మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రతి సెకనును తన షెడ్యూల్ అనుగుణంగా పని చేసేవారు. అలా చేయడం తన విజయానికి కారణమని భావించేవారు. కానీ కొన్నేళ్లకు బిల్‌గేట్స్ తాను చేస్తుందని తప్పని భావించారు. అందుకు బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ కారణం.
మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ ప్రతి సెకనును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. అయితే 2017లో తన స్నేహితుడు వారెన్ బఫెట్ కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారెన్ బఫెట్ షెడ్యూల్ తనకి చూపించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.
ఆ సమయంలో బఫెట్ తన క్యాలెంటర్‌ను చూపించడం నాకు ఇంకా గుర్తింది. అందులో ఏమీ లేదు. కానీ ఆ షెడ్యూల్ నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment