punjab
-
కుప్పకూలిన బిల్డింగ్.. 12 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
చంఢీగడ్ : పంజాబ్ రాష్ట్రం మొహాలి జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పుకూలింది. సహాయక చర్యలు 12 గంటలకు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్మెంట్ కోసం తవ్వకాలు జరుగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల్ని సంరక్షించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద భవన యజమానులు, పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు. భవనం కూలిపోవడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.-Sohana Building Collapse Update- Rescue Operation Continues;District Admin Sets Up Control Room +91 172-2219506,Civil Hospital Mohali, Fortis, Max and Sohana Hospital put on alert pic.twitter.com/UjRsI4G0Zh— DC Mohali (@dcmohali) December 21, 2024 -
ఫాస్టెస్ట్ సెంచరీ.. కసిదీరా కొట్టేశాడు!
పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా అన్మోల్ప్రీత్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు.. అరుణాచల్‌ప్రదేశ్ తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ‘ఎ’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.164 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 164 పరుగులకే కుప్పకూలింది. తెచి నెరి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ వర్మ 38, ప్రిన్స్ యాదవ్ 23, దేవాన్ష్ గుప్త 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, అశ్వని కుమార్ మూడేసి వికెట్లు తీయగా.. బల్జీత్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, రఘు శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అభిషేక్ శర్మ విఫలంఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(25 బంతుల్లో 35 నాటౌట్)కు తోడైన వన్‌డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.45 బంతుల్లో 115 పరుగులుసుడిగాలి ఇన్నింగ్స్‌తో కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అన్మోల్.. మొత్తంగా 45 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో 12.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 167 పరుగులు చేసింది పంజాబ్.కసిదీరా కొట్టేశాడుతద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి టోర్నీని విజయంతో ఆరంభించింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన అన్మోల్ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ పంజాబీ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వన్డేల్లో టీ20 తరహాలో ఊచకోత కోసి తన కసినంతా ఇక్కడ ప్రదర్శించాడంటూ అభిమానులు అన్మోల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ముంబై తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్.. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అన్మోల్.. 139 పరుగులు సాధించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్A majestic counter-attacking 58-ball 💯 from Anmolpreet Singh 👏👏#SMAT | @IDFCFIRSTBank | #FinalFollow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/3sdqD7CJvj— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023 -
పంజాబ్‌లో పేలుడు కలకలం
అమృత్సర్: పంజాబ్‌లో పేలుడు కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని ఇస్తామాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జర్మనీకి చెందిన గ్యాంగ్‌స్టర్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.ఈ నెల 4న అమృత్‌సర్‌లోని మజితా పోలీస్స్టేషన్లోనూ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు పగిలిపోయాయి. పోలీస్ స్టేషన్ గేటు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసిన పోలీసులు.. భద్రతను పెంచారు.Reportedly, a blast was heard in the early hours of Tuesday near the Islamabad police station in Amritsar. However, the police have yet to provide an official statement on the incident. pic.twitter.com/1tzYeyjidG— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) December 17, 2024 -
చలి గుప్పెట ఉత్తరాది
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లతో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజ లాడుతున్నాయి. చాలా చోట్ల ఆదివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే, కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఇది 3.1 డిగ్రీలు తక్కువ. ప్రస్తుతానికి శీతల గాలులు లేవని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ పేర్కొంది. అత్యల్పంగా ఫరీద్‌కోట్‌లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హరియాణాలోని హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్తాన్‌లోని ఫతేపూ ర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని కొండ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతల గాలుల ప్రభా వంతో 0.2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో, సొలాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 24.7 డిగ్రీలు, సిమ్లాలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో –3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో –4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నట్లు వెల్లడించింది. -
రణరంగంగా శంభు సరిహద్దు.. రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం
Live Updates..👉పంజాబ్-హర్యానా సరిహద్దులు రణరంగంలా మారాయి. రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దు వద్ద రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, రైతులు ముందుకు కదలడంతో పోలీసులు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే, వాటర్ కెనాన్లను రైతులపైకి ప్రయోగించారు. టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రులకు తరలించారు. #WATCH | Drone visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers protesting over various demands have been stopped from heading towards DelhiPolice used water cannon, tear gas to disperse the farmers. pic.twitter.com/W54KhOMqZa— ANI (@ANI) December 14, 2024#WATCH | Police use tear gas and water cannon to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/lAX5yKFarF— ANI (@ANI) December 14, 2024 #WATCH | Police use tear gas and water cannon to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/tDMTy8iGXU— ANI (@ANI) December 14, 2024#WATCH | Farmers begin their 'Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border; police personnel present at the spot pic.twitter.com/Uq8zTrbXjo— ANI (@ANI) December 14, 2024 👉పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమంలో నేడు మళ్లీ కొనసాగనుంది. ఈ మేరకు రైతులు సన్నద్దమవుతున్నారు. ఢిల్లీ చేరుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. 👉ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి బయలుదేరనుంది. ఇక, రైతుల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.#WATCH | Visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. According to farmer leader Sarwan Singh Pandher, a 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon. pic.twitter.com/Tfb1F8dSqE— ANI (@ANI) December 14, 2024👉 మరోవైపు.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. నేటి నుంచి ఈనెల 17వ తేదీ వరకు ఈ సేవలను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. 👉ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. రైతులు ఆందోళనలు చేపట్టి నేటి 307 రోజులు అవుతోంది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని మేమందరం కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ క్రమంలోనే మార్చ్ తలపెట్టాం. దేశం మొత్తం రైతులకు అండగా నిలుస్తోంది. కానీ, ప్రధాని మోదీ మాత్రం మౌనం వహిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.ఇక, ఇప్పటికే రెండు సార్లు రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. -
స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి దారుణ హత్య
ఇద్దరు స్నేహితుల మధ్య వంట గదిలో జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో 22ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.కెనడా పోలీసుల వివారాల మేరకు.. సుమారు నాలుగు నెలల క్రితం భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం లుథియానాకు చెందిన 22 ఏళ్ల గురాసిస్ సింగ్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ సర్నియా నగరంలో లాంబ్టన్ కాలేజీలు చేరాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో తన 34 క్రాస్లీ హంటర్‌తో కలిసి ఉంటున్నాడు.అయితే, ఈ తరుణంలో నవంబర్ 30 రాత్రి తన రూమ్‌లో ఓ విషయంలో గురుసిస్‌కు,హంటర్ల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారి తీసింది. కిచెన్‌లో ఉన్న గురుసిస్ను హంటర్ కత్తి దాడి చేశారు. ఈ ఘటనలో గురుసిస్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ దుర్ఘటన అనంతరం, గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడు హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, ఈ హత్యపై విచారణ నిర్వహిస్తున్నామని సర్నియా పోలీస్ అధికారి డేవిస్ తెలిపారు. హత్యకు గల కారణాల్ని వెలుగులోకి తెస్తామన్నారు. కాగా, గురుసిస్ హత్యపై లాంబ్టన్ కాలేజీ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. -
రైతుల ఢిల్లీ చలో వాయిదా..
farmers Protest Live Updates...👉ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఢిల్లీ మార్చ్‌పై రైతులు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో చర్చలు విఫలమైతే డిసెంబర్ 8న మార్చ్ చేస్తామని రైతులు తెలిపారు. ఢిల్లీ చలో నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉదద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. #WATCH | At the Shambhu border, farmer leader Sarwan Singh Pandher says, "Now 'Jattha' of 101 farmers will march towards Delhi on December 8 at 12 noon. Tomorrow's day has been kept for talks with the central government. They have said that they are ready for talks, so we will… pic.twitter.com/3llMjDGvsd— ANI (@ANI) December 6, 2024👉రైతుల సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఢిల్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టియర్ ప్రయోగించడంతో ఆరుగురు రైతు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. కాసేపు మేమేంతా సమావేశం కాబోతున్నాం. భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తామన్నారు. #WATCH | At the Shambhu border, Farmer leader Sarwan Singh Pandher says, "They (police) will not let us go (to Delhi). Farmer leaders have got injured, we will hold a meeting to decide the future strategy..." https://t.co/jpM65N22Po pic.twitter.com/rOnk0VXgcQ— ANI (@ANI) December 6, 2024 👉హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లోని శంభు వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో, టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు గాయపడ్డారు. దీంతో, వారికి ఆసుపతత్రికి తరలించారు. #WATCH | Police use tear gas to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/CMon3JDg3I— ANI (@ANI) December 6, 2024 👉దేశంలో రైతులు మరోసారి పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద ‘ఢిల్లీ చలో’ పేరుతో నిరసన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. అన్నదాతలను అడ్డుకోవడంతో ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ శంభు సరిహద్దుకు చేరుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బారికేడ్లతో రైతులను భద్రతా బలగాలు అడ్డుకున్నారు. మరోవైపు.. రైతులు నిరసనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.#WATCH | Drone visuals from the Shambhu border where the farmers protesting over various demands have been stopped from entering Delhi. pic.twitter.com/0aBiJTI7sS— ANI (@ANI) December 6, 2024ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అదనంగా మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు.#WATCH | At the Shambhu border, a police official says, "They (farmers) don't have permission to enter Haryana. The Ambala administration has imposed Section 163 of the BNSS..." https://t.co/zVSRcePdgO pic.twitter.com/NwkVbliejp— ANI (@ANI) December 6, 2024రైతు నాయకుడు, కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ మాట్లాడుతూ.. రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు తేకుండా కేవలం కాలినడకన పాదయాత్ర చేస్తారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి మార్చ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.#WATCH | Farmers protesting over various demands have been stopped at the Shambhu border from heading towards Delhi. pic.twitter.com/Pm3HxgR2ie— ANI (@ANI) December 6, 2024 -
అకాల్ తఖ్త్.. ఆదేశిస్తే ఏదైనా చేయాల్సిందే!.. మరి ఉల్లంఘిస్తే?
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన పాపాలకుగానూ(తప్పిదాలు).. ఏకంగా డిప్యూటీ సీఎంగా పని చేసిన ఓ వ్యక్తికి శిక్షలు విధించింది సిక్కు మతానికి చెందిన అకాల్ తఖ్త్. బాత్రూంలు, వంటగదులు, వరండాలు కడగడం.. షూలు, చెప్పులను శుభ్రం చేయడం లాంటి పనులు చేయాలని హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరసావహించారు. ఈ క్రమంలోనే ఆయనపై జరిగిన హత్యాయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్షల గురించి తెలిసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు.సిక్కు మత సమగ్రతను కాపాడుకోవడంతో పాటు తప్పు చేసిన వ్యక్తికి తన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చి.. తద్వారా మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని మార్చుకోవడమే అకాల్ తఖ్త్ ఉద్దేశం. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు కలగకమానవు. అసలు అకాల్ తఖ్త్‌ను నడిపించేదెవరు?. ఒకవేళ ఆ శిక్షకు తలొగ్గకపోతే ఏం చేస్తారు?. నిజంగానే తీవ్ర పరిణామాలు ఉంటాయా?. సాధారణంగా అకాల్ తఖ్త్ విధించే శిక్షలను పరిశీలిస్తే..బహిరంగ క్షమాపణలు.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారుపాప పరిహారం కింద.. సేవా కార్యక్రమాల్లో(బాత్రూంలు, వంటగది, వరండాలు శుభ్రం చేయడం.. వంట చేర్చి వార్చడం, కాపలా పని, వగైరా) ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బహిష్కరణ.. నేర తీవ్రతను బట్టి సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది కొంత కాలపరిమితితో ఉంటుంది. తద్వారా.. మతపరమైన కార్యక్రమాల్లో వాళ్లు భాగం కాలేరు. మరి ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..?ఎవరైనా అకాల్ తఖ్త్ శిక్షలను గనుక ఉల్లంఘిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.శాశ్వత బహిష్కరణ.. అకాల్ తఖ్త్ శిక్షలకు తలొగ్గనివాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేస్తారు.సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. తద్వారా.. వాళ్లను ఒంటరిని చేసేస్తారు.ఆధ్యాత్మిక సయోధ్య.. దండించడం బదులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదంటారు కదా. ఒత్తిడి చేయడం ద్వారా వాళ్లు తమ తప్పులను ఒప్పకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.ఇవేవీ పని చేయని క్రమంలో.. సిక్కు సంఘాలే రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో పరిస్థితి ఇంతదాకా ఏనాడూ రాలేదు.అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లు ఎందరో.. వాళ్లలో కొందరు ప్రముఖులూ ఉన్నారు.మహారాజా రంజిత్ సింగ్సిక్కుల తొలి చక్రవర్తి. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద అకాల్ తఖ్త్ ఆయనకు కొరడాతో దెబ్బలు తినాలని శిక్ష విధించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది తఖ్త్.జ్ఞానీ జైల్సింగ్భారత మాజీ రాష్ట్రపతి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని అకాల్ తఖ్త్ శిక్షించింది. అయితే రాత పూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు.బూటా సింగ్కేంద్ర మాజీ మంత్రి. ఈయన్ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు కూడా.సుర్జిత్ సింగ్ బర్నాలాపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆపరేషన్ బ్లాక్ థండర్(అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ని కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్కు జరిమానా కట్టడంతో బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాపపరిహారం చేసుకున్నారాయన. సుఖ్వీర్సింగ్ బాదల్పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం కూడా ఉంది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ను దోషిగా తేల్చింది. అయితే తాను చేసిన తప్పులను అంగీకరించిన(మూడు నెలల కిందటే) సుఖ్బీర్ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆపై కాలు ఫఫ్రాక్చర్ అయ్యి వీల్ చైర్‌కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి ఇప్పుడు అకాల్ తఖ్త్ విధించిన శిక్షలను అనుభవించారు. అకాల్ తఖ్త్.. ఒరిజినల్ పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్‌లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఉంది. సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ జూన్ 15, 1606లో దీనిని అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే ఆయన బాల్యమంతా గడిచిందన్న వాదన ఒకటి ఉంది. 👉పిరి-మిరి అంటే.. ఆధ్యాత్మికంగానే కాకుండా సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనల మీద చర్చ జరిపే ఉద్దేశంతో ఒక తాత్కాలిక అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు. పిరి-మిరికి ప్రతీకగా ఈ వేదికపై రెండు కత్తులను ఉంచారాయన. హర్గోవింద్తో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్లు అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు. 👉సిక్కుల అత్యున్నత విభాగంగా అకాల్ తఖ్త్కు పేరుంది. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా.. జతేదార్(లీడర్)ను అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా ఉన్న అకాల్ తఖ్త్‌ను అభివర్ణిస్తారు. 👉 పంజాబ్‌తో పాటు పాట్నా, బీహార్, మహారాష్ట్రలలో ఇలాంటి అధికార కేంద్రాలే ఉన్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే హుకామ్నామా(ఆదేశాలను).. ప్రతీ సిక్కు పాటించడం తప్పనిసరి. 👉 అకాల్ తఖ్త్ అనేది.. ఆకాలంలో అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తు. అయితే ఈ సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలీ దాడులతో మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అకాల్ తఖ్త్ దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. పునఃనిర్మించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో.. దామ్‌దామి తక్సల్ 14వ జతేదార్ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలేపై.. పంజాబ్‌లో అతివాద సంస్థను నడిపిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. 1983 జులైలో.. అకాలీదళ్ అధ్యక్షుడు హర్చరణ్ సింగ్ లాంగోవాల్, అప్పటి అకాల్ తఖ్త్ జతేదర్ల ఆహ్వానం మేరకు బింద్రాన్‌వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. అక్కడ అరెస్ట్‌కు భయపడి అకాల్ తఖ్త్‌లో తలదాచుకున్నాడు. అయితే.. అతని జాడ కనిపెట్టిన అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భారత సైన్యానికి అనుమతి ఇచ్చింది. 1984 జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీల మధ్యలో.. గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచింది. ఈ ఆపరేషన్‌లో అకాల్ తఖ్త్ భారీగా డ్యామేజ్ అయ్యింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో భింద్రాన్వాలే చనిపోయాడు.ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత.. అకాల్ తఖ్త్‌ను తిరిగి నిర్మించేందుకు అప్పటి జతేదార్ బాబా సంతా సింగ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సమీకరణ కూడా చేయాలనుకున్నాడు. అయితే.. అందుకు సిక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయినా కూడా సర్బత్ ఖాల్సా సహకారంతో జతేదార్ నెలన్నర వ్యవధిలోనే(1984, ఆగష్టు 11) అకాల్ తఖ్త్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే.. అదే సర్బత్ ఖాల్సా కూల్చేయాలని తీర్మానం చేసింది. జనవరి 1986లో కూల్చేసి.. బాబా సంతా సింగ్‌ను సిక్కు మర్యాదను దెబ్బ తీశాడనే కారణం చూపించి వెలివేసింది. 2001లో తిరిగి ఆయన్ని సిక్కు కమ్యూనిటీలో చేర్చుకుంది. అయితే.. సిక్కులకు న్యాయ పీఠంగా అకాల్ తఖ్త్ కొనసాగుతున్నప్పటికీ.. కాలక్రమంలోని పరిణామాలు(నిర్మాణాలపరంగా) మాత్రం ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. -
డాలర్ డ్రీమ్స్ వేటలో.. కటకటాల పాలు!
అమెరికా కలను సాకారం చేసుకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్ సీబీపీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు వాళ్లు ప్రధానంగా కెనడా సరిహద్దులను ఎంచుకుంటున్నారు. కెనడా గుండా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్టవుతున్న వారిలో భారతీయులే 22 శాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది! యూఎస్ సీబీపీ గణాంకాల ప్రకారం 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో కెనడా గుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16 శాతం కాగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మందిలో 30,010 మంది భారతీయులున్నారు. 2024లో 1,98,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే. లాటిన్ అమెరికా, కరేబియన్ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. అయినా గత నాలుగేళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్కు చెందిన ఇమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య తెలియదు. కెనడా సరిహద్దే ఎందుకు? అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. దాంతో అక్కడ రక్షణ తక్కువ. దాంతో అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. పంజాబ్ నుంచే ఎక్కువ ఇలా కెనడా గుండా అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, హరియాణాల వాళ్లే ఉంటున్నారు. తర్వాతి స్థానం గుజరాత్‌ది. విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం పంజాబీ గ్రామీణ యువత బాగా ఆసక్తి చూపుతోంది. కానీ సరైన విద్యార్హతలు, ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా పర్యాటక, విద్యార్థి వీసాలు పొందడం వీరికి గగనంగా మారుతోంది. ప్రత్యామ్నాయంగా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలామంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అకాలీల ప్రస్థానం ఎటువైపు?
పంజాబ్‌లో అవసానదశలో పడిన అకాలీదళ్‌కు కాయకల్ప చికిత్స చేసి రక్షించటానికి చేసిన ప్రయత్నం కాస్తా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రాణానికి ముప్పు తెచ్చింది. బుధవారం ఆయనపై కాల్పులు జరపబోయిన ఖలిస్తానీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాను అక్కడున్నవారు సకాలంలో నిరోధించకపోయివుంటే పంజాబ్‌లో మరో నెత్తుటి అధ్యాయం మొదలయ్యేది. గత తప్పిదాలకు బాదల్‌నూ, ఇతర నేతలనూ సిక్కు అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ మతద్రోహులుగా ప్రకటించి విధించిన శిక్షలు అమలవుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. పంజాబ్ స్థితిగతులు ప్రత్యేకమైనవి. మతమూ, రాజకీయాలూ కలగలిసి పోవటాన్ని వ్యతిరేకించేవారు సైతం ఈ ప్రత్యేకతను గమనించబట్టే అక్కడ అకాలీదళ్ వంటి మధ్యేవాద పక్షం అవసరమని భావిస్తారు. లేనట్టయితే మతాన్ని తలకెక్కించుకున్న అతివాదులది అక్కడ పైచేయి అవుతుందని వారి వాదన. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీదళ్‌ను బలహీనపరచటానికి భింద్రన్‌వాలే వంటి మిలిటెంట్లకు మొదట్లో అందించిన పరోక్ష ప్రోత్సాహం పంజాబ్‌కు శాపంగా మారింది. పరిస్థితి చేయిదాటాక అమృత్సర్ స్వర్ణాలయంలో తలదాచుకున్న భింద్రన్‌వాలేను, అతని ముఠాను అదుపు చేయటానికి సైన్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కాస్తా వికటించి చివరకు ఇందిర ప్రాణాలనే బలితీసుకుంది. ఆ హత్యకు ప్రతీకారమన్నట్టు ఢిల్లీతోసహా దేశంలో అనేకచోట్ల కాంగ్రెస్ నేతలు వెనకుండి సిక్కులపై సాగించిన హత్యాకాండ పర్యవసానంగా ఉగ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. దశాబ్దంపాటు పంజాబ్ కనీవినీ ఎరుగని కల్లోలం చవిచూసింది. వేలాదిమంది అమాయక పౌరులు ఆహుతయ్యారు. ఉగ్రవాదాన్ని అదుపుచేయటం కోసమంటూ భద్రతా బలగాలు సాగించిన ఎన్కౌంటర్లు, అపహరణలు, అదృశ్యాలు సరేసరి. మన దేశంలో నామరూపాల్లేకుండా పోయిన ఆ ఉద్యమం ప్రస్తుతం కెనడాలో సాగిస్తున్న కార్యకలాపాల పర్యవసానమేమిటో కనబడుతూనే వుంది. అయిదుగురు సిక్కు మత పూజారుల అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను స్వర్ణాలయ ప్రధానద్వారం వద్ద సాధారణ సేవాదార్‌గా పనిచేయాలని తీర్మానించింది. ఆయన తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపే పలకను మెడలో ధరించారు. ఇతర అకాలీ నేతలకు స్వర్ణాలయంలో అంట్లు తోమటం నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయటం వరకూ వేర్వేరు శిక్షలు విధించింది. ఈ శిక్షలకు 2007–17 మధ్య పంజాబ్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షమైన బీజేపీ అత్యుత్సాహం కారణం. పంథ్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను విస్మరించి, సిక్కులను అనేకవిధాల హింసించి చంపిన రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు పదవులు పంచిపెట్టడం అకాలీదళ్ నేతలు చేసిన ‘ప్రధాన నేరం’. వీరిలో చాలామంది బీజేపీవారు కాగా, అకాలీ తరఫున ఎంపికైనవారు కూడా ఉన్నారు. అలాగే మతాన్ని అపవిత్రం చేసిన దేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీంపై ఉన్న కేసుల్ని ఆయన కోరకుండానే రద్దుచేయటం, దాన్ని సమర్థించుకోవటానికి తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా జతేదార్లను పిలిపించి ఒత్తిడి చేయటం వంటివి ఇతర ఆరోపణలు. అధికారంలో ఉండగా చేసిన పనులకు అకాలీదళ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 1920లో ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రైతాంగం దూరమైంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దానికితోడు సాగు సంక్షోభం, ఉపాధి లేమివంటì సమస్యలు మధ్యతరగతిని, ఇతర వర్గాలవారినీ అసంతృప్తిలో ముంచెత్తాయి. అందుకే అకాలీలను వరస ఓటములు వెంటాడాయి. పర్యవసానంగా అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశం అకాలీని నిలువునా ముంచింది. ఆ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోయింది. తన భాగస్వామ్య పక్షాన్ని బలహీనపరిచి ఎదగాలని చూసే బీజేపీ ఎత్తుగడలు ఆ రాష్ట్రంలో ఫలించలేదు. అందుకే అకాలీ నేతల ‘తప్పుల’కు తగిన శిక్ష విధించి, వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గత నెలలో అకల్తఖ్త్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఉగ్రవాదం విస్తరిస్తుందన్న సాకుతో రాజకీయాల్లో మత సంస్థల ప్రాబల్యం పెంచటం ఎంతవరకూ సబబన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆప్ ఆగమనం, అది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం విశ్లేషిస్తే మత రాజకీయాల ప్రాబల్యం బలహీన పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. అకాలీదళ్ 1977 తర్వాత బాదల్ కుటుంబ ప్రాబల్యంలోకొచ్చాక రాష్ట్రంలో సిక్కు–నిరంకారీ ఘర్షణలు పెరిగాయి. అటూ ఇటూ పదులకొద్దీ మంది మరణించారు. ఇందిర పుణ్యమా అని ఉగ్రవాదం విస్తరించింది. ఈ అయోమయ పరిస్థితుల్లో 1996లో బీజేపీతో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకుని మోగాలో జరిగిన పార్టీ సమావేశాల్లో సిక్కు మత మూలాలున్న అకాలీదళ్‌ను సెక్యులర్ పార్టీగా మారుస్తూ తీర్మానించటం పంథ్ అనుకూల ఓటర్లను క్రమేపీ పార్టీకి దూరం చేసింది. బీజేపీ ఆ పని చేయకపోవటాన్ని అందరూ వేలెత్తి చూపారు. అకాలీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ జోషి పార్టీ తిరిగి పంథ్ అనుకూల వైఖరి తీసుకుని శిక్షలకు తలొగ్గటాన్ని నిరసిస్తూ అకాలీదళ్‌కు రాజీనామా చేశారు. ఈ అంతర్మథనం బాదల్‌పై జరిగిన తాజా దాడితో ఏయే మలుపులు తీసుకుంటుందో, అకాలీదళ్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో మున్ముందు చూడాలి. -
సుఖ్బీర్ సింగ్‌పై కాల్పులు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన హత్యాయత్నంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవిద్ కేజ్రీవాల్ స్పందించారు. శిరోమణి అకాలీదళ్ నేత బాదల్ జరిగిన కాల్పుల ఘటన.. పంజాబ్ ప్రతిష్టను తీసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడిలో అనేక శక్తులు పాల్గొన్నాయని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేడు పంజాబ్‌లో ఊహించని ఓ సంఘటన జరిగిందన్నారు. పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. కానీ ఈఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. అయితే పంజాబ్, పంజాబీ ప్రజల పరువు తీసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నది ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.. ఇందులో అనేక శక్తులు ఉన్నాయి' అని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అన్నారు.అయితే కాల్పుల సమయంలో పంజాబ్ పోలీసులు వ్యవహరించిన తీరును కేజ్రీవాల్ ప్రశంసించారు. అంతేగాక ప్రతిచోటా పంజాబ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.కాగా సర్వదేవాలయం ఎదుట సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆయన సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు బాదల్‌పై కాల్పులకు తెగబడ్డాడు. అయితే అతని వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమవ్వడంతో బుల్లెట్లు గోడను తాకాయి. ఈ ప్రమాదంలో బాదల్‌కు ఎలాంటి గాయాలు అవ్వలేదు.కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ ఉగ్రవాది నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. గతంలో అతడు ఖలిస్తానీ కార్యకలాపాల్లో అలాగే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఉగ్రవాదిగా పనిచేసినట్లు తెలిసింది.కాల్పుల ఘటన అనంతరం సుఖ్బీర్ తన శిక్షను కొనసాగించారు. సతీమణి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్‌తో కలిసి స్వర్ణదేవాలయంలో వంటపాత్రలు శుభ్రం చేశారు. ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ‘సుఖ్బీర్ బాదల్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించా’’ అని వెల్లడించారు. -
పాత్రలు కడిగి, షూస్ శుభ్రం చేసిన మాజీ డిప్యూటీ సీఎం.. కారణం ఇదే
అమృత్సర్ : సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ విధించిన శిక్షను పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటిస్తున్నారు.అకాల్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా మంగళవారం అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్లో సుఖ్బీర్ సింగ్ బాదల్ నీలిరంగు ‘సేవాదర్’ దుస్తులు ధరించారు. కాలికి గాయం కావడంతో కాలికి గాయం కావడంతో వీల్ చైర్లో కూర్చొని పాత్రల్ని కడిగారు. షూస్‌ను శుభ్రం చేశారు. అకాల్ తఖ్త్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ నేతలకు సైతం ఈ శిక్షను అనుభవిస్తున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో పాటు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియా సైతం పాత్రల్ని కడిగారు. ఈ శిక్షను అనుభవించే సమయంలో అకాలీదళ్ నేతల మెడలో వారు ఏ తప్పులు చేశారు. అందుకు గాను అకాల్ తఖ్త్ ఏ శిక్షలు విధించిందో తెలిపేలా ఓ పలకను కూడా ఉంచింది. అధికారంలో ఉండగా అనేక తప్పిదాలుపంజాబ్లో బీజేపీతో దశాబ్ద కాలంగా పొత్తు పెట్టుకున్న సమయంలో శిరోమణి అకాలీదళ్ అనేక మతపరమైన తప్పిదాలకు కారణమని అకాల్ తఖ్త్ పేర్కొంది. ఆ సమయంలో సుఖ్ బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనలకు పాల్పడ్డారని ఈ ఏడాది ఆగస్ట్‌లో అకాల్ తఖ్త్ తేల్చింది. డేరా బాబాకు మద్దతుగా నిలిచారని సుఖ్ బీర్ సింగ్ బాదల్ పలు నేరాలకు పాల్పడిన డేరా బాబాకు మద్దతుగా నిలిచారని తెలిపింది. చేసిన తప్పులకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ శిక్ష విధించింది. శిక్షలో భాగంగా స్వర్ణ మందిర్ సహా పలు గురుద్వారాల్లో సేవాదార్లుగా పని చేయాలంటూ శిక్ష ఖరారు చేసింది. సేవాదార్లుగా మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేయాలని, బూట్లు తుడవాలని ఆదేశించింది. అయితే,వారు చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పినా అకాల్ తఖ్త్ అంగీకరించలేదు. దీంతో అకాత్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా సుఖ్ బీర్ సింగ్ బాదల్ సేవాదార్‌గా పనిచేశారు. VIDEO | Punjab: Shiromani Akali Dal leader Sukhbir Singh Badal serves as a 'sewadar' at Golden Temple in Amritsar.#PunjabNews (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/c6lRVUbRX6— Press Trust of India (@PTI_News) December 3, 2024 -
మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు అకాల్ తఖ్త్ శిక్ష
ఛండీగఢ్: సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన పలు తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ గురుద్వారాల్లో పాత్రలు, బూట్లు, టాయిలెట్లను శుభ్రం చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. సుఖ్బీర్ సింగ్ బాదల్ తండ్రి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) బిరుదును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించింది.2007 నుండి 2017 వరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ క్షమాపణలు చెప్పడంతో అకాల్ తఖ్త్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అకాల్ తఖ్త్ ఆదేశాల్ని సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటించనున్నారు. VIDEO | Five high priests headed by Akal Takht Jathedar Giani Raghbir Singh pronounce punishment for former Punjab deputy CM Sukhbir Singh Badal for religious misconduct.On August 30, Sukhbir was declared ‘tankhaiya’ by Akal Takht, which held him guilty of religious misconduct… pic.twitter.com/MwPKXI1OS3— Press Trust of India (@PTI_News) December 2, 2024 -
తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు మూడో పరాజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండర్ చామా మిలింద్ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసంగ్రూప్ ‘ఎ’లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోరులో .. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకం సాధించగా... రమణ్‌దీప్ సింగ్ (11 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), నేహల్ వధేరా (31; ఒక ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అజయ్‌దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చామా మిలింద్, రోహిత్ రాయుడు (37 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించగా... మికిల్ జైస్వాల్ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.తిలక్ వర్మ విఫలంకెప్టెన్ తిలక్ వర్మ (9), తన్మయ్ అగర్వాల్ (9), రాహుల్ బుద్ధి (5), అజయ్‌దేవ్ గౌడ్ (6), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన మిలింద్ భారీ సిక్స్‌లతో విరుచుకుపడినా... జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో నమన్ ధీర్ 5 వికెట్లు పడగొట్టాడు. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు పంజాబ్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 21; ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 1; అన్మోల్ప్రీత్ సింగ్ (సి) ప్రతీక్ రెడ్డి (బి) అజయ్‌దేవ్ గౌడ్ 60; నేహల్ వధేరా (సి) మిలింద్ (బి) నితిన్‌సాయి యాదవ్ 31; నమన్ ధీర్ (సి) రాహుల్ బుద్ధి (బి) రవితేజ 9; సానీ్వర్ సింగ్ (సి) రోహిత్ రాయుడు (బి) రవితేజ 24; రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 39; అర్ష్‌దీప్ సింగ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–115, 4–115, 5–149, 6–151. బౌలింగ్: రవితేజ 4–0–49–2; మిలింద్ 4–0–28–1; అజయ్‌దేవ్ గౌడ్ 4–0–38–2; రక్షణ్ రెడ్డి 2–0–26–0, నితిన్‌సాయి యాదవ్ 4–0–40–1; రోహిత్ రాయుడు 2–0–13–0. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) జసిందర్ సింగ్ (బి) నమన్ 9; రోహిత్ రాయుడు (సి) సాన్వీర్ సింగ్ (బి) నమన్ 56; తిలక్ వర్మ (సి) అర్ష్‌దీప్ (బి) జసిందర్ 9; మికిల్ జైస్వాల్ (సి) అన్మోల్ప్రీత్ (బి) మయాంక్ మార్కండే 39; రాహుల్ బుద్ధి (సి) అభిషేక్ శర్మ (బి) జసిందర్ 5; అజయ్‌దేవ్ గౌడ్ (సి) రమణ్‌దీప్ సింగ్ (బి) నమన్ 6; రవితేజ (ఎల్బీ) (బి) నమన్ 0; ప్రతీక్ రెడ్డి (స్టంప్డ్) ప్రభ్‌సిమ్రన్ (బి) నమన్ 4; మిలింద్ (సి) రమణ్‌దీప్ (బి) అర్ష్‌దీప్ 55; నితిన్‌సాయి యాదవ్ (రనౌట్) 0; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–57, 3–118, 4–120, 5–127, 6–127, 7–133, 8–141, 9–142, 10–189. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0; అర్‡్షదీప్ 4–0–47–1; బల్తేజ్ సింగ్ 3–0–35–0; నమన్ ధీర్ 4–0–19–5; జసిందర్ సింగ్ 4–0–44–2; మయాంక్ మార్కండే 2–0–22–1; సాన్వీర్ సింగ్ 2–0–14–0. -
By Election Results: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీదే హవా
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం(నవంబర్23) వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు, కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగ్గా వయనాడ్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ 4లక్షలకుపైగా రికార్డు మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్..48 సీట్లలో యూపీలో కీలకమైన 9 సీట్లున్నాయి. యూపీలో ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా రెండు చోట్ల సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచింది. వెస్ట్‌బెంగాల్..వెస్ట్‌బెంగాల్‌లో ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ మళ్లీ సత్తా చాటింది. ఇక్కడ ఆరింటికి ఆరు స్థానాలను మమతా బెనర్జీ పార్టీ కైవసం చేసుకుంది. బీహార్..బీహార్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది.ఇక్కడ తరారీ (బీజేపీ ), రామ్‌గఢ్ (బీజేపీ), బేలాగంజ్ (జేడీయూ), ఇమామ్‌గంజ్ (హెచ్ఏఎం(ఎస్))రాజస్థాన్..రాజస్థాన్‌లో ఉప ఎన్నికలు జరిగిన 7 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 5 గెలుచుకుంది. ఒక సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా భారత్ ఆదివాసీ పార్టీ(బీఏడీవీపీ) ఒక సీటు గెలుచుకుంది. కర్ణాటక..కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి13 వేలకుపైగా ఓట్లతో బొమ్మైపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్పంజాబ్.. పంజాబ్‌లో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడింటిలో ఆమ్ఆద్మీపార్టీ, ఒక సీటులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. కేరళ..కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నకలు జరగగా ఒక చోట అధికార సీపీఎం మరొకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. 4 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీ 👉కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4లక్షల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో రాహుల్‌గాంధీ ఇదే స్థానం నుంచి 3,64,422 ఓట్ల ఆధిక్యత సాధించారు. 👉కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతిల్ 18,840 ఓట్ల భారీ తేడాతో బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్‌పై విజయం సాధించారు.అస్సాం.. అస్సాంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా నాలుగింటిలో రెండింటిని అధికార బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఏజీపీ గెలుచుకున్నాయి. సిక్కిం..సిక్కింలోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగగా రెండు సీట్లలో ఎస్కేఎం గెలుపొందింది. గుజరాత్..గుజరాత్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఒక్క సీటులో బీజేపీ గెలుపొందింది. చత్తీస్‌గఢ్..ఛత్తీస్‌గఢ్‌లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా దానిని బీజేపీ గెలుచుకుంది.ఉత్తరాఖండ్..ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఇక్కడ బీజేపీ గెలుపొందింది. మేఘాలయ..మేఘాలయాలోని ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఈ సీటును ఎన్పీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.ఇది కూడా చదవండి: Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం -
ఒక్కరోజులో భారీగా పంట వ్యర్థాల కాల్చివేత.. మరింతగా పెరిగిన కాలుష్యం
చండీగఢ్: పంజాబ్‌లో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో తరహా కేసుల సంఖ్య 8,404కి చేరుకుంది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా 404 వరకూ పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాటిలో ఫిరోజ్పూర్లో 74, భటిండాలో 70, ముక్త్సర్లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 ఘటనలు ఉన్నాయన్నారు. ఫిరోజ్‌లో అత్యధికంగా పంటవ్యర్థాలను తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా పంజాబ్‌లో 2022లో ఒకేరోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగులబెట్టిన కేసులు నమోదయ్యాయి.కాగా గత సెప్టెంబరు 15 నుండి నవంబర్ 17 వరకు పంజాబ్‌లో 8,404 పంటవ్యర్థాలు తగులబెట్టారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇటువంటి సంఘటనలలో 75 శాతం తగ్గుదల కనిపించింది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్, నవంబర్లలో వరి పంట కోసిన తర్వాత భారీ ఎత్తున పంట వ్యర్థాలు తగులబెడుతుంటారు. ఇదిలో ఢిల్లీలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ రాజీనామా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి, పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘శిరోమణి అకాలీదళ్ అధక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నేడు పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించారని, పార్టీకి కొత్త అధ్యక్షుడిని అందించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇన్నాళ్లు తన నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు, తనకు మద్దతు, సహాకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్బీర్ సింగ్ బాదల్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు అకాలీదళ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ భుందార్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ జరగనుం. కాగా అకాలీదళ్ అధ్యక్ష పదవి, ఆఫీస్ బేరర్లు, కార్యవర్గానికి డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్!
ఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లాను కెనడాలో అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత పోలీసు వర్గాలు వెల్లడించాయి.అయితే.. అతను విడుదలయ్యాడా లేదా ఇంకా జైలులో ఉన్నాడా? అనే దానిపై ఎటువంటి సమాచారం తెలియజేయలేదు. ప్రస్తుతం కెనడాతో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎటువంటి సమాచారం పంచుకోకపోవటం గమనార్హం. అతని నిర్బంధంపై అధికారిక ధృవీకరించలేదు. అక్టోబర్ 27-28 తేదీలలో కెనడాలో జరిగిన కాల్పుల తర్వాత డల్లాను అదుపులోకి తీసుకున్నారు. కెనడియన్ ఏజెన్సీల ప్రకారం.. మిల్టన్‌లో జరిగిన కాల్పులపై హాల్టన్ ప్రాంతీయ పోలీసు సర్వీస్ (HRPS) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై హెచ్ఆర్పీఎస్.. గల్ఫ్ పోలీసులను సంప్రదించారు. ఆ రోజు కాల్పుల్లో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చేరారని, అందులో ఒకరికి డాక్టర్లు చికిత్స అందించి అనంతరం పంపించి వేశారని తెలిపారు.మరోవైపు.. 28 ఏళ్ల డల్లా తన భార్యతో కలిసి కెనడాలోని సర్రేలో నివసిస్తున్నట్లు భారత భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి. అతనికి దోపిడీ, హత్య, తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. అదీకాక.. అతనిపై UAPA కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అతడిపై ఇప్పటికే పంజాబ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. పంజాబ్‌లోని జాగ్రావ్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ పరమజీత్ సింగ్ హత్యకు డల్లా బాధ్యత వహించాడు. డేరా సచ్చా సౌదా అనుచరుడు మనోహర్ లాల్‌ను అతని సహచరులు నవంబర్ 2020లో కాల్చి హత్య చేశారు. మరో డేరా సచ్చా సౌదా అనుచరుడైన శక్తి సింగ్‌ను కిడ్నాప్ చేసి చంపడానికి కుట్ర పన్నడంలో డల్లా ప్రమేయం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో భారత్ డల్లాను మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది.#BreakingNews: Wanted Khalistani terrorist Arsh Dalla arrested in Canada@arvindojha joins us for more on this #ArshDalla #Canada #Khalistani (@ahuja_harshit94) pic.twitter.com/pWset1mtnh— IndiaToday (@IndiaToday) November 10, 2024 క్రెడిట్స్: IndiaTodayచదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా? -
బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల వాచ్ గిఫ్ట్
పంజాబ్‌లో నివాస భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడో వ్యాపారవేత్త. నాణ్యతగా, వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతలో కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా చూపిన ఖచ్చితమైన శ్రద్ధను గుర్తిస్తూ ఆయనకు ఈ బహుమతి అందించినట్లు భవన యజమాని గుర్దీప్ దేవ్‌బత్ చెప్పారు.కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా అందుకున్న ఈ వాచ్ 18-క్యారెట్ల బంగారంతో రూపొందించిన రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ స్కై-డ్వెల్లర్. చూడగానే బంగారు కాంతులతో ధగాధగా మెరిసిపోతున్న ఈ వాచ్‌కి బలమైన బంగారు లింక్‌లతో తయారైన సిగ్నేచర్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఉంది. అలాగే ఇందులో షాంపైన్-రంగు డయల్ కూడా ఉంది.200 మందికిపైగా కార్మికులుపంజాబ్లోని జిరాక్పూర్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం విషయానికి వస్తే ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రూప్రా అనే కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా కార్మికులతో నిరంతరం పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు.వాస్తుశిల్పి రంజోద్ సింగ్ భవనం డిజైన్‌ను రూపొందించారు. దృఢమైన సరిహద్దు గోడతో ఒక ప్రైవేట్ కోటలా దీన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన హాళ్లు, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాణపరంగా విశిష్టమైన ప్రత్యేకతలెన్నో ఈ భవనంలో ఉన్నాయి. -
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్‌ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
70 దేశాలను ఓడించి అందాల రాణిగా రాచెల్ గుప్తా : తొలి ఇండియన్‌గా చరిత్ర
-
పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర
న్యూఢిల్లీ: శీతాకాలంలో దేశ రాజధానిని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు కోర్టు తిట్ల తలంటుపోసింది. వ్యర్థాలను తగలబెట్టిన వారికి నామామాత్రపు జరిమానాలు వేస్తూ వదిలేస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిపై అక్టోబర్ 23వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు బుధవారం సమన్లు జారీచేసింది. విధి నిర్వహణలో విఫలమైన ఆయా ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం)ను కోర్టు ఆదేశించింది. సంబంధిత కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం బుధవారం విచారించింది. దహనాలను నివారించేందుకు 2021 జూన్‌లో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో అమలుచేయాల్సిన సీఏక్యూఎం నిబంధనలను గాలికొదిలేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇదేం రాజకీయ అంశం కాదుగా: ‘‘తగలబెట్టడం వల్ల శీతాకాలంలో ఢిల్లీ మొత్తం పొగచూరుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై అధికారగణం ఒత్తిడి ఉంటే వారికీ మేం సమన్లు జారీచేస్తాం. రాష్ట్రాల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్ ప్రభుత్వం గత మూడేళ్లలో నిబంధనలను అతిక్రమించిన వారిలో ఒక్కరిపై కూడా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టలేదు. తప్పుచేసిన వారిని విచారించేందుకు ఎందుకంత భయపడుతున్నారు?. ఇదేం రాజకీయ అంశం కాదు. కమిషన్ నిబంధనలను ఖచి్చతంగా పాటించాల్సిందే. ఇందులో రాజకీయాలకు తావులేదు. మీరే నియమాలను ధిక్కరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నారు. నామామాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. పంటభూముల్లో ఎక్కడెక్కడ పంటవ్యర్థాలను తగలబెడుతున్నారో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మీకు లొకేషన్ పంపుతోంది. మీరే అది ఎక్కడుందో దొరకట్లేదని కుంటి సాకులు చెబుతున్నారు’’అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి: పంజాబ్ కోర్టు ఎదుట పంజాబ్ తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదించారు. ‘‘పొలాల్లో వ్యర్థాలను కాలి్చన ఘటనలపై అధికారులు నమోదుచేసిన రెవిన్యూ రికార్డులు తప్పులతడకగా ఉంటున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఆదేశాలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి’’అని చెప్పారు. కేంద్రప్రభుత్వానికీ చీవాట్లు ‘‘కేంద్రప్రభుత్వం వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్‌ను కోరలు పీకిన పాములా మార్చేసింది. ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటిని అమలుచేసే బాధ్యత, సర్వాధికారాలు దానికి అప్పజెప్పలేదు. వాయుకాలుష్య సంబంధ నిపుణులను సీఏక్యూఎంలో ఎంపికచేయలేదు. సీఏక్యూఎం సభ్యుల విద్యఅర్హతలు అద్భుతంగా ఉన్నాయిగానీ అవి గాలినాణ్యత రంగానికి ఎందుకూ పనికిరావు’అని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి వాదించారు. సభ్యుల్లో ఒకరు గతంలో మధ్యప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి ఆరేళ్లు చైర్మన్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ‘‘అక్కడ సారథిగా ఉండటమనేది అసలైన అర్హత కాబోదు. కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?. వాయుకాలుష్యరంగ నిపుణులతో కమిషన్‌ను పటిష్టంచేయాలి’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ ప్రాంతంలో సీఏక్యూఎం చట్టం, 2021 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించటంలో సీఏక్యూఎం పూర్తిగా విఫలమైంది. దహనం ఘటనలను యద్దప్రాతిపదికన అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే’అని కమిషన్‌పై కోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. -
హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో క్షీణిస్తున్న వాయు కాలుష్యం కేసులో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల దహనం సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23వ తేదీన వ్యక్తిగతంగా హాజరై, పరిస్థితిని వివరించాలని సర్వోన్నత న్యాయస్థానం తమ ఆదేశాల్లో పేర్కొందిఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అసానుద్దీన్ అమానుల్లా, ఆగస్టిన్ జార్జ్ మాషిస్‌లతో కూడిన ధర్మాసనం దేశాలు ఇచ్చింది. కాలుష్య నిరోధక చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను విచారించాలంటూ జూన్ 2021న తాము జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రెండు రాష్ట్రాలపై మండిపింది. తమ ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హె చ్చరించిందికాగా దేశ రాజధాని దిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.అనేకసార్లు చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తనను తాను ‘నిస్సహాయతగా’ ప్రకటించుకోవాలని కోర్టు చీవాట్లు పెట్టింది. ‘ఇక మేము ఏం చేయలేము... మేము నిస్సహాయులమని వారిని వారే ప్రకటించుకోనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పంజాబ్, హర్యానా రెండూ గత మూడు సంవత్సరాలుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చే రైతులపై చర్యలు తీసుకోలేదని, కేవలం నామమాత్రపు జరిమానాలు మాత్రమే విధించాయని కోర్టు పేర్కొంది.ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు న్యాణ్యతను పర్యవేక్షించి, నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్‌ను కూడా తీవ్రంగా విరుచుకుపడింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని సీఏక్యూఎంను సుప్రీం అడిగింది. ఇదేమీ రాజకీయ అంశం కాదని పేర్కొంది. ఉల్లంఘనల కట్టడిలో విఫలమైనందుకు గానూ పంజాబ్, హరియాణా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
పంజాబ్: కట్టుదిట్టమైన భద్రత మధ్య పంచాయతీ ఎన్నికలు
చండీగఢ్: పంజాబ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు(మంగళవారం) గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం 19 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్ల రద్దీ నెలకొంది. ఈ ఎన్నికల్లో దాదాపు 1.05 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 3,798 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని సోహల్ సైన్ భగత్ గ్రామంలో ఓటింగ్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అమృత్‌సర్‌కు తరలించారు.గత నెలలో అసెంబ్లీ ఆమోదించిన పంజాబ్ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, 2024 ప్రకారం అభ్యర్థులు రాజకీయ పార్టీల చిహ్నాలను ఉపయోగించకుండా నిషేధం విధించారు. రాష్ట్రంలో మొత్తం 1.33 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 70.51 లక్షల మంది పురుషులు, 63.46 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు -
ఢిల్లీ కాలుష్యం: చర్యలు తీసుకోకపోవటంపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై సరైన చర్యలు తీసుకోకపోవటంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించటంపై సమావేశాలు జరపటం తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవలేదని అసహనం వ్యక్తం చేసింది.పంట వ్యర్థాలను కాల్చుతూ.. కాలుష్యానికి కారణమవుతున్న రైతులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో తమ ఆదేశాలను పాటించటం లేదని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఎక్యూఎం)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు పంట వ్యర్థాలు కాల్చిన వారి నుంచి నామమాత్రపు జరిమానాలు మాత్రమే వసూలు చేస్తోందని తెలిపింది.‘‘కాలుష్య నియంత్రణ మండలి చివరి సమావేశం ఆగస్టు 29న జరిగింది. అందులో పంట వ్యర్థాల దహనంపై ఎలాంటి చర్చా జరగలేదు. సెప్టెంబర్ నెలలో ఒక్క సమావేశం కూడా జరగలేదు. సమావేశాలకు చాలా మంది కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు హాజరు కాలేదు. కాలుష్య నియంత్రణపై నిర్లక్ష్యంగా ఉన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి నామమాత్రపు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇక.. ఈ విషయంపై కేంద్రం ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది.చదవండి: సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట