ప్రపంచ దేశాల్లో నెలకొన్న ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. దీంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
బుధవారం రష్యా–ఉక్రెయిన్ యుద్ధ వేడి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు వంటి తదితర ప్రతికూల అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో బుధవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు పతనమై 56,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 వద్ద ముగిసింది. అయితే ఆ ప్రభావం గురువారం సైతం మార్కెట్‌లపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ అనూహ్యంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అమెరికాలో క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ముదుపర్లు పెట్టుబుడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఆ ప్రభావంతో పాటు భారత్ ఎకానమీ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండడంతో దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 9.17 నిమిషాలకు నిఫ్టీ 256 పాయింట్లు లాభపడి 57082 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 17122 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
హెచ్‌యూఎల్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా,యూపీఎల్,అపోల్ ఆస్పిటల్,ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,ఎథేర్ మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్,ఎసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా,భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టీసీఎస్, ఎన్టీపీసీ,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment