బడ్జెట్ తర్వాత మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయంటే | Sensex and Nifty mostly edge lower on Budget days: Budget 2025 | Sakshi
Sakshi News home page

బడ్జెట్ తర్వాత మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయంటే

Published Fri, Jan 31 2025 10:47 PM | Last Updated on Fri, Jan 31 2025 10:47 PM

Sensex and Nifty mostly edge lower on Budget days: Budget 2025

2020: కొత్త ట్యాక్స్ స్లాబులతో  పన్ను రేట్లలో మార్పులు జరిగినా, పరిశ్రమ వర్గాలకు అనువైన నిర్ణయాలేవీ బడ్జెట్ లో లేకపోవడం సెంటిమెంట్ ను దెబ్బతీసి సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పడిపోయింది.

2021: ఇది పూర్తిగా విభిన్న బడ్జెట్. కోవిడ్ తొలిదశ ప్రభావంతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారీస్థాయిలో మౌలిక రంగ కేటాయింపులు జరిగాయి. స్టార్ట్ అప్ లకు ట్యాక్స్ హాలిడేలు వంటి వృద్ధి ప్రేరక చర్యలతో మార్కెట్ ఆనందానికి అవధులు లేవు. దీంతో సెన్సెక్స్ బడ్జెట్ రోజున ఏకంగా 2314 పాయింట్లు పెరిగింది. గత రెండు దశాబ్దాల స్టాక్ మార్కెట్ బడ్జెట్ డే చరిత్రలో ఇది అత్యుత్తమంగా నిలిచిపోయింది.

2022: ఇది కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో సెన్సెక్స్ 849 పాయింట్లు పెరిగింది.  

2023: ఈ బడ్జెట్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా ఆరోజు సెన్సెక్స్ ఒకదశలో 1100 పాయింట్లు పెరిగినా చివరకు 158 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.

2024: మూలధన లాభాలపై అధిక పన్ను విధించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1 శాతం పడిపోయింది.

బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు/ట్రేడర్లు ఇలా చేయండి
బడ్జెట్ రోజున మార్కెట్లో హెచ్చుతగ్గులు భారీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయాల్లో తొందరపాటుతో వ్యవహరించకండి.
ట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయండి. సాధ్యమైనంత వరకు ఒకట్రెండు రోజులు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మంచిది.
బడ్జెట్ అనంతరం నిపుణుల/విశ్లేషకుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్కెట్లో కదలికలు సాగుతూ ఉంటాయి. కాబట్టి వారు ఏం చెబుతున్నారో ఆలకించండి.

బడ్జెట్ రోజు ట్రెండ్ ను అంచనా వేయడం చాలా కష్టం. పెరుగుతున్నాయి అనుకునే లోపే సూచీలు పడిపోతాయి. పడిపోతున్నాయి అనుకునే లోపే పైకి ఎగసిపోతాయి. మీకు మార్కెట్లో అనుభవం లేకపోతే బడ్జెట్ రోజు ట్రేడింగ్ చేయకండి. లాభాల మాట అటుంచి భారీ నష్టాలు కళ్లచూడాల్సి వస్తుంది.
బడ్జెట్ లో ఏయే రంగాలకు ఏమేరకు కేటాయింపులు జరిగాయో సమగ్రంగా గ్రహించండి. తదనుగుణంగా సంబంధిత రంగాలకు చెందిన షేర్లపై దృష్టి పెట్టండి.
అనాలోచిత నిర్ణయాలతో, గుడ్డిగా షేర్లు కొనేయకండి.

-బెహరా శ్రీనివాస రావు మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement