కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పాత వ్యక్తిగత ఆదాయపు పన్ను(Income Tax) విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. క్రమంగా ఈ పాత పన్ను(Old Tax) విధానాన్ని తొలగించే ప్రకటనలు చేయాలని ప్రభుత్వ యోచిస్తోంది. కొత్త పన్ను(New Tax) విధానాన్నే పన్నుదారుల ఎంపికగా మార్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పన్నుదారులు పాత, కొత్త విధానాల్లో ఏదైనా ఎంచుకునే వీలుంది. ప్రభుత్వం ఒకవేళ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇకపై ఈ వెసులుబాటు ఉండదని నిపుణులు చెబుతున్నారు.
2021 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ పాత పన్ను విధానంలో ఉన్నన్ని మినహాయింపులు మాత్రం కొత్త విధానంలో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే 72% పైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన తక్కువ రేట్లకు పన్నుదారులు ఆకర్షితులయ్యారు. వీరిని మరింత ప్రోత్సహించడానికి కొత్త శ్లాబ్‌లను తీసుకురావాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి.
ఇదీ చదవండి: మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
ప్రస్తుతం కొత్త విధానంలో ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ.4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. మొదటి శ్లాబుగా ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల పరిధిని రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షలకు సర్దుబాటు చేయవచ్చు. కొత్త విధానం చాలా మందికి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇంటి అద్దె భత్యం, పెట్టుబడులు, గృహ రుణ వడ్డీ వంటి వివిధ మినహాయింపులు, వాటి వల్ల కలిగే ప్రయోజనం పొందే అవకాశం పాత విధానంలో మెరుగ్గా ఉండేదనే వాదనలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment