Microsoft
-
మస్క్ హింట్ ఇచ్చారా!.. దిగ్గజాల కథ కంచికేనా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్‌తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్‌లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.Interesting. We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024 -
మైక్రోసాఫ్ట్‌కు, గూగుల్‌కు తేడా అదే..
మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యూహంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూక్ష్మంగా స్పందించారు. ది న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీదారులతో పోలిస్తే ఏఐలో గూగుల్ (Google) పురోగతి గురించి అడిగినప్పుడు, పిచాయ్ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు. గూగుల్ సొంత ఏఐ మోడల్లను అభివృద్ధి చేస్తుంది.. కానీ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల బాహ్య మోడల్‌లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల మాటకేమంటారు..?పోటీదారులతో పోలుస్తూ ఏఐలో గూగుల్ పురోగతి గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. ఏఐ రేసులో గూగుల్ గెలవాలని సవాలు విసురుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన గుర్తుచేశారు. పిచాయ్ స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ బాహ్య ఏఐ మోడల్స్‌పై ఆధారపడుతుందని, కానీ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు.చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మైక్రోసాఫ్ట్‌కు సవాలు విసురుతున్నారా.. అని ప్రశ్నించగా పిచాయ్ నవ్వుతూ, "అలా కాదు.. వారి పట్ల, వారి టీమ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై పిచాయ్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఏఐ- పవర్డ్ బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించిన తర్వాత సెర్చ్ వ్యాపారం పరంగా గూగుల్ ఎడ్జ్ గురించి నాదెళ్ల మాట్లాడారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్‌ను '800-పౌండ్ల గొరిల్లా' అని అభివర్ణించారు. తమ ఆవిష్కరణలతో గూగుల్‌ను ఆట ఆడిస్తామని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్.. మైక్రోసాఫ్ట్ బాస్‌కు కౌంటర్ ఇచ్చారు. తాము వేరొకరి మ్యూజిక్కు ఆడబోమంటూ బదులిచ్చారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్‌ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. తనకు అందించే స్టాక్ అవార్డులు ఏకంగా గతంలో కంటే 63 శాతం వృద్ధి చెందాయి. దాంతో తన వేతనం 79.1 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.665 కోట్లు)కు చేరింది. అయితే సంస్థ ద్వారా తనకు బోనస్ రూపంలో అందే వేతనాన్ని మాత్రం తగ్గించాలని కోరడం గమనార్హం.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ దాఖలు చేసిన నివేదిక ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరంలో సీఈఓ సత్య నాదెళ్ల మొత్తం పరిహారం సుమారు 79.1 మిలియన్లు (సుమారు రూ.665 కోట్లు)గా ఉంది. ఆయన వేతనం మైక్రోసాఫ్ట్ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. తనకు స్టాక్ అవార్డుల రూపంలో కంపెనీ అధికంగా వేతనం చెల్లిస్తుంది. దాంతో కంపెనీ షేర్లు పెరిగితే తన సంపద సైతం అధికమవుతుంది. తనకు కంపెనీ ఇచ్చిన వేతనం వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్టాక్ అవార్డులు: 71,236,392 డాలర్లు (సుమారు రూ.600 కోట్లు)నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్: 52 లక్షల డాలర్లు (సుమారు రూ.44 కోట్లు)మూల వేతనం: 25 లక్షల డాలర్లు (రూ.21 కోట్లకు పైగా)ఇతర అవవెన్స్లతో కూడిన పరిహారం: 1,69,791 డాలర్లు (సుమారు రూ.15 లక్షలు)బోనస్ పెంపు వద్దనుకున్న సత్యజీతం పెరిగినప్పటికీ తనకు అందే కొంత వేతనాన్ని వద్దనుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతను తనకు అందే బోనస్ 10.66 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.89 కోట్లు) నుంచి 5.2 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.43 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మైక్రోసాఫ్ట్ ఆర్థిక వృద్ధినాదెళ్ల సీఈఓగా నియమితులైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి 245.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20.4 లక్షల కోట్లు) చేరుకుంది. అయితే నికర ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 88.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.3 లక్షల కోట్లు) చేరుకుంది. కంపెనీ వృద్ధితో నాదెళ్ల పరిహారం కూడా అధికమైనట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..కొంతమంది భారతీయ సంతతి సీఈఓల వేతన వివరాలు..సుందర్ పిచాయ్(గూగుల్): దాదాపు రూ.1,846 కోట్లుసత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) రూ.665 కోట్లుశంతను నారాయణ్ (అడోబ్): రూ.300 కోట్లుసంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ): రూ.206 కోట్లుఅరవింద్ కృష్ణ (ఐబీఎం): రూ.165 కోట్లు -
మైక్రోసాఫ్ట్‌పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్‌లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్‌లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్‌కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్‌లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్‌ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్‌ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్‌ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో ప్యాకేజీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్ అవార్డుల విలువ 39 మిలియన్ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్ డాలర్లు.జూన్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్‌లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. -
మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న మహిళా ఉద్యోగులు..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో వింత ధోరణి కనిపిస్తోంది. సంస్థను వీడుతున్న ఉద్యోగుల్లో అత్యధికం మహిళలే ఉంటున్నారు. నిష్క్రమిస్తున్న వారిలో లాటిన్స్, నల్ల జాతీయులు ఉండటంతో కంపెనీ శ్రామికశక్తి వైవిధ్యంపై ప్రభావం చూపుతోంది.మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ అండ్ ఇన్‌క్లూషన్ నివేదిక ప్రకారం.. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీని వీడివెళ్లిన ఉద్యోగుల్లో మహిళలు 32.7% మంది ఉన్నారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోల్చితే 31% పెరిగింది. స్వచ్ఛంద నిష్క్రమణలు, తొలగింపులు అన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన ఈ రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేశారు.దెబ్బతింటోన్న వైవిధ్యంఅమెరికాకు సంబంధించిన నిష్క్రమణలలో నల్లజాతి కార్మికులు 10% ఉన్నారు. అంతకుముందు సంవత్సరం ఇది 8.7 శాతంగా ఉండేది. ఇక లాటిన్ అమెరికన్ల నిష్క్రమణలు 8% నుండి 9.8 శాతానికి పెరిగాయి. ఇక పురుషులు, ఆసియన్ ఉద్యోగుల విషయానికి వస్తే ఇది విరుద్ధంగా ఉంది. 2023లో కంటే గతేడాది వీరి నిష్క్రమణలు తక్కువగా నమోదయ్యాయి.ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమలో చాన్నాళ్లకు మారిన పరిస్థితులుప్రత్యర్థి కంపెనీలు అవలంభిస్తున్న పోకడలే ఇందుకు కారణంగా మైక్రోసాఫ్ట్ పేర్కొంటోంది. అలాగే తమ భౌతిక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారాలలో మార్పులు కూడా కొంత మేరకు కారణమైన ఉండచ్చొని చెబుతోంది. పెద్దగా ప్రాతినిధ్యం లేని సమూహాల నుండి ఉద్యోగులను నియమించుకోవడాన్ని మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కొనసాగిస్తోందని, అయితే వారిని నిలుపుకోవడానికి మరింత చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే-రే మెక్‌ఇంటైర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. -
మైక్రోసాఫ్ట్‌తో ఇన్ఫోసిస్ పార్టనర్షిప్ విస్తరణ
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం విస్తరిస్తున్నట్లు దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించింది. జనరేటివ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ అజూర్ల్లో గ్లోబల్ కస్టమర్ల దత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.క్లౌడ్, ఏఐ వర్క్ లోడ్స్లో మైక్రోసాఫ్ట్ ఎంటర్ప్రైజెస్ కస్టమర్లకు వ్యూహాత్మ సరఫరాదారుగా మద్దతునిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఖర్చు తగ్గించడంతోపాటు చురుకుదనం, స్కేలబిలిటీని సాధించడంలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐతో ఐపీ సొల్యూషన్ల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.ఇన్ఫోసిస్ టోపాజ్, ఇన్పోసిస్ కోబాల్ట్, ఇన్ఫోసిస్ ఆస్టర్ వంటి సొల్యూసన్స్ తో మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐ ఆఫరింగ్స్ సమ్మిళితం చేస్తున్నారు. ఫైనాన్స్, హెల్త్ కేర్, సప్లయ్ చైన్, టెలీ కమ్యూనికేషన్స్ తదితర కీలక రంగాల కస్టమర్ల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వెల్లడించాయి. -
టెక్ మొగల్ మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ : ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తూ వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో ఒక వీధి వ్యాపారి వద్ద హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది.స్ట్రీట్ ఫుడ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో స్ట్రీట్ ఫుడ్ హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తున్న తాజా వీడియో ణాల్లో ఇది వైరల్ అయ్యింది. "మీరు హాట్‌డాగ్ తినలేదూ అంటు న్యూయార్క్ వెళ్లనట్టే" అని క్యాప్షన్‌తో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులు రకరకాల కమెంట్లతోపాటు, టెక్ మొగల్ను ప్రశంసల్లో ముంచెత్తారు. వావ్, బిలియనీర్లు కూడా మంచి హాట్ డాగ్‌ని ఇష్టపడతారు!, ఆయనకూడా మనలాగే! గేట్స్ హాట్ డాగ్ అభిమాని అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు హాస్య భరితంగా, "బిల్ మస్టర్డ్ లేదా కెచప్‌ను ఇష్టపడతారా?"అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates)కాగా స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించడం బిల్‌గేట్స్‌కు ఇదే తొలిసారి కాదు తాను ఏ నగరంలో ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయడానికి ఆహారాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం బిల్ గేట్స్‌కు బాగా అలవాటు. ఆ నగరానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాన్ని గుర్తించి, దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశ పర్యటన సందర్భంగా, సోషల్ మీడియాఇన్ఫ్లుయెన్సర్ చాయ్‌వాలా చాయ్ సిప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు -
కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రీడ్ హాఫ్మన్తో ముచ్చటించారు. ఈ సందర్భంలో కంపెనీలో నెలకొన్న సమస్య గురించి ప్రస్తావించారు. ఉత్పాదకలో సమస్యలున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు.కరోనా సమయంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అంకితమయ్యారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత రిమోట్ వర్క్ అమల్లోకి వచ్చింది. ఇది ఉత్పాదకలో సమస్యలకు కారణమవుతోంది. కంపెనీలోని మేనేజర్లు 85 శాతం మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో 85 శాతం ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు.ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెబుతున్నారు. మేనేజర్లు ఉద్యోగులు పనిచేయలేదు అంటుంటే.. ఉద్యోగులు చేయాల్సిన పనికంటే ఎక్కువ పని చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి డేటా మరో కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. దీనిని పరిష్కరించడానికి ఒకటే మార్గం. అదేమిటంటే.. మేనేజర్లు ముందున్న లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను అర్థం చేసుకోవాలి. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొత్త ప్లాన్స్ వేసుకోవాలి, అవి సాధ్యం కాకపోతే కొత్తవాటిని అమలు చేయాలనీ సత్య నాదెళ్ల అన్నారు.ఇదీ చదవండి: ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్ఎలాంటి సమయంలో అయినా.. ప్రపంచానికి నాయకులు చాలా అవసరమని నేను విశ్వసిస్తున్నానని సత్య నాదెళ్ల అన్నారు. నాయకులు తమ ఉద్యోగులను బాగా అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలని వెల్లడించారు. -
ఆ 'కల' కోసం కాలేజీ వదిలేసి.. చివరకు..
మైక్రొసాఫ్ట్ కో-ఫౌండర్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరైన 'బిల్ గేట్స్' గురించి అందరికి తెలుసు. అయితే తన కలలను సాకారం చేసుకోవడానికి చదువుకునే రోజుల్లోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.బిల్ గేట్స్ చదువుకునే రోజుల్లో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇలాన్ మస్క్ మొదలైనవారు ఉన్నారు.ప్రతి ఇంట్లోని డెస్క్‌పైన కంప్యూటర్ కలిగి ఉండాలి అనేది బిల్ గేట్స్ కల. ఈ వైపుగానే అడుగులు వేశారు. నేడు ఆ కల నిజమైంది. ప్రారంభంలో తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని అన్నారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. 1970లలో బిల్ గేట్స్ అతని స్నేహితుడు పాల్ అలెన్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టు వదలకుండా దీనిపైనే శ్రమించారు. తన 20వ ఏట మొత్తం మైక్రోసాఫ్ట్ కోసం పనిచేసినట్లు గేట్స్ చెప్పారు. వారాంతాలు, సెలవులు వంటివన్నీ మరచిపోయే అనుకున్న లక్ష్యం దిశగానే అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నేడు మైక్రోసాఫ్ట్ వాల్యూ సుమారు మూడు ట్రిలియన్ డాలర్లు. -
రూ.520 కోట్లతో స్థలం కొనుగోలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ మహారాష్ట్ర పుణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అందుకోసం ఏకంగా రూ.520 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇండో గ్లోబల్ ఇన్ఫోటెక్ సిటీ ఎల్ఎల్పీ నుంచి ఈ కొనుగోలు చేసినట్లు పేర్కొంది. డేటా సెంటర్ కార్యకలాపాల్లో మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. అందుకోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కార్యకాలాపాలు సాగిస్తోంది. దేశీయంగా డేటా సెంటర్లను విస్తరిస్తామని కంపెనీ గతంలో పలుమార్లు తెలిపింది. వివిధ నగరాల్లో స్థలాలు కొనుగోలు చేసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయనేలా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల పుణె నగరంలో పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని రూ.328 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో పుణెలో గడిచిన రెండేళ్లలో రూ.848 కోట్ల పెట్టుబడితో రెండు చోట్ల స్థలాలు తీసుకుంది.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల ద్వారా వివిధ కంపెనీలకు అధునాతన క్లౌడ్ సొల్యూషన్స్ అందించనున్నారు. వివిధ రంగాల్లోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు.. వంటి వాటికి డేటా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. ఇదిలాఉండగా, మైక్రోసాఫ్ట్ 2025 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి కృత్రిమమేధ(ఏఐ), డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం ‘అడ్వాంటేజ్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
రానున్నది మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్‌గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్‌ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్‌కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
క్యూట్ కుర్రాడిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. అరుదైన ఫొటోలు
-
ఎక్కువ.. తక్కువ.. నిర్ణయాత్మకంగా..
ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల(57)నేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి’ అనే నియామాన్ని సత్య ఎక్కువగా నమ్ముతారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్‌లో ఆగస్టు 19, 1967లో జన్మించిన సత్యనాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. అతడి తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, 1962 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. సత్య విస్కాన్సిన్ మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు రూ.251 లక్షల కోట్లు (3 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు(రూ.8.3 లక్షలు) పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు(రూ.95 లక్షలు) అయ్యేది.బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ కావడం అంటే సత్యకు పెద్ద సవాలే. ఆయన సీఈఓ అవ్వడానికంటే 22 ఏళ్ల నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. దాంతో చాలామంది సత్య సుధీర్ఘ ప్రస్థానంలో సాధించలేనిది సీఈఓగా బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. నాదెళ్ల చేసే ప్రతి పనిని గత సీఈఓల పనితీరుతో పోల్చేవారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దాంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వచ్చే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!పేరు: సత్య నారాయణ నాదెళ్లతండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్తల్లి: ప్రభావతిభార్య: అనుపమ నాదెళ్లపిల్లలు: 3కుమారుడు: జైన్ నాదెళ్లకుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్లజన్మస్థలం: హైదరాబాద్వయసు: 57 (2024)జాతీయత: భారతీయుడుపౌరసత్వం: యూఎస్ఏచదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీవృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
హై రిస్క్‌లో విండోస్ యూజర్లు..
మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గుర్తించిన రెండు భద్రతా లోపాల గురించి యూజర్లను ప్రభుత్వం హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని టార్గెట్ సిస్టమ్‌పై దాడి చేసే వ్యక్తి 'ఎలివేటెడ్ ప్రివిలేజెస్' పొందేందుకు ఆస్కారం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది.ఈ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జారీ చేసిన ఒక సూచనలో సమస్య గురించి కొన్ని వివరాలను పంచుకుంది. “వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ (VBS), విండోస్ బ్యాకప్‌కు మద్దతు ఇచ్చే విండోస్ ఆధారిత సిస్టమ్‌లలో ఈ లోపాలు ఉన్నాయి. దాడి చేసే వ్యక్తి గతంలో తొలగించిన సమస్యలను తిరిగి ప్రవేశపెట్టడానికి లేదా వీబీఎస్ రక్షణలను చేధించడానికి ఈ లోపాలను ఉపయోగించుకోవచ్చు" అని పేర్కొంది.తాజా సెక్యూరిటీ ప్యాచ్‌లో సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు సెర్ట్ఇన్ పేర్కొంది. కాబట్టి విండోస్ యూజర్లు మైక్రోసాఫ్ట్ అందించిన అప్డేట్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని సూచించింది.ప్రభావిత విండోస్ వెర్షన్లు ఇవే..Windows Server 2016 (Server Core installation)Windows Server 2016Windows 10 Version 1607 for x64-based SystemsWindows 10 Version 1607 for 32-bit SystemsWindows 10 for x64-based SystemsWindows 10 for 32-bit SystemsWindows 11 Version 24H2 for x64-based SystemsWindows 11 Version 24H2 for ARM64-based SystemsWindows Server 2022, 23H2 Edition (Server Core installation)Windows 11 Version 23H2 for x64-based SystemsWindows 11 Version 23H2 for ARM64-based SystemsWindows 10 Version 22H2 for 32-bit SystemsWindows 10 Version 22H2 for ARM64-based SystemsWindows 10 Version 22H2 for x64-based SystemsWindows 11 Version 22H2 for x64-based SystemsWindows 11 Version 22H2 for ARM64-based SystemsWindows 10 Version 21H2 for x64-based SystemsWindows 10 Version 21H2 for ARM64-based SystemsWindows 10 Version 21H2 for 32-bit SystemsWindows 11 version 21H2 for ARM64-based SystemsWindows 11 version 21H2 for x64-based SystemsWindows Server 2022 (Server Core installation)Windows Server 2022Windows Server 2019 (Server Core installation)Windows Server 2019Windows 10 Version 1809 for ARM64-based SystemsWindows 10 Version 1809 for x64-based SystemsWindows 10 Version 1809 for 32-bit Systems -
ఉద్యోగులకు నంబర్1 మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, అమెజాన్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నట్టు ‘ర్యాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2024’ నివేదిక తెలిపింది. ఆర్థిక సామర్థ్యం, మంచి పేరు, కెరీర్లో చక్కని పురోగతి అవకాశాలు ఈ మూడూ ఉద్యోగులు ప్రధానంగా చూసే అంశాలు. వీటి పరంగా మైక్రోసాఫ్ట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. టాటా పవర్, టాటా మోటార్స్, శామ్సంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మెర్సెడెస్ బెంజ్ వరుసగా టాప్–10లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,73,000 మంది ప్రతినిధులు, 6,084 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా ర్యాండ్‌స్టాడ్ తెలుసుకుంది. భారత్ నుంచి 3,507 మంది అభిప్రాయాలు స్వీకరించింది. -
మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య.. స్పందించిన కంపెనీ
మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీని వల్ల యూజర్లు అనేక సేవల్లో అంతరాయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి ఇంజినీరింగ్ బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అజ్యూర్ ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కూడా పేర్కొంది.మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య మొదట యూరోప్‌లో గుర్తించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు చాలామందే ఉన్నారని పలువురు సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా తెలిసింది.We're currently investigating access issues and degraded performance with multiple Microsoft 365 services and features. More information can be found under MO842351 in the admin center.— Microsoft 365 Status (@MSFT365Status) July 30, 2024We are investigating an issue impacting the Azure portal. More details will be provided as they become available.— Azure Support (@AzureSupport) July 30, 2024 -
తప్పు చేశాం.. కప్పు కాఫీ తాగండి..!
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల తలెత్తిన్న అంతరాయానికి కారణమైన క్రౌడ్‌స్ట్రైక్ తన వినియోగదారులకు ఉబర్ ఈట్స్ కూపన్కార్డు ఇచ్చి క్షమాపణలు కోరింది. విండోస్ యూజర్లకు ఇటీవల ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ మేసేజ్ రావడంతో వారి విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ విమానరంగం, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్లు క్రాష్ అయినట్లు అంచనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ఈ ఘటన వల్ల ప్రభావితమైన యూజర్లకు 10 డాలర్ల (రూ.830) విలువ చేసే ఉబర్ ఈట్స్ కూపన్‌ను ఇచ్చి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఈమెయిల్లో కూపన్ వివరాలు పంపించింది.క్రౌడ్‌స్ట్రైక్ పంపించిన ఈమెయిల్లో..‘జులై 19న ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. సాంకేతిక సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేలా సహకరించినందుకు ధన్యవాదాలు. ఓ కప్పు కాఫీ లేదా స్నాక్స్‌తో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. కూపన్ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు’ అని తెలిపింది. ఇదిలాఉండగా, వోచర్‌ను రెడీమ్ చేయడంలో కొందరు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా చాలా దేశాల్లోని కంప్యూటర్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. -
ఆ నష్టాలు మీరే కట్టండి.. మైక్రోసాఫ్ట్‌కు షాక్!
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు మలేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయం కారణంగా వివిధ కంపెనీలకు కలిగిన నష్టాన్ని చెల్లించడాన్ని పరిగణించాలని మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ సంస్థలను కోరినట్లు మలేషియా డిజిటల్ మంత్రి తెలిపారు.క్రౌడ్ స్ట్రైక్ భద్రతా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన తప్పు అప్డేట్ గతవారం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆధారితమైన కంప్యూటర్లను క్రాష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించింది. విస్తృత శ్రేణి పరిశ్రమలను ప్రభావితం చేసింది.మలేషియాలో ప్రభావితమైన వాటిలో ఐదు ప్రభుత్వ సంస్థలు, విమానయానం, బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌లో పనిచేస్తున్న తొమ్మిది కంపెనీలు ఉన్నాయని మలేసియా మంత్రి గోవింద్ సింగ్ డియో విలేకరులతో అన్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదికను కోరేందుకు మైక్రోసాఫ్ట్, క్రౌడ్‌స్ట్రైక్ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, పునరావృత అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సంస్థలను కోరినట్లు గోవింద్ చెప్పారు."తమ నష్టాలను భర్తీ చేయాలని బాధిత కంపెనీలు కోరుతున్నాయి. వాటి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించడానికి వారు ఎంతవరకు సహాయం చేయగలరో చూడాలని నేను వారిని కోరాను" అని గోవింద్ చెప్పారు. సాధ్యమైన చోట క్లెయిమ్‌లపై ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందన్నారు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. -
ఆటో డ్రైవర్‌గా మారిన మైక్రోసాఫ్ట్ ఇంజనీర్..ఎందుకంటే..?
ప్రముఖ కంపెనీలో టెక్కీలుగా పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా కెమెరా కంటికి చిక్కాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదేంటీ టెక్కీ ఇలా డ్రైవర్‌గా పనిచేయడం ఏంటని అందరూ కంగుతిన్నారు. సోషల్ మీడియా ఎక్స్‌లో వేంకటేశ్ గుప్తా అనే వ్యక్తి కోరమంగళలోని మైకోసాఫ్ట్లో పనిచేస్తున్న వేంకటేశ్ గుప్తా అనే టెక్నీని కలిసినట్లు తెలిపాడు. వారాంతాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న ఆ టెక్కీతో మాటలు కలిపినట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో అతడి వివరాలు ఆరా తీయగా..ఆ టెక్కీ తాను ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో వివరించాడు.. పని అనంతరం వారాంతాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని.. ఆ ఒంటరి తనాన్ని అధిగమించడం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నాని తెలిపాడు. విచిత్ర ఏంటంటే ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రోసాఫ్ట్ హూడీని కూడా ధరించాడు.. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..అతడి ఒంటరితనం పట్ల సానూభూతి చూపగా, ఇంకొందరూ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి సీనియర్ మైక్రో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారాంతాల్లో ఇలా ఆటో డ్రైవర్లగా పనిచేయడం కొత్త విషయం ఏమీ కాదు. కొంతమంది టెక్కీలు కూడా ఇలా గిగ్ వర్కర్లుగా పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. గతంలో కూడా బెంగుళూరులోని హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)లో జావా డెవలపర్‌గా పనిచేస్తునన్న ఉద్యోగి రాపిడో బైక్ టాక్సీని నడుపుతూ దొరికిపోయాడు. దీంతో అతను తన మునుపటి ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. అయితే అతను తన తోటి టెక్కీలను కనుగొనడానికి ఇలా బైక్ రైడర్‌గా మారినట్లు చెప్పడం గమనార్హం. Met a 35 year old staff software engineer at Microsoft in Kormangala driving Namma Yatri to combat loneliness on weekends pic.twitter.com/yesKDM9v2j— Venkatesh Gupta (@venkyHQ) July 21, 2024 (చదవండి: నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!) -
చైనాపై పడని మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఎందుకో తెలుసా?
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచంలోనే చాలా దేశాలను అతలాకుతలం చేశాయి. ఇందులో భారత్ సహా అమెరికా, యూరప్ దేశాలు ఉన్నాయి. అనేక దేశాలపై పడిన ఈ మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనాలో మాత్రం అంతంతమాత్రంగానే ఉండటం గమనించదగ్గ విషయం.ప్రపంచవ్యాప్తంగా విమానాలు, ఐటీ వ్యవస్థలు, వ్యాపారాలపై ప్రభావం చూపిన మైక్రోసాఫ్ట్ అంతరాయం చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. చైనాలోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విమానయాన సంస్థలు, బ్యాంకుల కార్యకలాపాలు కూడా సజావుగా జరిగాయి. ఈ విషయాన్ని బీజింగ్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.ప్రపంచంలోని చాలా దేశాలు మైక్రోసాఫ్ట్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే చైనా మాత్రం విదేశీ టెక్నాలజీల మీద ఆధారపడటాన్ని తగ్గించి, సొంత దేశ టెక్నాలజీలనే ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగానే చైనాలో మైక్రోసాఫ్ట్ వినియోగం లేదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి చైనాలో రోజూ జరగవలసిన కార్యకలాపాలు నిర్విరామంగా జరిగాయి. -
ఒకే ‘క్లౌడ్’ను నమ్ముకుంటే ఇంతే..
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.ఒక క్లౌడ్‌పైనే ఆధారపడొద్దుఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్‌హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.మైక్రోసాఫ్ట్‌తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్‌గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్‌స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.తప్పించుకున్న రష్యామైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది. -
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన బగ్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్‌లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్‌గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. -
విండోస్‌లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓ
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ అనే మెసేజ్ వచ్చింది. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్ అటాక్ కాదని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్‌స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్‌స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్‌లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్‌లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.— Satya Nadella (@satyanadella) July 19, 2024మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఇదో సైబర్ అటాక్ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్‌అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్‌లను బ్యాకప్ చేశాం. విండోస్‌లోని ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్‌సైట్‌ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.Today was not a security or cyber incident. Our customers remain fully protected.We understand the gravity of the situation and are deeply sorry for the inconvenience and disruption. We are working with all impacted customers to ensure that systems are back up and they can…— George Kurtz (@George_Kurtz) July 19, 2024ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది.