దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 25,095కు చేరింది. సెన్సెక్స్ 285 పాయింట్లు పుంజుకుని 81,958 వద్ద ట్రేడవుతోంది. గడిచిన సెషన్‌ల్లో మార్కెట్‌లు నష్టాలపాలయ్యాయి. సోమవారం కొంత పుంజుకుని లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 102.52 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.97 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.9 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.22 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి ఆరు మార్పులు ఇవే..
భవిష్యత్తులో అంతర్జాతీయ అనిశ్చితులు దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికలు ముగిసే వరకు ఈ యుద్ధ భయాలు ఉండవచ్చని అంచనా. ముడిచమురు ధరలు మరింత పెరిగే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ నెల 9న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మార్కెట్‌కు కీలకంగా మారనున్నాయి. గతంలో ఆర్‌బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం కీలక వడ్డీరేట్లను వెంటనే తగ్గించబోమనే సంకేతాలు వెలువరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి కంపెనీలు ఆర్థిక ఫలితాలను త్వరలో ప్రకటించనున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment