cases filed
-
కదిరి మండలానికి చెందిన అమర్నాథ్ రెడ్డి పై ఐదు కేసులు నమోదు
-
వాట్సాప్ గ్రూపులపై ఏపీలో కేసులు
-
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
ఎన్నికల కేసులు వీగిపోకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులపై వివిధ జిల్లా కోర్టుల్లో ఉన్న కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయటానికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేసులు వీగిపోకుండా ప్రాసిక్యూషన్ తగిన శ్రద్ధ వహించాలని సుపరిపాలన వేదిక (ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. మొత్తం 507 కేసులు నమో దు అయ్యాయని ఆయా కేసులను నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని తెలిపారు. అన్ని కేసులు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ కాకపోవడంతో ప్రాసిక్యూషన్ వారి అలసత్వం తో అనేక కేసులు వీగిపోతున్నాయన్నారు. దీంతో శిక్ష పడిన కేసుల్లో స్టేలు రావడం వంటి వాటితో ప్రజలకు పోలీసుశాఖ, న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని విమర్శించారు. చదవండి: రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్ -
బెంగాల్ అల్లర్లపై 9 సీబీఐ కేసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస, అల్లర్లకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తొమ్మిది కేసులను నమోదుచేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను సీబీఐ ఆయా చోట్లకు పంపినట్లు గురువారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ ప్రభుత్వం తమకు అప్పజెప్పిన కేసులతోపాటు మరికొన్ని కేసుల నమోదు ప్రక్రియను సీబీఐ కొనసాగిస్తోంది. పలు హత్యలు, అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై ఐదుగురు జడ్జిల కలకత్తా హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు కేసుల విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. మే 2న ఎన్నికల ఫలితాలొచ్చాక జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని హైకోర్టు గతంలో ఈ ఆదేశాలిచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. పలు వినతుల నేపథ్యంలో కేసుల దర్యాప్తునకు బెంగాల్ పోలీసుల నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు హైకోర్టు గతంలో ఆదేశించింది. సీబీఐ, సిట్ వేర్వేరుగా 6 వారాల్లోగా దర్యాప్తు నివేదికలను సమర్పించాలని హైకోర్టు సూచించింది. కేసులు ఉపసంహరించుకోండంటూ బెదిరించారని, చాలా హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించి కనీసం ఎఫ్ఐఆర్లు నమోదు చేయించలేదని హైకోర్టుకు బాధితులు గతంలో విన్నవించుకున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించనందునే స్వతంత్ర దర్యాప్తు అవసరమనే నిర్ణయానికొచ్చామని కోర్టు వ్యాఖ్యానించింది. -
మరో న్యూయార్క్‌గా మహారాష్ట్ర
సాక్షి, ముంబై: కరోనా వైరస్ ఉక్కు పిడికిలిలో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దుబాయ్ నుంచి వచ్చిన పుణే జంటకు మార్చి 9న కోవిడ్–19 సోకిన దగ్గర్నుంచి 96 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేసులు దాటేశాయి. మహారాష్ట్ర కనుక ఒక దేశమే అయి ఉంటే, వరల్డో మీటర్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసుల్లో 17వ స్థానంలో ఉన్నట్టు లెక్క. చైనా, కెనడా వంటి దేశాలను కూడా దాటి పోయి రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం తీసుకుంటే మరో 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లో దాటాయంటే వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,01,141 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు వాణిజ్య రాజధాని ముంబైని వణికిస్తున్నాయి. నగరంలో మొత్తంగా 55,451 కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం. ముంబై తర్వాత థానేలో 16,443 కేసులు, పుణేలో 11,281 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,717 మంది ప్రాణాలు కోల్పోతే ముంబైలో మృతుల సంఖ్య 2,044గా ఉంది. 3 వేల కంటైన్మెంట్ జోన్లు మహారాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో వరసగా 28 రోజులు కొత్త కేసులు నమోదు అవకపోతే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ నుంచి మినహాయిస్తారు. ముంబైలో 4,500 భవనాల్లో కరోనా కేసులు బయట పడడంతో అక్కడ్నుంచి రాకపోకలు నిలిపివేశారు. బెడ్స్ లేక ఒకే మంచంపై ఇద్దరు రోగుల్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యూయార్క్ కంటే ప్రమాదకరమైన స్థితిలోకి ముంబై వెళ్లిపోతోంది. వెంటిలేటర్ కావాలంటే 2 గంటలు కంటే ఎక్కువ సేపు వేచి చూడాల్సి వస్తోందని స్వయంగా ఆస్పత్రి వైద్యులే చెబుతున్నారు. ఎందుకిన్ని కేసులు ? ► 11,6 కోట్ల మంది జనాభా ఉన్న మహారాష్ట్రలో ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 370 మంది నివసిస్తారు. ముంబై నగరంలో 42 శాతం జనాభా మురికివాడల్లోనే ఉంటారు. వీరే కరోనా వ్యాప్తికి క్యారియర్స్‌గా మారారు. ► లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు విధుల్లోకి వచ్చారు. దుకాణాలన్నీ తెరవడంతో జనం రోడ్లపై భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. ► లాక్డౌన్ సమయాన్ని ఆరోగ్య రంగంలో సదుపాయాలు పెంచుకోవడానికి వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ► రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడంతో కరోనా కట్టడి చర్యల్లో పార్టీల మధ్య సమన్వయం కొరవడింది.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి పాలనా అనుభవం లేకపోవడంతో కేసుల కట్టడికి క్రమబద్ధమైన ప్రణాళిక రూపొందించలేకపోయారు. నియంత్రణలో ఉంది: రాజేశ్ తోపే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు రెండు రోజుల ముందే అంటే మార్చి 23 నుంచే మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. అప్పటికి రాష్ట్రంలో 97 కేసులు మాత్రమే ఉండేవి. అయితే మహారాష్ట్ర జనాభా, జనసాంద్రతతో పోల్చి చూస్తే కేసుల్ని బాగా నియంత్రించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే అంటున్నారు. వైరస్‌ను నియంత్రించడానికి తొలిదశలో లాక్డౌన్ సాయపడిందన్నారు. అమెరికా, యూరప్ దేశాలతో పోల్చి చూస్తే మహారాష్ట్ర పరిస్థితి అంత ఘోరంగా లేదని రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 47.34% ఉంటే, మరణాల రేటు 3.7%గా ఉంది. -
82 వేలు కాదు..6.4 లక్షలు!
న్యూఢిల్లీ: చైనా చెబుతున్నట్లు ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య కేవలం 82 వేలు కాదని, అది అంతకు 8 రెట్లు ఎక్కువని వెల్లడైంది. ఫిబ్రవరి మొదటి నుంచి ఏప్రిల్ చివరి వరకు సుమారు 6.40 లక్షల మంది చైనాలో కరోనా బారిన పడ్డారని తేలింది. చైనా మిలటరీకి చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి లీక్ అయిన సమాచారం మేరకు ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, వాషింగ్టన్కు చెందిన ‘100 రిపోర్టర్స్’ఒక కథనాన్ని ప్రచురించాయి. ఆసుపత్రులు, అపార్ట్మెంట్స్ సహా చైనా వ్యాప్తంగా, సుమారు 230 నగరాల వారీగా అన్ని ప్రాంతాల్లో కేసుల విస్తృతికి సంబంధించిన పూర్తి వివరాలను టేబుల్ రూపంలో తమకు అందాయని అవి పేర్కొన్నాయి. భౌగోళికంగా, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎన్ని కేసులున్నాయనే విషయాన్ని ఆ కథనంలో సమగ్రంగా వివరించారు. కరోనా వైరస్‌ను మొదట గుర్తించిన హుబయి రాష్ట్రం, వుహాన్ ప్రాంతాల్లో కోలుకున్నవారి వివరాలను కూడా ఇందులో పొందుపర్చారు. పూర్తి వివరాలను భద్రత కారణాల రీత్యా ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచడం లేదని, అయితే, వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు అందజేసే దిశగా ప్రయత్నిస్తున్నామని ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, ‘100 రిపోర్టర్స్’ ప్రకటించాయి. దీనిపై చైనా స్పందించలేదు. కానీ, ‘కరోనా విషయంలో విదేశీ మీడియా చైనాపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వివరాలు పూర్తిస్థాయిలో నిజమా? కాదా? అనే విషయాలను పరిశీలించాల్సి ఉందని పలువురు స్వతంత్ర పరిశోధకులు పేర్కొన్నారు. ‘ఫారిన్ పాలసీ ఈ విషయాన్ని బయటపెట్టడం మంచిదే. అయితే, దీనిపై మరింత శోధన జరగాలి’ అని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పరిశోధనలు చేస్తున్న డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ వ్యాఖ్యానించారు. చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలోని కరోనా కేసుల సంఖ్య 82,919. మరణాల సంఖ్య 4,633గా ఉంది. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసుల ఎత్తివేత
సాక్షి, అమరావతి: పలు ఉద్యమాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జనవరిలో తుని, తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం నేపథ్యంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు, అనంతపురం సహా వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులను ఎత్తివేసున్నామని కిశోర్ కుమార్ చెప్పారు. -
దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు మంగళవారం రికార్డు స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ప్రధాని మోదీ హయాంలో అవినీతిపై చేపట్టిన అతిపెద్ద చర్యగా భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ.250 కోట్ల స్కాలర్ షిప్ కుంభకోణానికి సంబంధించి పలు విద్యా సంస్థలపై దాడులు జరిపింది. అదేవిధంగా, యూపీలో రద్దయిన నోట్ల చెలామణీ ఆరోపణలపై నాలుగుచోట్ల సోదాలు జరిపింది. రూర్కెలాలోని బోకారో స్టీల్ ప్లాంట్‌లో అవినీతి కేసులో రాంచీ, బొకారో, కోల్‌కతాలోని అధికారుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ.. అవినీతి, నేర పూరిత ప్రవర్తన, ఆయుధాల స్మగ్లింగ్ తదితర నేరాలకు సంబంధించి 30 కేసులు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల లైసెన్స్ జారీలో అక్రమాలకు సంబంధించి 13 చోట్ల సోదాలు చేశామని సీబీఐ తెలిపింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో ప్రారంభమైన ఈ సోదాల్లో 500 మంది అధికారులు పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నగదు, నగలతోపాటు పలు బ్యాంకు పత్రాలు, స్థిరాస్తులు, మ్యూచువల్ ఫండ్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. రూ.1,139 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ గత వారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 చోట్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. -
తొలివిడత బరిలో నేరచరితులు అధికం
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 96 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 11న జరిగే తొలి విడత పోలింగ్‌లో 213 మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హత్య, మహిళలపై నేరాలు, కిడ్నాప్ వంటి తీవ్ర నేరాలు తమపై నమోదయ్యాయని ఆయా అభ్యర్ధులు అఫిడవిట్లో వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షక సంస్థ ఏడీఆర్ ఈ వివరాలు తెలిపింది. 1279 మంది అభ్యర్ధులకు గాను 1266 మంది అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఈ డేటాను వెల్లడించింది. ఇక 1266 మంది అభ్యర్ధుల్లో 12 శాతం మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు నమోదు కాగా, 12 మంది నేరస్తులుగా నిర్ధారించబడిన వారున్నారు. మరో పది మంది అభ్యర్ధులు తమపై హత్య కేసులున్నాయని ప్రకటించారు. ఇక తమపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని 25 మంది అభ్యర్ధులు ప్రకటించారు. మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయని 16 మంది అభ్యర్ధులు, కిడ్నాప్ అభియోగాలు ఎదుర్కొంటున్నామని నలుగురు అభ్యర్ధులు ప్రకటించారు. ఇక 12 మంది అభ్యర్ధులు తమపై విద్వేష ప్రసంగాలు చేసినందుకు కేసులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మరోవైపు ఏప్రిల్ 11న తొలివిడత జరిగే 91 నియోజకవర్గాల్లో నేరస్తులు బరిలో ఉన్న 37 నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా భావిస్తున్నారు. -
నగరంలో రెచ్చిపోయిన కామాంధులు
హైదరాబాద్ : నగరంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారానికి యత్నించిన ఘటనలు బుధవారం ఒక్కరోజే నగరంలో రెండు వెలుగులోకి వచ్చాయి. ఎల్బీనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు గత కొంతకాలంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు బుధవారం రాత్రి దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్మెన్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో ఎల్బీనగర్ బండ్లగూడలో ఓ బాలికపై ఓల్డేజ్ హోమ్ నిర్వాహకుడు రామకృష్ణ అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ప్రజా, మహిళా సంఘాలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని... ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి. -
తణుకులో డ్రంక్ అండ్ డ్రైవ్
తణుకు: పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తణుకు వై జంక్షన్ వద్ద జరిపిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 6 బైక్‌లు, 2 టాటాఏస్‌లు, ఓ కారు, ఓ ఐచర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించారు. -
ముద్రగడపై లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం: ఎస్పీ
కిర్లంపూడి: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. కిర్లంపూడిలో గురువారం ఆయన మాట్లాడుతూ...ముద్రగడ ఆంక్షలు ఉల్లంఘించారన్నారు. ఆయనపై 32 యాక్ట్ ప్రకారం రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అమలాపురంలో సెక్షన్ 202/216తో పాటు కిర్లంపూడిలో మరో కేసు నమోదు చేశామని..ఆయన అరెస్టుకు సహకరించడం లేదని ఎస్సీ చెప్పారు. సీఐడీ అధికారులు ముద్రగడతో మాట్లాడతారని చెప్పారు. జిల్లాలో ఎక్కడా దీక్షలు, ధర్నాలు చేయడానికి వీల్లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముద్రగడ గురువారం ఉదయం తన నివాసంలో సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని పురుగు మందు డబ్బా చేతపట్టుకుని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 10 కేసులు నమోదు
రంగారెడ్డి జిల్లా: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 10 కేసులను నమోదు చేసి వారిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల భార్య, తల్లిదండ్రులను పిలిపించి మేజిస్ట్రేట్ పుష్పాదేశ్‌ముఖ్ వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధించారు. -
ముద్దుల వ్యవహారం.. వందమందిపై కేసులు!
బీజేవైఎం నేతల మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేస్తూ.. 'కిస్ ఆఫ్ లవ్' పేరిట ముద్దుల కార్యక్రమం నిర్వహించిన వంద మంది మీద కొచ్చిలో పోలీసు కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొచ్చి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఆదివారం నాడు వందలాది మందితో భారీ కార్యక్రమం నిర్వహించారు. అయితే అది చట్ట విరుద్ధం అంటూ పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టారు. వాస్తవానికి ఆరోజు ముద్దుల కార్యక్రమంలో పాల్గొన్నవాళ్ల కంటే.. దాన్ని చూసేందుకు వచ్చినవాళ్లు, శివసేన లాంటి ఇతర సంస్థల సభ్యులే ఎక్కువగా కనిపించారు. అలా చూసేందుకు వచ్చినవాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టలేదు గానీ.. నిర్వాహకులు, అందులో వాస్తవంగా పాల్గొన్నవాళ్ల మీద మాత్రం కేసులు నమోదు చేశారు. చిట్ట చివరి నిమిషంలో వాళ్లు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించడంతో పోలీసులు వాళ్లను అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. -
రాంగోపాల్ వర్మపై పలు కేసులు నమోదు
పుణే: వినాయకుడిపై ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై పలు కేసులు నమోదయ్యాయి. వినాయక చవితి సందర్భంగా శుక్రవారం వర్మ ట్విట్టర్లో గణనాథునిపై అనేక వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ముంబై శాఖ చీఫ్ సుమిత్ ఖంబేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని హిందువులకే కాక ముస్లింలకూ తీవ్ర ఆగ్రహం కలిగించాయన్నారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వహిందూ పరిషత్ కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించింది. వర్మ వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, ఆయనపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. వర్మ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ హిందూ జనజాగృతి సమితి కూడా ఫిర్యాదు చేసింది. వర్మ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చేయాలని హిందూ జనజాగృతి సమితి కార్యకర్త సూర్జిత్ కుమార్ డిమాండ్ చేశారు.