న్యూయార్క్: తాజాగా ప్రకటించిన అమెరికా కుబేరుల ఫోర్బ్స్ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్స్ గేట్స్ తిరిగి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. అత్యంత సంపాదన పరుల జాబితాలో బిల్స్ గేట్స్ 72 బిలియన్ యూఎస్ డాలర్ల(4.68 లక్షల కోట్ల రూపాయలు) తో మొదటిస్థానంలో నిలిచారు. బార్క్ షైర్ అధినేత వారెన్ బఫెట్ 58.5 బిలియన్ యూఎస్ డాలర్ల(3.71లక్షల కోట్ల రూపాయలు)తో రెండో స్థానం దక్కించుకున్నారు. కాగా, ఒరాకిల్ అధినేత లారీ ఎలిసన్ మూడో స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. ఎలిసన్ 41 బిలియన్ డాలర్ల(2.62 లక్షల కోట్ల రూపాయలు)తో మూడోస్థానంలో నిలిచారు. కొచ్చి కో-ఓనర్స్ ఛార్లెస్ సోదరులు మరియు డేవిడ్ కోచ్ లు 36 బిలియన్ డాలర్ల(2.30 లక్షల కోట్ల రూపాయలు)తో నాల్గో స్థానం నిలిచారు. అమెరికా లో గత సంవత్సరం కంటే 2013 లో అత్యధికమంది ఫోర్భ్స్ జాబితాలో స్థానం సంపాదించడం విశేషం.