Sensex BSE
-
మూడో రోజూ లాభాలు
ముంబై: ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి. ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ... కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది. -
71,000 శిఖరంపై సెన్సెక్స్
ముంబై: ఐటీ, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 71,000 పాయింట్ల ఎగువన ముగిసింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు తాజా గరిష్టాలు నమోదు చేశాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల ప్రభావం భారత్‌తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై కొనసాగింది. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు అంశాలు కలిసొచ్చాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 70,804 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 1,092 పాయింట్లు ఎగసి 71,484 వద్ద కొత్త జీవితకాల గరిష్టం తాకింది. చివరికి 970 పాయింట్లు లాభపడి 71,484 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 310 పాయింట్లు బలపడి 21,492 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 274 పాయింట్లు లాభపడి 21,457 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియలీ్ట, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► సూచీల రికార్డుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ గత ట్రేడింగ్ సెషన్లలో రూ.8.11 లక్షల కోట్ల పెరిగి రూ.357.87 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఐదు మాత్రమే నష్టపోయాయి. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 1,658 పాయింట్లు, నిఫ్టీ 487 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి. ఇరు సూచీలకిది వరుసగా ఏడో వారం లాభాల ముగింపు. ► పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకు చివరిరోజు నాటికి 93.40 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 88.37 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 82.54 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 115.97 రెట్లు, రిటైల్ కోటా 69.10 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటా 66.47 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ► డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం, స్టాక్ సూచీల కొత్త శిఖరాలకు ► ఫెడ్ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, ద్రవ్యోల్బణం దిగివచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో ఐటీ షేర్లు రెండో రోజూ లాభపడ్డాయి. ఇనీ్ఫబీమ్ 12%, జెన్సార్ టెక్ 11%, మెస్టేక్ 6.50%, హెచ్‌సీఎల్ టెక్ 6%, పర్సిస్టెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 5%, కో ఫోర్జ్, సైయంట్ 4%, టెక్ మహీంద్రా 3 చొప్పున లాభపడ్డాయి. ► బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.91.24 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.ఒక లక్షల కోట్లను అధిగిమించింది. -
70,000 వాలా!
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీలో భాగంగా సెన్సెక్స్ సరికొత్త మైలురాయిని తాకింది. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 70,000 పాయింట్లను తాకింది. మరో సూచీ నిఫ్టీ 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచింది. కొంతకాలంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది., ఆర్బీఐ వరుసగా అయిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు దేశీయ వృద్ధి అవుట్‌లుక్‌ను పెంచింది. అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. దీంతో కొన్ని వారాలుగా దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) నిర్ణయాలు బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. ఒడిదుడుకులున్నా.., సరికొత్త శిఖరాలకు .... ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 69,926 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్లు నష్టపోయి 20,965 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లకు రాణించడంతో ప్రథమార్ధంలోనే 232 పాయింట్లు పెరిగి 70,000 స్థాయిపై 70,058 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు బలపడి 21,026 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అయితే ద్వితీయార్ధంలో రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు కొంతమేర లాభాలు కొల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 69,929 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు బలపడి 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో 20,997 నిలిచింది. ‘‘కొత్త ఏడాదికి సరిగ్గా 20 రోజుల ముందు సెన్సెక్స్ 70 వేల పాయింట్ల ధమాకా ఇచి్చంది. అయితే నేడు(మంగళవారం) అమెరికా, భారత్‌ల నవంబర్ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ)డేటా వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. మరో ఏడాది కాలంలో సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక, ప్రభుత్వ రంగాల షేర్లు ర్యాలీకి ప్రాతినిథ్యం వహించవచ్చు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లో కొంత అస్థిరతర ఉండొచ్చు.’’ అని మార్కెట్ నిపుణుడు విజయ్ కేడియా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నిధుల సమీకరణ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టింగ్ ప్రణాళికల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు. బీఎస్ఈలో 10%పైగా లాభపడి రూ.60.57 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 16% ఎగసి రూ.63.69 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► అమెరికా నియంత్రణ సంస్థ హైదరాబాద్ రీసెర్చ్ ఫ్యాకల్టీ యూనిట్‌కు 3 అభ్యంతరాలు జారీ చేయడంతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 5% నష్టపోయి రూ.5,473 వద్ద స్థిరపడింది. ► ఓఎన్జీసీ నుంచి రూ.1,145 కోట్ల ఆర్డరు దక్కించుకోవడంతో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ షేరు 3% పెరిగి రూ.2118 వద్ద నిలిచింది. ► సెన్సెక్స్ 65,000 స్థాయి నుంచి 70,000 పాయింట్లకు చేరేందుకు కేవలం 110 రోజుల సమయం పట్టింది. ► 1979లో 100 పాయింట్ల వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించిన సెన్సెక్స్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 70 వేల స్థాయికి చేరుకుంది. అంటే 44 ఏళ్లలో సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు 700 రెట్ల లాభాలు పంచింది. ► సెన్సెక్స్ కొత్త రికార్డు స్థాయి నెలకొల్పడంతో సోమవారం రూ.1.85 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.351.09 లక్షల కోట్లకు చేరింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రతికూల అంశాలు ప్రభావం చూపడంతో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 64,756.11 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 65,014.06 పాయింట్ల గరిష్ఠానికి, 64,580.95 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. ముగింపు దశలో ఒక్కసారిగా కొనుగోళ్లు పుంజుకొని లాభాల్లోకి వెళ్లాయి. చివరకు 72 పాయింట్ల లాభంతో 64,904 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో 19,425 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా కంన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్‌లు లాభాలు గడించగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. -
భారత్ లోని 5 కంపెనీలు వల్లే ద్రవ్యోల్బణం పెరుగుతోంది
-
నిపుణుల అంచనాల తలకిందులు.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ సోమవారం ఉదయం దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఉదయం 9.40 గంటల సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్లు నష్టపోయి 59239 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ఉండగా 76 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆ కంపెనీకి చెందిన అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్ని ముటగట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, ఐసీఐసీ బ్యాంక్, ఎస్బీఐ, నెస్లే, బీపీసీఎల్,కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏసియన్ పెయింట్స్,హెచ్డీఎఫ్సీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, బ్రిటానియా షేర్లు పాజిటీవ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో,యూపీఎల్,ఇన్ఫోసిస్,ఎథేర్ మోటార్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎయిర్టెల్,హెచ్‌సీఎల్,టెక్ మహీంద్రా, విప్రో,టీసీఎస్, హీరో మోటో కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు, నష్టాల్లో దేశీ స్టాక్ సూచీలు
జాతీయ,అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.అమెరికాతో పాటు ఆసియా మార్కెట్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, భారత్‌లో యూనియన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మదపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. వెరసి మంగళవారం ఉదయం 9.37 గంటల సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టంతో 59341 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ అత్యల్పంగా 47 పాయింట్ల నష్ట పోయి 17601 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక బీపీసీఎల్, ఓఎన్జీసీ, జేఎస్‌డ్ల్యూ స్టీల్, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎం అండ్ ఎం, మారుతి సుజికి, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, సిప్లా, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్, టీసీఎస్, లార్సెన్,హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
వేదాంత డివిడెండ్ రూ.17.50
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్ మరోసారి భారీ డివిడెండ్‌ను వాటాదారులకు ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున 2022–23 సంవత్సరానికి మూడో మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని మంగళవారం నాటి బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఈ రూపంలో కంపెనీ రూ.6,505 కోట్లను చెల్లించనుంది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.58,597 కోట్లుగా ఉంది. రుణాలు తీర్చడానికి బదులు వాటాదారులకు భారీ మొత్తంలో డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ ప్రాధాన్యం ఇవ్వడం గమనించాలి. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో వాటా ఉంది. దీంతో డివిడెండ్ రూపంలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ తేదీగా నవంబర్ 30ని ప్రకటించింది. వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదటి మధ్యంతర డివిడెండ్ కింద రూ.31.50, రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.19.50 చొప్పున ఇవ్వడం గమనించాలి. ఈ మొత్తం కలిపి చూస్తే ఏడాది కాలంలో రూ.68.50 వరకు డివిడెండ్ కింద ఇచ్చినట్టయింది. -
స్టాక్ మార్కెట్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నమోదు
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)లను లిస్టింగ్‌కు అనుమతించడం ద్వారా పెట్టుబడుల సమీకరణ మార్గాలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశలో ఆర్ఆర్బీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు వీలుగా ఆర్థిక శాఖ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక మూలాలు తదితర అంశాలను రూపొందించింది. వీటి ప్రకారం గత మూడేళ్లలో కనీసం రూ. 300 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా నిబంధనలు డిమాండ్ చేస్తున్న 9 శాతం లేదా అంతకుమించిన కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్)ని గత మూడేళ్లలో నిలుపుకుని ఉండాలి. ఈ బాటలో మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తుండటంతోపాటు.. గత ఐదేళ్లలో మూడేళ్లు కనీసం రూ. 15 కోట్లు నిర్వహణ లాభం సాధించిన సంస్థనే లిస్టింగ్‌కు అనుమతిస్తారు. సంస్థ నష్టాలు నమోదు చేసి ఉండకూడదు. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు ఈక్విటీపై కనీసం 10 శాతం రిటర్నులు అందించిన సంస్థకు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో ఆర్ఆర్బీలు వ్యవసాయ రంగానికి రుణాలందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రస్తుతం ఆర్ఆర్బీలలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటాను కలిగి ఉంటోంది. మరో 35 శాతం సంబంధిత పీఎస్‌యూ బ్యాంకుల వద్ద, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. -
స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్! రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి!
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్ ఆయిల్ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేశాయి. దీంతో సోమవారం మొత్తం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతననమవడంతో రోజంతా బ్లడ్ బాత్ కొనసాగింది. కేవలం ఒక్కరోజులోనే రూ7లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1456 పాయింట్ల భారీ నష్టంతో 52,846 వద్ద నిఫ్టీ 427 పాయింట్ల నష్టంతో 15,744 వద్ద ట్రేడింగ్ ముగిసింది. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయాయి. బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, మెటల్, ఐటీ, రియల్ ఎస్టేట్, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్‌తో సహా ఇలా అన్నీ సెక్టార్ల షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 2020 తర్వాత తొలిసారిగా గత వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలా వారం రోజుల పాటు నష్టాలతో కొట్టుమిట్టాడాయి. కానీ ఈ వారంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగిన నష్టాలకు స్టాక్ మార్కెట్లు చెక్ పెట్టాయి. దీంతో సోమవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లుతో 0.34 శాతం పెరిగి 52,974 వద్ద ముగియగా, నిఫ్టీ 60 పాయింట్లతో 0.38 శాతం పెరిగి 15,842 వద్ద స్థిరపడింది. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్,ఎన్టీపీసీ,యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్ బీఐ, మారుతి సుజికీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాలతో ముగియగా.. ఆల్ట్రాటెక్ సిమెంట్,శ్రీ సిమెంట్, ఏసియన్ పెయింట్స్,ఐటీసీ, గ్రాసిం, దివిస్ ల్యాబ్స్,టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్ షేర్లు నష్టాల పాలయ్యాయి. -
కోలుకునేది ఎప్పుడో, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్బీఐ ఆకస్మిక రెపోరేటు పెంపుతో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 927 పాయింట్లు భారీగా నష్టపోయి 54774 వద్ద నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 16401 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.బ్లూడార్ట్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్, అంబీర్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజికీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
ఒడిదుడుకుల మార్కెట్, పరుగులు పెట్టిన ఐటీ షేర్లు!
ముంబై: ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమైన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 898 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ చివరికి 33 పాయింట్ల లాభంతో 55,702 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 268 పాయింట్లు వరకు ర్యాలీ చేసింది. మార్కెట్ ముగిసే సరికి ఐదు పాయింట్ల అతి స్వల్ప లాభంతో 16,683 వద్ద నిలిచింది. దీంతో సూచీలు మూడురోజుల నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఐటీ, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు అరశాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,075 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,229 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 16 పైసలు బలపడి 76.24 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీ ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. భారీ లాభాల నుంచి ఫ్లాట్‌గా ముగింపు ఆర్బీఐ ఆకస్మిక రెపోరేటు పెంపుతో బుధవారం భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 586 పాయింట్లు పెరిగి 56,255 వద్ద, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 16,855 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో సెన్సెక్స్ 898 పాయింట్లు దూసుకెళ్లి 56,567 వద్ద, నిఫ్టీ 268 పాయింట్లు 16,946 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి అమ్మకాల వెల్లువెత్తడంతో ఆరంభ లాభాల్ని కోల్పోయి ఫ్లాట్‌గా ముగిశాయి. ‘‘ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు అంశాలను డిస్కౌంట్ చేసుకున్న ఇన్వెస్టర్లు తొలి సెషన్లో కనిష్ట స్థాయిల వద్ద షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దేశీయ సేవా రంగ కార్యకలాపాలు ఏప్రిల్‌లో పుంజుకొని ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అయితే మిడ్‌సెషన్ నుంచి అధిక వెయిటేజీ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. దీనికి తోడు అమెరికా స్టాక్ ఫ్యూచర్లు అనూహ్యంగా నష్టాల్లోకి మళ్లడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీల ఆరంభ లాభాలన్నీ మాయమయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఒడిదుడుకుల మార్కెట్లో ఐటీ షేర్లు రాణించాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్ షేర్లు 4% నుంచి 1%లాభపడ్డాయి. ►మార్చి క్వార్టర్లో నికరలాభం రెండు రెట్లు పెరగడంతో ఏబీబీ ఇండియా షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 10.5% పెరిగి రూ.2,224 వద్ద స్థిరపడింది. ►ట్రేడింగ్‌లో 12% ర్యాలీ చేసి రూ. 2,251 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ►షేర్ల బైబ్యాక్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతుందనే వార్తలతో మాట్రిమోనీడాట్ కామ్ షేరు 5% లాభంతో రూ.729 వద్ద స్థిరపడింది. -
ఎల్ఐసీ ఐపీవో.. క్యూకడుతున్న యాంకర్ ఇన్వెస్టర్లు!
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించింది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. తద్వారా రూ. 21,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 5.92 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. వీటి విలువ రూ. 5,620 కోట్లు కాగా.. సోమవారం(2న) ఈ విభాగంలో రూ. 7,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా సావరిన్ వెల్త్‌ఫండ్స్, దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 20 యాంకర్ సంస్థలు ఆసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. షేరుకి రూ.902–949 ధరలో చేపట్టిన ఇష్యూ బుధవారం(4న) ప్రారంభమై సోమవారం(9న) ముగియనుంది. అతిపెద్ద ఇష్యూ..: రూ. 21,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీయంగా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించనుంది. ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించిన వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఇప్పటివరకూ భారీ ఐపీవోగా నిలుస్తోంది. 2010లో రూ. 15,200 కోట్ల సమీకరణతో లిస్టింగ్ సాధించిన పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా తదుపరి ర్యాంకును సాధించింది. కాగా.. తాజా ఐపీవోలో ఎల్ఐసీ పాలసీదారులకు 2,21,37,492 షేర్లు, ఉద్యోగులకు 15,81,249 షేర్లు విక్రయించనుంది. పాలసీదారులకు షేరు ధరలో రూ. 60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ. 45 చొప్పున రాయితీని ఇస్తోంది. ఈ నెల 17న ఎల్ఐసీ లిస్ట్‌కానుంది. చదవండి👉ఎల్ఐసీ షేరు ధర ఆకర్షణీయం... -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. దీంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం రష్యా–ఉక్రెయిన్ యుద్ధ వేడి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు వంటి తదితర ప్రతికూల అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో బుధవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు పతనమై 56,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 వద్ద ముగిసింది. అయితే ఆ ప్రభావం గురువారం సైతం మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అమెరికాలో క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ముదుపర్లు పెట్టుబుడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఆ ప్రభావంతో పాటు భారత్ ఎకానమీ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండడంతో దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 9.17 నిమిషాలకు నిఫ్టీ 256 పాయింట్లు లాభపడి 57082 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 17122 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. హెచ్‌యూఎల్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా,యూపీఎల్,అపోల్ ఆస్పిటల్,ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,ఎథేర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్,ఎసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా,భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టీసీఎస్, ఎన్టీపీసీ,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఉదయం 9.35గంటలకు సెన్సెక్స్ 32 పాయింట్లు లాభపడి 59060 వద్ద, నిఫ్టీ 24పాయింట్లు లాభపడి 17654 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. కోల్ ఇండియా, యూపీఎల్, టాటాకాన్స్, హిందాల్కో, జేఎస్‌డ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, బ్రిటానియా, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కిప్లా, టెక్ మహీంద్రా,టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్టీపీసీ, హీరో మోటోకార్పొరేషన్ యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
మార్కెట్: క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నా ఈ స్టాక్స్‌కు ఢోకాలేదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయుల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని ముడి వనరుగా ఉపయోగించే కొన్ని రంగాల సంస్థల మార్జిన్లు, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ హెడ్ (ఈక్విటీస్) అనిరుద్ధ నహా తెలిపారు. ముడి చమురు అధిక ధరల వల్ల ద్రవ్యోల్బణంతో పాటు వాణిజ్య లోటు.. ద్రవ్య లోటు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈక్విటీ మార్కెట్ల విషయంలో ఆచి తూచి వ్యవహరించనున్నట్లు అనిరుద్ధ వివరించారు. ఆదాయాలపరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం మెరుగ్గా కనిపిస్తోందని, ఇటీవల కొంత కరెక్షన్ తర్వాత ఐటీ స్టాక్స్ ఆకర్షణీయ ధరలో ఉన్నాయని ఆయన చెప్పారు. టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతుండటం .. ఐటీ రంగానికి తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. ఇక డిమాండ్ రికవరీ అనేది పారిశ్రామిక ఉత్పత్తుల సంస్థలకు సానుకూలమని తెలిపారు. సుదీర్ఘ మందగమనం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరిగి కోలుకుంటోందని, సమీప భవిష్యత్తులో ఇది నిలకడగా వృద్ధి చెందవచ్చని చెప్పారు. క్రూడాయిల్ ధరలు దిగి వస్తే.. రాబోయే మూడేళ్లలో కొన్ని ఆటో, ఆటో అనుబంధ కంపెనీలు సముచిత స్థాయిలో వృద్ధి చెందగలవని భావిస్తున్నట్లు అనిరుద్ధ వివరించారు. అయిదేళ్లు కార్పొరేట్లకు సానుకూలం.. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడం వల్ల సమీప భవిష్యత్తులో కాస్త సవాళ్లు నెలకొనవచ్చని అనిరుద్ధ చెప్పారు. అయితే, ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఇన్వెస్టర్లు ఎన్నో చూశారని.. కంపెనీల వృద్ధి, లాభదాయకత ఆధారంగా మార్కెట్లు పుంజుకుంటూనే ఉన్నాయన్నారు. ‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి వ్యవస్థాగత మార్పులు కార్పొరేట్లకు సానూకూలాంశాలు. డిమాండ్ పుంజుకునే కొద్దీ అమ్మకాలు, లాభాలు వృద్ధి చెంది వచ్చే మూడు నుంచి అయిదేళ్ల పాటు దేశీ కార్పొరేట్లకు మెరుగ్గా ఉండగలదు‘‘ అని ఆయన పేర్కొన్నారు. మూడు నుంచి అయిదేళ్ల కాలవ్యవధితో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని అనిరుద్ధ చెప్పారు. మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలను, రాబడుల అంచనాలను బేరీజు వేసుకుని తదనుగుణమైన వ్యూహాన్ని పాటించాలని అనిరుద్ధ సూచించారు. తగు స్థాయి రిస్కు తీసుకోగలిగి, కనీసం మూడేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయగలిగే వారు ఫ్లెక్సిక్యాప్ లేదా మిడ్‌క్యాప్ వ్యూహాన్ని ఎంచుకోవచ్చన్నారు. మరింత దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వారు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పరిశీలించవచ్చని అనిరుద్ధ పేర్కొన్నారు. -
అదృష్టం అంటే వీళ్లదే..! లక్షపెట్టుబడితో రూ.18లక్షలు లాభం..!
దేశీయ స్కాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్ తారా జువ్వలా దూసుకెళ్తున్నాయి. నవంబర్ 2, 2020న రూ.4.18 పైసలున్న సాఫ్ట్వేర్ కంపెనీ బ్రైట్.కామ్ గ్రూప్ స్టాక్స్ ఏడాది తిరిగే సరికల్లా ఆ స్కాక్స్ వ్యాల్యూ రూ.75.40కి చేరింది. దీంతో ఈ పెన్నీ స్టాక్స్ కొన్న ఇన్వెస్టర్లకు పంట పడినట్లైంది. లక్ష పెడితే రూ.18.03లక్షలు ఉదాహరణకు బ్రైట్.కామ్ గ్రూప్ షేర్లలో ఏడాది క్రితం లక్ష పెట్టుబడి పెడితే ఈరోజు ఆ లక్షకాస్త రూ.18.03 లక్షలైంది. ఈ మధ్యకాలంలో సెన్సెక్స్ 47.89 శాతం పెరగడంతో ఆ స్కాక్స్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 13న షేరు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరి రూ.90.55ను తాకింది. నిన్న(నవంబర్ 4న) దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సెషన్లో షేరు 0.87% లాభంతో రూ.75.40 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఈ కంపెనీ మొత్తం 2.78 లక్షల షేర్లు ఉండగా రూ. 2.10 కోట్ల టర్నోవర్‌ను సాధించడంతో బ్రైట్ కామ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.7,853.91 కోట్లకు చేరింది. సంవత్సరంలోనే ఇంత లాభమా బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 1,002 శాతం లాభపడ్డాయి. కేవలం ఒక్కనెలలో 17 శాతం పెరిగాయి. బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల వ్యాల్యూ స్థిరంగా సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.కాగా బ్రైట్.కామ్ గ్రూప్ వరల్డ్ వైడ్‌గా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, ఏజెన్సీలు, ఆన్లైన్ ప్రచురణకర్తలకు డిజిటల్ మార్కెటింగ్ పరిష్కారాల్ని అందిస్తుంది. కరోనా కారణంగా ఆన్లైన్ సర్వీసులు పెరగడంతో ఆ షేర్ వ్యాల్యూ భారీగా పెరిగినట్లు ఇన్వెస్టర్లు తెలిపారు. పెన్నీ స్టాక్స్ అంటే దేశీయ స్కాక్ మార్కెట్లో రిజిస్టరైన కంపెనీ షేర్ వ్యాల్యూ రూ.10 కన్నా తక్కువగా ఉంటే ఆ స్కాక్స్‌ను పెన్నీ స్కాక్స్ అంటారు. -
అదే దూకుడు.. లాభాల్లో సూచీలు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో సూచీలు సానుకూలంగా ఉండటం, ఇటు ఏషియా మార్కెట్లు సైతం లాభాల బాటలో పయణిస్తుండటం దేశీ మార్కెట్ల జోరుకు మరింత ఊతం ఇచ్చాయి. గత కొంత కాలంగా కొనసాగుతోన్న బుల్ జోరుని మరింతగా పెంచాయి. దీంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఆల్‌టైం హైలను టచ్ చేశాయి. ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 62,123 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్సీ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 18,571 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈ రోజు నిఫ్టీ ప్రారంభం కావడమే 18,602 పాయింట్లతో మొదలై ఆల్‌టైం హైని టచ్ చేసింది. ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, ఆల్ట్రాటెక్, టైటాన్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. -
సెన్సెక్స్ సరికొత్త రికార్డ్, 58 వేల మార్క్ క్రాస్
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9:54 గంటల సమయానికి సెన్సెక్స్ 58 వేల మార్క్ ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసి 119 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 60.75 పాయింట్ల లాభంతో 17,294 వద్ద ట్రేడింగ్ కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో బీఎస్ఈ 30 సూచీలో దాదాపు సగానికిపైగా కంపెనీల షేర్ల లాభాలు కంటిన్యూ అవుతున్నాయి. వీటిలో కొటాక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, టైటన్,ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉండగా హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాల బాట పట్టాయి. -
మళ్లీ బుల్ పరుగులు
ముంబై: ఒకరోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్ సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లలో చెప్పుకోదగ్గ కొనుగోళ్లు జరిగాయి. లార్జ్‌క్యాప్ షేర్లైన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ షేర్లు మూడు శాతం వరకు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఫలితంగా సెన్సెక్స్ 514 పాయింట్లు ఎగసి 57,853 వద్ద ముగిసింది. ఒక దశలో 554 పాయింట్ల వరకు ర్యాలీ చేసి 57,892 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 17,234 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 169 పాయింట్లు ర్యాలీ చేసి 17,246 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఆల్‌టైం హై ముగింపులు కావడం విశేషం. అంతకు ముందు(బుధవారం) ట్రేడింగ్‌లో పతనమైన షేర్లకు అధిక డిమాండ్ నెలకొంది. సూచీలు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లను కొనేందుకు అధికాసక్తి చూపారు. సెమికండక్టర్ కొరతతో ఆగస్టు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటో రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.349 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.382 కోట్ల ఈక్విటీలను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లోనూ రూపాయి 2 పైసలు బలపడి 73.06 వద్ద స్థిరపడింది. అమెరికా ఉద్యోగ గణాంకాల విడుదలకు ముందు అప్రమత్తతతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బుల్ జోరుతో ఇన్వెస్టర్లకు రూ.2.5 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.252.66 లక్షల కోట్లకు చేరింది. ‘‘జీడీపీతో సహా ఇటీవల విడుదలైన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించగలిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందనే ఆశావాదంతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ ఈక్విటీ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 17100 కీలక నిరోధాన్ని ఛేదించిన తర్వాత మరింత దూసుకెళ్లింది. ప్రస్తుత ట్రేడింగ్ స్థాయి(17200–17250)ని నిలుపుకోగలిగితే మూమెంటమ్ కొనసాగి 17,400 – 17450 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని ఆనంద్ రాఠి ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేందర్ సోలంకీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు ► నిధుల సమీకరణ అంశంపై బోర్డు సమావేశాని(శుక్రవారం)కి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ షేరు ఎనిమిది శాతం ఎగసి రూ.776 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 6% లాభంతో రూ.759 వద్ద ముగిసింది. ► మధ్యంతర డివిడెండ్ ప్రకటన తర్వాత వేదాంత షేరుకు డిమాండ్ నెలకొంది. మూడు శాతం ర్యాలీ చేసి రూ. 306 వద్ద స్థిరపడింది. ► కెనడా దేశంలోని స్థానిక ఫార్మా మార్కెట్లోకి రెవెలిమిడ్ జనరిక్ ఔషధాన్ని విడుదల చేయడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేరు రెండు శాతం లాభపడి రూ.4,857 వద్ద నిలిచింది. ► రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వడంతో కైటెక్స్ గార్మెంట్స్ షేరు పదిశాతం లాభంతో రూ.164 వద్ద ముగిసింది. -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.32 గంటల సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు నష్టపోయి 55,795 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుండగా నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 16,609 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. -
రికార్డ్ల వేట, భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుంది. ప్రధాన సూచీలు గరిష్టస్థాయిలో సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం 9.36 గంటల సమయానికి సెన్సెక్స్ సరికొత్త రికార్డ్ లను నమోదు చేసింది. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 56119 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 16683 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్,హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా,మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ) కార్యక్రమం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచ ప్రతికూలతలు పడేశాయ్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్ రెండో రోజూ వెనకడుగు వేసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలను ఉపసంహరించుకునే(ట్యాపరింగ్) అంశంపై ఫెడ్ అధికారులు చర్చించినట్లు మినిట్స్‌లో వెల్లడైంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతారన్న భయాలు తెరపైకి వచ్చాయి. చదవండి : 5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు వ్యాక్సినేషన్ తక్కువగా నమోదైన ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ తమ దేశానికే చెందిన దిగ్గజ ఐటీ సంస్థలపై చైనా రెగ్యులేటరీ కఠిన ఆంక్షలను విధించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు పతనబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ క్షీణించాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 55,329 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లను కోల్పోయి 16,500 దిగువను 16,450 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలో భాగంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు ఆగలేదు. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 15 పైసలు పతనమై 74.39 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,287 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.119 కోట్ల షేర్లను కొన్నారు. మెటల్ షేర్లలో మంటలు... ఈ ఏడాదిలో చైనా స్టీల్ ఉత్పత్తి భారీగా తగ్గిపోవచ్చని ప్రముఖ మైనింగ్ కంపెనీ బీహెచ్పీ గ్రూప్ తన కమోడిటీ అవుట్‌లుక్‌లో తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐరన్ ఓర్ ఫ్యూచర్లు నెలరోజుల కనిష్టానికి కుప్పకూలిపోయాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్ షేర్లపైనా పడటంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆరున్నర పతనాన్ని చవిచూసింది. ఎన్ఎండీసీ, వేదాంత, టాటా స్టీల్, సెయిల్, జిందాల్ స్టీల్ షేర్లు పదిశాతం నుంచి ఎనిమిదిశాతం క్షీణించాయి. కార్‌ట్రేడ్ టెక్ ... లిస్టింగ్‌లో డీలా ఆటో క్లాసిఫైడ్ సంస్థ కార్‌ట్రేడ్ టెక్ షేర్లు లిస్టింగ్ తొలిరోజే డీలాపడ్డాయి. ఇష్యూ ధర రూ.1,618తో పోలిస్తే బీఎస్ఈలో ఒకశాతం డిస్కౌంట్‌తో రూ.1,600 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో 9% క్షీణించి రూ.1475 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 7% నష్టంతో రూ.1501 వద్ద ముగిశాయి. -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న బుల్ జోరుకి బ్రేకులు పడింది. శుక్రవారం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. యరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంచనాల(2.2%)ను మించుతూ యూరోజోన్ ద్రవ్యోల్బణం 2.20 శాతంగా నమోదుకావడంతో యూరప్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్ పై పడింది. దీంతో శుక్రవారం 9.34 గంటల సమయానికి దేశీ మార్కెట్లో సెన్సెక్స్ 165.80 పాయింట్లు క్షీణించి 55,296 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 111.30 పాయింట్లు నష్టపోయి 16,457.55 పాయింట్లతో ట్రేడ్ కొనసాగుతుంది. టాటాస్టీల్, హీరో మోటో కార్ప్, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.