budget session
-
బడ్జెట్లో వ్యవసాయానికి ఊతం రైతులకు శుభవార్త
-
పెట్టుబడిదారులకు ప్రోత్సాహం చట్టాలలో కీలక మార్పులు
-
వేతన జీవులకు బిగ్ రిలీఫ్ .. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి: Nirmala Sitharaman
-
బడ్జెట్ వేళ.. పద్మశ్రీ గ్రహీత ఇచ్చిన చీరలో నిర్మలమ్మ
-
భారత్‌పై అన్ని దేశాల కన్ను
-
రైతులు మరియు స్టీల్ ప్లాంట్ పై బీజేపీ మొండి వైఖరి
-
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
Income Tax Slabs : సామాన్యుడిపై పన్నుల భారం తగ్గించండి
-
బడ్జెట్‌పై ఏపీ భారీ ఆశలు
-
బడ్జెట్ లో ఏపీకి ఊరట దక్కనుందా?
-
బడ్జెట్‌పై సామాన్యుల ఆశలు
-
నిత్యావసర ధరలపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం
-
పన్ను విధానాల్లో కేంద్రం కీలక మార్పులు ప్రతిపాదించే అవకాశం
-
కేంద్ర బడ్జెట్‌పై భారీగా అంచనాలు
-
పన్ను చెల్లింపుదారులతో సర్వే.. ఆసక్తికర అంశాలు
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025-26)లో పన్ను రేట్లను తగ్గించాలని 57 శాతం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరుతున్నట్లు గ్రాంట్ థార్టన్ భారత్(Grant Thornton Bharat) ఇటీవల నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సర్వేలో వెల్లడించింది. 500 మందికి పైగా పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించిన వివరాలతో ఈ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. సర్వేలో వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.తక్కువ పన్ను రేట్లు: ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని 57 శాతం మంది ప్రతివాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అధిక మినహాయింపు పరిమితులు: 25 శాతం పన్ను చెల్లింపుదారులు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి అధిక మినహాయింపులు ఆశిస్తున్నారు.కొత్త పన్ను విధానం: 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పటికీ, 63 శాతం మంది ఇప్పటికీ పాత విధానంలో ప్రోత్సాహకాలను పెంచాలని కోరుతున్నారు.నష్టాలు పూడ్చడానికి అనుమతి: కొత్త పన్ను విధానం ప్రకారం ఇంటి ఆస్తి నష్టాలను పూడ్చడానికి అనుమతించాలని 53 శాతం మంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో రూ.10కే టీ, రూ20కే సమోసా!చెల్లింపుదారుల మనోభావాలువ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ డిస్పోజబుల్ ఆదాయాన్ని(టాక్స్‌లు చెల్లించిన తర్వాత ఖర్చు చేయడానికి అనువైన డబ్బు) పెంచుకోవడానికి వ్యక్తిగత పన్ను విషయంలో ఉపశమనం పొందాలని చూస్తున్నారు. తక్కువ పన్ను రేట్లు, అధిక మినహాయింపు పరిమితులు కోరుతున్నట్లు సర్వేలోని అంశాల ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంటే ఖర్చులను మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడుతుందని ప్రతివాదులు నమ్ముతున్నారు. -
పాత పన్ను విధానం తొలగింపు..?
కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పాత వ్యక్తిగత ఆదాయపు పన్ను(Income Tax) విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. క్రమంగా ఈ పాత పన్ను(Old Tax) విధానాన్ని తొలగించే ప్రకటనలు చేయాలని ప్రభుత్వ యోచిస్తోంది. కొత్త పన్ను(New Tax) విధానాన్నే పన్నుదారుల ఎంపికగా మార్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పన్నుదారులు పాత, కొత్త విధానాల్లో ఏదైనా ఎంచుకునే వీలుంది. ప్రభుత్వం ఒకవేళ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇకపై ఈ వెసులుబాటు ఉండదని నిపుణులు చెబుతున్నారు.2021 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ పాత పన్ను విధానంలో ఉన్నన్ని మినహాయింపులు మాత్రం కొత్త విధానంలో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే 72% పైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన తక్కువ రేట్లకు పన్నుదారులు ఆకర్షితులయ్యారు. వీరిని మరింత ప్రోత్సహించడానికి కొత్త శ్లాబ్‌లను తీసుకురావాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి.ఇదీ చదవండి: మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..ప్రస్తుతం కొత్త విధానంలో ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ.4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. మొదటి శ్లాబుగా ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల పరిధిని రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షలకు సర్దుబాటు చేయవచ్చు. కొత్త విధానం చాలా మందికి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇంటి అద్దె భత్యం, పెట్టుబడులు, గృహ రుణ వడ్డీ వంటి వివిధ మినహాయింపులు, వాటి వల్ల కలిగే ప్రయోజనం పొందే అవకాశం పాత విధానంలో మెరుగ్గా ఉండేదనే వాదనలున్నాయి. -
మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?
అధిక పన్నులతో అల్లాడుతున్న మధ్య తరగతి ప్రజలకు రానున్న బడ్జెట్(Budget)లో ఊరట లభించనుందా? మందగించిన వినియోగానికి ప్రేరణగా ప్రభుత్వం పన్ను రేటు(Tax Rate)ను తగ్గించనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అంశాన్ని ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఆర్థిక వ్యవస్థ మందగించిన తరుణంలో జీవన వ్యయాలు పెరిగిపోయి, మధ్య తరగతి ప్రజలు(middle class people) ఇబ్బంది పడుతున్నారని, వినియోగం పడిపోతుందన్న ఆందోళనలు వినిపిస్తుండడం తెలిసిందే. వీటికి పరిష్కారంగా పన్ను రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమివ్వాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఇందులో ఈ మేరకు ప్రతిపాదన ఉంటే అది లక్షలాది మందికి ఊరట కల్పించనుంది. అయితే, కొత్త పన్ను వ్యవస్థలోనే ఈ మేరకు ఉపశమనం ఉండొచ్చన్నది సమాచారం. తద్వారా మరింత మందిని కొత్త పన్ను విధానం వైపు తీసుకురావడం కూడా ఈ ప్రతిపాదనలోని ఉద్దేశ్యంగా తెలుస్తోంది.కొత్త, పాత పన్ను విధానం..2020లో కేంద్రం అప్పటి వరకు ఉన్న పన్ను విధానానికి అదనంగా, మరో కొత్త విధానాన్ని సైతం ప్రవేశపెట్టింది. పాత విధానంలో ఆదాయం రూ.6లక్షలు మించితే 20 శాతం పన్ను పరిధిలోకి వస్తారు. అదే కొత్త పన్ను విధానంలో అయితే ప్రస్తుతం రూ.12 లక్షల వరకు ఆదాయంపై 15 శాతమే పన్ను అమల్లో ఉంది. కాకపోతే పాత పన్ను వ్యవస్థలో గృహ రుణం, బీమా ప్రీమియంలు, పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలున్నాయి. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఇతర మినహాయింపుల్లేవు. ఈ రెండింటిలో ఏ విధానం ఎంచుకోవాలన్నది పన్నుదారుల ఐచ్ఛికమే.ఇదీ చదవండి: ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..సర్కారుపై పెరుగుతున్న ఒత్తిళ్లు ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల నుంచి దిగిరావడం లేదు. వేతనాల్లో వృద్ధి సైతం మందగించింది. దీంతో ఖర్చు చేసేందుకు మిగులు లేక, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా పట్టణ, గ్రామీణ వినియోగం క్షీణించి, అది దేశ ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపిస్తోంది. జీడీపీ ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4 శాతానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పడిపోవడం తెలిసిందే. దీంతో ఆదాయపన్ను రేట్లను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. బడ్జెట్ ముందస్తు సమావేశాలు, వినతుల సందర్భంగా పలు రంగాల నిపుణులు, ఆర్థిక వేత్తలు సైతం పన్ను రేట్లు, కస్టమ్స్ టారిఫ్‌లు తగ్గించాలంటూ ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. సహజంగా పన్ను తగ్గింపు డిమాండ్లు ఏటా బడ్జెట్ ముందు వినిపిస్తూనే ఉంటాయి. ఆర్థిక వృద్ధి క్షీణించిన తరుణంలో ఈ విడత ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. -
తయారీ రంగం, ఆహార ద్రవ్యోల్బణంపై సూచనలు
బడ్జెట్ రూపకల్పనకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. గతంలోకంటే మరింత మెరుగ్గా అభివృద్ధి సాగించేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమగ్ర తయారీ విధానం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహకాలు, వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్థికవేత్తలతో చర్చించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులను అన్వేషించాలని, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను పెంచాలని ప్రముఖులు సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన విధానాలపై చర్చించారు. ఉత్పాదక రంగంలో దిగుమతి సుంకాలు, పన్నులు, సాంకేతికత బదిలీ, ఇతర అంశాల పురోగతిపై ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని తెలిపారు. ప్రభుత్వం మూలధన పెట్టుబడులపై స్థిరాదాయం సమకూరాలని పేర్కొన్నారు.స్తబ్దుగా తయారీ రంగందేశీయ తయారీ రంగ వాటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15-17% వద్ద కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. దీన్ని 25% పెంచడానికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే వాదనలున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగతున్నప్పటికీ, ప్రభుత్వం మూలధన వ్యయంపై స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కంపెనీలను ప్రోత్సహించాలని కొందరు ఆర్థికవేత్తలు సిఫార్సు చేశారు. 2025-26లో ప్రభుత్వ మూలధన వ్యయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జపాన్ కంపెనీల హవా.. కొరియన్, చైనా బ్రాండ్లకు దెబ్బ!ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలుసమగ్ర ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణం ప్రధాన అడ్డంకిగా మారుతుందనే వాదనలున్నాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని ప్రముఖులు విశ్లేషించారు. దాంతోపాటు ఆయా ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంపొందించడానికి ఇండియా అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయం అయినప్పటికీ, గ్రీన్ ఎనర్జీలో మరిన్ని ఆవిష్కరణలు రావాలని తెలిపారు. -
‘సామాన్యుడిపై భారం తగ్గించండి’
బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2025లో ప్రకటించే కేంద్ర బడ్జెట్లో మార్పులు చేయాలంటూ కొన్ని ఆర్థిక సంస్థలు, ప్రజల నుంచి కేంద్రానికి వినతులు వస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఎక్స్ పేజ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలిపారు.ఎక్స్ వేదికగా తుషార్ శర్మ అనే వ్యక్తి సామాన్యుడిపై పన్ను భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ‘@nsitharaman దేశాభివృద్ధికి మీరు చేస్తున్న సహకారం, ప్రయత్నాలను ఎంతో అభినందిస్తున్నాను. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇది నా హృదయపూర్వక అభ్యర్థన మాత్రమే’ అని తుషార్ శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ ‘మీ మాటలు, అవగాహనకు ధన్యవాదాలు. నేను మీ అభ్యర్థనను అభినందిస్తున్నాను. నరేంద్రమోదీ ప్రభుత్వం సమస్యలపై స్పందించి చర్య తీసుకునే ప్రభుత్వం. ప్రజల అభిప్రాయాలను వింటోంది. వాటికి తగినట్లు ప్రతిస్పందిస్తోంది. మీ అభ్యర్థన చాలా విలువైంది’ అని రిప్లై ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ 2025 ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జులైలో ఆర్థిక మంత్రి తెలిపారు.Thank you for your kind words and your understanding. I recognise and appreciate your concern.PM @narendramodi ‘s government is a responsive government. Listens and attends to people’s voices. Thanks once again for your understanding. Your input is valuable. https://t.co/0C2wzaQtYx— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2024ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!గతంలో మంత్రి స్పందిస్తూ ‘నేను మధ్యతరగతి వారికి విభిన్న రూపాల్లో మేలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను పన్ను రేటును తగ్గించి వారికి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచాం. అదనంగా అధిక ఆదాయ వర్గాలకు పన్ను రేటు పెంచాం. సామాన్యులపై పన్ను రేట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టాం’ అని చెప్పారు. -
చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్నివిధాలా కుదేలయింది
-
ఏపీ పవర్ బిల్లులపై జగన్ రియాక్షన్
-
ఇకనైనా డబ్బా కొట్టుకోవడం ఆపండి: YS Jagan
-
ఆర్థిక క్రమశిక్షణ పాటించింది..?
