజురోజుకీ బలపడుతూ వచ్చింది. ‘‘నేను నిఫ్ట్‌లో చదువుతున్నప్పుడు, ఆఖరి సెమిస్టర్ ప్రాజెక్ట్‌లో భాగంగా, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తగ్గిన రోగులకు కావలసిన లోదుస్తులను తయారుచేయాలనుకున్నాను. ఆ వ్యాధితో పోరాడి జీవించిన వారితో మాట్లాడిన తరవాత, వారికి కృత్రిమ అవయవం, ఇన్నర్ల అవసరం చాలా ఉందనీ, వీటిని తయారుచేయటానికి మంచి నైపుణ్యం కూడా అవసరమనీ తెలుసుకున్నాను’’ అంటారు సుస్మిత. కుటుంబ సభ్యులతో.. భర్త దేబ్రప్ మజుందార్, సోదరి మౌమిత, తండ్రి శివ్శంకర్లతో కలిసి, ‘సుగర్‌షెల్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు, వ్యాధి నుంచి బయటపడినవారికి ప్రత్యేకించి ఇన్నర్వేర్లు ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలోనే ఇటువంటివి తయారుచేయబోతున్న మొట్టమొదటి సంస్థ ఇది. ఎఫ్ఎంసిజి ఫార్మాలో పది సంవత్సరాలుగా డాటా సైంటిస్ట్‌గా పనిచేసిన మౌమిత తన సోదరికి సహకరించటానికి ముందుకు వచ్చారు. ఆ కంపెనీలో మౌమిత ...మార్కెటింగ్, బ్రాండింగ్, డాటా అనలిటిక్స్, కంటెంట్ జనరేషన్, వైట్ పేపర్ రైటింగ్‌లలో నైపుణ్యం సాధించారు. ‘‘నా అనుభవం మా అక్క కోసం వినియోగించి, తనకు సహకరించాలనుకుంటున్నాను’’ అంటారు మౌమిత. సుస్మిత భర్త దేబ్రప్ మజుందార్‌కు ఐటీ ఎక్స్‌పర్ట్‌గా పన్నెండు సంవత్సరాల అనుభవం ఉంది. తండ్రి శివ్ శంకర్ బసక్... ఇండస్ట్రియల్ ఇంజినీర్‌గా నలభై సంవత్సరాల ప్రాజెక్ట్ అనుభవం ఉంది. వీరంతా సుస్మిత ఆశయసాధనకు సహకరించటానికి ముందుకు వచ్చారు. ఇబ్బందులను అధిగమించేలా... ‘‘క్యాన్సర్ బారిన పడి బతికి బయటపడ్డ 20 మందితో మాట్లాడిన తరవాత, ఈ కంపెనీ చిన్నస్థాయిలో కాకుండా, భారీ స్థాయిలో ప్రారంభించాలి అనుకున్నాను. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినవారు రకరకాల వైద్య విధానాల వల్ల అనేక ఇబ్బందులు పడతారు. వారి అవసరాలకు అనుగుణంగా ఇన్నర్లు, సర్జరీ చేసి తొలగించిన ప్రదేశంలో అమర్చటానికి అనువుగా బ్రెస్ట్ తయారుచేయాలనుకున్నాను’’ అంటున్న సుస్మిత, నాణ్యమైన ఇన్నర్లు, బ్రెస్ట్‌లను అందరికీ అందుబాటులో ఉండేలా తయారుచేయటానికి నిశ్చయించుకున్నారు. మార్కెట్లో సింథటిక్‌తో రూపొందినవి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి రకరకాల ఇన్నర్వేర్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘బ్రెస్ట్‌ను తొలగించటం వల్ల బాధితులు మానసికంగా, శారీరకంగా బాధపడుతుంటారు. కొందరు మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. అటువంటి వారికి మా ఉత్పత్తుల ద్వారా ఆత్మవిశ్వాసం కలిగించడమే మా ధ్యేయం’’ అంటున్నారు సుస్మిత. ఇందులో ఉపయోగించేవన్నీ ప్రకృతిలో సహజంగా లభిస్తున్నవే. అంతేకాదు... మామూలు కాటన్‌తో కూడా తయారుచేస్తున్నారు. ఈ అక్టోబర్ (బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసం) మాసంలో పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. -
రొమ్ము క్యాన్సర్ ముప్పును ముందే గుర్తించండి!
రొమ్ముక్యాన్సర్‌కు అనేక అంశాలు కారణమవుతాయి. అందులో కొన్ని మనం నివారించగలవి. మరికొన్ని నివారించలేనివి. ఉదాహరణకు... నివారించలేని వాటిల్లో వయసు అనేది ముప్పును పెంచే అతి ముఖ్యమైన అంశం. వయసు ఎంతగా పెరుగుతుంటే.. రొమ్ము క్యాన్సర్ ముప్పు అంతగా పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం 30 నుంచి 39 ఏళ్ల మహిళల్లో ప్రతి 233 మందిలో ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం చదవండి: మహిళల్లో ప్రధాన క్యాన్సర్ అదే.. వారికే రిస్క్ కుటుంబ నేపథ్యం: దగ్గరి బంధువుల్లో (అంటే... అమ్మ, సోదరి, కూతుళ్ల)లో రొమ్ముక్యాన్సర్ ఉన్నట్లయితే... తమకూ రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. వ్యక్తిగత నేపథ్యం: ఇదివరకే రొమ్ముక్యాన్సర్ ఉన్నవారైతే... వారికి అదే రొమ్ములోగానీ మరోపక్క రొమ్ములోగానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈస్ట్రోజెన్: ఈస్ట్రోజెన్ హార్మోన్ రొమ్ముకణాలను ఉత్తేజపరుస్తుంది. అలా దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజెన్ హార్మోన్‌కు గురికావడం కూడా రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అయితే ఈస్ట్రోజెన్‌ను నియంత్రించడం కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకు చిన్నవయసులోనే అంటే పన్నెండేళ్ల కంటే తక్కువ వయసులోనే నెలసరి ప్రారంభం కావడం, అలాగే 55 ఏళ్లు తర్వాత బహిష్టు ఆగిపోవడం (మెనోపాజ్) లాంటి కారణాలతో ఈస్ట్రోజెన్ స్రావాలు చాలా సుదీర్ఘకాలంపాటు కొనసాగితే కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే ఈస్ట్రోజెన్ కూడా ఎవరి చేతుల్లోనూ ఉండదు. (అంటే మాంసాహారంలో ఉండే హార్మోన్ల వల్ల, పురుగుమందుల అవశేషాల కారణంగా దేహంలోకి ప్రవేశించే ఈస్ట్రోజెన్‌ను పోలిన అంశాలు కూడా ఈ ముప్పును పెంచుతాయి). చదవండి: ఒక ఓవరీ తీసేశారు.. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? గర్భధారణ... పిల్లలకు తల్లిపాలు పట్టించడం : గర్భం రావడంతో పాటు చిన్నారికి రొమ్ముపాలు పట్టించడం వంటి అంశాలు నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. ముప్ఫయి ఏళ్లు పైబడేవరకు గర్భం ధరించని మహిళల్లో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే చాలాకాలం పాటు... అంటే ఏడాది మొదలుకొని ఏడాదిన్నర లేదా రెండేళ్ల వరకు తల్లిపాలనే తాగించే మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పు తక్కువ. కానీ ఈరోజుల్లో అంత సుదీర్ఘకాలం పాటు తల్లిపాలు పట్టించడం సాధ్యంకావడంలేదు. కొన్నిసార్లు మన చేతిలో ఉన్న అంశాలపరంగా (అంటే మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి) తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా రొమ్ముక్యాన్సర్ రావచ్చు. అలాంటప్పుడు కుంగిపోకూడదు. సాధారణంగా బ్రెస్ట్‌క్యాన్సర్ అన్నది రొమ్ములో కణుతుల రూపంలో బయటపడుతుంది. ఈ కణుతులు నొప్పి లేకుండా, గట్టిగా, సమానమైన అంచులు లేకుండా ఉండవచ్చు. మరికొన్నిసార్లు మెత్తగా, సమానంగా కూడా ఉండవచ్చు. కాబట్టి రొమ్ముల్లో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే డాక్టరుకు చూపించుకోవడం మంచిది. సాధారణంగా రొమ్ముక్యాన్సర్ సోకినప్పుడు ఈ కింద పేర్కొన్న మార్పులు కనిపిస్తాయి. అవి... చదవండి: షుగరూ, హైబీపీ అదుపులో ఉంటే కిడ్నీలూ పదిలమే ►రొమ్ముల్లో వాపు, ఇరిటేషన్, నొప్పి, చనుమొనల్లో నొప్పి, చనుమొనలు లోపలివైపునకు కుంగినట్లుగా అయిపోవడం, ఎరుపెక్కడ, చనుమొనల నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, చంకల కిందిభాగంలో గడ్డలు ఉండటం... మొదలైనవి. అయితే అన్ని రకాల గడ్డలూ క్యాన్సర్ కాకపోవచ్చు. కాబట్టి డాక్టర్ చేత క్షుణ్ణంగా పరీక్ష చేయించుకుని, అది క్యాన్సరా, కాదా అని నిర్ధారణ చేసుకోవడం మంచిది. ►క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేయవచ్చు. దాన్ని త్వరగా గుర్తించడానికి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడమే సరైన మార్గం. ►ఇరవై ఏళ్ల వయసు దాటిన మహిళలు ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలి. ∙20 నుంచి 40 ఏళ్ల వయసు మహిళలు ప్రతి మూడేళ్లకోసారి డాక్టర్ ఆధ్వర్యంలో రొమ్ము పరీక్షలు జరిగేలా చూసుకోవాలి. ►40 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏడాదీ పరీక్ష చేయించుకోవాలి. ►40 –49 ఏళ్ల మహిళలు ప్రతి రెండేళ్లకోసారి డిజిటల్ మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. 50 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏడాదీ డిజిటల్ మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. ►డిజిటల్ మామోగ్రఫీ అనేది డిజిటల్ రెసెప్టార్తో కంప్యూటర్‌కు అనుసంధానం చేసిన ఒక ఆధునిక ఎక్స్–రే మెషీన్‌గా చెప్పవచ్చు. దాని ద్వారా అత్యంత సులువుగా, వేగంగా బయాప్సీ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న అధునాతన డిజిటల్ మామోగ్రఫీ మెషీన్స్‌తో బెడ్లో కాసేపు పడుకుని లేదా కూర్చుని కూడా అత్యంత వేగంగా బయాప్సీని నిర్వహించవచ్చు. మామోటోమ్ వంటి వాక్యూమ్ పవర్డ్ పరికరాల వల్ల అత్యంత ఖచ్చితంగా మల్టిపుల్ బయాప్సీ చేయవచ్చు. ఈ పరీక్షల సహాయంతో రొమ్ముక్యాన్సర్ లేదని నిర్ధారణ అయితే నిశ్చింతగా, నిర్భయంగా ఉండవచ్చు. ఒకవేళ ఉందని తేలితే వెంట -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న బండ్ల గణేశ్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. అయితే సోషల్ మీడియాని ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా... పేద ప్రజలకు సాయం అందించేందుకు వాడుతుంటాడు. ట్విటర్ ద్వారా తనను అభ్యర్థిస్తే చాలు... వెంటనే స్పందించి, తోచిన సాయం అందిస్తుంటాడు. అలా ఇప్పటికే చాలా మందికి సాయం అందించిన బండ్లన్న.. తాజాగా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ నెటిజన్ అభ్యర్థన గమనించిన ఆయన స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, వీలైన సాయం చేయాల్సిందిగా ట్వీటర్ ద్వారా అందరినీ అభ్యర్థించాడు. దీనిపై బండ్ల గణేశ్ స్పందిస్తూ.. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని తెలిపారు. దీంతో బండ్ల గణేశ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మహిళల్లో ప్రధాన క్యాన్సర్ అదే.. వారికే రిస్క్
కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుంది. అలాగే రొమ్ముక్యాన్సర్ చాలా అరుదుగా పురుషుల్లో కనిపించినా... మహిళల్లోనే అది ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ అవగాహన కోసం సంక్షిప్తంగా కొన్ని ప్రధాన విషయాలివి.. రొమ్ము క్యాన్సర్ క్యాన్సర్లలో వయస్సుకూ వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది. అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతుంటాయన్నమాట. మరీ వివరంగా చెప్పాలంటే 80 ఏళ్లు పైబడ్డ ప్రతి 10 మందిలో ఒకరికి ఇది తప్పక కనిపిస్తుంది. దీని విస్తృతి ఇంత ఎక్కువ కాబట్టే మహిళల్లో దీని గురించి ఆందోళన కూడా ఎక్కువే. అయినప్పటికీ దీని గురించి అంతగా బెంగపడాల్సినక్కర్లేదు. రిస్క్ గ్రూప్ ఎవరంటే : కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు రక్తసంబంధీకులలో ఈ వ్యాధి వచ్చిన వారు ఉన్నప్పుడూ పిల్లలు లేని వాళ్లలో మొదటిసారి గర్భం ముప్ఫయి ఏళ్లు దాటాక వస్తే ఐదేళ్లకు పైబడి హార్మోనల్ చికిత్స తీసుకుంటూ ఉంటే... వీళ్లకు ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలెక్కువ. కాబట్టి అలాంటివాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ రిస్క్ గ్రూపులు పరీక్షలు చేయించుకోవాలి. ►మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో వాళ్లకు తమ రొమ్ము ఎలా ఉంటుందన్న అంశంపై అవగాహన పెరుగుతుంది. ఫలితంగా అందులో ఏ చిన్నమార్పు వచ్చినా అర్థమైపోతుంది. లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరితంగా గుర్తించగలరు. దాన్ని మీ డాక్టర్/గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. ►మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. (చదవండి: వివిధ రకాల క్యాన్సర్లు: లక్షణాలు ఇవే) చాలా హై రిస్క్ ఉంటే... కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు అనుకుంటే... వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేదే లేనిదీ... జన్యుపరీక్షల ద్వారా– బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి కనుక్కోవచ్చు. ఓ చిన్ని రక్తపరీక్ష ద్వారా దీన్ని కనుక్కోవడం చాలా సులభం. మంచి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సర్విక్స్ క్యాన్సర్... దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం (పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని లక్షణాలు. -
వివిధ రకాల క్యాన్సర్లు: లక్షణాలు ఇవే
శరీరంలోని ఏదైనా ఒక కణం... నిరాటంకంగా, నిర్విరామంగా, నిరుపయోగంగా పెరుగుతూ పోయేదే క్యాన్సర్. అలా పెరిగాక రోగిని నిస్సత్తువగా చేసేస్తుంది. అలా ఓ పరిమితీ పాడూ లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణమైన పెరిగే ఈ క్యాన్సర్ కణం మొదట ఒకే కణంతోనే మొదలవుతుంది. అది రెట్టింపు అయ్యే ప్రక్రియలో 20వ సారి రెట్టింపు అయ్యే సమయంలో ఒక మిలియన్ కణాలుగా వృద్ధిచెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగిన ఆ సమయంలోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలుంటాయి. ఆ సమయంలో దాన్ని ఓ గడ్డ (లంప్)లా గుర్తించడం సాధ్యం. అంటే... చేత్తో గడ్డను తాకి గుర్తించే సమయంలో అందులో బిలియన్ కణాలుంటాయన్నమాట. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలో కనుక్కోవడం ఎలా? తల నుంచి మన దేహంలోని కింది భాగాల్లోని ఏదైనా అవయవంలో క్యాన్సర్‌ను ముందే ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్ రోగులందరిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కష్టం. క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు (కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) అవయవాలనుంచి రక్తస్రావం... ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా కనిపిస్తున్నప్పుడు మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండాలి. తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవభాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్... తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్నిసార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడి కీ, కాళ్లూచేతుల కదలిక ల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయన్న విషయం తెలిసిందే. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. గొంతు భాగంలో... దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న భావన ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. కడుపు (స్టమక్)లో... అదే కడుపు (స్టమక్)లో అయితే మంట పుడుతున్నట్లుగా ఉండే నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినీతినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్. తల భాగంలో... ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుళ్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్ గ్రంధుల వాపు. సర్విక్స్ క్యాన్సర్... దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం (పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని లక్షణాలు. రొమ్ము క్యాన్సర్... మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపిల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు. ఊపిరితిత్తులు... పొగతాగేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ క్యాన్సర్ ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లెలో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. రెక్టమ్ క్యాన్సర్‌లో... మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న అనుభూతి ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. దాంతో దాన్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒవేరియన్ క్యాన్సర్... దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. టెస్టిస్ క్యాన్సర్... పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. ప్రోస్టేట్ క్యాన్సర్... సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలు ఏవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్స్... మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. చర్మ క్యాన్సర్... చర్మ క్యాన్సర్‌ను ఏ,బీ,సీ,డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు. కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ... ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి. అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే అని ఆందోళన వద్దు. కాకపోతే తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్ష చేయించుకోవాలి.ఇక అది క్యాన్సర్ కాదని నిర్ధరించుకొని నిశ్చింతగా, నిర్భయంగా ఉండండి. బ్లడ్ క్యాన్సర్స్... రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ ప్యాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జెల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. -
కణాల కంట్రోలర్
నివారణపై ఒక కన్ను. నిర్థరణపై ఇంకో కన్ను. చికిత్సకు మరో కన్ను. బ్రెస్ట్ క్యాన్సర్‌పై.. మూడు కళ్లు వేసి ఉంచారు డాక్టర్ వర్ఘీస్! పరిశోధన మూడో కన్ను. జన్యువుల్ని గమనిస్తూ.. కణాల్ని కంట్రోల్ చేస్తుంటారు. ఈ వైద్య త్రినేత్రి ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది వరల్డ్’! డాక్టర్ జాజినీ వర్ఘీస్ కణజాల పునర్నిర్మాణ వైద్య చికిత్సా నిపుణురాలు, ప్లాస్టిక్ సర్జన్. లండన్‌లోని ‘రాయల్ ఫ్రీ హాస్పిటల్ అండ్ యూనివర్సిటీ కాలేజ్’కి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ కన్సెల్టెంట్‌గా ఉన్నారు. వైద్యరంగంలో యంగ్ టాలెంట్‌ను గుర్తించి సత్కరిస్తుండే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జె.సి.ఐ.) అనే అంతర్జాతీయ సంస్థ ఈ ఏడాది ‘ఔట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్’గా డాక్టర్ జాజిని ని ఎంపిక చేసింది! వినూత్య వైద్యావిష్కరణ కేటగిరీలో ఆమెకు ఈ అత్యున్నతస్థాయి గౌరవం దక్కింది. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, నిర్థరణ, చికిత్సలలో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు డాక్టర్ జాజిని కనిపెట్టిన అద్భుతమైన విధానాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే ‘ఎర్లీ స్క్రీనింగ్’కు అవసరమైన వ్యూహాలను రూపొందించినందుకు జె.సి.ఐ. ఈ అవార్డును ప్రకటించింది. నలభై ఏళ్ల లోపు శాస్త్ర పరిశోధకులకు ఇచ్చే అవార్డు ఇది. వైద్యరంగ విభాగానికి 110 దేశాల నుంచి వచ్చిన ఎంట్రీలలో యూ.కె. నుంచి పది మంది గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరిశోధకురాలిగా డాక్టర్ జాజినీ సాధించిన ఘనత ఆమెను విజేతగా నిలబెట్టింది. జె.సి.ఇ. ఇంకా బిజినెస్, పాలిటిక్స్, విద్యారంగం, సంస్కృతి, శిశు సంక్షేమం, ప్రపంచ శాంతి, శాస్త్ర పురోగమనం వంటి విభాగాలలో అవార్డును ప్రదానం చేస్తుంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురైన వారి జీవితాన్ని నాణ్యమైనదిగా పునర్నిర్మించడం డాక్టర్ వర్ఘీస్ లక్ష్యం! ఆ ధ్యేయంతోనే ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌పై అధ్యయనాలను, పరిశోధనలను తన జీవితాశయంగా ఎంచుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సా విధానాలను నిరంతరం అత్యాధునిక స్థాయికి తీసుకెళుతూనే ఉండాలన్నది ఆమె ప్రయత్నం. కేరళలోని ముత్తొం హరిపాద్ ఆమె స్వస్థలం. మెడిసిన్ చదివి బ్రిటన్ వెళ్లారు. తండ్రి జార్జి, తల్లి జాలీ వర్ఘీస్ కేరళలోనే ఉంటారు. భర్త, ఇద్దరు పిల్లలతో డాక్టర్ జాజిని లండన్‌లో స్థిరపడ్డారు. అయితే తన అభివృద్ధి కోసం ఆమె స్వదేశాన్ని వదులుకుని వెళ్లిపోలేదు. ‘‘విదేశాల్లో వైద్య పరిశోధనలు జరపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని మానవాళి ఆరోగ్యానికి మేలు జరిగే విధానాలు కనిపెట్టేందుకే ఇంత దూరం వచ్చాను’’ అని డాక్టర్ వర్ఘీస్ తరచు చెబుతూ ఉంటారు. పదిహేడేళ్ల క్రితం మెడిసిన్ ప్రాక్టీస్ కోసం లండన్ వెళ్లిన వర్ఘీస్ మొదట చేసిన పని భారతీయ వైద్య విద్యార్థులకు విద్యానంతర గ్రామీణప్రాంత సేవల ఒప్పందంతో స్కాలర్షిప్లను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదించడం. డాక్టర్ వర్ఘీస్ ప్రస్తుతం యు.సి.ఎల్. (యూనివర్సిటీ కాలేజ్ లండన్)లో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ రిసెర్చ్‌లో ఈ చిన్న వయసులోనే అనేక ఇంగ్లండ్ సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు. ‘జెనిటిక్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్’పై ఎం.ఫిల్., పిహెచ్.డి చేయడానికి కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్లు పొందిన అతి కొద్ది మంది భారతీయ వైద్యులలో డాక్టర్ వర్ఘీస్ ఒకరు. తాజాగా వచ్చిన ‘ఔట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డు అందుకోడానికి వచ్చే నెల ఆమె జపాన్ వెళుతున్నారు. జె.సి.ఐ. ఈసారి జపాన్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. -
అత్యధికంగా క్యాన్సర్ బారిన పడుతుంది వారే!
గ్రామీణ మహిళల కంటే పట్టణాల్లో ఉండే వారే అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే తొలి దశలో గుర్తిస్తుండగా, 70 శాతం మంది, 2, 3 దశల్లో ఆస్పత్రులకు వస్తున్నారు. మరో 20 శాతం మంది నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నారు. వ్యాధి లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు క్యాన్సర్ నిపుణులు చెబుతున్నారు. వ్యాధిపై విస్తృతమైన అవగాహన కలగించేందుకు అక్టోబర్ మాసాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. వీరికి వ్యాధి సోకే అవకాశం.. ►సాధారణంగా వయస్సు 40 ఏళ్లు దాటిన వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ►లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, పిల్లలు పుట్టాక పాలు ఇవ్వని వారికి ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ►కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా ఉన్నా, ఎక్కువ ఒత్తిళ్లకు గురయ్యే వారికి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, నెలసరి ఆగడం, 55 ఏళ్ల వరకు నెలసరి ఉండటం వంటివి కారణాలుగా చెబుతున్నారు. ►ధూమపానం, ఆల్కాహాల్ సేవించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ►ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంతో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు.. రొమ్ము క్యాన్సర్ ఎవరికి వారే గుర్తించవచ్చు. పీరియడ్ వచ్చిన వారం రోజుల తర్వాత స్నానం చేస్తున్న సమయంలో రొమ్ములో గింజంత సైజులో కణుతులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందా, చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్ చేసుకోవాలి. రొమ్ము భాగంలో నొప్పిగా ఉన్నా, చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. మమ్మోగ్రామ్‌తో నిర్ధారణ.. ►రొమ్ము క్యాన్సర్‌ను మమోగ్రామ్ అనే స్కానింగ్ ద్వారా నిర్ధారిస్తారు. ఇప్పుడు 3డీ మమ్మోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది. ►దీని ద్వారా వ్యాధి సూక్ష్మదశలో ఉన్నప్పుడే గుర్తించే అవకాశం ఉంది. ►రొమ్ము భాగంలో పౌడర్లా ఏదైనా చల్లినట్లు ఉన్నా కనిపెట్టేస్తుంది. ►ఏడాదికోసారి మమ్మోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ముందు చూపే మందు.. రొమ్ము క్యాన్సర్‌కు ముందు చూపే మందు. తొలిదశలోనే గుర్తించి వెంటనే ఆస్పత్రికి వెళ్తే అత్యాధునిక పరికరాలతో వ్యాధిని నిర్ధారించి చికిత్స పొందవచ్చు. సెల్ఫ్ చెక్ చేసుకునే విధానాలపై మహిళలకు అవగాహన ఉండాలి. రోజు వారీ వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోవడం, కొవ్వు, నూనె ఉన్న పదార్థాలు తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏవైరావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు -
క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత
క్యాన్సర్ మహమ్మారి కారణంగా మరో నటి, హాలీవుడ్‌కు చెందిన కెల్లీ ప్రెస్టన్ (57) మరణించారు. గత రెండేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూశారు. కెల్లీ భర్త జాన్ ట్రావోల్టా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషాదాన్ని వెల్లడించారు. దీనిపై హాలీవుడ్ నటీనటులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు, నర్సులు, సన్నిహితులు, స్నేహితుల మద్దతుతో సాహసోపేతమైన పోరాటం చేసి తన భార్య చివరికి ఓడిపోయిందంటూ ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు జాన్. కెల్లీ ప్రేమ, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ తమతోనే ఉంటాయన్నారు. ఈ సందర్భంగా తమకు సాయపడిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీరికి కుమార్తెఎల్లా (20), కుమారుడు బెంజమిన్ (9) ఉన్నారు. 2009 లో జెట్(16) అనే కుమారుడిని కోల్పోయారు కెల్లీ, జాన్ దంపతులు. కాగా స్పేస్క్యాంప్ (1986), జెర్రీ మాగైర్ (1996) ఫర్ లవ్ ఆఫ్ ది గేమ్ (1999) వంటి ప్రముఖ చిత్రాలలో కెల్లీ ప్రెస్టన్ నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం గొట్టి (2018). View this post on Instagram It is with a very heavy heart that I inform you that my beautiful wife Kelly has lost her two-year battle with breast cancer. She fought a courageous fight with the love and support of so many. My family and I will forever be grateful to her doctors and nurses at MD Anderson Cancer Center, all the medical centers that have helped, as well as her many friends and loved ones who have been by her side. Kelly’s love and life will always be remembered. I will be taking some time to be there for my children who have lost their mother, so forgive me in advance if you don’t hear from us for a while. But please know that I will feel your outpouring of love in the weeks and months ahead as we heal. All my love, JT A post shared by John Travolta (@johntravolta) on Jul 12, 2020 at 10:20pm PDT -
ఆ మచ్చలు గతాన్ని గుర్తు చేస్తాయి
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీర కశ్యప్ గతేడాది రొమ్ము క్యాన్సర్‌ను జయించింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించే పోస్టులను పెడుతూ వస్తోంది. తాజాగా "నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే" సందర్భంగా ఓ ఆడియో సందేశాన్ని అభిమానులతో పంచుకుంది. "కొన్ని గాట్లు లోతైనవి, కొన్ని కనిపిస్తాయి, మరికొన్ని కనిపించవు. కానీ ఆ మచ్చలు మీకు గతాన్ని గుర్తు చేస్తాయి. మీరు బాధ అనుభవించిన క్షణాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ మీ శరీరంపై ఉన్న మచ్చలున్నాయే.. అవి దూరంగా ఉన్న నక్షత్రాల లాగే రహస్యాలను దాచిపెడతాయి. అయితే ఈ రహస్యాలను కంటితో చూడలేరు. ఇందులో ప్రపంచాన్ని విస్మరించే కఠోరమైన అబద్ధం దాగి ఉంటుంది.. (మా ఆయనతో సినిమా చేస్తా: హీరో భార్య) ఇక ఈ మచ్చలు మనకు ఎన్నో నేర్పుతాయి. పోరాటం, శక్తి సామర్థ్యాలు అన్నీ.. ఆరోగ్య కర్మతో పోరాడే ప్రతి ఒక్కరూ విజేతలే. ఎలాగంటే ఈ పోరాటం మిమ్మల్ని అనుభవజ్ఞులుగానో లేదా యుద్ధానికి సిద్ధమవుతున్నారనో తెలుపుతుంది. అయితే క్యాన్సర్‌తో పోరాటం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఉంటుంది. కొన్ని యుద్ధాలు జయించడానికి ఎంతో కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా అవి అంతర్గతమైనపుడు! కానీ ఓ మాట గుర్తుంచుకోండి. మనందరికీ విశ్వమంతటి శక్తి ఉంది. కాబట్టి మీరు మచ్చలను దాచకండి, వాటిని చూపించండి.. మీ ఆత్మగౌరవానికి ఇతరులే ప్రేమలో పడుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి" అని చెప్పుకొచ్చింది. (నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా: హీరో) View this post on Instagram A small something I have written.... #nationalcancersurvivorsday . . Some scars are deep, some within, Some are seen while some are hidden. The thing about scars is , it reminds you of the past, The moments of suffering that you thought would forever last. But there’s more to these Goddamn scars, They are Secrets hidden far away, just like the stars. It’s the Truth which you don’t see with the naked eye, Oblivious to the functioning of the world, a blatant lie. But hear me, there’s more to this scar, It talks also about the fight, the resilience and your invincible power. My love and respect to those who fought, The treacherous battlefield that Few crossed while some got lost. But the thing with this health karma is that everyone is a winner, For it’s the fight that counts whether you an expert or a beginner. The fight with cancer is not just physical but also mental, Some battles are more tough to conquer especially if they are internal. But hear me again, we all have that fighter which has the universe’s might, The indomitable spirit that can’t be crushed by any fright. Hide not your scars my love, Show them, flaunt them, just like your bright smile, soothing to others eyes, And when you do that time and again giving people nowhere to run and hide, they will have to fall in love with your badge of honour, your prize. So hear me one last time, Fall in love with your self, All with dust, scar and grime. For that’s what make you, YOU Faulty, imperfect, blemished but all true! Lensed by @atulkasbekar who captures the soul! Thank you for this ❤️ A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Jun 6, 2020 at 11:27pm PDT -
శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు
బుల్లితెర నటి శ్రీలక్ష్మి కనకాల (40) మృతి చెందారు. గత రెండేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. దివంగత దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల కుమార్తె, నటుడు రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి. శ్రీ పెద్ది రామారావు భార్య అయిన శ్రీలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలు కూడా. కొన్నాళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తల్లిదండ్రులకు తగ్గ తనయగా గుర్తింపు పొందారు. శ్రీలక్ష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. -
ఏ వయసు మహిళ అయినా... రొమ్ముక్యాన్సర్‌కు అతీతం కాదు
వయసు, ఎత్తు, బరువు, పేద, ధనిక... ఇలాంటి ఏ అంశమూ క్యాన్సర్‌ను అడ్డుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు రొమ్ముక్యాన్సర్‌కు గురవుతున్నారు. మన దేశంలో ప్రతి 22 మంది మహిళల్లో ఒకరు దీనిబారిన పడుతున్నారు. పట్టణమహిళల్లో ఇది చాలా ఎక్కువ. అధిక బరువు ఉండేవారిలో, వయసు పైబడిన స్త్రీలలో, లేటు వయసులో పిల్లలు పుట్టినవారిలో, పాలివ్వని స్త్రీలలో, రజస్వల త్వరగా అయినవారిలో, 55 ఏళ్లు పైబడ్డా మెనోపాజ్ రానివారిలో, దీర్ఘకాలికంగా హార్మోన్ చికిత్స తీసుకున్నవారిలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. అయితే కేవలం వారికి మాత్రమే గాక ఎవరిలోనైనా ఇది వచ్చే ప్రమాదం ఉంది. తొలిదశలోనే కనుగొని, చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. ఎత్తుకు తగిన బరువు, ఆరోగ్యకరమైన జీవనశైలి, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా కొంతవరకు దూరంగా ఉంచుతాయి. కానీ దురదృష్టవశాత్తు క్యాన్సర్ అన్నది ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా సవాల్ విసురుతోందనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అయితే అనేక మంది ప్రముఖులు క్యాన్సర్‌ను జయించి మరెంతోమందికి స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు. వారి అనుభవాలను ఇతరులతో పంచుకొని ధైర్యం నింపడమే కాకుండా, కొందరు పుస్తకరూపంలో తమ అనుభవాలను ఇతరులకు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ముందుకు దూసుకెళ్లిన స్త్రీలు, అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని మనో«ధైర్యంతో క్యాన్సర్‌ను జయించడం మహిళలందరికీ ఓ పాఠం లాంటిది. మరీ ముఖ్యంగా క్యాన్సర్ అనగానే జీవితం అయిపోయిందని కుంగిపోయి, కొందరు చికిత్స కూడా తీసుకోకుండా జీవితాన్ని త్వరగా ముగించుకోవాలనుకునేవారు తప్పకుండా క్యాన్సర్ జయించిన వారి గురించి తెలుసుకోవాలి. గౌతమి మనందరికీ తెలిసిన ప్రముఖ నటి. దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలలో ప్రముఖ నటుల సరసన అనేక సినిమాల్లో నటించారు. 2004లో 35 ఏళ్ల వయసులో ఆమె రొమ్ములో క్యాన్సర్ గడ్డ ఉందని తెలిసినప్పుడు మొదట్లో కొంత ఆందోళన చెందినా ఆ తర్వాత ధైర్యంగా దాన్ని జయించగలిగాననీ, ఇప్పుడు వైద్యం ఎంతో అభివృద్ధి చెందిందనీ, వైద్యుల సలహాలు, సూచనలు పాటించగలిగితే పూర్తిగా నయమవుతుందని నమ్మకంగా చెబుతారామె. అలాగే ఒకప్పటి అమెరికా ప్రథమమహిళ లేడీ నాన్సీరీగన్, ఆస్ట్రేలియా నటి, గాయని కైలిమీనాగ్, 2010లో 53 వయసులో డక్టల్ కార్సినోమాను జయించిన మార్టినా నవ్రతిలోవా, బాలివుడ్ నటి ముంతాజ్ ఇలా క్యాన్సర్‌ను జయించిన వారెందరో ఉన్నారు. వీరంతా క్యాన్సర్ అనగానే భయాందోళనలకు గురయ్యే వారికి స్ఫూర్తిప్రదాతలు. ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాలివుడ్ నటి ఏంజిలినా జోలీ గురించి మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె తల్లి 56 ఏళ్ల వయసులో రొమ్ముక్యాన్సర్‌కు గురయి మరణించారు. దాంతో తనకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా అని తెలుసుకునేందుకు ముందుగానే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో తనకు క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని తెలియడంతో మాసెక్టమీ అనే ప్రక్రియ ద్వారా తన రెండు రొమ్ములనూ తొలగించుకోవడమే కాకుండా మే 14, 2013న ఆ విషయాన్ని ప్రపంచానికంతా తెలిపారు. అంతేకాదు... ఈ జీన్ మ్యూటేషన్ పరీక్ష పాజిటివ్ వచ్చినవారిలో అండాశయాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 50 శాతం ఉండటంతో తాను ఓవరీలు సైతం తొలగించుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇలా జీవితం గురించి అవగాహన ఉన్నవారు, జీవితం చాలా అమూల్యమైనదని గుర్తించిన వారు మొదట్లో కొంత ఆందోళను గురైనా సరైన చికిత్స తీసుకుని తాము ఎంచుకున్న రంగాలలో కొనసాగుతున్నారు. అంతేకాదు తమకు ఇష్టమైన వ్యాపకాలను చేపట్టడం ద్వారా... అంటే కొందరు వ్యాయామాలు చేయడం, ఇంకొందరు లాఫింగ్ థెరపీని ఆశ్రయించడం, మరికొందరు రోజుకొక సినిమా చూడటం, ఎక్కువగా పుస్తకాలు చదవడం, బయటకు వెళ్లి నలుగురితో కలిసే పనులు చేయడం, మొక్కలు నాటడం, క్లాసులు తీసుకోవడం వంటి పనులు చేయడం వల్ల త్వరగా కోలుకోగలుగుతున్నారు. ఎంత అవగాహన ఉన్నా, మనోధైర్యం ఉన్నా, వైద్యంలో ఆధునిక పద్ధతులు ఉన్నా క్యాన్సర్‌ను జయించడానికి అందరూ చేయాల్సింది మాత్రం తొలిదశలో గుర్తించడమే. క్యాన్సర్ కణాలు శరీరమంతా పాకిపోయిన తర్వాత, జీవితాన్ని మరికొంత పొడిగించడం తప్ప ఎవరూ ఏమీ లేయలేరనేది అక్షరసత్యం. రొమ్ములో మార్పులు త్వరగా గుర్తించగలరు కాబట్టి రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం తేలికే.రొమ్ములో కణితిలాగా చేతికి తగలగానే క్యాన్సర్ అని అనుమానించి, ఆందోళన చెందాల్సిన అవసరం లేనేలేదు. నెలసరి ముందు రోజుల్లో, పాలిచ్చే స్త్రీలలో, మెనోపాజ్ దశలో రొమ్ములో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొంతకాలంగా కణితి అలాగే ఉంటూ, పెరుగుతూ, రొమ్ములోపల గట్టిగా చేతికి తగులుతూ, కదలకుండా, నొప్పిలేకుండా ఉంటే మాత్రం అనుమానించాల్సిందే. ప్రతి స్త్రీ 20 ఏళ్ల వయసు నుంచే నెలసరి అయిన ఏడో రోజు స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకున్న చేతుతో, వేళ్లతో రొమ్ములను పరీక్షించుకోవాలి. అలా స్వయంగా పరీక్షించుకోవడంతోపాటు 30 ఏళ్లు పైబడ్డాక అల్ట్రాసౌండ్, మామోగ్రామ్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మరీ అనుమానంగా ఉంటే ఎమ్మారై, బయాప్సీ వంటివి తప్పనిసరి. ఈ స్క్రీనింగ్ పరీక్షలతో రొమ్ములోని కణితి చేతికి కూడా తగలనంత చిన్న సైజులో ఉన్నప్పుడే పసిగట్టగలము. దగ్గరి బంధువుల్లో, రక్తసంబంధీకుల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.ఎలాంటి రిస్క్లేనివారు 40 ఏళ్ల వయసులో ఒకసారి, ఆ తర్వాత 40 – 50 ఏళ్ల మధ్య ప్రతి రెండేళ్లకొకసారి, 50 ఏళ్లు పైబడ్డాక ప్రతి ఏడాదీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే కణితిని మాత్రమే తీసివేయగలిగే లంపెక్టమీ సాధ్యమవుతుంది. అలా రొమ్ముక్యాన్సర్ నుంచి విముక్తులు కావచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
జంక్‌ఫుడ్‌తో రొమ్ముక్యాన్సర్ ముప్పు!
టీనేజీ పిల్లలు జంక్‌ఫుడ్ అదేపనిగా తింటుంటారు. వారి ఈ అలవాటుతో భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలు తీసుకునే జంక్ఫుడ్స్, కేక్స్, బిస్కెట్ల వంటి పదార్థాల్లోని కొవ్వులు, నూనెల వల్ల వారు పెద్దయ్యాక కొన్ని అనర్థాలు కనిపించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన అధ్యయనవేత్తలు వెల్లడించారు. అనేక మంది టీనేజీ పిల్లలపై అధ్యయనం చేస్తూ దాదాపు పదేళ్ల పాటు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా ఈ విషయం తేటతెల్లమైంది. ఆ వయసులో ఉండే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు తోడుగా ఇక పెద్దయ్యాక ఆల్కహాల్ కూడా జత అయితే రొమ్ముక్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతుందని తేలింది. ఈ వివరాలన్నింటినీ అమెరికా అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ అయిన ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’లో పేర్కొన్నారు. -
మహిళా పేషెంట్లపై డాక్టర్ వికృత చేష్టలు
లండన్: చేసేది పవిత్ర వైద్యవృత్తి... కానీ అతడి బుద్ధి మాత్రం నీచమైనది. వైద్యం కోసం తన దగ్గరికి వచ్చే మహిళలను లైంగికంగా వేధించి వికృతంగా ప్రవర్తించాడు. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో.. అందరి ముందు దోషిగా నిలబడ్డాడు. వివరాలు... భారత్‌కు చెందిన మనీష్ షా అనే డాక్టర్ లండన్‌లో స్థిరపడ్డాడు. జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న అతడి వద్దకు ఎంతో మంది మహిళలు వస్తుండేవారు. ఈ క్రమంలో సాధారణ చెకప్ కోసం వచ్చిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గురించి వివరించేవాడు. వ్యాధుల తీవ్రతను చెబుతూ వారిని భయభ్రాంతులకు గురిచేసి ఎలాగైనా పరీక్షలు చేయించుకునేలా వారిని ఒప్పించేవాడు. ఈ క్రమంలో వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగిక దాడికి పాల్పడేవాడు. అలా 2009 నుంచి 2013 వరకు దాదాపు 23 మంది మహిళలను, మరికొంత మంది బాలికలను వేధించాడు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2013లో వైద్యశాఖ ఉన్నతాధికారులు మెడికల్ ప్రాక్టీసు నుంచి అతడిని సస్పెండ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన కేసు మాత్రం నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం మనీష్ షా కేసు కోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. ‘ హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ముందే జాగ్రత్తపడ్డారు. కాబట్టి మీరు తప్పక పరీక్షలు చేయించుకోవాలి అంటూ తన దగ్గరికి వచ్చిన మహిళా పేషెంట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనీష్ తీరును కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో అతడిని దోషిగా తేల్చిన కోర్టు.. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. ఇక షా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు ఖండించాడు. తనకు ఏ పాపం తెలియదని పేర్కొన్నాడు. -
సైక్లింగ్‌తో బ్రెస్ట్ క్యాన్సర్‌కు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : నేడు బ్రెస్ట్ క్యాన్సర్‌తో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు బాధ పడుతున్న విషయం తెల్సిందే. వారు వారానికి 150 నిమిషాలపాటు సైకిల్ తొక్కడం లేదా వడి వడిగా నడవడం చేస్తే కచ్చితంగా 30 శాతం మందికి క్యాన్సర్ తగ్గిపోతుందని పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో తేలించి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రానివారు కూడా ఈ వ్యాయామాలు చేస్తే వారిలో కూడా 30 శాతం మందికి ఈ జబ్బు రాదని వారు తెలిపారు. హైడెల్‌బెర్గ్‌లోని ‘జర్మనీ క్యాన్సర్ రీసర్చ్ సెంటర్’కు చెందిన పరిశోధకులు 2000 మందిపై గత పదేళ్ళుగా అధ్యయనం జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు వ్యాయామానికి ఏమైన సంబంధం ఉందా ? అన్న అంశంపై తొలిసారిగా ఈ అధ్యయనం జరిపినట్లు పరిశోధకులు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన మహిళల్లో వ్యాయామం చేస్తున్న వారు చనిపోవడం చాలా అరుదుగా జరుగుతుండడంతో ఈ దిశగా అధ్యయనం జరపాలనే ఆలోచన వచ్చినట్లు వారు తెలిపారు. -
రొమ్ము కేన్సర్‌కు ఉల్లి, వెల్లుల్లి మంత్రం
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా రొమ్ము కేన్సర్ విషయంలో మాత్రం ఇది అక్షరాల వాస్తవమని, ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉండేందుకు ఉల్లితో పాటు వెల్లుల్లి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు బఫెలో, ప్యూర్టరికో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్యూర్టరికోలోని కొంతమందిని నిశితంగా పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకొచ్చామని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గౌరీ దేశాయి తెలిపారు. ఉల్లి, వెల్లుల్లితో ప్యూర్టరీకన్లు చేసే సోఫ్రిటో అనే వంటకం అసలే తినని వారితో పోలిస్తే ఒకటి కంటే ఎక్కువ సార్లు తినే మహిళలకు రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం 67 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. కేన్సర్ నుంచి రక్షణకు ఈ రెండు పదార్థాలు ఉపయోగపడతాయన్న గత అధ్యయనాల ఆధారంగా తాము ఈ పరిశోధన చేశామని చెప్పారు. యూరప్, అమెరికాల కంటే ప్యూర్టరికోలో ఉల్లి, వెల్లుల్లి వాడకం ఎక్కువని, ఈ కారణంగా ఇక్కడ రొమ్ము కేన్సర్ కేసులు కూడా తక్కువగా ఉన్నాయని వివరించారు. ఉల్లి, వెల్లుల్లిలో ఉండే ఫ్లేవనాల్స్, ఆర్గానోసల్ఫర్ పదార్థాలు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. రోమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న 314 మందితో పాటు లేని 346 మందిపై 2008– 2014 మధ్యకాలంలో ఈ అధ్యయనం జరిపినట్లు తెలిపారు. -
తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించే 'జాకెట్'
సాక్షి, హైదరాబాద్: కేన్సర్.. మనుషులను కబళిస్తున్న మహమ్మారి. ముఖ్యంగా మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్ ఇందులో అగ్రభాగంలో ఉంది. ముందస్తు పరీక్షలతో తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే దీన్ని నివారించొచ్చు. ఓవైపు అవగాహన లేక.. మరోవైపు పరీక్షలకు తగిన ఆర్థిక స్తోమత లేక ఎందరో మహిళలు వ్యాధి ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే వ్యాధిని గుర్తించే టెక్నాలజీతో ప్రత్యేక జాకెట్లు, కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటితో పారిశుధ్య మహిళా కార్మికులకు రొమ్ము కేన్సర్ ఉచిత స్క్రీనింగ్‌లను జీహెచ్ఎంసీ చేపట్టింది. దేశంలోని అతి తక్కువ క్లినిక్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ జాకెట్‌ను... పబ్లిక్‌హెల్త్‌లో భాగంగా ఎక్కువ మందికి వినియోగించడం దేశంలో ఇదే ప్రథమం. ఈ సాంకేతికతతో దాదాపు 8 ఏళ్ల ముందే కేన్సర్ సోకే ప్రమాదాన్ని గుర్తించవచ్చు. ప్రాథమిక నిర్ధారణతో తదుపరి అవసరమైన చికిత్సలు పొందే అవకాశం ఉంది. కేన్సర్ నిర్ధారణకు రూపొందించిన ఈ ప్రత్యేక జాకెట్‌ను ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత ఆధారంగా వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చు. ఈ జాకెట్ ధరించేందుకు ఇష్టపడని వారికి శరీరాన్ని తాకకుండానే దాదాపు ఒక అడుగు దూరం నుంచే స్క్రీనింగ్ చేసే కెమెరాను వినియోగిస్తారు. థెర్మలిటిక్స్ టెక్నాలజీతో యాక్టివ్ కేన్సర్ కణాల్ని ప్రాథమిక దశలో గుర్తిస్తారు. కేన్సర్ కణాలున్న భాగంలోని శరీర ఉష్ణోగ్రతను బట్టి థర్మల్ ఇమేజెస్ ఏర్పడతాయని పరీక్షలు నిర్వహిస్తున్న మురాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉపకరణాలతో ఎలాంటి నొప్పి ఉండదు. రేడియేషన్ ప్రభావం ఉండదు. కోత, గాట్లు వంటివి ఉండవు. నలభై ఏళ్లలోపు వారిలోనూ కేన్సర్ వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చు. శరీరాన్ని తాకకుండానే స్క్రీనింగ్, పూర్తి గోప్యత, కణతి ఏర్పడకముందే కేన్సర్ లక్షణాల్ని గుర్తించవచ్చు. సీమెట్ రూపకల్పన... కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో దాని అనుబంధ సంస్థ సీమెట్ ఈ సాంకేతికతను రూపొందించింది. త్రివేండ్రంలోని సీడాక్, కాన్పూర్ మలబార్ కేన్సర్ సెంటర్, నిరామయి స్టార్టప్‌లతో కలిసి ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వినియోగానికి పేటెంట్ పొందిన జపాన్ మురాటా కంపెనీకి అనుబంధ సంస్థగా నగరంలో ఉన్న మురాటా బిజినెస్ ఇంజినీరింగ్(ఇండియా) లిమిటెడ్ ఉపకరణాల ఉత్పత్తితో పాటు స్క్రీనింగ్ పరీక్షలూ నిర్వహిస్తోంది. పబ్లిక్‌హెల్త్‌లో భాగంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇదీ పరిస్థితి థర్మల్ ఇమేజెస్ ద్వారా కేన్సర్ కణాల పెరుగుదలను రెండో సంవత్సరం నుంచే గుర్తించవచ్చు. మామోగ్రామ్ ద్వారా నాలుగేళ్ల వరకు కూడా కనుక్కోవడం కష్టం. గతంలో 40 ఏళ్లు దాటిన వారిలోనే రొమ్ము కేన్సర్లు ఉండేవి. ప్రస్తుతం యుక్త వయసులోనూ పెరుగుతున్నాయి. రొమ్ము కేన్సర్ లక్షణాలు చాలా వరకు స్టేజ్ 2, ఆ తర్వాతి దశల్లోనే కనిపిస్తాయి. తరచూ పరీక్షల ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చు. బస్తీ దవాఖానాల్లోనూ.. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య మహిళా కార్మికులందరికీ ఈ పరీక్షలు చేయిస్తాం. పేద మహిళల సదుపాయార్థం నగరంలోని బస్తీ దవాఖానాల్లోనూ అందుబాటులోకి తెస్తాం. – బొంతు రామ్మోహన్, మేయర్ అదే మా లక్ష్యం హైటెక్నాలజీతో కూడిన మెడికల్ ఉపకరణాలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనేదే మా లక్ష్యం. స్వదేశంలో స్థానికులతోనే ఉత్పత్తులు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందుకుగాను సాంకేతికంగా కొంత సహకారాన్ని జపాన్ నుంచి పొందుతున్నాం. – కరుణ్మల్హోత్రా, ఎండీ (మురాటా బిజినెస్ ఇంజినీరింగ్ ఇండియా) పేదల కోసం.. చాలామందికి రొమ్ము కేన్సర్‌పై అవగాహన ఉండదు. పారిశుధ్య కార్మికులతో సహా పేద మహిళలెందరికో ఉపయోగపడుతుందనే ఆలోచనతో మురాటా నిర్వాహకులతో సీఎస్సార్ కింద ఉచిత స్క్రీనింగ్‌కు ఒప్పించాం. పరీక్షల శిబిరాలతో క్రమేపీ అవగాహన వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేన్సర్ స్క్రీనింగ్‌కు రూ.10,000 నుంచి రూ.15,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఒక్కో జోన్‌లోని ఒక్కో డివిజన్ వంతున దాదాపు 400 మందికి ఉచిత స్క్రీనింగ్‌కు నిర్వాహకులు ముందుకొచ్చారు. ఒకవేళ ఎవరికైనా తదుపరి పరీక్షలు అవసరమైతే ఈఎస్ఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. – హరిచందన, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కేన్సర్ కణాల పెరుగుదల ఇలా... చురుగ్గా ఉండే కేన్సర్ కణాలు ప్రతి 90 రోజులకోమారు రెట్టింపవుతాయి. సమయం కణాలు 90 రోజులు 2 సంవత్సరం 16 రెండేళ్లు 256 మూడేళ్లు 4,896 నాలుగేళ్లు 65,536 ఐదేళ్లు 10,48,576 ఆరేళ్లు 1,67,77,216 ఏడేళ్లు 26,84,35,456 ఎనిమిదేళ్లు 429,49,67,296 -
తల్లిపాలకు దూరం..దూరం..!
సాక్షి, సిటీబ్యూరో: అమ్మపాల స్థానాన్ని ‘అమ్మకపు’ పాలు ఆక్రమించేశాయి. ఆధునిక జీవన శైలి, పని ఒత్తిడి తల్లీ పిల్లల అనుబంధాన్ని శాసిస్తున్నాయి. సకల సౌకర్యాలతో తులతూగుతున్న నవతరం శిశువులు అమ్మ మురిపాలకు, చనుబాలకు నోచుకోలేక పోతున్నారు. చాలా మంది పోతపాలే ఆహారంగా పెరుగుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమిత మైన ఈ విషసంస్కృతి నేడు పల్లెలకు సైతం పాకింది. బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన అన్ని రకాల పోషకాహారాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, క్యాల్షియం, ఐరెన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఎన్‌ఎఫ్‌హెచ్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 22 శాతం మంది చిన్నారులు మాత్రమే పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగుతుండగా, 30 శాతం మంది అసలు తల్లిపాల రుచే ఎరుగడం లేదు. దీంతో అనేక మంది చిన్నారులు వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. ఏటా వెయ్యి కోట్లపైనే వ్యాపారం నాగరికతపై ఉన్న మోజు...అందం చెడిపోతుందనే అపోహ.. ఉద్యోగం... సంపాదన..పనిఒత్తిడి... మారిన జీవనశైలి.. తదితర కారణాల వల్ల ఆధునిక తల్లులు డబ్బాపాలను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఏడాదికి దాదాపు 1.5లక్షల మంది శిశువులు జన్మిస్తుండగా, వీరిలో 75 శాతం మందికి డబ్బా పాలే దిక్కవడంతో పాల పౌడర్, సీసాల ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెల్లో ఒక్కో పాల సీసా ధర రూ.90 నుంచి రూ. 200 పలుకుతుండగా, పాలపౌడర్ ధర కూడా రూ.130 నుంచి రూ.180 పలుకుతోంది. పోతపాల వల్ల తల్లికి బిడ్డపై, బిడ్డకు తల్లిపై ఉండాల్సిన ప్రేమ తగ్గుతోంది. వయసు వచ్చాక ఇరువురి మధ్య దూరం పెరుగడంతో పాటు చాలా మంది తల్లులు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌కు గురవుతున్నారు. బిడ్డకు తల్లిపాలే శ్రేష్ఠం అప్పుడే పుట్టిన పిల్లలకు అందే మొట్టమొదటి ప్రకృతిసిద్ధ ఆహారం తల్లిపాలు. జీవితంలోని తొలి మాసంలో పిల్లలకు అవసరమైన శక్తి, పోషకాలను అందించడమే కాకుండా ఆరు నుంచి పన్నెండు నెలలకు, ఏడాది నుంచి ఏడాదిన్నర వరకూ వారి పోషక అవసరాలను ఎక్కువ వరకూ తల్లిపాలు అందిస్తాయి. స్పర్శ, మానసిక వికాసాన్ని తల్లిపాలు పెంపొందిస్తాయి. పిల్లలకు అంటు, దీర్ఘకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ప్రత్యేకంగా తల్లిపాలు బాల్యంలో వచ్చే డయేరియా , న్యుమోనియా లాంటి వ్యాధుల బారినుంచి తొందరగా కోలుకునేలా చేసి వారి ఆయుష్షు పెంచుతాయి. –డాక్టర్ అనిత కున్నయ్య, గైనకాలజిస్ట్, సిటిజన్ ఆస్పత్రి, నల్లగండ్ల -
చౌకగా కేన్సర్ వ్యాధి నిర్ధారణ...
కేన్సర్ మహమ్మారిని నిర్ధారించుకునేందుకు ఎంతో ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నాలజీతో దీన్ని కారు చౌక చేసేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. మనిషి వెంట్రుక మందమంత చిన్న చిన్న కాలువల్లాంటి నిర్మాణాలతో కూడిన ల్యాబ్ ఆన్ చిప్ పరికరాలతో కేన్సర్‌ను సులువుగా గుర్తించవచ్చునని సిప్రియాన్ ఇలిస్క్యూ అనే రొమేనియన్ శాస్త్రవేత్త చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ ల్యాబ్ ఆన్ చిప్‌లు ఒక్కో వ్యక్తికి తగిన వైద్యం అందించేందుకు కూడా ఉపయోగపడతాయని చెప్పారు. మైక్రోఫ్లూయిడిక్స్ అభివద్ధిపై బయో మైక్రోఫ్లూయిడిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని కణాలను వేరుచేసి ఈ చిప్‌లలోకి పంపి... కేన్సర్ మందులను వాటిపై ప్రయోగించవచ్చునని... తద్వారా అవి ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆయా మందులను వాడకం మొదలుపెట్టవచ్చునని సిప్రియాన్ వివరిస్తున్నారు. ఈ ల్యాబ్ ఆన్ చిప్స్ రక్తం, లాలాజలం, స్వేదం, మూత్రం వంటి పలు జీవ ద్రవాలను విశ్లేషించగలదని.. కేన్సర్ కణితులు విడుదల చేసే నిర్దిష్ట కణాలు, ప్రొటీన్లు, కణజాలాలను గుర్తించగలదని వివరించారు. లిక్విడ్ బయాప్సీ అని పిలిచే ఈ పద్ధతి వల్ల రోగికి ఇబ్బందులు తగ్గడమే కాకుండా.. శరీరం మారుమూలల్లోని కణితులను కూడా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కేన్సర్ ఏ అవయవంలో మొదలైంది.. ఇతర అవయవాలకు విస్తరించిందా? లేదా? అన్నది కూడా ఈ చిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. -
క్యాన్సర్... అందరూ తెలుసుకోవాల్సిన నిజాలు
వైద్యవిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ తెలిసిన వారికి, బంధువులకు క్యాన్సర్ అని తెలిస్తే... ఒళ్లు జలదరిస్తుంది. ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతుంటాయి. తొలిదశలోనే గుర్తిస్తే చికిత్సకు లొంగే క్యాన్సర్ గురించి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహనవంశీ అందిస్తున్న కొన్ని వివరాలు... 1. క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ లక్షణాలన్నవి ఆ వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందరిలోనూ అన్నిరకాల క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి... తీవ్రమైన అలసట. జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలితగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత. (ఇవి క్యాన్సర్ ముదిరాక కనిపించే సాధారణ లక్షణాలని తెలుసుకోండి). 2. క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? శరీరం మొత్తంలో క్యాన్సర్ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందని అనుమానిస్తే... ఆ అవయవానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్–రే, సీటీస్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ ఇలా.. అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రమే పాప్‌స్మియర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. 3. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ లేదా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం ఖచ్చితంగా హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందుగా) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 4. క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదా? సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పుష్కలంగా పీచుపదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా చూసుకోవడం ద్వారా కొంత మేరకు ప్రయత్నం చేయవచ్చు. 5. ఏదైనా క్యాన్సర్స్ వంశపారంపర్యమా? ఖచ్చితంగా చెప్పలేం గానీ... రొమ్ము క్యాన్సర్ రక్తసంబంధీకుల్లో ఉన్నప్పుడు... మిగతా వారితో పోలిస్తే... వీళ్లకువచ్చే ముప్పు ఎక్కువ. బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 వంటి జీన్ మ్యూటేషన్ పరీక్షల ద్వారా రొమ్ముక్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడచ్చు. రొమ్ము క్యాన్సర్ బాధితులు 80% వంశపారంపర్యంగా లేనివారే కాబట్టి ప్రతి మహిళా తన 20వ ఏటి నుంచే రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి. నెలసరి అయిన ఏడో రోజున సబ్బు చేతులతో వేళ్ల మధ్యభాగంతో రొమ్ములను పరీక్షించుకుని, చిన్న చిన్న గడ్డలు ఏవైనా తగులుతున్నాయా అని గమనించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ఇతర పరీక్షలు, 40 ఏళ్ల పైబడ్డాక మామోగ్రామ్ వంటివి డాక్టర్ సలహా మేరకు ఏడాదికి ఒకసారి (ఇది కుటుంబ చరిత్రను అనుసరించి) లేదా మూడేళ్లకు ఒకసారి చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించగలిగితే వెంటనే చికిత్స తీసుకోని, దాని బారినుంచి విముక్తం కావడానికి అవకాశాలుంటాయి. 6. క్యాన్సర్‌ను కొంతమంది జయిస్తే మరికొంతమంది తెలిసిన కొద్దిరోజుల్లోనే మరణిస్తారు. ఎందుకని? ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే, క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడం అన్న విషయం క్యాన్సర్‌ను ఏ దశలో కనుక్కున్నాం, వారి క్యాన్సర్ గడ్డకు త్వరగా పాకే గుణం ఉందా లేదా వచ్చిన ప్రదేశానికే పరిమితమయ్యిందా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, థెరపీలు కూడా ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడంలో త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ తాలూకు స్టేజ్, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. 7. క్యాన్సర్‌కు వయోభేదం లేదా? లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పెద్ద వయసు వారిలో వచ్చే క్యాన్సర్స్ తీవ్రత చాలా ఎక్కువ. అందుకే క్యాన్సర్ చికిత్స అన్నది కూడా రోగి వయసును బట్టి మారుతూ ఉంటుంది. 8. క్యాన్సర్ చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? పరిశోధకులు క్యాన్సర్ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) కొంతవరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. ప«థ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. ఇంకా మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ–హోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోధెరపీ, కీమో, హార్మోన్ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. అయితే కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్ అదుపులో ఉంది అంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
‘హీరో భార్యగా ఎంతో వేదన అనుభవించా’
ఒక హీరో భార్యగా తాను ఎంతో మానసిక వేదన అనుభవించానంటున్నారు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్. భర్త చుట్టూ అందమైన అమ్మాయిలు ఉంటే ఎవరైనా తనలాగే అభద్రతా భావంతో కుంగిపోతారని.. అయితే ఈ భావాలన్నీ తన మానసిక అపరిపక్వత కారణంగా కలిగినవేనని వ్యాఖ్యానించారు. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన తహీరా త్వరలోనే ఓ ఫీచర్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త మొదటి సినిమా నాటి అనుభవాల గురించి ప్రస్తావించారు. ‘చండీగఢ్ నుంచి ఆయుష్మాన్‌తో కలిసి ముంబై వచ్చిన కొత్తలో ఫలానా రంగంలో స్థిరపడాలని నేనెప్పుడూ అనుకోలేదు. రేడియో, టీవీ, టీచింగ్, పీఆర్ ఈవెంట్స్ ఇలా అన్నీ చేసాను. కానీ నాకు ఎందులోనూ సంతోషం దొరకలేదు. అయితే మొదటిసారి గర్భవతిని అయిన సందర్భంలో నేను పుట్టింటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయుష్మాన్ విక్కీ డోనర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నాతో కాసేపు మాట్లాడేందుకు కూడా తనకి సమయం ఉండేది కాదు. ఒకానొక సమయంలో తనకు విడాకులు ఇవ్వాలని కూడా అనుకున్నాను. నిజంగా అప్పుడు చాలా వేదన అనుభవించా. అది మా ఇద్దరి జీవితాల్లో అన్నికంటే కఠినమైన దశ అది. నా చేయి పట్టుకుని భయపడాల్సిందేమీ లేదని తను చెప్పినా బాగుండు. కానీ అప్పటికి ఇద్దరం మానసికంగా ఎదగలేదు. అందుకే చిన్న చిన్న తగాదాలు. తనతో బంధం తెంచుకోవాలన్నంత కోపం. కానీ తన గురించి నాకు, నా గురించి తనకి పూర్తిగా తెలుసు.అందుకే ప్రస్తుతం ఇలా ఉన్నాం’ అంటూ క్యాన్సర్‌తో ధీరోచితంగా పోరాడుతున్న తహీరా చెప్పుకొచ్చారు. కాగా రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన అతడి సినిమాలు ‘అంధాధూన్, బదాయి హో’ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఇక... 2008లో తహీరాను పెళ్లి చేసుకున్న ఈ స్టార్‌కి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
బ్రెస్ట్ కేన్సర్‌తో హార్ట్ ఫెయిల్యూర్
సాక్షి, సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఎంతో మంది చిన్నతనంలోనే పలు రకాల కేన్సర్ల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు గర్భాశయ ముఖద్వార కేన్సర్లతోను, పట్టణ మహిళలు రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలు అధికంగా వాడడంతో పురుషులు స్టమక్, నెక్ అండ్ మౌత్ కేన్సర్ల బారిన పడుతున్నట్టు ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో నమోదైన కేసులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. నేడు ‘ప్రపంచ కేన్సర్ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో ఎంతో మంది చిన్నతనంలోనే పలు రకాల కేన్సర్ల బారిన పడుతున్నారు. అతిగా మద్యం తాగడం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలు అధికంగా వాడటంతో పురుషులు స్టమక్, నెక్ అండ్ మౌత్ కేన్సర్ల బారిన పడుతుండగా, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు గర్భాశయముఖ ద్వార కేన్సర్ల బారిన పడుతున్నారు. ఎక్కువగా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 2017లో కొత్తగా నమోదైన కేన్సర్ కేసులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. ఆ ఏడాది మొత్తం 1,1000 కేన్సర్ కేసులు నమోదు కాగా, వీటిలో 2200 లుకేమియా, 1800 స్టమక్, 1600 హెడ్ అండ్ నెక్, 1500 గర్భాశయ ముఖ ద్వారం, 1000 రొమ్ము, 800 ఎముక సంబంధ, 500 కాలేయం, 220 బ్రెయిన్, 100 కిడ్నీ సంబంధ కేన్సర్లు నమోదయ్యాయి. ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం.. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద కేన్సర్ చికిత్సల సమాచారాన్ని పరిశీలిస్తే 49 శాతం మహిళలు దీని బారిన పడగా, ఇందులో రొమ్ము కేన్సర్ చికిత్సలు 18.70 శాతం. గర్భాశయ ముఖద్వార చికిత్సలు 30.25 శాతం ఉండడం గమనార్హం. రొమ్ము కేన్సర్‌లో హైదరాబాద్ 7,528 కేసులతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అదే విధంగా గర్భాశయముఖ ద్వార కేన్సర్‌లో వరంగల్ జిల్లాలో అత్యధికంగా 10064 చికిత్సలు జరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో చికిత్స పొందుతున్నది నిరుపేదలే. ‘లక్షణం’గా గుర్తించుదాం..నివారించుదాం కేన్సర్‌పై పోరాటంలో తొలి అడుగు దానిని గుర్తించడం. అలా జరగాలంటే దాని లక్షణాలపై మనకు సరైన అవగాహన అత్యవసరం. ముందస్తుగా దీనిపై అవగాహన పెంచుకోవాలి అంటున్నారు అపోలో క్లినిక్స్‌కు చెందిన రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి.విజయ్ కరణ్‌రెడ్డి. ♦ అప్పుడప్పుడూ దగ్గు వచ్చి తగ్గడం సహజమే. 3 వారాలు అంతకు మించి ఏకధాటిగా దగ్గు ఊపిరితిత్తుల కేన్సర్‌కి సంబంధించి ఓ ప్రధాన లక్షణం. అన్ని దగ్గులూ కేన్సర్‌కి దారి తీస్తాయని చెప్పలేం గానీ, ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్ ద్వారా పరీక్షలు చేయించుకోవడం మంచిది. ♦ పేగుల కదలికలు సులభంగా ఉండకపోవడం, తరచూ డయేరియా, మలబద్ధకం వంటివి జీర్ణాశయ కేన్సర్ లక్షణాలుగా సందేహించవచ్చు. చాలా రోజుల పాటు ఆకలి వేయకపోవడం, లేదా కడుపు నిండుగా ఉన్నట్టు ఉండడం వంటి లక్షణాలు కూడా జీర్ణకోశ అన్నవాహిక సమస్యలకు కారణం కావచ్చు. ఇలాంటి లక్షణాలు గమనిస్తే తప్పనిసరిగా ఎండోస్కొపీ/కొలనోస్కోపీ పరీక్షలు చేయించుకోవాలి. ♦ మూత్రవిసర్జన సమయంలో ఇబ్బందులు, తరచూ రక్తం పడడం, నొప్పి వంటివి /కిడ్నీ/బ్లాడర్/ప్రొస్టేట్ కేన్సర్ లక్షణాలు కావచ్చు. కాబట్టి తప్పనిసరిగా పరీక్ష చేయించి నిర్ధారించుకోవాలి. ♦ కొత్తగా పుట్టు మచ్చల వంటివి కనపించడం, లేదా అప్పటికే మనకి ఉన్న పుట్టుమచ్చలు పెద్దవిగా లేదా మరే రకంగానైనా రూపు మారడం వంటివి స్కిన్ కేన్సర్ లక్షణాలు. ఇవి గమనిస్తే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించాలి. అన్నీ మెలనోమాకు సూచనలు కాకపోవచ్చు. ♦ ఏదైనా గాయం తర్వాత పుండ్లు ఏర్పడి, 3 వారాలు దాటినా మానకపోవడం నయం కాకపోవడం జరిగితే.. ఈ పుండ్లు కేన్సర్‌గా పరిణామం చెందే అవకాశాలు న్నాయి. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ♦ మహిళల్లో సాధారణ రుతుచక్ర సమయానికి అనుకోని ప్రదేశం నుంచి రక్తస్రావం కావడం అనేది గర్భాశయ ముఖద్వార/గర్భాశయ కేన్సర్‌కు లక్షణాలు. పురుష నాళం నుంచి రక్తస్రావమైతే అది పెద్ద ప్రేవు కేన్సర్ లక్షణం. అలాగే దగ్గుతో పాటు రక్తం, వాంతిలో, ఉమ్మిలో రక్తపు మరకలు కూడా సందేహాస్పదమే. ♦ అకస్మాత్తుగా, మన ప్రమేయం లేకుండా బరువు తగ్గిపోతే అది కణితి లేదా కేన్సర్ వల్ల కావచ్చు. ఏదైనా సమయంలో కణితి ఏర్పడి అది రూపుమారుతూ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. అలాగే రొమ్ములలో గడ్డలు రొమ్ము కేన్సర్ లక్షణాలు. తరచూ అజీర్ణం, మింగడంలో ఇబ్బంది, మింగుతున్నప్పుడు నొప్పి కలగ డం అనేవి మెడ అన్నవాహిక కేన్సర్ లక్షణాలు కావచ్చు. ♦ కొంత వయసు మీద పడిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అతిగా శ్రమించినప్పుడు కూడా ఇది జరుగుతుంటుంది. కానీ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఊపిరితిత్తుల కేన్సర్లక్షణాలుగా అనుమానించాలి. ఏడాదికి 50 వేల కేసులు ఖైరతాబాద్: కేన్సర్ పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ డి.మధు తెలిపారు. కేన్సర్ సంబంధిత సమస్యలతో దేశంలో ఏటా 7లక్షల మంది మరణిస్తున్నట్లు తెలుస్తోందని, 2035 నాటికి 17లక్షల కేసులు నిర్ధారణ అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 50వేల కేన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. డాక్టర్ డి.మధు బ్రెస్ట్ కేన్సర్‌తో హార్ట్ ఫెయిల్యూర్ విభిన్న రకాల కేన్సర్లలో ప్రస్తుతం నగర మహిళలకు అత్యధికంగా బాధిస్తున్న బ్రెస్ట్ కేన్సర్ నివారణకు తరచు వైద్య పరీక్షలు తప్పనిసరని జూబ్లీహిల్స్‌లోని అపోలో క్రెడిల్కు చెందిన గైనకాలజీ/ఆబస్టెట్రిక్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ లక్ష్మీరత్న అభిప్రాయపడ్డారు. బ్రెస్ట్ కేన్సర్ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్‌కు కూడా దారి తీయవచ్చునని డానిష్ పరిశోధన తేల్చిందన్నారు. బ్రెస్ట్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళలు ఆట్రియల్ ఫైబ్రిల్లేషన్ అనే గుండె సంబంధ వ్యాధికి గురై తద్వారా స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం నుంచి హార్ట్ ఫెయిల్యూర్ దాకా తెచ్చిపెట్టే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. బ్రెస్ట్ కేన్సర్ బాధిత మహిళలు అట్రియల్ ఫైబ్రిల్లేషన్ పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం అత్యంత ప్రధానమైన విషయమని, హై కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని రిస్క్‌ని మరింత పెంచుతుంది కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రోజువారీగా వ్యాయామం చేయాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. మహిళల్లో గైనిక్, రొమ్ము కేన్సర్లు.. జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, పదే పదే సుఖవ్యాధులు సోకడం, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్ల లోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం వల్ల మహిళలు గర్భాశయ ముఖద్వార కేన్సర్ల బారినపడుతున్నారు. పుట్టిన పిల్లలకు పాలివ్వక పోవడం వల్ల అనేక మంది రొమ్ము కేన్సర్ల బారినపడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కేన్సర్‌పై విస్తృతంగా అవగాహన కల్పించడం, 9 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు బాలికలకు హెచ్‌పీవీ టీకాను ఇప్పించడం, రొ మ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లను గుర్తించడానికి నర్సులు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వడం ద్వారా కేన్సర్‌ను గుర్తించవచ్చు. – డాక్టర్ సాయిరామ్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి పురుషుల్లో దంత, నోటి కేన్సర్లు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ గుట్కా, జర్దా, పాన్‌మసాలా, బీడీ, సిగరెట్ వినియోగం ఎక్కువగా ఉంది. చిన్న వయసులోనే అనేక మంది వీటికి అలవాటు పడుతున్నారు. చదువుకున్న వారితో పోలిస్తే చదువుకోని యువకులు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా వీటికి అలవాటుపడుతున్నారు. పొగాకు ఉత్పత్తులను నోటిలో నమలడం వల్ల దంత, నోటి కేన్సర్లకు కారణమవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నగరంలో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంది. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటం వల్ల కేన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. – చంద్రకాంత్, దంతవైద్య నిపుణుడు, మహావీర్ ఆస్పత్రి -
స్టార్ హీరో భార్యకు క్యాన్సర్
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. తనకు రొమ్ము క్యాన్సర్ సోకిందని, ప్రస్తుతం మొదటి దశలో ఉందని తహీరా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రివీల్ చేశారు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుంగిపోవాల్సిన పని లేదని, దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దని తన శ్రేయోభిలాషులను కోరారు. మాట ఇస్తున్నా.. నాకేం కాదు! ‘ఇది నిజంగా చాలా కఠినమైన సమయమే. కానీ నేను ధైర్యం కోల్పోలేదు. నాలాగే చాలా మంది జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు. ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాదు. మొదటిసారిగా టెస్టు చేయించుకున్నపుడు స్టేజ్ జీరో అని రిపోర్టు వచ్చింది. డాక్టర్ చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకున్నా. కానీ ఇప్పుడు అప్‌గ్రేడెడ్ వర్షన్ వచ్చింది. మహమ్మారి ముదిరిపోయింది. స్టేజ్ 1లో ఉన్నా. ఇప్పటికి ఆరు సెషన్లు పూర్తయ్యాయి. ఇంకో ఆరు మిగిలి ఉన్నాయి. నేనెప్పటికీ ధైర్యం కోల్పోనని నా భర్త, స్నేహితులకు మాట ఇస్తున్నా. ఈ వార్త వినగానే మీరంతా షాకయ్యారని తెలుసు. మరేం పర్లేదు. మొదటి దశలోనే ఈ విషయం బయటపడింది’ అని తహీరా ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కాగా రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన అతడి సినిమాలు ‘అంధాధూన్, బదాయి హో’ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఇక... 2011లో తహీరాను పెళ్లి చేసుకున్న ఈ స్టార్‌కి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. View this post on Instagram That’s what you do when cancer shows up. You show it the way out! It is a tough phase to be in, but then I would have never known my own strength, which is inherent in each one of us, and which we come to know off when tested. Like I said before, let’s choose to be the heroes of our own drama of life. I strongly believe if an obstacle comes in your life it is for you to deal with it, overcome it, beat the shit out of it and become a better version of yourself, which could be a bit worn out but would be experienced, a bit tattered but more wise, a bit left out but more to bring forth, a bit handicapped but better equipped! So now the upgraded version of myself is dealing with cancer stage 1 a, which is still a result of early detection. I’ll be going through 12 sessions of chemotherapy. 6 down, and another 6 left. Hence the cap look nowadays😁 This post is dedicated to my journey where half the battle is won and the other half I want to fight with each of you who is enduring it. Be resilient, be strong, we shall overcome and how! Also I have immense gratitude for people around me who have taken it in the right spirit and didn’t give up on me. Personally I owe it to my best friend @komal20to77 husband @ayushmannk parents @kashyap6480 @yajankashyap . This bit is taken for granted but when professionally you are supported and still look dependable your resilience to fight becomes stronger. For this I owe it to @atulkasbekar @tanuj.garg @findingshanti @shrutiv11 who too were shocked when they heard the news but didn’t give up and still lay bet on this bruised but not broken horse. Gratitude 🙏 #earlydetection #breastcancerawareness #fuckcancer #spreadingawareness #selflovenomatterwhat #bruisedbutnotbroken #bodhisattva #sokavictor #spreadlove #compassion A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Nov 28, 2018 at 12:30am PST -
మనోనిబ్బరంతో క్యాన్సర్‌పై విజయం
రూట్స్ హెల్త్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్త ఆ«ధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి టి. గౌతమి మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని, మనోనిబ్బరం ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనని చెప్పారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని, మనోనిబ్బరం ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనని సినీనటి టి.గౌతమి పేర్కొన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా 1800 అడుగుల క్లాత్‌పై పలువురు మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు పెయింటింగ్స్ వేసారు. ఈ కార్యక్రయాన్ని ప్రారంభించిన గౌతమి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం చెప్పిరాదని, అలాగే క్యాన్సర్ కూడా ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేమన్నారు. పాజిటివ్ థింకింగ్‌తో ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనన్నారు. మహిళలకే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అనుకుంటారని, కానీ పురుషులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. క్యాన్సర్ నివారణకు నేడు అత్యాధునిక వైద్యవిధానం అందుబాటులోకి వచ్చిందని, కొంత మంది నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. రూట్స్ సంస్థ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పీవీఎస్ విజయభాస్కర్, అన్నే శివనాగేశ్వరరావు, చందు, కె.మధవి పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్రికార్ట్స్లో స్థానం.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేలా తైలవర్ణ చిత్రాలతో 1800 అడుగుల పెయింటింగ్స్ వేసినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం పొందింది. ఈ సందర్బంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్ ప్రతినిధులు, రూట్స్ ఫౌండేషన్‌కు సర్టిఫికెట్ అందజేసారు. -
దివ్యదృష్టి
చూపున్నవాళ్లమే లోకాన్ని ఈదుకుంటూ సాయంత్రానికి ఇంటì ఒడ్డుకి సరిగా కొట్టుకు రాలేకపోతున్నాం. ఇక నేహా తనెలా బతుకుతుంది? కూతుర్నెలా బతికిస్తుంది? దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తాడా? చెప్పగల విషయం కాదు. పెద్దాయన పైన ఉంటాడు. ఆయన లోపల ఏముంటుందో కింద ఉండేవాళ్లం మనకు ఎలా తెలుస్తుంది? అయినా, ఇవ్వడానికి తీసుకోవడం ఎందుకూ అనిపిస్తుంది! మనుషులం, మన భయం కొద్దీ దేవుణ్ని పాజిటివ్‌గా తీసుకుంటాం. ‘కులుకుతూ కూర్చున్నావ్, ఏం పట్టించుకోకుండా’ అని దేవుణ్ని పట్టుకుని రామదాసులా తిట్టేస్తే.. ఇంకోటేదైనా ఆయన మన నుంచి తీసేసుకుంటే మళ్లీ అదొక బాధ జీవితానికి. రెండేళ్ల క్రితం నేహా సూరి కి ఆ కాస్త కంటి చూపు కూడా పోయింది. ఒంటరి తల్లి. ఒక టీనేజ్ బిడ్డ. నైరాశ్యం. ఉండడం ఢిల్లీలో. చూపున్నవాళ్లమే లోకాన్ని ఈదుకుంటూ సాయంత్రానికి ఇంటì ఒడ్డుకి సరిగా కొట్టుకు రాలేకపోతున్నాం. ఇక నేహా తనెలా బతుకుతుంది? కూతుర్నెలా బతికిస్తుంది? ఏడాది పాటు ఎలాగో నెట్టుకొచ్చింది. తర్వాత ఆ చీకట్లోకి ఒక వెలుతురు రేఖ ప్రసరించింది. చూపు రాలేదు. చూపుతో పనిలేని ఉద్యోగం వచ్చింది. చేతివేళ్లతో తడిమి బ్రెస్ట్ కాన్సర్ రిస్క్‌ను కనిపెట్టే ఉద్యోగం అది. నేహా ఇప్పుడు ‘మెడికల్ టాకై్టల్ ఎగ్జామినర్’ (ఎం.ఇ.టి)! స్పర్శజ్ఞాని. గత మూడు నెలలుగా తన స్పర్శజ్ఞానంతో వట్టి చేతులతో వైద్య పరీక్షలు చేస్తున్నారు నేహా. వక్షోజాలలో, ఆ చుట్టుపక్కల బాహుమూలాల్లో అర సెంటీమీటరు కణితి ఉన్నా ఆమె వేళ్లు కనిపెట్టేస్తాయి. అయితే ఇది తనకై తను వృద్ధి చేసుకున్న జ్ఞానం కాదు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందే కనిపెట్టేందుకు వసంత్‌కుంజ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రి శిక్షణ ఇప్పించిన ఏడుగురు అంధ మహిళా ఎం.ఇ.టి.లలో నేహా ఒకరు. వీళ్లది మొదటి బ్యాచ్. వీళ్లతోనే ఎం.ఇ.టి. అనే ఒక కోర్సు మొదలైంది! గాంధీ జయంతి రోజు వీరు విధుల్లో చేరారు. ‘ఆప్టిమల్ సెన్సరీ టచ్’తో.. చెకప్ కోసం వచ్చిన మహిళల వక్షోజ భాగాలలోని చిన్నపాటి కణితులను సైతం వీరు గుర్తించగలుగుతారు. వేళ్లతో తగుమాత్రంగానే వక్షోజాలపై ఒత్తిyì కలిగిస్తూ లోపల ఏమైనా గడ్డల్లాంటివి ఉన్నాయేమో తడిమి చూస్తారు. అదే.. ఆప్టిమల్ సెన్సరీ టచ్. కనీసం 35 నుంచి 45 నిమిషాలపాటు వీరి వేళ్లు సునిశితంగా, సూక్ష్మంగా పరీక్ష జరుపుతాయి. మరి బ్రెస్ట్ సరిగ్గా ఎక్కడుందో వీళ్లకు లె లిసేదెలా? బ్రెయిలీ చుక్కలు ఉన్న టాకై్టల్ రేకులు ఛాతీని నాలుగు భాగాలుగా విభజిస్తూ వీరి వేళ్లకు దారి చూపుతాయి. ఒక్క బ్రెస్టు, ఆ చుట్టుపక్కలే కాకుండా.. వీపులో, మెడభాగంలో కూడా గడ్డలు, కణితుల కోసం వేళ్లు గాలిస్తాయి. శిక్షణలో భాగంగా నేహా, మిగతావాళ్లు గుర్గావ్లోని మేదంతా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక్కొక్కరూ 30 మంది మహిళలకు పైగా వేళ్లతో వక్షోజ పరీక్షలు జరిపారు. కచ్చితమైన ఫలితాలను రాబట్టారు. ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వసాధారణం అయింది. ప్రతి లక్ష మందిలో 24 మందిలో కనిపిస్తోంది. ముందుగా కనిపెట్టగలిగితే ఈ ఇరవై నాలుగు మంది ప్రాథమిక దశలోనే గట్టెక్కేయొచ్చు. అలా గట్టెక్కించేవారే ఈ ఎం.ఇ.టి.లు. దేవుడు ఒకటి తీసుకుని ఇంకొకటి ఇస్తాడన్న మాట నిజమే అయితే.. పది మందికి ఇవ్వడం కోసం దేవుడు నేహా దగ్గర్నుంచి, ఆమె బ్యాచ్‌మేట్స్ నుంచీ తీసుకున్నాడనుకోవాలి. నేçహా అయితే అలాగే అనుకుంటోంది. -
ముందు జాగ్రత్తే.. మందు
మారుతున్న జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడంతో మహిళలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతకాలంలో ఎక్కువ మంది మహిళలు ఎదుర్కొంటున్నఆరోగ్య సమస్యల్లో అత్యంత ప్రధానమైనది రొమ్ముక్యాన్సర్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏటా 4 వేల మందివ్యాధితో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అంటున్నవైద్యులు అప్రమత్తతో వ్యాధిని జయించవచ్చని సూచిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ అప్రమత్తతా మాసం సందర్భంగా ప్రత్యేక కథనం.. లబ్బీపేట(విజయవాడతూర్పు): రొమ్ము క్యాన్సర్ బా«ధితులు ఏటా పెరుగుతున్నారు. గ్రామీణ మహిళల కంటే పట్టణాల్లో ఉండే మహిళలే అత్య«ధికంగా వ్యాధి బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే తొలిదశలో గుర్తిస్తుండగా, 70 శాతం మంది, 2, 3 దశల్లో ఆస్పత్రులకు వస్తున్నారు. మరో 20 శాతం మంది నాలుగో దశలో చికిత్స కోసం వస్తున్నారు. అందుకు వ్యాధి లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏటా 4వేల మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. వ్యాధి లక్షణాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. వీరికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ.. సాధారణంగా వయస్సు 40 ఏళ్లు దాటిన వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, పిల్లలు పుట్టాక పాలు ఇవ్వని వారికి ఎక్కువుగా వస్తుంది. కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా ఉన్నా, ఎక్కువ వత్తిళ్లకు గురయ్యే వారికి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, నెలసరి ఆగడం, 55 ఏళ్ల వరకూ నెలసరి ఉండటం వంటివి కారణాలు. ధూమపానం, ఆల్కాహాల్ సేవించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంతో వచ్చే అవకాశం ఉంది. వ్యాధి లక్షణాలు.. రొమ్ము క్యాన్సర్ ఎవరికి వారే గుర్తించవచ్చు. పీరియడ్ వచ్చిన వారం రోజుల తర్వాత స్నానం చేస్తున్న సమయంలో రొమ్ములో గింజంత సైజులో కణుతులు ఏమైనా వచ్చాయా, రొమ్ము పై చర్మం రంగు మారిందా, చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను పరిశీలించాలి. రొమ్ము భాగంలో నొప్పిగా ఉన్నా, చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. మమ్మోగ్రామ్‌తో నిర్ధారణ.. రొమ్ము క్యాన్సర్‌ను మమ్మోగ్రామ్ ద్వారా నిర్ధారిస్తారు. ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ నిర్ధారణకు ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. 3డీ మమ్మోగ్రామ్ అందుబాటులో ఉంది. దీని ద్వారా వ్యాధి సూక్ష్మదశలో ఉన్నప్పుడే గుర్తించే అవకాశం ఉంది. రొమ్ము భాగంలో పౌడర్లా ఏదైనా చల్లినట్లు ఉన్నా కనిపెట్టేస్తుంది. వయస్సు 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి మమ్మోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. మరణాల రేటు అధికమే.. రాష్ట్రంలో ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే దేశంలో క్యాన్సర్‌తో మృతి చెందుతున్న వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంతో తొలిదశలో గుర్తించ లేక పోతున్నారు. మూడోదశలో చికిత్సకోసం వచ్చిన వారిలో కూడా మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. అప్రమత్తతే మందు రొమ్ము క్యాన్సర్‌కు ముందుచూపే మందు. సాధారణంగా 40 ఏళ్ల వయస్సు దాటిన మహిళల్లో ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంది. లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, బిడ్డలకు పాలివ్వని వారికి ఎక్కువుగా వస్తుంది. తొలిదశలోనే గుర్తించి వెంటనే ఆస్పత్రికి వెళ్తే అత్యాధునిక పరికరాలతో వ్యాధిని నిర్ధారించి చికిత్స పొందవచ్చు. రోజు వారీ వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోవడం, కొవ్వు, నూనె ఉన్న పదార్థాలు తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువుగా తీసుకుంటే మంచిది.– డాక్టర్ ఎన్.సుబ్బారావు, మెడికల్ అంకాలజిస్ట్, అనీల క్యాన్సర్ సెంటర్ -
టాప్‌లెస్‌గా పాట పాడిన టెన్నిస్ స్టార్
అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ టాప్ లెస్‌గా పాట పాడారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా ఆమె ‘ఐ టచ్ మై సెల్ఫ్’ అనే పాటను ఆలపించారు. మహిళలు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని గుర్తు చేస్తూ ఆమె ఈ పాట పాడారు. ఈ వీడియోను సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘ఇది నాకంత సౌకర్యంగా లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందర్నీ రొమ్ము క్యాన్సర్ ప్రభావితం చేస్తోంది, వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ పని చేశా’’నని ఆమె చెప్పారు. (చదవండి: సెరెనాకు ఊహించని షాక్) ‘‘రొమ్ము కేన్సర్‌ను ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఇది చాలా ప్రాణాలను కాపాడుతుందని సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మహిళలకు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలనే విషయాన్ని ఈ వీడియో గుర్తు చేస్తుందని భావిస్తున్నాను.’’ అని సెరెనా తెలిపారు. (చదవండి: అంపైర్ అబద్ధాల కోరు.. దొంగ: సెరెనా) View this post on Instagram This Breast Cancer Awareness Month I’ve recorded a version of The Divinyls global hit “I Touch Myself” to remind women to self-check regularly. _ Yes, this put me out of my comfort zone, but I wanted to do it because it’s an issue that affects all women of all colors, all around the world. Early detection is key - it saves so many lives. I just hope this helps to remind women of that. _ The music video is part of the I Touch Myself Project which was created in honor of celebrated diva, Chrissy Amphlett, who passed away from breast cancer, and who gave us her hit song to remind women to put their health first. The project is proudly supported by @BerleiAus for Breast Cancer Network Australia. _ Visit the link in my bio to find out more. #ITouchMyselfProject #BerleiAus #BCNA #DoItForYourself A post shared by Serena Williams (@serenawilliams) on Sep 29, 2018 at 8:19am PDT -
మన వెంటే ఉండే సూట్‌కేస్
ఫొటో చూశారుగా.. అదీ విషయం. ఇందులో కనిపిస్తున్న సూట్‌కేస్‌ను మనం లాక్కు వెళ్లే అవసరమే లేకపోగా.. అది మనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. మన దగ్గరగానే అడుగులేస్తూ ఉండటం ఇంకో విశేషం. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ ఫార్వర్డ్ ఎక్స్ రోబోటిక్స్ తయారు చేసింది దీన్ని. రెండు బ్రష్‌లెస్ విద్యుత్తు మోటర్లు, బోలెడన్ని కెమెరాలు.. ఒక స్నాప్‌డ్రాగన్ మైక్రో ప్రాసెసర్ సాయంతో ఈ సూట్‌కేస్ తన పరిసరాలను గుర్తిస్తూ మీ వెంటే నడుస్తుందన్నమాట. రొమ్ము క్యాన్సర్ నివారణకు విటమిన్–డి రోజూ కాసేపు ఎండలో నిలబడితే ఆరోగ్యానికి మేలని మీరు చాలాసార్లు విని ఉంటారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. శరీరం స్వయంగా తయారు చేసుకోవడం సాధ్యం కాని విటమిన్ డీని సూర్య కిరణాలతో చేసుకోవచ్చు. ఎముకల దృఢత్వం మొదలుకొని అనేక సమస్యల పరిష్కారానికి విటమిన్ డీ దోహదపడుతుందని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజాగా శరీరంలో విటమిన్ డీ ఎక్కువ మోతాదులో ఉంటే రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. విటమిన్ డీతో ఆరోగ్య ప్రయోజనాలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో కలిపి ఈ అధ్యయనం జరిగింది. దాదాపు అయిదు వేల మందిపై ఇప్పటికే జరిగిన రెండు క్లినికల్ ట్రయల్స్ నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించినప్పుడు తమకు ఈ కొత్త విషయం తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. 2002 – 2017 మధ్యకాలంలో జరిగిన ఈ దీర్ఘ అధ్యయనంలో అప్పుడప్పుడూ విటమిన్ డీ మోతాదులను పరిశీలించామని, మొత్తమ్మీద చూసినప్పుడు వీరిలో 77 మంది రొమ్ము కేన్సర్ బారిన పడ్డారని ఆయన చెప్పారు. కేన్సర్‌బారిన పడని వారిలో విటమిన్ డీ మోతాదు 60 నానోగ్రామ్స్/లీటర్‌గా ఉన్నట్లు గుర్తించామని.. సాధారణంగా 20 నానోగ్రాముల విటమిన్ డీ ఉంటే చాలని వైద్యం చెబుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన విటమిన్ డీ మోతాదును గణనీయంగా పెంచేందుకు అమెరికన్ వైద్యరంగం ప్రయత్నాలు చేస్తోంది. అరవై నానోగ్రాముల కంటే ఎక్కువ విటమిన్ డీ ఉన్న వారికి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం 20 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ధూమపానం వంటి అలవాట్లు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ విటమిన్ డీ ఎక్కువగా ఉన్నవారికి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తమ అధ్యయనం చెబుతోందని వివరించారు. కొన్ని రకాల ఇతర కేన్సర్ల విషయంలోనూ విటమిన్ డీ ప్రభావం ఎంతో ఉన్నట్లు గతంలో జరిగిన పరిశోధనలు చెబుతూండటం ఇక్కడ గమనార్హం. -
రొమ్ము కేన్సర్‌కు కొత్త చికిత్స.. సక్సెస్!
రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా రొమ్ము కేన్సర్‌కు సమర్థంగా చికిత్స కల్పించారు శాస్త్రవేత్తలు. దాదాపు 49 ఏళ్ల వయసున్న మహిళ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతోందని, మూడు నెలలకు మించి బతికేందుకు అవకాశం లేదని వైద్యులు తేల్చిచెప్పగా.. కెనడాలోని ఓ కేన్సర్ పరిశోధన సంస్థ కొత్త రకం ఇమ్యునోథెరపీని ఆ మహిళపై ప్రయోగించారు. రెండేళ్ల క్రితం చికిత్స మొదలుపెట్టగా కొన్ని వారాల్లోనే కేన్సర్ కణితి కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఇప్పటివరకూ వ్యాధి లక్షణాలేవీ కనిపించలేదని నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. రోగి శరీరంలోని ట్యూమర్ ఇన్ఫ్రిల్ట్రేటింగ్ లింఫోసైట్లను సేకరించి, కేన్సర్ కణాలను గుర్తించే లక్షణాలు వాటికి అందించి మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టడం ఈ కొత్త రకం ఇమ్యునోథెరపీ ప్రత్యేకత. ‘‘చికిత్స ప్రారంభమైన వారం రోజులకే నాలో ఏదో జరుగుతున్న అనుభూతి కలిగింది. ఛాతీలో ఉన్న కణితి కరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఆ తరువాత ఒకటి రెండు వారాలకు పూర్తిగా కుంచించుకుపోయింది ఆ కణితి’’ అని ఈ పరిశోధనలో పాల్గొన్న రోగి జూడీ పెర్కిన్స్ తెలిపారు. ఈ కొత్త రకం ఇమ్యునోథెరపీని కేవలం రొమ్ము కేన్సర్‌కు మాత్రమే కాకుండా ఇతర కేన్సర్లకు కూడా ఉపయోగించవచ్చుననీ, అన్ని కేన్సర్ కణాల్లోనూ జన్యుమార్పులు ఉండటం, వాటిని లక్ష్యంగా చేసుకుని లింఫోసైట్లను ప్రయోగించడం దీనికి కారణమనీ ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త స్టీఫెన్ రోసెన్‌బర్గ్ తెలిపారు. -
బ్రెస్ట్ క్యాన్సర్‌కు బీర్
బీరు మంచిదో, చెడదో చెప్పే విషయం కాదిది. క్యాన్సర్‌కు కీమోథెరపీ చేయించుకుంటున్న మహిళల కోసం చెకోస్లొవేకియాలోని ‘బ్రెస్ట్ క్యాన్సర్ ఛారిటీ’ సంస్థ ఒకటి ప్రత్యేకమైన బీరును తయారు చేయించింది. అయితే ఇది మహిళా పేషెంట్లు అందరి కోసమూ కాదు. బీరు తాగాలని ఆశపడుతున్న కొందరి కోసమే. మామూలు బీర్లు చేదుగా ఉంటాయి. వీరి బీర్లు తియ్యగా ఉంటాయి. ప్రస్తుతం ఇవి అక్కడి క్యాన్సర్ ఆసుపత్రులలో రోగులకు ఉచితంగా అందిస్తున్నారు. బయట మందుల షాపులలో కూడా కొద్దిపాటి ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఈ బీరులో ఏమేమి ఉంటాయి. ఆల్కాహాల్ అయితే ఉండదు. ఇక ఉండేవి ఏంటంటే విటమిన్లు, మినరల్స్, కొంచెం ఎక్కువస్థాయిలో డి విటమిన్, పొటాషియం ఉంటాయి. కడుపు నిండా తిన్నా ఒంటికి పోషకాలు పట్టని వారికి ఈ బీరు ప్రత్యామ్నాయం అని అక్కడి డాక్టర్లు సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. అంతేకాదు, కీమోథెరపీ వల్ల జుట్టు ఊడిపోయే సమస్యకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుందట. బీరు పేరు ‘మమ్మా బీర్’. మరి ఇది మగవాళ్లకు అమ్మరా? ఎందుకు అమ్మరండీ.. కొనరుగానీ. -
రొమ్ము కేన్సర్ గుర్తించేందుకు జాకెట్
రొమ్ము కేన్సర్ గుర్తింపునకు సంప్రదాయ మమోగ్రఫీ కంటే చౌకైన పద్ధతిని తమ సంస్థ సిద్ధం చేసిందని సీమెట్ డైరెక్టర్ జనరల్ ఎన్.ఆర్.మునిరత్నం తెలిపారు. రొమ్ము కేన్సర్‌ను గుర్తించేందుకు జాకెట్ ఆకారంలో ఉండే ఓ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ’సాక్షి’కి తెలిపారు. రొమ్ము కేన్సర్ గుర్తించేందుకు ఉపయోగించే మమోగ్రఫీ కోసం ప్రత్యేక యంత్రాలు అవసరమవుతాయని.. వీటి కొనుగోలు, నిర్వహణలకూ భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. దీనికంటే ఎన్నో రెట్లు తక్కువ ఖర్చుతోనే తమ జాకెట్ రొమ్ము కేన్సర్ కణతులను గుర్తించగలదని వివరించారు. కేరళలోని త్రిశూర్‌లో ఇప్పటికే 200 మందిపై పరీక్షించి కచ్చితమైన ఫలితాలు సాధించామన్నారు. కార్యక్రమంలో నార్త్ కరొలీనా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ విక్టర్ వెలియాడిస్, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, సీమెట్ హైదరాబాద్ డైరెక్టర్ రతీశ్ పాల్గొన్నారు. -
క్యాన్సర్ బాధితుల భరోసా కోసం ప్రత్యేక పుస్తకం
-
నా పేరు..... నాకు కేన్సర్!
సాక్షి, హైదరాబాద్: ఆ పేరు ఓ తల్లిది కావచ్చు.. ఓ చెల్లిది కావచ్చు.. ఓ భార్యదీ కావొచ్చు...రాష్ట్రంలో కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా మారుతోంది. కేన్సర్ చికిత్స తీసుకునే వారిలో 90 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు రాష్ట్రంలోని వందలాది ఆస్పత్రుల ద్వారా కేన్సర్‌కు చికిత్స అందిస్తోంది. కేన్సర్ చికిత్స పొందుతున్న వారికి సంబంధించి ఆరోగ్యశ్రీ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గణాంకాల ప్రకారం ఏటా సగటున 6 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో అధి క శాతం మహిళలే ఉంటు న్నారు. గర్భాశయ కేన్సర్ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. రొమ్ము కేన్సర్ బాధి తులు గణనీయంగా పెరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని మహిళలే ఎక్కువగా కేన్సర్ బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో రొమ్ము కేన్సర్ రోగులు ఎక్కువగా నమో దవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గర్భాశయ కేన్సర్ రోగులు ఎక్కువగా ఉంటున్నారు. నోటి కేన్సర్ రోగులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా నమోదవుతున్నారు. అవగాహనా రాహిత్యమే కారణం.. అవగాహనా రాహిత్యమే కేన్సర్ తీవ్రతకు ప్రధాన కారణ మని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసిం ది. భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనే ఏటా 14 లక్షల మంది కేన్సర్‌తో మరణిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ పరం గా కేన్సర్ అవగాహనా కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే బాధితులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కేన్సర్ రోగుల్లో 70% మంది 70 ఏళ్లలోపే మరణిస్తున్నారని తెలిపింది. పొగాకు, మద్యపానం వినియో గాన్ని పూర్తిస్థాయిలో అరికడితే పరిస్థితి మెరుగవుతుందని సూచించింది. సాధారణంగా కేన్సర్ తీవ్రస్థాయికి చేరుకు న్నాక కానీ భారత్‌లో రోగులు గుర్తించట్లేదని పేర్కొంది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. చివరిదశలో ఉన్నప్పుడు ఆస్పత్రులకు వచ్చే వారిసంఖ్య ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా చికిత్స పెద్దగా ప్రభావం చూప ట్లేదని ఆరోగ్యశ్రీ ట్రస్టు గణాంకాలు చెబుతున్నాయి. గర్భాశయ కేన్సర్‌కు కారణాలు.. హ్యూమన్పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ). పౌష్టికాహార లోపం బాల్యవివాహాలు, 18 ఏళ్లలోపు కాన్పులు జరగడం. మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, çసుఖవ్యాధుల తీవ్రత. రొమ్ము కేన్సర్‌కు కారణాలు.. ఎక్కువసార్లు జన్యు పరంగా రొమ్ము కేన్సర్ వస్తోంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, సంతానలేమి, పిల్లలకు తల్లి పాలు ఇవ్వకపోవడం కారణం. రాష్ట్రంలో కేన్సర్ బాధితులు గర్భాశయ 81,361 రొమ్ము 55,965 అండాశయం 11,257 జీర్ణకోశం 6,527 పెద్దపేగు 6,999 ఎముకలు 5,351 కండరాలు 4,898 అన్నవాహిక 5,062 ఊపిరితిత్తులు 3,445 రక్తం 4,018 -
మామోగ్రామ్ ఏ వయసు నుంచి?
రొమ్ము క్యాన్సర్ ముప్పును కనుగొనేందుకు మామోగ్రామ్ ఏ వయసు నుంచి చేయించాలనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీన్ని 40వ పడి నుంచే చేయించాలంటూ కొంతమంది మంది డాక్టర్లు సలహా ఇస్తుండగా, మరికొంతమంది 50 తర్వాత నుంచి చేయించవచ్చని చెబుతుంటారు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసేందుకు అమెరికాలోని ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ దాదాపు 66 అధ్యయనాలను నిర్వహించింది. రెండు రకాల రిస్క్‌లు ఉన్న మహిళల్లో దీన్ని నలభై దాటినప్పటి నుంచే ఈ పరీక్షను రొటీన్‌గా తరచూ చేయించడం మంచిదని ఆ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆ రిస్క్‌లు ఏమిటంటే... ♦ తమకు సమీప బంధువుల్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉండటం. ముందుగా చేయించిన మామోగ్రామ్‌లో బ్రెస్ట్ టిష్యూ చాలా మందంగా ఉన్నదనే ఫలితం వచ్చి ఉండటం. ♦ దూరపు బంధువుల్లోనూ రొమ్ము బయాప్సీలో హానికరంకాని (బినైన్) గడ్డలు ఉన్నట్లు తేలినా లేదా అలాంటి బయాప్సీ పరీక్షలో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలినా. ♦ అంతకు ముందు గర్భనిరోధక మాత్రలు (పిల్స్) వాడే అలవాటు ఉండటం లేదా పిల్లలు లేకపోవడం లేదా 30 ఏళ్ల తర్వాతే తొలిచూలు గర్భం రావడం లాంటి కేసుల్లో రొమ్ము టిష్యూ మందం మరీ ఎక్కువగా లేకుండా ఒక మోస్తరుగా ఉన్నా 40 ఏళ్ల నుంచే మామోగ్రామ్ పరీక్షలు చేయిస్తుండటం మంచిదని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి. -
నేను ప్రాణాలతో ఉన్నానంటే అదే కారణం..
సాక్షి, హైదరాబాద్ : ‘నేను ఈ రోజు ప్రాణాలతో ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం నా ధైర్యమే.. బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇప్పుడు మంచి చికిత్స అందుబాటులోకి వచ్చింది. ధైర్యంగా సరైన చికిత్స తీసుకుంటే నయమవుతుంది. గతంలో మాదిరిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ సినీనటి గౌతమి అన్నారు. లైఫ్ అగెయిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విన్నర్స్ వాక్ సందడిగా సాగింది. బ్రెస్ట్ కేన్సర్‌ను ఎదిరించి విజయం సాధించిన సినీనటి గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సినీనటులతో పాటు కేన్సర్‌ను జయించిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తగిన చికిత్స చేయించుకుంటే నయమవుతుందని సీనియర్ నటి జయసుధ పేర్కొన్నారు. బ్రెస్ట్ కేన్సర్ బాధితులు భయంతో వెనుకడుగు వేయకుండా ధైర్యంతో ముందుకు సాగాలని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. మువీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు శివాజి రాజా, జనరల్ సెక్రటరీ నరేష్, ముమైత్‌ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గుండె మీద చయి వేసుకోండి
రొమ్ముపైన కనిపించే ఏ చిన్న లక్షణాన్ని చూసైనా... అదిగో పులి అన్నట్లుగా ఇప్పుడు బెదరాల్సిన అవసరం లేదు. ఆ పులిని చెలరేగకుండా చూసి, అదుపు చేసే ఎన్నో చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదిగో పులి అని భయపడుతున్నప్పుడు... ఇదిగో తోక అంటూ బెదరగొట్టే వారి అపోహలకూ ఇప్పుడు వెరవనక్కర లేదు. ఎందుకంటే అవి అపోహలన్న విషయం గ్రహించి వాస్తవాలు తెలుసుకుంటే చాలు. భయాలూ, గియాలూ అన్నీ బెదిరిన పులిలా పరారవుతాయి. మనం చిన్నప్పుడు వినే కథలు అలా మెదడులోకి కూరుకుపోతాయి. మనసులో కూర్చుండిపోతాయి. ఎప్పటికీ గుర్తుంటాయి. అందుకే రొమ్ముక్యాన్సర్ గురించి అనేక విషయాలను కథలా చెబుతున్నారు ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యనిపుణులు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సీహెచ్. మోహనవంశీ. రొమ్ము క్యాన్సర్ కథను తెలుసుకోండి. అవగాహన పెంచుకోండి. ఇది కథ వెనక కథ... ఇక్కడ రొమ్ము క్యాన్సర్‌ది అసలు కథ. అయితే ఆ అసలు కథ చదివే ముందు ఆ కథ వెనుక క«థను కాస్త చూద్దాం. ఈ కథను చిన్నప్పుడు మనమంతా చదువుకున్నాం. గంగిగోవుకు పులి ఎదురైంది. చంపి తినేస్తానంది. గోమాత మాతృమూర్తి కదా. అందుకే ‘మునుమును పుట్టిన ముద్దుల పట్టి’... తన లేగదూడకు మనస్పూర్తిగా పాలుపట్టి వస్తానంది. మన కథలో గోమాత సమస్త మహిళా లోకానికి ప్రతీక. ఎదురుగా ఉన్న పులి... రొమ్ము క్యాన్సర్‌కు ప్రతినిధి. ఇప్పుడు అసలు కథకు వద్దాం... గిలిపుట్టించే ఈ పులి అసలెలా పుట్టింది? ఆధునికత ప్రధాన కారణం. అందుకే రొమ్ముక్యాన్సర్ నగర పట్టణప్రాంతాల్లో చాలా ఎక్కువ. ఆధునికతతో వచ్చే ఆకర్షణ పులి చారలంత అందంగా కనిపిస్తుంటుంది. కానీ అది తెచ్చే అనర్థాలే పులి గోర్లూ, కోరలంత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇప్పుడు చాలా మంది యువతులు... కెరీర్ కోసం అంటూ చాలాకాలం పాటు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. 30 ఏళ్లు దాటితేగానీ గర్భధారణకు ప్లాన్ చేసుకోవడం లేదు. అందం చెడుతుందనే అపోహతో పాపాయిలకు పాలు పట్టడం లేదు. వేళకు తినడం లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం లేదు. కాలుష్యాలకు దూరంగా ఉండటం లేదు. ఇలాంటి ఎన్నో అంశాలన్నీ కలగలసి రొమ్ముక్యాన్సర్ అనే పులిని పుట్టిస్తున్నాయి. గంగిగోవుల్లాంటి మహిళల ముందు నిలిచి బెంబేలెత్తిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్... అపోహలూ, వాస్తవాలు చికిత్స సాంప్రదాయిక క్యాన్సర్ చికిత్స ప్రక్రియల్లో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఉంటాయన్న విషయం తెలిసిందే. అవసరాన్ని బట్టి డాక్టర్లు ఏ ప్రక్రియను తొలుత చేయాలో... ఏయే కాంబినేషన్లలో చేయాలో నిర్ణయిస్తారు. ఇప్పుడు శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియోషన్ చికిత్సల్లో చాలా అధునాతన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీలో: ఇందులో ఎన్నో కొత్త మందులు అందుబాటులోకి రావడంతో ఇదివరలోలాగ శరీరం మీద వాటి దుష్ప్రభావాల తీవ్రత బాగా తగ్గిపోయింది. ఒకసారి కీమో ఇచ్చాక కూడా క్యాన్సర్ మళ్లీ వస్తే గతంలో అయితే ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త మాలిక్యూల్స్ వల్ల, నోటి ద్వారా తీసుకునే ఓరల్ కీమోథెరపీ మందుల వల్ల జీవిత కాలన్ని గణనీయంగా పొడిగించే అవకాశాలున్నాయి. రేడియేషన్ థెరపీలో: ఒకప్పుడు వ్యాధికి గురైన రొమ్ము భాగానికి రేడియేషన్ ఇస్తే... దాంతో పాటు శ్వాసకోశ వ్యవస్థ, గుండె కూడా దుష్ప్రభావానికి లోనయ్యేవి. కానీ ఇప్పుడు కొత్త రకం రేడియేషన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఐఎమ్ఆర్టీ (ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియో థెరపీ), ఐజీఆర్టీ (ఇమేజ్ గైడెడ్ రేడియో థెరపీ)లతో వి–మ్యాట్ సాంకేతికత సహాయంతో రేడియేషన్ ఇస్తే రోగగ్రస్తమైన భాగానికి చాలా వేగంగా రేడియేషన్ అందించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. పైగా, దీనివల్ల ఆ పొరుగున ఉండే సాధారణ కణజాలానికి ఏమాత్రం హాని కలగదు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అనే విధానం ద్వారా మొత్తం రొమ్ముకు కాకుండా కణితి ఉన్న చోటే రేడియేషన్ ఇవ్వడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. అంతేకాదు... ఇప్పుడు ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ ప్రక్రియల ద్వారా సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ ఇవ్వడమూ ఒకసారి పూర్తయ్యేలాంటి చికిత్స అందుబాటులో ఉన్నాయి. సైబర్‌నైఫ్ సహాయంతో చేసే పార్షియల్ రేడియేషన్‌తో ఒక్కరోజులో చికిత్స పూర్తవుతుంది. ఇవేగాక హార్మోన్ థెరపీ మరియు మోనోక్లోనల్ యాంటీబాడిస్ వంటి అధునాతనమై ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో ఇప్పుడు అన్ని రకాల రొమ్ము క్యాన్సర్లకు దాదాపుగా పూర్తి చికిత్స సాధ్యమేనని చెప్పవచ్చు. చివరగా ఇంకో పులి కథ... యువతులు, మహిళలు నిత్యం చేసుకునే స్వీయ రొమ్ము పరీక్షలతో పాటు రిస్క్ ఉన్నవారు ప్రతి ఏడాదీ లేదా డాక్టర్ చెప్పిన నిర్ణీత వ్యవధిలో అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎలాగూ రొమ్ము క్యాన్సర్‌ను పులితో పోల్చుకున్నాం కాబట్టి... మరో జాగ్రత్త! ప్రతిసారీ రొమ్ముక్యాన్సర్ వచ్చిన దాఖలాలేమీ కనిపించడం లేదు కదా అని... ‘నాన్నా పులి’ కథలో కొడుకు పరాచికాలకు విసిగిపోయిన తండ్రిలా ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదు. ఏమో ఈసారి నిజంగానే పులి కనిపించే ప్రమాదం ఉందేమో! ఇక ఆఖరున... చాలా సందర్భాల్లో చికిత్సతో ఎంతటి రొమ్ముక్యాన్సర్ అయినా తగ్గేందుకే అవకాశాలెక్కువ. ఇలా చూస్తే ఈ రొమ్ముక్యాన్సర్ కథలో –క్యాన్సర్ పులి కంచికి!... రోగి క్షేమంగా, ఆరోగ్యంగా ఇంటికి!! -
రొమ్ము క్యాన్సర్ తగ్గాక గర్భం ధరించవచ్చా..?
పరిపరిశోధన రొమ్ము క్యాన్సర్ వచ్చి తగ్గాక గర్భం ధరించాల్సి వస్తే... మహిళలు నిర్భయంగా ఆ పరిస్థితిని ఆహ్వానించవచ్చు అంటున్నారు అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ నిపుణులు. నిజానికి క్యాన్సర్ తగ్గిన మహిళలు గర్భం ధరిస్తే... రొమ్ము క్యాన్సర్ తిరగబట్టే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని 1,207 మంది మహిళలపై నిర్వహించిన తమ అధ్యయనంలో తేలిందని వారు అంటున్నారు.ఈ అధ్యయన ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదాహరణకు క్యాన్సర్ వచ్చి తగ్గాక గర్భం ధరించిన 333 మందిని ఒక గ్రూపుగానూ, గర్భం ధరించని వారిని మరో గ్రూపుగానూ విభజించి, ఈ రెండు గ్రూపులలోని వారిని నిశితంగా పరిశీలించారు. ఈ పరిశీలన దాదాపు పన్నెండున్నర ఏళ్ల పాటు సాగింది. రొమ్ముక్యాన్సర్ వచ్చి తగ్గాక గర్భం ధరిస్తే... ఆ పరిణామం కారణంగా వెలువడే అధిక హార్మోన్ స్రావాల వల్ల రొమ్ములోని క్యాన్సర్ గడ్డలు తిరగబెట్టి, మళ్లీ క్యాన్సర్‌కు దారితీయవచ్చేమోనని అంతకుమునుపు ఆందోళన చెందేవారు. అయితే అది అంతగా భయపడాల్సిన అంశం కాదని ఈ పరిశోధనలో తేలింది. క్యాన్సర్ వచ్చి తగ్గాక గర్భధారణ జరిగిన మహిళల్లో అది తిరగబెట్టిన కేసులు మిగతా వారిలో ఎన్ని ఉన్నాయో గర్భధారణ జరగని వారిలోనూ దాదాపు అంతే ఉన్నాయి. ఇక రొమ్ము క్యాన్సర్ వచ్చి తగ్గాక గర్భం ధరించినవారిలో (ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు) 25 మంది మహిళలు మిగతా అందరిలాగే తమ బిడ్డలకు రొమ్ముపాలు పట్టించగలిగారు. ‘‘మా అధ్యయన ఫలితాలను బట్టి రొమ్ము క్యాన్సర్ వచ్చి తగ్గాక గర్భం ధరించిన మహిళల్లో ఆ తర్వాత ఆ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తేలింది. కాబట్టి గర్భం ధరించాలనుకున్న వాళ్లను నిరుత్సాహపరచాల్సిన అవసరం లేదని మా అధ్యయనం చెబుతోంది’’ అని నిపుణుల బృందం వివరించింది. అయితే ఇలా గర్భం ధరించాల్సిన మహిళలు ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలి. -
రొమ్ము కేన్సర్ గుర్తింపులో అద్భుతం
► ఆరు రాష్ట్రాల్లోని ఏడు ఆస్పత్రుల్లో ప్రయోగాలు ► విజయవంతమైతే.. పావుగంటలో రూ.130కే కేన్సర్ నిర్ధారణ ► ప్రముఖ రొమ్ము కేన్సర్ నిపుణుడు డాక్టర్ రఘురామ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: వైద్య చరిత్రలో మరో అద్భుతం ఆవిషృతం కాబోతోంది. బయాప్సీ, మామోగ్రఫీ వంటి ఖరీదైన పరీక్షలతో పని లేకుండానే కేవలం చుక్క రక్తంతో ప్రాథమిక దశలోనే రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అత్యాధునిక వైద్యపరిజ్ఞానం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే దీనిపై అమెరికాలో పరిశోధనలు పూర్తై సీఈ సర్టిఫికెట్ కూడా పొందింది. మనదేశంలో ఖచ్చితమైన ఆధారాల కోసం క్లినికల్ రీసెర్చ్ ప్రారంభమైంది. త్వరలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాబోయే ఫలితాల ఆధారంగా మరింత మంది రోగులకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఇది విజయ వంతమైతే ఖరీదైన రొమ్ము కేన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేవలం రూ.130కే అందనుంది. ఈ మేరకు శనివారం హోటల్ ఐటీసీ కాకతీయలో సినీ నటి మంచు లక్ష్మి, పీఓసీ మెడికల్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ సక్సెనా, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌కేన్సర్ ఫౌండేషన్(యూబీఎఫ్) సీఇఓ డాక్టర్ పి.రఘురామ్ సంయు క్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘మమోఅలర్ట్’వైద్య పరికరం పనితీరుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో పరీక్షలు... రొమ్ము కేన్సర్ దేశానికి పెద్ద మహమ్మారిలా మారింది. ఏటా దేశంలో 1.54 లక్షల కేసులు నమోదవుతుండగా, వీటిలో 60శాతం అడ్వాన్స్ స్టేజీలో ఉంటున్నాయి. వ్యాధి నిర్థారణ అయిన ప్రతి ఇద్దరు రొమ్ము కేన్సర్ బాధితుల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారు. రొమ్ము కేన్సర్ మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పీఓసీ మెడికల్ సిస్టమ్ సంస్థ దీని నిర్ధారణ కోసం ‘మమోఅలర్ట్’అనే వైద్య పరికరాన్ని రూపొందించింది. అమెరికాలో ఇప్పటికే 600 మంది నుంచి నమూనాలు సేకరించి, ఉత్తమ ఫలితాలు సాధించింది. ఉషాలక్ష్మి బ్రెస్ట్‌కేన్సర్ ఫౌండేషన్ (యూబీఎఫ్) సీఇఓ డాక్టర్ పి.రఘురామ్ సలహా మేరకు ఖచ్చితమైన ఫలితాలు సాధించి, ఇక్కడి రోగులకు నమ్మకం కలిగించేందుకు దేశవ్యాప్తంగా మరో 2,400 నమూనాలు సేకరించి పరీక్షించాలని నిర్ణయించింది. 15 నిమిషాల్లోనే ఫలితం హైదరాబాద్‌లోని కిమ్స్ సహా ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి, మణిపాల్ ఆస్పత్రి (బెంగళూరు), టాటా మెడికల్ సెంటర్ (కోల్‌కతా) మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (న్యూఢిల్లీ), అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్స్(కొచ్చి), హెచ్‌సీజీ కేన్సర్ సెంటర్ (అహ్మదాబాద్)ను పీఓసీ, యూబీఎఫ్ సం యుక్తంగా ఎంపిక చేశాయి. ఇప్పటికే కిమ్స్‌లో పదిహేను రోజుల్లో వంద మంది(30 మంది వ్యాధి నిర్ధారణ అయిన రోగులు, 70 మంది అనుమానితుల)నుంచి నమూనాలు సేకరిం చి, పరీక్షలకు పంపించాయి. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాలు, వచ్చిన ఫలితాలను విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ సహకారంతో ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని నిర్ణ యించాయి. అయితే కొత్తగా అందుబాటులో కి వచ్చే ఈ వైద్య పరికరం ద్వారా తక్కువ ఖర్చుతో 15 నిమిషాల్లో వ్యాధిని నిర్ధారించ డంతో పాటు మారుమూల ప్రాంతాలకు సులభంగా తీసు కెళ్లే అవకాశం ఉంది. ఒకే సమయంలో పది శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న మామోగ్రామ్ పరీక్షకు ఇది ప్రత్యామ్నాయం కాదని రఘురామ్ వెల్లడించారు. -
రొమ్ము పాలతో బ్రెస్ట్ కేన్సర్ గుర్తింపు
బోస్టన్: రొమ్ము పాలలోని ప్రొటీన్ల తీరును బట్టి బ్రెస్ట్ కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించవచ్చని తేలింది. యుక్త వయసులోని మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను గుర్తించడంలో ఇప్పుడున్న మామోగ్రఫీ, ఇమేజింగ్ పద్ధతులు అంత ప్రభావవంతమైనవి కావని, యుక్త వయసులోని మహిళల్లో రొమ్ము కణజాలాలు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. రొమ్ము పాలు, కన్నీళ్లు, మూత్రం, లాలాజలం, సీరం వంటి ద్రవాల్లోని ప్రొటీన్ల తీరులను పర్యవేక్షించడం ద్వారా బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించవచ్చని మసాచూసెట్స్ వర్సిటీ పరిశోధకులు వివరించారు. పరిశోధనలో భాగంగా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న మహిళలు, రొమ్ము కేన్సర్ లేని మహిళల పాలను పోల్చి చూశారు. రొమ్ము కేన్సర్ వ్యాధికి కారణంగా భావించే ఎపిథియల్ కణాలను పరీక్షించేందుకు రొమ్ము పాలు ఉపయోగపడతాయని వెల్లడించారు. -
వేసవి వ్యాధులు... హోమియో పరిష్కారాలు
హోమియో కౌన్సెలింగ్ నా పేరు అనిల్‌కుమార్. వయసు 35 ఏళ్లు. మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాను. ఎండలో కొంతసేపు తిరిగిన వెంటనే నోరు తడి ఆరిపోతోంది. చెమటలు పడుతున్నాయి. తల తిరిగినట్లు అవుతోంది. దీనికి ముందుజాగ్రత్తలు చెప్పండి. అలాగే హోమియోలో వేసవి సమస్యలకు ఏవైనా పరిష్కారాలు ఉంటే సూచించండి. – సురేందర్‌రావు, వరంగల్ వేడికి నీరు ఎలా ఆవిరవుతుందో, వాతావరణంలో ఎండ వల్ల వేడిమి పెరిగేకొద్దీ మన శరీరంలోని నీరు కూడా అలాగే ఆవిరి అవుతుంది. ఎండాకాలంలో పెద్దవారు, చిన్నపిల్లలు ఎన్నో రకాల వ్యాధులకు గురవుతారు. మనం చెమట రూపంలో ఆవిరయ్యే నీటితో పాటు, సోడియమ్, పొటాషియమ్ మొదలైన లవణాలు కూడా నష్టపోతుంటాం. మిగతా కాలాల్లో కంటే వేసవిలో చెమట రూపంలో రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు నీటిని కోల్పోతుంటాం. ఎండలో తిరిగితే ఎండ దెబ్బ తగులుతుందని అనుకుంటాం. కానీ ఎండదెబ్బ అనేది హఠాత్తుగా జరగదు. ఆరోగ్యం మీద ఎండ ప్రభావం దశలవారీగా ప్రభావం చూపుతూ, చివరికి ఎండ దెబ్బకు దారితీస్తుంది. ఆ దశలు ... 1) అలసట; 2) హీట్ ఎగ్జాషన్; 3) హీట్ స్ట్రోక్. వడదెబ్బతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలిన వృద్ధులు, మహిళలు, చిన్నారు, విద్యార్థులు హోమియో మందులను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో కొన్ని రకాల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి... వడదెబ్బ, చికెన్‌పాక్స్, చర్మ సంబంధిత వ్యాధులు, అలర్జీ, చెమటకురుపులు, తలనొప్పి, ఆకలి మందగించడం, టైఫాయిడ్, నీళ్ల విరేచనాలు, మూత్ర సంబంధ వ్యాధులు, కలరా మొదలైనవి. కారణాలు: ∙కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ∙ఎండల్లో ఎక్కువగా తిరగడం ∙మద్యం సేవించడం ∙బయట కొన్న పదార్థాలు తినడం ∙తీవ్ర ఒత్తిడికి లోనుకావడం లక్షణాలు: ∙నీరసం, తల తిరగడం ∙సొమ్మసిల్లి పడిపోవడం ∙ఒంటినొప్పులు, తలనొప్పి ∙హైఫీవర్, వాంతులు ∙మూత్రం గాఢమైన పసుపురంగులో ఉండి మంటగా రావడం. చికిత్స: వడదెబ్బతో పాటు ఎండాకాలంలో వచే ఇతర వ్యాధులకు హోమియోలో అద్భుతమైన మందులు ఉన్నాయి. వేసవిలో వచ్చే వ్యాధులకు నేట్రమ్మ్యూర్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బ్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి తీవ్రత, లక్షణాలతో పాటు ఇతర వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వైద్యుల పర్యవేక్షణలోమందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ తిరగబెట్టే అవకాశాలు తక్కువే..! క్యాన్సర్ కౌన్సెలింగ్ క్యాన్సర్ ఉన్న శరీర భాగాన్ని తొలగించివేసిన తర్వాత భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? నా భార్య (36 ఏళ్లు)కు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ ఉన్న ఎడమ రొమ్మును తొలగించి వేస్తారని, అయినప్పటికీ మళ్లీ శరీరంలోని మరో చోట క్యాన్సర్ వస్తుందేమోనని ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. రాత్రిళ్లు సరిగా నిద్రకూడా పోవడం లేదు. బ్రెస్ట్‌క్యాన్సర్ వస్తే తప్పనిసరిగా ఆ రొమ్మును తీసివేయాల్సిందేనా? దీనివల్ల వైవాహిక జీవితం దెబ్బతింటుందా? హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుందా? వేరే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా? మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా తెలపండి. – మనోజ్‌కుమార్, హైదరాబాద్ శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించివేసిన తర్వాత మళ్లీ క్యాన్సర్ రాదు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందువల్ల అంటే ఆపరేషన్ చేయడం వల్ల మొత్తం క్యాన్సర్ కణాలు సమూలంగా తొలగించడం అన్నిసార్లూ సాధ్యం కాదు. రొమ్ము క్యాన్సర్ సర్జరీ తర్వాత ఆ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల రేడియేషన్‌తో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కీమోథెరపీ కూడా చేయడం ద్వారా ఆ ప్రదేశంలో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. అయితే శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా కొంతమంది మహిళలకు బ్రెస్ట్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చినట్టు గుర్తించారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం మాత్రం ఇక దాదాపుగా ఉండదు. రెండు అండావయాలను తొలగించి వేసిన మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ మరణాలు 80 శాతం తగ్గిపోయినట్టు, బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం 50 శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తెలిసింది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్‌లో రొమ్మును తొలగించివేయడంపైన చాలా అపోహలు, అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. క్యాన్సర్ సోకినప్పుడు పూర్తి రొమ్మును తొలగిఒచడం చాలా అరుదుగా జరుగుతుంది. రోగ నిర్ధారణ పరీక్షలపై ఆధారపడి క్యాన్సర్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగిస్తాం. దాని వల్ల రూపం చెడకుండా, గీత కనిపించకుండా ఉండేందుకు తొలగించిన భాగంలో శరీరంలోని మరో చోటి నుంచి కొంత భాగాన్ని తెచ్చి పార్షియల్ ఫిల్లింగ్ ద్వారా భర్తీ చేస్తాం. తర్వాత సాధారణ రూపంలో పోలిస్తే రొమ్ములో పెద్దగా తేడా కనిపించదు. మొత్తంగా రొమ్మును తీసివేయడం వల్ల మహిళ మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆమె మానసిక కుంగుబాటు (డిప్రెషన్)కు గురికావచ్చు. కానీ రొమ్మును తొలగించడం శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలను ఏమీ ప్రభావితం చేయదు. ఇది సాధారణ వైవాహిక జీవితంపై ప్రభావం కూడా చూపదు. మంచి సర్జికల్ ఆంకాలజిస్టులను కలవండి. ఆ నిపుణులు సహాయపడగలరు. మేము స్టేజ్ 1, స్టేజ్2, కొన్నిసార్లు స్టేజ్3 స్థాయిలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు కూడా చికిత్స చేస్తున్నాం. మీ భార్య భయపడుతున్న పరిణామాలు ఏమీ ఎదురవ్వలేదు. అందువల్ల ఆందోళన పడవద్దని చెప్పండి. ఆమె భయపడుతున్నట్లు ఏమీ జరగదు. డాక్టర్ కె. శ్రీకాంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ తగిన జాగ్రత్తలతో... ఫిస్టులా తగ్గుతుంది ఫిస్టులా కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. గత మూడు నెలలుగా మలద్వారం చుట్టూ విపరీతమైన నొప్పి వస్తోంది. కుర్చీ మీద కూర్చోలేకపోతున్నాను. మలద్వారం వద్ద బుడిపె ఏర్పడి అందులోంచి చీము స్రవిస్తోంది. అప్పుడప్పుడూ జ్వరం కూడా వస్తోంది. దీనికి చికిత్స మార్గాలు చెప్పండి. – సందీప్‌కుమార్, నిర్మల్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే దీర్ఘకాలికంగా మీరు మలబద్దకంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు చెప్పినట్లుగా దీని లక్షణాల్లో భాగంగా మలద్వారం సమీపంలో ఒక చిన్న బుడిపె ఏర్పడుతుంద. ఆ బుడిపె మధ్య భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం నుంచి తరచు చీము, రక్తం వస్తుంటాయి. దీన్ని ఫిస్టులా అంటారు. కొన్నిసార్లు ఫిస్టులా మధ్యలో ఉండే రంధ్రం పూడుకుపోయి లోపల చీము, రక్తం నిల్వ ఉండిపోయి... నొప్పి వస్తుంటుంది. ఈ టైంలో జ్వరం కూడా రావచ్చు. చికిత్స: ఫిస్టులా అన్నది సాధారణంగా మందులతో నయం చేయలేని వ్యాధి. దీన్ని తొలగించడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. అయితే కొన్ని జాగ్రత్తలతో దీన్ని రాకుండా నివారించవచ్చు. నివారణ: n మలబద్దకం లేకుండా చూసుకోవాలి n ఆహారంలో ఆకుకూరలు, పీచుపదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి n ఇలా చేయడం ద్వారా మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. తద్వారా పరిస్థితి ఫిస్టులా వరకు వెళ్లకుండా జాగ్రత్త వహించవచ్చు n పరిశుభ్రమైన లో దుస్తులు (అండర్వేర్)లు మాత్రమే ధరించాలి n డ్రైవింగ్ ఎక్కువగా చేసేవారు లేదా ఆ వృత్తిలో ఉన్నవారు మలద్వార ప్రాంతాన్ని ఎప్పుడూ బట్టలతో కప్పివేసి ఉంచేలా కాకుండా... అక్కడ గాలి తగులుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి n గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో, ఎండలో శ్రమించేవారు చెమట రూపంలో నీటిని ఎక్కువగా కోల్పోతుంటారు. ఈ కారణంగా కూడా మలబద్దకం రావచ్చు. ఇలాంటివాళ్లు తగినంత మంచినీటిని తాగుతూ ఉండటం ద్వారా మలబద్దకం సమస్యను నివారించుకోవచ్చు. మలబద్దకమే ఫిస్టులా సమస్యకు ప్రధానమైన మూలకారణం అయినందువల్ల... ముందుగా మలబద్దకాన్ని నివారించుకుంటే ఫిస్టులాను నివారించినట్లే అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. డా‘‘ఎమ్.ఏ.సలీమ్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జరీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
స్త్రీ చైతన్యమే ఈమె పరుగు లక్ష్యం!
ఇటీవలే ఎవరెస్టు అధిరోహించిన తెలుగు అమ్మాయి నీలిమ పూదోట. ధైర్యసాహసాలకు పెట్టింది పేరైన ఈ ధీర వనిత.. విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరుగెత్తి రికార్డు సృష్టించింది. ఇంత దూరం పరుగుపెట్టడమే కష్టమనుకుంటే.. పాదరక్షలు లేకుండా ఒట్టి పాదాలతోనే పరుగు కొనసాగించి మరింత సంచలనం సృష్టించింది నీలిమ. ఇదేదో పబ్లిసిటీకి చేసిన కార్యమని ఎంత సర్దిచెప్పుకున్నా.. ఆమె మారథాన్ లక్ష్యమేంటో తెలుసుకుంటే మాత్రం మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేం..! దేశంలో.. ఆ మాటకొస్తే.. ప్రపంచంలోనే అతి వేగంగా వ్యాప్తి చెందుతోన్న జబ్బు రొమ్ము క్యాన్సర్. మహిళలను మానసికంగా శారీరకంగా కుంగదీస్తోన్న ఈ మహమ్మారిపై అవగాహన పెంచేందుకే నీలిమ ఇంత సాహసం చేసింది. రొమ్ము క్యాన్సర్ దరిచేరకుండా మహిళల జీవన శైలి మారేలా చైతన్య పరచాలి. అందుకోసమే నడుం బిగించింది ‘పింకథాన్’. మెట్రో నగరాల్లో త్రీకే, ఫైవ్ కే, టెన్ కే రన్ నిర్వహిస్తూ మహిళలను, యువతులను ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే నీలిమ ఒట్టి కాళ్లతో లాంగ్ రన్ చేయాలని నిశ్చరుుంచుకుంది. అలా విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరిగెత్తి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఏదైనా అనుకుంటే చేసేయడం నీలిమకు మొదట్నుంచీ ఉన్న అలవాటు. పింకథాన్‌లో పాల్గొనడానికి నీలిమ 5 నెలలు ప్రాక్టీస్ చేసింది. సూర్యోదయం కంటే ముందే పరుగు ప్రారంభించి సాయంత్రానికి ఆగిపోయేది. ఇదొక్కటే కాదు.. నీలిమ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అన్నీ రికార్డులే. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన నీలిమ మంచి రైటర్, డాన్సర్. హార్స్ రైడింగ్ తెలుసు. పాటలు కూడా పాడుతుంది. ఏదైనా చేయాలని అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా మారుతుంది. ఆమెకు తల్లిదండ్రులూ ఏనాడూ అడ్డుచెప్పలేదు. మొన్నటికి మొన్న బెంగళూరు నుంచి హైదరాబాద్ 570 కి.మీ. దూరం సైకిల్ మీద ప్రయాణించింది. తాజాగా పింకథాన్ లో బేర్‌ఫుట్ రన్నర్‌గా మరో అరుదైన ఫీట్ సాధించింది. నీలిమ సంకల్ప బలం ముందు ముళ్లబాటలు కూడా పూల బాటలవుతున్నారుు. ఈమె ప్రయాణం మరింత దూరం సాగాలని కోరుకుందాం..! -
2030 నాటికి మహిళా క్యాన్సర్ రోగులు రెట్టింపు
క్యాన్సర్ బాధితులు, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, మహిళా రోగులు ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో బ్రెస్ట్‌క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ల వల్ల ఏటా 8 లక్షల మంది మరణిస్తున్నారని, 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టొరాంటో, కేప్‌టైన్ యూనివర్సిటీలు, లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మమోగ్రఫీ, కీమోథెరపీ సౌకర్యాలు లేకపోవడం వల్ల పేద దేశాల్లో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల వల్ల ఎక్కువమంది మహిళలు మరణిస్తున్నారని వారు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల్లో మూడింట రెండు వంతుల మంది మృత్యువాత పడుతుంటే, ప్రతి పదిమంది సర్వైకల్ రోగుల్లో తొమ్మిది మంది మృత్యువాత పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. గర్భిణి, ప్రసవం సమస్యల కారణంగా మరణిస్తున్న మహిళలకన్నా మూడురెట్లు ఎక్కువ మంది మహిళలు ఈ రెండు క్యాన్సర్ల వల్ల మరణిస్తున్నారని వారు తెలిపారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి కేవలం 1.72 డాలర్లను వెచ్చించడం వల్ల పెద్ద సంఖ్యలో మహిళల మృతులను అరికట్టవచ్చని వారు చెబుతున్నారు. ప్రపంచంలో 2030 నాటికి బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల సంఖ్య 32 లక్షల రూపాయలకు, సర్వైకల్ క్యాన్సర్ రోగుల సంఖ్య ఏడు లక్షలకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మరో నాలుగేళ్లలో బాలికలకు 'పాపిలోమా' (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ చేయడం ద్వారా వారికి సర్వైకల్ క్యాన్సర్‌ను వారికి రాకుండా అరికట్టవచ్చని వారు తెలిపారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది బాలికలకు పాపిలోమా వ్యాక్సినేషన్ చేయించాలని వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సిఫార్సు చేశారు. -
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పింక్ వాక్
-
విజయవాడలో పింక్ రిబ్బన్ ర్యాలీ
-
విజయవాడలో పింక్‌రిబ్బన్ ర్యాలీ
విజయవాడ: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరంలో పింక్‌రిబ్బన్ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, సినీనటుడు సుమంత్, క్యాన్సర్ వైద్య నిపుణుడు రఘురాంలు ఈ ర్యాలీకి ముఖ్య అతిధులుగా హజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. -
ఉద్యమ స్ఫూర్తి!
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకు ‘పింకథాన్’ పేరుతో ప్రముఖ మోడల్, బాలివుడ్ నటుడు మిళింద్ సోమన్ దేశమంతా లాంగ్‌మార్చ్ చేశారు.. చేస్తున్నారు. ఈ మధ్యే మిళింద్ సోమన్ వాళ్ల అమ్మ ఉషా కూడా ఈ పింకథాన్‌లో పాల్గొన్నారు. 76 ఏళ్ల ఉషా.. తన కొడుకు మిళింద్ సోమన్‌తో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు ఈ పింకథాన్‌లో పరిగెత్తారు. తొట్టతొలి చైతన్యదీక్ష! రొమ్ము క్యాన్సర్ గురించి జనంలో చైతన్యం కలిగించడం కోసం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున క్యాంపెయిన్లు జరగడం చూస్తున్నాం. అయితే, అందరి కన్నా ముందు ఇలాంటి చైతన్య కార్యక్రమం జరిగింది. 1992లో. ఎవెలిన్ లాడర్ తొలిసారిగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవేర్నెస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత నుంచి ప్రపంచవ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు ఇలాంటి చైతన్య కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. రొమ్ము క్యాన్సర్‌పై పోరాటానికి నిధులు సేకరించడం కోసం రకరకాల కార్యక్రమాలు, పరుగులు జరుగుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎవేర్నెస్ మన్త్ అయిన ప్రతి అక్టోబర్‌లో ఇవి మరింత ఎక్కువ. ఈ చైతన్యానికి ప్రతీకాత్మకంగా మద్దతు తెలపడం కోసం ‘పింక్ రిబ్బన్లు’ వాడుతున్నారు. డిజిటల్ మీడియాలో... మన సందడి! వివిధ రకాల భారతీయ బ్రాండ్లు సైతం సోషల్ మీడియా ద్వారా డిజిటల్ క్యాంపెయిన్లు, ఫేస్బుక్ - ట్వీటర్లలో హ్యాగ్ ట్యాగ్లు పెట్టడం, పోటీలు నిర్వహించడం లాంటి వాటి ద్వారా పదిమందికీ రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యం కలిగిస్తున్నాయి. వాటి ద్వారా క్యాన్సర్ పరిశోధనకు నిధులు సేకరిస్తున్నాయి. అలా చేసిన క్యాంపెయిన్లలో కొన్నిటి గురించి... ‘ఫిలిప్స్ ఇండియా’ సంస్థ ‘హజ్బెండ్ ఇనీషియేటెడ్ మూవ్మెంట్’ (హిమ్) పేరిట డిజిటల్ క్యాంపెయిన్ చేసింది. పురుషులు ప్రతి నెలా కనీసం పది నిమిషాల పాటు రొమ్ముల స్వీయ పరీక్ష చేసుకొనేలా తమ భార్యలకు వీలు కల్పించాలి. భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆ కాసేపటిలో వంట చేయడం, పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం లాంటి ఏదో ఒక పని చేసి పెట్టాలి. ఆ పనులు చేస్తూ, పురుషులు సెల్ఫీలు తీసుకొని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్వీటర్లలో అప్లోడ్ చేయాలి. ‘ఎల్లే’ సంస్థ ఫేస్బుక్ పేజ్ ద్వారా ఆ మధ్య పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ చేసింది. తద్వారా మహిళలకు మద్దతుగా నిలిచింది. పింక్ దుస్తులు వేసుకొని, సెల్ఫీలు తీసుకొని, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలని ప్రోత్సహించింది. ఆ రకంగా జనంలో రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యానికి కృషి చేసింది. హిందీ సినీ నటులు సోనమ్ కపూర్, నర్గీస్ ఫక్రీ తదితరులు తమ ‘పింక్ సెల్ఫీ’లను తీసి, నలుగురితో పంచుకోవడం ద్వారా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ‘ఎస్టీ లాడర్ ఇండియా’ సంస్థ తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో క్యాంపెయిన్ చేసింది. రొమ్ము క్యాన్సర్ బాధితులు ఇతరులకు స్ఫూర్తి నిచ్చేలా తమ ఫొటో, లేదంటే సందేశాన్ని షేర్ చేసుకోవాలి. షేర్ చేసిన ప్రతి మెసేజ్‌కీ వంద రూపాయల చొప్పున పది లక్షల దాకా మొత్తాన్ని రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన, వైద్య చికిత్సల నిమిత్తం ఇచ్చేందుకు సిద్ధమైంది. జనంలో ఉత్సాహం కోసం ముంబయ్‌లోని ప్రసిద్ధ బాంద్రా - వర్లీ సముద్రపు లింక్‌ను వారం రోజుల పాటు పింక్ లైట్లతో అలంకరించారు. వినోదం పంచే వీడియోలు పోస్ట్ చేసే ‘ప్రాన్క్ బాజ్’ తన యూ ట్యూబ్ చానల్లో, ఫేస్బుక్లో రొమ్ము క్యాన్సర్ గురించి షాకింగ్‌కి గురి చేసే వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ఒక అమ్మాయి తాను వేసుకొన్న పై దుస్తుల్ని తీసి, లోపలి టీ షర్ట్‌ని చటుక్కున చూపించే ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. కొన్ని లక్షల మంది చూశారు. జనం ఈ వీడియో చూసి, దాని గురించి మాట్లాడుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై జనంలో చైతన్యం తీసుకురావాలన్నది ప్రయత్నం. -
పింక్ నెల
ప్రతి అక్టోబర్‌లో... పింక్ చైతన్యం ‘పింక్ రిబ్బన్ల’ కథేంటి? పింక్ రిబ్బన్ అనగానే రొమ్ము క్యాన్సర్ చైతన్యం గుర్తుకొస్తుంది. 1993 నుంచి రొమ్ము క్యాన్సర్ చైతన్యానికి ప్రత్యేక చిహ్నంగా ‘పింక్ రిబ్బన్’ వాడకం స్థిరపడింది. కానీ, ‘పింక్ రిబ్బన్’ వాడకం అంతకు ముందు కొన్నేళ్ళ నుంచే ఉంది. అప్పట్లో క్యాలిఫోర్నియాకు చెందిన 68 ఏళ్ళ చార్లొటే హాలే అనే మహిళ తాలూకు సోదరి, కుమార్తె, మనుమరాలు - అందరూ రొమ్ము క్యాన్సర్ బారినపడ్డవాళ్ళే! దాంతో, ఈ క్యాన్సర్‌పై పరిశోధనకు తగినన్ని నిధులు సేకరించాల్సిన అవసరాన్ని అందరి దృష్టికీ తెచ్చేందుకు ఆమె ఒక వినూత్న ప్రయత్నం చేశారు. ‘పీచ్’ రంగులోని రిబ్బన్లను అందరికీ పంచారు. ఇక, ఆ తరువాత 1991లో ఒక సంస్థ రొమ్ము క్యాన్సర్ బారిన పడి బయటపడ్డవాళ్ళతో న్యూయార్క్ నగరంలో పరుగు నిర్వహించింది. అందులో పాల్గొన్నవాళ్ళందరికీ పింక్ రిబ్బన్లు పంచింది. అలా మొదలైన ‘పింక్ రిబ్బన్ల’ అలవాటు 1993 నుంచి పూర్తిగా స్థిరపడి, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్‌కు పర్యాయపదంగా మారింది. మహిళల్లో అధిక మరణాలు ఈ క్యాన్సర్ వల్లే! ఇవాళ భారతదేశంలో మహిళల్లో ఎక్కువమంది ప్రాణాలు తీస్తున్న క్యాన్సర్ - రొమ్ము క్యాన్సర్. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం ఈ సంగతి పేర్కొంది. 1990 నుంచి 2013 వరకు లెక్కలు చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఏకంగా 166 శాతం పెరిగాయి. ప్రపంచం నలుమూలల నెలకొన్న ధోరణులకు తగ్గట్లే, ఇండియాలో ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, మగవాళ్ళలో ప్రొస్టేట్ క్యాన్సర్ అనూహ్యంగా పెరిగింది. సగం మందికి 50 ఏళ్ళ లోపే! కొన్ని దశాబ్దాల క్రితం దాకా కేవలం 50 ఏళ్ళ పైబడినవాళ్ళకే రొమ్ము క్యాన్సర్ వచ్చేది. చిన్న వయసు స్త్రీలలో అది చాలా తక్కువ. రొమ్ము క్యాన్సర్ పీడితుల్లో 50 ఏళ్ళ పైబడినవాళ్ళు దాదాపు 65 నుంచి 70 శాతం ఉండేవారు. ఇక, 50 ఏళ్ళ లోపు వాళ్ళు 30 నుంచి 35 శాతమే ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న వయసు వారిలో ఈ క్యాన్సర్ మరింత కామన్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలోని రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళల్లో దాదాపు సగం మంది ముప్ఫై నుంచి యాభై ఏళ్ళ లోపు వయస్సువాళ్ళే! దురదృష్టం ఏమిటంటే, నూట్జికి 70 కేసుల్లో క్యాన్సర్ బాగా ముదిరేవరకు రోగాన్ని గుర్తించకపోవడం! అలా కాకుండా, ముందుగానే పరీక్ష చేయించుకొని, రోగాన్ని గుర్తిస్తే ప్రాణాలు నిలుపుకొనే అవకాశం ఎక్కువ. ప్రతి 28 మందిలో ఒకరికి! మన దేశంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఎక్కువ మంది ప్రాణాలు తీసిన క్యాన్సర్ - గర్భాశయ (సర్వికల్) క్యాన్సర్. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రోజు రోజుకీ రొమ్ము క్యాన్సర్ పీడితులు క్రమంగా పెరుగుతూ వస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ కన్నా రొమ్ము క్యాన్సర్ పెను వ్యాధిగా మారింది. ఇవాళ మన దేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి జీవితంలో ఏదో ఒక సమయంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఇండియాలో ఇదే ఎక్కువ! ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల తరువాత రెండో అతి పెద్ద ప్రాణాంతక వ్యాధి - క్యాన్సర్. అందులోనూ ఇండియాలో అయితే, అత్యంత తరచుగా వచ్చే క్యాన్సర్ - రొమ్ము క్యాన్సర్. ఆ తరువాతి స్థానం నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లది. రొమ్ము క్యాన్సర్‌ను వీలైనంత తొందరగా తొలి దశలోనే గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే, ముదిరిన కొద్దీ క్యాన్సర్‌కు చికిత్స సంక్లిష్టంగా మారుతుంది. మగాళ్ళకూ ఓ వారం! చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ, మగవాళ్ళకీ రొమ్ము క్యాన్సర్ వస్తుంటుంది. కానీ, చాలా అరుదు. అందుకే కావచ్చు... సాధారణంగా దీని గురించి ఎవరూ పెద్దగా దృష్టి పెట్టరు, ప్రచారం చేయరు. అయితే, 2009లో పురుషుల రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యం కోసం కొన్ని సంస్థలు కలసి ముందుకు వచ్చాయి. అప్పటి నుంచి ప్రపంచమంతటా ప్రతి ఏటా అక్టోబర్ నెలలోనే మూడో వారాన్ని ‘పురుషుల రొమ్ము క్యాన్సర్ చైతన్యోద్యోమ వారం’గా జరిపేలా చైతన్యం తీసుకువస్తున్నారు. త్వరగా.... కనిపెడితే కాపాడవచ్చు! ఒక్క గడచిన 2015 సంవత్సరంలోనే... కొత్తగా దాదాపు లక్షన్నర పైగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు. దేశంలో సుమారు 76 వేల మంది స్త్రీల మరణం. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించాల్సిన అవసరంపై దృష్టి పెట్టకపోతే, ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టడానికి - స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవడం, అలాగే మ్యామోగ్రఫీ ఉత్తమ సాధనాలని డాక్టర్లు నొక్కిచెబుతున్నారు. దురదృష్టవశాత్తూ మన దేశంలో అధిక శాతం కేసుల్లో క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. సాక్షాత్తూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యు.హెచ్.ఒ) ఆ సంగతి వెల్లడించింది. మహిళల్లో నూటికి 60కి పైగా కేసుల్లో - మూడో దశలోనో, నాలుగో దశలోనో ఉన్నప్పుడు కానీ, క్యాన్సర్‌ను కనిపెట్టడం లేదని డబ్ల్యు.హెచ్.ఒ. పేర్కొంది. దీని వల్ల చికిత్సకు అవకాశాలు, రోగిని కాపాడే ఛాన్స్‌లు తగ్గుతున్నాయి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇలా! బిఎస్ఇ అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇరవై ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ నెలకోసారి బిఎస్ఈ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా పసిగట్టి, వ్యాధి ముదరకముందే చికిత్స చేయించుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. అద్దం ముందు నిలబడి చేతులను తల వెనుకకు పెట్టి బ్రెస్ట్ ఆకారాన్ని రొమ్ముల ఆకారాన్ని గమనించాలి చేతులను నడుము మీద పెట్టి భుజాలను లోపలికి కుదించి మోచేతులను దేహం ముందు వైపుకు తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు బ్రెస్ట్ కదులుతాయి, ఆ కదలికలను బట్టి కండరాల్లో మార్పులు ఉన్నాయేమో గమనించాలి రొమ్ముల పై భాగం, చుట్టూ, చంకల కింద కూడా నొక్కి చూడాలి ఇప్పుడు నిపిల్స్ మెల్లగా నొక్కి పాలలాగ లేదా నీటిలాగ ద్రవం విడుదలవుతుందేమో చూడాలి తర్వాత వెల్లకిలా పడుకుని చేతివేళ్లతో బ్రెస్ట్‌ను తాకుతూ పరీక్షించుకోవాలి. పడుకున్నప్పుడు తలకింద దిండు ఉండరాదు, భుజాల కింద మడతపెట్టిన టవల్‌ను ఉంచుకోవాలి. ఈ స్థితిలో రొమ్ముల కండరాలు పక్కటెముకల మీద విస్తరించినట్లు పరుచుకుంటాయి. దాంతో చిన్న గడ్డలాంటిది ఉన్నా వెంటనే తెలిసిపోతుంది. ఈ పరీక్షను... రుతుక్రమం పూర్తయిన తొలిరోజు చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీరియడ్స్ మొదలయ్యే సమయంలో సాధారణంగానే రొమ్ములలో చిన్నపాటి గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుక్రమం మొదలైన మూడు- నాలుగు రోజుల్లో కరిగిపోతాయి. ఆ తర్వాత కూడా ఏదైనా లంప్ తగిలితే అది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సూచిక అయి ఉండవచ్చనే సందేహంతో డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవాలి. అలాగే... నిపిల్స్ నుంచి పాలలాగ ద్రవం విడుదలవుతున్నా, రొమ్ములలో వాపును గమనించినా, చర్మం మీద దురద పెడుతున్నా, బుడిపెలాంటిది ఏర్పడినా, నిపిల్స్‌లో నొప్పి, ఎరుపుదనం, లోపలికి ముడుచుకుపోవడం వంటి లక్షణాలను గమనించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఓడించవచ్చు! యూ ట్యూబ్ చిత్రం బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకుని నయం చేసుకుంటున్నవారు కొందరైతే, ఆలస్యంగా తెలుసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు మరికొందరు. బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కోసం అనేక లఘుచిత్రాలు గతంలో వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రారంభదశలోనే గుర్తించడం ప్రధానమని చెప్పే ‘వి కెన్ డిఫీట్ బ్రెస్ట్ క్యాన్సర్’ అనే చిత్రం 2012లో వచ్చింది. ‘ఫోరమ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొటెక్షన్’ దీనిని నిర్మించింది. ఈ లఘుచిత్రంలో ముందుగా... క్యాన్సర్ బారి నుంచి బయటపడినవారితో మాట్లాడించారు. ఎవరికి వారు పరీక్షించుకోవడం ఒక విధానం. మామోగ్రఫీ ద్వారా తెలుసుకోవడం మరో విధానం. ఇది ఏమాత్రం నొప్పి కలిగించే పరీక్ష కాదు అని ఈ చిత్రం ద్వారా అవగాహన కల్పించారు. భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోందని, ఏటా వేలాది మంది మహిళలు ఈ క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని ఈ చిత్రంలో చూపారు. 65 శాతం మంది మహిళలు ప్రారంభదశలో గుర్తించుకోలేక, మూడవ దశలోనో, నాల్గవ దశలోనో తెలుసుకుంటున్నారని, అందువల్ల వారు ప్రాణాలు కోల్పోతున్నారని కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ వినీత్ కపూర్ చేత ఈ చిత్రంలో చెప్పించారు. బాగా చదువుకున్నవారు సైతం ఈ విషయాలను తెలుసుకోలేక పోతున్నారని, తరచు డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవడం మంచిదని ఈ షార్ట్ ఫిల్మ్ చెబుతోంది. ‘వి కెన్ డిఫీట్ బ్రెస్ట్ క్యాన్సర్’ అనే 16 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రానికి రచన, నిర్మాణం, దర్శకత్వం సుస్మితా సేన్ గుప్తా. బ్రెస్ట్‌క్యాన్సర్ బాధితులకి యోగా రొమ్ము క్యాన్సర్‌కి ముఖ్యమైన కారణం లింఫ్యాటిక్ సర్క్యులేటరీ సిస్టమ్ సరిగా పనిచేయక పోవడం. ఆక్సిజన్ సరఫరా సరిగా లేక...లింపు గ్రంధుల్లో వాపు రావడం. కనుక లింఫ్యాటిక్ సిస్టమ్ బాగా పనిచేయడానికి ఉపయోగపడే ఆసనాలు, ప్రాణాయామాలు, జీవన విధానం అనుసరించాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పబ్లిక్ యాక్సిస్-ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయ పరిశోధనలో రిస్టోరేటివ్ యోగా ద్వారా 80 శాతం రోగులు ఒత్తిడి, చికాకులకు గురికాకుండా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడైంది. రొమ్ము క్యాన్సర్ బాధితులు మాత్రమే కాకుండా నివారణ కోసం ముందు జాగ్రత్తగా సేతు బంధాసనం, సర్వాంగాసనం, ధనురాసనం, సర్పాసనం, చక్రాసనం, బ్రహ్మ ముద్రలు, అంగచాలన, కర్ణ భుజ స్పర్శ వంటివి సాధన చేయడం చాలా మంచిది. బ్రహ్మముద్రలు అంటే: సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ తలను కొంచెం పైకి ఎత్తడం, శ్వాస వదులుతూ మళ్లీ యథాస్థితికి రావడం, శ్వాస వదులుతూ గడ్డం ఛాతీ మీదకు శ్వాస తీసుకుంటూ మళ్లీ యథాస్థితికి రావడం, తర్వాత శ్వాస తీసుకుంటూ గడ్డం కుడి భుజం మీదకు... తిరిగి శ్వాస వదులుతూ మధ్యలోకి తీసుకురావాలి. ఇదే తరహాలో 5సార్లు రిపీట్ చేయాలి. ప్రాణాయామాలు: భస్త్రిక, శక్తి చాలన భస్త్రిక, కపాల భాతి, మాత్రిక కపాల భాతి, మార్జాల కపాల భాతి, లింప్ గ్రంధులు బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మనసుకు ప్రశాంతతను చేకూర్చే చంద్రబేధి, అనులోమ విలోమ, భ్రమరీ ప్రాణాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యం. యోగ కాయ చికిత్స, కాయ సంవాదనను అనుసరించి రొమ్ములకు రెగ్యులర్‌గా క్లాక్ వైజ్, యాంటి క్లాక్‌వైజ్ మసాజ్ చేయడం, స్క్వీజింగ్, ఉద్ధ్వర్తనం లాంటి ప్రక్రియలను అనుసరించడం వల్ల కూడా రొమ్ములో కణితులు ఏర్పడకుండా నిరోధించవచ్చు. నాణ్యత కలిగిన స్పోర్ట్స్ బ్రాను అధికంగా ఉపయోగించడం మంచిది. రోజులో ఎక్కువ సమయం బ్రా ధరించి ఉండడం మంచిది కాదు. ఎక్కువ సేపు బ్రా ధరించి ఉంటే క్యాన్సర్ కారకమైన ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది. కొన్ని సూచనలు... ఆహార విషయంలో అయోడిన్ లోపం లేకుండా చూసుకోవాలి. సుగర్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అడల్ట్రేటెడ్ మిల్క్ ప్రొడక్ట్స్, కార్బొరేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. కెఫిన్ పూర్తిగా నిషేధం. నడివయసు స్త్రీలు ఏడాదికి ఒకసారైన మామోగ్రఫీ లేదా 3డి ఇమేజింగ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ వీరు రొమ్ము క్యాన్సర్‌ను జయించారు రొమ్ము క్యాన్సర్ వచ్చిందని తెలియగానే జీవితం అంతం అయిపోయిందనీ ఇక మృత్యువుకు దగ్గర పడ్డట్టేనని ఎట్టి పరిస్థితిలోనూ అనుకోరాదు. ప్రపంచంలో ఎందరో మహిళలు ఈ క్యాన్సర్ నుంచి సులువుగా బయటపడ్డారు. పడుతూనే ఉన్నారు. వీరి విజయం స్ఫూర్తిదాయకం. కొందరు బ్రెస్ట్ క్యాన్సర్ విజేతలు. మార్టినా నవ్రతిలోవా ఈ టెన్నిస్ సూపర్‌స్టార్‌కు 2010లో రొమ్ము క్యాన్సర్ తొలి దశలో ఉందని గుర్తించారు. ఆరువారాల పాటు ఆమె రేడియేషన్ థెరపీని తీసుకుంది. ఆ తర్వాత పరీక్షిస్తే ఆమెకు క్యాన్సర్ పూర్తిగా నయమైందని తేలింది. ఇప్పుడు ఆమె క్యాన్సర్ విజేత. ముంతాజ్ అలనాటి హిందీ సినీనటి ముంతాజ్‌కు తన 54వ ఏట రొమ్ము క్యాన్సర్ అని తేలింది. కాని ఆమె భయపడలేదు. వైద్యం చేయించుకుంది. ఇప్పటికి 11 ఏళ్లు గడిచాయి. ఆమె ఆ మహమ్మరి మీద విజయాన్ని సాధించి దరహాసం చిందిస్తూ ఉంది. బార్బరా మోరి హృతిక్ రోషన్ సరసన హిందీ చిత్రం ‘కైట్స్’లో నటించిన మెక్సికన్ నటి బార్బారా మోరీకి 2009లో రొమ్ము కేన్సర్ నిర్థారించారు. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శస్త్ర చికిత్స ద్వారా క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించుకుంది. కీమో థెరపీ అవసరం కూడా ఆమెకు లేకపోయింది. ఇప్పుడు ఆమె క్యాన్సర్ రహిత మహిళగా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. క్రిస్టీనా ఏపిల్గేట్ ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్రిస్టీనఆ ఏపిల్గేట్కు 2008లో రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఆమె తల్లికి కూడా ఈ సమస్య ఉండగా ఆమె దానిపై విజయం సాధించింది. అయితే పదేపదే ఈ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు క్రిస్టీనా తన రెండు వక్షోజాలను తొలగించుకుని బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ద్వారా కృత్రిమ వక్షోజాలను అమర్చుకుంది. ఇప్పుడామె ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ క్యాన్సర్ పరీక్షలకు నోచుకోలేని పేద మహిళల కోసం పరీక్షలు నిర్వహించే ఫౌండేషన్‌ను నిర్వహిస్తోంది. -
గుండెకోత వద్దు
సాక్షి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ పింక్ అక్టోబర్ థింక్ టుడే భారతీయ మహిళలకు వచ్చే క్యాన్సర్లలో మిగతా అన్నిటికంటే ఎక్కువగా కనిపించే వాటిల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇటీవల చాలా ఎక్కువ మంది మహిళలు దీనికి గురవుతున్నారు. ఒకప్పుడు దాదాపు 50 ఏళ్లు పైబడితేనే రొమ్ము క్యాన్సర్ వస్తుందనుకునే వారు. అయితే ఇటీవల చిన్న వయసు మహిళల్లోనూ ఇది కనిపిస్తుండటం ఒక విషాదం. ఇక భారతీయ మహిళల్లో మరో అంశమూ కాస్త ఆందోళన కలిగించేదే. పాశ్చాత్య దేశవాసులతో పోలిస్తే మన దేశపు మహిళల్లో ఇది ఒక దశాబ్దం ముందుగానే కనిపిస్తోంది. అంటే పాశ్చాత్య మహిళల్లో ఏ 40 దాటిన వారిలోనో కనిపించే రొమ్ముక్యాన్సర్... మన దేశ మహిళల్లో ఇటీవల 30లలోనే కనిపిస్తోంది. కానీ కారుచీకట్లలో కాంతిరేఖలా ఒక ఆశాజనకమైన విషయం కూడా ఉంది. దీన్ని గురించి ముందే తెలుసుకుంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే దాదాపు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మరెన్నో ఏళ్లు ఆర్థిక భారాలు లేకుండా మానసికంగా కలిగే బాధలకు దూరంగా, ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. అందుకు ఉపయోగపడేవే ఈ కథనాలు. మమకారం రంగేంటి? మేమైతే ‘పింక్’ అనే అంటాం. అమ్మ, చెల్లి, భార్య, కూతురు... అందరూ పంచేది మమకారమే. మరి వాళ్లను జాగ్రత్తగా చూసుకోని నాన్న, అన్న, భర్త, కొడుకు ఉంటే... ఏమవచ్చు? గుండెకోతే!! బ్రెస్ట్ క్యాన్సర్‌ను వెంటనే కనుగొంటే ఎదకోత వరకూ పోదు. మగవాళ్లకో విన్నపం. మీవాళ్ల గురించి కేర్ తీసుకోండి. ఇప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్‌కి తీసుకెళ్లండి. మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్) దోహదం చేస్తోంది. ఈ అంశంతో పాటు మరెన్నో అంశాలు దీనికి కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని... సాధారణంగా పెరిగే వయసు (పైబడుతున్న వయసు-ఏజింగ్) రొమ్ము క్యాన్సర్‌కు ఒక ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). అయితే ఇది అందరిలోనూ ఉండే నివారించలేని రిస్క్ ఫ్యాక్టర్. ఆధునిక జీవనశైలిలో వచ్చే మార్పులతో కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. పైన పేర్కొన్న అంశం వల్ల స్థూలకాయం వచ్చేందుకూ దోహదం చేస్తుంది. దాని వల్ల ఇతర అనర్థాలతో పాటు రొమ్ము క్యాన్సర్‌కూ అవకాశాలు ఎక్కువ. తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైనా బిడ్డకు రొమ్ము పాలు పట్టించాలి. అది జరగకపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ రావచ్చు. ఇక మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు ఒక కారణం కావచ్చు. పాశ్చాత్య దేశ వాసులతో పోలిస్తే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ త్వరగా గుర్తించినప్పుడు... మన దేశ మహిళల్లో ఉండే జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం. కొంతవరకు జన్యుపరమైన అంశాలు. లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఉదాహరణకు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి, స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కోసారి అవి నొప్పిగా లేనప్పుడు మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి హానికరం కాని గడ్డలా, లేక హానికరమైనవా అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు బాగా ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్ రావడం. రొమ్ములో సొట్టలు పడినట్లుగా ఉండటం రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినట్లుగా అనిపించడం, వాటిలో ఏదైనా తేడాను గమనించడం. (అయితే నెలసరి సమయంలో మహిళల్లో రొమ్ములు గట్టిబడి... ఆ తర్వాత మళ్లీ నార్మల్ అవుతాయి. అందుకోసం ప్రతినెలా వచ్చే మార్పుల గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. కానీ అలాగే గట్టిబడి ఉండటం కొనసాగితే మాత్రం ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. నిపుల్కు సంబంధించినవి : రొమ్ముపై దద్దుర్ల వంటివి (ర్యాష్) లేదా వ్రణాలు రావడం రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటి స్రావాలు రావడం. బాహుమూలాల్లో: చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం. భుజానికి సంబంధించి: భుజం వాపు కనిపించడం. స్క్రీనింగ్ సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎస్) బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు రిస్క్ ఫ్యాక్టర్లు లేని మహిళలైతే 50 - 70 ఏళ్ల మధ్యలో ప్రతి మూడేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న మహిళలైతే మరింత తరచుగా ఈ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు (అంటే అమ్మ, చెల్లెళ్లు, కూతుళ్లు) ఉంటే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. ఇక మహిళల్లోని జన్యువులైన బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5% మందిలో ఈ రెండు జన్యువుల్లో మ్యుటేషన్స్ (ఉత్పరివర్తన మార్పులు) చోటు చేసుకున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. నిర్ధారణ తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం (ఫిజికల్ ఎగ్జామినేషన్) ద్వారా. మామోగ్రఫీ అనే స్కాన్ ద్వారా. (ఇందులో డిజిట్ లేదా ఎమ్మారై లేదా అల్ట్రాసౌండ్ స్కాన్)ను నిర్వహిస్తారు. జెనెటిక్ స్క్రీనింగ్ కూడా చేస్తారు. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ (ఎఫ్ఎన్ఏసీ) అనే పరీక్ష ఒకవేళ అవసరం ఉందని తెలిస్తే వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ) లేదా ఎఫ్ఎన్ఏసీ అనే చిన్న నీడిల్ పరీక్ష చేస్తారు. మామోగ్రఫీతో పాటు ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ (కొన్ని సందర్భాల్లో ఇది తప్పనిసరి) ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ (ఈ చివరి పరీక్ష వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడం కోసం చేస్తారు). ఇటీవల రొమ్ములో ఏవైనా తేడాలు రాగానే మామోగ్రఫీ చేయించుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఒక స్క్రీనింగ్‌లో తప్పినా... మరో స్క్రీనింగ్లోనైనా ఈ వ్యాధిని కనుగొనడం ముమ్మరమైంది. ఫలితంగా ఎక్కువమందిని వ్యాధి బారినుంచి వైద్యులు కాపాడగలుగుతున్నారు. పైగా విదేశాల్లో ఆయుప్రమాణాలు ఎక్కువ కావడంతో అక్కడ 50 - 70 ఏళ్ల వయసులో జరిగే పరీక్షలు మన దేశంలో 30 -60లలోనే జరుగుతున్నాయి. దాంతో రొమ్ము క్యాన్సర్‌ను మరింత ముందుగా కనుగొనడానికి అవకాశం ఏర్పడుతోంది. చికిత్స ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. రొమ్ము క్యాన్సర్ చుట్టుపక్కలకు కూడా పాకిందని తెలిసినప్పుడు మాత్రమే రొమ్మును తొలగిస్తారు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా మిగతా చోట్ల ఉండే కండరాలతో ఆ ఇతర చికిత్సలు : ఈ రోజుల్లో శస్త్రచికిత్సతో పాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మాసెక్టమీలో రొమ్ము తొలగిస్తారు. అయితే రొమ్ముక్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియో థెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. నివారణ ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం ఒక మహిళ వ్యక్తిగత అలవాట్లు/జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో కొన్నింటిని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు. మరికొన్ని మార్చలేనివీ ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకొని ఒక మహిళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. ఇందులో... మార్చలేని అంశాలు: వయసు, మహిళ కావడం (జెండర్), రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో రక్తసంబంధం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. మార్చుకోగల అంశాలు: ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, ఆల్కహాల్ అలవాట్లు, పోషకాహారం. వ్యాయామం: మహిళలంతా మరీ తీవ్రమైనవీ, మరీ తక్కువవీ కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా వ్యాయామం చేయాలి. డా. ఏవీఎస్ సురేశ్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కాంటినెంటల్ హాస్పిటల్స్ గచ్చిబౌలి, హైదరాబాద్ ట్రీట్మెంటే... ధైర్యం ఇచ్చింది ఒకరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటే రొమ్ములో ఏదో తేడా అనిపించింది. మా నాన్నగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్. అమ్మ పాథాలజిస్ట్. అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి నాకు అవగాహన ఉంది. నా స్వీయపరీక్ష మీద ఉన్న నమ్మకంతో నేను డాక్టర్ని కలిశాను. నేను అనుకున్నది నిజమే. బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారించారు. అప్పుడు నా వయసు 35. క్యాన్సర్‌లాంటి పెద్ద వ్యాధిని ఎదుర్కొనే వయసు కాదది. కానీ ధైర్యంగా పోరాడాలనుకున్నా. రొమ్ము తీసినా పర్వాలేదనుకున్నా. ట్రీట్మెంట్లో భాగంగా జుత్తు ఊడిపోతుందని బాధపడలేదు. ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టడానికి ఇలాంటివన్నీ చిన్న చిన్న త్యాగాలు అనిపించింది. ఇలాంటి అనారోగ్యానికి గురైనప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా బలంగా ఉండాలని తెలుసు. అయినా భయపడ్డాను. కాని ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాక ధైర్యం పెరిగింది. అనవసరంగా భయపడ్డానని అప్పుడు అనిపించింది. నా అనుభవంతో చెబుతున్నా... రొమ్ము క్యాన్సర్‌ని సులువుగా జయించవచ్చు. నా కుటుంబ సభ్యులు, నాకు అత్యంత సన్నిహితుడు అయిన కమల్‌హాసన్ ఇచ్చిన ధైర్యం నేను కోలుకోవడానికి ఓ కారణం అయింది. నేను కొన్ని సినిమాల్లో చాలా శక్తిమంతమైన పాత్రలు చేశాను. క్యాన్సర్ జయించడానికి అవి కూడా ఓ కారణం అయ్యాయి. నాకు క్యాన్సర్ సోకిందని తెలిసిన మొదటి సంవత్సరంలో నేను 56 సినిమాలు చూశాను. అన్నీ థియేటర్లకు వెళ్లి చూసినవే. ఏదో జరగకూడనిది జరిగిందని కుంగిపోయి మంచానికే పరిమితం కాకూడదు. ఓపిక ఉన్నంతవరకూ పనులు చేసుకోవచ్చు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా తేలిక అవుతుంది. అందుకే ముప్పై ఏళ్లు వచ్చాయంటే ‘మామోగ్రఫీ’ చేయించుకోవాలి. మహిళలకు ఇంట్లో ఉన్నవాళ్లమీద ఉండే శ్రద్ధ తమ మీద ఉండదు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. - గౌతమి, సినీ నటి -
కేన్సర్‌ను జయిద్దాం..
బంజారాహిల్స్: ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్, కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ సీజేస్, భారతీయ రొమ్ము కేన్సర్ వైద్య నిపుణుల సంఘం సంయుక్తాధ్వర్యంలో రొమ్ము కేన్సర్‌పై ఆదివారం అవగాహన వాక్ నిర్వహించారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ వాక్‌ను సినీ నటి రెజీనా, కేన్సర్‌ను జయించిన మధుమిత చక్రవర్తి జెండా ఊపి ప్రారంభించారు. కేన్సర్‌ను జయించిన సుమారు మూడువేల మంది, వారి కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు. కేన్సర్‌ను జయించిన వారిని గౌరవించడం, వీరి స్ఫూర్తిగా కేన్సర్ బాధితుల్లో పోరాడేతత్వాన్ని రగిలించడం... ఈ వాక్ ముఖ్య ఉద్దేశమని ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ సీఈఓ పి.రఘురాం తెలిపారు. వాక్‌లో కిమ్స్ చైర్మన్ బి.కృష్ణయ్య, డాక్టర్ బి.భాస్కర్‌రావు, ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్, సింక్రోని ఫైనాన్షియల్ బిజినెస్ లీడర్ ఫైసలుద్దీన్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్, ఆస్కి చైర్మన్ పద్మనాభయ్య, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి చైర్మన్ రమేష్ ప్రసాద్ పాల్గొన్నారు. -
యురేకా - కాకీక...!
హ్యూమర్ నేను జుట్టుకు రంగేసుకుంటూ ఉండగా కొత్త ఐడియా చెబుతానంటూ ఠక్కున ఎంట్రీ ఇచ్చాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వన్నీ చాలా విచిత్రంగా మాట్లాడుతుంటావ్రా. ఒరేయ్... మొన్నట్లా మాట్లాడకు’’ అన్నాను కాస్త కోపంగా. ‘‘మొన్న అన్న మాటలు కూడా కరక్టే కదా’’ అన్నాడు వాడు. రాంబాబుగాడు ఆరోజు చెప్పినవి ఒకసారి తలచుకున్నా. ఇంతకూ వాడన్న మాట ఏమిటో చెబుతా వినండి. ‘ఆవు... పులి’ కథ తెలుసు కదా. అందులో పులికి తాను ఆహారంగా దొరికిపోయాక ఒకసారి తన బిడ్డను కలిసి వస్తానంటుంది కదా. చివరిసారిగా దూడకు పాలు పట్టించి బుద్ధులు చెబుతుంది కదా. అలా మాటమీద నిలబడ్డ కారణం వల్ల ఆవుకు ఆ ప్రఖ్యాతి రాలేదట. ఆవుకు ప్రశస్తి కలిగిన కారణం వేరట. ‘‘ఏంట్రా ఆ కారణం?’’ ఆసక్తిని చంపుకోలేక అడిగా. నిజానికి ఆ కథ రాసిన వ్యక్తి ఒక డాక్టర్ అట. అందునా క్యాన్సర్ స్పెషలిస్టు అట. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసమే ఈ కథ రాశాట్ట. ఆవు వెళ్లి తన బిడ్డకు పాలు పట్టించి వచ్చింది. కాబట్టి పులి-గిలీ లాంటివి ఏమీ చేయలేకపోయాయని చెప్పాడు. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పులి రూపంలో ప్రత్యక్షమైందని కూడా వాడు వాక్రుచ్చాడు. ఆవు కాస్తా బిడ్డకు రొమ్ముపాలు పట్టించడంతో క్యాన్సర్ అనే ఆ పులి కాస్తా పిల్లిగా మారిపోయిందనీ, అది కాలుగాలినట్టుగా ఆవుచుట్టూ కాసేపు పచార్లు చేయడం తప్ప మరేమీ చేయలేకపోయిందని వాడి రహస్య పరిశోధనల్లో తేలిందట. వాడి ఆ పరిశోధన గాథను నాకు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఆ కథ రాసిన వాడు అలనాటి ఆంకాలజిస్టు అనే గుట్టు కూడా విప్పాడు. కాకపోతే పరిశోధన ఫలితంలా చెబితే అందరూ అంతగా పట్టించుకోరట. అందుకే ‘డావిన్సీ కోడ్’లా ఆ రహస్య సమాచారాన్నంతా బయటకు ఒక నీతి కథలా కనిపించేలా రాశాట్ట. అదీ వాడు చెప్పిన మాట. ‘‘మొన్నటి నా పరిశోధనల్లో కొత్త సంగతి మనం కనిపెట్టడం తప్ప మనకు డెరైక్టుగా ఉపయోగ పడేది ఏమీ లేదు. కాకపోతే ఈ దెబ్బతో మనం కోటీశ్వరులం అయిపోవచ్చు’’ అన్నాడు. కోటీశ్వరులం కావచ్చనే మాటతో నేను కాస్త టెంప్ట్ అయ్యాను. ‘‘ఏంట్రా?...’’ అడిగాను నేను రంగేసుకోవడం ఆపకుండానే. ‘‘ఇలా వారానికి ఒకసారి కష్టపడి రంగేసుకునే బదులు... కాకి ఈకలకు ఆ రంగు ఎలా వస్తుందో తెలుసుకొమ్మని మనం రహస్యంగా సైంటిస్టులకు చెప్పాల్రా. సేమ్ టు సేమ్ రంగు వెంట్రుకలకూ వచ్చేలా చూస్తే చాలు. ఇలా మాటిమాటికీ రంగేసుకోనక్కర్లేదు. ఒకసారి ఆ పదార్థం జుట్టులోకి వెళ్లేలా చేస్తే చాలు... కాకి రంగు ఎప్పటికీ మారనట్టే... జుట్టుకూ రంగు మారదు. మొన్న మన వేప చెట్టు మీద కాకి వాలగానే నా బుర్రలోకి ఈ ఐడియా వాలిందిరా. వెంటనే యురేకా-కాకీక అనుకున్నా’’ అన్నాడు వాడు. ‘‘పక్షి ఈకలు వేరు... మనుషుల జుట్టు వేరు’’ అన్నాను నేను. ‘‘ఏం కాదు... మనుషుల్లో జుట్టు, గోళ్లూ... పక్షుల్లో ఈకలూ ఒకే పదార్థంతో తయారవుతాయట. దాని పేరు కెరటిన్ అట’’ అన్నాడు వాడు. ‘‘అయితే...?’’ ‘‘ఏముందిరా... అన్నీ ఒకే రకం పదార్థంతో తయారవుతున్నప్పుడు కొంగకు మాత్రం తెల్లరంగు ఉండి కాకి ఈకల్లోకి ఆ నల్లరంగు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అదే రంగు నీ జుట్టుకూ వచ్చేలా చేసేయాలి. కాకి ఈక ఫార్ములా తెలుసుకొని ఆ పేటెంట్‌ను మన పేరు మీద రాయించుకుంటే చాలురా... ఇక మనకు డబ్బులే డబ్బులు’’ అన్నాడు వాడు. వాడిచ్చిన ఐడియాను కాస్త సీక్రెట్‌గా ఉంచాలనుకున్నాను. మనకు నమ్మకమైన సైంటిస్టుకు ఎవరికైనా చెప్పి కాస్త పరిశోధన చేయించాలనీ... సక్సెస్ అయ్యాక ఫార్ములా అమ్ముకుని ఆ సైంటిస్టూ, మేమిద్దరమూ వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా కాస్త డబ్బు చేసుకుందామనుకున్నాం. భార్య దగ్గర రహస్యాలేవీ దాచకూడదన్న ప్రిన్సిపుల్ కొద్దీ నేను ఈ ఆలోచన చెప్పగానే సదరు ఐడియా మీద చన్నీళ్లు చల్లేసిందామె. ‘‘బట్టతలల వాళ్లెవ్వరూ మీ ఐడియాను కొనరు. కాకి మీద ఇంత పరిశోధన చేసే బదులు... రాబందు బట్టతల మీద జుట్టు మొలిచే మార్గం కనిపెడితే బెటరు కదా. దాంతో మరింత డబ్బే డబ్బు కదా’’ అంది మా ఆవిడ. - యాసీన్ -
క్యాన్సర్ తో పోరాడలేక..
♦ తనువు చాలించిన భువనేశ్వరి ♦ రోదిస్తున్న హోంగార్డు కుటుంబం ప్రొద్దుటూరు క్రైం: ‘నన్ను బతికించుకోండి నాన్నా.. నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలవుతారు.. అంటూ ఆమె ప్రతి రోజూ తల్లిదండ్రులను వేడుకునేది. ఏడు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాటం చేసింది. ఇక నా వల్ల కాదంటూ తనువు చాలించింది’. ప్రొద్దుటూరులో హోంగార్డు గా పనిచేస్తున్న కరుణాకర్ కుమార్తె భువనేశ్వరి (32) బుధవారం మృతి చెందింది. కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం మృతి చెందింది. ఏడు నెలలు క్యాన్సర్‌తో పోరాడి.. భువనేశ్వరికి 13 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన గోపాల్‌తో వివాహమైంది. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త మద్యానికి బానిసై భార్యా పిల్లలను పట్టించుకోకపోవడంతో రెండేళ్ల నుంచి ఆమె ప్రొద్దుటూరులోని తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం రొమ్ము క్యాన్సర్ సోకింది. రొమ్ముపై గడ్డ ఉండటంతో అది వేడిగుల్ల అనుకొని నిర్లక్ష్యం చేసింది. చివరకు మూడు నెలల క్రితం డాక్టర్‌కు చూపించగా క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. అప్పటికే క్యాన్సర్ బాగా ముదిరిపోయింది. చేతిలో డబ్బు లేకపోవడం, అవగాహనా రాహిత్యంతో ఆమెకు సకాలంలో వైద్యం అందలేదు. ఇటీవల చెన్నై, హైదరాబాద్‌కు తీసుకెళ్లినా ఫలితం లేదు. వైద్య సేవ కార్డు లేదని వారిని హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రి అధికారులు వెనక్కి పంపించారు. ఈ క్రమంలోనే ఆమె దీనస్థితి గురించి సాక్షిలో రెండు రోజుల క్రితం ‘నిరుపేద.. ఆపై క్యాన్సర్ బాధ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కొందరు దాతలు సాయం చేస్తామంటూ వారికి ఫోన్లు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా ఒక అధికారి ఫోన్ చేయగా భువనేశ్వరి అన్న అక్కడికి వెళ్లాడు. తాత్కాలిక వైద్యసేవ కార్డు ఇవ్వడమే గాక ఏ విధంగా ఆస్పత్రికి వెళ్లాలో అతనికి వివరించారు. అయితే అంతలోపే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మృతి చెందింది. విలపిస్తున్న పిల్లలు.. భువనేశ్వరి బిడ్డలు తల్లి మృతదేహాన్ని చూసి రోదించసాగారు. ఫోన్ పని చేయకపోవడంతో భువనేశ్వరి మృతి చెందిన విషయం ఆమె భర్తతో పాటు అతని వద్ద ఉంటున్న మరో కుమార్తెకు తెలియలేదు. కన్నబిడ్డను కాపాడుకోలేకపోయామంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
బ్రెస్ట్ కేన్సర్ రాజధానిగా ....
బెంగళూరులో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ కేన్సర్ దేశంలోని 11 ముఖ్య నగరాల్లో ఉద్యాననగరిదే మొదటి స్థానం ప్రతి లక్షమందికి 36.6 బ్రెస్ట్ కేన్సర్ కేసులు మారుతున్న జీవన విధానమే కారణమంటున్న వైద్యులు బెంగళూరు: గార్డెన్ సిటీ, ఫ్యాషన్ సిటీ అంటూ ముద్దుగా పిలుచుకునే బెంగళూరు నగరం ప్రస్తుతం మరో పేరును కూడా తన జాబితాలో చేర్చేసుకుంది. అదే బ్రెస్ట్ కేన్సర్ రాజధాని. అవును బెంగళూరు నగరంలో బ్రెస్ట్ కేన్సర్ కూడా వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్కు అనుబంధంగా నడుస్తున్న పాపులేషన్ బేస్డ్ కేన్సర్రిజిస్ట్రీ(పీబీసీఆర్) ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. భారతదేశంలోని మొత్తం 11 ప్రముఖ నగరాల్లో ఈ సర్వేను నిర్వహించగా మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది. లక్ష మందికి 36.6బ్రెస్ట్ కేన్సర్ కేసులు బెంగళూరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, తిరువనంతపురం, చెన్నై, నాగపూర్, కోల్కత్తా, కొల్లం, పూణె నగరాల్లో పీబీసీఆర్ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం బెంగళూరు నగరంలో ప్రతి లక్ష మంది జనాభాకు 36.6బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జాబితాలో 35.1బ్రెస్ట్ కేన్సర్ కేసులతో తిరువనంతపురం రెండో స్థానంలో ఉండగా, 32.6 కేసులతో చెన్నై మూడో స్థానంలో, 23.3 కేసులతో పూణె చివరి స్థానంలో ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లతో ముప్పు... పదేళ్ల క్రితం వరకు సాధారణంగా మహిళల్లో బ్రెస్ట్‌కేన్సర్ ప్రమాదం ఎక్కువగా 45-55 ఏళ్ల మధ్యన ఉండేది. మారుతున్న ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం ఆ వయస్సు 35-45మధ్యకు తగ్గిపోయింది. ప్రపంచీకరణతో బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానాలే ఇందుకు ప్రధాన కార ణాలుగా నిలుస్తున్నాయంటున్నారు వైద్యులు. ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు నగరంలో చాలా మంది కెరీర్ వేటలో పడి ఆహారపు నియమాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కువగా జంక్ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకొని ఒబేసిటీకి గురై తద్వారా బ్రెస్ట్ కేన్సర్‌కు గురవుతున్నారు. ఇక పాశ్చాత్యీకరణ కారణంగా అమ్మాయిల్లో ధూమపానం, మద్యపానం అలవాట్లు బాగా పెరుగుతున్నాయి. బెంగళూరులో ఇంతకుముందు కేవలం వీకెండ్ పార్టీలకు మాత్రమే పరిమితమైన ఈ అలవాటు ప్రస్తుతం చాలా మంది అమ్మాయిల్లో వ్యసనంగా మారిపోయింది. ఈ కారణంగా కూడా బ్రెస్ట్‌కేన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇవి కూడా కారణమే... బ్రెస్ట్‌కేన్సర్ బాధితుల సంఖ్య పెరగడానికి ఆహారపు అలవాట్లే కాక జీవన విధానంలోని మార్పులూ కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు కెరీర్లో పూర్తిగా నిలదొక్కుకున్నాకే వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది నలభైల వయసు వరకు వివాహానికి దూరంగా ఉండడం కూడా బ్రెస్ట్ కేన్సర్ అధికమవడానికి ఒక కారణంగా నిలుస్తోంది. గర్భధారణను వాయిదా వేయడం కోసం కాంట్రాసెప్టివ్ పిల్స్(గర్భనిరోధక మాత్రలు)ను ఇష్టమొచ్చినట్లుగా వాడడం, పిల్లలకు తల్లిపాలను (బ్రెస్ట్ ఫీడింగ్) అందించక పోవడం.. ఇవన్నీ కూడా బ్రెస్ట్ కేన్సర్ పెరగడానికి కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిబారిన పడుతున్న వారిలో పది శాతం వరకు వంశపారంపర్య (హెరిడిటరీ) సమస్య కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. 20 ఏళ్ల తర్వాత పరీక్షలు అవసరం... పాశ్యాత్యీకరణ కారణంగా అమ్మాయిల ఆహారపు అలవాట్లు, జీవనవిధానాల్లో చాలా మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా జంక్‌ఫుడ్స్‌లో వాడే ప్రిజర్వేటివ్స్, గర్భధారణను వాయిదా వేయడం కోసం ఉపయోగిస్తున్న కాంట్రాసెప్టివ్ పిల్స్ మహిళల్లో బ్రెస్ కేన్సర్ బాధితుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం బ్రెస్ట్ కేన్సర్ణు లైఫ్‌సై ్టల్ డిసీజ్‌గా పరిగణిస్తున్నాం. అందుకే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలోనే కాంట్రాసెప్టివ్ పిల్స్‌ను వాడాలి. అంతేకాదు పిల్లలకు కచ్చితంగా తల్లిపాలనే అందించాలి. తద్వారా తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. 20 ఏళ్లు వయస్సు దాటిన మహిళలందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక వేళ బ్రెస్ట్ కేన్సర్ సోకినా తొలిదశలోనే నయం చేయడానికి అవకాశాలుంటాయి. - డాక్టర్ జయంతి, ఆంకాలజిస్ట్ -
నిన్నొదల మానవాళీ
తింటే తంటా రోగాలు మందులు మింగుతున్నాయి. మింగే ముద్ద బుస కొడుతోంది. పాత జబ్బుల రోత పెరిగింది. కొత్త జబ్బుల మోత మొదలైంది. ‘అన్నం మందు కావాలి... మందు అన్నం కాకూడదు’ అన్న నానుడికి తింటే తంటా అన్న చీడ పట్టింది. మాంసం ఫ్రై చేసి... మసాలా కొట్టి... తందూరు పెట్టి తిందామంటే క్యాన్సర్ కొరుకుతానంటోంది. ప్రసాదం దగ్గర్నుంచి చాక్లెట్ దాకా ఏ పండగా చేసుకోనివ్వని చక్కెర... పానకంలో పుడక అయ్యింది. చిత్రవిచిత్రమైన వ్యాధులు కుల మత వర్ణ వర్గాల అంతరాలు లేకుండా ‘వదల మానవాళీ’ అని ఊళ వేస్తున్నాయి. అన్నీ బ్రేకింగ్ న్యూస్లే! మానవాళికి ‘బ్రెత్ టేకింగ్’ ఫ్యాక్టులే!! డిప్రెషన్ ఎగరగొట్టడానికి కన్ఫ్యూజన్ పారదోలడానికి ఈ కథనాలు! నిజానికి ఏ ఆహారమైనా ఎలర్జీ కలిగించవచ్చు. ఎక్కువగా పిల్లల్లోనే ఆహారం వల్ల ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిలో ప్రధానంగా ఎనిమిది రకాల ఆహార పదార్థాలు ఎలర్జీలు కలిగిస్తాయి. అవి... పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, వేరుశనగలు, ట్రీ-నట్స్, చేపలు, గుల్లచేపలు. ఆహారం వల్ల ఎలర్జీ లక్షణాలు కొందరిలో తక్కువగా ఉంటే, ఇంకొందరిలో ప్రాణాంతకమైన స్థాయిలో ఉంటాయి. సరిపడని ఆహారం తీసుకున్నప్పుడు నిమిషాల వ్యవధిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఫుడ్ ఎలర్జీలో జరిగే ప్రక్రియ ఏమిటి? ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక ప్రక్రియ చాలా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. అందువల్లనే సరిపడని ఆహార పానీయాలు తీసుకున్న వెంటనే అది తీవ్రంగా ప్రతిఘటించడం మొదలుపెడుతుంది. మనకు సరిపడని ఆహారం లేదా వస్తువును ఎలర్జెన్స్ అంటారు. ఎలర్జెన్స్ లోపలికి ప్రవేశించగానే వాటితో పోరాడేందుకు వ్యాధినిరోధక వ్యవస్థ యాంటీబాడీస్‌ను వెలువరిస్తుంది. ఈ పోరాటక్రమంలో యాంటీబాడీస్ వెలువరించే రసాయనాల వల్ల మన శరీరంలో ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫుడ్ ఎలర్జీలు... ఎవరెవరిలో ఎంతెంత? చిన్నారులందరిలోనూ 3 నుంచి 8 శాతం మందిలో ఏదో ఒక రకం ఆహారం కారణంగా ఎలర్జీలు కనిపిస్తుంటాయి. కొందరిలో ఈ ఎలర్జీలు కాలక్రమంలో తగ్గిపోవచ్చు కూడా. ఇక పెద్దల విషయానికి వస్తే 1 నుంచి 2 శాతం మందిలో ఏదో ఒక ఆహారం పట్ల ఎలర్జీ రావడం చాలా సాధారణం. అయితే గతంలో మనకు బాగా సరిపడే ఆహారాలే... ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా సరిపడకపోవడం కూడా జరుగుతుండవచ్చు. ఇలా ఏ సమయంలోనైనా, ఏ ఆహారం పట్లనైనా ఎలర్జీ కలగవచ్చు. లక్షణాలు ఎలా ఉంటాయి? * ఎలర్జీ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. తీవ్రత సైతం ఒకేలా ఉండదు. వాటి లక్షణాల ప్రభావం వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు శారీరక వ్యవస్థలపై ఉండవచ్చు. * ఆహారం మొదట వెళ్లేది జీర్ణవ్యవస్థలోకి కాబట్టి కొందరిలో అది లోపలికి ప్రవేశించగానే నోటిలోని లోపలి మ్యూకస్ పొరల వాపు, పెదవులపై దురదలు, గొంతు బొంగురుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. * ఇంకొందరిలో ఆహారం కడుపులోకి ప్రవేశించగానే వికారం, కడుపు పట్టేసినట్లుగా బిగుతుగా కావడం, మలబద్ధకం, కడుపునొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాల లాంటివి ఎదురుకావచ్చు. * చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాల వంటివి ఎలర్జీకి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కొందరిలో చర్మంపైనా, ఊపిరితిత్తులపైనా కనిపించే చాలా తీవ్రమైన రియాక్షన్‌ను ‘అనాఫిలాక్సిస్’ అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఫుడ్ ఎలర్జీ నుంచి నివారణ ఎలా...? దూరంగా ఉండండి: మీకు సరిపడని ఆహారం నుంచి దూరంగా ఉండండి. లేబుల్ చదవండి: మీరు ఏదైనా వంటకం లేదా ప్రిపరేషన్‌ను తీసుకోదలచినప్పుడు దానిలో ఉండే పదార్థాల జాబితాను చదవండి. మీరే వండుకోండి: మీకు ఫుడ్ ఎలర్జీలు ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తీసుకోండి. బయటకు వెళ్లాల్సి వస్తే, స్వయంగా వంట చేసుకునే అవకాశం ఉన్నచోట వసతి పొందండి. హోటళ్ళలో తినాల్సి వస్తే, అలవాటైన ఆహారాన్నే ఆర్డర్ చేయండి. నూనెలతో జాగ్రత్త: కొన్ని రకాల నూనెలు ఎలర్జీ కలిగించే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు వేరుశనగ నూనెకు ఈ గుణం ఎక్కువ. పిల్లల విషయంలో: బయట దొరికే కృత్రిమ ఫార్ములాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలిమెంటల్ ఫార్ములాలు లేదా అల్టర్డ్ ప్రోటీన్లు ఫుడ్ ఎలర్జీలను తక్కువగా కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను పాటించండి. అలాగే పిల్లల ఆహారంపై ‘హైపో ఎలర్జెనిక్’ అని రాసి ఉందంటే అది చాలా వరకు సురక్షితం. అయితే, అరుదుగా ఇవి కూడా ఎలర్జీ కలిగించే అవకాశాలు లేకపోలేదు. అందుకే కొద్ది మోతాదుల్లో పరీక్షించాకే వాటిని నమ్మకంగా వాడండి. చికిత్స: ఏదైనా ఆహారం వల్ల ఎలర్జిక్ లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను సంప్రతించాలి. ఎలర్జీ తీవ్రత ఎక్కువగా ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలర్జిక్ లక్షణాలు కనిపించగానే డాక్టర్లు ఎపినెఫ్రిన్ మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ హిస్టమైన్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ ఇవ్వాల్సి రావచ్చు. ఎక్కువ మందిలో ప్రధానంగా అలర్జీ కలిగించేవి... పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, వేరుశనగలు, ట్రీ-నట్స్, చేపలు, గుల్ల చేపలు. అలర్జీ లక్షణాలు వేరువేరుగానే ఉన్నా చాలా మందిలో దురదలు, గొంతు బొంగురుగా మారడం కనిపించవచ్చు గ్లూటెన్ అంటే...? పిండి... దానితో చేసే ముద్ద గురించి తెలుసుకునే ముందుగా మనం ‘గ్లూటెన్’ గురించి తెలుసుకుందాం. మనం పిండిని కంచంలో రాశిగా పోసి మధ్యలో గురుగు చేసి (గుంట పెట్టి) అందులో నీళ్లు పోస్తాం. కాసేపటి తర్వాత పొడి పిండి కాస్తా... పిండిముద్దగా మారుతుంది. ఇలా పొడి పిండిని, పిండిముద్దలా మార్చడానికి పిండిలోని గ్లూటెన్ అనే పదార్థం తోడ్పడుతుంది. నిజానికి గ్లూటెన్ అన్నది ఒక రకం ప్రోటీన్. అయితే, కొందరికి మాత్రం ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ సరిపడదు. దాంతో వాళ్లకు పిండితో చేసిన ఏదైనా వంటకం తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాల లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ ఉన్న వ్యక్తులుగా పేర్కొంటారు. ఇలాంటి వారి కోసమే... ఆ యా పిండులతో గ్లూటెన్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిండి నుంచి గ్లూటెన్ను తొలగిస్తారన్నమాట. ఇలాంటి పిండిని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అభివర్ణిస్తుంటారు. డిప్రెషన్ కన్ఫ్యూజన్ ఇన్ని వ్యాధులు మన చుట్టూ భ్రమిస్తూ ఉంటే మానసికంగా కూడా కుంగిపోయేవారు ఎంతోమంది! కొందరు వ్యక్తులు తమకు ఏదో సమస్య ఉన్నట్లుగా భావిస్తుంటారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ను ఒకటికి పదిసార్లు కలుస్తారు. వారు చెప్పింది నమ్మరు. తమకు ఏదో వ్యాధి ఉందంటూ ఈఎన్టీ, న్యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, డెంటిస్ట్, గ్యాస్ట్రో-ఎంటరాలజిస్ట్... ఇలా అన్నిరకాల స్పెషలిస్టులను సంప్రతిస్తుంటారు. కలిసినప్పుడల్లా సదరు డాక్టర్లకు కొన్ని కొత్త సమస్యలు చెబుతుంటారు. వాళ్లు చెప్పిన లక్షణాలను బట్టి ఆయా డాక్టర్లు రకరకాల వైద్య పరీక్షలు చేయిస్తుంటారు. అయినా ఏమీ తేలదు. అలాంటి వారిని ఇక చివరగా మానసిక వైద్యుల వద్దకు పంపిస్తారు. ఇలాంటి చాలామందిలో తమకు ఏదో జబ్బు ఉందని అనుమానించే వారిలో ‘హైపో-కాండ్రియాసిస్’ అనే రుగ్మత ఉండవచ్చు. ఇక కొందరికి తీవ్రమైన డిప్రెషన్ ఉంటుంది. ఇది చాలా పెద్ద మానసిక రుగ్మత. కానీ డిప్రెషన్ రోగులు దాన్ని మానసిక రుగ్మతగా అనుమానించడానికి ముందు అనేక శారీరకమైన లక్షణాలను వ్యక్తపరుస్తుంటారు. ఆ శారీరక లక్షణాలకే చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు తీవ్రమైన నీరసం, నిస్సత్తువతో కొందరు బాధపడుతుంటారు. అది శారీరకంగా వచ్చిన బలహీనత వల్ల అని అనుకుంటుంటారు. ఆకలి లేకపోవడం కూడా డిప్రెషన్ వల్ల కనిపిస్తుంది. ఇక కొందరిలో తలనొప్పి ఉంటుంది. నిజానికి డిప్రెషన్ వల్ల కలిగే ఈ తలనొప్పిని నరాలకు సంబంధించిన ఏదైనా వ్యాధి కారణంగా వస్తున్న తలనొప్పిగా రోగులు పొరపడుతుంటారు. ఇక, కండరాలు పట్టేయడం డిప్రెషన్లో కనిపించే మరో లక్షణం. కానీ ఒంట్లో నీళ్లు, లవణాలు తగ్గడం వల్ల ఇలా కండరాలు పట్టేస్తున్నాయని అపోహపడే అవకాశం ఉంది. ఇక, జీర్ణవ్యవస్థకు సంబంధించిన చాలా రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మలబద్ధకం కానీ, నీళ్ల విరేచనాల వంటివి కానీ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని డాక్టర్లు ముందుగా గ్యాస్ట్రో- ఇంటెస్టినల్ సమస్యగా పరిగణించవచ్చు. కానీ నిజానికి ఇవన్నీ డిప్రెషన్ వల్ల కలగవచ్చు. పైన పేర్కొన్న అనేక సందర్భాల్లో కొన్ని రకాల మానసిక రుగ్మతలు శారీరక లక్షణాలతో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ చికిత్స కోసం డాక్టర్లు కొంత వ్యవధి తీసుకొని అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే జాగ్రత్తపడాలి. మానసిక వ్యాధుల్ని అనుమానించాలి. అరుదైన వ్యాధులు ప్రొగేరియా వ్యాధి సోకిన వారికి బాల్యంలోనే ముసలితనం ముంచుకొస్తుంది. జనాభాలో 0.1 శాతం కంటే తక్కువ మందిలో కనిపించే వ్యాధులను అరుదైన వ్యాధులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది. దాదాపు ఏడువేల వ్యాధులను ప్రపంచ ఆరోగ్య సంస్థ అరుదైన వ్యాధులుగా గుర్తించింది. ఇవి సర్వసాధారణమైన వ్యాధులు కావు గనుక వీటిపై విస్తృతంగా అధ్యయనం చేసిన వైద్యుల సంఖ్య కూడా తక్కువే. అందువల్ల కొన్ని అత్యంత అరుదైన వ్యాధులను వైద్యపరీక్షల ద్వారా గుర్తించడానికే ఒక్కోసారి చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది. ఈలోగా అలాంటి వ్యాధులతో బాధపడే రోగులకు జరగాల్సిన అనర్థం కాస్తా జరిగిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాధులకు గురైన వారిలో మరణాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటోందని ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా (ఓఆర్డీఐ) వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ విజయ్ చంద్రు చెబుతున్నారు. మన దేశంలో సుమారు ఏడు కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు అత్యంత అరుదైన వ్యాధుల గురించి... ప్రొగేరియా జన్యులోపం వల్ల తలెత్తే అత్యంత అరుదైన వ్యాధి ఇది. దాదాపు 80 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారికి బాల్యంలోనే ముసలితనం ముంచుకొస్తుంది. ముసలితనం వల్ల వచ్చే అన్ని సమస్యలూ వీరిని చిన్న వయసులోనే చుట్టుముడతాయి. ఫలితంగా వారు త్వరగా మరణానికి చేరువవుతారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్సా పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులో లేవు. వాటర్ ఎలర్జీ హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వల్ల తలెత్తే అత్యంత అరుదైన వ్యాధి ఇది. ప్రపంచవ్యాప్తంగా వాటర్ ఎలర్జీతో బాధపడే రోగులను ఇప్పటి వరకు 31 మందిని మాత్రమే గుర్తించారు. నీరు ప్రాణాధారం. అలాంటి నీరే కొందరికి సరిపడదు. స్నానం చేయడానికి ఒంటి మీద నీళ్లు పోసుకుంటే చాలు ఎలర్జీ మొదలవుతుంది. ఒంటి మీద నీళ్లు పడిన నిమిషాల వ్యవధిలోనే ఒంటిపై దద్దుర్లు వచ్చేస్తాయి. డిస్టిల్ చేయని నీటిలోని అయాన్లు కొందరిలో ఎలర్జీ కలిగిస్తాయి. ఆల్స్ట్రామ్ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలలో ఈ వ్యాధితో బాధపడే 502 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. జన్యువుల్లో తలెత్తే అసహజమైన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది సోకిన వారు బాల్యంలోనే స్థూలకాయులవుతారు. అంతేకాక రెటీనా దెబ్బతిని క్రమంగా అంధులవుతారు. చిన్న వయసులోనే టైప్2 డయాబెటిస్ సోకడంతో పాటు లివర్, కిడ్నీ లాంటి అవయవాలు విఫలమై మరణానికి చేరువవుతారు. మైక్రోసెఫాలీ ఇది అత్యంత అరుదైన నాడీసంబంధ వ్యాధి. ఈ వ్యాధిలో గర్భస్థ స్థితిలో ఉండగానే శిశువు మెదడు అసాధారణంగా ఎదుగుతుంది. పుట్టిన తర్వాత మెదడు ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఈ వ్యాధి సోకిన వారి తల చాలా చిన్నగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని నయం చేసే చికిత్స ఏదీ ఇప్పటికీ అందుబాటులో లేదు. అపెండిక్స్ కేన్సర్ పేగుల చివరుండే వృథా భాగం అపెండిక్స్. అరుదుగా దీనికి కేన్సర్ సోకుతుంది. వైద్యపరిభాషలో దీనిని ‘సూడోమిక్సోమా పెరిటోనీ’ అంటారు. అపెండిక్స్‌లో మొదలైన కేన్సర్ క్రమంగా కడుపులోని ఇతర భాగాలకీ విస్తరిస్తుంది. దీన్ని సీటీ స్కానింగ్‌తో గుర్తించవచ్చు. అయితే, దీని లక్షణాలు త్వరగా బయటపడవు. వ్యాధి నిర్ధారణలో జాప్యం వల్ల అపెండిక్స్ కేన్సర్ రోగుల్లో చాలామంది మృత్యువాత పడుతుంటారు. ‘పా’ అనే హిందీ సినిమాలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రొగేరియా వ్యాధిగ్రస్తుడుగా నటించారు పానకంలో పుడక చక్కెర రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి ‘ఏ, డీ, ఈ, కే’ వంటి విటమిన్లు అందడానికి ఈ కొవ్వులే దోహదపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ‘‘వేడి వేడి అన్నంలోకి ఇంత ముద్దపప్పు... ఆవకాయ, చారెడు నెయ్యి పోసుకుని’’ తింటే ఉంటుందీ... ‘ఆహా ఏమి రుచి’ అంటూ మైమరచిపోవాల్సిందే! కానీ ఈ కాలంలో చాలామంది ‘మొదటి రెండింటికీ ఓకే గానీ... మరీ చారెడు నెయ్యి..? కొలెస్ట్రాల్ పెరిగిపోదూ..’ అంటూ తల విదిలించేస్తారు! ఒక్క నెయ్యి అనేమిటి? కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, గుండెజబ్బులకు కారణమవుతుందని మనం చాలా రుచులను పోగొట్టుకున్నాం. పాలు మొదలుకొని అన్ని రకాల పదార్థాల్లో కొవ్వులు తక్కువగా ఉండేలా చేసుకుంటున్నాం. ఆరోగ్యం కోసం ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడం తప్పు కాదు. మరి... గుండెజబ్బులు తగ్గాయా? ఊహూ... చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించిన వారిని, మంచాన పడ్డవారిని మనం చూస్తూనే ఉన్నాం! మరి... సమస్య ఎక్కడుంది? కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... చిక్కంతా చక్కెరలోనే ఉంది! అది 1972. అప్పట్లో బ్రిటిష్ న్యూట్రిషనిస్ట్ జాన్ యడ్కిన్స్ తన పరిశోధనల ఆధారంగా ‘ప్యూర్... డెడ్లీ అండ్ వైట్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. ‘చక్కెర (ఫ్రక్టోస్) శరీరంపై చూపే ప్రభావం గురించి ఏ కొంచెం ప్రపంచానికి చెప్పినా... వెంటనే దానిపై నిషేధం ఖాయం’ అని అంటారు యడ్కిన్. అయితే యడ్కిన్ అనుకున్నట్లు ఫ్రక్టోస్‌ను నిషేధించకపోగా యడ్కిన్స్పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఆహార పరిశ్రమ వర్గాలు ఈయన పరిశోధనలన్నీ బోగస్ అని విమర్శించాయి. ఈ అవమానాల మధ్య చివరకు యడ్కిన్ ఓ అనామకుడిలా 1995లో మరణించారు. ఈ మధ్యలో అమెరికా, బ్రిటన్లు ఆహారంలో కొవ్వును తగ్గించుకోవాలనీ, గుండెజబ్బులకు, మధుమేహానికి దూరంగా ఉండేందుకు అదే మేలైన మార్గమనీ ప్రచారం చేశాయి. ఇంకేముంది అందరూ కొవ్వు తక్కువగా ఉండే ‘లో-ఫ్యాట్ డైట్’ వ్యాపార వ్యూహానికి బోల్తా పడిపోయారు. చక్కెర చేదే! అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ లస్టిగ్ అని ఓ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన ఎండోక్రైనాలజిస్ట్. పిల్లల్లో ఊబకాయం నివారణపై పరిశోధనలు చేస్తూంటారు. ఏడేళ్ల క్రితం ఆయన ‘చక్కెర... ఓ చేదు నిజం’ పేరుతో ఓ ఉపన్యాసమిచ్చారు. యూ-ట్యూబ్‌లో దీన్ని ఇప్పటివరకూ దాదాపు 60 లక్షల మంది చూశారు. యడ్కిన్స్ చెప్పిన విషయాలనే ఈయనా తన ఉపన్యాసంలో చెప్పినప్పటికీ లస్టిగ్ తన వాదనలన్నింటికీ శాస్త్ర, పరిశోధన ఫలితాలను ఆధారంగా చూపారు. ఆహారం నుంచి కొవ్వు తీసేస్తే దాని రుచి మొత్తం పోతుంది కాబట్టి... దాని స్థానంలో చక్కెర మోతాదును ఎక్కువ చేయడం వల్లనే ప్రస్తుతం అమెరికాతోపాటు చాలా దేశాల్లో ఊబకాయం సమస్య పెరిగిపోతోందని, ఇది గుండెజబ్బులకు, ఇతర వ్యాధులకు దారితీస్తోందని ఆయన సోదాహరణంగా వివరిస్తున్నారు. ఇంతకీ చక్కెర ఏం చేస్తుంది? జంక్‌ఫుడ్ కేటగిరీలోకి వచ్చే చాలావరకూ ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో సుక్రోజ్, హై-ఫ్రక్టోస్ కార్న్ సిరప్లు అధిక మోతాదుల్లో ఉంటాయి. ఈ రెండు తీపి పదార్థాల్లోనూ గ్లూకోజ్, ఫ్రక్టోస్ అనే రెండు రకాల చక్కెరలుంటాయి. బంగాళ దుంపలతోపాటు అనేక రకాల కాయగూరలు, పండ్ల ద్వారా గ్లూకోజ్ లభిస్తుంది. జీవక్రియలకు అవసరమైన శక్తిని కణాలు గ్లూకోజ్ రూపంలోనే తయారు చేసుకుంటాయి. శరీరంలో లివర్ ఒక్కటే అధిక మోతాదులో ఫ్రక్టోస్‌ను జీర్ణం చేయగలదు. ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు లివర్ దాన్ని కొవ్వుగా మారుస్తుంది. ఈ కొవ్వు వెరీ లో-డెన్సిటీ లిపిడ్ కొలెస్ట్రాల్‌గా శరీరంలోకి చేరుతుంది. ఫలితంగా రక్తంలోని కొలెస్ట్రాళ్ల సమతౌల్యం దెబ్బతింటుంది. అంతేకాదు... యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని ఫ్రక్టోస్ ప్రేరేపించి రక్తపోటు అధికమయ్యేలా చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతూ ఊబకాయం, మధుమేహ వ్యాధులు వచ్చేందుకు కారణమవుతుంది. కొవ్వులు తింటే లావెక్కుతారా? ఆహారం ద్వారా మనం తీసుకునే కొలెస్ట్రాల్‌కూ, రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ మోతాదుకూ ఏ మాత్రం సంబంధం లేదని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. రోజుకు ఒకటి నుంచి పాతిక వరకూ కోడిగుడ్లు తినేవాళ్ల బ్లడ్ కొలెస్ట్రాల్ మోతాదుల్లో పెద్దగా మార్పుల్లేనట్లు గుర్తించారు. అదే సమయంలో చక్కెర దుష్ర్పభావాలపై గత దశాబ్ద కాలంలో ఎన్నెన్నో అధ్యయనాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితిలోని ఆహార, వ్యవసాయ విభాగం 2008లో అన్ని రకాల లో-ఫ్యాట్ డైట్లపై విశ్లేషణ జరిపింది. ఆహారం ద్వారా తీసుకునే కొవ్వుల ద్వారా గుండెజబ్బులు, కేన్సర్ వస్తాయనేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కొవ్వులు తింటే లావెక్కుతారనే వాదనలో పసలేదని పలు తాజా అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. వెన్న, నెయ్యి, గుడ్లు లాంటివి తినడం వల్ల ఒంట్లో కొవ్వు పెరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఈ అధ్యయనాలు నిగ్గు తేల్చాయి. నిజానికి రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి ‘ఏ, డీ, ఈ, కే’ వంటి విటమిన్లు అందడానికి ఈ కొవ్వులే దోహదపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. విషయం ఏంటంటే మితంగా తింటే ఏ గొడవా ఉండదు. - డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి వైస్ ఛైర్మన్ అండ్ సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ కౌన్సెలింగ్‌కు వచ్చిన వాళ్లకు కొద్దిగా ఫ్యాట్, అప్పుడప్పుడూ కొద్దిగా ఎగ్ ఎల్లో తీసుకోవచ్చు అని చెబితే... అన్నీ గుర్తుంచుకుంటారు కానీ... ఆ ‘కొద్దిగా’ అన్నమాట మరచిపోతుంటారు. ఆరోగ్యానికి జీవనశైలిలో బాలెన్స్ ముఖ్యమైనది. ఆ సమతౌల్యతను ‘మితం’ తోనే సాధించగలరు. రోజూ రీసెర్చ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అయితే ఆ సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి బాధ్యతగా, విచక్షణతో వాడుకుంటేనే ఆరోగ్యం మహా భాగ్యంగా ఉంటుంది. కొత్త మోత పాత రోత ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూస్తున్న 40 కొత్త వ్యాధులు ఆస్పత్రుల్లో ఉండే అనేక రకాల రోగకారక క్రిముల వల్ల వచ్చే వ్యాధులైన ‘నోటోకోమియల్ ఇన్ఫెక్షన్స్’ పెచ్చుమీరుతున్నాయి. అంటే జబ్బు తగ్గడానికి హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ సరిగా లేకపోతే, ఆ ప్రాంతమే మళ్లీ ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందన్నమాట! ఐదేళ్లలో పపంచంలో 1100 చోట్ల ఉత్పాత స్థాయిలో (ఎపిడమిక్స్ రూపంలో) వ్యాధుల విజృంభణ కొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయి. అంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరగని ‘జికా’ వంటివి వస్తున్నాయి. మరో కొత్త వ్యాధి ‘ఎబోలా’ ప్రపంచాన్ని గడగడ వణికించేసింది. గతంలోనూ అంతే... ఆంథ్రాక్స్ అనీ, సార్స్ అనీ, మ్యాడ్ కౌ అనీ, చికన్‌గున్యా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ అనీ... ఒక్కో సీజన్‌కు ఒక్కో వ్యాధి విజృంభించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్ల్లుగా... ఈ కొత్త వ్యాధులకు మరికొన్ని పాత వ్యాధులే కొత్త రూపాలను ధరించి వచ్చేశాయి. ఉదాహరణకు రెసిస్టెంట్ వెరైటీ టీబీ, బర్డ్ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ వంటివి తమ జన్యు స్వరూపాలూ మార్చుకొని విరుచుకుపడుతున్నాయి. సప్తసముద్రాలు దాటేస్తున్నాయి! గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ వ్యాధి అయినా, ప్రపంచంలో ఎక్కడ మొదలైనా అది ఒక మహమ్మారిలా వ్యాపించి, ఉత్పాతం సృష్టిస్తోంది. జికా వైరస్‌కి సంబంధించిన మొదటి కేసు గత మేలో బ్రెజిల్లో నమోదయింది. అప్పట్నుంచీ అది దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. అది మహమ్మారిలా విస్తరిస్తుండడంతో ప్రపంచదేశాలు ఉలిక్కి పడ్డాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ వైద్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచంలోని ఏదో ఒక చోట వ్యాపించే ఒక కొత్త వ్యాధి మిగతా ప్రాంతాల నుంచి ‘కొన్ని గంటల దూరంలోనే’ ఉంది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ డెరైక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆమె పేర్కొన్నదాని ప్రకారం ఒక తరం కిందటి వారు ఏ మాత్రం ఎరగని 40 రకాల కొత్త జబ్బులను ఆ తర్వాతి తరం వారు చవిచూశారు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో ప్రపంచం 1100 చోట్ల జబ్బుల వ్యాప్తి ఉత్పాతాలను (ఎపిడమిక్స్... అంటే జబ్బు మనుషులను తుడిచిపెట్టినట్లుగా ఒక ప్రదేశంలో వ్యాపించడాన్ని) చవి చూసింది. ఇప్పుడు బ్యాక్టీరియా జీవులు మరింత బలం పుంజుకోవడం వల్ల ఒక రకం నిమోనియాను కలిగించే క్లెబిసియెల్లా నిమోనియా కార్బపేనిమేజ్, సూడోమొనాస్ అనే ప్రజాతి (జీనస్)కి చెందిన సూక్ష్మజీవుల వల్ల వ్యాపించే వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వాలూ జాగ్రత్తలు తీసుకోవాలి! విస్తరించే వ్యాధులు సాధారణంగా వాటంతట అవే కొంత సమయం తర్వాత కట్టుబడుతుంటాయి. అయితే ఇలా అవి స్వాభావికంగా కట్టుబడకుండా ఉండడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తున్నాయి. ఉదాహరణకు సురక్షితమైన మంచి నీరు లేకపోవడం, రోజురోజుకూ పెరిగే కాలుష్యాల వల్ల పరిసరాలు అనారోగ్యకరంగా మారుతుండడం, సంపద అందరికీ అందకపోవడం వల్ల పేదలలో జీవన ప్రమాణాలు దిగజారుతుండడం వంటి అంశాలు పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. దీనికి తోడు మారిపోతున్న వాతావరణం, అనారోగ్యకరమైన ఆహారాలు, పాశ్చాత్య జీవనశైలి వంటివి ఈ వ్యాధులకు ఊతమిస్తున్నాయి. పట్టణీకరణలో భాగంగా పెరుగుతున్న మురుగునీటి పెరుగుదల, నీళ్లు కలుషితం కావడం వంటివి కొత్త వ్యాధులు మరింత వేగంగా విస్తరించేలా చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఈ అంశాలను పర్యవేక్షించడానికీ, కొత్త వ్యాధుల విస్తరణలపై నిఘా పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ఎపిడమిక్ అండ్ ప్యాండమిక్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్కు బాధ్యతలు అప్పగించింది డబ్ల్యూహెచ్ఓ. ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అంశాలను తెలుసుకోడానికి ఒక ఉదాహరణ. ప్రపంచంలోని 25 శాతం జనాభా ఫ్లూ వ్యాధికి గురవుతోంది. ఫ్లూను కలిగించే వైరస్లలో కలిగే ఉత్పరివర్తనాల వల్ల మందులకు లొంగని మ్యూటెంట్ వెరైటీ ఇన్ఫ్లుయెంజాలు ఏర్పడితే అది ముప్పుగా పరిణమించవచ్చు. ఇదే జరిగితే ఆ దేశం కునారిల్లే లోపే ఆ పెనుముప్పు ఎపిడమిక్ రూపంలో ప్రపంచంలోని అన్ని దేశాలనూ చుట్టుముడుతుంది. అది సమస్త మానవాళినీ తుడిచిపెట్టే అవకాశమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. డబ్ల్యూహెచ్ఓ వార్షిక నివేదిక చెబుతున్నదిదే... * 20వ శతాబ్దంలోనే కనిపించకుండా పోయాయనుకున్న కలరా, ఎల్లో ఫీవర్, ఎపిడమిక్ మెనింగోకోకల్ వ్యాధులు (బ్రెయిన్ ఫీవర్ / మెదడువాపు) మళ్లీ వెలుగు చూస్తున్నాయి. * వైరస్ ద్వారా సంక్రమించే ఎబోలా, మార్బర్గ్ హెమరేజిక్ ఫీవర్, నిఫా వైరస్ లాంటివి ఇప్పుడు మానవాళి అంతు చూసేందుకు సిద్ధంగా ఉన్నాయి. - డాక్టర్ మార్గరెట్ చాన్ డబ్ల్యూ.హెచ్.ఓ డైరెక్టర్ జనరల్ -
బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టకుండా.. చిన్న చిట్కా!
ఒకసారి క్యాన్సర్ బారిన పడి, చికిత్స చేయించుకున్నవారికి మళ్లీ ఆ వ్యాధి తిరగబెడుతుందనే ఆందోళన తక్కువేమీ కాదు. రొమ్ము క్యాన్సర్ పునరుక్తిని తగ్గించేందుకు చిన్న చిట్కాను పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి భోజనం తర్వాత విరామం ఎక్కువ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి ఎక్కువసేపు ఉపవాసం ఉండటం ఈ వ్యాధి మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. 1995, 2007 మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ పునరుక్తి, కొత్త ట్యూమర్లు రావడం, వారి ఆహార పద్ధతులు, నియమాలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇప్పటికే వ్యాధితో పోరాడిన దాదాపు 2వేల మందిపై జరిపిన కొత్త పరిశోధనలో ఈ అంశం తేలిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకురాలు కేధరీన్ మారినాక్ తెలిపారు. రాత్రిపూట భోజనం తర్వాత విరామం 13 గంటల కంటే తక్కువ కాకుండా ఉంటే ప్రారంభదశలోనే రొమ్ము కాన్సర్ చికిత్స పొందిన మహిళల్లో తిరిగి కణితులు ఏర్పడే అవకాశం 36 శాతం తగ్గిందని వెల్లడించారు. భోజనం తరువాత వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఎక్కువే అంటున్నారు. ఎక్కువ సేపు నిద్ర, రాత్రి ఎక్కువ భోజన విరామం గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్‌ను ప్రభావితం చేస్తుందన్నారు. దీంతోపాటు ఇతర క్యాన్సర్ల ప్రమాదం, టైప్ 2 మధుమేహం, గుండె రక్తనాళాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. రాత్రిపూట ఉపవాస విరామం తగినంత పొడిగించుకొని దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవాలని పరిశోధకులు సూచించారు. జామా ఆంకాలజీ అనే పత్రికలో ఈ పరిశోధనా పత్రం ప్రచురితమైంది. -
బిడ్డను కనకుంటే... క్యాన్సర్ వస్తుందా?!
నా వయసు 32. నేను భర్తతో విడిపోయాను. పిల్లలు లేరు. ఈ మధ్య ఓ పుస్తకంలో బిడ్డకు జన్మనివ్వని, పాలివ్వని వాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని చదివాను. నేను బిడ్డని కనలేదు. అంటే నాకూ క్యాన్సర్ వస్తుందా? - కె.ఉషశ్రీ, హుస్నాబాద్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువగా వస్తుంది. ఇది రావడానికి అనేక కారణాలుంటాయి. బాగా లావుగా ఉన్నా, బ్రెస్ట్ బాగా పెద్దగాను బరువుగాను ఉన్నా, పీరి యడ్స్ త్వరగా మొదలయ్యి లేట్‌గా ఆగిపోయేవారు, పిల్లలు లేనివారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వీరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండటం లేదా ఎక్కువకాలం ఈస్ట్రోజన్ హార్మోన్‌కు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, బ్రెస్ట్‌లోని కణాలు దీర్ఘకాలం ఈస్ట్రోజన్ ప్రభావానికి ప్రేరేపితమై వాటిలో మార్పులు ఏర్పడి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఫ్యామిలీస్‌లో బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జన్యువులు ఉండటం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వంటివి రావచ్చు. మెనోపాజ్ దశలో తీసుకునే హార్మోన్ రీప్లేస్మెంట్లో భాగంగా ఈస్ట్రోజన్‌ను ఎక్కువకాలం ఇవ్వడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. గర్భం దాల్చాక తొమ్మిది నెలల పాటు పీరియడ్స్ ఉండవు. అలాగే పాలిచ్చే సమయంలో కొన్ని నెలల పాటు పీరియడ్స్ ఉండవు. అంటే ఈ సమ యాల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫెక్ట్ ఉండదు. దానివల్ల కొంత కాలం బ్రెస్ట్... హార్మోన్ ప్రభావం నుంచి రక్షణ పొందుతుంది. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకా శాలు తగ్గుతాయి. అంతేకాని పిల్లల్ని కనకపోతే, పాలివ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుందని కాదు. వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయంతే. కాబట్టి కంగారు పడకుండా, ప్రతినెలా పీరియడ్స్ అయిపో యిన తర్వాత అద్దం ముందు నిలబడి... అరచేతితో బ్రెస్ట్‌ను తడుముకుని చూడ ండి. ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, చర్మం లోపలికి నొక్కుకుని ఉందా, నిపుల్స్ లోపలికి లాక్కున్నట్టు ఉన్నాయా, వాటి నుంచి ద్రవం వస్తోందా అన్న అంశాలను పరిశీలించుకోండి. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వల్ల బ్రెస్ట్‌లో ఏదైనా తేడా ఉంటే తెలుస్తుంది. ఉంటే డాక్టర్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలి దశలో నిర్ధారిస్తే, వంద శాతం చికిత్సకు ఆస్కారం ఉంటుంది. నా వయసు 33. ముప్ఫై దాటాక పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఏడు నెలలకే గర్భం దాల్చాను. స్కానింగ్‌లో ఫెయింట్ ఫీటల్ అని రావడంతో అబార్షన్ చేశారు. మళ్లీ ఆరు నెలలకు గర్భం దాల్చాను. అప్పుడూ అంతే. రెండో అబార్షన్ తర్వాతి నుంచి కడుపులో నొప్పి వస్తోంది. మరో డాక్టర్ని కలిస్తే అబార్షన్ చేసినప్పుడు గర్భసంచికి గీత పడింది అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నాకు ఆరోగ్యకరమైన గర్భం ఎందుకు రావడం లేదు? నాకు బిడ్డ కావాలి. సలహా ఇవ్వండి. - విజయలక్ష్మి, రాజమండ్రి గర్భం గర్భసంచిలో మొదలయ్యి అందులో పిండం ఏర్పడుతుంది. ఆరు వారాలకు దాని గుండె కొట్టుకో వడం మొదలవుతుంది. కొందరికి హార్మోన్ల అసమ తుల్యత లేదా జన్యుపరమైన కారణాల వల్ల పిండం సరిగ్గా ఏర్పడదు. గర్భంలో పిండం పెరగదు. దీనినే Blight Ovam అంటారు. కొందరిలో పిండం ఏర్పడు తుంది కానీ గుండె కొట్టుకోదు. లేదా కొన్నిరోజుల తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొన్నిసార్లు అండం నాణ్యత సరిగ్గా లేకపోయినా, తల్లిదండ్రుల్లో జన్యు సమస్యలు ఉన్నా కూడా పిండం పెరగకపోవచ్చు. థైరాయిడ్‌తో పాటు ఇతరత్రా హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీఓ, మధుమేహం, రక్తంలో యాంటీ ఫాస్పాలిపిడ్ యాంటిబాడీస్ వంటివి ఉన్నా కూడా మొదటి మూడు నెలల్లో పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు అవుతుంటాయి. అబార్షన్ చేసేటప్పుడు కొన్నిసార్లు గర్భసంచికి చిల్లుపడే అవకాశం ఉంటుంది. మీరు గీత పడింది అన్నదానికర్థం ఇదే అనుకుంటు న్నాను. అలాంటివి మెల్లగా మానిపోతాయి. కాకపోతే మళ్లీ వెంటనే గర్భం దాల్చకుండా కొన్ని నెలలు ఆగితే మంచిది. కొంతమందికి 30, 35 యేళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత తగ్గడం వల్ల కూడా పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు జరుగుతుంటాయి. బరువు ఎక్కు వుంటే తగ్గడానికి ట్రై చేయండి. రెండుసార్లు అబార్షన్ తప్పలేదు కాబట్టి మీలో ఇంకేమైనా సమస్యలున్నా యేమో తెలుసుకోవడం మంచిది. కాబట్టి CBP, ESR, OGTT, FSH, TSH, APA, Sr. APTTపరీక్షలతో పాటు షుగర్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ టెస్టులు కూడా చేయించుకోండి. ఏదైనా తేడా ఉంటే ముందు నుంచే చికిత్స తీసుకుంటూ గర్భం కోసం ప్రయత్నించండి. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ Karyotyping అనే జన్యుపరీక్ష చేయించుకుని, ఏవైనా జన్యు సమస్యలుంటే కౌన్సెలింగ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే గర్భం దాల్చ డానికి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకోండి. -
మద్యం తాగితే రొమ్ము కేన్సర్ ముప్పు అధికం!
మద్యం తాగడం వల్ల కేన్సర్ కారక జన్యువు స్థాయి మరింత పెరిగి, రొమ్ము కేన్సర్ వచ్చే ముప్పు ఎక్కువవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యం అతిగా తాగడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుందని, దానివల్ల రొమ్ము కేన్సర్ కణాల ఎదుగుదల కూడా ఎక్కువ కావడంతో పాటు, ఈస్ట్రోజన్‌ను అడ్డుకోడానికి ఉపయోగపడే టామోక్సిఫెన్ అనే మందు పనిచేయడం కూడా తగ్గుతుందని, దానివల్ల బీఆర్ఏఎఫ్ అనే కేన్సర్ కారక జన్యువు స్థాయి పెరుగుతుందని ఈ అంశంపై పరిశోధనలో పాల్గొన్న హ్యూస్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చిన్ యో లిన్ తెలిపారు. రొమ్ము కేన్సర్ కణాల విషయంలో ఈస్ట్రోజన్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ పరిశోధన నిర్వహించారు. మహిళల్లో ఉండే సెక్స్ హార్మనో ఈస్ట్రోజన్ స్థాయి ఎక్కువ కావడం వల్ల రొమ్ము కేన్సర్ ముప్పు ఎక్కువ అవుతుంది. కేన్సర్ కణాలు వేగంగా పెరగడాన్ని అడ్డుకునే టామోక్సిఫెన్ మందు సామర్థ్యాన్ని కూడా మద్యం తగ్గిస్తోందన్నది ఈ పరిశోధనలో తేలిన మరో ప్రధానమైన అంశం. మద్యం తాగడం వల్ల కేన్సర్‌కు సంబంధించిన చాలా అంశాలు ప్రభావితం అవుతాయని కూడా తెలిసింది. -
మహిళలందరికీ క్యాన్సర్ పరీక్ష !
ఛండీగఢ్: క్యాన్సర్ మహమ్మారిని నివారించేందుకు విశేషంగా కృషి చేస్తున్న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో 40 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 'మేం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం. ఒకవేళ ఈ పరీక్షల్లో వారికి క్యాన్సర్ సోకే అవకాశం ఉందని తెలిస్తే తదుపరి వైద్యం కోసం ఉన్నతస్థాయి ఆస్పత్రులకు పంపిస్తాం' అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. సర్వేకల్ క్యాన్సర్ లక్షణాలు కూడా వైద్యులు గుర్తించి చెప్తారని అన్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వ క్యాన్సర్ సోకిన ప్రతి వ్యక్తికి రూ.1.50లక్షల ఆర్థికసహాయం కూడా అందిస్తోంది. -
బ్రెస్ట్ క్యాన్సర్‌కు కొత్త చికిత్స!
న్యూయార్క్: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనిని గుర్తించడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఓ కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కేవలం 11 రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఈ కొత్త ఔషధం ప్రభావవంతంగా తొలగిస్తుందని బ్రెస్ట్ క్యాన్సర్ యురోపియన్ అసోసియేషన్ సదస్సులో పరిశోధకులు వెల్లడించారు. హెచ్ఈఆర్2 రకానికి చెందిన బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలపై హెర్సెప్టిన్, లాపాటినిబ్ ఫార్ములాతో ఉన్న కొత్త ఔషధం మంచి ఫలితాలను ఇచ్చిందని సదస్సు చీఫ్ ఎగ్జిక్యుటీవ్ సమియా అల్ ఖాదీ మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడిన చికిత్స విధానాలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధక బృందం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు హెచ్ఈఆర్2 బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడిన సుమారు 250 మందిపై పరిశోధనలు జరిపి ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నిర్థారించారు. -
పింకథాన్
-
బెంగళూరు టు హైదరాబాద్
మానవపాడు : బ్రెస్ట్‌క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి బెంగళూరుకు చెందిన ఇద్దరు స్నేహితులు ముందుకు కదిలారు. రోజుకు 60 కిలోమీటర్ల పొడవునా పరుగు తీస్తూ దారివెంట బ్రెస్ట్‌క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 6వ తేదీన 10వేల మందితో హైదరాబాద్‌లోని నక్లెస్రోడ్డుపై 10 కేవీ రన్ జరుగనుందని, అందులో పాల్గొనేందుకు తాము పరుగుతీస్తున్నట్లు బెంగళూరుకు చెందిన గిరధర్ కామంత్, స్పూర్తి సీతమ్మలు తెలిపారు. మంగళవారం కర్నూలు మీదుగా జాతీయరహదారిపైనున్న మానవపాడుకు చేరుకోగా ‘సాక్షి’ వారిని పలకరించింది. -
రొమ్ము క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 20 సంవత్సరాలు. నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు రెండేళ్లుగా విపరీతమైన తలనొప్పి. తలలో ఒకవైపు మొదలై కంటి వరకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. డాక్టర్గారిని సంప్రదిస్తే మైగ్రేన్ అని చెప్పి, కొన్ని మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతోంది. మానేస్తే మళ్లీ మామూలే. దీంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. నా సమస్యకి హోమియోలో పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? - టి.విజయ్ కుమార్, నల్గొండ మీరు ఆందోళన చెందకండి. హోమియోలో మైగ్రైన్‌కి పూర్తి చికిత్స లభిస్తుంది. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా చూస్తాం. ఈ పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నవారిలో నెలలో ఐదుకంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తుంటుంది. ఒకపక్కే వచ్చే ఈ నొప్పి నాలుగు గంటల నుండి మూడు రోజుల వరకు తీవ్రంగా బాధిస్తుంది. వాంతులు అవడం, శబ్దాలను, వెలుతురును భరించలేకపోవడం వంటి లక్షణాలు తలనొప్పితోబాటు కానీ, ముందుకానీ ఉంటాయి. కారణాలు: ఒత్తిడి, నిద్రలేకపోవడం, ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్. నెలసరి సమయంలో, గర్భిణులలో, మెనోపాజ్ సమయంలో సాధారణంగా ఈ నొప్పి వస్తుంటుంది. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఈ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన వాసనలు, పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు. పొగతాగటం, ఇంట్లో పొగతాగేవారుండటం, మద్యపానం లేదా ఇతర మత్తుపదార్థాలు తీసుకోవడం కూడా కారణాలవుతాయి. పైన పేర్కొన్న అంశాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని అదుపులో ఉంచవచ్చు. నొప్పి తగ్గిన తర్వాత కూడా చికాకు ఎక్కువగా ఉండటం, నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం వంటి లక్షణాలుంటాయి. రోగనిర్ధారణ పరీక్షలు: రోగలక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్ధారించడం జరుగుతుంది. ఈసీజీ, సీటీ బ్రెయిన్, ఎమ్మారై- బ్రెయిన్ వంటి పరీక్షల ద్వారా ఇతరత్రా వ్యాధులు లేవని నిర్ధారించుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్ధారించుకోవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యవిధానం ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపునొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. నాకు పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. ఈమధ్య ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాళ్లలో వాపులు వస్తున్నాయి. రక్తపరీక్ష చేయిస్తే క్రియాటినిన్ 10, యూరియా 28 అని వచ్చింది. యూరిన్ పరీక్ష చేయిస్తే 3 ప్లస్ అన్నారు. నాకు షుగర్ వల్ల సమస్య అవుతోందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - దయాసాగర్, శ్రీకాకుళం మీ రిపోర్ట్ ప్రకారం మీకు యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతోందని తెలుస్తోంది. ఇది షుగర్ వల్లనా లేక ఏదైనా కిడ్నీ సమస్యల వల్లనా లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్‌ను కూడా కలవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతిన్నదేమోనని (డయాబెటిక్ రెటినోపతీ) అని చూపించుకోవాలి. మీకు మూత్రంలో ఎక్కువగా ప్రోటీన్ పోవడానికి కూడా షుగర్ వల్లే అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకు భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట మీ షుగర్ లెవెల్స్‌ను బాగా నియంత్రించుకోవాలి. తినకముందు బ్లడ్ షుగర్ 110 ఎంజీ/డీఎల్, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేట్లుగా చూసుకోవాలి. బీపీ 125/75 లోపల ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ కొలెస్ట్రాల్ 150 ఎంజీ ఉండేలా మందులు వాడాలి. ఇవి కాకుండా ఆహారంలో ఉప్పు తగ్గించాలి. పొగతాగడం / ఆల్కహాల్ అలవాట్లు ఉంటే వాటిని దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు. మా అబ్బాయికి ఐదేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ 3 ప్లస్ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? - రవీంద్రరావు, కొత్తగూడెం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించుకోవాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ క్యాన్సర్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నా చిన్నప్పుడే మా అమ్మ రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. మా అక్కకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఒక రొమ్మును తొలగించాల్సి వచ్చింది. కుటుంబంలో ఇలా చాలామందికి క్యాన్సర్ రావడంతో నాకూ ఈ వ్యాధి వస్తుందేమో అని భయంగా ఉంది. నాకు ఈ ఏడాది లేదా పై ఏడాది పెళ్లి చేస్తామంటున్నారు. నా వైవాహిక జీవితం బాగానే ఉంటుందా? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? వస్తే తగ్గుతుందా? దీని బారిన పడకూడదంటే నేను తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు ఏవైనా ఉంటే తెలియజేయండి. - ఒక సోదరి, విజయవాడ ఇటీవల చాలామంది మహిళలు రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం... దీని పట్ల తగిన అవగాహన లేకపోవడం. అంత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా అవగాహన లోపం వల్ల ముందుగానే దీన్ని గుర్తించలేకపోతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీ కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డవారు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మీకు కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంది కాబట్టి ఒకసారి పరీక్షలు చేయించుకుంటే మీ అనుమానాలు తొలగిపోతాయి. ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అనే పరీక్ష ద్వారా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ మొదటే గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ ఉన్నా ఇప్పుడున్న వైద్య సదుపాయాలతో దీని నుంచి పూర్తిగా బయటపడవచ్చు. మీరు ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోకుండా ముందుగా మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోండి. ఒకవేళ అవసరమైతే వైద్యులు మీకు నీడిల్ బయాప్సీ అనే మరో పరీక్ష చేస్తారు. ఒకవేళ ఇప్పుడు పరీక్షలో మీకు ఎలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ లేదని తేలినప్పటికీ మీకు 30 సంవత్సరాలు వచ్చే వరకూ మూడేళ్లకొకసారి బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. - డాక్టర్ అవినాశ్ పాండే మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ -
ఏటా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా కొత్తగా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నట్లు అసోసియేషన్ ఆఫ్ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఇండియా(ఏజీఓఐ)- 2015 మూడు రోజుల సదస్సు ప్రకటించింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పట్టణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది మహిళల్లో 35, గ్రామీణ ప్రాంతాల్లో 8 మంది రొమ్ము క్యాన్సర్‌కు గురవుతున్నట్టు వెల్లడించింది. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సు శుక్రవారం హోటల్ మారియట్‌లో ప్రారంభమైంది. పది మంది అంతర్జాతీయ, 100 మంది జాతీయ ఫ్యాకల్టీలు... గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో వస్తున్న అధునాతన మార్పలు, మెళకువలను లైవ్ సర్జరీల ద్వారా ఇందులో వివరించారు. 400 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజీఓఐసీఓఎన్ ఆర్గనైజింగ్ చైర్మన్ టి.సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, ఏజీఓఐ అధ్యక్షురాలు నీరజాభట్ల, కార్యదర్శి రమాజోషి, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ క్లినికల్ చీఫ్ శశికాంత్ లేలే మాట్లాడారు. తగ్గిన సర్వైకల్ క్యాన్సర్... గతంతో పోలిస్తే ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ తగ్గిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత శుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించడం, అవగాహన పెరగడం, యుక్త వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవడమే ఇందుకు కారణమన్నారు. శరీరాకృతి దెబ్బతింటుందనే అపోహలతో పిల్లలకు పాలివ్వక పోవడంవల్ల అనేక మంది మహిళలు 30 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉందన్నారు. ముందస్తు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చన్నారు. జాతీయ టీకాల కార్యక్రమంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చేర్చి బాలికలు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా నెలకోసారి రొమ్ము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలని, మార్పులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
రొమ్ములో ఏర్పడే కణతులన్నీ క్యాన్సర్లు కాదు..!
హస్తవాసి ఆంకాలజీ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. డిగ్రీ చదువుతున్నాను. నేను సొంతంగా నా రొమ్ములను పరీక్షించుకున్నప్పుడు రెండేళ్ల క్రితం నా కుడి వైపు రొమ్ములో వేరుశనగ కాయ పరిమాణంలో కణితి ఉన్నట్లు గమనించాను. ఆ కణితి చాలా నొప్పిగా ఉంటోంది. దాంతో నేను చాలా అసౌకర్యానికి గురవుతుండడంతో పాటు చదువుపై దృష్టి సారించలేకపోతున్నాను. నా సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే ఇబ్బంది పడుతున్నాను. ఇది రొమ్ము క్యాన్సరేమో అని చాలా భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన చూపించగలరు. - ఓ సోదరి మీ వయసులో రొమ్ములో కణితి (ఫైబ్రోడినోమా) ఏడ్పడటం సాధారణమైన సమస్య. రొమ్ములో ఏర్పడిన కణుతులు, చిన్న చిన్న గడ్డలు క్యాన్సర్లు కావు. ఇది ఒక వ్యాధి కాదు. కేవలం బ్రెస్ట్ డెవలప్మెంట్లో జరిగే సాధారణ పరిణామం మాత్రమే. కాబట్టి మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ సమస్యకు సరైన చికిత్స అవసరం. కొన్ని సాధారణ పరీక్షల ద్వారా వైద్యులు పూర్తిగా పరీక్షించి, ఆ కణితిని తొలగించాలా, వద్దా అని నిర్ధారిస్తారు. క్రమంగా కణితి పరిమాణం పెరుగుతూ ఉండటం, నొప్పి తగ్గకుండా స్థిరంగా ఉండడం, వైద్య పరీక్షల్లో క్యాన్సర్ సూచనలు కనిపించడం, రొమ్ము క్యాన్సర్ కలిగిన కుటుంబ చరిత్ర ఉన్న వారిలో శస్త్రచికిత్స నిర్వహించి రొమ్ములోని కణితి తొలగించవలసి ఉంటుంది. కణితి పరిమాణాన్ని బట్టి ఆపరేషన్ అవసరమా, కాదా అని వైద్యులు నిర్థారిస్తారు. ఒకవేళ ఆపరేషన్ అవసరమైనా మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తక్కువ గాటుతోనే సురక్షితమైన విధానం ద్వారా ఆపరేషన్ నిర్వహించవచ్చు. ఈ శస్త్ర చికిత్స జరిగిన రోజునే ఇంటికి పంపిస్తారు. రొమ్ము నుంచి కణితి తొలగించిన ప్రాంతంలో మాత్రం చిన్న మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా ఆ మచ్చను కూడా కనబడకుండా చేసే అవకాశం ఉంటుంది. ఫైబ్రోడినోమా (రొమ్ములో కణితి లేదా గడ్డ)కు పూర్తి స్థాయి చికిత్స పొందడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చు. -డాక్టర్ వి. హేమంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస ్టయశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 33. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుంటే బి.పి. 170/120 అని చెప్పారు. బి.పి.కి. మందులు వాడాలి అని చెప్పారు. మందులు వాడకుంటే ఫ్యూచర్లో ఏమైనా కిడ్నీ ప్రాబ్లం రావచ్చా? - సుకుమార్, వెంకటాపురం ఈ వయసులో ఏ కారణం లేకుండా బి.పి. (ఎసెన్షియల్ హైపర్ టెన్షన్) రావడం చాలా అరుదు. నలభై సంవత్సరాల లోపు బి.పి. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా చూడాలి. మీరు యూరిన్ టెస్ట్, ఆల్ట్రాసౌండ్ అబ్డామిన్తో పాటు అవసరమైన ఇతర టెస్ట్‌లు చేయించుకొని బి.పి. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బి.పి.కి తప్పనిసరిగా మందులు వాడాలి. లేకుంటే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మందులు వాడడమే కాకుండా ఉప్పు చాలా తగ్గించి తినాలి. క్రమం తప్పకుండా కనీసం ఒక గంట సేపు వాకింగ్ చేయడం మంచిది. మీరు ఉండాల్సిన . బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గించుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే మానివేయాలి. నా వయసు 58. నేను విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. వీటి కోసం ఎక్కువగా నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - సలీమ్, గుంటూరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇతర పద్ధతులతో (ఫిజియోథెరపీ)తో నొప్పి తగ్గించుకోవాలి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి తరచు జ్వరం వస్తోంది. డాక్టర్లు రాసిన మందులు వాడుతున్నంత సేపు తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి మాటిమాటికీ జ్వరం రావడంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - సుధ, భద్రాచలం చిన్నారులు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం చాలా సాధారణం. అందునా కాలం మారినప్పుడు (సీజనల్ వేరియేషన్స్) ఇన్ఫెక్షన్స్ఎక్కువగా రావచ్చు. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం రావచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలతో పాటు దీర్ఘకాలికమైన జబ్బులు ఏమైనా అంతర్గతంగా ఉన్నాయేమో అని వాటి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు - మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్ఎస్ఏఐడీ వంటివి చాలాకాలం పాటు వాడుతూ పోవడం చాలా అపాయకరం. అది సరైనదీ కాదు. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ అంశాలన్నీ చర్చించి, తగిన చికిత్స తీసుకోండి. మా పాప వయసు ఐదేళ్లు. ప్రతిసారీ చలికాలంలో పాప ఒళ్లంతా తెల్లటి పొడల్లాంటివి వస్తన్నాయి. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఇది తిరగబెడుతుందేమోనని మాకు ఆందోళనగా ఉంది. మాకు ముందుగానే కొన్ని సూచనలు చెప్పండి. - రవికాంత్, పాడేరు మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎగ్జిమా లేదా అలర్జిక్ డర్మటైటిస్ అని చెప్పవచ్చు. ఇందులో చర్మం ఎర్రబారడం, పొట్టులా రాలడం, విపరీతమైన దురదలు ఉంటాయి. కొంతమంది పిల్లల్లో చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా వాతావరణంలో తీవ్రత (అంటే మరీ ఎక్కువ వేడిమి, మరీ ఎక్కువ చలి) ఉన్న సమయంలో రావడాన్ని గమనిస్తాం. ఇలాంటి పిల్లలకు మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ శరీరంపై రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ అలర్జీ ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయే సమస్య కాదు. ముందుగా మీరు మీ పాపను మరీ తీవ్రమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో సమస్య తగ్గనప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మైల్డ్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. - డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పోరుకు జోయాలుక్కాస్ ‘థింక్ పింక్’
దుబాయ్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోయాలుక్కాస్ వరుసగా ఐదో సంవ త్సరం కూడా ‘థింక్ పింక్’ కార్యక్రమం కింద బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహనను కల్పించనుంది. దీని కోసం అక్టోబర్ నెలలో ‘చెక్ ఇట్, బీట్ ఇట్’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అస్టర్ డీఎం హెల్త్‌కేర్ సహకారాన్ని అందిస్తోందని జోయాలుక్కాస్ గ్రూప్ డెరైక్టర్ సోనియా జాన్‌పాల్ తెలిపారు. థింక్ పింక్ కార్యక్రమం వెనుక ఎలాంటి లాభపేక్ష లేదని, సేవాభావంతో చేస్తున్నామని పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన తీసుకురావడానికి జోయాలుక్కాస్ గత నాలుగేళ్లుగా చేస్తున్న కృషి అభినందనీయమని అస్టర్ డీఎం హెల్త్‌కేర్ డెరైక్టర్ అలిషా మూపెన్ ఈ సందర్భంగా తెలిపారు. -
బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనకోసం టోల్ ఫ్రీ..
చెన్నై: బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఒక టోల్ ఫ్రీ నెంబరును కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ ఇన్సిస్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రిసెర్చ్ గురువారం లాంచ్ చేసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి టోల్ ఫ్రీ నంబరును లాంచ్ చేశామని సంస్థ తెలిపింది. 1800 2700 703 అనే నంబరుకు కాల్ చేసి ఇంగ్లీషు, తమిళ భాషల్లో సమాచారాన్ని తెలుసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ డా. పి. గుహన్, తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణ మార్గాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సా పద్ధతులు మొదలైన వివరాలను తెలుసుకోవచ్చన్నారు. మనదేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనను అందించేందుకు వీలుగా ఈ టోల్ ఫ్రీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా గతంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించామన్నాని సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఇందులో రెండు లక్షలమందికి పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 56 మంది ఈ వ్యాధి బారిన పడ్డట్టు గుర్తించామని తెలిపారు. వ్యాధిపై పూర్తిగా అవగాహన లేకపోవడ వల్లే మరింత ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే చికిత్స చాలా సులభమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే దాదాపు అయిదు లక్షల పోస్టర్లను ముద్రిస్తున్నామన్నారు. దీంతో పాటు మహిళల కోసం ఈ నెలాఖరువరకు( అక్టోబర్ 31) ఉచిత మమ్మోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. -
మంచి నిద్ర పట్టాలంటే... అలా మాత్రం చదవకండి!
కొత్త పరిశోధన చాలామంది నిద్రపోయే ముందు ఏదైనా పుస్తకం చదువుతూ పడుకుంటారు. అయితే ఇటీవల పుస్తకాల స్థానాన్ని ఎలక్ట్రానిక్ రీడింగ్ డివెసైస్ ఆక్రమిస్తున్న విషయం తెలిసిందే. సంప్రదాయ పుస్తకాల స్థానంలో కంప్యూటర్లలో ఈ-బుక్స్, చదవడం కోసమే తయారైన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో నిద్రకు ముందు చదవడం అంత మేలు కాదంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. దీనివల్ల నిద్రపోయే ప్రక్రియకు విఘాతం కలుగుతుందన్నది వారి పరిశోధనల్లో తేలిన విషయం. ఎలక్ట్రానిక్ ఉపకరణం లేదా కంప్యూటర్ నుంచి వెలువడే వెలుగు వల్ల... నిద్ర దెబ్బతింటుందని వారు పేర్కొంటున్నారు. పైగా మామూలు పుస్తకాలకు బదులు ఎలక్ట్రానిక్ ఉపకరణంలో పుస్తకం చదివేవారికి... నిద్రపట్టడానికి పట్టే వ్యవధి పెరుగుతుందట. ఇలా నిద్రపోయిన వారు ఆ మర్నాడు సాయంత్రం పూట మత్తుగా జోగుతూ ఉంటారనీ, చురుగ్గా ఉండలేరనీ హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ చదివే ఉపకరణంతో వచ్చే వెలుగు వల్ల సర్కాడియన్ రిథమ్ దెబ్బతిని మెదడులో స్రవించాల్సిన మెలటోనిన్ పాళ్లలో మార్పులు వస్తాయి. దాంతో జీవనశైలి కూడా దెబ్బతి అది రొమ్ముక్యాన్సర్, పెద్దపేగు-మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి పెద్ద సమస్యలకూ దారితీసే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు ఈ పరిశోధ కులు. అందుకే రాత్రిపూట నిద్ర పట్టడానికి పుస్తకాన్ని చదివేవారు సంప్రదాయ పుస్తకాలను చదవడమే మేలని వారు సలహా ఇస్తున్నారు. -
క్యాన్సర్ కౌన్సెలింగ్
తగ్గిన వ్యాధి తిరగబెట్టే అవకాశముందా? మా అమ్మగారికి రొమ్ము క్యాన్సర్ ఉంది. ఆమెకు సర్జరీ చేసి, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చారు. ఆమెకు ‘టామోక్సిఫెన్ 20 ఎంజీ’ టాబ్లెట్లు వాడమని సూచించారు. దాంతో ఆమె గత ఐదేళ్లుగా ఆ టాబ్లెట్లు వేసుకుంటోంది. ఇప్పుడు బాగానే ఉంది. అయితే, మళ్లీ మరో ఐదేళ్ల పాటు అదే టాబ్లెట్లను కొనసాగించమని డాక్టర్ చెబుతున్నారు. ఇలా కొనసాగించడం సరైనదేనా? మాకు తగిన సలహా చెప్పండి. - ఎస్.ఆర్.వి., ఖమ్మం మీ అమ్మగారు చాలా మెరుగుపడ్డారని మీ లేఖ వల్ల తెలుస్తోంది. అందుకు చాలా సంతోషం. ఇక గతంలో మీరు రాసిన మందును ఐదేళ్ల పాటే వాడేవారు. కానీ మరో ఐదేళ్ల పాటు టామోక్సిఫెన్ 20 ఎంజీ వాడటం రోగికి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలా ఆ మందును పదేళ్లు వాడటం వల్ల అది రొమ్ముక్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా మరో 15 ఏళ్ల పాటు రక్షణ ఇస్తుంది. ఈలోపు మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించడం మంచిది. దీనివల్ల ఆమె గర్భసంచి, ఎండోమెట్రియమ్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. నాకు 2005లో రొమ్ముక్యాన్సర్ వచ్చింది. చికిత్స తర్వాత పూర్తిగా తగ్గింది. ఇటీవల నాకు వెన్నునొప్పి రాగా డాక్టర్గారికి చూపించుకున్నాను. వారు బోన్‌స్కాన్ పరీక్ష చేసి ‘ఎల్2’ వెన్నుపూసకు క్యాన్సర్ వ్యాపించినట్లు చెప్పారు. దాంతో నేను షాక్ అయ్యాను. ఇలా పదేళ్ల తర్వాత కూడా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందా? - ఒక సోదరి, మిర్యాలగూడ క్యాన్సర్లు ఏవైనా సరే... చికిత్స తర్వాత అవి ఐదేళ్లలోపు మళ్లీ తిరగబెట్టకుండా ఉంటే దాన్ని పూర్తిగా నయమైనట్లుగా డాక్టర్లు పరిగణిస్తారు. కానీ ఐదు శాతం కేసుల్లో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకే క్యాన్సర్ పూర్తిగా తగ్గిన రోగులైనా సరే... వారు ప్రతి ఐదేళ్లకోసారి క్యాన్సర్ సంబంధిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నాయా అని భౌతికంగా పరీక్షించి చూసుకోవడమే కాకుండా, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి వైద్య పరీక్షలూ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ శుభవార్త ఏమిటంటే... ఐదేళ్ల తర్వాత తిరగబెట్టిన క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా మళ్లీ నయం చేయవచ్చు. మీ విషయంలో ఎస్ఆర్ఎస్ (స్టీరియోస్టాటిక్ రేడియో సర్జరీ) అనే ప్రక్రియ ద్వారా ఒకే సిట్టింగ్‌లో మీకు రేడియేషన్ ఇచ్చి వ్యాధిని నయం చేసేందుకు అవకాశం ఉంది. -
ఎదలో విషపుగడ్డ!
బ్రెస్ట్ క్యాన్సర్ - జాగ్రత్తలు ప్రతి మహిళా జీవితంలో యుక్తవయసులోకి ప్రవేశించాక ఏదో ఒక దశలో రొమ్ముక్యాన్సర్ గురించి ఆందోళన పడుతుంది. రొమ్ముక్యాన్సర్ కుటుంబాన్ని తీవ్రమైన ఉద్వేగభరితమైన ఒత్తిడికి గురిచేసే అంశం. కానీ అతి త్వరగా కనుక్కుంటే నేడది పూర్తిగా తగ్గే క్యాన్సర్. పైగా రొమ్ము కోల్పోకుండానే ఇంతకు మునుపులాగే ఉండేలా చూడగలరు డాక్టర్లు. వ్యాధి ఆనవాళ్లు కూడా లేకుండా తగ్గించగల క్యాన్సర్ ఇది. అయినా ఆ వ్యాధిపై అనేక అపోహలు. వాటిని దూరం చేసుకొని, రొమ్ము క్యాన్సరపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. లక్షణాలు రొమ్ముకు సంబంధించినవి : రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు బాగా ముదిరిన దశలో రొమ్ముపై అల్సర్స్ రావడం. నిపుల్లో : రొమ్ముపై ర్యాష్ లేదా వ్రణాలు రావడం రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటి స్రావాలు రావడం. బాహుమూలాల్లో : చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలియడం భుజం వాపు కనిపించడం. నిర్ధారణ పరీక్షలు : ఎఫ్ఎన్ఏసీ అనే పరీక్ష మామోగ్రఫీతో పాటు ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ (ఈ చివరి పరీక్ష వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడం కోసం చేస్తారు). నివారణ : ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం ఒక మహిళ జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో మార్చలేని అంశాలు : వయసు, జెండర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో బాంధవ్యంలో దగ్గరితనం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. కానీ... మార్చుకోగల అంశాలు: ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, పోషకాహారం, అబార్షన్ల సంఖ్య. పై అంశాల ఆధారంగా ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని ‘పద్ధతులు’ (మోడల్స్) అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రాచుర్యం పొందిన పద్ధతే... ‘గేల్స్ మోడల్’. దీని సహాయంతో ప్రస్తుత వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సమయంలో రుతుక్రమం మొదలైంది, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, దగ్గరి బంధువుల్లో ఎంత మందికి రొమ్ముక్యాన్సర్ ఉంది లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేస్తారు. ఒక మహిళకు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉందని తేలితే... దాన్నిబట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు. అవి... పౌష్టికాహారం : ముదురు ఆకుపచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న అన్ని రకాల కూరగాయలు ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. వ్యాయామం : మహిళలంతా మరీ తీవ్రమైనవీ, మరీ తక్కువవీ కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాల వ్యవధిని 45 నిమిషాలకు పెంచుకుంటే రొమ్ముక్యాన్సర్ రిస్క్ మరింత తగ్గుతుంది. అదే కాస్త చిన్న వయసు పిల్లలైతే ఈ వ్యాయామ వ్యవధిని 60 నిమిషాలకు పెంచుకుని, అలా వారంలో కనీసం ఐదు రోజులైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి. మందులతో నివారణ : కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నా లేదా బీఆర్సీఏ అనే జన్యువులో మార్పు ఉన్నా టామోక్సిఫెన్, ర్యాలోక్సిఫీన్ వంటి మందులతో నివారించవచ్చు శస్త్రచికిత్సతో నివారణ : బీఆర్సీఏ అనే జన్యువులో మార్పులు ఉన్నట్లయితే ‘ప్రొఫిలాక్టిక్ మాసెక్టమీ’ అనే ముందస్తు శస్త్రచికిత్సతో రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు. స్వయం పరీక్ష : రొమ్ముక్యాన్సర్‌ను ఎవరికి వారే స్వయంగా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మహిళలు తమ రొమ్ములను స్వయంగా పరీక్ష చేసుకుంటూ రొమ్ములో ఏవైనా గడ్డలు చేతికి తగులుతున్నాయా, రొమ్ము ఆకృతిలో తేడా ఉందా, రొమ్ము నిపుల్ నుంచి ఏవైనా స్రావాలు వెలువడుతున్నాయా, నిపుల్ లోపలికి ముడుచుకుపోయి ఉందా, నిపుల్ మీద ర్యాష్ లేదా వ్రణాలు ఏవైనా ఉన్నాయా అని ఎవరికి వారే పరీక్ష చేసుకోవచ్చు. కాబట్టి ముందే కనుగొంటే ప్రాణాలనూ, దాంతో పాటే రొమ్మును పూర్తిగా కాపాడుకునేందుకు అవకాశం ఉన్న వ్యాధి ఇది. చికిత్స : రొమ్ముక్యాన్సర్‌కు ఈ రోజుల్లో శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఇక ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి ఈ శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యాధి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్క్రీనింగ్ సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎస్) బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు 50 - 70 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ప్రతి మూడేళ్ల కోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న మహిళలైతే మరింత తరచుగా ఈ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ముక్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు (అంటే అమ్మ, చెల్లెళ్లు, కూతుళ్లు) ఉంటే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. ఇక మహిళల్లోని జన్యువులైన బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5 శాతం మందిలో ఈ రెండు జన్యువుల్లో మ్యూటేషన్స్ (ఉత్పరివర్తన మార్పులు) చోటు చేసుకున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. - డాక్టర్ శ్రీకాంత్,సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్,యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
రొమ్ముక్యాన్సర్ కౌన్సెలింగ్
రొమ్ము క్యాన్సర్‌కు తప్పనిసరిగా రొమ్ము తొలగించాల్సిందేనా? రొమ్ము తొలగించకుండా చేసే ప్రక్రియ ఏదీ లేదా? - ధరణి, వరంగల్ రొమ్ము క్యాన్సర్ తొలి దశలో ఉన్నవారికి రొమ్మును తొలగించే మాసెక్టమీ అనే శస్త్రచికిత్సను తప్పక చేయాల్సిందే అనే నియమమేదీ లేదు. రొమ్మును తొలగించకుండానే చేసే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ (బీసీఎస్) చేస్తున్నారు. దీంట్లో రొమ్ములోని హానికరమైన క్యాన్సర్ గడ్డను మాత్రమే తొలగించి, ఆంకోప్లాస్టిక్ టెక్నిక్ (ఇదోరకం ప్లాస్టిక్ సర్జరీ) సహాయంతో రొమ్మును మునపటిలాగే కాపాడుతు న్నారు. కాబట్టి రొమ్ము తొలగించుకోవాల్సి వస్తుందే మోననే కాస్మటిక్ సంబంధిత భయాలు అక్కర్లేదు. మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు. నేను రొమ్ముక్యాన్సర్‌కు సర్జరీ చేయించుకున్నాను. కానీ నాకు సర్జరీ అన్నా కీమోథెరపీ అన్నా భయంగా ఉంది. అవేవీ లేకుండా మందులతో నా జబ్బు తగ్గే అవకాశం లేదా? - సుధ, చెన్నై చాలా రకాల క్యాన్సర్లకు కేవలం ఒకే చికిత్స ప్రక్రియ కాకుండా అనేక రకాల చికిత్స ప్రక్రియలను (మల్టీ మోడాలిటీ థెరపీ) అనుసరించాల్సి ఉంటుంది. అంటే సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రకమైన చికిత్స ప్రక్రియ అనుసరించాలన్నది రొమ్ము క్యాన్సర్ ఏ దశలో ఉందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీ చికిత్స సాధారణంగా రొమ్ముక్యాన్సర్ తొలిదశలో ఉన్నవారికి ఇస్తుంటారు. మరీ చిన్న వయసువారికీ, మరీ వయసు పైబడిన వారికి ఇది ఇవ్వరు. ఇక రేడియేషన్ థెరపీ అనేది ‘నోడ్ పాజిటివ్ డిసీజ్’ ఉన్నవారికి ఇస్తారు. డాక్టర్ వి.హేమంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
రొమ్ము క్యాన్సర్‌పై యుద్ధం
ఖైరతాబాద్: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ‘పింక్‌థాన్’ పేరుతో రన్ నిర్వహించారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో సాగిన రన్లో సుమారు ఏడు వేల మంది పాల్గొన్నారు. గతంలో ముంబ యి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహా నగరాల్లో ఈ తరహా మారథాన్ నిర్వహించామని తొలిసారి సిటీలో ఏర్పాటు చేసినట్టు ఎస్బీఐ సీజీఎం సి.ఆర్. శశికుమార్ తెలిపారు. రన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రన్లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి.రఘురామ్, ఫిట్నెస్ నిపుణుడు సోమన్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
మామోగ్రఫీ మరవొద్దు
డా.కె.ప్రవీణ్‌కుమార్ దాదిరెడ్డి బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ సర్జన్,కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ కాలమ్ రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎందుకు, ఎప్పుడు వస్తుందో కారణాలు తెలియడం లేదు. ఒకప్పుడు నలభై ఐదేళ్లు దాటితేగానీ మహిళల్లో రొమ్ము కేన్సర్ పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు ముప్ఫై దాటితే చాలు వస్తోంది. మన దేశంలో ఏటా రెండు లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోనూ రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది. ముఖ్యంగా రొమ్ము కేన్సర్ బాధితులు నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రొమ్ము కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొద్దిపాటి అవగాహన ఉంటే చాలని అంటున్నారు ప్రముఖ బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ సర్జన్ డా.కె.ప్రవీణ్‌కుమార్ దాదిరెడ్డి. ముప్పయ్ ఏళ్ల వయసు దాటితే చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చునని, ప్రాథమిక దశలో గుర్తించినా దాన్ని పూర్తిగా నిర్మూలించుకోవచ్చునని అంటున్నారు. కారణాలు తెలియకపోయినా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుందన్నదానికి ప్రధానంగా కారణాలు లేకపోవచ్చుగానీ, ఎక్కువగా వస్తుందన్నది మాత్రం తేటతెల్లమైంది. దీనికి గల కారణాలు పరిశీలిస్తే... - కుటుంబ చరిత్ర కారణంగా వచ్చే అవకాశాలున్నాయి. - పొగతాగడం, మద్యం సేవించే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశం. - చిన్నవయసులోనే పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది. - లేటు వయసులో అంటే 40-45 ఏళ్ల మధ్యలో బిడ్డలను కనడం వల్లకూడా వచ్చే అవకాశం. - కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడమూ ఒక కారణం. - పీరియడ్స్‌లో భారీగా మార్పులు చోటు చేసుకోవడం. - ప్రధానంగా ఈస్ట్రొజెన్ కొలెస్ట్రాల్ కారణంగా బ్రెస్ట్ కేన్సర్ వస్తున్నట్టు స్పష్టం. ఏడాదికో 15 నిముషాలు.. - 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి మామోగ్రఫీ టెస్టు చేయించుకోవాలి. - ఈ టెస్టు చేయించుకోవడానికి 15 నిముషాలు పడుతుంది. దీనికి రూ.1,500 ఖర్చవుతుంది. దీనివల్ల రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది. - రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉండే డిజిటల్ మామోగ్రఫీ టెస్టులు వచ్చాయి. - చంటిబిడ్డలకు తల్లి ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల కొంతవరకూ రొమ్ము కేన్సర్‌ను నివారించుకోవచ్చు. - ముప్ఫై ఏళ్లు దాటిన మహిళలు తరచూ రొమ్ములో వచ్చే మార్పులను గమనించాలి. గడ్డలు, చర్మం రంగుమారడం, మచ్చలు వంటి మార్పులు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. - దీనివల్ల ప్రాథమిక దశలోనే రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది. - ప్రాథమిక దశలో ఉన్న రొమ్ము కేన్సర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెస్ట్‌ను తొలగించకుండా నయం చేసే అవకాశాలున్నాయి. - బీఆర్సీఏ జీన్ టెస్టింగ్ అనే పద్ధతి ఇప్పుడు రొమ్ము కేన్సర్ నివారణలో కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. - క్రమం తప్పకుండా మామోగ్రఫీ చేయించుకుంటే రొమ్ము కేన్సర్‌ను సులభంగా గుర్తించడం, నివారించుకోవడం సాధ్యమవుతుంది. -
కేన్సర్‌పై సర్కార్ ప్రచారం!
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 7 నుంచి అవగాహన వారోత్సవాలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నవంబర్ 7 నుంచి ఏడు రోజులపాటు జరిగే కేన్సర్ అవగాహన వారోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. అదేరోజు రాష్ట్రంలోని 436 మండల కేంద్రాల్లో రొమ్ము కేన్సర్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఏర్పాట్లు చేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలకు బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. 800 మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ.. 18 వేల గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తల ద్వారా మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన సుమారు 800 మంది అరోగ్య కార్యకర్తలకు నవంబర్ 2న హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. దృశ్య, శ్రవ ణ సాధనాల(ఆడియో, వీడియో సీడీల)తో ఆరోగ్య స్పృహ, కేన్సర్‌ను తొలిదశలో గుర్తించడం గురించి నిపుణులు వివరిస్తారు. అంతేకాకుండా కేన్సర్ తొలిదశను నిర్ధారించేందుకు క్లినికల్ టెస్ట్ ఎలా చేయాలో కూడా వీరికి నేర్పిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఆరోగ్య కార్యకర్తలు ముగ్గురు చొప్పున బృందాలుగా ఏర్పడి, మహిళలకు కేన్సర్‌పై అవగాహన కల్పించడంతోపాటు అవసరమైనవారికి క్లినికల్ టెస్ట్‌లు కూడా చేస్తారు. క్లినికల్ టెస్ట్ ద్వారా రొమ్ములో ఏవైనా గడ్డలు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆపై పరీక్షలు, వైద్య చికిత్సల నిమిత్తం ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. -
అవగాహనే అసలు మందు
న్యూఢిల్లీ:పదహారేళ్ల యువతి మొదలుకొని 60 ఏళ్ల వృద్ధురాలి వరకు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ సోకిందా లేదా అని నిర్ధారించే వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నా వాటి గురించి మహిళలకు సరైన అవగాహన లేకపోవటంతో వ్యాధి ముదిరిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించే మామోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పరీక్షకు రూ.2,500 తీసుకుంటుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగానే ఆ సేవలు లభ్యమవుతున్నాయి. మామోగ్రఫీతో ఉపయోగాలు... మామోగ్రఫీ ఎక్సరే మిషన్‌తో రొమ్ములో రెండు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో గడ్డలు ఉన్నా గుర్తించవచ్చు. తద్వారా రేడియేషన్, ఆపరేషన్ లాంటివి లేకుండా వైద్యం ద్వారా కొద్దిరోజుల్లోనే వ్యాధిని తగ్గించవచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షల మందికి మామోగ్రామ్ పరీక్ష చేశారు. వీరిలో 30శాతం మందికి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. జన్యులోపాలవల్ల, వంశపారంపర్యంగా, ఇన్ఫెక్షన్ల వల్ల, ఒక్కోసారి ఎలాంటి కారణం లేకుండానే రొమ్ములో గడ్డలు ఏర్పడతాయి. రొమ్ములో ఉండే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. అయితే అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవటం ద్వారా నిర్ధారించుకోవచ్చు. గ్రామస్థాయిలో ఉండే వైద్య సిబ్బంది యువతులకు రొమ్ము క్యాన్సర్ అవగాహన కల్పించాల్సి ఉంది.అవగాహన కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు పనిచేసే కార్యాలయాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. -
రొమ్ము కేన్సర్‌కు ‘యోగా’తో మేలు
వాషింగ్టన్: ఐదు వేల సంవత్సరాల క్రితమే భారతీయ వైద్య విధానాల్లో మంచి ఫలితాలు చూపించిన యోగా.. రొమ్ము కేన్సర్ బారిన పడ్డ మహిళలకూ బాగా పనిచేస్తుందని ఓ సరికొత్త అధ్యయనం వెల్లడించింది. రొమ్ము కేన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ చేయించుకుంటున్న మహిళలు యోగా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. వీరు తేలికపాటి యోగా ఎక్సర్సైజ్లు చేయడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్‌ను నియంత్రించవచ్చని తమ అధ్యయనంలో తేలిందన్నారు. శ్వాస నియంత్రణ, ధ్యానం, ఇతర ఉపశమన విధానాలను పాటించడం వల్ల వీరు దైనందిన కార్యకలాపాలను సులువుగా చేసుకోవచ్చని, దీంతోపాటు ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. ట్రీట్మెంట్ సమయంలో యోగా చేసినవారు మంచి ఫలితాలు సాధించారని పరిశోధకులు చెప్పారు. మనసుకు, శరీరానికి ఉన్న సంబంధాలను శాస్త్రీయంగా అంచనా వేసే ఎండీ అండర్సన్ కేన్సర్ సెంటర్ (యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్) ఈ అధ్యయనం చేసింది. దీన్ని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించారు. -
సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇలా!
బిఎస్ఇ అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇరవై ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ నెలకోసారి బిఎస్ఈ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా పసిగట్టి, వ్యాధి ముదరకముందే చికిత్స చేయించుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. 1.అద్దం ముందు నిలబడి చేతులను తల వెనకకు పెట్టి బ్రెస్ట్ ఆకారాన్ని గమనించాలి. 2.చేతులను నడుము మీద పెట్టి, భుజాలను లోపలికి కుదించి, మోచేతులను దేహం ముందు వైపుకు తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు బ్రెస్ట్స్ కదులుతాయి, ఆ కదలికలను బట్టి కండరాల్లో మార్పులు ఉన్నాయేమో గమనించాలి. 3.రొమ్ముల పై భాగం, చుట్టూ, చంకల కింద కూడా నొక్కి చూడాలి. 4.ఇప్పుడు నిపుల్స్ మెల్లగా నొక్కి పాలలాగ లేదా నీటిలాగ ద్రవం విడుదలవుతుందేమో చూడాలి. 5.తర్వాత వెల్లకిలా పడుకుని చేతివేళ్లతో బ్రెస్ట్‌ను తాకుతూ పరీక్షించుకోవాలి. పడుకున్నప్పుడు తలకింద దిండు ఉండకూడదు. మడతపెట్టిన టవల్‌ను భుజాల కింద ఉంచుకోవాలి. ఈ స్థితిలో రొమ్ముల కండరాలు పక్కటెముకల మీద విస్తరించినట్లు పరుచుకుంటాయి. దాంతో లోపల చిన్న గడ్డలాంటిది ఉన్నా వెంటనే తెలిసిపోతుంది. ఎప్పుడు పరీక్షించుకోవాలి? రుతుక్రమం పూర్తయిన తొలిరోజున చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీరియడ్స్ మొదలయ్యే సమయంలో సాధారణంగానే రొమ్ములలో చిన్నపాటి గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుక్రమం మొదలైన మూడు నాలుగు రోజుల్లో కరిగిపోతాయి. ఆ తర్వాత కూడా ఏదైనా లంప్ తగిలితే అది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సూచిక అయి ఉండవచ్చు. కాబట్టి ఓసారి డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవాలి. అలాగే... నిపుల్స్ నుంచి పాలలాగ ద్రవం విడుదలవుతున్నా, రొమ్ములలో వాపును గమనించినా, చర్మం మీద దురద పెడుతున్నా, బుడిపెలాంటిది ఏర్పడినా, నిపుల్స్‌లో నొప్పి, ఎరుపుదనం, లోపలికి ముడుచుకుపోవడం వంటి లక్షణాలను గమనించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. -
పురుషుల్లో రొమ్ము క్యాన్సర్...
సాధారణంగా రొమ్ముక్యాన్సర్ అన్నది పురుషులకు రాదని ఒక అపోహ. ఇది అరుదైన వ్యాధే అయినా పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అయితే సమాజంలో దీనిపై అంతగా అవగాహన లేదు. కారణం... పురుషుల్లో అది వచ్చేందుకు ఆస్కారమే లేదన్న భావన. కానీ 10000 మందిలో ఐదుగురికి వచ్చే ఆస్కారం ఉంది. పురుషుల్లో వచ్చే రొమ్ము కాన్సర్పై అవగాహన కోసం ఈ కథనం. మనందరిలో ఉండే సాధారణ అభిప్రాయం ప్రకారం మహిళల్లోనే బ్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు పురుషుల్లో ఇది ఎందుకు వస్తుంది. ఎందుకంటే... పాలిచ్చి పెంచేది తల్లి కాబట్టి ఒక దశ తర్వాత హార్మోన్ల కారణంగా మహిళల్లో బ్రెస్ట్ అభివృద్ధి జరుగుతుంది. కానీ భవిష్యత్తులో రొమ్ముగా అభివృద్ధి చెందాల్సిన కణజాలం మాత్రం చిన్నప్పుడు స్త్రీపురుషులిరువురిలోనూ ఉంటుంది. పురుషుల్లోనూ రొమ్ము సమస్యలుంటాయా? రొమ్ముకు సంబంధించిన సమస్యలు పురుషుల్లో ఉండవనేది సాధారణ అభిప్రాయం. కానీ రొమ్ముకు సంబంధించిన అనేక సమస్యలు పురుషుల్లోనూ కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మహిళల్లోలాగే పురుషుల్లోనూ క్యాన్సర్‌కు సంబంధించని హానికరం కాని (బినైన్) గడ్డలు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో దీనికి ఎలాంటి చికిత్సా అవసరం లేకపోయినా, కొన్ని సందర్భాల్లో చిన్న శస్త్రచికిత్సతో దాన్ని సరిచేయవచ్చు. కొంతమంది పురుషుల్లో... మహిళల్లోలాగే రొమ్ము పెరగడం కనిపిస్తుంది. దీన్నే ‘గైనకోమాస్టియా’ అంటారు. ఈ కండిషన్ ఉన్న పురుషుల్లో సాధారణం కంటే రొమ్ములు కాస్త ఎత్తుగా కనిపిస్తుండటంతో ఆత్మన్యూనతకు గురవుతుంటారు. రొమ్ముక్యాన్సర్‌లో లాగే... గైనకోమాస్టియాలోనూ నిపుల్ కింద ఒక బటన్‌లా కండ అభివృద్ధి చెందుతుంది. అయితే అది క్యాన్సర్‌కు సంబంధించిందా లేక హానికరం కాని సాధారణ కండా అన్నది డాక్టర్లు తేలిగ్గా గుర్తిస్తారు. గైనకోమాస్టియా సమస్య సాధారణంగా యుక్తవయసులోకి ప్రవేశిస్తున్న సమయంలో యువకుల్లో ఎక్కువ. ఆ సమయంలో వారిలో మహిళలకు సంబంధించిన హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ స్రవించడం వల్ల ఈ కండిషన్ అభివృద్ధి అవుతుంది. నిజానికి పురుషులందరిలోనూ ఆ సమయంలో ఈస్ట్రోజెన్ స్రవించినా... అది రొమ్ముల పెరుగుదలను ప్రేరేపించేంతగా ఉండదు. కానీ కొందరిలో ఊబకాయం ఉంటుంది. వారిలో ఈస్ట్రోజెన్ పెరిగి అది కూడా పురుషుల్లో రొమ్ముల పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే అల్సర్లను తగ్గించేవి, ఛాతీలో మంటను ఉపశమింపజేసేవి, బీపీకి, గుండెజబ్బులకు వాడే కొన్ని మందులు వాడకం కూడా పురుషుల్లో రొమ్ముల పెరుగుదలకు దారితీయవచ్చు. ఈ తరహా రొమ్ము పెరుగుదల పురుషుల్లో ఎలాంటి తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీయదు. అయితే... క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ అనే ఒకింత అరుదైన జన్యుసంబంధిత వ్యాధిలో పెరిగే పురుషుల రొమ్ము విషయంలో మాత్రం అది రొమ్ముక్యాన్సర్గా పరిణమించే రిస్క్ కాస్తంత ఎక్కువ. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎవరిలో ఎక్కువ... సాధారణంగా పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ అరుదుగా వచ్చేదే అయినా... 35 ఏళ్లు దాటని వారిలో కనిపించడం మాత్రం మరీ అరుదు. చాలా సాధారణంగా అది 60 - 70 ఏళ్ల వయసులో ఉన్న పురుషుల్లో ఎక్కువగా కనిసిస్తుంటుంది. మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌కు కారణాలు నిర్దిష్టంగా తెలిసినట్లుగా, పురుషుల్లో తెలియవు. అయితే కొన్ని వాతావరణ ప్రభావాలు, కొంత జన్యుపరమైన అంశాలు పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని ప్రస్తుత అధ్యయనాల వల్ల తెలుస్తోంది. ఇక మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రవించడం చాలా తక్కువ అన్న విషయం తెలిసిందే. అయితే కొందరిలో కొన్ని తెలియని కారణాలతో సాధారణ స్థాయికంటే ఈస్ట్రోజెన్ స్రావం మరింత ఎక్కువగా జరుగుతుంది. ఇది రొమ్ముక్యాన్సర్‌కు ఒక కారణం కావచ్చనేది కొన్ని అధ్యయనాల వల్ల తేలింది. అయితే ఈ అంశాన్ని గైనకోమాస్టియాతో ముడిపెట్టకూడదు. గైనకోమాస్టియా అన్నది ఎలాంటి ప్రాణాపాయం లేని సాధారణ కండిషన్. ఇందులో కేవలం రొమ్ము పెరుగుదల కాస్మటిక్‌గా మాత్రమే ఇబ్బందికరం. పురుషుల్లో ఈస్ట్రోజెన్ పెరుగుదల ఉన్నప్పుడు కనిపించే రొమ్ముక్యాన్సర్ చాలా అరుదు అని మాత్రం గుర్తుంచుకోవాలి. పురుషుల్లో రొమ్ముక్యాన్సర్‌కు కారణాలు ఛాతీ ఎక్స్-రేలు ఎక్కువసార్లు తీయించుకున్న మెడికల్ హిస్టరీ. ఊబకాయం ఎక్కువ ఉండి, ఈస్ట్రోజెన్ స్రావం పెరిగి ఉన్న మెడికల్ హిస్టరీతో... రొమ్ముపెరుగుదలకు దోహదపడే కొన్నిరకాల మందులను చాలా దీర్ఘకాలం వాడటం. క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ తీవ్రమైన కాలేయ వ్యాధులు, సిర్రోసిస్ (అదుపు లేకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే సిర్రోసిస్తోపాటు వైరల్ హెపటైటిస్ కూడా రొమ్ముక్యాన్సర్‌కు కారణం కావచ్చు). ఊ వృషణాలకు వచ్చే కొన్ని రకాల వ్యాధులు ఉదాహరణకు మంప్స్ ఆర్కయిటిస్, వృషణాలకు దెబ్బతగలడం వల్ల తీవ్రంగా గాయపడటం. కొందరిలో పిల్లాడు పుట్టిన వెంటనే వృషణాల సంచిలోకి రావాల్సిన వృషణాలు కిందికి దిగకుండా కడుపులోనే ఉండిపోతాయి. ఆ కండిషన్‌ను అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇది కూడా క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కుటుంబంలో పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ చరిత్ర ఉండటం కూడా రొమ్ముక్యాన్సర్‌కు ఒక కారణం కావచ్చు. పురుషుల్లో రొమ్ముక్యాన్సర్... మహిళల్లో కంటే తీవ్రమా...? పురుషుల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్... మహిళల్లో కంటే తీవ్రమైనది ఇప్పటివరకూ డాక్టర్లు సైతం భావించేవారు. కానీ దీనిపై పరిశోధనలు కొనసాగుతున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో భావించినట్లుగా స్త్రీల కంటే ఇది తీవ్రమైనది కాదన్నది కొత్త పరిశోధనలు చెబుతున్న సత్యం. కాకపోతే దాన్ని ముందుగా కనుక్కోవడం అన్నది చాలా ముఖ్యం. అప్పుడు చికిత్సానంతర ఫలితాలు స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఒకేలా ఉంటాయన్నది ఇప్పుడు డాక్టర్లు ఇస్తున్న భరోసా. పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ లక్షణాలు... సాధారణంగా రొమ్ముక్యాన్సర్‌లో క్యాన్సర్ గడ్డ గట్టి (ఫర్మ్)గా, ఒక గడ్డ (లంప్) మాదిరిగా నిపుల్ కింద ఉంటుంది. సాధారణంగా ఇందులో నొప్పి ఉండదు. కొందరిలో నిపుల్ భాగంలో అంతకు ముందు ఉన్న రంగులో మార్పు కనిపిస్తుంది. దాంతోపాటు నిపుల్లో మరికొన్ని గమనించ మార్పులు సైతం కనిపించవచ్చు. ఉదాహరణకు... నిపుల్ భాగం పుండులా కనిపించడం (అల్సరేషన్), అక్కడ గుంటలా పడటం (డింప్లింగ్), ఎర్రబారి పొలుసులు పొలుసులుగా కనిపించడం (స్కేలింగ్), నిపుల్ లోపలి వైపునకు తిరిగినట్లుగా (రిట్రాక్షన్) అనిపించవచ్చు . రొమ్ముభాగం నుంచి రక్తస్రావం. కొందరిలో అది రక్తంలా కాకుండా పారదర్శకంగా లేని (ఒపాక్) సాంద్రమైన స్రావంలా ఉండవచ్చు. ఈ లక్షణం ఉన్నవారిలో సైతం చాలా అరుదుగా (ఒక శాతం కంటే తక్కువ మందిలో) ఈ స్రావాలు రెండువైపులా (ఇరు రొమ్ముల్లోనూ) కనిపించవచ్చు. పై లక్షణాలతోపాటు ఇరువైపులా ఉండే బాహుమూలాల్లో దేనిలోనైనా గడ్డ (లంప్) కనిపించవచ్చు. ఊ సాధారణంగా క్యాన్సర్‌కు పాకే లక్షణం ఉంటుందన్న విషయం తెలిసిందే. అది ఆవిర్భవించిన చోటు నుంచి వేరే అవయవాలకు పాకడాన్ని మెటస్టాటిస్ అంటారు. ఒకవేళ అది రొమ్ము నుంచి సమీపంలోని ఎముకలకు పాకితే... ఆ ఎముకల్లో నొప్పి కనిపిస్తుంది. ఇక అన్ని రొమ్ముక్యాన్సర్ల మాదిరిగానే ఇందులోనూ నీరసం, బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఒకవేళ అది రొమ్ముకే పరిమితం కాకుండా పక్క అవయవాలకు పాకితే... అది విస్తరించిన అవయవాన్ని బట్టి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. చికిత్స: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ విషయంలోలాగే, పురుషుల రొమ్ము క్యాన్సర్‌నూ అది ఉన్న దశ ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. సాధారణం చికిత్స విషయంలో మహిళల, పురుషుల రొమ్ముక్యాన్సర్లలో తేడా ఉండదు. శస్త్రచికిత్స: ఒకవేళ పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్నట్లు తేలితే... ఆ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. ఛాతీలోని రొమ్ముభాగాన్ని, దాని పొరలను (లైనింగ్‌లను) తొలగించే ప్రక్రియను రాడికల్ మాసెక్టమీ అంటారు. ఇతర థెరపీలు: సాధారణంగా శస్త్రచికిత్స తర్వాత చేయాల్సిన ఇతర థెరపీలు (అడ్జువెంట్ థెరపీ) చేస్తుంటారు. ఇవి మందుల ద్వారా చేసే కీమోథెరపీ, రేడియేషన్ ద్వారా క్యాన్సర్ కణాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని కాల్చివేసే రేడియోథెరపీ, నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను మాత్రమే తుదముట్టించే టార్గెటెడ్ థెరపీ, అవసరాన్ని బట్టి హార్మోన్ థెరపీ వంటివి చేస్తారు. ఒకవేళ అప్పటికే క్యాన్సర్ పక్క అవయవాలకూ పాకితే (మెటాస్టాటిస్ దశకు చేరితే) అప్పుడు కీమోథెరపీతో పాటు, హార్మోన్ థెరపీ... ఈ రెండూ ఒకేసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగాక మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే కొత్తరకాల మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. నయమయ్యే అవకాశాలు (ప్రోగ్నోసిస్) పూర్తిగా నయమయ్యే అవకాశం అన్నది క్యాన్సర్‌ను ఏ దశలో గుర్తించారన్న అంశంతో పాటు అది ఏ తరహాకు చెందినది అనే దానిపై కూడా ఆధాపడి ఉంటుంది. ఇక దాంతోపాటు రోగి వయసు కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. - నిర్వహణ: యాసీన్ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు... పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు సైతం... మహిళల్లో నిర్వహించే పరీక్షలనే చేస్తారు. ఊ తొలుత బాహ్యలక్షణాలను, కుటుంబ, ఆరోగ్యచరిత్రలను చూస్తారు. లంప్‌ను పరీక్షించడం, దాన్ని స్పర్శించడం ద్వారా అది ఏమైనా అసాధారణంగా కనిపిస్తుందా, అనారోగ్యాలను కల్పిస్తుందా అన్న అంశాలను పేషెంట్‌ను అడిగి తెలుసుకుంటారు. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్ (సీబీఈ): రొమ్ము, ఆ పరిసర ప్రాంతాల్లో గడ్డను శ్రద్ధంగా పరిశీలిస్తూ... అసాధారణ అంశాలు ఏవైనా ఉన్నాయేమో చూడటం ద్వారా. అల్ట్రాసౌండ్ స్కానింగ్: రొమ్ములోని కణజాలంపై శబ్దతరంగాలను ప్రసరింపజేయడం ద్వారా నిర్వహించే ఈ పరీక్షలో, ఆ తరంగాల ప్రతిధ్వనితో ఏర్పడ్డ ప్రతిబింబం చిత్రాన్ని (పిక్చర్‌ను) పరిశీలించడం ద్వారా. బ్లడ్ కెమిస్ట్రీ స్టడీస్: రక్తంలోని కొన్ని పదార్థాల పాళ్లను పరిశీలించడం ద్వారా. (అంటే అవి నార్మల్‌గా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండటాన్ని పరిశీలించడం ద్వారా). బయాప్సీ: రొమ్ములోని గడ్డలో కొంతభాగాన్ని సేకరించి, దాన్ని మైక్రోస్కోపిక్‌గా, ఇతరత్రా పాథాలజిస్టులు పరీక్షించి చూడటం ద్వారా. ఇందులో రకరకాల పరీక్షలు ఉంటాయి. ఫైన్-నీడిల్ యాస్పిరేషన్ (ఎఫ్ఎన్ఏ) బయాప్సీ : ఇందులో సూది సహాయంతో క్యాన్సర్‌గా అనుమానిస్తున్న గడ్డలో కొంత భాగాన్ని లేదా అందులోని ద్రవాన్ని సేకరించి పరీక్షిస్తారు. కోర్ బయాప్సీ: ఇందులో కాస్తంత పెద్ద సూదితో కొంత కణజాలాన్ని సేకరించి పరీక్షిస్తారు. ఎగ్జిషనల్ బయాప్సీ: ఇందులో గడ్డ పూర్తి భాగాన్ని తొలగించాక పరీక్షించి, వ్యాధి నిర్ధారణ చేస్తారు. - డాక్టర్ ఉదయరాజు హేమంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ యశోదా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, యశోదా హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మీ మద్దతుతో ఎనలే ని ఉత్సాహం: మిలింద్
ముంబై: రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పింకథాన్ ర్యాలీలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని మద్దతు పలకడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ పేర్కొన్నాడు. నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన పింకథాన్ ర్యాలీకి హాజరైన సందర్భం గా మాట్లాడుతూ ఇకపైకూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నాడు. కాగా ఈ పింకథాన్‌లో దాదాపు మూడువేల మంది మహిళలు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న వారిలో వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన ఉద్యోగినులు, కళాశాలల విద్యార్థినులు, నర్సులు, మహిళా వైద్యులు ఉన్నారు. ఈ కార్యక్రమం హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మేక్సిమస్ ఎంఐసీఈ అండ్ మీడియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. బాలీవుడ్ తారలు గుల్‌పనగ్, మిలింద్ సోమన్, అల్ట్రా మారథానర్ దినేష్ మాధవన్‌లు పచ్చజెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. పది కిలోమీటర్ల పరుగులో జయశ్రీబోర్గి విజయకేతనం ఎగురవేయగా, ద్వితీయ, తృతీయ రన్నరప్‌లుగా సునీతా వాగ్మోడే, శ్వేతాదేవరాజ్లు నిలిచారు. ఇది ఐదుకిలో మీటర్ల పరుగులో జ్యోతి పంజాబీ తొలిస్థానంలో నిలిచారు. ఈ ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. -
`అనాస్ట్రోజోల్` తో బ్రెస్ట్ కేన్సర్ నివారణ
సిడ్నీ: మహిళలలో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ కేన్సర్ కు ఔషధాన్ని కనుగొన్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. ఈ ఔషధంలో బ్రెస్ట్ కేన్సర్ ను నివారించే గుణం ఉందంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిశోధనలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన ప్రొపెసర్ క్రిస్టోబెల్ సాండర్స్ నేతృత్వంలో పరిశోధకుల బృందం ఈ ఔషధాన్ని తయారుచేసింది. ఈ ఔషధం పేరు `అనాస్ట్రోజోల్'`. దీంతో బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న చాలామంది మహిళలకు ఈ ఔషధం ఉపయోగరమని పేర్కొంది. ఈ ఔషధంలో కొన్ని దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉన్నా.. అదనపు ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధన విభాగం తెలిపింది. బ్రెస్ట్ కేన్సర్ బాధిత కుటుంబాలనుంచి వచ్చిన వందలాది మంది మహిళలు పరిశోధనలో పాల్గొన్నారు. పరిశోధన ప్రకారం.. ఈ అనాస్ట్రోజోల్ ఔషధాన్ని తీసుకున్న మహిళకు ఐదుసంవత్సరాలలో మళ్లీ కేన్సర్ వచ్చే అవకాశం 50 శాతం వరకూ తగ్గుతుందని వెల్లడించింది. ఈ ఔషధంతో భవిష్యత్తులో తరాల మహిళలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని క్రిస్టోబెల్ సాండర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. -
డిజిటల్ 3డి మామోగ్రఫీతో రొమ్ముక్యాన్సర్‌ను ముందే గుర్తించండి!
రొమ్ముక్యాన్సర్ అంటే గతంలో ఒక ఆందోళన. బిడ్డకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని సమకూరుస్తూ, స్త్రీత్వానికి ప్రతీకగా నిలుస్తూ పరిపూర్ణనిచ్చే రొమ్ముకు అనారోగ్యం వస్తే గుండెకే గాయం అయినట్లవుతుంది. ఆ గాయాలు గడ్డల రూపంలో, కణుతుల రూపంలో ఉంటాయి. వాటిని తొలిదశలోనే గుర్తిస్తే ... అవి ఒకవేళ రొమ్ము క్యాన్సర్ రూపాన్ని సంతరించుకున్నా సరే పూర్తిగా తగ్గిపోతాయి. ఇక ఇలా రొమ్ముక్యాన్సర్నుంచి ప్రాణాపాయం తప్పడం అనే ప్రధాన వరం దక్కాక, మరో చిన్న అనుగ్రహమూ చిక్కితే బాగుంటుందనే ఆశ. అదే రొమ్మును తొలగించకుండా దాన్ని యథాతథంగా ఉంచడమనే కోరిక. ఇలా ఆరోగ్యమూ అందమూ... ఈ రెండూ దక్కాలనే ఆకాంక్ష. ఆ ఆశా, ఆకాంక్షా నెరవేరే రోజులు వచ్చేశాయి. ఇప్పుడు క్యాన్సర్‌కు శస్త్రచికిత్స, అందాన్ని పరిరక్షించే మేలుచికిత్సా ఒకేసారి దక్కే అవకాశాలు విచ్చేశాయి. దీన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. దీనికి మనం చేయాల్సిందేమిటి? ముందుగా తెలుసుకొని, సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే రొమ్ముక్యాన్సర్‌పై, రొమ్ములోని గడ్డలపై తిరుగులేని పోరాటం చేయడమే. రొమ్ములో గడ్డలనే ఆ శత్రువులను తెలుసుకోడానికి ఇప్పుడు మరింత మెరుగైన ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. అవే... డిజిటల్ మామోగ్రాఫీ. మామోగ్రఫీ మునుపు కూడా ఉన్న పరిజ్ఞానమే. దీనికి మరింత ఆధునిక సాంకేతికత తోడై... బ్రెస్ట్ టోమోసింథసిస్ / 3డి మామోగ్రాఫీ అనే అత్యంతాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒమెగా హాస్పిటల్స్‌లో నెలకొల్పిన ఈ అత్యాధునిక ఉపకరణంతో సంప్రదాయ పద్ధతుల్లో కంటే మరింత ముందుగానే గడ్డను చూడవచ్చు. దాని పరిణామాన్ని ముందుకంటే ప్రభావపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఫలితంగా రొమ్ములో కేవలం క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాన్ని తొలగించడానికి వీలవుతుంది. పక్కనున్న కణజాలం క్యాన్సర్ గడ్డతో కలగలసి పోయి, రెండింటినీ స్పష్టంగా, నిర్దిష్టంగా గుర్తించలేని పరిస్థితి పూర్తిగా తొలగిపోయి, కాన్సర్ గడ్డ, కణితి ఉన్న భాగం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో చికిత్స మరింత సులువుగా, సమర్థంగా, ప్రభావపూర్వకంగా అవుతుంది. దాంతో గతంలోలా వ్యాధి తిరగబెట్టడానికి ఉండే అవకాశాలు 30 శాతం తగ్గుతాయంటేనే అర్థం చేసుకోవచ్చు... గతం కంటే ఇప్పుడు పరిస్థితి ఎంతగా మెరుగుపడిందో! డిజిటల్ మామోగ్రఫీ గురించి తెలుసుకునే ముందు అసలు మామోగ్రఫీ ఎన్ని రకాలో చూద్దాం. మొదటిది ఇంతకు ముందూ అందుబాటులో ఉన్న సంప్రదాయ స్క్రీన్ మామోగ్రఫీ, రెండోది 2-డి మామోగ్రఫీ, మూడోది 3-డి మామోగ్రఫీ. డిజిటల్ మామోగ్రఫీ ఎంత మెరుగైనదంటే... గతంలో రొమ్ము పరీక్ష చేసే సంప్రదాయ మామోగ్రఫీతో పోలిస్తే డిజిటల్ మామోగ్రఫీతో ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దాం. ఇప్పటివరకూ మనం తీస్తూ వచ్చిన సంప్రదాయ స్క్రీన్ మామోగ్రఫీలో గడ్డలు లేదా కణుతుల సైజు 9 మి.మీ. కంటే ఎక్కువగా ఉంటేనే అవి తెలుస్తాయి. పైగా స్క్రీన్ తీసే ప్రక్రియలో విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ. ఒకవేళ మొదటిసారి తీసింది అంత బాగా రాకపోతే మళ్లీ మళ్లీ తీయల్సి వచ్చేది. దీన్ని ఎంత సైజ్ కావాలో అంతగా పెంచి చూడటానికి వీలయ్యేది కాదు. నలభై లోపు వయసున్న మహిళల్లో ఉపయోగించడానికి సరికాదు. అంటే మెనోపాజ్ కంటే ముందుగా లేదా ఆ ప్రాంతంలో ఉన్న మహిళలపై దీన్ని ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు. అయితే ఇక డిజిటల్ మామోగ్రఫీ (2డి మామోగ్రఫీ) విషయానికి వస్తే పైన పేర్కొన్న పరిమితులన్నింటినీ అది అధిగమించగలదు. అయితే ఇందులో గడ్డ తాలూకు చిత్రం కేవలం పరిమాణం తెలుసుకోడానికే వీలవుతుంది తప్ప... దాని 3-డి ప్రతిబింబం కనిపించదు. పైగా ఏదో ఒక వైపు నుంచి చూస్తే కనిపించే దృశ్యమే తప్ప... అన్ని కోణాల్లోనూ గడ్డ/కణితి ఎలా కనిపిస్తుందో తెలిసే అవకాశం ఉండదు. అయితే 3-డి డిజిటల్ మామోగ్రఫీలో మాత్రం సాధారణ సంప్రదాయ స్క్రీన్ పద్ధతిలోనూ, 2-డిలోనూ ఉన్న అన్ని పరిమితులను అధిగమించి, గడ్డ లేదా కణితి తాలూకు స్పష్టమైన చిత్రాన్ని చూడటానికి వీలువుతుంది. అందుకే అన్ని వైద్య ఆరోగ్య విషయాల్లో సురక్షితత్వానికి ప్రాధాన్యం ఇచ్చే అమెరికా అత్యున్నత సంస్థ అయిన ఎఫ్‌డీఏ ‘3-డి డిజిటల్ మామోగ్రఫీ చిత్రం ద్వారా క్యాన్సర్ గడ్డ లేదా సాధారణ గడ్డను చూడటం అన్నది చాలా త్వరితంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఒక స్పష్టమైన మార్గం’ అంటూ కితాబిస్తూ... సాంకేతిక రంగంలో ఇదో మైలురాయి, అద్భుతమైన పురోగతి అంటూ పేర్కొంది. 3డి డిజిటల్ మామోగ్రఫీతో ప్రయోజనాలివి... ఒక మందపాటి ఆకును అడ్డుగా కోశామనుకోండి. అప్పుడు దాని తొడిమ దగ్గర ఉన్న అడ్డుకోత చిత్రానికీ, మధ్య భాగం అడ్డుకోత చిత్రానికీ, అంచున ఉండే అడ్డుకోత చిత్రానికీ తేడా ఉంటుంది కదా. అదే తరహాలో రొమ్ము తాలూకు 3-డి చిత్రం కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రతిబింబిస్తుందనుకుందాం. అక్కడ గడ్డ మొదలైన చోట ఎలా ఉంది, మరో మూడు నాలుగు మిల్లీ మీటర్ల ఆవల ఎలా ఉంది, మరో ఆరేడు మిల్లీమీటర్ల అవతల ఎలా ఉంది అన్నది బయటి నుంచి చూస్తే తెలియదు. రొమ్మును అలా ప్రతి మిల్లీ మీటరుకు ఒకసారి కోసి చూడలేం. కానీ ఈ 3డి డిజిటల్ మామోగ్రఫీ (టోమోసింథసిస్) ప్రక్రియలో రొమ్ము లోపలి గడ్డను చూడదలచుకుంటే... రొమ్మును ఒక మూతలాగా తొలగించి, ఆ గడ్డను పై నుంచి ఎంత స్పష్టంగా చూడటానికి వీలవుతుందో ... అలాగే, ప్రతి మిల్లీమీటరు లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ గడ్డ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి వీలైనన్ని సూక్ష్మ భాగాలుగా చూడటానికి వీలవుతుందన్నమాట. మనం ఈ గడ్డ ప్రతిబింబాన్ని 3డి లో చూస్తున్న సమయంలోనే ఒకవేళ మనకు 2డి చిత్రం కావాలనుకున్నా... అప్పటికప్పుడు అదే సమయంలో దాన్ని తీసుకోవచ్చు. సాధారణ మామోగ్రఫీలో కణితి లేదా గడ్డ తాలూకు చిత్రాన్ని చూడటానికి కాస్తంత వ్యవధి పడుతుంది. అదే 2-డి మామోగ్రఫీలోనైతే అదే ప్రతిబింబాన్ని కంప్యూటర్ స్క్రీన్‌పై చూపించాలంటే ప్రత్యేకంగా ఒక డిజిటల్ కెమెరా కావాలి. కానీ... 3డి డిజిటల్ మామోగ్రఫీలో మాత్రం ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా కంప్యూటర్ స్క్రీన్‌పై వచ్చిన చిత్రాన్ని తక్షణం చూడవచ్చు. డాక్టర్ సిహెచ్.మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్: 9848011421 -
ఇప్పుడు రొమ్ము క్యాన్సర్‌కు అమెరికా స్థాయి చికిత్స ఇక్కడే...!
గతంలో రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము తొలగించాల్సి వచ్చేది. కానీ అమెరికాలో లభ్యమయ్యే చికిత్స ఇప్పుడు మన హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లోనే దొరుకుతుంది. దాంతో ఇప్పుడు రొమ్ము తొలగించాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి ఆపదా రాకుండా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్లలో డాక్టర్ సుగుణ చిర్ల ఏకైక మహిళ. ఇలాంటి అత్యాధునిక విద్యార్హతలు కలిగిన నిపుణులున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లాంటి చోట్ల ఈ రొమ్ము క్యాన్సర్ చికిత్స మరింత సులభం. ఆ వివరాలు తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మన శరీరంలో నిత్యం వేల సంఖ్యలో కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా జన్యువుల నియంత్రణలో జరుగుతుంటుంది. కొన్నిసార్లు జన్యువుల నియంత్రణ తప్పి, కణవిభజన ప్రక్రియ అదుపుతప్పి కణాలు విశృంఖలంగా పుడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అదనంగా ఏర్పడ్డ కణాలు ఒక కణితిగా రూపొందుతాయి. ఈ కణుతులు హానికరం కావుగాని... కొన్ని సందర్భాల్లో మాత్రం హానికరంగా పరిణమిస్తాయి. అవే క్యాన్సర్ కణుతులు. ఇది రొమ్ము భాగంలో ఏర్పడ్డప్పుడు దాన్ని రొమ్ము క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ రొమ్ములోగాని, నిపుల్కు పాలను సరఫరా చేసే నాళాల్లోగాని రావచ్చు. కానీ ముందే గుర్తిస్తే రొమ్మును తొలగించకుండానే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్‌కు వయసును కూడా ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించవచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యం కాదు. కాకపోతే తల్లికి, అక్కచెల్లెళ్లలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే రిస్క్ కాస్త ఎక్కువ. ఒకవేళ ఇదివరకు ఒక రొమ్ములో క్యాన్సర్ వస్తే రెండో రొమ్ముకూ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అంతేగాని వంశపారంపర్యంగా కానీ, ఒక రొమ్ముకు వస్తే మరో రొమ్ముకు తప్పనిసరిగా వస్తుందని చెప్పలేము. లేటు వయసులో పెళ్లిళ్లు, గర్భధారణ... పెరిగే వయసు రొమ్ము క్యాన్సర్‌కు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం. ముప్ఫయి ఏళ్లు దాటిన ప్రతి 233 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 60 ఏళ్లు దాటిన ప్రతి 27 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడవచ్చు. త్వరగా పెళ్లిచేసుకుని గర్భం దాల్చడం అన్నది రొమ్ము క్యాన్సర్ అవకాశాలను తగ్గించే అంశం. ఎందుకంటే గర్భధారణ వల్ల నెలసరులు తగ్గుతాయి. ఆ మేరకు ఈస్ట్రోజెన్ ప్రభావం కూడా తగ్గుతుంది. కాబట్టి రొమ్ముక్యాన్సర్‌కు అవకాశాలు కూడా తగ్గుతాయి. రిస్క్‌ను తగ్గించే రొమ్ము పాలు: బిడ్డకు రొమ్ము పాలు పట్టడం కూడా రొమ్ముక్యాన్సర్ రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఎంతకాలం బిడ్డకు రొమ్ము పాలు పడుతూ ఉంటే రొమ్ము క్యాన్సర్ రిస్క్ అంతగా తగ్గుతుంది. దీనివల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. కాబట్టి బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటైనా రొమ్ము పాలు పట్టేలా చూసుకోవాలి. గుర్తించడం ఎలా?: రొమ్ము క్యాన్సర్ కణుతుల్లో సాధారణంగా నొప్పి ఉండదు. కొన్నిసార్లు ఈ కణుతులు మెత్తగా ఉండవచ్చు. లేదా గట్టిగా కూడా ఉండవచ్చు. రొమ్ములో ఎలాంటి మార్పు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. రొమ్ములో వాపు, నొప్పి, నిపుల్స్ లోపలికి వెళ్లడం, ఎరుపెక్కడం, పాలు కాకుండా నిపుల్ నుంచి ఇతరత్రా ద్రవాలు స్రవించడం, చంకలో గడ్డలు ఏర్పడటం లాంటి మార్పులు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. రొమ్ము క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువవుతుంది. పైగా పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రఫీ అనే పరీక్ష చేస్తారు. దీనిద్వారా అతి సులువుగా, తక్కువ సమయంలో బయాప్సీ చేయవచ్చు. ఇప్పుడు ఆధునిక డిజిటల్ మామోగ్రఫిక్ ప్రక్రియలో బెడ్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి సౌకర్యంగా కూర్చుని లేదా పడుకుని, అత్యంత వేగంగా ఒక నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఫలితాలు పొందవచ్చు. మామోటోమ్ లాంటి పరికరాలు మరింత కచ్చితంగా మల్టిపుల్ బయాప్సీ చేస్తాయి. దాంతో రేడియేషన్ మోతాదు కూడా 50 శాతం తగ్గుతుంది. కాబట్టి రేడియేషన్ దుష్ర్పభావాలు కూడా తక్కువే. పరిష్కారాలు: రొమ్ముక్యాన్సర్ అనగానే చాలామంది రొమ్ము తొలగించాల్సి వస్తుందేమోనని భయపడతారు. కానీ నిజానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్స వల్ల రొమ్ము తొలగించకుండానే క్యాన్సర్‌కు చికిత్స చేసే వీలుంది. రొమ్ములో ఏర్పడ్డ చిన్న కణుతులను సర్జరీ ద్వారా తీసేస్తారు. అవే పెద్ద కణుతులైతే రెండుమూడు సార్లు కీమోథెరపీ ఇచ్చి వాటి పరిమాణం తగ్గించి, ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా మిగిలిన కణుతులను కూడా తీసేస్తారు. ఆంకోప్లాస్టిక్ సర్జరీ: పాడైన రొమ్ము ఆకృతిని సరిచేసే చికిత్స ఇది. బ్రెస్ట్ రీ-కన్స్ట్రక్షన్: అసహజాకృతిలో ఉండే రొమ్మును సరిచేయడం. బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్: ఇంప్లాంట్స్ ద్వారా రొమ్ము సైజ్‌ను పెంచడం. బ్రెస్ట్ లిఫ్ట్: నిపుల్ దగ్గర చిన్న గాటు పెట్టి కావలసిన ఆకృతికి, పరిమాణానికి రొమ్మును సరిచే యడం. కీమోథెరపీ: ఆపరేషన్ తర్వాత మిగిలిపోయిన క్యాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయడానికి కీమోథెరపీ చేస్తారు. దీని వల్ల క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కూడా అందిస్తారు. ఈ తరహా చికిత్సను నాలుగోదశకు చేరిన క్యాన్సర్‌కు కూడా ఉపయోగించవచ్చు. వీఎంఏటీ: దీన్నే వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అంటారు. ఇది రేడియేషన్ మోతాదును తగ్గిస్తుంది. రెండు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే ఈ చికిత్స పూర్తి చేయవచ్చు. నివారణ చాలా సులభం: క్యాన్సర్ రాకుండా నివారించడం మన చేతిలో ఉన్నదే. పెరిగే బరువు, స్థూలకాయం క్యాన్సర్‌కు కారణాలు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో బరువును నియంత్రించుకోవడం, స్థూలకాయం రాకుండా కాపాడుకోవడంతో క్యాన్సర్‌ను నివారించవచ్చు. మంచి ఆహారంతో క్యాన్సర్ నివారణ చాలా తేలిక. మాంసాహారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం, కొవ్వు పదార్థాలను పరిహరించడం, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయటం ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన లాంటి వాటికి దూరంగా ఉండటం క్షేమకరం. రెండు పదుల వయసు దాటిన తరువాత ప్రతి మహిళ ఎక్కడైనా గడ్డల్లా ఉన్నాయేమోనని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. 40 ఏళ్లలోపు వాళ్లందరూ ప్రతి మూడేళ్లకు ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. 40 దాటినవాళ్లు ప్రతి ఏటా పరీక్ష చేయించుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి డిజిటల్ మామోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవడం మంచిది. 50 దాటితే ప్రతి ఏటా ఈ పరీక్ష తప్పనిసరి. డాక్టర్ సుగుణ చిర్ల ఎండీ, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ శేరిలింగంపల్లి, హైదరాబాద్ email:drsuguna@americanoncology.com -
రొమ్ముక్యాన్సర్‌పై అపోహలు వద్దు...
రొమ్ము క్యాన్సర్ పట్ల ప్రజల్లో చాలా చాలా అపోహలున్నాయి. నిజానికి ముందుగా దీన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గే వ్యాధి ఇది. తొలిదశలోనే చికిత్స చేస్తే మునుపు ఉన్నంత ఆరోగ్యంగా తయారయ్యే ఈ వ్యాధి వల్ల కాపురాలే కూలిపోవడం విషాదకరమంటున్నారు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో సర్జికల్ ఆంకాలజీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు. సిటిజెన్స్ హాస్పిటల్ భాగస్వామ్యంతో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సర్జికల్ ఆంకాలజీ సేవలందిస్తోంది. ఈ సేవల్లో భాగంగానే సాధారణ ప్రజల్లోని అపోహలను తొలగించడానికి పలు అంశాలను వివరించారు డాక్టర్ చంద్రశేఖర్‌రావు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తరఫున ఆయన తెలియజేసిన అనేక ఆసక్తికరమైన సంగతులివి... రొమ్ము క్యాన్సర్ అన్నది వంశపారంపర్యం అని మనలో చాలామందికి ఒక అపోహ. కానీ ఇది వాస్తవం కాదు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రమే ఇది వంశపారంపర్యంగా వస్తుంది. అలా వచ్చేవారిని గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలున్నాయి. ఉదాహరణకు ఒకరి కుటుంబంలో అమ్మకు, సోదరికీ రొమ్ము క్యాన్సర్గాని, ఒవేరియన్ క్యాన్సర్గాని వచ్చి ఉండి, ఆ మహిళకు 45ఏళ్ల కంటే తక్కువ ఉంటే అలాంటివారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే తోడబుట్టిన వారిలో ఒక సోదరికి రొమ్ముక్యాన్సర్ ఉన్నంత మాత్రాన రెండోసోదరికీ అది రావాలని లేదు. రొమ్ముక్యాన్సర్ వచ్చిన సోదరికి రెండురొమ్ముల్లోనూ క్యాన్సర్ వస్తేనే మరో సోదరికి అది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆయుష్షు పెరగడం మంచిదేగా... మరి అదే కీడు ఎలా అయ్యింది? ఇటీవల ఆడవాళ్ల ఆయుఃప్రమాణం పెరిగింది. ఆయుష్షు పెరగడం మంచిదే. కానీ వయసు పైబడటం రొమ్ము క్యాన్సర్‌కు ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి అదే రోగుల సంఖ్యనూ పెంచింది. అయితే దీన్ని నివారించేందుకూ మార్గం ఉంది. సాధారణంగా యాభైఏళ్లు దాటాక ఆడవాళ్లకు మెనోపాజ్ వస్తుంది. ఇలా జరిగిన వాళ్లలో మామూలుగానైతే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గాలి. కానీ రుతుక్రమం ఆగి, బరువు పెరగడం మొదలైతే వాళ్లలో కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పెరిగే కొవ్వులో అరోమెటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ అరోమెటేజ్కు అడ్రినల్హార్మోన్నూ, మెనోపాజ్ తర్వాత పెరిగే ఆండ్రోజెన్ హార్మోన్‌నూ... ఈస్ట్రోజెన్‌గా మార్చే గుణం ఉంటుంది. దాంతో సాధారణంగా జరగాల్సినదానికి భిన్నంగా... రివర్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇలా ఈస్ట్రోజెన్ పెరగడం అన్నది రొమ్ముక్యాన్సర్‌కు దోహదం చేసే అంశం. కాబట్టి మెనోపాజ్ తర్వాత బరువు పెరిగే వాళ్లలో రొమ్ముక్యాన్సర్‌కు అవకాశం ఎక్కువ. మరి నివారణ ఎలా? బరువు పెరగడం వల్ల రొమ్ముక్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది కాబట్టి బరువు పెరగకుండా చూసుకోడానికి మెనోపాజ్ తర్వాత కొవ్వులు, నూనెలు తక్కువగా ఉండే ‘లో-ఫ్యాట్’ ఆహారం తీసుకోవాలి. అలాగే మెనోపాజ్‌కు చేరిన మహిళలు తప్పనిసరిగా వాకింగ్ వంటి వ్యాయామం చేయాలి. రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించడం ఎలా? దీనికీ చాలా తేలిక మార్గాలున్నాయి. వాటిలో కొన్ని... రుతుక్రమం ఆగిపోయాక ఒకవైపు రొమ్ము నుంచే రక్తస్రావం జరుగుతోందా అని చూడాలి.అలా అయితే దాన్ని రొమ్ముక్యాన్సర్గా అనుమానించాలి. రుతుక్రమం తర్వాత రొమ్ములో ఏవైనా గడ్డలు కనిపిస్తున్నాయా? ఒకసారి పరీక్షచేయించుకోవాలి. ఆమాటకొస్తే రుతుక్రమం ముందుకూడా రొమ్ములో గడ్డలు రావచ్చు. కానీ అవి పెరుగుతుంటే మాత్రమే వాటిని ప్రమాదకరమైనవిగా అనుమానించాలి. చికిత్స రొమ్ము క్యాన్సర్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది మెనోపాజ్ కంటే ముందు వచ్చే హార్మోనల్ డిపెండెంట్ తరహా క్యాన్సర్. ఇందులో టొమాక్సిఫెన్ అనే మందును 20 ఎంజీ మోతాదులో ఐదేళ్ల పాటు ఇవ్వాలి. దీన్ని పరగడుపున తీసుకోవాలి. ఇది యాంటీ ఈస్ట్రోజెన్ కావడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌ను అరికడుతుంది. ఇక రెండో రకమైన మెనోపాజ్ తర్వాతి దశలో వచ్చే హార్మోనల్ డిపెండెంట్ తరహా క్యాన్సర్. ఇందులో అరోమెటేజ్ అనే ఎంజైమ్‌ను అరికట్టే ఇన్హిబిటర్ను వాడటం ద్వారా చికిత్స చేస్తారు. ఈ అరోమెటేజ్ ఇన్హిబిటర్ను ఐదేళ్లపాటు వాడాలి. ఇందులో రెండు రకాల మందులు ఉన్నాయి. అనెస్టెజోల్ లేదా లెట్రజోల్ అనే ఈ రెండు మందుల్లో ఒకదానిని ఐదేళ్లపాటు వాడాల్సి ఉంటుంది. హార్మోనల్ ఇండిపెండెంట్ క్సాన్సర్కి మాత్రం కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. రొమ్ముక్యాన్సర్‌లో శస్త్రచికిత్స రెండు రకాలుగా చేయవచ్చు. ఒకవేళ రొమ్ములోని క్యాన్సర్ గడ్డ 2 సెం.మీ. నుంచి 4 సెం.మీ. పరిమాణంలో ఉంటే దానికి రొమ్మును తొలగించాల్సి అవసరం ఉండదు. అయితే అంతకంటే మించి ఉంటే రొమ్ము తొలగించాల్సి వస్తుంది. చంక నుంచి గడ్డను తొలగించడాన్ని ‘ఆక్సిలరీ క్లియరెన్స్’ అంటారు. ఆక్సిలరీ క్లియరెన్స్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గడ్డ తొలగించిన వైపున ఉన్న చేతికి గాజులు వేసుకోకూడదు. గడ్డ తొలగించాక ఆ వైపు చేతితో కత్తిపీటను వాడకూడదు. గడ్డ ఉన్న వైపున ఉండే చేతికి ఇంజెక్షన్ కూడా వేయించుకోకూడదు. ఆ వైపున ఉన్న చేతికి దోమలు కుట్టకుండా చూసుకోవడం మంచిది. అందుకోసం ఆపరేషన్ తర్వాత ఫుల్స్లీవ్స్ ఉండే దుస్తులు (జాకెట్లు) కుట్టించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అపోహలు వీడండి... చాలామంది రొమ్ముక్యాన్సర్ ఉన్నవారి కుటుంబంలోని మహిళలను పెళ్లి చేసుకోడానికి వెనకాడుతుంటారు. కానీ ఇది ఎంతమాత్రమూ అంటువ్యాధి కాదు. కుటుంబంలోని వారిలో ఒకేలాంటి జన్యువులు ఉన్నప్పటికీ... అదే కుటుంబానికి చెందిన వారిలో ఇది రాకపోవచ్చు. అలాంటిప్పుడు ఎవరిలో ఇది వస్తుందనడానికి కొన్ని సూచనలూ ఉన్నాయి. ఉదాహరణకు జన్యుపరీక్షలో బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 అనే జన్యువుల్లో తేడాలు ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చేందుకు రిస్క్ పెరుగుతుంది. అలాగే పి 10 అనే జన్యువు, పి 53 అనే జీన్ మ్యూటేషన్జరిగిన వారిలోనే ఇది వస్తుంది. అంటే కుటుంబ చరిత్రలో రొమ్ముక్యాన్సర్ వచ్చిన దాఖలా ఉన్నా ఆ కుటుంబంలో అందరికీ ఇది వచ్చే అవకాశాలు ఉండవు. కాకపోతే రిస్క్ మాత్రం ఉంటుందంతే. చాలామంది దీన్ని అంటువ్యాధి అనుకుంటారు. బాగా చదువుకున్నవారిలోనూ చాలామందిలో ఈ అపోహ ఉంది. కానీ బాగా ముదిరిన దశతో సహా ఏ దశలోనూ ఇది అంటువ్యాధి కానేకాదు. ఒకసారి శస్త్రచికిత్స జరిగి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాక వారు పూర్తిగా ఆరోగ్యవంతులైనట్లే. అంటే క్యాన్సర్ రాకముందు వారు ఎలాంటి జీవితం అనుభవించారో, అలాగే గడపవచ్చు. దాంపత్య జీవితం, సెక్స్‌తో సహా. మనదేశంలో రోగి పట్ల సానుభూతి చూపడం ఎక్కువ. కానీ ఒకసారి వ్యాధికి చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గినవారు ఇక అన్నివిధాలుగా పూర్తిగా ఆరోగ్యవంతులు కాబట్టి బంధువులంతా పరామర్శల పేరిట వారికి సానుభూతి పంచడం, తమ అపోహలను వారిపై రుద్ది వారిని లేనిపోని భయాందోళనలకు గురిచేయడం ఎంతమాత్రమూ సరికాదని గుర్తుంచుకోండి. డాక్టర్ చంద్రశేఖర్‌రావు చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్