Stock Market Trend
-
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,176.45 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 78,041.59 వద్ద, నిఫ్టీ 364.20 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టంతో 23,587.50 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరెటరీస్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్ మహీంద్రా, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 23,911కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు దిగజారి 79,027 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.43 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.09 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.12 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 236.18 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 81,289.96 వద్ద, నిఫ్టీ 93.10 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 24,548.70 వద్ద నిలిచాయి.అదానీ ఎంటర్ప్రైజెస్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో నిలువగా.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), హిందూస్తాన్ యూనీలీవర్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 24,646కు చేరింది. సెన్సెక్స్ 53 పాయింట్లు ఎగబాకి 81,591 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.63 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.82 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం పుంజుకుంది.దేశీయంగా అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!
స్టాక్ మార్కెట్‌ను ఎలాంటి కష్టం లేకుండా డబ్బు సంపాదించే మార్గంగా చాలా మంది భావిస్తుంటారు. ఇందులో కొంతవరకు వాస్తవం లేకపోలేదు. కానీ, ఫ్రీగా డబ్బులు రావన్న విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. గతంలో స్టాక్ మార్కెట్ లావాదేవీలన్నీ కాగితాల మీదే జరిగేవి. ఒక షేర్ కొనాలన్నా, అమ్మలన్నా పెద్ద తతంగమే ఉండేది. పైగా ఆ షేర్లు మన అకౌంట్లో జమ అయ్యేందుకు రోజులే పట్టేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాంతో ట్రేడింగ్ చాలా సులువైంది. అరచేతిలో క్షణాల్లో స్టాక్స్ అమ్మడం, కొనడం జరిగిపోతుంది. కానీ గతంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వ్యక్తులు డబ్బు పోగుట్టుకున్నా అనుభవం గడించేవారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్..?ఎవరో చెప్పారని, యూట్యూబ్‌లో ఏదో వీడియోలు చూశామని స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు. దాంతో మార్కెట్‌పై నిందలేస్తూ, ఇదో జూదమని, గ్యాంబ్లింగని స్టాక్ మార్కెట్ నుంచి విరమించుకుంటున్నారు. సరైన అవగాహన పెంపొందించుకోకుండా మార్కెట్లోకి ప్రవేశించి చేతులు కాల్చుకుని మార్కెట్‌ను నిందించడం సరికాదు. మార్కెట్లోకి రావాలనుకునేవారు, ఇప్పటికే వచ్చినవారు ముందుగా అవగాహన పెంచుకోవాలి. కేవలం స్టాక్స్‌లోనే కాకుండా ఇండెక్స్‌లు, మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి ఎన్నో మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్స్ కొనాలంటే ఎలాంటి సమయంలో తీసుకోవాలి.. ఎందుకు వాటినే ఎంచుకోవాలి.. వాల్యుయేషన్ల మాటేంటి.. త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి.. కంపెనీ కాన్ఫరెన్స్‌కాల్‌లో ఏం చెబుతున్నారు.. భవిష్యత్తు ప్రణాళికలేంటి.. వంటి ఎన్నో అంశాలను పరిగణించాలి. మార్కెట్లో ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని కొన్ని అంశాలను పరిశీలిద్దాం.ఇలా చేయొద్దుఅవగాహన లేనప్పుడు ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి.ఇన్స్టంట్ మనీ కోసం తాపత్రయపడకండి.పెట్టిన గంటలోనో, ఒక రోజులోనో లాభాలు వచ్చేయాలని ఆశించకండి.ట్రేడింగ్‌లో లాభాలతో పోలిస్తే నష్టపోయేది ఎక్కువ. కాబట్టి దానిపై పూర్తి పరిజ్ఞానం లేకుండా డబ్బులతో ప్రయోగాలు చేయకండి.సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యక్తులు ఊదరగొట్టే సిఫారసులు చూసి మీ కష్టార్జితంతో చెలగాటమాడుతారు. వారి మాటలు నమ్మకండి.‘మీరు ట్రేడింగ్ చేస్తున్నారా..’ అంటూ ఫోన్ కాల్స్ చేసి మీకు సిఫారసులు అందిస్తాం.. అనేవాళ్లను నమ్మకూడదు.ఏ పని చేసిన మీపై ఆధారపడి కుటుంబం ఉందనే విషయాన్ని మరవకూడదు.ఇదీ చదవండి: ‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’ఇలా చేయండిముందు స్టాక్ మార్కెట్ మీద ఉన్న అపోహలు, భయాలను వదిలేయండి.స్టాక్ మార్కెట్ అంటే నష్టాలు తెచ్చిపెట్టే ఓ జటిల పదార్ధంగా భావించకుండా సిరులు కురిపించే సాధనంగా చూడటం నేర్చుకోండి.మార్కెట్‌పై అవగాహన పెంచుకోండి.రియల్‌టైమ్‌లో పేపర్ట్రేడ్ చేస్తూ క్రమంగా పట్టు సాధించండి.మీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రారంభంలో ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టండి.ట్రేడింగ్ వేరు.. ఇన్వెస్ట్మెంట్ వేరనే విషయాన్ని నిత్యం గుర్తుంచుకోండి.మీ పెట్టుబడును దీర్ఘకాలం కొనసాగించేలా ప్రయత్నించండి.బ్యాంకులో ఎఫ్డీ చేసినపుడు ఏడాది, రెండేళ్లు, ఐదేళ్లు ఎలా వేచిస్తున్నారో..అలాగే మార్కెట్లోనూ ఓపిగ్గా ఉండండి.స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫండమెంటల్స్ బాగున్నా షేర్లను ఎంచుకోండి.తాత్కాలిక ఒడిదొడుకులు ఎదురైనప్పుడు ఈ షేర్లు పడినట్లు కనిపించినా, భవిష్యత్‌లో ఇవి మంచి రాబడులు అందిస్తాయి.మార్కెట్ పడిన ప్రతిసారీ కొంత మొత్తంలో షేర్స్ కొనేలా ప్లాన్ చేసుకోండి. దానివల్ల మీకంటూ ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ అవుతుంది.డిపాజిట్లు వంటి సంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అధిక రాబడులనే ఇస్తాయి. కానీ సరైన అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.- బెహరా శ్రీనివాసరావు, మార్కెట్ విశ్లేషకులు -
ఈ వారం అనిశ్చితులు కొనసాగుతాయా..?
అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ గణాంకాలు మార్కెట్లను ఈవారం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనైన మార్కెట్లు ఈ వారం కూడా అదే రీతిలో ఉన్నా కాస్తా నెమ్మదించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడిచినప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న అనిశ్చితి ప్రతికూల సంకేతాలను పంపిస్తోంది. విదేశీ మదుపర్ల అమ్మకాలు పెరుగుతున్నందున మార్కెట్లో ఆటుపోట్లు తప్పవు. జీడీపీ మందగమనంగత వారం చివర్లో జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఈ గణాంకాలు నమోదు కావడం మార్కెట్‌ను నిరుత్సాహపరుచనుంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి కేవలం 5.4 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 8.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. అలాగే మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నమోదైన వృద్ధి రేటు 6.7 శాతంతో పోల్చి చూసినా తక్కువే. ముఖ్యంగా తయారీ రంగంలో వృద్ధి మందగించడం జీడీపీ గణాంకాలను ప్రభావితం చేసింది. ప్రస్తుత అంకెలు అంచనాలకు దూరంగా ఉండటం ఈవారం మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంది. సోమవారం ప్రారంభంలో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా ముగింపు వరకు కాస్తా కోలుకోవచ్చని అంచనా.ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగే అవకాశం..అక్టోబర్ నెల ప్రారంభం నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా మార్కెట్ నుంచి తమ పెట్టుబడిని ఉపసంహరిస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత నికర కొనుగోలుదార్లుగా నిలిచినప్పటికీ అది మూడు రోజులకే పరిమితమైంది. గత వారం చివరి రెండు రోజుల్లో ఏకంగా దాదాపు రూ.16000 కోట్ల షేర్లను అమ్మేశారు. ఎఫ్ఐఐలు ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుతుండగా మరోపక్క దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) మాత్రం మార్కెట్‌కు తమ మద్దతు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్ఐఐల అమ్మకాలు డిసెంబర్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది.అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..గత వారాంతాన అమెరికా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా అమెరికా విషయంలో ట్రంప్ నిర్ణయాలు మార్కెట్లకు కొత్త శక్తినిస్తూ రికార్డుల వైపు పరుగు తీయిస్తున్నాయి. డోజోన్స్, ఎస్ & పీ ఇండెక్స్‌లు దూసుకెళుతుండగా టెక్నాలజీ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. దీని ప్రభావంతో నాస్డాక్ సూచీ పడిపోయేందుకు కారణమవుతుంది. ఇది మన మార్కెట్లలో ఐటీ షేర్లను ప్రభావితం చేస్తోంది. ఈవారం కూడా అమెరికా మార్కెట్లు లాభాలను కొనసాగించే అవకాశం ఉన్నందుకు ఇది కొంతవరకు మన మార్కెట్లకు సానుకూల సంకేతాలను పంపొచ్చు.ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’సాంకేతిక స్థాయులుసెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడిదొడుకులు కొనసాగుతాయి. నిఫ్టీ గతవారం 24130 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఒక రకంగా అమ్మకాల స్థాయిని సూచిస్తోంది. సోమవారం నిఫ్టీ తొలి గంటలో 24150 స్థాయికి దిగువన ట్రేడ్ అయితే అమ్మకాల ఉద్ధృతి మరింత పెరుగుతుంది. ఇదే కొనసాగితే ఈవారం నిఫ్టీ 23800 మార్కును చేరవచ్చు. దాన్ని కూడా బ్రేక్ చేస్తే తదుపరి మద్దతు స్థాయి 23300కు పడిపోయే అవకాశం ఉంది.- బెహరాశ్రీనివాసరావుమార్కెట్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,820.19 పాయింట్లు లేదా 2.36 శాతం పెరిగి 78,975.98 వద్ద, నిఫ్టీ 525.70 పాయింట్లు లేదా 2.25 శాతం పెరిగి 23,875.60 వద్ద నిలిచాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టైటాన్ కంపెనీ, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS), జేఎస్‌డబ్ల్యు స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. బజాజ్ ఆటో, వోడాఫోన్ ఐడియా, ఫెడరల్ బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి. నిన్న (నవంబర్ 21) భారీ నష్టాలను చవి చూసిన అదానీ సంస్థలు మళ్ళీ లాభాల్లో పయనించాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,491కు చేరింది. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగబాకి 77,596 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.5 శాతం పెరిగింది. నాస్డాక్ 0.03 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 వద్దకు చేరింది. సెన్సెక్స్ 984 పాయింట్లు దిగజారి 77,690 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి రోజూ సరాసరి రూ.4వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.ఇదీ చదవండి: నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తిసెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒకే రోజు రూ.4.3 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్ ప్రారంభంలో కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ముగింపు సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 257 పాయింట్లు నష్టపోయి 23,883 వద్దకు చేరింది. సెన్సెక్స్ 820 పాయింట్లు దిగజారి 78,675 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.4.3 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్ ఎటాక్..!
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 942 పాయింట్లు క్షీణించి 78,782 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24 వేల దిగువన 23,995 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 1,492 పాయింట్లు క్షీణించి 78,233 వద్ద, నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 23,816 వద్ద కనిష్టాలు తాకాయి. ట్రేడింగ్ చివర్లో కనిష్ట స్థాయిల వద్ద పలు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. కొన్ని రియల్టీ రంగ షేర్లు 5–6 శాతం వరకూ పతనం కాగా... ప్రైవేటు రంగ బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు 3–6 శాతం నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలేఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది.ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. 1% నుంచి అరశాతం నుంచి పతనమయ్యాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పావుశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు బలహీనంగా ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 942 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ. 5.99 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.421 లక్షల కోట్లకు దిగివచ్చింది. రిలయన్స్ 3%, అదానీ పోర్ట్స్ 3%, సన్‌ఫార్మా 2.60%, ఎన్టీపీసీ 2.50%, బజాజ్ ఫిన్సర్వ్ 2.45%, యాక్సిస్ బ్యాంకు 2.40 నష్టపోయాయి. అక్టోబర్ వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ షేర్లు 3–4% చొప్పున నష్టపోయాయి. ఎదురీదిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఎదురీదింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.463)తో పోలిస్తే 7% డిస్కౌంటుతో రూ.430 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 9% క్షీణించి రూ.420 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే ట్రేడింగ్ చివర్లో రికవరీతో 2.50% లాభపడి రూ.475 వద్ద స్థిరపడింది.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!నష్టాలు ఎందుకంటే..?అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశాల(6–7 తేదీల్లో) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. బీజింగ్‌లో జరుగుతున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సందర్భంగా చైనా మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. చమురు ఉత్పత్తి పెంచాలనే నిర్ణయాన్ని ఓపెక్ వాయిదా వేసుకోవడంతో క్రూడాయిల్ ధరలు 2% పెరిగాయి. సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరిచేలా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. -
ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీగా పడుతున్నాయి. ఉదయం 11:25 నిమిషాల సమయం వరకు ఏకంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైనట్లు తెలిసింది. మార్కెట్లు పడిపోతుండడంపై నిపుణులు కొన్ని అంతర్జాతీయ అంశాలు కారణమని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.అమెరికా ఎన్నికలుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు(మంగళవారం 5న) జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.యూఎస్ ఫెడ్ సమావేశంమరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధ, గురువారాల్లో(6–7వ తేదీన) మానిటరీ పాలసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నాయి. 7న యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం(2.4 శాతం), అక్టోబర్ ఉపాధి గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్లలో సవరణలకు తెరతీయనుంది. గత సమావేశంలో నాలుగేళ్ల తదుపరి ఎఫ్‌వోఎంసీ తొలిసారి 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతంగా అమలవుతున్నాయి.క్యూ2 ఫలితాలుఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ వేడెక్కింది. పలు దిగ్గజాలు పనితీరును వెల్లడిస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మార్కెట్లు కింది చూపులు చూస్తున్నాయి. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాల జాబితాలో డాక్టర్ రెడ్డీస్, టైటన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. దేశ, విదేశీ గణాంకాలను ఈ వారం స్టాక్ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నాయి.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్దేశీ స్టాక్స్‌లో ఉన్నట్టుండి గత నెలలో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త చరిత్రకు తెరతీశారు. అక్టోబర్‌లో నికరంగా రూ.94,000 కోట్ల(11.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నెలవారీగా దేశీ స్టాక్ మార్కెట్లలో ఇవి అత్యధిక అమ్మకాలుకాగా..కొవిడ్–19 ప్రభావంతో ఇంతక్రితం 2020 మార్చిలో ఎఫ్‌పీఐలు రూ.61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీయంగా ఒక నెలలో ఇవి అత్యధిక విక్రయాలుగా నమోదయ్యాయి. ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌లో రూ.57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇవి గత 9 నెలల్లోనే గరిష్టంకావడం గమనార్హం. అయితే చైనాలో ఆకర్షణీయ ఈక్విటీ విలువలు, ప్రభుత్వ సహాయక ప్యాకేజీలు ఎఫ్‌పీఐలను అమ్మకాలవైపు ఆకర్షిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
ఐటీ షేర్ల దెబ్బ.. సంవత్ చివరిరోజూ నష్టాలే!
బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50, గురువారం వరుసగా రెండో సెషన్లోనూ ప్రతికూలంగా ముగిశాయి. ఇది సంవత్ 2080 చివరి ట్రేడింగ్ సెషన్. బీఎస్ఈ సెన్సెక్స్ 553.12 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 79,389.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే దారిలో 135.50 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 24,205.35 వద్ద ముగిసింది. దీంతో సంవత్ 2080లో సెన్సెక్స్ 22.31 శాతం లాభపడగా, నిఫ్టీ 26.40 శాతంగా ఉంది.50 షేర్లలో 34 నష్టాల్లో ముగియడంతో ప్రస్తుత సంవత్ చివరి ట్రేడింగ్ సెషన్ 3.61 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, సిప్లా, లార్సెన్ & టూబ్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓన్జీసీ, మహీంద్రా & మహీంద్రా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.కాగా శుక్రవారం దీపావళి సందర్భంగా బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లతోపాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సాధారణ ట్రేడింగ్ సెషన్‌కు బదులుగా ముహూర్తం ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. శుక్రవారం సాయంత్రం 6-7 గంటల వరకు గంటసేపు సెషన్ జరగనుంది. దీంతో సంవత్ 2081 ప్రారంభం కానుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండగవేళ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 66 పాయింట్లు తగ్గి 24,272కు చేరింది. సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 79,681 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.33 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.56 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఐఐలు నిత్యం వేలకోట్ల రూపాయల విలువ చేసే షేర్లు విక్రయిస్తున్నారు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5-7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మ్యూచవల్ ఫండ్స్ వద్ద ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఎఫ్ఐఐలు మరింతగా విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ఏఎంసీల వద్ద సరిపడా డబ్బు ఉండకపోవచ్చనే వాదనలున్నాయి. కానీ ఈ తాత్కాలిక పరిణామాలకు భయపడి విక్రయాలు అమ్మకాలు చేయకుండా మంచి కంపెనీ స్టాక్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 24,201కు చేరింది. సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 79,616 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.24 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.6 శాతం లాభపడింది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేస్తున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపుతాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇటీవల భారీగా పడిపోతున్న నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మదుపర్లకు సలహా ఇచ్చారు. సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తోనే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్ ట్రెండ్‌కు తగిన వ్యూహం అనుసరించని వారు త్వరగా నష్టపోతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్లో కొన్ని అంశాలను పంచుకున్నారు.‘ఈక్విటీ మార్కెట్లో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేనివారు లాభాలు ఆర్జించడం ఇప్పటివరకు చూడలేదు. మార్కెట్ ట్రేండ్‌కు తగిన ప్రణాళిక లేకుండా ట్రేడింగ్ చేసేవారు త్వరగా నష్టాల్లోకి వెళుతారు. మార్కెట్ రిస్క్‌లకు తగిన విధంగా పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలి. లేదంటే డబ్బు సంపాదించడం కష్టం. రిస్క్ తక్కువగా తీసుకుంటే రిటర్న్‌లు కూడా అందుకు అనుగుణంగానే తక్కువ ఉంటాయి. అలాగని ఎక్కువ రిస్క్ తీసుకోవడం ప్రమాదం. కొన్నిసార్లు మొత్తం డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ నిర్వహణ చాలా ముఖ్యం. పోర్ట్‌ఫోలియో ఆధారంగా రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇది ట్రేడర్, ఇన్వెస్టర్ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని కామత్ అన్నారు.In the 20+ years in this business, I haven’t seen anyone who has kept profits from trading without good risk management. I know many who've lost quickly. If you don't have a plan to manage risk and size your bets, it's impossible to keep the money you make.Here are a few…— Nithin Kamath (@Nithin0dha) October 23, 2024ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఎన్నికలు, పెరుగుతున్న ఎఫ్ఐఐ అమ్మకాలు వెరసి స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. దీర్ఘకాలంలో రాబడులు ఆశించే ఇన్వెస్టర్లకు ఇలా మార్కెట్లు నష్టపోతుండడం మంచి అవకాశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మరిన్ని ఎక్కువ స్టాక్‌లు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 24,441కు చేరింది. సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయి 80,144 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.05 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.18 శాతం లాభపడింది.ఇదీ చదవండి: రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్..నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 104.1 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 24,821కు చేరింది. సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 81,314 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.01 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.18 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.27 శాతం లాభపడింది.ఇదీ చదవండి: 2030 నాటికి రూ.32 లక్షల కోట్లు అవసరంఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా ఇటీవల భారీగా పడిన మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇది ఒకింత సానుకూలాంశమే. కానీ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎఫ్ఐఐలు భారీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి షేర్లు అమ్ముతున్నారు. దాంతో మార్కెట్లు పతనమవుతున్నాయి. దానికితోడు నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 72 పాయింట్లు తగ్గి 24,781 వద్దకు చేరింది. సెన్సెక్స్ 73 పాయింట్లు దిగజారి 81,151 వద్ద ముగిసింది.మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయి. చైనా మార్కెట్లో ప్రభుత్వ నిర్ణయాలు కొంత అంతర్జాతీయ మార్కెట్లకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. రానున్న యూఎస్ ఎన్నికలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, నెస్లే, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం అధిక స్థాయిలో ప్రారంభమయ్యాయి.ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 420 పాయింట్లు లేదా 0.52 శాతం పెరిగి 81,645 వద్ద, నిఫ్టీ 50 108 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 24,962 వద్ద పయనిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, విప్రో టాప్ గెయినర్స్‌గా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా కన్య్సూమర్ ప్రొడక్ట్స్, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా భారీ నష్టాల్లో చలిస్తున్నాయి.కాగా సోమవారం ఉదయం చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన రేటు తగ్గింపును ట్రేడర్లు అంచనా వేయడంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒక సంవత్సరం రుణ ప్రైమ్ రేటుని 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే ఐదేళ్ల ఎల్పీఆర్ 3.6 శాతానికి తగ్గింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పతనమవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 114 పాయింట్లు తగ్గి 24,635కు చేరింది. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80,573 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.04 శాతం లాభపడింది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా ఇటీవల భారీగా పడిన మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. గడిచిన రెండు రోజుల నుంచి తిరిగి మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇది ఒకింత సానుకూలాంశమే. కానీ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎఫ్ఐఐలు భారీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి షేర్లు అమ్ముతున్నారు. దాంతో మార్కెట్లు పతనమవుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ల తిరోగమనం.. నష్టాల్లో ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ప్రారంభ లాభాలను కోల్పోయి ప్రతికూలంగా తిరోగమించాయి. సెన్సెక్స్ 167.71 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టపోయి 81,467.10 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 82,319.21 - 81,342.89 స్థాయిల శ్రేణిలో ట్రేడైంది. సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ కూడా 31.20 పాయింట్లు లేదా 0.12 శాతం తగ్గి 24,981.95 వద్దకు పడిపోయింది. బుధవారం ఇది 25,234.05 - 24,947.70 రేంజ్లో చలించింది.నిఫ్టీ50 ఇండెక్స్‌లోని 50 స్టాక్స్‌లో సిప్లా, ట్రెంట్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , టెక్ మహీంద్రా నేతృత్వంలోని 31 స్టాక్స్ గ్రీన్‌లో ముగిసి 2.58 శాతం వరకు పెరిగాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఒఎన్జీసీ, హిందుస్తాన్ యూనిలీవర్ 19 స్టాక్‌లలో దిగువన ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎంపీసీ సమావేశం..లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 25,068కు చేరింది. సెన్సెక్స్ 170 పాయింట్లు పుంజుకుని 81,801 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.01 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.97 శాతం లాభపడింది. నాస్డాక్ 1.44 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం వివరాలు వెల్లడి కానున్నాయి. మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దానికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఉండడంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. ఇరాన్ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలం నుంచి వారం రోజుల్లో మార్కెట్లు భారీగా పడిపోయాయి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 24,808కు చేరింది. సెన్సెక్స్ 84 పాయింట్లు పుంజుకుని 81,142 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.53 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.02 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.96 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైడెల్బర్గ్ సిమెంట్‌పై అదానీ కన్ను!రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థలకు తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర అనిశ్చితులకు గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. ఇరాన్ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలం నుంచి వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 25,095కు చేరింది. సెన్సెక్స్ 285 పాయింట్లు పుంజుకుని 81,958 వద్ద ట్రేడవుతోంది. గడిచిన సెషన్‌ల్లో మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. సోమవారం కొంత పుంజుకుని లాభాల్లో ట్రేడవుతున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.52 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.97 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.9 శాతం లాభపడింది. నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి ఆరు మార్పులు ఇవే..భవిష్యత్తులో అంతర్జాతీయ అనిశ్చితులు దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికలు ముగిసే వరకు ఈ యుద్ధ భయాలు ఉండవచ్చని అంచనా. ముడిచమురు ధరలు మరింత పెరిగే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ నెల 9న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మార్కెట్‌కు కీలకంగా మారనున్నాయి. గతంలో ఆర్బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం కీలక వడ్డీరేట్లను వెంటనే తగ్గించబోమనే సంకేతాలు వెలువరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి కంపెనీలు ఆర్థిక ఫలితాలను త్వరలో ప్రకటించనున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ కల్లోలానికి కారణాలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాలుస్తుండడంతో స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఇజ్రాయిల్–ఇరాన్ పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. ఫలితంగా నిన్న దేశీయ స్టాక్మార్కెట్లో రూ.9.78 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇందుకుగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.నిపుణులు అంచనా ప్రకారం..హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ సంస్థలకు మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రత్యక్ష దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌పై ఏకంగా 180కి పైగా క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్–ఇజ్రాయెల్‌ల మద్య పోరు భీకర యుద్ధానికి దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు ఈక్విటీ మార్కెట్లో స్థిరత్వం కోసం సెబీ ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. డెరివేటివ్స్ కనీస కాంట్రాక్టు విలువను రూ.15–20 లక్షలకు పెంచింది. దీంతో విస్తృత మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. సెబీ కొత్త మార్గదర్శకాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి.పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో కొన్ని వారాలుగా నిలకడగా ఉన్న క్రూడాయిల్ ధరలు ఇటీవల మళ్లీ ఎగబాకాయి. గడిచిన 3 రోజుల్లో చమురు ధరలు 5% పెరిగాయి. ప్రస్తుతం భారత్‌కు దిగుమతయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సరఫరా అవాంతరాల దృష్ట్యా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. దేశీయ ముడి చమురుల దిగుమతుల బిల్లు భారీగా పెరగొచ్చనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు బలహీనపడి 83.96 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23 పైసలు క్షీణించి 84.00 స్థాయిని తాకింది.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!చైనా ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలు, ఉద్దీపన చర్యలు, వరుస వడ్డీరేట్ల కోతను ప్రకటించడంతో గతవారంలో ఆ దేశ స్టాక్ మార్కెట్ ఏకంగా 15 శాతం ర్యాలీ అయింది. ఇప్పటికీ అక్కడి షేర్లు తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లో లాభాల స్వీకరణకు పాల్పడి, చైనా మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు. -
భారత్, చైనా మార్కెట్లపై జెఫ్రీస్ హెడ్ కీలక వ్యాఖ్యలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల జీవితకాల గరిష్ఠాలను చేరిన నేపథ్యంలో ప్రస్తుత స్థాయి నుంచి ఒక శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా మార్కెట్లు మాత్రం ప్రస్తుత స్థానం నుంచి దాదాపు రెండు శాతం పెరగనున్నాయని అంచనా వేశారు.క్రిస్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం..భారత ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో చాలామంది మదుపర్లు లాభాలు స్వీకరించే అవకాశం ఉంది. అదే చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి మార్కెట్లు ప్రస్తుత స్థానం నుంచి సుమారు రెండు శాతం పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, మలేషియా మార్కెట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న యుద్ధ వాతావరణం మరింత పెరిగితే భారత్‌తోపాటు దాదాపు అన్ని గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయి.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!దీర్ఘకాల వ్యూహంతో ఈక్విటీలో పెట్టుబడి పెట్టేవారు ప్రతి ప్రతికూల ప్రభావాన్ని ఒక అవకాశంగా తీసుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. మరో పదేళ్లలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పు రానుంది. అన్ని విభాగాలు వృద్ధి చెందనున్నాయి. కాబట్టి మదుపర్లు ట్రేడింగ్ కంటే పెట్టుబడిపై దృష్టి సారించి మంచి రాబడులు పొందాలని చెబుతున్నారు. -
ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 368 పాయింట్లు తగ్గి 25,810 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1272 పాయింట్లు దిగజారి 84,299 వద్ద ముగిసింది. ఈరోజు స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఉదయ నుంచే లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. రానున్న యూఎస్ ఎన్నికలు, ఎఫ్ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసినట్లు నిపుణులు చెప్పారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి సుజుకీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)