శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,176.45 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 78,041.59 వద్ద, నిఫ్టీ 364.20 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టంతో 23,587.50 వద్ద నిలిచాయి.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబరెటరీస్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్ మహీంద్రా, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 23,911కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు దిగజారి 79,027 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108.43 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.09 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.12 శాతం దిగజారింది.
ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment