రేసు గుర్రాలు.. చిన్న షేర్లు | Bse mid and small cap index is up 30 percent this 2024-25 Year | Sakshi
Sakshi News home page

రేసు గుర్రాలు.. చిన్న షేర్లు

Published Thu, Jul 18 2024 2:38 AM | Last Updated on Thu, Jul 18 2024 2:38 AM

Bse mid and small cap index is up 30 percent this 2024-25 Year

ఈ ఏడాది మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సుల దూకుడు 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ను మించుతూ 30 శాతం హైజంప్‌

సెన్సెక్స్‌తోపాటు రికార్డ్‌ గరిష్టాలకు  మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 

కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్‌ను మించి బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్‌ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్‌క్యాప్‌ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్‌చేంది. ఇదే కాలంలో బీఎస్‌ఈ ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.

ఏషియన్‌ పెయింట్స్‌ లాభం డౌన్‌ 
రూ. 1,187 కోట్లుగా నమోదు 
న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్‌ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్‌ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్‌ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్‌ మిక్స్‌లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్‌ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్‌ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్‌ బిజినెస్‌ 6% 
పుంజుకున్నట్లు తెలిపారు.

పర్యాటకానికి పరిశ్రమ హోదా..
జీఎస్‌టీ రేటు క్రమబదీ్ధకరించాలి 
ట్రావెల్‌ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్‌ 
పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్‌ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్‌టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్‌టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.

మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్‌టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సేవల సంస్థ మేక్‌మైట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు రాజేష్‌ మగోవ్‌ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్‌ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్‌ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్‌ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ (వెస్టర్న్‌ ఇండియా) ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ శెట్టి పేర్కొన్నారు.

బుల్‌ మార్కెట్‌ 
దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ లిమిటెడ్‌ ఎండీ సునీల్‌ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసులు(పీఎంఎస్‌), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్‌) బుల్‌ ట్రెండ్‌లో మార్కెట్‌ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్‌ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్‌ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్‌ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్‌ క్యాప్స్‌ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్‌ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు.  

సరికొత్త రికార్డులు 
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్‌క్యాప్‌ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్‌ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్‌ గూడ్స్‌ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అరి్వందర్‌ సింగ్‌ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్‌ క్యాప్స్‌లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్‌ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్‌ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్‌ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్‌లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్‌ క్యాప్స్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్‌ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్‌ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్‌ నిపుణులు వివరించారు. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement