వారెన్ బఫెట్ పైనుంచి దిగిరాలేదు. గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు. ఆయన వెనుక గాఢ్ ఫాదర్ ఎవరూ లేరు. కటిక పేదరికాన్ని చూశారు. ఆకలి కేకలు పెట్టారు. అన‍్నమో రామచంద్రా అని ఏడ్చారు. పేదరికంతో బాధపడ్డారు. అంతే. అంతవరకే పేదరికాన్ని తిడుతూ కూర్చోలేదు. అవకాశాల్ని వెతుక్కున్నారు. అవకాశాలు లేని చోట దాన్ని సృష్టించుకున్నారు. ఒక్కో క్షణాన్ని కరెన్సీ నోటుగా మార్చడం తెలుసుకున్నారు. ఇలా 91ఏళ్ల వయస్సులో 117 బిలియన్ల (రూ. 8.97 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన బెర్క్‌షైర్ హాత్వేకి ఛైర్మన్, సీఈఓగా ఉన్న బఫెట్ అప్పుడప్పుడు యువతకు ఉపయోగపడేలా సలహాలు ఇస్తుంటారు. తాజాగా తన షేర్ హోల‍్డర్లకు లేఖ రాశారు. అందులో యువత జాబ్‌తో మంచి ఫ్యూచర్ ఎలా పొందవచ్చో తెలిపారు.
కంపెనీ షేర్‌హోల్డర్‌లకు తన తాజా వార్షిక లేఖలో ..బఫెట్ తన సుదీర్ఘ కెరీర్‌లో పనిని ఆస్వాదించినట్లు చెప్పారు. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు పలు అంశాలను గుర్తుంచుకోవాలని చెప్పారు. డబ్బులు కోసం ఎప్పుడూ పని చేయకండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి. అలా చేస్తే మీకు కావాల్సిన డబ్బులు వాటంతట అవే వస‍్తాయి.
ఒకవేళ డబ్బులు ఎక్కువగా వస్తున్న జాబ్‌లో మీరు జాయిన్ అయితే.. డబ్బులు వస్తున్నాయి. కాబట్టి పనిని ఎంజాయ్ చేయలేరు. ఉన్న జాబ్‌ను కూడా సక్రమంగా చేయలేరు. అందుకే మంచి భవిష్యత్ కావాలంటే పనని ఎంజాయ్ చేయాలని సూచించారు.
బఫెట్ ఏం చేశారు.
బఫెట్ తన తాత ముంగెర్కు చెందిన కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించారు. అయితే బఫెట్కు ఆ పని నచ్చకపోవడంతో సెక్యూరిటీలను విక్రయించే వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బఫెట్ తాత ముంగెర్ లాయర్ వృత్తిని ప్రారంభించారు. అలా 1965లో ఇద్దరూ కంపెనీ నిర్వహణ, ఆర్థిక విధానాలను నియంత్రించేలా బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ కంట్రోల్ స్టేక్‌ను కొనుగోలు చేశారు. జనరల్ మోటార్స్, కోకా కోలా కంపెనీ,యాపిల్ వంటి మెగా కంపెనీలలో 700 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్, హోల్డింగ్‌లతో ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగారు.
Comments
Please login to add a commentAdd a comment