
700 కోట్ల కుంభకోణంపై త్వరలో విచారణ
ఏడు వందల కోట్ల రూపాయల స్పీక్ ఏషియా ఆన్ లైన్ కుంభకోణంపై త్వరలో విచారణ ప్రారంభిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన భారీ మోసాలకు పాల్పడే వారిని విచారించే కార్యాలయం (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫిస్-ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తును ఇప్పటికే పూర్తి చేసిందని చెప్పారు. సింగపూర్కు చెందిన ఈ సంస్థపై విచారణకు సంబంధించిన కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామన్నారు. ఈ కుంభకోణం 2011లో వెలుగులోకి వచ్చింది.