ఎంఐఎం శాసనపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
హైదరాబాద్: ఎంఐఎం శాసనపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. 2013 ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బహిరంగసభలో అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే.