Stock market investors
-
రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
వివేక్ ఒబెరాయ్ ప్రముఖ నటుడిగానే అందరికి తెలుసు. కానీ, తన పదహారో ఏటే స్టాక్ మార్కెట్లో శిక్షణ తీసుకుని కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చాలా మందికి తెలియకపోవచ్చు. అలా స్టాక్ మార్కెట్, నట జీవితంలో వచ్చిన డబ్బుతో పాటు విభిన్న వ్యాపారాల వల్ల తాను ప్రస్తుతం రూ.1,200 కోట్ల సంపదను సృష్టించుకున్నారు. అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన తన సంపదను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇటీవల తెలియజేశారు.వివేక్ ఒబెరాయ్ చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించడంతోపాటు దాన్ని సమర్థంగా ఎలా నిర్వహించాలనే దానిపై దృష్టి సారించేవారు. తాను సినిమాల్లోకి రాకముందే వాయిస్ఓవర్ అసైన్మెంట్లు, హోస్టింగ్ షోలు చేసేవారు. అందులో వచ్చిన డబ్బును సమర్థంగా పెట్టుబడి పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. దాంతో విభిన్న వ్యాపార ఆలోచనలను అన్వేషిస్తూ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి స్టాక్ బ్రోకర్లతో శిక్షణ తీసుకున్నట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. తన పదహారో ఏట మార్కెట్లో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నారు. ఎక్కువగా కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చెప్పారు. 19 ఏళ్ల వయసులోనే ఒక టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 22 సంవత్సరాల వయసులో మంచి లాభంతో దాన్ని ఓ బహుళజాతి సంస్థకు విక్రయించినట్లు తెలిపారు.వ్యూహాత్మక పెట్టుబడులుముంబయిలోని మిథిబాయి కాలేజీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో పట్టా పొందిన వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం తన వద్ద ఉన్న సంపదను రెండు భాగాలు విభజించినట్లు చెప్పారు. 60 శాతం సంపదను స్థిరంగా ఆదాయం సమకూర్చే విభాగాల్లో పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. మరో 40 శాతం సంపదను ప్రైవేట్ ఈక్విటీ, రియల్ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నట్లు, ఆకర్షణీయ స్టార్టప్‌ల్లో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాలతో ప్రయోగాత్మక పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: రైల్వే కొత్త రూల్.. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..రియల్ ఎస్టేట్: వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో దృష్టి సారించి కర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్థాపించారు.డైమండ్ బిజినెస్: దేశవ్యాప్తంగా 18 స్టోర్లతో సోలిటారియో అనే డైమండ్ కంపెనీని స్థాపించారు.ఈవెంట్ మేనేజ్మెంట్: వివేక్ ‘మెగా ఎంటర్టైన్మెంట్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించారు.ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్: సుమారు రూ.3,400 కోట్ల (సుమారు 400 మిలియన్ డాలర్లు) విలువైన ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు.ఫ్యామిలీ కార్యాలయం: ‘ఒబెరాయ్ ఫ్యామిలీ ఆఫీస్’ ద్వారా పెట్టుబడులను మేనేజ్ చేస్తున్నారు. -
ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్
దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్‌తేరాస్‌కు ముందు అక్టోబర్ 28న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి. అక్టోబర్ 25తో ముగిసిన ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. అంటే డీమ్యాట్‌లో ఒక షేర్ ఉంటే అదనంగా మరో షేర్ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్ ధర కూడా సమానంగా డివైడ్ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్‌కు అక్టోబర్ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్‌కు అర్హులుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.17,55,986 కోట్లుగా ఉంది. -
‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇటీవల భారీగా పడిపోతున్న నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మదుపర్లకు సలహా ఇచ్చారు. సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తోనే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్ ట్రెండ్‌కు తగిన వ్యూహం అనుసరించని వారు త్వరగా నష్టపోతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్లో కొన్ని అంశాలను పంచుకున్నారు.‘ఈక్విటీ మార్కెట్లో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేనివారు లాభాలు ఆర్జించడం ఇప్పటివరకు చూడలేదు. మార్కెట్ ట్రేండ్‌కు తగిన ప్రణాళిక లేకుండా ట్రేడింగ్ చేసేవారు త్వరగా నష్టాల్లోకి వెళుతారు. మార్కెట్ రిస్క్‌లకు తగిన విధంగా పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలి. లేదంటే డబ్బు సంపాదించడం కష్టం. రిస్క్ తక్కువగా తీసుకుంటే రిటర్న్‌లు కూడా అందుకు అనుగుణంగానే తక్కువ ఉంటాయి. అలాగని ఎక్కువ రిస్క్ తీసుకోవడం ప్రమాదం. కొన్నిసార్లు మొత్తం డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ నిర్వహణ చాలా ముఖ్యం. పోర్ట్‌ఫోలియో ఆధారంగా రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇది ట్రేడర్, ఇన్వెస్టర్ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని కామత్ అన్నారు.In the 20+ years in this business, I haven’t seen anyone who has kept profits from trading without good risk management. I know many who've lost quickly. If you don't have a plan to manage risk and size your bets, it's impossible to keep the money you make.Here are a few…— Nithin Kamath (@Nithin0dha) October 23, 2024ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఎన్నికలు, పెరుగుతున్న ఎఫ్ఐఐ అమ్మకాలు వెరసి స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. దీర్ఘకాలంలో రాబడులు ఆశించే ఇన్వెస్టర్లకు ఇలా మార్కెట్లు నష్టపోతుండడం మంచి అవకాశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మరిన్ని ఎక్కువ స్టాక్‌లు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 25,095కు చేరింది. సెన్సెక్స్ 285 పాయింట్లు పుంజుకుని 81,958 వద్ద ట్రేడవుతోంది. గడిచిన సెషన్‌ల్లో మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. సోమవారం కొంత పుంజుకుని లాభాల్లో ట్రేడవుతున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.52 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.97 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.9 శాతం లాభపడింది. నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి ఆరు మార్పులు ఇవే..భవిష్యత్తులో అంతర్జాతీయ అనిశ్చితులు దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికలు ముగిసే వరకు ఈ యుద్ధ భయాలు ఉండవచ్చని అంచనా. ముడిచమురు ధరలు మరింత పెరిగే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ నెల 9న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మార్కెట్‌కు కీలకంగా మారనున్నాయి. గతంలో ఆర్బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం కీలక వడ్డీరేట్లను వెంటనే తగ్గించబోమనే సంకేతాలు వెలువరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి కంపెనీలు ఆర్థిక ఫలితాలను త్వరలో ప్రకటించనున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పేరుకు స్మాల్ క్యాప్..మిడ్ క్యాప్ సంస్థల్లో పెట్టుబడెందుకు?
స్మాల్ క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎందుకు కేటాయింపులు చేస్తుంటాయి? – వంశీ గౌడ్నిజానికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ పెట్టుబడులు అన్నింటినీ స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే పెట్టేయవు. ఇది సాధారణ నమ్మకానికి విరుద్ధమైనది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు పెట్టుబడుల పరంగా కొంత వెసులుబాటు కల్పించింది. స్మాల్‌క్యాప్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మిగిలిన 35 శాతాన్ని ఏ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలన్నది పూర్తిగా ఫండ్ మేనేజర్ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా ఈ 35 శాతాన్ని మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌లో ఏ విభాగానికి కేటాయించాలన్నది ఫండ్ మేనేజర్లు నిర్ణయిస్తుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఆటుపోట్లు ఎక్కువ. లిక్విడిటీ సమస్యలు కూడా ఉంటాయి. అందుకని పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఇతర మార్కెట్ క్యాప్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్‌లను అధిగమించొచ్చు.28 స్మాల్‌క్యాప్ యాక్టివ్ ఫండ్స్‌ను గమనిస్తే.. అవి తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 82 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీలకు, 13 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించాయి. కేవలం ఆరు పథకాలే మిడ్‌క్యాప్ కంపెనీలకు 15 శాతానికి మించి పెట్టుబడులు కేటాయించాయి. వాటి పనితీరు మిశ్రమంగా ఉంది. మూడు పథకాలు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250కి మించి పనితీరు చూపించాయి. మరో మూడు బెంచ్ మార్క్ పనితీరు స్థాయిలో రాబడులు అందించాయి. కేవలం జేఎం స్మాల్ క్యాప్ ఫండ్, టాటా స్మాల్‌క్యాప్, ఎస్బీఐ స్మాల్‌క్యాప్, డీఎస్పీ స్మాల్‌క్యాప్ పథకాలే 90 శాతానికి పైగా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి.ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి అమలవుతున్న ఆరు మార్పులు ఇవే..నా వద్ద రూ.35 లక్షలు ఉన్నాయి. 8 నుంచి 10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఏడు పథకాల పరిధిలో ఇన్వెస్ట్ చేయాలన్నది నా యోచన. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్‌కు ఇది మంచి వ్యూహమే అవుతుందా? – జయదేవ్రూ.35 లక్షల పెట్టుబడులను 8–10 ఏళ్ల కాలానికి, వివిధ పథకాల పరిధిలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, ఏడు పథకాల పరిధిలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది పెద్దగా ఫలితం ఇవ్వదు. దీనికి బదులు మొత్తం పథకాల సంఖ్యను ఐదుకు తగ్గించుకోవడాన్ని పరిశీలించండి. అప్పుడు ఒక్కో పథకానికి 20 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. కొన్ని పథకాలపైనే దృష్టి సారించడం వల్ల వాటికి అర్థవంతంగా కేటాయింపులు చేసుకోవడానికి వీలుంటుంది. ఐదు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాటి పనితీరును ఎప్పటికప్పుడు సులభంగా సమీక్షించుకుంటూ, అవసరమైతే సర్దుబాట్లు చేసుకోవచ్చు. పెట్టుబడులను ఎక్కువ పథకాల మధ్య విస్తరించడం వల్ల అది సంతృప్తిని ఇవ్వొచ్చు. కానీ, విడిగా ఒక్కో పథకానికి తగినంత సమయాన్ని కేటాయించడం సాధ్యపడకపోవచ్చు. -
ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!
స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ అనగానే.. ఆహా! లక్షలు సంపాదించవచ్చని చాలామంది భావిస్తారు. అందులో పెట్టుబడి పెట్టేవారు ఒక్కరోజులోనే భారీగా లాభాలు రావాలని ఆశిస్తారు. దాంతో ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్(ఒకరోజులో స్టాక్స్ కొని అదేరోజు అమ్మడం)ను ఎంచుకుంటున్నారు. కానీ అలా ట్రేడింగ్ చేస్తున్న ప్రతి పది మందిలో ఏడుగురు నష్టపోతున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం 2018–19తో పోలిస్తే 2022–23లో ఈక్విటీల్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన వారి సంఖ్య ఏకంగా 300 శాతం పెరిగింది. వీరిలో ఎక్కువ శాతం మంది 30 ఏళ్ల లోపు యువ ట్రేడర్లే ఉన్నారు.ఇంట్రాడే ట్రేడింగ్‌లో లాభపడిన వారితో పోలిస్తే నష్టపోయిన ట్రేడర్లు సగటున అత్యధికంగా లావాదేవీలు చేశారు. వీరి లాభనష్టాల సరళిని విశ్లేషించడానికి సెబీ అధ్యయనం నిర్వహించింది. కరోనా మహమ్మారికి పూర్వం, తర్వాత ట్రెండ్స్‌ను పరిశీలించేందుకు 2018–19, 2019–20, 2022–23 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న రిస్క్‌ల గురించి ట్రేడర్లలో అవగాహన పెంచేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని సెబీ భావిస్తోంది.సెబీ ఇప్పటికే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో ట్రేడర్ల ధోరణులపై అధ్యయనం చేసింది. దీని ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్అండ్ఓలో ట్రేడింగ్ చేసిన వారిలో 89 శాతం మంది నష్టపోయారని చెప్పింది. ఈ నష్ట పరిమాణం సగటున రూ.1.1 లక్షలుగా ఉందని తేలింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 7.1 లక్షలుగా ఉన్న ఎఫ్‌అండ్‌వో ట్రేడర్ల సంఖ్య 500 శాతం ఎగిసి 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 45.24 లక్షలకు పెరిగింది.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!తాజా నివేదికలోని వివరాల ప్రకారం..ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లావాదేవీలు జరిపే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు. 30 ఏళ్ల లోపు వయసున్న ఇంట్రాడే ట్రేడర్ల సంఖ్య 2018–19లో 18 శాతంగా ఉండగా 2022–23లో 48 శాతానికి పెరిగింది. 2022–23లో 71 శాతం మంది (ప్రతి పది మందిలో ఏడుగురు) ఇంట్రాడే ట్రేడర్లు నికరంగా నష్టపోయారు. తరచుగా ట్రేడింగ్ చేసి (ఏడాదికి 500 పైగా ట్రేడ్లు) నష్టపోయిన ట్రేడర్ల సంఖ్య 80 శాతం పెరిగింది. ట్రేడింగ్‌లో నష్టపోవడమే కాకుండా ఆ నష్టాల్లో దాదాపు సగభాగం (57 శాతం) ట్రేడింగ్ ఖర్చుల రూపంలో సమర్పించుకున్నారు. ఇక నష్టపోయిన వారిలో అత్యధికులు (76 శాతం) యువ ట్రేడర్లే ఉండటం గమనార్హం. -
తాత చేసిన పని.. 30 ఏళ్ల తర్వాత ఎగిరి గంతేసిన మనువడు
మనలో చాలా మంది..నేను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా? కోటీశ్వరుణ్ణి కాకపోతానా? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే అలా ధనవంతులు కావాలంటే లక్షలు కావాల్సిన పనిలేదు. వందల్లో పొదుపు చేసినా అది ధనవంతుల్ని చేస్తుందని నిజం చేశారు ఓ పెద్దాయన. కేవలం రూ.500 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ.3.75 లక్షలుగా మారడంతో మనవుడు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. చండీగఢ్‌కు చెందిన తన్మయ్ మోతీవాలా పీడియాట్రిక్ సర్జన్‌గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే ఓ రోజు తన ఇంటిని సర్ధుతుండగా తాత వినియోగించిన ఓ ట్రంక్ పెట్ట మోతీవాలా కంటపడింది. అందులో ఏమున్నాయా? అని తెరిచి చూశాడు. అంతే అప్పుడే తాత పెట్టిన పెట్టుబడి చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. అయితే ఆ ట్రంక్ పెట్టెలో 1994లో తన తాత రూ. 500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేసినట్లు, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను షేర్ చేశారు. తన తాత షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అమ్మలేదని తర్వాత గుర్తించాడు. ఆ రూ.500 పెట్టబడితో వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆరా తీశారు. 1994లో ఒక్కో షేర్ రూ.10 చొప్పున రూ.500కి మొత్తం 50 షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ మొత్తం షేర్ల విలువ రూ.3.75లక్షలకు చేరింది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన మొత్తం 750 శాతంతో రిటర్న్స్ వచ్చాయని డాక్టర్ మోతీవాలా వెల్లడించారు. The power of holding equity 😊 My Grand parents had purchased SBI shares worth 500 Rs in 1994. They had forgotten about it. Infact they had no idea why they purchased it and if they even hold it. I found some such certificates while consolidating family's holdings in a… pic.twitter.com/GdO7qAJXXL — Dr. Tanmay Motiwala (@Least_ordinary) March 28, 2024 -
బిజినెస్: నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, అధిక వెయిటేజీ రిలయన్స్(1.25%), ఐటీసీ(1.50%), ఎస్బీఐ(2%) షేర్లు రాణించడంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. అయితే రూపాయి క్షీణత, చిన్న కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీల భారీ లాభాలకు అడ్డుకట్టవేశాయి. తొలిసెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ట్రేడింగ్‌లో 729 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 90 పాయింట్ల లాభంతో 72,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 71,674 కనిష్టాన్ని, 72,403 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 221 పాయింట్ల రేంజ్లో 21,931 వద్ద గరిష్టాన్ని, 21,710 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పెరిగి 21,839 వద్ద నిలిచింది. రెండు నెలల కనిష్టానికి రూపాయి.. డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 83.19 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయి రెండు నెలల కనిష్టం. ట్రస్ట్ ఫిన్‌టెక్ @ రూ.95–101 సాస్ ప్రొడక్ట్ ఆధారిత ఫిన్‌టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే ట్రస్ట్ ఫిన్‌టెక్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 95–101 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది.ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 63 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఇవి చదవండి: ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
ఫలితాలు ఎలా ఉన్నా ఇవి మాత్రం..
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్‌ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. మన పోర్ట్‌ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్‌ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది. కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్‌ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు. గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్‌లుక్‌ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు. ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇదీ చదవండి: ఈసారైనా సెక్షన్ 80సీకు మోక్షం లభిస్తుందా..? ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్‌ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి. -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పుంజుకున్న దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:16కు నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 21,747 వద్దకు చేరింది. సెన్సెక్స్ 87 పాయింట్లు పుంజుకుని 72,113 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లోనే ఉన్నాయి. యూరప్మార్కెట్లు కొంత నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎఫ్ఐఐలు రూ.1696 కోట్లు విలువైన షేర్లు స్టాక్మార్కెట్లో కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.3497 కోట్ల విలువైన షేర్లు మార్కెట్‌నుంచి విక్రయించారు. ఇటీవల వెలువడిన యూఎస్ జాబ్స్ డేటా ప్రకారం మార్కెట్ ఊహించిన 1,70,000 ఉద్యోగాలకు బదులుగా 2,16,000 ఉద్యోగాలు పెరిగాయి. లేబర్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఫెడ్ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మరింత సమయం తీసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్‌ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే..
స్టాక్మార్కెట్లో మదుపుదారులకు ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరమూ సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ 50లోని 27 షేర్లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. 40కి పైగా కంపెనీలు 10-100 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవారికి, ఇతర పెట్టుబడిదారులకు ఐపీఓలు లిస్ట్ అయిన తొలిరోజే మంచి లాభాలను తీసుకొచ్చాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లు కాస్త నష్టాల్లోకి వెళ్లినా తరువాత భారీగా రాణించాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో గతంలో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 4, 3 శాతమే రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఏప్రిల్ నుంచి సూచీలు పుంజుకున్నాయి. ర్యాలీకి కారణాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇవ్వడం, ముడి చమురు ధరలు వేగంగా తగ్గడంతో, రెండు నెలల పాటు బాగా రాణించిన సూచీలు ప్రథమార్ధాన్ని 6 శాతం పైగా లాభాలతో ముగించాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 7.6% వృద్ధి నమోదైంది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు బలంగా కొనసాగడం, 2024లో రేట్ల కోతకు అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం ఇందుకు దోహదం చేసింది. ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ.. చరిత్రలోనే తొలిసారిగా డిసెంబరు 6వ తేదీన 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటేసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.81.90 లక్షల కోట్లు పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. జూన్‌లో నిఫ్టీ సూచీ 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, ఈనెల 8న 21,000 పాయింట్లకు చేరింది. డిసెంబరు 28న ఆల్‌టైం గరిష్ఠస్థాయి అయిన 21,801.45ను చేరింది. సెన్సెక్స్ జూన్‌లో 64,000 పాయింట్లను అధిగమించింది. జులైలో 67,000ను తాకింది. నవంబరు, ఈనెల 28నలో ఏకంగా 8000 పాయింట్లకుపైగా ర్యాలీ అయి 72,484.34 వద్ద జీవనకాల రికార్డు గరిష్ఠాన్ని చేరింది. ఏడాది మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్ 19% మేర లాభాలను అందించాయి. 2024లో ఎలా ఉండబోతుందంటే.. వచ్చే ఏడాది స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడడానికి పెద్దగా అవకాశాలను ఈ ఏడాది మిగల్చలేదని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి మహా అయితే 8-10% రాణించొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదించింది. ఎన్నికల ముందు ర్యాలీ కారణంగా వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు సానుకూలంగా ఉండొచ్చు. ఇదీ చదవండి: ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..? ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటనలు వచ్చాకే స్టాక్ మార్కెట్ దిశపై ఒక అంచనాకు రాగలమని బ్రోకరేజీలు అంటున్నాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన భారత స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 0.50% తగ్గి 64,933.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 0.42% కుంగి 19,443.50 వద్ద ముగిసింది. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. యూఎస్ క్రెడిట్ రేటింగ్ ఔట్‌లుక్‌ను మూడీస్ స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు మార్చింది. ఈ నేపథ్యంలో అక్కడి మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఐరోపా సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఆసియా- పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దేశీయంగా ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.261 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.822 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. సెన్సెక్స్ 30లో ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, టాటా మోటార్స్ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దీపావళి బలిప్రతిపద సందర్భంగా మంగళవారం(నవంబర్ 14) రోజున దేశీయ స్టాక్‌మార్కెట్లకు సెలవు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
నష్టాల్లోకి వెళ్లడానికే రిస్క్ తీసుకుంటున్న మదుపర్లు!
స్టాక్‌మార్కెట్ మదుపర్లు కొన్నిసార్లు నష్టపోతుంటారు. ఇంకొన్నిసార్లు లాభాల్లో ఉంటారు. కానీ నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్లే స్టాక్లను మాత్రం వెంటనే అమ్ముతుంటారు. నష్టాల్లో ఉన్న స్టాక్లను మాత్రం ఎప్పటికైనా లాభాల్లోకి రాకపోతుందా అని అట్టే పెట్టుకుంటారు. అలా తాత్కాలికంగా నష్టాలు వచ్చే వాటిల్లో బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు ఉంటే ఫరవాలేదు. కానీ సరైన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించకుండా నష్టాలను పోస్ట్ చేస్తున్న కంపెనీలకు చెందిన స్టాక్లను కూడా అలాగే ఉంచుకోవడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా మార్కెట్‌ను గమనిస్తున్న ఆర్థికవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. వారు ప్రతిపాదించిన యుటిలిటీ థియరీ ప్రకారం..మదుపర్లు వివిధ స్వభావాలు కలిగి ఉంటారు. రిస్క్ తీసుకుని కొందరు లాభాల్లోకి వెళితే, మరికొందరు అదే రిస్క్ తీసుకుని నష్టాల్లోకి వెళ్తున్నారు. మొదటి నియమంతో మంచి కంపెనీలు మదుపు చేయడం వల్ల లాభాల్లోకి వెళ్లవచ్చు. ఇదీ చదవండి: బోయింగ్ 777లో సౌకర్యాలు మెరుగుపరిచిన ఎయిర్ ఇండియా కానీ రెండో నియమం ప్రకారం రిస్క్ తీసుకున్నా నష్టాల్లోకి వెళ్లడం ఏమిటనే అనుమానం ఉంటుంది. అయితే కంపెనీపై సరైన అవగాహన, దానికి సంబంధించి ఎలాంటి పరిశోధన చేయకుండా మార్కెట్లో పెట్టుబడి పెట్టి కొందరు నష్టాల్లోకి జారుకుంటారు. కొద్దిగా నష్టాలు ఉన్నపుడు స్టాక్లను అమ్మకుండా రిస్క్ తీసుకుని వాటిని అలాగే తమ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకుంటారు. ఫలితంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా మరింత నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. మదుపు చేసేముందు కంపెనీ పూర్వాపరాలు ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణ, ఫలానా రంగంలోని పోటీలో ఉన్న సంస్థలు, ముడిసరుకు, మార్కెటింగ్, కంపెనీ అప్పులు తదితర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల బాటపట్టాయి. సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై చివరికి భారీ నష్టాలపాలయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 140 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 521 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 366 పాయింట్లు నష్టపోయాయి. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్న వేళ మార్కెట్ నిపుణులు కంపెనీల ఆదాయాలు ప్రతికూలంగా ఉంటాయని అంచనాలు వేసిన వేళ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు భారీ నష్టాలకు దారితీశాయి. బ్యాంకింగ్, పవర్ రంగాల్లోని కంపెనీలు ప్రధానంగా మార్కెట్లను నష్టాలోకి లాగాయి. ఫార్మా స్టాక్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, మారుతీ, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాలతో పయణించాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, విప్రో, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
పెట్టుబడికి సోషల్ రూట్..?
ఇటీవలి స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్ ఖాతాల తీరు). తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్‌లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్ కొనుగోలు చేయాలనే టిప్స్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్ ఇన్వెస్టింగ్. ఆచరణ ముఖ్యం ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్‌కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కంటే నేరుగా స్టాక్స్‌లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్ చేయడం కారణం కావచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీపేశ్ రాఘవ్ వివరించారు. మార్గదర్శిగానే.. ఇన్వెస్టింగ్ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు స్టాక్స్, ట్రేడింగ్ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్‌ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్ చేయలేరు. గుడ్డిగా అనుసరించడం సరికాదు.. కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్‌లో పెట్టుబడులు, ట్రేడింగ్‌కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. వారి పోర్ట్‌ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్‌కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియో, భవిష్యత్ నగదు అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పారుల్ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్‌ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్లో రిస్క్ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే..? ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్ ఇన్వెస్టింగ్ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్ ఇన్వెస్టింగ్ యాప్స్, ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి. సీనియర్ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్‌లు, పోర్ట్‌ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్‌లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్ పోర్ట్‌ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్ ఇన్వెస్టింగ్ పోర్టల్. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్‌ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు. కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్ ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్ విధానాలు, పోర్ట్‌ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్‌కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. నేర్చుకునే మార్గం.. ‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్లైన్లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్ లీలాధర్ రిటైల్ బ్రోకింగ్ సీఈవో సందీప్ రాయ్చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు. సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్‌లో చురుగ్గా ట్రేడింగ్ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్‌లో ట్రేడింగ్ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్ గురించి యూట్యూబ్ చానళ్లు, ట్విట్టర్ పోస్ట్‌లలో టిప్స్ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్‌లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు. ఉత్కర్‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్ ఇన్వెస్టింగ్ ఫోరమ్‌లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్‌పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్‌ల సాయంతో స్టాక్స్ ట్రెండ్స్ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ‘‘మార్కెట్లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్ ఇన్వెస్టింగ్‌ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్‌కేస్ వసంత్ కామత్ వివరించారు. ఒక్క ఉత్కర్‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్‌కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్‌లకు వచ్చే వ్యూస్ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి. -
నిపుణుల అంచనాల తలకిందులు.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ సోమవారం ఉదయం దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఉదయం 9.40 గంటల సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్లు నష్టపోయి 59239 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ఉండగా 76 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆ కంపెనీకి చెందిన అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్ని ముటగట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, ఐసీఐసీ బ్యాంక్, ఎస్బీఐ, నెస్లే, బీపీసీఎల్,కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏసియన్ పెయింట్స్,హెచ్డీఎఫ్సీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, బ్రిటానియా షేర్లు పాజిటీవ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో,యూపీఎల్,ఇన్ఫోసిస్,ఎథేర్ మోటార్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎయిర్టెల్,హెచ్‌సీఎల్,టెక్ మహీంద్రా, విప్రో,టీసీఎస్, హీరో మోటో కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
ముఖేష్ అంబానీ అదిరిపోయే ప్లాన్! రూ.19 లక్షల కోట్లకు రిలయన్స్ కంపెనీ వ్యాల్యూ!
ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ జోరు చూపుతోంది. తాజాగా బుధవారం ట్రేడింగ్‌లో తొలుత 1.9 శాతం పుంజుకుంది. కొత్త గరిష్టం రూ. 2,827ను తాకింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. 19 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి రూ. 19,12,814 కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ దిగ్గజంగా ఆర్ఐఎల్ చరిత్ర సృష్టించింది. చివరికి రూ. 2,778 వద్ద షేరు ముగియడంతో మార్కెట్ విలువ రూ. 18,79,237 కోట్ల వద్ద స్థిరపడింది. జోరు తీరిలా ►ఈ ఏడాది(2022) మార్చిలో ఆర్ఐఎల్ మార్కెట్ విలువ తొలిసారి రూ. 18 లక్షల కోట్లను దాటింది. ►గతేడాది(2021) అక్టోబర్ 13న రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 17 లక్షల కోట్లను అధిగమించింది. ►దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ యూఏఈలో టాజిజ్ కెమికల్ భాగస్వామ్య సంస్థలో 2 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌లో షేరు మరోసారి బలపడింది. వెరసి ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 17.3 శాతం ర్యాలీ చేసింది. ►ఓవైపు ముడిచమురు ధరలు ఊపందుకోవడంతో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మరింత బలపడనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. మరోపక్క ప్రపంచ భౌగోళిక, రాజకీయ అస్థిర వాతావరణంలోనూ టెలికం బిజినెస్ స్థిరంగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇక రిటైల్ బిజినెస్‌లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు సహకారంపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. ఇటీవల పునరుత్పాదక ఇంధన బిజినెస్‌వైపు భారీ ప్రణాళికలు వేయడం కూడా కంపెనీకి బలాన్నిస్తున్నట్లు వివరించారు. చదవండి👉అదానీనా మజాకానా.. ముఖేష్ అంబానీకి భారీ షాక్..! -
స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను! ఈ వారం మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా స్టాక్ సూచీలు ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. కోవిడ్ కేసులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలపై ఇన్వెస్టర్లు కన్నేయొచ్చని తెలిపారు. ‘‘జాతీయ, అంతర్జాతీయంగానూ సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. ద్రవ్య పాలసీపై ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరిని కలిగింది. బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆగడం లేదు. క్రూడాయిల్ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల వరుస విక్రయాలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపొచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి సాంకేతికంగా 17,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 16,800 వద్ద మద్దతు లభించొచ్చు. స్వల్పకాలంలో మార్కెట్ స్థిరీకరించుకునే అవకాశాలు ఎక్కువ’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచనుందనే ఆందోళనలతో గతవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. వారం మొత్తంగా 1,142 పాయింట్లు, నిఫ్టీ 304 పాయింట్లు చొప్పున క్షీణించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు... కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ ఐసీఐసీఐ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 గణాంకాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక వారంలో సుమారు 160కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, విప్రో, మారుతీ సుజుకీ, ఆల్ట్రాటెక్ సిమెంట్స్ మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ద్రవ్యోల్బణం, బాండ్లపై రాబడులు అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఈక్విటీ మార్కెట్లను కలవరపెడుతోంది. ఇప్పటికే అమెరికాతో సహా బ్రిటన్, భారత్‌లో ద్రవ్యోల్బణ రికార్డు స్థాయికి చేరినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆయా దేశాల్లో ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు ఉలికిపడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఏప్రిల్‌లో రూ.15,867 కోట్ల షేర్లను, ఈ ఏడాది మొత్తంగా ఇప్పటికి వరకు రూ.1,32,529 కోట్ల షేర్లను విక్రయించారు. రెండు ఐపీవోలు.. ఈ వారంలో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఫుట్‌వేర్ కంపెనీ క్యాంపస్ యాక్టివ్‌వేర్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(ఈ నెల 26న) ప్రారంభం అవుతుంది. ఇష్యూ గురువారం ముగిస్తుంది. మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్ చెయిన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపీవో ఏప్రిల్ 27న(బుధవారం) ప్రారంభమై 29న(శుక్రవారం) ముగుయనుంది. దీని ద్వారా సంస్థ రూ. 2,000 కోట్లు సమీకరించనుంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఏప్రిల్ 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఏప్రిల్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మార్చిలో పీనోట్ పెట్టుబడులు: 87,979 పార్టిసిపేటరీ(పీ) నోట్ల ద్వారా దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు గత నెలలో రూ. 87,979 కోట్లకు క్షీణించాయి. ఫిబ్రవరిలో ఇవి రూ. 89,143 కోట్లుగా నమోదయ్యాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో రానున్న నెలల్లో లిక్విడిటీ తగ్గనుందని, దీంతో పీనోట్ల ద్వారా పెట్టుబడులపై ఒత్తిడి పెరగనుందని సెబీ రిజిస్టర్డ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసుల సంస్థ గ్రీన్ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలియజేశారు. అయితే ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు భారత్‌తో వాణిజ్య భాగస్వామ్యాలకు ఆసక్తి చూపిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఇన్వెస్టర్లకు రిజిస్టర్డ్ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేస్తుంటారు. తద్వారా దేశీ స్టాక్ మార్కెట్లలో గ్లోబల్ ఇన్వెస్టర్లు రిజిస్టర్‌కాకుండానే ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీనోట్ల ద్వారా మార్చి చివరికల్లా రూ. 87,979 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. -
Warren Buffett: మీకిదే నా సలహా..ఇలా చేస్తే జాబ్, మంచి ఫ్యూచర్ ఉంటుంది!
వారెన్ బఫెట్ పైనుంచి దిగిరాలేదు. గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు. ఆయన వెనుక గాఢ్ ఫాదర్ ఎవరూ లేరు. కటిక పేదరికాన్ని చూశారు. ఆకలి కేకలు పెట్టారు. అన్నమో రామచంద్రా అని ఏడ్చారు. పేదరికంతో బాధపడ్డారు. అంతే. అంతవరకే పేదరికాన్ని తిడుతూ కూర్చోలేదు. అవకాశాల్ని వెతుక్కున్నారు. అవకాశాలు లేని చోట దాన్ని సృష్టించుకున్నారు. ఒక్కో క్షణాన్ని కరెన్సీ నోటుగా మార్చడం తెలుసుకున్నారు. ఇలా 91ఏళ్ల వయస్సులో 117 బిలియన్ల (రూ. 8.97 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన బెర్క్‌షైర్ హాత్వేకి ఛైర్మన్, సీఈఓగా ఉన్న బఫెట్ అప్పుడప్పుడు యువతకు ఉపయోగపడేలా సలహాలు ఇస్తుంటారు. తాజాగా తన షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. అందులో యువత జాబ్‌తో మంచి ఫ్యూచర్ ఎలా పొందవచ్చో తెలిపారు. కంపెనీ షేర్హోల్డర్లకు తన తాజా వార్షిక లేఖలో ..బఫెట్ తన సుదీర్ఘ కెరీర్లో పనిని ఆస్వాదించినట్లు చెప్పారు. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు పలు అంశాలను గుర్తుంచుకోవాలని చెప్పారు. డబ్బులు కోసం ఎప్పుడూ పని చేయకండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి. అలా చేస్తే మీకు కావాల్సిన డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఒకవేళ డబ్బులు ఎక్కువగా వస్తున్న జాబ్‌లో మీరు జాయిన్ అయితే.. డబ్బులు వస్తున్నాయి. కాబట్టి పనిని ఎంజాయ్ చేయలేరు. ఉన్న జాబ్‌ను కూడా సక్రమంగా చేయలేరు. అందుకే మంచి భవిష్యత్ కావాలంటే పనని ఎంజాయ్ చేయాలని సూచించారు. బఫెట్ ఏం చేశారు. బఫెట్ తన తాత ముంగెర్కు చెందిన కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించారు. అయితే బఫెట్‌కు ఆ పని నచ్చకపోవడంతో సెక్యూరిటీలను విక్రయించే వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బఫెట్ తాత ముంగెర్ లాయర్ వృత్తిని ప్రారంభించారు. అలా 1965లో ఇద్దరూ కంపెనీ నిర్వహణ, ఆర్థిక విధానాలను నియంత్రించేలా బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ కంట్రోల్ స్టేక్‌ను కొనుగోలు చేశారు. జనరల్ మోటార్స్, కోకా కోలా కంపెనీ,యాపిల్ వంటి మెగా కంపెనీలలో 700 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్, హోల్డింగ్లతో ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగారు. చదవండి: గేట్స్ ఫౌండేషన్‌కు బఫెట్ రాజీనామా -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుపడింది!!వందల కోట్ల పెట్టుబడులు షురూ!
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా రియల్టీ రంగ కంపెనీ డీబీ రియల్టీలో ఇన్వెస్ట్ చేయనున్నారు. భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రేర్ ఇన్వెస్ట్మెంట్స్ సైతం కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నారు. రుణరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు వీలుగా వారంట్ల జారీ ద్వారా రూ.1,575 కోట్లు సమీకరించనున్నట్లు డీబీ రియల్టీ వెల్లడించింది. ప్రమోటర్ గ్రూప్‌సహా ఇతర ఇన్వెస్టర్లకు దశలవారీగా ఈక్విటీ షేర్లుగా మార్పిడయ్యే 12.7 కోట్ల వారంట్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇటీవలే డీబీ రియల్టీలో రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనకు స్వస్తి నేపథ్యంలో రాకేష్ కుటుంబ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. -
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా ? క్యూ 3లో లిస్టింగ్ కంపెనీల రిజల్ట్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌పై సామాన్యులకు ఆసక్తి పెరిగింది. రాబడుల కోసం షేర్ మార్కెట్‌వైపు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా కంపెనీల పనితీరు తెలుసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్నాయి. అందులో కొన్ని లిస్టింగ్ కంపెనీల పనితీరు వివరాలు ఇలా ఉన్నాయి. పిరమల్... వీక్ స్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం పిరమల్ ఎంటర్ప్రైజెస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 426 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 628 కోట్లు ఆర్జించింది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం ప్రధానంగా ఫలితాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫార్మా విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు అక్టోబర్‌లో బోర్డు అనుమతించినట్లు కంపెనీ వివరించింది. ఫార్మా జోరు ఫార్మా విభాగం ఆదాయం రూ. 1,441 కోట్ల నుంచి రూ. 1,621 కోట్లకు ఎగసింది. ఫైనాన్షియల్ సర్వీసుల అమ్మకాలు మాత్రం రూ. 1,861 కోట్ల నుంచి రూ. 1,484 కోట్లకు తగ్గాయి. డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలు లావాదేవీకి రూ. 143 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రూ. 153 కోట్లమేర అనుకోని వ్యయాలు నమోదైనట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 2,714 వద్ద ముగిసింది. గోద్రెజ్ కన్జూమర్... ప్లస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 479 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 458 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు మరింత వృద్ధితో 9 శాతం ఎగసి రూ. 3,144 కోట్లకు చేరాయి. అయితే మొత్తం వ్యయాలు సైతం 11 శాతం పెరిగి రూ. 2,579 కోట్లను తాకాయి. దేశీ బిజినెస్ 9 శాతంపైగా వృద్ధితో రూ. 1,838 కోట్లను అధిగమించగా.. ఇండొనేసియా మార్కెట్ నుంచి ఆదాయం యథాతథంగా రూ. 445 కోట్లుగా నమోదైంది. ఆఫ్రికా నుంచి అమ్మకాలు 15 శాతం జంప్‌చేసి రూ. 748 కోట్లను దాటాయి. ఇతర మార్కెట్ల నుంచి మాత్రం ఆదాయం 4 శాతం నీరసించి రూ. 174 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 2.5% నష్టంతో రూ. 953 వద్ద ముగిసింది. బజాజ్ హిందుస్తాన్... నష్టాలు తగ్గాయ్ ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో షుగర్ తయారీ కంపెనీ బజాజ్ హిందుస్తాన్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం 29 శాతం తగ్గి రూ. 113 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 160 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం క్షీణించి రూ. 1,344 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,570 కోట్ల ఆదాయం సాధిం చింది. ప్రభుత్వ రంగ సంస్థ పీఎన్బీకి చెందిన రమణి రంజన్ మిశ్రాను నామినీ డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు బజాజ్ హిందుస్తాన్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ హిందుస్తాన్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 14.7 వద్ద ముగిసింది. ఐబీ హౌసింగ్ లాభం... డౌన్ ముంబై: మార్టిగేజ్ కంపెనీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2) లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 286 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 323 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో ఇతర సంస్థలతో ఒప్పందాల నేపథ్యంలో రూ. 325 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని డిసెంబర్‌కల్లా రూ. 500 కోట్లకు, 2022 మార్చికల్లా రూ. 800 కోట్లకు పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. రిటైల్ రుణాల విడుదలకు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితరాలతో చేతులు కలిపినట్లు పేర్కొంది. క్యూ2లో స్థూల ఎన్పీఏలు 2.21 శాతం నుంచి 2.69 శాతానికి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 3.4% పతనమై రూ. 237 వద్ద ముగిసింది. ఆర్సెలర్ మిట్టల్... టర్న్ఎరౌంట్ గ్లోబల్ స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఈ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ3)లో 462.1 కోట్ల డాలర్ల(రూ. 34,430 కోట్లు) నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020) ఇదే కాలంలో 26.1 కోట్ల డాలర్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 13.3 బిలియన్ డాలర్ల నుంచి 20.2 బిలియన్ డాలర్లకు జంప్‌చేసింది. స్థూల రుణభారం బిలియన్ డాలర్లు తగ్గి 8.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో షిప్‌మెంట్స్ 17.5 మిలియన్ టన్నుల నుంచి తగ్గి 14.6 ఎంటీకి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా ఆటోమోటివ్ రంగం నుంచి బలహీనపడిన డిమాండ్, ఉత్పత్తి సమస్యలు, ఎగుమతులకు ఆర్డర్లు ఆలస్యంకావడం వంటి అంశాలు కారణమైనట్లు కంపెనీ తెలియజేసింది. ధరలు బలపడటంతో క్యూ3లో పటిష్ట ఫలితాలు సాధించినట్లు ఆర్సెలర్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. దీంతో అత్యధిక లాభాలు ఆర్జించడమేకాకుండా 2008 తదుపరి కనిష్ట నికర రుణ భారాన్ని నమోదు చేసినట్లు వెల్లడించారు. మోర్పెన్ ల్యాబ్స్... జూమ్ హెల్త్‌కేర్ రంగ కంపెనీ మోర్పెన్ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 38 శాతం వృద్ధితో రూ. 37 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 340 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు ఎగసింది. ఏపీఐలకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్, చైనా నుంచి సరఫరాలకు అంతరాయాలు ఏర్పడటం వంటి అంశాల నేపథ్యంలో విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సుశీల్ సూరి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో మోర్పెన్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.25 శాతం ఎగసి రూ. 52.5 వద్ద ముగిసింది. జీవోసీఎల్‌కు రూ.23 కోట్ల నష్టం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవోసీఎల్ కార్పొరేషన్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.23 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 24 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవర్ రూ. 132 కోట్ల నుంచి రూ. 146 కోట్లకు చేరింది. ఆర్డర్ బుక్ రూ.946 కోట్లు ఉందని జీవోసీఎల్ కార్పొరేషన్ ప్రకటించింది. చదవండి: ఈ షేర్లు... తారాజువ్వలు! -
Stock Market: కరెక్షన్ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా కరెక్షన్ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు(గురువారం) ముగింపుతో పాటు ఈ వారంలో సుమారు 700కి పైగా కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు. సూచీల గమనాన్ని ప్రపంచ పరిణామాలు నిర్ధేశిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా కేసుల నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు తదితర అంశాలూ ట్రేడింగ్ పై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 40,000 స్థాయిని అధిగమించింది. అనేక బ్యాంకులు ఈ వారంలో రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో కరెక్షన్(దిద్దుబాటు) కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పతనం కొనసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 18,050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువస్థాయిలో 18,300–18,350 శ్రేణిలో వద్ద బలమైన నిరోధం ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. వరుస నాలుగు రోజుల పతనంతో గతవారం సెన్సెక్స్ 483 పాయింట్లు నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి. క్యూ2 ఫలితాల జాబితా... సూచీలు ముందుగా గత శుక్రవారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, శనివారం వెల్లడైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలపై స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో నిఫ్టీ–50 ఇండెక్స్‌లోని షేర్లకు చెందిన 20 కంపెనీలతో సహా సుమారు 700కు పైగా కార్పొరేట్లు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ తదితర కంపెనీలున్నాయి. ఈ వారంలో రెండు ఐపీఓలు... బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్స్ ఈ వారం పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ) ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. ఫినోటెక్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 29న(శుక్రవారం) ప్రారంభమై.., నవంబర్ 2న ముగుస్తుంది. ధర శ్రేణిని కంపెనీ ఈ వారంలో ప్రకటించనుంది. ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్... గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు భిన్నంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ ఈక్విటీల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(అక్టోబర్ 24)ఎఫ్‌పీఐలు రూ. 3,825 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,331 కోట్ల షేర్లను అమ్మగా., డెట్ మార్కెట్లో రూ.1,494 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ షేర్ల పట్ల బేరిష్ వైఖరి కలిగి ఉన్నారు. బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ ఏడాది తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,406 కోట్ల ఐటీ షేర్లను విక్రయించారు. సాధ్యమైనంత తొందర్లో ట్యాపరింగ్ చర్యలను చేపట్టడంతో పాటు కీలక వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్ వ్యాఖ్యలతో విదేశీ ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. 28 నుంచి నైకా ఐపీవో షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125 సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 1న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 630 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 4,19,72,660 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. కార్యకలాపాల విస్తరణకు, కొత్త రిటైల్ స్టోర్లు.. గిడ్డంగుల ఏర్పాటు కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అలాగే కొంత రుణాన్ని తీర్చడం ద్వారా వడ్డీ వ్యయాలను తగ్గించుకుని, లాభదాయకతను మెరుగుపర్చుకోనుంది. -
Stock Market: లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్.. గురువారం ఉదయం లాభాలతో మొదలై.. స్వల్ఫ నష్టాలు, ఆపై స్వల్ఫ లాభల దిశగా ట్రేడ్ అవుతోంది. వరుస రికార్డులను నమోదుచేసిన దేశీ సూచీలకు మంగళవారం రోజున బ్రేక్ పడిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఇదే ట్రెండ్ మార్కెట్లో కొనసాగింది. అయితే గురువారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు మరోసారి సరికొత్త గరిష్టాలను టచ్ చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లు లాభపడి 61,329 పాయింట్ల వద్ద ట్రేడయ్యింది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 18,297 వద్దకు చేరుకుంది. కానీ, కాసేపటికే సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ఫ నష్టాలను చవిచూశాయి. ఆ వెంటనే స్వల్ఫంగా లాభపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 61,271.07 , నిఫ్టీ 18,282.00 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఎనర్జీ బెస్ట్ సెక్టార్‌గా, నిఫ్టీ సెక్టార్ వరస్ట్ సెక్టార్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ మీద మార్కెట్ ఫోకస్ నడుస్తోంది. ఓఎన్జీసీ భారీగా లాభపడగా, ఐవోసీ, టాటా మోటర్స్, బీపీసీఎల్, టాటా కన్జూమర్ ఉత్పత్తులు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ తరపున సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, కొటాక్ బ్యాంక్, రిలయన్స్, మారుతీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా.. ఏషియన్ పెయింట్, టైటాన్, బజాజ్ ఆటో, టీసీఎస్, టెక్ఎం, భారతీఎయిర్‌టెల్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. చదవండి: మార్కెట్లో చెన్నై సూపర్ కింగ్స్ హవా