ప్రతీకాత్మక చిత్రం
మూడు రోజుల దేశీయ స్టాక్ మార్కెట్‌ల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు, దేశీయ మదుపర్ల అప్రమత్తతతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. ఆపై నష్టాలతోనే ట్రేడ్ నడుస్తోంది కూడా.
నిన్నటి ముగింపులో, సెన్సెక్స్ 157.45 పాయింట్లు (0.27%) పెరిగి 58,807.13 వద్ద ఉంటే, నిఫ్టీ 47 పాయింట్లు (0.27%) లాభపడి 17,516.80 వద్ద నిలిచింది. అయితే శుక్రవారం ఉదయం 10.00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 58,663 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17,485 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, సిప్లా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటామెటార్స్, కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment