BSE Sensex
-
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ ఈ వారం కూడా కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ స్థూల ఆరి్థక గణాంకాలు సానుకూలంగా ఉండటం, అమెరికా ఆరి్థక మందగమనంపై ఆందోళనలు తగ్గడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం తదితర అంశాలు సూచీలను లాభాల దిశగా నడిపిస్తాయని చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.‘‘ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇన్వెస్టర్లు ‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’ వూహాన్ని అమ లు చేస్తున్నారు. వినియోగ, ఆటో, ఫై నాన్స్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మ ద్దతు లభించవచ్చు. డాలర్ విలువ బ లహీనపడటంతో ఎగుమతి ఆధారిత రంగాల ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 26,000 స్థాయిని అందుకోవచ్చు. దిగువున 25,500 – 25, 450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అ ని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. అమెరికా నాలుగేళ్ల తర్వాత వడ్డీరేట్లను అంచనాలకు మించి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రికార్డుల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. గతవారం మొత్తంగా సెన్సెక్స్ 1653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్లు లాభపడ్డాయి. గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ఈ గురువారం (సెపె్టంబర్ 22న) నిఫ్టీ సెపె్టంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 26,000 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని నిలుపుకోగలిగితే 26,100 – 26,350 శ్రేణిని పరీక్షిస్తుందని ఆప్షన్ డేటా సూచిస్తోంది.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెపె్టంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ. 342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (సెపె్టంబర్ 24న) స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ పెట్టుబడులుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెపె్టంబర్లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘నాలుగేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ.., రేట్ల త గ్గింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంకేతాలిచి్చంది. వచ్చే ఏడా ది (2025) చివరికి ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.4 శాతా నికి పరిమితం చేసేందుకు ప్రయతి్నస్తోంది. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లో పెట్టుబడులు మరింత పెరగొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయంగా హెచ్ఎస్బీసీ కాంపోజిట్ సెపె్టంబర్ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడనున్నాయి. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. -
Stock Market: సెన్సెక్స్ 80000
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో బుధవారం మరో మరపురాని రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తొలిసారి 80,000 శిఖరాన్ని తాకింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, పారిశ్రామిక షేర్లు ముందుండి నడిపించాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% రాణించి సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ముగింపులోనూ తాజా రికార్డులు నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 572 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయిపైన 80,013 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 633 పాయింట్లు పెరిగి 80,074 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 545 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయి దిగువన 79,987 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 183 పాయింట్లు ఎగసి 24,307 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 163 పాయింట్ల లాభంతో 24,287 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్ షేర్లలో ర్యాలీ క్రమంగా చిన్న, మధ్య తరహా షేర్లకు విస్తరించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.86%, 0.86 శాతం రాణించాయి. → బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితం కావడంతో బ్యాంకింగ్ షేర్లు మరింత రాణిస్తాయని విశ్లేషకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఎస్బీఐలు 2% లాభపడ్డాయి.→ బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు ఎంఎస్సీఐ ఇండెక్సు ఆగస్టు సమీక్షలో వెయిటేజీ పెంచవచ్చనే అంచనాలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2% పెరిగి రూ.1,768 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.50% ఎగసి రూ.1,792 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,758 కోట్లు ఎగసి రూ.13.45 లక్షల కోట్లకు చేరుకుంది. → ఈ జూన్ 25న 78 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్... 80,000 స్థాయిని చేరేందుకు కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంది. → ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం(జూన్ 9న) నాటి నుంచి 3,294 పాయింట్లు ర్యాలీ చేసింది. → సెన్సెక్స్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవితకాల గరిష్ట స్థాయి రూ.445.43 లక్షల కోట్లకు చేరింది. వ్రజ్ ఐరన్ బంపర్ లిస్టింగ్ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో 16% ప్రీమియంతో రూ.240 వద్ద లిస్టయ్యింది. ఈక్విటీ మార్కెట్ రికార్డు ర్యాలీతో మరింత కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 22% లాభపడి రూ.252 అప్పర్ సర్క్యూట్ వద్ద లాకైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది.సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకోవడం దలాల్ స్ట్రీట్‌కు దక్కిన పెద్ద విజయం. లేమన్ సంక్షోభం(2008)లో 8800 స్థాయికి దిగివచి్చంది. కానీ 16 ఏళ్లలో 9 రెట్ల ఆదాయాలు ఇచి్చంది. నాలుగేళ్ల క్రితం కరోనా భయాలతో 26,000 స్థాయికి చేరుకుంది. అయితే పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా పుంజుకుంది. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి అనేందుకు ఇది నిదర్శనం. – శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ -
సీపీఐ పుష్.. మార్కెట్ రికార్డ్స్
ముంబై: గత నెలలో సీపీఐ ఆర్బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 5% జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్, టెక్ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. మార్కెట్ క్యాప్ @ 431.67 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: సార్వత్రిక ఎన్నికలు, కార్పొరేట్ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల సరళి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మే డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులకు అవకాశం ఉంది. ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ సోమవారం ముగిస్తుంది. ఎక్సే్చంజీల్లో షేర్లు గురువారం లిస్టవుతాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1,404 పాయింట్లు, నిఫ్టీ 455 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ ఇన్వెస్టర్ల సిర్థమైన కొనుగోళ్లు, ఆర్బీఐ కేంద్రానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, ఆయా కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర పరిణామాలు కలిసొచ్చాయి. చివరి దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దలాల్ స్ట్రీట్ ముందుగా దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలతో పాటు గతవారాంతపు రోజుల్లో విడుదలైన ఇతర కార్పొరేట్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ చివరి దశ(ఎనిమిదో వారం)కు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఈ వారంలో దాదాపు 2,100 కి పైగా కంపెనీలు తమ మార్చి క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి. టాటా స్టీల్, ఎల్ఐసీ, ఐఆర్టీసీ, ఆ్రస్టాజెనికా, నాట్కో ఫార్మా, ఎన్ఎండీసీ, జీఐసీలు కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఎన్నికల ఓటింగ్ శాతంపై దృష్టి దేశంలో లోక్ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. చివరి (ఏడో) విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇదే రోజున రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ నమోదు శాతం, సంబంధిత వార్తల పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం జపాన్ మే కన్జూమర్ కన్ఫిడెన్స్ డేటా బుధవారం, అమెరికా క్యూ1 జీడీపీ వృద్ధి, ఉద్యోగ గణాంకాల గురువారం వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోజోన్ ఏప్రిల్ నిరుద్యోగ రేటు, పారిశ్రామిక సరీ్వసుల సెంటిమెంట్, మే వినియోగదారుల విశ్వాస గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం(మే 31న) చైనా ఏప్రిల్ నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్ల డేటా, యూరోజోన్ మే ద్రవ్యల్బోణ గణాంకాలతో భారత నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడంతో భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో (మే 24 వరకు) దాదాపు రూ.22,000 కోట్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, సమీక్షా కాలంలో ఎఫ్‌పీఐలు రూ.178 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్‌లో రూ.2,009 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే ఈ నెల ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టడం విశేషం.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(మే 30న) నిఫ్టీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 22,800 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 23,250–23,350 శ్రేణిని పరీక్షిస్తుంది’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
సానుకూల సంకేతాలు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ ఎన్నికల అప్రమత్తత కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చివరి దశ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలూ ట్రేడింగ్ ప్రభావితం చూపొచ్చంటున్నారు. ఇక ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ బుధవారం ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ‘‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’’ అని నిపుణులు తెలిపారు. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. అమెరికా ఆర్థిక పరిణామాలు భారత్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. -
చిన్న షేర్ల పెద్ద ర్యాలీ
న్యూఢిల్లీ: దలాల్ స్ట్రీట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023 –24)లో రిటైల్ ఇన్వెస్టర్ల హవా కొనసాగింది. దేశంలో దృఢమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆకర్షణీయమైన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య స్థాయి షేర్లును కొనేందుకు ఆధిక ఆసక్తి చూపారు. 2023–24లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 62%, స్మాల్ క్యాప్ సూచీ 60% రాణించాయి. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 25% పెరిగింది. ‘‘ఆదాయాలు గణనీయంగా పెరగడం, అధిక వృద్ధి అవకాశాలతో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా షేర్లను కొనుగోలుకు ఆసక్తి చూపారు. లార్జ్ క్యాప్ షేర్ల పట్ల విముఖత చూపారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నికర పెట్టుబడులు పెరగడం ఇందుకు నిదర్శనం. ఆర్థిక విస్తరణ సమయంలో చిన్న, మధ్య తరహా షేర్ల వృద్ధి వేగంగా ఉంటుందనే సంప్రదాయ సూత్రాన్ని వారు విశ్వసించారు. అంతేకాకుండా స్మాల్, మిడ్ సైజ్ కంపెనీల అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు వారిని కొనుగోళ్ల వైపు ఆకర్షితం చేశాయి’’ అని హెడ్జ్ ఫండ్ హెడోనోవా సీఐఓ సుమన్ బెనర్జీ తెలిపారు. ► 2023–24లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫిబ్రవరి 8న 40,282 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. గతేడాది మార్చి 31న 23,881 వద్ద ఏడాది కనిష్టానికి తాకింది. ► ఇదే కాలంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఫిబ్రవరి 7న 46,821 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేయగా, గతేడాది మార్చి 31న 26,692 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ► సెన్సెక్స్‌తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి షేర్ల అత్యుత్తమ ప్రదర్శన భారత ఈక్విటీ మార్కెట్ క్రియాశీలక స్వభావాన్ని, ఇన్వెస్టర్ల అపార వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతీ తెలిపారు. ► వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య తరహా షేర్ల ర్యాలీ కొనసాగుతుందని న్యాతీ అభిప్రాయపడ్డారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారాన్ని దక్కించుకోవచ్చనే అంచనాలతో వ్యాపార అనుకూల వాతావరణం పెంపొంది స్థిరమైన వృద్ధి కొనసాగొచ్చు. దీనికి తోడు భారత వృద్ధి బలమైన అవుట్‌లుక్ అంచనాలు ఈ రంగాల షేర్లకు డిమాండ్‌ను పెంచుతాయి’’ న్యాతీ తెలిపారు. అయితే కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ అనిశి్చతులు, లాభాల స్వీకరణ వంటి అంశాలు స్వల్పకాలిక ఒడిదుడుకులకు దారితీయొచ్చన్నారు. ఐపీవో బాటలో ఆఫ్కన్స్ ఇన్ఫ్రా ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లి క్ఇష్యూ బాట పట్టింది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఐపీవోతో రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనుంది. రూ. వెయ్యి కోట్లకు జిరోధా ఫండ్ విలువ జిరోధా, స్మాల్‌కేస్ జేవీ జిరోధా ఫండ్ హౌస్ నిర్వహణలోని ఆస్తుల విలువ కేవలం 40 రోజుల్లో రూ. 500 కోట్ల మేర ఎగిసింది. దీంతో సంస్థ ఏయూఎం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. -
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా అయిదో రోజూ లాభాలు కొనసాగడంతో నిఫ్టీ సూచీ సోమవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనాన్స్, ఇంధన, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో 146 పాయింట్లు ఎగసి 22,187 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 82 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపు 22,122 వద్ద స్థిరపడింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనై సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే తేరుకోని లాభాల బాటపట్టాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,187)ని నమోదు చేయగా.. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,882 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటీ, రియల్టీ షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 72,708 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం సరికొత్త శిఖరం(22,122) వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.52 %, 1.29% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.755 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.453 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, జపాన్, ఇండోనేసియా స్టాక్ సూచీలు మాత్రమే నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ ఎక్సే్చంజీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా ప్రెసిడెంట్స్ హాలిడే కావడంతో అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. మార్కెట్లు మరిన్ని సంగతులు ► తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చడంతో పేటీఎం షేరు 5% లాభపడి రూ.359 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ► క్యూ3లో నికర లాభం 33% వృద్ధి నమోదుతో క్రిసిల్ షేరు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 9.50% ర్యాలీ చేసి రూ.5,039 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 13% ర్యాలీ చేసి రూ.5196 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తన అనుబంధ సంస్థ పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఐఆర్డీఏఐ ‘డైరెక్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్’ నుంచి ‘కాంపోసైట్ ఇన్యూరెన్స్ బ్రోకర్’గా అప్‌గ్రేడ్ చేయడంతో పీబీ ఫిన్‌టెక్ షేరు 8% ఎగబాకి రూ.1,004 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్ల సంపద.. ఆల్‌టైమ్ గరిష్టం మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.20 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.391.69 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్‌లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్‌మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్‌టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్‌తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్‌డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
మార్కెట్‌కు బ్యాంకింగ్ షేర్ల దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో శుక్రవారం దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 71,595 వద్ద, నిఫ్టీ సుమారు 65 పాయింట్లు లాభంతో (0.30 శాతం) 21,782.50 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 71,676–71,200 శ్రేణిలో తిరుగాడింది. ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో స్వల్పంగా లాభపడిందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు, మెటల్, టెలికం, విద్యుత్ రంగ సంస్థల షేర్లలో అమ్మకాలు జరిగాయి. వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అత్యధికంగా ఒత్తిడికి గురైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 52 వారాల గరిష్టానికి జొమాటో.. పేటీఎం మరింత డౌన్.. క్యూ3లో లాభాలు ప్రకటించిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. బీఎస్ఈలో ఒక దశలో 5 శాతం ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 151ని తాకాయి. చివరికి సుమారు 4 శాతం లాభంతో రూ. 149.45 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ షేరు బీఎస్ఈలో మరో 6 శాతం క్షీణించి రూ. 419.85 వద్ద క్లోజయ్యింది. రెండు రోజుల్లో షేరు 15 శాతం మేర పతనమైంది. రూ. 4,871 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ కరిగిపోయింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా.. ఫిబ్రవరి 29 నుంచి దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ వన్97కి అసోసియేట్ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.36 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.97 శాతం, మెటల్ 1.62 శాతం, టెలికమ్యూనికేషన్ 1.45 శాతం, విద్యుత్ 1.10 శాతం మేర తగ్గాయి. బ్యాంకెక్స్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు లాభపడ్డాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ, ఎఫ్‌పీఐ) నికరంగా రూ. 142 కోట్లు కొనుగోళ్లు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 422 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► వారంవారీగా చూస్తే సెన్సెక్స్ 490 పాయింట్లు (0.67 శాతం), నిఫ్టీ 71 పాయింట్లు (0.32 శాతం) మేర తగ్గాయి. ► ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభాల్లోనూ, హాంకాంగ్ నష్టాల్లోనూ ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. -
నిఫ్టీ కొత్త రికార్డ్
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో శుక్రవారం నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ స్టాకులు రాణిండంతో ఇంట్రాడేలో 429 పాయింట్లు ఎగసి 22,127 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, మెటల్, సరీ్వసెస్, యుటిలిటీ, ఐటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రథమార్థంలో 2% ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,127)ని నమోదు చేయగా.., సెన్సెక్స్ 1444 పాయింట్లు దూసుకెళ్లి 73,089 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్ నుంచి ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 440 పాయింట్లు లాభపడి 72,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద నిలిచింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.80%, 0.50% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.71 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,463 కోట్ల షేర్లు కొన్నారు. నాస్డాక్లో ఐటీ షేర్ల ర్యాలీ ప్రభావం గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా, యూరప్ స్టాక్ సూచీలు 0.5–1% మేర పెరిగాయి. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(73,089) నుంచి ఏకంగా 1004 పాయింట్లు, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,127) నుంచి 273 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ బడ్జెట్ వారంలో సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ► సెన్సెక్స్ 441 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.34 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.382 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► కేంద్రం బడ్జెట్లో పర్యావరణ అనుకూల ఇంధనాలకు ప్రాధాన్యత నివ్వడం, అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకోవడం ఇంధన షేర్లకు కలిసొ చి్చంది. బీపీసీఎల్ 10%, ఐఓసీ 8%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఓఎన్జీసీ 4%, కోల్ ఇండియా 3% లాభపడ్డాయి. ► ఇంధన షేర్లలో భాగంగా రిలయన్స్ షేరు 2% పెరిగి రూ.2915 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.33% ర్యాలీ చేసి రూ.2950 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ విలువ రూ. 41,860 కోట్లు పెరిగి రూ.19.72 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజూ పేటీఎం షేరు 20% లోయర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో శుక్రవారం 20% పతనమై రూ.487 వద్ద ముగిసింది. -
5 కంపెనీల్లో రూ.1,67,936 కోట్ల ఆవిరి
ముంబై: మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి 10 కంపెనీల్లో అయిదింటి విలువ గతవారం భారీగా క్షీణించింది. గడిచిన వారం రోజుల్లో ఈ అయిదు కంపెనీల మార్కెట్ విలువ రూ.1,67,936 కోట్లు హరించుకుపోయాయి. గతవారం సెన్సెక్స్ 1,144 పాయింట్లు (1.57%) నష్టపోయింది. ఈ నెల 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సాధారణ ట్రేడింగ్ నిర్వహించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీవీఎస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్బీఐల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. ► అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,22,163.07 కోట్లు నష్టపోయి రూ.11,22,662.76 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు మార్కెట్లను మెప్పించలేకపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల విక్రయానికి పాల్పడ్డారు. దీంతో ఈ షేరు బుధ, గురు, శుక్రవారాల్లో 12% నష్ట పోయింది. శనివారం ట్రేడింగ్ లో తిరిగి పుంజుకుని 0.54% లాభ పడింది. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,199.35 కోట్లు నష్టపోయి రూ.18,35,665.82 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్ యూనీలివర్ (హెచ్ యూఎల్) మార్కెట్ క్యాప్ రూ.17,845.15 కోట్ల పతనంతో రూ.5,80,184.57 కోట్లతో సరిపెట్టుకున్నది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,720.6 కోట్లు కోల్పోయి రూ.14,12,613.37 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.2,008.04 కోట్లు నష్టపోయి రూ.5,63,589. 24 కోట్ల వద్ద ముగిసింది. ► ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఎస్బీఐని దాటేయడంతో పాటు దేశంలోనే అత్యంత ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థగా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.26,380.94 కోట్లు పెరిగి రూ.6,31, 679.96 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,170.75 కోట్లు పుంజుకుని రూ.6,84,305.90 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.3,163.72 కోట్లు పెరిగి రూ.7,07,373.79 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,058.48 కోట్లు పుంజుకుని రూ.5,84,170.38 కోట్లకు పెరిగింది. -
Stock market: మూడో రోజూ వెనకడుగు
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇందుకు కారణం. ► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది. -
దలాల్ స్ట్రీట్‌లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్‌లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్‌సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్‌అండ్‌టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్‌డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్ పంజా..!
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్‌ను ఒక్కసారిగా బేర్ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు క్షీణించి 70,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 21,150 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద కొత్త జీవికాల గరిష్టాలు నమోదు చేశాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ట్రేడింగ్ ముగిసే అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,134 పాయింట్లు పతనమై 70,303 వద్ద, నిఫ్టీ 366 పాయింట్లు క్షీణించి 21,087 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 3.42%, 3.12% చొప్పున నష్టపోయాయి. ► ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.8.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.350 లక్షల కోట్లకు దిగివచ్చింది. ► సెన్సెక్స్ సూచీ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్(0.19%) మినహా మిగిలిన 29 షేర్లూ 4% వరకు నష్టపోయాయి. ► రంగాల వారీగా యుటిలిటీ 4.65%, టెలికం 4.36%, విద్యుత్ 4.33%, సరీ్వసెస్ 4.20%, మెటల్, కమోడిటీ, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 3.50% వరకు నష్టపోయాయి. ► ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యూకోబ్యాంక్ 10.50%, ఐఓబీ 10%, సెంట్రల్ బ్యాంక్ 8%, పీఎస్బీ, పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5% పతనయ్యాయి. ఇండియన్ బ్యాంక్, బీఓబీ షేర్లు 4–3% పడ్డాయి. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 4% క్రాష్ అయ్యింది. దుమ్మురేపిన డోమ్స్.. డోమ్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ హిట్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.790)తో పోలిస్తే 77% ప్రీమియంతో రూ.1,400 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 82% ర్యాలీ చేసి రూ.1,434 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 68% లాభంతో రూ.1,331 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.8,077 కోట్లుగా నమోదైంది. కాగా, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.493)తో పోలిస్తే 12% ప్రీమియంతో రూ.613 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 27% ర్యాలీ చేసి రూ.625 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని వద్ద తాకింది. చివరికి 10% లాభంతో రూ.544 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.5,818 కోట్లుగా నమోదైంది. ఇవీ నష్టాలకు కారణాలు లాభాల స్వీకరణ విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ప్రోద్బలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ గత నెల రోజుల్లో ఏకంగా 7.2% లాభపడింది. పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. సాంకేతిక చార్టులు ‘అధిక కొనుగోలు’ సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మళ్లీ కరోనా భయాలు... దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్.1కి సంబంధించి 292 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం ద్వారా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ ‘రష్’ గడిచిన నెల రోజుల్లో ప్రధాన విభాగం నుంచి 11 కంపెనీలతో సహా అనేక చిన్న, మధ్య తరహా స్థాయి కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈ పబ్లిక్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అవసరమైన లిక్విడిటి(ద్రవ్య)ని పొందేందుకు హెచ్ఎన్ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పాల్పడంతో సెకండరీ మార్కెట్ ఒత్తిడికి లోనై ఉండొచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
టాటా టెక్ సూపర్ హిట్.. గాంధార్ ఆయిల్ ఘనం
న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 140% ప్రీమియంతో రూ.1,200 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 180% ఎగసి రూ.1,400 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 163% లాభపడి రూ.1,314 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2023) లిస్టింగ్ రోజు అత్యధిక లాభాలు పంచిన షేరుగా రికార్డు సృష్టించింది. కంపెనీ విలువ రూ.52,940 కోట్లుగా నమోదైంది. గాంధార్ సెంచరీ... గాంధార్ ఆయిల్ రిఫైనరీ షేరు ఘనంగా లిస్టయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.169)తో పోలిస్తే 75% ప్రీమియంతో రూ.295 వద్ద లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌లో మరింత దూసుకెళ్లింది. ఒక దశలో 104% ర్యాలీ చేసి రూ.345 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగింపు సమయంలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరికి 78% లాభంతో రూ.301.50 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మొత్తం 29.06 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,951 కోట్లుగా నమోదైంది. ఫెడ్ ఫినా.. ప్చ్! ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ. 140)తో పోలిస్తే 1.50% డిస్కౌంట్‌తో రూ.138 వద్ద లిస్టయ్యింది. ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లిస్టింగ్ నష్టాలు భర్తీ చేసుకొంది. ఒక దశలో 6% ర్యాలీ చేసి రూ.148 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో చివరికి ఇష్యూ ధర రూ.140 వద్దే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.5,378 కోట్లుగా నమోదైంది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల కదలికలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. హెచ్డీఎఫ్సీ వీలినం, గిఫ్ట్‌నిఫ్టీ ఇండెక్స్ కార్యకలాపాల ప్రారంభం(సోమవారం) అంశాలు కీలకం కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. గతవారంలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు, నిఫ్టీ 524 చొప్పున లాభపడ్డాయి. దేశవ్యాప్తంగా వర్షపాత నమోదు, ప్రోత్సాహకర ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, హెచ్డీఫ్సీ–హెచ్డీఫ్సీ బ్యాంక్ విలీనం నుంచి సానుకూల అప్డేట్ అంశాల నేపథ్యంలో గతవారం సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ‘‘ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుత నెలకొని ఉన్న సానుకూల పరిమాణాల దృష్ట్యా సూచీలు స్వల్పకాలం పాటు ముందుకే కదిలే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 19250–19500 స్థాయిని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడే వీలుంది. దిగువ స్థాయిలో 19000 వద్ద బలమైన తక్షణ మద్దతును కలిగి ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా మార్కెట్ శనివారం విడుదలైన ఆటో కంపెనీల జూన్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇవాళ భారత, అమెరికా దేశాల జూన్ తయారీ రంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. దేశీయ సేవారంగ పీఎంఐ, అమెరికా మే ఫ్యాక్టరీ ఆర్డర్లు డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. యూరోజోన్, యూకే దేశాలూ ఇదే వారంలో తయారీ, సేవారంగ డేటాలను విడుదల చేయనున్నాయి. శుక్రవారం జూన్ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్ 18న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జూన్‌లో మొత్తం రూ. 47,148 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రికార్డు స్థాయిని చేరుకోగలిగాయి. ‘‘భారత ఈక్విటీ మార్కెట్‌పై ఎఫ్ఐఐలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కోవిడ్ అనంతరం చైనా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం నేపథ్యంలో ఈ ఏడాది తొలి రెండు నెలలు భారత్‌లో విక్రయించి, చైనాలో కొనుగోలు చేశారు. అయితే ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తుందనేందుకు సూచికగా వెలువడి ఆర్థిక డేటాతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు’’ అని వీకే విజయ్ కుమార్ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
64,000 బుల్ 19,000 కొత్త రికార్డుల్..!
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లో బుధవారం రికార్డుల మోత మోగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం మరింత ప్రోత్సాహాన్నిచి్చంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 64,000 స్థాయిని తాకింది. నిఫ్టీ ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న 19,000 మైలురాయిని ఎట్టకేలకు అందుకుంది. సెన్సెక్స్ ఉదయం 286 పాయింట్లు లాభంతో 63,702 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 634 పాయింట్లు పెరిగి 64,050 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 18,908 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌లో 194 పాయింట్లు ఎగసి 19,011 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 155 పాయింట్ల లాభంతో 18,972 వద్ద స్థిరపడింది. మెటల్, ఫార్మా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సూచీల ఆల్‌టైం హై నమోదు తర్వాత చిన్న కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08% పెరిగి ఫ్లాటుగా ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 0.73 శాతం లాభపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,350 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,021 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల్లో రూ.3.43 లక్షల కోట్లు సెన్సెక్స్ రెండురోజుల వరుస ర్యాలీతో బీఎస్ఈలో 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 294.11 లక్షల కోట్లకు చేరింది. ఈ జూన్ 21 తేదిన బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ రూ. 294.36 లక్షల కోట్లు నమోదై జీవితకాల రికా ర్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ‘‘దాదాపు ఏడు నెలల స్ధిరీకరణ తర్వాత తర్వాత నిఫ్టీ 19వేల స్థాయిని అందుకోగలిగింది. ఆర్థిక వృద్ధి ఆశలు, వడ్డీరేట్ల సైకిల్ ముగింపు అంచనాలు, గత కొన్ని రోజులు గా విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయ అంశాలు సూచీ ల రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఫార్మా, మెటల్ షేర్లకు ఎక్కువగా డిమాండ్ లభించింది’’ అని యస్ సెక్యూరిటీస్ గ్రూప్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు ఒక బిలియన్ డాలర్ విలువైన వాటాను కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 5.34% లాభపడింది. అదానీ ట్రాన్స్మిషన్ 6%, అదానీ పోర్ట్స్ 5%, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ 2%, ఏసీసీ 1%, అదానీ పవర్ అరశాతం, అంబుజా సిమెంట్స్ 0.10 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీలు 0.16%, 0.32 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ట్రేడింగ్‌లో 44,508 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 206 పాయింట్ల లాభంతో 44,328 వద్ద స్థిరపడింది. -
5 నెలల గరిష్టానికి మార్కెట్
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు, ఉపశమించిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ దూకుడు చూపాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్‌చేసి 62,346కు చేరింది. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 18,399 వద్ద నిలిచింది. వెరసి గతేడాది డిసెంబర్ 14 తర్వాత తిరిగి మార్కెట్లు గరిష్టాలకు చేరాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ప్రోత్సాహానికితోడు.. ఏప్రిల్‌లో టోకు ధరలు మైనస్‌కు చేరడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు పురోగమించి 62,563కు చేరింది. నిఫ్టీ 18,459ను తాకింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. రియల్టీ 4.3 శాతం జంప్‌చేసింది. రిటైల్, టోకు ధరలు తగ్గడంతో వడ్డీ రేట్లకు చెక్ పడనున్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 2–0.7 శాతం లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ యథాతథంగా నిలిచింది. రియల్టీ కౌంటర్లలో శోభా 11.5 శాతం దూసుకెళ్లగా.. డీఎల్ఎఫ్, మహీంద్రా లైఫ్, ప్రెస్జీజ్ ఎస్టేట్స్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, లోధా 7.4–3.4 శాతం మధ్య జంప్ చేశాయి. టాటా మోటార్స్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, టాటా మోటార్స్ 3 శాతం పుంజుకోగా.. ఐటీసీ, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, టాటా స్టీల్, విప్రో, ఐషర్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే అదానీ ఎంటర్, సిప్లా, బీపీసీఎల్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, మారుతీ, అదానీ పోర్ట్స్, టీసీఎస్ 3–0.7 శాతం మధ్య నీరసించాయి. చిన్న షేర్లు ఓకే మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్ కనిపించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,856 లాభపడితే, 1,802 డీలాపడ్డాయి. నగదు విభాగంలో వారాంతాన రూ. 1,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం మరింత అధికంగా రూ. 1,685 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 191 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేశాయి. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు రూ. 23,152 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! విదేశీ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారల్ 0.25 శాతం బలపడి 74.34 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు నీరసించి 82.31కు చేరింది. సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్‌లు మళ్లీ ప్రారంభం స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈ తాజాగా సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్‌లను సోమవారం పునఃప్రారంభించింది. ఈ కాంట్రాక్టులకు సంబంధించిన ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజును తగ్గించడంతో పాటు ఎక్స్పైరీ రోజును కూడా గురువారం నుంచి శుక్రవారానికి మార్చినట్లు సంస్థ ఎండీ సుందరరామన్ రామమూర్తి ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. సెన్సెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజు 15 నుంచి 10కి, బ్యాంకెక్స్ లాట్ సైజును 20 నుంచి 15కి తగ్గించారు. అధిక రాబడులిచ్చేందుకు ఆస్కారమున్న అత్యంత రిస్కీ సాధనాలుగా డెరివేటివ్స్‌ను పరిగణిస్తారు. 2000లో బీఎస్ఈ తొలిసారిగా సెన్సెక్స్–30 డెరివేటివ్స్ (ఆప్షన్స్, ఫ్యూచర్స్)ను ప్రవేశపెట్టింది. -
సూచీలకు మళ్లీ లాభాలు
ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్ సూచీలకు గురువారం మళ్లీ లాభాలొచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ దఫా చివరిది కావచ్చంటూ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన దేశీయ కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1% వరకు బలపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు పెరిగి 61,258 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 605 పాయింట్లు ర్యాలీ చేసి 61,797 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 556 పాయింట్ల లాభంతో 61,749 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు దూసుకెళ్లి 18,267 గరిష్టాన్ని తాకింది. చివరికి 166 పాయింట్లు బలపడి 18,256 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో ఒక్క ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.83%, 0.82% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1415 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.442 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి 275.13 లక్షల కోట్లకు చేరింది. ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్ సూచీలు లాభపడగా., కొరియా ఇండెక్స్ నష్టపోయింది. ఈసీబీ పావుశాతం వడ్డీరేట్ల పెంపుతో యూరప్ మార్కెట్లు 0.50 – 1% క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీస్ ‘బై’ రేటింగ్‌తో ఫుడ్ డెలీవరీ దిగ్గజం జొమాటో షేరు 3% పైగా లాభపడి రూ.65.63 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికంలో నికరలాభం 13% బజాజ్ కన్జూమర్ కేర్ షేరు నాలుగుశాతం పెరిగి రూ.172 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో పదిశాతం దూసుకెళ్లి రూ.182 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► అంచనాలకు మించి మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడంతో ఏబీబీ షేరు ఐదున్నర శాతం బలపడి రూ.3,646 వద్ద స్థిరపడింది. -
Sensex: ఆఖరి గంటలో కొనుగోళ్లు
ముంబై: ట్రేడింగ్ చివర్లో ఇంధన, టెలికాం, వినిమయ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభం తర్వాత కొద్దిసేపు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ తర్వాత సానుకూలంగా కదిలాయి. అమ్మకాల ఒత్తిడితో చివరి గంటవరకు ఊగిసలాట ధోరణి ప్రదర్శించి పరిమిత లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,587 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 347 పాయింట్ల పరిధిలో 59,490 వద్ద కనిష్టాన్ని, 59,837 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 66 పాయింట్లు లాభపడి 59,632 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,584 – 17,684 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఆరు పాయింట్లు స్వల్ప లాభంతో 17,624 వద్ద నిలిచింది. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, కమోడిటీ, ఐటీ, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలపడి 82.14 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,169 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.833 కోట్ల షేర్లను అమ్మేశారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మ్యూచువల్ ఫండ్ నిర్వహణకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించడంతో బ్రోకరేజ్ దిగ్గజం ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.80 వద్ద లాకయ్యింది. ► క్యూ4 పలితాలు మెప్పించకపోవడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 5% పడి రూ. 439 వద్ద స్థిరపడింది. -
తొమ్మిదో రోజూ లాభాలే
ముంబై: ఆఖర్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల ర్యాలీ తొమ్మిదోరోజూ కొనసాగింది. గడిచిన రెండేళ్లలో సూచీలు వరుసగా తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 29 పాయింట్ల నష్టంతో 60,364 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 405 పాయింట్ల పరిధిలో కదలాడి 60,081 వద్ద కనిష్టాన్ని 60,487 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 38 పాయింట్ల స్వల్ప లాభంతో 60,431 వద్ద ముగిసింది. నిఫ్టీ అయిదు పాయింట్లను కోల్పోయి 17,807 వద్ద 17,635 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,730 వద్ద కనిష్టాన్ని 17,842 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఇంధన, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.33%, స్మాల్ క్యాప్ సూచీ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 81.85 వద్ద స్థిరపడింది.విదేశీ ఇన్వెస్టర్లు రూ.222 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.274 కోట్ల షేర్లను అమ్మేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి సోమవారం యథావిధిగా ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ‘‘టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల సందర్భంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్ఎస్ఐ) పనితీరు, అవుట్‌లుక్‌పై యాజమాన్యం ఆందోళనకర వ్యాఖ్యలతో దేశీయ ఐటీ రంగ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ.., బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చని ఎఫ్ఓఎంసీ మినిట్స్ సూచించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
వారాంతాన బుల్ రంకెలు
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో వారాంతాన బుల్ రంకెలు వేసింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల అండతో శుక్రవారం స్టాక్ సూచీలు లాభాల జోరు కనబరిచాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ, కీలక రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకుంది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన స్టాక్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు నెలరోజుల్లో అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు బలపడి 59,809 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద నిలిచింది. చిన్న, మధ్య తరహా షేర్లకు మోస్తారు స్థాయిలో రాణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతానిపైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.246 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,090 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ సేవారంగం పుంజుకోవడం, ఎఫ్ఐఐల రెండోరోజూ కొనుగోళ్లతో డాలర్ మారకంలో రూపాయి విలువ 63 పైసలు బలపడి నెల గరిష్టం 81.97 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు గురువారం ఒకశాతం బలపడ్డాయి. ఆసియా, యూరప్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడయ్యాయి. రోజంతా లాభాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 59,241 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు బలపడి 17,451 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,058 పాయింట్లు దూసుకెళ్లి 59,967 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు ఎగసి 17,645 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. లాభాలు ఎందుకంటే..: అంతర్జాతీయ ఇన్వెస్టర్ జీక్యూజీ పాట్నర్ అదానీ గ్రూప్‌నకు చెందిన 2 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడంతో మార్కెట్ వర్గాలకు కొంత ఊరట లభించింది. జీక్యూజీ ఒప్పందంతో సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని అదానీ గ్రూప్ తెలపడంతో ఎక్స్పోజర్ ఉన్న బ్యాంకింగ్ భారీగా ర్యాలీ చేశాయి. ఫిబ్రవరి సేవల రంగం 12 ఏళ్లలోనే బలమైన వృద్ధిని నమోదుచేసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ నెల గరిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండోరోజూ కొనుగోళ్ల చేపట్టడం కూడా కలిసొచ్చాయి. వచ్చే ద్రవ్య పాలసీ సమావేశం నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉండొచ్చని, అలాగే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి రేట్ల పెంపు సైకిల్ అగిపోవచ్చంటూ అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మార్కెట్లో మరిన్ని విశేషాలు.. ► ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థల్లో విశ్వాసాన్ని నింపేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా జీక్యూజీ పార్ట్నర్స్ రూ.15,446 కోట్ల కొనుగోలు ఒప్పందంతో శుక్రవారం ఈ గ్రూప్‌లో మొత్తం పది షేర్లూ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ అత్యధికంగా 17% దూసుకెళ్లింది. అదానీ పోర్ట్స్ 10%, అంబుజా సిమెంట్స్ 6%, ఏసీసీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% చొప్పున లాభపడ్డాయి. గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ గ్రూప్‌లో రూ.1.42 కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ. 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 263 లక్షల కోట్లకు చేరింది. ఇదే సూచీలో 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), అల్ట్రాటెక్ (1%), ఏషియన్ పేయింట్స్ (0.19%), నెస్లే లిమిటెడ్ (0.17%) మాత్రమే నష్టపోయాయి. ► ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు నాటికి 5.44 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 38.41 లక్షల షేర్లను జారీ చేయగా 2.08 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
టెక్నాలజీ వైపు.. స్టాక్ బ్రోకర్ల చూపు!
న్యూఢిల్లీ: వ్యాపార సేవల్లో టెక్నాలజీ వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవడంపై అత్యధిక శాతం స్టాక్ బ్రోకర్లు దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) బృందంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నారు. బ్రోకరేజి సంస్థల సమాఖ్య అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్ఛేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) నిర్వహించిన సర్వేలో సుమారు 71 శాతం బ్రోకరేజీలు ఈ అభిప్రాయాలను వెల్లడించాయి. ఏఎన్ఎంఐలో 900 సంస్థలకు సభ్యత్వం ఉంది. స్టాక్‌బ్రోకింగ్ పరిశ్రమలో ఆర్థిక సాంకేతికతల పాత్ర, వాటి వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాలపై ఏఎన్ఎంఐ గత నెలలో స్టాక్టెక్ సర్వేను నిర్వహించింది. అధునాతన రీతుల్లో సైబర్ దాడులు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా తమను, కస్టమర్లను రక్షించుకునేందుకు ఆర్థిక సంస్థలు టెక్నాలజీపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోందని ఇందులో వెల్లడైంది. దీని ప్రకారం గతేడాది 39 శాతం స్టాక్‌బ్రోకింగ్ కంపెనీలు ఐటీ సంబంధ సమస్యలు ఎదుర్కొన్నాయి. ఫిన్‌టెక్ కంపెనీల బాట... ఎక్కువగా సాంకేతికతతో పని చేసే ఫిన్‌టెక్ కంపెనీలు పెరుగుతుండటంతో ..వాటితో దీటుగా పోటీపడేందుకు సాంప్రదాయ ఆర్థిక సంస్థలు కూడా తమ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తోంది. 2022–23లో సగటున 30 శాతం పెట్టుబడులు సాంకేతికతపైనే వెచ్చించవచ్చని అంచనాలు ఉన్నాయి. సర్వే ప్రకారం వ్యాపార ప్రక్రియల్లో 33 శాతం భాగం ఫిజికల్ నుంచి డిజిటల్‌కు మారాయి. డిజిటల్‌కు మారడం వల్ల ట్రేడింగ్ లావాదేవీల సమర్ధత, వేగం పెరగడం.. వ్యయాల తగ్గుతుండటం, అందుబాటులో ఉండే పరిస్థితి మెరుగుపడటం వంటి అంశాలు ఇందుకు కారణం. కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితిలోనూ కమ్యూనికేషన్‌కు ఆటంకం కలగకుండా పరిశ్రమ నిలబడేలా టెక్నాలజీ తోడ్పడిందని సర్వే నివేదిక పేర్కొంది. సైబర్ దాడుల నుంచి వ్యాపారాలు సురక్షితంగా ఉండేలా కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనలు దోహదపడగలవని 92 శాతం సంస్థలు ఆశాభావంతో ఉన్నట్లు వివరించింది. -
స్టాక్ మార్కెట్లో లాభాల పంట,బుల్ రంకెలేసింది..రికార్డుల మోత మోగించింది
ముంబై: ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందనే ఆశలతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఎనిమిదో రోజూ కొనసాగింది. సానుకూల పీఎంఐ గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ర్యాలీ వేగం తగ్గింది. ముఖ్యంగా ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లు రాణించడంతో గురువారం సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 63,284 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 483 పాయింట్లు ఎగిసి 63,583 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 18,813 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 130 పాయింట్లు దూసుకెళ్లి 18,888 వద్ద కొత్త గరిష్టాన్ని నెలకొల్పింది. ఇంధన, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ అరశాతం ర్యాలీతో 1.36 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.289.86 కోట్లకు చేరింది. డిసెంబర్ తొలి ట్రేడింగ్ సెషన్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1566 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2665 కోట్ల షేర్లను కొన్నారు. డిసెంబర్లో వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదిస్తామని ఫెడ్ రిజర్వ్ ప్రకటన తర్వాత ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 81.22 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►సిమెంట్ షేర్లలో గురువారం ర్యాలీ చోటు చేసుకుంది. ఇన్పుట్ వ్యయాలు తగ్గడంతో పాటు వర్షాకాలం ముగియడంతో డిమాండ్ పుంజుకొని కంపెనీల మార్జిన్లు పెరగవచ్చనే అంచనాలతో ఈ రంగ షేర్లకు డిమాండ్ లభించింది. దాల్మియా భారత్, బిర్లా కార్పొరేషన్, జేకే సిమెంట్, ఇండియా సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, అంబుజా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 1–5 శాతం ర్యాలీ చేశాయి. ► జొమాటో షేరు రెండున్నర శాతం పెరిగి రూ.67 వద్ద స్థిరపడింది. ఆలీబాబాకు చెందిన ఆలీపే సింగపూర్ హోల్డింగ్ సంస్థ బుధవారం జొమాటోకు చెందిన 3.07 శాతం వాటా విక్రయించింది. దీంతో గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు ఆరుశాతం ర్యాలీ చేసింది. -
రంకెలేస్తున్న బుల్..దలాల్ స్ట్రీట్‌లో మళ్లీ రికార్డుల మోత
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో మళ్లీ రికార్డుల మోత మోగింది. స్టాక్ సూచీలు సోమవారం సరికొత్త శిఖరాలకు చేరి కొత్త రికార్డు నెలకొల్పాయి. వరుసగా అయిదోరోజూ లాభాలు కొనసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పదినెలల కనిష్టానికి దిగిరావడం కలిసొచ్చింది. భవిష్యత్తుల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుదల నెమ్మదించవచ్చనే అంచనాలు బుల్స్‌కు బలాన్నిచ్చాయి. డాలర్ ఇండెక్స్ 106 స్థాయికి పతనం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడింది. భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు నాలుగుశాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఇంధన, ఆటో, పారిశ్రామిక, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. సెన్సెక్స్ తాజా జీవిత గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ కొత్త రికార్డు స్థాయిని లిఖించింది. అయితే గరిష్టాల స్థాయి వద్ద లాభాల స్వీకరణతో కాస్త వెనక్కి తగ్గి ముగిశాయి. మెటల్, టెలికం, ఐటీ, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చైనాలో కోవిడ్ లాక్డౌన్ విధింపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. నష్టాల్లోంచి రికార్డు స్థాయిలకి... సెన్సెక్స్ ఉదయం 278 పాయింట్ల నష్టంతో 62,016 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 18,431 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలోనే నష్టాల్లోంచి తేరుకున్న సూచీలు క్రమంగా రికార్డు స్థాయిల దిశగా కదిలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 407 పాయింట్లు దూసుకెళ్లి 62,701 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు బలపడి 18,614 వద్ద కొత్త ఆల్‌టైం హై స్థాయిని తాకింది. దీంతో గతేడాది(2021) అక్టోబరు 19న నమోదైన 18,604 జీవితకాల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఆఖరి గంటలో లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 211 పాయింట్ల లాభంతో 62,505 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 18,563 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు స్థాయిలు కూడా రికార్డు గరిష్టాలు కావడం విశేషం. మార్కెట్లో మరిన్ని సంగతులు ►గతేడాది(2021) అక్టోబరు 19న నమోదైన 18,604 ఆల్‌టైం హై స్థాయిని అధిగమించేందుకు నిఫ్టీకి 275 ట్రేడింగ్ సెషన్ల సమయం పట్టింది. అలాగే ఈ ఏడాది(2022) జూన్ 17న ఏడాది కనిష్ట స్థాయి(15,183) నుంచి 22% ర్యాలీ చేసింది. ►క్రూడాయిల్ ధరల పతనం రిలయన్స్‌కు కలిసొచ్చింది. బీఎస్ఈలో నాలుగుశాతం లాభపడి రూ.2,722 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి మూడున్నర శాతం లాభంతో రూ.2,708 వద్ద స్థిరపడింది.