
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులపై వివిధ జిల్లా కోర్టుల్లో ఉన్న కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయటానికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేసులు వీగిపోకుండా ప్రాసిక్యూషన్ తగిన శ్రద్ధ వహించాలని సుపరిపాలన వేదిక (ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు.
మొత్తం 507 కేసులు నమో దు అయ్యాయని ఆయా కేసులను నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని తెలిపారు. అన్ని కేసులు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ కాకపోవడంతో ప్రాసిక్యూషన్ వారి అలసత్వం తో అనేక కేసులు వీగిపోతున్నాయన్నారు. దీంతో శిక్ష పడిన కేసుల్లో స్టేలు రావడం వంటి వాటితో ప్రజలకు పోలీసుశాఖ, న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment