Warren Buffett
-
రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్
ప్రపంచ కుబేరులలో ఒకరు, దిగ్గజ ఇన్వెస్టర్.. బెర్క్‌షైర్ హాత్వే సహ వ్యవస్థాపకుడు 'వారన్ బఫెట్' (Warren Buffett) ఎట్టకేలకు తన వారసుడిని ప్రకటించారు. తన రెండో కుమారుడు 'హోవార్డ్ బఫెట్' (Howard Buffett)ను 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 86.55 లక్షల కోట్లు) వ్యాపార సామ్రాజ్యానికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దాదాపు తన మిగిలిన సంపదనంతా కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌కు మళ్లించనున్నట్లు వారన్ బఫెట్ వెల్లడించారు. అయితే తన ముగ్గురి పిల్లలైన 'సూసీ, హోవార్డ్, పీటర్'లకు తన సంపదలో తక్కువ భాగాన్ని మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించిన 140 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ స్టాక్లను ఈ ముగ్గురూ పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు.హోవార్డ్ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన తరువాత, నా ముగ్గురు బిడ్డలకు నేను బలంగా విశ్వసిస్తాను అని వారన్ బఫెట్ చెప్పారు. అయితే హోవార్డ్ కూడా నా బిడ్డే కాబట్టి అతనికి వారసత్వ అవకాశం లభించిందని అన్నారు. 30 సంవత్సరాలకు పైగా బెర్క్‌షైర్ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేసిన హోవీ.. ఇప్పుడు చైర్మన్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.ఎవరీ హోవార్డ్ బఫెట్?➤హోవార్డ్ బఫెట్ పూర్తి పేరు 'హోవార్డ్ హౌవీ బఫెట్'. ఈయనను 'హౌవీ' అని కూడా పిలుస్తారు. చదువు పూర్తయిన తరువాత తండ్రి బాటలో అడుగులు వేసిన హోవార్డ్.. వారెన్ బఫెట్ సలహా మేరకు లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని సీస్ క్యాండీస్ అనే కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో వ్యాపారానికి సంబంధించిన అనేక కీలక విషయాలను నేర్చుకున్నారు.➤వారెన్ బఫెట్.. హౌవీ కోసం ఒక పొలాన్ని కొనుగోలు చేశారు. దానిని వాడుకున్నందుకు కూడా కొడుకు నుంచి అద్దె వసూలు చేశారు. ఆ తరువాత కాలంలో హౌవీ భూమిని దున్నకుండానే సాగు చేస్తూ.. కొత్త వ్యవసాయ విధానాలపై దృష్టిపెట్టారు.➤1989లో హౌవీ బఫెట్ కౌంటీ బోర్డ్ ఆఫ్ కమీషనర్లలో చేరారు. తరువాత నెబ్రాస్కా ఇథనాల్ బోర్డ్ సభ్యునిగా చేరి.. చివరికి ఛైర్మన్ అయ్యారు. 2017 నుంచి 2018 వరకు అతను ఇల్లినాయిస్లోని మాకాన్ కౌంటీకి షెరీఫ్గా పనిచేశారు.➤1993 నుంచి.. హోవీ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే, కోకా కోలా ఎంటర్ప్రైజెస్, లిండ్సే కార్పొరేషన్, స్లోన్ ఇంప్లిమెంట్, కొనాగ్రా ఫుడ్స్ & వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ జీఎస్ఐ గ్రూప్‌తో సహా పలు ప్రముఖ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేశారు.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..➤హోవీ బఫెట్ తండ్రి మాదిరిగానే.. దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించి స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అంతే కాకుండా వన్య పరిరక్షణ, వన్యప్రాణులు సంబంధిత అంశాలపై ఎనిమిది పుస్తకాలను కూడా రచించారు. ఈయన డెవాన్ మోర్స్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హోవార్డ్ వారెన్ బఫెట్ అనే కుమారుడు ఉన్నారు. -
యాపిల్‌లో మరింత తగ్గిన బఫెట్ వాటా
ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ సంస్థలో బెర్క్‌షైర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ వాటా మరింత తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్లో షేర్లను విక్రయించినట్లు బెర్క్‌షైర్ హాత్వే తెలిపింది. దీంతో యాపిల్‌లో మొత్తం వాటా విలువ 69.9 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఆగస్టు త్రైమాసికంలో 75 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల(సగానికి పైగా వాటా)ను అమ్మింది. ఈ ఏడాదిలో యాపిల్‌తో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్లను భారీ విక్రయించడంతో పాటు ఎలాంటి ప్రధాన కొనుగోళ్లు జరపకపోవడంతో బెర్క్‌షైర్ హాత్వే నగదు రిజర్వు 325 బిలియన్ డాలర్లకి చేరింది. -
సంపదనంతా దానం ఇచ్చేస్తున్న వారెన్ బఫెట్!
బెర్క్‌షైర్ హతావే చైర్మన్, సీఈవో వారెన్ బఫెట్ రూ.44,200 కోట్లు దానం చేస్తున్నారు. ప్రపంచంలో 10వ అత్యంత సంపన్నుడైన బఫెట్ 5.3 బిలియన్ డాలర్ల విలువైన 1.3 కోట్ల బెర్క్‌షైర్ హతావే స్టాక్స్‌ను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు, నాలుగు కుటుంబ ఛారిటీలకు విరాళంగా ఇస్తున్నారు. 2006 తర్వాత ఇది ఆయన ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం.సంపాదనకు, సంపదకు మారుపేరైన వారెన్ బఫెట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన దాతృత్వం గురించి, విరాళాల గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తాజాగా ప్రకటించిన విరాళంతో కలిపి స్వచ్ఛంద సంస్థలకు ఆయన అందించిన మొత్తం విరాళాలు 57 బిలియన్ డాలర్లకు (సుమారు 4.7 లక్షల కోట్లు) పెరిగాయి. గేట్స్ ఫౌండేషన్ కు బఫెట్ ఇప్పటివరకూ 43 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను విరాళంగా ఇచ్చారు.తన మొదటి భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,93,035 షేర్లను, తన పిల్లలు హోవార్డ్, సుసాన్, పీటర్ నేతృత్వంలోని మూడు స్వచ్ఛంద సంస్థలకు కూడా 6,95,122 షేర్లను బఫెట్ విరాళంగా ఇచ్చారు.ఉన్నదంతా ఇచ్చేసే ఆలోచనబెర్క్ షైర్లో1965 నుంచి తాను నిర్మించిన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలని 93 ఏళ్ల బఫెట్ యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన వీలునామాను ఆయనతదనంతరం ఆయన పిల్లలు అమలు చేయనున్నారు. బెర్క్‌షైర్ సుమారు 880 బిలియన్ డాలర్ల సమ్మేళనం. ఇది బీఎన్ఎస్ఎఫ్ రైల్రోడ్, గీకో కార్ ఇన్సూరెన్స్, యాపిల్ వంటి స్టాక్స్‌తో సహా డజన్ల కొద్దీ వ్యాపారాలను కలిగి ఉంది. -
బఫెట్ సంపద రహస్యం అదే
జెండరీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ జిమ్ సిమన్స్ సంపద విలువ 31.4 బిలియన్ డాలర్లు. విఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నెట్‌వర్త్ 139 బిలియన్ డాలర్లు. బఫెట్ కంటే సిమన్స్ సంపద 77 శాతం తక్కువ. వీరిద్దరి మధ్యనున్న సూక్ష్మ వైరుధ్యాన్ని ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాలి. జిమ్ సిమన్స్ స్థాపించిన హెడ్జ్ ఫండ్ ‘రెనైసెన్స్ టెక్నాలజీస్’ ఒకటి రెండేళ్లు కాదు.. 1988 నుంచి ఏటా 66 శాతం చొప్పున, నిరంతరాయంగా మూడు దశాబ్దాలకు పైనే ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచి్చపెట్టింది. అదే వారెన్ బఫెట్ స్థాపించిన బెర్క్‌షేర్ హాథవే ఏటా 19.8 శాతం కాంపౌండింగ్ వృద్ధినే నమోదు చేసింది. సిమన్స్ కంటే బఫెట్ సంపదే నాలుగు రెట్లు అధికం. ఏటా ఎంత అధికంగా రాబడి తెచ్చుకున్నారనే దానికంటే.. ఎంత ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టారు, వాటిని ఎంత కాలం పాటు కొనసాగించారు? అన్నవే సంపదను నిర్ణయిస్తాయని సిమన్స్–బఫెట్ జర్నీ చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ ఆరంభించి, దీర్ఘకాలం పాటు కొనసాగించినప్పుడే కాంపౌండింగ్ ప్రయోజనాన్ని గరిష్టంగా అందుకోగలరు. ఏటా 12 శాతం రాబడి సంపద సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. సంపాదనను తీసుకెళ్లి వృద్ధి చెందే చోట పెట్టడం. ఎంత ముందుగా ఆరంభిస్తే, దీర్ఘకాలంలో అంత అధికంగా ప్రయోజనం పొందొచ్చు. బఫెట్ పెట్టుబడుల ప్రయాణాన్ని గమనించినా ఇదే బోధపడుతుంది. ముందుగా మొదలు పెట్టడం వల్ల అప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనం గరిష్ట స్థాయిలో పొందడానికి కావాల్సినంత వ్యవధి ఉంటుంది. 25 ఏళ్ల మహిమ ప్రతి నెలా రూ.1,000 చొప్పున తనకు 50 ఏళ్లు వచ్చే వరకు.. అంటే 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసిందని అనుకుందాం. అప్పుడు 25 ఏళ్లలో మహిమ అసలు పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీలలో దీర్ఘకాల సగటు) అంచనా ప్రకారం సమకూరే మొత్తం రూ.18 లక్షలు. కేవలం వెయ్యి రూపాయలే.. 25 ఏళ్లలో రూ.18 లక్షలుగా మారడం కాంపౌండింగ్ వల్లే. ఇలా కాకుండా మహిమ కేసులో కాంపౌండింగ్ ప్రయోజనం తీసేసి చూస్తే.. అంటే అసలుతోపాటు, దానిపై వచి్చన వడ్డీని ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే సమకూరే మొత్తం రూ.7.5 లక్షలుగానే ఉండేది. మొత్తం రూ.18 లక్షల్లో మిగిలిన రూ.10.5 లక్షలు కేవలం కాంపౌండింగ్ వల్లే సమకూరినట్టు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడికి ఇప్పుడేం తొందరొచి్చందిలే.. తర్వాత చూద్దామనుకుని, మహిమ పదేళ్లు ఆలస్యంగా తన 35వ ఏట నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి ఉంటే ఏమయ్యేది? పైన చెప్పుకున్నట్టు 50 ఏళ్ల వయసుకు రూ.18 లక్షలు రావాలంటే అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు ప్రతి నెలా ఆమె రూ.1,700 ఇన్వెస్ట్ చేయాల్సిందే. పదేళ్లు వృధా చేయడం వల్ల 70 శాతం అదనపు పెట్టుబడి అవసరం అవుతుందని ఇక్కడి ఉదాహరణ చెబుతోంది. పెట్టుబడి విషయంలో కాలం వృధా అవుతున్న కొద్దీ కాంపౌండింగ్ ప్రయోజనం అదే స్థాయిలో కోల్పోతారు. కాంపౌండింగ్పెట్టుబడిపై వడ్డీ వస్తుందని తెలుసు. దీన్ని వడ్డీ రాబడిగా చెబుతారు. ఈ వడ్డీ కూడా తిరిగి పెట్టుబడిగా మారి దానిపైనా వడ్డీ సమకూరడమే కాంపౌండింగ్. దీన్నే చక్రవడ్డీ అని కూడా చెబుతారు. బ్యాంకులో వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం తీసుకున్నప్పుడు ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఒక నెల ఈఎంఐ చెల్లించడంలో విఫలమై, మరుసటి నెలలో చెల్లిస్తున్నప్పుడు నెల బకాయిపై వడ్డీని కూడా బ్యాంక్ రాబడుతుంది. దీన్నే వడ్డీ మీద వడ్డీగా చెబుతారు. రూ.100 ఇన్వెస్ట్ చేస్తే 10 శాతం రాబడి ప్రకారం ఏడాది తర్వాత రూ.110గా మారుతుంది. ఇందులో రూ.10 వడ్డీ రూపంలో సమకూరింది. రెండో ఏడాది రూ.110 కాస్తా రూ.121గా మారుతుంది. మొదటి ఏడాది వడ్డీ రూ.10పైనా రెండో ఏడాది రూపాయి వడ్డీ వచ్చినట్టు. ఇలా వడ్డీపై వడ్డీ రాబడి జమవుతుంది కనుకనే దీర్ఘకాలంలో భారీ మొత్తం సమకూరుతుంది. పెట్టుబడుల జర్నీ..బఫెట్ ప్రస్తుత వయసు 90 ఏళ్లు. ఆయన సంపద విలువ 139 బిలియన్ డాలర్లు. నిజానికి బఫెట్ సంపదలో 99 శాతం ఆయనకు 65 ఏళ్లు వచి్చన తర్వాత సమకూరిందేనని ప్రముఖ రచయిత మోర్గాన్ హౌసెల్ ‘ద సైకాలజీ ఆఫ్ మనీ’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఒకవేళ బఫెట్ 65 ఏళ్లకే రిటైర్ అయి ఉంటే నేడు ఆయన గురించి అంతగా మాట్లాడుకునే వాళ్లం కాదని ఓ ఇంటర్వ్యూలో భాగంగా హౌసెల్ పేర్కొన్నారు. బఫెట్ 30 ఏళ్ల వయసులో పెట్టుబడులు మొదలు పెట్టి, 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకున్నాడన్నది చాలా మంది ఇన్వెస్టర్లకు తెలిసిన విషయం. కానీ, నిజానికి బఫెట్ 10 ఏళ్ల వయసులోనే పెట్టుబడి ఆరంభించారు. 30 ఏళ్ల నాటికి ఆయన 9.3 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు. వెనక్కి తీసుకోకుండా అలాగే జీవితకాలం పాటు కొనసాగించారు. సంపాదిస్తున్న మొత్తంలో కనీస అవసరాలకే తప్ప ఎప్పుడూ లగ్జరీ వ్యయాలకు పోలేదు. వీలైనంత పెట్టుబడి పెట్టడమే ఆయన చేసిన పని. నిజానికి దీన్నే బఫెట్ స్కిల్ (నైపుణ్యం)గా హౌసెల్ అభివర్ణిస్తారు. ఏటా 20 శాతం చొప్పున బఫెట్ సంపద కాంపౌండ్ అయింది. జిమ్ సిమన్స్ 1988 నుంచి పెట్టుబడులు ఏటా 66 శాతం చొప్పున వృద్ధి చెందేంత గొప్ప వ్యూహాలు అమలు చేసిననప్పటికీ.. తక్కువ సంపద కలిగి ఉండడానికి కారణం పెట్టుబడుల ప్రపంచంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే. నిజానికి సిమన్స్ వార్షిక రాబడి 66 శాతంలో బఫెట్ వార్షిక రాబడి మూడింట ఒక వంతే. బఫెట్ ఎంతో ముందుగా మొదలు పెట్టడం వల్ల కాంపౌండింతో ఎక్కువ సంపద సమకూరింది. ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కానంత వార్షిక రాబడులను సిమన్స్ తెచ్చుకున్నా కానీ, ఆస్తుల్లో బఫెట్ కంటే దిగువన ఉండడానికి కారణం 50 ఏళ్లు వచి్చన తర్వాతే తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఆరంభించడం. అందుకే ప్రతి ఇన్వెస్టర్ ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టి, ఎక్కువ కాలం పాటు కొనసాగించడం ఆచరించాలని బఫెట్ విజయ గాధ తెలియజేస్తోంది. బఫెట్ మాదిరే సిమన్స్ కూడా 70 ఏళ్లపాటు ఏటా 66 శాతం చొప్పున రాబడులు తెచ్చుకుని ఉంటే.. ఆ మొత్తం కొన్ని వందల రెట్లు అధికంగా ఉంటుంది. బఫెట్ పంచ సూత్రాలు ⇥ పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి. ⇥ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్‌లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి. ⇥ పెట్టుబడుల్లో ఉండే రిస్క్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్ ఎదురవుతుంది. ⇥ వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి. ⇥ ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్‌కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్ మార్కెట్ పనితీరు ఉంటుంది. జిమ్ సిమన్స్ ఏమి చెప్పారంటే..?⇥ ఒక గొప్ప సిద్ధాంతం అందంగా ఎలా ఉంటుందో.. గొప్పగా, సమర్థవంతంగా పనిచేసే కంపెనీ కూడా అంతే అందంగా ఉంటుంది. ⇥ వీలైనంత వరకు మీ చుట్టూ తెలివైన, ఉత్తమమైన వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. వారు మీకంటే తెలివైన వారు అయితే ఇంకా మంచిది. ⇥ ఏదో ఒకటి వాస్తవికంగా చేయండి. మిగిలిన వారిని అనుసరించొద్దు. ఒకే సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది ప్రయతి్నస్తుంటే మీరు దాన్ని చేయొద్దు. ⇥ అంత సులభంగా వదిలేసుకోవద్దు. దానికే కట్టుబడి ఉండాలి. అలా అని శాశ్వతంగా కాదు. కానీ, ఫలితమిచ్చేంత సమయం దానికి ఇవ్వాలి. ⇥ చివరిగా అదృష్టం కలసిరావాలి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ⇥ జేమ్స్ హారిస్ సిమన్స్ (జిమ్ సిమన్స్) గణితంలో దిట్ట. తనకున్న అసాధారణ ప్రతిభతో మార్కెట్ల తీరును కచి్చతంగా అంచనా వేసి, పెట్టుబడులపై అధిక ప్రతిఫలం పొందే దిశగా ఆయన అమలు చేసిన విధానాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. 1980లోనే క్వాంట్ ఇన్వెస్టింగ్ విధానాన్ని ఆవిష్కరించి బఫెట్, జార్జ్ సోరోస్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లను అధిగమించారు. -
వారెన్ బఫెట్ నుంచి బిల్ గేట్స్ నేర్చుకున్న పాఠం ఏంటంటే?
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రతి సెకనును తన షెడ్యూల్ అనుగుణంగా పని చేసేవారు. అలా చేయడం తన విజయానికి కారణమని భావించేవారు. కానీ కొన్నేళ్లకు బిల్‌గేట్స్ తాను చేస్తుందని తప్పని భావించారు. అందుకు బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ కారణం.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ ప్రతి సెకనును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. అయితే 2017లో తన స్నేహితుడు వారెన్ బఫెట్ కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారెన్ బఫెట్ షెడ్యూల్ తనకి చూపించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.ఆ సమయంలో బఫెట్ తన క్యాలెంటర్‌ను చూపించడం నాకు ఇంకా గుర్తింది. అందులో ఏమీ లేదు. కానీ ఆ షెడ్యూల్ నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. -
బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సింది..
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని నమ్మేవారు. అలాంటి బిల్ గేట్స్.. అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. వారెన్ బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెబుతున్నారు.."విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్లోని ప్రతి సెకనును నింపాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్‌లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలించి ఉంటే ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రోమేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్ రిక్వెస్ట్‌లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని ఈ విధానమే విజయానికి మార్గమని ఆయన గతంలో విశ్వసించారు. అయితే, బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు."వారెన్ తన క్యాలెండర్‌ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు అతనికి ఉన్నాయి" అని బిల్ గేట్స్ అన్నారు. బఫెట్ షెడ్యూల్ తనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందన్నారు. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. బఫెట్ భావన ఏంటంటే "కష్టపడి కాదు.. తెలివిగా పనిచేయండి". సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.'ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు అంతకాలం వేచి ఉండవద్దు' అని ఆయన అన్నారు. "ఇష్టమైనవారితో బంధాలను పెంపొందించుకోవడానికి, సక్సెస్‌ను ఆనందించడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోండి. అవసరమైనప్పుడు విరామం తీసుకోండి" అని బిల్ గేట్స్ సూచిస్తున్నారు. -
రూ.20 వేల కోట్ల సెటిల్మెంట్కు వారెన్ బఫ్ఫెట్
వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ ‘హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ అమెరికా దేశవ్యాప్తంగా వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 వేల కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది.రియల్ బ్రోకరేజీలు తమ నుంచి అధికంగా బ్రోకర్ కమీషన్లు వసూలు చేశాయంటూ అమెరికాలోని గృహ యజమానులు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపాదిత సెటిల్మెంట్ ద్వారా తమ 51 బ్రాండ్లు, దాదాపు 70,000 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, 300 ఫ్రాంఛైజీలకు ఈ వ్యాజ్యాల నుంచి విముక్తి లభిస్తుందని హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా తెలిపింది.కెల్లర్ విలియమ్స్ రియాల్టీ, రీ/మ్యాక్స్, కంపాస్, ఎనీవేర్ రియల్ ఎస్టేట్‌తో సహా అనేక ఇతర పెద్ద బ్రోకరేజ్ సంస్థలు ఇదివరకే సెటిల్మెంట్కు సిద్ధమైన నేపథ్యంలో ‘హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ కంపెనీ కూడా సెటిల్మెంట్ సిద్ధమైంది. గత నెలలో, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ 418 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది. -
పేటీఎమ్ నుంచి బెర్క్‌షైర్ ఔట్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌లోగల మొత్తం 2.46 శాతం వాటాను ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాథవే తాజాగా విక్రయించింది. ఓపెన్ మార్కెట్ ద్వారా పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్లోగల 1.56 కోట్లకుపైగా షేర్లను ఆఫ్‌లోడ్ చేసింది. షేరుకి రూ. 877.29 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ దాదాపు రూ. 1,371 కోట్లు. అనుబంధ సంస్థ బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ద్వారా మొత్తం వాటాను విక్రయించింది. కాగా.. దీనిలో 1.19 శాతం వాటాకు సమానమైన 75,75,529 షేర్లను కాప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు చేయగా.. 42.75 లక్షల షేర్ల(0.67 శాతం వాటా)ను ఘిసల్లో మాస్టర్ ఫండ్ ఎల్పీ సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 877.2 సగటు ధరలో దాదాపు రూ. 1,040 కోట్లు వెచ్చించాయి. ఈ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 895 వద్ద ముగిసింది. -
రూ.7250 కోట్లు విరాళం ప్రకటించిన వారెన్ బఫెట్ - ఎవరికో తెలుసా?
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'వారెన్ బఫెట్' (Warren Buffett) గతంలోనే తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని వెల్లడించారు. అన్నమాట ప్రకారమే చేస్తున్న బఫెట్ తాజాగా స్వచ్ఛంద సంస్థలకు 876 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్లను అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ తమ పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు వేలకోట్లు విరాళాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగానే గత మంగళవారం 876 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7250 కోట్లు) షేర్లను గిఫ్ట్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. వారెన్ బఫెట్ భార్య పేరు మీద ఉన్న 'సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్'కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్లను ప్రకటించారు. తమ పిల్లలు నిర్వహిస్తున్న మూడు ఫౌండేషన్లకు (షేర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్) ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్‌షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చేసారు. గత ఏడాది కూడా భారీ షేర్లను విరాళంగా అందించారు. -
వారెన్ బఫెట్‌కు లక్షల కోట్లు నష్టం!
ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు భారీ నష్టం వాటిల్లింది. బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే క్యూ3 (జూలై-సెప్టెంబర్) గానూ ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ 12.8 బిలియన్ డాలర్లు (లక్ష కోట్ల రూపాయలకుపైగా) నష్టపోయినట్లు ప్రకటించింది. దీంతో ఒక్కో ఏ రకం షేర్ 8,824 డాలర్లు కోల్పోయినైట్టెంది. గత ఏడాది క్యూ3లో 2.8 బిలియన్ డాలర్ల నష్టం నమోదవగా, ఒక్కో ఏ రకం షేర్ విలువ రూ.1,907 డాలర్లు పడిపోయింది. అదే సమయంలో బెర్క్‌షైర్ హాథ్‌వే ఇన్సూరెన్స్ విభాగం లాభాల్ని గడించింది. బెర్క్‌షైర్ నిర్వహణ లాభంలో 2.4 బిలియన్లు అందించగా.. ఏడాది క్రితం బీమా రంగ సంస్థలు మూడవ త్రైమాసికంలో 1.1 బిలియన్ల నష్టాన్ని నివేదించాయి. బెర్క్‌షైర్ త్రైమాసికంలో 1.1 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను కొనుగోలు చేసింది.అయితే 4.4 బిలియన్ల బెర్క్‌షైర్ షేర్లను కొనుగోలు చేసిన మొదటి త్రైమాసికం నుండి దాని బైబ్యాక్‌ల వేగం గణనీయంగా తగ్గింది. -
మిత్రమా అందుకో శుభాకాంక్షలు: బిల్‌గేట్స్ అద్భుతమైన వీడియో
Happy Birthday Warren Buffett ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారుడి, అపరకుబేరుడు బెర్క్‌షైర్ హాత్వే , ఛైర్మన్,సీఈవో వారెన్ బఫ్ఫెట్ పుట్టిన రోజు ఆగస్టు 30. ఈ సందర్బంగా మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన స్నేహితుడికి శుభాకాంక్షలందించారు.దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను షేర్ చూస్తూ వినూత్నంగా విషెస్ తెలిపారు. దీంతో ఇది నె టిజనులను బాగా ఆకట్టుకుంటోంది 1920లో నెబ్రాస్కాలోని ఒమాహాలో ఆగస్టు 30న జన్మించారు వారెన్ బఫ్ఫెట్. 93ఏళ్ల ఇన్వెస్టింగ్ లెజెండ్ వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలో అత్యంత విజయ వంతమైన పెట్టుబడిదారులలో ఒకరిగా పేరు గడించారు. ఇన్వెస్టింగ్ తీరు మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలి, పెట్టుబడులపై లాభాలు ఎలా సాధించాలి లాంటి సలహాలు ఇన్వెస్టర్లకు పెద్ద సక్సెస్మంత్రాలా పని చేస్తాయి. వ్యాపారవేత్త, తండ్రి హోవార్డ్ గ్రాహం బఫ్ఫెట్ ప్రేరణతో 60కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బెర్క్‌షైర్ హాత్వే సీఈవోగా కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు. మీ మీద మీ పెట్టుబడే పెద్ద సక్సెస్ అంటారు ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పాపులర్ అయిన వారెన్ బఫ్ఫెట్. Happy 93rd birthday to my friend Warren! pic.twitter.com/WxeVO1vOut — Bill Gates (@BillGates) August 30, 2023 -
సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ( Warren Buffett ) కు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ కంపెనీ బెర్క్‌షైర్ హతావే ( Berkshire Hathaway ) ఒక ట్రిలియన్ డాలర్ల (రూ. 82 లక్షల కోట్లకుపైగా) ఆస్తులను ఆర్జించి చారిత్రక మైలురాయిని సాధించింది. సంపద సృష్టికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇటీవల విడుదల చేసిన కంపెనీ రెండవ త్రైమాసిక డేటా ప్రకారం, బెర్క్‌షైర్ హతావే జూన్ చివరి నాటికి 1.04 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. వీటిలో దాని స్టాక్ పోర్ట్‌ఫోలియో ద్వారానే అత్యధిక సంపద ఉంది. ఇది త్రైమాసికం చివరి నాటికి 353 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. ఇందులో 178 బిలియన్ డాలర్లు ఒక్క యాపిల్ సంస్థలోనే ఉన్నాయి. 33 వేల రెట్లు పెంచిన బఫెట్ ట్రిలియన్ మైలురాయి దాటి ఆకట్టుకున్న బెర్క్‌షైర్ హతావే ఆస్తులు వారెన్ బఫెట్‌కు ముందు 1964లో 30 మిలియన్ డాలర్లు. ఈ మొత్తం 30 సంవత్సరాలలో 700 రెట్లు పెరిగి 1994లో దాదాపు 21 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి బెర్క్‌షైర్ ఆస్తులు మరో 48 రెట్లు పెరిగాయి. మొత్తంగా వారెన్ బఫెట్ సీఈవో ఉన్న సమయంలో కంపెనీ ఆస్తులను 33,000 రెట్లు పెంచారు. యాపిల్ కంటే మూడింతలు ఇటీవలి త్రైమాసికం ముగింపులో యాపిల్ కంపెనీ 335 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. ఇందులో 167 బిలియన డాలర్లు నగదు, సెక్యూరిటీలు, ఇతర రూపాల్లో ఉన్నాయి. అమెజాన్ 463 బిలియన్ డాలర్ల ఆస్తులను క్లెయిమ్ చేయగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, మెటా 200 నుంచి 400 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులను నివేదించాయి. ఇక బెర్క్షైర్తో పోల్చదగిన మార్కెట్ విలువ కలిగిన టెస్లా జూన్ చివరి నాటికి కేవలం 91 బిలియన్ డాలర్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉంది. 768 బిలియన్ డాలర్ల బెర్క్‌షైర్ కంటే అధికంగా దాదాపు 1.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన ఎన్విడియా, తాజా లెక్కల ప్రకారం 44 బిలియన్ డాలర్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉంది. -
ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట!
ఇడహొ: ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ ఒకరు. ఆయన ఆస్తి 115 బిలియన్ డాలర్లకు పైమాటే. అటువంటి వ్యక్తి భార్య కాఫీ ధర ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికర అంశంగా మారింది. సన్ వ్యాలీలో ఇటీవల బిలియనీర్ల సమ్మర్ క్యాంప్ జరిగింది. ఓ రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో వారెన్ బఫెట్ భార్య ఆస్ట్రిడ్ బఫెట్ కప్పు కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడంపై అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారట. ఇతర ప్రాంతాల్లోని కాఫీ ధరతో పోలిస్తే ఇది ఎక్కువేనంటూ అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, సంపద ఎంతున్నా వారెన్ బఫెట్ మహా పొదుపరి. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు. -
వారెన్ బఫెట్ పోలికపై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్పందన వైరల్
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూసి(ఆగస్టు14)రోజులు గడుస్తున్నా....ఆయనకు సంబంధించిన ఏదో ఒక వార్త విశేషంగా నిలుస్తోంది. ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్ పెట్టుబడిదారులలో ఒకరైన రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు మాత్రమే కాదు, మంచి సరదా మనిషి కూడా. తనకోసం ఏర్పరచుకున్న నిబంధనలతో తనదైన జీవితాన్ని గడిపి, నచ్చిన పనిచేస్తూ, చేస్తున్న పనిని మనసారా ఆస్వాదించిన వ్యక్తిత్వం ఆయనది. అయితే ‘ఇండియాస్ వారెన్ బఫెట్’గా తనను పిలవడంపై గతంలో ఒక సందర్భంలో వెలిబుచ్చిన ఆయన తన అభిప్రాయం ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. "ఒరాకిల్ ఆఫ్ ఒమాహా" లాగా, రాకేష్ ఝున్‌జున్‌వాలా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వేల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. అందుకే ఆయనను ప్రపంచ పెట్టుబడిదారుడు ‘ఇండియాస్ వారెన్ బఫెట్’ తో పోలుస్తారు. 2012లో వార్తా సంస్థ రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇది సరైన పోలిక కాదు (వారెన్ బఫెట్‌తో) అంటూ సున్నితంగా తిరస్కరించారు. తనతో పోలిస్తే సంపదలోగానీ, సాధించిన విజయాల్లోగానీ, పరిపక్వత పరంగా వారెన్ బఫెట్ చాలా ముందున్నారని చెప్పారు. ముఖ్యంగా బెర్క్‌షైర్ హాత్వే సీఈఓగా, 100 బిలియన్లడాలర్లకు పైగా నికర విలువతో, ప్రపంచంలోని 10 మంది ధనవంతులలో ఒకరుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) కాగా 5 వేల రూపాయలతో రాకేష్ ఝున్‌జున్‌వాలా 1986లో స్టాక్‌మార్కెట్ అరంగేట్రం చేసిన అద్బుతమైన అంచనాలు, చాతుర్యంతో దేశీయంగా అతిపెద్ద పెట్టుబడి దారుడిగా నిలిచారు. చనిపోయే నాటికి రియల్ ఎస్టేట్, బ్యాంక్స్, ఆటో తదితర 30 కంపెనీల్లో విజయవంతమైన పోర్ట్‌ఫోలియో నిర్మించుకున్నారు. 5.8 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించారు. ఇటీవలే ఆకాశ ఎయిర్ పేరుతో ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించారు. కానీ అంతలోనే తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 14న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా చనిపోవడంతో వ్యాపార వర్గాలు, అభిమానులతోపాటు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి లోనైంది. -
Warren Buffett: బఫెట్‌తో భోజనం @ రూ.148 కోట్లు
న్యూయార్క్: పెట్టుబడుల దిగ్గజం వారెన్ బఫెట్‌తో లంచ్ వేలంలో ఏకంగా 1.9 కోట్ల డాలర్లు (రూ.148 కోట్లు) పలికింది. శాన్ఫ్రాన్సిస్కోలోని చారిటీ గ్లైడ్ కోసం నిర్వహించిన ఈ వేలం పాట గత ఆదివారం 25 వేల డాలర్లతో మొదలైంది. రోజురోజుకూ పెరిగి చివరికి అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది. చదవండి: (లోక్‌సభ టాప్ గేర్) -
ఆయన చేస్తున్న పనులు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు - బిల్‌గేట్స్
వారిద్దరు ప్రపంచ కుబేరులు. ఒకే సమయంలో వ్యాపార సామ్రాజ్యంలో పోటీ పడ్డారు. వారిలో ఒకరు వారెన్ బఫెట్ అయితే, మరొకరు బిల్‌గేట్స్. సంప్రదాయ వాణిజ్యం, స్టాక్మార్కెట్లో వారెన్ బఫెట్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే.. టెక్నాలజీ బాట పట్టి మైక్రోసాఫ్ట్‌తో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు బిల్‌గేట్స్. వ్యాపారంలో ఇద్దరి దారులు వేరైనా వాటి ద్వారా వచ్చిన సంపద ఖర్చు పెట్టడంలో ఇద్దరూ ఒక్కటే. తమ దగ్గరున్న సంపదను సేవా కార్యక్రమాలను వెచ్చించడంలో వీళ్లద్దరూ ఎప్పుడూ ముందుంటారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడిగా వెలుగొందుతున్న కాలంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ గేట్స్ - మిలిండా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆహారం, విద్యా, వైద్యం మొదలు వ్యాక్సిన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. బిల్‌గేట్స్ ఉద్దేశాలు నచ్చి వారెన్ బఫెట్ సౌతం గేట్స్ - మిలిందా ఫౌండేషన్‌కి భారీ ఎత్తున విరాళం అందిస్తున్నాడు. తాజాగా గేట్స్ - మిలిందా ఫౌండేషన్‌కి నాలుగు బిలియన్ డాలర్లు అందించాడు వారెన్ బఫెట్. దీంతో ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ అందించిన సాయం ఏకంగా 36 బిలియన్ డాలర్లకు చేరింది. కీర్తి కోసం పాకులాడకుండా తన మిత్రుడు నడిపిస్తున్న స్వచ్చంధ సంస్థకు వారెన్ బఫెట్ భారీగా విరాళం అందిస్తున్నాడు. దీంతో మంచి పనులు చేసేందుకు సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు వారెన్ బఫెట్ అందిస్తున్న సహకారం చూస్తుంటే తన కళ్ల వెంట ఆనంద భాష్పాలు రాలుతున్నాయంటూ గేట్స్ పేర్కొన్నారు. I’m grateful for Warren’s gifts to support the foundation’s work and for our many years of friendship. When he decided in 2006 to make these gifts, it moved me to tears. It still does. https://t.co/JVfF4aUCZv — Bill Gates (@BillGates) June 14, 2022 చదవండి: బిల్‌గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా? -
సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదంటున్న అపర కుబేరుడు వారెన్ బఫెట్
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ సక్సెస్‌కి విభిన్నమైన నిర్వచనం ఇచ్చారు. ఆయన ఈసీవోగా ఉన్న బెర్క్‌షేర్ హత్వే కంపెనీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్ని అనేక అంశాలను ప్రస్తావించారు. కోవిడ్ వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఉత్సవాలను వర్చువల్‌గా కాకుండా నేరుగా నిర్వహించారు. 116 బిలియన్ల సంపదతో ప్రపంచం కుబేరుల్లో టాప్‌లెన్‌లో ఉన్న వారెన్ బఫెట్ సక్సెస్‌ని తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారెన్ బఫెట్ మాట్లాడుతూ.. సక్సెక్‌కు నిర్వచనం ఇవ్వాలంటే జీవితాన్ని చూడాలి. మీరు నా వయసుకు వచ్చినప్పుడు (91) జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. సక్సెస్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్, మన పరపతిలలో ఉండదు. మనల్ని ఎంత మంది ప్రేమించాలని మనం కోరుకుంటాం.. వాస్తవంలో మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు ఎందురు ఉన్నారనేది సక్సెస్‌కి అసలైన నిర్వచనం అని బఫెట్ అన్నారు. విచిత్రం ఏంటంటే ప్రేమను మనం డబ్బుతో కొనలేం. బిలియన్ డాలర్ల డబ్బు ఉంది కదా భారీ ఎత్తున ప్రేమను పొందగలం అనుకోవడం పొరపాటు. అది అసాధ్యం కూడా. కేవలం మనం ఇతరుల్ని ప్రేమించినప్పుడే.. ఆ ప్రేమ మనకు తిరిగి వస్తుంది అంటూ జీవిత సారాన్ని కాచి వడబోసిన విషయాలను వారెన్ బఫెట్ నేటి తరానికి వివరించారు. అసలైన ప్రేమను పొందడమే జీవితంలో సక్సెస్‌కు నిజమైన కొలమానం అన్నారు. చదవండి: ట్విటర్‌ను హ్యాండిల్ చేయడం టెస్లా అంత ఈజీ కాదు - బిల్‌గేట్స్ -
ఈక్విటీల్లో విజయానికి.. బఫెట్ పంచ సూత్రాలు
2020 నుంచి రెండేళ్లపాటు తారాజువ్వలా సాగిన ఈక్విటీల ర్యాలీ చూసి మార్కెట్లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన యువ ఇన్వెస్టర్లు బోలెడు మంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు వారిని ఇప్పుడు అయోమయానికి గురిచేయవచ్చు. అంతెందుకు సుదీర్ఘకాలం నుంచి మార్కెట్లో ఉన్న వారు సైతం షేర్ల ధరలు పేకమేడల్లా రాలుతున్నప్పుడు స్థిరంగా చూస్తూ ఉండలేరు. నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లకు సంక్షోభాలు కొత్త కాదు కదా! ఎన్నో స్కాములు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలను చూసి పడిపోయాయి. అంతే బలంగా పైకి లేచి నిలబడ్డాయి. ఈక్విటీల్లో విజయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి కాదు. విజయ సూత్రాలు. వారెన్ బఫెట్ వంటి విఖ్యాత ఇన్వెస్టర్ల అనుభవాలు, సూత్రాలు లోతుగా పరిశీలిస్తే ఈక్విటీ తత్వం కొంతైనా బోధపడుతుంది. వారెన్ బఫెట్ పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాతవే 1970 నుంచి ఏటా వాటాదారులకు వార్షిక నివేదిక పంపిస్తుంటుంది. ఇందులో వాటాదారులను ఉద్దేశించి బఫెట్ రాసే లేఖ ఇన్వెస్టర్లకు ఒక చుక్కానిలా పనిచేస్తుంది. బఫెట్ అనుసరించిన సూత్రాలు కాల పరీక్షకు నిలబడినవి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కరోనా విపత్తు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక ఆంక్షలు, చైనాలో మందగమనం, అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల శరాఘాతం, దీర్ఘకాలం పాటు ఆర్థిక స్తబ్దత, రూపాయి బలహీనత ఇలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఒకవైపు వృద్ధికి ప్రోత్సాహం కావాలి. మరోవైపు ధరలకు కట్టడి వేయాలి. సెంట్రల్ బ్యాంకులకు ఇదొక సవాలుగా మారిపోయింది. ధరల పెరుగుదలకు సరఫరా వ్యవస్థలో సమస్యలూ తోడయ్యాయి. ఇలా ఒకటికి మించిన ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు గురిచేస్తున్నాయి. స్వల్పకాలంలో కనిపించే ఇలాంటి ప్రకంపనలకు కదిలిపోతే దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలిచి రాణించడం అసాధ్యం. ద్రవ్యోల్బణం ప్రభావం ద్రవ్యోల్బణం ఎగసిపడడం అన్నది తాత్కాలికమేనన్న వాదన గతేడాది నుంచి వినిపిస్తోంది. కానీ, ఇది నిజం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. ఫలితంగా దీర్ఘకాలం పాటు సరళతర విధానాలు కొనసాగడం వల్ల ఉండే రిస్క్‌ను ఇన్వెస్టర్లు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు సైతం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం నడుమ సెంట్రల్ బ్యాంకుల ముందున్న ఏకైక మార్గం ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేయడమే. ఇన్నాళ్లూ తక్కువ వడ్డీ రేట్లు, మిక్కిలి ద్రవ్య లభ్యతతో లాభపడిన మార్కెట్లు.. పరిస్థితులకు తగ్గట్టు మార్పునకూ గురి కావాల్సిందే. వడ్డీ రేట్లు పెరగడం స్టాక్స్‌కు ప్రతికూలమే. ద్రవ్యోల్బణాన్ని బఫెట్ టేప్వార్మ్తో పోల్చారు. టేప్‌వార్మ్‌లు పేగుల లోపలి గోడల్లో ఉండి మనం తీసుకునే ఆహారంలోని శక్తిని గ్రహిస్తుంటాయి. అలాగే, ద్రవ్యోల్బణం కంపెనీల నిధుల శక్తిని హరిస్తుంటుంది. రుణాలను భారంగా మారుస్తుంది. అధిక ద్రవ్యోల్బణం తర్వాత కనిపించేది అధిక వడ్డీ రేట్లే. అందుకుని మార్కెట్లు ఖరీదుగా మారినప్పుడు, వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మిగులు నిధులను బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తానని బఫెట్ తన 1986 లేఖలో పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరిగితే టేప్‌వార్మ్ మాదిరిగా ఏ స్టాక్స్ విలువలు హరించుకుపోతాయన్న విశ్లేషణ చేయాలి. కమోడిటీలు ఇన్‌పుట్‌గా (ముడి సరుకులుగా) వ్యాపారం చేసేవి, అధిక రుణభారంతో నడిచే కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అప్పటి వరకు రుణాల అండతో ఇన్ఫ్రా, పవర్ కంపెనీలు దూకుడు ప్రదర్శించగా.. ఆ తర్వాత కుదేలయ్యాయి. రుణాలు తీర్చలేక ఎన్నో కనుమరుగయ్యాయి. పెన్నీ షేర్లుగా మారిపోయినవీ ఉన్నాయి. వడ్డీ రేట్ల సైకిల్ మారే దశలో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, నష్టాలతో వచ్చే న్యూఏజ్ కంపెనీలపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపిస్తాయి. భద్రత పాళ్లు ఎంత? 1991, 1993 వార్షిక లేఖల్లో బఫెట్ ‘మార్జిన్ ఆఫ్ సేఫ్టీ’ (భద్రత) గురించి ప్రస్తావించారు. పెట్టుబడి విజయంలో దీని పాత్ర ఎంతో ఉంటుందన్నది ఆయన అనుభవ సారం. స్టాక్స్ విలువను మదింపు వేసే విషయంలో ఊహించిన, ఊహించని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాలకు దారితీస్తుంది. వచ్చే పదేళ్ల పాటు మార్కెట్లలో సానుకూల పరిస్థితులు ఉంటాయని వినడా నికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవంలో ఇది సాధ్యమేనా? ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కంపెనీలకు సంబంధించి రిస్క్‌లు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. లాభాల్లేకుండా ఏటా మార్కెట్ వాటా పెంపు కోసం నష్టాలను అధికం చేసుకుంటూ వెళ్లే కంపెనీలకు సంబంధించి భవిష్యత్తు అంచనాలు ఎంతో ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ, ఆర్జించే ఆదాయానికి 3,000 రెట్లు ధర పలుకుతున్న ఆయా కంపెనీల్లో మీరు పెట్టే పెట్టుబడికి భద్రత పాళ్లు ఎంత? ఎన్నో రేట్ల అధిక స్పందన అందుకున్న ఇటీవలి జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్, కార్‌ట్రేడ్ షేర్లు.. లిస్ట్ అయిన తర్వాత గరిష్టాల నుంచి చూస్తే 40–70 శాతం స్థాయిలో పడిపోయాయి. కానీ, ద్రవ్యోల్బణం ప్రభావం వీటిపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. జొమాటో రూ.76 ధరకు ఐపీవో తీసుకురాగా, ఆ తర్వాత రూ.179 వరకు వెళ్లింది. ఇప్పడు రూ.79 వద్ద ట్రేడవుతోంది. విలువను సరిగ్గా అంచనా కట్టకుండా రూ.150–179 మధ్య పెట్టుబడులు పెట్టిన వారి స్థితి ఏంటి? వారు మార్జిన్ ఆఫ్ సేఫ్టీని పట్టించుకోలేదన్నది స్పష్టం. స్పెక్యులేషన్‌కు దూరం దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలంటే స్పెక్యులేటర్గా ఉండకూడదని బఫెట్ చెబుతారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్ వేర్వేరు. ఈ రెండింటి మధ్య విభజన గీత స్పష్టంగా ఉంచుకోవాల్సిందే. ఫలానా షేరు ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలో, ర్యాలీ చేస్తుండడమే మీ పెట్టుబడి వెనుక కారణం అయి ఉంటే, షేరు ధర కంపెనీ మూలాలను ప్రతిఫలించడం లేదంటే అది స్పెక్యులేషన్ అవుతుంది. అయినా కానీ, లాభాలు రావచ్చు. మన దేశంలో కొన్ని పాపులర్ స్టాక్స్ కొన్నేళ్ల పాటు అసాధారణ వ్యాల్యూషన్లతోనే ట్రేడవుతుంటాయి. కానీ, ఒక్కసారిగా ఆయా కంపెనీల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటే ఈ వ్యాల్యూషన్లు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఉదాహరణకు పెయింట్స్ స్టాక్స్ ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలోనే, అంతర్గత విలువకుపైనే ట్రేడవుతుంటాయి. కానీ, చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు వాటి ధరలు దిగొస్తున్నాయి. చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే పెయింట్స్ స్టాక్స్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వృద్ధి అవకాశాలూ సన్నగిల్లుతాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు ధరలను పెంచితే విక్రయాలపై ప్రభావం పడుతుంది. అం దుకని పెట్టుబడికి స్పెక్యులేషన్ ధోరణి పనికిరాదు. అంతర్గత విలువ కంపెనీకి ఫలానా ధర పెట్టొచ్చా అన్నది ఎలా తెలుస్తుంది? దీనికి అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూడడం బఫెట్ అనుసరించే సూత్రాల్లో మరొకటి. బెర్క్‌షైర్ వాటాదారులకు బఫెట్ తరచుగా దీన్ని సూచిస్తుంటారు కూడా. కంపెనీ వ్యాపారం నుంచి తీసుకోతగిన ‘డిస్కౌంటెడ్ క్యాష్ వ్యాల్యూ’ను అంతర్గత విలువగా బఫెట్ చెబుతారు. కానీ పెట్టుబడుల నిపుణులకు సైతం ఇది కొరుకుపడని అంశం. ఇందుకు సంబంధించి ఎవరికి వారు తమదైన లెక్కింపు విధానాలను అనుసరిస్తుంటారు. కంపెనీకి సంబంధించి నికర పుస్తక విలువను అంచనా వేసి, దానికి సమీప భవిష్యత్తులో వచ్చే క్యాష్ ఫ్లో, ప్రస్తుత లాభాలను కలిపితే అంతర్గత విలువ వస్తుంది. ఇవన్నీ కష్టంగా అనిపించిన వారు.. కంపెనీ లాభాలు ఆ కంపెనీ గత చరిత్ర సగటు స్థాయిలోనే ఉన్నాయా? అని చూడాలి. తర్వాత స్టాక్ ధర చారిత్రకంగా (గతంతో పోలిస్తే) సగటు వ్యాల్యూషన్ల స్థాయిలోనే ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా? గమనించాలి. ఒకవేళ స్టాక్ ధర చారిత్రక సగటు వ్యాల్యూషన్లకు ఎగువన ట్రేడ్ అవుతుంటే అంతర్గత విలువకు మించి ట్రేడవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీల లాభాల వృద్ధి కంటే వాటి స్టాక్స్ వ్యాల్యూషన్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో అవి అంతర్గత విలువను దాటిపోయి ట్రేడవుతున్నాయి. 2011 నుంచి 2021 వరకు నిఫ్టీ–50 ఇండెక్స్ 275 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఈ మొత్తంలో 170 శాతం రాబడులు పీఈ రేషియో పెరగడం రూపంలోనే వచ్చాయి. కానీ, ఫండమెంటల్స్ మెరుగుపడడం వల్ల కాదు. అదంతా బబుల్గానే భావించాల్సి ఉంటుంది. పెరుగుదల వెనుక వాస్తవ బలం 100 శాతంగానే భావించాలి. ఇలాంటప్పుడు అంతర్గత విలువకు లభించే స్టాక్స్ తక్కువగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. సరైన ధర సరైన ధర వచ్చే వరకు వేచి చూడాలి.. ఇన్వెస్టర్లకు 1993 లేఖలో బఫెట్ ఇచ్చిన సూచన ఇది. పెట్టుబడులకు సంబంధించి ఎలా నడుచుకోవాలో తెలియని ఇన్వెస్టర్లను మార్కెట్ క్షమించదని ఆయన చెబుతారు. అత్యుత్తమమైన కంపెనీ అయినా సరే షేరు ధర సహేతుక స్థాయి వద్ద ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నది బఫెట్ అనుసరించే సూత్రం. ఒక కంపెనీకి సంబంధించి ఆయన అనుసరించే అంశాలను గమనిస్తే.. ఎంపిక చేసుకునే కంపెనీ చేస్తున్న వ్యాపారం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. దీర్ఘకాలం పాటు అనుకూలతలు ఆ కంపెనీకి ఉండాలి. సమర్థులైన, నిజాయతీపరులైన వ్యక్తులు నడిపిస్తుండాలి. ఆకర్షణీయమైన ధర వద్ద ఉండాలి. వీటిల్లో మొదటి మూడు అంశాలకు రైట్ మార్కులు పడే కంపెనీలను ఆయన ఎన్నో సందర్భాల్లో గుర్తిస్తూనే ఉంటారు. కానీ, నాలుగో అంశమైన ఆకర్షణీయమైన ధర వద్ద లేకపోవడంతో బఫెట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మార్కెట్లో ప్రతి పతనం పెట్టుబడికి అవకాశం కావాలనేమీ లేదు. కొన్ని సందర్భాల్లో కంపెనీలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం కావచ్చు. పెట్టుబడులకు ముందు భిన్నమైన అంశాలను విశ్లేషించుకోవాలని, వేగంగా స్పందించకుండా ఓపిక పట్టాలన్నది బఫెట్ ఫిలాసఫీ. పెట్టే ధర విషయంలో రిస్క్ తీసుకోవడం బఫెట్‌కు నచ్చదు. అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టడమే ఆయన అనుసరించే విధానం. చక్కని అవకాశాలన్నవి మళ్లీ మళ్లీ వస్తుంటాయని ఆయన నమ్ముతారు. అందుకనే అందరూ ఎగబడి కొంటున్న వేళ అప్రమత్తంగా వ్యవహరించాలని.. అందరూ విక్రయిస్తున్న వేళ కొనుగోళ్లకు మొగ్గు చూపాలన్నది బఫెట్‌కు ఫలితాలిచ్చిన సూత్రాల్లో ఒకటి. ఎగసిపడే కెరటాన్ని పట్టుకోకుండా.. అది నేలను తాకే వరకు ఆగాలంటారు. 100–150–200 పీఈ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు అయినా బఫెట్ సూత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. -
Warren Buffett: మీకిదే నా సలహా..ఇలా చేస్తే జాబ్, మంచి ఫ్యూచర్ ఉంటుంది!
వారెన్ బఫెట్ పైనుంచి దిగిరాలేదు. గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు. ఆయన వెనుక గాఢ్ ఫాదర్ ఎవరూ లేరు. కటిక పేదరికాన్ని చూశారు. ఆకలి కేకలు పెట్టారు. అన్నమో రామచంద్రా అని ఏడ్చారు. పేదరికంతో బాధపడ్డారు. అంతే. అంతవరకే పేదరికాన్ని తిడుతూ కూర్చోలేదు. అవకాశాల్ని వెతుక్కున్నారు. అవకాశాలు లేని చోట దాన్ని సృష్టించుకున్నారు. ఒక్కో క్షణాన్ని కరెన్సీ నోటుగా మార్చడం తెలుసుకున్నారు. ఇలా 91ఏళ్ల వయస్సులో 117 బిలియన్ల (రూ. 8.97 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన బెర్క్‌షైర్ హాత్వేకి ఛైర్మన్, సీఈఓగా ఉన్న బఫెట్ అప్పుడప్పుడు యువతకు ఉపయోగపడేలా సలహాలు ఇస్తుంటారు. తాజాగా తన షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. అందులో యువత జాబ్‌తో మంచి ఫ్యూచర్ ఎలా పొందవచ్చో తెలిపారు. కంపెనీ షేర్హోల్డర్లకు తన తాజా వార్షిక లేఖలో ..బఫెట్ తన సుదీర్ఘ కెరీర్లో పనిని ఆస్వాదించినట్లు చెప్పారు. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు పలు అంశాలను గుర్తుంచుకోవాలని చెప్పారు. డబ్బులు కోసం ఎప్పుడూ పని చేయకండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి. అలా చేస్తే మీకు కావాల్సిన డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఒకవేళ డబ్బులు ఎక్కువగా వస్తున్న జాబ్‌లో మీరు జాయిన్ అయితే.. డబ్బులు వస్తున్నాయి. కాబట్టి పనిని ఎంజాయ్ చేయలేరు. ఉన్న జాబ్‌ను కూడా సక్రమంగా చేయలేరు. అందుకే మంచి భవిష్యత్ కావాలంటే పనని ఎంజాయ్ చేయాలని సూచించారు. బఫెట్ ఏం చేశారు. బఫెట్ తన తాత ముంగెర్కు చెందిన కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించారు. అయితే బఫెట్‌కు ఆ పని నచ్చకపోవడంతో సెక్యూరిటీలను విక్రయించే వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బఫెట్ తాత ముంగెర్ లాయర్ వృత్తిని ప్రారంభించారు. అలా 1965లో ఇద్దరూ కంపెనీ నిర్వహణ, ఆర్థిక విధానాలను నియంత్రించేలా బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ కంట్రోల్ స్టేక్‌ను కొనుగోలు చేశారు. జనరల్ మోటార్స్, కోకా కోలా కంపెనీ,యాపిల్ వంటి మెగా కంపెనీలలో 700 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్, హోల్డింగ్లతో ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగారు. చదవండి: గేట్స్ ఫౌండేషన్‌కు బఫెట్ రాజీనామా -
ప్రపంచ బిలియనీర్లకు శనిలా దాపురించిన చైనా కొత్త సంక్షోభం..!
చైనాకు చెందిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎవర్‌గ్రాండే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. ఎవర్‌గ్రాండే గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఇది ఒకటి. 2008 అమెరికాలో సుమారు 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన సంస్థ లేమన్ బ్రదర్స్ మాదిరిగానే ఎవర్ గ్రాండే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేమన్ బ్రదర్స్ తరహాలో ఎవర్‌గ్రాండే కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద సంక్షోభంగా నిలిచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! శనిలా దాపురించిన ఎవర్‌గ్రాండే..! తాజాగా ఎవర్‌గ్రాండే సంక్షోభం ప్రపంచంలోని బిలియనీర్లకు శనిలాగా పట్టుకుంది. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ తదితర బిలియనీర్లు ఏకంగా సుమారు 26 బిలియన్ల డాలర్ల(సుమారు రూ.1,92,082 కోట్ల రూపాయలు)పైగా నష్టపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు తగ్గి 198 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సుమారు 5.6 బిలియన్ డాలర్లను కోల్పోగా, జెఫ్ బెజోస్ నికర విలువ 194 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ బిలియనీర్ల జాబితాలోని మొదటి ఐదు స్థానాల్లోని మరో ముగ్గురు వ్యక్తులు లూయిస్ విట్టన్ ఎస్ఈ గ్రూప్ హెడ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండు బిలియన్ డాలర్లు నష్టపోయి 157 బిలియన్ డాలర్ల వద్ద, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 1.94 బిలియన్ డాలర్లు నష్టపోయి 149 బిలియన్ డాలర్ల వద్ద, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 3.27 బిలియన్ డాలరు నష్టపోయి.. 132 బిలియన్ వద్ద నిలిచారు. వారితో పాటుగా లారీపేజ్-సెర్జే బ్రిన్, స్టీవ్ బామర్, లారీ ఎల్లిసన్, వారన్ బఫెట్ వరుసగా..1.9 , 1.8, 1.9 , బిలియన్ డాలర్లు, 764 మిలియన్ డాలర్లు, 701 మిలియన్ డాలర్లు నష్టపోయారు. వడ్డీలను చెల్లించలేం..ఇన్వెస్టర్లకు పంగనామాలు..! బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో 359 వ స్థానంలో నిలిచిన ఎవర్‌గ్రాండే వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హుయ్ కా యాన్ కంపెనీ షేర్లు 11 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో అతని నికర ఆస్తులు విలువ ర్యాంకింగ్‌లో తగ్గుదల కనిపించింది. ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో ఈ స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. ఎవర్‌గ్రాండే చైనాలో రియల్ఎస్టేట్ రంగంలో అతి పెద్ద దిగ్గజం. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించలేనని ఎవర్‌గ్రాండే ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. -
గేట్స్ ఫౌండేషన్‌కు బఫెట్ రాజీనామా
న్యూఢిల్లీ: షేర్ మార్కెట్ దిగ్గజం, బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ బఫెట్(90) ‘బిల్ అండ్ మెలిండా గేట్స్(బీఎంజీ) ఫౌండేషన్’ ట్రస్టీ పదవికి రాజీనామా చేశారు. ‘‘చాలా ఏళ్లుగా బీఎంజీ ఫౌండేషన్ ట్రస్టీగా కొనసాగుతున్నా. కొన్నాళ్లుగా ఈ పోస్టులో నేను చురుగ్గా వ్యవహరించడం లేదు. చాలా కార్పొరేట్ సంస్థల బోర్డులకు రాజీనామా చేసినట్లుగానే బీఎంజీ ఫౌండేషన్ ట్రస్టీ పదవి నుంచి తప్పుకుంటున్నా. ఫౌండేషన్ సీఈవోగా మార్క్ సుజ్మన్ చక్కగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఎన్నికైన ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుంది. నా లక్ష్యాలు, ఫౌండేషన్‌లోని పెద్దల లక్ష్యాలు ఒక్కటే. ఈ లక్ష్యాలను సాధించడానికి ఇక నా భౌతికపరమైన భాగస్వామ్యం అవసరం లేదు’’ అని బఫెట్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పెట్టుబడి పెట్టిన మొత్తం షేర్లను దానం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో సగం దూరం ప్రయాణం చేశానని తెలిపారు. అలాగే మరో 4.1 బిలియన్ డాలర్లను (రూ.30,413 కోట్లు) సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తానని వెల్లడించారు. అయితే, ట్రస్టీ పోస్టు నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ఆయన బయటపెట్టలేదు. 27 ఏళ్ల వివాహ బంధం నుంచి వైదొలిగామని, విడాకులు తీసుకుంటామని బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ప్రకటించిన కొన్ని వారాల్లోనే వారెన్ బఫెట్ నుంచి రాజీనామా ప్రకటన రావడం గమనార్హం. ప్రపంచంలో అతిపెద్ద దాతృత్వ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన బీఎంజీ ఫౌండేషన్‌లో ఇకపైనా కలిసి పనిచేస్తామని బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మళ్లీ షేర్లు కొంటున్న వారెన్ బఫెట్
న్యూయార్క్: ప్రపంచ సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.. తిరిగి ఈక్విటీలవైపు దృష్టి సారించారు. ఈ ఏడాది(2020) మూడో త్రైమాసికంలో పలు ఫార్మా దిగ్గజాలలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. బఫెట్ ప్రధాన కంపెనీ బెర్క్‌షైర్ హాథవే.. క్యూ3(జులై- సెప్టెంబర్)లో వివిధ కంపెనీలలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇదే కాలంలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి సైతం మరో 9 బిలియన్ డాలర్లను వెచ్చించడం గమనార్హం! ఈ అంశాలను బెర్క్‌షైర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తాజాగా వెల్లడించింది. యూటర్న్.. దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్న నేపథ్యంలో తొలి రెండు త్రైమాసికాలలోనూ బఫెట్ సంస్ధ బెర్క్‌షైర్ 13 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు ఎయిర్‌లైన్స్ కంపెనీలలో గల వాటాలను దాదాపు అమ్మివేసింది. కాగా.. కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్లు 90 శాతం విజయవంతమైనట్లు ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో బఫెట్ రూటు మార్చుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో షేర్ల విక్రయాలకు బదులుగా కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఫార్మాకు ప్రాధాన్యం బెర్క్‌షైర్ క్యూ3లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో ఫార్మాకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. జాబితాలో యాబ్వీ ఇంక్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, మెర్క్ అండ్ కో చోటు చేసుకున్నాయి. వీటిలో ఫైజర్‌లో 13.8 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. కేవలం కోవిడ్-19 వ్యాక్సిన్లపై దృష్టితో కాకుండా భవిష్యత్‌లో ఫార్మా రంగానికున్న అవకాశాలపై అంచనాలతో బఫెట్ కంపెనీ ఇన్వెస్ట్ చేసినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో బ్యాంకింగ్ దిగ్గజాలు జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్ ఫార్గో, పీఎన్సీ ఫైనాన్సియల్ సర్వీసెస్‌తోపాటు.. రిటైల్ దిగ్గజం కాస్ట్కో హోల్‌సేల్ కార్ప్లలో వాటాలు తగ్గించుకుంది. క్యూ2లో పలు ఎయిర్‌లైన్స్ కంపెనీలలో భారీగా వాటాలు విక్రయించిన సంగతి తెలిసిందే. టీ మొబైల్లో.. స్టాక్ ఎక్స్ఛేంజీల వివరాల ప్రకారం ఈ ఏడాది క్యూ3లో టెలికం సేవల దిగ్గజం టీ మొబైల్ యూఎస్‌లో బెర్క్‌షైర్ అదనపు వాటాలను సొంతం చేసుకుంది. అతిపెద్ద వైర్లెస్ నెట్వర్క్ కలిగిన టీ మొబైల్ 5జీ సేవలవైపు దృష్టి సారించిన నేపథ్యంలో బఫెట్ తాజా పెట్టుబడులు చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెక్నాలజీ రంగ ఐపీవో స్నోఫ్లేక్ ఇంక్లోనూ బెర్క్‌షైర్ ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఇదే సమయంలో 2.5 బిలియన్ డాలర్లతో క్లాస్ ఏ షేర్లను, 6.7 బిలియన్ డాలర్లతో క్లాస్ బీ షేర్లనూ బైబ్యాక్ చేసింది. వెరసి 2020లో బెర్క్‌షైర్ హాథవే షేర్ల బైబ్యాక్‌కు సెప్టెంబర్ చివరికల్లా 15.7 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లయ్యింది. అయినప్పటికీ కంపెనీ వద్ద దాదాపు 146 బిలియన్ డాలర్ల నగదు నిల్వలుండటం విశేషం! -
కోవిడ్19- రూటు మార్చిన బఫెట్
న్యూయార్క్: కోవిడ్-19 కారణంగా ప్రపంచ ఇన్వెస్ట్ మెంట్ గురు వారెన్ బఫెట్ సైతం రూటు మార్చుకున్నారు. వెరసి ఈ ఏడాది(2020) తొలి 9 నెలల్లో సొంత కంపెనీ షేర్ల బైబ్యాక్ కు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. తద్వారా 16 బిలియన్ డాలర్లను బైబ్యాక్ కోసం వెచ్చించారు. గతేడాదిలో చేపట్టిన బైబ్యాక్ తో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికంకావడం గమనార్హం. బఫెట్ దిగ్గజ కంపెనీ బెర్క్ షైర్ ఇటీవల చేపట్టిన పెట్టుబడులను సైతం బైబ్యాక్ మించినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 2019లో ఆక్సిడెంటల్ పెట్రోలియం కార్ప్ డీల్, ఏడాది కాలంపాటు ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేర్ల కొనుగోలుకి వెచ్చించిన నిధులకంటే ఇవి అధికమని పేర్కొన్నారు. కరోనా కాటు కోవిడ్-19 ప్రభావంతో ఇన్వెస్ట్ మెంట్ దిగ్గజం బఫెట్ పెట్టుబడి ప్రణాళికల్లో కొంతమేర యూటర్న్ తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రికార్డ్ బైబ్యాకులు, జపనీస్ ట్రేడింగ్ సంస్థలలో వాటాలు, నేచురల్ గ్యాస్ ఆస్తుల కొనుగోలు తదుపరి పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేశారు. కొద్ది నెలల క్రితమే ఇన్వెస్ట్ చేసిన యూఎస్ ఎయిర్ లైన్స్ కంపెనీలలో వాటాలను భారీగా విక్రయించారు. నిజానికి కొంతకాలంగా పేరుకుపోతున్న నగదు నిల్వలతో భారీ కొనుగోళ్లకు తెరతీయాలని భావించిన బఫెట్.. కరోనా వైరస్ కారణంగా ప్రణాళికలు మార్చుకున్నట్లు నిపుణులు వివరించారు. 8 శాతం డౌన్ ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో బైబ్యాక్ పై 9 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లు బెర్క్ షైర్ తాజాగా వెల్లడించింది. క్యూ4(అక్టోబర్- డిసెంబర్)లోనూ బైబ్యాక్ కొనసాగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ కల్లా నగదు నిల్వలు 146 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు పేర్కొంది. బైబ్యాక్స్, స్టాక్స్ లో పెట్టుబడుల నేపథ్యంలోనూ జూన్ మగింపుతో పోలిస్తే 1 బిలియన్ డాలర్లు మాత్రమే తక్కువకావడం విశేషం. క్యూ3లో నిర్వహణ లాభం 32 శాతం క్షీణించి 5.48 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు బెర్క్ షైర్ శనివారం వెల్లడించింది. అయితే ఇంధన విభాగం మిడ్ అమెరికన్ ఎనర్జీ ఆర్జన 21 శాతం ఎగసినట్లు పేర్కొంది. కాగా.. బైబ్యాకులు చేపట్టినప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకూ బెర్క్ షైర్ క్లాస్ A షేరు 7.6 శాతం క్షీణించిన విషయాన్ని నిపుణులు గమనించదగ్గ అంశమంటున్నారు. -
వారెన్ బఫెట్‌కు షాకిచ్చిన అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ (63) తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. నికర విలువ పరంగా, బిజినెస్ టైకూన్, ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్‌ను అధిగమించారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ విలువ ఇప్పుడు 70.1 బిలియన్ డాలర్లకు చేరగా, వారెన్ బఫెట్ సంపద విలువ 67.9 బిలియన్ డాలర్లు మాత్రమే. దీంతో అంబానీ ప్రపంచంలో ఏడవ ధనవంతుడుగా నిలిచారు. రిలయన్స్ టెలికాం విభాగం జియోలో వరుస పెట్టుబడులతో అంబానీ సంపద గణనీయంగా పుంజుకుంది. దీంతో ప్రపంచంలోని టాప్10 ధనవంతుల క్లబ్లో ఉన్న ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా అంబానీ నిలిచారు. బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ సీఈఓ వారెన్ బఫెట్ (82) 37 బిలియన్ డాలర్లకు పైగా బెర్క్‌షైర్ హాత్వే షేర్లను ఇటీవల విరాళంగా ఇచ్చిన తరువాత సంపద క్షీణించింది. ఒరాకిల్ ఆఫ్ ఒమాహా గా పేరొందిన బఫెట్ ఈ వారంలో 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేశారు. దీంతో ఆయన సంపద నికర విలువ క్షీణించింది. కాగా హురున్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, అంబానీ ఇటీవల ప్రపంచంలో ఎనిమిదవ ధనవంతుడిగా అంబానీ అవతరించారు. సంపన్న భారతీయుడిగా అంబానీ నంబర్ వన్ ర్యాంకులో దూసుకుపోతున్నారు.ఈ ఏడాదిలో మొదటి రెండు నెలల్లో తీవ్ర నష్టాలను నమోదు చేసినప్పటికీ, జియోలో వరుస భారీ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స షేరు రికార్డు గరిష్టాన్ని తాకింది. దీంతో కరోనా సంక్షోభంలో కూడా గణనీయమైన వృద్దిని సాధించి, అప్పుల్లేని సంస్థగా రిలయన్స్ అవతరించింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12.70 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరింది. (రిలయన్స్- బీపీ జాయింట్ వెంచర్ లాంచ్) -
మార్కెట్లు ర్యాలీ- బఫెట్‌కు నష్టాలు
కోవిడ్-19 నేపథ్యంలో నగదు నిల్వలను కదపని సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాథవే ఎట్టకేలకు తొలి అడుగు వేస్తోంది. అనుబంధ విభాగం బెర్క్‌షైర్ హాథవే ఎనర్జీ ద్వారా డొమినియన్ ఎనర్జీ గ్యాస్ ఆస్తుల కొనుగోలుకి సిద్ధపడుతోంది. ఇందుకు 4 బిలియన్ డాలర్ల విలువైన డీల్ కుదుర్చుకుంది. తద్వారా 7700 మైళ్ల సహజవాయు పంపిణీ నెట్‌వర్క్‌తోపాటు.. 900 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలను సొంతం చేసుకోనుంది. మిడ్అమెరికన్ ఎనర్జీ, ఎన్వీ ఎనర్జీ, పసిఫిక్ కార్ప్ యుటిలిటీస్ తదితర ఇంధన ఆస్తులు కలిగిన బెర్క్‌షైర్ హాథవే ఎనర్జీలో బెర్క్‌షైర్‌కు 91.1 శాతం వాటా ఉంది. 20200 మార్చికల్లా బెర్క్‌షైర్ వద్ద 137 బిలియన్ డాలర్లకుపైగా నగదు నిల్వలున్నాయి. గత నాలుగేళ్లుగా బఫెట్ భారీ కొనుగోళ్లకు వెనుకాడుతున్న విషయం విదితమే. 50 బిలియన్ డాలర్లు ఇటీవల అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. నాస్డాక్ పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటోంది. డోజోన్స్, ఎస్అండ్పీ సైతం చరిత్రాత్మక గరిష్టాలకు చేరువలో నిలుస్తున్నాయి. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్(జనవరి-మార్చి)లో వారెన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బెర్క్‌షైర్ హాథవే 50 బిలియన్ డాలర్ల నష్టాలను ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ యూఎస్ మార్కెట్లు 40 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెర్క్‌షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్ సంపదకు 19 బిలియన్ డాలర్లు(రూ. 1.4 లక్షల కోట్లు) చిల్లు పడినట్లు బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ తెలియజేసింది. అయినప్పటికీ 70 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచ కుబేరుల్లో ఆరో ర్యాంకులో నిలుస్తున్నట్లు పేర్కొంది. బేరిష్‌గా ఉన్నారు మార్కెట్లు దూకుడు చూపుతున్నప్పటికీ బఫెట్ ఇటీవల బేరిష్ వ్యూతో వ్యవహరిస్తున్నట్లు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ భసిన్ పేర్కొంటున్నారు. మార్చిలో మార్కెట్లు పతనమైనప్పుడు బెర్క్‌షైర్ నాలుగు ప్రధాన అమెరికన్ ఎయిర్‌లైన్స్ కంపెనీల వాటాలను విక్రయించింది. కోవిడ్-19 కారణంగా ప్రయాణాలు నిలిచిపోవడం ప్రభావం చూపగా..మార్చి క్వార్టర్లో బెర్క్‌షైర్ భారీగా 50 బిలియన్ డాలర్ల నష్టాలను ప్రకటించింది. కాగా.. ఈ త్రైమాసికంలో బఫెట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్కూ ఆసక్తి చూపలేదంటూ కానవ్ క్యాపిటల్ మేజేజింగ్ పార్టనర్ గౌరవ్ సూద్ పేర్కొన్నారు. పలు అవకాశాలను అందుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్లో సచిన్ సైతం సున్నాకు ఔట్ అయిన సందర్భాలున్నట్లే.. ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయని.. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వారెన్ బఫెట్ గొప్ప దిగ్గజమని కొటక్ ఏంఎసీ ఎండీ నీలేష్ షా తదితర పలువురు నిపుణులు ప్రశంసిస్తున్నారు!