రెండో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 222 పాయింట్లు ఎగసి 38,978కు చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో వినతీ ఆర్గానిక్స్, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్, టైమ్ టెక్నోప్లాస్ట్, ట్రెంట్ లిమిటెడ్, శ్రీ రాయలసీమ హైస్ట్రెంగ్త్ హైపొ, రీఫెక్స్ ఇండస్ట్రీస్, స్కిప్పర్ లిమిటెడ్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..
వినతీ ఆర్గానిక్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 1,171 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,242 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 21,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 52,000 షేర్లు చేతులు మారాయి.
ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 653 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 687 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 24,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 22,000 షేర్లు చేతులు మారాయి.
టైమ్ టెక్నోప్లాస్ట్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం లాభపడి రూ. 42 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.02 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 38,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి.
ట్రెంట్ లిమిటెడ్
బీఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ఎగసింది. రూ. 737 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 742 వరకూ లాభపడింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 32,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 25,000 షేర్లు చేతులు మారాయి.
శ్రీ రాయలసీమ హైస్ట్రెంగ్త్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 196 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7,000 షేర్లు చేతులు మారాయి.
రీఫెక్స్ ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం ర్యాలీ చేసి రూ. 51.5 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 12,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి.
స్కిప్పర్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 47.60 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 16,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,000 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment