prosecution
-
కేజ్రీవాల్‌కు షాక్..! లిక్కర్ కేసుపై ఎల్జీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత,ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది.లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకుగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనుమతిచ్చినట్లు సమాచారం. దీంతో లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ప్రత్యేక కోర్టు విచారణకు ఇక లైన్ క్లియరవనుంది. సీఆర్పీసీ ప్రకారం పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా కావాలి అయితే ఈడీ కేసుల్లో మాత్రం ఈ అనుమతి గతంలో అవసరం లేదు. తాజాగా నవంబర్ 6వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈడీ కేసుల్లో కూడా పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది. దీంతో ఈడీ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి కోరింది.కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. బయటికి వచ్చిన తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలుండడంతో ప్రస్తుతం ఆయన వాటిపైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎన్నికల కోసం ఆప్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. -
కేజ్రీవాల్ విచారణకు సీబీఐకి అనుమతి
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవినీతి కేసులోప్రాసిక్యూట్ చేసేందుకు తమకు అనుమతి లభించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సంస్థ వెల్లడించింది. లిక్కర్‌స్కామ్ అవినీతి కేసులో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌నూ విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. తమకు అనుమతి లభించిన విషయాన్ని సీబీఐ తాజాగా రౌస్ ఎవెన్యూకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌పై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఆగస్టు 27న కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. ఛార్జ్‌షీట్ అనంతరం కేసు విచారణ ముందుకు సాగాలంటే కేజ్రీవాల్ విచారణకు పరిపాలన పరమైన అనుమతి తప్పనిసరి. దీంతో సీబీఐ ఈ మేరకు అనుమతులు తెచ్చుకుంది. మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. -
ఏబీ వెంకటేశ్వర్రావుకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీ పదవిలో ఉన్నపుడు పాల్పడిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతిచ్చింది.దీంతో త్వరలో అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ ప్రారంభం కానుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీప్‌గా పనిచేస్తున్నప్పుడు సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ ఏబీపై అవినీతి కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరైంది. ఇప్పుడు అనుమతి రావడంతో విచారణకు లైన్ క్లియరైంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రాసిక్యూషన్‌కు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ పేరుతో పవర్ మిస్ యూజ్ చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రణీత్ రావును డీజీపీ ఇప్పటికే సస్పెండ్ చేశారు. కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావుపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం మారటంతో ట్యాపింగ్ రికార్డ్స్ ధ్వంసం చేసిన ప్రణీత్ రావు.. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశాడు. 42 హార్డ్ డిస్క్‌ల్లో డేటాను రిమూవ్ చేశారు. ఎస్ఐబీ ఆఫీస్‌లోని లాగర్ రూమ్‌లో ఉన్న లాప్టాప్, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు. ఫోన్ టాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎమ్ఈఐ నంబర్ల వివరాల సైతం ధ్వంసం చేశాడు. డేటా బేస్ లో ఉన్న మొత్తం డేటాను ప్రణిత్ రిమూవ్ చేశాడు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశాడనే దర్యాప్తు చేపట్టారు. అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్ రావుకు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
బ్యాలెట్‌పై ‘ఎక్స్’ మార్కు ఎందుకేశారు?
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్‌ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్‌గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. నిజాయతీగా సమాధానమివ్వండి సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్‌ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు. అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్‌ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే..? జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్‌కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. -
US Elections: ట్రంప్ పోరాటం వాటితోనే !
వాషింగ్టన్: కొత్త ఏడాదిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోవాలని భావిస్తున్న దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికలకు కేసులు ప్రతిబంధకం కాకుండా ఎంత ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ ట్రంప్ స్పీడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రాసిక్యూషన్ కూడా అంతే గట్టిగా కేసులు వాదిస్తోంది. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించిన కేసుకు సంబంధించి తాజాగా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు చేసింది. ట్రంప్‌కు క్రిమినల్ కేసుల నుంచి ఎలాంటి ప్రత్యేక రక్షణ ఉండదని కోర్టుకు తెలిపింది. తాను అధ్యకక్షుడిగా ఉన్నపుడు పాల్పడిన చర్యలకు క్రిమినల్ చట్టాలు వర్తించవని ట్రంప్ బలంగా వాదిస్తున్నారు. ట్రంప్ చేసిన ఈ వాదనను కొలంబియా కోర్టు ఇప్పటికే తోసిపుచ్చడంతో ఆయన అప్పీల్‌కు వెళ్లారు. ఈ కేసులో జనవరి 9న కొలంబియా సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇరుపక్షాల వాదనలు విననుంది. ఒకవేళ ట్రంప్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరిస్తే ఈ కేసులో మార్చి నుంచి ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభిస్తుంది. అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోవాలనుకుంటున్న ట్రంప్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. 2024 నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా జనవరి 15 నుంచి ప్రైమరీలు ప్రారంభం కానున్నాయి. ఇదీచదవండి..పుతిన్‌ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్ -
రూ.5 కోట్ల పైగా జీఎస్టీ ఎగవేస్తే ఇక తీవ్ర నేరమే!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కి సంబంధించి రూ.5 కోట్లకుపైగా ఎగవేత, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగం అంశాలను తీవ్ర నేరంగా పరిగణించడం జరుగుతుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయా ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభిస్తే ప్రాసిక్యూషన్ చర్యలు ఉంటాయని ఉద్ఘాటించింది. కాగా, ఎప్పుడూ ఎగవేతలకు పాల్పడే వారు లేదా ఆయా కేసులకు సంబంధించి అప్పటికే అరెస్ట్ అయిన సందర్భాల్లో ప్రాసిక్యూషన్‌కు తాజా నోటిఫికేషన్‌తో సంబంధం లేదని ఫైనాన్స్ శాఖ జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ విభాగం స్పష్టం చేసింది. -
Russia-Ukraine war: యుద్ధ నేరాలపై రష్యా సైనికుడి విచారణ
కీవ్/ఐక్యరాజ్యసమితి: రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మొదటినుంచీ ఆరోపిస్తున్న ఉక్రెయిన్, తొలిసారిగా ఆ అభియోగాల కింద రష్యా సైనికునిపై విచారణకు శుక్రవారం తెర తీసింది. చుపాకివ్‌కా గ్రామంలో 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపిన కేసులో అరెస్టయిన రష్యా జవాను సార్జెంట్ వాదిమ్ షైషిమారిన్(21)ను కీవ్‌లోని కోర్టుకు తరలించి విచారించారు. షైషిమారిన్ అంగీకరించాడని అధికారులు చెప్పారు. అతనికి యావజ్జీవ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘బాలల’ సంక్షోభమే: ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ముమ్మాటికీ బాలల హక్కుల సంక్షోభమేనని ‘యునిసెఫ్’ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒమర్ అబ్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, నాటో కూటమిలో చేరొద్దని ఫిన్లాండ్ను రష్యా హెచ్చరించింది. లేదంటే సైనిక, సాంకేతిక చర్యలు తప్పవని హెచ్చరించింది. భారత ఎంబసీ పునఃప్రారంభం కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కార్యకలాపాలు ఈ నెల 17 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో మానవ హక్కుల పరిస్థితి నానాటికీ దిగజారుతుండడంపై ఐరాస మానవ హక్కుల మండలిలో చేసిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. రష్యా సైన్యానికి చేదు అనుభవం తూర్పు ఉక్రెయిన్‌లోని సివెర్‌స్కీ డొనెట్స్ నదిని దాటుతున్న రష్యా దళాలపై ఉక్రెయిన్ సైన్యం విరుచుకుపడినట్లు బ్రిటిష్ అధికారులు శుక్రవారం తెలిపారు. పదుల సంఖ్యలో రష్యా సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయని, జవాన్లు హతమయ్యారని వెల్లడించారు. ఆయుధాల కొనుగోలు కోసం ఉక్రెయిన్‌కు అదనంగా 520 మిలియన్ డాలర్ల సాయం అందించేందుకు యూరోపియన్ యూనియన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. జి–7 దేశాల దౌత్యవేత్తలు జర్మనీలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై చర్చించారు. -
బాలికపై లైంగిక దాడి ... ఆపై వ్యభిచార వృత్తిలోకి దింపి...
Two women who lured A Girl Into Prostitution: ఓ బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలో దింపిన ఇద్దరు మహిళలను బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ డివిజన్ ఏసీపీ భిక్షం రెడ్డి, బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ వివరాలు వెల్లడించారు... కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటోంది. నవంబర్ 20న సోదరితో గొడవ పడిన మైనర్ బాలిక అర్థరాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి రాజేంద్రనగర్‌లోని ఇన్నర్ రింగ్ రోడ్డుకు చేరుకుంది. ఫిష్ బిల్డింగ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వెంబడించారు. దీంతో అదే ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవర్లు సమీర్, హఫీజ్ ఆమెను తమ ఆటోలో ఉప్పర్‌పల్లికి తీసుకెళ్లారు. బుస్రా సుల్తానా, ఆయేషా బేగం అనే మహిళలకు బాలికకు పరిచయం చేసి, ఇక్కడే ఉంటుందని తెలిపారు. అనంతరం డిసెంబర్ 26న బాలికను మైలార్‌దేవ్‌పల్లిలోని అలీనగర్ హ్యాపీ హోమ్స్‌కు మార్చారు. అదే రోజు సమీర్, హఫీజ్ బాలికకు మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. ఇందుకు బుస్రా సుల్తానా, ఆయేషా బేగం వారికి సహకరించారు. అనంతరం బాలికను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపి బయటి నుంచి విటులను రప్పించారు. వీరి చెర నుంచి బయట పడేందుకు ప్రయత్నించిన బాధితురాలు ఆయేషా బేగం సెల్‌ఫోన్ ద్వారా తన అత్త ఇన్‌స్ట్రాగామ్‌కు తాను ఉంటున్న లోకేషన్ షేర్ చేసింది. బాలిక మిస్సింగ్‌పై డిసెంబర్ 1న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు పంపించిన లోకేషన్‌ను డిసెంబర్ 31న బహదూర్‌పురా పోలీసులకు అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. ఉప్పర్‌పల్లికి చెందిన బుస్రా సుల్తానా, ఆయేషా బేగంలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు సమీర్, హఫీజ్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఏసీపీ తెలిపారు -
ఎన్నికల కేసులు వీగిపోకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులపై వివిధ జిల్లా కోర్టుల్లో ఉన్న కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయటానికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేసులు వీగిపోకుండా ప్రాసిక్యూషన్ తగిన శ్రద్ధ వహించాలని సుపరిపాలన వేదిక (ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. మొత్తం 507 కేసులు నమో దు అయ్యాయని ఆయా కేసులను నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని తెలిపారు. అన్ని కేసులు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ కాకపోవడంతో ప్రాసిక్యూషన్ వారి అలసత్వం తో అనేక కేసులు వీగిపోతున్నాయన్నారు. దీంతో శిక్ష పడిన కేసుల్లో స్టేలు రావడం వంటి వాటితో ప్రజలకు పోలీసుశాఖ, న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని విమర్శించారు. చదవండి: రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్ -
ఆ ఇరువురు డైరెక్టర్లను నియమించండి!
న్యూఢిల్లీ: ఎంక్వైరీ అండ్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్లను త్వరగా నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని లోక్‌పాల్ కోరింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ పంపినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు లోక్‌పాల్ బదులిచ్చింది. ప్రభుత్వధికారుల అవినీతిపై ఫిర్యా దులను పరిశీలించడం, ప్రాసిక్యూషన్ ప్రక్రియ జరపడమనే రెండు ప్రధాన విధులను ఈ ఇరువురు డైరెక్టర్లు నిర్వహిస్తారు. 2019 మార్చిలో లోక్‌పాల్‌కు ఛైర్పర్సన్ను, సభ్యులను నియమించారు. అయితే ఎంక్వైరీ డైరక్టర్, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ల నియామకం జరగలేదు. దీనిపై అజయ్ దూబే అనే యాక్టివిస్టు ఆర్టీఐ కింద లోక్‌పాల్‌ను ప్రశ్నించారు. లోక్‌పాల్ అండ్ లోకాయుక్త చట్టం కింద వీరివురి నియామకం జరపాల్సిఉందని, కేంద్రం పంపిన పేర్ల నుంచి ఇద్దరిని లోక్‌పాల్ చైర్పర్సన్ ఎంపిక చేయాల్సి ఉందని అజయ్ చెప్పారు. చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్.. మార్కెట్ విలువ రూ.126 కోట్లు -
రేప్ కేసుల విచారణ 2నెలల్లో..
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో చట్ట ప్రకారం రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేసి, చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దారుణాలు, హాథ్రస్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఈమేరకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి మరణ వాంగ్మూలం రికార్డు చేయలేదన్న నెపంతో, మరణవాంగ్మూలాన్ని విస్మరించరాదని కేంద్రం తన మార్గదర్శకాల్లో తేల్చి చెప్పింది. సీఆర్పీసీ ప్రకారం నేరం జరిగిన వెంటనే తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగదని, కనుక పోలీసులు నేరం జరిగినట్టు ఫిర్యాదు అందిన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. ఒకవేళ నేరం జరిగిన ప్రాంతం సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోనికి రాకపోయినప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. పోలీసులకు చట్టాలను గురించి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వాటిని విచారించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 173 అత్యాచారం కేసుల్లో విచారణ రెండు నెలల్లో ముగించాలని చెపుతోందని, సీఆర్పీసీ సెక్షన్ 164–ఎ ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలిని ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు గుర్తింపు కలిగిన వైద్యులచే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హోం శాఖ తెలిపింది. సాక్ష్యాల చట్టం–1872 ప్రకారం, చనిపోయిన వ్యక్తి మరణానికి ముందు రాతపూర్వకంగా గానీ, నోటి మాట ద్వారాగానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని నిజమని నమ్మితీరాలని, విచారణలో అది తొలిసాక్ష్యమని చెపుతోంది. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ (ఎస్ఏఈసీ) కిట్లను వాడేందుకు పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, వైద్య సిబ్బందికి శిక్షణనిస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. విచారణను ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలంది. పదే పదే అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయిలోని డేటాబేస్‌ని వాడుకోవాలని తెలిపింది. అత్యాచార నేరాలను విచారించేందుకు కేంద్రం, కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధిలో చార్జ్‌షీట్ దాఖలయ్యేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
లెక్క పెట్టించాల్సినోడు లెక్క పెడుతున్నాడు.
కరీంనగర్‌లీగల్: మేకల విక్రయదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై మర్రిపల్లి రమేష్, కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, మరో కానిస్టేబుల్ కోడూరి కనకశ్రీనివాస్కు ఆర్నెళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు మంగళవారం తీర్పునిచ్చారు. పీ.పీ వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన జక్కుల సారయ్య, లంక అంజయ్య, మరికొంత మంది మేకల వ్యాపారం నిర్వహిస్తున్నారు. మేకలను మహేంద్ర, టాటాఏస్ వాహనాల్లో కరీంనగర్, గంగాధర, హుస్నాబాద్ తదిరత ప్రాంతాల్లోని అంగడిబజార్లకు తరలించి విక్రయించేవారు. 2011 మార్చి 26న చొప్పదండి అంగడికి మేకలను తరలించారు. సదరు వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఎస్సై మర్రిపల్లి రమేష్ జరిమానా విధించాడు. దీంతో సారయ్య, తదితరులు మరునాడు ఎస్సైని కలిశారు. ఏడాది వరకు రూ.40వేలు మాముళ్లుగా ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేమని చెప్పిన బాధితులు పదిహేను రోజులకు మళ్లీ ఎస్సైని కలిశారు. రూ.15 ఇవ్వాలని ఎస్సై ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఎస్సై వద్దకు వెళ్లేందుకు గన్‌మెన్ ఎల్లయ్యగౌడ్ రూ.1000 డిమాండ్ చేశాడు.దీంతో సారయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 2011 ఏప్రిల్ 15న సారయ్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. రూ.15వేలు ఎస్సైకి ఇవ్వబోతుం డగా రైటర్ శ్రీనివాస్‌కు ఇవ్వమని చెప్పాడు. రైటర్ రూ.15వేలు తీసుకున్నాడు. బయటకు రాగానే గన్‌మెన్ ఎల్లయ్యగౌడ్ రూ.1000 తీసుకున్నాడు. దీంతో ముందస్తు పథకం ప్రకారం వేచి ఉన్న ఏసీబీ అధికారులు స్టేషన్‌లోనికి వెళ్లారు. లంచం డబ్బులు స్వాధీనం చేసుకుని ఎస్సై, గన్‌మెన్, రైటర్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచగా వాగ్మూలంను నమోదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్‌రావు మంగళవారం ఎస్సై మర్రిపల్లి రమేష్(40), కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్ (40)లకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా, కోడూరి కనక శ్రీనివాస్(47)కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున 20మంది సాక్షులను ప్రవేశపెట్టగా 13మంది కేసుకు వ్యతిరేకంగా, నిందితులకు అనుకూలంగా సాక్ష్యం ఇవ్వడంతో వీరిపై కేసు ఎందుకు నమోదు చేయరాదో డిసెంబర్ 20వ తేదీ వరకు సంజాయిషీని ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇందులో ఫిర్యాదుదారుడు జక్కు సారయ్య, లంక అంజయ్య, ట్రాప్ జరిగినపుడు హాజరైన సాక్ష్యులు డాక్టర్ గుర్రం శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ పూదరి నరేష్, ఏఎస్సై ముచ్చె మధుసూధన్‌రెడ్డితోపాటు మెరుగు జానయ్య, కానిస్టేబుల్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, పులి అంజయ్య, రంగు శ్రీనివాస్, తొర్తి కొమురయ్య, సాగాల రాజయ్య, జెట్టి ప్రభాకర్, బి. మల్లేశంకు నోటీసులు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం ఎస్సై రమేష్ కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌లో, కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్ గంగాధర పోలీస్‌స్టేషన్‌లో, కోడూరి కనక శ్రీనివాస్ ముస్తాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. -
సారీ చెప్పినా.. విచారణ ఎదుర్కోవాల్సిందేనా
దుబాయ్ : క్షణకాలంలో తీసుకునే నిర్ణయాలకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దుబాయ్‌లోని ప్రముఖ జేడబ్ల్యూ మారియట్ మార్కిస్ హోటల్లో చీఫ్ చెఫ్‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన అతుల్ కొచ్చర్ ఇప్పడు అదే పరిస్థతిని ఎదుర్కొంటున్నాడు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో ఓ ట్వీట్ పెద్ద దుమారమే లేపింది. ప్రియాంక చోప్రా క్వాంటికో సీరియల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్ చేసిన అతడు విమర్శల పాలయ్యాడు. తన తప్పును గ్రహించి క్షమాపణలు చెప్పినప్పటికి.. లాభం లేకుండా పోయింది. హోటల్ యాజమాన్యం కూడా ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపింది. అతుల్ ట్వీట్‌పై మండిపడిన కొందరు అతన్ని కాల్చిపడేస్తామని కూడా హెచ్చరించారు. వీటన్నింటిపై అతుల్ సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని.. తాను పనిచేసే చోట చాలా సంస్కృతుల వారు ఉంటారని.. ఏదో క్షణికావేశంలో ఆ పోస్ట్ పెట్టానని.. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణల కోరుతున్నానని ట్వీట్ చేశాడు. కాగా స్థానిక మీడియా మాత్రం అతుల్ క్షమాపణలు చెప్పినప్పటికి విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. అన్లైన్ దూషణలకు పాల్పడిన, ముఖ్యంగా ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసిన దాని తీవ్ర నేరంగా పరిగణిస్తారని.. చట్ట ప్రకారం అతుల్‌కు పదిలక్షల దినార్ల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. -
బాలకృష్ణపై ప్రాసిక్యూషన్ నిలిపివేత
నరసరావుపేట: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై 2009లో నరసరావుపేటలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌ను నిలిపేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోడెల శివప్రసాదరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు బాలకృష్ణ నరసరావుపేటకు వచ్చారు. ఆ సమయంలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అయినప్పటికీ దానికి విరుద్ధంగా ర్యాలీ, సభ, సమావేశం నిర్వహించినందుకు గాను బాలకృష్ణతోపాటు ప్రస్తుత స్పీకర్ కోడెల, గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, కోడెల తనయుడు శివరామకృష్ణ, మరో 15మందిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో వీరిపై ప్రాసిక్యూషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలమేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.ఆర్.అనూరాధ జీవో నంబరు 122ను జారీచేశారు. -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదో..ఇక అంతే
పన్ను ఎగవేతదారులపై కొరడా ఝుళిపించిన ఆదాయపు పన్ను శాఖ, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారిపై కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నాన్-ఫైలర్స్ పై అధికమొత్తంలో జరిమానా, విచారణలకైనా వెనుకాడవద్దని ఆఫీసర్లకు ఆదాయపు పన్ను విభాగం ఆదేశించింది. సెక్షన్ 271ఎఫ్ కింద పెనాల్టీ, 276సీసీ కింద ప్రాసిక్యూషన్ ను అమలు చేయబోతున్నట్టు వెల్లడించింది. ఆస్తిపాస్తులను నమోదుచేయని నాన్-ఫైలర్స్ ఎక్కువగా పెరిగిపోతుండటంతో ఆదాయపు పన్ను విభాగం ఈ చర్యలకు ఉపక్రమించింది. 2014లో 22.09లక్షలుగా ఉన్న నాన్-ఫైలర్స్, 2015లో 58.95లక్షలకు పెరిగారని గణాంకాల్లో తెలిసింది. తాజా పన్ను అధికారుల కాన్ఫరెన్స్ లో ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆస్తిపాస్తుల వివరాలు తెలపని వారి కోసం నాన్-ఫైలర్స్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎమ్‌ఎస్)ను అమలు చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా నాన్ ఫైలర్స్ గుర్తించవచ్చని తెలిపింది. 271సీసీ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు ఫైన్ విధించే అవకాశముంది. అలాగే 271ఎఫ్ కింద పెనాల్టీగా రూ.1000 నుంచి రూ.5000గా విధించనుంది. దీనికి సంబంధించి మరిన్ని మార్గదర్శకాలను ఐటీ శాఖ విడుదల చేసింది. -
అక్బరుద్దీన్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
హైదరాబాద్: ఎంఐఎం శాసనపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. 2013 ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బహిరంగసభలో అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. -
'ఆ హీరోకు ఐదేళ్లు జైలుశిక్ష వేయడం కరెక్టే'
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు సెషన్స్ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించడం సబబేనని, అతను నేరం చేసినట్టు నిరూపితమైందని బాంబే హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే వాదించినట్టు సమాచారం. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. నిందితుడు సల్మాన్ ఖాన్‌పై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని, కింది కోర్టు విధించిన శిక్షను అమలు చేయాలని సందీప్ షిండే హైకోర్టును కోరారు. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌ను దోషిగా పేర్కొన్న ముంబై సెషన్స్ కోర్టు అతడి ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేయగా.. బాంబే హైకోర్టు ఆ తీర్పును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం బాంబే హైకోర్టులో సాగుతోంది. కింది కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సల్మాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఏ ఆర్ జోషి విచారిస్తున్నారు. కోర్టులో సందీప్ షిండే, ప్రాసిక్యూటర్ పూర్ణిమా కంథారియా తమ వాదనలు వినిపిస్తూ.. 'ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ మద్యం సేవించాడు. ఆ మరుసటి రోజు వైద్య పరీక్షల కోసం అతడిని ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు మద్యం తాగినట్టు వాసన వచ్చింది' అని కోర్టుకు తెలియజేసినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్ వాహనాన్ని నడుపుతున్నాడని, టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిందన్న సల్మాన్ తరపు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చారు. ప్రమాద స్థలంలో సల్మాన్ ఉన్నాడని సందీప్ షిండే, పూర్ణిమా కంథారియా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. -
'ఆ 8 మందికి ఉరిశిక్ష వేయండి'
-
ముందుగా వెల్లడిస్తే ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ
నల్లధనంపై ప్రభుత్వం ఆఫర్ న్యూఢిల్లీ: ప్రత్యేక పథకాన్ని ఉపయోగించుకుని విదేశీ అక్రమ ఆస్తులను ముందస్తుగా వెల్లడించిన వారికి ఫెమా సహా ఐదు చట్టాల కింద ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ లభించగలదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇలాంటి వారికి అదాయ పన్ను చట్టం, సంపద చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం, కంపెనీల చట్టం, కస్టమ్స్ చట్టం కింద ప్రాసిక్యూషన్ ఉండదని పేర్కొంది. అయితే, ఈ ఐదు మినహా.. ఇతరత్రా చట్టాలేమైనా వర్తించే పక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అవినీతి ద్వారా సొమ్ము కూడబెట్టిన వారికి, జూన్ 30కి ముందుగానే నోటీసులు అందుకున్న వారికి మినహాయింపులు వర్తించబోవని పేర్కొంది. నల్లధన కుబేరులు విదేశీ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఉద్దేశించిన వన్ టైమ్ కాంప్లియన్స్ విండో సదుపాయంపై సందేహాలను నివృత్తి చేసే దిశగా కేంద్రం ఈ విషయాలు తెలిపింది. విదేశాల్లో అక్రమంగా కలిగి ఉన్న బ్యాంకు ఖాతా విలువను.. అది ప్రారంభించినప్పటి నుంచి జమ అవుతూ వచ్చిన డిపాజిట్ల మొత్తం ఆధారంగా లెక్కించి.. పన్నులు, జరిమానాలు విధించడం జరుగుతుందని పేర్కొంది. ఒకవేళ భారత్‌లో ఆర్జించిన ఆదాయంపై ఇక్కడ పన్ను చెల్లించకుండా, విదేశాల్లో ఆస్తి కొన్న పక్షంలో దాన్ని కూడా చట్టప్రకారం వెల్లడించని విదేశీ ఆస్తిగానే పరిగణించడం జరుగుతుందని తెలిపింది. ఇక, విద్యార్థులకు ఊరటనిచ్చే విధంగా.. క్రితం సంవత్సరంలో రూ. 5 లక్షల కన్నా తక్కువగా డిపాజిట్లు ఉన్న విదేశీ బ్యాంకు ఖాతాల విషయంలో ఎటువంటి పెనాల్టీలూ ఉండబోవని పేర్కొంది. -
కాసుల కోసం కూతురిని బ్రోతల్‌గా మార్చిన తల్లి
-
700 కోట్ల కుంభకోణంపై త్వరలో విచారణ
ఏడు వందల కోట్ల రూపాయల స్పీక్ ఏషియా ఆన్ లైన్ కుంభకోణంపై త్వరలో విచారణ ప్రారంభిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన భారీ మోసాలకు పాల్పడే వారిని విచారించే కార్యాలయం (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫిస్-ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తును ఇప్పటికే పూర్తి చేసిందని చెప్పారు. సింగపూర్‌కు చెందిన ఈ సంస్థపై విచారణకు సంబంధించిన కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామన్నారు. ఈ కుంభకోణం 2011లో వెలుగులోకి వచ్చింది. -
మహానగరంలో విష సంస్కృతి
-
అనుమతిలేని ఏ ప్రాసిక్యూషన్ నిలబడదు
చెన్నై: నేరశిక్షా స్మృతిలో నిర్దేశించినట్లు తగిన అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వ ఉద్యోగిపై ప్రారంభించే ఏ ప్రాసిక్యూషన్ చర్యా నిలబడదని మద్రాస్ హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. తమిళనాడులోని వేలూరుకు చెందిన డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ కే మస్తాన్ రావు సహా, దక్షిణ రైల్వే అధికారులు కొందరిపై వేలూరుకే చెందిన ఫ్యాక్టరీల విభాగం ఇనస్పెక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదును మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం కొట్టివేశారు. నేరశిక్షా స్మృతిలోని 197వ సెక్షన్ ప్రకారం తగిన అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా చేపట్టే ప్రాసిక్యూషన్ నిలువదని సుప్రీంకోర్టు పేర్కొందని, సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సదరు ప్రాసిక్యూషన్ ప్రక్రియను కొట్టివేయవలసి ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని అరక్కోణం రైల్వే ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో, అగ్నిప్రమాద నిరోధక నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ అక్కడి అధికారులపై వేలూరు ఫ్యాక్టరీల విభాగం ఇనస్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, చట్టప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకుండా కేంద్రప్రభుత్వ ఉద్యోగులైన తమపై ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తూ రైల్వే అధికారులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో ఫిర్యాదీదారు వివేచనతో వ్యవహరించలేదని, లోపాలను సరిచేసుకునే అవకాశాన్ని అధికారులకు ఇవ్వలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా ప్రాసిక్యూషన్ తప్పదన్న బెదిరింపుతో వారికి నోటీసులు జారీ చేశారని, ఈ కారణంతోనే ఫిర్యాదును కొట్టివేయవచ్చని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
బంజారాహిల్స్‌లో హైటెక్ వ్యభిచారం