
సరిహద్దు వద్ద చైనాతో సైనిక వివాదాలు కొనసాగుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 207 పాయింట్లు క్షీణించి 39,096కు చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐటీడీసీ), నెస్కో లిమిటెడ్, శాక్‌సాఫ్ట్, ఎస్‌ఎంఎస్ లైఫ్‌సైన్సెస్, జేబీ కెమికల్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..
ఐటీడీసీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.2 శాతం లాభపడి రూ. 270 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 275 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 12,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 79,000 షేర్లు చేతులు మారాయి.
జేబీ కెమికల్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 1047 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1059 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం గమనార్హం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 31,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 71,000 షేర్లు చేతులు మారాయి.
నెస్కో లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.3 శాతం ర్యాలీ చేసి రూ. 593 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 19,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి.
శాక్‌సాఫ్ట్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లి రూ. 347 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 355 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 38,500 షేర్లు చేతులు మారాయి.
ఎస్‌ఎంఎస్ లైఫ్‌సైన్సెస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 602 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 11,500 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment