Today Stock Market
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు లాభపడి 23,416కు చేరింది. సెన్సెక్స్(Sensex) 92 పాయింట్లు ఎగబాకి 77,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 80.07 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే ఎలాంటి మార్పు చెందలేదు. నాస్డాక్ 1 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ముగిశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 454 పాయింట్లు లేదా 0.59 శాతం లాభపడి 77,073.44 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,584.84- 77,318.94 రేంజ్లో ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈ (Nifty) నిఫ్టీ 50 కూడా 141 పాయింట్లు లేదా 0.61 శాతం లాభంతో 23,344.75 వద్ద గ్రీన్ జోన్లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.10 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,170.65 వద్ద ఉంది.కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టిపిసి, ఎస్బిఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్, బిపిసిఎల్ నేతృత్వంలోని లాభాలతో నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 29 సానుకూలంగా ముగిశాయి. దీనికి విరుద్ధంగా ఎస్బీఐ లైఫ్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు నష్టపోయి 23,194కు చేరింది. సెన్సెక్స్(Sensex) 16 పాయింట్లు ఎగబాకి 76,663 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.19 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్(Crude Oil) ధర 80.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి నేడు(20న) తెరలేవనుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనుండటంతో కొంతకాలంగా వాణిజ్య వర్గాలు అధికంగా ప్రభావితం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాణిజ్యంతోపాటు ఫైనాన్షియల్ మార్కెట్లపైనా ట్రంప్ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు మరోపక్క ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల విజయ పరంపరకు బ్రేక్ వేస్తూ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వారంలో చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 403.24 పాయింట్లు లేదా 0.52 శాతం క్షీణించి 76,639.58 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 77,069.19-76,263.29 రేంజ్లో ట్రేడయింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 108.60 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 23,203.20 వద్ద ముగిసింది. నిఫ్టీ50 23,292.10 వద్ద గరిష్ట స్థాయికి చేరుకోగా, రోజు కనిష్ట స్థాయి 23,100.35 వద్ద నమోదైంది. నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బిపిసిఎల్, హిందాల్కో, హిందాల్కో, కోల్ ఇండియా నేతృత్వంలోని 29 లాభాలతో గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో వంటి 21 షేర్లు నష్టాల్లో ముగిసి 5.75 శాతం వరకు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 66 పాయింట్లు నష్టపోయి 23,249కు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు దిగజారి 76,761 వద్ద ట్రేడవుతోంది. దాంతో గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయింది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.98 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.21 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.89 శాతం దిగజారింది.ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ హ్యాట్రిక్
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 గురువారం వరుసగా మూడవ సెషన్లో సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 318.74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 77,042.82 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 77,319.50 నుండి 76,895.51 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 98.60 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 23,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.65కి చేరుకోగా, కనిష్ట స్థాయి 23,272.05 వద్ద నమోదైంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ , అదానీ పోర్ట్స్ ఈరోజు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. వీటి లాభాలు 7.99 శాతం వరకు పెరగడంతో నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 33 గ్రీన్‌లో ముగిశాయి.మరోవైపు ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ నేతృత్వంలోని 17 భాగస్వామ్య స్టాక్‌లు 2.90 శాతం వరకు క్షీణించి నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 1 శాతంపైగా పెరగడంతో విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. ఇదిలా ఉండగా, మార్కెట్ అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ 1.35 శాతం పెరిగి 15.17 పాయింట్ల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకుంటున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు లాభపడి 23,320కు చేరింది. సెన్సెక్స్(Sensex) 285 పాయింట్లు ఎగబాకి 77,006 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.04 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.34 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.83 శాతం లాభపడింది. నాస్డాక్ 2.45 శాతం ఎగబాకింది.రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 273.66 పాయిట్లు లేదా 0.36 శాతం లాభంతో.. 76,773.30 వద్ద, నిఫ్టీ 51.75 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 23,227.80 వద్ద నిలిచాయి.ట్రెంట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు లాభపడి 23,229కు చేరింది. సెన్సెక్స్(Sensex) 252 పాయింట్లు ఎగబాకి 76,767 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 109.23 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం లాభపడింది. నాస్డాక్ 0.2 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్‌లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్‌లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 169.62 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 76,499.63 వద్ద, నిఫ్టీ 121.65 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,207.60 వద్ద నిలిచాయి.అదానీ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు లాభపడి 23,221కు చేరింది. సెన్సెక్స్(Sensex) 418 పాయింట్లు ఎగబాకి 76,741 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.65 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.76 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.38 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ ఖాళీరూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్‌లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్‌లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమూ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలూ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1,049 పాయింట్లు క్షీణించి 76,330 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 23,086 వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,129 పాయింట్లు క్షీణించి 76,250, నిఫ్టీ 384 పాయింట్లు పతనమై 23,047 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ద్రవ్యల్బోణం పెరగొచ్చనే ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.మార్కెట్లో మరిన్ని సంగతులుఅధిక వాల్యుయేషన్లు, వృద్ధిపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను భారీగా విక్రయించారు. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 4.17%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4.14 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3,562 కంపెనీల షేర్లలో 2,876 షేర్లు నష్టపోగా, 508 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకింది. సూచీల వారీగా బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 6.50% అత్యధికంగా పతనమైంది. యుటిలిటీ 4.50%, సర్వీసెస్ 4.35% చొప్పున పడ్డాయి.4 రోజుల్లో 24.7 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా నాలుగు రోజుల్లో రూ.24.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.12.61 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.417.05 లక్షల కోట్ల(4.82 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. అమెరికా డిసెంబర్ వ్యవసాయేతర ఉద్యోగాలు (2.56 లక్షలు) అంచనాలను మించాయి. నిరుద్యోగ రేటు 4.2% నుంచి 4.1 శాతానికి దిగివచ్చింది. అధిక ఉద్యోగాల నియామకంతో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు తలెత్తాయి. ద్రవ్యోల్బణం పెరగొచ్చనే ఆందోళనలు మెదలయ్యాయి. బాండ్లపై రాబడులు 14 ఏళ్ల గరిష్టం 4.79% భారీగా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఈక్విటీల్లోంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు.భారత్, చైనాకు చౌకగా చమురును అందిస్తున్న రష్యా క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారత్ దిగుమతి చేసుకొనే బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.5% పెరిగి 81.67 స్థాయికి చేరింది. తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకొనే భారత్‌కు అధిక ధరలు నష్టదాయకం. పెరిగిన దిగుమతుల బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగించాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతానికి పరిమితమవుతుందని కేంద్రం ముందస్తు అంచనా వేసింది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు 2024–25 ఏడాది కార్పొరేట్ ఆదాయాలు ఒక అంకె వృద్ధికే పరిమితం కావచ్చని చెబుతున్నాయి. కార్పొరేటు ఆదాయాలు, జీడీపీ వృద్ధి అంచనాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. -
అంతర్జాతీయ పరిణామాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడిదొడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్ ఈల్డ్‌లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టాలను చేరుతోంది.ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులుసెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండ్స్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, టైటాన్ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ క్షీణించాయి. శుక్రవారం వారాన్ని ప్రతికూల నోట్‌తో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ (Sensex) 241.30 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 77,378.91 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 77,099.55 - 77,919.70 రేంజ్లో ట్రేడయింది.ఇక ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 (Nifty) 95 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,431.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,596.60 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,426.55 వద్ద ఉంది.శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్ నేతృత్వంలోని నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 36 నష్టాలతో ముగిశాయి. మరోవైపు టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ 6 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిసిన 14 స్టాక్‌లలో ఉన్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 2.08 శాతం నష్టంతో 54,585.75 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 2.61 శాతం నష్టాలతో 17,645.55 వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలు.. నిఫ్టీ@23,440
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు నష్టపోయి 23,448కు చేరింది. సెన్సెక్స్(Sensex) 229 పాయింట్లు దిగజారి 77,395 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 77.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతమార్కెట్ రేటింగ్‌కు హెచ్ఎస్బీసీ కోత..అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ(HSBC).. భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కి తగ్గించింది. కార్పొరేట్ ఆదాయాలు నెమ్మదించడం, అధిక వాల్యుయేషన్లు ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025)గానూ నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను గణనీయంగా 15% నుంచి 5%కి తగ్గించింది. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 85,990 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. గురువారం సెన్సెక్స్ ముగింపు (77,620)తో పోలిస్తే 10% మాత్రమే అధికం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 528.28 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 77,620.21 వద్ద, నిఫ్టీ 162.45 పాయింట్లు లేదా 0.69 శాతం నష్టంతో 23,526.50వద్ద నిలిచాయి.బజాజ్ ఆటో, నెస్లే ఇండియా (Nestle India), హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), కోల్ ఇండియా, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు నష్టపోయి 23,602కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు దిగజారి 77,890 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.68 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 50.62 పాయింట్లు లేదా 0.065 శాతం నష్టంతో 78,148.49 వద్ద, నిఫ్టీ 18.95 పాయింట్లు లేదా 0.080 శాతం నష్టంతో 23,688.95 వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ వంటివి టాప్ గెయిన్ర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు నష్టపోయి 23,628కు చేరింది. సెన్సెక్స్(Sensex) 289 పాయింట్లు దిగజారి 77,910 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు(stock market) గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.1 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.9 శాతం దిగజారింది.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.69 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 177.70 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 78,142.69 పాయిట్ల వద్ద, నిఫ్టీ 81.20 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,697.25 వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, ట్రెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 157 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్(Sensex) 435 పాయింట్లు ఎగబాకి 78,414 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 1.2 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 720.60 పాయింట్లు లేదా 0.90 శాతం క్షీణించి 79,223.11 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 80,072.99 నుండి 79,147.32 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక నిఫ్టీ50 183.90 పాయింట్లు లేదా 0.76 శాతం నష్టంతో 24,004.75 వద్ద రెడ్‌లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,196.45 వద్ద, కనిష్ట స్థాయి 23,978.15 వద్ద నమోదైంది.నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో 32 రెడ్‌లో ముగిశాయి. విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, సిప్లా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఓఎన్జీసీ, టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఎస్బీఐ లైఫ్ లాభాలతో ముగిసిన 18 స్టాక్‌లలో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 24,064కు చేరింది. సెన్సెక్స్ 501 పాయింట్లు దిగజారి 79,454 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.22 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.16 శాతం దిగజారింది.బలహీన డిమాండ్‌కు భిన్నంగా డిసెంబర్లో అంచనాలకు మించి వాహన విక్రయాలు జరడంతో ఆటో రంగ షేర్లు నిన్నటి మార్కెట్ సెషన్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, సిటీ డిసెంబర్ క్వార్టర్‌తో పాటు 2025 ఏడాది మొత్తంగా ఐటీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి బలంగా ఉండొచ్చనే తాజాగా అంచనా వేశాయి. ఫలితంగా ఈ రంగంలోని షేర్లు రాణించాయి. ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచి కొంత ఒడిదొడుకుల్లో ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:55 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు లాభపడి 23,855కు చేరింది. సెన్సెక్స్(Sensex) 373 పాయింట్లు ఎగబాకి 78,873 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్(Barrel Crude) ధర 74.92 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్(Nasdaq) 0.9 శాతం దిగజారింది.కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో స్వాగతం పలికింది. మెటల్, రియల్టీ(Realty) మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం ఇండెక్సులు అరశాతం మేర లాభపడ్డాయి. కొత్త సంవత్సరం రోజున ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తొలిరోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 కొత్త సంవత్సరం మొదటి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ బుధవారం 368.40 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 78,507.41 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 78,756.49 - 77,898.30 రేంజ్లో ట్రేడ్ అయింది.అదేవిధంగా నిఫ్టీ 50 దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 98.10 పాయింట్లు లేదా 0.41 శాతం పెరిగి 23,742.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 23,822.80 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,562.80 వద్ద ఉంది.మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, టాటా మోటార్స్ 3.01 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో 37 గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 మొదటి ట్రేడింగ్ రోజు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,617కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు దిగజారి 78,067 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.48 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 74.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.9 శాతం దిగజారింది.ఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి(Rupee) బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 109.12 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టంతో 78,139.01 వద్ద, నిఫ్టీ 0.100 పాయింట్లు లేదా 0.00042 శాతం నష్టంతో 23,644.80 వద్ద నిలిచాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, కోల్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 96 పాయింట్లు నష్టపోయి 23,545కు చేరింది. సెన్సెక్స్(Sensex) 425 పాయింట్లు దిగజారి 77,831 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.64 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.3 శాతం దిగజారింది.2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్–ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 450.94 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 78,248.13 పాయింట్ల వద్ద, నిఫ్టీ 168.50 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో.. 23,644.90 పాయింట్ల వద్ద నిలిచాయి.అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, టాటా మోటార్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు నష్టపోయి 23,786కు చేరింది. సెన్సెక్స్(Sensex) 46 పాయింట్లు దిగజారి 78,649 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 74.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.67 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.9 శాతం దిగజారింది.ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలు2024 బుల్స్, బేర్స్ మధ్య నువ్వా–నేనా అన్నట్టుగా యుద్ధం నడిచిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయని తెలిపారు. ఈ ఒత్తిళ్లను తట్టుకుని మరీ భారత మార్కెట్లు చక్కని రాబడులు ఇచ్చాయన్నారు. దీంతో మన మార్కెట్ల విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదుగా మారింది. దీనికితోడు అధిక లిక్విడిటీ (నిధుల ప్రవాహం) మార్కెట్ల వ్యాల్యూషన్‌ను గరిష్టాలకు చేర్చిందని చెప్పారు. దీంతో ఫండమెంటల్స్ కూడా పక్కకుపోయాయి. ఇదే అంతిమంగా మార్కెట్లో కరెక్షన్ను ఆహ్వానించినట్లయిందని అభిప్రాయపడ్డారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మెరిసిన ఫార్మా, ఆటో షేర్లు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వారాంతపు ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 226 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 78,699.07 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 79,043.15 - 78,598.55 రేంజ్లో ట్రేడయింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ50 ( NSE Nifty 50 ) 63 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 23,813.40 వద్ద గ్రీన్‌లో స్థిరపడింది. నిఫ్టీ ఈరోజు గరిష్ట స్థాయి 23,938.85 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,800.60 వద్ద ఉంది.డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, విప్రో 2.51 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 29 గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు హిందాల్కో, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఒఎన్‌జిసి, టాటా స్టీల్ 1.81 శాతం వరకు నష్టాలు మూటకట్టుకుని నష్టాలతో ముగిసిన 21 స్టాక్‌లలో ఉన్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 124 పాయింట్లు లాభపడి 23,877కు చేరింది. సెన్సెక్స్(Sensex) 397 పాయింట్లు పుంజుకుని 78,891 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 71.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.15 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.02 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో యూఎస్‌లో మదుపర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 31తో అమెరికాలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మిశ్రమ ఫలితాల్లో స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 0.39 పాయింట్లు లేదా 0.00050 శాతం నష్టంతో 78,472.48 వద్ద, నిఫ్టీ 22.55 పాయింట్లు లేదా 0.095 శాతం లాభంతో 23,750.20 వద్ద నిలిచాయి.అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, JSW స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాలను చవి చూశాయి.స్థిరమైన గ్లోబల్ సూచనలు, ఆసియా మార్కెట్ల ఉత్తేజం నేపథ్యంలో ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ 50 (Nifty) గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి, సెన్సెక్స్ 238.27 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 78,711 వద్ద, నిఫ్టీ 56.45 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 23,784.10 వద్ద ఉన్నాయి.ఓపెనింగ్ బెల్ తర్వాత ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా స్టాక్‌లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతుండగా, మిగిలినవి లాభాల్లో పయనిస్తున్నాయి. వీటిలో బ్యాంక్ స్టాక్‌లు ముందు వరుసలో ఉన్నాయి. లాభాల్లో అగ్రగామిగా ఎస్బీఐ (SBI) ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.నిఫ్టీ50లో ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ట్రెంట్, టీసీఎస్‌లతో సహా ఐదు స్టాక్‌లు మాత్రమే దిగువన ట్రేడింగ్‌లో ఉన్నాయి. బిపిసిఎల్, ఎస్బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మారుతీ సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్స్.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market).. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 85.93 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 78,454.24 వద్ద, నిఫ్టీ 23.85 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టంతో 23,729.60 వద్ద నిలిచాయి.టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఐషర్ మోటార్స్, ఐటీసీ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి నష్టాలను చవిచూశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు పుంజుకుని 78,611 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.92 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. రేపు క్రిస్మస్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు. తిరిగి గురువారం యథావిధిగా స్టాక్‌మార్కెట్లు పని చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లు సోమవారం కాస్త పుంజుకోవడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల మార్కెట్ నుంచి భారీగా అమ్మకాలు చేస్తున్న విదేశీ సంస్థగత పెట్టుబడిదారుల సరళిని గమనించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. జొమాటో, మారుతీసుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, నెస్లే కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)