-
YS Jagan: చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగాయి
-
అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు
-
చంద్రబాబు యాక్టింగ్ కి ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ కూడా సరిపోడు
-
చంద్రబాబు గోబెల్స్ ప్రచారంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
YS Jagan: ప్రవేశ పెట్టిన పత్రాలే చెప్తున్నాయి
-
ఏపీ బడ్జెట్‌పై జగన్ రియాక్షన్
-
ప్రజల నెత్తిన బాబు టోపీ సూపర్ సిక్స్ అంతా తుస్సు: Mohan Reddy
-
ఏపీ బడ్జెట్ పై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
కూటమి బడ్జెట్ నిరాశాజనకం బ్రిజేంద్రా రెడ్డి.
-
ఇది ప్రజలను ముంచే బడ్జెట్: రాచమల్లు
-
Buggana: అప్పులతో అమరావతి సాధ్యమా?
-
Buggana: బడ్జెట్ పెట్టడానికి ఐదు నెలలు ఎందుకు పట్టింది?
-
Watch Live: AP అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-
బడ్జెట్ పై అసత్యాలు కాంగ్రెస్ పై నిర్మల అస్త్రాలు
-
బీజేపీ ప్రభుత్వం వల్ల అంబానీ,అదానీలకే లాభం : రాహుల్ గాంధీ
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ బడ్జెట్‌పై ప్రసంగించారు. కురుక్షేత్రంలో అభిమన్యుడిని బంధించి చంపారు. పధ్మవ్యూహలాంటి కమలం పార్టీ రూపంలో దేశంలో అధికారంలో ఉందని వ్యాఖ్యానించారు. కాబట్టే రైతులు కార్మికులు భయపడుతున్నారు. వారే కాదు.. దేశంలోని అన్నీ వర్గాలను బీజేపీ బయపెడుతోందని వ్యాఖ్యానించారు.అప్పుడు ఫద్మవ్యూహాన్ని ఆరుగురు కంట్రోల్ చేశారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే రాహుల్ ప్రసంగంపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా సైతం రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడాలంటూ అభ్యంతరం తెలిపారు. #WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "My expectation was that this Budget would weaken the power of this 'Chakravyuh', that this Budget would help the farmers of this country, would help the youth of this country, would help the labourers, small business of this country. But… pic.twitter.com/t5RaQn4jBq— ANI (@ANI) July 29, 2024రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే 👉రాజకీయ ఏకస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది. 👉ట్యాక్స్ టెర్రరిజం ఆపేందుకు కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు.👉బీజేపీ ప్రభుత్వం వల్ల అదానీ, అంబానీలకే లాభం👉ఇంటర్న్‌షిప్‌ల వల్ల యువతకు ఒరిగేదేం లేదు.👉కాళ్లు విరగొట్టి బ్లాంకెట్ వేసినట్లుంది👉అగ్నివీరులను కేంద్రం మోసం చేస్తోంది👉బడ్జెట్లో అగ్నివీర్ల పెన్షన్‌కు బడ్జెట్లో ఒక్కరూపాయి కేటాయించలేదు. 👉రైతు సంఘాలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు👉రైతులు పంటలకు కనీస మద్దతు కావాలను కోరుతున్నారు.. రైతుల విషయంలో ఇప్పటికీ కేంద్రం స్పష్టతలేదు👉కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల్ని పట్టించుకోవడం లేదు👉పదేళ్లలో 70 సార్లు ప్రశ్న పత్రాన్ని లీక్ చేశారు👉పేపర్ లీకేజీతో యువత నష్టపోయారు👉విద్య పైన కేవలం అతి తక్కువగా 2.5% బడ్జెట్ మాత్రమే కేటాయించారు 👉ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేవు -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పవర్‌పై వాడీవేడి చర్చ
Updates.. సీఎం రేవంత్ కామెంట్స్..కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇలా మాట్లాడితే ప్రాసిక్యూలేషన్ చేయాల్సి వస్తుంది.కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదు. 2021లో పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్నారు.ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు.రూ.81వేల కోట్లు అప్పులకు కారణమయ్యారు.నల్లగొండ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ సంగతి తేలిపోయింది.పవర్ ప్లాంట్ పేరుతో దోచుకున్నారు. 👉మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..మీరు ఫ్లోరోసిన్‌ను మాకు బహుమతిగా ఇచ్చారు.బీహెచ్ఈఎల్కు కాంట్రాక్ట్ ఇస్తే తప్పేంటి?.పవర్ ప్లాంట్ నల్లగొండలో కడితే తప్పు.. వేరే చోట కడితే తప్పా?.సూపర్ క్రిటికల్‌లో అయితే నాలుగేళ్లలో భద్రాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ చెప్పింది.బీహెచ్ఈఎల్ సబ్ కాంట్రాక్ట్‌ల్లో మా బంధువు ఒక్కరు కూడా లేరు.మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కరెంట్ పోయిందని అధికారులకు ఫోన్ చేశారు.నల్లగొండ తెలంగాణలో లేదా?.కరెంట్ లేదని హెల్ఫ్‌లైన్‌కు ఫోన్ చేస్తే కేసులు పెడుతున్నారు.దానిపై ఎందుకు మాట్లాడటం లేదు?.జీవన్ రెడ్డిపై కూడా కేసు పెడతారా?. 👉గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాపై మూడు మర్డర్ కేసులు పెట్టారు - జగదీష్ రెడ్డి👉మూడు మర్డర్ కేసుల్లో కోర్టు నిర్దోషిగా తీర్చి కేసులను కొట్టివేసింది - జగదీష్ రెడ్డి.👉మంత్రి కోమటిరెడ్డి నాపై రెండు మర్డర్ కేసుల ఆరోపణలు చేశారు - జగదీష్ రెడ్డి.👉ఆ మర్డర్ కేసులో అంశంపై హౌస్ కమిటీ వేయాలని కోరుతున్నా - జగదీష్ రెడ్డి.👉హౌస్ కమిటీ వేసి నిజా నిజాలు తేల్చాలి - జగదీష్ రెడ్డి.👉హౌస్ కమిటీ ద్వారా నిజాలు తేలుతాయి అప్పుడు రాజీనామా వాళ్లు చేస్తారా నేను చేస్తానా అనేది తెలుస్తుంది.👉నేను ఉద్యమంలో పనిచేశాను ఆ కేసులు ఉన్నాయి.. వాళ్ల లాగా సంచులు మోసిన జీవితం నాది కాదు. - జగదీష్ రెడ్డి👉సంచులు మోసి జైలుకుపోయిన జీవితం నాది కాదు. జగదీష్ రెడ్డి👉రికార్డుల నుంచి తొలగించాలి అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను సైతం తొలగించాలి. - జగదీష్ రెడ్డి. 👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పై వ్యాఖ్యల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్👉మర్డర్ కేసులో జైశ్వర్ రెడ్డి ఉన్నారు - కోమటి రెడ్డి👉ఏడాది పాటు జగదీష్ రెడ్డిని జిల్లా బహిష్కరించింది - మంత్రి.👉కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు - జగదీష్ రెడ్డి.👉కోమటిరెడ్డి చెప్పినట్లుగా నా పై కేసులు ఉన్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. - జగదీష్ రెడ్డి👉నిరూపించకపోతే ముఖ్యమంత్రి కోమటిరెడ్డి ఇద్దరు రాజీనామా చేసి ముక్కు నేలకు రాయాలి. - జగదీష్ రెడ్డి👉జగదీష్ రెడ్డి సవాలను స్వీకరిస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.👉కేసులో రికార్డులు బయటపెడతా... లేకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా - కోమటి రెడ్డి వెంకట్ రెడ్ 👉సీఎం రేవంత్‌కు జగదీష్ రెడ్డి కౌంటర్..👉చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.👉మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.👉జగదీష్ రెడ్డి సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేసింది మర్చిపోయాడు.👉మర్డర్ కేసులో జగదీష్ రెడ్డి ఏ-2: మంత్రి కోమటిరెడ్డి👉మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.👉రాంరెడ్డి హత్య కేసులో ఏ-6👉లక్షా 80వేల దొంగతనం కేసులో ముద్దాయి జగదీష్ రెడ్డి.👉నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.👉జగదీష్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.👉నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు.👉కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. సీఎం రేవంత్ సీరియస్ కామెంట్స్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.కమిషన్ ఛైర్మన్‌ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను. దీంతో, నన్నుమార్షల్స్ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు. సోలార్ పవర్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది. సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్‌లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడేవిచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. 👉అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 👉ఇప్పటి వరకు డిమాండ్ బుక్స్ ఇవ్వలేదన్న జగదీష్ రెడ్డి.👉రాత్రే పంపించామన్న స్పీకర్👉దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదు: జగదీష్ రెడ్డి.👉పదేళ్లలో రేపు రాత్రి 10 గంటలకు వచ్చి మాట్లాడే వాళ్లు: శ్రీధర్ బాబు👉హరీష్ రావు బుల్డోడ్ చేసేపని పెట్టుకున్నారు. ఇది మానుకోవాలి: శ్రీధర్ బాబు👉మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు. 👉పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్ రెడ్డి.👉ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.👉మీటర్ల విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు.👉కరెంట్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.👉ఉదయ్ స్కీమ్‌లో 27 రాష్ట్రాలు చేరాయి.👉ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.👉స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. 👉అసెంబ్లీలో విద్యుత్‌పై చర్చ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. అందుకే పవర్ సెక్టార్ గందరగోళంగా మారింది. రైతులకు ఉచిత కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విద్యుత్ రంగం అస్తవ్యస్తమైంది. యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్ రాష్ట్రానికి వచ్చింది. కేసీఆర్ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రాలేదు. మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు?.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు?.యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.పవర్ ప్లాంట్‌లో టెండర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. 👉విద్యుత్ మీటర్ల అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్.సీఎం రేవంత్ రెడ్డి మాపై బురద జల్లే ప్రయత్నం చేశారని దీనిపై చర్చకు సిద్దమంటున్న బీఆర్ఎస్.హోం శాఖ, మెడికల్ అండ్ హెల్త్‌పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.ఎడ్యుకేషన్ పై చర్చపై మాట్లాడనున్న- ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.ఎక్సైజ్ , ట్రాన్స్ పోర్ట్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.విద్యుత్ చర్చ పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిఎం అండ్యూడీ, ఐటీ మున్సిపల్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మేల్యే వివేకా నంద గౌడ్. 👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ఐదో రోజు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, నేడు ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చించనున్నారు.👉మరోవైపు.. నేడు సభలో 19 పద్దులపై శాసనసభలో చర్చ ఉండనుంది. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్లపై, మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఎంఏయూడీలపై చర్చ జరుగుతుంది.పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ..👉ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్‌పై కూడా చర్చించనున్నారు. 19 పద్దులపై చర్చించిన తర్వాత వాటికి శాసనసభ ఆమోదం తెలుపనుంది. ఇక, ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్, విద్యాశాఖ, హోం శాఖ ఉన్న విషయం తెలిసిందే.👉మోటర్లకు మీటర్లు పెట్టేందుకు 2017లోనే ఉదయ్ స్కీంలో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉదయ్ స్కీంపై సంతకం చేయ్యలేదని, మీటర్లు పెట్టలేదు బీఆర్ఎస్ చెబుతోంది. దీనిపై కూడా సభలో చర్చ జరుగనుంది. ఇదిలాఉండగా.. అసెంబ్లీలో పోడు భూముల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు -
తెలంగాణ బడ్జెట్లో కీలక అంశాలు
-
తెలంగాణ బడ్జెట్‌పై కేసీఆర్ హాట్ కామెంట్స్
-
కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసింది..కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
ఓఆర్ఆర్కు రూ.200 కోట్లు.
-
వరి రైతులకు శుభవార్త
-
మాకు దక్కింది ఏం లేదు.. కేంద్రం రీ-బడ్జెట్ పెట్టాలి
-
కొత్త ట్యాక్స్ విధానంలో మార్పులపై నిర్మలా సీతారామన్ జవాబు
-
బాబు అట్టర్ ఫ్లాప్ ఏపీకి గుండు సున్నా!
-
కొత్త పన్ను విధానంలో మార్పులు..
-
లోన్స్ పై నిర్మలా సీతారామన్ క్లారిటీ
-
ఏపీకి తక్షణ సాయం 15 వేల కోట్లు.. పోలవరం పూర్తికి కట్టుబడి ఉన్నాం
-
ఒక నెల జీతం.. ఉద్యోగులకు శుభవార్త
-
వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్..
-
బడ్జెట్ 2024-25 వరుసగా మూడోసారి
-
మోదీ మైండ్ గేమ్ ఆ రాష్ట్రాలకే నిధులు..
-
Budget 2024-25: బడ్జెట్ ముఖ్యాంశాలు
Parliament Budget Session 2024 Highlights: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దేశ చరిత్రలో ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ 2024-25లో నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు, అప్డేట్లు.ఆదాయ సమీకరణ కేవలం పన్ను ఆధారితమైంది కాదు: నిర్మలా సీతారామన్మనీలాండరింగ్ను నిరోధించడంలో ఏంజెల్ ట్యాక్స్ రద్దు అంశం కీలక ప్రభావం చూపుతుంది. ఇన్ని రోజులు ఇది భారతదేశంలో పెట్టుబడులకు ఆటంకంగా మారింది.యూపీఏ 2లో ఏంజెల్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై తీసుకొచ్చిన 12.5% ట్యాక్స్‌ను నిజానికి సరాసరి పన్నురేటుతో పోలిస్తే చాలా తగ్గించాం.పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం.ఎప్ అండ్ ఓల్లో ఎస్టీటీ ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి .కేంద్ర బడ్జెట్ 2024-25లో మొత్తం రూ.48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు.మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ.ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లుగా అంచనా.రెవెన్యూ వసూళ్లు రూ.31,29,200 కోట్లు.నికర పన్ను ఆదాయం రూ.25,83,499 కోట్లు.పన్నేతర ఆదాయం రూ.5,45,701 కోట్లు.మొత్తం మూలధన వసూళ్లు (రుణేతర రశీదులు, రుణ రసీదులతో కలిపి) రూ.15,50,915 కోట్లు.యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్: మోదీమహిళల స్వావలంబనకు దోహదం చేసే బడ్జెట్.ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం.ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.భారత్‌ను గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా మారుస్తాం.పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాం.#WATCH | Post Budget 2024: Prime Minister Narendra Modi says "For MSMEs, a new scheme to increase ease of credit has been announced in the budget. Announcements have been made to take export and manufacturing ecosystem to every district in this budget...This budget will bring new… pic.twitter.com/C0615OJjdt— ANI (@ANI) July 23, 2024స్టాంప్ డ్యూటీ పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి.పన్ను సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల ద్రవ్య పరిమితులు పెంచారు.ట్యాక్స్ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేయడానికి ద్రవ్య పరిమితులు వరుసగా రూ.60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లుగా నిర్ణయించారు.గత సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు నిధులు తగ్గించారు. 2024-25 బడ్జెట్లో రూ.951 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.968 కోట్లు కంటే 1.79 శాతం నిధులు తగ్గాయి.జమ్మూ కశ్మీర్‌కు బడ్జెట్లో రూ.42,277 కోట్లు.అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,985 కోట్లు.చండీగఢ్‌కు రూ.5,862 కోట్లు.లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు.ప్రభుత్వం మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించింది.విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించింది.క్యాపిటల్ గెయిన్‌లపై ప్రభుత్వం పన్ను పెంచిన తర్వాత రూపాయి రికార్డు స్థాయికి క్షీణించింది.యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.69కి పడిపోయింది.ఎంపిక చేసిన నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధి.30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల కోసం రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు.ప్రధాన కేంద్ర పథకాలకు కేటాయింపులు..గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు.రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు రూ.1,200 కోట్లు.న్యూ క్లియర్ ప్రాజెక్ట్‌లకు రూ.2,228 కోట్లు.ఫార్మాసూటికల్స్ రంగంలో పీఎల్ఐ పథకానికి రూ.2,143 కోట్లు.సెమికండక్టర్లు అభివృద్ధికి, తయారీ రంగానికి రూ.6,903 కోట్లు.సోలార్ పవర్(గ్రిడ్) రూ.10 వేలకోట్లు.ఎల్పీజీ డీబీటీ(రాయితీ)లకు 1,500 కోట్లు.రూపాయి రాక...ఇన్కమ్ ట్యాక్స్ 19 పైసలుఎక్సైజ్ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 27 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 19 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుసబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 21 పైసలుఫైనాన్స్ కమిషన్‌కు చెల్లింపులు 9 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర ఖర్చులు 9 పైసలుకొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7లక్షలు-రూ.10 లక్షలలోపు 10%, రూ.10లక్షలు- రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.ట్రేడింగ్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై ఎస్టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.స్టార్టప్‌ల కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు.బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.మొబైల్, యాక్ససరీస్‌పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎస్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు.రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్‌తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల అభివృద్ధి.ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.నేపాల్‌లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్‌లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం.గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు.ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీం.సులభంగా నిధులు అందేలా చర్యలు.గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం.ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్ట్పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు.దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటు.బీహార్‌లో ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మాణం.బీహార్, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.ఏపీకి అండగా ఉంటాం..ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు.వాటర్, పవర్, రైల్లే, రోడ్లు రంగాల్లో ఏపీకి అండగా ఉంటాం.పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తి సాయం అందించేలా చర్యలు.అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు.ఈ ఏడాదిలోనే ఆర్థిక సాయం.అవసరమైతే మరిన్ని నిధులు.విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.ఏటా 10 లక్షల మందికి విద్యారుణం.విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు.కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ఓ పథకం.ఈపీఎఫ్ఓ ద్వారా నగదు బదిలీ.వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు.నాలుగు కోట్ల మందికి స్కిల్ పాలసీ.ఈ బడ్జెట్లో వికసిత్ భారత్‌కు రోడ్‌మ్యాప్.సమ్మిళిత అభివృద్ధికి పెద్దపేట.యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం.ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్లో నిర్ణయాలు.కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారు.ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడంలో ఈ విజయం సాధ్యమైంది.దేశవ్యాప్తంగా మద్దతు ధరలు పెంచాం.అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది: నిర్మలా సీతారామన్పార్లమెంట్లో బడ్జెట్ 2024-25ను విడుదల చేయనున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభకు చేరుకున్నారు.#WATCH | PM Modi in Parliament, ahead of the presentation of Union budget by Finance Minister Nirmala Sitharaman(Video source: DD News) pic.twitter.com/T0RD4hBO2z— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ చేరుకున్నారు.#WATCH | Congress MP and LoP in Lok Sabha, Rahul Gandhi reaches Parliament ahead of Union Budget presentation by Finance Minister Nirmala Sitharaman in Lok Sabha. pic.twitter.com/zNcijSYS4e— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్-మే వరకు అమలు అవుతుంది.ఫిబ్రవరి 1, 2020లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.మోడీ 3.0 మొదటి బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్‌ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్మరో గంటలో పార్లమెంట్లో బడ్జెట్స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీబడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉంటుదన్న ప్రధాని మోదీఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రవేశిస్తూ బడ్జెట్ ట్యాబ్‌ను ఆమె ప్రదర్శించారు. కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman carrying the Budget tablet arrives at Parliament, to present the first Budget in the third term of Modi Government. pic.twitter.com/0tWut8mhEu— ANI (@ANI) July 23, 2024 పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్‌కు వెళ్లారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman meets President Droupadi Murmu at Rashtrapati Bhavan, ahead of the Budget presentation at 11am in Parliament.(Source: DD News) pic.twitter.com/VdsKg5bSLG— ANI (@ANI) July 23, 2024జమ్మూకశ్మీర్ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్ 2024-25 అంచనా రశీదులను సమర్పిస్తారు.#WATCH | Delhi | J&K budget copies arrive in Parliament; Union Finance Minister Nirmala Sitharaman will present the estimated receipts and expenditure (2024-25) of the Union Territory of Jammu and Kashmir (with legislature) in Parliament today. pic.twitter.com/gMIf8y31bU— ANI (@ANI) July 23, 2024నిర్మలా సీతారామన్ తన ‘బహి-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. గతంలో మాదిరిగానే ఆర్థిక మంత్రి సంప్రదాయ ‘బహి-ఖాతా’ రూపంలో ఉన్న టాబ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.నిర్మలమ్మ ఈసారి మెజెంటా పట్టు బోర్డర్ ఉన్న తెల్లటి చీరను ధరించారు.కొవిడ్ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్లోని డెరివేటివ్స్ ట్రేడింగ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం, రెగ్యులేటర్లు దీన్ని ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.బడ్జెట్ 2024-25 ప్రకటన సందర్భంగా ఈరోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీదారు ఐటీసీ కంపెనీపై 5–7 శాతం కంటే తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని ‘జెఫ్రీస్’ అభిప్రాయపడుతుంది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని మరింత పెంచే అవకాశం ఉంది.లోక్‌సభలో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించనున్న నిర్మలా సీతారామన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత తిరిగి పార్లమెంట్‌ను చేరుకుంటారు.బడ్జెట్‌ను ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్‌లోని మంత్రిత్వ శాఖ వెలుపల బడ్జెట్ టాబ్‌ను ఆవిష్కరించారు. #WATCH | Finance Minister Nirmala Sitharaman heads to Rashtrapati Bhavan to call on President Murmu, ahead of Budget presentation at 11am in Parliament pic.twitter.com/V4premP8lL— ANI (@ANI) July 23, 2024ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం. నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.Finance Minister Nirmala Sitharaman reaches Ministry ahead of Union Budget presentationRead @ANI Story | https://t.co/2pLE5R08Yh#Budget2024 #BudgetDay #NirmalaSitharaman pic.twitter.com/Vu9E7tqsio— ANI Digital (@ani_digital) July 23, 2024ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్.#WATCH | Chief Economic Advisor V Anantha Nageswaran arrives at Ministry of Finance, ahead of Union Budget presentation pic.twitter.com/vWrU3LbcLz— ANI (@ANI) July 23, 2024ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి మాట్లాడుతూ..‘గత సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు దాదాపు 6.5% ఉంది. ఈసారి కూడా ఆర్థిక సర్వే 7% వృద్ధి రేటును సూచిస్తుంది. పర్యాటక రంగంలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. ప్రజల సంప్రదాయాల విస్తరణకు ఈ రంగం వారధిగా ఉంటుంది. బడ్జెట్ 2024-25లో పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలుంటాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.#WATCH | Union Budget 2024 | Rikant Pitti, co-founder of EaseMy Trip says, "... Last year our GDP growth rate was around 6.5%, and this time as well, the economic survey suggests around 7% growth rate... In the coming time, our GDP growth rate will become even better... Tourism… pic.twitter.com/vZgPne4vyd— ANI (@ANI) July 23, 2024ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో జమ్ము కశ్వీర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడుతారు.వ్యవసాయం రంగం వృద్ధికి నిర్ణయాలు..?ఆర్థికసర్వేలోని వివరాల ప్రకారం దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయం మరింత పుంజుకోవాలంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక నైపుణ్యాలను తీసుకురావాలని కోరుతున్నారు.వ్యవసాయ మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.పంట ఉత్పత్తుల ధరను స్థిరీకరించాలని చెబుతున్నారు.వ్యవసాయంలో ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఎరువులు, నీటి వాడకంలో మార్పులు రావాలంటున్నారు.వ్యవసాయ-పరిశ్రమ సంబంధాలను మెరుగుపరిచేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రకటన2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు. సోమవారం విడుదల చేసిన ఎకనామిక్‌సర్వేలో ‘వికసిత్ భారత్’ కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేస్తే జీడీపీ వృద్ధి చెందుతుందన్నారు.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో నిర్మల ఎలాంటి కీలక నిర్ణయాలు ఏవీ చేయలేదు. ఈసారి నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి.పాత పన్ను విధానానికే చాలామంది మొగ్గు చూపుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులు వస్తాయని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. -
‘వికసిత్ భారత్’కు పునాది వేసే బడ్జెట్: ప్రధాని
దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వేను కాసేపట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. ప్రభుత్వం కలలుకనే ‘వికసిత్ భారత్’కు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని తెలిపారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంత్రి బడ్జెట్ 2024-25ను ప్రకటిస్తారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ..‘భారత రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం గర్వించదగ్గ విషయం. దేశంలోని ప్రజలకు, ప్రభుత్వం లక్ష్యంగా ఏర్పరుచుకున్న ‘అమృత్కాల్’కు ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది. ఈ బడ్జెట్ ప్రభుత్వం కలలుకనే ‘వికసిత్ భారత్’కు పునాది వేస్తుంది’ అన్నారు. -
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 12వ తేదీ వరకు 19 రోజులపాటు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. జమ్మూకశీ్మర్ బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి వాడీవేడిగానే చర్చలు 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు వివిధ కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ, యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, రైల్వే భద్రత, డిప్యూటీ స్పీకర్ పదవి, నిరుద్యోగం, అగి్నవీర్ పథకం, ఆర్థిక వ్యవస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, మణిపూర్‌లో శాంతి భద్రతలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయానికొచ్చాయి. ప్రత్యేక హోదాపై గళం విప్పిన వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రులు రాజ్నా«థ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన తదితర 44 పార్టీల సభాపక్ష నేతలు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పారీ్టలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్సార్సీపీ రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతిపక్ష నేతలపై దమనకాండ సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీ(యూ), ఒడిశాకు ప్రత్యేక హోదా కలి్పంచాలని బిజూ జనతాదళ్(బీజేడీ) సైతం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున హాజరైన గౌరవ్ గొగోయ్ కోరారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ఆరు బిల్లులివే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది. 90 ఏళ్ల క్రితం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్–2024ను తీసుకొస్తోంది. విమానయాన రంగంలో సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేయనున్నారు. అలాగే ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు, రబ్బర్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. హోదాపై టీడీపీ మౌనమెందుకో?: జైరాం అఖిలపక్ష సమావేశంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో ఆంధ్రప్రదేశ్, బిహార్‌కు ప్రత్యేక హోదా కలి్పంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జేడీ(యూ) డిమాండ్ చేశాయి. విచిత్రంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపై మౌనం దాల్చింది’’ అని పేర్కొన్నారు. -
డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచిన పాకిస్థాన్!
పాకిస్థాన్ గతేడాదితో పోలిస్తే రక్షణరంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయింపులు పెంచుతున్నట్లు ప్రకటించింది. పాక్ ఇటీవల విడుదల చేసిన 2024-25 బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి రూ.2.1లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది.పాక్ బుధవారం రూ.18లక్షలకోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దాయాదిదేశం గతేడాది రక్షణ రంగానికి రూ.1.8లక్షల కోట్లమేర నిధులు ఇచ్చింది. అంతకుముందు 2022-23 ఏడాదికిగాను రూ.1.5లక్షలకోట్లు ఖర్చుచేసింది. క్రమంగా ఆయా నిధులు పెంచుకుంటూ 2024-25 ఏడాదికిగాను డిఫెన్స్ రంగానికి రూ.2.1లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గతేడాది కేటాయింపుల కంటే 15 శాతం ఎక్కువ. కాగా, రానున్న బడ్జెట్ సెషన్లో భారత్‌కూడా ఆమేరకు కేటాయింపులు పెంచుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మొత్తం తన బడ్జెట్లో దాదాపు 12 శాతం రక్షణ రంగానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దాంతో భారత్ కూడా ఆ శాఖకు నిధులు గుమ్మురిస్తుందనే వాదనలున్నాయి. ఒకవేళ రానున్న బడ్జెట్ సమావేశాల్లో భారత్ డిఫెన్స్ రంగానికి కేటాయింపులు పెంచితే ఆ రంగంలోని లిస్టెడ్ కంపెనీల స్టాక్‌లు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
Ts: ప్రభుత్వానిది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్‌పేపర్: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని బీఆర్ఎస్ చెప్పించిందని, ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాపాయింట్లో హరీశ్‌రావు మాట్లాడారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో కేఆర్ఎంబీపై ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పారు. ‘ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై నిలదీశాం. ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వారి ప్రెజెంటేషన్లన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయి. మేము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి. వాస్తవాలు తెలియజేయాలి.మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ చెప్తామంటే వినడం లేదు. కాగ్ పనికి రాదు అని మేము అనలేదు. మాజీ ప్రధాని మీ మన్మోహన్ సింగ్ గారే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వైఎస్‌రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్‌ను తప్పుపట్టారు. ఇదే కాగ్ మమ్మల్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నది. ప్రాణహిత టెండర్లు కూడా వేయకుండా పనులు ప్రారంభించారని కాగ్ మిమ్మల్ని తిట్టింది. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. నాలుగు ఎంపీ సీట్ల కోసం చిన్న పొరపాట్లను భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సంక్షేమం చూడాలి. లేదంటే ఆగం అవుతారు. మీకు పుట్టగతులు ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మమల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. ఏనాటికైనా కంచు కంచే. మేము ప్రజల మధ్య ఉన్నాం. మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారు. నేను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరు. ప్రజలు చూశారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకున్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. సభలో అడ్డుకున్నా ప్రజల్లో అడ్డుకోలేరు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిక.. బీజేపీ నేత ఈటల క్లారిటీ -
నేడు తెలంగాణ బడ్జెట్
-
ఏపీ బడ్జెట్ ఏడు రంగుల ఆంధ్ర ధనుస్సు
‘రోటి, కపడా, ఔర్ మకాన్’ ఎవరు అవునన్నా, కాదన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదో నినాదం. ప్రజలకు వీటిని సమకూర్చడం పాలకుల కనీస బాధ్యత. ఇవి అందుబాటులో ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయడానికి ఉపక్రమిస్తుంది. వీటిని విస్మరించి, గ్రాఫిక్స్‌తో ఎన్ని మేడలు కట్టినా అవి నీటి మూటలేనని చరిత్ర చెబుతోంది. ప్రజల ఆనందాన్ని, వారి బాగోగులను చూసి ఆనందించే వాడే అసలైన పాలకుడని కూడా చరిత్ర వెల్లడిస్తోంది. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచినప్పుడే ప్రజా రంజక పాలన అనిపించుకుంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో చేయూత అందిస్తే చాలు, ప్రజలు స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తారని విశ్వ వ్యాప్తంగా విఖ్యాత ఆర్థిక నిపుణులు నొక్కి వక్కాణిస్తుండటం తరచూ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభ్యున్నతికే ఎన్నో దేశాలు, రాష్ట్రాలు సతమతం అవుతున్న వేళ.. ఇంతకు మించిన సంక్షేమాభివృద్ధిని సాకారం చేస్తూ మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. నవరత్నాల పథకాలు, సప్త స్వరాల్లాంటి థీమ్‌ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన జీవనాన్ని అందించాలనే తపన, తాపత్రయం.. బడ్జెట్లో కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024 – 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు ప్రయత్నం చేసిన ఆర్థిక మంత్రి మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు ద్వారా గత ఐదేళ్లలో సాధించిన ప్రగతి, ఫలితాలు, సంక్షేమాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్త ఆలోచనలు, వినూత్న విధానాలను అమలు చేయడం ద్వారా అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగలిగిందన్నారు. ఎన్నికల నేపధ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. భారీ అంచనాలకు వెళ్లకుండా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలకే పరిమితమయ్యారు. ఎప్పటిలాగానే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. ► 2024–25 ఓటాన్ అకౌంట్ మొత్తం బడ్జెట్‌ను రూ.2,86,389.27 కోట్లు గా బుగ్గన ప్రతిపాదించారు. మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 24,758.22 కోట్లు ఉంటుందని, ద్రవ్య లోటు రూ.55.817.50 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యలోటు జీఎస్డీపీలో దాదాపు 3.51% ఉంటుందని, రెవెన్యూ లోటు జీఎస్డీపీలో దాదాపు 1.56 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2023–24 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 2.19 శాతం, ద్రవ్య లోటు జీఎస్డీపీలో 4.18 శాతం ఉంటుందని తెలిపారు. ► సాధారణ విద్యకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద పీట వేశారు. సాధారణ విద్యా రంగానికి రూ.33,898 కోట్లు కేటాయించారు. సంక్షేమ, అభివృద్ది రంగాలకు తగినన్ని నిధులు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ.17,816 కోట్లు, పట్టణాభివృద్దికి రూ.9546 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.17,916 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.14,236 కోట్లు, సాగునీటి రంగానికి రూ.12,038 కోట్లు, మొత్తం సంక్షేమ రంగానికి రూ.44,668 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.6,595 కోట్లు, రవాణా రంగానికి రూ.10,334 కోట్లు కేటాయింపులు చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు రూ.3,940 కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో ‘సుపరిపాలిత ఆంధ్ర’గా.. 2019.. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయింది. విభజన గాయాలు మానేందుకు, సాంత్వన చర్యలు తీసుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా.. పరిస్థితిని పెనం మీంచి పొయ్యలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని పునరి్నర్మించుకోవడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ సమస్యలను అధిగమించాలంటే మూస పద్ధతిలో కాకుండా సరికొత్త విధానంలో మాత్రమే అభివృద్ధి సాధించగలమని ఆయన తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా బలంగా విశ్వసించారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ముఖ్యంగా సుపరిపాలనలో భాగంగా పాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు సీఎం జగన్ తీసుకెళ్లారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరిచారు. విస్తృతస్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించి సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారత అందించి రాష్ట్రాన్ని ‘సుపరిపాలిత ఆంధ్ర’గా తీర్చిదిద్దారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం ‘సుపరిపాలిత ఆంధ్ర’గా ఎలా రూపాంతరం చెందిందో స్పష్టంగా వివరించారు. పాలనా వికేంద్రీకరణ.. ప్రజలు సాధికారిత, వికేంద్రీకరణ, సుపరిపాలన అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం, సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతనందించింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేసింది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. అలాగే.. ► దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. వీటిల్లో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. తద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలకు తోడు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందిస్తోంది. ► అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచి పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా చేసింది. ► నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి. ► ఇక పౌరుల రక్షణ, భద్రతను పెంపొందించడానికి అవసరమైన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీసు సబ్–డివిజన్లు ఏర్పాటుచేసింది. ► ప్రతి జిల్లాలో దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడమే కాక రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీసుస్టేషన్లు ప్రారంభమయ్యాయి. ► భద్రతా మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజాభద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం.. ► ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుంచి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు. ► ఈ కార్యక్రమంలో భాగంగా 58,288 పనులను రూ.2,356 కోట్ల అంచనాతో మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.729 కోట్లతో 17,239 పనులు పూర్తయ్యాయి. ► రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాల్గవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి, ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటుచేసింది. వివక్షకు దూరంగా.. గత ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలను వివరిస్తూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమని వదిలేయకుండా కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించడంతోపాటు పౌరుల రక్షణ, భద్రత కోసం కొత్త పోలీసు సబ్ డివిజన్, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందనేందుకు ఇదే ఉదాహరణ అని చెప్పారు. సంక్షేమ ఫలాలను వివరిస్తూ కొందరు లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాన్ని బుగ్గన వీడియో ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయన్నారు. ► తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన వడ్డే రాజేశ్వరి పొదుపు సంఘాల రుణాల మాఫీ, పింఛన్, ఆసరా కింద లభించిన సాయంతో గొర్రెలను కొనుగోలు చేశారు. తనను కష్టాల నుంచి ఈ ప్రభుత్వం గట్టెక్కించిందని ఆమె సంతోషంగా చెబుతోంది. ► విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెంకు చెందిన పల్లా కృష్ణవేణి చేయూత కింద అందిన మొత్తంతో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మ ఒడి సాయం కూడా అందుతోంది. కుట్టు మిషన్ ఉంది. రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తున్నానని, కిరాణా దుకాణంతో తమ బతుకులు మారాయని సగర్వంగా చెబుతోంది. ► విశాఖపట్నం ఆరో వార్డు మధురవాడకు చెందిన వాండ్రాసి అన్నపూర్ణ తాము టీడీపీ మద్దతుదారులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇతర పథకాలనూ అందిస్తోందని ధన్యవాదాలు తెలియచేస్తోంది. ► నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన వృద్ధురాలు కవుజు బేబీ అనే మహిళకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్, ఇతర పథకాలను ఇంటి వద్దే అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం తనను ఎంతో ఆదుకుంటోందని కృతజ్ఞతలు తెలిపింది. ► విశాఖకు చెందిన రోబంకి చిరంజీవులు అనే వృద్ధ దంపతులకు వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా కాలికి ఆపరేషన్ నిర్వహించడంతోపాటు ఆసరా, పెన్షన్ అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం కన్న కొడుకులా ఆదుకుంటోందంటూ సంతోషంగా చెబుతున్నారు. ► ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపడంతో ఒంటరిగా ఉన్న తాను దేవాలయాల వద్ద యాచిస్తూ జీవనం సాగించానని, ఈ ప్రభుత్వం వచ్చాక రూ.3,000 పెన్షన్ ప్రతీ నెలా ఇస్తుండటంతో భిక్షాటన మానుకుని గౌరవంగా బతుకుతున్నానంటూ విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన బత్తిన అప్పమ్మ చెబుతోంది. -
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడుతున్న దృశ్యాలు
-
AP: కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి,తాడేపల్లి: సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024–25 ఆర్ధిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించడంతో పాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది. నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ హార్టీకల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది. దీంతో పాటు డోన్‌లో వ్యవసాయం రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజీ పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు కేబినెట్ అనుమతిచ్చింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి.. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : బుగ్గన -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పొడిగింపు.. అందుకేనా..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. ముందుగా ఈ నెల 9వ తేదీ శుక్రవారం వరకే సమావేశాలు జరుగుతాయని ప్రకటించినప్పటికీ తాజాగా శనివారం కూడా సెషన్ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రకటించారు. కాగా, యూపీఏ పదేళ్ల పాలనలో అస్తవ్యస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందన్న పుకార్ల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల పొడిగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. పదేళ్ల యూపీఏ పాలనలో అవలంబించిన అస్తవ్యస్థమైన ఆర్థిక విధానాలు, అవినీతి వల్ల దేశం చాలా విలువైన పదేళ్ల కాలాన్ని కోల్పోయిన వైనాన్ని మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ఎండగట్టనున్నట్లు సమాచారం. యూపీఏ పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత్ తీసుకొని ఉండాల్సిన చర్యలు కూడా శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యూపీఏ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇదీచదవండి.. ఇండియా కూటమికి నితీశ్ అంత్యక్రియలు చేశారు -
4న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. ఆదివారం జరగనున్న సమావేశంలో మరో రెండు గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: జన్మలో కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరు: సీఎం రేవంత్‌రెడ్డి -
బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 1న)వరుసగా ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు నిర్మలాసీతారామన్. అంతేగాదు వరుసగా ఐదు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోవడమేగాక ఈ ఏడాది ప్రవేశపెడుతున్న ఆరో బడ్జెట్‌తో సరికొత్త రికార్డుని నెలకొల్పబోతున్నారు కూడా. ఇక సీతమ్మ బడ్జెట్ అనంగానే గుర్తొచ్చేది ఆమె చీరలే. ప్రతి ఏటా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆమె ధరిస్తున్న చీరలదే ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఈసారి 2024 బడ్జెట్ సందర్భంగానూ ఆమె ప్రత్యేక రంగు చీరలో వచ్చారు కూడా. అయితే ఇంతవరకు ఆమె ప్రతి ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలాంటి చీరలు ధరించారు? వాటి విశేషాలేంటో చూద్దామా!. 2019లో.. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో ఆమె గులాబీ రంగు, బంగారు అంచు మంగళ గిరి చీరను ధరించారు. అలాగే ఆ ఏడాదే సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో బహీ ఖాతాను ప్రవేశపెట్టి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు ఆర్థిక మంత్రి. ఈ బహీ ఖాతా కోసం ఎరుపు రంగు సిల్క్ క్లాత్‌తో బడ్జెట్ పేపర్లను చుట్టారు. 2020లో 2020 బడ్జెట్ సమర్పణ కోసం నిర్మలా సీతారామన్ పసుపు రంగు సిల్క్ చీరతో పార్లమెంట్‌కు వచ్చారు. నీలం రంగు అంచుతో పసుపు- బంగారు రంగు చీరను ధరించారు. పసుపును సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చాలా మంది ప్రత్యేక రోజుల్లో ఈ రంగు చీరలను ధరిస్తుంటారు. 2021 బడ్జెట్లో.. 2021 బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చీరను కట్టుకున్నారు. ఎరుపు- హాఫ్ వైట్ సమ్మేళనం అయిన ఇక్కత్ సిల్క్ పోచంపల్లి చీరను ధరించారు. ఈ చీరకు పల్లు ఇక్కత్ పాటర్స్‌తో సన్నటి గ్రీన్ బార్డర్ ఉంటుంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీర తయారైంది. 2022 బడ్జెట్లో.. 2022 బడ్జెట్ సమర్పణ సందర్బంగా బ్రౌన్ కలర్ చీర ధరించి పార్లమెంట్ కు వచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒడిశాలో ఈ చీరలు తయారవుతాయి. రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ రంగు బార్డర్, సిర్వర్ కలర్ డిజైన్ ఉంది. బ్రౌన్ కలర్ రక్షణ, భద్రతలను సూచిస్తుంది. రెడ్ కలర్ పవర్‌ను సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉన్న చీరను ధరించి 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023లో.. 2023లో ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్.. ఎరుపు రంగు టెంపుల్ బార్డర్ చీర ధరించారు. దీని మీద ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. ఈ చీరలు ముఖ్యంగా కాటన్ లేదా సిల్క్‌లో మాత్రమే లభిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో మహిళలు వీటిని కట్టుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరోవైపు.. ఇదే ఏడాది బహీ ఖాతా స్థానంలో ఎరుపు రంగు డిజిటల్ టాబ్లెట్‌తో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 2024లో.. ఈ ఏడాది ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్లూ కలర్ కాంతా వర్క్ టస్సార్ చీరను ధరించారు. ఈ చీర పశ్చిమ బెంగాల్లో తయారైంది. ఇక ఈ నీలం రంగు నీలం మంచి ఆరోగ్యానికి ప్రతీక. పైగా ఇది రక్షణకు, అధికారం, విశ్వాసం,మేధస్సు, ఐక్యత, స్థిరత్వలను సూచిస్తుంది. ఇక ఆర్థిక మంత్రి సీతమ్మకు చేనేత చీరలంటే మహా ఇష్టం. జనవరి 26న, నార్త్ బ్లాక్‌లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె ఎక్కువగా సంబల్పురి, ఇకత్, కంజీవరం చీరలలో కనిపిస్తుంది. చాలా వరకు ఆమె నలుపు రంగుకు దూరంగా ఉంటారని సమాచారం. (చదవండి: నిర్మలమ్మ చీర ప్రత్యేకత ఇదే..) -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: సీతమ్మ సరికొత్త రికార్డులు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేస్తున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేయనున్నారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ వరుసగా ఆరవ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు. 2019 జూలై నుంచి వరుసగా ఐదు సంవత్సరాలు దేశానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అందించిన మహిళా ఆర్థికమంత్రి సీతారామన్. ఈ వారంలో ఆరవసారి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959–1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. వరుసగా ఐదు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్. గతంలో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్ సిన్హా ఐదుసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆరో బడ్జెట్‌తో కొత్త రికార్డు నెలకొల్పనున్న నిర్మలా సీతారామన్. -
మధ్యంతర బడ్జెట్ ఈ ఐదింటిపై ఆశలొద్దు !
కేంద్ర బడ్జెట్ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో ఆశ పడుతుంటారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. మధ్యంతర బడ్జెట్ అయినా సామాన్య ప్రజానీకం మొదలు కార్పొరేట్ వర్గాల దాకా అందరి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒక ఐదు అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వారు సెలవిస్తున్నారు. ఆ ఐదేంటో ఓసారి చూసేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ 1. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు త్వరలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఈ మధ్యంతర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలను కొత్త ప్రభుత్వం నెలవేరుస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల జోలికి వెళ్లకుండా ఇప్పటి పద్దుల సంగతే చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించదల్చుకోలేదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో కొత్త పథకాలు ఏమీ ఉండబోవని ఇప్పటికే విత్త మంత్రి నిర్మల సెలవివ్వడం గమనార్హం. ప్రస్తుత ఖర్చుల మీద మాత్రమే దృష్టిపెడతామని ఆమె ప్రకటించారు. 2. పన్ను మినహాయింపులు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాల్లో మాత్రమే పన్ను శ్లాబుల్లో మార్పుల వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వాలు ప్రకటించడం చూశాం. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పన్ను శ్రేణుల్లో సవరణలు ఆశించలేమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే పన్ను శ్లాబుల్లో మార్పులు రావాలంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరాక వచ్చే పూర్తి బడ్జెట్ దాకా వేచి ఉండక తప్పదు. 3. నూతన సంక్షేమ పథకాలు కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. కొత్త పథకాలను పట్టించుకోదనే వాదన ఉంది. నూతన సంక్షేమ పథక రచనకు విస్తృతస్తాయి సంప్రదింపులు జరగాలి. ఎన్డీఏ కూటమికి అంత వ్యవధిలేదని మూడోసారి గెలిచాక వాటి సంగతి చూసుకుందామనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఒక రాజకీయ విశ్లేషకుడు అంచనావేశారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించి అమలుచేయాలంటే అందుకు తగ్గ ఆర్థికవనరులనూ సమకూర్చుకోవాల్సిందే. అంటే పూర్తి బడ్జెట్ స్థాయిలో కేటాయింపులు జరగాలి. మధ్యంతర బడ్జెట్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అందుకే కొత్త సంక్షేమ పథకాల పాట బీజేపీ పాడదని మాట వినిపిస్తోంది. 4. ద్రవ్యలోటు కట్టడి చర్యలు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఆ పని చేయాలంటే సంబంధిత అన్ని శాఖలతో విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరం. అత్యంత కఠిన ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ద్రవ్యలోటు కట్టడి చర్యలకు దిగితే దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సార్వత్రిక ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టే సర్కార్ మళ్లీ ద్రవ్యలోటు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది. ద్రవ్యలోటు భారాన్ని దింపేందుకు మధ్యంతర బడ్జెట్ సరైన వేదిక కాదనే భావన ఉండొచ్చు. 5. నూతన ఆర్థిక విధానాలు చాలా నెలలుగా అమలవుతోన్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు తెస్తూ ప్రకటించే నూతన ఆర్థిక విధానాలు వ్యవస్థను ఒక్కసారిగా కుదుపునకు గురిచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా పూర్తిస్తాయి బడ్జెట్లోనే చేస్తారు. మధ్యంతర బడ్జెట్‌కు ఈ ఫార్ములా నప్పదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంబంధిత రంగాల సంస్థలతో చర్చోపచర్చల తర్వాతే మామూలుగా ఇలాంటి నూతన ఆర్థిక విధానాలను ప్రకటిస్తారు. నూతన ఆర్థిక విధానాలు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లు స్పందించడం సర్వసాధారణం. సానుకూలమో, ప్రతికూలమో, లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడమో.. ఇంకేదైనా జరగొచ్చు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల అమలుకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయినా కొన్ని అంచనాలు.. 1.పెట్రోల్, డీజిల్ ధరలను కిందకు దించుతారని ఆశలూ ఎక్కువయ్యాయి. అధిక పెట్రో ధరల కారణంగా ప్రభుత్వ చమురు రిటైల్ కంపెనీలు ఇటీవలికాలంలో అధిక లాభాలను కళ్లజూశాయి. ఈ లాభాలను పౌరులకు కాస్తంత మళ్లించే యోచన ఉందట. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 5–10వరకు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ప్రకటనలు బడ్జెట్ రోజు వెలువడొచ్చని భావిస్తున్నారు. 2. పట్టణవాసులు భారీ లబ్ది చేకూరేలా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీతో పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పథకం అమలుచేస్తే బాగుంటుందని మంత్రి గతంలో వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 3.దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకం పీఎం– కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని మరింత పెంచుతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. అందుకే పీఎం–కిసాన్ నగదు సాయాన్ని అధికం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలొచ్చాయి. ఈ ఆలోచన బడ్జెట్లో ఆచరణాత్మకం అవుతుందో లేదో చూడాలి. పీఎం కిసాన్ మొత్తాన్ని దాదాపు రూ.9,000కు పెంచే వీలుందని సమాచారం. 4. గత బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రిబేట్‌ను ఏకంగా రూ.7,00,000 పెంచడం వంటి చాలా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి అలాంటి కలలనే మధ్యతరగతి కుటుంబాలు కంటున్నాయి. ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం రూ. 50 వేలుగా ఉంది. కొత్త, పాత పన్ను విధానాల్లో ఈ డిడక్షన్‌ను రూ.1,00,000కు పెంచాలని మధ్యాదాయ వర్గాలు అభిలషిస్తున్నాయి.. 5. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు పెరగొచ్చని మరో అంచనా. వీరి సేవింగ్స్ ఖాతా వడ్డీపైనా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000కు పెంచుతారని ఆశిస్తున్నారు. 6. ఆదాయపు పన్ను చట్టంలో ముఖ్యమైనదైన సెక్షన్–80సీ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చందా చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని రూ. 3,00,000కు పెంచాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. -
కోరం లేకున్నా.. బడ్జెట్ ఆమోదమే!
సాక్షి, హైదరాబాద్: చాలా మునిసిపల్ పాలకమండళ్లకు పలువురు సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇవ్వడంతో బడ్జెట్ సమావేశాలకు కోరం కరువైంది. కోరం లేకున్నా మునిసిపల్ బడ్జెట్లు ఆమోదం పొందుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2023–24 వార్షిక బడ్జెట్ల ఆమోదానికి శుక్రవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను ఇప్పటికే మూడోవంతు పట్టణ పాలకమండళ్లు సమావేశాలు నిర్వహించి రాబోయే వార్షిక బడ్జెట్లకు ఆమోదం తెలిపాయి. అయితే ఈసారి పురపాలికల్లో అవిశ్వాసాల రగడ మొదలవడంతో చాలా మునిసిపాలిటీల్లో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మునిసిపల్ చట్టసవరణకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో మూడేళ్ల పదవీకాలం పూర్తయిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫిబ్రవరిలో అవిశ్వాసాల ప్రక్రియ సాగింది. ఇందులో భాగంగా జగిత్యాల మునిసిపల్ చైర్పర్సన్ ఏకంగా రాజీనామా కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు హుజూరాబాద్, వికారాబాద్, తాండూర్, యాదగిరిగుట్ట, ఆలేరు, చండూరు, జనగాం, దమ్మాయిగూడెం, జవహర్‌నగర్ కార్పొరేషన్, చౌటుప్పల్, నాగార్జునసాగర్, ఇబ్రహీంపట్నం తదితర 37 మున్సిపల్ పాలకమండళ్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అవిశ్వాస ప్రతిపాదనల గడువును మూడేళ్ల పదవీకాలం నుంచి నాలుగేళ్లకు పెంచిన సవరణ చట్టం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో మునిసిపల్ చైర్పర్సన్లే హైకోర్టును ఆశ్రయించి 29 చోట్ల స్టే తెచ్చుకున్నారు. మిగతా మునిసిపాలిటీలకు సంబంధించి కూడా ఎలాంటి పురోగతి లేదు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ముగియనున్న పాత ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కోరంతో సంబంధం లేకుండా ఆమోదం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మునిసిపల్ చైర్పర్సన్లు నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు సభ్యులు హాజరుకాని పరిస్థితి నెలకొంది. ఇటీవల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బడ్జెట్ సమావేశం నిర్వహించగా, కోరం లేక తొలిరోజు వాయిదా పడింది. మరుసటిరోజు కోరంతో సంబంధం లేకుండా సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించారు. అదే జిల్లాకు చెందిన కొత్తపల్లి మునిసిపాలిటీలో అవిశ్వాస నోటీసు ఇవ్వకపోయినా, సరిపడా సభ్యులు రాలేదు. అయినా కోరంతో సంబంధం లేకుండా మరుసటిరోజు బడ్జెట్‌ను ఆమోదించారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రల్లో భాగమే... : వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్ చాంబర్స్ చైర్మన్ రాష్టంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమే ‘అవిశ్వాసాలు’. నాలుగేళ్ల పదవీకాలం వరకు అవిశ్వాస తీర్మానానికి ఆస్కారం లేకుండా చేసిన సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదించకపోవడంతో ఈ గందరగోళం నెలకొంది. బడ్జెట్ ఆమోదానికి కోరంతో సంబంధం లేదు. తొలిరోజు కోరం లేకుండా వాయిదా పడితే, మరుసటి రోజు ఏకపక్షంగా ఆమోదించే అధికారం సభకు ఉంటుంది. -
AP Budget: రూ.41,436 కోట్లతో వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్
సాక్షి, అమరావతి: రూ.41,436 కోట్ల రూపాయలతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని కాకాణి అన్నారు. ‘‘రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్భీకే సేవలు అందిస్తున్నాయి. రైతులకు కావాల్సిన అన్ని సేవలను గ్రామస్థాయిలోనే అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 8,837 ఆర్బీకే భవనాలు వివిధ స్థాయిలో ఉన్నాయి. ఆర్మీకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నాం యూట్యూబ్ ఛానళ్లు, మాస పత్రికను ప్రారంభించాం’’ అని మంత్రి కాకాణి అన్నారు. ►155 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది ►రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.6940 కోట్లు అందించాం. ►రైతు భరోసా, కిసాన్ యోజన కింద రూ. 7,220 కోట్లు ►రైతులకు యూనివర్శల్ బీమా పథకం కల్పించిన ఏకైక రాష్ట్రం ఏపీ ►ఏపీ సీడ్స్‌కు జాతీయ స్థాయిలో అవార్డులు ►విత్తనాల రాయితీకి రూ.200 కోట్లు ►ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్ల విలువైన ఎరువులు సరఫరా ►ఆర్భీకేల్లో 50వేల టన్నుల ఎరువులను నిల్వ చేస్తున్నాం ►వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం ►పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల పర్యవేక్షణ ►మా ప్రభుత్వంలో రైతులు ఎక్కడా కరవు, కాటకాలను ఎదుర్కోలేదు ►వాటర్ గన్స్ అవసరమే రాలేదు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి ►రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేశాం ►9 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి చేకూరింది ►వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం ►3.50 లక్షల మంది సన్నకారు రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు ►డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారి చేసేలా చర్యలు ►ఆర్భీకేల ద్వారా 10 వేల డ్రోన్లను రైతులకు అందిస్తాం ►చిరుధాన్యాల సమగ్ర సాగు విధానం తీసుకొచ్చాం ►చిరుధాన్యాల సాగు హెక్టార్‌కు రూ.6వేల ప్రోత్సాహకం ►రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పథంలో ఉంది ►ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటున్నాం ►రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.6940 కోట్లు ►ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 1.61 లక్షల మంది రైతులకు లబ్ధి ►మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 513.74 కోట్లు ►సహకారశాఖకు సంబంధించి రూ. 233.71 కోట్లు ►సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి రూ.100 కోట్లు ►ఆహార పరిశ్రమల ప్రోత్సహకాలకు రూ.146.41 కోట్లు ►ఫుడ్ ప్రాసెసింగ్ కోసం రూ.286.41 కోట్లు ►ఆచార్య ఎన్జీరంగా వర్శిటీకి రూ.472.57 కోట్లు ►వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి రూ.102.04 కోట్లు ►ఆంధ్రప్రదేశ్ మత్స్య వర్శిటీకి రూ.27.45 కోట్లు ►వెంకటేశ్వర పశువైద్య వర్శిటీకి రూ.138.50 కోట్లు ►వైఎస్సార్ పశునష్టం పరిహారం కోసం రూ.150 కోట్లు ►పశువుల వ్యాధి నిరోధక టీకాలకు రూ.42.28 కోట్లు -
AP Budget: వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: వార్షిక బడ్జెట్లో ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమానికి వైఎస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే రోజులలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈవిషయంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుంచి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతో పాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, అవసరమైన పరికరాలు, శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 108 సేవలు, 104 సేవలు, కుటుంబ సంక్షేమం వంటి ప్రాధాన్యతా కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, ముఖ్యమైన పథకాల కింద బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా, ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకువెళ్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమయాలలో రోలుగు ప్రయాణించిల్సిన అవసరం లేకుండా, తదపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉందని ఈ కార్యక్రమం నిర్ధారిస్తుంది. సాధారణ ఓపీ, అంటు వ్యాధుల నిర్వహణ, ప్రసవానికి ముందు తర్వాత సంరక్షణకు, మంచాన ఉన్న రోగులకు ఇంటి వద్దకు వెళ్లి వైద్యులు సేవలు అందిస్తారు. ఈ వైద్యులు 104-ఎంఎంయూ వాహనాల ద్వారా 15 రోజులకు ఒకసారి డాక్టర్ వెఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను(విలేజ్ హెల్త్ క్లినిక్) సందర్శిస్తారు. ఈ ఆరోగ్య కేంద్రాలలో రోగులకు 14 రకాల లేబొరేటరీ పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికిపై ప్రజలు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు. దాదాపు 1.41 కోట్ల కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణ విధానాలకు 2,446 నుంచి 3,255కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలలో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందో విధంగా ఈ పథకాన్ని విస్తరిచండం జరిగింది. డాక్టర్ వైఎస్సార్ ఆఱోగ్య ఆసరా కింద శస్త్రచికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం సీఎం జగన్ ప్రభుత్వం నెలకు రూ.5,000 అందిస్తోంది జగనన్న గోరుముద్ద.. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా ప్రభుత్వం రోజువారీ వంటకాల జాబితా మెరుగుపరచడం ద్వారా 2020 నుంచి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాడనికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు అధికంగా ఖర్చు చేస్తోంది. ► మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.15,882 కోట్లు కేటాయించింది. -
ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట
సాక్షి, అమరావాతి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్ రూ. రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. బడ్జెట్లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి.. ► వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు ► వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు ► వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు ► జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు ► జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు ► వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు ► డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు ► రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు ► వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు ► జగనన్న చేదోడు రూ.35 0 కోట్లు ► వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు ► వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు ► వైఎస్సార్ మత్స్యకారు భరోసా రూ.125కోట్లు ► మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50కోట్లు ► రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు ► లా నేస్తం రూ.17 కోట్లు ► జగనన్న తోడు రూ.35 కోట్లు ► ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు ► వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు ► వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు ► వైఎస్సార్ చేయూత రూ.5, 000 కోట్లు ► అమ్మఒడి రూ.6,500 కోట్లు ► జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు -
చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
బెంగళూరు: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా ఇతర ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. బీజేపీ గత బడ్జెట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, 2018 మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీఎం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను 'కివిమెలెహూవ'గా అభివర్ణించారు. అంటే ప్రజలను ఫూల్స్ చేస్తోందని అర్థం. Congress MLAs in Karnataka attended budget session with flower on their ears as a mark of protest. They call it Kivi mele hoova protest. pic.twitter.com/Kx5kdIrbrQ — Nagarjun Dwarakanath (@nagarjund) February 17, 2023 సీఎం బొమ్మై ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఆరోపించడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వెనక్కితగ్గకుండా నిరసనలు కొనసాగించారు. సీఎం మాత్రం యథావిధిగా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగించారు. రామనగరలో రామ మందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తరచూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమలం పార్టీ గత ఎన్నికల్లో 600 హామీలు ఇస్తే వాటిలో 10 శాతం మాత్రమే అమలు చేసిందని ధ్వజమెత్తారు. చదవండి: అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్ -
బడ్జెట్లో సికిల్ సెల్‌పై ప్రస్తావన.. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి గురించి తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తాజాగా ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో సికిల్ సెల్ ఎనీమియాను సంపూర్ణంగా తుడిచిపెట్టేందుకు కార్యాచరణ ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం అవుతోంది. బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం అమలుకు నోచుకుంటే ఈ వ్యాధి మరో పాతికేళ్లలో కనుమరుగు కావడం తథ్యమని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటీ సికిల్ సెల్? మానవ శరీరంలోని రక్తంలో ఏర్పడే అపసవ్యతగా సికిల్‌సెల్‌ను పేర్కొంటున్నారు. ఇది వంశపారంపర్యంగా వచ్చేవ్యాధి. ఈ వ్యాధికి గురైనవాళ్లలో ఎర్రరక్త కణాలు ప్రత్యేకమైన సికిల్ (కొడవలి) రూపాన్ని సంతరించుకుంటాయి. అవి సాధారణంగా 125 రోజులు బతకాల్సి ఉండగా 25 రోజుల్లోపే చనిపోతాయి. న్యుమోనియా, తీవ్రమైన కీళ్లనొప్పులు, అవయవాల వాపులు, స్ట్రోక్... వంటివి వ్యాధి లక్షణాల్లో కొన్ని. సరైన చికిత్స చేయనట్లయితే శరీరంలోని పలు అవయవాలను ఇది దెబ్బతీస్తుంది. ఇటీవల జాతీయ ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియా బారిన పడుతున్నారు. సరైన అవగాహనలేక, గుర్తించడంలో ఆలస్యం వల్ల అనేకమంది బాధితులుగా మారుతున్నారు. వరంగల్, ఆదిలాబాద్, అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలవారు, ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన వెద్య చికిత్సల కోసం నగరానికి రాకపోకలు సాగించేవారు కూడా ఎక్కువే. మంచి నిర్ణయం.. వచ్చే 2047కల్లా సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం మంచి నిర్ణయం. దీనిలో భాగంగా ఈ వ్యాధికి అత్యధికంగా గురయ్యే ఆదివాసీ ప్రాంతాల్లో 0–40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 7 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం వ్యాధి నిర్మూలనకు దోహదపడుతుంది. గత కొన్నేళ్లుగా బాధితులకు స్వచ్ఛంద సేవలు అందిస్తున్న మా సొసైటీ ఈ మిషన్ అమలులో ప్రభుత్వానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. – చంద్రకాంత్ అగర్వాల్, అధ్యక్షుడు, తలçమియా సికిల్‌సెల్ సొసైటీ. మేనరికపు వివాహాలు కూడా కారణమే తండాలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించడానికి మేనరిక వివాహాలు, దగ్గర బంధువుల్లో వివాహాలు కూడా కారణమే. ప్రణాళికాబద్ధంగా పరీక్షల నిర్వహణ, అవగాహన పెంచడం, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం ఆయా ప్రాంతాల్లో వ్యాధి నిర్మూలనకు దోహదపడతాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసిందని భావిస్తున్నాం. – డాక్టర్ కె.సి గౌతమ్‌రెడ్డి, కన్సల్టెంట్ అంకాలజిస్ట్ అమోర్ అసుపత్రి. -
ఇల్లు కొనాలనుకుంటున్నారా? ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేసుకోండి!
ఆర్థిక మంత్రిగారు హల్వా తయారు చేశారు. ఇది గంట పని. బడ్జెట్ కసరత్తు మాత్రం ఫిబ్రవరి 1 నాడు ఉదయం వరకు జరుగుతూనే ఉంటుంది. మార్పులు, చేర్పులు, కూర్పులు .. రాబోయే బడ్జెట్ ఎలా ఉండాలో అన్న విషయంపై ఎన్నో ఆశలు .. ఆలోచనలు .. ఏది ఎలా ఉన్నా .. కింద చెప్పిన ట్యాక్స్ ప్లానింగ్‌లో పదనిసలు మీకు ఎప్పుడు శ్రీరామరక్ష (సీతమ్మ వరాలతో నిమిత్తం లేకుండా). ►ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి మీ కుటుంబసభ్యులు మీకు అప్పుగా మొత్తం ఇవ్వొచ్చు. మీరు తీసుకోవచ్చు. వారికి సోర్స్ ఉండాలి. నిజంగా వ్యవహారం జరగాలి. వారు ట్యాక్సబుల్ బ్రాకెట్లో లేకపోతే మరీ మంచిది. ఉదా: స్త్రీ ధనం .. వారి సేవింగ్స్ లాంటివి. ►వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్న రోజుల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు మెడిక్లెయిం పాలసీ మంచిది. ►సీనియర్ సిటిజన్లకు ఎన్నో ఆకర్షణీయమైన, అనువైన ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ►చదువుల కోసం అప్పు తీసుకుంటే ఆ అప్పు మీద వడ్డీకి ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేవు. అలా అని అప్పులకు పోకండి. మీకు ఇబ్బంది లేనంతవరకు మాత్రమే వెళ్లండి. ►దగ్గర బంధువుల నుంచి వచ్చే గిఫ్ట్‌లకు పన్ను భారంలేదు. లేని పాత్రను సృష్టించకండి. మనిషి ఉండాలి. కెపాసిటీ ఉండాలి. సోర్స్ ఉండాలి. వ్యవహారం జరిగి ఉండాలి. ►బంధువులు కాని వారి నుండి కేవలం రూ. 50,000 వరకు గిఫ్టులకు మినహాయింపు ఉంటుంది. రూ. 50,000 దాటితే పుచ్చుకున్న వ్యక్తికి అది ఆదాయం అవుతుంది. ►ఇవే రూల్సు స్థిరాస్తులకు కూడా వర్తిస్తాయి. రూ.50,000కు ఏ స్థిరాస్తీ రాదు. కానీ పల్లెటూళ్లలో బహుశా అంత తక్కువకు స్థిరాస్తివిలువ ఉంటే ప్రయత్నం చేయండి. ►ఇదే విధంగా షేర్లు, సెక్యూరిటీలు, బంగారం,ఆభరణాలు, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, కళాత్మకమైన వస్తువులు మొదలైన విషయాల్లోనూ పాటించండి. (6), (7), (8)ల్లో పేర్కొన్న వాటికి సంబంధించి.. దగ్గర బంధువులు అంటే .. ‘‘నిర్వచనం’’ప్రకారం ఉండాలి. ►వయస్సు పెద్దదవుతున్నప్పుడు‘‘వీలునామా’’రాస్తే మంచిది. వీలునామా ద్వారా ఆస్తులకు ఎటువంటి పన్నుభారం ఉండదు. వీలునామా మామూలు కాగితం మీద, స్పష్టంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా, అనుమానాలకు తావు ఇవ్వకుండా రాస్తే చాలు. వ్యవహారం సులువుగా జరిగిపోతుంది. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6 నుంచి తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. ఇదీ చదవండి: ఒడిశాలో మిస్టరీ మరణాల కలకలం.. మరో రష్యా పౌరుడు మృతి -
ఏపీ వార్షిక బడ్జెట్. కేటాయింపులు ఇవే..
-
ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు
Parliament Budget Session: బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ఈనెల 14వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడత మాదిరిగానే ఈసారి కూడా రాజ్యసభ, లోక్‌సభలు సమావేశాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన సీటింగ్, ఇతర ఏర్పాట్లపై మంగళవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమై చర్చించారు. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, లోక్‌సభ సాయం త్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఉభయ సభల సెక్రటరీ జనరళ్లు సమావేశమై దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గినందున తీసుకోవాల్సిన చర్యల ను చర్చించారు. బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో మాదిరిగానే చాంబర్లు, గ్యాలరీల్లో సభ్యులకు స్థానం కల్పించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఉభయ సభల సంయుక్త సమావేశంతో జనవరి 31న మొదలైన విషయం తెలిసిందే. (చదవండి: ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు) -
బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే సభలో హైడ్రామా చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హింసను ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. హింసకు సంబంధించిన పోస్టర్లు, ఫోటోలను బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ప్రదర్శించారు. వెల్‌లో బైఠాయించారు. శాంతించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని గవర్నర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రసంగాన్ని విరమించి, బయటకు వెళ్లిపోయేందుకు గవర్నర్ సన్నద్ధం కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకున్నారు. బయటకు వెళ్లొద్దంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా నిరసన ఆపాలని గవర్నర్ కోరినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. మళ్లీ గవర్నర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, తృణమూల్ ఎమ్మెల్యేలు ఆయనను వారించారు. చేసేది లేక నినాదాల హోరు కొనసాగుతుండగానే గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యుల తీరు పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా ఉందన్నారు. బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్నదే వారి కుట్ర అని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండపై మాత్రమే తాము నిరసన తెలిపామని, సభను అడ్డుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి చెప్పారు. (చదవండి: గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?)