chef
-
ఎక్స్‌లో లేఆఫ్, కట్ చేస్తే : వైట్‌హౌస్‌లోకి సగర్వంగా ‘ప్రియాంక’
నా ఉద్యోగం పోయింది అని బాధపడుతూ కూర్చోలేదు ఆమె. కొత్త కరియర్‌ను వెతుక్కుంది. పడిలేచిన కెరటంలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకొంది. కట్ చేస్తే వైట్ హౌస్‌లో స్పెషల్ గెస్ట్‌గా అవతరించింది.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన దీపావళి వేడుకలకు ఆహ్వానం అందుకున్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో ఒకరిగా నిలిచింది. టెక్కీ-నుంచి ఫుడ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ చెఫ్ ప్రియాంక నాయక్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి!అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో చదువుకున్న భారతీయ సంతతికి చెందిన స్టేటెన్ ద్వీపానికి చెందిన ప్రియాంక నాయక్ ఎక్స్(ట్విటర్)లో పనిచేసింది. లేఆఫ్స్‌లో భాగంగా 2022 లో ఉద్యోగాన్ని కోల్పోయింది. అంతకుముందు దాదాపు పదేళ్ల పాటు వివిధకంపెనీల్లో టెకీగా పని చేసింది. టెక్ ప్రపంచంలోతనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. టెకీగా విజయం సాధించినప్పటికీ, నాయక్ మనసు మాత్రం ఎపుడూ వంటలు చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇందలో ఉద్యోగం మీద దెబ్బ పడింది. కానీ ఆమె పట్టుదల మాత్రం చెక్కు చెదరలేదు. వంట చేయడం పట్ల ఆమెకున్న అభిరుచినే పెట్టుబడిగా మల్చుకుంది. సోషల్ మీడియాలో పాకశాస్త్ర బ్లాగ్‌తో ఆమె అవార్డ్ విన్నింగ్ జర్నీ మొదలైంది. ప్రత్యేకమైన తన వంటకాలను నెటిజన్లుతో పంచుకొనేది.సుస్థిరత, పర్యావరణ అనుకూల విధానాలతో శాకాహారి చెఫ్‌గా మంచి ఆదరణను దక్కించుకుంది. క్రిస్సీ టీజెన్ లాంటి టాప్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తొలి తరం భారతీయ అమెరికన్‌గా, నాయక్ తన బ్రాండ్‌లో వంట పుస్తక విక్రయాలు, సోషల్ మీడియా స్పాన్సర్షిప్స్, వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆమె ప్రత్యేకమైన “ఎకోకిచెన్” కాలమ్ ద్వారా మంచి ఖ్యాతిని సంపాదించింది. అటు ఆర్థికంగా సక్సెస్‌ను అందుకుంది. లక్షల్లో ఆర్జించడంతో పాటు ఇటు పాపులారిటీని కూడా దక్కించుకుంది. (తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!)ఈ క్రమంలోనే 2024 అక్టోబర్‌లో నాయక్ వైట్ హౌస్‌లో జరిగిన అతిపెద్ద దీపావళి వేడుకలకు స్పెషల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో తాను కూడా ఉన్నానంటూ తన స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.‘‘జీవితంలో ఎన్నో కష్టాలు, వ్యక్తిగతంగా, వృతిపరంగా ఎన్నో అవమానాలు.. తిరస్కరణలు.. కానీ స్వయంకృషితో రచయిత/టీవీహోస్ట్గాఎదిగాను. ఇపుడు ప్రతిష్టాత్మక వైట్‌హౌస్ దీపావళి వేడుకలకు హాజరు.. ఇది చాలా సంతోషంగానూ,గర్వంగానూ ఉంది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. View this post on Instagram A post shared by Priyanka Naik | Eco Chef & Travel (@chefpriyanka) -
ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...
మధుస్మిత సోరెన్ ముర్ము ఓ ట్రెండ్‌సెట్టర్. సంతాలి ఆదివాసీ వంటకాలను, ఇటాలియన్ వంటకాల శైలితో మేళవించి కొత్త రుచులను ఆవిష్కరిస్తోంది. సంతాలి సంప్రదాయ వంటల గురించి బ్లాగ్‌లో రాస్తోంది. కొద్దిరోజుల్లోనే ఓ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది మధుస్మిత. బాల్యంలో ఎదురైన చిన్న చూపు నుంచి ఎదిగిన విజయ కిరణం ఆమె. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా, రాయ్‌రంగపూర్ అమ్మాయి మధుస్మిత.పోటీలో విజయంఆదివాసీల ఆహారపు అలవాట్లు నాగరక సమాజానికి భిన్నంగా ఉంటాయి. అడవుల్లో దొరికే చీమలు, నత్తలు, ఇతర కీటకాల వంటలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. లంచ్ బాక్సులో ఆమె ఆహారాన్ని చూసిన ఇతర విద్యార్థులు ఆమెను తక్కువగా చూసేవారు. అప్పటినుంచి ఆమెలో తమ ఆహారపు అలవాట్లను నాగరకులు ఎందుకు తక్కువగా చూస్తారు... అనే సందేహం కలిగింది. ఆమెతోపాటే ఆమె సందేహం కూడా పెద్దదైంది. ‘ఒడిశా హోమ్‌ఫుడ్ షెఫ్’ పోటీల్లో గెలవడం మధుస్మితలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తమ సంప్రదాయ వంటకాలను ఇతర ప్రాంతాల వంటకాల శైలితో మేళవించి వండడం అనే ప్రయోగం కూడా విజయవంతమైంది. బీటెక్ చదివేనాటికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం విజయవంతం అవుతుందా లేదా అనే ప్రశ్నకు కోవిడ్ లాక్డౌన్ చక్కటి సమాధానాన్ని చెప్పింది. లాక్డౌన్ సమయంలో వంటల మీద పరిశోధనలు మొదలుపెట్టింది. లాక్డౌన్ తర్వాత సంతాలి వంటలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకోవడానికి ఆ గ్రామాల్లో పర్యటించింది. ఎలా వండుతున్నారో తెలుసుకుంది. తెలుసుకున్న విషయాలను బ్లాగ్‌లో రాయడం మొదలుపెట్టింది.ఇప్పుడామె చెఫ్‌లకు శిక్షణనిస్తోంది. ప్రముఖ రెస్టారెంట్లలో సంతాలి తెగ వంటకాలు ప్రముఖ స్థానంలో కనిపిస్తున్నాయి. 2022లో మాస్టర్ షెఫ్ పోటీల్లో పాల్గొంది. ఆమె చేసిన రెండు వంటలు న్యాయనిర్ణేతల జిహ్వను మైమరిపించాయి. ఇటాలియన్ వంటకం పోలెంతాని మధుస్మిత స్థానిక పద్ధతిలో ఎర్రబియ్యంతో చేసింది. వేయించిన చికెన్‌కు తోడుగా ఎర్ర చీమల చట్నీ వడ్డించింది. అలాగే పాల్వా చట్నీతో పాట్లపీత వంటకం కూడా. ఎండిన చింతాకు ΄పొడితో చేసిన వంటకాలను నగరవాసులు లొట్టలేసుకుని తింటున్నారు.గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ‘‘మా తల్లిదండ్రుల ఆలోచనలు చాలా సంప్రదాయబద్ధమైనవి. నేను బాగా చదువుకుని ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునేవారు. కానీ నేను మాత్రం మా సంతాలి తెగ మీద సమాజంలో నెలకొని ఉన్న తేలిక అభి్రపాయాన్ని తొలగించాలనుకున్నాను. సంతాలి వంటకాలను తెలియచేసే ఫుడ్ బ్లాగర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యాను. మా వంటలను పరిచయం చేశాను.ప్రపంచç ³టంలో వంటకాల్లో ఇటలీకున్న స్థానంలో మా సంతాలి వంటకాలను చేర్చగలిగాను. పెద్ద పేరున్న రెస్టారెంట్లు మా వంటకాలకు మెనూ కార్డులో ‘ట్రైబల్ క్విజిన్’ అని ప్రత్యేక కేటగిరీ కల్పిస్తున్నారు. ఇప్పుడు మా సంతాలి వంటకాలు ప్రపంచ ఆహారపట్టికలో ఉన్నాయి. నేను అనుకున్నది సాధించాను’’ అని సంతోషంగా చె΄్తోంది 32 ఏళ్ల మధుస్మిత. బాల్యంలో మనసుకైన గాయంతో తమ సంతాలి తెగకు ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చి పెట్టింది మధుస్మిత సోరెన్ ముర్ము. -
లిటిల్ చెఫ్ ! అపుడు అన్నం తినడానికి మారాం, ఇపుడు యూట్యూబ్ స్టార్‌గా
చిన్నారులకు అన్నం తినిపించాలంటే తల్లులకు పెద్ద టాస్క్. కథలు చెప్పాలి.. బుజ్జగించాలి.. లాలించాలి.. అంత చేసినా చివరకు సగం వదిలేస్తుంటారు. ఇప్పుడైతే మొబైల్ ఫోన్లో ఏదో ఒక కార్టూన్లు, రైమ్స్ పెట్టి తినిపించేస్తున్నారు. అసలు పిల్లలు ఏం తింటున్నారో కూడా వారికి తెలియట్లేదు. అలా వారిపై ఫోన్ల ప్రభావం ఉంటోంది. ఇలాగే ఈ చిన్నారి కూడా అన్నం తిననంటూ మారాం చేస్తుండేదట. కానీ ఆ పాప తల్లిదండ్రులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. ఆ పాపతోనే వంటలు చేయించడం ప్రారంభించారు. వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. – సాక్షి, హైదరాబాద్లిటిల్ చెఫ్.. తినేటప్పుడు ఏడుపు మానిపించడానికి చేసిన ప్రయత్నం ఆ పాపకు వంటలపై మక్కువను పెంచేలా చేశాయి. దీంతో ప్రస్తుతం ఆ పాప మరింత యాక్టివ్‌గా తన హావభావాలతో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ పాప పేరే శ్రీనిత్య. బాచుపల్లిలో నివాసం ఉంటున్న నవీన్ చారి, శైలజ కూతురైన శ్రీనిత్య వయసు 8 ఏళ్లు. ప్రస్తుతం మూడో తరగతి చదువుకుంటోంది. కానీ వంటలతో పెట్టే వీడియోలతో యూట్యూబ్‌లో స్టార్‌గా మారింది.ఇదీ చదవండి: ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!చిన్నప్పటి నుంచే ఆసక్తి.. నాలుగేళ్ల వయసు నుంచే పాప కిచెన్‌లోని వస్తువులతో గడిపేదట. పాప ఆసక్తి చూసిన తండ్రి కిచెన్ సెట్ కొనిచ్చాడు. ఇక ఎప్పుడూ వాటితోనే కాలం గడుపుతూ ఉల్లాసంగా ఉండేదట. అయితే అన్నం తినకపోయేదట. దీంతో పాపకు అన్నంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వంట పాత్రల్లో వంటకాలు చేయించడం నేరి్పంచారట. ఆ పాప చేసిన వంటకాలను చాలా ఇష్టంతో తినడం గుర్తించిన నవీన్.. ఓ రోజు పాప వంటలు తయారుచేస్తున్న సమయంలో వీడియోలు తీసి, ఇన్‌స్టాలో పెట్టాడు. బంధువులు, స్నేహితుల నుంచి ప్రశంసలు రావడంతో వీడియోలు తీయడం కొనసాగించాడు. అందుకోసం డ్రెస్‌లతో పాటు అన్ని రకాల మినియేచర్ వంట పాత్రలనూ కొనుగోలు చేశాడు. దాదాపు 5 ఏళ్ల వయసు నుంచే పాపతో వెరైటీ వంటకాలు చేయించడం, వాటిని అప్లోడ్ చేయడం చేస్తున్నాడు. శ్రీనిత్య చిన్నప్పటి నుంచే బుజ్జిగా మాట్లడటమే కాకుండా ముఖంలో హావభావాలు అద్భుతంగా పలికిస్తోంది. దీంతో వీక్షకులు కూడా పాప వంటకాలకే కాకుండా ఆమె ముఖ కవళికలకు కూడా ఫిదా అవుతున్నారు. ఆహారంపై ఆసక్తి పెంచాలి.. శ్రీనిత్యకు ఎలాగైనా ఆహారంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో పాటు, వంటలు చేయడం ఎంత కష్టమో తెలియజేసేందుకు ఇలా వంటకాలు నేర్పించాం. వీడియోలు తీసేటప్పుడు ఎలా చెబితే అలా చేస్తుంటుంది. అస్సలు అలిసిపోదు. వీడియో షూటింగ్ అనగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటు స్కూల్లో కూడా బాగా చదువుకుంటుంది. వారాంతాల్లో ఎక్కువగా వంటలు చేయిస్తూ వీడియోలు తీస్తుంటాం. పాప వంటలు చేస్తుంటే ముద్దుముద్దుగా అనిపిస్తుంటుంది. వంటలు చేసుకుంటూ పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, మంచి మాటలు చెప్పిస్తుంటాం. – నవీన్ చారి నారోజు, నిత్య తండ్రి -
సీటీ చెఫ్.. టేస్ట్‌కి కేరాఫ్
చారిత్రకంగా విభిన్న రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందిన మన నగరం విశ్వనగరిగా మారే క్రమంలో అంతర్జాతీయ రుచులకూ కేరాఫ్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే నగరం పాకశాస్త్ర ప్రావిణ్యులు, నలభీముల నిలయంగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితమైన చెఫ్ అనే పదం.. ఇప్పుడు రెస్టారెంట్స్, కేఫ్స్, ఆఖరికి ఇంటి వంటకు పేరొందిన హోమ్ చెఫ్స్ దాకా కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో కొంతకాలంగా భోజనప్రియులకు సేవలు అందిస్తున్న కొందరు చెఫ్స్ పరిచయం.. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న నోవోటెల్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న అమన్న రాజు.. సిటీలోని టాప్ చెఫ్స్‌లో ఒకరు. ఆయన 2012లో జరిగిన సిఒపి 11 ఇంటర్నేషనల్ క్లైమేట్ మీటింగ్‌లో ఆహార తయారీ బృందానికి సారథ్యం వహించినందున ఆయన పాకశాస్త్ర నైపుణ్యం గ్లోబల్ స్టాండర్డ్స్‌ను అందుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని ఐకాన్ ప్రధాన కార్యా లయం ప్రశంసలు మొదలుకుని 2014లో అకార్ చెఫ్ అవార్డు రాయల్ కరీబియన్ నుంచి క్యులినరీ సీ అవార్డ్స్‌తో సహా ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారు. రాడిసన్ బ్లూ ప్లాజా, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హాలండ్ అమెరికా క్రూయిస్ లైనర్స్ వంటి ప్రసిద్ధ హాస్పిటాలిటీ సంస్థల్లో పనిచేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ టైగర్ రిజర్వ్ సందర్భంగా ఒకసారి, అలాగే ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రత్యేక చెఫ్‌గా వండి వడ్డించిన ఘనత కూడా ఆయన దక్కించుకున్నారు. విజయాలు ‘అమేయం’.. 2 దశాబ్దాల కెరీర్లో పలు అవార్డులు గెలుచుకున్న చెఫ్ అమేయ్ మరాఠే. సన్–ఎన్–సాండ్ హోటల్స్, సెయింట్ వంటి కొన్ని అగ్ర బ్రాండ్లతో అలాగే నగరంలోని లార్న్ హోటల్స్, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్, ఇన్వెన్యూ హాస్పిటాలిటీ, ఓహ్రీస్ – ప్యారడైజ్లకూ సేవలు అందించారు. ప్రస్తుతం చెఫ్ అమేయ్.. హాస్పిటాలిటీ పరిశ్రమలో కన్సలి్టంగ్లో ఉన్నారు. అలాగే సొంతంగా జేఎస్ అమేయ్ ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. యువతను ఈ రంగం వైపు ప్రోత్సహిస్తూ తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.ప్రస్తుతం వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన చెఫ్ యాదగిరి నగరంలో చెఫ్స్ పదుల నుంచి వందలు వేలకు చేరుతున్న పరిస్థితుల్లో.. చెఫ్ కమ్యూనిటీలో యూనిటీ తీసుకువచ్చి సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెఫ్స్ కాలనీకి రూపకల్పన చేయడం, యువతను హోటల్ మేనేజ్మెంట్ రంగం వైపు ఆకర్షించేందుకు సీనియర్ చెఫ్స్కి గుర్తింపును ఇచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేక ఆర్టిఫిషియల్ రంగులు తదితర అనారోగ్యకర ముడి పదార్థాల వినియోగాన్ని రూపుమాపేందుకు కృషి చేయడంతో పాటు గ్రామాల్లో నిరుపేదలకు ఉపకరించే పలు సేవా కార్యక్రమాలు సైతం ఆయన తమ సంస్థ తరఫున నిర్వహిస్తున్నారు.మాస్టర్ చెఫ్.. జన్మతః విశాఖపట్టణానికి చెందిన మహేష్ నగరంలో స్థిరపడి 22 సంవత్సరాల నుంచి చెఫ్‌గా ఉన్నారు. నగరంలో, బెంగుళూర్లో షెరటెన్ గ్రాండ్ గ్రూప్ ఆధ్వర్యంలోని రెస్టారెంట్స్‌లో సేవలు అందిస్తున్నారు. వెస్టిన్, మారియట్ హోటల్స్‌లో చేశాను. అమెరికాలో చేశాను. దేశంలో 35 రెస్టారెంట్స్‌లో చేశాను. విదేశాల్లో కూడా చాలా పేరొందిన రెస్టారెంట్స్‌లో చేశాను. 2010లో మారియట్ గ్లోబల్ రైజింగ్ స్టార్ చెఫ్స్ ఆఫ్ ద ఇయర్‌గా ఏసియాలో బెస్ట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తదితర పురస్కారాలు దక్కించుకున్నారు. చెఫ్ అనే పదం అంటేనే తనకెంతో ప్రేమ అంటూ మెడమీద పచ్చ»ొట్టు సైతం పొడిపించుకున్న మహేష్.. ఆ ప్రేమతోనే దాదాపు 1,000 మందికిపైగా చెఫ్స్‌ను తయారు చేశానని సగర్వంగా చెబుతారు.క్రూయిజ్ నుంచి సిటీ దాకా... దశాబ్దంన్నరగా సిటీలో సేవలు అందిస్తున్న చెఫ్ నరేష్ ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠా వంటి భారీ హోటళ్లు, క్రూయిజ్ లైనర్స్లలో కూడా పనిచేశారు. గ్రాండ్ హయత్ రీసార్ట్ అండ్ స్పా, ఫ్లోరిడా ఐడా క్రూయిజ్‌లో తనదైన ముద్ర వేశారు. హల్సియోలో సౌస్ చెఫ్‌గా వంటగది. కొత్త రకం వంటకాలను సృష్టించడంలో బిజీగా ఉన్నారు. మాదాపూర్‌లోని సి–గుస్తా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న హల్సియోన్ ఫుడ్‌కు కార్పొరేట్ చెఫ్‌గా నరేష్ సేవలు అందిస్తున్నారు. టైమ్స్ దినపత్రిక ఆధ్వర్యంలో 2019 సంవత్సరపు ఉత్తమ చెఫ్‌ని గెలుచుకున్నారు. -
ఇవి ఉద్యోగాలా.. నరకంలో శిక్షలా?
పని ఒత్తిడితో 26 ఏళ్ల ఈవై కంపెనీ ఉద్యోగి విషాద మరణం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఉదంతం తర్వాత పని గంటలు, విషపూరిత పని వాతావరణంపై అనేక దారుణ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పనిచేసిన చోట ఎదుర్కొన్న చేదు అనుభవాలను పలువురు పంచుకుంటున్నారు.బెంగుళూరుకు చెందిన నయనతార మీనన్ అనే చెఫ్, న్యూట్రిషన్ కోచ్ తాను పనిచేసిన ఓ విలాసవంతమైన హోటల్లో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఓ మ్యాగజైన్‌కు వివరిస్తూ పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగులతో రోజుకు 18 నుండి 20 గంటలపాటు పని చేయిస్తారని, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు కూడా సమయం ఇవ్వరని చెప్పారు.ఇక విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిని దారుణంగా శిక్షిస్తారని తెలిపారు. రెండు గంటల పాటు చేతులు పైకెత్తి నిలబెడతారని, ఒట్టి చేతులతో రిఫ్రిజిరేటర్లను శుభ్రం చేయిస్తారని చెప్పుకొచ్చారు.నరకానికి స్వాగతం"నన్ను ఒక లగ్జరీ హోటల్లో చేర్చుకున్నప్పుడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాకు 'వెల్కమ్ టు హెల్' అని చెప్పారు. ఆ మాటలు నిజమేనని తర్వాత తెలిసొచ్చింది. అక్కడ ఉద్యోగులకు 18-20 గంటల వర్ఖ్ షిఫ్టులు ఉన్నాయి. సీనియర్లు యువత శ్రమను వాడుకుంటారు. లైంగిక వేధింపులు సైతం ఉన్నాయి" అని నయనతార అక్కడి దారుణ పరిస్థితులను వెల్లడించారు. -
సిక్స్ ప్యాక్ చెఫ్ ’కట్ చేస్తే’ : వరల్డ్ రికార్డ్, వైరల్ వీడియో
కూరగాయలు కట్ చేయడం కూడా ఒక కళే. కళే కాదు వరల్డ్ రికార్డు కూడా అని నిరూపించాడు ఒక నలభీముడు. అదీ కళ్లు మూసుకుని. ‘సిక్స్ ప్యాక్ చెఫ్’గా పేరొందిన కెనడియన్ చెఫ్ వాలెస్ వాంగ్(WallaceWong) కట్ చేయడంలో తన రికార్డుల పరంపరను కొనసాగించాడు. తాజాగా ఏకంగా కళ్లకు గంతలు కట్టుకొని మరీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. పదునైన కత్తితో, తొమ్మిది టొమాటోలను సమానభాగాలుగా కట్ చేశాడు.చెఫ్ వాంగ్ జూన్ 12న లండన్‌లో కేవలం 60 సెకండ్ల వ్యవధిలో 9 టమోటాలను కోసి ఈ ఘనతను సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. వాయువేగంతో, అన్ని టొమాటాలను సమానంగా అందంగా కత్తిరించాడని వెల్లడించింది. ఇక్కడ విశేషం ఏంటేంటే ఏమాత్రం చిన్న తేడా వచ్చిన టమాటా ముక్కల స్థానంలో అతని వేళ్లు ఉండేవి. కానీ ప్రయోగాలు,రికార్డులు అతనికి వెన్నతో పెట్టిన విద్య. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords)చాలా జాగ్రత్తగా ఒడుపుగా కట్ చేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. వాలెస్ వాంగ్ ఈ ఒక రికార్డును మాత్రమే కాదు 2023, ఇటలీలో మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. తాజా వీడియోపై కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించగా, మా అమ్మ కూడా బాగా కట్ చేస్తుందని ఒకరు, ఇండియాలో ఇంతకంటే వేగంగా కట్ చేసే నిపుణులు చాలామంది ఉన్నారు అంటూ మరొకరు కమెంట్ చేశారు.వాలెస్ వాంగ్ చెఫ్, ఫిట్నెస్ అథ్లెట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మాత్రమే కాదు. ఒక కంపెనీకి సీఈవో కూడా. కేన్సర్ సర్వైవర్. ప్రపంచవ్యాప్తంగా అనేక టాప్ మెస్ట్ రెస్టారెంట్లలో పనిచేశాడు. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లున్నారు. Can he beat the record? #chef #worldrecord #foodpreparation #canadasgottalent #foodchopper guinessworldrecord Wallace Wong attempts a World Record on Canada's Got Talent! 🥕🔪 pic.twitter.com/FpJPRDJ9WC— Olivia Gran (@GranOlivia) April 21, 2024 -
వంట మనిషి కోసం లక్షలు డిమాండ్: డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నటీనటులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు నటీనటులు సమంజసం కాని డిమాండ్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. షూటింగ్ సమయంలో కొంతమంది నటులు వ్యక్తిగత చెఫ్‌లను నియమించుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. అంతే కాదు.. వారి చెఫ్‌కు ఒక్క రోజుకు ఏకంగా రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. వారి డిమాండ్స్ చాలా హాస్యాస్పదంగా ఉంటాయని కశ్యప్ వెల్లడించారు. అయితే ఎవరనేది మాత్రం పేర్లు వెల్లడించలేదు.కొందరు నటులు తమకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే వారు చెఫ్ వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారని కశ్యప్ అన్నారు. అంతే కాకుండాహెయిర్, మేకప్ ఆర్టిస్టులు రోజుకు రూ.75,000 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది సాంకేతిక నిపుణుల కంటే ఎక్కువని కశ్యప్ పేర్కొన్నాడు. తాను హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఇప్పటికే ధనవంతుడు అయ్యి ఉండేవాడినని తెలిపారు.ఇదంతా నిర్మాతలు, వారి ఏజెంట్ల తప్పు వల్లే జరుగుతోందని.. నిర్మాతలు ఇలాంటి వారిని సెట్స్‌పై ఎందుకు అనుమతిస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు. కానీ నా సెట్స్‌లో ఇలాంటివి జరగవని చెప్పాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ సెట్‌కు మైళ్ల దూరంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బర్గర్ తీసుకురావాలని తమ డ్రైవర్‌ను ఓ నటుడు కోరినట్లు కశ్యప్ తెలిపారు. ఇలాంటి ఖర్చులు సినిమా మొత్తం నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.కాగా.. కశ్యప్ ఇటీవలే బాడ్ కాప్ సిరీస్‌లో నటించాడు. ఇందులో గుల్షన్ దేవయ్యకు విలన్‌గా నటించారు. -
రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..!
ఇటీవల యువతలో లక్షల జీతాలు కోసం వెంపర్లాడేవారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి అనుకున్న కొలువులో ఉద్యోగం కొట్టి గ్రేట్ అనిపించుకునేవారు. కానీ ఇప్పడు ఆ ఉద్యోగాలే వారికి విసుగు తెప్పించి బయటకొచ్చేలా చేస్తున్నాయి. పైగా సాదాసీదా ఉద్యోగాలు చేస్తూ..అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కొందరు. అలాంటి కోవకు చెందిందే యూఎస్‌కు చెందిన మహిళ. మంచి ఉద్యోగం, లక్షల్లో వేతనం వదులుకుని ఎలాంటి ఉద్యోగం చేస్తుందో తెలిస్తే షాకవ్వుతారు.వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన 34 ఏళ్ల మహిళ వాలెరీ వాల్కోర్ట్ గూగుల్, అమెజనా వంటి పలు కార్పోరేట్ కంపెనీల్లో పనిచేశారు. ఆ తర్వాత సీటెల్‌లో అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ పార్టనర్‌గా ఏకంగా రూ. 83 లక్షల వేతనం అందుకున్నారు. 2020 వరకు పలు కార్పొరేట్ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. ఇక వాటిల్లో ఉండే ఒత్తిడిలు, టెన్షన్లకు తట్టుకోలేక ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఉద్యోగం చేయాలనుకుని డిసైడ్ అయ్యింది వాల్కోర్ట్. అలా ఆమె ఫ్రాన్స్‌కు వెళ్లి పేస్ట్రీ స్కూల్లో జాయిన్ అయ్యి మూడెళ్ల పాట్ర శిక్షణ తీసుకుంది. అక్కడ రెస్టారెంట్ ఇంటర్నెషిప్లలో ఆహ్లదకరంగా ట్రైనింగ్ పూర్తి అయ్యిందని, ఈ క్రమంలో ఎంతో మంది స్నేహితులను కూడా సంపాదించుకున్నానని చెబుతోంది వాల్కోర్ట్. ప్రస్తుతం ఆమె మైసన్ చబ్రాన్ రెస్టారెంట్లో పేస్ట్రీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. యూఎస్‌లోని కార్పొరేట్ ఉద్యోగాల్లో లక్షలు సంపాదిస్తున్నప్పుడూ కంటే ఇప్పుడే మానసికంగా చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది. అంతేగాదు మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విలువైన జీతం కంటే మనసుకు సంతోషాన్ని, హాయిని ఇచ్చే ఉద్యోగమే బెటర్ అంటోంది వాల్కోర్ట్. ప్రస్తుతం చాలామంది యువతలో ఈ ధోరణి ఎక్కువ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(చదవండి: హాట్‌టాపిక్‌గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్..!) -
Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే?
చండీగఢ్‌కు చెందిన 23 సంవత్సరాల దేవిక మన్‌చందానీ ఇప్పుడు న్యూయార్క్‌లోని ప్రముఖ చెఫ్‌లలో ఒకరు. వంటలకు సంబంధించిన ఎన్నో పోటీల్లో బహుమతులు గెలుచుకుంది. పేస్ట్రీ చెఫ్‌గా రకరకాల ప్రయోగాలు చేస్తూ తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది.చిన్నప్పటి నుంచి దేవికకు వంటలన్నా, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనని చండీగఢ్ వీధుల నుంచి న్యూయార్క్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్ల వరకు తీసుకెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువులలో పాకశాస్త్ర ప్రవీణులు ఎంతో మంది ఉన్నారు. వారి దగ్గరి నుంచి ఎన్నో కుటుంబ వంటకాలను నేర్చుకుంది.వంటలపై దేవిక ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే న్యూయార్క్‌లోని కలినరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా(సిఐఎ)లో చదివే వరకు. పాకశాస్త్ర పరిధిని విస్తరించుకోవడానికి,ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ చదువు దేవికకు ఉపయోగపడింది.‘సిఐఎ’లో అకడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ నుంచి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డ్ వరకు ఎన్నో అవార్డ్లు అందుకుంది దేవిక. ‘స్కిల్స్ యూఎస్ఏ బేకింగ్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్’ పోటీల్లో పాల్గొనడం దేవిక కేరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ పోటీలో పాల్గొన్న ఏకైక భారతీయురాలిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఆ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం తనని రెండు అడుగులు ముందుకు వేసేలా చేసింది. ప్రసిద్ధ ‘గాబ్రియెల్’ రెస్టారెంట్‌కు సంబంధించి ముఖ్యమైన ఈవెంట్స్‌కు నాయకత్వం వహించేలా చేసింది.ఆ రెస్టారెంట్లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సవాళ్లు ఎదురయ్యేవి. క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి బాగా తెలిసిన దేవిక ఆ సవాళ్లను అధిగమించింది. ఒక విజేతగా సిఐఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేసే అవకాశం దేవికకు వచ్చింది. ‘పాత్ వేస్ టు ఎక్స్‌లెన్స్’ అంశంపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసింది. ‘ఎగ్జయిట్‌మెంట్‌కు ఎనర్జీ తోడైతే ఎంత విజయాన్ని అయినా సాధించవచ్చు’ అంటుంది దేవిక. ‘స్కిల్స్ యూఎస్ఎ’ రాష్ట్ర స్థాయి పోటీలకు న్యాయనిర్దేత పాత్ర పోషించిన దేవిక ‘బేకింగ్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్’కు సంబంధించిన పోటీకి పోటీ పడుతున్న తరువాతి తరం విద్యార్థులకు మార్గనిర్దేశం చేసింది.పేస్ట్రీ చెఫ్ కావాలనే కలతో చండీగఢ్ నుంచి అమెరికాకు వెళ్లిన దేవిక తన కలను నెరవేర్చుకోవడమే కాదు చిన్న వయసులోనే ప్రముఖ ‘పేస్ట్రీ చెఫ్’గా పెద్ద పేరు తెచ్చుకుంది.సూపర్ స్పీకర్..దేవిక మన్‌చందానీ చెఫ్ మాత్రమే కాదు స్ఫూర్తిదాయక వక్త కూడా. ఆమె వంటలతో పాటు ఉపన్యాసాలకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పనిచేస్తున్న క్రమంలోనే క్రైసిస్ మేనేజ్మెంట్కు సంబంధించిన సూత్రాలు పట్టుబడతాయని చెబుతుంది దేవిక. చదువుల కోసం వేరే దేశం వెళ్లే విద్యార్థులకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి.తాను అమెరికాకు వచ్చినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, వాటిని అధిగమించిన తీరును విద్యార్థులకు చెబుతుంటుంది దేవిక. ‘ఎంతో కొంత నేర్చుకున్నాను అనే తృప్తి కంటే ‘ఇంకా ఎంతైనా నేర్చుకుంటాను’ అనే దాహం విజయానికి దారి చూపుతుంది అంటుంది దేవిక. ‘లక్ష్యం మీద అయోమయం కాదు స్పష్టత ఉండాలి’ అంటున్న దేవిక ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తుంది.ఇవి చదవండి: Summer Season: ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్‌కి దూరంగా ఉండాలంటే? -
Nikitha Umesh: స్ట్రాంగ్‌గా ఉంటేనే మనుగడ
సాధారణంగా ఇళ్లలో ఆడవాళ్లే వంటలు చేస్తారు. వృత్తిపరంగా చూస్తే మగ చెఫ్‌లే ఎక్కువ కనిపిస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న చెఫ్ నిఖితా ఉమేష్‌ను అడిగితే... ‘‘నేను చెఫ్‌గా ఈ వృత్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ‘గిన్నెలు కడగడానికి వెళుతున్నావా’ అని వ్యంగ్యంగా అన్నవాళ్లే ఇప్పుడు నా వంటలు రుచి చూసి చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’’ అని వివరించారు. మాస్టర్ చెఫ్ ఇండియా (తెలుగు) జ్యూరీ ప్యానెల్లో స్థానం దక్కించుకున్న నిఖిత ఉమేష్ ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘చదువుకునే రోజుల్లో టీవీలో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా చూసేదాన్ని. ఇంట్లో రకరకాల వంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ ఆసక్తితోనే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. దుబాయ్, సింగపూర్లలో శిక్షణ కోసం రెండేళ్లపాటు పనిచేశాను. పేస్ట్రీ ప్రొఫెషనల్ అండ్ మాస్టర్ చాకోలేటియర్గా హైదరాబాద్‌లో ఏడేళ్లు పని చేశాను. అలా హైదరాబాద్ పేస్ట్రీ చెఫ్‌గా, క్యుజిన్ డిజైనర్‌గా పేరొచ్చింది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో మావారితో కలిసి మూడు పేస్ట్రీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాను. ఏ రంగమైనా మనల్ని మనం నిత్యం నిరూపించుకుంటూనే ఉండాలి. అందులోనూ ఆహారం విషయానికి వస్తే మరీ ప్రత్యేకం. ఇంట్లో తిన్నవారు ఆ వంట రుచి చెప్పేంతవరకు వంట వండినవారు ఒక తెలియని ఒత్తిడిని పీలవుతుంటారు. అలాగే, మేం ప్రతి రోజూ మా పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎంతోమందికి చేరవవుతుంటాం. కాబట్టి, ఈ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. నైపుణ్యంతోపాటు రుచిగా అందించాలనే భావన కూడా మమ్మల్ని గెలిపిస్తుంటుంది. వర్క్ బాగుంటేనే... ఐటీసీ హోటల్స్‌లో చెఫ్‌గా వర్క్ చేసినప్పుడు నా వయసు 22 ఏళ్లే. టీమ్‌లో పద్దెనిమిది మంది చెఫ్స్ ఉండేవారు. అందరూ మగవాళ్లే. అందులో సీనియర్స్ కూడా ఉండేవారు. నా వర్క్ బాగుంటేనే వారందరూ నన్ను గౌరవిస్తారు. ఈ విషయంలో ఎప్పుడూ నేను అలర్ట్‌గా ఉండేదాన్ని. వారికి తగిన సూచనలు ఇస్తూ ఏడేళ్లు పనిచేశాను. ఈ వర్క్‌లో శారీరక శ్రమతో పాటు టైమ్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కుటుంబం కూడా సపోర్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. నిజానికి ఇళ్లలో వంటలు చేసేవాళ్లు ఆడవాళ్లే కానీ. హోటల్స్‌లో వృత్తిపరంగా చెఫ్‌లుగా ఉన్న మహిళల శాతం మాత్రం తక్కువగానే ఉంది. కొత్తగా నేర్చుకుంటూ.. నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. అమ్మ ప్రభ డిఫెన్స్‌లో సీనియర్ అడ్మిన్ ఆఫీసర్, నాన్న ఉమేష్ ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు రాదు. మాస్టర్ చెఫ్ ఇండియా అవకాశం వచ్చాక తెలుగు నేర్చుకున్నాను. అందుకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. చెఫ్ కమ్యూనిటీ నుంచి ఎవరో నన్ను రికమండ్ చేసి ఉంటారు. ఆ విధంగా నాకు జ్యూరీలో సభ్యురాలిగా ఉండే అవకాశం లభించింది. పనిలో చూపించే శ్రద్ధ, తపన మనల్ని విజయమార్గంలో తప్పక నడిపిస్తుంది’’ అని వివరించారు ఈ మాస్టర్ చెఫ్. ఆమె అనుభవ పాఠాలు మరికొందరికి విజయ సోపానాలు అవుతాయి కదా... – నిర్మలారెడ్డి -
'రామ్ చరణ్ గారు.. ఈ రోజు ఏం చేస్తున్నారు'.. ఉపాసన వీడియో వైరల్!
మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను ఉపాసన పోస్ట్ చేసింది. ఉమెన్స్ డే స్పెషల్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఏంటి? మన చరణ్ అన్నయ్య ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో ఉపాసన మాట్లాడుతూ..' అత్తమ్మగారు.. ఈ రోజు మీ కిచెన్‌లో ఏం చేస్తున్నారు? రామ్ చరణ్ గారు మీరు ఏం వంటలు చేస్తున్నారు' అంటూ ఫన్నీగా ప్రశ్నలు అడిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా 'పిచాయా పామ్'!
బ్యాంకాక్‌లోని పోటాంగ్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన చెఫ్ పిచాయా పామ్ సూన్టోర్నియానాకిజ్ 2024 సంవత్సరానికి ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్ ఆఫ్ ది ఇయర్‌గా టైటిల్‌ని గెలుచుకుంది. బ్యాంకాక్‌లో పెరిగిన థాయ్, చైనీస్ ,ఆస్ట్రేలియన్ చెఫ్ పిచాయా పొటాంగ్లో మంచి పేరుగాంచిన చెఫ్‌గా ప్రసిద్ధి చెందింది. తన పామ్ జాతి వారసత్వానికి గుర్తుగా థాయ్ చైనీస్ వంటకాలను హైలెట్ చేస్తోంది. ఆమె ఈ అవార్డుని మార్చి 26, 2024న కొరియాలోని సియోల్‌లో వేడుకగా జరగనున్న అవార్డుల ఫంక్షన్లో ఆ అవార్డుని తీసుకుంటారు. ఈ ఏడాదిలో ఓపెనింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలైన తొలి మహిళా చెప్గా పిచాయా పామ్ నిలిచింది. ఈ ఏడాది అవార్డులను ఉత్తమ రెస్టారెంట్లు, బెస్ట్ చెఫ్‌ల వారిగా విస్తృత జాబితాను చేసింది. గతేడాది ఆసియాలో 50 ఉత్తమ రెస్టారెంట్లలో ఆమె రెస్టారెంట్ 35వ స్థానంలో ఉండగా, ప్రపంచంలోనే 50 ఉత్తమ రెస్టారెంట్ జాబితాలో పిచాయ్ రెస్టారెంట్ 88వ స్థానానికి పరిమితమయ్యింది. 'పోటాంగ్ ' అంటే సింపుల్ అని అర్థం. ఆమె తన పామ్ జాతి వారసత్వాన్ని, కుటుంబ వృత్తి అయినా ఆయర్వేద వైద్యాన్ని ప్రతిబింబించేలా వంటలు చేస్తుంది. అంతేగాదు చైనాటౌన్ ఆధారిత రెస్టారెంట్ ఆమె కుటుంబానికి చెందిన హెర్బల్ ఫార్మసీని కూడా పునర్నిర్మించే పనిలో ఉంది. ఆమె ప్రధానంగా 'సాల్ట్, యాసిడ్, స్పైస్, టెక్స్చర్, మైలార్డ్ రియాక్షన్ వంటి ఐదు ఇన్‌గ్రేడియంట్స్ ఫిలాసఫి కచ్చితంగా ఉండేలా తన వంటల మెనూని రూపొందించింది. ఆమె వంటల మెనూ పురాతన సంప్రదాయల్ని మిళితం చేసేలా ఉంటుంది. అంతేగాదు పిచాయా అమెరికన్ ఉమెన్స్ క్లబ్ ఆఫ్ థాయిలాండ్ సహకారంతో సొంతంగా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉమెన్ ఫర్ ఉమెన్(డబ్ల్యూఎఫ్డబ్ల్యూ)ని కూడా ప్రారంభించింది. ఇది ఒక లాభప్రేక్ష లేని సంస్థ. దీని సాయంతో గ్రామీణ మహిళకు పాకశాస్త్రంలో నైపుణ్యాలను, మెళుకువలను నేర్పిస్తుంది. పిచాయా ఏళ్లుగా పాకశాస్త్రంలో తీసుకున్న శిక్షణ, తన కుటుంబ ప్రోత్సహాం, చిన్ననాటి నుంచి రుచుల సమ్మేళనాల గూర్చి విన్న కథలు, తదితరాలు తనను ప్రపంచ స్థాయిలో అందరూ మెచ్చుకునేలా వండే స్థాయికి తీసుకొచ్చాయని చెప్పుకొచ్చింది. అదే తనకు ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా స్థానం దక్కించుకునేలా చేసిందని చెప్పింది చెఫ్ పిచాయా. View this post on Instagram A post shared by Tatler Dining Hong Kong (@tatlerdininghk) (చదవండి: తేనెను నేరుగా వేడిచేస్తున్నారా? పాయిజన్‌గా మారి..) -
ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు!
ఇందిరా గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజ్ గోవాలోని చెఫ్ సతీష్ అరోరా తన పుస్తకంలో పేర్కొన్న ఘటన ఇది. తాను ఇందిరా గాంధీకి బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయి పండ్లు ఇచ్చేందుకు ఎంతలా కష్టపడాడో గుర్తు చేసుకున్నారు. ఓ యుద్ధమే చేసినట్టు తాను రాసిన స్వీట్స్ అండ్ బిట్టర్స్: టేల్స్ ఫ్రమ్ ఏ చెఫ్స్ లైఫ్ అనే పుస్తకంలో వివరించారు. ఇంతకీ ఆ చెఫ్ గెలచాడా? లేదా? అసలేం జరిగిందంటే..అది 1983లో ఇందిరాగాంధీ చోగం (CHOGM) సమావేశం సందర్భంగా జరిగిన ఘట్టం. చెఫ్ అరోరా ఆ పుస్తకంలో.. 1983 నవంబర్‌లో దివగంత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో గోవాలో దాదాపు 40కి పైగా కామెన్వెల్త్ దేశాల నాయకులతో 48 గంటల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ సదస్సు వరల్డ్ టూరిజం మ్యాప్‌లో గోవాను ఉంచాలనే లక్ష్యంతో జరుగుతోంది. వారికి గోవా తాజా హోటల్లో ఆతిధ్యం ఏర్పాటు చేశారు. నాయకులకు అందించే వంటకాల మెనుతో సహా ఇందిరాగాంధీ భోజన మెనూ కూడా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. ఇందిరాగాంధీ బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయిలు తీసుకుంటారని ఆ మెనూలో ఉంది. గోవాలో అది కూడా నవంబర్ మాసం కావడంతో బోపాయిలు ఎక్కడ అందుబాటులో లేవు. అదీగాక ఈ కామెన్వెల్త్ నాయకుల సదస్సు కోసం గోవా అంతటా టైట్ సెక్యూరిటీతో పోలీసులు బందోబస్తుతో హాడావిడిగా ఉంది. ఎక్కడిక్కడ మరమత్తులు చేసి వీధి దీపాలు వెలిగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బయటకు వెళ్లి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పోలీస్ చెకింగ్ దాటుకుని బయటకు వెళ్లి తిరిగి రావడం మాటలు కాదు. దీంతో చెఫ్‌ల బృందం బొప్పాయిలను ముంబై తాజ్ నుంచి తెప్పించే ఏర్పాట్లు చేసిందని అక్కడే ఐదేళ్లుగా సేవలందించిన చెఫ్ సతీష్ అరోరా వెల్లడించారు. "వచ్చిన పచ్చి బొప్పాయిలు తొందరగా పక్వానికి వచ్చేలా కాగితం చుట్టి ఉంచాను. అవి పక్వానికి మెల్లగా వస్తున్నాయి. ఇంకో పక్క ఇందిరా గాందీ, ఆమె సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పడంతో ఎలా అందించాలో తెలియక కలవరపడుతున్నాం. ఎందుకంటే సరిగా పక్వానికి రానీ పండ్లను వారికి ఎలాఅందించాలో తెలియక ఒకటే ఆందోళన. ఇక లాభం లేదనుకుని ఆమెకు బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయిలు అందించేందుకు పోలీస్ జీపులో ఓ యుద్ధ వీరుడి మాదిరి గోవా మార్కెట్లన్నీ గాలించానని" తెలిపారు అరోరా. "చివరికి ఓ మార్కెట్లో పండిన బొప్పాయిలు కనిపించాయి. ఓ డజను బొప్పాయిలను తీసుకుని అదే జీపులో వస్తూ.. ఏదో సాధించిన వీరుడిలా ఆనందంగా వచ్చా". కానీ చివరికి ఆ హోటల్ ప్రవేశించేందుకు హోటల్ సెక్యూరిటీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యులు అరోరాను అడ్డుకున్నారు. వాస్తవాన్ని వివరించి ఎంతగా బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పండ్లలో పేలుడు పదార్థాలు ఉన్నాయోమో! అని ప్రతి దానికి రంధ్రాలు పెట్టి చెక్‌చేశారు. ఓ రెండు చెక్‌లు చేసి వదిలిపెట్టక మొత్తం అన్నింటికి రంధ్రాలు చేశారు సెక్యూరి సిబ్బంది. ఏదో రకంగా ప్రదాని ఇందిరా గాంధీకి బ్రేక్‌ఫాస్ట్‌గా బోప్పాయిల అందిచేందుకు చేసిన యుద్ధం విజయవంతం కాకపోగా తమకు అత్యంత నిరాశనే మిగిల్చిందంటారు అరోరా. పైగా జీవితంలో మర్చిపోలేనంత టెన్షన్‌కి గురిచేసిన రసవత్తరం ఘట్టం అని తన పుస్తకం స్వీట్స్ అండ్ బిట్టర్స్లో చెప్పుకొచ్చారు చెఫ్ అరోరా. నాయకులకు సంబంధించని కొన్ని ఆసక్తకర విషయాలు వాళ్లు మన ముందు సజీవంగా లేకపోయినా వాళ్ల నిర్ణయాలు, జీవితశైలికి అద్దం పట్టేలా కనిపిస్తాయి కదూ!. (చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!) -
వ్యర్థాల నుంచి రుచికరమైన వంటలు తయారు చేస్తున్న పాపులర్ చెఫ్
వంట అందరూ చేస్తారు కానీ, ఎక్కువమంది తినేట్టు, నచ్చేటట్లు చేసిన వారు మాత్రమే చెఫ్‌గా మారతారు. మరింత రుచికరంగా... ఘుమఘుమలాడేలా వినూత్నంగా ఆహారాన్ని తయారు చేసిన వారు పాపులర్ చెఫ్‌గా పేరు తెచ్చుకుంటారు. ఇలా పాపులర్ అయిన అతికొద్దిమంది చెఫ్‌లలో ఒకరే దవీందర్ కుమార్. ప్రొఫెషనల్ చెఫ్‌గా యాభై ఏళ్లు పూర్తి చేసుకుని వేస్ట్ టు ప్లేట్’ ఐడియాతో ఇండియాలోనే గాక ప్రపంచంలోని చెఫ్‌లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెఫ్ డీకేగా పేరొందిన దవీందర్ కుమార్ ఢిల్లీ యూనివర్శిటీలో కామర్స్ డిగ్రీ పూర్తయ్యాక ప్రొఫెషనల్ డిగ్రీ చేయాలనుకున్నారు. అప్పట్లో పెద్దగా ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో లేవు. తన స్నేహితుడు ఒబెరాయ్ హోటల్లో పనిచేస్తుండడంతో తను కూడా హోటల్లో చేరాలనుకున్నాడు. ఇంట్లో ఎవరికీ ఇష్టలేకపోయినప్పటికీ ‘ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్’లో చేరాడు. మూడేళ్ల కిచెన్ మేనేజ్మెంట్ డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత.. ఒబెరాయ్ హోటల్లో పర్మనెంట్ ఉద్యోగి అయ్యాడు. దీంతో దవీందర్ చెఫ్ ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్ భాషపై ఉన్న ఆసక్తితో ఫ్రెంచ్ వంటకాలను సైతం నేర్చుకునేవాడు. ఆసక్తి మరింత ఎక్కువ కావడంతో పారిస్‌లోని టెక్నిక్ డీ హోటలియర్లో రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నాడు. తనకిష్టమైన వంటలన్నీ నేర్చుకుంటూ, మరోపక్క చెఫ్‌గా రాణిస్తూ ఒబెరాయ్ గ్రూప్‌లో 12 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తరువాత 1985లో ‘లీ మెరిడియన్’లో టీమ్ సభ్యుడిగా చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మెరిడియన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్గానేగాక, ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్ కలినరీ ఫోరమ్‌కు (ఐసీఎఫ్)కు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొక్కలతో... చెఫ్‌గా ఎంతో అనుభవం ఉన్న దవీందర్ కుమార్ ఒకరోజు టీవీలో వరల్ట్ ఫుడ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న ఆహారంలో మూడు వంతులు తినకముందే వ్యర్థంగా పోతుంది. ఒక్కో హోటల్లో పండ్లు, కూరగాయల నుంచి తయారు చేసే వంటకాల్లో కనీసం ఐదు నుంచి పది శాతం వ్యర్థంగా పోతుంది’’ అని చెప్పారు. ఇది చూసిన దవీందర్‌కు వ్యర్థాల నుంచి కూడా ఆహారం తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. అదే వేస్ట్ టు ప్లేట్. అనుకున్న వెంటనే పన్నెండు రెస్టారెంట్లు, ఐదు ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి పండ్లు, కూరగాయ వ్యర్థాలను సేకరించడం మొదలు పెట్టారు. అలా సేకరించిన వాటిని శుభ్రం చేసి రంగు, రుచికి తగ్గట్టుగా వేరు చేసి, పోషకాలతో కూడిన డిష్‌లను తయారు చేసి కస్టమర్లకు వేడి వేడిగా వడ్డించారు వీటిని తిన్నవారు ఇష్టపడడంతో వేస్ట్ టు ప్లేట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఫుడ్ వ్యర్థాల్లో కూరగాయ, పండ్లతొక్కలు, కొమ్మలు, కాడలు, విత్తనాలు కూడా ఉన్నాయి. స్పెషల్ మెనూ.. వ్యర్థాల నుంచి తయారు చేసే రుచికరమైన వంటలతో ఏకంగా స్పెషల్ మెనూని అందిస్తున్నాడు చెఫ్ డీకే. ఈ మెనూలో పనసపండు విత్తనాలు, బాదం హల్వా, సెలేరి, పాలకూర సలాడ్, యాపిల్ పల్ప్ పై, బ్రాకలీ, పుదీనా కాడల ముక్కల చట్నీ, జ్యూస్ తీయగా మిగిలిపోయిన బీట్రూట్తో రసం, క్యారట్ తొక్కల సలాడ్వంటివి ఉన్నాయి. ఈ డిష్‌లు రుచిగా, శుచిగానేగాక పుష్కలంగా పోషకాలు ఉండేలా వడ్డించడం విశేషం. View this post on Instagram A post shared by Chef Davinder Kumar (@chefdavinderkumar) కుక్ బుక్స్.. కొత్త వంటలని కనిపెట్టడమేగాక తను చేసే వంటలతో చాలా కుక్బుక్స్ను రాశాడు చెఫ్ డీకే. ఈ బుక్స్‌లో ‘కబాబ్ చట్నీ అండ్ బ్రెడ్’, జస్ట్ కబాబ్: ఫర్365 కబాబ్స్ అండ్ లీప్ ఇయర్’, సూప్స్, ఫోర్ సీజన్స్, సీజనల్ సలాడ్, సెకండ్ మీల్స్ వంటివి ఉన్నాయి. పుస్తకాల్లో కొన్నింటికి గౌరవ సత్కారాలు కూడా అందుకున్నారు. లీ మెరిడియన్ పదో వార్షికోత్సవం సందర్భంగా 7500 కేజీల కేక్‌ను తయారు చేసి లిమ్కాబుక్ రికార్డుల్లో నిలిచారు. అంతర్జాతీయ మెడల్స్‌తో పాటు, గోల్డెన్ హ్యాట్ చెఫ్ అవార్డు, భారత పర్యాటక మంత్రిత్వ శాఖతో బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా అవార్డు, జాతీయ టూరిజం అవార్డులను అందుకున్నారు. View this post on Instagram A post shared by Trends9 (@trends9official) -
బాల నలభీములు! తినడం చేతకాని ఏజ్‌లోనే వంటకాలు..!
వంట చేయడం ఓ కళ. అందరికీ తెలిసిన రెసిపే అయినా ఒకొక్కరి చేతిలో అమృతంలా మారుతుంది. దాన్నే చేతి మహిమ అంటుంటాం. అయితే ఇక్కడున్న పాకశాస్త్ర ప్రవీణులంతా తలలు పండిన పెద్దలు కాదు. బుల్లిబుజ్జాయిలు. ఎవరైనా తినిపిస్తే కానీ తినడం చేతకాని వయసులోనే గరిటె పట్టిన అభినవ నలభీములు. నిహాల్ రాజ్ ‘లిటిల్ షెఫ్ కిచ్చా’ అనే పేరుతో పాపులర్ అయిన నిహాల్ రాజ్.. దేశీవాసులకు సుపరిచితుడే. కేరళకు చెందిన పిల్లోడు. 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ విజేతగా నిలిచాడు. నిహాల్ తయారు చేసిన ‘మిక్కీ మౌస్ మ్యాంగో ఐస్ క్రీమ్’కి ప్రత్యేకమైన హక్కులను పొందేందుకు ఫేస్బుక్ ఈ అబ్బాయికి 2,000 డాలర్లు చెల్లించింది. పదమూడేళ్ల ఈ లిటిల్ షెఫ్.. తన యూట్యూబ్ చానెల్లో రకరకాల వంటలు వండుతూ, ఎవరికీ తెలియని రుచులను పరిచయం చేస్తున్నాడు. సోషల్ మీడియాలోని భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ఒమారీ మెక్‌క్వీన్ లండన్ కి చెందిన ఒమారీ మెక్‌క్వీన్ అనే 14 ఏళ్ల కుర్రాడు వెజిటేరియన్ వంటగాడు. ఇప్పటికే ఆన్లైన్లో వేల మంది హృదయాలను కొల్లగొట్టాడు. ఎనిమిదేళ్ల వయస్సులోనే యూట్యూబ్ చానెల్ని స్టార్ట్ చేశాడు. ఇంగ్లండ్, క్రోయ్డన్లోని ‘"Dipalicious (డిలీషియస్)’ అనే రెస్టారెంట్‌కి సీఈఓ కూడా. శాకాహారి షెఫ్‌గా ఈ బుల్లోడు ఎన్నో అవార్డ్‌లను అందుకున్నాడు. వంటలకు సంబంధించి పలు చిట్కాలను చెబుతూ పుస్తకాలూ రాశాడు. ఒమారీకి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫాలోవర్స్ ఎక్కువే. ఇన్‌స్టాలో తన కుకింగ్ వీడియోలతో పాటు.. కుటుంబంతో గడిపే ఆత్మీయ క్షణాలను రీల్స్‌లా మలచి షేర్ చేస్తుంటాడు. కేంబ్రియా కాలిఫోర్నియాకు చెందిన కేంబ్రియా.. నాలుగేళ్ల వయసు నుంచే జూనియర్ షెఫ్‌గా తన ఫాలోవర్స్‌కి రకరకాల వంటకాలను ఇంట్రడ్యూస్ చేసింది. ప్రపంచంలోనే అతి పిన్న వయసు షెఫ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నెలల వయసు నుంచే కేంబ్రియా మంచి ఫుడీ. ప్రస్తుతం ఈ పాపకు పదేళ్లు దాటాయి. సోషల్ మీడియాలో వంటల వీడియోలు, రీల్స్‌తో బిజీగా ఉంటుంది. పలు రెస్టారెంట్స్‌కి వెళుతూ అక్కడి వంటకాలను రుచి చూసి.. రివ్యూలు ఇస్తూంటుంది. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా అక్కడున్న షెఫ్ దగ్గర ఒక కొత్త వెరైటీ వంటకాన్ని నేర్చుకుని.. వీలైతే అక్కడే స్వయంగా వండి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. (చదవండి: డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..) -
ధోనిని ఇలాంటి స్టైల్లో ఎప్పుడైనా చూశారా?
-
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
Dhruvi Panchal: వన్స్‌మోర్ వంటలు
అహ్మదాబాద్‌లోని ఒక హెల్త్‌కేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్న ధృవీ పాంచల్‌కు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ పాషన్ తనను ఎక్కడిదాకా తీసుకెళ్లిందంటే వీధి పక్కన ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసేంత వరకు! అలా అని ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు ఫుడ్ స్టాల్ నడుపుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన పాంచల్ వీడియో వైరల్ అయింది. ‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకమ్మా ఈ కష్టం’ అన్న వాళ్లు అతి కొద్దిమంది అయితే... ‘ఈ వీడియో మమ్మల్ని ఎంతో ఇన్స్పైరింగ్ చేసింది’ అన్నవాళ్లు ఎక్కువ. -
మణికేరళం
ఎక్కడి కేరళ? ఎక్కడి మణిపుర్? అయితే మానవత్వానికి భౌగోళిక సరిహద్దులతో పనిలేదు అని నిరూపించే విషయం ఇది. కేరళ కోచిలోని ఆర్సీపీ రెస్టారెంట్లో మణిపుర్‌కు చెందిన సుస్మిత పనిచేస్తుంది. సర్వీస్ స్టాఫ్‌లో ఒకరైన సుస్మిత ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మూడుసార్లు ‘బెస్ట్ ఎంప్లాయీ’గా అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది... ఓ రోజున సుస్మిత డల్‌గా ఉండడం చూసి ‘ఏమైంది?’ అని అడిగాడు జనరల్ మేనేజర్. తన రాష్ట్రం మణిపుర్లో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లి, సోదరి గురించి ప్రస్తావిస్తూ ‘వారికేమైనా అవుతుందేమో’ అంటూ భయపడింది. విషయం తెలిసిన చెఫ్ పిళ్లై, అతని టీమ్ మణిపుర్ నుంచి ఆమె తల్లి, సోదరిలను రప్పించి కోచిలో బస ఏర్పాటు చేశారు. సుస్మిత తల్లి ఇబెంచదేవి, సోదరి సర్ఫిదేవిలకు ‘ఆర్సీపీ కోచి కిచెన్’లో ఉపాధి కల్పించారు. ఈ స్టోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. -
‘చికెన్ కర్రీలో ఎలుక’ ఎపిసోడ్లో ట్విస్ట్!
రెస్టారెంట్లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించడం.. ఆ వార్త ప్రముఖంగా వార్తల్లో, సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే.. ముంబై బాంద్రాలో జరిగిన ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్టమర్లు ఫుల్‌గా తాగొచ్చి అల్లరి చేయడమే కాకుండా.. తప్పుడు కేసు బనాయించారని రెస్టారెంట్ మేనేజర్ వాపోతున్నాడు. ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బాంద్రా వెస్ట్ పరిధిలోని పాలి నాకాలోని పాపా పంచావో దా దాబా రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ చికెన్, బ్రెడ్‌తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. ఫుడ్ తింటుండగా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించడంతో పరీక్షించి చూడగా అందులో చనిపోయిన చిన్న ఎలుక కనిపించింది. దీనిపై కంగుతిన్న కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. మేనేజర్ తీరుపై ఆగ్రహంతో బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్‌తో పాటు సర్వర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాగి వచ్చి డ్రామాలు గత 22 ఏళ్లుగా రెస్టారెంట్ నడుస్తోంది. ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. మద్యం మత్తులో ఆ ఇద్దరూ మా రెస్టారెంట్‌కు వచ్చారు. వచ్చాక కూడా తాగుతూ కనిపించారు. మందు కోసం డిమాండ్ చేశారు. మాది కేవలం ఫుడ్ డైనింగ్ మాత్రమని స్పష్టం చేసినా వినిపించుకోలేదు. సర్వర్‌తో గొడవ పడ్డారు. చివరకు చచ్చిన ఎలుకతో డ్రామాకు దిగారు. డబ్బు ఇస్తేనే సైలెంట్‌గా వెళ్లిపోతామని చెప్పారు. మేం ఒప్పుకోకపోవడంతో ఇంత రాద్ధాంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే.. వాస్తవాలు బయటపడతాయి అని మేనేజర్, సర్వర్లు చెబుతున్నారు. బెయిల్‌పై విడుదల అయితే రెస్టారెంట్ పేరును దెబ్బ తీయడంతోపాటు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే రెస్టారెంట్‌పై అపవాదు మోపారని నిందితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మంగళవారం నిందితులు ముగ్గురినీ బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు. కలుషిత ఆహారం నేరం కింద కేసు నమోదు అయ్యిందని.. ఎలుక బయటపడిందిగా చెబుతున్న ప్లేట్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపామని.. నివేదిక వస్తే అసలు విషయం బయటపడుతుందని బాంద్రా పోలీస్ అధికారి చెబుతున్నారు. @MumbaiPolice Rat found in our gravy at #papaPanchodadhaba near Pali naka Bandra West . No manager or owner is ready to listen . We called police and 100 as well . No Help yet . @mumbaimirror @TOIMumbai pic.twitter.com/YRJ4NW0Wyk — Stay_Raw (@AMINKHANNIAZI) August 13, 2023 చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
చెత్త ఏరుకునే స్థాయి నుంచి హోటల్లో చెఫ్ వరకు..
తల్లిదండ్రులు చనిపోయారు.బంధువులు దూరం జరిగారు. తనకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా కన్నీళ్లు, కష్టాలు మాత్రం కచ్చితంగా ఉండేవి. అయినా సరే ఆ చిన్నారి ఎప్పుడూ నిరాశపడలేదు. చెత్త ఏరుకునే స్థాయి నుంచి దిల్లీలోని ప్రముఖ హోటల్లో చెఫ్ వరకు ఎదిగి, కష్టాల చీకటిని ఛేదిస్తూ రెయిన్బోగా వెలిగి ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది లిలిమా ఖాన్... దిల్లీ వసంత్‌కుంజ్‌లోని లె క్యాంటిన్ రెస్టారెంట్లో లిలిమాఖాన్ చెఫ్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారింది. కడుపు నింపుకోవడం కోసం చెత్త ఏరింది. ఇటుకలు మోసింది. ఇండ్లలో పనిచేసింది... ఒకటా రెండా... పొట్టనింపుకోవడానికి ఎన్నెన్నో పనులు చేసింది. డబ్బులు లేని సమయంలో ఆకలి తట్టుకోలేక చెత్తబుట్టల్లో నుంచి మెతుకులు ఏరుకుని తిన్న సందర్భాలూ ఉన్నాయి. ఆకలి తీర్చుకోవడం ఒక ఒక పనైతే పోకిరీలు, రౌడీల నుంచి తనను తాను రక్షించుకోవడం మరో పెద్ద పనిగా మారింది. కష్టాల కత్తుల వంతెనపై నడుస్తున్న ఖాన్‌కు ‘కిల్కరి రెయిన్బో హోమ్’ రూపంలో దివ్యమైన దారి దొరికింది.‘ఇక్కడ నాకు ఆహారం, ప్రేమతో పాటు ఎన్నో దొరికాయి. అందులో చదువు ఒకటి’ అంటుంది ఖాన్. కుటుంబంలేని తనకు ‘రెయిన్బో’ అనే స్వచ్ఛందసంస్థ పెద్ద కుటుంబమై ప్రేమను పంచింది. ‘రెయిన్బో’లో ఖాన్‌కు ఇష్టమైన ప్రదేశం... వంటగది. వంటచేస్తున్న వాళ్లకు చిన్న చిన్న పనులలో సహాయపడేది. చదువు పూర్తయిన తరువాత ‘రెయిన్బో’ సహాయంతో ఖాన్ కుకింగ్‌లో అప్రెంటిస్‌షిప్ చేసింది. శిక్షణ పూర్తయిన తరువాత దిల్లీలోని ఇటాలియన్ రెస్టారెంట్లో స్టాఫ్ కుక్‌గా ఖాన్‌కు అవకాశం వచ్చింది. ఆ తరువాత లె క్యాంటీన్లో చేరింది.‘ఇంత పెద్ద హోటల్లో నేను పనిచేయగలనా అని మొదట్లో భయపడ్డాను. కొన్ని రోజులకు ఆ భయం దూరమైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ అంటుంది ఖాన్. ‘స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉండని ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకున్నారు’ అనేది ఖాన్‌కు తరచుగా ఎదురయ్యే ప్రశ్న. ‘చెఫ్ జూలియాకు ఇండస్ట్రీలో పెద్ద పేరు ఉంది. ఆమె నాకు ఆదర్శం. ప్రతిభ ఉంటే జెండర్ అనేది అడ్డంకి కాదు’ అంటుంది ఖాన్. ఒకరోజు హోటల్‌కు తనను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. ‘ఈ అమ్మాయికి నాతో పనేమిటి’ అనుకుంది మనసులో. ఆ అమ్మాయి మాత్రం మనసు విప్పి మాట్లాడింది. ‘పరీక్షలో ఫెయిల్ అయిన నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి. ఆ సమయంలో మీ గురించి చదివాను. నా సమస్య చాలా చిన్నదిగా అనిపించింది. ఎన్నో కష్టాలను తట్టుకొని మీరు సక్సెస్ అయ్యారు. మీ స్ఫూర్తితో నేను కూడా విజయం సాధించాలకుంటున్నాను’ అని చెప్పింది. ‘కష్టాలలో నలిగినా వెనకడుగు వేయకుండా సాధించిన విజయాలు మనకు మాత్రమే పరిమితం కావు. అవి పదిమందికీ స్ఫూర్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి అని నేను విన్న మాట ఆ సమయంలో గుర్తుకు వచ్చింది’ అంటుంది లిలిమాఖాన్. -
నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?
నైజీరియా దేశానికి చెందిన ఒక చెఫ్ చేపట్టిన కుక్-ఏ-థాన్ విశేషంగా నిలుస్తోంది. లాంగెస్ట్ కుక్ఏథాన్లో హిల్డా బాసీ వరుసగా 100 గంటలు వంట చేసి రికార్డ్ బద్దలు కొట్టింది. మే 11-15 వరకు ఏకథాటిగా కుక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల కెక్కింది. దీని ప్రధాన ఉద్దేశ్యం తమ నైజీరియన్ వంటకాల గురించి ప్రచారం చేయడమేనని ఆమె వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో నైజీరియన్ వంటకాలు కూడా ఒకటని, వీటి గురించిన విశేషాలు మరింతమందికి చేరాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. హిల్డా బాసిగా ప్రసిద్ధి చెందిన హిల్డా ఎఫియాంగ్ బస్సే ఈ 100 గంటల్లో 100 కంటే ఎక్కువ మీల్స్ , దాదాపు 55 ఇతర వంటకాలను ప్రిపేర్ చేసింది. ఈ కుక్-ఎ-థాన్ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. హిల్డా బాసికంటే ముందు సుదీర్ఘమైన వంట చేసిన రికార్డు భారతీయ చెఫ్ లతా టొండన్ పేరుతో ఉంది. దాదాపు 88 గంటల పాటు వంట చేసి రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Hilda Baci’s Cookathon (@hildabacicookathon) View this post on Instagram A post shared by Myfood By Hilda Baci (@myfoodbyhilda) -
రెస్టారెంట్లో చెఫ్‌గా మారిపోయిన స్టార్ హీరో.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది తునివు సినిమాతో సక్సెస్ అందుకున్న అజిత్ తర్వాత చేయబోయే సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే ఈ స్టార్ హీరో నేపాల్‌లో చెఫ్‌గా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..అజిత్‌కు బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం. రీసెంట్గా బైక్‌పై నేపాల్ వెళ్లిన ఆయన ఓ హోటల్లో చెఫ్ అవతారం ఎత్తాడు. ఈ సందర్భంగా అక్కడ వంట చేస్తూ షాకిచ్చాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంత సింపుల్‌గా ఉండటం చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అజిత్ వచ్చారని తెలిసి చుట్టుపక్కల ప్రజలు పెత్త ఎత్తున ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. Recent Ajith Kumar sir cooking Nepal hotel🤩🔥#RIDEformutualrespect #AjithKumar #Ak62 #Thala More exclusive video only on Ajithkumar_samrajyam follow now ❤️ pic.twitter.com/Sk3gyodxip — Ajithkumar_Samrajyam (@Ak_Samrajyam) April 24, 2023 -
ముకేశ్ అంబానీ వంటమనిషి జీతం ఎంతంటే?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరుగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా శాఖాహారమే తీసుకోవడం గమనార్హం. ఇటీవల అంబానీ డ్రైవర్‌కు ఇచ్చే జీతం గురించి తెలిసింది, కాగా ఇప్పుడు వంటమనిషికి ఎంత జీతం ఇస్తారన్నది వెలుగులోకి వచ్చింది. చాలా సాధారణమైన ఆహారం తీసుకునే ముకేశ్ అంబానీ ఎక్కువగా పప్పు, చపాతీ, అన్నం తింటారని, అంతే కాకుండా అప్పుడప్పుడు సరికొత్త వంటకాలు కూడా రుచిచూస్తారని సమాచారం. అంబానీ ఆహారపు అలవాట్లు ఆయన సాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయని చెబుతారు. ముకేశ్ అంబానీకి సాధారణ వంటకాలతో పాటు థాయ్ వంటకాలంటే కూడా చాలా ఇష్టమని సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆదివారం రోజు ఇడ్లీ సాంబార్ ఉండి తీరాల్సిందే అంటున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్న రాత్రి భోజం మాత్రం కుటుంబంతో కలిసి చేస్తారని గతంలో నీతా అంబానీ చెప్పారు. (ఇదీ చదవండి: భారత్‌లో మారుతి బ్రెజ్జా సిఎన్జి లాంచ్.. పూర్తి వివరాలు) అంబానీ ప్రతి రోజు తీసుకునే ఆహారానికి సంబంధించి కీలక పాత్ర చెఫ్ది (వంట మనిషి) అనే చెప్పాలి. ఎప్పుడు ఏమి తింటారనేది కూడా వారే చూసుకుంటారు. ఇంతలా జాగ్రత్తలు తీసుకునే వంటమనిషి జీతం భారతదేశంలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేల జీతంకంటే ఎక్కువని తెలుస్తోంది. సుమారు అంబానీ వంటమనిషి జీతం రూ. 2 లక్షల కంటే ఎక్కువే అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. -
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ రోటీ చేస్తే ఎలా ఉంటుంది? వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నారు. ఒక ఫుడ్ బ్లాగర్ తో కలిసి రోటీలు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం చెఫ్ అవతార మెత్తారు. ప్రముఖ చెఫ్ ఈటన్ బెర్నాథ్‌తో కలిసి రోటీలు చేసిన వాటిని నేతితో ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు రోటీ ఎలా చేయాలో నేర్చుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి వాటిని ఆరంగించారు. చాలా బాగున్నాయంటూ బిల్ గేట్స్ కితాబునిచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గేట్స్ ఒక వీడియోను పంచుకున్నారు, దీనిలో రోటీని ఎలా తయారు చేయాలో బెర్నాథ్ గేట్స్‌కు నేర్పించారు. ‘‘మేం కలిసి భారతీయ రోటీని తయారు చేసాం. ఈటాన్ భారతదేశంలోని బీహార్ పర్యటన నుండి తిరిగి వచ్చాడు, అక్కడ అతను గోధుమ రైతులను కలుసుకున్నాడు, కొత్త ప్రారంభ విత్తే సాంకేతికతలతో దిగుబడి గణనీయంగా పెరిగింది’’ అని గేట్స్ క్యాప్షన్‌లో రాశారు.అలాగే 'దీదీ కి రసోయ్' కమ్యూనిటీ క్యాంటీన్ల మహిళలను కూడా కలుసుకున్నారు. అటు పాప్యులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘‘నేను భారతదేశంలోని బీహార్ కు వెళ్లి వచ్చా.. అక్కడ గోధుమలను పండించే రైతులను కలిశాను. రోటీని తయారు చేయడంలో తమ నైపుణ్యాన్ని పంచుకున్న ‘దీదీ కీ రసోయి’ క్యాంటీన్లకు ధన్యవాదాలు’’ అని ఆయన రాశారు. .@BillGates and I had a blast making Indian Roti together. I just got back from Bihar, India where I met wheat farmers whose yields have been increased thanks to new early sowing technologies and women from "Didi Ki Rasoi" canteens who shared their expertise in making Roti. pic.twitter.com/CAb86CgjR3 — Eitan Bernath (@EitanBernath) February 2, 2023 -
పాక్‌తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ జట్టులోకి కొత్త వ్యక్తి
టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ ఒకటి నుంచి 21 వరకు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకే ఇరుజట్లు పూర్తిస్థాయి జట్లతో బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ తమతో పాటు కొత్త వ్యక్తిని పాకిస్తాన్‌కు తీసుకెళ్లనుంది. అయితే ఆ కొత్త వ్యక్తి ఆటగాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంగ్లండ్ జట్టు వెంట వెళ్లనుంది మాస్టర్ చెఫ్. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనున్న ఇంగ్లండ్ ఆటగాళ్లకు క్వాలిటీ ఫుడ్ అందించేందుకు తమ చెఫ్‌ను తీసుకెళ్లనుంది. ఎందుకంటే టి20 ప్రపంచకప్ కంటే ముందు ఇంగ్లండ్ పాకిస్తాన్లో పర్యటించింది. అప్పుడు ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడగా.. చివరగా ఇంగ్లండ్ 4-3 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. అప్పుడు జరిగిన టి20 సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫుడ్ విషయమై మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. ఫుడ్ అసలు బాలేదని.. తినడానికి ఇబ్బందిగా ఉందని.. క్వాలిటీ ఫుడ్ అందిస్తే బాగుండేదని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఈసీబీ టెస్టు సిరీస్‌కు మాత్రం నాణ్యమైన చెఫ్‌ను ఇంగ్లండ్ జట్టు వెంట పంపనుంది. కాగా ఇంగ్లండ్ జట్టు తమ వెంట చెఫ్‌ను తీసుకెళ్లడం కొత్త కాదు. ఇంతకముందు 2013-14 యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు తమ వెంట ప్రత్యేక క్యాటరింగ్ బృందం తీసుకెళ్లడం అప్పట్లో చర్చకు దారి తీసింది. అంతేకాదు 2019లో కివీస్ పర్యటనలో స్పిన్నర్ జాక్ లీచ్ ఫుడ్ పాయిజన్‌తో ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రి పాలైన లీచ్ ఆ సిరీస్ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. చదవండి: FIFA : రిపోర్టర్‌కు చేదు అనుభవం.. పోలీసుల జవాబు విని షాక్ -
చెఫ్‌గా మారిపోయిన హీరోయిన్ అనుష్క.. ఫోటో వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి గరిట పట్టారు. తన వంటలను కస్ట్మర్స్కి రుచి చూపించేందుకు చెఫ్‌గా మారారు. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. ఆమె నటిస్తున్న తాజా చిత్రం కోసమే. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తున్నారు. కాగా సోమవారం (నవంబర్ 7) అనుష్క బర్త్‌డేని పురస్కరించు కుని అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. On my Birthday I am happy to Introduce myself as Masterchef 'Anvitha Ravali Shetty' from my upcoming project with @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations 😊 Can’t wait to meet u all on Big Screen 🤞🏻❤️ pic.twitter.com/jsVFlTDwMM — Anushka Shetty (@MsAnushkaShetty) November 7, 2022 -
హిజాబ్ హీట్: పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్ ‘జామీ ఆలివర్’ మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు తీవ్రంగా కొట్టటం వల్ల ప్రముఖ చెఫ్ మెహర్షాద్ షాహిదీ అలియాస్ ‘జామీ ఆలివర్’ మృతి చెందటం కలకలం సృష్టించింది. ఆయన అంత్యక్రియలకు శనివారం వేలాది మంది హాజరయ్యారు. మెహర్షాద్ షాహిదీ 20వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. అరక్ సిటీలో మెహర్షద్ షాహిదీని అదుపులోకి తీసుకున్నారు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. వారు తీవ్రంగా కొట్టటం ద్వారా మెహర్షద్ షాహిదీ పుర్రె దెబ్బతిని బుధవారం మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘అరెస్ట్ చేసిన తర్వాత లాఠీతో కొట్టటం ద్వారానే మా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల ఒత్తిడి కారణంగా గుండె పోటుతో మరణించాడని చెప్పాల్సి వచ్చింది.’ అని బాధితుడి బంధువు ఒకరు ఇరాన్ ఇంటర్నేషనల్ టీవీకి తెలిపారు. మెహర్షద్ షాహిదీ గుండెపోటుతోనే మరణించాడని చెప్పాలని అధికారులు ఒత్తిడి చేశారని ఆయన కుటుంబం సభ్యులు సైతం వెల్లడించారు. మెహర్షద్ షాహిదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 25వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన చేసిన వంటలు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇదీ చదవండి: హిజాబ్ ధరించలేదని పోలీసుల టార్చర్?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి -
ఆటో డ్రైవర్‌కు రూ.25 కోట్ల లాటరీ
తిరువనంతపురం: కేరళలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్‌కు ఓనమ్ బంపర్ లాటరీలో రూ.25 కోట్ల జాక్‌పాట్ తగిలింది. మలేసియా వెళ్లి చెఫ్‌గా స్థిరపడాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న ఇతడు 22 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అన్ని పన్నులు పోను అనూప్ చేతికి రూ.15 కోట్లు అందుతాయని నిర్వాహకులు చెప్పారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని అనూప్ తెలిపాడు. -
చిట్టిచేతులతో అమ్మకోసం డిన్నర్.. వీడియో వైరల్..
బుడి బుడి అడుగులు వేసే ఓ రెండేళ్ల పసిపాప తన తల్లికోసం పసిప్రాయంలోనే చెఫ్‌గా మారింది. చిట్టిచేతులతో కూరగాయలు కట్ చేసి ప్రత్యేకంగా డిన్నర్ తయారు చేసింది. ఈ చిన్నారి ఎంతో ఓపికతో ఇష్టంగా ఆహారం వండిన తీరు నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేసింది. ఆగస్టు చివరి వారంలో అప్లోడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ అయి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో చిన్నారి స్వయంగా కూరగాయలు కట్ చేసింది. వాటిని జాగ్రత్తగా బాయిలర్‌లో పెట్టింది. పాప పని చేస్తూనే క్యారట్ కొరుక్కుని తినడం చాలా క్యూట్‌గా అనిపించింది. అంతేకాదు ఆ తర్వాత చికెన్ కూడా వండింది. టిక్‌టిక్‌టిక్ అంటూ చికెన్ ముక్కలను ఎయిర్ ఫ్రయర్లో వేసింది. ఓ పాకెట్ రైస్‌ను మైక్రోవేవ్‌లో పెట్టి దానికి కాస్త ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేసింది. ఆ తర్వాత రైస్‌ను ఓ బౌల్లోకి తీసుకుంది. చివరకు మొత్తం డిన్నర్‌ను ప్రిపేర్ చేసి టేబుల్‌పై పెట్టింది ఈ పసిపాప. ఆ తర్వత ఆమె తల్లి వచ్చాక.. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ డిన్నర్ చాలా రుచిగా ఉందంటూ తల్లి కూతుర్ని మెచ్చుకుని మురిసిపోయింది. ఈ క్షణం కోసం, తన వ్యక్తిగత చెఫ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. చిన్నారి వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. వావ్, అమేజింగ్ అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Bruna Fava and Natalie (@natalieandbruna) చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
యోగా, వంట మాస్టర్లకు ఆస్ట్రేలియా బంపర్ ఆఫర్
యోగా గురువులు, వంట చేయడంలో చేయి తిరిగిన చెఫ్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేస్తామని తెలిపింది. ఇప్పటి వరకు వంట మాస్టర్లు, యోగా గురువులు స్కిల్క్డ్ పర్సన్స్ కోటాలోనే ఆస్ట్రేలియా వీసాలు జారీ చేస్తోంది. దీని వల్ల వీసాలు పొందడానికి చాలా జాప్యం జరుగుతూ వస్తోంది. ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్(ఏఐఈసీటీఏ) కుదిరింది. అందులో భాగంగా యోగా గురువులు, చెఫ్‌లకు ప్రత్యేక వీసాలు జారీ చేస్తామని ఆస్ట్రేలియా టూరిజం మినిష్టర్ డాన్ తెహాన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగినప్పుడే ఏఐఈసీటీఏ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన తెలిపారు. ఈ వీసాల జారీకి సంబంధించిన నియమ నిబంధనలు త్వరలో ప్రకటించనున్నారు. -
వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడికి పాల్పడి ముఖం చాటేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని కెమిస్ట్రీ పబ్‌లో చెఫ్‌గా పని చేస్తున్న బి.సత్యజిత్ బెహరా(25) అదే రెస్టారెంట్లో పని చేస్తున్న యువతి(22)తో పరిచయం చేసుకున్నాడు. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) మూడు నెలలుగా ఆమె వెంట పడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుమార్లు ఆమె గదికి వచ్చి లెంగిక దాడికి పాల్పడ్డాడు. తన వాంఛలు తీర్చుకున్న తర్వాత పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేయడంతో పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సత్యజిత్ బెహరాపై ఐపీసీ 376, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఎస్సై నిర్వాకం: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లాడాడు.. చివరకు) -
నట్టింటికే నలభీములు!
సాక్షి, హైదరాబాద్: పులిహోర, బగారన్నం, గుత్తి వంకాయ, పూర్ణం బూరెలు, నేతి గారెలు, నాటుకోడి పులుసు, రొయ్యల వేపుడు, మటన్ కీమా ఇలాంటి వంటలు ఇంట్లోనే సులువుగా వండేస్తారు. మరి క్లాసిక్ చికెన్‌కర్రీ, థాయ్ బాసిల్ చికెన్ స్టిర్‌ఫ్రై, ఇటాలియన్ పీనట్ నూడుల్స్ విత్ చికెన్, మెక్సికన్ కార్న్ టోర్టిల్లా, నాచో చిప్స్, గ్రీన్ టొమాటో సల్సా.. ఇలా చిత్రమైన పేర్లతో ఉండే టేస్టీ వంటలు చేయాలంటే ఎలా? ఏముందీ ఓ మంచి చెఫ్ (వంటల నిపుణుడు)ను ఇంటికి పిలిపించుకుంటే సరి. గృహిణికి ఒకరోజు విరామం. ఉద్యోగినికి సెలవును సెలవుగా గడిపే అవకాశం. సరికొత్త వంటలను మన ఇంట్లోనే నచ్చినట్టుగా చేయించుకుని తినే వీలు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన శ్రుతిరెడ్డి సరికొత్తగా ‘ఓవైచెఫ్ (ఓన్ యువర్ చెఫ్)’పేరుతో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఏం వండాలి? ఎంత వండాలి? ఆధునిక నలభీములను ఒకచోటికి చేర్చడం, అవసరమైన వారి ఇంటికే వెళ్లి వంట చేసిపెట్టడం కోసం ఆన్లైన్ వేదికగా ‘ఓవైచెఫ్’ను శ్రుతిరెడ్డి ప్రారంభించారు. ఈ తరహా ప్రయోగం మన దేశంలో ఇదే మొదటిసారని అంచనా. రోజూ వంటచేసే గృహిణికి ఒకరోజు విరామం కావాలన్నా.. ఇంట్లో ఏదైనా చిన్న వేడుక జరుపుకొంటున్నా.. చెఫ్‌ను మీ ఇంటికి పిలిపించుకుని వంట చేయించుకోవచ్చు. ఎంతమందికి వండాలో, ఏమేం వండాలో చెబితే చాలు. ‘ఓవైచెఫ్’నుంచి ఆ వంటల్లో స్పెషలిస్టులను మన ఇంటికి పంపుతారు. నార్త్ ఇండియన్, సౌత్ రుచులు, చైనీస్, థాయ్, ఇటాలియన్, అమెరికన్, కాంటినెంటల్ ఇలా అన్నిరకాల వంటకాలు చేసే చెఫ్‌లు అందుబాటులో ఉంటారు. అంతేకాదు.. ప్రత్యేక వంటకాలు చేసేందుకు ఓవెన్లు, బార్బిక్యూల వంటి పరికరాలు లేకున్నా.. అందుబాటులో ఉండే పద్ధతిలోనే వంటలు చేయడానికి ప్రయత్నిస్తారని శ్రుతిరెడ్డి తెలిపారు. కలసి భోజనం చేస్తుండగా ఆలోచనతో.. శ్రుతిరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో ఉద్యోగం చేశారు. కొంతకాలం ఓ బొటిక్ నడిపారు. ఆ తర్వాత వర్జీనియా ప్రాంతంలో ‘టామరిండ్ ఇండియన్ కుకింగ్’పేరుతో ఒక రెస్టారెంట్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఈ ఏడాది జనవరిలో భారత్‌కు వచ్చారు. తర్వాత కరోనా రెండో వేవ్ లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో రోజూ స్వయంగా వండుకుంటూ, అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో.. ఇంటికొచ్చి వంట చేసిపెట్టే చెఫ్‌ల ఆలోచన వచ్చిందని శ్రుతి చెప్పారు. ఆ ఆలోచనకు కార్యరూపమే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రారంభమైన ‘ఓవైచెఫ్’అని వివరించారు. చెఫ్‌లకూ గౌరవం లభించాలి నీకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని మా తాత వంటేరు సుదర్శన్‌రెడ్డి చెప్తుండేవారు. ఆయన స్ఫూర్తితోనే కొందరు మిత్రుల సహకారంతో.. వినూత్నంగా ‘ఓవై చెఫ్’స్టార్టప్ తెచ్చాను. తినేవారి ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని వండగలిగిన నిపుణులు మావద్ద ఉన్నారు. గంటకు మూడు వందల రూపాయలు మొదలుకొని పన్నెండు వేల వరకు చార్జ్ చేసే టాప్ చెఫ్‌లూ ‘ఓవైచెఫ్’తో అనుసంధానమై ఉన్నారు. ఈ సర్వీస్‌ను మరింతగా విస్తరిస్తాం. వండటం అనే వృత్తికి సమాజంలో గౌరవస్థానం లభించేలా చేయాలనేది నా కోరిక. – శ్రుతిరెడ్డి, ఓవై చెఫ్ వ్యవస్థాపకురాలు -
వైరల్: సింగిల్ మీల్‌కు లక్షా ఎనభై వేలు!!
Turkey Stylish Chef Salt Bae Bill: కొత్తగా మొదలైన రెస్టారెంట్ అది. అయినా లోపల సీట్లు ఫుల్ అయ్యాయి. బయటేమో జనాలు క్యూ కట్టి ఉన్నారు. ఇంతలో బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలోని బిల్ చూపించాడు. సింగిల్ మీల్ రేటు మరీ అంతా? అని ఆశ్చర్యపోయారంతా. అలాగని వాళ్లేం కంగారుపడి వెనక్కి వెళ్లిపోయారనుకునేరు. ఏదేమైనా సరే.. ఎంత ఖర్చైనా ఆ రెస్టారెంట్లో ఒక్కసారైనా తిని తీరాల్సిందేనని తమ వంతు కోసం ఎదురుచూశారు. లండన్‌లోని ఓ రెస్టారెంట్ ‘కాస్ట్లీ’ బిల్లు ఇప్పడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. సింగిల్ మీల్‌కు 1800 పౌండ్లు(మన కరెన్సీలో ఒక లక్షా ఎనభై వేలు).. లండన్‌లో కొత్తగా మొదలైన నుస్ర్-ఇట్ రెస్టారెంట్ వేసిన ఛార్జ్ ఇది. కేవలం ఆ రెస్టారెంట్ చీఫ్ చెఫ్ సర్వ్ చేశాడన్న ఒక కారణంతో అంతేసి బిల్ వేశారు. వ్యాపారంలో సక్సెస్‌కి ప్రధాన సూత్రం.. కరెక్ట్ మార్కెటింగ్. అది లేకుంటే క్వాలిటీ ఎంతున్నా, ఎన్ని వ్యూహాలు పాటించినా ప్రయోజనం ఉండదు. గల్లీలో రుచికరమైన వంటలు వండే నుస్రెట్ గోక్సె.. తన హోటల్ వ్యాపారాన్ని వెరైటీగా ప్రమోట్ చేసుకున్నాడు. వెరైటీ స్టయిల్‌తో సర్వింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది అతనికి ఊహించని రేంజ్లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎంత ఖర్చైనా సరే అతని స్టైల్‌ను తాకిన తిండిని తినాలని జనాలు క్యూ కట్టేంతగా మార్చేసింది. Salt Bae is the world's greatest living artist pic.twitter.com/ZZMydLsoah — Francisco Garcia (@Ffranciscodgf) September 27, 2021 నుస్రెట్ నుస్రెట్ గోక్సె.. టర్కీ షెఫ్. మాంసాన్ని కట్ చేసే తీరు.. మోచేతి మీదుగా ఇస్టయిల్‌గా సాల్ట్‌ను, మసాలాను మాంసం మీద చల్లుతూ చాలామందిని ఆకట్టుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన నుస్రెట్ గోక్సె.. 2010-17 మధ్య చాలా దేశాలు తిరిగి పాక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. 2017లో టర్కీలోని ఓ ఇరుకుగల్లీలోని తన చిన్నిదుకాణంలో ఉన్న ఇతను.. స్టయిల్‌గా సాల్ట్, మసాలా చల్లే తీరు.. ‘సాల్ట్ బే’గా ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టింది. మీమ్‌గా అతని ఫొటో బాగా పాపులర్ అయ్యింది. విపరీతమైన క్రేజ్‌తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, బ్రాండ్స్ ప్రమోటర్‌గా బోలెడంత డబ్బు కూడా వచ్చిందతనికి. దీంతో ప్రపంచంలోని చాలా చోట్ల లగ్జరీ రెస్టారెంట్లను ఓపెన్ చేశాడు. తాజాగా సెప్టెంబర్ 23న లండన్‌లో రెస్టారెంట్ ఓపెన్ చేయగా.. అందులోని సింగిల్ మీల్ తాలుకా బిల్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Nusr_et#Saltbae (@nusr_et) చదవండి: ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. మిస్సింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్ -
ఈ చాక్లెట్లో షుగర్ ఉందా, 200 మంది డాక్టర్లతో చర్చలు చివరికి ఇలా
స్వీట్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ముంబై కుర్రాడు హర్ష్ కేడియకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అయితే ఆ అమితమైన ఇష్టానికి డయాబెటిస్ బ్రేక్ వేసింది. పన్నెండేళ్ల వయసులో హర్ష్ డయాబెటిస్ బారిన పడ్డాడు. ఇక అప్పటి నుంచి జీవనశైలి, అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. పార్టీలకు... చెక్.. స్వీట్లకు... కట్ పార్టీలకు... చెక్..స్వీట్లకు.... కట్... ఇలా రకరకాల చెక్‌లతో జీవితం దుర్భరప్రాయంగా అనిపించింది. ఖైదీ జీవితానికి తన జీవితానికి తేడా ఏమిటి! అని కూడా అనిపించింది. నోరు కట్టేసుకోకుండా రుచి మొగ్గలను మళ్లీ హుషారెత్తించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ‘అసలు ఈ డయాబెటిస్ ఏమిటి?’ అని దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి భారీ కసరత్తే చేశాడు. చాక్లెట్లో షుగర్ ఎంత ఉందో తెలుసుకునేందుకు రెండు వందల మందికి పైగా వైద్యులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. టీవీల్లో టూత్ పేస్ట్ యాడ్ లా.. ఈ చాక్లెట్ లో షుగర్ ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ మార్కెట్టులో ‘షుగర్–ఫ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్న చాలా చాక్లెట్లలో ఎంతో కొంత షుగర్ కూడా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ నేపథ్యంలోనే ‘డయాబెటిక్ ఫ్రెండ్లీ చాక్లెట్’ అనే ఐడియా మదిలో మెరిసింది.పేరుకి ‘షుగర్–ఫ్రీ’ అని కాకుండా 100 శాతం షుగర్–ఫ్రీ చాక్లెట్ తయారీ కోసం ఆలోచించాడు. ఎన్నో పుస్తకాలు తిరగేశాడు. అంతర్జాల సమాచార సముద్రంలో దూకాడు. డాక్టర్లు, న్యూట్రీషనిస్ట్లు, ఫుడ్సైంటిస్టులను కలిశాడు. తన నుంచి ఒక చెఫ్ బయటికి వచ్చాడు. ప్రయోగాల్లోనే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న హర్ష్ రకరకాల కంపెనీలలో పనిచేసి బిజినెస్ స్కిల్స్‌ను ఒంటబట్టించుకున్నాడు. తాను చేసిన పరిశోధన, వ్యాపార నైపుణ్యాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు...అలా ముంబై కేంద్రంగా ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ‘ఈ వయసులో ఇదొక దుస్సాహాసం’ అన్నవారు కూడా లేకపోలేదు. ‘సాహాసానికి వయసుతో పనేమిటి’ అని వెన్నుతట్టిన వారు కూడా లేకపోలేదు. ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ టాప్ క్వాలిటీ ఇన్‌గ్రేడియంట్స్‌తో, రుచితో రాజీ పడకుండా, అయిదు రకాల ఫ్లేవర్లతో తయారుచేసిన ‘ఏ డయాబెటిక్’ చెఫ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి టాక్ వచ్చింది. 24 సంవత్సరాల హర్ష్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్ 30–ఫోర్బ్స్ ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ జాబితాలో చోటు సంపాదించాడు. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న హర్ష్ కెడియ పేద డయాబెటిక్ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా హర్ష్ కెడియ పుస్తకాలు చదువుతాడు. తన భావాలను కాగితాలపై పెడతాడు. రచన అతనికేమీ కొత్తకాదు.‘డయాబెటిస్ సమస్య నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం వరకు తన అనుభవాలకు పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది కదా!’ అనేవాళ్లతో మనం కూడా గొంతు కలుపుదాం. ఒక ప్రాడక్ట్‌కు మార్కెట్లో మంచి టాక్ రావాలంటే...అది పేరుతోనే మొదలవుతుంది. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే పేరుతో తొలి అడుగులోనే మార్కులు కొట్టేసిన హర్ష్ కేడియ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పేదరోగులకు సహాయం చేస్తూ మంచిమనసును చాటుకుంటున్నాడు. -
రూ.750 జీతంతో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేశాను: స్టార్ హీరో
చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే గొప్ప నటుడాయన. విలక్షణమైన నటనతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్‌గా ‘మాస్టర్ చెఫ్’ అనే కార్యక్రమం త్వరలోనే తమిళంలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా విజయ్‌సేతుపతి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రాకముందు కుటుంబ పోషణ కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేసినట్లు పేర్కొన్నారు. 'చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ పూర్తైన తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి అర్థరాత్రి 12:30 గంటలవరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడ్ని.అక్కడే రాత్రి భోజనం కూడా తినేవాడ్ని. డబ్బులతో పాటు ఆకలి కూడా తీరుతుందనే కారణంతో అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చాలాకాలం వరకు పనిచేశాను. అలా నాకు ప్రతి నెలా రూ.750 జీతం ఇచ్చేవాళ్లు. దీంతో పాటు ఓ మూడు నెలల వరకు టెలిఫోన్ బూత్‌లో కూడా పనిచేశాను' అని సేతుపతి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక తనకు ఉల్లి సమోసా అంటే ఎంతో ఇష్టమని, కానీ ప్రస్తుతం అది ఎక్కడా దొరకడం లేదని తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్నప్పుడు తానే స్వయంగా ఉల్లిసమోసా చేసుకొని, ఒక కప్పు టీ తాగుతానని వివరించారు. -
నాకు గుడ్డు ఎలా ఉడకబెట్టాలో కూడా తెలియదు : హీరోయిన్
హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీషోలు సహా వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్లో 'హిజ్ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. బాలాజీ టెలిఫిలింస్, డింగ్ ఇన్ఫినిటీ సంస్థలు సంయుక్తంగా నిర్మంచిన ఈ సిరీస్ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో పాల్గొన్న ప్రియమణి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకుంది. 'ఈ వెబ్ సిరీస్‌లో తాను సాక్షి అనే చెఫ్ పాత్ర పోషిస్తున్నాని, రియల్ లైఫ్‌లో అసలు తనకు అసలు వంట చేయడమే రాదని పేర్కొంది. నిజం చెప్పాలంటే నాకు కోడిగుడ్డు ఉడకబెట్టడం కూడా రాదు. సెట్లో ఉన్న అబ్బాయిలు బాగా వంట చేసేవారు. ఈ సిరీస్‌లో వంట సీన్లు వచ్చినప్పుడు నేను వంట చేయడం చూసి వాళ్లంతా నవ్వుకునేవారు, నాపై జోకులు వేసేవారు' అని ప్రియమణి తెలిపింది. ఈ సిరీస్‌లో తాను పోషించిన చెఫ్ రోల్ చాలా కీలకమైనది, ప్రేక్షకులందరికీ నచ్చుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రియమణి తెలుగులో 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లోనూ అజయ్ దేవగణ్ తో కలిసి 'మైదాన్' చిత్రంలో నటిస్తోంది. చదవండి : వైరల్‌గా మారిన 'మై విలేజ్ షో' అనిల్ లగ్నపత్రిక హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాస్.. వైరలవుతోన్న ఫోటోలు -
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్‌టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్‌వర్క్‌నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్‌తో వడాపావ్‌లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్‌లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
నోరే ఊరేలా... కూరే కావాలా!
టేస్టీ టేస్టీ కూరను రుచి చూపించనున్నారు పూర్ణ. ఫుడ్ మేళా పెట్టారేమో అనుకుంటున్నారా? అదేం కాదు.. ‘బ్యాక్‌డోర్’ సినిమాలో రుచికరమైన కూర నేపథ్యంలో ఓ పాట ఉంటుంది. సినిమాలో నటీనటులు ఎలాగూ టేస్ట్ చేస్తారనుకోండి. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రంలోని రెండో పాట ‘నోరే ఊరేలా... కూరే కావాలా’ పాటను చెఫ్ సంజయ్ తుమ్మ చేతుల మీదగా విడుదల చేయించారు. ప్రణవ్ స్వరపరచిన ఈ పాటకు చాందిని సాహిత్యం అందించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. -
స్టార్ హోటల్ నుంచి వీధి బండికి..
ముంబై: కరోనా మనుషులనే కాదు వారి జీవనోపాధిని కూడా కాటేసింది. దీంతో ఎంతోమంది జనాల బతుకులు రోడ్డు పాలయ్యాయి. ఆ బాధితుల్లో ఒకరే అక్షయ్ పార్కర్. ఈయన చేయి తిరిగిన వంటగాడు. ఇంటర్నేషనల్ స్టార్ హోటల్లో ఆయన కింద ఎందరో వంటగాళ్లు ఉండేవారు. తాజ్ ఫ్లైట్ సర్వీస్‌తో పాటు ప్రిన్సెస్ క్రూయిజ్‌లోనూ పని చేసేవాడు. కానీ కరోనా విపత్తు వల్ల ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగం ఊడిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇలాగైతే బతుకు బండి ముందుకు సాగదని తెలసుకున్న అక్షయ్ ముంబై వీధిలో చిన్న స్టాల్ పెట్టుకుని బిర్యానీ వండుతూ నాలుగు పైసలు సంపాదిస్తున్నాడు. (వైరల్ వీడియో.. నిజం తెలిస్తే షాకవుతారు) ఆయన చేసే బిర్యానీ ఘుమఘుమలు మిమ్మల్ని తిననివ్వకుండా వదిలిపెట్టవు. ప్రస్తుతం ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హోటల్ నుంచి దిగి వచ్చి వీధిలో బండి పెట్టుకోవడం మామూలు విషయం కాదని నెటిజన్లు అతడిని కీర్తిస్తున్నారు. అతడి బిర్యానీ బండి వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఎంతైనా స్టార్ హోటల్ చెఫ్ కాబట్టి బిర్యానీ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంది. కిలో వెజ్ బిర్యానీ రూ.800 కాగా కిలో నాన్ వెజ్ బిర్యానీ రూ.900కు అమ్ముతున్నాడు. మీరూ ఆ బిర్యానీ రుచి చూడాలంటే ముంబైలోని దాదర్‌లో జేకే సావంత్ మార్గ్ ప్రాంతానికి వెళ్లి తీరాల్సిందే. (వైరల్: యువతి తలను కోసుకుని తినొచ్చు!!) -
జీవితంలో అది తల్చుకోకుండా వంట చేయను
రసొడే మే కౌన్ థా? (వంటగదిలో ఉన్నది ఎవరు?) అనే ర్యాప్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అంత స్పెషల్ ఏముంది అనుకునేరు? మరేం లేదు.. సాథ్ నిభానా సాథియా(కోడలా కోడలా కొడుకు పెళ్లామా) సీరియల్లో అత్త క్యారెక్టర్ కోకిలాబెన్ వంటగదిలో పొయ్యి మీద ఖాళీ కుక్కర్ పెట్టి ఉంది. అది చేసింది ఎవరు అంటూ అంటూ గోపిని ప్రశ్నిస్తూ కోడలికి చీవాట్లు పెడుతుంది. అందుకు ఆమె ఏడుస్తూ వంటగదిలో ఉంది రాశి అని చెప్తుంది. ఈ సన్నివేశాన్ని క్యాచ్ చేశాడు సంగీత దర్శకుడు యశ్‌రాజ్ ముఖటే. ఆ డైలాగ్‌లకు మ్యూజిక్ జోడించి వదిలాడు. అంతే.. అది కాస్తా నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. (చదవండి: లోలోపల భయంగా ఉన్నా.. పైకి నవ్వేదాన్ని’) అటు ఆ సన్నివేశం, ఇటు ఈ ర్యాప్ సాంగ్ రెండింటినీ కలిపి మీమ్స్ రాయుళ్లు ఫన్నీ మీమ్స్ సృష్టిస్తూ నెటిజన్లకు నవ్వులు పంచుతున్నారు. కోకిలా బెన్లా నటించిన రూపల్ పటేల్ దత్తా.. పాట బాగుందని యశ్రాజ్కు ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారు. అలాగే సీరియల్లో రాశిగా కనిపించిన రుచ హసబ్నీస్ కూడా తనకీ ర్యాప్ సాంగ్ తెగ నచ్చిందని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ పాటపై స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా స్పందించారు. "దీని గురించి ఆలోచించకుండా నా జీవితంలో కుక్కర్లో శనగల కూర చేయను కాబోలు" అని ట్విటర్లో రాసుకొచ్చారు. మరోవైపు ఈ ఒక్క వీడియోతో యశ్‌రాజ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఫాలోవర్లు కూడా భారీగానే పెరిగారు. (చదవండి: సర్జరీ చేశారు.. ఇంటికి వచ్చేశా: నటుడు) I dont think that I can ever cook chane in cooker again in my life without thinking about this. 🤣 https://t.co/doFqYxli1S — Vikas Khanna (@TheVikasKhanna) August 24, 2020 Double standards by #KokilaModi justice for #rashiben #RasodeMeinKaunTha #gopibahu pic.twitter.com/mEVJyqhlbI — Poonam Naik💎 (@P00Naik) August 24, 2020 How many of u feel the same... 😂🤪 #RasodeMeKonTha #RasodeMeinKaunTha #yashrajmukhate u made entire India crazy by this pic.twitter.com/HlaenHCkZh — Akash R R Upadhye (@AkashUpadhye) August 26, 2020 -
ఆగని బతుకు చక్రం
జీవితం ఎప్పుడూ పచ్చగా ఉండాలి. జీవితాన్ని మోడువార్చే వైపరీత్యాలు ఎన్ని ఎదురైనా వాటిని ఎదుర్కొని కొత్త దారులు వేసుకుంటూ ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా చిగురింప చేసుకుంటూ ఉండాలి. కోవిడ్ 19 జీవితాలను అతలాకుతలం చేసింది. జీవికలనే ప్రశ్నార్థకం చేసింది. ఎన్ని ప్రశ్నార్థకాలు ఎదురైనా వెనుకడుగు వేయాల్సిన పని లేదని నిరూపిస్తున్నారు కేరళవాసులు. పనిని గౌరవించే సంస్కృతే వారిని నిలబెడుతోంది. ముందుంది మంచికాలం అజ్మల్‌కి 28 ఏళ్లు. అతడిది కేరళలోని కొట్టాయం. కోస్టా క్రూయిజ్‌లో షెఫ్‌గా ఉద్యోగం చేయాలనేది అతడి కల. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరినప్పటి నుంచి కన్న కల అది. అతడి ఫ్రెండ్స్‌కి అందులో ఉద్యోగం వచ్చింది. అజ్మల్‌కి రాలేదు. దాంతో కొట్టాయంలోనే ఒక స్టార్ హోటల్లో ఉద్యోగం చేస్తూ మళ్లీ ప్రయత్నించాడు. గత ఏడాది చివరిలో సెలెక్ట్ అయ్యాడు. కొట్టాయంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది మార్చిలో విదేశాల బాట పట్టాల్సిన వాడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ కోవిడ్ మహమ్మారి అతడి రెక్కలను కట్టేసింది. కోస్టా కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితిని వివరిస్తూ తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. కనీసం ఏడాదిపాటు ఎదురు చూడాలని సూచించింది కోస్టా క్రూయిజ్ కంపెనీ. ఖాళీగా ఉండడంతో పిచ్చిపట్టినట్లయిందతడికి. దాంతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. తోపుడు బండి మీద కూరగాయలమ్ముతున్నాడు. ‘‘పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉంది. అప్పటి వరకు ఊరికే ఉండకూడదు. ఏదో ఒక పని చేయాలి’’ అని ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాడు అజ్మల్. హాస్టల్‌కి లాక్డౌన్ కోళికోద్‌కు చెందిన ప్రీతి సంతోష్‌కి ఇది తొలి కష్టం కాదు. ఆమె భర్త ఐదేళ్ల కిందట యాక్సిడెంట్లో పోయాడు. అప్పటి నుంచి నలుగురున్న ఆ కుటుంబ భారం ఆమెదే. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది. తొంభై మందితో హాస్టల్ సజావుగానే నడుస్తోంది. జీవిత నావ కూడా ఒడిదొడుకులు లేకుండా నడుస్తుందనే నమ్మకం ఏర్పడింది ఆమెకి. ఇంతలో 2020 వచ్చింది, కోవిడ్ ఇండియాకి వచ్చి విస్తరించింది. లాక్‌డౌన్‌తో హాస్టల్‌కు లాక్ పడింది. ఏదో ఒకటి చేసి బతుకును కొనసాగించాలనుకున్నాడు. అప్పటికే రైతులు పండించిన కూరగాయలు పెద్ద మార్కెట్లకు తరలించడానికి వీలు లేకుండా రవాణా స్తంభించి పోయి ఉంది. అప్పుడు ప్రీతి తన ఇంటి ముందు కూరగాయల దుకాణం పెట్టింది. సమీపంలో ఉన్న రైతులు కూరగాయలను స్వయంగా తెచ్చి ఇస్తారు. ఆ తాజా కూరగాయలే ఆమె జీవితాన్ని చిగురింపచేస్తున్నాయి. ఏసీ షోరూమ్‌ల ధరలతో పోలిస్తే ప్రీతి దగ్గర కూరగాయల ధర బాగా తక్కువగా ఉండడంతో ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. చేదెక్కిన దుబాయ్ కాఫీ కరీమ్ తన స్నేహితుడితో కలిసి 2019 మొదట్లో దుబాయ్‌లో చిన్న కాఫీ షాప్ పెట్టాడు. కొద్ది నెలల్లోనే కాఫీ వ్యాపారం గాడిన పడింది. ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్దామనుకున్నాడు. గత ఏడాది చివర్లో ఇండియాకి వచ్చాడు. ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాలనుకున్నాడు. కానీ అమ్మ అనారోగ్యం వల్ల మరికొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. ఇంతలో కోవిడ్ వచ్చింది. ఇక దుబాయ్‌కి వెళ్లేదెప్పుడో చెప్పగలిగిన వాళ్లెవరూ లేరిప్పుడు. కరీమ్ ఇప్పుడు చేపల వ్యాపారం చేస్తున్నాడు. బైక్ మీద చేపల ట్యాంక్ పెట్టుకుని వీథి వీథి తిరిగి తాజా చేపలను అమ్ముతున్నాడు. ఆదుకుంటున్న అప్పడాలు కృష్ణదాస్ ఎనిమిదేళ్లుగా కోళికోద్లో ఆటో నడిపేవాడు. లాక్‌డౌన్‌తో ఆటో ఆగిపోయింది. అతడు వెంటనే అప్పడాల తయారీ చేపట్టాడు. ఇప్పుడు రోజుకు ఐదు వందల అప్పడాలు అమ్ముతున్నాడు. లాక్డౌన్ సడలించిన తర్వాత తిరిగి ఆటో బయటకు తీశాడు. కానీ ఆటో ఎక్కేవాళ్లు లేక రోజుకు వంద రూపాయలు రావడమే గగనమైంది. దాంతో తిరిగి ఆటోను పక్కన పెట్టేశాడు. ఆటో చక్రం ఆగినా సరే బతుకు చక్రం ఆగకూడదు. ఒకదారి మూసుకుపోతే మరోదారిని వెతుక్కోవాలి. ఇప్పుడతడికి అప్పడాలే అన్నం పెడుతున్నాయి. దాంతో అప్పడాల తయారీని మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు కృష్ణదాస్. -
వంటలతో అదరగొడుతున్న చిన్నారి
-
వయసు ఎనిమిదేళ్లు కానీ వంటలో దిట్ట
మయన్మార్: మో మైంట్ మే థు ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఈ ఎనిమిదేళ్ల చిన్నారి పేరు ఇప్పుడు ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. కరోనా కారణంగా ప్రపంచంలో చాలా దేశాలు లాక్డౌన్ విధించడంతో అందరూ దాదాపు ఇంటికే పరిమితమయిపోయారు. ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ఏంటా అని వెతికి మరీ పదునుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ చిన్నారి కూడా ఎనిమిదేళ్ల లేత ప్రాయంలోనే వంటకాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. (కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు) రొయ్యల కూర, కప్ప ఫ్రై, పోర్క్, టమాటాతో చేపల కూర ఇలా నోరూరించే రకరకాల కూరలు చేస్తూ అందరిని మంత్రముగ్థుల్ని చేస్తోంది. ఈ పాప రొయ్యల కూర చేసిన వీడియోను ఆమె తల్లి ఏప్రిల్‌లో ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ‘లిటిల్ చెఫ్’ పేరుతో ఆన్లైన్లో పాపులర్ అయిపోయింది. ఈ విషయంపై మో మైంట్ మే థు మాట్లాడుతూ... ‘నాకు వంటచేయడం అంటే చాలా ఇష్టం’ అని తెలిపింది. ఇంకా తను కెరీర్‌ను కూడా ఆ దిశగానే ఎంచుకోవాలనుకుంటున్నట్లు కూడా తెలిపింది. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది) ఈ పాప చేసిన ఒక వీడియోని 2,00,000 మంది వీక్షించారు. ఈ వీడియోలో మో మైంట్ మే థు మయన్మార్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ మోహింగ్యా, బాయిల్డ్ కాట్ ఫిష్ ను తయారు చేసింది. ఇప్పుడు ఈ పాప చేసిన వంటకాల్ని 10,000క్యాత్లకు (7.20 డాలర్ల)కు విక్రయిస్తున్నారు. దీని గురించి ఆమె తల్లి హనీచో మాట్లాడుతూ... ప్రతి రోజు మో మైంట్ థు చేసిన వంటకాలను తమ కుటుంబం డెలివరీ చేస్తోందని తెలిపారు. అన్ని జాగ్రత్తలతో ఈ వంటకాలు చేస్తోన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మో మైంట్ మే థు తనకంటూ ప్రత్యేకమైన ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ పేజీలో తన వంటకాలను పోస్ట్ చేస్తోంది. అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ ఆమె వీడియోలను చూస్తుంటే తమని తాము మర్చిపోతున్నామని తెలిపారు. మో మైంట్ మే థు ఆన్లైన్లో కుకింగ్ క్లాస్‌లు కూడా చెబుతోంది. -
క్యారెట్ కేక్ చేసిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై
ముంబై : లాక్డౌన్లో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ మాస్టర్ చెఫ్‌గా మారారు. కిచెన్‌లోకి దూరి కష్టపడి క్యారెట్ కేక్ తయారు చేశారు.దీనిని ముద్దుల చెల్లెలు ఖుషీకి రుచి చూపించి..ఎలా ఉందో చెప్పాలని కోరారు. అయితే క్యారెట్ కేక్‌ను టెస్ట్ చేసిన ఖుషీ మాత్రం ఊహించని రిప్లై ఇచ్చారు. ముందుగా కొద్దిగా తిన్న ఖుషీ బాగుందని కితాబు ఇచ్చింది. మరికొంత తినమని జాన్వీ అడగడంతో.. ఖుషీ అందుకు నిరాకరించి నాకు అది నచ్చలేదు అని సమాధానమిచ్చారు. ఈ వీడియోను మొదటి జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేయగా అనంతరం ఆమె ఫ్యాన్స్ క్లబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. (‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్‌గా నివేదా) ఇంతకముందు జాన్వీ లాక్డౌన్ కాలం తనను మార్చిన విధానాన్ని ఓ వివరణాత్మక పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ పుణ్యామా అని సెలబ్రిటీలంతా తమలో ఉన్న నైపుణ్యాలను బయటపెడుతున్నారు. దీపికా పదుకొనే నుంచి కత్రినా కైఫ్ వరకు కొత్త కొత్త వంటలు సృష్టించడంలో బిజీగా ఉన్నారు. నలభీముడిలా మారిపోయి గరిట తిప్పుతున్నారు. కాగా ఈ వంటకాలను చూసిన అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. తాము ఆరాధించే తారలు యాక్టింగ్ మాత్రమే కాకుండా.. ఇంటి పనులు కూడా చకాచకా చేయగలరని అభిప్రాయపడుతున్నారు. (ఎక్కడైనా నేర్చుకోవచ్చు: జాన్వీ) -
ఆ చెఫ్‌ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ...
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళలు ఆందోళనకు దిగిన సంఘటనపై గల్ఫ్ న్యూస్ ఓ కథనం రాసింది. ఇందులో దుబాయ్‌లో చెఫ్‌గా పని చేస్తున్న ఓ భారతీయుడు ఆన్లైన్లో మహిళలను అసభ్యంగా దూషించడం, అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన ఆరోపణలపై ఆ చెఫ్‌ని అరెస్ట్ చేయాలంటూ అక్కడి మహిళలు వందలాది మంది ఆందోళనకు దిగినట్లు పేర్కొంది. చెఫ్ త్రిలోక్ తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. అందులో ఓ భారతీయ మహిళను అత్యాచారం చేస్తానని బెదిరించాడు. ప్రస్తుతం త్రిలోక్ ఫేస్బుక్ ఖాతా తొలగించినప్పటికీ.. అతని ప్రొఫైల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం యూఏఈకి వెళ్లేముందు ఢిల్లీలోని లలిత్ హోటల్లో చెఫ్‌గా పనిచేసినట్లు ఉంది. అయితే ఈ విషయంపై లలిత్ హోటల్ని సంప్రదించగా అతని చర్యలను పూర్తిగా ఖండిస్తూ.. గతంలో పనిచేసే వాడని దాదాపు సంవత్సర కాలంగా అక్కడ ఉద్యోగం మానేసినట్లు చెప్పింది. ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం గురించి ఫేస్బుక్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం యూఏఈలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో సమాచారం లేదు. అయితే.. దుబాయ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు ఎఫ్బీ ప్రొఫైల్‌లో ఉంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలను పోస్ట్ చేసే వారిని యూఏఈ సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం విచారించవచ్చు. ఇదే సమయంలో త్రిలోక్‌పై ఈ క్రైమ్ పోర్ట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సోషల్ మీడియా సలహా ఇచ్చింది. నేర నిరూపణ అయితే నిందితుడికి జైలు శిక్ష లేదా రూ.50 వేల నుంచి 3 మిలియన్ డాలర్ల జరిమానాను విధించే అవకాశం ఉంది. కాగా.. గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 50మంది చనిపోగా వాటిని సెలబ్రేట్చేసుకుంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన ఓ భారతీయుడిని దుబాయ్‌లోని ట్రాన్స్‌గార్డ్ గ్రూప్ విధుల్లోంచి తొలగించింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపేస్తామని బెదిరిస్తూ పోస్ట్ పెట్టిన వ్యక్తిని కూడా అబుదాబీలో ఉద్యోగం నుంచి తొలగించారు. 2017లో ఓ భారతీయ జర్నలిస్ట్‌కు ఫేస్బుక్లో అభ్యంతరకర సందేశాలను పంపినందుకు గాను మరో కేరళ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించారు. -
కళాకారుడి వినూత్న స్వాగతం.. మోదీ, ట్రంప్ ఇడ్లీలు..
-
ట్రంప్ టూర్: కళాకారుడి వినూత్న స్వాగతం
చెన్నై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా తొలిసారి భారత పర్యటనకు విచ్చేశారు. దీంతో వారికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ట్రంప్ రెండు రోజుల పర్యటనపై దేశమంతా ఆసక్తిని కనబరుస్తోంది. ఈ క్రమంలో ఓ కళాకారుడు అగ్రరాజ్య అధ్యక్షుడికి వినూత్న స్వాగతం పలికాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఇనైవాన్ అనే వ్యక్తి ట్రంప్ పర్యటనతోపాటు రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని తన కళాకృతిలో చాటి చెప్పాడు. అందుకోసం మూడు పే..ద్ద ఇడ్లీలను తయారు చేసి వాటిపై మోదీ, ట్రంప్ ముఖాలను చిత్రీకరించాడు. (మేడమ్ ఫస్ట్ లేడీ) మరో ఇడ్లీపై భారత్, అమెరికా జాతీయ పతాకాలను ఆవిష్కరించాడు. ఈ కళాకృతులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వీటిని ఇనైవాన్ ఆరుగురు వ్యక్తుల సహాయంతో సుమారు 36 గంటల పాటు శ్రమించి సిద్ధం చేశాడు. ఈ మూడు ఇడ్లీల బరువు సుమారు 107 కిలోలు. కాగా నేడు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లాభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వీరు అక్కడి నుంచి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ట్రంప్ దంపతులు ఇద్దరూ నేలపై కూర్చుని చరఖాపై నూలు వడకడం విశేషం. (మోదీ, నేను మంచి ఫ్రెండ్స్!) -
అనుకోకుండా హ్యాపీ'షెఫ్'
ఆత్మీయుల్ని చూడగానే నేత్రాలుసజలాలైనట్టుగా ఆత్మకింపైన భోజనంఅగుపించగానే నోరు నీరూరుతుంది.ఆత్మారాముణ్ణి సంతృప్తిపరచేఆహారాన్ని లోనికి ఆహ్వానించి...అతిథికి నీళ్లిచ్చినట్టుగానే లాలాజలంతో అభిషేకించిమరీ గౌరవిస్తుంది.అంతటి గౌరవం పొందాలంటేవంట రుచిగా ఉండాలి.చవులూరించే ఎన్నో వంటల్నిచెవులు పట్టుకు లాక్కొచ్చే పనిలో ఉంది అను హసన్. సాధారణ ఇల్లాలి నుంచి సెలెబ్రిటీ మహిళ దాకా.. వంట చేయడాన్నే అభిరుచిగా మలచుకుంటున్నవారెందరో అనూ హసన్‌తో సహా. పాకశాస్త్రానికున్న పాపులారిటీ అది. సుహాసిని దర్శకత్వంలో వచ్చిన ఇందిర సినిమాతో నటిగా పరిచయమైంది అను హసన్. తర్వాత జేఎఫ్డబ్ల్యూ (జస్ట్ ఫర్ విమెన్) మ్యాగజైన్లో ‘సన్నీ సైడ్ అప్’ అనే పేరుతో కాలమ్ రాసింది. ఆపేరుతోనే పుస్తకాన్నీ తెచ్చింది. ఇప్పుడు అదే జెఎఫ్‌డబ్ల్యూ యూట్యూబ్ చానెల్‌కు షెఫ్‌గా మారి ‘గెట్ సెట్ కుక్’ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది అను హసన్. ‘జీవితం చిన్నది.. ప్రపంచం విశాలమైంది. అందుకే నన్ను నేను ఒక్క పనికే పరిమితం చేసుకోవడానికి ఇష్టపడను. కాబట్టి సినిమాకే ముడిపడి లేను. నా శక్తి సామర్థ్యాల మేరకు వీలైనన్ని రంగాల్లో నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను. చిత్రలేఖనం, సంగీతం, జనాలతో ఇంటరాక్ట్ అవడం, ట్రావెల్, ఫుడ్.. ఏదైనా సరే.. వీలైనన్నింటిలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తాను. వాటిలో ఒకటే జేఎఫ్డబ్లు్య వారి షో కూడా. చాలా సంతోషాన్నిస్తోంది ఈ కొత్త ఉద్యోగం’ అంటూ వంట.. ఆహారంతో ముడిపడి ఉన్న తన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం మొదలుపెట్టింది అను. ప్రేమనుపంచడమే..‘ముందు ఈ కుకరీ షోలో అవకాశం ఎలా వచ్చిందో రెండు మాటల్లో చెబుతా. కిందటేడు అక్టోబర్‌లో బీనా సుజిత్ ( ఈ షో నిర్వాహకురాలు) నన్ను కలిసి ‘‘మీతో ఒక కుకరీ షో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందోని ఆలోచిస్తున్నా’’ అంది. ఆ మాట వినగానే ఉత్సాహపడ్డా.. పైగా చిన్నప్పటి నుంచి వండడం, వండినదాన్ని పదిమందికి వడ్డించడమంటే మహా ఇష్టం. దాంతో ఆ ఆఫర్‌ను వెంటనే ఒప్పేసుకున్నా. గెట్ సెట్ కుక్ అంటూ వంట మొదలుపెట్టేశాను. నన్నడిగితే యాంత్రికంగా చేసేది కాదు వంట. ఇది జీవితంలోని భావోద్వేగాలను రిఫ్లెక్ట్ చేస్తుంది. చక్కటి రుచికి కావల్సిన దినుసులు తగిన మోతాదులో ఎలా పడాలో జీవితానికీ సెట్ ఆఫ్ ఎమోషన్స్ అంతే అవసరం. నా ఈ షో.. వంట చేయడం ఎంత తేలికో లైఫ్‌ను హ్యాండిల్ చేయడమూ అంతే తేలిక అనే సందేశాన్నిస్తుంది. అంతేకాదు వంట చేయడం పట్ల విముఖంగా ఉన్న వాళ్లలో దానిపట్ల ఆసక్తినీ రేకెత్తిస్తుంది. కుగింగ్ అంటే ప్రేమను పంచడమే. ఇందుకు నా జీవితంలోని సంఘటనే మంచి ఉదాహరణ. క్రిస్మసే నీ దగ్గరకు..నా తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. దాంతో యేడాది కిందటి క్రిస్మస్ నాకు విషాదంగానే గడిచింది. ఆ పండగరోజు.. ఇంట్లో (యూకేలో) ఒక్కదాన్నే దిగులుగా కూర్చున్నా. నా ఫ్రెండ్ ఫోన్ చేసింది.. వాళ్ల దగ్గరకు రమ్మని. వెళ్లడం ఇష్టంలేక ఏవేవో బహుమానాలు ఇవ్వసాగాను. సరే నువ్వు మా దగ్గరకు రాకపోతే క్రిస్మసే నీ దగ్గరకు వస్తుంది అని అప్పటికప్పుడు నా ఫ్రెండ్ వచ్చేసింది మా ఇంటికి తన భర్త, పిల్లలను తీసుకొని. వాళ్లే ఇంటినంతా అలంకరించి.. వంట చేసి.. పిల్లలతో సందడి చేశారు. ఆ వంటలో వాళ్లు ప్రేమతో పెట్టిన తాలింపు నా ఒంటరితనాన్ని మాయం చేసింది. నిజంగానే ఆరోజు క్రిస్మస్ నా దగ్గరకు వచ్చినట్టే అనిపించింది. ఇదొక్కటే కాదు వంటతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఇంకా చాలానే ఉన్నాయి. శివాజీ గణేషన్ ఇంటి నుంచి..బిర్యానీ, రొయ్యల తొక్కు అంటే పిచ్చి ఇష్టం.. అదీ శివాజీ గణేషన్ వాళ్లింటిది. కమల్ అంకుల్ కూతుళ్లు శ్రుతి, అక్షరలకు కూడా. ప్రతి ఆదివారం శివాజి గణేశన్ వాళ్లింటి నుంచి బిర్యాని, రొయ్యల తొక్కు వచ్చేది మా ఇంటికి. ఆ టిఫిన్ క్యారేజ్ కోసం శ్రుతి, అక్షరల దగ్గర్నుంచి మేమంతా ఎదురు చూసేవాళ్లం ఆకలితో. భలే ఉండేది ఆ వంటల రుచి. ఇంతకీ గెట్ సెట్ కుక్ షోలో నేను ఫస్ట్ వండిన వంటకం ఏంటో తెలుసా? మష్రూమ్ బిర్యానీ(నవ్వుతూ). జనాలకు కావల్సింది.. ఎప్పుడూ డిమాండ్‌లో ఉండేవి మూడే మూడు.. రోటీ, కపడా ఔర్ మకాన్. ఈ మూడింట్లో ఫుడ్ ఎంత ముఖ్యమైందో వేరే చెప్పక్కర్లేదు కదా. ఆహారం విషయంలో మనమెప్పుడూ కొత్త రుచులకోసం అన్వేషిస్తూనే ఉంటాం. చాలా మంది అడుగుతుంటారు.. అంతర్జాతీయంగా కుకింగ్కు సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రఖ్యాత మాస్టర్ షెఫ్స్‌తో వంటల కార్యక్రమాలు టెలికాస్ట్ అవుతున్నాయి. జాతీయస్థాయిలో కూడా తక్కువేం లేవు. వాళ్లతో మీరు పోటీ పడగలరా అని . నేను మాస్టర్ షెఫ్‌ను కాను. కాని.. షెఫ్నే. హ్యాపీ షెఫ్‌ను. ప్రెజెంటర్‌గా.. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ షోను నిర్వహిస్తున్నాను అని మాత్రం చెప్పగలను’ అంటూ ముగించింది సుహాసినికి చెల్లెలి వరుసయ్యే అను హాసన్. రుక్మిణీతో అన్నం..కుకర్ అంటే భయం నాకు తొమ్మిదేళ్లనుకుంటా.. అప్పడు మేం ట్రిచీలో ఉండేవాళ్లం. మా పెరట్లో రెండు కొబ్బరి చెట్లు, ఒక మామిడి చెట్టు.. త్రికోణాకారంలో ఉండేవి. సెలవుల్లో ఒకరోజు ఆ మూడు చెట్ల మధ్య ఇటుకలతో పొయ్యి పేర్చి.. నా ఫ్రెండ్‌తో వంటల కార్యక్రమం పెట్టా. ఆ టైమ్‌లో మట్టి పొయ్యి మీద అన్నం వండడానికి రుక్మిణీ అనే పేరున్న రాగి పాత్ర ఉండేది. అంటే ప్రెషర్ కుకర్ లాంటిది.. దాంట్లో అన్నం వండాను. పచ్చడీ చేసుకున్నాం. అయితే భయంకరమైన ఎక్స్పీరియెన్సూ ఉంది అదీ నా చిన్నప్పటిదే. ఒకసారి మా ఇంట్లో ప్రెషర్ కుకర్ పేలి.. అన్నమంతా గోడలకు.. పైకప్పుకీ చిమ్మింది.. అక్కడే ఉన్న నా ఒంటికీ అతుక్కున్నాయి కొన్ని మెతుకులు. దాంతో కేకలేస్తూ అక్కడినుంచి పరుగో పరుగు. అందుకే ప్రెషర్ కుకర్ అంటే ఇప్పటికీ నాకు భయమే. -
అహాహ్హ నాకే ముందు నాన్న చేతి వంట
అంతా గొప్పగొప్ప నాన్నలు! టైమే లేనివాళ్లు. వంటసలే రాని వాళ్లు. వాళ్లొచ్చి కుకింగ్ మొదలు పెట్టేశారు. రిజల్టేమిటి? పాస్ అయిన వాళ్లెందరు? పాస్ చేయబడిన వాళ్లెందరు?! నాన్న వండితే ఎలా ఉంటుంది? అమ్మ వండినట్లయితే ఉండదు. కానీ ఆ వంటలో నాన్న ప్రేమ ఉంటుంది. కూతురు ఆ ప్రేమను రుచి చూస్తుంది. అందుకే నాన్న వంటలో లోపాలను కూతురి ‘టేస్ట్ బడ్స్’ గుర్తించవు. అదే అమ్మ వంటలో ఏదో ఒక రోజు ఒక్క ఆవగింజ పేలకపోయినా సరే... ‘పంటి కింద పడుతున్నాయమ్మా’ అంటూ కంప్లయింట్ చేస్తారు అమ్మాయిలు. ‘నువ్వు వండేటప్పుడు అన్నీ సమంగా వేయించు. నేనూ చూస్తాగా’ అంటూ తల్లి మొట్టికాయ వేసినట్లు బదులిస్తుంది. ఆ చిన్నారి అమ్మవైపు గుర్రుగా చూడడాన్ని ఓరకంట గమనిస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంటాడు తండ్రి. ఆ మాత్రం భరోసా దొరికితే ఇంకేం కావాలి... అమ్మను ఈజీగా ఆట పట్టించేయవచ్చు. అంతే... ఏ ఇంట్లో అయినా తండ్రీకూతుళ్లు ఒక జట్టు. ఆ ఇద్దరూ జట్టుకట్టి వారంలో ఓ రోజు తామే వండితే ఎలా ఉంటుంది? ఆ వండుకున్న వాళ్లకు మాత్రం తండ్రీ కూతుళ్ల ప్రేమలా రుచిగానే అనిపిస్తుందా వంట. కానీ ఆ వంటలో లోపాలు అమ్మకు మాత్రమే తెలుస్తాయి. అందుకే, ఎందుకైనా మంచిదని అమ్మల గైడెన్స్‌లో అనేక మంది తండ్రీకూతుళ్లు వండడానికి సిద్ధమైన ఒక ఈవెంట్ ఇది. ఇంట్రెస్టింగ్ కదా! ఐఏఎస్ ‘చెఫ్’ జయేశ్ రంజన్ ఐఏఎస్ ఆఫీసర్. తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీ. 1992 బ్యాచ్ కు చెందిన జయేశ్ ఐఏఎస్‌లో ఆల్ ఇండియా టాపర్. ఆయన ఢిల్లీయూనివర్సిటీ, కోల్కత్తా యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, బర్మింగ్ హామ్, టోక్యో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ ఇన్స్టిట్యూట్లలో చదువుకున్నారు. ఉద్యోగంలో బిజీ కాకపోతే ఇంకా చదువుకోవడానికి ఏమేమి కోర్సులు న్నాయా అని చూసుకుని చేరిపోయే వారేమో! ఇప్పుడైతే ఉద్యోగంలో కొంచెం ఆటవిడుపు చూసుకుని హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న ‘ద కలినరీ లాంజ్’లో ఉగాది పచ్చడి చేయడం నేర్చుకు న్నారు. ‘డాడ్స్ కుకింగ్ క్లబ్’లో చేరి కూతురితో కలిసి వంటలు చేస్తున్నారు. ఏప్రాన్ కట్టుకుని గరిటె పట్టుకున్నారాయన. జయేశ్ పుట్టింది, పెరిగింది రాజస్థాన్‌లో. వాళ్ల పూర్వీకులది పంజాబ్ రాష్ట్రం. తెలుగు వాళ్ల ఉగాది పచ్చడితో పరిచయమే లేని రంజన్ ఉగాది పచ్చడి కలపడానికి రెడీ అయ్యారు. కూతురు ఇషిక మాత్రం ‘మా నాన్న అన్నింటిలో బెస్ట్’ అన్నంత ధీమాతో చూస్తోంది. అయితే... భార్య రుచీ రంజన్ మాత్రం ఈ తండ్రీకూతుళ్లు.. çపచ్చడి కోసం ఏమేమి కలుపుతున్నారో, ఎంతెంత కలుపుతున్నారోనని చూస్తూ, కడుపు కకావికలం కానివ్వకుండా జాగ్రత్త కోసం సూచనలిస్తున్నారు. ఉడికిందా? ఐతే ఓకే! ‘ద కలినరీ లాంజ్’ ఇటీవల నిర్వహించిన డాడ్స్ కుకింగ్ క్లబ్లో వండడానికి తండ్రులు చాలామందే వచ్చారు. చెయ్యి తిరిగిన తండ్రులు కూతుళ్లకు నేర్పిస్తూ వండారు. లెర్నర్ తండ్రులు కూతుళ్ల సలహా, సహాయం తీసుకుంటూ వండారు. మొదటగా ఉగాది పచ్చడి కలిపి, ఆ తర్వాత పాస్తా చేసి భార్యాపిల్లలకు తినిపించారు మగవాళ్లు. వంట చేస్తే మానసిక ఒత్తిడి ఎంతగా తగ్గుతుందోనని సంతోషపడిపోయారు వంట చేసిన మగవాళ్లందరూ. వాళ్లంతా ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో, ఊపిరి సలపనంత బిజీగా ఉండేవాళ్లే. అందుకే వాళ్లకు వండడం ఒక ఆటవిడుపైంది. కూతుళ్లు గరిటె తిప్పుతుంటే తండ్రులు పెనంలో దినుసులు వేస్తున్నారు. తండ్రులు ఉడికిందా లేదా అని చూస్తుంటే కూతుళ్లు... నాన్నకసలు వంట వచ్చా రాదా, నాన్న వంట చూడడానికేనా తినడానికి కూడానా అని సందేహంగా రుచి చూస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో కూతుళ్లందరూ తండ్రులకు పాస్ సర్టిఫికేట్లు ఇచ్చేశారు. తర్వాత అంతా కలిసి ఆనందానుభూతులను పంచుకుంటూ భోజనం చేశారు. ‘‘మా ఉద్యోగాల్లో టైమ్ మా చేతిలో ఉండదు. చాలాసార్లు కుటుంబంతో క్వాలిటీ టైమ్ గడపలేక పోతుంటాం. టైట్ షెడ్యూల్లో ఇలాంటి ఒక సరదా ప్రోగ్రామ్ని కూడా చేర్చుకుంటే చాలా బాగుం టుంది. బిజీగా ఉండే తండ్రులు పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇలాంటి కుకింగ్ క్లబ్‌లు బాగా ఉపయోగపడతాయి’’ అన్నారు జయేశ్ రంజన్. ఆ కార్యక్రమాన్ని రూపొందించిన జయ్ కిషన్ మాట్లాడుతూ ‘‘వారంలో ఒక రోజు డాడ్స్ క్లబ్‌కి వచ్చి కుటుంబం అంతా ఆనందంగా గడపడానికి ఇదో మంచి మార్గం. మంచి ఆహారంతో ఆరోగ్యం కూడా బావుంటుంది’’ అన్నారు. జయ్ కిషన్ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్, టీ హబ్ మాజీ సీఈవో. – వాకా మంజులారెడ్డి -
ఈ వంట... ఆ వంట... మన ఇంట
‘మనీష్ మెహ్రోత్రా ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న భారతీయ చెఫ్’ అంటారు వీర్ సంఘ్వి. బిహార్‌లోని పాట్నాలో జన్మించిన మనీష్, ముంబైలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్న రోజుల్లోనే వంటకాల మీద అభిమానాన్ని ప్రేమను పెంచుకున్నాడు. ‘ఓల్డ్ వరల్డ్ హాస్పిటాలిటీ ఓరియెంటల్ ఆక్పోస్’ (ద పాపులర్ మెంబర్స్ రెస్టారెంట్ ఎల్ ఇండియా హాబిటేల్ సెంటర్, ఢిల్లీ) లో 2000 సంవత్సరంలో చేరిన తరువాత, ఆసియా ఖండమంతా పర్యటించి, అక్కడివారికి ‘పాన్ ఆసియా క్విజీన్’లో శిక్షణ ఇవ్వాలనుకున్నారు. అక్కడ నుంచి తిరిగి వచ్చాక 2009లో ‘ఇండియా యాక్సెంట్’ను స్థాపించి, అతి తక్కువ కాలంలోనే ప్రపంచ ఖ్యాతి చెందారు. అనేక అవార్డులు అందుకున్నారు. గ్రేట్ ఆర్ట్, సింపుల్ రెసిపీ... కుటుంబాన్ని ఒకచోట చేర్చుతారు, వారివే అయిన రుచులతో వారికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగిస్తారు. భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన చెఫ్ అయిన మనీష్, ఢిల్లీలోని ‘ద లోధీ రెస్టారెంట్’లో వంటలతో ఫ్యూజన్ చేస్తున్నారు. చ్యవనప్రాశను క్రీమ్ బ్రూలీతో, ఆమ్లా మురబ్బాను తందూరీతో, కిచ్డీని వేయించిన పోర్క్‌తో ఫ్యూజన్ చేస్తున్నారు. ఆయన మన ఆహారం గురించి ‘‘భారతీయ వంటకాలను అంతర్జాతీయ విధానంలోను, విదేశీ వంటకాలను భారతీయ విధానంలోనూ చూపుతాను’’ అంటున్నారు. భోజన ప్రియుల నాలుకలు నిరంతరం కొత్త రుచుల కోసం ఉవ్విళ్లూరుతుంటారు. ఆ రుచులకు అనుగుణంగానే మనీష్ మెహ్రోత్రా కొత్త కొత్త వంటకాలు కనిపెడుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన 50 రెస్టారెంట్లలో ‘ఇండియన్ యాక్సెంట్’ ఉంటోంది. 2017లో ట్రిప్ అడ్వయిజర్ ఈ రెస్టారెంట్‌కి మొదటి ర్యాంకు ఇచ్చింది. ఆసియాలో 2వ స్థానంలోను, ప్రపంచంలో 19వ స్థానంRecipesలోను ఉంది మ్యాస్ట్రో మెహ్రోత్రా రూపొందించిన ఈ రెస్టారెంట్. -
సారీ చెప్పినా.. విచారణ ఎదుర్కోవాల్సిందేనా
దుబాయ్ : క్షణకాలంలో తీసుకునే నిర్ణయాలకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దుబాయ్‌లోని ప్రముఖ జేడబ్ల్యూ మారియట్ మార్కిస్ హోటల్లో చీఫ్ చెఫ్‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన అతుల్ కొచ్చర్ ఇప్పడు అదే పరిస్థతిని ఎదుర్కొంటున్నాడు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో ఓ ట్వీట్ పెద్ద దుమారమే లేపింది. ప్రియాంక చోప్రా క్వాంటికో సీరియల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్ చేసిన అతడు విమర్శల పాలయ్యాడు. తన తప్పును గ్రహించి క్షమాపణలు చెప్పినప్పటికి.. లాభం లేకుండా పోయింది. హోటల్ యాజమాన్యం కూడా ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపింది. అతుల్ ట్వీట్‌పై మండిపడిన కొందరు అతన్ని కాల్చిపడేస్తామని కూడా హెచ్చరించారు. వీటన్నింటిపై అతుల్ సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని.. తాను పనిచేసే చోట చాలా సంస్కృతుల వారు ఉంటారని.. ఏదో క్షణికావేశంలో ఆ పోస్ట్ పెట్టానని.. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణల కోరుతున్నానని ట్వీట్ చేశాడు. కాగా స్థానిక మీడియా మాత్రం అతుల్ క్షమాపణలు చెప్పినప్పటికి విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. అన్లైన్ దూషణలకు పాల్పడిన, ముఖ్యంగా ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసిన దాని తీవ్ర నేరంగా పరిగణిస్తారని.. చట్ట ప్రకారం అతుల్‌కు పదిలక్షల దినార్ల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. -
వివాదాస్పదం : అతన్ని కాల్చిపడేస్తాం..!
దుబాయ్ : అనుచిత, అనాలోచిత ట్వీట్లతో మత విద్వేషాలను రెచ్చగొట్టి విమర్శల పాలవుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా, ఇక్కడి జేడబ్ల్యూ మారియట్ మార్కిస్ హోటల్లో చీఫ్ చెఫ్‌గా పని చేస్తున్న భారత సంతతి వ్యక్తి ఆ కోవలోకి చేరారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘కరుడుగట్టిన హిందూత్వవాదులు తీవ్రవాదుల’ని పేర్కొన్నట్లు ఖలీజ్ టైమ్స్ మంగళవారం ప్రచురించింది. దీనిపై స్పందించిన చెఫ్ అతుల్ కొచ్చర్.. ‘ఇది చాలా దురదృష్టకరం. మీరు హిందూత్వ వాదులను కించపరుస్తున్నారు. రెండు వేల ఏళ్లక్రితం నుంచి తీవ్రవాద భావజాలం వ్యాప్తి చేస్తున్న ఇస్లాం నుంచే హిందువులు తీవ్రవాదం నేర్చుకున్నార’ని ట్వీట్ చేసి దుమారం రేపారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. పెద్ద పొరబాటు దొర్లిందని క్షమాపణలు కోరారు. సరి చూసుకోకుండా ఇస్లాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నాని ట్విటర్లో పేర్కొన్నారు. 1400 ఏళ్ల నుంచి ఇస్లాం మతం ఉనికిలో ఉందనీ, కానీ అపరిపక్వంగా ఆలోచించి 2 వేల ఏళ్ల క్రితమని పేర్కొనడం పట్ల క్షమాపణలు కోరాడు. అయితే, హోటల్ యాజమాన్యం ఈ ట్వీట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అది కొచ్చర్ వ్యక్తిగత వ్యవహారమని ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఓ ట్విటరాటీ కొచ్చర్‌ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, కొచ్చర్ ట్వీట్‌పై మండిపడిన కొందరు.. ‘అతడిని కాల్చిపడేస్తామని’ హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రముఖ చెఫ్ ఆత్మహత్య
పారిస్ : ప్రముఖ చెఫ్ ఆంథోని బుర్డేన్ పారిస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఓ కార్యక్రమ షూటింగ్ కోసం పారిస్‌కు వెళ్లిన ఆంథోని శుక్రవారం హోటల్లోని తన గది ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అమెరికాకు చెందిన ఆంథోని వంటల తయారీలో, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సాధారణ జనాలే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఆంథోని వంటకాలను అమితంగా ఇష్టపడుతారు. ప్రస్తుతం ఆంథోని ప్రముఖ న్యూస్ చానల్ సీఎన్ఎన్ నిర్వహిస్తున్న పార్ట్స్ అన్నోన్ వంటల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని వంటకాలను ఈ కార్యక్రమంలో పరిచయం చేస్తున్నారు. ఈ షో చిత్రీకరణ కోసం పారిస్ వెళ్లిన ఆంథోని హోటల్లో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆంథోని మరణంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆంథోని తినని ఆహారం అంటూ ఏదీ లేదు. ప్రపంచంలోని దాదాపు అన్ని రకాల వంటకాలను రుచి చూసిన వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పారు. రుచికరమైన ఆహారంతోపాటు.. చెత్త ఫుడ్ కూడా తిన్న వ్యక్తిని నేనే అంటారు ఆయన. కొద్ది రోజుల ముందే పార్ట్స్ అన్నోన్కు సంబంధించి హౌస్ ఆఫ్ రైజింగ్ సన్ పేరుతో ఓ పాటను విడుదల చేశారు. దీనికి విశేష స్పందన వచ్చింది. ఆంథోని వంటలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతడు వంటలపై పుస్తకాలు రాయడంతో పాటు పలు టీవీ షోలు నిర్వహించారు. రెస్టారెంట్లో పనిచేస్తున్న సిబ్బంది భద్రత కోసం కూడా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎన్ఎన్లో ఆంథోని నిర్వహిస్తున్న పార్ట్ అన్నోన్ 2013లో ప్రముఖ పీబాడీ అవార్డు సొంతం చేసుకుంది. -
న్యూఇయర్ రోజున చెఫ్‌గా మాస్టర్ బ్లాస్టర్
-
న్యూఇయర్ రోజున సచిన్ ఇలా..
ముంబై: కొత్త ఏడాదికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్తగా ఆహ్వానం పలికాడు. తన ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీ కోసం వంట చేసి న్యూ ఇయర్‌కు స్వాగతం పలికాడు. తాను చెఫ్‌గా అవతారమెత్తిన విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'న్యూఇయర్ సందర్భంగా నా స్నేహితుల కోసం వంట చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లంతా నా వంటను ఎంతగానో ఆస్వాదించారు. మీరు కూడా ఇలాగే న్యూఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారని భావిస్తున్నాను. 2018 మీ అందరికీ ఎంతో సంతోషాన్ని కలుగచేయాలని కోరుకుంటున్నాను' అని సచిన్ విషెస్ తెలియజేశాడు. -
దుర్గా పూజలో చెఫ్‌లుగా సెక్స్ వర్కర్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దుర్గా నవరాత్రుల సందర్భంగా సెక్స్ వర్కర్లు చెఫ్‌ల టోపీలు ధరించనున్నారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన సోనాగచ్చి నగరంలోని సెక్స్ వర్కర్లు దుర్గా పూజ సందర్భంగా మత్స్యశాఖ ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్టుల్లో చెఫ్‌గా పనిచేయనున్నారు. సెక్స్‌వర్కర్లకు ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ(డీఎంఎస్సీ), ఎన్జీవో సంస్థలు ఈ ప్రాజెక్టుపై షెఫ్‌లుగా శిక్షణ ఇచ్చేందుకు ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒక అవగాహనకు వచ్చాయి. డీఎంఎస్సీ కింద రిజిస్టర్ అయిన వారిలో 1.30 లక్షల మంది సెక్స్‌వర్కర్లు ఉన్నారు. దుర్గా పూజా సమయంలో కోల్‌కతాలోని వివిధ ప్రదేశాల్లో ఎనిమిది, బెంగళూరులో రెండు ఫుడ్ పెవిలియన్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అధిక శాతం మందిని బెంగళూరు పంపనున్నట్లు తెలిపారు. తమకు వంటవారు(కుక్)లు అవసరం ఉందని, డీఎంఎస్సీని సంప్రదించగా వారు అంగీకరించారని ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. సజీవంగా ఉన్న చేపల ప్యాకేజీ, వాటి వంటకాల్లో ఈ సెక్స్‌వర్కర్లకు శిక్షణ ఇస్తామని కార్పొరేషన్ ఎండీ సౌమ్యజిత్ తెలిపారు. సోమవారం నుంచి ఈ శిక్షణ ఇవ్వనున్నారు. -
నయనలో మరో కోణం
తమిళసినిమా: నటి నయనతార అనగానే తనో టాప్ కథానాయకి అన్న విషయం, ఆమె నటన, పారితోషికం, ప్రేమలో పడడం, పెళ్లి విషయంలో ఓడిపోవడం ఇలాంటి వాటి గురించే చాలా మందికి తెలుసు. ఎంతసేపు ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకుంటారు. అయితే నాణేనికి బొమ్మా బొరుసులాగా ప్రతి మనిషిలోనూ పలు కోణాలుంటాయి. అలా నయనతారలో మరో కోణం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. నయనతారలో మంచి చెఫ్ ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో రకరకాల వంటకాలతో ప్రయోగం చేయడం ఆమె కాలక్షేపాల్లో ఒక అంశం అట. నయనతారలో మరో ముఖ్య అంశం తనలో మంచి కవయిత్రి ఉన్నారట. ఇప్పటికే చాలా కవితలు రాశారట. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకున్నారట. విశేషం ఏమిటంటే తను రాసిన కవితలన్నిటిలోనూ ప్రేమ తొణికిసలాడుతుందట. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్లు ఎలా ఉండాలన్న విషయాలు ఆ కవితల్లో చోటు చేసుకుంటాయట. తన రాసిన కవితలను తరచూ చదువుకుంటారట. ఆ కవితలను ³#స్తకంగా ముద్రించాలా లేక సినిమా పాటలుగా ఉపయోగించాలా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నారట. నయన కవితలను పుస్తకం రూపంలోనో, పాటల రూపంలోనో త్వరలో చదవడమో, వినడమో చేయబోతున్నామన్న మాట. -
పఫ్ షెఫ్
బొరుగులు.. మరమరాలు.. మురుముర.. పఫ్డ్ రైస్... ఇన్ని పేర్లున్న పఫ్డ్ రైస్‌తో అన్ని ఐటమ్స్ చేసుకోవాలి కదా. మరి అన్ని చేయాలంటే.. పెద్ద పెద్ద హోటళ్లలోలా షెఫ్ కావాలి కదా. అవసరం లేదు! హ్యాపీగా మీరే ఒక పఫ్ షెఫ్ అయిపోయి కావలసినవన్నీ వండేసుకోండి! అంత ఈజీ.. వీటి తయారీ. పఫ్డ్ రైస్ పీనట్ బటర్ బాల్స్ పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఆకలి అంటూ గోల చేస్తుంటారు. తక్కువ టైమ్‌లో తక్షణ ఎనర్జీని ఇచ్చే వంటకాలలో ఇది ఒకటి. కావల్సినవి: మరమరాలు – కప్పు; తేనె – పావు కప్పు; పంచదార పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్; పీనట్ బటర్ – అర కప్పు; కిస్మిస్ – 2 టేబుల్‌స్పూన్లు; జెమ్స్ – 15 గ్రాముల పాకెట్ తయారీ: ఒక గిన్నెలో తేనె, పంచదార పొడి, పీనట్ బటర్ వేసి బాగా కలపాలి. దీంట్లో మరమరాలు, కిస్మిస్ వేసి కలపాలి. దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేయాలి. బాల్స్ పైన ఒక్కోదాన్ని జెమ్స్‌తో అలంకరించి ఫ్రిజ్‌లో 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత తీసి అందించాలి. నోట్: 1. పీనట్ బటర్‌కి బదులు చాకొలెట్ మిశ్రమంతోనూ ఇలా తయారు చేసుకోవచ్చు. 2. పాలలో కొద్దిగా బెల్లం తురుము, మరమరాలు, డ్రైఫ్రూట్స్ పలుకులు వేసి కూడా కలిపి పెట్టవచ్చు. భేల్ పూరి భేల్పూరీని వీధి చివరలో బండిమీద పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటుంటారు. బయట బండ్ల మీద శుభ్రంగా ఉండదని కంగారు పడకుండా ఇంట్లోనే హెల్తీ స్నాక్‌గా దీనిని తయారుచేసివ్వచ్చు. కావల్సినవి: మరమరాలు – 1కప్పు; వేయించిన పుట్నాలపప్పు – 100 గ్రాములు; పల్లీలు – 100 గ్రాములు; కీరా – 1 (సన్నని ముక్కలుగా కట్ చేయాలి); బంగాళదుంప – 1 (ఉడికించి, సన్నని ముక్కలు చేసుకోవాలి); ఉల్లిపాయ – 1 (సన్నగా కట్ చేసుకోవాలి); టొమాటో – సన్నగా కట్ చేయాలి; కొత్తిమీర – అలంకరణకు; ఉప్పు – టీ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్; చాట్ మసాలా – టేబుల్ స్పూన్; పసుపు – చిటికెడు; దానిమ్మగింజలు – తగినన్ని తయారీ: వేయించిన మరమరాలు కరకరలాడుతుంటాయి. వెడల్పాటి గిన్నెలో మరమరాలు, పుట్నాలపప్పు, వేయించిన పల్లీలు, కీరాముక్కలు, బంగాళదంపముక్కలు, ఉల్లిపాయలు, టొమాటో, ఉప్పు, చాట్ మసాలా, సేవియా, నిమ్మరసం, పసుపు వేసి బాగా కలపాలి. దీని పైన కొత్తిమీర చల్లి. సర్వ్ చేయాలి. దీనికి కొత్తిమీర లేదా పుదీనా చట్నీ, అల్లం–బెల్లం పచ్చడి కూడా వాడుకోవచ్చు. నోట్: 1. సన్నగా కట్ చేసిన అల్లం తరుగు, చింతపండు గుజ్జు, నల్లుప్పు, గరం మసాలా కూడా వేసి కలుపుకోవచ్చు. సేవియా: రెండు భాగాల బియ్యప్పిండికి ఒక భాగం శనగపిండి, ఉప్పు, కారం కలపాలి. తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. సేవియా చేసే అచ్చులో పిండి పెట్టి, ఒత్తి, కాగుతున్న నూనెలో రెండువైపులా వేయించుకోవాలి. బొరుగుల ఉప్మా/ఉగ్గాణి ఇది వేడి వేడిగా, కొద్దిగా కారంగా రుచిగా ఉండే వంటకం. చేయడం సులువు. సాయంకాలం స్నాక్‌గానూ తీసుకోవచ్చు. కావల్సినవి: మరమరాలు/బొరుగులు – 2 కప్పులు; వేయించిన పుట్నాలపప్పు – పావు కప్పు; ఉల్లిపాయలు – 1; పచ్చిమిర్చి – 1; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – తగినంత; నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; పోపు గింజలు – టీ స్పూన్; వేరుశనగలు తయారీ: ∙బొరుగుల(మరమరాలు)లో తగినన్ని నీళ్లు పోసి 5 నిమిషాలు ఉంచి, నీళ్లు పోయేలా గట్టిగా పిండి ఒక ప్లేట్లో వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి మందపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి వేడయ్యాక 3 టీ స్పూన్ల నూనె వేయాలి. దీంట్లో పల్లీలు, శనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీంట్లో పసుపు వేసి కలిపి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి ∙వేయించిన పుట్నాల పప్పును పిండి చేసుకోవాలి ∙నానిన మరమరాలను మగ్గిన పోపు మిశ్రమంలో వేసి కలపాలి. పైన మూతపెట్టి 2 నిమిషాలు ఆగాలి. తర్వాత పుట్నాలపప్పు, కొత్తిమీర వేసి కలపాలి. ఈవెనింగ్ స్నాక్ ఉగ్గాణి రెడీ. పఫ్డ్ రైస్ బార్స్ కావల్సినవి: మరమరాలు – 250 గ్రాములు; బెల్లం – 750 గ్రాములు; నీళ్లు – 3 1/2 కప్పులు తయారీ: ∙బెల్లం తురమాలి. నీళ్లలో వేసి కరిగేంతవరకు గరిటతో కలపాలి. తర్వాత వడకట్టుకోవాలి. దీని వల్ల సన్నటి చెత్తను తీసేయడం సులువు. ∙ఈ బెల్లం నీళ్లు ఉన్న గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట ఉంచాలి. బెల్లం నీళ్లు మరిగేంతవరకు మంట పెద్దగా పెట్టి, తర్వాత సన్నటి మంట మీద ఉడికించాలి ∙పాకం చిక్కగా అయ్యేంత వరకు ఉంచి మరమరాలు పోసి కలపాలి. ∙ కొద్దిగా చల్లారాక మరమరాల మిశ్రమం కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేయాలి. అలాగే రెండు అరచేతులతో రోల్ చేస్తే పొడవు బార్స్ వస్తాయి. నోట్: 1. మరమరాలు పోయడానికి ముందు బెల్లం పాకంలో చిటికెడు యాలకుల పొడి వేసి కలపాలి. వీటిని లడ్డూలుగానూ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత గ్లాస్జార్లో భద్రపరిస్తే పిల్లల కంటికి అందంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. 2. పాకం పట్టేటప్పుడు ఒక చిన్న ప్లేట్లో వేడి పాకం మిశ్రమం ఒక చుక్క వేయాలి. నీళ్ల నుంచి బెల్లం పాకం వేరుగా కనపడిందంటే మిశ్రమం సిద్ధం అయినట్టుగా గుర్తించాలి. 3. మరమరాలు బెల్లం పాకంలో పోశాక టూటీ ఫ్రూటీ, డ్రైఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు. పఫ్డ్ రైస్ కేక్ మరమరాలను నువ్వుల పొడితో కలిపి తయారు చేస్తే రుచిగా ఉండటమే కాదు ఒంటికి బలం కూడా! ముఖ్యంగా రక్తహీనత ఉన్న అమ్మాయిలకు ఇది మంచి ఔషధం. కావల్సినవి: మరమరాలు – 5 కప్పులు; తెల్ల నువ్వులు – కప్పు; తేనె – అర కప్పు; తహని పేస్ట్ – 1/2 కప్పు (వేయించిన నువ్వులను పొడి చేసి, ఆలివ్ ఆయిల్ కలపాలి); ఖర్జూరం పేస్ట్ – తగినంత; పంచదార – 1/3 కప్పు; వెన్న – 1/2 కప్పు, జీడిపప్పు పలుకులు – కొన్ని తయారీ: పొయ్యి మీద పాన్ పెట్టి నువ్వులను వేయించాలి. దీంట్లో తేనె, తహని పేస్ట్, పంచదార కలపాలి. పంచదార కరిగి మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో మరమరాలు పోసి కలపాలి. వెన్నె లేదా నెయ్యి రాసి వెడలాట్పి ప్లేట్లో మరమరాల మిశ్రమం పోసి, వెడల్పాటి స్పూన్‌తో ప్లాట్‌గా సర్దాలి. పైన జీడిపప్పు పలుకులను పెట్టాలి. దీన్ని ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి. బయటకు తీసి చాకుతో ముక్కలుగా కట్ చేసి, సర్వ్ చేయాలి. పంచదార బదులు బెల్లం వాడితే మరింత రుచి వస్తుంది. మరమరాల దోసె ఇది దోసెకు పట్టినంత సమయమే పడుతుంది. ఇందులో వాడే మరమరాలు మినహా మిగతా దోసెకు కావల్సిన దినుసులన్నీ అవే! అయితే దోసె పిండిలో నానబెట్టిన మరమరాలను కూడా వాడటంతో దోసె మృదువుగా, రుచిగా అవుతుంది. కావల్సినవి: మరమరాలు – 150 గ్రాములు; బియ్యం – అరకేజీకి వంద గ్రాములు తక్కువ; మినప్పప్పు – 50 గ్రాములు; మెంతులు – అర టీస్పూన్; ఉప్పు – తగినంత; బేకింగ్ సొడా – చిటికెడు; నూనె – తగినంత తయారీ: ∙బియ్యం, మినప్పప్పు కడిగి 4 గంటలు నానబెట్టాలి. దీంట్లో మెంతులు వేయాలి. మరమరాలలో నీళ్లు పోసి, అరగంట నాననివ్వాలి. నీళ్ల నుంచి గట్టిగా పిండి మరమరాలను మరొక గిన్నెలోకి తీసుకోవాలి. బియ్యం, పప్పులో నానబెట్టిన మరమరాలు కూడా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. సరిపడా ఉప్పు కలిపి మూత పెట్టి 5–6 గంటలు బయటే ఉంచాలి. ∙దోసె వేసే ముందు కొద్దిగా బేకింగ్ సోడా కలపాలి. పిండి జారుగా ఉండటానికి మరికొన్ని కలుపుకోవాలి. ∙నాన్‌స్టిక్ పెనం పొయ్యిమీద పెట్టి వేడి చేయాలి. గరిటెతో దోసె పిండి పెనం మీద వేసి గరిటెను పిండి మీద వృత్తాకారంలో తిప్పాలి. దోసె వెడల్పుగా వచ్చిందనుకున్నాక చుట్టుతా నూనె వేసి 2–3 నిమిషాలు ఉంచి, కాలాక మంట తగ్గించి ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీ లేదా కొబ్బరి చట్నీతో వడ్డించాలి. -
ఆమెలో అదే స్పెషల్ !
తమిళసినిమా: ప్రతి మనిషిలోనూ ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. అలా నటి అమలాపాల్‌లోనూ ఒక ప్రత్యేకత ఉందట. అదేమిటో తెలుసా? ఈ అమ్మడి సినీ కేరీర్ పెళ్లికి ముందు, ఆ తరవాత అని విభజించవచ్చు. పెళ్లికి ముందు కథానాయకిగా నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి రెజింగ్‌లో కెరీర్ సాగింది. ఇక పెళ్లి, విడాకులతో కొంచెం తడబడినా తాజాగా మళ్లీ గాడిలో పడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకూ అమలాపాల్ ఖాతాలో రీఎంట్రీలో సరైన హిట్ పడలేదు. త్వరలో ధనుష్‌తో రొమాన్స్ చేసిన వీఐపీ–2 చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీనిపై అమలాపాల్ చాలా ఆశలు పెట్టుకుంది. కాగా ప్రస్తుతం తిరుట్టుప్పయలే–2, భాస్కర్ ఒరు రాస్కెల్, రెండు మలయాళ చిత్రాలు చేతిలో ఉన్నాయి. తాజాగా మరో తమిళ చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. ఇకపోతే అమలాపాల్‌లో మంచి చెఫ్ ఉందట. సమయం దొరికినప్పుడల్లా వంటింట్లోకి ప్రవేశించి రకరకాల చేపల కూరలను వండుతుందట. అదే విధంగా ఒంటరిగా పయనించడం అమలాపాల్ హాబీల్లో ఒకటట. -
మిస్టర్ చెఫ్
అతను స్టార్ హోటల్లో చెఫ్. అంటే వంట చేసే వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల్లో జీతం. కలర్‌ఫుల్ జీవితం. ఇలాంటి హ్యాపీ లైఫ్‌ను ఎవ్వరూ వదులుకోరు. కానీ ఈ మిస్టర్ చెఫ్ వదులుకుంటాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి రోడ్‌సైడ్ ఫుడ్ ట్రక్‌ను స్టార్ట్ చేస్తాడు. అందులోనూ అతను హ్యాపీలైఫ్ను ఎలా వెతుక్కున్నాడన్న అంశాలతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘చెఫ్’. బాలీవుడ్ డైరెక్టర్ రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. సైఫ్ ఆలీఖాన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. పద్మప్రియ కథానాయిక. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత డిఫరెంట్‌గా సైఫ్ ఇందులో కనిపించనున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న సైఫ్ ఫొటో సినిమాలోదే. చెఫ్ లుక్‌లో సైఫ్ సూపర్‌గా ఉన్నారు కదూ. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. -
వంటను ప్రశ్నిస్తే చెఫ్ కారం కుమ్మరించాడు
-
వంటను ప్రశ్నిస్తే చెఫ్ కారం కుమ్మరించాడు
లండన్: వీకెండ్ అంటే యువతకు పార్టీలు షరా మాములే.. ఇలాంటి పార్టీలే భార్యభర్తలు కూడా చేసుకుంటుంటారు. కాకపోతే పబ్బులు వంటివికాదుగానీ మంచి భోజనం పెట్టే రెస్టారెంట్లకు వెళ్లి తమకు నచ్చినది తింటుంటారు. బ్రిటన్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో ఇలాగే తమకు నచ్చిన ఆహారం తినేసి వద్దామనుకొని శనివారం సాయంత్రం వెళ్లిన ఓ భార్యభర్తలు విషాదాన్ని ఎదుర్కోవల్సి వచ్చింది. అది కూడా చీఫ్ చెఫ్ రూపంలో. వంట భాగలేదని చెప్పినందుకు ఆ షెఫ్ హోటల్‌కు వచ్చిన వ్యక్తి భార్యను తిట్టడమే కాకుండా ప్రశ్నించిన భర్త ముఖంపై మంచి ఘాటైన కారాన్ని కుమ్మరించాడు. దీంతో అతడి కళ్లు దాదాపు పోయిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. డేవిడ్ ఇవాన్స్(46), మిషెల్లీ(47) భార్యాభర్తలు. ఇద్దరు భోదనా రంగంలో పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం హ్యపీగా భోజనం చేసేందుకు ఓ రెస్టారెంటుకు వెళ్లారు. తొలుత స్టార్టర్స్‌తో ప్రారంభించి అవి అంతభాగలేకపోయినా ఏదో కానిచ్చేశారు. ఆ తర్వాత మాంసంతో కూడిన ఆహారం వచ్చాక కూడా అది సరిగా లేకపోవడంతో అది మాత్రం పక్కకు పెట్టి మిగితా భాగం తినేశారు. పూర్తయ్యాక ఫుడ్ ఎలా ఉందని వెయిటర్ ప్రశ్నించగా మాంసం సరిగా బాయిల్ అవ్వలేదని, రబ్బరు మాదిరిగాఉందని, స్ట్రార్టర్స్ కూడా బాగా లేవని చెప్పారు. అదే విషయాన్ని చెఫ్‌కు చెప్పాడు. దీంతో అతడు వారిని తిట్టాడు. తమనెందుకు తిడుతున్నావని క్షమాపణలు చెప్పాలని డేవిడ్ ఇవాన్స్ చెఫ్‌ను అడిగాడు. ఇందుకు తిరస్కరించిన చెఫ్ వెంటనే డేవిడ్ ముఖంపై కారం కుమ్మరించాడు. దాంతో అతడి కళ్లు పోయే పరిస్థితి ఏర్పడింది. -
చికెన్‌ఫ్రై చేయడం వస్తే ప్రభుత్వోద్యోగం వచ్చినట్లే
రాంచీ: జార్ఖండ్ పోలీస్ శాఖలో వంట మాస్టర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎవరు చికెన్‌ఫ్రై బాగా చేస్తారో, రోటీలు ఎంత వేగంగా ఎవరైతే తయారు చేస్తారో వారికే ఉద్యోగం దక్కుతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 4000 మంది అభ్యర్ధులు 78 ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఈ రిక్రూట్మెంట్కు రాంచీలోని పేరున్న పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల చెఫ్‌లు కూడా దరఖాస్తు చేసుకుని పోటీపడుతున్నారు. ఉద్యోగానికి ఎంపికయినవారికి నెలకు రూ.15000 నుంచి 18000 వరకు జీతంగా నిర్ణయించారు. ‘‘రాంచీలోనే పేరుపొందిన క్రిష్ణా రెస్టారెంట్లో పనిచేస్తాను. శాకాహార వంటకాలు వండుతాను’’ అని గుప్తా తెలిపారు. ఒకవేళ ఉద్యోగానికి ఎంపికైతే మంచి జీతం ఇస్తారని గుప్తా చెప్పారు. ‘‘నేను అదృష్టాన్ని పరిశీలించుకోవడానికి వచ్చాను. నేను చికెన్‌కర్రీ , రోటీ, వాటితో పాటు సలాడ్, శాకాహార కూరలు చేయగలను'' అని నగరంలోని క్యాపిటల్ గ్రూప్‌లో పనిచేస్తున్న మనీష్ తెలిపారు. అభ్యర్ధులు ఎక్కువగా వంట చేయడం వృత్తిగా ఉన్నారని పోలీస్ రిక్రూట్మెంట్ ఇన్ఛార్జ్ , డీఎస్పీ ఆర్.కె.చౌధరి తెలిపారు. కానీ ఎక్కువ మంది అభ్యర్ధులు రోడ్డు పక్కన చిన్న చిన్న హోటళ్లు నడుపుకునేవారని ఆయన అన్నారు. ‘‘చాలామంది పోటీపడుతున్నారు. కానీ అదృష్టం ఉండాలి. ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే తిరిగి మా గ్రామానికి వెళ్లి చైనీస్ ఫుడ్ అమ్ముకుంటాను’’ అని జంషెడ్పూర్ నివాసి శైలేష్‌కుమార్ అంటున్నారు. రాంచీకి 450 కిలోమీటర్ల దూరంలో ఉండే రానూపూర్ నుంచి వచ్చిన స్వర్గిని మరాండి మాట్లాడుతూ ‘‘స్లోకుక్డ్ పేరుతో వంట కాలు చేశాను. ప్రయాణపు ఖర్చులు, వసతి, సరుకులు మెత్తానికి రూ.2500 ఖర్చు చేశాను. అయినా ఫైనల్‌కు వచ్చినందుకు సంతోషంగానే ఉంది'' అని అన్నారు. జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అభ్యర్ధులు వచ్చారు. వారి వంటల రుచి చూసి ఆశ్చర్యపోయామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారు నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండే పోలీస్ పికెట్స్, క్యాంపులు, జార్ఖండ్ ఆర్మ్డ్ ఫోర్స్, జార్ఖండ్ జాగ్వర్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జార్ఖండ్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌ల్లో పనిచేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇలా వంటవాళ్లను నోటిఫికేషన్ ద్వారా ఎన్నుకోవటం మొదటిసారని జార్ఖండ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్యక్షుడు హరి నారాయణ రామ్ మహలి పేర్కొన్నారు. వంటలు మంచిగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటమే ఒక కొలమానంగా పోటీలు నిర్వహిస్తున్నామని ఆయనన్నారు. జనవరి 29 నుంచి ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాం. వచ్చే గురువారం తుది ఫలితాలు వెలువరిస్తామని చెప్పారు. -
సైఫ్...చెఫ్!
బాలీవుడ్ తెరపై హాలీవుడ్ కథలను రీమేక్ చేయడం ఎప్పటినుంచో వస్తున్నదే. హాలీవుడ్ ‘వారియర్’ను ‘బ్రదర్స్’గా ఇటీవలే తెర మీదకు తీసుకొచ్చింది హిందీ పరిశ్రమ. ఇప్పుడు మరో హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘చెఫ్’ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్వీయ దర్శకత్వంలో జాన్ ఫెవ్రూ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. సైఫ్ అలీఖాన్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి నిర్మాత విక్రమ్ మల్హోత్రా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సైఫ్ టైటిల్ రోల్ చేయనున్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. -
'ఆ అమ్మాయే నా భార్యగా.. ఐయామ్ సో లక్కీ'
ముంబయి: నోట మాటరాదు. ఎవరేం చెప్పినా వినిపించదు.. పుట్టుకతో మూగ, చెవి లక్షణాలు. అయినా జీవిత కష్టాలను ఈది గెలిచాడు. నచ్చిన భాగస్వామిని సొంతం చేసుకోబోతున్నాడు. ఇది ముంబయిలోని ఓ యువకుడి కథ. హ్యూమన్స్ ఆఫ్ బొంబే పేరిట ఫేస్బుక్ పేజీలో తన అనుభవాలు పంచుకున్నాడు. తొలుత పలు అవకాశాలకోసం కాలు అరిగేలా తిరిగిన అతడు చివరికి ఓ కిచెన్‌లో పనిలో చేరాడు. అక్కడే అనుభవం సంపాధించి మంచి చెఫ్‌గా మారాడు. ఒక్కసారి అతడి మాటల్లోనే చూస్తే.. 'నేనెప్పుడు వంటవాడిగానే ఉండేందుకు ఇష్టపడతాను. నేను వైకల్యంగలవాడిని కావడవంతో ఏ అవకాశాలు నాకు రాలేదు. పుట్టుకతో చెవుడు, మూగ లక్షణాలున్న నాకు ఎవరూ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ, ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. బదులు కూడా ఓ శబ్ధం ద్వారా ఇవ్వగలను. కానీ అది మీకు సరిగా అర్థం కాకపోవచ్చేమో. నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం అంటే నా ప్రేమ.. కాబోయే భార్య' 'ఓసారి దాదర్ మార్కెట్‌కు వెళ్లిన నాకు ఓ అమ్మాయి కనిపించింది. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. కానీ ఒక్కసారి కూడా ఆమెతో మాట్లాడలేదు. కనీసం కలవలేదు. కానీ ఓ రోజు నా స్నేహితుడు వచ్చి నీకు ఒక అమ్మాయిని చూశానని చెప్పాడు. ఏం చేస్తాం ఏదో ఒక అమ్మాయిలే అనుకున్నాను. కానీ, ఆశ్చర్యపోయేలా నేను మార్కెట్లో ఏ అమ్మాయిని చూశానో అమ్మాయినే నా స్నేహితుడు నాకు భార్యగా తెచ్చాడు. ఆ సందర్భం ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా అదృష్టవంతుడిని. ఆమెకు కూడా నాలాగా వినిపించదని తెలిసింది. దీంతో ఆమెపై నాకు మరింత ప్రేమ పెరిగింది. మేమిద్దరం దగ్గరవడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. తొలిసారి కలుసుకున్నప్పుడు మాటలు చెప్పలేను. ఆమె నా ప్రేమను ఒప్పుకుంది. త్వరలో పెళ్లి చేసుకుంటాం' అని చెప్పాడు. -
ఉందిలే మంచి కాలమ్..
Jhansi ki వాణి: గడచిన సంవత్సరం ఎలా గడచినా కొత్త సంవత్సరం మాత్రం కొత్తగా ఉండాలని కోరుకుంటాం. కొత్త ఆశలను, కొత్త అవకాశాలను మోసుకొచ్చిన 2015కు స్వాగతం. ఫార్ములా వన్ ట్రాక్‌పై దూసుకెళ్లిన రేసుకారులా 2014 రివ్వున వెళ్లిపోయింది. కానీ, జ్ఞాపకాల పొరల్లో దాని తాలూకు గుర్తులు మంచీ, చెడు రెండూ చరిత్రలో నిలిచిపోతాయి. కలంతో స్నేహం.. 2014లో ఏం చేశాను, రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాను. వెనక్కి తిరిగి చూసుకుంటే 2014 నా కెరీర్లో ప్రత్యేకంగా గుర్తించుకునే సంవత్సరం అవుతుందని అనిపించింది. ‘చెఫ్ నంబర్ 1’ కార్యక్రమంతో మొదటిసారి దర్శకురాలిని అయ్యాను. ఈ సంవత్సరమే నా మొదటి పూర్తి పొలిటికల్ డిబేట్ షోతో రాజకీయాలనూ టచ్ చేశాను. ఈ సంవత్సరంలోనే ఎప్పట్నుంచో అనుకుంటున్న మీడియా లా చదవడానికి కాలేజీలో చేరాను. ఎప్పుడూ అనుకోనట్టు ఈ సంవత్సరమే మొదటిసారి కలం పట్టి కాలమిస్ట్ అవతారం ఎత్తాను. నాలో ఇన్ని కొత్త కోణాలను చూపించిన 2014 మరిన్ని అవకాశాలకు దారి చూపిస్తున్నట్టు 2015కు ద్వారం తెరిచింది. వారందరికీ వందనాలు.. 2015 ఇంకా ఏం ప్రారంభం కాకుండానే ఈ సంవత్సరం నాకు ప్రత్యేకం. బుల్లితెరపై ఇది నాకు ఇరవయ్యో సంవత్సరం. రెండు దశాబ్దాల కెరీర్ ఇచ్చినందుకు ఈ రంగానికీ, ఇన్నేళ్లూ మెచ్చి ఆశీర్వదించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు కొత్త కోణంలో నన్ను చూపించేందుకు ఈ ప్రయాణంలో ఎందరో నాకు సహకరించారు. వారందరికీ నమః! ఈ క్రమంలో మోకాలడ్డిన వారికీ మనస్ఫూర్తిగా నమః! తిరిగి లేవడం నేర్పింది వారే మరి. పడి లేవడమే కాదు, ఎగిసే అలలా, ఎగిరే పక్షిలా దూసుకెళ్లేందుకు నా రెక్కల కింద కనిపించని గాలిలా నిరంతరం ప్రోత్సహించే నా వారందరికీ ఈ సంవత్సరం నేనివ్వగలిగింది నా విజయాలు మాత్రమే. థింక్ పాజిటివ్.. మన మనసులో మెదిలే ప్రతి ఆలోచన ఏదో ఒక విధంగా కార్యరూపం దాలుస్తుందని ‘ద సీక్రెట్’ అనే పుస్తకంలో చదివాను. అప్పటినుంచి అంతా పాజిటివ్‌గానే ఆలోచించే ప్రయత్నంలో ఉన్నాను. 2015 గురించి ఆలోచించేటప్పుడు నాకెందుకో చాలా పాజిటివ్‌గా అనిపిస్తోంది. మనకు జరగబోయే మంచి గురించి మన చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులు ఓ క్రమంలో కన్స్పైర్ అవుతాయని పాలోకొల్హో పుస్తకాల్లో చదవడమే కానీ, ఎప్పుడూ అనుభూతి చెందలేదు. కానీ మొదటిసారి అలాంటి అనుభవం కలిగింది. గగనంలో శుభశకునం.. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తూ ఫ్లైట్‌లో ఈ ఆర్టికల్ రాస్తున్నాను. సరిగ్గా మొదటి రెండు పేరాలు రాశానో లేదో వెనుక సీట్లో నుంచి ఓ పెద్దాయన నా దగ్గరకు వచ్చి, నా చేతిలో చాక్లెట్ బాక్స్ పెట్టి నన్ను మెచ్చుకుని వెళ్లిపోయారు. ఇందులో కొత్తేముంది , చాలా మంది నాకిలా చెప్పి ఉంటారనుకుంటున్నారా..! ఎంత మంది చెప్పినా, ఎలా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా.. మా అమ్మగారు చెప్పినట్టు అవన్నీ ఆశీఃకవచమై రక్షిస్తాయని నా నమ్మకం. అలా ఆశీర్వదించిన ఈ పెద్దాయన నాకు ఆ రోజు ఇచ్చిన గిఫ్ట్‌లో నాకు పాజిటివ్ సిగ్నల్ కనిపించింది. 2015కు అది నాకు కిక్ స్టార్ట్. ఆ చాక్లెట్ బాక్స్ స్టార్ ఆకారంలో ఉంది. అది నాకు అంతర్లీనంగా పాజిటివ్ శకునంలా తోచింది. తేరుకుని వెనక్కి వెళ్లి ఆ పెద్దాయనను ‘ఒక ఫొటో దిగొచ్చా..’ అని అడిగాను. ఎప్పుడూ ఫొటోలు మేమడిగి దిగుతాం కానీ, మీరు మాతో తీయించుకోవడమేంటని ఆశ్చర్యపోయింది వాళ్లావిడ. ఆ మూమెంట్ ప్రత్యేకత, ఆ గిఫ్ట్ విలువ వారికి అర్థం అయినా, కాపోయినా ఆ క్షణాలు నన్నెప్పుడూ రీచార్జ్ చేయడానికి ఈ ఫొటో ఉపయోగపడుతుంది. 2015 సంవత్సరంలో పరిగెత్తేందుకు కావాల్సిన ఉత్సాహాన్నిచ్చిన శర్మ, విజయలక్ష్మి దంపతులకు ధన్యవాదాలు. మార్పు మన మంచికే.. డేటు మారుతుంది, రుతువులు మారతాయి, క్యాలెండర్ మారిపోతుంది. మనం మారకపోతే ఎలా..? సంవత్సరం కొత్తగా ఉండాలంటే మనం కూడా కొత్తదనాన్ని ఆహ్వానించేందుకు మారాలి. ఇక్కడో పిట్టకథ గుర్తొచ్చింది. నిజమో కాదో తెలీదు కానీ, ఒక రకం గద్ద 40 ఏళ్లు వచ్చాక ఎత్తయిన కొండపైకి వెళ్లి, తన ముసలి ఈకలను, కాలి గోళ్లను తానే పీకేసుకుంటుందట. ఆపైన రాతికి తన మొండిబారిన ముక్కుని ఢీ కొట్టీ కొట్టీ ఊడగొట్టుకుంటుందట. తిరిగి మెల్లగా మొలిచే ఈకలు, గోళ్లు, ముక్కు మరింత పదనుగా ఉంటాయట. తన కొత్తరూపంతో ఆ గద్ద మరో 40 ఏళ్లు బతకగలుగుతుందట. నొప్పికి భయపడి మార్పు వద్దనుకుంటే నువు మరణించినట్టే అని ఈ కథ సారాంశం. మార్పు భయపెడుతుంది, మార్పు బాధ కలిగిస్తుంది. కానీ, మార్పు మన మంచికే. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు 2015లో ప్రయత్నిస్తాను. మనసారా మార్పుని ఆహ్వానిస్తాను. 2015 అందరికీ సంతోషాలను మోసుకురావాలని ఆశిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్. -
పాము 'తలే' ప్రాణం తీసింది!
చైనా:పాము తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ మాంసాన్ని వంటకు సిద్ధం చేశాడు. అయితే ఆ వేరు చేసిన తల ప్రాణంతోనే ఉన్నదన్న సంగతి మరిచాడు. అలా చేయడమే అతని ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ తాజా నమ్మశక్యం కాని ఘటన చైనాలోని ఫోషన్ నగరంలోని కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఒక చెఫ్ త్రాచు పామును మాంసాహారంగా చేయడం కోసం ఒక కత్తితో ఆ పాము తలను, మొండాన్ని వేరు చేశాడు. ఇక వంటకు సిద్ధం అయ్యే క్రమంలో ప్రక్కనే ఉన్న పాము తలను చెత్తబుట్టలో పాడేయడానికి వెళ్లాడు. అయితే ఆ పాము తల మాత్రం అప్పటికీ ఊపిరితోనే ఉంది. అది ఆ చెఫ్ ను కాటువేయడంతో అతను కొద్దిపాటి సమయంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఇటువంటి ఘటనలు అరుదుగా జరిగినా.. పాము తలను వేరుచేసిన గంట తరువాత కూడా బ్రతికే ఉంటాయనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. -
కుకింగ్లు!
భగభగలాడే భూమి పొరల నుండి వెలికితీసి, మరిగించి, కరిగించి పోత పోసేది, మన ఒంటి మీది బంగారం అయితే భగ భగలాడే బాణలిలో ఉడికించి, మరిగించి, కరిగించి, పోపించి, వడ్డించేది మన కంచంలోని బంగారం. ఆ కమ్మటి వాసనను ఎగబీల్చి, ‘ఈ వంట చేసిన ఆవిడ ఎవరో’ అని అనుకుంటే పొరపాటే. వంట ఒక్క ఆడవాళ్ల సొత్త్తే కాదు, మేము కూడా చేయి కాల్చుకోగలం అని నిరూపించారు ఈ ముగ్గురు కుర్ర షెఫ్‌లు. ఇంజినీరింగో, ఎంబియే అనో వెళ్లకుండా పాకశాస్త్ర పట్టా పుచ్చుకొని, ఆ రంగంలో కొత్త రుచులు సృష్టిస్తున్న ఈ ముగ్గురి గురించి... 1- ‘‘ఎవరైనా 8వ తరగతి చదివే విద్యార్థిని, ట్యూషన్‌కో, ఐఐటీ కోచింగ్ సెంటర్స్‌కి వర్క్ షాపులకు పంపుతుంటారు. నన్ను మాత్రం హైదరాబాద్ పార్క్ హోటల్లోని పేస్ట్రీ అండ్ బేకరీ వర్క్‌షాప్‌కి పంపించారు నా తల్లిదండ్రులు. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పట్నుంచీ వంటలంటే చాలా ఆసక్తి. ఏదైనా తినగానే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగేది. దాని వెనుక ఉన్న మేజిక్ ఏంటో తెలుసుకోవాలని ఎప్పుడూ అనిపించేది. హాస్టల్లో ఉండి చదువుకునేప్పుడు, వారానికి రెండు మూడు రోజులైనా స్కూల్ కిచెన్‌లోకి వెళ్లి అంతా అబ్జర్వ్ చేసేవాడిని. నా ఆసక్తిని గమనించి మా పేరెంట్స్ నన్ను ఆ రంగం వైపు వెళ్లేందుకు ప్రోత్సహించడమే కాక, కలినరీ ఆర్ట్స్‌లో ఫ్యూచర్ ప్లానింగ్‌లోనూ సాయం అందిస్తున్నారు. ఆ వర్క్ షాప్ నా జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. షెఫ్‌లకు ఉండే విలువ, ఆదరణ కళ్లారా చూశాను. ఇద్దరు, ముగ్గురు షెఫ్స్ ఫోన్ నంబర్లను తీసుకుని, వారితో ప్రతిరోజూ మాట్లాడేవాడిని. రకరకాల వంటల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకునేవాడిని. స్కూల్‌కి వెళ్లడం, హోమ్ వర్క్ చెయ్యడం, షెఫ్‌లతో మాట్లాడటం, లేదంటే ఏదైనా వంట చెయ్యడం... ఇదే పని! దాంతో మా ఫ్రెండ్స్ నాకు ‘బావర్చి’ అని నిక్ నేమ్ పెట్టారు. నాకు పేస్ట్రీల మీద ఎక్కువ ఆసక్తి. ఆ ఆసక్తితోనే పార్క్ హోటల్లో జూనియర్ గౌర్మెట్ షెఫ్‌గా చేరాను. అక్కడ 5000 బ్రెడ్ పీసెస్‌తో రాష్ట్రంలోనే అతి పెద్ద జింజర్ డ్రెడ్ హౌస్‌ని నిర్మించాం. అందులో నేనూ ఒకణ్ణి అవ్వడం నా అదృష్టం. ఎన్నిసార్లు చేతులూ, వేళ్లూ కాల్చుకున్నా వాటినుండి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. 2- మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్నగారు ఛత్తీస్‌గడ్‌లోని ఒక నర్సింగ్ కాలేజీలో, అమ్మ ఓ హాస్పిటల్లో పని చేస్తారు. చిన్నప్పట్నుంచీ నాకు ‘ఇది అవ్వాలి’ అనే క్లారిటీ లేదు. తల్లిదండ్రులు, మెడికల్ ఫీల్డ్‌లో పని చేస్తుండటంతో డాక్టర్ అవుదామని ఇంటర్ తరువాతCOMEDKలో మంచి ర్యాంక్ సాధించా! కానీ అందరూ వెళ్లే దారిలోనే వెళుతున్నానని వెలితిగా అనిపించేది. అంతేకాక నేను ఎమ్‌బీబీఎస్ చేస్తే, మా తమ్ముడు కూడా నన్ను ఫాలో అయి ఎమ్‌బీబీఎస్ కానీ ఇంజినీరింగ్ కానీ చేస్తేనో? కనీసం మా ఇంట్లో ఈ పరిస్థితి మార్చాలనుకున్నాను. అందుకే ఎవరూ ఎన్నుకోని ప్రొఫెషన్ని ఎంచుకుందామని నిర్ణయించుకున్నాను. చిన్నప్పట్నుంచీ మా అమ్మ నాకు వండి తినిపించడమే కాక, వంట ఎలా చెయ్యాలో కూడా నేర్పేది. అందుచేత వంట అనేది నాకు చిన్నప్పట్నుంచీ ఉన్న హాబీ. అలాగే చిన్నప్పట్నుంచీ సంజీవ్ కపూర్ గారంటే ఒక ఆరాధ్యభావం. అంత సులువుగా వంట ఎలా చేసేవారా అని ఆశ్చర్యపోయేవాణ్ణి! అందులో కిటుకేంటో తెలుసుకుందామని ఈ వృత్తి ఎన్నుకున్నాను. మా ఇంట్లో కూడా ఓకే అన్నారు. వండటం అనేది కళ. ఒక చిత్రకారుడు చిత్రం వేసే ముందు రంగుల్ని కలుపుతాడు. నేను దినుసుల్ని కలుపుతాను. ‘ఎవరి హృదయాన్నయినా చేరుకోవాలంటే ముందు వారి కడుపుని శాంతపరచడమే మార్గం’ - ఇది ఇన్నేళ్ల వంట గది ప్రయాణంలో నేను నేర్చుకున్నది. ఐహెచ్ఎమ్లో చేరాక, వంట అంటే కేవలం గిన్నె, గరిటెల్లోనే ఉండేది కాదని తెలుసుకున్నాను. ఈ కలినరీ ఆర్ట్స్ వల్ల క్రమశిక్షణ అలవడుతుందని తెలుసుకున్నాను. ఈ రంగంలో జీతం బాగుంటుంది. మన దేశంలోనే కాక, విదేశాల్లో కూడా కోర్సులు చేసి, సొంతంగా ఒక ఇండియన్-ఇటాలియన్ రెస్టారెంట్ పెట్టాలనేది నా కోరిక. 3- ‘‘తండ్రి సైంటిస్టు. అన్న లా స్టూడెంట్. ఇంట్లో ఇద్దరు గొప్ప విద్యావంతులున్నా నాకు స్ఫూర్తినిచ్చింది మాత్రం నిరక్షరాస్యురాలైన మా అమ్మే. బీహార్‌లోని ససరం అనే చిన్న ఊరు మాది. ఇంటర్లో అవినాష్ అనే మిత్రుడుండేవాడు. అతను వంట చేయడంలో సిద్ధహస్తుడు. అతని స్ఫూర్తితో ఇంటర్ తర్వాత కలినరీ ఆర్ట్స్‌లో చేరాను. వంటలలో బేసిక్స్ మా అమ్మ దగ్గర నేర్చుకుంటే, నూతన టెక్నిక్స్‌ను మా స్నేహితుడి వద్ద నేర్చుకున్నాను. ఐహెచ్ఎమ్లో కోర్స్ పూర్తిచేసి ప్రస్తుతం లెమన్ ట్రీ ప్రీమియర్‌లో షెఫ్‌గా చేస్తున్నాను. సామర్థ్యం, మెళకువలతో పాటు దీక్ష, ఓపిక ఈ రంగానికి అవసరం. కుకింగ్ అనేది వేరొకరి మీద ప్రేమని చూపించే కళ. ఒక పెయింటింగ్‌నో, పొయిట్రీనో చూసినప్పుడు కలిగే భావన ఒక మంచి వంటకం తిన్నా కలుగుతుంది. అంతేకాక వంటల్లో మనం రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. అందుకే కుకింగ్ ఒక కళే కాదు, సైన్సు కూడా! ప్రతి వంటా ఒక సంప్రదాయాన్ని సూచిస్తుంది. ఆ సంప్రదాయాన్ని వేరే వారికి పరిచయం చేయడమే నా ధ్యేయం. అందుకే మారుమూల ప్రాంతాల్లో వంటకాలను రెసిపీలను యూ ట్యూబ్‌లో పెడుతున్నాను. అంతేకాక వాటి గురించి ఒక పుస్తకం కూడా రాస్తున్నాను. ఎక్కువ మంది ఈ రంగం మీద ఆసక్తి ఉన్నా చేరరు. డబ్బు తక్కువ వస్తుంది అనేది ఒక కారణం. కాని అది పూర్తిగా నిజం కాదు. మొదట ఒకటి రెండేళ్లు అరకొరగా ఉన్నా, ఎక్స్పీరియన్స్ పెరిగేకొద్దీ జీతం విపరీతంగా పెరుగుతుంది. లక్షలు సంపాదించే షెఫ్‌లు కూడా మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ పని చేసినా తృప్తి అనేది ముఖ్యం. అది ఈ రంగంలో భాండాలకొద్దీ దొరుకుతుంది. నా మట్టుకు నాకు నేనే ఒక ఫుడ్ డాక్టర్... ఫుడ్ ఇంజినీర్! -
ఇంట ఆమె గెలిచింది... రచ్చ ఆయన గెలిచాడు
చెఫ్... అని గూగుల్‌లో ఇమేజెస్ వెతకండి... అందులో ఎంతమంది ఆడవాళ్లున్నారో లెక్కపెట్టండి. మౌస్‌ను ఎంత కిందికి దించినా కనపడటం లేదా? ప్రతి ఇంట్లోనూ స్త్రీ చేతి వంటే మనం తింటున్నాం. కానీ దాదాపు ప్రతి హోటల్లోనూ పురుషుడే మనకు వండి పెడుతున్నాడు. దీనికి కారణాలేంటని ఆరా తీస్తే సమాధానాలు, విశ్లేషణలు బోలెడొచ్చాయి. స్త్రీకి మానసికంగా సహనం ఎక్కువే ఉండచ్చు గాని శ్రమతో కూడిన సహనాన్ని భరించడానికి ఆమె శరీర నిర్మాణం అనుకూలంగా ఉండదు. గతంలో గ్యాస్ స్టౌలు, పనిని సులువు చేసే ఆధునిక పాత్రలు, ఇతర సదుపాయాలు లేకపోవడంతో, ఎక్కువమందికి ఒకేసారి వంట చేయడం స్త్రీలకు కష్టమయ్యేది. సహాయకులను పెట్టుకుందామన్నా, మగసహాయ కులు కావాలి. అప్పటి సమాజం దీనిని పూర్తిస్థాయిలో అనుమతించలేదు. వంట బాగా వచ్చిన స్త్రీలు... సొంత ఇంటి వేడుకల వరకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేవారు. వృత్తిగా స్వీకరించడానికి అనువైన పరిస్థితు లు ఉండేవి కావు. దీంతో స్త్రీలకు సామర్థ్యాలున్నా ఈ రంగంలోకి రాలేదు. ఎక్కువమంది స్త్రీలు చెఫ్‌లుగా లేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఏదైనా ఒక రంగంలో స్త్రీలు అసలు వేలు పెట్టే పరిస్థితులే లేనపుడు, తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారినా అది అందరికీ తెలిసి, దానిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ విషయం సమాజం అంగీకరించడానికి మరింత సమయం పడుతుంది. అందుకే స్త్రీలు చెఫ్‌లుగా రాణించే పరిస్థితులు కొన్నేళ్ల క్రితమే వచ్చినా వారు ఈ రంగం వైపు మొగ్గు చూపలేకపోయారు. ఇంకో విషయం.. వంట ఓ కళ. స్త్రీలకు మాత్రం వంట ఒక దినచర్య. పైగా ఇళ్లలో కుటుంబసభ్యుల ఆకలి తీర్చడం ప్రధానం. అందువల్ల వంటను ఒక కళగా, ప్రయోగాలు చేసే అంశంగా స్త్రీలు చూసేవారు కాదు. మరో కారణం ఏంటంటే... ఈ రంగంలో గతంలో వేతనాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఖరీదైన రెస్టారెంట్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు రావడం, ప్రజలు తినడానికి బయటకు వెళ్లడాన్ని ఇష్టపడుతుండటం వల్ల అవకాశాలు బాగా పెరిగాయి. వాటితోపాటు ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఇప్పుడు స్త్రీలు చెఫ్ లుగా రాణించే అవకాశాలు పెరుగుతున్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరుతున్న స్త్రీల శాతం పెరుగుతోంది. కాకపోతే ఈ టైమింగ్స్ వారిని ఇంకా నియంత్రిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వెసులుబాటు ఏంటంటే... గతంలోలా భారీ పాత్రలతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే... ఆర్డర్లకు అనుగుణంగా ‘చెఫ్’లు వాటిని ఇద్దరు, ముగ్గురు, మహా అయితే ఏడెనిమిది మందికి సరిపడే తక్కువ పరిమాణాల్లో వండితే చాలు. ఏదేమైనా తమకు బాగా తెలిసున్న పనిలో స్త్రీలు ఇంత ఆలస్యంగా రావడం ఒక విచిత్రం! - ప్రకాశ్ చిమ్మల -
విజయం: సెలెబ్రిటీలు మెచ్చిన చెఫ్!
పూజ వ్యాపారం 200 శాతం వృద్ధి సాధించింది. అక్కడ సగం ఉత్పత్తులు ముంబై టాప్ సెలబ్రిటీల ఇళ్లకే వెళ్లిపోతాయి. వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు ఫుడ్ రైటింగ్, ఫుడ్ ఫొటోగ్రఫీ మీద కోర్సులతో స్టూడియో 15 అనే సంస్థను కూడా ఆరంభించే ప్రయత్నంలో ఉంది పూజ. మాంద్యం రానివ్వండి. అన్ని రంగాలూ కూలిపోనివ్వండి. ఉద్యోగాలు పోనివ్వండి! కానీ ఉపాధికి, ఆదాయానికి ఢోకా లేని అంశాలు రెండుంటాయి. ఒకటి వైద్యం, ఇంకోటి తిండి! కాకపోతే మొదటి రంగం అందరినీ ఎంచుకోదు. రెండో రంగాన్ని అందరూ ఎంచుకోరు! కానీ ముంబైకి చెందిన పూజ ఢింగ్రా... సామాన్యులకు ఆసక్తి లేని రంగాన్నే ఎంచుకుంది. వండి పెట్టే నైపుణ్యం కోసం దేశాలు తిరిగింది. ప్రయోగాలు చేసింది. చివరికి విజేతగా నిలిచింది. స్ఫూర్తినిచ్చే ఈ యువ వ్యాపారవేత్త విజయగాథను తెలుసుకుందాం రండి! వస్తువుకు లగ్జరీ ఉంటుంది. మరి తిండికి లగ్జరీ ఉంటుందా? ఉంటుంది. ముంబయిలోని ‘లీ 15 ప్యాటిసెరీ’కి వెళ్తే తెలుస్తుంది దీనికి సమాధానం. అసలా పేరు చెబితేనే చాలామందికి నోరూరిపోతుంది. ఇంతకీ అదేంటో తెలుసా... ఓ లగ్జరీ బేకరీ. అందులోని ఐటమ్స్‌కు యమా గిరాకీ. అందులోనూ మాకరాన్స్ (క్రీమ్ బిస్కెట్లు) గురించి చెప్పనవసరం లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తుంటారు. ఎందుకంత డిమాండ్? అది తెలుసుకోవాలంటే ఆ డిమాండును సృష్టించిన పూజ ఢింగ్రా గురించి తెలుసుకోవాలి. పూజ వాళ్లమ్మ కొన్నాళ్లు చాకొలేట్ వ్యాపారం చేసింది. నాన్న కూడా రెస్టారెంట్ నడిపేవారు. అందుకే ఆమెకు ఫుడ్ ఇండస్ట్రీ మీదే ఆసక్తి ఏర్పడింది. అయితే పనిని ఉపాధిలా కాకుండా వృత్తిలా చూసే గుణం ఆమెను విజేతగా నిలిపింది. డబ్బు అనేది ఆమెకు ‘బై ప్రొడక్ట్’గా వచ్చి పడింది. ఐతే ఈ స్థాయికి చేరే క్రమంలో పూజ తన రాతను తనే రాసుకుంది. ఇంటర్మీడియట్ తర్వాత తల్లిదండ్రులు పూజను న్యాయవాది కమ్మన్నారు. ఆ కోర్సులో చేరింది కూడా. కానీ వారం రోజులు గడిచాక తన గమ్యం ఇది కాదని ఆమెకర్థమైంది. లా పుస్తకాలు తలకు మించిన భారంలా కనిపించాయి. చెఫ్ కావాలని కోరుకుంది. ఆ కోరికనే తల్లిదండ్రుల ముందు పెట్టింది. అంతే, స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కించేశారు వాళ్లు. అక్కడ ఓ ప్రముఖ ఇన్స్టిట్యూట్లో హాస్పిటాలిటీ కోర్సులో చేరింది. మొదట అక్కడి వారి మధ్య తనను తానో ఏలియన్లా భావించిన పూజ... మెల్లగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నించింది. ఆమె తొలి ఇంటర్న్‌షిప్ ఓ కుటుంబం నడుపుతోన్న రెస్టారెంట్లో. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనే. పొద్దున బ్రేక్ ఫాస్ట్ చేయడంతో మొదలు.. పొద్దు పోయే వరకూ పనే పని. రెండో ఇంటర్న్‌షిప్ ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో. అక్కడ ఫ్లోర్లు, టాయిలెట్లు శుభ్రం చేయడం ఆమె పని. నామోషీ పడకుండా అన్ని పనులూ చేసింది. కోర్సు పూర్తయ్యేసరికి అంతర్జాతీయ డెలిగేట్స్ సెమినార్లు నిర్వహించే స్థాయికి చేరుకుంది. స్విస్ నుంచి తిరిగొచ్చాక ప్యారిస్ వెళ్లి అక్కడ మరో హాస్పిటాలిటీ కోర్సు చేసింది. తర్వాత ఏం చేయాలి? వ్యాపారంలోకి ఎలా దిగాలో తెలియక.. తన ఇంటి కిచెన్‌నే ప్రయోగశాలగా మార్చుకుంది పూజ. తాను నేర్చుకున్న వంటలు ఇక్కడ ప్రయత్నించబోతే.. అన్నీ దెబ్బకొట్టేశాయి. విదేశాల్లో దొరికే పదార్థాలు ఇక్కడ దొరకలేదు. దాంతో ఇక్కడ దొరికే పదార్థాలతో బేకరీ ఐటమ్స్‌ను తయారు చేయడం మొదలుపెట్టింది. తాను తయారు చేసిన పదార్థాలతో ఫుడ్ ఎగ్జిబిషన్లకు తిరిగింది. దాంతో ఆర్డర్లు వచ్చాయి. పూర్తిగా విశ్వాసం లభించాక ‘లీ 15 ప్యాటిసెరీ’ని ఆరంభించిందామె. కొన్నాళ్లకే ముంబయిలోని విశిష్టమైన బేకరీల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. మరో రెండు శాఖలు కూడా వెలిశాయి. తనలా షెఫ్ కావాలనుకునేవారికి పాఠాలు కూడా చెబుతోంది పూజ. ఆమె క్లాసులకు వెళ్లాలనుకుంటే, www.le15.co.in/classes.php లో వివరాలున్నాయి. - ప్రకాష్ చిమ్మల