మైక్రోసాఫ్ట్ సర్వీస్‌లో ఏర్పడిన సమస్య వల్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ సేవల్లో అంతరాయం కలిగినట్లు ‘ఎక్స్’లో పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. ఏంజెల్ వన్, 5పైసా, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, నువామా, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థలు ఈమేరకు ప్రభావితం చెందినట్లు ఎక్స్‌లోని పోస్ట్‌ల ద్వారా తెలిసింది.
మైక్రోసాప్ట్ క్లౌడ్ సర్వీస్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, విమానాశ్రయ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు ఆన్‌లైన్ ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ సేవల్లోనూ సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. ఏంజెల్ వన్, 5పైసా, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, నువామా, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థల ప్లాట్‌ఫామ్‌ల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఎక్స్ వేదికగా నివేదించాయి. మైక్రోసాఫ్ట్‌లోని సమస్య కారణంగా తమ సిస్టమ్‌లు ప్రభావితమయ్యాయని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. వీలైనంత త్వరగా ఆ సిస్టమ్‌లను పునరుద్ధరించడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పాయి.
‘బ్రేకరేజ్ సొల్యూషన్ ప్రొవైడర్‌గా ఉన్న మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఉత్పన్నమవడంతో వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఏంజెల్ వన్ తెలిపింది.
పెండింగ్‌లో ఉన్న ఆర్డర్‌లు కనిపించకపోవడంతో తమ పొజిషన్‌లను విక్రయించలేకపోయామని వినియోగదారులు ఎక్స్‌లో తెలిపారు. ఆ పొజిషన్ల వల్ల తమకు కలిగిన నష్టాలకు బ్రోకర్లు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
You may be facing an intermittent issue due to a global outage faced by one of the solution providers. We are trying to get this resolved at the earliest.
— Angel One (@AngelOne) July 19, 2024
Comments
Please login to add a commentAdd a comment