మహిళలందరికీ క్యాన్సర్ పరీక్ష !
ఛండీగఢ్: క్యాన్సర్ మహమ్మారిని నివారించేందుకు విశేషంగా కృషి చేస్తున్న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో 40 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
'మేం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం. ఒకవేళ ఈ పరీక్షల్లో వారికి క్యాన్సర్ సోకే అవకాశం ఉందని తెలిస్తే తదుపరి వైద్యం కోసం ఉన్నతస్థాయి ఆస్పత్రులకు పంపిస్తాం' అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. సర్వేకల్ క్యాన్సర్ లక్షణాలు కూడా వైద్యులు గుర్తించి చెప్తారని అన్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వ క్యాన్సర్ సోకిన ప్రతి వ్యక్తికి రూ.1.50లక్షల ఆర్థికసహాయం కూడా అందిస్తోంది.