
రాయల్ రెవ్ హోటల్ వేదికగా ఏర్పాటు
పాకశాస్త్రం నైపుణ్యాలను ప్రదర్శించిన ప్రముఖ పంజాబీ మాస్టర్ చెఫ్స్
4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఫెస్టివల్
నగరం విభిన్న సంస్కృతులకు నిలయమే కాకుండా ఆహార వైవిధ్యానికి కూడా కేంద్రంగా నిలుస్తోంది. దీనికి ప్రతిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న ప్రాంతాలకు చెందిన వంటకాలు నగరంలో అలరిస్తుంటాయి. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్ వేదికగా ప్రతిష్టాత్మక పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. పంజాబ్ సంప్రదాయ పంటల పండుగ ‘పంజాబీ ఫుడ్ ఫెస్టివల్‘ను అమృత్సర్ గ్యాస్ట్రోనమికల్ యాత్రలో భాగంగా ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు రాయల్ రెవ్ హోటల్, లాజీజ్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ వేదికగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
దీనికి సంబంధించి బుధవారం రాయల్ రేవ్ హోటల్ వేదికగా పంజాబీ పసందైన వంటకాలతో ప్రముఖ పంజాబీ మాస్టర్ చెఫ్ రాజుసింగ్ సోన్వాల్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన మెనూలో మటన్ బెలిరామ్, రారా మటన్, సాగ్ మీట్, తందూరీ కుక్కడ్, కుక్కడ్ మఖన్వాలా, మచ్లీ టిక్కా, మచ్లీ అమృత్సరి వంటి మాంసాహార వంటకాలు ఉన్నాయన్నారు. శాఖాహారులు పనీర్ టిక్కా జలంధరి, పెథివాలి టిక్కీని ఆస్వాదించవచ్చు. వీటితో పాటు మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు.
చదవండి:35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో