Bill Gates makes roti with chef Eitan Bernath, enjoys it with ghee - Sakshi
Sakshi News home page

టెక్‌ దిగ్గజం బిల్‌ గేట్స్‌ రోటీ చేస్తే ఎలా ఉంటుంది? వైరల్‌ వీడియో

Published Fri, Feb 3 2023 4:17 PM | Last Updated on Fri, Feb 3 2023 4:31 PM

Bill Gates makes roti with chef Eitan Bernath enjoys with ghee - Sakshi

సాక్షి, ముంబై: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు  బిల్ గేట్స్‌ ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నారు. ఒక ఫుడ్ బ్లాగర్ తో కలిసి రోటీలు తయారు చేసిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బిహార్‌ పర్యటనలో భాగంగా  టెక్‌ దిగ్గజం చెఫ్‌ అవతార మెత్తారు. ప్రముఖ చెఫ్ ఈటన్ బెర్నాథ్‌తో  కలిసి రోటీలు చేసిన వాటిని నేతితో ఎంజాయ్‌ చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు రోటీ ఎలా చేయాలో నేర్చుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి వాటిని ఆరంగించారు. చాలా బాగున్నాయంటూ బిల్ గేట్స్ కితాబునిచ్చారు. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గేట్స్ ఒక వీడియోను పంచుకున్నారు, దీనిలో రోటీని ఎలా తయారు చేయాలో బెర్నాథ్ గేట్స్‌కు నేర్పించారు. ‘‘మేం  కలిసి భారతీయ రోటీని తయారు చేసాం. ఈటాన్ భారతదేశంలోని బీహార్ పర్యటన నుండి తిరిగి వచ్చాడు, అక్కడ అతను గోధుమ రైతులను కలుసుకున్నాడు, కొత్త ప్రారంభ విత్తే సాంకేతికతలతో దిగుబడి గణనీయంగా పెరిగింది’’ అని గేట్స్ క్యాప్షన్‌లో రాశారు.అలాగే 'దీదీ కి రసోయ్' కమ్యూనిటీ క్యాంటీన్ల  మహిళలను కూడా కలుసుకున్నారు. 

అటు పాప్యులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్  దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.   ‘‘నేను భారతదేశంలోని బీహార్ కు వెళ్లి వచ్చా.. అక్కడ గోధుమలను పండించే రైతులను కలిశాను. రోటీని తయారు చేయడంలో తమ నైపుణ్యాన్ని పంచుకున్న ‘దీదీ కీ రసోయి’ క్యాంటీన్‌లకు ధన్యవాదాలు’’ అని ఆయన రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement