mid cap index
-
మిడ్‌క్యాప్‌లో మెరుగైన రాబడులు
ఈక్విటీల్లో స్మాల్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగంలో ఆటుపోట్లు కాస్త తక్కువగా ఉంటాయి. స్మాల్‌క్యాప్‌లో రాబడులతోపాటు అస్థిరతలు కూడా ఎక్కువే. అందుకే పెట్టుబడుల్లో కేవలం స్మాల్‌క్యాప్ ఒక్కటే కాకుండా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రిస్‌్కను వైవిధ్యం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. మిడ్‌క్యాప్ విభాగంతోపాటు లార్జ్క్యాప్లోనూ పెట్టుబడులకు అవకాశం కలి్పస్తూ, మెరుగైన రాబడుల చరిత్ర కలిగిన పథకాల్లో హెచ్ఎస్బీసీ మిడ్‌క్యాప్ ఫండ్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 44 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. కానీ, ఈక్విటీ మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడి ఇదే కాంలో 31.59 శాతంగానే ఉంది. మూడేళ్లలో 26.67 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని అందించగా, ఇదే కాలంలో మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడి 23.64 శాతంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఇక ఐదేళ్లలో 25.40 శాతం, ఏడేళ్లలో ఏటా 15.33 శాతం, పదేళ్లలో ఏటా 17.69 శాతం వార్షిక రాబడులను అందించిన చరిత్ర ఈ పథకానికి ఉంది. మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడుల కంటే అధిక ప్రతిఫలాన్ని అందించింది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక పెట్టుబడుల వృద్ధి 19.90 శాతంగా ఉంది. గతంలో ఎల్అండ్టీ మిడ్క్యాప్ఫండ్గా ఇది కొనసాగింది. హెచ్ఎస్బీసీ కొనుగోలు తర్వాత పథకం పేరు మారింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో మిడ్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ తన మొత్తం నిర్వహణ ఆస్తుల్లో అధిక శాతాన్ని లార్జ్‌క్యాప్‌లోనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. రిస్క్ తగ్గించడం, రాబడులను పెంచడం అనే వ్యూహంలో భాగంగా లార్జ్, మిడ్‌క్యాప్ విభాగాల మధ్య పెట్టుబడుల్లో ఫండ్ మేనేజర్లు మార్పులు చేర్పులు చేస్తుంటారు. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌తో పోలి్చతే లార్జ్‌క్యాప్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం 11,912 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 98.31 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 1.7 శాతం నగదు, నగదు సమానాల్లో ఉన్నాయి.ఈక్విటీ పెట్టుబడుల్లో 67 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 32.68 శాతం ఇన్వెస్ట్ చేసింది. స్మాల్‌క్యాప్‌లో కేవలం 0.46 శాతమే పెట్టుబడులు ఉండడం గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే 37 శాతం పెట్టుబడులు పెట్టింది. కనీసం రూ.500 మొత్తంతో ఈ పథకంలో సిప్ మొదలు పెట్టుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోని గమనిస్తే.. ఇండ్రస్టియల్స్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచి్చంది. మొత్తం పెట్టుబడుల్లో 34 శాతం ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 18 శాతం, కన్జ్యూమర్ డి్రస్కీíÙనరీ కంపెనీలకు 12.53 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 9.37 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
పేరుకు స్మాల్ క్యాప్..మిడ్ క్యాప్ సంస్థల్లో పెట్టుబడెందుకు?
స్మాల్ క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎందుకు కేటాయింపులు చేస్తుంటాయి? – వంశీ గౌడ్నిజానికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ పెట్టుబడులు అన్నింటినీ స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే పెట్టేయవు. ఇది సాధారణ నమ్మకానికి విరుద్ధమైనది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు పెట్టుబడుల పరంగా కొంత వెసులుబాటు కల్పించింది. స్మాల్‌క్యాప్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మిగిలిన 35 శాతాన్ని ఏ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలన్నది పూర్తిగా ఫండ్ మేనేజర్ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా ఈ 35 శాతాన్ని మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌లో ఏ విభాగానికి కేటాయించాలన్నది ఫండ్ మేనేజర్లు నిర్ణయిస్తుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఆటుపోట్లు ఎక్కువ. లిక్విడిటీ సమస్యలు కూడా ఉంటాయి. అందుకని పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఇతర మార్కెట్ క్యాప్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్‌లను అధిగమించొచ్చు.28 స్మాల్‌క్యాప్ యాక్టివ్ ఫండ్స్‌ను గమనిస్తే.. అవి తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 82 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీలకు, 13 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించాయి. కేవలం ఆరు పథకాలే మిడ్‌క్యాప్ కంపెనీలకు 15 శాతానికి మించి పెట్టుబడులు కేటాయించాయి. వాటి పనితీరు మిశ్రమంగా ఉంది. మూడు పథకాలు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250కి మించి పనితీరు చూపించాయి. మరో మూడు బెంచ్ మార్క్ పనితీరు స్థాయిలో రాబడులు అందించాయి. కేవలం జేఎం స్మాల్ క్యాప్ ఫండ్, టాటా స్మాల్‌క్యాప్, ఎస్బీఐ స్మాల్‌క్యాప్, డీఎస్పీ స్మాల్‌క్యాప్ పథకాలే 90 శాతానికి పైగా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి.ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి అమలవుతున్న ఆరు మార్పులు ఇవే..నా వద్ద రూ.35 లక్షలు ఉన్నాయి. 8 నుంచి 10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఏడు పథకాల పరిధిలో ఇన్వెస్ట్ చేయాలన్నది నా యోచన. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్‌కు ఇది మంచి వ్యూహమే అవుతుందా? – జయదేవ్రూ.35 లక్షల పెట్టుబడులను 8–10 ఏళ్ల కాలానికి, వివిధ పథకాల పరిధిలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, ఏడు పథకాల పరిధిలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది పెద్దగా ఫలితం ఇవ్వదు. దీనికి బదులు మొత్తం పథకాల సంఖ్యను ఐదుకు తగ్గించుకోవడాన్ని పరిశీలించండి. అప్పుడు ఒక్కో పథకానికి 20 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. కొన్ని పథకాలపైనే దృష్టి సారించడం వల్ల వాటికి అర్థవంతంగా కేటాయింపులు చేసుకోవడానికి వీలుంటుంది. ఐదు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాటి పనితీరును ఎప్పటికప్పుడు సులభంగా సమీక్షించుకుంటూ, అవసరమైతే సర్దుబాట్లు చేసుకోవచ్చు. పెట్టుబడులను ఎక్కువ పథకాల మధ్య విస్తరించడం వల్ల అది సంతృప్తిని ఇవ్వొచ్చు. కానీ, విడిగా ఒక్కో పథకానికి తగినంత సమయాన్ని కేటాయించడం సాధ్యపడకపోవచ్చు. -
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్‌ను మించి బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్‌చేంది. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్ రూ. 1,187 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్ మిక్స్‌లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్ బిజినెస్ 6% పుంజుకున్నట్లు తెలిపారు.పర్యాటకానికి పరిశ్రమ హోదా..జీఎస్టీ రేటు క్రమబదీ్ధకరించాలి ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్ పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు.బుల్ మార్కెట్ దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు(పీఎంఎస్), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్) బుల్ ట్రెండ్‌లో మార్కెట్ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్‌క్యాప్ స్టాక్స్ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్ క్యాప్స్ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. సరికొత్త రికార్డులు బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్‌క్యాప్ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్ గూడ్స్ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరి్వందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్‌లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్ నిపుణులు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఏది బెటర్..?
స్మాల్ క్యాప్ కంటే మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చేయడం మంచిదా? – వరుణ్ మిడ్‌క్యాప్‌లో ఉండే రాబడులు, సవాళ్లు అనేవి స్మాల్‌క్యాప్ మాదిరే ఉంటాయి. పేరుకు తగినట్టుగా ఈ పథకాల పెట్టుబడులు ఉండటాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అదే విధంగా స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ చెప్పకోతగ్గ పెట్టుబడులు కలిగి ఉంటాయి. అదే స్మాల్‌క్యాప్ ఫండ్ అయితే ఎక్కువగా స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు పెట్టుబడులు కేటాయిస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మార్కెట్ విలువ పరంగా టాప్ –100 కంపెనీలను లార్జ్‌క్యాప్‌గా, తదుపరి 150 కంపెనీలను మిడ్‌క్యాప్‌గా, మిగిలిన కంపెనీలను స్మాల్‌క్యాప్ కంపెనీలుగా సెబీ నిర్వచించింది. ఈ నిర్వచనాన్నే పథకాలు కూడా అనుసరిస్తుంటాయి. మార్కెట్ విలువ ఆధారంగా ఒక కంపెనీని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ అని చెప్పడమే. ఒకవేళ అది చిన్న కంపెనీయే అయినప్పటికీ గొప్పది అయి ఉండొచ్చు. చక్కని నిర్వహణతో, ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారంతో, భరోసానిస్తూ ఉండొచ్చు. ఇలాంటి అంశాలున్న కంపెనీల విషయంలో అది మిడ్ లేదా స్మాల్ క్యాప్ అన్న నిర్వచనం జోలికి వెళ్లక్కర్లేదు. ఉదాహరణకు ఒక మిడ్‌క్యాప్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత కాలానికి నిర్వహణ ఆస్తుల పరంగా అది పెద్ద పథకంగా మారొచ్చు. అప్పుడు అది పేరుకు మిడ్‌క్యాప్ అయినప్పటికీ లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడులు కలిగి ఉంటుంది. పేరుకు మిడ్‌క్యాప్ కంపెనీలుగా ఉన్నప్పటికీ, పోర్ట్‌ఫోలియోలని చాలా కంపెనీలు భవిష్యత్తులో లార్జ్‌క్యాప్‌గా మారే అవకాశాలు ఉంటాయి. నేను ఆదాయపన్ను 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తాను. దీంతో అత్యవసర నిధిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – శివ్ గణేశన్ మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఏటేటా వడ్డీ ఆదాయం పన్ను చెల్లింపుదారు ఆదాయానికి కలుస్తుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను ఆధారపడి ఉంటుంది. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను విక్రయించినప్పుడు కూడా నమోదయ్యే లాభంపై ఇంతే మేర పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, డెట్ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి పెట్టుబడులకు రక్షణ హామీ కూడా ఉండదు. అయినా కానీ, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి. నాణ్యమైన డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసిన పథకాన్నే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. -
చిన్న షేర్ల పెద్ద క్రాష్
సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్ఈలో రూ.13.47 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు దిగివచి్చంది. గత 3 రోజుల్లో రూ.20.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ముంబై: చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల భారీ పతనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. అమెరికా ద్రవ్యోల్బణం దిగిరాకపోవడంతో ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు’ ఆశలు సన్నగిల్లాయి. ట్రేడింగ్‌లో వినిమయ, ఇంధన, మెటల్ షేర్ల భారీ పతనంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22,000 స్థాయిలను కోల్పోయాయి. లాభాల నుంచి భారీ నష్టాల్లోకి ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి దిగివచి్చన సానుకూల సంకేతాలతో ఉదయం స్టాక్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 325 పాయింట్లు పెరిగి 73,993 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 22,432 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే చిన్న, మధ్య తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న సెబీ చైర్మన్ మాధవీ పురి ఇటీవలి వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,152 పాయింట్లు క్షీణించి 72,516 వద్ద, నిఫ్టీ 430 పాయింట్లు దిగివచ్చి 21,906 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997 వద్ద స్థిరపడ్డాయి. ► స్కాటిష్ చమురు కంపెనీ కెయిర్న్‌కు రూ.77.6 కోట్లు చెల్లించాలంటూ సెబీ ఆదేశాలు జారీ చేయడంతో వేదాంత లిమిటెడ్ షేరు 7% నష్టపోయి రూ.252 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 8% నష్టపోయి రూ.250 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీకి రూ.6,858 కోట్ల నష్టం వాటిల్లింది. ► మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం పదింటికి గానూ ఏడు కంపెనీల షేర్లు నష్టపోయాయి ► జీజే కెమికల్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.221)తో పోలిస్తే 4.52% డిస్కౌంట్‌తో రూ.211 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 18% క్షీణించి రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 16% నష్టపోయి రూ.185 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.724 కోట్లుగా నమోదైంది. ఎఫ్‌అండ్‌వోపై దృష్టి ఆందోళనకరం రిటైల్ ఇన్వెస్టర్లకు సీఈఏ హెచ్చరిక అత్యధిక రిసు్కలతోకూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు చేపట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం ఆందోళనకరమని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా పేర్కొన్నారు. తక్షణ లాభాలపై దృష్టి పెట్టడం పెట్టుబడుల పురోగతికి ప్రతికూలమని సెబీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. -
ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్.. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
పదేళ్లకు మించి నేను సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయగలను. నా ఈక్విటీ పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ యాదవ్ దీర్ఘకాల పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీలకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. ఒకే రకం ఫండ్ లేదా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండాలి. 50–60% మేర మిడ్, స్మాల్ క్యాప్స్ పెట్టుబడులతో ప్రధాన పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం అన్నది సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25– 30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70% మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ ఎ క్కువగా ఉంటుంది. అందుకే వీటికి 50–60% కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక అస్థితరలు ఉన్నా సరే, దీర్ఘకాలంలో అధిక రాబడులు కో రుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా నెలవారీ, త్రైమాసికం వారీ ఆదాయం వచ్చేలా ఎస్‌డబ్ల్యూపీ ఎంపిక చేసుకోవాలా? – శంకర్ నారాయణన్ ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ తదితర సూచీల్లో (ఇండెక్స్‌ల్లో) ఇన్వెస్ట్ చేసేది. మరోవైపు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకునే సాధనం. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సంబంధిత సూచీ రాబడులకు అనుగుణంగానే ఉంటాయి. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా మీరు కోరుకున్నంత ప్రతి నెలా ఉపసంహరించుకోవచ్చు. రూ.లక్షను 10 నెలల్లో ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే ప్రతి నెలా రూ.10వేలను ఎస్డబ్ల్యూపీగా ఎంపిక చేసుకోవాలి. మీ దగ్గర కొంత మొత్తం ఫండ్ ఉండి, ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంటే దాన్ని ఒకే విడత కాకుండా ఆరు నుంచి 12 నెలల పరిధిలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే.. మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ వద్దనుకునే వారు లార్జ్‌క్యాప్ ఫండ్ లేదా ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక ఏడాది అవసరాలకు సరిపడా (మొత్తం పెట్టుబడిలో 6 శాతం మించకుండా) లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్లో, అది కూడా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవాలి. ఏడాదికోసారి మీ ఈక్విటీ పెట్టుబడులు 33–35 శాతం మించకుండా, తగ్గకుండా రీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఏటా ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఈ మొత్తాన్ని ఏటా 5 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అలాగే, ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడిలో 6 శాతం మించకుండా చూసుకోవాలి. -
పెన్నీ స్టాక్స్‌తో జర జాగ్రత్త!
ముఖ విలువకు దగ్గరగా లేదా అంతకంటే బాగా తక్కువ ధర పలికే షేర్లను స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్‌గా పిలుస్తుంటారు. సాధారణంగా వీటిలో అత్యధిక శాతం కంపెనీలు బలహీన ఫండమెంటల్స్ కలిగి ఉండటం, నష్టాలు నమోదు చేస్తుండటం, రుణ భార సమస్యలు ఎదుర్కోవడం, కార్పొరేట్ సుపరిపాలనలో వెనుకబడటం వంటి ఏవైనా ప్రతికూలతలను కలిగి ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు పనితీరును ఏటికేడాది మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్‌లో మిడ్ క్యాప్ కంపెనీలుగా ఎదుగుతుంటాయి కూడా. అయితే ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అనుమానాస్పదంగా పెరుగుతుండటంపై నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ వివరాలు చూద్దాం.. ముంబై: సాధారణంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా పరుగు తీస్తున్నప్పుడు క్రమంగా పెన్నీ స్టాక్స్‌లో కద లికలు మొదలవుతుంటాయి. ఈ బాటలో ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అంతంత మాత్ర బిజినెస్‌లు కలిగి ఉన్నప్పటికీ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. నిజానికి అటు సెబీ, ఇటు స్టాక్ ఎక్సే్ఛంజీలు ప్రమాదకర స్థాయిలో పెరిగే పెన్నీ స్టాక్స్‌పై కన్నేసి ఉంచుతాయి. అయినప్పటికీ కొంతమంది ఆపరేటర్ల కారణంగా కొన్ని షేర్లు ఏకధాటిగా పరుగు పెడుతుంటాయి. ఇది అనుమానాస్పదమేనని బ్రోకింగ్ వర్గా లు పేర్కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సుమారు 150 షేర్లు 2022 ఏప్రిల్ 1 నుంచి 200 శాతం నుంచి 2,000 శాతం వరకూ దూసుకెళ్లాయి. నామమాత్ర బిజినెస్‌లు మాత్రమే కలిగి ఉన్న కంపెనీల షేర్లు ఈ స్థాయిలో పరుగు తీయడం ప్రమాదకర విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ తీరు గతేడాది నవంబర్ నుంచి సాఫ్ట్రాక్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు 3,368 శాతం దూసుకెళ్లింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన 12 నెలలను పరిగణిస్తే కంపెనీ రూ. 25 లక్షల ఆదాయం, రూ. 10 లక్షల నికర లాభం మాత్రమే సాధించింది. ఇక గత అక్టోబర్ నుంచి బోహ్రా ఇండస్ట్రీస్ షేరు 1,823 శాతం జంప్‌చేసింది. గతేడాది(2021–22) ఎలాంటి ఆదాయం ఆర్జించకపోయినా రూ. 1.37 కోట్ల ఇతర ఆదాయం నమోదైంది. రూ. 2.62 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత 12 నెలల కాలాన్ని తీసుకుంటే శ్రీ గాంగ్ ఇండస్ట్రీస్ రూ. 113 కోట్ల ఆదాయం, రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏప్రిల్ నుంచి ఈ షేరు 1,911 శాతం లాభపడింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,800 శాతం దూసుకెళ్లి తదుపరి 74 శాతం పతనమైంది. వెరసి రూ. 2.7 నుంచి 242ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కన్ను కొద్ది నెలలుగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్లపై అంతగా అవగాహనలేని కొంతమంది కొత్త ఇన్వెస్టర్లు ఇలాంటి ఆపరేటర్ల స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటారని తెలియజేశారు. తాజాగా పెన్నీ స్టాక్స్ ర్యాలీపై స్పందించిన సెబీ ఈ నెల మొదట్లో 55 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధించింది. ఈ జాబితాలో నటులు అర్షద్ వార్సి, ఆయన భార్య మారియా గోరెట్టి ఉన్నారు. సాధనా బ్రాడ్‌క్యాస్ట్, షార్ప్‌లైన్ బ్రాడ్‌క్యాస్ట్ యూట్యూబ్ చానళ్ల ద్వారా షేర్ల కొనుగోలుకి అక్రమ సిపారసులతోపాటు.. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి లబ్ది పొందిన కారణంగా సెబీ చర్యలు చేపట్టింది. కొన్ని కంపెనీల షేర్లు భారీ లాభాలనిస్తాయంటూ తప్పుడు సిఫారసులు చేయడం, కృత్రిమంగా పెంచిన ధరలతో ఆయా షేర్లను విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు సెబీ పేర్కొంది. కాగా.. మెర్క్యురీ మెటల్స్, ఎస్‌అండ్‌టీ కార్ప్, కర్ణావటి ఫైనాన్స్, కేఅండ్‌ఆర్ రైల్ ఇంజినీరింగ్, టేలర్‌మేడ్ రీన్యూ, ఆస్కమ్ లీజింగ్, రీజెన్సీ సిరామిక్స్ తదితరాలు 1,000 శాతంపైగా లాభపడటం గమనార్హం!! -
రిస్క్ తక్కువ, రాబడులు మెరుగ్గా ఉండాలని అనుకుంటున్నారా?
రిస్క్ తక్కువ, రాబడులు మెరుగ్గా ఉండాలని కోరుకునే వారు వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. వ్యాల్యూ ఫండ్స్ అన్నవి ఒక కంపెనీ వ్యాపారం, మార్కెట్ వాటా, ఆర్థిక బలాలు ఇలా ఎన్నో అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత వాస్తవ విలువ కంటే వాటి షేరు ధరలు తక్కువగా లభిస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వ్యాల్యూఫండ్స్ను ఎంపిక చేసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఇవి దీర్ఘకాలంలోనే మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. గ్రోత్ ఇన్వెస్టింగ్ అయితే స్వల్పకాలంలోనే లాభాలకు అవకాశం ఉంటుంది. కానీ, వ్యాల్యూ ఫండ్స్‌లో స్వల్పకాలంలో గణనీయమైన లేదా మెరుగైన రాబడులను ఆశించడం సమంజసం కాదు. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 3 శాతంగా ఉన్నాయి. ప్రధాన సూచీల రాబడులు సైతం ఇదే స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. మూడేళ్లలో 18 శాతం, ఐదేళ్లలో 15 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 11 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. వ్యాల్యూ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్‌లో రాబడులు 2–3 శాతం అధికంగా ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.4,749 కోట్ల పెట్టుబడులున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడులు 12 శాతానికి పైన ఉంటే మెరుగైన పనితీరుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక ఏడేళ్ల కాలంలో 16 శాతం, పదేళ్లలో 14.53 శాతం చొప్పున ఈ పథకం ఏటా రాబడిని తెచ్చి పెట్టింది. పెట్టుబడుల విధానం స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్‌ను ఈ పథకం గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. ముఖ్యంగా లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. ప్రస్తుతానికి తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 12 శాతాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉండగా.. 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. లార్జ్‌క్యాప్‌లో ప్రస్తుతానికి 72 శాతానికి పైగా పెట్టుబడులున్నాయి. మిడ్‌క్యాప్‌లో 20 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 8 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు కనిపించిన సందర్భంలో పెట్టుబడులను తగ్గించుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2020 మార్చి నుంచి జూన్ మధ్య ఈ విధానాన్నే పాటించింది. ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకున్న ఈ పథకం.. ఆ తర్వాతి కాలంలో తిరిగి ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో నడుస్తున్న తరుణంలో కేటాయింపులను పెంచింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 78 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. 32 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగ కంపెనీలకు 9.59 శాతం, టెక్నాలజీ కంపెనీలకూ 9 శాతం, ఇంధన కంపెనీలకు 8 శాతం కేటాయింపులు చేసింది. -
Multi Bagger Stock : లక్ష పెట్టుబడి.. ఏడాదికల్లా రూ.9.94 లక్షల లాభం
ముంబై : షేర్ మార్కెట్లో అధిక లాభాలను అందించే స్టాక్లను పట్టుకోవడం ఓ కళ. కొందిరకే అందులో పట్టు ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందే ఆయా కంపెనీకలు సంబంధించిన పనితీరు, భవిష్యత్తులో రాబోయే మార్పులు, ప్రభుత్వ పాలసీలు తదితర అంశాలను బేరీజు వేసుకుని పెట్టుబడులు పెడతారు. స్వల్ప కాలంలోనే భారీ లాభాలను చూస్తారు. ఇటీవల మల్టీబ్యాగర్ స్టాక్‌గా పాపులరైన ఎనేషనల్ స్టాండర్డ్ ఇండియా (ఎన్ఎస్ఐ) స్టాక్స్ గురించి కొన్ని వివరాలు. ఏడాదిలోనే లాభాల పంట మిడ్‌క్యాప్ షేర్‌గా ఎన్ఎస్ఐ బీఎస్ఈ స్టాక ఎక్సేంజీలో ట్రేడ్ అవుతోంది. గతేడాది సెప్టెంబరు 9న ఎన్ఎస్ఐ షేర్ విలువ కేవలం రూ. 298.60 మాత్రమే. అయితే ఆ రోజు నుంచి వరుసగా షేర్ విలువ పెరుగుతూనే పోయింది. ఐదో రోజు నుంచి మొదలైన షేరు విలువలో పెరుగుదల రెండోందల రోజు చేరుకునే సరికే రికార్డు స్థాయిలో 569 శాతం పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న షేరు 894 శాతం పెరిగి రూ. 2969.25 దగ్గర ట్రేడవుతోంది. ఉజ్జాయింపుగా గత సెప్టెంబరున లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఎన్ఎస్ఎల్ షేర్లు కొనుగోలు చేసిన వారికి సరిగ్గా ఏడాది తిరిగే సరికి దాని విలువల రూ.9.94 లక్షలకు చేరుకుంది. ఏ లెక్కన చూసినా ఏడాదిలో లక్షకు ఎనిమిది లక్షల లాభం తెచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్‌గా నిలిచింది. 52 వారాల్లో ఇదీ పరిస్థితి 2020 సెప్టెంబరు 9న ఎన్ఎస్ఐ షేరు విలువ రూ. 298.60 ఉండగా ఈ 52 వారాల వ్యవధిలో గరిష్టంగా ఆగస్టు 27న రూ. 3,820లకు చేరుకుంది. ఆగస్టులో ఈ కంపెనీ షేర్లు అమ్ముకున్న వారి మరింత లాభాలను సొంతం చేసుకున్నారు. స్టాక్ వ్యాల్యూ జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడంతో అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో 2021 సెప్టెంబరు 9న షేర్ వాల్యూ రూ.2969గా నమోదు అయ్యింది. ఎన్ఎస్ఐ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ది చెందిన లోదా గ్రూప్ సబ్సిడరీ కంపెనీ. చదవండి : ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ?
నేను యాక్సిస్ మిడ్‌క్యాప్, యాక్సిస్ బ్లూచిప్, మిరేఅస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకాల్లో గత రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడుల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని కంపెనీల షేర్లు సైతం ఇదే కాలంలో 100–200 శాతం పెరగడాన్ని గమనించాను. కనుక మంచి రాబడుల కోసం నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలా లేక మ్యూచువల్ ఫండ్స్లోనా? – ప్రశాంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మూడు పథకాలు కూడా మంచివే. వీటితో కూడిన పోర్ట్‌ఫోలియో సమతూకంగానే ఉంది. అయితే, యాక్సిస్‌కు చెందిన రెండు పథకాల్లో ఏదో ఒక దానిలోనే ఇన్వెస్ట్ చేసుకుని.. ఇతర ఫండ్‌హౌస్‌కు చెందిన మరో పథకాన్ని ఎంపిక చేసుకోండి. దీనివల్ల వైవిధ్యం పెరిగి రిస్క్ తగ్గుతుంది. ఈ మూడు పథకాల్లోనూ సమానంగా ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అప్పుడు మూడింట రెండొంతులు యాక్సిస్ ఫండ్ పథకాల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా సంబంధిత ఫండ్‌హౌస్ పరంగా అంచనాలు తప్పితే రాబడులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని యాక్సిస్‌కు చెందిన ఒకే పథకంలో ఇన్వెస్ట్ చేసుకుని, రెండో పథకానికి బదులు ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులను.. ఏ కంపెనీ షేరుతోనూ పోల్చి చూడకూడదు. మీ మ్యూచువల్ ఫండ్ పథకం పనితీరును సంబంధిత సూచీ రాబడులతోనే పోల్చి చూడాలి. అంటే మిడ్‌క్యాప్ పథకాన్ని మిడ్‌క్యాప్ ఇండెక్స్ రాబడులతోనే పోల్చి చూడాలి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు కేవలం ఒకటి, రెండు కంపెనీల్లోనే పెట్టుబడులకు పరిమితం కాకూడదు. తగినంత వైవిధ్యం కోసం కనీసం 10–20 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పోర్ట్‌ఫోలియో నిర్వహించినట్టయితే రాబడులు మోస్తరుగా ఉంటాయి. రిస్క్ కూడా తగ్గుతుంది. ఎవరైనా కానీ ఒక కంపెనీ 200 శాతం రాబడులను ఇస్తుందని పెట్టుబడులన్నింటినీ అందులోనే ఇన్వెస్ట్ చేయడం సరికాదు. 200 శాతం రాబడులకు అవకాశం ఎలా అయితే ఉంటుందో.. కొనుగోలు ధర నుంచి 60–70 శాతం పతనానికీ అవకాశం ఉంటుంది. ఈ రిస్క్‌లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంటాయి. అలాంటప్పుడు రాబడులు మోస్తరు నుంచి మెరుగ్గా దీర్ఘకాలానికి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10లక్షలను ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరైన సమయమేనా? నేను కనీసం పదేళ్లపాటు నా పెట్టుబడులను కొనసాగించగలను – గజేంద్ర రూ.10లక్షలు అన్నవి మీకు అంత అవసరమైనవి కాకపోతే ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, ఒకేసారి గణనీయమైన పెట్టుబడి మొతాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. ఒకవేళ ఒకేవిడత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు కిందకు వెళితే మీరు కచ్చితంగా భయానికి లోనవుతారు. భయపడి పెట్టుబడులను నష్టాలతో వెనక్కి తీసుకోవడం వల్ల దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలన్న మీ ప్రాథమిక లక్ష్యం దెబ్బతింటుంది. కనుక క్రమంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీదగ్గర ఉన్న పెట్టుబడులను వచ్చే 12–15 నెలల కాలంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు భారీ పెట్టుబడి అనిపిస్తే 18–36 నెలల పరిధిలో పెట్టుబడులు పెట్టడాన్ని విస్తరించుకోవడం కూడా సూచనీయం. రిటైర్ అయిన వ్యక్తి క్రమ ఆదాయం కోసం ఎన్పీఎస్ టైర్–2 అకౌంట్‌ను వాడుకోవచ్చా? – ఎం.మాధుర్ ఆదాయం పన్ను పరిధిలో లేకపోతే మీ సౌకర్యం ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఎన్పీఎస్ సరైన ఆప్షన్ అవుతుంది. మీ అస్సెట్ అలోకేషన్ (ఏ విభాగంలో ఎంత మేర కేటా యింపులు) ఆధారంగా ఈ తరహా పెట్టుబడి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో అందుబాటులో ఉన్న మూడు రకాల ఆప్షన్లలో సరైనది ఎంపిక చేసుకోవడం మీ బాధ్యతే. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగానికి ఎంత కేటాయింపులు చేయగలరు, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్ల లో ఎంత ఇన్వెస్ట్ చేయగలరనే దాని ఆధారంగా ఎంపిక ఉంటుంది. స్థిరాదాయ పథకాల కంటే ఎక్కువ రాబడులను మీరు ఆశిస్తున్నట్టు అయితే.. మీ ఆదాయం రూ.6.5 లక్షల వరకు ఉన్నట్టయితే అప్పుడు రూ.1.5 లక్షలను పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతో మిగిలిన రూ.5లక్షలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఈక్విటీలకు కేటాయింపులు 20–30% మించనీయకండి. డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే కూడా స్థిరాదాయ ప్లాన్ల నుంచే తీసుకోవాలి. ఇదే మాదిరి మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జిరోదా..! -
ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటీ? తెలుసుకోండిలా..
స్టాక్‌మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమ్యాట్ ఖాతాలే ఇందుకు నిదర్శనం. షేర్మార్కెట్లో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందడమనేది ఎంతో కీలకం. ఇందుకు అనుగుణంగా ఉండే వాటిలో ఫ్లెక్సీక్యాప్ పథకం ఒకటి. అసలు ఫ్లెక్సీక్యాప్ అంటే ఏంటీ ? ఇటీవల అధికంగా లాభాలు అందిస్తోన్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్కి సంబంధించిన వివరాలు... ఫ్లెక్సీక్యాప్ ఫ్లెక్సీక్యాప్ పథకాలు గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పేరుతో ఉండేవి. మల్టీక్యాప్ పథకాలు కచ్చితంగా స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ పథకాల్లో 25 శాతం చొప్పున కనీస పెట్టుబడులను నిర్వహించాల్సిందేనని.. లేదంటే ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ సెబీ గతేడాది నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో మల్టీక్యాప్ విభాగం నిబంధనలను కట్టుబడలేని పథకాలు ఫ్లెక్సీక్యాప్గా పేరు మార్చుకున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ గడిచిన కొన్నేళ్లలో ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలో మార్కెట్ విలువ పరంగా తమకు అనుకూలం అనిపించిన, భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకునే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. ఫలానా విభాగంలో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) కచ్చితంగా ఇంత మేర పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనలు ఈ పథకాలకు వర్తించవు. ఈ విభాగంలో కొన్ని పథకాలు గడిచిన ఏడాది కాలంలో గణణీయమైన రాబడులను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం (కనీసం పదేళ్లు అంతకుమించి) ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కొంత చోటు కల్పించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్టర్లకు 58 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఇదే కాలంలో ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడులు 51 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. బీఎస్ఈ 500 సూచీ రాబడులు 53 శాతంతో పోల్చినా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం మెరుగైన పనితీరును చూపించినట్టు తెలుస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతానికి పైనే సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. అంతేకాదు ఐదేళ్లలోనూ, ఏడేళ్లలోనూ, పదేళ్లలో కూడా వార్షిక సగటు రాబడులు 15 శాతం స్థాయిలోనే ఉన్నాయి. నిలకడైన పనితీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లక్ష ఇన్వెస్టే చేస్తే కోటి రూపాయలు ఆదిత్య బిర్లా ఫెక్సీక్యాప్ పథకంలో 22 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం రూ.1.04 కోట్లు సమకూరేది. అంటే 104 రెట్లు వృద్ధి చెందేది. వార్షికంగా 22.57 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ను మించి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై దృష్టి ప్రస్తుతం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం నిర్వహణలో రూ.14,571 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 96.2 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 3.5 శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 65 స్టాక్స్‌ను నిర్వహిస్తోంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 68 శాతం, మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 14 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలు, బలమైన యాజమాన్యాలు, కార్పొరేట్ పాలనలో పారదర్శకత, బలమైన బ్యాలన్స్ షీట్ ఇటువంటి అంశాల ఆధారంగా కంపెనీలను ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.77 ఇన్ఫోసిస్ 8.46 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 7.05 డాక్టర్ రెడ్డీస్ 6.19 భారతీ ఎయిర్టెల్ 4.35 హెచ్‌సీఎల్ టెక్ 3.66 సన్‌ఫార్మా 2.75 బజాజ్ ఫైనాన్స్ 2.45 కోటక్ బ్యాంకు 2.24 ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ 2.22 -
2020లో 10 పెన్నీ స్టాక్స్ బొనాంజా
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో దేశీ స్టాక్ మార్కెట్లు పలు ఆటుపోట్లను చవిచూశాయి. తొలుత జనవరిలో సరికొత్త గరిష్టాలవైపు నడక సాగించాయి. అయితే చైనాలోని వుహాన్‌లో ఊపిరిపోసుకుని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ ధాటికి మార్చికల్లా కనిష్టాలకు పడిపోయాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకున్న సహాయక చర్యలతో తిరిగి నెల రోజుల్లోనే రికవరీ బాట పట్టాయి. అంతేకాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్లుబడుల వెల్లువతో సరికొత్త గరిష్టా రికార్డులను సాధిస్తూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడేళ్లుగా పెద్దగా వృద్ధి చూపని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు మధ్య, చిన్నతరహా కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మార్కెట్లను మించి లాభపడుతూ సరికొత్త గరిష్టాలను చేరాయి. పెన్సీ స్టాక్స్ 2019లో పెన్నీ స్టాక్స్‌గా నిలిచిన 10 కంపెనీల షేర్లు ఈ ఏడాది(2020) లాభాల పరుగందుకున్నాయి. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక శాతం రిటర్నులు అందించాయి. ఇందుకు రూ. 25 ధరకంటే తక్కువగా ఉన్న షేర్లను మాత్రమే పరిగణించినట్లు ఏస్ ఈక్విటీ పేర్కొంది. రూ. 100 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) మించని కంపెనీలను మాత్రమే మదింపులోకి తీసుకున్న్లట్లు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం.. (బోరోసిల్ -ఫైనోటెక్స్ కెమ్.. యమస్పీడ్) అలోక్ గెలాప్ సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 38 శాతం వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో అలోక్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగింది. ఫలితంగా అలోక్ ఇండస్ట్రీస్ షేరు 2020లో ఏకంగా 602 శాతం దూసుకెళ్లింది. 2019 డిసెంబర్ 31న రూ. 3.04గా నమోదైన ఈ షేరు వారాంతానికల్లా రూ. 21.4కు చేరింది. లాభాల బాట అలోక్ ఇండస్ట్రీస్ బాటలో టెక్నాలజీ సేవల కంపెనీ స్యుబెక్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో ఈ షేరు గతేడాది చివర్లో నమోదైన రూ. 5.90 నుంచి వారాంతానికల్లా రూ. 29.70కు ఎగసింది. వెరసి 403 శాతం ర్యాలీ చేసింది. ఈ జాబితాలో కర్దా కన్స్ట్రక్షన్స్ షేరు రూ. 23.74 నుంచి 376 శాతం జంప్‌చేసింది. వారాంతానికల్లా రూ. 113ను దాటేసింది. ఇక టెక్ సొల్యూషన్స్ అందించే కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేరు రూ. 18 నుంచి రూ. 72.40కు పురోగమించింది. ఇది 301 శాతం వృద్ధికాగా.. క్యాపిటల్ గూడ్స్ కంపెనీ సీజీ పవర్ ఇండస్ట్రియల్ షేరు రూ. 10.82 నుంచి రూ. 43.20వరకూ పెరిగింది. ఇది 299 శాతం లాభంకావడం గమనార్హం! ఇదేవిధంగా రతన్ ఇండియా ఇన్ఫ్రా స్టాక్ రూ. 1.87 నుంచి రూ. 6.60కు బలపడింది. వెరసి 253 శాతం వృద్ధి చూపింది. హెల్త్‌కేర్ కంపెనీ మార్క్‌శాన్స్ ఫార్మా రూ. 16.71 స్థాయి నుంచి రూ. 58కు ఎగసింది. 247 శాతం లాభపడింది. టెలికం సేవల కంపెనీ టాటా టెలీసర్వీసెస్ షేరు రూ. 2.25 నుంచి 237 శాతం ర్యాలీ చేసింది. రూ. 7.59ను తాకింది. దుస్తుల తయారీ కంపెనీ బాంబే రేయాన్ ఫ్యాషన్స్ రూ. 4.20 నుంచి 220 శాతం జంప్‌చేసింది. రూ. 13.44కు చేరింది. ఇక మౌలిక రంగ కంపెనీ జేపీ అసోసియేట్స్ షేరు రూ. 1.96 నుంచి రూ. 6.16కు పెరిగింది. ఇది 214 శాతం లాభం! -
క్రిస్మస్ టు క్రిస్మస్: చిన్న షేర్లు చిరుతలు
ముంబై, సాక్షి: గతేడాది(2019) క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకూ మార్కెట్లు పలు ఎత్తుపల్లాలను చవిచూశాయి. అంతక్రితం ఏడాది మార్కెట్లు పెద్దగా ర్యాలీ చేయకపోవడంతో నెమ్మదిగా బలపడుతూ వచ్చాయి. అయితే 2020 మార్చికల్లా కోవిడ్-19 దెబ్బకు ఉన్నట్టుండి పతనమయ్యాయి. తిరిగి వెనువెంటనే కోలుకుని బుల్ ధోరణిలో సాగిపోయాయి. ఫలితంగా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తూ వచ్చాయి. తాజాగా సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మైలురానికి అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు సాగుతోంది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఏడాది కాలంలో 13 శాతం చొప్పున బలపడగా.. మధ్య, చిన్నతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 19 శాతం, 32 శాతం చొప్పున ఎగశాయి. ఇతర వివరాలు చూద్దాం.. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) కారణాలేవిటంటే? ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పడగ విప్పడంతో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. తద్వారా భారీ స్థాయిలో నిధులను వ్యవస్థలోకి విడుదల చేయడంతో అటు బంగారం, ఇటు స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సంక్షోభ పరిస్థితుల భయాలతో పసిడి జోరందుకోగా.. లిక్విడిటీ కారణంగా మార్కెట్లు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా తదితర దిగ్గజాలు వేగంగా వ్యాక్సిన్లను రూపొందించడంతో సెంటిమెంటు పుంజుకున్నట్లు తెలియజేశారు. దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం ప్రభావం చూపింది. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) షేర్లు మరింత స్పీడ్ బీఎస్ఈ-500 ఇండెక్సులో 65 శాతం షేర్లు లాభాలతో నిలిచాయి. వీటిలో 50 శాతం రెండంకెల వృద్ధిని చూపాయి. ప్రధానంగా 36 స్టాక్స్ 100-900 శాతం మధ్య దూసుకెళ్లడం ద్వారా మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. వీటిలో మిడ్, స్మాల్ క్యాప్స్ అధికంగా చోటు సాధించడం విశేషం! ప్రధాన కంపెనీలలో అదానీ గ్రీన్, ఆర్తి డ్రగ్స్, లారస్ లేబ్స్, ఐవోఎల్ కెమికల్స్, ఆల్కిల్ అమైన్స్, బిర్లాసాఫ్ట్, డిక్సన్ టెక్నాలజీస్, ఇండియామార్ట్ ఇంటర్మెష్, గ్రాన్యూల్స్, వైభవ్ గ్లోబల్, టాటా కమ్యూనికేషన్స్, నవీన్ ఫ్లోరిన్, పాలీ మెడిక్యూర్, దీపక్ నైట్రైట్, అఫ్లే ఇండియా, సీక్వెంట్ సైంటిఫిక్, జేబీ కెమికల్స్, అదానీ గ్యాస్, స్ట్రైడ్స్ ఫార్మా, ఫస్ట్‌సోర్స్, అదానీ ఎంటర్, యాంబర్ ఎంటర్, ఏపీఎల్ అపోలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జిందాల్ స్టెయిన్, టాటా ఎలక్సీ, దివీస్ లేబ్స్, మైండ్‌ట్రీ, ఇండియా సిమెంట్స్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎస్కార్ట్స్, రెస్సాన్సివ్, వొకార్డ్ 600-100 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! ఇతర కౌంటర్లలో తాన్లా సొల్యూషన్స్ 900 శాతం పురోగమించింది. నేలచూపులో గతేడాది కాలంలో ప్రభుత్వ రంగ కంపెనీలు కొన్ని నేలచూపులకే పరిమితమయ్యాయి. ఈ జాబితాలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హోటళ్లు, రిటైల్ రంగ కౌంటర్లు సైతం చోటు చేసుకున్నాయి. ఫ్యూచర్ రిటైల్, జీఈ పవర్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, రేమండ్, కెనరా బ్యాంక్, చాలెట్ హోటల్స్, ఇండస్ఇండ్, బీవోబీ, లెమన్ ట్రీ, షాపర్స్‌స్టాప్, ఎడిల్వీజ్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, జాగరణ్ ప్రకాశన్, డీసీబీ బ్యాంక్, కోల్ ఇండియా, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ తదితరాలు 30 శాతం స్థాయిలో నీరసించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. -
30 రోజుల్లో 100 శాతం లాభాలు
ముంబై, సాక్షి: కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పలు మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లవైపు దృష్టిసారించారు. వెరసి పలు కౌంటర్లు గత నెల రోజుల్లోనే 100 శాతానికిపైగా లాభపడ్డాయి. గత 30 రోజుల్లో 29 కంపెనీలు రెట్టింపునకుపైగా ఎగశాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 6 శాతమే లాభపడటం గమనార్హం! ఇటీవల దూకుడు చూపుతున్న కంపెనీల జాబితాలో జెట్ ఎయిర్వేస్, వక్రంగీ, డైనకాన్స్ సిస్టమ్స్, గోల్డెన్ టొబాకో, ఆర్కిడ్ ఫార్మా, బాఫ్నా ఫార్మా, ఆర్వీ డెనిమ్స్ తదితరాలు చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. (కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు) జోరుగా హుషారుగా మురారీ లాల్ జలాన్, కల్రాక్ క్యాపిటల్ కన్సార్షియం ద్వారా తిరిగి రెక్కలొచ్చిన జెట్ ఎయిర్వేస్ కౌంటర్ వరుసగా 8వ రోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 105.35 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. కొత్త ఏడాది(2021)లో దేశ, విదేశాలకు సర్వీసులను పునరుద్ధరించే ప్రణాళికల్లో ఉంది. మెట్రో నగరాలతో యూరోపియన్ దేశాలకు సర్వీసులను ప్రారంభించనుంది. దీంతో ఈ కౌంటర్ జోరందుకోగా.. గోల్డెన్ టొబాకో షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. గత మూడు రోజుల్లోనే 60 శాతం దూసుకెళ్లింది. తాజాగా రూ. 50.55 వద్ద నిలిచింది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ముంబైలోని విలే పార్లే ప్రాపర్టీని ఎక్సైజ్ శాఖ అటాచ్ చేసింది. అయితే ఈ సమస్యనుంచి బయటపడగలమని యాజమాన్యం భావిస్తోంది. అంతేకాకుండా గుంటూరులో గల ప్రాపర్టీని సైతం అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. (జూబిలెంట్ నుంచి బిర్యానీ- దివీస్ కొత్త రికార్డ్) ఇతర కౌంటర్లూ ఫార్మా కంపెనీ సువెన్ లైఫ్ సైన్సెస్ నాలుగో రోజూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 105.20 వద్ద ఫ్రీజయ్యింది. గత మూడు రోజుల్లో 10 శాతం చొప్పున జంప్‌చేసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 124 శాతం ర్యాలీ చేసింది. కాగా.. డైనకాన్స్ సిస్టమ్స్ తొలుత 10 శాతం అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. రూ. 85.50 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఆపై తిరిగి 10 శాతం లోయర్ సర్క్యూట్‌కు చేరి రూ. 70 వద్ద ముగిసింది. ఈ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ షేరు గత వారం రోజుల్లోనే 88 శాతం పురోగమించింది. పీఎస్‌యూ సంస్థ యూబీఐ నుంచి రూ. 24.5 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు డైనకాన్స్ మంగళవారం ప్రకటించింది. నెల రోజుల తీరు స్మాల్ క్యాప్ కౌంటర్లలో ప్రధానంగా ఆర్కిడ్ ఫార్మా, బాఫ్నా ఫార్మా, రాజ్ ఆయిల్, జిందాల్ ఫొటో, గోల్డెన్ టొబాకో, ట్రాన్స్ఫార్మర్స్(ట్రిల్), సువెన్ లైఫ్, డైనకాన్స్, ఆర్వీ డెనిమ్స్, బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్, వక్రంగీ, జెనిత్ ఎక్స్‌పోర్ట్స్, ఆర్ఫిన్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ తదితరాలు గత నెల రోజుల్లో 178-102 శాతం మధ్య దూసుకెళ్లడం విశేషం! -
నష్టాల ముగింపు- చిన్న షేర్లు జూమ్
ముంబై, సాక్షి: రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు క్షీణించి 44,150 వద్ద నిలివగా.. నిఫ్టీ 18 పాయింట్లు తక్కువగా 12,969 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,995 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,914 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య నీరసంగా ముగిశాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొనడం గమనార్హం! ఐటీ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, మీడియా, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్ 2.7-1.25 శాతం మధ్య బలపడగా.. ఐటీ 0.45 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో, దివీస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ 4.3-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎంజీఎల్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎంజీఎల్ 14 శాతం దూసుకెళ్లగా.. కమిన్స్, ఐజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, చోళమండలం, కేడిలా హెల్త్‌కేర్, ఎక్సైడ్, అపోలో టైర్, టీవీఎస్ మోటార్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 10.4- 5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పెట్రోనెట్, పిరమల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఆర్ఈసీ, జిందాల్ స్టీల్, మారికో, ఇండిగో, కోఫోర్జ్, మెక్‌డోవెల్ 3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1032 మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
మూడో రోజూ రికార్డుల పరుగు
ముంబై, సాక్షి: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల గెలాప్ తీశాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు ఎగసి 44,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు బలపడి 12,938 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 44,215 వద్ద గరిష్టానికి, 43,786 దిగువన కనిష్టానికీ చేరింది. నిఫ్టీ సైతం 12,949- 12,819 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్-19 వ్యాక్సిన్లపై అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అత్యధికంగా ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఎన్ఎస్ఈలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 26 నెలల గరిష్టానికి చేరగా.. బ్యాంక్ నిఫ్టీ 9 నెలల హైను తాకింది. మెటల్ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు 3-2 శాతం మధ్య ఎగశాయి. మీడియా, మెటల్ 0.5 శాతం పుంజుకోగా.. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా 1 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఐషర్, హిందాల్కో, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ 11-2 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే బీపీసీఎల్, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, టైటన్, టీసీఎస్, ఐటీసీ, ఎయిర్టెల్, హీరో మోటో, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, విప్రో 3-1 శాతం మధ్య క్షీణించాయి. ఫైనాన్స్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎంఅండ్ఎం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, ఎల్అండ్టీ ఫైనాన్స్, మదర్సన్, బాటా, టాటా పవర్, జీఎంఆర్, చోళమండలం, ఎంజీఎల్, ఇండిగో 7.6-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క అంబుజా, అరబిందో, నాల్కో, ఐసీఐసీఐ లంబార్డ్, హెచ్‌పీసీఎల్, డాబర్, ఐడియా 2.5-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,615 లాభపడగా.. 1,156 డీలా పడ్డాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శనివారం ఎఫ్‌పీఐలు రూ. 78.5 కోట్లు, డీఐఐలు రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. కాగా.. ఈ నెల 2-13 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
ఈ చిన్న షేర్లు మార్కెట్లనే మించాయ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 510 పాయింట్లు జంప్‌చేసి 40,268 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లనే మించుతూ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో జామ్నా ఆటో ఇండస్ట్రీస్, మ్యాగ్మా ఫిన్‌కార్ప్, ప్రిజమ్ జాన్సన్, యాంబర్ ఎంటర్ప్రైజెస్, సువెన్ ఫార్మాస్యూటికల్స్, సుందరం ఫైనాన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. జామ్నా ఆటో ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 93,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.53 లక్షల షేర్లు చేతులు మారాయి. మ్యాగ్మా ఫిన్‌కార్ప్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 40 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.3 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.84 లక్షల షేర్లు చేతులు మారాయి. ప్రిజమ్ జాన్సన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం లాభపడి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 55,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 76,000 షేర్లు చేతులు మారాయి. యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.6 శాతం జంప్‌చేసి రూ. 2,239 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,353 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,500 షేర్లు చేతులు మారాయి. సువెన్ ఫార్మాస్యూటికల్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.5 శాతం దూసుకెళ్లి రూ. 323 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 332 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 27,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 15,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి. సుందరం ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం ర్యాలీతో రూ. 1590 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1610ను అధిగమించింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,300 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో కేవలం 1,300 షేర్లు చేతులు మారాయి. -
మార్కెట్లు బోర్లా- ఈ చిన్న షేర్లు భలేభలే
ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 162 పాయింట్లు తక్కువగా 39,588కు చేరగా.. నిఫ్టీ 44 పాయింట్లు బలహీనపడి 11,627 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో టీవీఎస్ మోటార్, వైభవ్ గ్లోబల్ లిమిటెడ్, బజాజ్ హెల్త్‌కేర్, ధని సర్వీసెస్, ఆసమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. టీవీఎస్ మోటార్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 450 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 461 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 62,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.04 లక్షల షేర్లు చేతులు మారాయి. వైభవ్ గ్లోబల్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.4 శాతం లాభపడి రూ. 1,979 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,040 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 1,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,000 షేర్లు చేతులు మారాయి. బజాజ్ హెల్త్‌కేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 545 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 590 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 43,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి. ధని సర్వీసెస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 194 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో పాక్షిక చెల్లింపుల ఈ షేరు మరింత అధికంగా 12 శాతం పెరిగి రూ. 93కు చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 74,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 45,000 షేర్లు చేతులు మారాయి. ఆసమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం పురోగమించి రూ. 55 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,200 షేర్లు చేతులు మారాయి. -
ఈ మిడ్ క్యాప్ షేర్లు బేర్ బేర్
ప్రపంచ మార్కెట్ల పతనం కారణంగా నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు తెరతీశారు. దీంతో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, జీఈ పవర్ ఇండియా, టాటా కాఫీ, ఎంసీఎక్స్ కౌంటర్లు భారీ నష్టాలతో డీలా పడ్డాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. వివరాలు చూద్దాం.. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం పడిపోయి రూ. 659 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 646 వరకూ జారింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 50,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 81,000 షేర్లు చేతులు మారాయి. పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.2 శాతం పతనమై రూ. 1218 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 1,198 వరకూ జారింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 52,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 85,000 షేర్లు చేతులు మారాయి. జీఈ పవర్ ఇండియా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.4 శాతం కుప్పకూలి రూ. 228 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 226 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9,600 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 65,000 షేర్లు చేతులు మారాయి. టాటా కాఫీ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం తిరోగమించి రూ. 102 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 56,600 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 57,000 షేర్లు చేతులు మారాయి. ఎంసీఎక్స్ ఇండియా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.4 శాతం పతనమై రూ. 1,672 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 18,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 2.74 లక్షల షేర్లు చేతులు మారాయి. -
మార్కెట్ల పతనం- చిన్న షేర్ల పరుగు
మిడ్‌సెషన్‌కు ముందుగానే ఊపందుకున్న అమ్మకాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 668 పాయింట్లు పడిపోయి 40,017ను తాకింది. నిఫ్టీ సైతం 206 పాయింట్లు పతనమై 1,724 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో కొన్ని కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లగా..కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పుంజుకుంది. జాబితాలో ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, జస్ట్ డయల్ లిమిటెడ్, జీహెచ్‌సీఎల్ లిమిటెడ్, ప్రైమ్‌ఫోకస్, తాల్‌బ్రోస్ ఆటోమోటివ్, ఎన్డీఆర్ ఆటో కంపోనెంట్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 5.2 శాతం జంప్‌చేసి రూ. 756 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 794 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 10,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 20,000 షేర్లు చేతులు మారాయి. జస్ట్ డయల్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 635 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 642ను అధిగమించింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.21 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.11 లక్షల షేర్లు చేతులు మారాయి. జీహెచ్‌సీఎల్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం వృద్ధితో రూ. 163 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 168 వరకూ బలపడింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 48,000 షేర్లు చేతులు మారాయి. ప్రైమ్‌ఫోకస్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 7.5 శాతం పురోగమించి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 45 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 16,500 షేర్లు చేతులు మారాయి. తాల్‌బ్రోస్ ఆటోమోటివ్ ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 130 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 135 వరకూ పెరిగింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 900 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 25,000 షేర్లు చేతులు మారాయి. ఎన్డీఆర్ ఆటో కంపోనెంట్స్ ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 152 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 900 షేర్లు మాత్రమేకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2,000 షేర్లు చేతులు మారాయి. -
మిడ్, స్మాల్ క్యాప్స్‌లో దీపావళి: విశ్లేషణ
దీపావళికి ముందు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగితే.. మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ పెరగవచ్చని సీనియర్ సాంకేతిక నిపుణులు గౌరవ్ రత్నపార్ఖీ పేర్కొంటున్నారు. బీఎన్పీ పరిబాస్ ప్రమోట్ చేసిన షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్.. స్వల్ప కాలంలో మార్కెట్లను మించి మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు పరుగుతీసే వీలున్నట్లు భావిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సాంకేతిక అంశాల ఆధారంగా మార్కెట్లపై అంచనాలను వెల్లడించారు. అంతేకాకుండా మూడు బ్లూచిప్ స్టాక్స్‌ను కొనుగోలుకి సిఫారసు చేశారు. వివరాలు చూద్దాం.. మెచూరీటికి దగ్గరగా.. గత వారం మార్కెట్లు స్వల్ప శ్రేణిలో సంచరించినప్పటికీ ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 12,000 పాయింట్ల సమీపంలో స్థిరపడింది. గత నెల చివరి వారంలోనూ, ఈ నెల మొదట్లోనూ ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల కన్సాలిడేషన్ బాట పట్టాయి. వచ్చే వారం అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుండటం, యూఎస్‌లో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశముంది. చార్టుల ప్రకారం ప్రస్తుతం నిఫ్టీ ట్రయాంగులర్ ప్యాటర్న్‌లోనే కనిపిస్తోంది. అంటే మెచూరిటీకి దగ్గరగా ఉన్నట్లు. దీంతో 12,025 స్థాయిలో నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే.. తదుపరి 12,200 వద్ద, ఆపై 12,430 వద్ద తిరిగి అవరోధాలు ఏర్పడవచ్చు. ఇదే విధంగా మార్కెట్లు బలహీనపడితే.. నిఫ్టీకి తొలుత 11,800 వద్ద, తదుపరి 11,660 స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది. కన్సాలిడేషన్‌లో నిఫ్టీతో పోలిస్తే మిగిలిన ఇండెక్సులు దీర్ఘకాలిక కన్సాలిడేషన్‌లో ఉన్నాయి. ఆగస్ట్- సెప్టెంబర్‌లో నమోదైన గరిష్టం 11,794 పాయింట్లను నిఫ్టీ ఇప్పటికే అధిగమించింది. అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఇటీవల గరిష్టాలకంటే దిగువనే ట్రేడవుతున్నాయి. మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే ఇకపై ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీలను మించి మిడ్, స్మాల్ క్యాప్స్ పరుగుతీసే అవకాశముంది. వెరసి దీపావళి ర్యాలీలో మార్కెట్లకంటే ముందుండే వీలుంది. టెక్నికల్ స్టాక్స్.. చార్టుల ప్రకారం సాంకేతిక అంశాల ఆధారంగా ఈ వారం మూడు స్టాక్స్ కొనుగోలుకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. వీటిని మూడు లేదా నాలుగు వారాలకు పరిశీలించవచ్చు. జాబితాలో ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ, ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ డాబర్ ఇండియా, ఇండెక్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ చోటు సాధించాయి. అయితే పొజిషన్లు తీసుకునే ఇన్వెస్టర్లు తప్పనిసరిగా స్టాప్‌లాస్‌లను అమలు చేయవలసి ఉంటుంది. మారుతీ సుజుకీ: కొనుగోలు చేయవచ్చు గత కొద్ది సెషన్లుగా మారుతీ సుజుకీ కౌంటర్ స్వల్పకాలిక దిద్దుబాటు(కరెక్షన్)కు లోనయ్యింది. అయితే అత్యంత కీలకమైన రోజువారీ చలన సగటుల సమీపంలో మద్దతు లభించింది. తద్వారా గత సెషన్లో బౌన్స్‌బ్యాక్(ఫ్రెష్ మూవ్)ను సాధించింది. ఈ దశలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరగడం బుల్లిష్ ధోరణికి సంకేతంగా భావించవచ్చు. 23న ముగింపు: రూ. 7,108 టార్గెట్ ధర: రూ. 7,350- 7,600 స్టాప్‌లాస్: రూ. 6,830 డాబర్ ఇండియా: కొనుగోలు చేయవచ్చు మధ్యకాలిక రైజింగ్ చానల్లో భాగంగా డాబర్ ఇండియా షేరు తాజాగా బలపడింది. ఇటీవలి క్షీణతతో చానల్ దిగువ భాగాన మద్దతును కూడగట్టుకుంది. వెరసి మద్దతు స్థాయిల సమీపంలో కదులుతోంది. తద్వారా పరుగు తీసేందుకు సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. 23న ముగింపు: రూ. 519 టార్గెట్ ధర: రూ. 535- 564 స్టాప్‌లాస్: రూ. 500 ఏషియన్ పెయింట్స్: కొనుగోలు చేయవచ్చు గత కొన్ని సెషన్లలో స్వల్ప దిద్దుబాటు(కరెక్షన్) తదుపరి ఏషియన్ పెయింట్స్ స్పీడందుకుంది. ఈ జోరుతో ఇకపై మరింత ర్యాలీ చేసే అవకాశముంది. స్వల్ప, మధ్యకాలిక సంకేతాలు బుల్లిష్ ధోరణినే వ్యక్తం చేస్తున్నాయి. 23న ముగింపు: రూ. 2,119 టార్గెట్ ధర: రూ. 2,185- 2,270 స్టాప్‌లాస్: రూ. 2,040 -
మార్కెట్లు అప్- ఈ చిన్న షేర్లు గెలాప్
ఆటుపోట్ల మధ్య వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 106 పాయింట్లు పెరిగి 40,538కు చేరగా.. నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 11,896 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఐబీ ఇంటిగ్రేటెడ్, డీహెచ్ఎఫ్ఎల్, హిందుస్తాన్ కాపర్, సొమానీ సిరామిక్స్, ఓరియంట్ బెల్, ఒమాక్స్ ఆటోస్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 54.25 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 32,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 79,000 షేర్లు చేతులు మారాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 15.2 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.61 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 34.3 లక్షల షేర్లు చేతులు మారాయి. హిందుస్తాన్ కాపర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10.4 శాతం లాభపడి రూ. 36.25 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 39,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.4 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి. సొమానీ సిరామిక్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 223 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 231 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 34,500 షేర్లు చేతులు మారాయి. ఓరియంట్ బెల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 125 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 137 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 27,500 షేర్లు చేతులు మారాయి. ఒమాక్స్ ఆటోస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం ర్యాలీతో రూ. 40 సమీపంలో ట్రేడవుతోంది. తొలుత రూ. 42ను అధిగమించింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 1,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 6,000 షేర్లు చేతులు మారాయి. -
బీఎస్ఈ మార్కెట్ విలువ- సరికొత్త రికార్డ్
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, సానుకూల ప్రపంచ సంకేతాల నేపథ్యంలో ఇటీవల జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డును సాధించాయి. వారాంతాన ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 40,509 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 160.68 ట్రిలియన్లను తాకింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. తద్వారా ఈ ఏడాది(2020) జనవరి 17న సాధించిన రూ. 160.57 ట్రిలియన్ల రికార్డును అధిగమించింది. ఈ బాటలో జనవరి 20న నమోదైన 42,274 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని అందుకునేందుకు సెన్సెక్స్ దాదాపు 4 శాతం దూరంలో నిలిచింది. డాలర్ల రూపేణా చూస్తే గత మూడేళ్లలో 14 శాతం పుంజుకోవడం ద్వారా దేశీ స్టాక్ మార్కెట్లు వర్ధమాన మార్కెట్లలో ముందంజలో ఉన్నాయి. కాగా.. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 20 శాతం దూరంలో నిలవడం గమనార్హం! ఐటీ, ఫార్మా దన్ను కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సెన్సెక్స్ విలువకు రూ. 4.67 ట్రిలియన్లను జమ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. ఈ బాటలో ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కలసికట్టుగా రూ. 5.08 ట్రిలియన్ల విలువను అందించాయి. ఇక ఫార్మా దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, దివీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, బయోకాన్ రూ. 2 ట్రిలియన్లను సమకూర్చగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ రూ. 1.75 ట్రిలియన్లతో సహకరించాయి. న్యూ లిస్టింగ్స్ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఆరు కంపెనీల నుంచి సెన్సెక్స్ మార్కెట్ క్యాప్‌నకు రూ. 1.01 ట్రిలియన్లు జమయ్యింది. వీటిలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో 177 స్టాక్స్ జనవరి 17 స్థాయిలను అధిగమించగా.. 19 షేర్ల మార్కెట్ విలువలో సగానికిపైగా క్షీణించింది. జాబితాలో ఇండస్ఇండ్, కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఫ్యూచర్ రిటైల్, స్పైస్‌జెట్ తదితరాలు చేరాయి. -
ఈ ఐటీ షేర్ల సొగసు చూడతరమా?
తొలుత కనిపించిన ఆటుపోట్ల నుంచి బయటపడుతూ జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 303 పాయింట్లు జంప్‌చేసి 39,877ను తాకగా.. నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 11,735 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో మైండ్‌ట్రీ లిమిటెడ్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, ఆల్‌సెక్ టెక్నాలజీస్, సైబర్‌టెక్ సిస్టమ్స్, తెరా సాఫ్ట్వేర్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. మైండ్‌ట్రీ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,469 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,590 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.11 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.25 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 2,809 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,959 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 13,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 27,500 షేర్లు చేతులు మారాయి. ఎంఫసిస్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ర్యాలీ చేసి రూ. 1,414 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,454 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 16,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 62,000 షేర్లు చేతులు మారాయి. ఆల్‌సెక్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం లాభపడి రూ. 265 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 286 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 350 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2,000 షేర్లు చేతులు మారాయి. తెరా సాఫ్ట్వేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం ఎగసి రూ. 29 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8,000 షేర్లు చేతులు మారాయి. సైబర్‌టెక్ సిస్టమ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 14 శాతం జంప్‌చేసి రూ. 84 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 88 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 26,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.54 లక్షల షేర్లు చేతులు మారాయి. -
ఈ మిడ్, స్మాల్ క్యాప్స్.. భలే స్పీడ్ గురూ
తొలుత కనిపించిన ఆటుపోట్ల నుంచి బయటపడుతూ జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 303 పాయింట్లు జంప్‌చేసి 39,877ను తాకగా.. నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 11,735 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో థైరోకేర్ టెక్నాలజీస్, మెట్రోపోలిస్ హెల్త్, టేక్ సొల్యూషన్స్, సొలారా యాక్టివ్ ఫార్మా, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. థైరోకేర్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 1010 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,038 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 14,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.43 లక్షల షేర్లు చేతులు మారాయి. మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 2,083 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,120 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 17,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 28,000 షేర్లు చేతులు మారాయి. టేక్ సొల్యూషన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం ర్యాలీ చేసి రూ. 48 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.09 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.31 లక్షల షేర్లు చేతులు మారాయి. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం లాభపడి రూ. 2,117 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,178 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 21,000 షేర్లు చేతులు మారాయి. సొలారా యాక్టివ్ ఫార్మా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ఎగసి రూ. 1,174 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,249 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 18,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.36 లక్షల షేర్లు చేతులు మారాయి.