
ప్రపంచ మార్కెట్ల పతనంతో భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం కోలుకున్నాయి. స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 76 పాయింట్లు తక్కువగా 33,462కు చేరగా.. నిఫ్టీ 25 పాయింట్లు నీరసించి 9,877 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్ 1,000 పాయింట్లవరకూ పడిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో గ్రాన్సూల్స్ ఇండియా, గుజరాత్ అపోలో ఇండస్ట్రీస్, ఏషియన్ గ్రానైటొ ఇండియా, మ్యాగ్మా ఫిన్‌కార్ప్, జేటీఈకేటీ ఇండియా, ఇండ్ బ్యాంక్ హౌసింగ్ చోటు సాధించాయి.
గ్రాన్యూల్స్ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ఈ హెల్త్‌కేర్ రంగ కంపెనీ షేరు ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 216 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 217 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.54 లక్షల షేర్లుకాగా.. 2.42 లక్షల షేర్లు చేతులు మారాయి.
గుజరాత్ అపోలో ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ఈ నిర్మాణ రంగ పరికరాల తయారీ కంపెనీ షేరు ప్రస్తుతం 18 శాతం దూసుకెళ్లి రూ. 183 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 750 షేర్లుకాగా.. 3700 షేర్లు చేతులు మారాయి.
ఏషియన్ గ్రానైటొ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ఈ టైల్స్, గ్రానైట్స్ తయారీ కంపెనీ షేరు ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 159 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 165 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 45,500 షేర్లుకాగా.. 23,700 షేర్లు చేతులు మారాయి.
జేటీఈకేటీ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ఈ ఆటో విడిభాగాల కంపెనీ షేరు ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 73 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 40,300 షేర్లుకాగా.. 1.18 లక్షల షేర్లు చేతులు మారాయి.
మ్యాగ్మా ఫిన్‌కార్ప్
ఎన్‌ఎస్‌ఈలో ఈ ఎన్‌బీఎఫ్‌సీ రంగ కంపెనీ షేరు ప్రస్తుతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 18.5 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.97 లక్షల షేర్లుకాగా.. 5.48 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఇండ్ బ్యాంక్ హౌసింగ్
బీఎస్‌ఈలో ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేరు ప్రస్తుతం 10 శాతం జంప్‌చేసి రూ. 24 సమీపంలో ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,300 షేర్లుకాగా.. 13,000 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment