స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9గం.50ని. సమయంలో సెన్సెక్స్ 390 పాయింట్ల నష్టంతో 57,510 వద్ద.. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,116 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.19 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టైటన్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
కారణాలు ఏంటంటే..
►అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్ల మీద కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
► దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది.
► అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.
► అమెరికా ఫెడ్ వచ్చే ఏడాది వడ్డీరేట్లను పెంచుతామని ప్రకటించడం, అలాగే బాండ్ల విక్రయాల ద్వారా 30 బిలియన్ డాలర్లు సేకరిస్తామని చెప్పడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1800 డాలర్లు దాటింది.
► ఇక ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం ఇప్పుడు మదుపర్లను కలవరపెడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment