Budget
-
టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్
ఎస్‌యూవీలు, ఎంపీవీలు, సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే దేశీయ విఫణిలో ఉన్న కార్ మోడల్స్ కోకొల్లలు. మార్కెట్లో ఎన్నెన్ని కార్లున్నా బడ్జెట్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. బడ్జెట్ కార్ల విభాగంలో కూడా లెక్కకు మించిన కార్లు ఉండటం వల్ల.. ఇందులో బెస్ట్ కార్లు ఏవి అనేది కొందరికి అంతుచిక్కని ప్రశ్న. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో 800భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న, ఎక్కువ మంది ప్రజలను ఆకర్శించడంలో విజయం పొందిన కార్లలో 'మారుతి సుజుకి ఆల్టో 800' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రూ.3.25 లక్షల నుంచి రూ.5.12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధరతో లభించే ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. పనితీరు ఉత్తమంగానే ఉంటుంది.మారుతి సుజుకి స్విఫ్ట్మారుతి అంటే అందరికి గుర్తొచ్చేది స్విఫ్ట్. మంచి పర్ఫామెన్స్, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు డ్యూయల్ టోన్ స్పోర్టీ స్టైల్, క్రాస్డ్ మెష్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ వంటి వాటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ స్విచ్, మల్టీ-కలర్ ఇన్ఫర్మేషన్ మానిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఎన్ని ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ కూడా ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న పాపులర్ బడ్జెట్ కారు. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అప్డేటెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇది రీడిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ గ్రిల్ వంటివి పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా టియాగోదేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా సరసమైన ధర వద్ద లభించే కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఒకటి టియాగో. 2016లో పరిచయమైన ఈ కారు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 242 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. హైట్ అడ్జస్టబుల్ సీటు, రియర్‌వ్యూ కెమెరా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. దీని ధర రూ.5 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలుమారుతి సుజుకి వ్యాగన్ ఆర్రూ.5.41 లక్షల నుంచి రూ.7.12 లక్షల మధ్య లభించే 'మారుతి సుజుకి వ్యాగన్ ఆర్' మన జాబితాలో చెప్పుకోదగ్గ కారు. 2400 మిమీ వీల్‌బేస్ కలిగి ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ కారు పెద్ద క్యాబిన్ కలిగి ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ పొందిన క్యాబిన్‌లోని డ్యాష్‌బోర్డ్ హై క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారైంది. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. -
తయారీ రంగం, ఆహార ద్రవ్యోల్బణంపై సూచనలు
బడ్జెట్ రూపకల్పనకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. గతంలోకంటే మరింత మెరుగ్గా అభివృద్ధి సాగించేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమగ్ర తయారీ విధానం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహకాలు, వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్థికవేత్తలతో చర్చించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులను అన్వేషించాలని, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను పెంచాలని ప్రముఖులు సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన విధానాలపై చర్చించారు. ఉత్పాదక రంగంలో దిగుమతి సుంకాలు, పన్నులు, సాంకేతికత బదిలీ, ఇతర అంశాల పురోగతిపై ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని తెలిపారు. ప్రభుత్వం మూలధన పెట్టుబడులపై స్థిరాదాయం సమకూరాలని పేర్కొన్నారు.స్తబ్దుగా తయారీ రంగందేశీయ తయారీ రంగ వాటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15-17% వద్ద కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. దీన్ని 25% పెంచడానికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే వాదనలున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగతున్నప్పటికీ, ప్రభుత్వం మూలధన వ్యయంపై స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కంపెనీలను ప్రోత్సహించాలని కొందరు ఆర్థికవేత్తలు సిఫార్సు చేశారు. 2025-26లో ప్రభుత్వ మూలధన వ్యయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జపాన్ కంపెనీల హవా.. కొరియన్, చైనా బ్రాండ్లకు దెబ్బ!ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలుసమగ్ర ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణం ప్రధాన అడ్డంకిగా మారుతుందనే వాదనలున్నాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని ప్రముఖులు విశ్లేషించారు. దాంతోపాటు ఆయా ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంపొందించడానికి ఇండియా అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయం అయినప్పటికీ, గ్రీన్ ఎనర్జీలో మరిన్ని ఆవిష్కరణలు రావాలని తెలిపారు. -
నేటి నుంచే బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బడ్జెట్‌కు సంబంధించి వివిధ భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించనున్నారు. ఇవి శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ప్రముఖ ఆర్థికవేత్తలతో ఆమె భేటీ కానున్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్‌కు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆమె తెలుసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత రైతు సంఘాలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులతో ఈ నెల 7న ఆర్థిక మంత్రి భేటీ కానున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్ర వరి 1న పార్లమెంట్‌కు సమరి్పంచే అవకాశం ఉంది. -
బడ్జెట్ ఫ్రెండ్లీ.. రూ. 50వేలుంటే చాలు!
ఒక టూ వీలర్ కొనాలంటే కనీసం లక్ష రూపాయలైన వెచ్చించాల్సిందే వెచ్చించాల్సిందే అనుకుంటారు. అయితే ఇక్కడ మేము చెప్పబోయే ద్విచక్రవాహనాలు మాత్రం రూ. 50వేలు కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..యో ఎడ్జ్: ఇదొక ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 49,086 మాత్రమే (ఎక్స్ షోరూమ్). 1.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్.. ఒక ఫుల్ ఛార్జీతో 60 కిమీ రేంజ్ అందిస్తుంది3. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. కేవలం 95 కేజీల బరువున్న ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.టీవీఎస్ ఎక్స్ఎల్ 100: ఎక్కువగా గ్రామాల్లో కనిపించే ఈ టూ వీలర్.. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనం. రూ. 46671 (ఎక్స్ షోరూమ్) విలువైన ఈ వెహికల్ బరువులు మోయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మన ఊరి బందీగా ప్రసిద్ధి చెందిన ఈ ఎక్స్ఎల్ 100 ఇప్పటికి 10 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలు పొందినట్లు సమాచారం.టీవీఎస్ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ: రూ. 44,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఫ్రెండ్లీ బడ్జెట్ టూ వీలర్. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ 99.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది కేవలం 88 కేజీల బరువున్నప్పటికీ.. 59.5 కిమీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.పైన చెప్పిన టూ వీలర్ ధరలు.. ఎక్స్ షోరూమ్ ప్రైస్. ధరలు అనేవి మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ధరల్లో మార్పు ఉంటుంది. ఖచ్చితమైన ధరలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ సినిమా.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ను తుడిచిపెట్టింది!
ఇటీవల సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. పాన్ ఇండియా హీరోల సినిమాలకైచే నిర్మాతలు బడ్జెట్ విషయంలో అసలు వెనకడుగు వేయడం లేదు. ఇటీవల సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువా. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కేవలం రూ.100 కోట్లకు పైగా వసూళ్లతోనే సరిపెట్టుకుంది. టాలీవుడ్‌లోనూ సలార్, బాహుబలి, పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైనప్పటికీ సక్సెస్ సాధించాయి.అయితే భారీ బడ్జెట్ చిత్రాలతో లాభాల కంటే నష్టాలు ఎక్కువ వచ్చిన సందర్భాలే ఉంటున్నాయి. కానీ ఓ చిన్న సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2017లో అద్వైత్ చందన్ తెరకెక్కించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ మూవీని కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నిర్మించారు. ఇండియాలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్లోనూ రూ.65 కోట్లు వసూలు చేసి విజయాన్ని సాధించింది.అయితే ఆ తర్వాత చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆ దేశంలో ఏకంగా 124 డాలర్ల మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా పెట్టుబడి కంటే అదనంగా 60 రెట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో జై సంతోషి మా మూవీ రికార్డును 20 రెట్ల భారీ తేడాతో అధిగమించింది.ఈ లెక్కన సీక్రెట్ సూపర్‌స్టార్ ప్రపంచవ్యాప్తంగా రూ.966 కోట్లను ఆర్జించిందని నివేదికలు వెల్లడించాయి. ఈ వసూళ్లతో ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన స్త్రీ 2 (రూ.857 కోట్లు), పీకే (769 కోట్లు), గదర్ -2 (రూ.691 కోట్లు), బాహుబలి: ది బిగినింగ్ (617 కోట్లు) లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అధిగమించింది. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. కానీ కేవలం రూ.15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన సీక్రెట్ సూపర్‌స్టార్... భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఈ సినిమాలో పెద్ద స్టార్స్ కూడా లేరు. అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించగా.. 16 ఏళ్ల జైరా వాసిమ్ కీలక పాత్ర పోషించారు. చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం దంగల్ తర్వాత అమీర్, జైరాలకు ఆ దేశంలో లభించిన క్రేజ్ కారణమని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. నవంబర్ 2024 నాటికి ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన 10వ భారతీయ చిత్రంగా సీక్రెట్ సూపర్‌స్టార్ నిలిచింది. -
అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది.. ప్రభుత్వ యంత్రాంగమంతా నీ చేతుల్లోనే ఉంది.. నీ చేతుల్లో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టావు.. అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే.. ఆ లెక్కలను కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా ధ్రువీకరించింది.. మరి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 2018–19 నాటికి అంటే నువ్వు అధికారంలోకి నుంచి దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.3.13 లక్షల కోట్లు అని లెక్క చూపావు.. 2023–24 నాటికి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని తేల్చావు.. మరి ఇప్పడేమో లేదు లేదు.. రాష్ట్ర అప్పులు రూ.10.47 లక్షల కోట్లని ఒకరు.. రూ.11 లక్షల కోట్లని మరొకరు..! పక్కకు వస్తే వేరే నెంబర్లు చెబుతా అని అంటావా? గుంజీలు తీయిస్తానంటావా? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతో.. బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా భిన్న అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మోసాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామికవాదులపై అక్రమ కేసులను బనాయిస్తూ, నిర్భందిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తప్పైతే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?2018–19 నాటికి రూ.3.13 లక్షల కోట్లున్న అప్పులు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని నిర్థారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పద్దులను ఆడిట్ చేసే కాగ్ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అందులోనూ రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగానే తేల్చారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే.. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలోని తన వదినమ్మ, ఎల్లో మీడియాతో కలిసి అబద్ధాలకు రెక్కలు కట్టి ఎలా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడుతున్నారనేందుకు రాష్ట్ర అప్పులపై వారు చేసిన దు్రష్ఫచారమే తార్కాణమని గత మీడియా సమావేశంలోనే చెప్పా. బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా రాష్ట్ర అప్పులపై అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు దుష్ఫ్రచారం కొనసాగిస్తున్నారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? పైగా మరో అడుగు ముందుకేసి బకాయిలపై (స్పిల్ ఓవర్ అకౌంట్స్) పదే పదే అబద్ధాలా? ప్రభుత్వం వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు ఏటా స్పీల్ ఓవర్ కింద మరుసటి ఏడాదికి రావడం సహజం. 2019లో చంద్రబాబు దిగిపోతూ రూ.42,183 కోట్ల బకాయిలు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో బకాయిలు పెట్టిన దాఖలాలు లేవు. అయినా సరే చిరునవ్వుతో ఆ బకాయిలన్నీ మేం చెల్లించాం. ఇలా సర్వసాధారణ విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ ఏదో జరిగిపోతోందనే భ్రాంతి కలిగించడంలో చంద్రబాబు దిట్ట.ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. మేమిచ్చినవీ ఊడగొట్టారుమెగా డీఎస్సీ అని హామీ ఇచ్చారు. ఉన్న డీఎస్సీ కూడా ఆగిపోయింది. మేం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. వీళ్లు 16,347 పోస్టులతో ఇస్తున్నామన్నారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పటికి ఆర్నెల్లు గడిచిపోయాయి. అదే మేం అధికారంలోకి వచి్చన ఆర్నెళ్లు తిరగకమునుపే అక్టోబర్ 2వతేదీన గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.30 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 58 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాలు చేశాం. ఇవన్నీ ఆర్నెళ్ల లోపే చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతున్నారు. ఇప్పటికే 2.66 లక్షల మంది వలంటీర్లు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న 15 వేల మందిని పీకేశారు. ఆర్థిక విధ్వంస కారుడు బాబే..» ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితికి మించి 2014–19 మధ్య రూ.28,457 కోట్లు అప్పులు చేసింది నువ్వు కాదా బాబూ? ఈ అంశాన్ని కాగ్ నివేదిక, కేంద్ర ఆర్థిక సంఘం నివేదిక కూడా స్పష్టం చేసింది. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేయడం వల్ల ఆ మేరకు మా హయాంలో అప్పులపై కోత పడింది. మా హయాంలో కేవలం రూ.1,600 కోట్లు మాత్రమే పరిమితికి మించి అప్పులు చేశాం. ఈ గణాంకాలు చాలు.. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో.. ఎవరు ఆర్థిక క్రమశిక్షణతో నడిచారో.. ప్రభుత్వాన్ని నడిపించారో చెప్పడానికి! సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అప్పులను భూతంగా చూపే కార్యక్రమాలు చేస్తున్నాడు.» చంద్రబాబు హయాంలో కోవిడ్ లాంటి మహమ్మరి లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా ప్రభావంతో రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అనుకోని ఖర్చులు పెరిగిపోయాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కోవిడ్ వల్ల అనూహ్య పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్సార్సీపీ హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) తక్కువగానే ఉంది. నాడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్లకు చేరగా.. సీఏజీఆర్ 19.54 శాతంగా నమోదైంది. అనంతరం మా హయాంలో అప్పులు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 కోట్లకు చేరాయి. సీఏజీఆర్ 15.61 శాతంగా ఉంది. అంటేæ చంద్రబాబు హయాంలో కంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు 4 శాతం తక్కువగా ఉన్నట్లు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు ఆర్ధిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. » నాన్ గ్యారంటీ అప్పులు బడ్జెట్లోకి రావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన ఎస్బీఐ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ లాంటి సంస్థలు చేసే అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఖాతాలో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ నాన్ గ్యారంటీ అప్పులు కాబట్టి. అయినా సరే ఈ నాన్ గ్యారంటీ అప్పులు కూడా కలిపి చూసినా నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లుగా ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.77,229 కోట్లకు తీసుకుపోయిన ఘనత కూడా బాబుదే. మా హయాంలో వాటిని రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు తగ్గించాం. ఈ నాన్ గ్యారంటీ అప్పుల వార్షిక వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 54.98 శాతం ఉంటే మా హయాంలో అది 0.48 శాతం తగ్గింది. రాష్ట్ర అప్పులు, గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు కలిపి చూస్తే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉన్న అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతంగా నమోదైంది. మా హయాంలో ఆ అప్పులు రూ.3.90 లక్షల కోట్ల నుంచి రూ.7.21 లక్షల కోట్లకు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధి రేటు 13.57 శాతం మాత్రమే. ఈ లెక్కలు చూస్తే ఎవరు ఆరి్ధక విధ్వంసకారుడో ఇట్టే అర్ధమవుతుంది. » చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా హయాంలో తలసరి ఆదాయం 9 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని ప్రచారం చేశాడు. చంద్రబాబు సర్కార్ దిగిపోయేనాటికి 2018–19లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు మాత్రమే ఉంటే మా హయాంలో 2024 మార్చి నాటికి రూ.2,42,479గా నమోదైంది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంటే.. రెండేళ్లు కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మా హయాంలో 15వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది లెక్కలు కూడా కలిపితే మరో 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. 2019–24 మధ్య ఏ రంగాన్ని తీసుకున్నా సరే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీ వృద్ధి రేటు దేశం కంటే ఎక్కువగా ఉంది. అయినా సరే వాస్తవాలకు ముసుగేసి చంద్రబాబు వక్రీకరిస్తూ దు్రష్ఫచారం చేస్తున్నారు. ప్రతికూలతలోనూ పారిశ్రామిక వృద్ధి..బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ 2014–19 వరకు రాష్ట్ర వృద్ధి రేటు 13.50 శాతం ఉంటే 2019–24 మధ్య 10.60 శాతానికి పడిపోయిందన్నారు. బాబూ..! నీ హయాంలో కోవిడ్ లేదు. ప్రపంచమంతా రెండేళ్ల పాటు కోవిడ్‌తో అతలాకుతలమైంది. 2014–19తో పోల్చి చూస్తే గత ఐదేళ్లలో వృద్ధి రేటు ప్రతి రాష్ట్రంలోనూ తక్కువే ఉంది. దేశ వృద్ధి రేటు చూస్తే 2014–19 మధ్య 10.97 శాతం ఉంటే 2019–24 మధ్య 9.28 శాతం ఉంది. 2014–19 మధ్య మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సగటున 11.92 శాతం ఉండగా 2019–24 మధ్య 12.61 శాతంగా నమోదైంది. ఇవేమీ నేను చెప్పిన లెక్కలు కాదు. బడ్జెట్‌తో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికలో వెల్లడించిన అంశాలే ఇవన్నీ! రాష్ట్ర పారిశ్రామిక రంగంలో స్థూల వస్తు ఉత్పత్తి విలువ (జీవీఏ) చూస్తే 2014–19 మధ్య రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 11.92 శాతంగా నమోదైంది. అదే 2019–24 మధ్య కోవిడ్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రూ1.88 లక్షల కోట్ల నుంచి రూ.3.41 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 12.61 శాతం పెరిగింది. జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018–19లో 11 స్థానంలో ఉన్న రాష్ట్రం 2019–24 మధ్య 8వ స్థానంలోకి ఎగబాకింది. ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ (జీవీఏ) 12.61 శాతం ఉంటే దేశంలో సగటున ఉత్పత్తి విలువ 8.17 శాతంగా నమోదైంది. అంటే పారిశ్రామికాభివృద్ధి దేశంలో కంటే రాష్ట్రంలో 4 శాతం ఎక్కువగా ఉంది. మేకపిల్ల – కుక్కపిల్ల కథలో గజదొంగల్లా..!చంద్రబాబు అబద్ధాలు చూస్తే ఓ కథ గుర్తుకొస్తోంది. ఒక ఊరిలో ఓ అమాయకుడు భుజాన మేకపిల్లను వేసుకుని అమ్ముకోవాలని బజారుకు బయలుదేరతాడు. ఇంటి గడప దాటగానే ఒకడొచ్చి నీ కుక్క భలే ఉందంటాడు! దాంతో ఆ అమాయకుడు ఆలోచనలో పడతాడు. వీధి చివరికి వచ్చేసరికి మరొకడు ఎదురై నీ కుక్క పిల్ల చాలా తెల్లగా, బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చావు? అంటాడు. మళ్లీ ఆ అమాయకుడు సందిగ్ధంలో పడి.. ఇది మేకపిల్లే.. కుక్కపిల్ల కాదు.. నీకు కళ్లు కనిపించట్లేదా అనుకుంటూ ముందుకువెళ్తాడు. అక్కడి నుంచి కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఇంకొకడు కనిపిస్తాడు. అరే.. నీ కుక్కపిల్ల బాగుంది.. నాకు అమ్ముతావా? అంటాడు! ఇక.. ఆ అమాయకుడిలో గందరగోళం ప్రారంభం అవుతుంది. నేను మేక పిల్లలను భుజాన వేసుకుని వెళ్తుంటే ఇంతమంది అది కుక్క పిల్లే అని అంటున్నారు. నా కళ్లకు ఏమైనా అయ్యిందా? నాకు ఏమైనా జరిగిందా? అనే అనుమానంతో మేకపిల్లను కిందకు దించి నాకు మేకపిల్లా వద్దూ.. కుక్క పిల్లా వద్దూ! అనుకుని వెళ్లిపోతాడు. ఈ కథ చంద్రబాబు వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని ఎలా కబళిస్తున్నారో చెప్పేందుకు అతికినట్లు సరిపోతుంది. ఈ కథలో తొలి వ్యక్తి పేరు చంద్రబాబు! రెండో వ్యక్తి దత్తపుత్రుడు! మూడో వ్యక్తి బీజేపీలో ఉన్న తన వదినమ్మ..! నాలుగో వ్యక్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5..లాంటి ఎల్లో మాఫియా. వీళ్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌కు లేని అప్పులు ఉన్నట్టుగా వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకే. ఈ కథలో రాష్ట్ర ప్రజలు అమాయకులు అయితే.. మేక పిల్ల మన రాష్ట్రం. ఆ నలుగురు గజదొంగలు కలసి కింద పడేసిన మేకను తీసుకెళ్లి బిర్యానీ వండుకుని పంచుకుని తిన్నట్లుగా.. ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచేసే పంచుకు తింటున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా?ఆరోగ్యశ్రీ గతంలో వెయ్యి ప్రొసీజర్స్‌కు మాత్రమే పరిమితం కాగా మేం 3,300 ప్రొసీజర్స్‌కు పెంచి రూ.25 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా పథకాన్ని విస్తరించాం. గతంలో చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువే ఉన్న పరిస్థితి నుంచి మా హయాంలో ఏకంగా రూ.3,762 కోట్లకు చేరాయి. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికను పరిశీలిస్తే 2023–24లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అని పేర్కొన్నారు. 2023–24లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉండగా దాన్ని మార్చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీంగా పెట్టేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 13,22,319 మంది రోగులకు మేలు చేశారట! రూ.3,762 కోట్లు ఖర్చు చేశారట! 1–4–2023 నుంచి 31–3–2024 మధ్య ఎవరి ప్రభుత్వం ఉంది? వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3,762 కోట్లు ఖర్చు చేసి 13 లక్షల మందికిపైగా పేదలకు వైద్యం అందిస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వస్తుందోననే ఆందోళనతో ఇలా చేశారు. మేం ఖర్చు పెట్టింది వాళ్లు (చంద్రబాబు) వ్యయం చేసినట్లు రాసుకుని.. దొంగ పబ్లిసిటీ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే మీకంటే (చంద్రబాబు) దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా? నాలుగు నెలల నుంచి జీతాలు అందట్లేదని 104, 108 ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మా హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో తగినంత మంది స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాం. 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టాం. పులివెందుల సహా మరో రెండు కొత్త కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లను కేటాయించినా అడ్డుపడిన చరిత్ర మీది. 32.79 లక్షల మందికి ఉద్యోగాలు..అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వే నివేదికలో పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఎంఎస్ఎంఈ రంగంలో ఆయన హయాంలో 2014–19 మధ్య 8.67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడైంది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. భారీ, మెగా ప్రాజెక్టులతో మా హయాంలో 1,02,407 ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు హయాంలో ఉపాధి కల్పన చాలా తక్కువగా నమోదైంది. మేనిఫెస్టోతో మోసం..చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్‌ను ఉపయోగించారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లు అంటూ హామీలిచ్చి మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని రచించారు. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరి మనోభావాలతో ఆడుకుని, వాడుకున్నారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లలో అతి చిన్న అంశాలు! కూటమి నాయకులు ఎన్నికల వేళ ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో చిన్న పిల్లలు కనిపిస్తే చాలు.. ఎంత మంది ఉన్నా సరే.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు..నీకు రూ.15 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. వాళ్ల అమ్మ.. చిన్నమ్మలు బయటకొస్తే నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. అనేవాళ్లు! అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద వయసు మహిళలు కనిపిస్తే నీకు రూ.48 వేలు..నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అనేవాళ్లు. ఇంట్లో 26 ఏళ్ల యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. నీకు రూ.36 వేలు..నీకు రూ.36 వేలు అనేవాళ్లు.రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. ఇవన్నీ సూపర్ సిక్స్‌లో భాగమే. పెద్దవి కూడా. మోసాల్లో భాగంగా ఇవన్నీ ఎలాగూ చేయరనుకుంటే చిన్న చిన్న వాటిల్లోనూ మోసాలే! రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.55 కోట్లు ఉన్నాయి. కర్నాటకలో 1.84 కోట్లు, కేరళలో 96 లక్షలు, తమిళనాడులో 2.33 కోట్లు, తెలంగాణలో 1.24 కోట్లున్నాయి. ఏపీలోని 1.55 కోట్ల కనెక్షన్లకు సిలిండర్‌కు రూ.895 చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రూ.4,200 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో మాత్రం రూ.895 కోట్లే పెట్టారు. అంటే ఇచ్చేది ఒక్క సిలిండర్.. అది కూడా అందరికీ ఇవ్వరు. ఒక్కో సిలిండర్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.1,400 కోట్లు కావాలి. అందరికీ ఇవ్వడానికి నీకు (చంద్రబాబు) మనసు లేదు. 40 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారని అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామంటారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ సంవత్సరానికి ఒకటే ఇస్తామంటారు. ఒక మంత్రి చెప్పేదానికి.. ఇంకో మంత్రి చెప్పేదానికి పొంతన లేదు. పోనీ ఒక్కటన్నా అందరికీ ఇస్తున్నారంటే అదీ లేదు. దారుణమైన అబద్ధాలు, మోసాలకు ఇది నిదర్శనం కాదా? -
అడ్డంగా దొరికిపోయిన బాబు.. వాస్తవం ఏంటో చెప్పిన వైఎస్ జగన్ (ఫోటోలు)
-
‘సామాన్యుడిపై భారం తగ్గించండి’
బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2025లో ప్రకటించే కేంద్ర బడ్జెట్లో మార్పులు చేయాలంటూ కొన్ని ఆర్థిక సంస్థలు, ప్రజల నుంచి కేంద్రానికి వినతులు వస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఎక్స్ పేజ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలిపారు.ఎక్స్ వేదికగా తుషార్ శర్మ అనే వ్యక్తి సామాన్యుడిపై పన్ను భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ‘@nsitharaman దేశాభివృద్ధికి మీరు చేస్తున్న సహకారం, ప్రయత్నాలను ఎంతో అభినందిస్తున్నాను. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇది నా హృదయపూర్వక అభ్యర్థన మాత్రమే’ అని తుషార్ శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ ‘మీ మాటలు, అవగాహనకు ధన్యవాదాలు. నేను మీ అభ్యర్థనను అభినందిస్తున్నాను. నరేంద్రమోదీ ప్రభుత్వం సమస్యలపై స్పందించి చర్య తీసుకునే ప్రభుత్వం. ప్రజల అభిప్రాయాలను వింటోంది. వాటికి తగినట్లు ప్రతిస్పందిస్తోంది. మీ అభ్యర్థన చాలా విలువైంది’ అని రిప్లై ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ 2025 ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జులైలో ఆర్థిక మంత్రి తెలిపారు.Thank you for your kind words and your understanding. I recognise and appreciate your concern.PM @narendramodi ‘s government is a responsive government. Listens and attends to people’s voices. Thanks once again for your understanding. Your input is valuable. https://t.co/0C2wzaQtYx— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2024ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!గతంలో మంత్రి స్పందిస్తూ ‘నేను మధ్యతరగతి వారికి విభిన్న రూపాల్లో మేలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను పన్ను రేటును తగ్గించి వారికి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచాం. అదనంగా అధిక ఆదాయ వర్గాలకు పన్ను రేటు పెంచాం. సామాన్యులపై పన్ను రేట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టాం’ అని చెప్పారు. -
నా ఆలోచనలతో సంపద సృష్టిస్తా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : ‘అన్ని వర్గాల వారిలో మా ప్రభుత్వంపై ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, హామీల అమలుకు అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బీఎం షరతులున్నాయి. అమ్మడానికి ఆస్తులు కూడా లేవు’.. అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హామీలు అమలుచేయడానికి డబ్బుల్లేవుగానీ, తన దగ్గర కొత్త ఆలోచనలున్నాయని చెప్పారు. వాటితో సంపద సృష్టించి, పేదరికాన్ని నిర్మూలిస్తానన్నారు. బడ్జెట్‌పై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి నుంచి 21 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఫలితంగా ఢిల్లీలో పలుకుబడి పెరిగిందన్నారు. హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెడతామని.. ఇందులో భాగంగా ఆరు కొత్త పాలసీలను ప్రకటించామని సీఎం చెప్పారు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ పాలనతో ప్రభుత్వంలోని అన్ని శాఖలు అస్తవ్యస్థంగా మారాయని, వివిధ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు. ఇది ఉత్తమ బడ్జెట్.. రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని.. ఇది ఎంతో ఉత్తమ బడ్జెట్ అని చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేరుస్తూ అదనపు హామీలను అమలుపరుస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అమరావతిని పట్టాలెక్కించామని.. గోదావరి, పెన్నా, వంశధార నదుల అనుసంధానానికీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సంక్రాంతిలోపు రహదారులపై గుంతలన్నింటినీ పూడుస్తామని.. నూతన మద్యం పాలసీ అమలుతో రాష్ట్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మద్యం బ్రాండ్లన్నింటినీ అందుబాటులోకి తెచ్చామని.. ప్రజలు కూడా తమ జీవితాలు ఎలా మారాయో చర్చించుకోవాలన్నారు. భూములు అమ్ముకుంటే రాజధాని నిర్మాణం పూర్తి.. ఇక అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టే అవసరంలేదని తాను గతంలో చాలా సందర్భాల్లో చెప్పానన్నారు. ఇక్కడ 10 వేల ఎకరాల భూమి ఉందని.. దీనిని అమ్ముకుంటే దశల వారీగా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆడబిడ్డల రక్షణ కోసం తమ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని.. సోషల్ మీడియాలో వారిని కించపరిచేలా పోస్టులు పెడితే వారు ఏ పార్టీ వారైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. డిసెంబరులోగా పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఇసుక విధానంపై మా ఎమ్మెల్యేలే అసహనంతో ఉన్నారు.. సభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.15 వేల కోట్లు గ్రాంటా అప్పా అనే సందేహాలపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. అప్పులపై ఆధారపడితే రాష్ట్రం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని.. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్లో 80 శాతం మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెట్టారని.. అదే బాబు పాలనలో చేసిన అప్పుల్లో 40 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చుచేశారని పయ్యావుల చెప్పారు. నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని.. అయితే, దీనిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంతేకాక, చాలా జిల్లాల్లో సమస్యలు ఉన్నట్లు తమ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తంచేస్తున్నారని పయ్యావుల సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇసుక పాలసీలో ప్రభుత్వానికి మంచిపేరు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
బడ్జెట్‌పై చర్చ పక్కదారి
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం బడ్జెట్‌పై జరిగిన చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. తాము మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, బొమ్మి ఇజ్రాయెల్, సిపాయి సుబ్రమణ్యం, పీవీవీ సూర్యనారాయణరాజు, వంకా రవీంద్రనాథ్ మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. మంత్రులందరూ అడ్డుకున్నారు..మండలిలో బడ్జెట్‌పై మాట్లాడుతుంటే వాస్తవాలు భరించలేని అధికారపక్ష నేతలు అడుగడుగునా మమ్మల్ని అడ్డుకున్నారు. టారిఫ్ పెంచబోతున్నారా అని ఎనర్జీ మీద ప్రశ్నోత్తరం ఇచ్చాం? కానీ, దానిపై చర్చ జరగలేదు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఒక్కో యూనిట్‌కు రూ.1.50 పైసలు పెంచుతున్నారు.ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వమే దీనిని భరించాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూ నెట్టుకొచ్చి ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ అంటున్నారు. బడ్జెట్‌పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే లోకేశ్ చర్చను తప్పుదారి పట్టించారు. సోషల్ మీడియాలో పోస్టులపై చర్చ కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు ఇలా వ్యవహరిస్తున్నారు. – తోట త్రిమూర్తులుప్రజలను ప్రభుత్వం మోసం చేసింది..ప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. బడ్జెట్లో జరిగిన తప్పులను లేవనెత్తడం ప్రతిపక్షంగా మా బాధ్యత. మా సభ్యులు మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డుతగులుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలుచేయాలంటే రూ.74 వేల కోట్లకు పైగా అవసరమవుతాయి. కానీ, అందుకు తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఈ బడ్జెట్‌తో ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. మూడు సిలిండర్లు ఇస్తామని ఒక్కటే ఇచ్చారు.. మరో 2 సిలిండర్ల మాటేంటి? రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలూ ఇవ్వడంలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా? అరకొర బడ్జెట్ కేటాయించి సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలుచేస్తారు? మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. – వరుదు కళ్యాణిఈరోజు మండలి చూస్తే బాధేసింది..ఈరోజు మండలిలో జరిగిన పరిస్థితులను చూస్తే బాధేసింది. విజయనగరం జిల్లాలో అతిసార వ్యాప్తి, మరణాలపై ప్రశ్నోత్తరం ఇచ్చాం. జిల్లాలో డయేరియా వ్యాప్తి వాస్తవమేనా అంటే వైద్య మంత్రి లేదన్నారు. మొత్తం 14 మరణాలు సంభవిస్తే డిప్యూటీసీఎం పవన్ 10 మంది చనిపోయారని.. చంద్రబాబు 8 మంది చనిపోయారన్నారు. నిన్న మంత్రి సభలో నలుగురు చనిపోయారంటున్నారు. సభ్యుల ఆవేదన చూస్తే ముచ్చటేస్తోందని మంత్రి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం బాధాకరం. –పీవీవీ సూర్యనారాయణ రాజుబాబు పాలనంతా తిరోగమనమే..సభలో ఎవరైనా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పుచేసిందన్నారు. కానీ, బడ్జెట్లో రూ.6 లక్షల కోట్లు మాత్రమే చూపించారు.. ఇది మోసం కాదా? బాబు పాలనంతా తిరోగమనమే. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. – బొమ్మి ఇజ్రాయెల్ విపక్షాల గొంతు నొక్కుతున్నారు..మండలిలో ప్రస్తుతం మేం మెజార్టీ సభ్యులం. అయినా కూడా సభా పద్ధతులు పాటించకుండా టీడీపీ మంత్రులు గందరగోళం సృష్టిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించకపోతే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు. సూపర్ సిక్స్‌లో ప్రతీ రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంటే 11 వేల కోట్లు.. కానీ, కేటాయించింది వెయ్యి కోట్లే. ఇది మోసం కాదా? ఇక ఉచిత బస్సు ఏమైంది? – సిపాయి సుబ్రహ్మణ్యంసమయం కూడా ఇవ్వలేదు..నాకు కేటాయించిన సమయం ఇవ్వకుండానే సభను రేపటికి వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులపై దాడిచేసే ప్రయత్నం చేశారు. ఎంతో విలువైన 4 గంటలు వృథా అయిపోయాయి. మాలాంటి కొత్త ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం రావట్లేదు. కనీసం రేపైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబు నిత్యం మోసం, దగా చేస్తూ అబద్ధాలు చెబుతున్నారు. – వంకా రవీంద్రనాథ్ -
హామీల అమలెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారన్న ప్రణాళికను కూడా కనీసం బడ్జెట్ ప్రస్తావించలేకపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు అధ్యక్షతన శాసనమండలిలో 2024–25 బడ్జెట్‌పై బుధవారం చర్చ మొదలైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చర్చను ప్రారంభిస్తూ.. హామీలు మెండు–చేసేది సున్నా అన్నట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను నిలబెట్టుకునే అలవాటు టీడీపీ లేదని.. ఈసారి ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉండటంతో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ఆ పార్టీలు తీసుకుంటాయని ప్రజలు భావించారన్నారు. కానీ.. మొత్తంగా కూటమి పార్టీలు హామీలతో ప్రజలను నమ్మించి ద్రోహం చేశాయన్నారు.వైఎస్సార్సీపీ ప్రజలకిచ్చిన హామీలకు ఏటా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిందని.. కూటమి ప్రభుత్వం ఏ నెలలో ఏ హామీ అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం ఒక్క రూపాయి బడ్జెట్లో కేటాయించలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఎప్పటిలోగా పోలవరం పూర్తి ఏస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు.ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా బడ్జెట్‌ను దాటవేసిందన్నారు. కనీసం ఏ పథకం ఎప్పుడు ఇస్తారో అనే ప్రణాళిక కూడా బడ్జెట్లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గమైన పాలన అంటూ బడ్జెట్లో మొదటిలోనే మొదలుపెట్టారని, ప్రజలకిచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం చేసిందని, హామీలు అమలు చేయడం దుష్పరిపాలన అవుతుందా అని ప్రశ్నించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తామన్న రూ.15 వేల కోట్లు అప్పుగానా లేకా గ్రాంటా అన్నది బడ్టెట్ పేర్కొనలేదన్నారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్ బదులిస్తూ.. కేంద్రం రుణంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్‌గా అందజేస్తుందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అను«రాధ మాట్లాడారు. -
సూపర్‌సిక్స్, బడ్జెట్ అంతా మోసం: వైఎస్ జగన్
-
చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్నివిధాలా కుదేలయింది
-
ఏపీ పవర్ బిల్లులపై జగన్ రియాక్షన్
-
ఇకనైనా డబ్బా కొట్టుకోవడం ఆపండి: YS Jagan
-
ఆర్థిక క్రమశిక్షణ పాటించింది..?
-
YS Jagan: చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగాయి
-
చంద్రబాబు యాక్టింగ్ కి ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ కూడా సరిపోడు
-
చంద్రబాబు గోబెల్స్ ప్రచారంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
YS Jagan: ప్రవేశ పెట్టిన పత్రాలే చెప్తున్నాయి
-
ఏపీ బడ్జెట్‌పై జగన్ రియాక్షన్
-
‘అప్పు రత్న’ బిరుదు ఎవరికివ్వాలి.. ఇవిగో ఆధారాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు.. అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగదీశారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చాయి. బడ్జెట్ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్ తెలుస్తుంది.’ అంటూ దుయ్యబట్టారు.‘చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు. ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. తర్వాత తన మనుషులతో పదేపదే అబద్ధాలు చెప్పిస్తాడు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు.ఇవే విషయాలను దత్త పుత్రుడితో మాట్లాడిస్తారు. ఇదంతా ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్‌కు నిలువెత్తు ఆధారం’ అని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..ఓట్ ఆన్ ఎక్కౌంట్‌తో 8 నెలలు:దురదృష్టవశాత్తూ 8 నెలలు అయిపోయాక, ఇంకో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లూ ఓట్ ఆన్ అక్కౌంట్తోనే కాలం వెళ్లదీశారు. ఇంత కాలం ఎందుకు సాగదీశారంటే, బడ్జెట్ ప్రవేశపెడితే, చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు బయటపడతాయి. ప్రజలు తమ హామీలు అడుగుతారన్న భయం. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు.చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రిమినల్:ఇవాళ బడ్జెట్లో చెప్పిన అంశాలు, గణాంకాలు చూస్తే, చంద్రబాబుగారు ఎంత డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమైంది. ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేశాడనేది అందరికీ అర్ధమవుతుంది. ఆయన ఆర్గనైజ్డ్ క్రిమినల్. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా ఉంటుంది అంటే.. ముందుగా తన అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తాడు. ఆ తర్వాత ఆయన దాన్నే పదే పదే మాట్లాడతాడు. పనిలో పనిగా తన దత్తపుత్రుడితోనూ, తనకు సంబంధించి ఇతర పార్టీల ఉన్న వారితోనూ మాట్లాడిస్తారు. ట్వీట్స్ పెడతారు. చివరకు దాన్ని ఒక ఇంటర్నేషనల్ మ్యాటర్‌గా చేస్తారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే.. సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను.అప్పులపై విష ప్రచారం:ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయడం సహజం. అది బడ్జెట్లో భాగమే. ప్రతి ప్రభుత్వానికి ఎఫ్ఆర్బీఎం ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తారు. జీఎస్డీపీలో 3 శాతం లేదా 3.5 శాతం అప్పులు చేస్తారు. అంతకు మించి ఎవరికి సాధ్యం కాదు. కానీ వారు ఒక ప్లాన్ ప్రకారం వారు ఎలా దుష్ప్రచారం చేశారంటే..తొలుత..⇒05.04.2022. చంద్రబాబు ప్రకటన. రాష్ట్రం శ్రీలంక అవుతుంది.⇒13.04.2022. రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో.. అనడం.. దాన్ని వెంటనే ఈనాడులో రాస్తారు.⇒19.04.2022న ఈనాడులో రాశారు.. మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాశారు.⇒17.05.2022న దత్తపుత్రుడు ట్వీట్ చేశాడు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో.. అని⇒ 21.07.2022న అప్పటి టీడీపీ మంత్రి, ఇప్పటి ఆర్థిక మంత్రి ఏమన్నారంటే.. శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు నాలుగు రెట్లు అని.⇒07.02.2023న అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు.. ‘అప్పు రత్న’ అని పేరు పెట్టాలని దత్తపుత్రుడి ట్వీట్.⇒25.10.2023. ఆ తర్వాత చంద్రబాబుగారి వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు.. ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షలు అని ప్రకటన’.అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం. కొత్త పాత్రధారులు.వారి ఎల్లో మీడియా. ఇతర పార్టీల్లో ఉన్న టీడీపీ నాయకులు.అవన్నీ ఎందుకు అంటే.. వైయస్సార్సీపీ ప్రభుత్వానికి అప్పులు రాకూడదు. కేంద్రం సహకరించొద్దు. ఇక్కడ ఏమేమో జరుగుతోందన్న భయం క్రియేట్ చేయాలి.ఎన్నికలు సమీపించడంతో..:ఎన్నికలు దగ్గర పడే సరికి.. ఆ ప్రచారం మరింత ముమ్మరం చేశారు. 07.04.2024న రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబుగారి వదినమ్మ ప్రకటన. 21.04.2024న సరిగ్గా ఎన్నికలకు కొన్నాళ్ల ముందు.. ఈనాడు ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకనమిస్ట్ అనే బిళ్ల తగిలించి.. ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు. అలా ఒక పద్ధతి ప్రకారం అబద్దాల ప్రచారం. విష ప్రచారం. రాష్ట్ర రుణాన్ని ఏకంగా రూ.14 లక్షల కోట్లు అని చెప్పించి, ఈనాడులో రాయడం. దాన్ని అందరూ చెప్పడం.అధికారంలోకి వచ్చాక కూడా..:⇒అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన దుష్ప్రచారం మానలేదు. ఎందుకంటే హామీలు అమలు చేయడం ఆయనకు అలవాటు లేదు. అందుకే అదే విష ప్రచారం.⇒10.07.2024న ఆర్థిక శాఖపై రివ్యూ చేస్తూ.. రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని లీక్. దాన్ని ఈనాడులో రాస్తారు. ఈటీవీలో చూపుతారు.⇒22.07.2024న రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్‌గారి ప్రసంగం. çఆ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పించారు. రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అని చెప్పించారు. ⇒26.07.2024న చంద్రబాబు అదే ఓట్ ఆన్ ఎక్కౌంట్ ప్రవేశపెడుతూ అన్న మాటలు ఒకసారి విందామా? అంటూ ఆ వీడియో ప్రదర్శించి చూపారు.⇒బాధగా ఉందంటాడు. ఆవేదనగా ఉందంటాడు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు. భయం వేస్తుందంటాడు.⇒దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ యాక్షన్‌ను మించి చంద్రబాబు నటన.అప్పులపై బడ్జెట్లో ఏం చెప్పారు?:⇒2024–25 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర అప్పులు చూపారు. ఆ వివరాలు చూద్దాం.⇒2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,57,509 కోట్లు. దానికి తోడు ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు చేసిన అప్పు మరో రూ.55,000 కోట్లు. ఆ రెండూ కలిపి చూస్తే.. మొత్తం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు. ⇒అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పులు చూస్తే.. ప్రభుత్వ అప్పులు రూ.4,91,734 కోట్లు. అలాగే ప్రభుత్వం పూచీ పడ్డ అప్పులు 1.54 లక్షల కోట్లు. ⇒రెండూ కలిపితే మొత్తం అప్పులు రూ.6,46,000 కోట్లు.⇒మరి వారు ప్రచారం చేసినట్లు ఎక్కడ రూ.14 లక్షల కోట్లు. ఎక్కడ వాస్తవ రూ.6.46 లక్షల కోట్లు.⇒ఎవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారు? వాటి గ్రోత్ ఎంత (సీఏజీఆర్) అని చూస్తే..⇒ చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,32,079 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.3,13,018 కోట్లు. అంటే ఏటా సగటున 19.54 శాతం చొప్పున అప్పులు పెరిగాయి.⇒అదే మా ప్రభుత్వ హయాంలో చూస్తే.. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,13,018 కోట్ల నుంచి రూ.6,46,531 కోట్లకు పెరిగాయి. అంటే ఏటా సగటున 15.61 శాతం చొప్పున అప్పులు పెరిగాయి. అంటే చంద్రబాబుగారి హయాంలో కన్నా, 4 శాతం తక్కువ అన్నమాట.⇒ఇక పబ్లిక్ సెక్టార్లకు సంబంధించి, నాన్ గ్యారెంటీడ్ అప్పులు చూసినా, చంద్రబాబుగారి హయాంలో రూ.8638 కోట్లు ఉన్న నాన్ గ్యారెంటీ అప్పు, ఆయన హయాం ముగిసే నాటిసి ఏకంగా రూ.77,228 కోట్లకు తీసుకుపోయాడు. 54.98 శాతం పెరిగింది. పవర్ సెక్టర్లో డిస్కమ్‌లకు అలా రుణాలు సేకరించారు.⇒అదే మా ప్రభుత్వం వచ్చాక, ప్రభుత్వ రంగ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు తగ్గించే ప్రయత్నం చేశాం. మా హయాంలో ఆ రుణం పెరగకపోగా, తగ్గించాం. –0.48 శాతం. అంటే ఆ రుణాన్ని రూ.75,386 కోట్లకు తగ్గించాం.⇒ఇక ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ అప్పు, నాన్ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి చూస్తే..⇒చంద్రబాబు హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన నాటికి రూ.1.40 లక్షల కోట్లు, ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లు. అంటే సీఏజీఆర్ 23.6 శాతం అన్నమాట.⇒మా హయాంలో 2019లో ఉన్న అప్పు రూ.3.90 లక్షల కోట్లు కాస్తా, రూ.7.21 లక్షల కోట్లు అయింది. అంటే సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే.⇒ఇంకా చెప్పుకోవాలంటే.. మా హయాంలో సీఏజీఆర్ 15.61 శాతం నమోదైంది.. అది కూడా రెండేళ్లు కోవిడ్ దుర్భర పరిస్థితులు.⇒నిజానికి కోవిడ్ వల్ల దేశమే కాదు, ప్రపంచలోనే చాలా దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రభుత్వ ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చు పెరిగింది. అయినా చంద్రబాబు కంటే మా పనితీరు చాలా బాగుంది.చంద్రబాబు వదిలిపెట్టిన బకాయిలు:⇒చంద్రబాబు దిగిపోతూ, డిస్కమ్‌ల బకాయిలు రూ.21,541 కోట్లు. అంటే కరెంటు సప్లై చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదు. వాటితో పాటు, చంద్రబాబు పోతూ పోతూ మాకు ఇచ్చిన బకాయిలు ఏకంగా రూ.42,183 కోట్లు.⇒ఉపాధి హామీ బకాయిలు రూ.2340 కోట్లు. ఉద్యోగుల రెండు డీఏలు బకాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.680 కోట్లు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు. పిల్లలకు మధ్యాహ్న భోజనం వండిన ఆయాలకు గౌరవ వేతనాలు కూడా బకాయిలు. చివరకు పిల్లల కోడిగుడ్లకు కూడా డబ్బులు చెల్లించలేదు.⇒ఏ ప్రభుత్వమైనా కొంత బకాయిలు పెడుతుంది. కానీ, చంద్రబాబు మాదిరిగా ఈ స్థాయిలో బకాయిలు పెట్టిపోదు.జీడీపీలో రాష్ట్ర వాటా. గణాంకాలు:⇒ప్రభుత్వం సంపద లెక్కలు తేలాలంటే.. దేశ జీడీపీలో ప్రభుత్వ వాటా (జీఎస్డీపీ) ఎంత అని చూస్తే చాలు.⇒చంద్రబాబుగారి హయాంలో కోవిడ్ మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉంది.⇒చంద్రబాబుగారి హయాంలో 5 ఏళ్లలో దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్డీపీ వాటా 4.47 శాతం. అదే మా హయాంలో అది 4.83 శాతం. అంటే కోవిడ్ ఉన్నా, చంద్రబాబుగారి కంటే బాగా పని చేశాం.ఉత్పాదక రంగం చూస్తే..:⇒తనకు తాను ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు చంద్రబాబు. ఆయన హయాంలో 2014–19 మధ్య దేశ వస్తు ఉత్పత్తి (ఉత్పాదక రంగం)లో రాష్ట్ర వాటా 2.86 శాతం.⇒అదే మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నా, 2019–24 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 4.07 శాతం. ఇది చాలదా? మా హయాంలో ఉత్పాదక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందింది? చంద్రబాబు హయాంలో ఎలా నత్తనడకన సాగింది?వైఎస్సార్సీపీ హయాంలోనే పెట్టుబడులకు బాట:⇒ఆదిత్య మిట్టల్‌తో నా భేటీ. అంటూ దావోస్ సమావేశం ఫోటోలు చూపారు. అలాగే అదానీ, కుమార మంగళం బిర్లా, ముఖేష్ అంబానీతో వేర్వేరు సందర్భాల్లో ఫోటోలు చూపారు.⇒ముఖేష్ అంబానీ మా ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ పెట్టుబడులు మొదలుపెట్టారు. ఆ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న, ఎనిమిది ఎథనాల్ ప్రాజెక్టులు కట్టడం మొదలు పెట్టారు. ⇒ఆయన దాన్ని ముందుకు తీసుకుపోతూ.. ఇక్కడ రూ.65 వేల కోట్ల పెట్టుబడి అంటూ బిల్డప్ ఇచ్చారు. కానీ, నిజానికి దానికి పునాది పడింది మా హయాంలోనే. ఇది వాస్తవం.⇒ఏ దానికైనా బిల్డప్. ఆదిత్య మిట్టల్ ఒడిషాలో రూ.1.04 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ కడుతున్నారు. అయితే అదే మిట్టల్ ఇక్కడ అనకాపల్లి వద్ద రూ.1.61 లక్షల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసున్నారని లోకేష ప్రకటించారు. దాన్ని ఒడిషా సీఎం తీవ్రంగా ఖండించారు.⇒పైగా, వస్తున్న కంపెనీలను పంపించేస్తున్నారు. సజ్జన్ జిందాల్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం మొదలుపెడుతుంటే.. ఎవరో హ్యాబిచ్యువల్ అఫెండర్‌ను తీసుకొచ్చి, ఆరోపణలు చేయించి, ఆయన వెళ్లిపోయేలా చేశారు.డిస్కమ్‌ల నష్టాలు. అప్పులు. గణాంకాలు:⇒2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి పవర్ డిస్కమ్‌ల నష్టాలు రూ.6625 కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి డిస్కమ్‌ల నష్టాలు ఏకంగా రూ.28,715 కోట్లకు పెరిగాయి.⇒అంటే చంద్రబాబు హయాంలో ఏకంగా రూ.22 వేల కోట్ల నష్టాలు పెరిగాయి. అదే మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల నష్టాలు కేవలం రూ.395 కోట్లు మాత్రమే అదనంగా పెరిగాయి.⇒చంద్రన్న వెలుగులు. జిలుగులు. మెరుగులు అంటారు కదా.. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి 2014లో డిస్కమ్‌ల అప్పులు రూ.29,552 కోట్లు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు ఏకంగా రూ.86,215 కోట్లకు పెరిగాయి. ⇒అంటే ఆయన హయాంలో డిస్కమ్‌ల అప్పులు ఏకంగా రూ.56,664 పెరిగాయి. అంటే ఏటా సగటున పెరిగిన అప్పు 23.88 శాతం కాగా, మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల అప్పులు రూ.86 వేల కోట్ల నుంచి రూ.1.22 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే కేవలం రూ.36 వేల కోట్లు మాత్రమే పెరిగాయి. అంటే ఏటా పెరిగిన సగటు అప్పులు కేవలం 7.28 శాతం మాత్రమే.చంద్రబాబు హయాంలో డిస్కమ్‌లకు అరకొర:⇒మామూలుగా డిస్కమ్‌లకు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి. అప్పుడే డిస్కమ్‌లు కొనసాగుతాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుంది.⇒చంద్రబాబుగారి హయాంలో 2014–19 మధ్య డిస్కమ్‌లను సపోర్ట్ చేస్తూ ఇచ్చిన మొత్తం కేవలం రూ.13,255 కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఏకంగా రూ.47,800 కోట్లు.⇒అలా ఇవ్వగలిగాం కాబట్టే.. డిస్కమ్‌లు నిలబడగలిగాయి. ⇒చంద్రబాబు మామీద వదిలిపెట్టిన ట్రూఅప్ ఛార్జీలు, ఫ్యుయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలకు సంబంధించి, ప్రజలకు తక్కువ బదిలీ చేయగలిగాం. అంటే ఛార్జీలు పెద్దగా పెంచలేదు.ఆరు నెలలు తిరక్కుండానే విద్యుత్ ఛార్జీల మోత:⇒అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా రాకముందే ప్రజలపై ఏకంగా రూ.17,899 కోట్ల భారం మోపాడు. ఇందులో రూ.6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు ఇప్పటికే నవంబరులో భారం మోపారు. మిగిలిన రూ.11 వేల కోట్లు డిసెంబరు నుంచి వేస్తాడు.⇒చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే, డిస్కమ్‌లకు సపోర్ట్ చేస్తే, ప్రజలపై ఈ భారం పడదు కదా?. అంటే ఆయన అక్కడ వాటికి సపోర్టు చేయకుండా, ఇక్కడ ప్రజలపై భారం వేస్తున్నాడు. అదీ చంద్రబాబు వైఖరి.ప్రభుత్వ ఆదాయం తగ్గింది:⇒ఈ ఆరు నెలల్లో చంద్రబాబుగారి హయాంలో రాష్ట్ర సంపద (స్టేట్ ఓన్ రెవెన్యూస్–ఎస్ఓఆర్)ను, మా ప్రభుత్వ హయాంలో తొలి ఆరు నెలలతో పోల్చి చూస్తే, ఇప్పుడు అది –2 శాతం తగ్గింది.⇒అంటే మా ప్రభుత్వ హయాంలో తొలి ఆరు నెలల్లో ఎస్ఓఆర్ రూ.42436 కోట్లు కాగా, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఈ తొలి ఆరు నెలల్లో అది రూ.41,570 కోట్లు.⇒అంటే రాష్ట్ర ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గింది. ఎందుకంటే రావడం రావడం దోపిడినే. వచ్చీరాగానే యథేచ్ఛగా ఇసుక దోపిడి చేశారు. ఎక్కడా వదిలిపెట్టలేదు. ⇒ఇంకా పేకాట క్లబ్‌లు. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేష్‌కు వాటాలు.⇒మద్యం షాప్‌లు. గతంలో ప్రభుత్వ «ఆధ్వర్యంలో నడిస్తే ఇప్పుడు సిండికేట్ల చేతిలో. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అది ప్రభుత్వానికి రాదు. అందరికీ వాటా. ప్రైవేటు జేబుల్లోకి.⇒మా హయాంలో ఇసుక ధర రెట్టింపు. మా హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల రాయల్టీ వచ్చేది. టన్నుకు రూ.370 చొప్పున. – ఇప్పుడు గతంలో కంటే ఇసుక ధరలు రెట్టింపు అయ్యాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరగలేదు.క్యాపిటల్ ఎక్స్పెండీచర్:⇒చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య క్యాపిటల్ ఎక్స్పెండీచర్ కింద ఏటా చేసిన సగటు వ్యయం రూ.13,860 కోట్లు కాగా, అదే మా హయాంలో చేసిన సగటు వ్యయం రూ.15,632 కోట్లు.⇒అందుకే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు పడ్డాయి. ప్రతి గ్రామంలో సచివాలయాలు వచ్చాయి. ప్రణాళిక ప్రకారం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాం. అవి నీళ్లతో నిండాయి.⇒కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటి. వెలిగొండ ప్రాజెక్టు పూరై్తనా నీళ్లు నింపని పరిస్థితి.ఇదీ చదవండి: నయవంచనకు నకలు పత్రం! -
ఏపీ బడ్జెట్ పై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలి
సాక్షి, అమరావతి: బడ్జెట్‌పైన, బడ్జెట్ సమావేశాలపైన అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని అన్నారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వాములను చేస్తామని చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ కమిటీ హాలులో మంగళవారం ఎన్డీఏ ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఒకే అంశంపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లమని, ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి క్రమంగా తగ్గుతోందని చెప్పారు.కేంద్ర బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. సభలో ప్రతిపక్షం లేదని అనుకోవద్దని, వాళ్లకు బాధ్యత లేదని అన్నారు. అసెంబ్లీకి తాము పంపిన ప్రతినిధి తమ కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారని చెప్పారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరని తెలిపారు. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు అసెంబ్లీ రూల్స్ తెలియాలని చెప్పారు. అనంతరం బడ్జెట్‌పై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంఆ తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. 150 రోజుల పాలనలో చాలా నిర్ణయాలు తీసుకున్నాని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు హుందాగా ఉండాలని, వారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపైన చర్చించాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు, ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ఇది ప్రజలను ముంచే బడ్జెట్: రాచమల్లు